ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ తరపున పతకాలు సాధించేవారికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జల్ జిందాల్ బంపరాఫర్ ఇచ్చారు. ఈ విశ్వ క్రీడల్లో మెడల్స్ సాధించిన భారత క్రీడాకారులకు 'ఎంజీ విండ్సర్' కారు బహుమతిగా ఇవ్వనున్నట్లు సజ్జల్ జిందాల్ ప్రకటించారు.
ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా శుక్రవారం వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల్స్‌ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిందాల్ తెలిపారు.
"భారత్ తరపున పతకం సాధించే ప్రతీ క్రీడాకారుడికి జేఎస్‌డబ్ల్యూ గ్రూపు తరుపున 'ఎంజీ విండ్సర్స్ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఈ ప్రకటన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అత్యుత్తమ వ్యక్తులు అత్యుత్తమైనవి పొందేందుకు అర్హులు కదా! వారి అంకిత భావం, విజయాల కోసమే ఇది అంటూ" ఎక్స్‌లో జిందాల్ రాసుకొచ్చాడు.
కాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్‌గా కూడా సజ్జల్ జిందాల్ ఉన్నారు. ఇక ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ప్రస్తుతం మూడు పతకాలు ఉన్నాయి. షూటింగ్‌లో మను భకర్ రెండు కాంస్య పతకాలు సాధించగా.. స్వప్నిల్ కుసాలే సింగ్ ఓ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment