న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ ఈవై ఎంట్రప్రెన్యుర్ ఆఫ్ ద ఇయర్ 2022గా ఎంపికయ్యారు. డీఎల్‌ఎఫ్ అధినేత కేపీ సింగ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వరించింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ కేవీ కామత్ అధ్యక్షతన గల ఏడుగురు సభ్యుల జ్యురీ విజేతల వివరాలను ప్రకటించింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ స్టీల్, సిమెంట్, ఇన్‌ఫ్రా, ఎనర్జీ, పెయింట్స్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా 40వేల మందకి పైగా ఉపాధి కల్పిస్తుండడంతో ఈ సంస్థ అధినేత సజ్జన్ జిందాల్‌ను ఈవై ఎంట్రప్రెన్యుర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక చేసింది.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి కూడా హాజరయ్యారు. మరో తొమ్మిది ఇతర విభాగాల్లోనూ విజేతలను జ్యురీ ఎంపిక చేసింది. స్టార్టప్ విభాగంలో మెడ్‌జీనోమ్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో మహేశ్ ప్రతాప్‌నేని, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వీ వైద్యనాథన్, ఎనర్జీ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్‌ఫ్రా విభాగంలో ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్, ఎండీ ఇర్ఫాన్ రజాక్, తయారీ విభాగంలో బోరోసిల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మ్ ప్రదీప్ ఖెరుకాను జ్యురీ ఎంపిక చేసింది.
Comments
Please login to add a commentAdd a comment