న్యూఢిల్లీ: వాహన రంగంలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఆల్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కన్వర్టబుల్ సైబర్‌స్టర్ మోడల్‌ను 2025 జనవరి–మార్చి మధ్య భారత్‌లో ప్రవేశపెడుతోంది. ధర రూ.65–70 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
ఎంజీ సెలెక్ట్ ఔట్‌లెట్లలో విక్రయానికి రానున్న తొలి మోడల్ ఇదేనని కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా తెలిపారు. వచ్చే రెండేళ్లలో నాలుగు ఎలక్ట్రిక్ మోడళ్లను పరిచయం చేయనున్నట్టు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. సైబర్‌స్టర్‌తోపాటు మరో మోడల్ సైతం మార్చిలోగా అడుగుపెట్టనుందని గుప్తా వెల్లడించారు.
భారత్‌లో లగ్జరీ కార్ల విభాగం గత నాలుగేళ్లలో మాస్ సెగ్మెంట్ కార్ల కంటే రెండింతలై దాదాపు 25 శాతం వృద్ధి చెందిందని చెప్పారు. కంపెనీ పట్ల సానుకూల ప్రభావంతోపాటు సైబర్‌స్టర్ మొత్తం ఈవీలు, బ్రాండ్‌కు మరింత ఆకర్షణను జోడిస్తుందని అన్నారు. ఇది బ్రాండ్‌కు ప్రోత్సాహాన్ని ఇవ్వడంతోపాటు అదనపు గుర్తింపును ఇస్తుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment