న్యూఢిల్లీ: ఇతర బాలీవుడ్ తారల బాటలో పరిణీతి చోప్రా సైతం అడుగులు వేస్తున్నారు. తాజాగా వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ క్లెన్‌స్టాలో ఇన్వెస్ట్ చేశారు. సోషల్ మీడియా యాప్ ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ఈ అంశాన్ని పేర్కొన్నప్పటికీ పెట్టుబడి వివరాలు వెల్లడించలేదు.
వెరసి బ్యూటీలో 82ఈ, క్లాతింగ్‌లో ఎడ్ ఏ మమ్మా, మేకప్ విభాగంలో కే బ్యూటీ బ్రాండ్ల ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకున్న దీపికా పదుకొణే, అలియా భట్, కత్రినా కైఫ్ బాటలో పరిణీతి చోప్రా సాగుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
2016లో పునీత్ గుప్తా ప్రారంభించిన డీటూసీ స్టార్టప్ క్లెన్‌స్టా.. వాటర్‌లెస్ పర్సనల్ హైజీన్ ప్రొడక్టును తయారు చేస్తోంది. ఇతరులెవరూ రూపొందించని ప్రొడక్టును తయారు చేస్తున్న క్లెన్‌స్టా బ్రాండులో ఇన్వెస్టర్‌గా, భాగస్వామిగా చేరినందుకు ఉత్సాహపడుతున్నట్లు ఈ సందర్భంగా ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో పరిణీతి చోప్రా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment