‘70 గంటల పని’ వివాదంపై జిందాల్‌ ఏమన్నారంటే.. | Jindal On The 70 Hours Work Dispute | Sakshi
Sakshi News home page

‘70 గంటల పని’ వివాదంపై జిందాల్‌ ఏమన్నారంటే..

Published Sat, Oct 28 2023 3:03 PM | Last Updated on Sat, Oct 28 2023 3:06 PM

Jindal On The 70 Hours Work Dispute - Sakshi

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. భారత యువత వారంలో కనీసం 70 గంటలు పనిచేయాలని ఆయన అనడంతో ఐటీ ఉద్యోగులతో సహా ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. అయితే ఆయన మాటలను సమర్థిస్తూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్‌పర్సన్ సజ్జన్‌ జిందాల్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 

యువత విశ్రాంతి కంటే పనికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. భారత్‌ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి ఐదు రోజులపాటే పని చేయాలనే సంస్కృతి అవసరం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ  రోజూ 14-16 గంటలకు పైగా పని చేస్తారని, తానూ రోజూ 10-12 గంటలు విధుల్లో ఉంటానని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement