Narayana Murthy
-
పనిగంటల్లో మహిళను మరిచారా?
వారంలో ఎన్ని గంటలు పనిచేయాలి? ఈ మధ్య కాలంలో దేశం మొత్తమ్మీద విపరీతమైన చర్చ లేవనెత్తిన ప్రశ్న ఇది. ఏడాది క్రితం ‘ఇన్ఫోసిస్’ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దేశం కోసం వారంలో 70 గంటలు పనిచేయాలని సూచించడంతో మొదలైందీ చర్చ. ఇది సద్దుమణిగేలోపు, ‘లార్సెన్ అండ్ టూబ్రో’ (ఎల్ అండ్ టీ) ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ వారంలో 90 గంటలు పని చేయాలని ఇచ్చిన సలహా మళ్లీ దుమారం రేకెత్తించింది. ‘ఆదివారాలు ఎంత సేపని మీ భార్యల ముఖాలు చూస్తూ కూర్చుంటారు, ఆఫీసులకు వచ్చి పనిచేయండి’ అని కూడా ఆయన చతుర్లు ఆడారు. ఈ సరదా వ్యాఖ్య కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షల జోకులు, మీమ్స్ పుట్టుకొచ్చాయి. నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు యథాలాపంగా చేసిన వ్యాఖ్యలను బట్టి వారిని జడ్జ్ చేయడం మంచిది కాదు. కానీ సుదీర్ఘ పనిగంటలను వారు సీరియస్‌గానే ప్రతిపాదిస్తున్నట్టు కనిపిస్తోంది.వ్యాపార రంగంలో వారిద్దరి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసు కుని చూస్తే ఆ వ్యాఖ్యలకు మనం విలువ ఇవ్వాలి. దేశంలో ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీని నిలబెట్టిన వ్యక్తి నారాయణమూర్తి. ఎల్ అండ్ టీ చైర్మన్ కూడా ఆషామాషీ వ్యక్తి కాదు. 5,690 కోట్ల డాలర్ల విలువైన, ఫోర్బ్స్ జాబితాలో నమోదైన కంపెనీని నడిపిస్తున్నారు. కాబట్టి వీరి దృష్టి కోణాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇంటి పని మాటేమిటి?నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యల నేపథ్యంలో కనిపించే ఒక అంశం ఏమిటంటే... వీరిరువురి భార్యలకు సొంతంగా ఉద్యోగాలేమీ లేకపోవడం. దీనివల్ల మన సంరక్షణ బాధ్యతలు చూసుకునే వ్యక్తులు మన అభివృద్ధిలో ఎంత మేరకు భాగస్వాములో తెలియకుండా పోతుంది. వీరిద్దరు చెప్పినట్లు వారానికి 70 లేదా 90 గంటలు పనిచేశామనుకోండి... మహిళలు ఉద్యోగాలు చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు అంత ఎక్కువ పెరిగిపోతాయి కాబట్టి!ఉద్యోగాలు చేసే వారి పిల్లల సంరక్షణ కోసం దేశంలో ఇప్పటి వరకూ ఎలాంటి ఏర్పాట్లూ లేవు. ఇలా ఉండి ఉంటే తల్లులు కూడా ఎక్కువ సమయం ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో గడిపేందుకు అవకాశం ఏర్పడేది. వారంలో 70 లేదా 90 గంటలు పనిచేయాలన్న ఆలోచన వెనక ఆ ఉద్యోగి జీవిత భాగస్వామికి ఉద్యోగం ఏదీ లేదన్న నిర్ధారణ ఉండి ఉండాలి. పితృస్వామిక భావజాలం ఎక్కువగా ఉండే భారతదేశ నేపథ్యాన్ని లెక్కలోకి తీసుకుంటే... ఆ జీవిత భాగస్వామి మహిళే అయి ఉంటుంది. ఈ వ్యవహారంలో భార్య ప్రస్తావన వచ్చేందుకు ఇంకోటి కూడా కారణం. భార్యలు ఇంటిపట్టున తీరికగా ఉన్నారు అన్న అంచనా. ఇంకోలా చెప్పాలంటే... ఇంట్లో పని మొత్తం అంటే ఇల్లూడ్చడం, వంట, పిల్లల మంచిచెడ్డలు, వయసు మళ్లిన వారి బాగోగులన్నీ ఇతరులు ఎవరో చూసుకుంటున్నారన్నమాట. వాస్తవం ఏమిటంటే... ఇలా పనులు చేసిపెట్టే వారు ఏమీ అంత చౌకగా అందుబాటులో ఉండరు.ఈ దృష్ట్యా చూస్తే... ఈ ఇద్దరు ప్రముఖులు పని అంటే కేవలం ఇంటి బయట చేసేది మాత్రమే అన్న అంచనాతో మాట్లాడటం సమంజసం కాదు. ఇంటి పని కూడా చాలా శ్రమతో కూడుకున్నది, సమయం తీసుకునేదని వీళ్లు గుర్తించి ఉండాల్సింది. పైగా ఇంటి పనులు సాధారణంగా ఆడవారే చేస్తూంటారు. ప్రపంచవ్యాప్తంగా, ఇంకా ముఖ్యంగా భారతదేశంలో ఇదే ధోరణి కనిపిస్తుంది. ఇంట్లో ఆడవాళ్లు చేసే శ్రమ విలువ ఎంతో అర్థం చేసుకోవాలంటే ఆ మధ్య వచ్చిన మలయాళ సినిమా ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఒకసారి చూడాలి. మహిళ శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత?ఈ నేపథ్యంలో దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత అన్న ప్రశ్నకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. అంతర్జాతీయంగా మహిళల భాగస్వామ్యం సగటున 51 శాతం ఉంటే భారత్‌లో గణనీయంగా తక్కువ ఉండేందుకు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. అయితే, ఇటీవలి కాలంలో ఈ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, మహిళల భాగస్వామ్యం 2017–18లో 23.3 శాతం మాత్రమే ఉంటే, 2023–24లో 41.7 శాతానికి పెరిగింది. పురుషుల భాగస్వామ్యం సుమారుగా 78.8 శాతం ఉండటం గమనార్హం. ఆర్థికవేత్తలు శమికా రవి, ముదిత్ కపూర్లు చేసిన ఒక అధ్యయనం ప్రకారం, దేశంలో శ్రమశక్తిలో పెళ్లయిన మగవారి భాగస్వామ్యం చాలా ఎక్కువ. అదే సమయంలో పెళ్లయిన మహిళల సంఖ్య చాలా తక్కువ. తల్లి లేదా తండ్రి ఉద్యోగస్తుడైతే ఆ యా కుటుంబాల్లో పిల్లలపై ప్రభావాన్ని కూడా పరిశీలించారు. తండ్రి ఉద్యోగస్తు డైతే ఆ ప్రభావం దాదాపు లేకపోయింది. మహిళల విషయానికి వస్తే పిల్లలున్న కుటుంబాల్లోని మహిళలు శ్రామిక శక్తిలో భాగం కావడం కేరళ వంటి రాష్ట్రాల్లో బాగా తగ్గిపోయింది. బిహార్, పంజాబ్, హరి యాణా వంటి రాష్ట్రాల్లో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వరుసగా తక్కువగా నమోదవుతున్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. అసంఘటిత రంగం మాటేమిటి?పని గంటలు పెంచాలన్న అంశంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఏమాత్రం నియంత్రణ లేని అసంఘటిత రంగం పరి స్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పని గంటలను అసాధారణంగా పెంచి చిన్న వ్యాపారులు ఉద్యోగుల శ్రమను దోపిడి చేసే అవకాశం ఉంది. నగర ప్రాంతాల్లో గిగ్ ఆర్థిక వ్యవస్థ చాలా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరికి పనివేళలు నిర్దిష్టంగా ఉంటాయి కానీ టార్గెట్లు ఎక్కువ ఇవ్వడం ద్వారా అధిక శ్రమకు గురి చేస్తూంటారు. ఇంటి పని చేసే వారి విషయంలోనూ పనివేళలు, వేత నాలపై ఎలాంటి నియంత్రణ లేదు. పనిగంటలపై మొదలైన చర్చ ఏయే రంగాల్లో నియంత్రణ వ్యవస్థల అవసరం ఉందన్నది గుర్తించేందుకు ఉపయోగపడవచ్చు. అయితే అసంఘటిత రంగంలో ఉన్న వారు తమంతట తామే పనివేళలను నిర్ధారించుకునే అవకాశం ప్రస్తుతానికైతే లేదన్నది విధాన నిర్ణేతలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం వారంలో ఎన్ని గంటలు పనిచేయాలన్న విష యంపై మొదలైన చర్చ కొన్ని సానుకూల అంశాలను తెరపైకి తెచ్చింది. పని చేసే సమయం ముఖ్యమా? చేసిన పని తాలూకూ నాణ్యత ముఖ్యమా అన్నది వీటిల్లో ఒకటి. అదృష్టవశాత్తూ చాలా మంది కార్పొరేట్ బాసులు సమయం కంటే నాణ్యతకే ఓటు వేశారు. ఒక్కటైతే నిజం... నారాయణ మూర్తి, సుబ్రహ్మణ్యన్ వంటి తొలి తరం వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలపై ఏకాగ్ర చిత్తంతో పని చేయడం వల్లనే ఇప్పుడీ స్థితికి ఎదిగారు. అయితే విజయానికి మార్గాలు అనేకం. రతన్ టాటా వంటి వారు పారిశ్రామికంగా ఎదుగుతూనే ఇతర వ్యాపకాలను కూడా చూసుకోగలిగారు. అభివృద్ధి పథంలో మన సంరక్షకుల పాత్రను కూడా విస్మరించలేము. మొత్త మ్మీద చూస్తే ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలేమిటన్నది సంకుచిత దృష్టితో కాకుండా సమగ్రంగా చూడటం మేలు!సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇల్లు, సంసారం మనకొద్దు.. ఆఫీసే ముద్దు
*ఇంట్లో కూర్చుని ఎంతసేపని భార్యని చూస్తూ ఉంటారు? ఇంట్లో కంటే ఆఫీస్ లో(Office Working Hours) ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యకు చెప్పండి. వారానికి 90 గంటలు పనిచేయండి... నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నా.. ఆరోజు మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధపడుతున్నా. అలా చేయించగలిగితే నాకు చాలా హ్యాపీ"ది గ్రేట్ ఎల్ & టీ చైర్మన్ ఎస్. ఎన్. సుబ్రహ్మణ్యన్ తన ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఇది.గతంలో ఇన్ఫోసిస్ మెంటార్ నారాయణ మూర్తి(Narayana Murthy) కూడా ఇదే మాదిరి మాట్లాడారు. కాకపోతే మరీ సుబ్రహ్మణ్యన్ లా కాదులెండి. "మన దేశంలో ఉత్పాదకత చాలా తక్కువ. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ.. పురోభివృద్ధి దిశగా దూసుకుపోవాలంటే మరింత కష్టించి పనిచేయాలి. ఇండియాలో అపారమైన నైపుణ్యాలున్నాయి. అవసరాలూ ఉన్నాయి. వారానికి 70 గంటలు పనిచేస్తే మనం లక్ష్యాల వైపు వెళ్లగలుగుతాం"ఇవీ అప్పట్లో ఆయన అన్న మాటలు.ఇద్దరి ఉద్దేశమూ ఒకటే..మూర్తి గారు రోజుకు 10 గంటలు పనిచేయమంటే..సుబ్రహ్మణ్యన్ గారు ఓ నాలుగాకులు ఎక్కువే చదివి.. రోజుకు 13 గంటల సూత్రం బయటకు తెచ్చారు.వీళ్ళిద్దరూ సింపుల్ గా చెబుతున్నది ఏమిటంటే.. అన్నీ వదిలేసుకొని గొడ్డు చాకిరీ చేయండి అని..వీళ్ళు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వ్యక్తులు. ఆయా కంపెనీలకు అధిపతులు.. 70, 90 ఏం ఖర్మ. 120 గంటలైనా పనిచేస్తారు..నేను ఇన్ని గంటలు పనిచేశా/చేస్తున్నా... మీరూ అలాగే చేయండి అని ఉద్యోగులను అనడమే వివాదాన్ని రాజేస్తోంది...ఉద్యోగులు అంటే జీతం తీసుకుని పనిచేసే శ్రామికులు. ఎన్నో వ్యక్తిగత బరువులు, బాధ్యతల మధ్య నలిగిపోతూ..నెట్టుకొచ్చే సగటు జీవులు.వాళ్ళను అనునిత్యం సమస్యలు పలకరిస్తూనే ఉంటాయి. ఓపక్క వాటితో పోరాడుతూనే.. మరోపక్క వృత్తి ఉద్యోగాల్లో అనుక్షణం టెన్షన్ తో సహజీవనం చేసే అభాగ్యులు. పేరుకు ఎనిమిది గంటల మాటే కానీ.. చాలా కంపెనీల్లో తీసుకునే జీతం కంటే చాకిరీ ఎక్కువ చేసే ఉదంతాలే ఎక్కువ. ఏసీ కార్లు, చుట్టూ పనివాళ్లు, పెద్ద బంగళాలు, మానవ సంబంధాలకు అతీతంగా విశాలమైన ఛాంబర్లలో కాలం గడుపుతూ ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసే సుబ్రహ్మణ్యన్లను ఒక్కసారి సగటు ఉద్యోగి ఇంట్లో ఓ నాలుగు రోజుల పాటు కూర్చోపెడితే తెలుస్తుంది... రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలో...?? సుబ్రహ్మణ్యన్ సార్ చేసిన ప్రతిపాదనకే వద్దాం...రోజుకు 24 గంటల చొప్పున... వారానికి 168 గంటలు.ఇందులో ఆయన చెప్పినట్లు 90 పని గంటలను తీసేద్దాం.ఇక మిగిలేవి 78 గంటలు. సగటు ఆరోగ్యవంతుడు రోజుకు 8 గంటలు నిద్రకు కేటాయించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. అంటే మిగిలేవి 22 గంటలు (78 - 7x8 = 56 గంటలు). పోనీ... 8 గంటలు కాకుండా 6 గంటలు చొప్పునే లెక్కేద్దాం. అప్పుడు మిగిలేవి 36 గంటలు (78 - 7x6 = 42 గంటలు)అంటే రోజుకు 5 గంటలు.సాధారణంగా కార్పొరేట్ ఉద్యోగులు ఉండేది నగరాలు, పట్టణాల్లోనే...ఇంటి నుంచి ఆఫీస్ కు వెళ్ళడానికి, ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి... నిత్యట్రాఫిక్ రద్దీ కి కనీసం మూడు గంటలు కేటాయించక తప్పదు.ఇక మిగిలేవి రెండు గంటలు. కాలకృత్యాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్లకు తక్కువలో తక్కువ గంటన్నర వేసుకుందాం...ఇక మిగిలేది అరగంట...ఇంటికి వచ్చాక కనీసం రిలాక్స్ అవ్వకూడదు...టీవీ చూడకూడదు.పిల్లల బాగోగులు పట్టించుకోనక్కర్లేదు..సరే.. ఇక భార్యను చూస్తూ కూర్చొద్దని సదరు సుబ్రహ్మణ్యన్ సారే చెప్పారు. సంసారంలో ఏం జరుగుతోందో... బంధువు ఎవడో.. ఫ్రెండ్ ఎవడో...పక్కన పెట్టేయాలి.కూరలు, కిరాణా మార్కెట్లకు వెళ్ళకూడదు. పండగలు, పబ్బాలు చేసుకోకూడదు...టూర్ల సంగతి పూర్తిగా మర్చిపోవాలి. అనారోగ్యంగా ఉన్నా సరే... టాబ్లెట్ వేసుకుని ఆఫీస్ కు వచ్చేయాలి. సెలవు తీసుకోకూడదు. విసుగు పుట్టినా.. చూడాలి అనిపించినా... సినిమా ఊసే ఎత్తకూడదు. టైం ఏదీ ??ఇలా చెప్పుకుంటూ పోతే... చాలానే ఉంటాయి...పెద్ద స్థాయిల్లో ఉన్న వ్యక్తులు... మహా మేధావులు, తెల్లారి లేస్తే కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిపే ఈ ప్రముఖులు.. కనీస మానవతా కోణాన్ని పక్కన పెట్టేసి ఇలా ఎలా మాట్లాడతారో అర్ధం కానీ ప్రశ్న.ఎక్కువ గంటలు పనిచేస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే పని మీద దృష్టి పెట్టగలుగుతాడు. జీవితానికి, పనికి మధ్య సమతౌల్యం పాటించాలి. అది ఎప్పుడైతే ఉండదో... మానసిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అటువంటి వ్యక్తి ఎక్కువ గంటలు పనిచేయడం మాట అటుంచి... పని వాతావరణాన్నే దెబ్బ తీస్తాడు.పైగా గంటల కొద్దీ పని చేసుకుంటూ పోతే... ఒకరకమైన జడత్వం ఆవరిస్తుంది. చేసే పని మీద ఆసక్తి పోతుంది.. అశ్రద్ధ పెరుగుతుంది. తప్పులు జరుగుతాయి. వేల కోట్ల ప్రాజెక్టులను హేండిల్ చేసే కంపెనీల్లో జరిగే తప్పులు ఆ కంపెనీ కొంప ముంచుతాయి. కొండకచో.. కంపెనీలు మూత పడే పరిస్థితి తీసుకొస్తాయి.కాబట్టి సుబ్రహ్మణ్యన్ సారూ...అతి సర్వత్రా వర్జయేత్... అన్న మాట ఊరికే రాలేదు. అది తినే తిండి అయినా.. చేసే పని అయినా...మీలాంటి దిగ్గజాలు మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడటం మంచిది అనుకుంటా... మీ సహచర పారిశ్రామికవేత్తే మీ ఆలోచనల్ని తప్పుబట్టారు... "గంటలు గంటలు పనిచేయనక్కర్లేదు.. చేసే పనిలో క్వాలిటీ ఉంటే.. 10 గంటలు పని చేసినా చాలు..."అంటూ మహీంద్రా & మహీంద్రా అధిపతి ఆనంద్ మహీంద్రా చెప్పిన మాటలు అక్షర సత్యం.ఇప్పటికే అందర్లోనూ అభాసు పాలయ్యారు. మహీంద్రా మాటలనైనా కాస్త చెవికెక్కుంచుకుని తప్పు దిద్దుకునే ప్రయత్నం చేస్తే మంచిదే.. లేదంటే.. మరింత చులకన అవుతారు... తస్మాత్ జాగ్రత్త.పొరపాటు దిద్దుకునే ప్రయత్నాల్లో భాగంగా ఎల్ & టీ ప్రతినిధి వివరణ ఇచ్చినప్పటికీ ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోవడం,స్టేట్మెంట్ ఇచ్చిన సుబ్రహ్మణ్యన్ సార్ ఇప్పటికీ నోరు మెదపకపోవడంతో ఈ వ్యాఖ్యలు వివాదం రేపుతూనే ఉన్నాయి)-బెహరా శ్రీనివాస రావువిశ్లేషకులు -
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి నిజంగా అలా అన్నారా?
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆ మధ్య పని గంటల మీద చేసిన వ్యాఖ్యలు.. ఎంత దుమారం రేపాయో తెలియంది కాదు. దానికి ఇప్పుడు కొనసాగింపుగా.. ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. అయితే.. తాజాగా ఇన్ఫోసిస్ మూర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఇంతకు ముందు వారంలో 70 పనిగంటల(70 Hours) ఉండాల్సిందేనని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన ఇన్ఫోసిస్ మూర్తి.. ఇప్పుడు యువతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దగ్గర అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మాటలు ఎంత పరిమితంగా ఉంటే దేశానికి అంత మంచిదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మాటలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అప్పుడే జీవితంలో విజయం బాట పడతారు అంటూ ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. దీంతో ఆ వార్త ఆధారంగా నారాయణమూర్తి(Narayana Murthy)పై సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. ఆయనకేమైందంటూ.. పలువురు విమర్శించడం, ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ చర్చ ఇలా నడుస్తుండగానే.. అసలు విషయం తెలిసింది. పీటీఐ ఫ్యాక్ట్ చెక్(PTI Fact Check)లో నెట్టింట్ హల్చల్ చేస్తున్న ఆ వార్త తాలుకా స్క్రీన్ షాట్ ఫేక్‌గా నిర్ధారణ అయ్యింది. అది డిజిటల్‌గా ఎడిట్ చేసిందని తేలింది. ఈ విషయాన్ని సదరు మీడియా సంస్థ కూడా తన సోషల్ మీడియా ద్వారా ధృవీకరించింది. -
భార్యలవైపు ఎంతసేపు చూస్తారు... ఆదివారాలు కూడా ఆఫీసుకు రండి!
‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? భార్యను ఎంత సేపు చూడగలరు? భర్తలను భార్యలు ఎంత సేపు చూడగలరు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ‘ఆదివారాలు కూడా ఆఫీసుకురండి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో కాదు దేశంలోనే ప్రముఖ కార్పొరేట్ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్. ఆ మధ్య వారానికి 70గంటలు పనిచేయాలని మాట్లాడి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురయ్యారు. ఇప్పుడు ఆ వంతు సుబ్రమణ్యన్ది. మూర్తి మీద జోకులు మీమ్‌లు ఆగకముందే ఎల్–టీ చైర్మన్ ఆయనకు తోడయ్యారు. ఉద్యోగులకు వ్యక్తిగత జీవితం ఉండదా, ఉండకూడదా అంటూ నెటిజనులు దాడి మొదలెట్టారు. ఇతర కార్పొరేట్ సీఈఓలు కూడా సుబ్రమణ్యన్ మాటల్ని కొట్టిపారేశారు. ఉద్యోగులపై ఒత్తిడి పెరిగి సమర్ధత సన్నగిల్లుతున్న ఈరోజుల్లో వారికి స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పాల్సింది పోయి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదన్నారు. సోషల్ మీడియాలో దాడిని నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతని గమనించిన ఎల్–టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇది భారతదేశపు దశాబ్దమని చైర్మన్ సుబ్రమణ్యన్ విశ్వసిస్తున్నారు..అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి అవసరం. కలసికట్టుగా అంకితభావంతో కృషి చేస్తే వృద్ధిని కొనసాగించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే విజన్‌ను సాకారం చేసుకోగలుగుతాం. కంపెనీ చైర్మన్ వ్యాఖ్యలు ఇదే లక్ష్యాన్ని ప్రతిఫలిస్తున్నాయని ఎల్–టీ ప్రకటన జారీ చేసింది. జాతి నిర్మాణమే ఎల్అండ్టీ ప్రధాన లక్ష్యం. ఎనిమిది దశాబ్దాలుగా దేశ మౌలికసదుపాయాలు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను బలపరుస్తున్నాం. ఉద్ధేశాలు, లక్ష్యాలు సాధనకు కట్టుబడి ముందుకు సాగుతామని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరు -
నారాయణ మూర్తి (ఇన్ఫోసిస్) రాయని డైరీ
కంపెనీలు వర్కర్ల మీద ఆధారపడి పనిచేయవు. ఇంఛార్జిల మీద వర్కర్లు ఆధారపడేలా చేసి చక్కటి ఫలితాలను సాధిస్తుంటాయి. ఎక్కడైనా చూడండి... ఇంఛార్జిలే, వర్కర్ల కన్నా ఎక్కువ కష్టపడి పని చేస్తుంటారు. వర్కర్లలో పని చేయనిదెవరో కనిపెట్టడానికి సెలవులు కూడా వాడుకోకుండా శ్రమిస్తూ ఉంటారు. అయితే అంత శ్రమ అవసరం లేదంటాన్నేను!దేనికైనా టెక్నిక్ ఉండాలి. పని చేయని వారెవరో వెతకటం మాని, పని చేస్తున్న వారెవరో నిఘా పెట్టి చూస్తే ఇంచార్జిల పనికి ప్రయోజనం చేకూరుతుంది, మరింత మెరుగైన ఫలితాలను తొలి త్రైమాసికంలోనే సాధించి యాజమాన్యానికి చూపించగలుగుతారు!సభాపర్వంలో ధర్మరాజుకు నారదుడు పని ఎలా చేయించుకోవాలో బోధిస్తుంటాడు. నేర్పరులనే సేవకులుగా పెట్టుకున్నావా? వారిలో పని చేస్తున్న వారిని గమనిస్తున్నావా? వారి పట్ల ఉదారంగా ఉంటున్నావా? అని అడుగుతాడు.పని చేయని వారిని కనిపెట్టటం వల్ల ఒరిగే ప్రయోజనం కన్నా, పని చేసే వారిని కనిపెట్టుకుని ఉండకపోవటం వల్ల జరిగే నష్టమే ఎక్కువని నారద ప్రబోధం.పని చేయని వారి వల్ల సంస్థలకు వచ్చే నష్టం ఏమీ లేదు. వాళ్ల పని కూడా మీద వేసుకుని చేయగల పనివాళ్లు పక్కనే అందు బాటులో ఉంటారు. వారానికి 70 గంటలైనా సరే, వాళ్లు అలా పని చేసుకుంటూ పోగలరు... ఇంఛార్జిలు కనుక వాళ్లకు అందరిముందూ చిన్న కాంప్లిమెంట్ ఇవ్వగలిగితే.పని చేసే వాళ్లకు అందరిముందూ కాంప్లిమెంట్ ఇస్తే, పని చేయని వాళ్లు హర్ట్ అవుతారని చెప్పి, చాటుగా పిలిచి భుజం తట్టడం వల్ల ముందు తరాల సంస్థలకు మంచి ఇంఛార్జిలు తయారు అయితే అవొచ్చు. మంచి వర్కర్లు తయారుగా ఉండరు. వర్క్–లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడేవారు మాత్రమే ఫైళ్లు పట్టుకుని ఇంటర్వ్యూలకొస్తారు.అనుపమ్ మిట్టల్ ట్వీట్ ఒకటి చూశాను. షాదీ డాట్ కామ్ ఫౌండర్ అతడు. ‘‘70 గంటల పనికి భయపడుతున్న వారంతా 2025లో రిలాక్స్డ్ గా ఉండొచ్చు. ఏఐ మన ఉద్యోగాలన్నిటినీ ఊడబెరుక్కోబోతోంది. హ్యాపీ న్యూ ఇయర్’’ అని విష్ చేశాడు. శాడిస్ట్. మిట్టల్ ఫౌండర్ అయిపోయాడు కానీ... గొప్ప ఇంచార్జి కావలసినవాడు.ఇంఛార్జి... ఫౌండర్లా ఉండాలి. ఇంకా చెప్పాలంటే గౌతమ్ అదానీలా ఉండాలి. ‘‘చేసే శక్తి, ఆసక్తి ఉన్న వాళ్లు... వద్దన్నా 70 గంటలు పని చేస్తారు. చేయనివ్వండి. ఒకటైతే నిజం. ఫ్యామిలీతో 8 గంటలు గడిపితే ఆ ఉక్కపోత భరించలేక జీవిత భాగస్వామి ఇంట్లోంచి పారిపోతుంది’’ అని పెద్దగా నవ్వుతారాయన.భార్యాభర్తలిద్దరూ వాళ్ల వాళ్ల ఆఫీస్‌లలో 70 గంటలు పని చేసి వస్తే ఇద్దరిలో ఎవరూ ఇల్లొదిలి పారిపోయే సమస్యే ఉండదు. అయితే వాళ్లు ఆఫీస్ వదిలి పారిపోకుండా ఇంచార్జిలు చూసుకోవాలి.మహా భారతంలో కర్ణుడు నాకు ఇష్టమైన క్యారెక్టర్. గొప్ప దాతృత్వం అతడిది. ఇంచార్జిలు కూడా ఎప్పుడైనా ఒకరోజు సెలవు ఇవ్వటానికి, హాఫ్ డే లీవు శాంక్షన్ చెయ్యటానికి కర్ణుడిలా గొప్ప దాతృత్వం ప్రదర్శిస్తే ఆఫీసంటే పడి చచ్చిపోని వర్కర్లు ఉంటారా?వర్కర్లు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ‘వర్క్’ అంటే ఆఫీసు మరియు ఇంచార్జి. ‘లైఫ్’ అంటే భార్య మరియు పిల్లలు. (ఉద్యోగినులకైతే భర్త మరియు పిల్లలు). వర్క్‌ను లైఫ్, లైఫ్‌ను వర్క్ వాటికవే బ్యాలెన్స్ చేసుకుంటాయి కనుక వర్కర్లు పని కట్టుకుని లైఫ్‌ని, వర్క్‌ని బ్యాలెన్స్ చేసుకోనక్కర్లేదు. పనిలో మునిగి వుంటే చాలు.ఎండ్ ఆఫ్ ది డే... ఇంచార్జిలు కంపెనీకి మంచి ఫలితాలను సాధించి చూపేలా పని చేయటం వర్కర్ల కనీస బాధ్యత. -
పని గంటలపై నారాయణమూర్తికి కౌంటర్
న్యూఢిల్లీ:ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తికి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్‌లో పనిదినాలు ఆరు రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గిపోతుండడంపై మూర్తి ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కార్తీ చిదంబరం ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ఎన్ని గంటలు ఎక్కువ పనిచేశామన్నది ముఖ్యం కాదని, ఎంత ప్రభావవంతంగా పనిచేశామన్నది ముఖ్యమన్నారు.‘ఎక్కువ సేపు పనిచేయడమనేది అర్థం లేనిది. ఎంత ఫోకస్‌తో పనిచేశామనేది మఖ్యం. జీవితంలో రోజువారి సమస్యలతో పోరాడే మనుషులకు వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ అనేది తప్పనిసరి. నిజానికి భారత్‌లో పనిదినాలను వారానికి నాలుగు రోజులకు తగ్గించాలి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తే చాలు’అని కార్తీ చిదంబరం తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌గొగోయ్ కూడా నారాయణమూర్తి ఎక్కువ పనిగంటల విధానంతో విభేదించడం గమనార్హం. Working longer is meaningless, focus should be on efficiency. Daily life is as it is a struggle, battling inefficient & substandard infrastructure & amenities. Work life balance is most important for good social order & harmony. We should infact move to a 4 day working week. 12… https://t.co/EOOer6AgnK— Karti P Chidambaram (@KartiPC) December 22, 2024 ఇదీ చదవండి: హైదరాబాద్‌పై ఇన్ఫోసిస్ మూర్తి కీలక వ్యాఖ్యలు -
హైదరాబాద్ సహా మూడు నగరాలకు ఫుల్ డిమాండ్: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
పూణే: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పుల కారణంగా రానున్న కాలంలో బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాలకు భారీ ఎత్తున వలసలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వలసల లేకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో నారాయణమూర్తి మాట్లాడుతూ..‘భారత్ సహా పలు దేశాల్లో(ఆఫ్రికన్) ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా రాబోయే రెండు దశాబ్దాల్లో కొన్ని దేశాల ప్రజలు భారత్‌వైపు చూసే అవకాశం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాలు నివాసయోగ్యంగా ఉండటంతో వారు ఇక్కడికి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఫలితంగా పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతాయని అన్నారు.ఇదే సమయంలో భారత్ విషయానికి వస్తే హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాల్లోకి వలసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అందుకే వారంతా ఇక్కడే వచ్చేందుకు చూస్తారు. అప్పుడు ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం కారణంగా ఇక్కడ పరిస్థితులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వలసలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. కార్పొరేట్ ప్రపంచం, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు కలిసి వాతావరణ మార్పు సమస్యను పరిష్కరించాలని సూచనలు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు వారంలో 70 గంటలు పనిచేయాలంటూ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాల్సిందేనని కుండ బద్ధలుకొట్టారు. లేకుంటే పేదరికం నుంచి ఎలా బయటపడగలమని? ప్రశ్నించారు. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?. భవిష్యత్తు కోసం మనమంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. Infosys CEO Narayana Murthy warns of urban overload due to climate change pic.twitter.com/85EwbchiOD— NDTV (@ndtv) December 22, 2024 -
జీవితాంతం ఉద్యోగం చేయడానికే మనం పుడుతున్నట్లా?
రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి? వారానికి ఎన్ని రోజులు పని చేయాలి..? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తరచుగా సూచించే వారానికి 70గంటల పని విధానాన్ని మీరు సమర్థిస్తారా? ముందు ఈ స్టోరీ క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చదవండి.. చివరికి సమాధానం మీకే దొరుకుతుంది!గుజరాత్‌లోని సూరత్‌లో ఓ 32ఏళ్ల వ్యక్తి తన రైట్ హ్యాండ్‌కి ఉన్న 5 వేళ్లలో నాలుగు వేళ్లను నరుక్కున్నాడు. కారణం ఏంటో తెలుసా? పని ఒత్తిడి..! అవును..! అతనికి నెలకు 50 వేల రూపాయల జీతం.. ఓ కంపెనీలో కంప్యూటర్ అపరేటర్‌గా పని చేస్తున్నాడు.. రోజుకు 12గంటలకు మించి అతనితో కంపెనీ మేనేజర్ పని చేయించుకుంటున్నాడు. జాబ్ మానేద్దామంటే అతని తండ్రి ఏమో మేనేజర్‌కు మంచి ఫ్రెండట..! ఉద్యోగం మానేస్తా అంటే తన తండ్రి ఒప్పుకోడు.. అందుకే ఫోర్ ఫింగర్స్‌ను స్టెయిన్లెస్ స్టీల్ కత్తితో కసాకసా కోసుకున్నాడు. ఇది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్. ఒకసారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్దాం.. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా పూణే బ్రాంచ్ ఉద్యోగి అన్నా సెబాస్టియన్ ఎలా చనిపోయిందో గుర్తుంది కదా? రాత్రి-పగలు తేడా లేకుండా, కనీసం వీకాఫ్ కూడా ఇవ్వకుండా ఆమెతో కంపెనీ వెట్టిచాకిరి చేయించుకుంది.. చివరకు ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైంది. మరో ఘటనలో వరుసగా 45 రోజులుగా సరైన నిద్రలేని 40 ఏళ్ల బ్యాంక్ మేనేజర్ సుశాంత్ చక్రవర్తి ముంబైలోని అటల్ సేతుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో పని చేస్తున్న సుశాంత్ ఎన్నో నెలలగా తీవ్రమైన పని ఒత్తిడితో బాధపడుతున్నాడని ఆయన భార్య కన్నీటిపర్యంతమైంది. ఇవన్నీ ఇండియాలో నిత్యం జరిగే కొన్ని ఘటనలు మాత్రమే..! మీడియా దృష్టికి, పోలీసు స్టేషన్ వరకు రాని కేసుల సంఖ్యకు లెక్కే ఉండదు..!'వారానికి 70గంటలు పనిచేయాలి...' ఇది నారాయణమూర్తి పదేపదే చెబుతున్న మాట.. మరోసారి కూడా అదే చెప్పారాయన..! దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపేందుకు భారతీయ యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్నది ఆయన వాదన. ఇండియాలో పేదరికాన్ని పోగొట్టాలంటే ఇలా కష్టపడాలట..! కేవలం వ్యాపారవేత్తలే ఉద్యోగాలను సృష్టించగలరని.. దేశానికి ఆదాయాన్ని తీసుకురాగలిగేది కూడా వారేనని నారాయణమూర్తి చాలా స్పీచ్‌ల్లో చెబుతున్నారు. అంతేకాదు.. పెట్టుబడిదారి విధానంతో మంచి రోడ్లు, మంచి ఉద్యోగాలు వస్తాయని..దేశాన్ని ముందుకు నడిపేది క్యాపిటలిజమేనని ఆయన అంటున్నారు.పనిలోపనిగా సోషలిస్ట్ సిద్ధాంతాలను నమ్మిన భారత్ తొలి ప్రధాని నెహ్రూని ఆయన విమర్శిస్తున్నారు. నెహ్రూ సోషలిస్టిక్ విధానాల వల్ల ఇండియా చాలా నష్టపోయిందని ఆరోపిస్తున్నారు.70వ దశకం ప్రారంభంలో తనకు పారిస్‌లో పని చేసే అవకాశం వచ్చిందని.. అక్కడున్నవారంతా ఇండియాను మురికి దేశంగా భావించేవారని చెప్పుకొచ్చారు నారాయణమూర్తి. అప్పటికి దేశంలో పేదరికం ఉందని.. రోడ్లన్నీ గుంతలమయంగా ఉండేవని.. ఆ తర్వాత పెట్టుబడిదారి విధానాల కారణంగా ఆ పరిస్థితి మారిందని చెప్పారు. వ్యాపారాల్లో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండకూడదని.. పెట్టుబడిదారులు ఉద్యోగాలు సృష్టించడం ద్వారా దేశాన్ని నిర్మిస్తారని, వారు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారని.. ఇదే దేశం ఎదుగుదలకు కారణం అవుతుందని నారాయణమూర్తి అప్పట్లోనే భావించారట..!వారానికి 70 గంటల పని విధానం కారణంగా గుండెపోటు ముప్పు 33శాతం పెరుగుతుందని కెంబ్రిడ్జ్ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. అధిక పని ఒత్తిడితో 2016లో 7 లక్షల 45 వేల మంది ప్రపంచవ్యాప్తంగా మరణించారు. 2010 - 2019 మధ్య 350 మంది ఇండియన్ డాక్టర్స్ కేవలం ఓవర్ టైమ్ వర్క్‌ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అటు అమెరికాలో వృత్తిపరమైన ఒత్తిడి ఆరోగ్య సమస్యలను విపరీతంగా పెంచుతుందని నివేదికలు చెబుతున్నాయి. పని-సంబంధిత ఒత్తిడి కారణంగా అమెరికాలో సంవత్సరానికి 20,231 మంది మరణిస్తున్నారు.అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం అధిక పని ఒత్తిడితో ఆత్మహత్యలు 27శాతం పెరిగాయి. ఇక WHO స్టడి ప్రకారం వారానికి 55గంటలకు మించి పని చేస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం 1.3రెట్లు పెరుగుతుంది. మెడిబడ్డి రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 62శాతం మంది తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు..! అటు 160 దేశాల్లోని 1,28,278 మంది ఉద్యోగులను సర్వే చేసిన గాలప్.. ప్రతీ 1,000 మంది భారతీయ ఉద్యోగులలో 350 మంది విపరీతమైన కోపాన్ని కలిగి ఉన్నారని తేల్చింది. అటు తీవ్రమైన పని వేళల కారణంగా డిప్రెషన్ బారిన పడేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓవర్ టైమ్ వర్క్ కారణంగా తీవ్రమైన మానసిక సమస్యలతో పాటు గుండె జబ్బులు, అధిక రక్తపోటు లాంటి సమస్యలు పెరుగుతాయి. ఇది డాక్టర్లు చెబుతున్న పచ్చి నిజాలు..!సరే.. ఓసారి ఆరోగ్యం విషయాలను పక్కనపెడదాం..! పోని నారాయణమూర్తి చెప్పినట్టు కేవలం క్యాపిటలిజం మాత్రమే దేశాలను ముందుకు నడిపిస్తున్నాయా అంటే కాదనే చెప్పాలి.! చైనా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిలో ఒకటిగా ఎదగడానికి ఉపయోగపడింది ఆ దేశం నమ్మిన సోషలిస్ట్ సిద్ధాంతాలు. అటు నాటి సోవియట్ రష్యాతో పాటు క్యూబా లాంటి దేశాలు సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ద్వారానే అభివృద్ధి చెందాయి. సరే ఈ సోషలిజాన్ని కూడా పక్కన పెడదాం..! మరి స్వీడన్, నార్వే దేశాల్లో వారానికి 35-40 పని గంటల విధానమే ఉంది కదా.. మరి అక్కడ ఉచిత ఆరోగ్యసేవలు, మెరుగైన ఉద్యోగ భద్రత ఎందుకున్నట్టు? గొడ్డుచాకిరి చేస్తేనే ప్రొడక్టవిటీ ఉంటుందని నారాయణమూర్తి చెప్పిన మాటలకు యూరప్‌లోని అభివృద్ధి చెందిన దేశాల ఉద్యోగ విధానాలకు ఏమాత్రం పొంతన లేదు.ఇవి కళ్లకు కనిపిస్తున్న నిజాలు..! వీటి అన్నిటిని సమ్ అప్ చేసి ఒక మాట చెప్పనా.. 'A worker chained by exploitation may produce results, but never innovation.. true productivity thrives in freedom, not fear...' టార్గెట్లు పెట్టి డెడ్లైన్లు విధించి ఓవర్‌టైమ్ చేస్తే ఏదో ఒక ప్రొడక్టివిటీ కనిపిస్తుంది కానీ బెటర్ అవుట్‌పుట్ అయితే రాదు..! ఇండియాలో ఇప్పటికి చాలా కంపెనీల్లో వారానికి 48గంటల పని విధానం ఉంది. వారానికి ఆరు రోజుల వర్క్ ఉంటే రోజుకు 8 గంటలు పని చేస్తున్నట్టు లెక్కా! ఇక 48గంటలకే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉద్యోగులను వేధిస్తున్నాయి. మరి వారానికి 70 గంటల పని అంటే రోజుకు దాదాపు 12గంటలు పనిచేయాలి..! మరి పర్శనల్ లైఫ్ ఏది? అంటే జీవితాంతం ఉద్యోగం చేయడానికి మనుషులు పుడుతున్నట్టా? మనుషులా.. మెషీన్లా? ఓ యాంత్రానికి కూడా రెస్ట్ లేకపోతే అది సరిగ్గా పనిచేయదు.. మరి బాడీకి, మైండ్‌కి విశ్రాంతి అవసరం లేదా?-త్రినాథ్ బండారు -
పేదరికం నుంచి బయటపడాలంటే
-
పేదరికం నుంచి భారత్ బయటపడాలంటే..: నారాయణమూర్తి
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి.. పని గంటలపై తన వాదనను మరోసారి సమర్థించుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాల్సిందేనని కుండ బద్ధలు కొడుతూ.. లేకుంటే పేదరికం నుంచి ఎలా బయటపడగలమని? ప్రశ్నించారాయన. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో నారాయణమూర్తి పాల్గొని మాట్లాడుతూ..‘‘ఇన్ఫోసిస్‌ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి... వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?. భవిష్యత్తు కోసం మనమంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలి’’ అని నారాయణమూర్తి పిలుపు ఇచ్చారు.ఆ మధ్య ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ది రికార్డ్’ అనే పాడ్‌కాస్ట్ తొలి ఎపిసోడ్లో నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలు, టెకీలు స్పందిస్తూ భిన్నాభిప్రాయాలు వ్యక్తపర్చారు. పలు దేశాల్లో పని గంటలపై చర్చ ఆ సమయంలో జరిగింది. అంతేకాదు.. ఇటీవల జపాన్‌లో వారానికి నాలుగు రోజుల పని దినాల అంశాన్ని ప్రస్తావిస్తూ.. నారాయణమూర్తిని నెట్టింట ట్రోల్ చేశారు కూడా.నారాయణమూర్తి ఏమన్నారంటే..‘ది రికార్డ్’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువని అన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా.. మరికొందరు మాత్రం నారాయణ మూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు. ఇదీ చదవండి: భారత్ బాగుండాలంటే.. పని గంటలు తగ్గాల్సిందే! -
ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. టాలీవుడ్ ప్రముఖుల సంఘీభావం (ఫొటోలు)
-
రూ.50 కోట్లతో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు.. ఎక్కడంటే..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి కొత్తగా రూ.50 కోట్లతో ఫ్లాట్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. బెంగళూరులో కింగ్‌ఫిషర్ టవర్స్‌లోని పదహారో అంతస్తులో ఆయన ఫ్లాట్ కొనుగోలు చేశారు. సుమారు 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ నాలుగు బెడ్రూమ్లను కలిగి ఉంది. దీనికి ఐదు కారు పార్కింగ్ స్థలాలున్నాయి. మూర్తి దీన్ని రూ.50 కోట్లతో కొనుగోలు చేయడంతో నగరంలోని అత్యంత ఖరీదైన ఫ్లాట్ల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు పదేళ్ల క్రితం ఈ టవర్స్‌లో ఫ్లాట్ సొంతం చేసుకున్న ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి మూర్తి తాజాగా ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.బెంగళూరు నగరం మెయిన్ సిటీలో ఉన్న యూబీ సిటీ హౌస్ వద్ద కింగ్‌ఫిషర్ టవర్స్ 4.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో మూడు బ్లాకుల్లో 34 అంతస్తుల్లో 81 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కోటి సగటున 8,321 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్నాయి. గతంలో ఈ ప్రదేశంలో విజయ్ మాల్యా పూర్వీకుల ఇల్లు ఉండేది. అందులో ఫ్లాట్లు నిర్మించారు. ఇందుకోసం 2010లో కింగ్‌ఫిషర్, ప్రెస్టీజ్ గ్రూప్ కలిసి పనిచేశాయి. ఇప్పటికే ప్రెస్టీజ్ గ్రూప్ ఆధ్వర్యంలోని 41 లగ్జరీ అపార్ట్మెంట్లను సంస్థ విక్రయించింది.ఇదీ చదవండి: విభిన్న ఖాతాలు.. మరెన్నో పరిమితులు!ఇప్పటికే నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి ఆ టవర్స్‌లో 23 అంతస్తులో రూ.29 కోట్లతో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్‌షా, కర్ణాటక విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్ కుమారుడు రానా జార్జ్, క్వెస్ట్ గ్లోబల్ సీఈఓ, ఛైర్మన్ అజిత్ప్రభు ఈ టవర్స్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. -
నారాయణ మూర్తిని మించిన సేనాపతి
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తిని సంపద పరంగా అదే సంస్థకు చెందిన మరో సహవ్యవస్థాపకులు సేనాపతి గోపాలకృష్ణన్ మించిపోయారు. ఇటీవల వెలువడిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం భారత్‌లో 334 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ సంఖ్య గతేడాది కంటే 75 ఎక్కువ. వారి సామూహిక సంపద రూ.159 లక్షల కోట్లకు చేరింది. ఈ లిస్ట్‌లో ఈసారి నారాయణ మూర్తి(సందప రూ.36,600 కోట్లు)ని సేనాపతి గోపాలకృష్ణన్ అధిగమించారు. రూ.38,500 కోట్ల నికర సంపదతో ఈ ఘనత దక్కించుకున్నారు.ఇన్ఫోసిస్‌ను 1981లో నారాయణ మూర్తి, ఎన్ఎస్ రాఘవన్, అశోక్ అరోరా, నందన్ నీలేకని, ఎస్డీ శిబులాల్, కే.దినేష్, సేనాపతి గోపాలకృష్ణన్ కలిసి స్థాపించారు. ఇది తరువాతి కాలంలో ఇన్ఫోసిస్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఐటీ సంస్థల్లో ఒకటిగా మారింది. 2023లో 18.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,51,762 కోట్లు ) ఆదాయాన్ని ఆర్జించింది.ఇదీ చదవండి: యాపిల్ తయారీకి మరో కంపెనీలో వాటా కొనుగోలుసేనాపతి గోపాలకృష్ణన్సేనాపతి గోపాలకృష్ణన్(69) ఇన్ఫోసిస్ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అతను 2007 నుంచి 2011 వరకు కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కంపెనీ విస్తరణ, ఆవిష్కరణల్లో ఇన్ఫోసిస్‌ను ముందుండి నడిపించారు. గోపాలకృష్ణన్ 2011 నుండి 2014 వరకు సంస్థకు వైస్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్‌లో తన కార్యకలాపాల నుంచి వైదొలిగిన తర్వాత గోపాలకృష్ణన్ కొత్త వ్యాపారాలపై దృష్టి సారించారు. అతను ప్రస్తుతం యాక్సిలర్ వెంచర్స్ ఛైర్మన్‌గా ఉన్నారు. యాక్సిలర్ వెంచర్స్ గుడ్‌హోమ్, కాగాజ్, ఎన్కాష్ వంటి స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టింది. -
తగ్గేదేలే.. మరోసారి పని గంటలపై మూర్తి వ్యాఖ్యలు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి గతంలో పని గంటలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. వాటిని వెనక్కి తీసుకోబోనని స్పష్టం చేశారు. అందరూ కష్టపడి పని చేయాలని సూచించారు. సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.ప్రతి ఒక్కరూ వారంలో దాదాపు 70 గంటలపాటు పని చేయాలని నారాయణ మూర్తి గతంలో కామెంట్ చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా చర్చ జరిగింది. తన అభిప్రాయాన్ని మార్చుకున్నారా అని తాజాగా అడిగిన ప్రశ్నలకు మూర్తి స్పందించారు. ‘నన్ను క్షమించండి. నేను నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు. నా తుదిశ్యాస వరకు ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను. దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ వారంలో 100 గంటలపాటు పని చేస్తున్నారు. మనం కూడా కష్టపడి చేయడమే తనకు ఇచ్చే ప్రశంస. ఇది దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. పని చేయకుండా విశ్రాంతి తీసుకోవడంతో ఫలితం ఉండదు. వారంలో ఆరు రోజుల పని దినాలను ఐదు రోజులకు మార్చినప్పుడు తీవ్ర నిరాశ చెందాను. నా జీవితంలో చాలాకాలంపాటు రోజులో 14 గంటలు, వారంలో ఆరున్నర రోజులు పనిచేశాను. ఉదయం 6:30 గంటలకు కార్యాలయానికి చేరుకుని రాత్రి 8:40 గంటల వరకు పని చేసేవాడిని. కష్టపడి పనిచేసేతత్వం భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయింది’ అని అన్నారు.ఇదీ చదవండి: నెలలో 5.9 శాతం తగ్గిన ఇళ్ల ధరలు!ప్రపంచంలోనే అధికారికంగా వారంలో అధిక పని గంటలున్న దేశాలుయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: 52.6 గంటలు(సరాసరి)గాంబియా: 50.8 గంటలుభూటాన్: 50.7 గంటలులెసోతో: 49.8 గంటలుకాంగో: 48.6 గంటలుఖతార్: 48 గంటలుఇండియా: 47.7 గంటలుమౌరిటానియా: 47.5 గంటలులైబీరియా: 47.2 గంటలుబంగ్లాదేశ్: 46.9 గంటలు -
పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తన భార్య సుధామూర్తి నెట్‌ఫ్లిక్స్ షో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో స్టార్ గెస్ట్లుగా పాల్గొన్నారు. అందులో తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నారు. నారాయణ మూర్తి తన 25వ వివాహ వార్షికోత్సవం రోజున సుధామూర్తికి శుభాకాంక్షలు తెలపడం మరిచిపోయానన్నారు.‘ఒకరోజు నేను ఆఫీస్‌కు బయలుదేరుతుండగా సుధ ఉదయం నా దగ్గరకు వచ్చి ఈ రోజు ఏదైనా ప్రత్యేకత ఉందా? అని అడిగింది. ఏమీలేదు అని జవాబిచ్చాను. ఆఫీస్ నుంచి కారులో ఇంటికి వస్తుండగా మళ్లీ ఈరోజు ప్రత్యేకతేంటో ఆలోచించారా? అని అడిగింది. ఏమీలేదని అదే సమాధానం చెప్పాను. నేను ఆ తర్వాతిరోజు ముంబయిలో ఒక సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. నేను ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి విమానం ఎక్కుతుండగా నా కూతురు అక్షత(బ్రిటన్ మాజీ ప్రధాని రిషీసునాక్ భార్య) నుంచి కాల్ వచ్చింది. ఏం చేస్తున్నారు? అని అడిగింది. ఫ్లైట్ ఎక్కుతున్నాను అని సమాధానం ఇచ్చాను. వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. వేరే విమానం ఎక్కి బెంగళూరు వెళ్లండని చెప్పింది. అమ్మకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పండని తెలిపింది. మీరు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశానికి హాజరు అవ్వాల్సి ఉంది. వీలైతే మీరు ప్రైవేట్ విమానాన్ని అద్దెకు తీసుకోండి. కానీ అమ్మకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పాల్సిందేనని పట్టుపట్టింది’ అని నారాయణమూర్తి చెప్పారు.ఇదీ చదవండి: మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్‌తో దోస్తీ ఇందుకేనా..?సుధామూర్తి నవ్వుతూ ‘అది మా 25వ వివాహ వార్షికోత్సవం. కొంత ప్రత్యేకంగా ఉండాలనుకున్నాను. నా భర్త ఆ విషయాన్ని మరిచిపోయేసరికి ఐదు-పది నిమిషాల పాటు కొంత బాధ అనిపించింది. కానీ ఆయన పనితీరు నేను అర్థం చేసుకుంటాను. కాబట్టి ఇలాంటి విషయాలు అంతగా పట్టించుకోను. కానీ, ఈ విషయంలో నా కూతురు చాలా కలత చెందింది’ అని చెప్పారు. -
The Great Indian Kapil Show: చూతము రారండీ
వయసుతో సంబంధం లేకుండా మహిళల్లో పెద్దరికం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్నవాళ్ళయినా, పెద్దవాళ్ళయినా పెద్దరికం అన్నది మహిళలకు ఒక సొగసు. మళ్లీ మగవాళ్లు అలాక్కాదు. వాళ్లకెంత వయసు వచ్చినా కూడా మాటల్లో, చేతల్లో చిన్నవాళ్లే... మహిళలతో పోలిస్తే’!సుధామూర్తి వయసు 74. మూర్తి గారి వయసు 78. ఆమె ఆగస్టు 19 న పుడితే, ఆయన ఆగస్టు 20 న జన్మించారు. తేదీలను బట్టి చూసినా సుధ ఆయన కన్నా ఒకరోజు ‘పెద్దరికం ’ ఉన్నవారు. (తమాషాకు లెండి). సరే, సంగతి ఏమిటంటే... ఈ దంపతులిద్దరూ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కు ఆహ్వానం వస్తే వెళ్లారు. సాధారణంగా కపిల్ బాలీవుడ్ సెలబ్రిటీలను తన టాక్ షో కు పిలుస్తుంటారు. అందుకు భిన్నంగా ఈసారి ఈ బిజినెస్ దిగ్గజ దంపతుల్ని ఒప్పించి రప్పించారు. వారితో టాక్ షో సరదాగా నడిచింది. భర్త గురించి భార్యను, భార్య గురించి భర్తను కొన్ని ప్రశ్నలు అడిగారు యాక్టర్ కమ్ కమెడియన్ కపిల్ శర్మ. వాటిల్లో ఒక ప్రశ్న : ‘మొదటిసారి సుధాజీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీకెలా అనిపించింది?’ అని అడిగారు కపిల్. దానికి మూర్తి గారు చాలా గంభీరంగా, నిజాయితీగా సమాధానం ఇచ్చారు. ‘ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే.. ఒక స్వచ్ఛమైన గాలి పరిమళం నా శ్వాసలోనికి వెళ్లినట్లుగా...’ అన్నారు. ఆ మాటకు వెంటనే సుధామూర్తి... ‘అప్పుడు ఆయన వయసులో ఉన్నారు కదా’ అన్నారు జోకింగ్‌గా. దెబ్బకు ఆడియెన్స్ భళ్లుమన్నారు. నిజానికి సుధామూర్తి ఉద్దేశ్యం ఆడియెన్స్‌ని నవ్వించడం కాదు, భర్తలోని కవితాత్మక భావోద్వేగాన్ని కాస్త నెమ్మది పరచటం. పైగా అంతమంది ఎదుట భర్త తనను అంతగా ‘అడ్మైర్’ చెయ్యటంతో ఆమెలోని పెద్దరికం మధ్యలోనే కల్పించుకుని ఆయన్ని ఆపవలసి వచ్చినట్లుంది. ఆపకపోతే... ఇంకా ఏం చెబుతారో అని. అసలే వాళ్ళది లవ్ మ్యారేజ్. ఈ నెల 9న నెట్‌ఫ్లెక్స్‌లో స్ట్రీమ్ ఆయ్యే ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ ఎపిసోడ్లో మూర్తి గారి ఈ అమాయకత్వాన్ని, సుధామూర్తి పెద్దరికాన్ని కనులారా వీక్షించవచ్చు. (డాటర్ ఆఫ్ ఆలియ : రాహా ‘ఆహా’ అంటూ వింటుంది)ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు -
నేను మీలా అవ్వాలంటే?: ఇన్ఫీ నారాయణ మూర్తి సమాధానం
ఇన్ఫోసిస్ కంపెనీ గురించి తెలిసిన అందరికీ.. ఎన్ఆర్ నారాయణ మూర్తి గురించి కూడా తప్పకుండా తెలిసే ఉంటుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రముఖ్ టెక్ దిగ్గజంగా ఎదిగారు అంటే, దాని వెనుక ఆయన అపారమైన కృషి, పట్టుదలే కారణం. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని నేడు ప్రముఖుల జాబితాలో ఒకరుగా ఉన్న నారాయణమూర్తి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ.. సూచనలు, సలహాలు ఇస్తుంటారు.ఇటీవల నారాయణ మూర్తి టీచ్ ఫర్ ఇండియా లీడర్స్ వీక్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 12ఏళ్ల విద్యార్ధి ''నేను మీలా అవ్వాలంటే?.. ఏమి చేయాలి'' అని ప్రశ్నించారు. దానికి మూర్తి బదులిస్తూ.. ''మీరు నాలాగా మారడం నాకు ఇష్టం లేదు. దేశ శ్రేయస్సు కోసం మీరు నా కంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.మీ సొంత మార్గాన్ని ఏర్పరచుకోండి.. కొత్త విధానాలకు శ్రీకారం చుట్టండి. జీవితం అంటే ఒకరి అడుగుజాడల్లో నడవడం కాదని నారాయణ మూర్తి వెల్లడించారు. క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ.. మా నాన్న నాకు టైమ్‌టేబుల్ ద్వారా సమయాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పించారు. అదే నన్ను స్టేట్ ఎస్ఎస్ఎల్సీ పరీక్షలో నాల్గవ ర్యాంక్ సాధించేలా చేసిందని వెల్లడించారు.ఇదీ చదవండి: 'అలాంటివేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రాప్యారిస్లో ఇంజనీర్‌గా ఉన్నప్పుడు, ఒక ప్రోగ్రామ్‌ను పరీక్షించే సమయంలో అనుకోకుండా మొత్తం కంప్యూటర్ సిస్టమ్ మెమరీని తొలగింతొలగించాను. సిస్టమ్‌ని పునరుద్ధరించడానికి అప్పటి మా బాస్ కోలిన్‌తో కలిసి 22 గంటలు పంచేసాను. కాబట్టి అనుకోను తప్పులు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలని ఆయన అన్నారు. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ఆయన అన్నారు. -
''పదివేల అప్పుతో వేలకోట్ల సామ్రాజ్యం''.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
చంద్రబాబు సర్కార్ లో మంగళవారం వచ్చిందంటే టెన్షన్..
-
‘మూర్తి సార్.. మీ ఇన్ఫోసిస్ వాళ్లకు చెప్పండి’
ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి సున్నితమైన కౌంటర్ ఇచ్చారు ఓ చార్టెర్డ్ అకౌంటెంట్. ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఐటీ శాఖ పోర్టల్‌లో సమస్యలు తలెత్తడం మీద దాన్ని అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్‌పై బెంగళూరుకు చెందిన సీఏ ఒకరు సోషల్ మీడియా వేదికగా అంతృప్తి వ్యక్తం చేశారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో బసు (@Basappamv) అనే సీఏ ఓ పోస్టు పెట్టారు. దేశాన్ని నిర్మించడానికి యువ నిపుణులు వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇచ్చిన సలహాను హాస్యాస్పదంగా ప్రస్తావించారు. "నారాయణ మూర్తి సార్, మీ సలహా మేరకు, మేము పన్ను నిపుణులం వారానికి 70 గంటలకు పైగా పని చేయడం ప్రారంభించాం. ఆదాయపు పన్ను పోర్టల్‌ను సజావుగా నడపడానికి మీ ఇన్ఫోసిస్ బృందాన్ని వారానికి కనీసం ఒక గంట పని చేయమని అడగండి" అంటూ రాసుకొచ్చారు.ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో కీలకమైన వార్షిక సమాచార ప్రకటన (AIS), పన్ను సమాచార ప్రకటన (TIS) డౌన్లోడ్ చేయడంలో సమస్యలను పేర్కొంటూ చాలా మంది సీఏలు బసు మనోభావాలను ప్రతిధ్వనించారు. ట్యాక్స్‌ఆరామ్ ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్, భాగస్వామి మయాంక్ మొహంకా, "ఈ సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో సాధారణ జాప్యం జరుగుతోంది" అని పేర్కొన్నారు.మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలతో జరిగిన ఆలస్యం కారణంగా చాలా మంది క్లయింట్ల కోసం ఏఐఎస్, టీఐఎస్‌లను పొందడంలో చాలా మంది చార్టెర్డ్ అకౌంటెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పన్ను చెల్లింపుదారులను, సీఏలను ప్రభావితం చేస్తున్న పోర్టల్ సమస్యలపై అటు ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఇటు ఇన్ఫోసిస్ గానీ స్పందించలేదు. -
ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్న
నవమాసాలు కడుపునమోసి పెంచకపోతే ఏంటి..పాలుపట్టి లాలించకపోతే ఏంటి..చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపంచకపోతే ఏంటి.. ఎక్కడో వంటగదిలో కుక్కర్ శబ్దానికి మన ఏడుపు వినిపించక అమ్మ తనపని చేసుకుపోతుంటే.. మన గొంతు విన్న నాన్న పరుగోమని హక్కున చేర్చుకుంటాడు కదా.. అహర్నిశలు అమ్మ, పిల్లలకు ఎలాంటిలోటు లేకుండా కంటిరెప్పలా చూసుకుంటాడు కదా.. తోచినంతలో దాచిపెట్టి తిరిగి అత్యవసర సమయాల్లో మనకే ఖర్చుపెడుతాడు కదా..మన ఇష్టాలే తన ఇష్టాలుగా బ్రతుకుతాడు కదా.. మనల్ని కొట్టినాతిట్టినా తనకంటే ఉన్నతస్థాయిలో చూసుకోవాలనుకుంటాడు కదా.. తన బుజాలపై మనల్ని మోస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కదా.. నాన్నే మన హీరో. వ్యాపారంలో కోట్లు సంపాదించి అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు కూడా నాన్నతో తమకున్న బంధాన్ని, తమ పిల్లలపై ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. అలా తండ్రుల నుంచి జీవితాన్ని నేర్చుకున్న కొందరు వ్యాపార ప్రముఖుల గురించి ఫాదర్స్‌డే సందర్భంగా ఈ కథనంలో తెలుసుకుందాం.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి తెలిపారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు.యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్‌లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో, ఉమ్మటి ఆంధ్రప్రదేశ్‌లోనూ వివిధ పదవుల్లో పని చేశారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తిసందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు..డియర్ అక్షితామీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్‌లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్‌కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ అందుకు అనుమతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్‌తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయతీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ.- మీ పప్పాజమ్సెట్జీ టాటాభారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్‌పూర్‌లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం హైడల్పవర్ ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్‌లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు దొరాబ్జీ టాటా, రతన్జీటాటాలు ఆ ప్రాజెక్ట్ పూర్తిచేశారు. అప్పటి నుంచి జేఆర్డీ టాటా వారి స్ఫూర్తిని కొనసాగించారు. దాన్ని రతన్‌టాటా మరింత స్థాయికి తీసుకెళ్లి భారత పరిశ్రమలో మెఘుల్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. -
వయస్సు 5 నెలలే.. కానీ ఇన్ఫోసిస్ ద్వారా 4.2 కోట్లు సంపాదించాడు
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి మనువడు ఏకాగ్రహ్ రోహన్ కేవలం ఐదు నెలల వయస్సులో ఇన్ఫోసిస్ నుంచి రూ.4.2 కోట్లు దక్కించుకున్నాడు. నారాయణ మూర్తి గత నెలలో తన మనవడు ఏకాగ్రహ్ రోహన్‌కు రూ. 240 కోట్ల కంటే ఎక్కువ విలువైన 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను (0.04% వాటా) రాసిచ్చారు. ఈ తరుణంలో ఇన్ఫోసిస్ గురువారం క్యూ 4 ఫలిteతాలను ప్రకటించింది. క్యూ 4 ఫలితాలతో పాటు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 28 డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. దీంతో ఇన్ఫోసిస్‌లో తన పేరు మీద ఉన్న మొత్తం 15లక్షల షేర్ల ద్వారా డివిడెండ్ రూపంలో ఏకాగ్రహ్ రోహన్ ఇప్పుడు రూ.4.2 కోట్లు అర్జించాడు. నారాయణ్ మూర్తి, సుధా మూర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు అక్షతా మూర్తి, కొడుకు రోహన్ మూర్తి. అక్షతా మూర్తి, 2009లో రిషి సునాక్(ప్రస్తుత బ్రిటన్ ప్రధాని)ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఇక రోహన్ మూర్తికి 2011లో టీవీఎస్ కంపెనీ ఛైర్మన్ వేణుశ్రీనివాస్ కుమార్తె లక్ష్మితో వివాహం జరిగింది. ఈ జంట 2015లో విడిపోయారు. 2019లో అపర్ణ కృష్ణన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి సంతానమే ఏకాగ్రహ్. -
‘ఐదు రోజులు తిండి లేదు.. ఆ బాధ మీకు తెలియదు’
ఆకలి విలువ చాలామందికి తెలియదని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్ఆర్.నారాయణమూర్తి అన్నారు. ‘ఆహార భద్రతలో సాధించిన విజయాలు: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వైపు భారత్ ప్రయాణం’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితిలో ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో ఆయన మాట్లాడారు. ‘యాభై ఏళ్ల కిందట యూరప్ సరిహద్దు ప్రాంతమైన బల్గేరియా, యుగోస్లేవియా మధ్య ఉన్న నిచ్ అనే ప్రదేశంలో పనిచేస్తున్నపుడు దాదాపు 120 గంటలపాటు(5రోజులు) తిండిలేక ఆకలితో బాధపడ్డాను. మీలో ఎవరికీ ఆకలిబాధ తెలియదు. ఆకలితో అలమటించే పరిస్థితి భారత్‌లో ఎవరికీ రాకూడదు. అక్షయపాత్ర కార్యక్రమంతో నిస్సాహాయుల ఆకలితీర్చడం గొప్పవిషయం. భారత ప్రభుత్వం యువతకు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకుంటోంది. దేశ పౌరులందరూ పేద పిల్లల భవిష్యత్తు కోసం తోచినంత సహాయం చేయాలి. ప్రభుత్వ ఆర్థిక విధానాలతో విదేశీ పెట్టుబడులు పెరిగి దేశం వృద్ధి సాధిస్తోంది. భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా దాదాపు 80 కోట్ల మందికి పైగా ప్రయోజనం కలుగుతోంది. పీఎం పోషన్(పోషణ్ శక్తి నిర్మాణ్) పథకంతో నేరుగా 11 కోట్ల మంది పిల్లలకు పౌష్టికాహారం అందుతోంది’ అని మూర్తి అన్నారు. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు ఎక్కడంటే.. -
సూధామూర్తి ఆస్తి విలువ ఎంతో తెలుసా..
ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి(73) రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఎంపీగా నియమితులైన సుధామూర్తికి ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌లో 0.83% వాటాకు సమానమైన 3.45 కోట్ల షేర్లు ఉన్నాయి. ప్రస్తుత షేరు ధర రూ.1,616.95 ప్రకారం, సుధామూర్తి షేర్ల విలువ రూ.5,600 కోట్ల వరకు ఉండొచ్చు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి ఇన్ఫోసిస్‌లో 1.66 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి విలువ సుమారుగా రూ.2,691 కోట్లు. 2006లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న సుధామూర్తికి.. ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ పురస్కారమూ లభించింది. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ భార్య అక్షతామూర్తి ఈమె కుమార్తె. ఇదీ చదవండి: అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం ‘సుధామూర్తిని రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేయడం సంతోషంగా ఉంది. సామాజిక కార్యకలాపాలు, దాతృత్వం, విద్య.. ఇలా పలు విభాగాల్లో ఆమె అందించిన సేవలు అమోఘం. రాజ్యసభ సభ్యురాలిగా దేశ భవిష్యత్తును మార్చడంలో నారీశక్తికి నిదర్శనంగా ఆమె తన వంతు పాత్ర పోషిస్తారని కోరుకుంటున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ప్లాట్ఫామ్లో తెలిపారు. -
అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం
ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్, సంస్థ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ నిర్ణయం వెలువడడం విశేషం. సుధామూర్తి సంఘ సేవకురాలిగా అందరికీ సుపరిచితం. ఈమె గొప్ప రచయిత్రి. కంప్యూటర్ ఇంజినీర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. సుధామూర్తి పలు అనాధాశ్రమాలను ప్రారంభించారు. గ్రామీణాభివృద్దికి సహకరిస్తున్నారు. కర్ణాటకలోని దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్యను చేరేలా తోడ్పడుతున్నారు. ఆమె గతంలో కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆమెను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించినట్లు తెలిసింది. ఆమె నవలే సీరియల్‌గా.. సుధామూర్తి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో ‘ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ ప్రారంభించారు. ఆమె కాల్పనిక రచనలు కూడా రాస్తారు. ఆమె రచించిన కన్నడ నవల ‘డాలర్ సొసే’ ఇంగ్లిష్‌లో డాలర్ బహుగా ట్రాన్స్‌లేట్ చేశారు. తర్వాత ఆ నవల 2001లో ‘జీ టీవీ’లో సీరియల్‌్‌గా ప్రసారం చేశారు. భూరి విరాళాలు.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా సుధామూర్తి ఐఐటీ కాన్పూర్‌లోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఉండే హెచ్.ఆర్.కాదిం దివాన్ బిల్డింగ్ హౌసింగ్ ఏర్పాటుకు, నారాయణరావ్ మెల్గిరి స్మారక న్యాయ కళాశాలకు భూరి విరాళాలను అందజేశారు. కర్ణాటకలోని బి.వి.బి.టెక్నికల్ కాలేజీలో ఎలక్టికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్) నుంచి కంప్యూటర్ సైన్స్ విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించారు. పోరాడితే దక్కిన ఉద్యోగం.. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆటో పరిశ్రమలో పేరొందిన టెల్కో కంపెనీలో మహిళా ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. అంతా ఈజీగా ఈ ఉద్యోగం రాలేదు. అప్పటికి ఈ సంస్థలో కేవలం పురుషులకే స్థానం కల్పించేవారు. దాన్ని ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడికి పోస్టుకార్డు రాశారు. దానికి స్పందించిన ఆయన తనకు ఇంటర్వ్యూ నిర్వహించారు. అప్పటికప్పుడు నియామక ఉత్తర్వులు అందించారు. ఆ సంస్థకు పుణె బ్రాంచిలో పనిచేస్తున్నపుడే ఆవిడకు నారాయణ మూర్తితో పరిచయం ఏర్పడి తర్వాత వివాహం చేసుకున్నారు. అందుకున్న పురస్కారాలు.. మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేతగా పలు సేవలు అందిస్తున్నారు. అలాగే ఇన్ఫోసిస్‌కు క్యాపిటలిస్ట్‌గా ఉన్న కెటారామన్ వెంచర్స్ సంస్థలకు పెట్టుబడిదారుగా వ్యవహరిస్తున్నారు. 2004 - సామాజిక సేవకుగాను శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం 2006 - భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం. (సామాజిక సేవ, దాతృత్వం, విద్యా రంగం) దేశంలో న్యాయ విద్య , ఉపకారవేతనాల అందజేతకు ప్రముఖ న్యాయవేత్త సంతోష్ హెగ్డేతో కలిసి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. సాహితీ సేవ, ఆమె రచనలకు ఆర్.కె.నారాయణన్ పురస్కారం అందుకున్నారు. 2011లో కన్నడ సాహిత్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అట్ఠిమబ్బే (Attimabbe) అవార్డు అందుకున్నారు. 2023 -పద్మ భూషణ్ అవార్డు 2023 - గ్లోబల్ ఇండియన్ అవార్డు. ఇదీ చదవండి: ‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’ ప్రముఖ రచనలు మదర్ ఐ నెవెర్ న్యూ మేజిక్ ఆఫ్ ది లాస్ట్ టెంపుల్ హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్ వైస్ అండ్ అదర్ వైస్ మేజిక్ డ్రమ్ అండ్ ఆదర్ ఫేవరేట్ స్టోరీస్ 3000 స్టిచెస్: ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రార్డినరీ లైవ్స్ గ్రాండ్ మాస్ బాగ్ ఆఫ్ స్టోరీస్