ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఈ అభిప్రాయంపై ఏకీభవిస్తే, మరికొందరు వ్యతిరేకించారు.
టైమ్ యూస్ సర్వే (Time Use Survey) విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో వారానికి సరాసరి 61.6 గంటలు పనిచేస్తున్నట్లు తెలిసింది. వారానికి 65.4 గంటలు పనిచేస్తూ తెలంగాణ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలున్నాయి.
ఇదీ చదవండి: పండుగ సీజన్‌లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి!
తక్కువ పని గంటలున్న రాష్ట్రాల్లో మణిపూర్ (46.9 గంటలు), నాగాలాండ్ (46.8 గంటలు) ఉన్నాయి. అండమాన్ & నికోబార్ దీవుల్లో కూడా వారానికి 58.7 గంటలు పనిచేస్తున్నట్లు ఈ జాబితాలో చూడవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ యువకులు చేసినట్లు భారతీయలు ఎక్కువ గంటలు పనిచేస్తే తప్పకుండా ఇండియా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment