working hours
-
పని వేళలు కాదు.. నాణ్యత ముఖ్యం..
ముంబై: ఆఫీసులో ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు.. ప్రతి రోజు ఎంత నాణ్యమైన పని చేశామనేదే తనకు ముఖ్యమని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ వ్యాఖ్యానించారు. తనకు పని, కుటుంబం రెండూ ప్రాధాన్యతాంశాలేనని ముంబై టెక్ వీక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరు జీవితంలో తమ తమ ప్రాధాన్యతలను గుర్తెరిగి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. వారానికి 90 గంటల వరకు పని చేయాలంటూ కొందరు, 50 గంటలలోపు చాలంటూ మరికొందరు కార్పొరేట్లు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఆకాశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మార్గనిర్దేశం చేసేందుకు తమ కంపెనీ 1,000 మంది డేటా సైంటిస్టులు, పరిశోధకులు, ఇంజినీర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకుందని అంబానీ చెప్పారు. జామ్‌నగర్‌లో 1 గిగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను (జీపీయూ) సర్విసుగా అందించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
పనిగంటలపై మస్క్ సంచలన ట్వీట్
వాషింగ్టన్:ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పనిగంటల పెంపు వ్యాఖ్యల వివాదం అమెరికాను తాకింది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రముఖ బిలియనీర్ ఇలాన్‌మస్క్ ఈ విషయంలో నారాయణమూర్తి కంటే చాలా అడుగులు ముందుకు వేశారు. తాను తన డీవోజీఈ డిపార్ట్మెంట్ సిబ్బంది ఏకంగా వారానికి 120 గంటలు పనిచేస్తున్నామని చెప్పారు.ఇదే సమయంలో అమెరికా ఉన్నతస్థాయి అధికారులు వారానికి కేవలం 40 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని అందుకే పౌరులు చెల్లిస్తున్న పన్ను సొమ్ము వృథా అవుతోందని మస్క్ తెలిపారు. ఈ మేరకు మస్క్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థపై డీవోజీఈ చేస్తున్న ఆడిట్లో సంచలన విషయాలు బయట పడుతున్నాయని, ప్రజల డబ్బు ఎలా దుర్వినియోగమవుతోందో తెలుస్తోందని మస్క్ అన్నారు. DOGE is working 120 hour a week. Our bureaucratic opponents optimistically work 40 hours a week. That is why they are losing so fast. https://t.co/dXtrL5rj1K— Elon Musk (@elonmusk) February 2, 2025 అయితే డీవోజీఈ ఆడిట్లపై ఉద్యోగుల సంఘాలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా బ్యూరోక్రసీని సమర్థవంతంగా తయారుచేసేందుకు ట్రంప్ డీవోజీఈ చీఫ్‌గా మస్క్‌ను నియమించిన విషయం తెలిసిందే. కాగా, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తితో పాటు ఎల్అండ్టీ చీఫ్ సుబ్రమణియన్ తదితరులు ఎక్కువ పనిగంటల విధానమే మేలని వ్యాఖ్యానించి వివాదానికి కారణమయ్యారు. అయితే భారత ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఆర్థిక సర్వే మాత్రం 60 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని పేర్కొనడం గమనార్హం. -
Budget 2025: ఆర్థిక సర్వేలో పని గంటల ప్రస్తావన
వర్క్-లైఫ్ బ్యాలెన్సింగ్ గురించి ఈ మధ్యకాలంలో విస్తృతస్థాయి చర్చ నడుస్తోంది. చైర్మన్, సీఈవో స్థాయిలో ఉన్న వ్యక్తులు నేరుగా స్పందిస్తుండడం.. వాటిపై విమర్శలు-సమర్థనలతో ఈ చర్చ కొనసాగుతోంది. ఈ దరిమిలా ఇవాళ విడుదలైన ఆర్థిక సర్వే సైతం పనిగంటల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.పని గంటల చర్చలో ఇప్పుడు ఎకనామిక్ సర్వే సైతం భాగమైంది. వారానికి 60 గంటలకు మించి పని చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. వివిధ అధ్యయనాల నివేదికలను ఇందులో ప్రముఖంగా ప్రస్తావించింది. ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం..‘‘ఆఫీసుల్లో ఎక్కువ సేపు గడపడం వల్ల మానసిక శ్రేయస్సుకు మంచిది కాదు. రోజుకు 12, అంతకంటే ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తులు గణనీయమైన స్థాయిలో బాధను అనుభవిస్తున్నారు. వారానికి ఎక్కువ గంటలు పని చేయడం ఆరోగ్యానికి హానికరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ(ILO) అధ్యయనాల నివేదికలూ ఈ విషయాన్నే స్పష్టం చేశాయి... అనధికారికంగా.. ఎక్కువ పని గంటలతో ఉత్పాదకత(Productivity) పెరిగినా.. వారానికి 55-50 గంటల మధ్య పని చేయడం ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమేనని డబ్ల్యూహెచ్‌వో-ఐఎల్వో సంయుక్త అధ్యయన నివేదిక స్పష్టం చేసింది’’ అని ఆర్థిక సర్వే వెల్లడించింది. అలాగే.. సుదీర్ఘంగా ఒకే దగ్గర ఎక్కువ గంటలు పని చేయడం మానసిక ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందని సపెయిన్ లాబ్స్ సెంటర్ ఫర్ హుమన్ బ్రెయిన్ అండ్ మైండ్ స్టడీ రిపోర్ట్‌ను ఎకనామిక్ సర్వే హైలెట్ చేసింది.ఇక.. పని గంటలపై పరిమితులు విధించడం ఆర్థిక వృద్ధికి అవాంతరాన్ని కలిగించొచ్చని సర్వే అభిప్రాయపడింది. అలాగే కార్మికుల సంపాదన సామర్థ్యాన్ని దెబ్బ తీసే అవకాశం లేకపోలేదని తెలిపింది. కాబట్టి సౌకర్యవంతమైన పని గంటల విధానం భారతదేశాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుతుందని.. ఈ చర్యలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి తోడ్పడుతుంది అని ఆర్థిక సర్వే సూచించింది.బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. అనంతరం 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. బడ్జెట్‌కు ముందర దీనిని ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. -
కుటుంబానికే ఓటు!
ముంబై: వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై కొన్నేళ్లుగా జరుగుతున్న చర్చలు.. వారంలో 90 గంటలు పని చేయాలన్న ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు దానిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన నిరసనలు, జోకులు, కామెంట్లు, వాదనలు తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ చేపట్టిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాలుపంచుకున్న 78 శాతం మంది ఉద్యోగులు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇండీడ్ ఫ్యూచర్ కెరీర్ రిజల్యూషన్ రిపోర్ట్ ప్రకారం.. భారతీయ ఉద్యోగుల ప్రాధాన్యతలలో గణనీయ మార్పు వచి్చంది. దాదాపు ఐదుగురిలో నలుగురు (78 శాతం) 2025లో కెరీర్లో పురోగతి కంటే జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులతో గడిపేందుకే మొగ్గుచూపుతున్నారు. ఉద్యోగులు తక్కువ ఒత్తిడిని కోరుకుంటున్నారు. మానసిక ప్రశాంతతపై ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య మెరుగైన సమతుల్యత కావాలంటున్నారు. జాబ్ మార్కెట్‌పై సానుకూలం.. భారతీయ ఉద్యోగులు జాబ్ మార్కెట్ గురించి ఆశాజనకంగా ఉన్నారని నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న రంగాలు, పరిశ్రమలలో అవకాశాల విస్తరణపై 55 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగులు విభిన్న నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి చురుకుగా పని చేస్తున్నారు. ఇందుకు అనువుగా తమనితాము మలుచుకుంటున్నారు. కొత్త ఉద్యోగ అవకాశాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ ప్రాంతానికైనా వెళ్లి పనిచేసేందుకూ రెడీ అంటున్నారు. ఎక్కువ సంపాదించడం ముఖ్యం అయినప్పటికీ.. సురక్షిత ఉద్యోగం, న్యాయమైన వేతనం, ప్రత్యేకతను చూపే ప్రయోజనాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నారని ఇండీడ్ ఆ్రస్టేలియా, ఇండియా, సింగపూర్ మార్కెటింగ్ డైరెక్టర్ రేచల్ టౌన్స్లీ తెలిపారు. 2024 డిసెంబర్–2025 జనవరి మధ్య చేపట్టిన ఈ సర్వేలో ఉద్యోగ వేటలో ఉన్న 2,507 మంది భారతీయులతో సహా సింగపూర్, జపాన్, ఆ్రస్టేలియాకు చెందిన 6,126 మంది పాలుపంచుకున్నారు. నైపుణ్యాల ఆధారంగానే.. అధునాతన సాంకేతికతలను స్వీకరించేందుకూ ఉద్యోగులు సిద్దంగా ఉన్నారని నివేదిక వివరించింది. ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్, సాంకేతికత కూడిన రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయని 55 శాతం మంది ఆశాభావంతో ఉన్నారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కాన్ఫ్లిక్ట్ రిజొల్యూషన్, డేటా లిటరసీ, ఏఐ, మెషీన్ లెరి్నంగ్, కోడింగ్ వంటివి 2025లో కెరీర్ పురోగతికి ఉపయోగపడే నైపుణ్యాలుగా భావిస్తున్నారు. సంప్రదాయ డిగ్రీ–ఆధారిత అర్హతల కంటే నైపుణ్యాల ఆధారిత నియామకాలు ఉంటాయని 59 శాతం మంది భారతీయ ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. ఈ ధోరణి సాంకేతికత, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలకు తగ్గట్టుగా అనుకూలత, ప్రత్యేక నైపుణ్యాలను ప్రదర్శించగల అభ్యర్థులకు కంపెనీలు ఎక్కువగా విలువ ఇస్తున్నాయి. ప్రతిభావంతులకే గుర్తింపు, తదుపరి దశలకు వెళ్తారన్న భావన ఉద్యోగుల్లో ఉంది’ అని నివేదిక వివరించింది. -
సుదీర్ఘ పని గంటలు.. ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలి..
ముంబై: దేశం పురోగమించాలంటే యువత సుదీర్ఘ సమయం పాటు పని చేయాలన్న వ్యాఖ్యలపై దుమారం ఇంకా చల్లారని నేపథ్యంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి వివరణనిచ్చారు. ఎవరూ ఎవరినీ గంటల తరబడి పని చేయాలని చెప్పరని, ఎవరికి వారే ఆలోచించుకుని, తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘నేను పొద్దున్నే ఆరున్నరకి ఆఫీసుకి చేరుకునేవాణ్ని. రాత్రి ఎనిమిదిన్నరకి బైటికి వచ్చేవాణ్ని. ఇలా నేను దాదాపు నలభై ఏళ్లు పని చేసాను. ఇది వాస్తవం. నేను స్వయంగా చేశాను. ఇది తప్పు.. నువ్వు ఇలా చేయాలి.. ఇలా చేయకూడదు.. అని ఎవరూ అనడానికి లేదు. ఇలాంటి వాటిపై చర్చలు, వాదోపవాదాలు అనవసరం. మీకు మీరుగా ఆలోచించుకుని, మీరు కోరుకున్నది చేయడమే‘ అని కిలాచంద్ స్మారకోపన్యాస కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నారాయణ మూర్తి తెలిపారు. నిరుపేద బాలలకు మెరుగైన భవిష్యత్తును అందించే దిశగా కష్టపడి పనిచేయాలా, వద్దా అనేది ఎవరికి వారు ఆలోచించుకుని, నిర్ణయం తీసుకోవాల్సిన విషయమని పేర్కొన్నారు. -
ఇల్లు, సంసారం మనకొద్దు.. ఆఫీసే ముద్దు
*ఇంట్లో కూర్చుని ఎంతసేపని భార్యని చూస్తూ ఉంటారు? ఇంట్లో కంటే ఆఫీస్ లో(Office Working Hours) ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యకు చెప్పండి. వారానికి 90 గంటలు పనిచేయండి... నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నా.. ఆరోజు మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధపడుతున్నా. అలా చేయించగలిగితే నాకు చాలా హ్యాపీ"ది గ్రేట్ ఎల్ & టీ చైర్మన్ ఎస్. ఎన్. సుబ్రహ్మణ్యన్ తన ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఇది.గతంలో ఇన్ఫోసిస్ మెంటార్ నారాయణ మూర్తి(Narayana Murthy) కూడా ఇదే మాదిరి మాట్లాడారు. కాకపోతే మరీ సుబ్రహ్మణ్యన్ లా కాదులెండి. "మన దేశంలో ఉత్పాదకత చాలా తక్కువ. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ.. పురోభివృద్ధి దిశగా దూసుకుపోవాలంటే మరింత కష్టించి పనిచేయాలి. ఇండియాలో అపారమైన నైపుణ్యాలున్నాయి. అవసరాలూ ఉన్నాయి. వారానికి 70 గంటలు పనిచేస్తే మనం లక్ష్యాల వైపు వెళ్లగలుగుతాం"ఇవీ అప్పట్లో ఆయన అన్న మాటలు.ఇద్దరి ఉద్దేశమూ ఒకటే..మూర్తి గారు రోజుకు 10 గంటలు పనిచేయమంటే..సుబ్రహ్మణ్యన్ గారు ఓ నాలుగాకులు ఎక్కువే చదివి.. రోజుకు 13 గంటల సూత్రం బయటకు తెచ్చారు.వీళ్ళిద్దరూ సింపుల్ గా చెబుతున్నది ఏమిటంటే.. అన్నీ వదిలేసుకొని గొడ్డు చాకిరీ చేయండి అని..వీళ్ళు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వ్యక్తులు. ఆయా కంపెనీలకు అధిపతులు.. 70, 90 ఏం ఖర్మ. 120 గంటలైనా పనిచేస్తారు..నేను ఇన్ని గంటలు పనిచేశా/చేస్తున్నా... మీరూ అలాగే చేయండి అని ఉద్యోగులను అనడమే వివాదాన్ని రాజేస్తోంది...ఉద్యోగులు అంటే జీతం తీసుకుని పనిచేసే శ్రామికులు. ఎన్నో వ్యక్తిగత బరువులు, బాధ్యతల మధ్య నలిగిపోతూ..నెట్టుకొచ్చే సగటు జీవులు.వాళ్ళను అనునిత్యం సమస్యలు పలకరిస్తూనే ఉంటాయి. ఓపక్క వాటితో పోరాడుతూనే.. మరోపక్క వృత్తి ఉద్యోగాల్లో అనుక్షణం టెన్షన్ తో సహజీవనం చేసే అభాగ్యులు. పేరుకు ఎనిమిది గంటల మాటే కానీ.. చాలా కంపెనీల్లో తీసుకునే జీతం కంటే చాకిరీ ఎక్కువ చేసే ఉదంతాలే ఎక్కువ. ఏసీ కార్లు, చుట్టూ పనివాళ్లు, పెద్ద బంగళాలు, మానవ సంబంధాలకు అతీతంగా విశాలమైన ఛాంబర్లలో కాలం గడుపుతూ ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసే సుబ్రహ్మణ్యన్లను ఒక్కసారి సగటు ఉద్యోగి ఇంట్లో ఓ నాలుగు రోజుల పాటు కూర్చోపెడితే తెలుస్తుంది... రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలో...?? సుబ్రహ్మణ్యన్ సార్ చేసిన ప్రతిపాదనకే వద్దాం...రోజుకు 24 గంటల చొప్పున... వారానికి 168 గంటలు.ఇందులో ఆయన చెప్పినట్లు 90 పని గంటలను తీసేద్దాం.ఇక మిగిలేవి 78 గంటలు. సగటు ఆరోగ్యవంతుడు రోజుకు 8 గంటలు నిద్రకు కేటాయించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. అంటే మిగిలేవి 22 గంటలు (78 - 7x8 = 56 గంటలు). పోనీ... 8 గంటలు కాకుండా 6 గంటలు చొప్పునే లెక్కేద్దాం. అప్పుడు మిగిలేవి 36 గంటలు (78 - 7x6 = 42 గంటలు)అంటే రోజుకు 5 గంటలు.సాధారణంగా కార్పొరేట్ ఉద్యోగులు ఉండేది నగరాలు, పట్టణాల్లోనే...ఇంటి నుంచి ఆఫీస్ కు వెళ్ళడానికి, ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి... నిత్యట్రాఫిక్ రద్దీ కి కనీసం మూడు గంటలు కేటాయించక తప్పదు.ఇక మిగిలేవి రెండు గంటలు. కాలకృత్యాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్లకు తక్కువలో తక్కువ గంటన్నర వేసుకుందాం...ఇక మిగిలేది అరగంట...ఇంటికి వచ్చాక కనీసం రిలాక్స్ అవ్వకూడదు...టీవీ చూడకూడదు.పిల్లల బాగోగులు పట్టించుకోనక్కర్లేదు..సరే.. ఇక భార్యను చూస్తూ కూర్చొద్దని సదరు సుబ్రహ్మణ్యన్ సారే చెప్పారు. సంసారంలో ఏం జరుగుతోందో... బంధువు ఎవడో.. ఫ్రెండ్ ఎవడో...పక్కన పెట్టేయాలి.కూరలు, కిరాణా మార్కెట్లకు వెళ్ళకూడదు. పండగలు, పబ్బాలు చేసుకోకూడదు...టూర్ల సంగతి పూర్తిగా మర్చిపోవాలి. అనారోగ్యంగా ఉన్నా సరే... టాబ్లెట్ వేసుకుని ఆఫీస్ కు వచ్చేయాలి. సెలవు తీసుకోకూడదు. విసుగు పుట్టినా.. చూడాలి అనిపించినా... సినిమా ఊసే ఎత్తకూడదు. టైం ఏదీ ??ఇలా చెప్పుకుంటూ పోతే... చాలానే ఉంటాయి...పెద్ద స్థాయిల్లో ఉన్న వ్యక్తులు... మహా మేధావులు, తెల్లారి లేస్తే కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిపే ఈ ప్రముఖులు.. కనీస మానవతా కోణాన్ని పక్కన పెట్టేసి ఇలా ఎలా మాట్లాడతారో అర్ధం కానీ ప్రశ్న.ఎక్కువ గంటలు పనిచేస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే పని మీద దృష్టి పెట్టగలుగుతాడు. జీవితానికి, పనికి మధ్య సమతౌల్యం పాటించాలి. అది ఎప్పుడైతే ఉండదో... మానసిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అటువంటి వ్యక్తి ఎక్కువ గంటలు పనిచేయడం మాట అటుంచి... పని వాతావరణాన్నే దెబ్బ తీస్తాడు.పైగా గంటల కొద్దీ పని చేసుకుంటూ పోతే... ఒకరకమైన జడత్వం ఆవరిస్తుంది. చేసే పని మీద ఆసక్తి పోతుంది.. అశ్రద్ధ పెరుగుతుంది. తప్పులు జరుగుతాయి. వేల కోట్ల ప్రాజెక్టులను హేండిల్ చేసే కంపెనీల్లో జరిగే తప్పులు ఆ కంపెనీ కొంప ముంచుతాయి. కొండకచో.. కంపెనీలు మూత పడే పరిస్థితి తీసుకొస్తాయి.కాబట్టి సుబ్రహ్మణ్యన్ సారూ...అతి సర్వత్రా వర్జయేత్... అన్న మాట ఊరికే రాలేదు. అది తినే తిండి అయినా.. చేసే పని అయినా...మీలాంటి దిగ్గజాలు మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడటం మంచిది అనుకుంటా... మీ సహచర పారిశ్రామికవేత్తే మీ ఆలోచనల్ని తప్పుబట్టారు... "గంటలు గంటలు పనిచేయనక్కర్లేదు.. చేసే పనిలో క్వాలిటీ ఉంటే.. 10 గంటలు పని చేసినా చాలు..."అంటూ మహీంద్రా & మహీంద్రా అధిపతి ఆనంద్ మహీంద్రా చెప్పిన మాటలు అక్షర సత్యం.ఇప్పటికే అందర్లోనూ అభాసు పాలయ్యారు. మహీంద్రా మాటలనైనా కాస్త చెవికెక్కుంచుకుని తప్పు దిద్దుకునే ప్రయత్నం చేస్తే మంచిదే.. లేదంటే.. మరింత చులకన అవుతారు... తస్మాత్ జాగ్రత్త.పొరపాటు దిద్దుకునే ప్రయత్నాల్లో భాగంగా ఎల్ & టీ ప్రతినిధి వివరణ ఇచ్చినప్పటికీ ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోవడం,స్టేట్మెంట్ ఇచ్చిన సుబ్రహ్మణ్యన్ సార్ ఇప్పటికీ నోరు మెదపకపోవడంతో ఈ వ్యాఖ్యలు వివాదం రేపుతూనే ఉన్నాయి)-బెహరా శ్రీనివాస రావువిశ్లేషకులు -
‘భార్యను తదేకంగాఎంతసేపు చూస్తారు? : అమూల్ స్పందన, ఈ కార్టూన్లు చూస్తే!
ఉద్యోగులు, పనిగంటలపై కార్పొరేట్ కంపెనీ ఎల్అండ్టీ (L&T) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని, ఇంట్లో కూర్చుని భార్యను ఎంత సేపు చూస్తారూ, ఆదివారం కూడా పని చేయండి అంటూ సుబ్రహ్మణ్యన్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో సుదీర్ఘ పని గంటలపై మరోసారి చర్చకు దారి తీసింది. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఇప్పటికే నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై పలువురు ఇండస్ట్రీ పెద్దలుకూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలోకి డైరీ బ్రాండ్ అమూల్ చేరింది.అమూల్ ఏమంది?ఎల్ అండ్ టి బాస్ "స్టేర్ ఎట్ వైఫ్" వ్యాఖ్యలపై అమూల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక డూడుల్ విడుదల చేసింది. ఇందులో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమూల్ "90 గంటల పని వారం గురించి వివాదం!" అనే శీర్షికతో పాటు ఒక డూడుల్‌ను షేర్ చేసింది! డూడుల్‌లోని టెక్స్ట్ బోల్డ్‌లో L & T లెటర్స్‌తో ((Labour & Toil) "శ్రమ అండ్ కఠోర శ్రమ?" అంటూ సుబ్రహ్మణ్యన్ను విమర్శించింది "మీరు మీ భార్యను ఎంతసేపు తదేకంగా చూడగలరు?" "అమూల్ రోజూ బ్రెడ్‌ను తదేకంగా చూస్తుంది," అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.#Amul Topical: Controversy about the 90 hour work week! pic.twitter.com/VQlwoLoTx8— Amul.coop (@Amul_Coop) January 14, 2025కాగా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు, అంశాలపై ప్రత్యేకమైన గ్రాఫిక్స్ ,పోస్టర్లను రూపొందించడంలో అమూల్ కంపెనీబాగా ప్రసిద్ధి చెందింది. క్రీడల నుండి వినోదం వరకు, అన్ని ముఖ్యమైన సందర్భాలు, ప్రధానంగా ప్రముఖులు చనిపోయినపుడు కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, 90 గంటల పనివారం గురించి కొనసాగుతున్న వివాదంపై కూడా స్పందించడం విశేషం. గతంలో వారానికి 70 గంటలు పని చేయాలనే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఎల్అండ్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఇంకో అడుగు ముందుకేసి, 90 గంటలు, "ఇంట్లో కూర్చొని మీరు ఏమి చేస్తారు? భార్యను ఎంత సేపు చూస్తారు,ఆఫీసుకు వెళ్లి పని ప్రారంభించండి." అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధిక జీతం , సౌకర్యాలు ఉన్న కార్పొరేట్ కంపెనీల సీఈవోలు, కింది స్థాయి, తక్కువ జీతం పొందే ఉద్యోగుల నుండి అదే స్థాయి నిబద్ధతను ఎందుకు ఆశిస్తారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. మరికొంతమంది కార్మిక శ్రమను దోచుకునే వీళ్లకి కార్మిక చట్టాలు, అమలు, కార్మిక సంక్షేమం గురించి మాట్లాడే మనసు ఉండదంటూ మండిపడ్డారు. అంతేకాదు ఈ వివాదంపై అనేక కార్డూన్లు, ఫన్నీ కామెంట్లు,వీడియోలు నెట్టింట సందడి చేశాయి కూడా. Dedicated to the L&T Chairman who wants a 90 hour work week pic.twitter.com/QtPtLjh2ej— Prashant Bhushan (@pbhushan1) January 13, 2025బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకొనే, ఆర్పీసీ గ్రూప్ చైర్పర్సన్ హర్ష్ గోయెంకా కూడా సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను ఖండించారు. అలాగే ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్రా 90 గంటల పనివారం చర్చపై స్పందిస్తూ.. తూకం వేసి, పరిమాణం కంటే పని నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. సుదీర్ఘ పని గంటల కంటే ఉత్పాదకత ,సామర్థ్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.బండ చాకిరీ : మన దేశంమరోవైపు అంతర్జాతీయ కార్మిక సంస్థ( ILO) నివేదిక ప్రకారం, భారతదేశం ఇప్పటికే ప్రపంచ ఓవర్ వర్క్ రంగంలో ముందు వరుసలో ఉంది. అదనపు పని విషయంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం 13వ స్థానంలో ఉందని వెల్లడించింది. సగటున భారతీయ ఉద్యోగులు ప్రతి వారం 46.7 గంటలు పనిచేస్తారని, భారతదేశంలోని 51శాతం మంది శ్రామిక శక్తి ప్రతి వారం 49 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేస్తుందని, అత్యధికంగా సుదీర్ఘమైన పని గంటలు ఉన్న దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని కూడా సంస్థ పేర్కొన గమనార్హం. -
'90 గంటల పని'పై ఎల్&టీ హెచ్ఆర్ టీం స్పందన
ఉద్యోగులు వారంలో 90 గంటలు పనిచేయాలని, ఆదివారాలు కూడా విధులకు హాజరుకావాలంటూ ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. సోషల్ మీడియాలో దీని మీద మామూలు చర్చ జరగడం లేదు. అయితే.. తమ చైర్మన్ చేసిన వ్యాఖ్యలపై ఎల్ అండ్ టీం హెచ్ఆర్ టీం స్పందించింది. ఆయన వ్యాఖ్యలపై వివరణతో హెచ్ఆర్ హెడ్ సోనికా మురళీధరన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఉంచారు.90 పని గంటల విషయంలో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్(SN Subrahmanyan) వ్యాఖ్యలు జనాల్లోకి చాలా పొరపాటు వెళ్లాయంటూ లారెన్స్ & టూబ్రో(L & T) హెచ్ఆర్ హెడ్ సోనికా అంటున్నారు. ‘మా ఎండీ వ్యాఖ్యలు పొరపాటుగా జనంలోకి వెళ్లాయి. ఆయన చాలా సాధారణంగానే ఆ మాటలు అన్నారు. కానీ, అవి అనవసర విమర్శలు దారితీయడం నిజంగా బాధాకరం. వారానికి 90 గంటలు పని తప్పనిసరనిగానీ.. దానిని అమలు చేయాలనిగానీ ఆయనేం అనలేదు. .. ఆయన ప్రతీ ఉద్యోగిని తన కుటుంబ సభ్యుడిగానే భావిస్తారు. అలాగే తన టీం బాగోగుల గురించి కూడా ఆలోచిస్తారు. ఇప్పుడున్న కార్పొరేట్ ప్రపంచంలో ఇది అంత్యంత అరుదైన విషయం’’ అని ఆమె అన్నారు. అలాగే.. ఆయన నాయకత్వాన్ని ఆమె ఆకాశానికెత్తారు. కాబట్టి.. ఆయన మాటల్ని అర్థం చేసుకుని, విమర్శలకు పుల్‌స్టాప్ పెట్టాలని ఆమె కోరారు.అంతటితో ఆగలేదు..ఉద్యోగులు వారానికి 90 గంటలు(90 Hours Work) పనిచేయాలని ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. అయితే ఆయన పనిగంటల వరకు మాట్లాడినా ఈ వివాదం అంతగా ముదిరేది కాదేమో. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇంట్లో కూర్చొని ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు? ఇంట్లో తక్కువ, ఆఫీసులో ఎక్కువగా ఉంటామని భార్యలకు చెప్పాలి. అవసరమైతే ఆదివారాలు కూడా పనిచేయాలి’’ అని అన్నారు. దీంతో రచ్చ మొదలైంది.ఉన్నతహోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం చూసి ఆశ్చర్యానికి గురయ్యానంటూ బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణె అసహనం వ్యక్తం చేశారు. వారానికి 90 గంటలు పనిచేయాలనే ఆలోచన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సైతం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. అలాగైతే సండే పేరును ‘సన్ డ్యూటీ’గా మార్చాలని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. బానిసలాగా కష్టపడటాన్ని కాకుండా తెలివిగా పనిచేయడాన్ని తాను నమ్ముతానని తెలిపారు. పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా అవసరమన్నారు. మరోవైపు.. పలువురు ప్రముఖులు సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలతో ఏకీభవించడం కొసమెరుపు.చర్చ సరైన దిశగా వెళ్లడం లేదు. పని పరిమాణంపైనే కదా ఇదంతా. నా దృష్టిలో అయితే 40 గంటలా.. 70 గంటలా లేదంటే 90 గంటలా అని కాదు. ఎంత నాణ్యమైన పనిని అందించామా అన్నదే ముఖ్యం. 10 గంటల్లో కూడా ప్రపంచాన్ని మార్చవచ్చు. అందుకే పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎంతసేపు పని చేశామన్నది ముఖ్యం కాదు:::మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా -
నా భార్యను చూడటం నాకు చాలా ఇష్టం
న్యూఢిల్లీ: ‘నా భార్య అద్భుతమైనది. ఆమెను తదేకంగా చూడటం నాకు ఇష్టం’ అని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. వారానికి 90 గంటలు పని చేయాలంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యంలో మహీంద్రా తాజాగా చేసిన కామెంట్ ఆసక్తి రేపుతోంది. పని గంటల పరిమాణాన్ని నొక్కి చెప్పడం తప్పు అని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడారు. ‘మనం పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎంత సమయం పని చేశామన్నది కాదు. కాబట్టి 40 గంటలా, 70 గంటలా, 90 గంటలా కాదు. మీరు ఏ అవుట్‌పుట్ చేస్తున్నారు అన్నది ముఖ్యం. 10 గంటలు అయినా మీరు ప్రపంచాన్ని మార్చవచ్చు’ అని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో సమయం గడిపినంత మాత్రాన తాను ఒంటరిగా ఉన్నట్టు కాదని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఎక్స్ వేదికగా 1.1 కోట్ల మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్టు వివరించారు. -
అస్తమానం భార్యల ముఖాలు చూస్తారా ?.. 90 గంటలు పనిచేయాలంట!
-
అన్నేసి గంటలు పనిచేస్తే జరిగేది ఇదే!
భారత్‌లో పనిగంటల అంశం మరోసారి చర్చ తెర మీదకు వచ్చింది. ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఉద్యోగులు వారం మొత్తం మీద ఏకంగా 90 గంటలు పని చేయాల్సిందేనంటూ వ్యాఖ్యానించడం ఇందుకు కారణం. మొన్నీమధ్యే ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి 70 గంటలు పని చేయాలంటూ పిలుపు ఇవ్వడం తెలిసిందే. అయితే సుబ్రహ్మణ్యం ‘అంతకుమించి’ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు సెలబ్రిటీలు సైతం మండిపడుతున్నారు. ఈ దరిమిలా వీళ్లిద్దరి గురించి నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. అయితే.. ఇంతకీ 70.. 90.. మనిషి శరీరం ఒక వారంలో అసలు ఎన్నేసి పనిగంటలను చేయగలదు?. ఏ మేర పని ఒత్తిడిని ఒక ఉద్యోగి భరించగలరు?. అలా గనుక పని చేస్తే.. శరీరంలో కలిగే మార్పులేంటి?. ఈ విషయంలో అసలు వైద్యులు ఏం చెబుతున్నారు?.. బిజినెస్ టైకూన్లు చెబుతున్న అంతటి పని భారం ఉద్యోగి మోయ తరమేనా?.. వారంలో 90 గంటలపని.. అంటే ఏడు రోజులపాటు 13 గంటల చొప్పున పని చేయాలన్నమాట. మిగిలిన 11 గంటల్లోనే నిద్ర, ఇతర పనులు, ప్రయాణాలు, ఆఖరికి కుటుంబ సభ్యులతో గడపడం లాంటి వాటితో సర్దుకుపోవాలన్నమాట. అయితే ఇది శారీరకంగానేకాదు.. మానసికంగానూ మనిషిపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయం ప్రకారం.. వారంలో 55 గంటలకు మించి గనుక పని చేస్తే గుండె జబ్బుల బారినపడే అవకాశం ఉంటుందట. అలా పనిచేసే ఉద్యోగుల్లో వందలో 35 మంది స్ట్రోక్ బారినపడే అవకాశం ఉంది. వందలో 17 మంది ప్రాణమే పొగొట్టుకునే అవకాశం ఉంది అని ఆ స్టడీ వెల్లడించింది. ‘‘ఎక్కువసేపు పని చేయడమంటే గుండె మీద ఒత్తిడి పెంచడమే. దీనివల్ల కోర్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. తద్వారా బీపీ, గుండె కొట్టుకునే వేగంలో మార్పులొస్తాయి. అలా హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్‌తో పాటు హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వారానికి 40 గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు గట్టిపడడమో లేదంటే కుంచిచుపోతాయి’’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: భారత్ బాగుండాలంటే.. ఉద్యోగుల పని గంటలు తగ్గాల్సిందే!.. ఇక ఎక్కువ గంటలు పని చేయడం డయాబెటిస్‌కు దారి తీసే అవకాశం లేకపోలేదు. ఇది రక్తంలో షుగర్ స్థాయిపై అనేక రకాలుగా ప్రభావం చూపెడుతుంది. మహిళలు 45 గంటలకంటే ఎక్కువసేపు పని చేసినా.. పురుషులు 53 గంటలకు మించి పని చేసినా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాలు తెలిపాయి కూడా. ఇక చాలాసేపు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయి పెరుగుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి కూడా. ఇది ఒబెసిటీ(స్థూలకాయం)కి దారి తీయొచ్చు. అన్నింటికి మించి.. విపరీతమైన పనిభారం మానసిక ఆరోగ్యాన్ని కుంగదీస్తుంది. ఇది బంధాలకు బీటలు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే.. విశ్రాంతి లేకుండా శరీరానికి పని చెప్పడం ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. జీరో రెస్ట్ వర్క్.. నిద్రాహారాలను నిర్లక్ష్యం చేయిస్తుంది. పని ఒత్తిడి వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతిమంగా.. అనారోగ్యకరమైన జీవనశైలి వైపునకు అడుగులు వేయిస్తుందని అంటున్నారు. భారతీయుల్లో ఇప్పటికే గుండె జబ్బులు, డయాబెటిస్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో అధిక పని గంటల నిర్ణయాలతో పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంటుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: వారానికి మొత్తం 40 గంటలే పని ఉండాలి!ఇన్ఫోసిస్ మూర్తి(78) ఏమన్నారంటే..ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువ. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలి. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలి.తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శల నేపథ్యంలో మరోసారి ఆయన స్పందిస్తూ..ఇన్ఫోసిస్(Infosys)ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?.ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం(64) ఏమన్నారంటే..ఆదివారాలు మీతో పనిచేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మీతో అలా పనిచేయించగలిగితే.. నాకు సంతోషం. ఎందుకంటే నేను ఆదివారాలు పనిచేస్తున్నాను. అయినా ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి. వారానికి 90 గంటలు పని చేయాలి. అందుకోసం ఆదివారం సెలవులనూ వదిలేయాలి. ఇదీ చదవండి: 104 రోజులు ఏకధాటిగా పని.. అనారోగ్యంతో వ్యక్తి మృతి -
భార్యను.. భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు?
పని గంటల గురించి ప్రముఖ కార్పొరేట్ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్(SN Subramanyan) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల బంధాన్ని తక్కువ చేసేలా ఆయన మాట్లాడిన మాటలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎన్ సుబ్రమణ్యన్ కామెంట్లపై భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల(Jwala Gutta) ఘాటుగా స్పందించారు. ఉన్నత విద్యావంతులు కూడా మహిళల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ చురకలు అంటించారు.కాగా.. ‘భార్యను భర్త.. భర్తను భార్య ఎంత సేపు చూడగలరు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి.. ఆదివారాలు కూడా ఆఫీసుకు రావాలి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ సుబ్రమణ్యన్ చేసిన కామెంట్లపై మెజారిటీ మంది నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పెట్టుబడిదారులు వేల కోట్లు ఆర్జిస్తూ.. తరతరాలకు సంపాదించిపెట్టడానికి సామాన్యుల శ్రమను దోచుకోవడం కోసం అభివృద్ధి అనే సాకును వాడుకోవడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భార్యను.. భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు?ఈ నేపథ్యంలో గుత్తా జ్వాల సైతం సుబ్రమణ్యన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్వీట్ చేశారు. ‘‘అసలు నాకొకటి అర్థం కాని విషయం ఏమిటంటే.. భర్త భార్య వైపు తదేకంగా చూస్తూ ఎందుకు ఉండిపోకూడదు? అది కూడా ఆదివారం మాత్రమే ఇలాంటివి ఉంటాయా!!బాగా చదువుకున్న వాళ్లు.. ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాళ్ల నుంచి కూడా ఇలాంటి మాటలు వినాల్సి రావడం విచారకరం. ఇలాంటివి ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కావు. మానసిక ఆరోగ్యం, విశ్రాంతి గురించి పట్టించుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నమ్మలేకపోతున్నా.నిరాశ, భయంఅంతేకాదు స్త్రీల పట్ల వారికున్న చిన్నచూపును ఇంత బహిరంగంగా చెప్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. నిరాశగానూ.. భయంగానూ ఉంది’’ అని గుత్తా జ్వాల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదే విధంగా.. ఆదివారాలు కూడా పనిచేయడం అందరికీ ఇష్టం ఉండదని.. మానసిక ప్రశాంతత ఉండాలంటే తగిన విశ్రాంతి అవసరమని నొక్కివక్కాణించారు.ఏదేమైనా బహిరంగ వేదికపైన సుబ్రమణ్యన్ లాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ విమర్శించారు.డబుల్స్ విభాగానికి వన్నె తెచ్చిన ప్లేయర్గాకాగా మహారాష్ట్రలో జన్మించిన గుత్తా జ్వాల హైదరాబాద్‌లో సెటిలయ్యారు. బాల్యం నుంచే బ్యాడ్మింటన్‌పై మక్కువ పెంచుకున్న ఆమె.. పద్నాలుగుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచారు. అశ్విని పొన్నప్పతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు అందుకున్నారు. మహిళల డబుల్స్ విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి జోడీగా జ్వాల- అశ్విని ద్వయం నిలిచింది.ఇక 2011లో లండన్‌లో జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్స్‌లో కాంస్యం గెలిచిన గుత్తా జ్వాల.. 2010 కామన్వెల్త్ గేమ్స్ వుమెన్ డబుల్స్ విభాగంలో స్వర్ణం, 2014 గేమ్స్‌లో రజతం గెలిచారు. అదే విధంగా.. 2014లో ప్రతిష్టాత్మక ధామస్- ఉబెర్ కప్ ఈవెంట్లో కాంస్యం కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా మిక్స్డ్ డబుల్స్ విభాగంలో 2009 బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్లో డిజు(లండన్)తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించి చరిత్ర సృష్టించారు.కాగా భారత బ్యాడ్మింటన్ రంగంలో డబుల్స్ విభాగానికి వన్నె తెచ్చిన ప్లేయర్‌గా గుత్తా జ్వాల పేరొందారు. తన సేవలకు గానూ అర్జున అవార్డు పొందారు. కేవలం క్రీడా రంగంలోనే కాకుండా.. విద్య, వైద్య, మహిళా సాధికారికత, లింగ సమానత్వంపై కూడా గుత్తా జ్వాల తన గొంతును బలంగా వినిపిస్తున్నారు.నటుడితో రెండో వివాహంసహచర బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో పెళ్లి చేసుకున్నారు గుత్తా జ్వాల. అయితే, ఆరేళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరం తమిళనటుడు, డివోర్సీ విష్ణు విశాల్(Vishnu Vishal)తో ప్రేమలో పడ్డ జ్వాల.. 2021లో అతడితో వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. చదవండి: ఎట్టకేలకు మౌనం వీడిన చహల్.. అవన్నీ నిజం కాకపోవచ్చు! -
భార్యలవైపు ఎంతసేపు చూస్తారు... ఆదివారాలు కూడా ఆఫీసుకు రండి!
‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? భార్యను ఎంత సేపు చూడగలరు? భర్తలను భార్యలు ఎంత సేపు చూడగలరు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ‘ఆదివారాలు కూడా ఆఫీసుకురండి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో కాదు దేశంలోనే ప్రముఖ కార్పొరేట్ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్. ఆ మధ్య వారానికి 70గంటలు పనిచేయాలని మాట్లాడి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురయ్యారు. ఇప్పుడు ఆ వంతు సుబ్రమణ్యన్ది. మూర్తి మీద జోకులు మీమ్‌లు ఆగకముందే ఎల్–టీ చైర్మన్ ఆయనకు తోడయ్యారు. ఉద్యోగులకు వ్యక్తిగత జీవితం ఉండదా, ఉండకూడదా అంటూ నెటిజనులు దాడి మొదలెట్టారు. ఇతర కార్పొరేట్ సీఈఓలు కూడా సుబ్రమణ్యన్ మాటల్ని కొట్టిపారేశారు. ఉద్యోగులపై ఒత్తిడి పెరిగి సమర్ధత సన్నగిల్లుతున్న ఈరోజుల్లో వారికి స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పాల్సింది పోయి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదన్నారు. సోషల్ మీడియాలో దాడిని నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతని గమనించిన ఎల్–టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇది భారతదేశపు దశాబ్దమని చైర్మన్ సుబ్రమణ్యన్ విశ్వసిస్తున్నారు..అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి అవసరం. కలసికట్టుగా అంకితభావంతో కృషి చేస్తే వృద్ధిని కొనసాగించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే విజన్‌ను సాకారం చేసుకోగలుగుతాం. కంపెనీ చైర్మన్ వ్యాఖ్యలు ఇదే లక్ష్యాన్ని ప్రతిఫలిస్తున్నాయని ఎల్–టీ ప్రకటన జారీ చేసింది. జాతి నిర్మాణమే ఎల్అండ్టీ ప్రధాన లక్ష్యం. ఎనిమిది దశాబ్దాలుగా దేశ మౌలికసదుపాయాలు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను బలపరుస్తున్నాం. ఉద్ధేశాలు, లక్ష్యాలు సాధనకు కట్టుబడి ముందుకు సాగుతామని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరు -
బ్యాంకులకు కొత్త టైమింగ్స్.. జనవరి 1 నుంచే..
వివిధ పనుల నిమిత్తం నిత్యం బ్యాంకులకు (Banks) వెళ్తుంటారా..? అయితే ఈ వార్త మీకోసమే. బ్యాంక్ తెరిచే వేళలు, మూసే సమయం ఒక్కో బ్యాంకుకు ఒక్కో రకంగా ఉంటున్నాయి. దీంతో ప్రజలు చాలాసార్లు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలను మెరుగుపరచడానికి మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జాతీయ బ్యాంకుల పని వేళలు (Bank Timings) ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంది.ఈ మార్పులు 2025 జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు ఉదయం 10 గంటలకు తెరిచి సాయంత్రం 4 గంటలకు మూసివేస్తారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. బ్యాంకింగ్ సేవలను క్రమబద్ధీకరించడంలో ఈ చర్య సహాయపడుతుందని కమిటీ అభిప్రాయపడింది.మార్పు ఎందుకంటే..వివిధ బ్యాంకులకు వేర్వేరు సమయాల కారణంగా ఖాతాదారులు గందరగోళానికి గురవుతున్నారు. చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని బ్యాంకులు ఉదయం 10 గంటలకు తెరుచుకోగా, మరి కొన్ని బ్యాంకులు 10:30 లేదా 11 గంటలకు తెరుచుకుంటున్నాయి. ఈ వ్యత్యాసం కారణంగా ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు వెళ్లాల్సిన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కస్టమర్లు ఇప్పుడు వివిధ బ్యాంక్ షెడ్యూల్ల ప్రకారం ప్రణాళిక లేకుండా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఏ బ్యాంకుకు అయినా వెళ్లవచ్చు. ఏకరీతి పని వేళలు ఉండటం వల్ల గందరగోళం తగ్గుతుంది. వినియోగదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు.అన్ని బ్యాంకులు ఒకే సమయంలో పని చేయడం వల్ల ఇంటర్-బ్యాంక్ లావాదేవీలు, కస్టమర్ రిఫరల్స్ వంటి సేవల్లో మెరుగైన సమన్వయం ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులకు కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆఫీసు షిఫ్ట్‌ల మెరుగైన ప్రణాళికలో సహాయపడుతుంది. మధ్యప్రదేశ్ తీసుకున్న ఈ చర్యను దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా అనుసరించవచ్చు. -
పని గంటలపై నారాయణమూర్తికి కౌంటర్
న్యూఢిల్లీ:ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తికి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్‌లో పనిదినాలు ఆరు రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గిపోతుండడంపై మూర్తి ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కార్తీ చిదంబరం ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ఎన్ని గంటలు ఎక్కువ పనిచేశామన్నది ముఖ్యం కాదని, ఎంత ప్రభావవంతంగా పనిచేశామన్నది ముఖ్యమన్నారు.‘ఎక్కువ సేపు పనిచేయడమనేది అర్థం లేనిది. ఎంత ఫోకస్‌తో పనిచేశామనేది మఖ్యం. జీవితంలో రోజువారి సమస్యలతో పోరాడే మనుషులకు వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ అనేది తప్పనిసరి. నిజానికి భారత్‌లో పనిదినాలను వారానికి నాలుగు రోజులకు తగ్గించాలి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తే చాలు’అని కార్తీ చిదంబరం తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌గొగోయ్ కూడా నారాయణమూర్తి ఎక్కువ పనిగంటల విధానంతో విభేదించడం గమనార్హం. Working longer is meaningless, focus should be on efficiency. Daily life is as it is a struggle, battling inefficient & substandard infrastructure & amenities. Work life balance is most important for good social order & harmony. We should infact move to a 4 day working week. 12… https://t.co/EOOer6AgnK— Karti P Chidambaram (@KartiPC) December 22, 2024 ఇదీ చదవండి: హైదరాబాద్‌పై ఇన్ఫోసిస్ మూర్తి కీలక వ్యాఖ్యలు -
పేదరికం నుంచి బయటపడాలంటే
-
పేదరికం నుంచి భారత్ బయటపడాలంటే..: నారాయణమూర్తి
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి.. పని గంటలపై తన వాదనను మరోసారి సమర్థించుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాల్సిందేనని కుండ బద్ధలు కొడుతూ.. లేకుంటే పేదరికం నుంచి ఎలా బయటపడగలమని? ప్రశ్నించారాయన. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో నారాయణమూర్తి పాల్గొని మాట్లాడుతూ..‘‘ఇన్ఫోసిస్‌ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి... వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?. భవిష్యత్తు కోసం మనమంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలి’’ అని నారాయణమూర్తి పిలుపు ఇచ్చారు.ఆ మధ్య ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ది రికార్డ్’ అనే పాడ్‌కాస్ట్ తొలి ఎపిసోడ్లో నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలు, టెకీలు స్పందిస్తూ భిన్నాభిప్రాయాలు వ్యక్తపర్చారు. పలు దేశాల్లో పని గంటలపై చర్చ ఆ సమయంలో జరిగింది. అంతేకాదు.. ఇటీవల జపాన్‌లో వారానికి నాలుగు రోజుల పని దినాల అంశాన్ని ప్రస్తావిస్తూ.. నారాయణమూర్తిని నెట్టింట ట్రోల్ చేశారు కూడా.నారాయణమూర్తి ఏమన్నారంటే..‘ది రికార్డ్’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువని అన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా.. మరికొందరు మాత్రం నారాయణ మూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు. ఇదీ చదవండి: భారత్ బాగుండాలంటే.. పని గంటలు తగ్గాల్సిందే! -
భారత్ బాగుండాలంటే.. పని గంటలు తగ్గాల్సిందే!
ఆరోగ్యం ఏమాత్రం చెడిపోకుండా.. అసలు ఎన్ని గంటలు పని చేస్తే సరిపోతుంది?. 7 గంటలా?, 8 గంటలా?, పోనీ 10 గంటలా?.. ఏదో ఒక సందర్భంలో తమను తాము ఉద్యోగులు వేసుకునే ప్రశ్నే ఇది. అయితే అది పనిని, పని ప్రదేశాన్ని బట్టి మారొచ్చనేది నిపుణులు చెప్పే మాట. అలాంటప్పుడు మార్గదర్శకాలు, లేబర్ చట్టాలు ఎందుకు? అనే ప్రశ్న తలెత్తడం సహజమే కదా!.ఆమధ్య కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ అనే యువ చార్టెడ్ అకౌంటెంట్.. పుణేలో ఓ ఎమ్మెన్సీలో చేరిన నాలుగు నెలలకే అనారోగ్యం పాలై చనిపోయింది. పని ఒత్తిడి వల్లే తన కూతురి ప్రాణం పోయిందంటూ సదరు కంపెనీకి, కేంద్రానికి బాధితురాలి తల్లి ఓ లేఖ రాసింది. యూపీలో ఫైనాన్స్ కంపెనీలో పని చేసే తరుణ్ సక్సేనా.. 45 రోజులపాటు విశ్రాంతి తీసుకోకుండా పని చేసి మానసికంగా అలసిపోయాడు. చివరకు టార్గెట్ ఒత్తిళ్లను భరించలేక.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. చైనాలో, మరో దేశంలోనూ ఇలా పని వల్ల ప్రాణాలు కోల్పోయిన కేసులు చూశాం. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు తీవ్రస్థాయిలో పని గంటల గురించి.. పని వాతావరణం గురించి తీవ్ర చర్చ జరుగుతుంది. అసలు ఇలా.. ఉద్యోగులు ఇన్నేసి గంటలు బలవంతంగా పని చేయడం తప్పనిసరేనా? చట్టాలు ఏం చెబుతున్నాయంటే..భారత్‌లో పనిగంటలను నిర్దారించేవి యాజమానులు/ సంస్థలు/కంపెనీలే. కానీ, ఆ గంటల్ని నియంత్రించేందుకు చట్టాలు మాత్రం అమల్లోనే ఉన్నాయి. అవే.. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, షాప్స్ అండ్ ఎస్టాబిష్మెంట్స్ యాక్ట్స్ ఉన్నాయి.ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం..రోజూ వారీ పని గంటలు: గరిష్టంగా 9 గంటలువారంలో పని గంటలు: గరిష్టంగా 48 గంటలురెస్ట్ బ్రేక్స్: ప్రతీ ఐదు గంటలకు ఆరగంట విరామం కచ్చితంగా తీసుకోవాలిఓవర్ టైం: నిర్ణీత టైం కన్నా ఎక్కువ పని చేస్తే చేసే చెల్లింపు.. ఇది ఆయా కంపెనీల, సంస్థలపై ఆధారపడి ఉంటుందిషాప్స్ అండ్ ఎస్టాబిష్మెంట్స్ యాక్ట్లురోజువారీ పని గంటలు: 8-10 గంటలువారంలో పని గంటలు: 48 గంటలకు పరిమితం.. ఓటీని కలిపి 50-60 గంటలురెస్ట్ బ్రేక్స్: ఫ్యాక్టరీస్ యాక్ట్ తరహాలోనే తప్పనిసరి విరామంకొత్త లేబర్ చట్టాల ప్రకారం..(అమల్లోకి రావాల్సి ఉంది)రోజువారీ పని గంటలు: 12 గంటలకు పరిమితంవారంలో పని గంటలు: 48 గంటలకు పరిమితంఓవర్ టైం: అన్నిరకాల పరిశ్రమల్లో.. త్రైమాసికానికి 125 గంటలకు పెరిగిన పరిమితి‘దేశంలోని ఉద్యోగులకు పని వేళలను కుదించండి.. ఆ నిబంధనలను కఠినంగా అమలయ్యేలా చూడండి’ తాజా పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభ వేదికగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేంద్రానికి చేసిన విజ్ఞప్తి ఇది. ‘‘ఇది అత్యవసరమైన అంశం. గంటల తరబడి పనితో.. ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఒకవైపు ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌లాంటి సమస్యల బారిన పడుతున్నారు. పని గంటలను పరిమితం చేసే చట్టాలకు ప్రాధాన్యమిస్తూనే.. కఠినంగా వాటిని అమలయ్యేలా చూడాలి’’ అని కార్మిక శాఖ మంత్రి మాన్షుక్ మాండవియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ఉద్యోగుల పని గంటలకు సాధారణ మార్గదర్శకాలుఫుల్ టైం వర్క్.. ఎనిమిది గంటలకు మించకుండా వారంలో ఐదు దినాలు.. మొత్తం 40 గంటలు. ఓవర్ టైం.. 40 పని గంటలకు మించి శ్రమిస్తే.. రకరకాల సమస్యలు రావొచ్చు. అందుకే ఓటీ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. పని మధ్యలో.. ఎక్కువ సేపు తదేకంగా పని చేయడం అంత మంచిది కాదు. మధ్యమధ్యలో కాసేపు విరామం తీసుకోవడం కంపల్సరీ. ఆయా దేశాల జనాభా, ఆర్థిక పరిస్థితులు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని వివిధ దేశాల వారపు పని గంటల జాబితాను పరిశీలిస్తే.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలుగా కంబోడియా, మయన్మార్, మెక్సికో, మలేషియా, బంగ్లాదేశ్ లిస్ట్‌లో ప్రముఖంగా ఉన్నాయి. అత్యల్పంగా పని గంటల దేశాలుగా దక్షిణ ఫసిఫిక్ దేశం వనౌతు, కిరిబాటి, మొజాంబిక్, రువాండా, సిరియా ఉన్నాయి.ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోనే ఎక్కువ పని గంటలు ఉన్న దేశంగా జాబితాలో భారత్ కూడా ఉంది. అందుకు కారణం.. దేశ శ్రామిక శక్తిలో 51 శాతం ఉద్యోగులకు వారానికి 49 పని గంటల విధానం అమలు అవుతోంది కాబట్టి. అలాగే ఆ మధ్య వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం.. 78 శాతం భారతీయ ఉద్యోగులు పని గంటలతో శారీరకంగా, మానసికంగా అలసటకు గురవుతున్నారు.వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోసం, పని ప్రాంతాల్లో పరిస్థితులు మానవీయ కోణంలో కొనసాగాలన్నా.. తక్షణ చర్యలు అవసరం అని థూరూర్ లాంటి వాళ్లు చెబుతున్నారు. అందుకు అన్నా సెబాస్టియన్ అకాలమరణా ఉదంతాన్నే ఉదాహరణగా చెబుతున్నారు. చిన్నవయసులో.. అదీ కొత్తగా ఉద్యోగంలో చేరి మానసికంగా వేదనకు గురైంది ఆమె. అలా.. ఆరోగ్యం చెడగొట్టుకుని ఆస్పత్రిపాలై.. ప్రాణం పొగొట్టుకుంది. దేశ ఎదుగుదలకు శ్రమించే ఇలాంటి యువ నిపుణల బాగోగుల కోసం ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, ఇలాంటి వరుస విషాదాలు.. వ్యవస్థాగత వైఫల్యాలను ప్రతిబింబిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి హద్దులు చెరిపేసి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచనలు చేస్తాయా?. -
తగ్గేదేలే.. మరోసారి పని గంటలపై మూర్తి వ్యాఖ్యలు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి గతంలో పని గంటలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. వాటిని వెనక్కి తీసుకోబోనని స్పష్టం చేశారు. అందరూ కష్టపడి పని చేయాలని సూచించారు. సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.ప్రతి ఒక్కరూ వారంలో దాదాపు 70 గంటలపాటు పని చేయాలని నారాయణ మూర్తి గతంలో కామెంట్ చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా చర్చ జరిగింది. తన అభిప్రాయాన్ని మార్చుకున్నారా అని తాజాగా అడిగిన ప్రశ్నలకు మూర్తి స్పందించారు. ‘నన్ను క్షమించండి. నేను నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు. నా తుదిశ్యాస వరకు ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను. దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ వారంలో 100 గంటలపాటు పని చేస్తున్నారు. మనం కూడా కష్టపడి చేయడమే తనకు ఇచ్చే ప్రశంస. ఇది దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. పని చేయకుండా విశ్రాంతి తీసుకోవడంతో ఫలితం ఉండదు. వారంలో ఆరు రోజుల పని దినాలను ఐదు రోజులకు మార్చినప్పుడు తీవ్ర నిరాశ చెందాను. నా జీవితంలో చాలాకాలంపాటు రోజులో 14 గంటలు, వారంలో ఆరున్నర రోజులు పనిచేశాను. ఉదయం 6:30 గంటలకు కార్యాలయానికి చేరుకుని రాత్రి 8:40 గంటల వరకు పని చేసేవాడిని. కష్టపడి పనిచేసేతత్వం భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయింది’ అని అన్నారు.ఇదీ చదవండి: నెలలో 5.9 శాతం తగ్గిన ఇళ్ల ధరలు!ప్రపంచంలోనే అధికారికంగా వారంలో అధిక పని గంటలున్న దేశాలుయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: 52.6 గంటలు(సరాసరి)గాంబియా: 50.8 గంటలుభూటాన్: 50.7 గంటలులెసోతో: 49.8 గంటలుకాంగో: 48.6 గంటలుఖతార్: 48 గంటలుఇండియా: 47.7 గంటలుమౌరిటానియా: 47.5 గంటలులైబీరియా: 47.2 గంటలుబంగ్లాదేశ్: 46.9 గంటలు -
ఇంట్లో రెస్ట్ లేదు... ఆ‘పీస్’ లేదు
పూర్వం పురుషుడి సంపాదనకు స్త్రీ సంపాదన తోడైతే ‘ఏదో వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడు’ అనేవారు. రాను రాను స్త్రీ సంపాదన ప్రధానం అయ్యింది. స్త్రీలు ఇంటి పని, ఉద్యోగం చేయాల్సి వస్తోంది. కాని పని గంటలు వారి జీవితాలను కబళిస్తున్నాయా? ప్రయివేటు ఉద్యోగాలు పది గంటలు డిమాండ్ చేస్తుంటే సేల్స్ విమెన్ గానో, చిన్న ఉద్యోగాల్లోనో ఉండే మహిళలు ఏకంగా 12 గంటలు చేయాల్సి వస్తోంది. కుటుంబ, సాంఘిక, సామాజిక జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ పని గంటలపైకార్మిక చట్టాలు ఏమీ చేయడం లేదు. స్త్రీలు ప్రాణాలు ΄ోయేంతగా వొత్తిడి అనుభవించాలా?ఇటీవల పూణెలో అన్నా సెబాస్టియన్ అనే యువ చార్టర్డ్ అకౌంటెంట్ తను పని చేసే సంస్థలో ఒత్తిడి తట్టుకోలేక మరణించింది. మంగళవారం (సెప్టెంబర్ 24) లక్నోలోని ఒక ప్రయివేట్ బ్యాంకులో పని చేస్తున్న ఫాతిమా అనే ఉద్యోగిని కుర్చీలోనే కుప్పకూలి మరణించింది. పని ఒత్తిడి వల్లే అని సహోద్యోగుల ఆరోపణ. ఇవి తెలిసి. తెలియనివి ఇంకెన్నో.స్త్రీలకు రెండు ఉద్యోగాలుఉదయం ఎనిమిదన్నర నుంచి రాత్రి ఎనిమిదన్నర వరకూ పని చేస్తే తప్ప జీతం రాని ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు మన దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. సేల్స్‌గర్ల్స్, హాస్పిటల్ స్టాఫ్, హోటల్ రంగం, కాల్ సెంటర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫ్యాక్టరీ వర్కర్లు... 12 గంటలు చేయలేం అంటే 10 గంటలు అడుగుతున్నారు. అదీ కాదంటే 9 గంటలకు ఒక్క నిమిషం కూడా తక్కువ కాకుండా పని చేయాలన్నది వాస్తవం. ఈ 9 గంటలతో పాటు రాక΄ోకల సమయం కూడా కలుపుకుంటే స్త్రీలకు ఇంటి పనికీ, పిల్లల పెంపకానికి, విశ్రాంతికీ మిగిలే సమయం ఎంత?జీవితం గడవడానికి సంపాదన చాలా ముఖ్యమయ్యాక, ఆ సంపాదనలో ప్రధాన భాగం పిల్లల చదువుకు, వైద్యానికి, రవాణాకు ఖర్చు చేయకతప్పని పరిస్థితుల్లో భార్యాభర్తలు పని చేయక తప్పడం లేదు. మగాడిగా భర్తకు ఉద్యోగ వొత్తిడి తప్పదు. కాని స్త్రీలకు ఇంటి బాధ్యత కూడా ఉంటుంది. వంట వారే చేయాలి. ఇక పిల్లల పనులు, బట్టలు ఉతకడం, ఇంటి శుభ్రత, ఆతిథ్యం, అత్తమామలు ఉంటే వారి బాగోగులు... ఇవన్నీ భారమే. ఇటు ఈ పని అటు ఆ పని వీటి మధ్య సమన్వయం చేసుకోలేక మౌనంగా వొత్తిడి ఎదుర్కొంటూ అనారోగ్యం తెచ్చుకుంటూ ఒక్కోసారి ప్రాణాల మీదకు వచ్చే స్థితికి చేరువ చేస్తోంది మహిళా ఉపాధి.ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలలో కొంత వెసులుబాటు ఉండేది. కాని ప్రస్తుతం వారి పని ఒత్తిడి కూడా తక్కువగా లేదు. సుఖమైన బ్యాంకు ఉద్యోగం ఇప్పుడు పచ్చి అబద్ధం. చాలా చాకిరి అందులో ఉంటోంది. పెద్ద జీతాల సాఫ్ట్వేర్ రంగం విషయానికి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక ఇరవై నాలుగ్గంటలు పనే అనే భావన కలుగుతోంది. ‘మల్టీ నేషనల్ కంపెనీలు భారతీయ ఉద్యోగులను మనుషుల్లా కాకుండా గాడిదలతో సమానంగా చూస్తున్నాయి’...‘లాగిన్ చేయడం వరకే మా చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని గంటలు పని చేస్తామో మాకే తెలియదు’ అనే మాటలు ఆ రంగంలో సర్వసాధారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో స్త్రీలు తమ ఉద్యోగ, కుటుంబ జీవితాలను నిర్వహించుకోవడానికి సతమతమవుతున్నారు.వారానికి 60 గంటలుఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో ఎవర్ని పలకరించినా చేస్తున్న ఉద్యోగం గురించి గొప్పగా చెప్పుకోవడం కంటే ఆవేదన వ్యక్తం చేసే సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లైఫ్‌కు భరోసా ఇవ్వాల్సిన ఉద్యోగాలే ప్రాణాలను హరిస్తున్నాయనడానికి పూణెలో అన్నా సెబాస్టియన్ అనే మహిళ పని ఒత్తిడితో మరణించడం ఒక ఉదాహరణ మాత్రమే. 26 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకే దారుణమైన వర్క్ కండిషన్స్ కారణంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయింది. భారత్‌లో యువ మహిళా ఉద్యోగులు ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. వారానికి 40 గంటలు పాత మాటగా మారగా 55 నుంచి 60 గంటలు మహిళలతో కార్పోరేట్ కంపెనీలు పని చేయించుకుంటున్నాయి. సాఫ్ట్వేర్, ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో రోజుకు 18 గంటల పని విధానం సర్వసాధారణంగా మారి΄ోయింది. పని గంటలు ముగిసినా ఇంట్లో ఉన్నా చివరకు వారాంతమైనా సరే టార్గెట్లు పూర్తి చేయించుకోవడానికి ఆయా సంస్థలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. కుటుంబం, వ్యక్తిగత జీవితంతోపాటు ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేస్తే తప్ప ఈ తరహా ఉద్యోగాలు చేయలేని పరిస్థితి.హక్కులు ఏవి? చట్టాలు ఎక్కడ?చట్టాలను కఠినంగా అమలు చేసే దేశాల్లో ఇంత చాకిరి చెల్లుబాటు కాదు. ప్రపంచంలో అతి తక్కువ పని గంటలున్న 20 దేశాల్లో ఇండియా ఊసు కూడా లేదు. మన దేశంలో జీవించడానికి ఉద్యోగం చేస్తున్నామా లేక ఉద్యోగం చేయడమే జీవితమా అన్న స్థాయిలో పని కబళించేస్తోంది. ఒకరకంగా మానవ హక్కుల ఉల్లంఘనే జరుగుతోంది. వర్క్ కండిషన్స్ ఎలా ఉండాలి అనే అంశంపై 1948లో ‘యూనివర్సల్ డిక్లరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్’ను మెజార్టీ దేశాలు ఆమోదించాయి. ఉద్యోగుల హక్కులను కాపాడే ఈ డిక్లరేషన్ ను రూ΄÷ందించడంలో భారత్ కూడా కీలక పాత్ర ΄ోషించింది. అయితే దానికి కట్టుబడి చట్టాలను అమలు చేయడంలో మాత్రం మన ప్రభుత్వాలు, వ్యవస్థలు విఫలమవుతున్నాయి. అందుకే భారతీయులతో గొడ్డుచాకిరీ చేయించుకునే సంస్థలు పెరిగి΄ోయాయి.స్మార్ట్‌వర్క్‌ను ప్రోత్సహించాలిఎక్కువ గంటలు పని చేయడం ఉద్యోగి డెడికేషన్ కు ఏమాత్రం కొలమానం కాదన్న విషయాన్ని సంస్థలు గుర్తించాలి. వర్కింగ్ కండిషన్స్ ఏమాత్రం సానుకూలంగా లేని చోట హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయడం చాలా అవసరం. ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే ‘నో’ చెప్పడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. ఇన్ని గంటలు ఇంత పనే చేయగలం అని చె΄్పాలి. ఎవరి జీవితం వాళ్ల చేతుల్లోనే ఉండాలంటే మొహమాటాలను పక్కన పెట్టి నో చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.ఫ్యాక్టరీస్ చట్టం 1948, మైన్స్ చట్టం, బీడీ– సిగార్ కార్మికుల చట్టం మొదలగు చట్టాల కింద ప్రత్యేక సందర్భాలలో తప్ప ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు మాత్రమే స్త్రీలు పని చేయాల్సి ఉంటుంది. ఈ పని వేళలు దాటి రాత్రి 10 వరకు పనిచేయాలి అంటే సదరు యాజమాన్యం ప్రత్యేకమైన వసతులు; రక్షణ, రవాణా వంటివి కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ పని వేళలు సాఫ్ట్వేర్ రంగానికి కూడా వర్తించినప్పటికీ, కొన్ని వెసులుబాటులను ప్రభుత్వం ఐటీ రంగానికి కల్పించింది. అయినప్పటికీ స్త్రీలను రాత్రి వేళలో పనిచేయాలి అని ఏ యాజమాన్యం కూడా ఒత్తిడి చేయడానికి వీలులేదు. ఒకవేళ అలా పని చేయాల్సి వస్తే రవాణా, చిన్నపిల్లల సౌకర్యార్థం (క్రెచ్) సదుపాయాలు కల్పించాల్సి వుంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిస్త్రీలకు పిల్లల పెంపకం, ఇంటి పని భారం, ఉద్యోగ భారం... ట్రిపుల్ బర్డన్ కలిగిస్తున్నాయి. ఇంటిని చూసుకోవాలి... సంపాదించాలి... అంటే రెండు చోట్లా ఆమె ఉత్పాదనను పరీక్షకు పెడుతున్నట్టే లెక్క. ఈ రెండు పనులు ఆమెకు సౌకర్యంగా లేక΄ోతే శారీరకంగా మానసికంగా చాలా సమస్యలు వస్తున్నాయి. మానసికంగా యాంగ్జయిటీ, డిప్రెషన్ చూస్తున్నాం. ఇక ఎముకల బలం క్షీణించడం, బహిష్టు సమస్యలు... కనపడుతున్నాయి. కొందరిలో ఇన్ఫెర్టిలిటీ పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య సమన్వయమే ఈ పరిస్థితి నుంచి స్త్రీలను బయటపడేయగలదు.– డాక్టర్ ఆరతి బెల్లారి, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్– ఫణికుమార్ అనంతోజు, సాక్షి -
‘వారానికి 40 గంటలే పని ఉండాలి!’
పని భారం.. తీవ్ర ఒత్తిడితో ఓ యువ ఉద్యోగిణి ప్రాణం కోల్పోవడం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ భిన్నంగా స్పందించారు.పని ఒత్తిడితో యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగి మరణించిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. పని ప్రదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగొద్దని సూచించిన ఆయన.. పనివేళలపై పార్లమెంట్లో చట్టం తెచ్చేందుకు కృషిచేస్తానన్నారు. ఈ క్రమంలో వారానికి 40 గంటల పని దినాల ప్రతిపాదన తెరపైకి తెచ్చారాయన.Had a deeply emotional and heartrending conversation with Shri Sibi Joseph, the father of young Anna Sebastian, who passed away after a cardiac arrest, following four months of deeply stressful seven-day weeks of 14 hours a day at Ernst&Young. He suggested, and I agreed, that I…— Shashi Tharoor (@ShashiTharoor) September 20, 2024 నాలుగు నెలలు.. ఏడు రోజులు.. రోజుకి 14 గంటల చొప్పున పని చేయడంతోనే ఆమె ఒత్తిడికి గురైంది. ఆమె మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నా. అందుకే వారానికి ఐదు రోజులే పని దినాలు ఉండాలి. ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగులు రోజుకు ఎనిమిది గంటలే పని చేయాలి. ఈ దిశగా చట్టం కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నా వంతు కృషి చేస్తా.. అని తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక సందేశం కూడా ఉంచారు. అంతేకాదు ఇదే అంశంపై అన్నా తండ్రి సిబి జోసెఫ్‌తోనూ తాను మాట్లాడినట్లు థరూర్ తెలిపారు.కేరళకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్(26) నాలుగు నెలలుగా పూణే ఈవై కార్యాయలంలో పని చేస్తూ.. జులై నెలలో కన్నుమూసింది. అయితే పని ఒత్తిడి వల్లే అన్నా మరణించిందని ఆమె తల్లి అనిత ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీకి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఇక.. ఈ వ్యవహారంపై కేంద్ర కార్మిక శాఖ విచారణ చేపట్టింది. మరోవైపు తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో రాజీవ్ మెమానీ స్పందించారు. ‘‘ఆమె కుటుంబంతో మాట్లాడాను. సెబాస్టియన్ మృతికి సంతాపం తెలిపాను. వారి జీవితంలో ఏర్పడిన వెలితిని ఎవరూ పూడ్చలేరు. ఆమె అంత్యక్రియల సమయంలో మేము అక్కడ లేకపోవడంపై తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నాను. ఇది మా పని సంస్కృతికి పూర్తిగా విరుద్ధం. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. భవిష్యత్తులో ఇలా జరగదు’’ అని సంస్థ మెమానీ పేర్కొన్నారు. తెరపైకి నారాయణమూర్తి కామెంట్స్పని ఒత్తిడితో ఈవై ఉద్యోగిణి మరణించడం చర్చనీయాశంగా మారిన వేళ.. పనిగంటలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నా.. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలన్నా.. భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాల్సిందేనని అన్నారాయన. ‘‘ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువ. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. చైనా వంటి దేశాలతో పోటీపడాలంటే మన యువత అదే తరహాలో పనిచేయాల్సిన అవసరం ఉంది. ‘ఇదీ నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటలు కష్టపడతా’ అనే అనే ప్రతిజ్ఞ చేయాలి’’ అని నారాయణమూర్తి అన్నారు. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.వారానికి 100 గంటలైనా పని చేయాలంటూ ఎలోన్ మస్క్ లాంటి బిలియనీర్లు పిలుపు ఇస్తుంటారు. కానీ, ఓవర్ వర్క్ వల్ల గుండె, మెదడు ఇతర కీలకమైన అవయవాలపై ఒత్తిడి పడుతుంది. చివరకు.. మరణానికి కూడా దారి తీయొచ్చు. మొన్నీమధ్య చైనాలోనూ ఓ పెయింటర్ ఇలా గొడ్డు చాకిరీ చేసే ప్రాణం పొగొట్టుకున్నాడు. ఆరా తీస్తే.. వరుసగా 104 రోజులు పని చేసిన ఆ కిందిస్థాయి ఉద్యోగి.. ఒకే ఒక్కరోజు సెలవు తీసుకున్నాడని తేలింది. ఇదీ చదవండి: కోటి జీతం.. అయినా ఈవై ఉద్యోగం వద్దనుకున్నాడు!! -
104 రోజులు ఏకధాటిగా పని.. అనారోగ్యంతో వ్యక్తి మృతి
30 ఏళ్ల చైనీస్ వ్యక్తి ఒకే ఒక్క రోజు సెలవుతో వరుసగా 104 రోజులు పనిచేసిన తర్వాత అవయవ వైఫల్యంతో బాధపడుతూ మరణించాడు. తరువాత, అతని మరణానికి 20 శాతం యజమాని యజమాని కారణమని కోర్టు తీర్పు చెప్పింది.ఓ వ్యక్తి సెలవు తీసుకోకుండా, కనీసం ఆఫ్ కూడా వినియోగించకుండా 100 రోజులకు పైగా నిరంతరం పనిచేయడంతో ఆరోగ్యం క్షీణించి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. వృత్యిరీత్యా పెయింటర్ అయిన అబావో అనే 30 ఏళ్ల వ్యక్తి.. గత ఏడాది ఫిబ్రవరిలో ఓ పని ప్రాజెక్టు కోసం ఒప్పందంపై సంతకం చేశాడు.ఫిబ్రవరి నుంచి మేరకు ప్రతిరోజు పనిచేశాడు. కేవతం ఏప్రిల్ 6న ఒకరోజు మాత్రమే సెలవు తీసుకున్నాడు.ఈ క్రమంలో మే 25న ఆయన ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించడంతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అబావోకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకినట్లు తేల్చారు. చివరికి చికిత్స పొందుతూ జూన్ 2023లో ప్రాణాలు విడిచాడు. అయితే పని ఒత్తిడి, ఎక్కువ సమయం పనిచేయడం వల్లే అబావో మరణించాడని, ఇందుకు యజమానిపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబం కోర్టును ఆశ్రయించిందికానీ అతడి యజమాని మాత్రం తన చర్యలను సమర్థించుకున్నాడు. అబావో కేవలం సమయానుసారమే పనిచేసినట్లు తెలిపాడు. తనే స్వచ్చందంగా అదనంగా పని చేశాడని, ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడలంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పేర్కొన్నాడు.కానీ యజమాని వ్యాఖ్యలతో న్యాయస్థౠనం ఏకీభవించలేదు. అబావో మరణానికి కంపెనీ 20 శాతం బాధ్యత వహించాలని కోర్టు ఆదేశించింది. 104 రోజులు నిరంతరం పనిచేయడం అనేది చైనీస్ లేబర్ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘగించినట్లేనని పేర్కొంది. చట్టం ప్రకారం రోజుకు గరిష్టంగా ఎనిమిది గంటలు, వారానికి సగటున 44 గంటలు మాత్రమే పనిచేయాలని తెలిపింది. అనంతరంఅబావో కుటుంబానికి 4,00,000 యువాన్లు (సుమారు రూ. 47,46,000), అతడి మానసిక క్షోభకు సంబంధించి 10,000 యువాన్లను (సుమారు రూ. 1,17,000) పరిహారం ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. -
ఈ గంటల లెక్క సరైనదేనా?!
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం అని కవి వాక్కు. కాకపోతే ఎలా శ్రమించాలి? ఎంతసేపు శ్రమించాలి? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. అందుకే కావచ్చు... వారానికి 70 గంటలు పని చేయాలంటూ ఇన్ఫోసిస్ సంస్థ సహ–వ్యవస్థాపకులు నారాయణమూర్తి తాజాగా చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా, ముఖ్యంగా యువతరంలో పెద్ద చర్చ రేపుతోంది. ఐటీ వృత్తినిపుణుల్ని ఉద్దేశించి ఓ పాడ్ క్యాస్ట్‌లో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయమది. రానున్న దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్త మార్పులతో వచ్చిపడే డిమాండ్లను అందుకొని, భారత ఉత్పాదకతను పెంచుకోవాలంటే ఈ అధిక పని గంటల విధానం అవసరమనేది ఆయన మాట. కార్పొరేట్ దిగ్గజాలు ఆ ప్రతిపాదనను సమర్థిస్తుంటే, శ్రామికవర్గాలు ఈ సుదీర్ఘ పనిగంటల ఆలోచనను వ్యతిరేకిస్తున్నాయి. వెచ్చించిన కాలం, ఉత్పాదకత... ఈ రెంటి మధ్య సంబంధం అన్నిసార్లూ అనులోమానుపాతంలోనే ఉంటుందా అనే మౌలిక ప్రశ్న మొదలైంది. పనిగంటలు పెంచి, ఎక్కువ పని చేయడమనే ప్రతిపాదన పట్ల పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు కారణాలు లేకపోలేదు. మన దేశంలో ఇప్పటికే అధిక సంఖ్యాకులు ఎక్కువ పని చేస్తూ, తక్కువ వేత నాలు పొందుతున్నారు. ఇక, ఇంటిని చక్కబెట్టే మహిళలు, అసంఘటిత రంగ శ్రామికులు లక్షల మంది ఈ 70 గంటల లెక్కకు మించే పనిచేస్తున్నారు. జీతం బత్తెం లేని కుటుంబ స్త్రీలు, వేతనం పొందినా లెక్కల్లోకి రాని అసంఘటిత శ్రామికుల రీత్యా ఉత్పాదకతలో అది కనిపించకపోవచ్చు. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ (ఓఈసీడీ) గణాంకాల ప్రకారం అధిక పనిగంటల విషయంలో మొత్తం 187 దేశాల్లో మనది 136వ ర్యాంకు. భారతీయ శ్రామికులు సగటున ఏటా 1660 గంటలు పనిచేస్తూ, 2,281 డాలర్ల మేర తలసరి జీడీపీ అందిస్తున్నారు. ఇండొనేసియా, ఆస్ట్రేలియా వగైరా దాదాపు అంతే గంటల్లో అధిక తలసరి జీడీపీ సాధిస్తున్నాయి. నిజానికి, రోజుకు గరిష్ఠంగా 8 గంటల పని మాత్రమే అనే పద్ధతిని భారతీయ కార్మిక చట్టాల్లోకి తేవడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వారానికి 70 గంటలు, అంటే రోజుకు 11.5 గంటలు అనే పద్ధతి తెస్తే మునుపటి పోరాటాల ఫలితమంతా గంగలో కలిసిపోతుందనే భయమూ శ్రామికుల్లో ఉంది. అదనపు జీతం, పరిహారాల ఊసెత్తకుండా కేవలం అధిక పని గంటల ప్రతిపాదన తీసుకురావడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. ఒకవేళ ఉత్పాదకత, అభివృద్ధి పెరగాలనుకుంటే... శ్రామికులు తమ ఉద్యోగంతో పాటు నచ్చిన మరో పని కూడా ఏకకాలంలో చేసుకొని అదనంగా సంపాదించుకొనేలా ‘మూన్‌లైటింగ్’కు అనుమతించాలని కొందరు నిపుణుల సూచన. తద్వారా శ్రామికులకూ, దేశానికీ ఉపయోగమనేది వారి వాదన. అయితే, పలు దిగ్గజ టెక్ సంస్థల భావన తద్భిన్నంగా ఉంది. మారుతున్న శ్రామిక సంస్కృతిలో మూన్‌లైటింగ్ విడదీయరాని భాగమని కేంద్ర ఐటీ అమాత్యులంటున్నా, దాన్ని శిరోధార్యమంటున్న కార్పొరేట్ల సంఖ్య తక్కువే! వృత్తి పట్ల అంకితభావం, అచంచలమైన శ్రద్ధ కావాల్సిందే! కానీ, పని మీద దృష్టి అనేది చివరకు ఉద్యోగ జీవితానికీ – కుటుంబ జీవితానికీ మధ్య సమతౌల్యం దెబ్బ తీయకూడదు. మనిషి పూర్తిగా డస్సిపోయే పరిస్థితి తేకూడదు. శారీరక, మానసిక సమస్యలకు కారణం కాకూడదు. ఏ పని చేసినా సంతోషంగా చేస్తే ఫరవాలేదు. ఆ పరిస్థితి అంతటా సాధ్యం కాదు. సంతోషమే సగం బలం అనే మనం అందులో వెనకబడ్డాం. ఇప్పటికే ప్రపంచ సంతోషసూచిలో మన దేశపు స్కోరు గణనీయంగా తగ్గుతోంది. దశాబ్దం క్రితం 2013లో 4,772 స్కోరుతో సంతోషసూచిలో భారత్ 111వ ర్యాంకులో ఉండేది. తీరా ఈ ఏడాది మన స్కోరు 4,036కు పడిపోయింది. మన ర్యాంకు 126కు దిగజారింది. ఈ పరిస్థితుల్లో సంతోషంగా పని చేయాలనే పద్ధతికి నీళ్ళొదిలి, మానసిక ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, అధిక గంటల పనితో ఉత్పాదకత పెంచాలని భావిస్తే, మొదటికే మోసం వస్తుంది. దీర్ఘకాలంలో అది దేశానికి నష్టదాయకంగా పరిణమించే ప్రమాదం ఉంది. నారాయణమూర్తి అన్నట్టు దేశాభివృద్ధికి మరింత శ్రమించాలనడంలో సందేహం లేదు. అయితే ఆ శ్రమను పని గంటలతో కొలవాలనుకుంటేనే చిక్కు. భారత్‌ను ఇప్పటికీ నిరుద్యోగం, తక్కువ ప్రతిఫలానికే పనిచేయాల్సి రావడం పట్టిపీడిస్తున్నాయి. స్వయం ఉపాధికి దిగుదా మంటే కావాల్సిన పెట్టుబడి దొరకని పరిస్థితి. విద్య, ఆరోగ్య వసతులూ అంతంత మాత్రమే. అవ్యవస్థీకృత ఆర్థికరంగంలో వారానికి 48 గంటల పైనే పని చేస్తున్నా, వేతనాల్లో వ్యత్యాసం, ఉపాధి భద్రత లేమి లాంటి సమస్యలు సరేసరి. ఈ నేపథ్యంలో జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచేలా ప్రభుత్వ విధానాలు మారాలి. పనిగంటల కన్నా మానవ సంక్షేమ మూలధనంపై దృష్టిపెట్టడం కీలకం. అప్పుడు ఉత్పాద కత పెరుగుతుంది. అందుకు పాలకులు ప్రాథమిక వ్యవస్థాగత లోపాలను సవరించడం అవసరం. గమనిస్తే, అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా సగటు భారతీయ శ్రామికుడు ఎక్కువ సేపు పనిచేస్తున్నా, ఉత్పాదకత తక్కువగా ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. అంటే, ఎంత నాణ్యమైన పని చేశావనేది ప్రధానం కావాలి కానీ, ఎంతసేపు గానుగెద్దులా పని చేశావనేది కాదు. గంటలకొద్దీ శ్రమను పెంచే కన్నా, నైపుణ్యాలకు పదునుపెట్టి, కొద్దిపాటి పరిశ్రమతో అధిక ఫలితం అందించే నవీన మార్గాలను అన్వేషించాలి. పారిశ్రామిక శిఖరం జేఆర్డీ టాటా మాటల్లో చెప్పాలంటే, ‘భారత్ ఆర్థిక అగ్రరాజ్యం కావడం కన్నా, ఆనందమయ దేశం కావాలి.’ అంచనాలు, అంతకు మించి ఒత్తిడి అంతకంతకూ అధికమవుతున్న కాలంలో అది చాలా ముఖ్యం. సంతోషం, సామర్థ్యం పెరిగితే సంపద అదే సృష్టి అవుతుంది. శ్రమజీవి ప్రతి చెమటచుక్క సిరులు పండిస్తుంది. -
ఎక్కువ పనిగంటలు ప్రమాదకరం!
యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్న మాటలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అసలు భారత కార్మిక చట్టం, ఫ్యాక్టరీ చట్టం వంటివి ఏం చెబుతున్నాయి, రోజుకి 8 గంటలు పైబడి పని చేస్తే పర్యవసనాలు ఏమిటి వంటి అనేక విష యాలు చర్చించవలసిన అవసరం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో 49 పని గంటల విధానం అమల్లో ఉంది. మన దేశంలో రోజువారి విశ్రాంతి సమయం, వార్షిక సెలవులు కలిపి వారానికి 48 పనిగంటలు మించకుండా ఉండేలా చట్టాలు ఉన్నాయి. మనిషికీ మనిషికీ పని గంటల్లో తేడా; అలాగే డబ్బు, ప్రాంతం, సంస్కృతి, జీవన విధానం వంటి అనేక అంశాలతో పాటు ముఖ్యంగా జీతాలు, లాభాలు ఆధారంగా కూడా ఈ పని గంటలు మారుతూ ఉంటాయి. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో వారి వారి అంగీ కారాన్ని బట్టి కూడా పని గంటలు నిర్దిష్టంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా నియమిత పని గంటలు వారానికి 40 నుంచి 44గా అమలులో ఉన్నాయి. తాత్కాలిక, బదిలీ ఉద్యోగులకు ఒకలాగా; పర్మినెంట్ ఉద్యోగులకు ఒకలాగా, అలాగే రోజుకి ఇన్ని గంటలని వారానికి మొత్తంగా 48 గంటలు మించకుండా పనిగంటలు ఉండాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా తక్కువ పని గంటలు వున్న దేశం జర్మనీ. ఇక్కడ సంవత్సరానికి 1340 గంటలు పని గంటలుగా ఉంటాయి. మెక్సికో, కొలంబియా, కోస్టారికాలలో ఎక్కువ పనిగంటలు (1886) ఉన్నాయి. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు అప్పటి వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్‌గా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కార్మికులకూ, ఉద్యో గులకూ రోజుకు 8 పని గంటలు ఉండాలని 1942లో మొదటిసారి డిమాండ్ చేశారు. అనేక వాదోపవాదాలూ, తర్జనభర్జనల మధ్య వైస్రాయ్ కౌన్సిల్ 9 పనిగంటలు ఉండాలనీ, దీనిలో 30 నిమిషాలు రెండు దఫాలుగా విశ్రాంతి ఉండాలనీ నిర్ణయించారు. ‘1948 ఫ్యాక్టరీ చట్టం’ సెక్షన్ 54 ప్రకారం ఈ తొమ్మిది గంటల పని, విశ్రాంతి సమయాన్ని అంబేడ్కర్ కార్మికుల పక్షాన పోరాడి సాధించారు. ఇటీవల మన దేశంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ‘కర్ణాటక ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు – 2023’ను ఆమోదించడం ద్వారా రోజుకు 12 పని గంటలు ఉండాలని నిర్ణయిం చింది (వారానికి 48 గంటలు మించకుండా). అలాగే భారత కార్మిక మంత్రిత్వ శాఖ రోజుకు12 పనిగంటలు ఉండాలని పార్లమెంట్లో చట్టం చేసినప్పటికీ... ‘ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ –1948’ ఓవర్ టైంతో కలిపి 50 నుంచి 60 పని గంటలు దాటకూడదనే నిబంధన కచ్చితంగా పాటించాలని చెప్పింది. 2016లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంత ర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయనం, అంచనాల ప్రకారం ఎవరైతే వారానికి 55 గంటలు దాటి పని చేస్తారో వారిలో ప్రతి పది మందిలో ఒక కార్మి కుడు గుండె పోటుతో మరణిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 745,000 మంది కార్మికులు గుండెపోటుతో మరణించినట్లు నివేదిక తెలిపింది. దీనికి కారణం ఎక్కువ పని చేయడమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థల సంయుక్త నివేదిక చెబుతున్నటువంటి సత్యం. పైన ఉదాహరించిన ఎక్కువ గంటలు పని చేయడం వల్ల జరిగిన మరణాలను పరిశీలిస్తే, యువత వారానికి 70గంటలు పని చేస్తే జరిగే నష్టం అంచనా వేయొచ్చు. స్వతంత్ర భారతదేశంలో ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా చెప్పవచ్చు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆయన రంగంలో ఆయన ఆదర్శప్రాయులు. వయస్సు రీత్యా కూడా పెద్దవారు. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో యువత అనేక ఆరోగ్య, మానసిక, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అనేక వార్తలు నిత్యం చూస్తూనే ఉన్నాం. ఆయన తన అభిప్రాయాలు మెజారిటీ మనోభావాలు దెబ్బతినే విధంగానూ, అశాస్త్రీ యంగానూ వ్యక్తపరిస్తే ఆ ప్రభావం సమాజం మీద కచ్చితంగా ఉంటుంది. యువత మానసిక స్థితి మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక దారుఢ్యం, కుటుంబ నేపథ్యం, పెరిగిన వాతా వరణం వంటివాటిని బట్టి ఉంటుంది. కాబట్టి విధాన నేర్ణేతలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. – డా‘‘ గుబ్బల రాంబాబు, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు, ఏపీ -
ఆయనైతే 90 గంటలు పనిచేసేవారు.. భర్తకు అండగా సుధామూర్తి
దేశంలో యువత "వారానికి 70 గంటలు" పని చేయాలని ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy)ఇచ్చిన సలహాపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, రచయిత్రి సుధా మూర్తి (Sudha Murty) స్పందించారు. తన భర్త నారాయణ మూర్తి వ్యాఖ్యలను సమర్థించారు. నిజమైన కష్టాన్నే నమ్ముతారు నారాయణమూర్తి స్వయంగా వారానికి 80-90 గంటలు పనిచేశారని, నిజమైన హార్డ్ వర్క్‌పై ఆయనకు నమ్మకం ఉందని సుధామూర్తి చెప్పారు. ‘ఆయన వారానికి 80 నుండి 90 గంటలు పని చేశారు. ఆయనకు అదే తెలుసు. నిజమైన కష్టాన్ని నమ్మే ఆయన అలాగే జీవించారు. అందుకే ఆయనకు అనిపించింది చెప్పారు’ అని సుధామూర్తి న్యూస్ 18కి చెప్పారు. ఈ రోజుల్లో కార్పొరేట్ ఇండియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నారాయణమూర్తికి చెప్పడానికి ప్రయత్నించారా అని అడిగినప్పుడు.. యువత భిన్న భావాలను కలిగి ఉంటారని, అయితే స్వయంగా ఎక్కువ గంటలు పనిచేసిన నారాయణ మూర్తి తన అనుభవాన్ని పంచుకున్నారని ఆమె వివరించారు. (టీసీఎస్‌లో మరో కొత్త సమస్య! ఆఫీస్‌కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..) భారతీయ యువత ఉత్పాదకతపై నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. యువత రోజుకు 12 గంటలు పని చేస్తేనే గత 2-3 దశాబ్దాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన దేశాలను భారత్ చేరుకోగలదని నారాయణమూర్తి ఇటీవల పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. భారతదేశ ఉత్పాదకత ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని ఆయన అన్నారు. -
వారానికి 60 గంటల కంటే ఎక్కువే.. పని గంటలపై ఇదిగో ప్రూఫ్..
ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఈ అభిప్రాయంపై ఏకీభవిస్తే, మరికొందరు వ్యతిరేకించారు. టైమ్ యూస్ సర్వే (Time Use Survey) విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో వారానికి సరాసరి 61.6 గంటలు పనిచేస్తున్నట్లు తెలిసింది. వారానికి 65.4 గంటలు పనిచేస్తూ తెలంగాణ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. ఇదీ చదవండి: పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి! తక్కువ పని గంటలున్న రాష్ట్రాల్లో మణిపూర్ (46.9 గంటలు), నాగాలాండ్ (46.8 గంటలు) ఉన్నాయి. అండమాన్ & నికోబార్ దీవుల్లో కూడా వారానికి 58.7 గంటలు పనిచేస్తున్నట్లు ఈ జాబితాలో చూడవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ యువకులు చేసినట్లు భారతీయలు ఎక్కువ గంటలు పనిచేస్తే తప్పకుండా ఇండియా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని వెల్లడించారు. -
రోజుకు 17 గంటలు పని చేస్తున్న ఉద్యోగికి డాక్టర్ సలహా..
కార్పొరేట్ ఉద్యోగాలంటే రూ.లక్షల్లో జీతాలు, విలాసవంతమైన జీవనశైలి ఉంటాయనేది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు వారి పని గంటలు, పడుతున్న ఒత్తిడి గురించి తెలుసుకుంటే ఇవేం ఉద్యోగాలురా నాయనా.. అనిపిస్తుంది. కార్పొరేట్ ఉద్యోగుల పని గంటలు, ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటాయనేది ఈ వార్త చదివితే తెలుస్తుంది. కార్పొరేట్ సంస్థలో పనిచేసే ఓ 37 ఏళ్ల వ్యక్తి తాను రోజుకు 17 గంటలు పనిచేస్తున్నానని, ఇటీవల తన రక్తపోటు స్థాయిల్లో మార్పుల గురించి ఆందోళన చెందుతూ ట్విటర్లో వైద్యుడిని సంప్రదించాడు. ఆ డాక్టర్ మొదటి సిఫార్సు ఏమిటంటే.. ట్విటర్లో హర్షల్ (@HarshalSal67) అనే వ్యక్తి తన ఆరోగ్య సమస్యపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ను ట్విటర్లో సంప్రదించాడు. ‘హాయ్ డాక్టర్, నాకు 37 ఏళ్లు, కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నాను. గత 6 నెలల నుంచి రోజుకు 16 నుంచి 17 గంటలు పని చేస్తున్నాను. ఇటీవల బీపీ చెక్ చేసుకోగా 150 /90 వచ్చింది. ఇప్పుడేం చేయమంటారు?’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ స్పందిస్తూ ‘పని గంటలను 50 శాతం తగ్గించండి. మరో నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే అవకాశం కల్పించండి. అంటే మీ ఉద్యోగంతో పాటు మీరు మరొకరి ఉద్యోగం చేస్తున్నారు’ అని సలహా ఇచ్చారు. దీంతో డాక్టర్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ఉద్యోగం మానేస్తున్నట్లు సదరు వ్యక్తి ప్రకటించారు. దీనికి మంచి నిర్ణయం తీసుకున్నారని డాక్టర్ సుధీర్ అభినందించారు. పలువురు ట్విటర్ యూజర్లు అతని పరిస్థితిపై సానుభూతి వ్యక్తం చేశారు. 1. Reduce working hours by 50%, and ensure an unemployed person gets a job (whose job you are doing in addition to yours) (+follow other advice from the pinned post on my timeline) https://t.co/wThD7cEvMt — Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) June 10, 2023 ఇదీ చదవండి: కార్మిక శాఖను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు.. ఎందుకంటే.. -
మస్క్ మామ మరో బాంబు: రోజుకు12 గంటలు, ఆఫీసులోనే నిద్ర!
న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ టేకోవర్ తరువాత సంస్థలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలు కీలక ఎగ్జిక్యూటివ్‌లపై మస్క్ వేటు, ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో బ్లూటిక్ కోసం నెలకు 8 డాలర్ల ఫీజు తదితర పరిణామాలు చకచకా జరిగిపోయాయి. తాజాగా మరో సంచలనం విషయం వెలుగులోకి వచ్చింది. రోజుకు 12 గంటలు పనిచేయాలని కొంతమంది ఉద్యోగులను ఆదేశించినట్టు తెలుస్తోంది. అంతేకాదు సిబ్బందికి ఇప్పటికే టాస్క్‌లు డెడ్‌లైన్స్ సెట్ చేశారట. అలాగే మేనేజర్ స్థాయి ఉద్యోగులు వీకెండ్ (శుక్ర,శనివారం)లో రాత్రి ఆఫీసుల్లోనే నిద్రించినట్టుగా ఉద్యోగులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఇదీ చదవండి: Elon Musk క్లారిటీ: బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు ఎంతో తెలుసా? ఎలాన్ మస్క్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉద్యోగులకు వారానికి ఏడు రోజులు, 84 గంటలు పనిచేస్తున్నారని, ఇప్పటికే చాలా మంది సిబ్బంది సాధారణం కంటే చాలా ఎక్కువ గంటలు పని చేస్తున్నారని సీఎన్‌బీసీ నివేదించింది. ముఖ్యంగా కొత్త బాస్ మస్క్ ఆధ్వర్యంలో ఉద్యోగులపై భారీగా వేటు పడనుందన్న అంచనాల మధ్య తమను తాము నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. స్ప్రింట్స్ పేరుతో వారాంతంలో పని చేయడానికి మస్క్ టీం ఇంజనీర్లలో కొంతమందికి కోడింగ్ ప్రాజెక్ట్‌లను కేటాయించిందని ఇన్సైడర్ గతంలోనే నివేదించింది. (Moonlighting టెక్ఎం సీఎండీ కీలక వ్యాఖ్యలు, ఒక్క మాటతో..!) కాగా 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ టేకోవర్ తరువాత తొలగింపుల అంశం ఉద్యోగుల్లో గుబులు పుట్టిస్తోంది. అలాంటి దేమీ లేదని ఇటీవల మస్క్ ప్రకటించినప్పటికీ ఆందోళన కొనసాగుతోంది. అయితే ఎంతమంది సిబ్బందిని ఎప్పుడు తొలగిస్తారు, ఏయే టీంలు ఎక్కువగా ప్రభావితమవుతాయనేది ప్రస్తుతానికి అస్పష్టం. -
ఈ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్, ‘వారానికి 4 రోజులే పని’
దిగ్రేట్ రిజిగ్నేషన్, అట్రిషన్ రేట్ కారణంగా ఈ ఏడాది మార్చి - ఏప్రిల్ నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు పని దినాల్ని కుదించాయి. వారానికి 6 రోజులు, ఆ తర్వాత 5 రోజులు, ఇప్పుడు వారానికి 4 రోజులు మాత్రమే పనిచేసే వెసలుబాటు కల్పిస్తున్నామంటూ సంస్థలు ఆ సమయంలో ప్రకటించాయి. తాజాగా మరో కంపెనీ వారానికి 4 రోజులు పనిచేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. యూకేకు చెందిన సుమారు 100 కంపెనీలకు పైగా ఉద్యోగులతో వారానికి 4 రోజులు మాత్రమే పనిచేయించుకుంటున్నాయి. అలా చేయడం వల్ల వర్క్ ప్రొడక్టవిటీ పెరగడంతో పాటు, కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ప్లైమౌత్ సిటీలో మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించే ‘ఫ్యూయల్’ కంపెనీ ఆఫీస్ వర్కింగ్ డేస్‌ను 5 రోజుల నుంచి 4 రోజులకు తగ్గించింది. 2022 అక్టోబర్ నుంచి 2023 మార్చి నెల వరకు ఉద్యోగులు ఈ కొత్త పనిదినాల్లో పనిచేస్తారని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ కింగ్ తెలిపారు. దిగ్గజ టెక్ కంపెనీలు గూగుల్, మెటా తరహాలో ఉద్యోగులకు పూర్తి స్థాయిలో శాలరీను అందిస్తామని అన్నారు. ఇక మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైమింగ్స్ ఉంటున్నట్లు పేర్కొన్నారు. పనిగంటలు ఎక్కువే వారానికి 4 రోజుల పనిదినాలే అయినా.. రోజుకు సుమారు 10 పని గంటలు ఉండటంపై మార్టిన్ స్పందించారు. మా సంస్థకు ఎక్కువ మంది క్లయింట్లు ఈ-కామర్స్ రంగానికి చెందిన వారే. క్లయింట్ల అవసరాల్ని బట్టి వారి వర్క్స్ అవసరానికి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. 2019 నుంచి వారానికి 4 రోజుల పని ఫ్యూయల్ , పోర్ట్కల్లిస్ లీగల్ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే పోర్ట్ కల్లిస్ సంస్థ 2019 నుంచి వారానికి 4 రోజుల దినాల్ని ప్రవేశ పెట్టారు. చదవండి👉 నువ్వూ వద్దు..నువ్విచ్చే జీతమూ వద్దు, రూ.8కోట్లు వద్దన్న ఉద్యోగి -
బ్యాంకుల పనివేళలు మారనున్నాయా? బ్యాంకు అసోసియేషన్ ప్రతిపాదనలు ఇవే!
దేశంలో అన్నీ ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల పనిదినాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వారానికి 6 రోజులు పని చేసే ఉద్యోగులు ఇకపై 5 రోజులు మాత్రమే పనిచేయనున్నారా? అంటే అవుననే అంటోంది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ). అంతే కాదు బ్యాంకు యూనియన్ సభ్యులు కొన్ని డిమాండ్లను ఆర్బీఐ, కేంద్రం ఎదుట ఉంచారు. పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం..ఏఐబీఈఏ సంఘం కొన్ని ప్రతిపాదనలు చేసింది. అందులో.. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు వారానికి 6 రోజులు పని చేస్తుండగా.. ఆ పనివేళల్ని 5 రోజులకు కుదించాలని ప్రతిపాదించింది. అదే సమయంలో బ్యాంకు పనిదినాల్ని 5 రోజులకు కుదించడంతో పాటు..రోజుకు మరో అరగంట అదనంగా పనిచేస్తామని పేర్కొంది. బ్యాంకుల పనిదినాలు ఇలా ఉండాలి బ్యాంకు ఉద్యోగుల సంఘం లేఖ ప్రకారం..ప్రతిపాదిత పని గంటలు ఉదయం 9:15 గంటల నుండి సాయంత్రం 4.45 గంటల వరకు కాకుండా..ఉదయం 9:45 నుండి సాయంత్రం 4.45 గంటల వరకు మార్చాలి. బ్యాంకు ట్రాన్సాక్షన్ సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సవరించాలి. సవరించిన నగదు రహిత లావాదేవీల వేళలు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉండాలని యూనియన్ ప్రతిపాదించిందని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని కల్పించాలని యూనియన్ డిమాండ్ చేస్తోందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ఈ వర్కింగ్ ప్రతిపాదనలు గతేడాది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్లో ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. ఆర్బీఐ అంగీకరిస్తుంది రెండు శనివారాల నష్టాన్ని భర్తీ చేయడంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తన అభిప్రాయాలను కోరినట్లు ఆయన చెప్పారు. పనిగంటలను ముప్పై నిమిషాలు పెంచవచ్చని ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ (ఐబీఏ), కేంద్రం, ఆర్బీఐ తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో ప్రతిపాదనల తిరస్కరణ కరోనా మహమ్మారి సమయంలో, కోవిడ్ -19 వైరస్ నుండి ఉద్యోగులను రక్షించడానికి బ్యాంకు ఉద్యోగుల సంఘాలు వారానికి ఐదు రోజుల పని చేయాలని డిమాండ్ చేశాయి. ఈ ప్రతిపాదనను ఐబీఏ తిరస్కరించింది. కాని ఉద్యోగులకు 19 శాతం వేతన పెంపును ప్రతిపాదించింది. ప్రస్తుతం, బ్యాంకులకు ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు, ప్రతి ఆదివారం సెలవులు ఉన్న విషయం తెలిసిందే. -
ఉద్యోగులకు పండగే: వావ్..ఆ దేశంలో తగ్గనున్న పని గంటలు!
చిలీ ఉద్యోగులకు ఆ దేశ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ శుభవార్త చెప్పారు. దేశంలో పని గంటలను తగ్గించే బిల్లును అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా ఈ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు. 2017లో నాటి చిలీ ప్రభుత్వం ఐదేళ్లలోపు వీక్లీ వర్కింగ్ అవర్స్‌ను 45 నుండి 40 గంటలకు తగ్గించాలని అప్పటి చట్ట సభ సభ్యులు, ప్రస్తుత ప్రభుత్వ ప్రతినిధి కమీలా వల్లేజో బిల్లును ప్రవేశ పెట్టారు. కానీ ఆ బిల్లు అమలులో కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ తరుణంలో ప్రస్తుతం చిలీ ప్రెసిడెంట్ గాబ్రియెల్ బోరిక్ పనిగంటల్ని తగ్గిస్తూ 'అత్యవసర' బిల్లుగా పరిగణలోకి తీసుకున్నారు. చిలీ రాజ్యాంగ నిబంధన ప్రకారం..దేశ ప్రెసిడెంట్ ఏదైనా బిల్లు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తే చట్టసభ సభ్యులు సైతం ఆ బిల్లును పరిశీలించాల్సి ఉంటుంది. సభ్యులు అంగీకారంతో ఆ బిల్లు అమలు కానుంది. చట్టసభ సభ్యులు బోరిక్ ఆదేశాలతో పనిగంటల్ని తగ్గించడంతో పాటు అదనంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే కార్మికులకు సైతం పనిగంటల్ని తగ్గించే అంశంపై చర్చిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తప్పదు మరి చిలీ ప్రపంచంలోనే అతిపెద్ద రాగిని ఉత్పత్తి చేస్తున్న దేశంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా చిలీ ఆర్ధికంగా దెబ్బతిన్నది. ఇప్పుడు మహమ్మారి తగ్గి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.అదే సమయంలో అధిక ద్రవ్యోల్బణంతో దెబ్బతిన్న ఎకానమీని తిరిగి గాడిలో పెట్టేందుకు చిలీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగుల వర్కింగ్ అవర్స్ తగ్గించే అంశంపై ఆ దేశానికి చెందిన సంస్థల ప్రతినిధులతో పాటు యూనియన్ సంఘాలు,వర్కర్ ఫెడరేషన్లతో సంప్రదింపులు జరుపుతుంది. చర్చలు కొనసాగుతుండగా.. తమ ప్రభుత్వం వర్కింగ్ అవర్స్‌ను తగ్గించే బిల్లును వెంటనే అమలు చేసేలా ఉభయ సభల సభ్యులకు విజ్ఞప్తి చేసినట్లు చిలీ ప్రెసిడెంట్ గాబ్రియెల్ బోరిక్ చెప్పారు. చదవండి👉 వారానికి 4 రోజులే పని, కొత్త లేబర్ చట్టం అమల్లోకి వచ్చేది ఎప్పుడంటే! -
వారానికి 4 రోజులే పని, కొత్త లేబర్ చట్టం అమల్లోకి వచ్చేది ఎప్పుడంటే!
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 4 కార్మిక చట్టాలు జులై1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇంత వరకు అమలు జరగలేదు. ఒక వేళ అమలైతే ఉద్యోగుల వేతనం, పీఎఫ్ వాటా, పని సమయం, వీక్లీ ఆఫ్‌లు వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాలను పార్లమెంటు ద్వారా ఆమోదించినప్పటికీ, అనేక రాష్ట్రాలు ఇంకా కొత్త కోడ్లను ఆమోదించలేదు. రాజ్యాంగం పరిధిలో కార్మిక అంశం ఉన్నందున అమలులో జాప్యం జరిగింది. రాష్ట్రాలు వాటిని ఆమోదించిన తర్వాతే ఈ కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. కేంద్ర కార్మిక శాఖ సమాచారం ప్రకారం..ఇప్పటి వరకు 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతనాల కోడ్- 2019 కింద ముసాయిదా నిబంధనల్ని ప్రచురించాయి. త్వరలో అమలులోకి రానున్న కొత్త లేబర్ కోడ్ ఉద్యోగుల పని గంటలు, టేక్ హోం శాలరీ, సెలవులపై ప్రభావం చూపనుంది. ఉద్యోగి చివరి వర్కింగ్ డేస్ వరకు చెల్లించాల్సిన వేతనాలు రెండు రోజుల లోపే పూర్తి చేయాలని వేతన కోడ్ నిర్దేశిస్తుంది. అదే విధంగా సంస్థలు ఉద్యోగుల పని గంటల్ని పెంచుకోవచ్చు. అలాంటి సందర్భాలలో ఉద్యోగులకు అదనపు సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. ♦ కొత్త వేతన నియమావళి ప్రకారం బేసిక్ శాలరీ కనీసం 50 శాతం ఉండాలని నిర్దేశించడంతో ఉద్యోగులు తీసుకునే టేక్ హోం శాలరీపై ప్రభావం పడనుంది. ♦ ఉద్యోగి, సంస్థల సహకారంతో ఎక్కువ మొత్తం పీఎఫ్‌లో జత కానుంది. ♦ 2019లో పార్లమెంట్ ఆమోదించిన ఈ లేబర్ కోడ్ 29 కేంద్ర కార్మిక చట్టాలను భర్తీ చేస్తుంది. ♦ వేతనం, సామాజిక భద్రత, కార్మిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులపై నాలుగు కొత్త కోడ్లు జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా.. జాప్యం జరగడంతో త్వరలోనే అమలు జరగనున్నాయి. ఉద్యోగులపై ప్రభావం రాజీనామా, ఉద్యోగం నుండి తొలగించిన తర్వాత ఉద్యోగి చివరి పనిదినం వరకు చెల్లించిన బకాయిల్ని రెండు రోజులలోపు పూర్తి చేయాలని కొత్త చట్టం ఆదేశిస్తుంది. ప్రస్తుతం, కంపెనీలు సెటిల్మెంట్కు 45 రోజుల నుండి 60 రోజుల గడువు విధిస్తున్న విషయం తెలిసిందే. పెరగనున్న పని గంటలు కొత్త కార్మిక చట్టంలో సంస్థలు ఉద్యోగుల పని గంటల్ని 9 గంటల నుండి 12 గంటలకు పెంచేందుకు అనుమతిస్తుంది. పనిగంటలు పెరిగితే కొత్త లేబర్ చట్టాల ప్రకారం.. ఉద్యోగులు ప్రస్తుతం వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తుండగా..కొత్త పనివేళలతో వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగులకు వారానికి 3 రోజుల హాలిడేస్ కావాలి అనుకుంటే ప్రతి వారం 48 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. వారంలో 48 పని గంటలు దాటితే సదురు ఉద్యోగికి..సంస్థలు అదనంగా ఓవర్ టైం చెల్లించాల్సి ఉంటుంది. -
ఇక అక్కడ పనిదినాలు నాలుగు రోజులే!
కరోనా వైరస్ ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. రిమోట్ నుంచి హైబ్రిడ్ వర్కింగ్ విధానానికి దారితీసింది. ఇందులో భాగంగా జపాన్ మరో అడుగు ముందుకు వేయబోతోంది. పని దినాలను ఐదు నుంచి నాలుగు రోజులకు తగ్గించాలని అనుకుంటోంది. ఈ మేరకు ఒక ప్రతిపాదనను వార్షిక ఆర్థిక విధానాల మార్గదర్శకాలలో కీలకంగా చేర్చింది. టోక్యో: జపాన్ గవర్నమెంట్ 2021 కొత్త ఆర్థిక విధానాలతో వార్షిక మార్గదర్శకాల్ని విడుదల చేసింది. అందులో ఐదురోజుల పనిదినాలకు బదులు.. నాలుగు రోజులే పనిరోజులు ఉండాలని ప్రతిపాదించింది. ఉద్యోగుల పని-జీవితం ఈ రెండు విషయాల్ని పరిగణనలోకి తీసుకుని.. వాటిని సమతుల్యం చేసే విధంగా ఈ విధానాల్ని రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. జపాన్ అంటే హార్డ్వర్కింగ్కు కేరాఫ్ అనే ముద్ర ప్రపంచం మొత్తం ఉంది. అలాంటి దేశంలో తమ పని గంటల్ని తగ్గించాలని ఉద్యోగులు చాలా ఏళ్లుగా కోరుకుంటున్నారు.. ఉద్యమిస్తున్నారు. ఈ తరుణంలో నాలుగు రోజుల పనిరోజులు ఊరట కలిగించేదే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో రాజకీయ నేతలు సైతం జోక్యం చేసుకుంటున్నారు. కొందరు నేతలు కార్పొరేట్ ప్రతినిధులతో ఎంప్లాయిస్ పనిగంటల తగ్గింపు, వర్క్‌ఫ్రమ్ హోం లాంటి అంశాల గురించి చర్చిస్తున్నారు. ఇక తాజా మార్గదర్శకాలపై వాళ్లంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెలలోపే నాలుగు రోజుల పనిదినం పాలసీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే మేధావులు మాత్రం రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకుంటున్నారు. నాలుగు రోజుల పనిదినాల వల్ల అవుట్‌పుట్ తగ్గిపోతుందని, ప్రొడక్టివిటీపెరగకపోయినా.. ఉత్తేజంగా పని చేస్తారని, అదే టైంలో జీతాల కోతల గురించి కూడా ఉద్యోగులు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. కరోషి మరణాలు వర్క్‌ప్లేస్ మరణాలకు జపాన్ ఉద్యోగులు పెట్టుకున్న పేరు. తీవ్ర పని ఒత్తిడితో గుండెపోటు తదితర అనారోగ్య సమస్యలతో చనిపోయినా, లేదంటే ఒత్తిడితో ఆత్మహత్యలుచేసుకున్నా వాటిని కరోషి మరణాలుగా పరిగణిస్తారు. 2015, క్రిస్మస్‌నాడు మట్సూరి టకహషి(24) అనే యువతి.. పని ఒత్తిడి తట్టులేక ఆత్మహత్య చేసుకోవడంతో జపాన్ పని వాతావరణం, పని గంటల గురించి వీర లెవల్లో చర్చ జరిగింది. చదవండి: బఫెట్ రాజీనామా! ఎం జరిగిందంటే.. -
ప్రభుత్వ కార్యాలయాల పనివేళల మార్పు పొడిగింపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులను నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని శాఖలు, సచివాలయం, శాఖాధిపతులు, జిల్లా, సబ్ డివిజన్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకే పనిచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12 తర్వాత ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండాలంటే ప్రత్యేక పాసులుండాలని పేర్కొన్నారు. -
ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
-
ఏపీలో ఉద్యోగుల పనివేళల్లో మార్పు!
సాక్షి, అమరావతి: కోవిడ్ కట్టడే లక్ష్యంగా రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రజలు కూడా స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఉద్యోగుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రోజున ఉత్తర్వులను జారీ చేసింది. కర్ఫ్యూ నేపథ్యంలో ఉద్యోగుల పనివేళలు ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ఉండాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని హెచ్‌డీవో కార్యాలయాలు, సెక్రటెరియట్, జిల్లా కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఈ మేరకు అమలులో రానుంది. మధ్యాహ్నం 12 గంటల తరువాత ఉండాలంటే ఉద్యోగులకు కచ్ఛితంగా పాసులు కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. కాగా అత్యవసర సర్వీసులకు ఏపీ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. -
టైమ్ మెషీన్స్: ఏయే పనికి ఎంత టైం కేటాయిస్తున్నామంటే!
పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఒకటే పని.. ఆఫీసు డ్యూటీ, ఇంట్లో పని, షాపింగ్, పర్సనల్ పనులు.. ఇలా పొద్దంతా ఏదో ఓ పని చేస్తూనే ఉంటాం. దానికితోడు నిద్రపోయే టైం అదనం. మరి ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో జనం ఏ పనికి ఎంత టైం కేటాయిస్తున్నారో తెలుసా? దీనిపై జరిగిన పలు సర్వేలను క్రోడీకరించి.. అవర్ వరల్డ్ ఇన్ డేటా సంస్థ ఓ నివేదికను రూపొందించింది. 15 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య వయసువారిని పరిగణనలోకి తీసుకుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ 90 శాతం ఈ పనులకే.. రోజులో ఉండేది మొత్తంగా 1,440 నిమిషాలు. ఇందులో 80 నుంచి 90 శాతం వరకు మనం రెగ్యులర్‌గా ఒకేలా చేసే పనులకే సరిపోతోంది. ఎవరైనా ఓ వ్యక్తి సంపాదన కోసం చేసే వ్యాపారం, ఉద్యోగానికి కేటాయించే టైం, ఇంటికి సంబంధించిన పనులు, తిండి, నిద్ర, టీవీ, ఇంటర్నెట్లో గడపడం వంటివి దాదాపుగా రోజూ ఒకేలా (సేమ్ ప్యాటర్న్‌లో) ఉంటున్నాయని నివేదిక పేర్కొంది. అయితే సగటున పరిశీలిస్తే ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటోందని వెల్లడించింది. పని, నిద్ర.. చైనా, ఇండియాల్లోనే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా సంపాదన కోసం ఎక్కువ సేపు పనిచేయడంలో, బాగా నిద్రపోవడంలో చైనా వాళ్లు టాప్‌లో ఉన్నారు. సంపాదన కోసం పనిచేసే సమయంలో ఇండియా నాలుగో ప్లేస్‌లో ఉండగా.. నిద్రకు సంబంధించి అమెరికాతో కలిసి రెండో స్థానంలో ఉంది. మెక్సికో, దక్షిణ కొరియా, కెనడా, అమెరికా వంటి దేశాల్లోనూ పనికి కాస్త ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో సంపాదన బాగానే ఉన్నా.. ఇంకా ఎక్కువ డబ్బుల కోసం ఎక్కువ సేపు పనిచేస్తున్నారని, మరికొన్ని దేశాల్లో జీతాలు/ఆదాయం తక్కువగా ఉండటంతో ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తోందని నివేదిక పేర్కొంది. ఆహారంపై సంస్కృతి ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జనం వివిధ పనులకు టైం కేటాయించడంలో ఆయా ప్రాంతాల సంస్కృతి ప్రభావం ఉంటుందని అవర్ వరల్డ్ ఇన్ డేటా నివేదిక స్పష్టం చేసింది. భిన్నమైన ఆహారాన్ని ఇష్టపడే ఇటలీ, గ్రీస్, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల వారు మిగతా దేశాలకన్నా ఎక్కువ సమయాన్ని తినడానికి, తాగడానికి కేటాయిస్తున్నారు. అదే అమెరికాలో ఇందుకోసం ప్రపంచంలోనే అతితక్కువ టైం తీసుకుంటున్నారు. ఎంజాయ్మెంట్ కూడా.. సంపాదనకు తక్కువ టైం కేటాయిస్తున్న వారిలో ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం, డెన్మార్క్, నార్వే తదిరత యూరోపియన్ దేశాల వారే ఎక్కువగా ఉన్నారు. అదే సమయంలో నిద్రకు, ఎంజాయ్‌మెంట్‌కు ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. టీవీ, ఫోన్, స్పోర్ట్స్, ఫ్రెండ్స్‌ను కలవడం, పారీ్టలకు వెళ్లడం వంటి పనులతో ఎంటర్టైన్ అవుతున్నారు. ఈ దేశాల్లో రోజువారీ పని సమయం, పని దినాల సంఖ్య తక్కువగా ఉండటం కూడా వారు సంపాదనకు తక్కువ టైం ఇవ్వడానికి కారణమని నివేదిక వెల్లడించింది. ఇంటిపని, షాపింగ్‌లో మెక్సికో, ఇండియా.. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఓ పని ఉంటూనే ఉంటుంది. దానికితో డు ఇంటి అవసరాలకు షాపింగ్ కూడా అవసరమే. ఇలా ఇంటికోసం సమయం కేటాయించడంలో మెక్సికో, ఇండియా టాప్ లో నిలిచాయి. సాధారణంగానే ఈ రెండు దేశాల్లో సంస్కృతి ఇంటిపనికి కాస్త ప్రాధాన్యత ఇస్తుందని నివేదిక పేర్కొంది. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇంటి పనికి యావరేజ్‌గా టైమిస్తే.. దక్షిణ కొరియా, నార్వేల్లో మాత్రం తక్కువగా కేటాయిస్తున్నారు. సేవలో ముందున్న ఐర్లాండ్ రోజుకు 24 గంటలు.. 1,440 నిమిషాలు.. చిన్నాపెద్ద, పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ఉండే టైం ఇంతే. కానీ కొందరు తమకున్న సమయంలోనే కొంత ఇతరులకు సేవ చేయడానికి కేటాయిస్తుంటారు. ఈ విషయంలో ఐర్లాండ్ వాసులు అందరికన్నా ముందున్నారు. ఫిన్లాండ్, నార్వే, అమెరికా తదితర దేశాల వారూ కాసేపు వాలంటరీ వర్క్ చేస్తున్నారు. ఈ విషయంలో ఫ్రెంచ్ వాళ్లు అందరికన్నా వెనుక ఉండగా, ఆ తర్వాత ఇండియన్లే ఉన్నారు. -
ఎనిమిది 12 అయితే ఆమెకు ఎదురీతే..
ఈ కాలం అమ్మాయిలు.. చదవని డిగ్రీ లేదు.. చేయని ఉద్యోగం లేదు.. పొందని అవకాశం లేదు.. రాష్ట్రాలూ ఏలుతున్నారు..అరే.. స్పేస్లోకీ వెళ్తుంటే!! వాళ్లకు అండగా ఎన్ని చట్టాలు? 498 (ఏ), డొమెస్టిక్ వయొలెన్స్, నిర్భయ..! బస్సుల్లో వాళ్లకు సీట్లు.. స్థానిక పాలనాసంస్థల్లో సీట్లు.. ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్స్.. ఇంకా.. ఆగొచ్చు అక్కడితో! ఎంత చదువుకుంటున్నా.. ఎన్నో కొలువుల్లో ఉన్నా.. ఆఖరికి అంతరిక్షంలోకి వెళ్లినా ఎక్కడా నాయకత్వంలో లేరు. మహిళాపాలకులనూ వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు! ఎన్ని చట్టాలు వచ్చినా వాళ్ల మీద హింస మాత్రం ఆగట్లేదు. బస్సుల నుంచి స్థానిక పాలనా సంస్థల దాకా ఉన్న సీట్లూ వాళ్లను నాయకులుగా నిలబెట్టేవి కావు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లూ ఆడవాళ్లను బాసులుగా చేయట్లేదు. అన్నీ నేర్చుకొని.. లేదా నేర్చుకోవాలనే తపన చూపించి నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలనుకుంటే... ‘నేను డ్రైవింగ్ నేర్చుకోనా?’ ఉత్సుకతో అడిగిన భార్యకు ‘ముందు పరాఠా చేయడం నేర్చుకో.. డ్రైవింగ్ సంగతి తర్వాత’ అని భర్త చెప్పే సీన్ల (థప్పడ్ అనే బాలీవుడ్ సినిమాలోనిది)వంటివే ఎదురవుతుంటాయి. తప్ప ‘మిష్టర్ పెళ్లాం’ సినిమాలో లాగా ‘మీ సరకుల్లో చచ్చులు, పుచ్చులు ఉండవని.. ఉంటే చూపించమని సవాల్ చేయండి.. క్వాలిటీనే మీ బ్రాండ్‌గా మార్చుకోండి.. సేల్స్ ఎందుకు పెరగవో చూద్దాం’ అని సలహా ఇచ్చిన మహిళలోని ప్రతిభను మెచ్చి, ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాన్నీ గుర్తించి మేనేజర్ స్థాయి ఉద్యోగం ఇచ్చిన యాజమాన్యం.. అలాంటి సీన్లు కనిపించవు. చర్విత చర్వణంలాంటి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి యూఎన్ విమెన్ ఈ ఏడు ప్రకటించిన థీమ్.. ‘‘విమెన్ ఇన్ లీడర్షిప్: అచీవింగ్ ఏన్ ఈక్వల్ ఫ్యూచర్ ఇన్ ఏ కోవిడ్–19 వరల్డ్’’. మహిళలు నాయకత్వం వైపు అడుగులేస్తూ స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించాలని యూఎన్ విమెన్ వింగ్ ఏటా ఒక్కో థీమ్‌తో ప్రపంచాన్ని చైతన్య పరుస్తోంది. ఆ స్ఫూర్తిని అందుకుంటున్న దేశాలున్నాయి. ఆ ప్రయాణాన్ని ఇదివరకే ప్రారంభించిన దేశాలూ ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తున్న దేశాలూ లేకపోలేదు. మనం ఏ జాబితాలో ఉన్నామో మహిళలకు సంబంధించి తాజా పరిస్థితులు, పరిణామాలు, పర్యవసానాలను బట్టి అర్థమవుతూనే ఉంది. సందర్భం కాబట్టి ఇటీవల కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ చేసిన పన్నెండు పని గంటలు, మూడు రోజుల సెలవులు అనే ప్రతిపాదనను మహిళా కోణంలోంచి చూద్దాం. ప్రభుత్వాలు ఎలాంటి ప్రతిపాదన చేసినా.. చేయాలనుకున్నా దాని ప్రభావం స్త్రీల మీద ఎలా ఉంటుందో.. ఎలా ఉండబోతుందో ఒకటికిపదిసార్లు చర్చించి, తరచి చూసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. చట్టాలుగా తేవాలి. ప్రతిపాదన దశలో మహిళా వర్గం నుంచి వస్తున్న స్పందన, ప్రతిస్పందనలనూ పరిగణనలోకి తీసుకోవాలి. కార్మికశాఖ ప్రతిపాదించిన ఈ పనిదినాల మార్పు మీద మెట్రో నగరాల్లో చర్చ మొదలై పోయింది. ‘రోజూ పన్నెండు గంటల చొప్పున వారానికి నాలుగు పనిదినాలు, మూడు వారాంతపు సెలవులు లేదా ఇప్పుడెలా ఉందో అలాగే అంటే రోజుకి ఎనిమిది గంటల చొప్పున వారానికి ఆరు పనిదినాలనే అనుసరించడం. ఇది ఐచ్ఛికం. ఈ రెండింటిలో ఉద్యోగి ఏ పద్ధతినైనా అవలంబించవచ్చు’ అనేదే ఆ ప్రతిపాదన. ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదుకదా.. ఉద్యోగులు అందరికీ కదా? అవును. కానీ ప్రభావం మాత్రం మొత్తం స్త్రీల మీదే ఉంటుంది. అన్నేసి గంటల పనివేళలు ఎవరికైనా ఇబ్బంది. మగవాళ్లు రోజంతా ఆఫీస్‌లో గడిపితే ఇంట్లోని మహిళలు అదనపు భారాన్ని మోయాలి. ఆఫీస్‌కెళ్లే ఆడవాళ్ల తిప్పలైతే చెప్పక్కర్లేదు. విలువలేని ఇంటి చాకిరీతోపాటు ఎంతోకొంత విలువ చేసే ఆఫీస్ చాకిరీ కలసి రోజుకు 24 గంటలూ సరిపోవు. ‘ఎనిమిది, తొమ్మిది గంటల పనివేళలకే ఇంట్లోంచి ఉదయం బయలుదేరితే రాత్రికి గానీ ఇల్లు చేరని పరిస్థితి. నగరాల్లోని ట్రాఫిక్ ఇక్కట్లు ఆ సమయాల్ని మరింత సాగదీస్తాయి. రోజుకి పన్నెండు గంటలంటే ఊహించుకోవడానికేమీ లేదు. ‘అయినా ఇది ఐచ్ఛికమే అంటున్నారు కదా?’ అని కొంతమంది ఉద్యోగినులు, ఉద్యోగులనూ అడిగితే.. ‘ముందు ఆప్షన్‌గానే ఇస్తారు తర్వాత అది తప్పనిసరి నిబంధనగా మారుతుంది. సపోజ్.. మా ఆఫీస్ (ప్రభుత్వ కార్యాలయం)లో కొంతమందిమి ట్వల్వ్ అవర్స్, త్రీ డేస్ వీకెండ్‌ను ఆప్షన్‌గా తీసుకున్నాం అనుకోండి. ఇంకొంతమంది వన్ డే వీకెండ్ ఆప్షన్లో ఉన్నారనుకోండి. ఒక పనికి సంబంధించి ఆ టూ కేటగిరీస్ మధ్య కో ఆర్డినేషన్ ఎలా కుదురుతుంది? యూనిఫార్మిటీ ఉన్నప్పుడే పనులు సవ్యంగా జరగడం కష్టం.. ఇక ఒకే సెక్షన్లో ఇలా డిఫరెంట్ కేటగిరీస్‌లో పనిచేసే వాళ్ల మధ్య ఎలా కుదురుతుంది? దాంతో అందరికీ పన్నెండు గంటల పనివేళలే తప్పనిసరి చేసేస్తారు’ అని చెప్పారు. ఉద్యోగినులు, అందులోనూ వర్కింగ్ మదర్స్‌ను కదిలిస్తే.. ‘ట్వల్వ్ వర్కింగ్ అవర్స్ కన్నా త్రీ డేస్ వీకెండే అట్రాక్ట్ చేస్తుంది ఎవరినైనా. అబ్బా.. మూడు రోజులు హాలీడేస్ అనిపిస్తుంది. కానీ దానికి మొత్తం నాలుగు రోజులను పణంగా పెడుతున్నామన్న ధ్యాస రాదు. ఒకవేళ ఉద్యోగులుగా మనం లాజికల్‌గా ఉండి వన్ డే వీకెండ్ ఆప్షన్‌కి వెళితే ఇంట్లో ప్రెజర్ మొదలవుతుంది. మూడు రోజులు సెలవులిస్తుంటే హాయిగా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండక ఒక్క రోజు సెలవుకి వెళ్లడం ఎందుకు? అని. రోజూ పన్నెండు గంటలు ఆఫీస్‌లో.. ప్లస్ నాలుగ్గంటలు ట్రాఫిక్‌లో ప్రయాణాలతో పదహారు గంటలు బయటే గడిపితే ఇంటి పని ఎప్పుడు చేసుకోవాలి? ఎన్నింటికి నిద్రపోవాలి? ఉదయం ఎన్నింటికి లేవాలి? పిల్లలను ఎవరు చూసుకోవాలి? వాళ్ల తిండీతిప్పలకు అత్త, అమ్మ మీదో.. లేకపోతే సర్వెంట్ మెయిడ్ మీదో ఆధారపడ్డా.. వాళ్ల చదువుసంధ్యలు ఎవరు పట్టించుకోవాలి? దీని బదులు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవడం బెటర్ అనిపిస్తుంది. ఆ వెసులుబాటైనా కల్పించేలా లేవు కదా పెరిగిన ధరలు. మొండికేసి ఉద్యోగమే ముఖ్యం అనుకుంటే ఏదోకరోజు రోగాల కుప్పై సంపాదించుకున్నదంతా మెడికల్ బిల్లులకు పే చేయాల్సి వస్తుంది. అమ్మో... తలచుకుంటేనే భయంగా ఉంది’ అంటున్నారు. నిజమే.. ఇంకా చట్టంగా రాకుండా.. కేవలం చర్చల్లోనే ఈ ప్రతిపాదన ఇంతగా వణికిస్తోంది. బయట పనుల్లో స్త్రీలు భాగస్వాములైనంత చొరవగా, వేగంగా ఇంటి పనుల్లో మగవాళ్లు భాగస్వాములు కాలేదు. మనకది నేటికీ వింత సంస్కృతే. అమ్మాయి ఉద్యోగం చేయాలి, ఇంట్లో పనీ చూసుకోవాలి. పిల్లల పెంపకమూ ఆమె బాధ్యతే. అసలు మహిళా దినోత్సవం వచ్చిందే పనివేళల కుదింపు, శ్రమకు తగ్గ వేతనం, ఓటు వేసే హక్కు కావాలనే డిమాండ్‌తో. వందేళ్ల పైబడ్డ చరిత్ర ఆ విప్లవానిది. ఈ వందేళ్లలో సాధించిన నాగరికత ఆధునిక స్త్రీ సవాళ్లను గుర్తించాలి.. సమానత్వాన్ని చేకూర్చాలి. శ్రమకు తగ్గ వేతనం నుంచి సమాన వేతన లక్ష్యానికి చేరాలి. కానీ సాంకేతిక యుగంలో కూడా స్త్రీ విషయంలో ఇంకా ప్రాథమిక దశే మనది. మహిళలు గడప దాటితే ఎక్కడికి వెళ్తున్నారో పోలీస్‌స్టేషన్‌లో చెప్పి, వివరాలు నమోదు చేసి వెళ్లాలనే నిబంధన (మధ్యప్రదేశ్‌లో) పెట్టే స్థితిలో ఉంటే సమానత్వం మాటెక్కడిది? పాశ్చాత్య దేశాలు మనకు భిన్నంగా ఉన్నాయి. ఫ్రాన్స్‌లో వారానికి 35 గంటల పని నియమం. అమెరికాలో వారానికి 40 గంటలు. మన దగ్గర వారానికి 48 గంటలు. లేబర్ యాక్ట్ ప్రకారం రోజుకి తొమ్మిది గంటలు గరిష్ట పరిమితి. ఏ రోజైనా తొమ్మిది గంటలకంటే ఎక్కువ పనిచేయించుకుంటే దాన్ని ఓటీగా పరిగణించి రెట్టింపు డబ్బులు చెల్లించాలి. స్వీడన్లో ఎనిమిది గంటల పనివేళలను ఆరు గంటలకు మార్చారు. దీనివల్ల ఉత్పత్తిలో ఎలాంటి ఆటంకాలు రాకపోగా పని సామర్థ్యం పెరిగినట్టుగా గమనించారు. అంతేకాదు ఉద్యోగుల ఇళ్లల్లోనూ ఆరోగ్యకర వాతావరణం నెలకొందని అధ్యయనాలు తెలిపాయి. కాలక్రమేణా ఈ పనిగంటల విధానాన్ని ఇలా సరళం చేసేలా ఆలోచించాలి కాని క్లిష్టతరం చేయడమేంటి? పారిశ్రామిక విప్లవ పూర్వకాలానికి వెళ్తున్నామా అనిపిస్తోంది కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆలోచనలు వింటూంటే’ అని ప్రశ్నిస్తున్నారు సామాజికవేత్తలు. తలనొప్పి వ్యవహారంగా.. సాంకేతికత తెచ్చిన ఆధునికత ఎంత విస్తృతమైనా ఇంటా, బయటా మహిళల భద్రత విషయంలో మనం అనాగరికంగానే ఉన్నాం. ఆడవాళ్లకు ఉద్యోగాలిస్తే అన్నీ సవాళ్లే అని విసుక్కునే యాజమాన్యాలే ఎక్కువ. అమ్మాయిలకు ఉద్యోగాలంటే ఆఫీస్ డెకొరమ్ను డిసిప్లిన్‌లో పెట్టాలి, రాత్రి తొమ్మిది దాటితే రవాణా సౌకర్యం కల్పించాలి, యాంటీ సెక్సువల్ హెరాస్మెంట్ సెల్‌ను ఏర్పాటు చేయాలి, మెటర్నిటీ లీవ్‌ను ఇవ్వాలి.. ఇదంతా తలనొప్పి వ్యవహారంగా భావించే యాజమాన్యాలు చాలానే ఉన్నాయి. దీని కన్నా మహిళలను తీసుకోకుండా ఉంటేనే నయం కదా అనే ఆచరణలోకి వచ్చేస్తున్నాయి. పని ప్రదేశాల్లో స్త్రీలకు ఎదురయ్యే ఇబ్బందులను అరికట్టే సరైన యంత్రాంగం లేదు. ఇప్పుడీ పనిగంటల పెంపు మహిళల ఉద్యోగ జీవితాన్ని మరింత అభద్రతలోకి నెట్టడమే కదా! మా ఉద్యోగ హక్కును, అవకాశాలను హరించేయడమే కదా? అంటున్నారు ఈ తరం అమ్మాయిలు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడమే.. మహిళలు లీడర్షిప్ వైపు రావాలి. ఆర్థిక, సాంఘిక, రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి అని ఉపన్యాసాలు ఇస్తున్నాం.. వింటున్నాం. ఇలా మహిళా దినోత్సవాల పేరిట స్ఫూర్తినీ పంచుతున్నాం. ఇంకో వైపు ఈ గంటల పెంపు వంటివాటినీ అమలు చేయచూస్తున్నాం. మహిళా కోణంలోంచి చూస్తే పొమ్మనలేకుండా పొగబెట్టే కార్యక్రమంగానే తోస్తోంది. వాళ్లంతట వాళ్లు ఉద్యోగాల నుంచి తప్పుకునేలా చేసే ప్రణాళికే ఇది. యాజమాన్యాల కోసం చేస్తున్న ప్రతిపాదన. ఇలాంటి అడ్డంకులను పేరుస్తూ కమాన్ లేడీస్.. మీరు సాధించగలరు.. అన్నిరంగాల్లో మీరు లీడర్స్‌గా రావాలి అని ప్రోత్సహించడంలో అర్థం ఉందా? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాదా ఇది .. అని అభిప్రాయపడుతున్నారు నాయకత్వ బరిలో ఉన్న చాలా మంది మహిళలు. ఈ అభిప్రాయం అపోహ కాదనే అనిపిస్తోంది. దీని మీద చర్చలు విస్తృతం కావాలి. పురుషులూ పాలుపంచుకోవాలి. ఇంట్లో అయినా బయట అయినా శ్రమలో స్త్రీ, పురుషుల సమభాగస్వామ్యం ఉండాలి. మహిళలు ఐచ్ఛికంగా ఉద్యోగాలు వదులుకోవడం కాదు.. ఇన్నాళ్లుగా ఈ సమాజం పురుషుడికి ఇచ్చిన నాయకత్వ వరాన్ని వాళ్లు వదులుకోవాలి. స్త్రీలకూ ఆ అవకాశం ఉండాలని గ్రహించాలి. ఆ హక్కును మహిళలూ తీసుకోవాలి. దీని కోసం మహిళల పరిధిని కుదించే నిబంధనలు కాదు.. వాళ్ల స్వేచ్ఛాస్వాతంత్య్రాలు, ప్రజ్ఞ, సామర్థ్యాలను గౌరవించే ప్రతిపాదనలు, చట్టాలు కావాలి. సవాళ్లు.. అవకాశాల తీరు ► మన చట్టసభల్లో కేవలం 14 శాతం మంది మాత్రమే మహిళలు. ► పారిశ్రామిక సంస్థల విషయానికి వస్తే పేరున్న అయిదు వందల కంపెనీల్లో కేవలం అయిదు శాతం స్త్రీలు మాత్రమే సీఈఓలుగా ఉన్నారు. ప్రపంచంలో మనం ► 193 దేశాల్లోని చట్టసభల్లో స్త్రీల భాగస్వామ్యం లెక్క తీస్తే మనం 150వ స్థానంలో ఉన్నాం. భద్రత స్కేలు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం 2018తో పోల్చితే 2019లో మహిళల మీద నేరాల సంఖ్య 7.3 శాతం పెరిగింది. ఈ నేరాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దళితుల మీద నేరాల విషయానికి వస్తే ఆ స్థానాన్ని రాజస్థాన్ తీసుకుంది. ► 2019లో మహిళల మీద జరిగిన నేరాల సంఖ్య 4,05,816 (నమోదైన కేసులు). 2018లో ఈ సంఖ్య 3,78,236. ► లైంగిక దాడుల విషయానికి వస్తే 5వేల 997 కేసులతో రాజస్థాన్ ఆ అపఖ్యాతిని మోస్తోంది. ఆ వరుసలో 3,065 కేసులతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలబడింది. ► పోక్సోయాక్ట్ కింద నమోదైన నేరాల్లో 7,444 కేసులతో ఉత్తరప్రదేశ్ ముందుంది. తర్వాత మహారాష్ట్ర. అక్కడ నమోదైన కేసుల సంఖ్య 6,402. ► వరకట్న కేసుల్లోనూ ఉతర్తప్రదేశ్కే అపకీర్తి కిరీటం. నమోదైన కేసుల సంఖ్య 2,410. తర్వాత బిహార్. కేసుల సంఖ్య.. 1,220. ► యాసిడ్ దాడుల్లోనూ ఉత్తరప్రదేశ్‌దే ప్రథమ స్థానం. నమోదైన కేసులు 42. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. నమోదైన కేసులు 36. ( ఎన్సీఆర్బీ 2019 ) 12 గంటల పనిదినం అకాల మరణమే! ఉద్యోగుల చేత వారానికి 4 రోజులే పని చేయించి, రోజుకి 8 గంటల బదులు 12 గంటలు పని చేయించుకోవచ్చుననే ప్రతిపాదన వల్ల ప్రధానంగా స్త్రీలకు జరిగే నష్టం.. స్త్రీలు నాయకత్వ స్థానాల్లోకి ఎదగడానికి కావలిసిన పరిస్థితులు.. స్త్రీ–పురుష సమానత్వ సాధనకు పురుషులు చేయాల్సిన కృషి.. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఇప్పుడున్న పెట్టుబడిదారీ విధానాన్ని తీసెయ్యడమే. అది ఇప్పటికిప్పుడు జరిగే పని కాదు కాబట్టి, తాత్కాలిక పరిష్కారాల గురించి ఆలోచించాలి. ప్రస్తుతం నూటికి 90 శాతం పని స్థలాల్లో, 8 గంటల పని దినం అయినా అమలులో లేదు, కాయితాల మీద తప్ప. రోజుకి 8 గంటల చొప్పున వారంలో 6 రోజుల పని అయినా, రోజుకి 12 గంటల చొప్పున వారంలో 4 రోజులే పని అయినా, పని చేసేది 48 గంటలే గదా? అని ప్రభుత్వమూ, యజమానులూ వాదించవచ్చును. కానీ, 12 గంటల పని దినంలో, 8 గంటల పని దినంలో కన్నా శ్రమ తీవ్రత ఘోరంగా వుంటుంది. యజమానులు ఉత్పత్తి సాధనాలను, ఎప్పటికప్పుడు మార్చివేసి, ఉద్యోగులు (కార్మికులు) సృష్టించే అదనపు విలువని పెద్ద ఎత్తున గుంజు కోగలుగుతారు. 12 గంటల పని దినంలో వుండే శ్రమ తీవ్రత, మార్క్స్ తన ‘కాపిటల్’ పుస్తకం లో చెప్పినట్టు ‘‘అది కార్మికుని వాస్తవ ఆయుష్షును తగ్గించడం ద్వారా ఒక నిర్ణీత కాల పరిమితిలో అతని ఉత్పత్తి కాలాన్ని పొడిగిస్తుంది.’’ అది క్రమంగా ‘‘అకాల అశక్తతనీ, మరణాన్నీ ఉత్పత్తి చేస్తుంది.’’ కాబట్టి, కార్మికులు 8 గంటల పనిదినం అనే నియమాన్ని యజమానులు కచ్చితంగా అమలు పరచాలని డిమాండు చేయడమే తాత్కాలిక పరిష్కారం. ఇంటి పని అనేది ఇప్పటికీ ప్రధానంగా స్త్రీల బాధ్యతగానే వుంది కాబట్టి, 12 గంటల పని దినం వల్ల, బైటికి వెళ్ళి పనులు చేసే స్త్రీల మీద, శారీరకం గానూ, మానసికంగానూ ఒత్తిడి పెరుగుతుంది. ఆ స్త్రీలు పిల్లలకెప్పుడు తిండి పెడతారు? పిల్లల్ని ఎప్పుడు బడికి పంపుతారు? ఇంట్లో వుండే వృద్ధుల్ని ఎలా చూసుకుంటారు? రోజుకి 12 గంటల చొప్పున కాక, 24 గంటల చొప్పున అయితే, 2 రోజుల్లోనే కార్మికులు ఇళ్ళకు వెళ్ళకుండా 48 గంటలు పని ఇచ్చేస్తారు గదా! అది యజమానులకు ఎంత మేలు! స్త్రీలు నాయకత్వ స్థానాలలోకి ఎదగడం అంటే, ఉద్యోగాలలో, పని స్థలాల్లో, శారీరక శ్రమలు చేసే వారిపైనా, కొన్ని రకాల మేధా శ్రమలు చేసే వారి పైనా‘అధికార’ స్థానాల్లో వుండడమే! ఇప్పుడు ఆ స్థానాల్లో మొగవాళ్ళే ఎక్కువగా వున్నారు కాబట్టి. ఆ అధికార స్థానాల్లో, పురుషులకైనా, స్త్రీలకైనా ‘పర్యవేక్షణ’ అనే సహజంగా అవసరమయ్యే పనీ వుంటుంది. ‘పెత్తనం’ అనే అసహజ కార్యమూ వుంటుంది. పర్యవేక్షణ శ్రమలు చేసే అవకాశం కోసం స్త్రీలు డిమాండు చెయ్యవచ్చును. పెత్తనం శ్రమ చేసే అవకాశం ఎవ్వరికీ వుండకూడదు. కానీ, ‘తప్పుడు సామాజిక సంబంధాల’(‘‘ఫాల్టీ సోషల్ రిలేష¯Œ ్స’’) వల్ల ఆ స్థానాలు అవసరం అయ్యాయి. స్త్రీ–పురుష సమానత్వం కోసం స్త్రీలూ, పురుషులూ కృషి చేయవలిసింది, సమసమాజం కోసమే! అంటే, స్తీలకీ, పురుషులకీ ఇద్దరికీ ఇంటి పనీ, ఇద్దరికీ బైటి పనీ అనే శ్రమ విభజన అమలు జరిగే సమాజం కోసం కృషి చెయ్యాలి. భిన్నంగా ఉంటుందని ఊహించలేం ఆడవాళ్ల జీవితాలు ఎన్నో సమస్యలతో ముడిపడి ఉంటాయి. ఇంటి, వంట పని దగ్గర్నుంచి భర్తకు, పిల్లలకు లంచ్ బాక్స్‌లు సర్దివ్వడం వరకు ఒత్తిడి అంతా ఆడవాళ్లే భరించాల్సి వస్తోంది. కాబట్టి పన్నెండు గంటల ఆఫీస్ పనివేళల వల్ల రోజూ వారి జీవితం మరింత భారమవుతుంది. లాక్డౌన్ టైమ్‌లో మహిళల మీద పెరిగిన హింసను గమనిస్తే వారానికి మూడు సెలవులు ఆ హింసకు భిన్నంగా గడుస్తాయని ఊహించలేం. అలాగని పన్నెండు గంటల సమయాన్ని ఆఫీస్‌కూ వెచ్చించలేరు కదా. ఇంటి, వంట పనిలో మగవాళ్లు విధిగా భాగస్వాములైతే తప్ప మహిళలపై భారం, హింస తగ్గే సూచనలు లేవు. మారిన కాలానికి అనుగుణంగా మగవాళ్ల మనస్తత్వం మారకుండా ఎంతకాలం నిర్లజ్జగా, స్తబ్ధుగా, కటువుగా ఉంటుందో అంతకాలం స్త్రీ, పురుషుల సంబంధాలు హింసాపూరితంగానే ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఈ కోణంలో ఆలోచన చేయకుండా తెచ్చే ఎలాంటి పాలసీలైనా మహిళా సాధికారతకు అడ్డంకులే తప్ప వాళ్ల లీడర్షిప్ను పెంచే ప్రయత్నాలు కావు. – అంకురం సుమిత్ర, సామాజిక కార్యకర్త వలంటరీగా ఇంటికి పంపించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ ప్రతిపాదన వింటుంటే ఆ మధ్య జరిగిన ఓ సంఘటన గుర్తొస్తోంది. ఆడవాళ్లు ఆటోలు నడుపుతుంటే మేల్ ఆటోడ్రైవర్లంతా స్ట్రయిక్ చేశారు. ఇదొక్కటే కాదు గ్లోబలైజేషన్ తొలినాళ్లనాటి సంఘటనలూ గుర్తొస్తున్నాయి. అప్పుడూ ఇంతే.. అసంఘటిత రంగంలో ఉన్న ఆడవాళ్లంతా పనులు మానేసేట్టు చేశారు. దానికి అతీతంగా ఏమీ ఉండబోదు ఈ పన్నెండు గంటల పనివేళలు, మూడు రోజుల సెలవు దినాల ప్రతిపాదన. ఆర్గనైజ్డ్ సెక్టార్లోంచి కూడా మహిళలను వలంటరీగా ఇంటికి పంపించే ప్రయత్నం ఇది. మళ్లీ మహిళలను నాలుగు గోడలకే పరిమితం చేసే కుట్ర ఇది. ఎన్టీఆర్ ఇలాగే ఇష్టం వచ్చినట్టు పనిగంటలను మార్చాడు. ప్రభావం ఆడవాళ్ల మీదే పడింది. ఇప్పుడూ అలాగే ఉంటుంది. కుటుంబంలోని స్త్రీ, పురుషుల మధ్య ఎలాంటి అవగాహన, అండర్స్టాండింగ్ పెంచే వాతావరణం కల్పించకుండా ఇలాంటి చట్టాలు తెస్తే బలయ్యేది మహిళలే. పురుషాధిపత్య మైండ్‌సెట్‌ను మార్చకుండా నాయకత్వం దిశగా మహిళలు నడవాలి అనడం మీనింగ్ లెస్. – కొండవీటి సత్యవతి, భూమిక ఎడిటర్ మానవ హక్కుల ఉల్లంఘనే.. పన్నెండు గంటల పనివేళలు, మూడు రోజుల సెలవులు అనేది కచ్చితంగా రాంగ్ డైరెక్షనే. ఉద్యోగినులకే కాదు, ఇంట్లో ఉన్న స్త్రీలకూ ఇది భారమే. నిజానికి ఇప్పుడున్న వారానికి 48 గంటల పనివేళలన్నదే చాలా బర్డెన్. దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి కాని రోజులో శ్రమ భారాన్ని పెంచే ప్రయత్నం ఏంటి? ఇదంతా ఉద్యోగుల కోణంలోంచి జరుగుతున్న మేలు కాదు.. యాజమాన్యాలకు చేయాలనుకున్న మేలుగానే అనిపిస్తోంది. ఒకరంగా ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ప్రభావం తప్పకుండా మహిళ మీదే పడుతుంది. మహిళలు నాయకత్వం వైపుగా రావడానికి సహజంగా ఉండే అడ్డంకులే సవాలక్ష. వాటి దృష్ట్యా మహిళలకు వెసులుబాటు కల్పించాల్సింది పోయి ఇలాంటి ప్రతిపాదనలతో మరింత క్లిష్టం చేస్తున్నాం. ఈ ప్రతిపాదన ఆప్షన్ అంటున్నారు కాని ఒకసారి మొదలైతే అది ఆప్షన్‌గా ఉండదు. అనివార్యంగా మారుతుంది. తప్పనిసని అవుతుంది. ఈ సందర్భంగా గృహిణుల శ్రమనూ చర్చించాలి. – విస్సా కిరణ్ కుమార్, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు. లీడర్షిప్ ప్రతిబంధకాలు ఇప్పటికే వర్క్‌ప్లేస్‌లో ఉన్న సెక్సువల్ హెరాస్మెంట్స్కి ఈ పని గంటల పెంపు కూడా తోడైతే ఆ స్ట్రెస్ తట్టుకోలేక మహిళలు ఉద్యోగాలు మానేసే అవకాశాలే ఎక్కువ. ఇంట్లో ఆడవాళ్ల పనినీ అన్‌పెయిడ్ లేబర్‌గా చూస్తున్నాం. ఆఫీస్ పని చేసినా ఇంటి పనీ ఆమె బాధ్యతే అన్నట్టుగా ఉంటుంది మన ధోరణి. ఈ క్రమంలో ఈ ప్రపోజల్, రిఫార్మ్స్ అన్నీ కూడా విమెన్ లీడర్షిప్కు ప్రతిబంధకాలుగా ఉంటున్నాయే తప్ప వాళ్లను ప్రోత్సహించేలా ఉండట్లేదు. ట్వల్వ్ అవర్స్ వర్కింగ్ అనేది అయితే కచ్చితంగా కంపెనీలకు లాభమయ్యేదే. – స్వేచ్ఛ, న్యాయవాది ప్రైవేట్ యాజమాన్యాలకు ఆహ్వానం ఈ ప్రతిపాదన చాలా అశాస్త్రీయమైంది. ఇది ప్రైవేట్ యాజమాన్యాలకు ఆహ్వానంగా ఉందే తప్ప ఉద్యోగులకు ఒరగబెట్టేదేం లేదు. ముఖ్యంగా మహిళల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వాళ్ల మానసిక, శారీరక అరోగ్యాన్ని దెబ్బతినే ప్రమాదం ఉంది. రోజూ పన్నెండు గంటలు ఆఫీస్ పనితోనే సరిపోతే మిగిలిన వ్యక్తిగత పనుల సంగతేంటి? వాటికి వాళ్లెప్పుడు సమయం వెచ్చించాలి? అలాగే భద్రతా ప్రశ్నార్థకమే. – గౌతమ్, న్యాయవాది -
వారానికి 3 రోజులు సెలవులిస్తే..
సాక్షి, న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఓ చర్చ జరుగుతోంది. కేంద్రం కార్మిక చట్టాలను మార్చి.. ఆరు రోజుల పని దినాలను నాలుగు రోజులకు కుదించనుంది అనేది ఈ చర్చల సారాంశం. ఇది ఇంకా ప్రతిపాదనలోనే ఉంది. అమలు కూడా అంత తేలక కాదు. పైగా ఈ నిర్ణయం తప్పకుండా అమలు చేయాలని ఒత్తిడి తేవడానికి వీలు లేదు. సంస్థల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇది జరగడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఈ లోపు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏ దేశాల్లో ఇలాంటి నిర్ణయం అమల్లో ఉంది.. అక్కడ వచ్చిన మార్పులు ఏంటి.. దీని వల్ల వచ్చే నష్టాలు ఏంటనే తదితర అంశాల మీద ఓ లుక్కేయండి.. ఐదు రోజుల పని.. 2 రోజుల రెస్ట్ ప్రస్తుతం మన దేశంలో ఎక్కువగా ఐటీ రంగంలో ఈ విధానం అమల్లో ఉంది. వారానికి ఐదు రోజులు పని చేస్తే.. రెండు రోజులు వీకెండ్. బ్యాంక్ ఉద్యోగులకు నెలలో రెండు సార్లు ఇలాంటి అవకాశం లభిస్తుంది. అయితే తొలత ఈ విధానాన్ని ఓ అమెరికన్ ఫ్యాక్టరీ అమల్లోకి తెచ్చింది. మతపరమైన కారణాల వల్ల 1908లో అమెరికన్ ఫ్యాక్టరీ అయిన న్యూ ఇంగ్లాండ్ మిల్లు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. వారంలో ఐదు రోజులు పని చేస్తే.. శని, ఆదివారాలు రెస్ట్. కార్మికులు చర్చికి వెళ్లడానికి వీలుగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకుంది. పని గంటలు తగ్గించిన దేశాలు ఫ్రాన్స్: 20 ఏళ్ల క్రితం ఫ్రాన్స్ పని గంటలు తగ్గిస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దేశ పౌరులు పని-వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే విమర్శకులు ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. పని గంటలు తగ్గించడం వల్ల ఫ్రెంచ్ కంపెనీల్లో పోటీతత్వం తగ్గిందని విమర్శించారు. నెదర్లాండ్స్: నెదర్లాండ్స్ పని గంటలను భారీగా తగ్గించింది. ఈ మేరకు 2000 సంవత్సరంలో ఓ చట్టం చేసింది. దీని ప్రకారం నెదర్లాండ్స్‌లో వారానికి 29 గంటలు మాత్రమే పని చేస్తే చాలు. న్యూజిలాండ్, ఫిన్లాండ్: ఇరువురు దేశాధ్యక్షులు తక్కువ పని గంటల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. మన దగ్గర పరిస్థితి మన దేశంలో వారానికి 48 గంటలు పని చేయాలి. దీని ప్రకారం వారానికి ఆరు రోజుల పని చేస్తే.. రోజుకు 8 గంటలు వర్క్ చేయాలి. ఒకవేళ కేంద్రం వారానికి నాలుగు పని దినాల చట్టం అమలు చేస్తే.. అప్పుడు రోజుకు 9.6 గంటలు పని చేయాల్సి ఉంటుంది. వారానికి నాలుగు పని దినాలు-ప్రయోజనాలు పని దినాలను తగ్గించి.. వర్క్ అవర్స్‌ను పెంచే అంశం మీద అనేక పరిశోధనలు జరిగాయి. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని సదరు సర్వేలు వెల్లడించాయి. తక్కువ పని దినాల వల్ల ఉత్పత్తి పెరగుతుంది.. ఉద్యోగుల ఆరోగ్యం బాగుంటుంది.. కంపెనీకి- ఎంప్లాయికి మధ్య బంధం బలపడుతుంది.. ఫలితంగా ఎక్కువ రోజులు ఒకే కంపెనీలో కొనసాగే అవకాశం ఉంటుందని సర్వేలు వెల్లడించాయి. ఇక విద్యుత్ వినియోగం 23 శాతం, పేపర్ ప్రింటింగ్ 59శాతం తగ్గుతుందని సర్వే తెలిపింది. నష్టాలు పని రోజులు తగ్గుతాయి.. కానీ వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి. దీని వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. ఇది అన్ని వ్యాపారాలకు వర్తించదు. రెస్టారెంట్, మీడియా వంటివి రోజు నడవాల్సిందే. అలాంటప్పుడు వీటిల్లో పని చేసే వారికి వారానికి మూడు రోజులు సెలవు ఇవ్వాలంటే ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవాలి.. షిఫ్ట్‌లు కేటాయించడం కూడా కష్టం అవుతుంది. నగరాల వారిగా సంవత్సరానికి సగటు పని గంటలు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతీయులు సంవత్సరంలో అత్యధిక గంటలు పని చేస్తున్నారని సర్వేలు తెలుపుతున్నాయి. మన దగ్గర ఓ ఉద్యోగి ఏడాదికి సగటున 2,117 గంటలు పని చేస్తున్నాడు. దుబాయ్‌లో ఇది 2,323 గంటలు, లండన్‌లో 2,003 గంటలు, టోక్యోలో 1,997 గంటలు, పారిస్‌లో 1,663 గంటలుగా ఉంది. చైనాలో కూడా ఏడాదికి సగటు పని గంటలు మన కన్నా తక్కువే. బీజింగ్‌లో ఒక ఉద్యోగి ఏడాదికి సగటున 2,096 గంటలు పని చేస్తున్నాడు. ఇక మనదగ్గర ముంబైలో ఓ ఉద్యోగి సగటున ఏడాదికి 2,691 గంటలు పని చేస్తుండగా.. ఢిల్లీలో 2,511 గంటలు వర్క్ చేస్తున్నాడు. చదవండి: ఇక ‘ఓవర్‌టైమ్’కి వేతనం.. ఈ సడలింపులు ఎవరికి ప్రయోజనకరం? -
ఇక ‘ఓవర్‌టైమ్’కి వేతనం..
న్యూఢిల్లీ: ఇక మీదట వారానికి నాలుగు రోజులే పని దినాలుగా తీసుకురావాలని భావిస్తోన్న కేంద్రం కార్మిక శాఖ మరో నూతన చట్టం తీసుకురానుంది. దీని ప్రకారం కార్మికులు కంపెనీలో పనివేళలకు అదనంగా(ఓటీ) పని చేస్తే.. అందుకు వేతనం చెల్లించాలనే కొత్త నిబంధనను పరిశీలిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీని అమలుకు సన్నాహాలు చేస్తోంది. హిందూస్తాన్ టైమ్స్ తాజా రిపోర్టు ప్రకారం సామాన్యంగా పనివేళలు ముగిసిన తర్వాత ఒక కార్మికుడు 15 నిముషాలు అదనంగా పనిచేస్తే దానికి కూడా సదరు కంపెనీ వేతనం చెల్లించాలని ఈ చట్టం చెబుతోంది. ఈ విధంగా కేంద్రం కొత్త నిబంధనలు, చట్టాల ద్వారా కార్మికులకు కొంత పని ఒత్తిడి తగ్గించడంతోపాటు, ఉత్పాదకత పెరిగే దిశగా ప్రోత్సహించాలని చూస్తోంది. (చదవండి: ఇక వారానికి నాలుగే పనిరోజులు!) -
ఇక వారానికి నాలుగే పనిరోజులు!
న్యూఢిల్లీ: ఇక మీదట వీకెండ్ అంటే రెండు రోజులు కాదు. మూడు రోజులు.. ఎంచక్కా వారానికి మూడు రోజులు రిలాక్స్ అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. అలాగని పనిగంటలు తగ్గిపోతాయని అనుకోవద్దు. మిగిలిన నాలుగు రోజులు ఊపిరి సలపకుండా పనిచేయాల్సి ఉంటుంది. వారంలో నాలుగు రోజులు పనిదినాలుగా మార్చుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు అనుమతినివ్వడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి కొత్త కార్మిక కోడ్లపై కేంద్ర కార్మిక ఉపాధి శాఖ కసరత్తు చేస్తోంది. అయితే వారానికి 48 గంటల పని విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ కంపెనీలు వారానికి మూడు రోజులు వీకెండ్ సెలవులుగా ఇస్తే, నాలుగు రోజులు పనితో ఉద్యోగులకు ఊపిరి కూడా సలపదు. రోజుకి 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ‘‘కంపెనీలు వారానికి మూడు రోజులు సెలవు ఇస్తే, మిగిలిన నాలుగు రోజులు రోజుకి 12గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల అనుమతితోనే ఈ మార్పులు చెయ్యాలి. ఈ విషయంలో ఉద్యోగులు, యాజమాన్యాలపై బలవంతం ఉండదు. కేవలం వారికి ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా పని సంస్కృతిలో మార్పులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాం’’అని కార్మిక ఉపాధి శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర చెప్పారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నిబంధనల మేరకు వారానికి 48 గంటలు పని చెయ్యాలి. అంతకంటే ఎక్కువగా పని చేయించుకోవడం నిబంధనలకు వ్యతిరేకం. మన దేశంలో సాధారణంగా రోజుకి ఎనిమిది గంటలు చొప్పున వారానికి ఆరు రోజులు పని దినాలుగా ఉన్నాయి. సాఫ్ట్ట్వేర్ కంపెనీలు మాత్రమే శని, ఆదివారాలు సెలవు ఇస్తున్నాయి. ఈ కొత్త కార్మికుల కోడ్ అమల్లోకి వస్తే ఏ కంపెనీ అయినా తమ ఉద్యోగుల అనుమతితో వారానికి నాలుగు రోజుల పనిదినాల్ని అమల్లోకి తేవచ్చు. దీంతో పాటు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేలా కూడా కార్మిక కోడ్స్‌లో మార్పులు తీసుకురానున్నారు. 40% పెరిగిన ఉత్పాదకత 2019లో జపాన్‌లో మైక్రోసాఫ్ట్ 4రోజుల విధానాన్ని ప్రయోగాత్మకంగా తెచ్చింది. 4 రోజులు పని చేయడం వల్ల ఆ కంపెనీ ఉత్పాదకత ఏకంగా 40శాతం పెరిగింది. కుటుంబసభ్యులతో కలిసి మూడు రోజులు గడపడం వల్ల మిగిలిన రోజుల్లో రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేశారు. ఇలా చేయడం వల్ల కంపెనీలకు కూడా డబ్బులు ఆదా అవుతాయి. విద్యుత్ ఇతర ఖర్చులు బాగా కలిసొచ్చి ప్రతీ ఏడాది కంపెనీ టర్నోవర్‌లో 2% మిగులుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేసింది. అయితే కేవలం నాలుగు రోజులు పని చేస్తే వినియోగదారుల అంచనాలకు తగ్గట్టుగా పని జరగదన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. మరోవైపు జర్మనీలోని అతి పెద్ద ట్రేడ్ యూనియన్ ఐజీ మెటాల్ ఫోర్ డే వీక్ కోసం గత ఏడాది పిలుపునివ్వడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మన దేశంలో ఈ విధానం అమలు చేయడానికి మరో అయిదేళ్లు పడుతుందన్న అంచనాలున్నాయి. -
ఏపీ: పాఠశాలల పనివేళల్లో మార్పులు
సాక్షి, అమరావతి: పాఠశాలల వేళలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఉన్న పాఠశాలల సమయాల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ప్రాథమిక పాఠశాలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వహణ సమయం మార్పు చేశారు. (చదవండి: స్కూళ్లలో పిల్లల హాజరుపై దృష్టి) మన బడి నాడు–నేడు, మధ్యాహ్న భోజన పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలోని పాఠశాలలన్నీ ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం కావాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉదయం వేళ సాధ్యమైనంత త్వరగా స్కూళ్లలో బోధన ప్రారంభించడం మంచిదని సూచించారు. ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం బాగా ఉంటుందని, వారి మెదడు కూడా విషయాలను శీఘ్రంగా గ్రహించగలుగుతుందని, ఆ సమయంలో పాఠ్యబోధన సాగిస్తే పిల్లలు ఆయా అంశాలను త్వరితంగా, లోతుగా అవగాహన చేసుకోగలుగుతారన్నారు.(చదవండి: సీఎం జగన్ ఆదేశాలు: వైద్యురాలికి చికిత్స) ప్రపంచంలో పాఠశాలలన్నీ ఉదయం 8 లేదా 8.30 గంటలకల్లా ప్రారంభమవుతున్నాయని, అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఆలస్యంగా 9.30కు ప్రారంభం కావడం వల్ల అనుకున్న ఫలితాలను సాధించడానికి వీలుండదన్న చర్చ జరిగింది. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని పరిష్కరించుకొని రాష్ట్రంలో కనీసం 9 గంటలకల్లా స్కూళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
ఏపీలో రూ.8,000 కోట్లతో ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే ఆర్థిక ఏడాదిలో నిరుపేద కూలీలకు రూ.8,000 కోట్ల మేర పనులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో 2021-22 ఉపాధి హామీ లేబర్ బడ్జెట్ రూపకల్పనకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కూలీలకు ఏడాది మొత్తంలో 30 కోట్ల పనిదినాలు కల్పించేలా గ్రామాలు, జిల్లాలవారీగా నెలవారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ప్రతి గ్రామంలో లేబర్ బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ఆరంభమైంది. నవంబరు 15వతేదీలోగా వీటిని సిద్ధం చేసి అదే నెల 30వతేదీ కల్లా గ్రామ పంచాయతీల అనుమతి తీసుకుంటారు. డిసెంబరు నెలాఖరు కల్లా గ్రామాల వారీగా ప్రణాళికలను కలెక్టర్లు ఆమోదిస్తారు. ఉపాధి హామీ లేబర్ బడ్జెట్ రూపకల్పనకు ప్రస్తుతం అధికారులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వారం పది రోజుల్లో గ్రామ స్థాయి వరకు శిక్షణ పూర్తి కానుంది. సచివాలయాల భాగస్వామ్యం.. ‘గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి’ ప్రణాళికలు అనే నినాదంతో ఉపాధి హామీ లేబర్ బడ్జెట్ రూపకల్పనలో గ్రామ సచివాలయాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యలను చేసింది. వలంటీర్లతో పాటు గ్రామ సచివాలయంలో పనిచేసే వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, మత్స్య సహాయకుల సహాయంతో ఉపాధి హామీ ద్వారా చేపట్టే అవకాశం ఉన్న పనులను గుర్తిస్తారు. వ్యవసాయం, అనుబంధ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ చిన్న నదుల పునరుజ్జీవం, చెరువుల్లో పూడికతీత, హార్టికల్చర్, ప్లాంటేషన్, సేద్యపు నీటి కుంటలు, గిరిజన ప్రాంతాల్లో ఆర్వోఎఫ్ఆర్ భూముల సమగ్ర అభివృద్ధి తదితర పనులను వచ్చే ఆర్ధిక సంవత్సరంలో పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించారు. (చదవండి: ఆపద సమయంలో ప్రభుత్వాస్పత్రులే అండ..!) ప్రజలకు ఉపకరించే స్థిరాస్తి కల్పన పనులు గుర్తించాలి ఏడాది పొడవునా కూలీలకు నిరంతరాయంగా పనులు కల్పించేందుకు తగినన్ని పనులను లేబర్ బడ్జెట్ ప్లానింగ్ సమయంలో గుర్తించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. 2021-22 ఉపాధి హామీ లేబర్ బడ్జెట్ తయారీ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాలను మంగళవారం ఆయన విజయవాడలో ప్రారంభించారు. రెండు రోజుల పాటు వీటిని నిర్వహించనున్నారు. ప్రాంతం, సీజన్‌ను బట్టి ఉపాధి హామీ పనులను ఎంపిక చేయాలని సూచించారు. ప్రజలకు ఉపకరించే స్థిరాస్తుల కల్పన పనులను చేపట్టాలన్నారు. వినూత్న పనులకు ప్రణాళికలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 2021- 22లో పేదలకు 30 కోట్ల పనుల కల్పించాలంటే 45 కోట్ల పనిదినాలకు సరిపడా పనులను గుర్తించాలన్నారు. ప్రణాళిక సమయంలోనే జాబ్ కార్డులు లేని కూలీలను గుర్తించి జారీ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్లు శివప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: పోర్టబులిటీ.. ‘వలస’పాలిట పెన్నిధి) -
వివాదాస్పద ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన సర్కార్
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కార్మికుల పనిగంటలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులపై అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో సర్కార్ వెనక్కి తగ్గింది. సాధారణంగా కార్మికులు 8 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. దీనిని సవరిస్తూ యోగి సర్కార్..రోజుకు 12 గంటలు పనిచేయాల్సిందిగా వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. (లాక్డౌన్: సీఎం యోగి కీలక నిర్ణయం ) కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు నాలుగు కార్మిక చట్టాలను మినహాయించి అన్నింటినీ సవరించాలని ఇటీవలె యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. వ్యాపార రంగాలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని కార్మిక చట్టాల పరిధి నుంచి వ్యాపారాలకు మినహాయింపు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిలో భాగంగానే కార్మికుల పని గంటలు పెంచింది. కాగా, తాజా హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పనిగంటలు పెంచుతూ తీసుకున్న నిర్ణయీన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. (గృహ రుణాలపై వడ్డీ తీసుకోకూడదు: ప్రియాంక ) -
లాక్డౌన్ 2.0 : ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి మే 3 వరకూ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం పొడిగించడంతో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నిబ్యాంకుల్లో బ్యాంకింగ్ వేళలను ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకూ కుదించిన క్రమంలో ఏప్రిల్ 30 వరకూ ఇదే సమయాన్ని పాటించాలని నిర్ణయించింది. మే 1 నుంచి మే 3 వరకూ మూడు రోజుల వరస సెలవుల అనంతరం మే 4న బ్యాంకులు తిరిగి ప్రారంభమయ్యే నాటికి బ్యాంకుల పనివేళలపై నిర్ణయాన్ని సమీక్షిస్తామని పేర్కొంది. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు ఈనెల 7 నుంచి 17 వరకూ అన్ని నియంత్రిత మార్కెట్లలో పనివేళలను ఆర్బీఐ గతంలో సవరించగా, ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగించిన క్రమంలో సవరించిన పని గంటలను కొనసాగించాలని నిర్ణయించామని ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్ -
ఇక నాలుగు రోజులే పని దినాలు
ప్రస్తుతం అమల్లో ఉన్న వారానికి ఐదు రోజుల పనిదినాలను నాలుగు రోజులకు కుదిస్తానని ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మేరిన్ సోమవారం ప్రకటించారు. కార్మికులు తమ కుటుంబాలతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఈ నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆమె చెప్పారు. పైగా రోజుకు ఆరు గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఎనిమిది గంటల పని వేళలు అమల్లో ఉన్నాయి. 34 ఏళ్ల సన్నా మేరిన్ ప్రపంచంలోనే పిన్న వయస్సుగల ప్రధాన మంత్రి. మహిళలే నాయకత్వం వహిస్తున్న మరో నాలుగు రాజకీయ పార్టీలతో కలిసి ఆమె సంకీర్ణ ప్రభుత్వానికి సారధ్యం వహిస్తున్నారు. మిగతా మూడు పార్టీలకు నాయకత్వం వహిస్తోన్న మహిళలు 35 ఏళ్ల లోపువారే అవడం మరో విశేషం. మేరిన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు దేశ రవాణా మంత్రిగా పనిచేశారు. కార్మికులు కుటుంబ సభ్యులు మరింత సమయం గడపడంతోపాటు జీవితానికి సంబంధించిన సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నా మేరిన్ తెలిపారు. తమ నిర్ణయం వల్ల కార్మికులు మరింత చురుగ్గా పనిచేయడం వల్ల ఉత్పాదకత పెరుగుతుందని భావిస్తున్నట్లు ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే అమల్లోకి రానున్న నాలుగు రోజుల పని దినాల పట్ల వామపక్ష పార్టీలు హర్శం వ్యక్తం చేశాయి. -
రోజుకు 9 పనిగంటలు.. కనీసవేతనం మాత్రం?
న్యూఢిల్లీ: కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికులు చేస్తున్న 8 గంటల పని ఇక నుంచి 9 గంటలుగా మారనుంది. ఇప్పటికే పలు ఫ్యాక్టరీలు కార్మికులతో 9 గంటల పని చేయిస్తున్నాయి. దేశంలో 9 గంటల పని దినాన్ని ప్రవేశపెట్టే క్రమంలో భాగంగా కేంద్రం నిబంధనలు జారీ చేసింది. భారత ప్రభుత్వం వారంలో ఒక రోజు సెలవు దినంతో రోజుకు 9 పని గంటలు చేయాలనే ప్రతిపాదనను డ్రాఫ్ట్ వేజ్ రూల్స్‌లో తీసుకొచ్చింది. అయితే.. కనీస వేతనం ఎంత ఉండాలనేదానిపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులో వేతనాలు నిర్ణయించడానికి ఆరు ప్రమాణాలను సూచించడం మినహా చాలా వరకు పాత నిబంధనలను ముసాయిదా పునరుద్ఘాటించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు, కార్మికులు తమ అభిప్రాయాల్ని తెలిపేందుకు ఓ వీలు ఉంది. ఈ నెలాఖరులోగా rajiv.ranja76@gov.in, malick.bikash@gov.in ఈ-మెయిళ్లకు తమ అభిప్రాయాలు పంపొచ్చు. పని గంటలు పెంచినంత మాత్రాన శాలరీలు పెరుగుతాయన్న గ్యారెంటీ లేదు. అందువల్ల కేంద్రం నిర్ణయాన్ని ఉద్యోగులు, కార్మికులు వ్యతిరేకించే అవకాశాలున్నాయి. వారి అభిప్రాయాల్ని లెక్కలోకి తీసుకొని కేంద్రం ఫైనల్ నిర్ణయం తీసుకునే వీలుంది. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులకు కలిపి రోజుకు కనీసం 2700 కేలరీల ఆహారం, ఏడాదికి 66 మీటర్ల వస్త్రం ప్రామాణికంగా నిర్ణయించనుంది. ఈ రెండిటికీ అయ్యే ఖర్చులో 10 శాతాన్ని ఇంటి అద్దెగా, 20 శాతాన్ని ఇంధనం, విద్యుత్తు ఇతర ఖర్చులుగా లెక్కించనుంది. కనీస వేతనంలో 25 శాతం పిల్లల విద్య, వైద్యం, వినోదం, ఇతర ఖర్చుల కింద తీసుకుని నిర్ణయించాలని నిబంధనల్లో కార్మికశాఖ పేర్కోంది. కాగా, 1957 తొలిసారి కనీసం వేతనం లెక్కించిన విధానమే ఇప్పటికీ అమలు చేస్తుండటం గమనార్హం. అయితే, ఈ లెక్కలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంచాలనే అంతర్గత కమిటీ సూచించింది. వర్కర్, భాగస్వామి, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు మొత్తం ఆరుగురిని యూనిట్‌గా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. -
ఆఫీస్‌లో ఎక్కువ పనిచేస్తే.. ఇక అంతే!
జపాన్... పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడి. అంతటి భయంకర దాడికి దేశం చిన్నాభిన్నమైనప్పటికీ... జపనీయులు ఎంతో మనోధైర్యంతో తమ దేశాన్ని మళ్లీ నిలబెట్టుకున్నారు. తమ జీవనశైలితో ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఎంతో నిబద్ధతో పనిచేసే జపనీయులు విశ్రాంతి లేకుండా పనిచేస్తూ... తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు... అక్కడి ప్రభుత్వం రొటీన్‌కు భిన్నంగా కొత్త కొత్త నిబంధనలు రూపొందించి మరీ క్రమశిక్షణలో పెడుతోంది. ప్రభుత్వం చర్యలు తీసుకునేంతంగా ఆ దేశ పౌరులు ఏంచేస్తున్నారో మనమూ ఓసారి తెలుసుకుందాం... టోక్యో: జపాన్‌లోని ఓ ఆఫీస్.. డ్యూటీ షిప్ట్ ముగిసిపోయే సమయం సాయంత్రం 5 గంటలకు సరిగ్గా ఓ అలారం మోగుతుంది. ఉద్యోగులు వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని అనౌన్స్మెంట్ వస్తుంది. కాసేపయ్యాక.. ఓ డ్రోన్ ఆఫీస్ మొత్తం తిరుగుతుంది. ఎక్కడైనా ఉద్యోగులు కనిపిస్తే.. వెంటనే పై అధికారులకు సమాచారం ఇస్తుంది. వాళ్లు సదరు ఉద్యోగులకు ఫోన్ చేస్తారు. వెంటనే పని ఆపేసి వెళ్లకపోతే మెమో జారీ చేస్తామని హెచ్చరిస్తారు. విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. జపాన్‌లోని ప్రభుత్వ ఆఫీసుల్లో, చాలా కంపెనీల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అవును..జపాన్ ఉద్యోగులు చేయాల్సిన పనిగంటలకంటే ఎక్కువ గంటలు పని చేయడమేగాక... తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంతేగాక..ఉద్యోగులు ఏదైనా నిరసన తెలపాలన్నా ఎక్కువసేపు పనిచేసి నిరసన తెలుపుతున్నారు. ఇదంతా తలనొప్పిగా మారడంతో.. పనిరాక్షసులపై ప్రభుత్వానికి కఠిన నిబంధనలు అమలు చేయక తప్పడంలేదు. కరోషి.. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఒత్తిడి పెరిగి గుండెపోటు, అవయవాల ఫెయిల్యూర్ వంటివి సంభవిస్తున్నాయి. దీనిని జపాన్ భాషలో కరోషి అని పిలుస్తుంటారు. ఎన్‌హెచ్‌కే వార్తా సంస్థలో పనిచేసే ఓ మహిళా రిపోర్టర్ మివా సాడో.. వయసు 31 సంవత్సరాలు మాత్రమే. 2013 జులైలో ఆమె గుండెపోటుతో మరణించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో కరోషి వ్యాధితో చనిపోయినట్టు తేలింది. ఎన్నికల సమయం కావడంతో ఆమె 159 గంటలపాటు అదనంగా పనిచేసినట్టు తేలింది. నెలలో రెండు రోజులు మాత్రమే వీక్ ఆఫ్ తీసుకున్నారట. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ విషయం బయటికి వచ్చింది. ఇది ఒక్కటేగాక.. ఇలా జపాన్‌లో చాలామంది కరోషి వ్యాధితో మరణిస్తున్నట్లు సర్వేల్లో తేలింది. ఇలాంటి మరణాలను మొదట 1978లో అధికారికంగా గుర్తించి కరోషి అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఆఫీస్‌లోనే చనిపోయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. దీనికి ప్రధాన కారణం.. వాళ్ల పని సంస్కృతి, ఎక్కువ మొత్తంలో అందే జీతాలు. అంతేగాక ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారికి సైతం రూ.లక్షల్లో జీతాలు అందుతాయి. ఉద్యోగుల ప్రాణాలు కాపాడేందుకు.. కరోషిని గుర్తిస్తే వెంటనే సమాచారం ఇచ్చేలా 1988లోనే ఒక హెల్ప్‌లైన్ నంబరును ఏర్పాటు చేశారు. 1990–2007 మధ్య కాలంలో ఈ నంబరుకు దాదాపు రెండు వేల కాల్స్ వచ్చాయి. ఇది గుర్తించిన చాలా కంపెనీలు ఉద్యోగులకు ప్రత్యేక కళ్లద్దాలు పంపిణీ చేశాయి. అవి ఉద్యోగుల కళ్ల కదలికలను గమనించి సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తాయి. ఏకాగ్రత తగ్గినట్టు గుర్తిస్తే కాసేపు విరామం తీసుకోమంటూ వారి ఫోన్లకు సందేశం పంపిస్తాయి. అయితే 2008 నుంచి కాల్స్ రావడం కొంత తగ్గినా ఇప్పటీకి ఏడాదికి సగటున 400 కాల్స్ వస్తున్నాయి. ఈ మధ్యనే ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులను ఇంటికి పంపడానికి డ్రోన్లను రంగంలోకి దించారు. టైం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆఫీసులోనే ఉండి పనిచేస్తుంటే ఈ డ్రోన్ పసిగట్టేస్తుంది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తుంది. అధికారులు పరిశీలించి సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జపాన్ వాసుల పనితీరులో మాత్రం పెద్దగా మార్పు కనిపించడంలేదట. ఎక్కువ గంటలు పనిచేయడానికే మొగ్గు చూపి, ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు ఉద్యోగులు. చట్టపరంగా... దశాబ్దాలుగా జపాన్ను కరోషి తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు కలిసి చర్యలు చేపట్టాయి. చట్టప్రకారం నెలలో 100 గంటలకు మించి పనిచేయకూడదు. వారానికి రెండు చొప్పున వారాంతపు సెలవులు తీసేసినా రోజుకి ఐదుగంటలకు మించి పనిచేయరాదు. నిబంధనలు అతిక్రమించి ఎక్కువగంటలు పనిచేస్తే ఆ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. నిబంధనలు ఉల్లంఘించి కంపెనీలు తమ ఉద్యోగులతో ఎక్కువ గంటలు పనిచేయించినా చర్యలు తప్పవు. (సాక్షి, స్టూడెంట్ ఎడిషన్) -
పనిలోనే ఆనందం!
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా అరడజను సినిమాలు (తమిళంలో ‘ఎన్జీకే, దేవ్’ శివకార్తికేయన్‌తో ఓ సినిమా’, బాలీవుడ్లో ‘దే దే ప్యార్‌దే’, మర్జవాన్, తెలుగులో ‘వెంకీమామ’) రకుల్ ప్రీత్ సింగ్ బ్యాంక్‌లో ఉన్నాయి. రీసెంట్గా ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ సినిమాలో ఆమె శ్రీదేవి పాత్రలో కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘దేవ్, ఎన్జీకే, దే దే ప్యార్‌దే’ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇలా ఇన్ని ప్రాజెక్ట్స్ షెడ్యూల్స్, డేట్స్, ప్రమోషన్స్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? మీకు అలసటగా అనిపించదా? అన్న ప్రశ్నలను రకుల్ ముందు ఉంచితే.. ‘‘మనం చేసే పనిని ప్రేమిస్తే ఎంత కష్టమైనా సులభంగానే అనిపిస్తుంది. వర్క్ కమిట్మెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కెరీర్‌కు ప్లస్ అవుతున్నప్పుడు ఎక్కువ టైమ్ వర్క్ చేయడంలో తప్పులేదు. ఒక్కోసారి లాంగ్ జర్నీ చేసి కూడా షూటింగ్లో పాల్గొనాల్సి వస్తుంది. అయినప్పటికీ నేను ఇబ్బంది ఫీలవ్వను. ఎందుకంటే రోజులో ఎక్కువ పని గంటలు ఉండటాన్ని ఇష్టపడతాను. ఆ పనిలోనే ఆనందం వెతుక్కుంటా’’ అని పేర్కొన్నారు రకుల్. -
అనుబంధ ఉద్యోగులకు ఎస్బీఐ షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : అనుబంధ బ్యాంకుల ఉద్యోగులకు ఎస్బీఐ షాక్ ఇచ్చింది. నోట్ల రద్దు సమయంలో అదనపు పనిగంటలకు అందించిన పరిహారం వెనక్కి ఇవ్వాలని తాఖీదులు పంపడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు పనిగంటలకు పరిహారం అందిస్తామని గతంలో బ్యాంకు హామీ ఇచ్చింది. ఏప్రిల్ 1, 2017న ఎస్బీఐలో అనుబంధ బ్యాంకులు విలీనమవడం గమనార్హం. అయితే నోట్లరద్దు సమయంలో అనుబంధ బ్యాంకుల విలీనం జరగలేదని ఎస్బీఐ పేర్కొంటోంది. నోట్ల రద్దు సమయంలో ఎస్బీఐ అనుబంధ బ్యాంకులైన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్‌లకు చెందిన 70,000 మంది అధికారులు, సిబ్బంది అదనపు గంటలు పనిచేశారు. వీరికి ఓవర్‌టైమ్ చేసినందుకు ఎస్బీఐ హామీ ఇచ్చిన మేర పరిహారం చెల్లించింది. అయితే వీరు అదనంగా పనిచేసినందుకు అందుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఎస్బీఐ కోరుతుండటంతో అనుబంధ బ్యాంకుల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్‌టైమ్ చేసినందుకు ఇచ్చిన పరిహారం కేవలం తమ ఉద్యోగులకేనని, అనుబంధ బ్యాంకుల ఉద్యోగులకు ఇది వర్తించదని జోనల్ హెడ్క్వార్టర్లకు ఎస్బీఐ పంపిన సమాచారంతో ఆయా బ్యాంకుల సిబ్బంది మండిపడుతున్నారు. గతంలో తమ అనుబంధ బ్యాంకుల సిబ్బందికి చెల్లించిన పరిహారంను తిరిగి రాబట్టేందుకు చర్యలు చేపట్టాలని ఎస్బీఐ తన జోనల్ మేనేజర్లను కోరడంతో సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పరిహారం రికవరీ ఉత్తర్వులను బ్యాంకు యూనియన్లు తప్పుపడుతున్నాయి. పరిహారం వెనక్కితీసుకోవాలని చూడటం సరైంది కాదని హెచ్చరించాయి. -
పనిమంతులు ముంబైవాసులు...!
అడుగు తీస్తే మరో అడుగు పెట్టేందుకు ఖాళీ లేక కిక్కిరిసిన లోకల్ ట్రైన్లు...స్టేషన్లలో రైళ్లు ఆగినపుడు ఎక్కడానికి, దిగడానికి ఒలంపిక్ పతకం కోసమా అన్నట్టుగా పోటీపడే జనం...లక్షలాది ఉద్యోగులకు సమయానికి మధ్యాహ్న భోజనం అందించేందుకు అహోరాత్రులు శ్రమించే డబ్బా వాలాలు...వాహనాలు, మనుషులు, ట్రాఫిక్‌తో నిండిపోయిన రహదారులు... రెండుకోట్లకు పైగా ప్రజల రంగురంగుల కలల ప్రపంచం... ముంబై...! అసలు అలుపనేదే లేని, నడిరాత్రి అయినా ఎక్కడ ఆగకుండా నిరంతరం పయనిస్తూ, రాత్రిపూట కూడా విశ్రాంతి అనే మాట కూడా ఎరగని మహానగరమిది. ఉద్యోగులు అత్యధికంగా కష్టించే నగరంగా దీనిని మార్చడంలోనూ అక్కడి ఉద్యోగులు పై చేయి సాధించారు. ఇప్పుడిక్కడి ఉద్యోగులు ప్రపంచంలోనే అత్యధిక గంటలు పనిచేస్తున్న వారిగా గుర్తింపు పొందారు. ప్రపంచంలోని 77 ప్రధాన నగరాల్లో ఏడాదికి 3,314.7 గంటల పాటు పనిచేస్తున్న రికార్డ్‌తో ప్రథమస్థానంలో నిలిచారు. ఇది ప్రపంచ సగటు 1,987 గంటల కంటే ఎంతో ఎక్కువ. ముఖ్యమైన ఐరోపా నగరాలు... రోమ్–1,581, పారిస్–1,662 పనిగంటలతో పోల్చితే రెండు రెట్ల కంటే ఎక్కువే.. ముంబైలో సగటు ఉద్యోగి ఏడాదికి 3,314.7 గంటలు పనిచేస్తున్నట్లు తాజాగా స్విస్ బ్యాంక్ యూబీఎస్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 77 నగరాల్లో సగటున ఏడాదికి పనిచేసే గంటలతో పాటు వివిధ అంశాలపై జరిపిన పరిశీలనను ‘ప్రైస్ అండ్ ఎర్నింగ్స్ 2018 రిపోర్ట్’పేరిట విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి–ఏప్రిల్ మధ్యలో ఈ నగరాల్లోని 75 వేలకు పైగా డేటా పాయింట్లను సేకరించారు. ఈ మహానగరాల్లో ధరలు, ఆదాయం, కొనుగోలుశక్తి స్థాయి, తదితరాలను సూచికలుగా తీసుకుని ఈ నివేదికను రూపొందించారు. టాప్–5 నగరాలివే: 1) ముంబై–3,314.7– 2) హనోయి–2,691.4– 3) మెక్సికో సిటీ–2,622.1– 4) న్యూఢిల్లీ–2,511.4–5) బొగొటా–2,357.8 అతి తక్కువ పనిగంటల నగరాలివే:1) లాగోస్–609.4– 2) రోమ్–1,581.4–3) పారిస్–1,662.6– 4) కోపెన్‌హగన్–1,711.9–5) 1,719.6 ఏడాదికి తక్కువ సెలవులు తీసుకున్న వారిలో (సగటున 10,4 రోజులతో) కూడా ముంబైవాసులు కింది నుంచి అయిదో స్థానంలో నిలిచారు. మొదటి నాలుగుస్థానాల్లో లాగోస్, హనోయి, బీజింగ్, లాస్ఏంజిల్స్ నగరాలున్నాయి. అత్యధికంగా 37 రోజుల సెలవులతో రియాద్ నగరం అగ్రస్థానంలో నిలిచింది. మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్, బార్సిలోనా, దోహ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం స్టేటస్ సింబల్‌గా, ఖరీదైన మొబైళ్లలో ఒకటిగా పరిగణిస్తున్న ఐ ఫోన్ గీ (టెన్) ఫోన్ కొనేందుకు కైరో వాసి 1,066.2 గంటలు, ముంబై ఉద్యోగి 917.8 గంటలు, న్యూఢిల్లీ పౌరుడు 804 గంటలు పనిచేయాల్సి ఉంటుందని, అదే జూరిచ్లోనైతే 38.2 గంటలు, జెనీవాలో 47.5 గంటలు, లాస్ ఏంజెల్స్‌లో 50.6 గంటలు పనిచేయాల్సి ఉంటుందని ఆయా మహానగరాల్లో ఆర్జించే వేతనాల్లోని వ్యత్యాసాలను కూడా ఈ సర్వే ఎత్తిచూపింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సెలవు దినాల్లోనూ పని.. కారణమేంటంటే?
సాక్షి, న్యూఢిల్లీ : ఎంత తక్కువ పని గంటలుండి, అంత ఎక్కువ జీతమిస్తే ఆనందపడే వారు ఎందరుంటారోగానీ తక్కువ పని గంటలుండి ఎక్కువ సెలవులుంటే ఆనంద పడేవారు ఎక్కువే ఉంటారు. ఒకప్పుడు ఫ్యాక్టరీలలో 15, 18 గంటలు పని చేయించుకునేవారు. శారీరకంగా, మానసికంగా అన్ని గంటలు పనిచేయడం కష్టమవడంతో అమెరికాలో మేడే ఉద్యమం ద్వారా అంతర్జాతీయంగా కార్మికులకు 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. రాను, రాను సాంకేతిక పరిజ్ఞానం అభివద్ధి చెందడంతో కొన్ని రంగాల్లో పని దినాలు తగ్గుతూ సెలవు దినాలు పెరుగుతూ వచ్చాయి. కార్మికులు లేదా ఉద్యోగులు మానసికంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు ఉత్పత్తి పెరుగుతుందని భావించిన ఐటీ లాంటి కంపెనీలు ఉద్యోగులకు క్రీడల లాంటి అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తూ వచ్చాయి. రానురాను సాంకేతిక పరిజ్ఞానం మరింత పెరగడం వల్ల 2030 సంవత్సరానికి పని గంటలు వారానికి 15 గంటలకు చేరుకుంటుందని జాన్ మేనర్డ్ కీనెస్ వంటి ఆర్థిక వేత్తలు ఆశించారు. ఉద్యోగల నుంచి అధిక దిగుబడిని రాబట్టేందుకు పెట్టుబడుదారులు వారి పని గంటలను తగ్గించి, సెలవుదినాలను పెంచుతారని వారు అంచనా వేశారు. ఎందుకంటే తక్కువ పని వల్ల ఉద్యోగులు ఎక్కువ ఆరోగ్యంతో ఉంటారని వారు భావించారు. ఎక్కువ పని గంటల వల్ల ఎక్కువ మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి ఎక్కువై కార్మికులు అస్వస్థులవడం చూసి వారు అలా భావించారు. ఎక్కువ పని ఒత్తిడి వల్ల అనారోగ్యం పాలవడం నిజమేగానీ తక్కువ పని గంటల వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెప్పలేం. ఆరోగ్యంపై ఇతర సామాజిక అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. ఎక్కువ పని గంటల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువేనని కూడా అధ్యయనాల్లో తేలింది. ఈ అంశాలను పెద్దగా పట్టించుకోకుండా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుదారులు కార్మికుల నుంచి వీలైనంత ఎక్కువ పనిని రాబట్టేందుకే ప్రయత్నిస్తూ వచ్చారు. ఫలితంగా కార్మికులు సెలవుల్లో కూడా పనిచేయడం, అస్వస్థతతో ఉండి కూడా పనిచేయడం ఎక్కువైంది. ఈ అస్వస్థతతో పనిచేసే వారి సంఖ్య 2010 సంవత్సరంలో 26 శాతం ఉండగా, ఇప్పుడు 86 శాతం ఉందని ‘చార్టెట్ ఇనిస్టిట్యూడ్ ఆఫ్ పర్సనల్ అండ్ డెవలప్మెంట్’ అనే సంస్థ వెల్లడించింది. ఆశ్చర్యకరంగా సెలవు దినాల్లో పనిచేసేందకు ఎక్కువ మంది సిద్ధపడుతున్నారని, అందుకు పనిపట్ల ఉన్న అంకిత భావం కాదని, సెలవుల్లో కూడా పనిచేస్తున్నారనే గుర్తింపు కోసమని ఈ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. అయితే ఈ మనస్థత్వం ఎక్కువగా మధ్యతరగతి ఉద్యోగుల్లోనే ఉందని తెలిపింది. పని పట్ల అంకిత భావం ఉన్నట్లు కనపడకపోతే ఉద్యోగం పోతుందనే భయంతో కూడా ఎక్కువ మంది సెలవుల్లో, అనారోగ్యంతో ఉన్నప్పుడు విధులకు హాజరవుతున్నారని తెల్సింది. ఏదేమైనా ఈ పద్ధతి మారక పోతే ఎక్కువ గంటల పని వల్ల అనారోగ్యానికి గురై, మత్యువాత పడక తప్పదని ఆ నివేదిక హెచ్చరించింది. -
జాలీగా ఫోర్ డేస్ జాబ్..!
మనదేశంలో ఇటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో, అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ‘వారానికి అయిదు రోజుల పని విధానం’ (ఫైవ్ డే వీక్)లో పనిచేస్తుండడం మనకు తెలిసిందే. శని,ఆదివారాలు సెలవులు ఉండడంతో ఫైవ్ డే వీక్ ఉన్న వారిని ఒకింత ప్రత్యేకంగానే చూస్తుంటాము. అయితే మనం మరింత ఆశ్చర్యపోయేలా న్యూజిలాండ్‌లోని ఒక సంస్థ వారానికి నాలుగు రోజుల విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ విధానంలో భాగంగా మంచి ఫలితాలే వచ్చినట్టుగా ఆ సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్కడి ఉద్యోగులకు కూడా ఈ కొత్త పద్ధతి తెగ నచ్చేసిందిట. నాలుగు రోజులకు పనిచేసినందుకు అయిదురోజుల జీతం రావడం తమకు కలిసొచ్చే అంశంగా వారు పరిగణిస్తున్నారు. వారానికి నాలుగు రోజులే పని... న్యూజిలాండ్ ట్రస్టీ కంపెనీ ‘పర్పెక్చువల్ గార్డియన్’ ఈ పని విధానాన్ని అమలు చేస్తోంది. ఈ సంస్థలోని 200 మంది ఉద్యోగులు మార్చి నెల మొదలైనప్పటి నుంచి ‘ఫోర్ డే వీక్’ పనిచేస్తున్నారు. ఆరువారాల పాటు అంటే ఏప్రిల్ 15 వరకు ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా పరిశీలించాలని ఈ సంస్థ నిర్ణయించింది. ఈ గడువు ముగిశాక ఈ కాలానికి (45 రోజులకు) ఉద్యోగుల ఉత్పాదకత డేటాను ఒకచోట చేర్చి విశ్లేషిస్తారు. ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తారో లేదా అన్న విషయం జులైలో ఉద్యోగులకు తెలియజేస్తారు. లగ్జంబర్గ్‌లో అత్యధిక ఉత్పాదకత... న్యూజిలాండర్లు ఏడాదికి సగటున 1,752 గంటలు పనిచేస్తున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్, కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ)లోని సహచర సభ్యదేశాల్లోని (న్యూజిలాండ్‌తో కలుపుకుని మొత్తం 35 దేశాలు) ఉద్యోగులతో ఈ పనిగంటలు ఇంచుమించు సమానం. జర్మనీలో ఫైవ్డే వీక్‌లో భాగంగా ఉద్యోగులు 40 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. డెన్మార్క్‌లో వారానికి సగటున మహిళలు 35 గంటలు, పురుషులు 41 గంటలు పనిచేస్తుం టారు. నార్వేలో వారానికి సగటున 37,38 గంటలు పనిచేస్తారు. నెదర్లాండ్స్, మెక్సికో, కొరియా, కోస్తారికాలలోని ఉద్యోగులు కొంచెం అటు, ఇటుగా ఇన్ని గంటలే పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదకత గల దేశంగా లగ్జంబర్గ్ నిలుస్తోంది. అక్కడి ఉద్యోగులు,కార్మికులు వారానికి కేవలం 29 గంటల పాటే పనిచేస్తున్నా ఈ ఘనతను సాధించడంలో భాగం పంచుకున్నారు. మంచి ఫలితాలే వచ్చాయి... ‘ఈ ప్రయోగం ద్వారా ఆసక్తికరమైన డేటా వస్తోంది. న్యూజిలాండ్‌లోని రెండు ప్రముఖ యూనివర్సిటీల విద్యా వేత్తలతో ఈ సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం. వచ్చే ఫలితాలను బట్టి మరి కొంతకాలం ఈ విధానాన్ని కొనసాగించడంపై నిర్ణయం తీసుకుంటాం. కొందరు ఉద్యోగులు తమకిచ్చిన సమయం కంటే ముందుగానే అప్పగించిన పని ముగిస్తున్నారు. ఉద్యోగుల్లో అధికశాతం సానుకూల దృక్పథం కనిపిస్తోంది. న్యూజిలాండ్‌లో ఈ విధానం అమలయ్యేందుకు వీలుగా మేము విజయం సాధించాలని ఇక్కడివారు కోరుకుంటున్నారు. అయితే ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుగొనే అవకాశమున్న ఈ విధానాన్ని ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడం నిరుత్సాహ పరుస్తోంది’ అని ‘పర్పెక్చువల్ గార్డియన్’ సీఈఓ ఆండ్రూ బార్న్స్ పేర్కొన్నారు. ‘వారంలో అదనంగా ఒకరోజు సెలవు లభించడాన్ని ఉద్యోగులు సరిగ్గానే అర్థం చేసుకున్నారు. నాలుగు రోజుల పాటు చేస్తున్న పనిని సమర్థవంతంగా చేస్తున్నారు. సెలవుల నుంచి తిరిగి వచ్చాక సోమవారం మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మూడురోజుల వారాంతం సెలవులను బాగా ఉపయోగించుకుంటున్నారు’ అని ఆ సంస్థ ఉన్నతోద్యోగి క్రిస్టినీ బ్రదర్టన్ తెలిపారు. అదేబాటలో మరిన్ని సంస్థలు.. కొందరి ఉద్యోగులపై వారానికి 30 గంటల పనివిధానాన్ని అమేజాన్ సంస్థ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. పూర్తికాలం ఉద్యోగులకిచ్చే బెనిఫిట్స్ అన్ని వారికి కూడా ఇచ్చినా జీతం మాత్రం 75 శాతం ఇస్తారని తెలుస్తోంది. డెలాయిట్‌తో పాటు కేపీఎంజీ సంస్థ కూడా కొన్ని షరతులతో కొందరు ఉద్యోగులకు ‘ఫోర్ డే వీక్’ విధానాన్ని అమలుచేస్తోంది. గూగుల్ సంస్థ కూడా కొందరు ఉద్యోగులకు వారంలో తాము చేసే పనిలో 20 శాతం సమయాన్ని తమకు ఇష్టం వచ్చినట్టుగా గడిపేలా అవకాశం కల్పిస్తోంది. ఇలాంటి సృజనాత్మక స్వేచ్ఛ ఇవ్వడం వల్ల కొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతుందని ఈ సంస్థ భావిస్తోంది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వారానికి 40 గంటలు పనిచేస్తారా.. అయితే!
మీరు వారానికి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? 39 గంటలకు పైబడి పనిచేస్తున్నారా.. అలా అయితే మీ శారీరక, మానసిక ఆరోగ్యం రిస్కులో పడ్డట్లే. దాదాపు 80 ఏళ్ల క్రితం అంతర్జాతీయంగా వారానికి 48 గంటల పని ఉండాలన్న పరిమితిని పెట్టుకున్నారు. దాన్ని ఇప్పుడు సవరించాల్సిన అవసరం వచ్చిందని ద ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ) హెచ్చరిస్తోంది. ఆరోగ్యకరమైన జీవితం కావాలంటే మాత్రం వారానికి 39 గంటల పని పరిమితిని విధించాలని ఏఎన్‌యూ చెప్పింది. ఎక్కువ సేపు పని చేయడం వల్ల మనిషి శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తుందని, అలా పనిచేస్తే సరిగా తినడానికి, తమ గురించి తాము పట్టించుకోడానికి సమయం సరిపోదని ఏఎన్‌యూ రీసెర్చ్ స్కూల్ ఆఫ్ పాపులేషన్ హెల్త్‌కు చెందిన హువాంగ్ డిన్ తెలిపారు. పురుషులకైతే 39 గంటలు ఓకేనని, అదే మహిళలకైతే వారానికి 34 గంటలు మాత్రమే పని పరిమితి ఉండాలని ఆయన చెప్పారు. వాళ్లు కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కాబట్టి మరో ఐదు గంటలు తగ్గించాలన్నారు. ఇంతకుముందు అయితే ఆరోగ్యవంతులైన పురుషులకు వారానికి 47 గంటల పని పరిమితి విధించారని, వాళ్లు మహిళల కంటే కుటుంబ వ్యవహారాలు తక్కువ పట్టించుకోవడమే అందుకు కారణమని అన్నారు. అయితే మారుతున్న పరిస్థితుల్లో మహిళలు కూడా పురుషులతో సమానమైన నైపుణ్యాలు చూపుతున్నా.. సగటున మహిళలకు తక్కువ వేతనాలు వస్తున్నాయని డిన్ చెప్పారు. కుటుంబ బాధ్యతల దృష్ట్యా పురుషులతో సమానంగా మహిళలు కూడా పనిచేస్తే వాళ్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని వివరించారు. -
ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ గంటలు పనిచేస్తారు?
న్యూయార్క్: ప్రపంచంలో మిలీనియన్లు (2000 సంవత్సరం నాటికి యుక్త వయసు వచ్చిన వారు) బద్ధకస్తులని, వారిలో ఉత్పాదక శక్తి సన్నగిల్లుతుందని వ్యాపారవర్గాలు భావిస్తుంటాయి. కానీ ఆసియా దేశాల్లో మాత్రం మిలీనియన్లు కొద్దీ యువకులు ఎక్కువ గంటలు పని చేస్తున్నారు. వారిలో భారతీయులు అగ్రభాగాన నిలవడం విశేషం. వారానికి 40 గంటలు పనిచేయాలంటే ప్రపంచంలో మిలీనియన్లు అపసోపాలు పడుతుంటారని ఇప్పటి వరకు వ్యాపారవర్గాల్లో నెలకొన్న భావన. కానీ వారిలో మూడొంతుల మంది వారానికి 40 గంటకుపైగానే పనిచేస్తున్నారని, కొన్ని దేశాల్లో వారానికి 50 గంటలు పనిచేస్తున్నారని ఓ తాజా సర్వేలో వెల్లడైంది. భారత్‌లో 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్యనున్న యువకులు వారానికి 52 గంటలు పనిచేస్తున్నారు. చైనా, మెక్సికో, సింగపూర్ దేశాల్లో వారానికి 48 గంటలు పనిచేస్తున్నారు. జపాన్, అమెరికా దేశాల్లో మిలీనియన్లు వారానికి 45 గంటలు పనిచేస్తుండగా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో వారానికి సగటున 41 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. -
ముస్లిం ఉద్యోగులకు పని వేళల కుదింపు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు వీలుగా ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు పని వేళలను కుదించింది. అన్ని కార్యాలయాలు, పాఠశాలల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ గంట ముందుగా విధుల నుంచి వెళ్లేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు శనివారం అన్ని కార్యాలయాలకు సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా సర్క్యులర్ జారీ చేశారు. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులను ప్రభుత్వ పనిదినాలన్నింటా సాయంత్రం 4 గంటలకు విధుల నుంచి వెళ్లేందుకు అనుమతించాలని అందులో పేర్కొన్నారు. నెలవంకను బట్టి రంజాన్ మాసం ప్రారంభమయ్యే జూన్ 6 లేదా 7వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఈ వెసులుబాటును ఇస్తున్నామన్నారు. -
‘మేడే’ మోగించాలి నిరంకుశ ప్రభుత్వాలపై ‘రణభేరి’
ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం కోసం పోరాటానికి మేడే ప్రతీక. 1830 నుంచి 1850 వరకు యూరప్ కార్మికవర్గం పనిగంటల తగ్గింపునకై ప్రాణార్పణలతో పోరు చేసింది. 1850లో బ్రిటన్ ప్రభుత్వం 12 గంటల పనిదినం చట్టం చేయడం యూరప్ కార్మికవర్గానికి పర్వదినంగా మారిందంటే ఆ నాటికి పనిగంటలు ఎంత దుర్భరంగా ఉండేవో ఊహించుకోవచ్చు. యూరప్ కార్మికవర్గం పారిస్ కమ్యూన్లో ఘోరంగా దెబ్బతిన్న కాలంలో వారి పోరాట బావుటాను విశ్వవీధుల్లో ఎగరేసింది అమె రికా కార్మిక వర్గం. ఆ చరిత్రకు మరో పేరు మేడే. ఎనిమిది గంటల పరిశ్రమ, 8 గంటల విరా మం (నిద్ర), 8 గంటల వినోదం (విద్య, విజ్ఞానం, క్రీడలు వగైరా) కోసం రోజును మూడు సమ విభా గాలుగా వర్గీకరించడం ద్వారానే కార్మికుడిని కేవలం కూలీగా కాకుండా పరిపూర్ణ మనిషిగా చూడగలమ న్నది 150 ఏళ్ల క్రితం కార్మిక సంస్థల భావన. పని, నిద్ర తప్ప ఇతర అవసరాలు కూలివాళ్లకు అక్కర లేదన్న ఆనాటి అమానుష వ్యవస్థకు ఇది పూర్తి భిన్న మైన వాదన. దీంట్లోనుంచే 8 గంటల పని దినం ప్రపంచవ్యాప్తంగా క్రమంగా అమలులోకి వచ్చింది. మానవ సమాజం వందేళ్ల క్రితం నాటి ఆధునీ కరణ నుంచి యాంత్రీకరణ, సాం కేతీకరణ, కంప్యూటరీకరణ, అంత ర్జాలం ద్వారా ఎంతో ముందుకు సాగినా పరిపూర్ణ మానవుడు భావ న ఇంకా పూర్తిస్థాయిలో ఫలించ లేదు. 8 గంటల పని దినాన్ని ఆరు గంటల పనిదినంగా పురోగమించ డానికి బదులుగా, 8 నుంచి 10, 12, 14 గంటల పనిదినంవైపు నేడు అడుగులు పడుతున్నాయి. పెట్టుబడిదారీ వేతన బానిసత్వ రద్దుకోసం పోరాడ టమే తమ లక్ష్యమని, 19వ శతాబ్దంలో ఉరికంబమె క్కబోయే ముందు మేడే వీరులు అమెరికా న్యాయ స్థానంలో ప్రకటించారు. కానీ 13 దశాబ్దాల తర్వాత మళ్లీ 8 గంటల పనిదినం కోసం కార్మికవర్గం పోరా డాల్సి రావడం విషాదకరం. నేటి భారతదేశంలో 40 కోట్లకు పైగా అసంఘటిత కార్మిక వర్గానికి 8 గంటల పనిదినం అందని ద్రాక్షపండే. 8 గంటల పని నడు స్తున్న పాత పరిశ్రమల్లోనే 12 గంటలపాటు పని చేసే ఒప్పంద, పొరుగు సేవలు, వలస కార్మికులు కొత్తగా చేరుతుండటం ఒకెత్తు కా గా, ఐ.టీ, బీపీఓ వంటి అత్యాధు నిక బానిసత్వ పరిశ్రమల్లో అత్యు న్నత విద్యావంతులు 10 లేదా 12 గంటల పనిదినానికి అలవాటు పడుతుండటం మరో ఎత్తు. రాజస్థాన్ నుంచి ఆంధ్రప్ర దేశ్ వరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికచట్టాలకు తిరోగమన సవరణలు చేస్తున్నాయి. మార్చినెలలో ఏపీ శాసనసభ సమావేశాల్లో చంద్రబాబు ప్రభు త్వం ఆదరాబాదరాగా కార్మిక చట్టాల సవరణలకు దిగడం వ్యూహాత్మకమైంది. చంద్రబాబు తాను మా రిన మనిషినని చెబుతూనే పాత చీకటి చరిత్రను పునరావృతం చేస్తున్నారు. సింగపూర్, చైనా తదితర దేశాల విదేశీ పెట్టుబడుల కోసం వెంపర్లాట కోసం స్వదేశీ కార్మిక వర్గంమీద యుద్ధప్రకటన చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు తీరు కూడా ఇలాగే పోటీపడుతోంది. కార్మికుల ఆకలి కేకలు పట్టించుకో కుండా విదేశీ పెట్టుబడులతో కొత్త పరిశ్రమలకై తెగ ఆరాటపడుతోంది. తాము కార్మికవర్గ హక్కులను ఎంత ఎక్కువగా కాలరాస్తే, విదేశీ పెట్టుబడులు అం త ఎక్కువ స్థాయిలో ఇక్కడకు వస్తాయన్న తాత్విక సిద్ధాంతంతో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. రైతుల ఆత్మహత్యలు, నిర్వాసిత సమస్యలు, బలవంతపు భూసేకరణ, బూటకపు ఎదురుకాల్పు లు తదితర ప్రజావ్యతిరేక విధానాలవల్ల రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం, కూలీలు, ఆదివాసీలు, దళితులు, మత్స్యకారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నా రు. అలాంటి బాధిత వర్గాల ప్రజలకంటే కార్మిక వ ర్గం ఒకింత ఎక్కువ సమరశీలమైంది. మేడే సంద ర్భంగా కేవలం 8 గంటల పనిదినం, జీతభత్యాలు, జీవన ప్రమాణాల మెరుగుదలకే పరిమితం కాకుం డా ప్రజావ్యతిరేక ప్రభుత్వాలపై పోరుకు దిగే చారి త్రక పాత్రను పోషించేందుకు కార్మికవర్గం దీక్ష పూ నాలి. ఇదే మేడే వీరులకు నిజమైన నివాళి. (మేడే కార్మిక పోరుకు నేటికి 129 ఏళ్లు) పి. ప్రసాద్, ఐ.ఎఫ్.టి.యు జాతీయ కార్యదర్శి మొబైల్: 9490700715