న్యూఢిల్లీ:ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తికి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్‌లో పనిదినాలు ఆరు రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గిపోతుండడంపై మూర్తి ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కార్తీ చిదంబరం ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ఎన్ని గంటలు ఎక్కువ పనిచేశామన్నది ముఖ్యం కాదని, ఎంత ప్రభావవంతంగా పనిచేశామన్నది ముఖ్యమన్నారు.
‘ఎక్కువ సేపు పనిచేయడమనేది అర్థం లేనిది. ఎంత ఫోకస్‌తో పనిచేశామనేది మఖ్యం. జీవితంలో రోజువారి సమస్యలతో పోరాడే మనుషులకు వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ అనేది తప్పనిసరి. నిజానికి భారత్‌లో పనిదినాలను వారానికి నాలుగు రోజులకు తగ్గించాలి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తే చాలు’అని కార్తీ చిదంబరం తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌గొగోయ్ కూడా నారాయణమూర్తి ఎక్కువ పనిగంటల విధానంతో విభేదించడం గమనార్హం.
Working longer is meaningless, focus should be on efficiency. Daily life is as it is a struggle, battling inefficient & substandard infrastructure & amenities. Work life balance is most important for good social order & harmony. We should infact move to a 4 day working week. 12… https://t.co/EOOer6AgnK
— Karti P Chidambaram (@KartiPC) December 22, 2024
ఇదీ చదవండి: హైదరాబాద్‌పై ఇన్ఫోసిస్ మూర్తి కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment