
ఇన్ఫోసిస్ లిమిటెడ్ షేర్ ధర వరుసగా రెండు రోజుల నుంచి భారీగా పతనమవుతోంది. దాంతో కంపెనీ షేర్ హోల్డర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అందులో మేజర్ వాటాదారులుగా ఉన్న కంపెనీ ప్రమోటర్ నారాయణమూర్తి, ఆయన కుటుంబ సభ్యులకు గణనీయంగా నష్టాలు నమోదయ్యాయి. బుధవారం ఇన్ఫోసిస్ 5.49 శాతం క్షీణించి 1,569.35 వద్ద కనిష్టాన్ని తాకింది. 2024 డిసెంబర్‌లో 52 వారాల గరిష్ట స్థాయి రూ.2,006.80తో పోలిస్తే ఈ షేరు దాదాపు 22 శాతం క్షీణించింది. దాంతో మూర్తి కుబుంబానికి ఏకంగా రెండు రోజుల్లో రూ.6,875 కోట్లు నష్టం వాటిల్లింది.
అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ వార్ కారణంగా ఐటీ కంపెనీల క్లయింట్లు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. దాంతో కొన్ని బ్రోకరేజీ సంస్థలు ఇన్ఫోసిస్ స్టాక్‌ను డౌన్‌గ్రేడ్ చేయడంతో తాజా పతనం సంభవించిందని చెబుతున్నారు. కేవలం ఐటీ స్టాక్‌లే కాకుండా దాదాపు చాలా స్టాక్‌లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.
ఇదీ చదవండి: టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్!
ఎవరి వాటా ఎంత..
కార్పొరేట్ డేటాబేస్ ఏసీఈక్విటీతో సేకరించిన డేటా ప్రకారం ఎన్ఆర్ నారాయణమూర్తి కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇన్ఫోసిస్‌లో రూ.26,287.19 కోట్ల విలువైన 4.02 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2024 డిసెంబర్ 13న రూ.33,162.89 కోట్లతో పోలిస్తే ఇది ఇటీవల రూ.6,875.70 కోట్లు తగ్గింది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ మూర్తి ఇన్ఫోసిస్‌లో 0.40 శాతం వాటాను కలిగి ఉండగా, ఆయన భార్య సుధా మూర్తి డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి 0.92 శాతం వాటాను కలిగి ఉన్నారు. దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌గా పేరున్న ఇన్ఫోసిస్‌లో వారి కుమారుడు రోహన్ మూర్తి, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ భార్య, నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తికి వరుసగా 1.62 శాతం, 1.04 శాతం వాటాలు ఉన్నాయి. మూర్తి మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి ఇన్ఫోసిస్‌లో స్వల్పంగా 0.04 శాతం వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment