loss
-
సీజ్ ద షిప్.. సర్వం లాస్!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పావలా కోడికి ముప్పావలా మసాలా అన్నట్లుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘సీజ్ ద షిప్’ వ్యవహారం. కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం వివాదంలో పట్టుబడ్డ బియ్యం ఖరీదుకంటే నౌక నిలిచిపోవడం వల్ల పడ్డ డెమరేజ్ చార్జీలు ఎక్కువయ్యాయి. మరోపక్క కార్మికులకూ నష్టం వాటిల్లింది. మొత్తంగా పోర్టు పరువే తీసేసింది కూటమి ప్రభుత్వం. అనేక వివాదాలు, భారీ నష్టం అనంతరం పీడీఎస్ బియ్యం ఉన్న స్టెల్లా నౌక ఆదివారం అర్ధరాత్రి దాటాక 52 వేల మెట్రిక్‌టన్నుల బియ్యంతో పశ్చిమ ఆఫ్రికాకు బయలుదేరింది.స్టెల్లా నౌకలో పీడీఎస్ బియ్యం ఉన్నాయనే అనుమానంతో నవంబర్ 27న కాకినాడ పోర్టులో నిలిపివేశారు. నవంబర్ 29న పవన్ కాకినాడ పోర్టుకు వచ్చి ‘సీజ్ ద షిప్’ అంటూ సినిమా స్టైల్లో ఆదేశించేశారు. కానీ, దాని పర్యవసానాలు ప్రభుత్వం పట్టించుకోలేదు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఇతర సరకులను ఎగుమతి చేసే వారు ఇతర పోర్టులకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. పోర్టుపై ఆధారపడ్డ 10 వేలకు పైగా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది.పట్టుకున్న బియ్యం విలువ కన్నా డెమరేజ్ చార్జి రూ.1.5 కోట్లు ఎక్కువస్టెల్లా నౌకలోని ఐదు హేచెస్లో 52వేల మెట్రిక్ టన్నులు బియ్యం ఉంటే కేవలం 4 వేల టన్నుల బియ్యాన్ని 12 గంటల పాటు తనిఖీ చేశారు. చివరకు 3వ నంబరు హేచెస్లో ఉన్న సత్యం బాలాజీ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్‌కు చెందిన 1,320 మెట్రిక్ టన్నులు పీడీఎస్‌గా లెక్క తేల్చారు. ఈ బియ్యాన్ని వెంటనే అన్లోడ్ చేసి, నౌకను పంపకుండా పవన్ అన్న ‘సీజ్ ద షిప్’ మాటతో పోర్టులోనే నిలిపివేశారు. ఇలా నౌకను పోర్టులో నిలిపివేసినందుకు దాని యాజమాన్యానికి ఎగుమతిదారులు డెమరేజ్ చార్జీలు చెల్లించాలి. నవంబర్ 29 నుంచి డెమరేజ్ చెల్లించాలని నౌక యాజమాన్యం అంటుండగా.. తుపాను కారణంగా డిసెంబర్ 4 వరకు డెమరేజ్ వేయడం కుదరదని ఎగుమతిదారులు పట్టుబడుతున్నారు. ఈ వివాదం ఇంతవరకు తేలలేదు.నౌక పశ్చిమ ఆఫ్రికాకు చేరుకున్నాక షిప్ నిర్వాహకుడు బియ్యానికి చెల్లించాల్సిన సొమ్ము నుంచి డెమరేజ్ను మినహాయించుకుని మిగిలిన సొమ్ము జమ చేస్తాడని పోర్టు వర్గాలు చెబుతున్నాయి. నౌకకు క్రూతో సహా అన్ని ఖర్చులు చూసుకుంటే రోజుకు 22 వేల యూఎస్ డాలర్లు (రూ.18.73 లక్షలు) వంతున డెమరేజ్ చెల్లించాలి. అంటే నౌక నిలిచిపోయిన 38 రోజులకు సుమారు రూ.7 కోట్లకు పైగా డెమరేజ్ పడుతుందని లెక్కలేçÜ్తున్నారు. విదేశాలకు ఎగుమతిచేసే బియ్యం ప్రస్తుత ధరల ప్రకారం కిలో రూ.36 పలుకుతోంది. ఈ లెక్కన 1,320 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం ఖరీదు రూ.5.50 కోట్లు. అంటే పట్టుకున్న బియ్యం కంటే స్టెల్లా నౌకకు చెల్లించే నష్టమే రూ.1.5 కోట్లకు పైగా అదనం. ఇన్ని రోజులు పోర్టులో నిలిపివేసిన నౌక డెమరేజ్ చార్జీలు పవన్ చెల్లిస్తారా అని ట్రేడ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మరోపక్క ఈ నష్టాన్ని సత్యంబాలాజీ కంపెనీ చెల్లించాలా లేక, ఆ నౌకలో బియ్యం ఎగుమతికి రిజిస్టర్ అయిన 28 ఎక్స్‌పోర్టు కంపెనీలు చెల్లించాలా అనే దానిపైనా వివాదం నడుస్తోంది.మంటగలిసిన పోర్టు ప్రతిష్టఈ వ్యవహారంతో పోర్టు ప్రతిష్ట కూడా మంటగలిసిపోయింది. కాండ్లా, విశాఖపట్టణం, కృష్ణపట్నం పోర్టులు ఉన్నప్పటికీ బియ్యం ఎగుమతిలో కాకినాడ పోర్టుకే ఎగుమతిదారులు ఎక్కువ మొగ్గు చూపుతారు. దేశంలో ఏక కాలంలో బియ్యాన్ని ఏడు నౌకల ద్వారా ఎగుమతి చేయగలిగే బెర్త్‌ల సామర్థ్యం ఉన్న ఏకైక పోర్టు కాకినాడ యాంకరేజ్ పోర్టు. మిగిలిన పోర్టుల్లో రెండుకు మించి బియ్యం ఎగుమతికి అవకాశం లేదు. ఈ వెసులుబాటు కారణంగానే బియ్యం ఎగుమతుల్లో దేశంలోనే నంబర్ వన్‌గా కాకినాడ పోర్టు నిలుస్తోంది. అటువంటి పోర్టుపై పీడీఎస్ బియ్యం పేరుతో కూటమి నేతలు విషం చిమ్మడంతో పోర్టు ప్రతిష్ట మంటగలిసిపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు బియ్యం ఎగుమతిదారులు కాండ్లా రేవుకు మళ్లే ఏర్పాట్లలో ఉన్నారు.ఆందోళనలో కార్మికులుపోర్టుపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు మట్టికొట్టుకుపోయే పరిస్థితులు దాపురించాయని వారి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ పోర్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేలకు పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. పోర్టులో ఉన్న 100 బార్జీలపై 2,000 మంది కార్మికులు, టవ్వింగ్లో 1,000 మంది, షోర్ లేబర్ (గోడౌన్ ఎగుమతి, దిగుమతి)లో 8,000 మంది, మరో 2,000 మంది స్టీవ్ డోర్ వర్కర్స్‌గా పనిచేస్తున్నారు. ప్రతి కార్మికుడికి రోజూ రూ.800 నుంచి రూ.1,000 వరకు ఆదాయం లభిస్తుంది. -
రైలు నుంచి కింద పడిన వస్తువులను ఈజీగా పొందండిలా..
రైల్లో ప్రయాణ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ప్రమాదవశాత్తు వస్తువులు కింద పడుతుంటాయి. ఆ సందర్భంలో సాధారణంగా చాలామంది ఎమర్జెన్సీ చైన్ లాగితే సరిపోతుంది అనుకుంటారు. కానీ రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు అలా చైన్ లాగితే నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించడంతోపాటు, జైలుకు వెళ్లాల్సి రావొచ్చు. రైలు ప్రయాణిస్తున్న సమయంలో వస్తువులు ఏవైనా కిందపడితే వాటిని తిరిగి ఎలా పొందాలో తెలుసుకుందాం.రైలు ప్రయాణంలో ప్రమాదవశాత్తు వాలెట్, ఫోన్ వంటి విలువైన వస్తువులు కింద పడినప్పుడు వెంటనే చైన్ లాగకుండా, వస్తువులు పడిన పరిధిలోని పసుపు, ఆకుపచ్చ రంగులో ఉన్న పోల్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి. వెంటనే టికెట్ కలెక్టర్(టీసీ)ను సంప్రదించాలి. వస్తువు పడిన ప్రదేశం వెనకాల వెళ్లిన స్టేషన్, తదుపరి స్టేషన్ వివరాలు, పోల్ నంబర్‌ను రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ అధికారులకు అందించాలి. పోల్ నంబర్‌ను ఆధారంగా చేసుకుని రెండు స్టేషన్ల మధ్య పోయిన వస్తువును వెతికేందుకు అవకాశం ఉంటుంది. ఇతర ఏదైనా సహాయం కోసం రైల్వే పోలీస్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 182 లేదా సాధారణ రైల్వే హెల్ప్‌లైన్ 139కి కూడా కాల్ చేయవచ్చు.ఇదీ చదవండి: ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపుఇండియన్ రైల్వే యూఎస్, చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద రైల్వే నెట్వర్క్. రోజూ కోట్లాది మంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఫిబ్రవరి 1, 2023 లెక్కల ప్రకారం మొత్తం ఇండియన్ రైల్వే సర్వీసులో దాదాపు 11,75,925 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
చలికాలంలో బరువు పెరుగుతారెందుకు? అదుపులో ఉండేందుకు ఏం చేయాలి?
చలి వాతావరణంలో మన ఆహారపు అలవాట్లు మారుతుంటాయి. శీతాకాలంలో మనం వేడిగా ఉండే ఆహారపదార్థాలను అధికంగా తీసుకుంటుంటాం. ఫలితంగా శరీర బరువు పెరగడం మొదలవుతుంది. ఇది కొందరిలో ఆందోళనకు దారితీస్తుంది. అయితే చలికాలంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం, నియమాలను పాటించడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. చలికాలంలో బరువు పెరగడానికి కారణాలేమిటో, ఏ విధంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.అదనపు కేలరీల తీసుకోవడంచలికాలంలో మనం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటుంటాం. అతిగా టీ, కాఫీలు తాగడం, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం మొదలైనవన్నీ బరువు పెరగడానికి కారణంగా నిలుస్తాయి. శీతాకాలంలో శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది. ఫలితంగొ కొద్ది కేలరీలు మాత్రమే బర్న్ అవుతాయి.వ్యాయామం చేయకపోవడంచలికాలంలో చాలామంది వెచ్చగా పడుకోవాలని అనుకుంటారు. దీంతో రోజువారీ వ్యాయామాన్ని ఆపివేస్తారు. ఫలితంగా బరువు పెరగడం ప్రారంభమవుతుంది. దీనిని నివారించేందుకు వ్యాయామంపై దృష్టి పెట్టాలి.ప్రోటీన్ తీసుకోవడం ముఖ్యంఆహారంలో ప్రోటీన్ ఉండటం ముఖ్యం. ప్రొటీన్ వినియోగం జీవక్రియను పెంచుతుంది. కండరాలను నిర్మించడంలో కూడా సహాయపడుతుంది. పప్పులు, చేపలు, గుడ్లు, జున్ను ఇలా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.చక్కెర- ఉప్పు తగ్గించండిచలికాలంలో తీపిని ఎక్కువగా తినడం కూడా బరువు పెరగడానికి కారణంగా నిలుస్తుంది. అదనంగా తీసుకునే ఉప్పు కూడా బరువు పెరగడానికి కారణంగా నిలుస్తుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు చేరి బరువు పెరుగుతారు.ఫైబర్ కలిగిన ఆహారం ఉత్తమంపండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మొదలైన ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను శీతాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఫలితంగా కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. బరువు పెరిగేందుకు అవకాశమివ్వదు.తాగునీరు- సూప్చలికాలంలో నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. అలాగే చలికాలంలో వేడి వేడి సూప్ తాగడం మంచిది. తక్కువ కేలరీలు కలిగిన కూరగాయల సూప్ లేదా చికెన్ సూప్ తీసుకోవచ్చు.వ్యాయామం చేయండిచలికాలంలో వ్యాయామంపై తగిన శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కేలరీలను బర్న్ చేయవచ్చు. బరువు తగ్గవచ్చు.ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు శీతాకాలంలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఈ తరహా కొవ్వులు అసంతృప్తమైనవి. ఫలితంగా గుండెకు కూడా మేలు కలుగుతుంది. ఆలివ్ ఆయిల్, అవకాడో, గింజధాన్యాలను తీసుకోవడం ఉత్తమం.ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర -
జపాన్‌లో భూకంపం.. 6.4 తీవ్రత నమోదు
నోటో: జపాన్‌లో భూకంపం సంభవించింది. ఉత్తర మధ్య ప్రాంతంలోని నోటోలో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నోటో ద్వీపకల్పంలోని పశ్చిమ తీరంలో 10 కి.మీ. (6.2 మైళ్ళు) లోతులో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణశాఖ తెలిపింది.ఈ ఏడాది ప్రారంభంలో సంభవించిన భారీ భూకంపం నుండి కోలుకుంటున్నంతలోనే ఇప్పుడు మరో భూపంపం సంభవించింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ ముప్పు లేదని తెలుస్తోంది. ఈ భూకంపం కారణంగా ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు యూఎస్జీఎస్ పేర్కొంది. భూకంపానికి సంబంధించిన నష్టం గురించి తక్షణ నివేదికలేవీ లేవు. 2024, జనవరి ఒకటిన నోటో ప్రాంతంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. నాటి దుర్ఘటనలో 370 మందికి పైగా జనం మృతిచెందారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇది కూడా చదవండి: పరిహారం చెల్లించాకే భూసేకరణ -
వొడాఫోన్ ఐడియా నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర నష్టం తగ్గి రూ. 7,176 కోట్లకు పరిమితమైంది. జులైలో టారిఫ్‌ల పెంపు చేపట్టడంతో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) మెరుగుపడటం ఇందుకు దోహదపడింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 8,747 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 2 శాతం స్వల్ప వృద్ధితో రూ. 10,932 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 10,716 కోట్ల టర్నోవర్ సాధించింది. ఏఆర్పీయూ 8 శాతం పుంజుకుని రూ. 166ను తాకింది. మొత్తం వినియోగదారుల సంఖ్య 20.5 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: రూ.6కే అన్లిమిటెడ్.. బీఎస్ఎన్ఎల్లో బెస్ట్ ప్లాన్కాగా.. మూడేళ్ల కాలంలో నెట్వర్క్ పరికరాల సరఫరా కోసం నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్‌లతో 3.6 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 30,000 కోట్లు) విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. లితాల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 4 శాతం క్షీణించి రూ. 7.37 వద్ద ముగిసింది. -
బరువు తగ్గించే ఔషధాలతో కండరాల క్షీణత
బరువు తగ్గేందుకు వినియోగించే ఔషధాల వల్ల కండరాల ద్రవ్యరాశి క్షీణించే ప్రమాదం ఉన్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. మధుమేహం, రక్తపోటు లాంటి జీవన శైలి వ్యాధులకు దారి తీసే ఊబకాయాన్ని నియంత్రించడంలో ఈ మందులు సమర్థంగా పని చేస్తున్నప్పటికీ బరువు కోల్పోయే ప్రక్రియలో కండరాలు క్షీణతకు గురయ్యే ముప్పు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.బరువు కోల్పోవడం కారణంగా కండరాలు క్షీణతకు గురైనప్పుడు వార్దక్య లక్షణాలు, హృద్రోగ జబ్బుల ముప్పు పెరుగుతాయి. ఈమేరకు పెన్నింగ్టన్ బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ (అమెరికా), ఆల్బర్టా, మెక్ మాస్టర్ వర్సిటీ (కెనడా)కి చెందిన పరిశోధకులు రూపొందించిన పత్రాలు లాన్సెట్ జనరల్‌లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, సెంట్రల్ డెస్క్కండరాలు ఎందుకు అవసరం?⇒ దేహానికి పటుత్వం చేకూర్చి శరీరాన్ని దృఢంగా ఉంచడంతోపాటు జీవ క్రియలు, వ్యాధి నిరోధక వ్యవస్థను నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి.⇒ శరీర కదలికలు, ఆకృతికి కండర కణజాలం అవసరం.ఏం చేయాలి?⇒ బరువు కోల్పోయేందుకు తీసుకునే మందుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.⇒ ఆహారం తక్కువ తీసుకుంటే విటమిన్లు, ఖనిజాలు తగిన మోతాదులో అందకపోయే ప్రమాదం ఉంది.⇒ తగినంత ప్రోటీన్లు తీసుకోవడంతోపాటు వ్యాయామాలు లాంటి ఆరోగ్యకరమైన విధానాలను పాటించాలి.బరువు తగ్గించే మందులు ఏం చేస్తాయి?డయాబెటిక్ బాధితులు, బరువు కోల్పోయేందుకు తీసుకునే ఓజెమ్పిక్, వెగావై, మౌన్జరో, జెప్‌బౌండ్ లాంటి మందుల్లో జీఎల్పీ – 1 రిసెప్టార్ఎగోనిస్ట్లు ఉంటాయి. ఒక రకమైన ప్రోటీన్లు లాంటి ఈ రిసెప్టార్లు రక్తంలో చక్కెర స్థాయిలు, జీవ క్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి పెంచే గ్లూకగాన్ హార్మోన్ విడుదలను అడ్డుకుంటాయి. ఆహారం తీసుకున్న తరువాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు ఇది దోహదం చేస్తుంది.ఆకలిని కూడా ఇవే రిసెప్టార్లు నియంత్రిస్తాయి. కడుపు నిండిన భావన కలిగించడం ద్వారా బరువును నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి. ఈ రిసెప్టార్లను అనుకరిస్తూ టైప్ 2 డయాబెటిస్, ఊబకాయాన్ని నియత్రించే ఔషధాలు తయారయ్యాయి. మధుమేహ నియంత్రణలో వాడే మరికొన్ని మందులు మూత్రం ద్వారా గ్లూకోజ్‌ను బయటకు పంపి శరీర బరువును సమతూకంలో ఉంచేలా దోహదం చేస్తాయి. ప్రధానంగా మెదడులోని కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆకలిని అణచివేసి తక్కువ తీసుకునేలా ప్రోత్సహిస్తాయి. -
పోరాడి ఓడిన యూకీ–ఒలివెట్టి జోడీ
బాసెల్: స్విస్ ఇండోర్స్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ కథ ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ–ఒలివెట్టి ద్వయం 6–4, 5–7, 6–10తో జేమీ ముర్రే (బ్రిటన్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. యూకీ–ఒలివెట్టి జోడీకి 19,765 యూరోల (రూ. 18 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తొలి రౌండ్లో మొత్తం ఏడు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–జో సాలిస్బరీ (బ్రిటన్) జంటను బోల్తా కొట్టించిన యూకీ–ఒలివెట్టి ద్వయం క్వార్టర్ ఫైనల్లో మరో సంచలనం సృష్టించే అవకాశాన్ని చేజార్చుకుంది. 93 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి 14 ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. రెండు జోడీలు తమ సర్వీస్‌లను ఒక్కోసారి కోల్పోయాయి. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో మాత్రం అపార అనుభవజు్ఞలైన జేమీ ముర్రే–జాన్ పీర్స్ పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నారు. డబుల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ అయిన 38 ఏళ్ల జేమీ ముర్రే మొత్తం 32 టైటిల్స్ సాధించాడు. ఇందులో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్) కూడా ఉన్నాయి. 36 ఏళ్ల జాన్ పీర్స్ ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో సహచరుడు మాథ్యూ ఎబ్డెన్తో కలిసి డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు. కెరీర్ మొత్తంలో 28 డబుల్స్ టైటిల్స్ నెగ్గిన జాన్ పీర్స్ 2017లో ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో డబుల్స్ చాంపియన్‌గా నిలిచాడు. -
జియోకి షాక్.. కోటి మంది టాటా!
కొన్ని రోజుల క్రితం రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్ల టారిఫ్‌ను పెంచిన తర్వాత యూజర్లు షాక్ ఇచ్చారు. నివేదికల ప్రకారం పెరిగిన టారిఫ్‌ల ప్రభావం దాని వినియోగదారు బేస్‌పై ప్రతిబింబించింది. రెండవ త్రైమాసికంలో దాదాపు 1.09 కోట్ల మంది వినియోగదారులు జియో నుండి వెళ్లిపోయారు.అదే సమయంలో జియో 5G సబ్‌స్క్రైబర్ బేస్ మాత్రం 17 మిలియన్లు పెరిగినట్లు మొత్తం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంలో యూజర్ బేస్ 130 మిలియన్లు ఉండగా ఇప్పుడు 147 మిలియన్లకు చేరుకుంది. ఇక ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) రూ. 181.7 నుండి రూ.195.1కి పెరిగింది. అయితే మొత్తంగా జియో సబ్‌స్క్రైబర్ బేస్ క్షీణించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త అడుగు.. దేశంలో తొలి D2Dతన యూజర్ బేస్‌కు సంబంధించిన పరిస్థితి గురించి తమకు తెలుసునని, లాభాలపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపదని జియో తెలిపింది. తమ కస్టమర్లకు అత్యుత్తమ 5జీ నెట్‌వర్క్‌ను అందించడంపైనే తమ దృష్టి ఉందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులను కోల్పోవడం తమ వ్యాపారాన్ని ప్రభావితం చేయదని, అయితే ఇతర టెలికాం ఆపరేటర్లకు ఇది అవకాశం కల్పిస్తుందని జియో అంగీకరించింది. -
ఆదాయం పెరిగింది.. నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీ భారత్‌పే గ్రూప్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) లో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలు 50 శాతం తగ్గి రూ. 474 కోట్లకు పరిమితమయ్యాయి.అంతక్రితం ఏడాది(2022–23)లో రూ. 941 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం జంప్‌చేసి రూ. 1,426 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది రూ. 1,029 కోట్ల టర్నోవర్ మాత్రమే అందుకుంది. కంపెనీ 2024 అక్టోబర్‌లో పాజిటివ్ ఇబిటా సాధించినట్లు భారత్‌పే సీఈవో నళిన్ నేగి వెల్లడించారు. -
సీన్ రివర్స్.. నష్టాల్లోకి పీవీఆర్ ఐనాక్స్
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో లాభాలకు బదులు నష్టాలు చవిచూసింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 12 కోట్లకుపైగా నష్టాలను ప్రకటించింది. సినిమా థియేటర్ల బిజినెస్ నీరసించడం ప్రభావాన్ని చూపించింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో కంపెనీ రూ. 166 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. మొత్తం ఆదాయం సైతం 19 శాతం క్షీణించి రూ.1,622 కోట్లకు పరిమితమైంది. మొత్తం వ్యయాలు 7 శాతం తగ్గి రూ. 1,679 కోట్లుగా నమోదయ్యాయి. మూవీ ఎగ్జిబిషన్ ఆదాయం 20 శాతం క్షీణించి రూ. 1,579 కోట్లకు పరిమితమైంది. అయితే మూవీ ప్రొడక్షన్, పంపిణీ బిజినెస్ 78 శాతం పెరిగి రూ. 108 కోట్లను చేరుకుంది. -
సింగరేణికి ‘భూగర్భ’ శోకం
సాక్షి, హైదరాబాద్: భూగర్భ గనులు సింగరేణి సంస్థకు గుదిబండగా మారాయి. ఈ గనులతో సంస్థ గత ఐదేళ్లలో రికార్డుస్థాయిలో రూ.13,093 కోట్ల నష్టాలను మూటగట్టు కుంది. ఈ గనుల్లో టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.10,394 ఖర్చు అవుతుండగా, అమ్మకం ద్వారా రూ.4854 మాత్ర మే ఆదాయం వస్తోంది. భూగర్భ గనుల్లో 2019–20లో 86.65 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగగా, 2023–24లో 59 లక్షల టన్నులకు తగ్గిపోవడం సంస్థను మరింత కుంగదీస్తోంది.మరోవైపు టన్ను బొగ్గు ఉత్పత్తి వ్యయం 2019–20లో రూ.5413 ఉండగా, 2024–25 నాటికి రూ.10,394కు పెరిగింది. అందులో రూ.7901 ఉద్యోగుల జీతభత్యాల వ్యయమే ఉండటం గమనార్హం. ఇదే కాలంలో అమ్మకం ధర టన్నుకు రూ.3135 నుంచి రూ.4854కు మాత్రమే పెరగడంతో ఏటేటా నష్టాల శాతం పెరిగిపోతోంది. ఉపరితల గనులు, బ్యాంకు డిపాజిట్ల వడ్డీలు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంతో వస్తున్న లాభాలతో భూగర్భ గనుల నష్టాలను పూడ్చుకొని సంస్థ నికర లాభాలను సాధిస్తోంది. డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క ఆదేశాలతో దసరా పండుగ సందర్భంగా సింగరేణివ్యాప్తంగా 40వేల మంది కార్మికులకు గత రెండు రోజులుగా సామూహిక విందు భోజనం ఏర్పాటు చేసి వారికీ ఈ విషయాలను అధికారులు వివరిస్తున్నారు. ఉజ్వల సింగరేణి–కార్మికుల పాత్ర....‘ఉజ్వల సింగరేణి–కార్మికుల పాత్ర’అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సింగరేణి ఆర్థిక పరిస్థితి, మార్కెట్లో తక్కువ ధరకు బొగ్గు అమ్ముతున్న ఇతర కంపెనీలతో ఎదుర్కొంటున్న సవాళ్లు, సింగరేణిలో ఉత్పత్తి ఖర్చును తగ్గించాల్సిన అవసరం, యంత్రాలను సమర్థంగా వినియోగించాల్సిన బాధ్యత, డ్యూటీ సమయం సద్వినియోగం అనే అంశాలపై గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి గనిలో వివరిస్తున్నారు. సింగరేణి బొగ్గుధర... కోల్ ఇండియా, ఇతర ప్రైవేట్ కంపెనీల కన్నా ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు దూరమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ⇒ మొత్తం 22 భూగర్భ గనులుండగా, 16 గనుల్లో ఎస్డీఎల్ యంత్రాలతో ఉత్పత్తి జరుగుతోంది. భూగర్భ గనుల ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఈ 16 గనుల్లోనే ఉంటోంది. భూగర్భ గనుల ఉద్యోగుల్లో 75 శాతం అనగా, 17,286 మంది ఈ గనుల్లోనే పనిచేస్తున్నారు. ఎస్డీఎల్ యంత్రాల పనిని రోజుకు 2 గంటలు పెంచితే 30 టన్నుల ఉత్పత్తి పెరిగి మొత్తం రోజువారీ ఉత్పత్తి 132 టన్నులకు చేరుతుంది. దీంతో నెలకు రూ.104 కోట్ల నష్టాలు తగ్గుతాయి.⇒ 2008–09లో భూగర్భ గనుల్లో అత్యధికంగా రోజుకు 142 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, 2023–24లో 102 టన్నులకు తగ్గింది. కార్మికుల పనిగంటలూ 8.5 నుంచి 6.7కి పడిపోయాయి. ఈ రెండు గంటల ఉత్పత్తిని మళ్లీ పెంచితే రోజుకి 30 టన్నుల ఉత్పత్తి అదనంగా జరిగి మొత్తం రోజువారీ ఉత్పత్తి 132 టన్నులకు పెరుగుతుంది. ఉత్పత్తి కనీసం 20శాతం పెరిగినా నెలకు రూ.155 కోట్ల నష్టాలు తగ్గుతాయి. ⇒ వెస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్(డబ్ల్యూసీఎల్), మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(ఎంసీఎల్) విక్రయిస్తున్న బొగ్గు ధరలతో పోల్చితే సింగరేణి బొగ్గు ధరలు రెండింతలు అధికంగా ఉన్నాయి. ఉదాహరణకు టన్ను గ్రేడ్–5 బొగ్గును సింగరేణి రూ.5,685కు విక్రయిస్తుండగా, డబ్ల్యూసీఎల్, ఎంసీఎల్ సంస్థలు కేవలం రూ.2,970కే విక్రయిస్తున్నాయి. ⇒ రాబోయే ఏళ్లలో సింగరేణి సంస్థ కొత్తగా ఒక భూగర్భ గని, 6 భూ ఉపరితల గనులను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటి నుంచి ఏటా 21.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీకే, జీడీకే 10, జేకే(రొంపేడు), గోలేటి, ఎంవీకే, పీవీఎన్ఆర్(వెంకటాపూర్) అనే ఉపరితల గనులతో పాటు కేటీకే ఓసీ–2 అనే భూగర్భ గని ఇందులో ఉంది. ఒడిశాలోని నైనీ బ్లాక్‌లో ఈ ఏడాది నుంచే ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంది. -
అంబానీకి మార్కెట్ సెగ.. రూ. 1.32 లక్షల కోట్లు ఆవిరి!
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి షేర్ మార్కెట్ సెగ తగిలింది. భారత్‌లో అత్యంత విలువైన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని షేర్లు భారీగా పతనమవడంతో భారీ నష్టాన్ని చవిచూసింది.షేర్ మార్కెట్లో అమ్మకాల జోరుతో కేవలం నాలుగు రోజుల్లోనే కంపెనీ రూ. 1.32 లక్షల కోట్లు నష్టపోయింది. కొద్ది రోజుల క్రితం రూ. 20 లక్షల కోట్ల మార్కును అధిగమించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ అక్టోబర్ 4 నాటికి రూ.18.76 లక్షల కోట్లకు తగ్గింది. శుక్రవారం కంపెనీ షేరు ధర రూ.42.45 (1.51%) తగ్గింది.ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..రిలయన్స్ షేరులో భారీ క్షీణత కనిపించినప్పటికీ దేశంలో ముఖేష్ అంబానీనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. అక్టోబర్ 4 నాటికి అంబానీ రియల్ టైమ్ నెట్‌వర్త్ రూ.916055 కోట్లు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, నిరంతర విదేశీ మూలధన ప్రవాహం కారణంగా మార్కెట్ క్రాష్ అయింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా అనిశ్చితి కారణంగా గ్లోబల్ క్రూడ్ ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీసింది. -
డిస్కంల నష్టాలు రూ.57,448 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి విద్యుత్ సరఫరాకు చేస్తున్న వ్యయంతో పోలిస్తే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న బిల్లులు, సబ్సిడీల రూపంలో వచ్చే ఆదాయం తక్కువగా ఉండటంతో.. విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం) నష్టాలు ఏటేటా పేరుకుపోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్రంలోని రెండు డిస్కంల నష్టాలు కలిపి మొత్తం రూ.57,448 కోట్లకు ఎగబాకాయి. అందులో రూ.39,692 కోట్ల నష్టాలు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)వే కాగా, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పిడీసీఎల్) నష్టాలు రూ.17,756 కోట్లు ఉన్నాయి. 2023–24లో రెండు డిస్కంలు మరో రూ.6,299.29 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పిడీసీఎల్ సంస్థలు 2023–24కి సంబంధించిన తమ చివరి త్రైమాసిక నివేదికల్లో ఈ విషయాన్ని వెల్లడించాయి. ఏటేటా పెరుగుతున్న నష్టాలు: గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, ఇతర అన్ని కేటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాలో కీలకమైన డిస్కంలు ఏటేటా భారీ నష్టాలు మూటగట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 2017–18 ముగిసే నాటికి రూ.28,209.26 కోట్లకు పెరిగిన డిస్కంల నష్టాలు, 2018–19 ముగిసే నాటికి రూ.36,231.47 కోట్లకు చేరాయి. 2020 మార్చి 31 నాటికి రూ.రూ.42,292 కోట్లకు ఎగబాకినట్టు తాజాగా డిస్కంలు బహిర్గతం చేసిన వార్షిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2022–23 నాటికి 51,149.98 కోట్లు ఉన్న నష్టాలు 2023–24 నాటికి రూ.57,448 కోట్లకు చేరాయి. రూ.45,241 కోట్లకు చేరిన అప్పులు: రెండు డిస్కంల దీర్ఘకాలిక రుణాలు రూ.23,895.27 కోట్లకు, స్వల్ప కాలిక రుణాలు రూ.21,345.73 కోట్లకు పెరిగాయి. దీంతో డిస్కంల మొత్తం రుణాలు రూ.45,241 కోట్లకు చేరాయి. విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లుల చెల్లింపులతోపాటు ఉద్యోగులకు జీతాల చెల్లింపుల కోసం డిస్కంలు ఎడాపెడా స్వల్పకాలిక రుణాలు తీసుకుంటున్నాయి. దీనికితోడు పంపిణీ వ్యవస్థ సామర్థ్యం పెంపుదల కోసం భారీగా దీర్ఘకాలిక రుణాలు పొందాయి. బకాయిలు రూ.44,744 కోట్లు తెలంగాణ జెన్కో, ఏపీ జెన్కో, సింగరేణి తదితర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కి సంబంధించిన బకాయిలతోపాటు ఇతర అన్ని బకాయిలు కలిపి రెండు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.44,744.3 కోట్లను ఎగబాకాయి. ఇటు అప్పులు, అటు చెల్లించాల్సి ఉన్న బకాయిలు భారీగా పెరిగిపోవడంతో రెండు డిస్కంలు దివాళాబాటలో నడుస్తున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు వెంటిలేటర్‌గా మారి డిస్కంల దీపం ఆరిపోకుండా కాపాడుతున్నాయి. -
త్రిపురను ముంచెత్తిన వరదలు.. రూ. 15 వేల కోట్ల నష్టం
త్రిపురను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలో వరదల కారణంగా రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మీడియాకు తెలిపారు. వరదల కారణంగా 24 మంది మృతిచెందినట్లు తెలిపారు. 1.28 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారని పేర్కొన్నారు.అఖిలపక్ష సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ వరదల కారణంగా ఏర్పడిన నష్టం రూ.15 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. క్లిష్ట సమయాల్లో కలిసికట్టుగా పని చేస్తామని అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ నిబద్ధతను వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో పంపిణీ చేసేందుకు సరిపడా ఆహార ధాన్యాలు, ఇంధనం నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం మార్కెట్లపై నిఘా సారిస్తుందని అన్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం త్రిపురలో వరద పరిస్థితులు నెమ్మదించాయి. పలు నదులు ప్రమాద స్థాయికి దిగువన ప్రవహిస్తున్నాయి. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారి కోసం వైమానిక దళం హెలికాప్టర్ల నుండి నాలుగు వేలకు పైగా ఆహార ప్యాకెట్లను జారవిడిచింది. ఇదిలావుండగా బంగ్లాదేశ్‌లో వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరుకుంది. ఆ దేశంలోని 11 జిల్లాల్లో వరదలకు దాదాపు 49 లక్షల మంది ప్రభావితులయ్యారు. బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ తమ దేశానికి సహాయం చేయాలని స్వచ్ఛంద సంస్థలను కోరుతున్నారు. -
ఫేస్‌బుక్‌తో మోసం.. రూ.3 కోట్లు నష్టం
టెక్నాలజీ పెరుగుతున్నంత వేగంగా.. మోసాలు కూడా పెరుగుతున్నాయి. అడ్డదారుల్లో డబ్బు సంపాదించుకునేవారు టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ దాడుల్లో కోట్ల కొద్దీ డబ్బు పోగొట్టుకున్న సంఘటనలు గతంలో చాలానే తెలుసుకున్నాం. అలాంటి మరో సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఇందిరాపురం నివాసితులైన నబనిత, మృణాల్ మిశ్రా ఫేస్బుక్లో ఏకంగా రూ.3.1 కోట్లు నష్టపోయారు. స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడి అంటూ ఈ దంపతులను మోసం చేసి.. సైబర్ నేరగాళ్లు జూలై, ఆగస్టు మధ్య కాలంలో వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.నిజానికి నబానితా మిశ్రా ఫేస్బుక్లో ఒక ప్రకటన చూసి దానిపైన క్లిక్ చేసింది. ఆ తరువాత వ్యాపార సేవలను అందించడంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న వాట్సాప్ గ్రూప్‌లో ఆమెను యాడ్ చేశారు. గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ రజత్ చోప్రా జీటీసీ అనే పోటీలో పాల్గొనమని సభ్యులను ప్రోత్సహించారు.ఇన్వెస్ట్మెంట్ సలహా కోసం మొదట నెలవారీ సబ్స్క్రిప్షన్ రూ. 2,000 చెల్లించానని.. ఆపై షేర్లు, ఐపిఓ ఇన్వెస్ట్మెంట్లకు కూడా బదిలీలు చేయాలని చెప్పారు. అప్పటికే వాట్సాప్ గ్రూప్‌లో ఇతరులు తమ పెట్టుబడులపై లాభాలను అందుకున్నట్లు వివరించారు.ఐపీవో లావాదేవీలలో ఒకదాని కోసం కంపెనీ తనకు రూ. 80 లక్షలు అప్పుగా ఇచ్చిందని నబానితా మిశ్రా తెలిపారు. ఆమె తన ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆ డబ్బును తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. అలా చేయడానికి ఆమె తన తండ్రి ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తాలను తనఖా పెట్టింది. ఆ తరువాత ఒక అకౌంట్ యాక్సెస్ చేయగలిగింది. కంపెనీ యాప్‌లో ఆమె పెట్టుబడులు, లాభాల వివరాలను చెక్ చేసుకోగలిగింది. కానీ డబ్బును మాత్రం విత్ డ్రా చేయలేకపోయింది. ఆ తరువాత ఆమెకు అనుమానం వచ్చిన వాట్సాప్ నెంబర్ ద్వారా కాల్ చేసినప్పుడు అవన్నీ స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు. -
ఏలూరు జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్..రైతులకు భారీ నష్టం
-
అద్దిల్లా..? సొంతిల్లా..?
చాలా మంది తేల్చుకోలేని అంశం.. అద్దె ఇంట్లో ఉండడం నయమా? లేక సొంతిల్లు సమకూర్చుకోవడం బెటరా? అని. ఈ రెండింటిలో ఆర్థికంగా ఏది లాభదాయకమో నిపుణులను అడిగితే చెబుతారు. కానీ, ఇల్లు అన్నది భావోద్వేగాలు, సామాజిక గుర్తింపు, మానసిక ప్రశాంతత తదితర ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. అద్దె ఇల్లు ఆర్థిక భారం లేనిది. సొంతిల్లు ఆర్థిక బాధ్యతను తెచి్చపెడుతుంది. ఒకటి రెండు నెలల అడ్వాన్స్ ఉంటే నిమిషాల్లో అద్దె ఇంట్లో దిగిపోవచ్చు. కానీ, సొంతింట్లో కుడి కాలు మోపాలంటే భారీ మొత్తం కావాలి. లేదంటే బ్యాంక్ తలుపు తట్టాలి. అద్దె ఇంట్లో మనకు నచ్చకపోయినా, ఇంటి యజమానికి గిట్టకపోయినా మరో గూడు వెతుక్కోవాల్సిందే. సొంతింట్లో ఎవరికి వారే రారాజు. ఇలా నాణేనికి రెండువైపులా లాభనష్టాలున్నాయి. తమకు ఏది అనుకూలమో ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే. ఈ దిశగా అవగాహన కలి్పంచి, సులువుగా నిర్ణయం తీసుకోవ డానికి దారి చూపించేదే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. ఆర్థిక కోణం... ఇంటి విషయంలో ముందుగా తమ ప్రాధాన్యతలు ఏంటన్నవి ముఖ్యం. మెట్రో నగరాల్లో ఇంటి ధరలు చూస్తే చుక్కల్లో కనబడుతున్నాయి. కనుక అక్కడ సొంతిల్లు చాలా మందికి సాధ్యపడకపోవచ్చు. అలాంటి చోట అద్దె ఇల్లే ఆర్థి కంగా సౌకర్యం. ఇంటి కొనుగోలుతో పోలిస్తే అద్దే తక్కువగా ఉంటుంది. ఇంటి కొనుగోలుకు సరిపడా ఆర్థిక స్థోమత ఉన్న వారి విషయంలో అంత గందరగోళం అక్కర్లేదు. వృత్తి/ఉద్యోగ/వ్యాపార రీత్యా తరచూ ప్రాంతాలు మారే అవసరం లేకపోతే నిశి్చంతగా సొంతింటికి మొగ్గు చూపొచ్చు. కానీ, నగరాలు, పట్టణాల్లో రుణంపై ఇంటిని సమకూర్చుకోవాలని భావించే వారు అక్కడి రెంటల్ ఈల్డ్స్ (ప్రాపర్టీ విలువపై అద్దె రాబడి), ప్రాపర్టీ విలువ పెరుగుదల శాతం ఏ మేరకు ఉంది, తదితర అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. మన దేశంలోని చాలా పట్టణాల్లో రుణంపై ఇల్లు కొనుగోలు చేసి చెల్లించే ఈఎంఐతో పోలి్చతే.. చాలా తక్కువకే అద్దె ఇల్లు వచ్చేస్తుంది. పట్టణాల్లో ఇంటిని కొనుగోలు చేయడం మంచి ఆప్షనే. కాలం గడిచే కొద్దీ దాని విలువ పెరుగుతూ వెళ్తుంది. కానీ, దాన్ని సమకూర్చుకునేందుకు సరిపడా పెట్టుబడి కావాలి. పెట్టుబడి కోసం అయితే కొత్తగా అభివృద్ధిలోకి వస్తున్న నగర, పట్టణ శివారు ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేసుకోవడం వల్ల.. తక్కువ కాలంలోనే ఎక్కువ విలువ సమకూరుతుంది.అద్దె రాబడి తక్కువ... మన దేశంలో ఇంటిపై సగటు రాబడి 2.9 శాతంగా ఉంది. ప్రపంచంలో ఇక్కడే తక్కువ. అదే యూఎస్, కెనడా, దుబాయిలోని పట్టణాల్లో ఇంటిపై అద్దె రాబడి 5–6 శాతంగా ఉంది. అద్దె రాబడి 4 శాతాన్ని మించినప్పుడు రుణంపై ఇంటిని కొనుగోలు చేసుకోవడం అత్యుత్తమమని ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. మీరు ఉండాలనుకుంటున్న ప్రాంతంలో ప్రస్తుత రెంటల్ ఈల్డ్ (అద్దెకు ఇస్తే వచ్చే రాబడి) (ప్రాపర్టీ విలువతో పోలిస్తే చెల్లించే అద్దె రేటు), ఏటా ఎంత చొప్పున పెరుగుతుందన్నది తెలుసుకోవాలి. వీటి ఆధారంగా అద్దె/ఈఎంఐ రేషియో ఎంతో తేల్చుకోవాలి. రియల్ ఎస్టేట్ పరిశోధనా సంస్థ ‘లైసస్ ఫొరాస్’ ఇందుకు సంబంధించి విలువైన గణాంకాలు రూపొందించింది. దీని ప్రకారం 100 శాతం అంతకంటే తక్కువ నిష్పత్తి ఉన్న పట్టణాల్లో అద్దె ఇంట్లో ఉండడమే లాభం. ఈ రేషియో 100 దాటిన చోట సొంతిల్లు సమకూర్చుకోవడం లాభం.విశ్లేషణ విశాఖలో రెంటల్ ఈల్డ్ ప్రాపర్టీ విలువపై 2 శాతంగా ఉంది. ఇది ఏటా 5 శాతం పెరుగుతూ పోతే రెంటల్/ఈఎంఐ రేషియో 57 శాతం అవుతుంది. ఏటా 10 శాతం పెరిగితే ఈ రేషియో 84 శాతంగా ఉంటుంది. 11 శాతం పెరిగితే రేషియో 93గా ఉంటుంది. అదే హైదరాబాద్‌లో రెంటల్ ఈల్డ్ 2.5 శాతం.. ఏటా 9 శాతం వరకు పెరిగితే రెంట్/ఈఎంఐ రేషియో 94గా ఉంటుంది. ఒకవేళ ఏటా 10 శాతం పెరిగితే ఈ రేషియో 104కు వెళుతుంది. హైదరాబాద్‌లో ఏటా 10 శాతం చొప్పున అద్దెలు పెరిగేట్టు అయితే అప్పుడు రుణంపై ఇల్లు కొనుగోలు చేసి, ఈఎంఐలు కట్టుకోవడమే ప్రయోజనకరం. అద్దె పెరుగుదల 10 శాతంలోపే ఉంటే కిరాయికి తీసుకోవడం ఆర్థికంగా ప్రయోజనకరం. ఒకవేళ మీరు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో ప్రస్తుత రెంటల్ ఈల్డ్ ప్రాపర్టీ విలువపై 4 శాతం అంతకంటే ఎక్కువే ఉండి, ఏటా అద్దె 5 శాతం పెరిగినా సరే.. అక్కడ రుణంపై ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐ కట్టుకోవడమే లాభం.లాభాలుఈ అంశాలు గమనించాలి.. ఆర్బీఐ డేటా ప్రకారం 2010–11 నుంచి 2017–18 మధ్య కాలంలో (రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ సంస్థ (రెరా) రాక ముందు) ప్రాప ర్టీల ధరలు ఏటా 15 శాతం చొప్పున పెరిగాయి. 2018–19 నుంచి 2022–23 కాలంలో (రెరా వచ్చిన తర్వాత) ఏటా 3 శాతం పెరిగాయి. చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు స్థాయిలో ప్రాపరీ్టల ధరలు పెరిగినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ రకంగా చూస్తే ప్రాపర్టీ కొనుగోలు లాభదాయకమే. 30 ఏళ్ల కాలానికి రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తే, ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎంఐ, ఇంటి అద్దె కంటే రెట్టింపు ఉంటుంది. కానీ, 15–17 ఏళ్లు గడిచే సరికి ఇంటి అద్దె ఏటా పెరుగుతూ రుణ ఈఎంఐకి చేరువ కావచ్చు.సొంతిల్లు→ ఒకే చోట స్థిరపడిన వారు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. మన దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. ఇది ఇళ్లు, స్థలాల విలువలకు దన్నుగా నిలుస్తుంది. కనుక ఇంటిపై పెట్టుబడి దీర్ఘకాలంలో సంపదకు దారితీస్తుంది. → సొంతిల్లుతో వచ్చే ప్రశాంతతను వెలకట్టలేం. భద్రతకు హామీనిస్తుంది. ఖాళీ చేయాల్సిన అనిశ్చితి ఉండదు. ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. గోపత్య ఉంటుంది. ఇంటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంలో పరిమితులు ఉండవు. నచ్చినట్టుగా ఇంటిని మార్చుకోవచ్చు. రాజీపడాల్సిన అవసరం ఉండదు. → అద్దెకు బదులు ఈఎంఐ కట్టుకుంటే స్థిరాస్తి సమకూరుతుంది. రుణంపై ఇంటిని సమకూర్చుకోవడం వల్ల దీర్ఘకాలంలో దాని విలువ పెరగడమే కాదు.. పన్ను రూపంలోనూ ఎంతో ఆదా అవుతుంది. ఇంటి రుణ ఈఎంఐలో అసలు (ప్రిన్సిపల్), వడ్డీ అని రెండు భాగాలుంటాయి. అసలుకు చెల్లించే మొత్తం గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, సెక్షన్ 24 కింద ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 2 లక్షల వడ్డీ భాగంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఒకవేళ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే అప్పుడు వడ్డీ ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉన్నా, ఆ మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. → సొంతింటితో అనుబంధం విడదీయరానిది. అదే అద్దె ఇంట్లో ఉండి, చుట్టుపక్కల వారితో మంచి సంబంధాలు ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడం కష్టమనిపిస్తుంది. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయాల్సిన అగత్యం ఏర్పడదు. సొంతిల్లు వ్యక్తిగత హోదాను పెంచుతుంది. సామాజిక గుర్తింపును తెస్తుంది. → చివరిగా సొంతిల్లు ఉంటే.. విశ్రాంత జీవనంలో స్థిరమైన ఆదాయాన్నిచ్చే బంగారు బాతు అవుతుంది. రివర్స్ మార్ట్‌గేజ్‌తో ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని బ్యాంక్ నుంచి పొందొచ్చు. అద్దె ఇల్లుళీ అద్దె ఇంటితో ఉండే అత్యంత అనుకూలత.. నచి్చన ప్రాంతంలో ఉండొచ్చు. సొంతిల్లు అయితే మారకుండా ఎప్పటికీ ఒకేచోట ఉండిపోవాల్సి వస్తుంది. → ప్రతికూల ఆర్థిక పరిస్థితుల్లో, ఉద్యోగం కోల్పోయి ఖాళీగా ఉండాల్సి వస్తే, తక్కువ అద్దె ఇంటికి వెళ్లి సర్దుకోవచ్చు. సొంతిల్లు అయితే వ్యక్తిగత కష్టాలతో సంబంధం లేకుండా ఈఎంఐ కట్టాల్సిందే. → అద్దె ఇల్లు అయితే ఇంటి నిర్వహణ భారం తమ మీద పడదు. వాటర్ ట్యాంక్‌లు, నీటి మోటార్ల నిర్వహణ, రిపేర్లు, పెయింట్స్ తదితర బాదర బం«దీలు ఉండవు. వీటి రూపంలో ఆర్థిక భారం పడదు. ఇంటి పన్నుల బాధా ఉండదు. → రుణంపై ఇల్లు కొనుగోలు చేయాలంటే.. మొత్తం విలువలో 20 శాతం డౌన్ పేమెంట్ కింద సమకూర్చుకోవాలి. అదే అద్దె ఇంటి విషయంలో ఈ అవసరం ఉండదు. కొద్ది నెలల అద్దెకు సరిపడా రిఫండబుల్ డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది.వేతన జీవులకు రియల్టీ ఆస్తివేతన జీవులకు రియల్ ఎస్టేట్ ఒక ఆస్తిగా మారుతుంది. నీవు ప్రతి నెలా అద్దె కింద రూ.లక్ష చెల్లిస్తుంటే, దానికి అదనంగా రూ.50,000–60,000 చెల్లించేట్టు అయితే సొంతిల్లు దక్కుతుంది. పదేళ్ల పాటు ఇదే అద్దెను చెల్లించడం వల్ల ఎలాంటి ఆస్తి సమకూరదు. కనుక ఈఎంఐతో ఒక ఆస్తిని సమకూర్చుకోవచ్చు. – అజితేష్ కొరుపూలు, అశోక బిల్డర్స్ (రియల్ ఎస్టేట్ కంపెనీ) సీఈవోతెలివైన నిర్ణయం కాదు!గురుగ్రామ్‌లో నేను ఉండే ఇంటికి ప్రతి నెలా రూ.1.5 లక్షలు అద్దె, మెయింటెనెన్స్‌తో కలిపి రూ.1.65 లక్షలు చెల్లిస్తున్నా. అది గోల్ఫ్‌కోర్స్‌తో కూడిన ఖరీదైన ప్రాంతం. నేను ప్రస్తుతం అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ ఖరీదు రూ.7.5–8 కోట్లు. దీన్ని కొనుగోలు చేయాలంటే 70 శాతం మేర రూ.6 కోట్లు రుణం తీసుకోవాలి. దీనికి ప్రతి నెలా రూ.6–7 లక్షల ఈఎంఐ చెల్లించాలి. అంటే నేను ప్రస్తుత ఇంటికి చెల్లిస్తున్న అద్దెకంటే ఈఎంఐ నాలుగు రెట్లు అధికం. కనుక ఇల్లు కొనుగోలు చేయడం నాకు తెలివైన నిర్ణయం కాబోదు. ఇల్లు అనేది లిక్విడిటీ (కోరుకున్న వెంటనే సొమ్ము చేసుకోగల) ఉన్న ఆస్తి కాదు. కనుక నేను అదే రూ.6 లక్షలను పబ్లిక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తాను. పైగా అద్దె ఇల్లు తీసుకోవడంలో కొంత స్వేచ్ఛ ఉంటుంది. 15 రోజుల్లోనే చిన్న సైజు నుంచి పెద్ద సైజు ఇంటికి మారొచ్చు. నేను నా పిల్లలు, తల్లిదండ్రులతో కలసి ఉంటే తప్ప ఇంటి విషయంలో నా ఆలోచన ఇదే. – శంతను దేశ్‌పాండే, బోంబే షేవింగ్ కంపెనీ ఫౌండర్హాస్యాస్పదంప్రస్తుత వేల్యూషన్ల వల్లే నేను రియల్ ఎస్టేట్‌ను కొనుగోలు చేయలేదు. నా వరకు ఈ వేల్యూషన్లు నిజంగా హాస్యాస్పదం. వడ్డీ రేట్ల కంటే ఇంటిపై రాబడులు తక్కువ. ఇళ్లు, ఆఫీస్‌ల ధరలు పెరుగుతాయని కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం అనిపించడంలేదు. పెట్టుబడులపై 10–12 శాతం రాబడులు సంపాదించుకోలిగినప్పుడు, 3 శాతానికే (ప్రాపర్టీ విలువలో) వచ్చే అద్దె ఇల్లు తీసుకోవడమే మంచిది. పెట్టుబడులపై వచ్చే రాబడి కంటే రెంటల్ ఈల్డ్ చాలా తక్కువ. నా తల్లిదండ్రులు నివసించిన ఇల్లు ఒక్కటే నాకు ఉంది. దానికి కూడా భావోద్వేగ పరమైన కారణాలున్నాయి. – నిఖిల్ కామత్, జెరోదా కో–ఫౌండర్ ఆఫీసుకు దగ్గరుంటే.. తమ కార్యాలయాలకు దగ్గరగా లేదా వ్యాపార సంస్థలకు సమీపంలో ఉండాలనుకుంటే ఇంటిని అద్దెకు తీసుకోవడమే లాభం. అలాంటి చోట సొంతిల్లు సమకూర్చుకోవడానికి భారీ పెట్టుబడి కావాలి. దాంతో పోలిస్తే చాలా తక్కువకే అద్దె ఇల్లు వచ్చేస్తుంది. పైగా రోజూ ఇంటి నుంచి వెళ్లి వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టదు. ఇంధన వ్యయాల భారం ఉండదు. విలువైన సమయం, వనరుల ఆదా అవుతాయి. సెలబ్రిటీలు ఇలా..సెలబ్రిటీలు మాధురి దీక్షిత్, కృతి సనన్ సొంతింటికి బదులు అదంట్లో ఉండడానికే ప్రాధాన్యమిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ ముంబైలో ఒకే ప్రాజెక్టులో 6 అపార్ట్మెంట్లు కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణాలివే?
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో యూపీలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని 80 సీట్లలో ఎస్పీకి 37, బీజేపీకి 33, కాంగ్రెస్‌కు 6, ఆర్ఎల్డీకి 2, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్)కి ఒకటి, అప్నాదళ్ (సోనేలాల్)కి ఒక సీటు లభించింది. అయోధ్యలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురయ్యింది. దీనికి పలు కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు.అయోధ్యలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ 54,567 ఓట్లతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 5,54,289 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌కు 4,99,722 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి సచ్చిదానంద్ పాండే 46,407 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో యూపీ లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని బీజేపీ భావించింది. అయితే ఈ విషయంలో బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి.కుల సమీకరణ: అయోధ్యలో పాసి వర్గం (దళితులు) పెద్ద సంఖ్యలో ఉంది. అయోధ్యలో ఎస్పీ తన అభ్యర్థిగా ఈ వర్గానికి చెందిన అవధేష్ ప్రసాద్‌ను ఎన్నికల బరిలో నిలిపింది. అవధేష్ ప్రసాద్ యూపీ రాజకీయాల్లో దళితుల తరపున గొంతువిప్పే నాయకునిగా పేరొందారు.అవధేష్‌కు ఆదరణ: ఎస్పీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్‌కు అయోధ్య ప్రజల్లో అత్యధిక ఆదరణ ఉంది. ఆయన తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఆయన ఒకరు.రాజ్యాంగంపై ప్రకటన: అయోధ్య బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ రాజ్యాంగానికి సంబంధించి చేసిన ప్రకటనపై బెడిసికొట్టింది. ‘రాజ్యాంగాన్ని మార్చాలంటే మోదీ ప్రభుత్వానికి 400 సీట్లు కావాలని’ లల్లూ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన బీజేపీకి ఎదురుదెబ్బగా మారింది.లల్లూ సింగ్‌పై అసంతృప్తి: లల్లూ సింగ్ అయోధ్య నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ ఆయనను మూడోసారి అభ్యర్థిగా నిలబెట్టింది. అయోధ్య పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి కానరాకపోవడంతో లల్లూపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది. బీజేపీ రామమందిరంపై దృష్టి పెట్టి, ప్రజా సమస్యలను ఉపేక్షిందనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే లల్లూ ఓటమి పాలయ్యారు.ఇళ్లు, దుకాణాల కూల్చివేత: అయోధ్యలో 14 కి.మీ పొడవున రామ్ పథాన్ని నిర్మించారు. అలాగే భక్తి పథం, రామజన్మభూమి పథాలు కూడా నిర్మించారు. వీటి కారణంగా తమ ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయని, ఎవరికీ నష్టపరిహారం అందలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.రిజర్వేషన్ అంశం: అయోధ్యలో బీజేపీ నేతలు తమ పార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ప్రచారాన్ని సాగించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఓటర్లు ఎస్పీ వైపు మొగ్గు చూపారు.యువతలో ఆగ్రహం: అయోధ్యలో యువత ఓట్లు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పడ్డాయి. స్థానికులు అగ్నివీర్ పథకం విషయంలో ప్రభుత్వంతో ఏకీభవించలేదు. పేపర్ లీక్‌లు కూడా మరో కారణంగా నిలిచాయి.కాంగ్రెస్‌పై సానుభూతి: అయోధ్యలోని దళితుల్లో బీజేపీపై ఆగ్రహం నెలకొంది. అదే సమయంలో కాంగ్రెస్‌పై సానుభూతి ఏర్పడింది. దీని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. -
అనిల్ అంబానీకి మరో దెబ్బ.. రూ.397 కోట్లు నష్టం
నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీకి మరో దెబ్బ తగిలింది. తన నేతృత్వంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్ మార్చి త్రైమాసికంలో రూ.397.66 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.321.79 కోట్ల లాభాన్ని ఆర్జించిన కంపెనీ ఇప్పుడు దానిని మించి నష్టాన్ని చవిచూసింది.ఇంధన వ్యయాలు పెరగడం వల్లే ఈ నష్టం వాటిల్లినట్లు కంపెనీ తెలిపింది. నష్టాలు ఉన్నప్పటికీ కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,193.85 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది రూ.1,853.32 కోట్లతో పోలిస్తే ఇది అధికం. అయితే ఈ త్రైమాసికంలో వినియోగించిన ఇంధన వ్యయం రూ.953.67 కోట్లకు పెరిగింది. 2022-23 జనవరి-మార్చి కాలంలో ఇది రూ.823.47 కోట్లు.పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే రిలయన్స్ పవర్ నష్టాలు గణనీయంగా ఎగిసి రూ.470.77 కోట్ల నుంచి రూ.2,068.38 కోట్లకు పెరిగాయి. ఇక క్యూ4లో రిలయన్స్ పవర్ దాదాపు 6,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. కాగా సెబీ నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) ద్వారా విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లు (ఎఫ్‌సీసీబీలు), సెక్యూరిటీల జారీకి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. -
ధాన్యం.. దయనీయం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు అతలాకుతలం అవుతున్నారు. గత రెండురోజులుగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో కోత దశలో ఉన్న వరి పంట నేలవాలింది. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో.. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిచిపోయాయి.ఇంతకుముందు వర్షానికి తడవడంతో ఆరబోసుకున్న వడ్లు వర్షపు నీటికి కొట్టుకుపోయాయని రైతులు వాపోయారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మార్కెట్ యార్డు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోయింది. మహబూబాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా వర్షం కారణంగా రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.ఉమ్మడి కరీంనగర్‌లోని పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శుక్రవారం సుమారు గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. పలు మండలాల్లో క్వింటాళ్ల కొద్దీ వడ్లు తడిచిపోయాయి. ఖమ్మం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు మామిడి కాయలు రాలిపోయాయి. ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేయాలని, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. -
పూత రాలి.. కాయ కుళ్లి
కొల్లాపూర్ /జగిత్యాల అగ్రికల్చర్ ఈ ఏడాది మామిడి పూత చూసి రైతులెంతో మురిసిపోయారు. కానీ వాతావరణంలో తలెత్తిన మార్పులు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో రైతుల ఆశలు అడియాసలు కాగా, కౌలు రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. దిగుబడి సగానికి సగం తగ్గిపోగా, మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాతావరణ మార్పులు, తెగుళ్లు డిసెంబర్లో చలి తీవ్రత, తేమ శాతం పెరగడం, అకాల వర్షం కారణంగా పూత పెద్దమొత్తంలో రాలిపోయింది. అదే నెలలో రెండో దశ పూతలు వచ్చాయి. వీటికి బూడిద తెగులు సోకి రాలిపోయాయి. అక్కడక్కడా పంటలో పూత నిలబడినా, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో తేనె మంచు పురుగు ఆశించింది. ఈ పురు గులు గుంపులు, గుంపులుగా మామిడి పూత, పిందెపై చేరి, వాటి నుంచి రసాన్ని పీల్చాయి. దీంతో, పూత, పిందె రాలి మాడిపోయాయి. కొన్నిచోట్ల పూత, పిందెలపై నల్లని మసి ఏర్పడింది. ఈ పురుగు వల్ల దాదాపు 20 నుంచి 100 శాతం వరకు నష్టం ఏర్పడుతుంది. మరోవైపు బంక తెగులు సోకి కాయలు నేలరాలాయి. మితిమీరి పురుగు మందుల పిచికారీ తేనె మంచు పురుగు కట్టడికి రైతులు విపరీతంగా రసాయన మందులు పిచికారీ చేశారు. ఇప్పటికే ఒక్కో రైతు ఒక్క ఎకరానికి దాదాపు రూ.20వేల వరకు ఖర్చు చేశారు. రెండుమూడు నుంచి ఏడుసార్ల వరకూ మందులు పిచికారీ చేసిన రైతులు ఉన్నారు. ధరలు సైతం నేలచూపులే ఏటా సీజన్ ప్రారంభంలో మామిడి కాయల ధర టన్నుకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు పలికేది. కానీ, ఈసారి ఫిబ్రవరి రెండో వారంలో టన్ను ధర రూ.1.20 లక్షల వరకు పలికింది. నెలాఖరులో టన్ను ధర రూ.80 వేలకు పడిపోయి.. ప్రస్తుతం రూ.50–60 వేల వరకు పలుకుతోంది. వ్యాపారుల సిండికేట్‌తోనూ ధరలు తగ్గాయి. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లిలో హైదరాబాద్, ముంబయికి చెందిన వ్యాపారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి నెలాఖరులో రూ.60– 75 వేల వరకు టన్ను మామిడి కాయలను కొనుగోలు చేసి.. ఇప్పుడు తగ్గించేశారు. జగిత్యాల మామిడి మార్కెట్లో మొన్నటి వరకు కిలో రూ.65 వరకు ఉన్న బంగినపల్లి రకం ధర ప్రస్తుతం రూ.45–55 మధ్య పలుకుతోంది. దశేరి రకం కిలో రూ.75 వరకు పలకగా, ప్రస్తుతం రూ.50–65 మధ్య పలుకుతోంది. హిమాయత్ రకం కిలో రూ.130 వరకు పలకగా, ఇప్పుడు రూ.100గా కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 57,344 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వీటిలో 70 శాతం మేర తోటలు కాపు కాసేవి ఉన్నాయి. సాగు చేస్తున్న తోటల లెక్కల ప్రకారం ఈ ఏడాది 1,38,848 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అందులో 50 శాతం కూడా వచ్చే పరిస్థితి లేదు. జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలో 40వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 70శాతం మామిడి తోటల్లో పురుగు ఆశించి 100శాతం పంటనష్టం జరిగింది. మామిడికాయ ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తోంది. దిగుబడి నాలుగైదు టన్నులకే పరిమితమైంది. పూతకు ముందే తోటలు లీజుకు తీసుకున్నవారు ప్రస్తుతం ఆ తోటలను చూసి తమ అడ్వాన్సులు తిరిగి ఇవ్వమంటూ రైతులను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా: బోధన్‌రూరల్(బోధన్): నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని మందర్న, హున్స గ్రామాలు మామిడి తోటల సాగులో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఇక్కడ 80 నుంచి 100 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. పూత రాలిపోయి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ఆదుకోవాలి.. నేను 40 ఎకరాల తోటలను రూ.42 లక్షలకు కౌలుకు తీసుకున్నా. సొంత తోటలు కూడా ఉన్నాయి. సాగు పనులకు రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశా. ఇప్పటి వరకు 20 టన్నుల కాయలు మాత్రమే అమ్మాను. సాగు, కౌలు కోసం ఖర్చు చేసిన డబ్బులు ఇంకా రాలేదు. రెండో విడత పూత కొంత మేరకు నిలబడింది. ఆ కాయలు వచ్చే నెలలో కోతకు వస్తాయి. వాటి మీదే ఆశలు పెట్టుకున్నా. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ రెండు సార్లు మందులు కొట్టాను పూత ప్రారంభానికి ముందు, పూత వచి్చన తర్వాత మందులు పిచికారీ చేశాను. ఎకరానికి రూ.30వేల వరకు ఖర్చు చేశాను. అయినా పూత సరిగ్గా నిలువ లేదు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. – కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, వెంకట్రావుపేట, మేడిపల్లి పూత నిలబడలేదు వాతావరణంలో మార్పులు, తెగుళ్ల కారణంగా ఈసారి మామిడి దిగుబడి బాగా తగ్గింది. పంటనష్టం వివరాలు ఇంకా అంచనా వేయలేదు. పూతలు బాగానే వచి్చనా, తేనెమంచు పురుగు, నల్లి, బూడిద తెగుళ్ల కారణంగా పూత నిలవలేదు. – లక్ష్మణ్, ఉద్యానశాఖ అధికారి, కొల్లాపూర్ -
కోవిడ్-19 తగ్గినా..ఐక్యూ ముప్పు పెరిగింది!
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు నియంత్రణలో ఉన్నప్పటికీ, దీని బారినపడిన వారిని వెంటాడుతున్న లాంగ్ కోవిడ్ ముప్పు ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనాపై చేసిన పలు పరిశోధనలలో సార్స్- కోవ్-2 వైరస్ దీర్ఘకాలంలో హాని కలిగిస్తుందని తేలింది. దీని దుష్ప్రభావాలు గుండె, ఊపిరితిత్తులపై ఉంటాయని వెల్లడయ్యింది. కోవిడ్-19పై ఇటీవల జరిపిన అధ్యయనాలు కరోనా కారణంగా మెదడు సంబంధిత సమస్యల ముప్పును తెలియజేశాయి. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన బాధితులలో చాలా మంది వ్యాధి నుంచి కోలుకున్నాక వారిలో జ్ఞాన సామర్థ్యం(ఐక్యూ) తగ్గిపోతున్నదని పరిశోధనల్లో తేలింది. నిపుణుల బృందం కోవిడ్-19 నుండి కోలుకున్న వారిలో ఒక ఏడాది తర్వాత వారి ఐక్యూ స్థాయిలో మూడు పాయింట్ల తగ్గుదలను కనుగొంది. ఇది మెదడు సంబంధిత ముప్పుపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని నిపుణులు అంటున్నారు. మెదడు పనితీరులో తగ్గుదల జీవన నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు తెలిపారు. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ పరిశోధనా వివరాలు ప్రచురితమయ్యాయి. -
8.50 లక్షల కోట్ల సంపద ఆవిరి
సెన్సెక్స్ ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో రూ.8.50 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.365 లక్షల కోట్లకు దిగివచ్చింది. ముంబై: దలాల్ స్ట్రీట్‌లో మంగళవారం అమ్మకాల మోత మోగింది. అధిక వెయిటేజీ షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు(3%), రిలయన్స్ ఇండస్ట్రీస్(2%), ఎస్బీఐ(4%) షేర్లు పతనంతో పాటు పశ్చిమాసియాలోని యుద్ధ ఉద్రికత్తలు ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. ఇటీవల విడుదలైన కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడమూ సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచింది. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. గడిచిన 3 నెలల్లో భారీగా ర్యాలీ చేసిన చిన్న, మధ్య తరహా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ 3శాతం చొప్పున నష్టపోయాయి. పెరిగి పడిన మార్కెట్... మూడు రోజుల వరుస సెలవుల తర్వాత తెరుచుకున్న మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 444 పాయింట్లు పెరిగి 71,868 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు బలపడి 21,717 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. కానీ, కాసేపటికే అమ్మకాల ఒత్తిడి మొదలైంది. ఒక దశలో సెన్సెక్స్ 1,189 పాయింట్లు క్షీణించి 70,235 వద్ద, నిఫ్టీ 397 పాయింట్లు దిగివచ్చి 21,193 వద్ద ఇంట్రాడే కనిష్టాలను దిగివచ్చాయి. చివరికి సెన్సెక్స్ 1,053 పాయింట్లు నష్టపోయి 70,371 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 330 పతనమై 21,242 వద్ద స్థిరపడ్డాయి. జనవరి 17 తర్వాత సూచీలకు ఇది భారీ పతనం. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లూ డీలా...! అమ్మకాల సునామీతో ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు ఎరుపెక్కాయి. రంగాల వారీగా ఎన్ఎస్ఈలో మీడియా 13%, రియల్టీ 5%, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 4%, మెటల్, ఆయిల్‌అండ్‌గ్యాస్ 3%, బ్యాంక్ నిఫ్టీ 2%, ప్రైవేట్ రంగ బ్యాంక్ 2%, ఎఫ్ఎంసీజీ, ఆటో ఇండెక్సులు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. ఫార్మా సూచీ మాత్రమే 1.5% రాణించింది. ►నష్టాల ట్రేడింగ్‌లోనూ మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ లిస్టింగ్ సక్సెస్ అయ్యింది. ఇష్యూ ధర(రూ.418)తో పోలిస్తే బీఎస్ఈలో 11.24% ప్రీమియంతో రూ.465 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో 22% ఎగసి రూ.510 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభపడి దాదాపు లిస్టింగ్ ధర రూ.464 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.3,197 కోట్లుగా నమోదైంది. ►ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత సిప్లా షేరు రాణించింది. డిసెంబర్ క్వార్టర్లో నికర లాభం 32% వృద్ధి చెందినట్లు వెల్లడించడం కలసి వచ్చింది. బీఎస్ఈలో ఈ షేరు 7% పెరిగి రూ.1,409 వద్ద ముగిసింది. ►సోనీ గ్రూప్ 10 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందం రద్దుతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేరు కుప్పకూలింది. బీఎస్ఈలో 10% నష్టంతో రూ.209 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో ఏకంగా 34% పతనమై రూ.152 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. చివరికి 33% నష్టంతో రూ.156 వద్ద స్థిరపడింది. ఒక దశలో షేరు ఇరు ఎక్సే్చంజీలో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. షేరు భారీ క్షీణతతో కంపెనీకి రూ.7,300 కోట్ల నష్టం వాటిల్లింది. ►హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు పతనం ఆగడం లేదు. బీఎస్ఈలో 3.50% నష్టపోయి రూ.1428 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.65% పతనమై రూ.1,425 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.83 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు వరుస అయిదు రోజుల్లో 13% క్షీణించింది. -
రిలయన్స్ లాభం 17,265 కోట్లు
న్యూఢిల్లీ: ఆయిల్ నుంచి రిటైల్ వరకు ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తున్న డైవర్సిఫైడ్ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ డిసెంబర్ త్రైమాసికంలో మిశ్రమ పనితీరు చూపించింది. రిటైల్, టెలికం వ్యాపారాలు రాణించగా, ఆయిల్ టు కెమికల్స్ (ఓటూసీ) నిరాశపరించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 9.3 శాతం పెరిగి రూ.17,265 కోట్లకు చేరుకుంది. షేరువారీ ఆర్జన రూ.25.52గా ఉంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3.6 శాతం వృద్ధితో రూ.2.28 లక్షల కోట్లుగా నమోదైంది. కానీ, 2023 సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చి చూస్తే నికర లాభం 0.7 శాతం, ఆదాయం 3 శాతం చొప్పున తక్కువగా నమోదయ్యాయి. ఎబిటా (ఆపరేటింగ్ మార్జిన్) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2.10 శాతం మేర, 2023 డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే 0.50 శాతం మేర పెరిగి 18 శాతానికి చేరింది. రుణాలపై వ్యయాలు 11 శాతం పెరిగి రూ.5,789 కోట్లుగా ఉన్నాయి. బ్యాలన్స్ షీటులో నగదు, నగదు సమానాలు రూ.1.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. కన్సాలిడేటెడ్ రుణ భారం రూ.3.12 లక్షల కోట్లుగా, నికర రుణ భారం రూ.1,19,372 కోట్లుగా ఉంది. రిటైల్ భేష్... ► రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) కన్సాలిడేటెడ్ లాభం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 40 శాతం పెరిగి రూ.3,165 కోట్లకు చేరింది. ►స్థూల ఆదాయం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 23 శాతం వృద్ధితో రూ.83,063 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో కంపెనీకి ఇదే అత్యధిక ఆదాయం. ► ఎబిటా 31% పెరిగి రూ.6,258 కోట్లు. ► గత త్రైమాసికంలో 252 స్టోర్లను కొత్తగా ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 18,774కు చేరింది. ఆయిల్, కెమికల్స్... ఆయిల్ టు కెమికల్స్ విభాగంలోనే బలహీనత కనిపించింది. నిర్వహణ పనుల కోసం జామ్‌నగర్‌లోని రిఫైనరీ ప్లాంట్లను ఏడు వారాలు మూసివేయడం ప్రభావం చూపించింది. ఆయిల్ టు కెమికల్స్ ఆదాయం 2.4% తగ్గి రూ.1.41 లక్షల కోట్లుగా ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఆదాయం 50% వృద్ధితో రూ.6,719 కోట్లకు ఎగసింది.రిలయన్స్ షేరు ఫ్లాట్‌గా రూ.2,736 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. జియో జూమ్... టెలికం, డిజిటల్ వ్యాపారం రాణించింది. నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12% పెరిగి రూ.5,445 కోట్ల గా ఉంది. ఆదాయం 11 శాతానికి పైగా వృద్ధితో రూ.32,510 కోట్లుగా నమోదైంది. జియో వరకే చూస్తే లాభం 12% పెరిగి రూ.5,208 కోట్లుగా ఉంది. ఆదాయం 10% వృద్ధితో రూ.25,368 కోట్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయ రూ. 181.70కి చేరింది. ఏడాది క్రితం రూ. 178గా ఉంది. 2023 సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలి స్తే ఫ్లాట్‌గా ఉంది. డిసెంబర్ నాటికి కస్టమర్ల సంఖ్య 470.09 మిలియన్లకు చేరింది. నికరంగా 11.2 మిలియన్ల కస్టమర్లు జతయ్యారు. 9 కోట్ల మంది 5జీ నెట్‌వర్క్‌కు మళ్లారు. -
చెల్లి పెళ్లి సొమ్ముతో ఆన్లైన్ గేమ్ ఆడి..
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాకు చెందిన ఒక బీఎస్సీ విద్యార్థి ఆన్లైన్ గేమ్ ఆడి సుమారు రూ.5.5 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తాన్ని అతని సోదరి పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఉంచారు. ఆన్లైన్ గేమ్‌లో రూ. 5 లక్షలకు పైగా మొత్తాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ కుర్రాడు కిడ్నాప్ నాటకం ఆడాడు. ఆన్లైన్ గేమ్‌లో భారీగా సొమ్మును పోగొట్టుకున్న తర్వాత అతనిని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో కిడ్నాప్ నాటకం ఆడి, తప్పుడు కథనాన్ని సృష్టించాడు. ఇటావా జిల్లాలోని ఫ్రెండ్స్ కాలనీలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. బీఎస్సీ విద్యార్థి కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పోలీసుల విచారణలో.. కుటుంబసభ్యులు మందలింపుతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తేలింది. బీఎస్సీ చదువుకుంటున్న తమ కుర్రాడు కిడ్నాప్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిటీ ఎస్పీ, సిటీ సీఓ దర్యాప్తు చేపట్టి ఆ విద్యార్థి ఆచూకీ తెలసుకున్నారు. ఆ కుర్రాడు తాను కిడ్రాప్ అయినట్లు నాటకం ఆడాడని ఇటావా ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఈ కుర్రాడి సోదరి వివాహం జరగనుంది. ఈ నేపధ్యంలో కుటుంబ సభ్యులు అతని ఖాతాలో సుమారు రూ.5 లక్షలు జమ చేశారు. ఆన్లైన్ గేమ్ ఆడిన ఆ కుర్రాడు తన దగ్గరున్న సొమ్మునంతా పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ కుర్రాడిని తీవ్రంగా మందలించారు. దీంతో ఆ కుర్రాడు తన సోదరుడు, ఒక బంధువు సహకారంతో కిడ్నాప్ డ్రామా ఆడాడు. జనవరి ఒకటిన రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇటావా పరిధిలోని ఘూగల్‌పూర్‌లో ఉంటున్న ఆ కుర్రాడి బంధువు శివం యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బంధువు సంజీవ్‌కుమార్ యాదవ్ కుమారుడు అంకిత్ యాదవ్‌ను గుర్తుతెలియని దుండగులు కారులో కిడ్నాప్ చేశారని అతను తన మొబైల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఘూఘల్‌పూర్‌కు చేరుకున్నారు. ఇటావా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు అదనపు పోలీసు సూపరింటెండెంట్ మార్గదర్శకత్వంలో అంకిత్ యాదవ్‌ను వెదికేందుకు పోలీసుల బృందం ఏర్పాయ్యింది. వీరికి ఈ ఘటన అనుమానాస్పదంగా కనిపించడంతో శివమ్ యాదవ్, అతని కుటుంబ సభ్యులను పోలీసు బృందం విచారించింది. ఈ నేపధ్యంలో అంకిత్ యాదవ్‌ను వెదికి పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
టాప్-5 డైట్ ప్లాన్స్... 2023లో ఇలా బరువు తగ్గారట!
2023లో కొన్ని డైట్ ప్లాన్లు వార్తల్లో నిలిచాయి. వీటిలో వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రయోజనకరంగా ఉండే డైట్ ప్లాన్ కూడా ఉంది. ఆ వివరాలతో పాటు 2023లో చర్చకు వచ్చిన టాప్-5 డైట్ ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మెడిటేరియన్ డైట్ 2023లో మెడిటేరియన్ డైట్ అధికంగా చర్చల్లోకి వచ్చింది. చాలా మంది దీనిని అనుసరించారు. ఈ డైట్ ప్లాన్‌లో వారానికోసారి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాల్సి ఉంటుంది. చక్కెర, కొవ్వు పదారార్థాలు తీసుకోకూడదు. గుండెపోటు, స్ట్రోక్, టైప్ -2 డయాబెటిస్ బాధితులు వైద్యుల సూచనల మేరకు ఈ ప్లాన్ అనుసరించారు. 2. వెయిట్ వాచర్స్ రెసిపీ డైట్ వెయిట్ వాచర్స్ రెసిపీలో వేగంగా బరువు తగ్గడంలో సహాయపడే అనేక అంశాలు ఉన్నాయి. బరువు తగ్గడంలో సహాయపడే ఆహార ప్రణాళిక దీనిలో ఉంది. దీనిలో రెండు ఫార్ములాలు ఉన్నాయి. మొదటి ఫార్ములాలో ఆహారంలో నూనె పదార్థాలకు దూరంగా ఉండటం. రెండవ ఫార్ములా.. అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం. అలాగే కార్బోహైడ్రేట్లు వీలైనంత తక్కువగా తీసుకోవడం. 3. కీటో డైట్ కీటో డైట్లో తక్కువ కార్బ్, తక్కువ కొవ్వు పదార్ధాల వినియోగంపై దృష్టి పెట్టాలి. కీటో డైట్ ద్వారా కొన్ని వారాల్లోనే వేగంగా బరువు తగ్గవచ్చు. వైద్యులు పర్యవేక్షణలో ఈ డైట్‌ని ఎంచుకోవాలి. ఎందుకంటే దీనిని దీర్ఘకాలం పాటు ఫాలో చేస్తే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. 4. డాష్ డైట్ డాష్ డైట్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని చెబుతారు. డాష్ అంటే హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడానికి ఉపయోగపడే డైట్ ప్లాన్. ఇది అధిక రక్తపోటు నియంత్రణకు రూపొందించిన ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక. హృద్రోగులు దీనిని పాటిస్తుంటారు. 5. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అడపాదడపా ఉపవాసం. ప్రతిరోజూ కొంత సమయం లేదా వారంలో ఒకరోజు ఏమీ తినకుండా ఉండటం. అడపాదడపా ఉపవాసంలో ప్రతిరోజూ కొన్ని గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి. లేదా వారంలో ఒక రోజు ఉపవాసం చేసి, మరుసటి రోజు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. ఈ ఐదు డైట్ ప్లాన్లు 2023లో అత్యంత ఆదరణ పొందాయి. ఇది కూడా చదవండి: గ్యాస్ చాంబర్‌గా రాజధాని.. కనిపించని సూర్యుడు! -
ఉదారంగా ఆదుకోండి
సాక్షి, అమరావతి/పామర్రు/గుడివాడ/కంకిపాడు: మిచాంగ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ముందెన్నడూలేని విధంగా 19 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో సాయం అందించే విషయంలో ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ–విపత్తుల నిర్వహణ శాఖ) సాయిప్రసాద్ కేంద్ర బృందానికి విన్నవించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో నష్టాలను అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందంతో బుధవారం తాడేపల్లిలో విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్, వ్యవసాయ శాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీధర్ తదితరులతో కలిసి సాయిప్రసాద్ సమావేశమయ్యారు. తుపాను తీవ్రతతో కురిసిన భారీ వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర బృందానికి వివరించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ వ్యవస్థలు సైతం దెబ్బతిన్నాయని తెలిపారు. వీలైనంత మేర ఆదుకోవడానికి సహకరిస్తాం: కేంద్ర బృందం కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ మాట్లాడుతూ.. తుపానుతో తీవ్రంగా ప్రభావితమైన నాలుగు జిల్లాల్లో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తామని చెప్పారు. తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి వెంటనే అందించి వీలైనంత మేర ఆదుకోవడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. తుపాను వల్ల కలిగిన నష్టాలను విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ కేంద్ర బృందానికి వివరించారు. శాఖాపరంగా రోడ్లు, భవనాల శాఖకు రూ.2,641 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.703 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు రూ.100 కోట్లు, ఉద్యాన శాఖకు రూ.86.97 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. మొత్తంగా మిచాంగ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వాటి పునరుద్ధరణకు రూ.3,711 కోట్లు సాయం అందించాలని విన్నవించారు. ఈ సమావేశం తర్వాత కేంద్ర బృందం తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లింది. గురువారం కూడా ఈ బృందం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. రైతులకు న్యాయం చేస్తాం.. రాష్ట్రంలో పంట నష్టం గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలిపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర బృందం ప్రతినిధి రాజేంద్ర రత్నూ పేర్కొన్నారు. బుధవారం కృష్ణా జిల్లా పామర్రు, కంకిపాడు, గుడివాడల్లో కేంద్ర బృందం పర్యటించింది. కంకిపాడు రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది. గుడివాడ మండలం రామనపూడి, వలిపర్తిపాడు గ్రామాల్లో పర్యటించి పంటలను పరిశీలించింది. అలాగే పామర్రు మండలం నెమ్మలూరు, కొరిమెర్ల తదితర గ్రామాల పరిధిలో తుపాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజితాసింగ్ తదితరులతో కలిసి రాజేంద్ర రత్నూ పరిశీలించారు. నెమ్మలూరులో కౌలు రైతు ఆత్మూరి రామ కోటేశ్వరరావు కేంద్ర బృందంతో మాట్లాడుతూ సాగు చేస్తున్న 40 ఎకరాలలోని వరి పంట పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పంట కాలువలు, మురుగు డ్రెయిన్ల నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ఏటా పంట నష్ట పోవాల్సి వస్తోందని దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ వివిధ గ్రామాల రైతులు కేంద్రం బృందానికి అర్జీలను సమర్పించారు. మొత్తం 1,270 ఎకరాల సాగులో 1,040 ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు. జేసీ అపరాజితాసింగ్ స్థానికంగా జరిగిన పంట నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారధి, కైలే అనిల్ కుమార్, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. నేడు దెబ్బతిన్న ధాన్యం పరిశీలన తుపాను దాటికి దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల కేంద్ర పౌరసరఫరాల శాఖ సాంకేతిక బృందం గురువారం నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. తుపాను ప్రభావిత జిల్లాల్లో పంట కోసి తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యంతో పాటు ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన ధాన్యంలో విరిగిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం నమూనాలను సేకరించనుంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటనకు ఏపీ పౌరసరఫరాల సంస్థ సహాయకులను ఎంపిక చేసింది. కాగా ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. ఈ క్రమంలో తేమ శాతంతో సంబంధం లేకుండా తడిచిన ధాన్యాన్ని సైతం సేకరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తుపాను ప్రభావం కారణంగా ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ సైతం రాసింది. వర్షాలు తగ్గడంతో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తోంది. -
అయ్యయ్యో..ఎంత విషాదం: మంచికోసం వెళ్లి..మృత్యు ఒడిలోకి!
ఎవరికి ఏమైతే నాకేంటిలే అని అనుకోకుండా తోటి మనిషికి సాయం చేయాలని ప్రయత్నించిన వ్యక్తి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో చిక్కుకున్న మనషికి సాయం చేయాలని ప్రయత్నించి తానే ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. నైరుతి ఢిల్లీలోని కార్గిల్ చౌక్ సమీపంలో నవంబర్ 3న ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ప్రమాదంలో గాయపడిన తోటి బైకర్‌ను రక్షించి, ఆ ప్లేస్ నుంచి బయలుదేరుతున్న సమయంలో వాటర్ ట్యాంక్ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో షంషేర్ సింగ్ అనే వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదైంది. అమర్జీత్ సింగ్ నవంబర్ 3వ తేదీ రాత్రి 10.20 గంటల సమయంలో గురుగ్రామ్‌కు వెళుతుండగా, అతని కారును వెనుక నుంచి మోటార్ సైకిల్ ఢీకొట్టింది. అతను మద్యం సేవించి ఉండటంతో నియంత్రణ కోల్పోయి కారును ఢీకెట్టాడు. ఫలితంగా అతని తలకు గాయం అయింది. ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు సహాయం కోసం ఆగారు. వారిలో షంషేర్ కూడా ఉన్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో మరొక వ్యక్తి గాయపడిన బైకర్‌ను తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ముందుకొచ్చాడు. దీంతో అమర్జీత్, షంషేర్ కలిసి గాయపడిన వ్యక్తిని కారులోకి ఎక్కించారు. అనంతరం అక్కడినుంచి షంషేర్ బయలుదేరుతుండగా వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ అతడిని బలంగా ఢీకొట్టింది. దీంతో షంషేర్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. దీంతో అమర్జీత్ ఆ వాహనాన్ని వెంబడించి, దాన్ని ఓవర్టేక్ చేయగలిగాడు. కానీ డ్రైవర్ అప్పటికే అక్కడినుంచి పారాపోయాడు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారి చెప్పారు. అలాగే షంషేర్ సాయం చేసిన బైకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాదని ద్వారకా నార్త్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. -
డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోదీ
అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెటర్లను ప్రధాని మోదీ ఓదార్చారు. ఓటమి సాధారణమైనది, నిరుత్సాపడకూడదని ప్రోత్సహించారు. టోర్నీలో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన తీరును గుర్తుచేశారు. దేశమంతా చూస్తోంది.. దయచేసి నవ్వండని కోరారు. అప్పుడప్పుడు ఇలా జరగుతుందని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చేతులు పట్టుకుని ఉత్సాహపరిచారు. ఆటగాళ్లు ఒకరినొకరు నిరంతరం ప్రోత్సహించుకోవాలని చెప్పారు. గుజరాతీ అయిన రవీంద్ర జడేజాతో ప్రధాని మోదీ గుజరాతీలో మాట్లాడారు. ఏం బాబు అని పలకరిస్తూ ఇరువురు నవ్వులు కురిపించారు. మహ్మద్ షమీ వద్దకు వచ్చిన మోదీ.. షమీని కౌగిలించుకున్నారు. అద్భుతమైన ఆటతీరు కనబరిచావని మెచ్చుకున్నారు. #WATCH | Prime Minister Narendra Modi met Team India in their dressing room after the ICC World Cup Finals at Narendra Modi Stadium in Ahmedabad, Gujarat on 19th November. The PM spoke to the players and encouraged them for their performance throughout the tournament. (Video:… pic.twitter.com/ZqYIakoIIj — ANI (@ANI) November 21, 2023 అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ పోరుకు దిగింది. అయితే.. 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఆసిస్ అలవోక విజయం సాధించింది. ఓటమిని చవిచూసిన భారత ఆటగాళ్లు నిరుత్సాహంతో మైదానాన్ని వీడారు. కొందరు ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. మ్యాచ్‌ను వీక్షించడానికి వెళ్లిన ప్రధాని మోదీ క్రికెటర్లను డ్రస్సింగ్ రూంలో కలిశారు. నిరుత్సాహంలో ఉన్న ఆటగాళ్లను ఓదార్చారు. ఇదీ చదవండి: ద్రవిడ్‌ను కొనసాగిస్తారా లేక సాగనంపుతారా.. టీమిండియా తదుపరి కోచ్ ఎవరు..? -
బీఎస్ఈ లాభం హైజంప్
న్యూఢిల్లీ: మార్కెట్ దిగ్గజం బొంబాయి స్టాక్ ఎక్ఛేంజ్ (బీఎస్ఈ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం నాలుగు రెట్లు దూసుకెళ్లి రూ. 118 కోట్లను అధిగమించింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 29 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 53 శాతం జంప్‌చేసి రూ. 367 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 240 కోట్ల ఆదాయం సాధించింది. ఈక్విటీ విభాగంలో రోజువారీ సగటు టర్నోవర్ రూ. 4,740 కోట్ల నుంచి రూ. 5,922 కోట్లకు ఎగసింది. రైట్స్ ఇష్యూ ద్వారా ఇండియా ఇంటర్నేషనల్ ఎక్సే్ఛంజ్(ఐఎఫ్ఎస్సీ) లిమిటెడ్(ఇండియా ఐఎన్ఎక్స్)లో రూ. 22.36 కోట్లు, ఇండియా ఇంటర్నేషనల్ ఎక్సే్ఛంజ్(ఐఎఫ్ఎస్సీ) లిమిటెడ్(ఇండియా ఐసీసీ)లో రూ. 33.88 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు బీఎస్ఈ వెల్లడించింది. -
3 రోజుల లాభాలకు బ్రేక్
ముంబై: దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడంతో స్టాక్ సూచీల 3 రోజుల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. ఆసియా, యూరప్ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించారు. ట్రేడింగ్‌లో 383 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరికి 16 పాయింట్ల స్వల్ప నష్టంతో 64,942 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 94 పాయింట్ల పరిధిలో కదలాడింది. ఆఖరికి ఐదు పాయింట్ల నష్టంతో 19,407 వద్ద నిలిచింది. చైనా అక్టోబర్ ఎగుమతులు భారీగా క్షీణించినట్లు డేటా వెల్లడికావడంతో ఆసియాలో ఒక్క తైవాన్ తప్ప మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు 2% నష్టపోయాయి. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన, ఇంధన షేర్ల పతనంతో యూరప్ మార్కెట్లు ఒకశాతం మేర పతనమయ్యాయి. హోనాసా కన్జూమర్ లిస్టింగ్ పర్వాలేదనిపించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.324) వద్దే లిస్టయ్యింది. చివరికి 4% లాభంతో రూ.337 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.10,848 కోట్లుగా నమోదైంది. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ చివరిరోజు నాటికి 73.15 రెట్లు సబ్స్క్రయిబ్ అ య్యింది. 5.77 కోట్ల ఈక్విటీలను జారీ చేయగా 422 కోట్ల ఈక్విటీలకు బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐబీ కోటా 173.52 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్ల కోటా 84.37 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 16.97 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. -
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంతో భారత్‌కు నష్టం ఏమిటి?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంతో భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. అయితే యుద్ధం చాలా కాలం పాటు కొనసాగితే దాని ఫలితాలు భారత్‌పై పడే అవకాశాలున్నాయి. వాస్తవానికి, ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి దేశం ఏదో ఒక దేశంతో అనుసంధానమై ఉంది. అటువంటి పరిస్థితిలో ఒక దేశం ఇబ్బందుల్లో పడితే అది ఇతర దేశాలపై ప్రభావం చూపుతుంది. అయితే భారతదేశ పరిస్థితి కొద్దిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్‌తో భారత్ సంబంధాలు ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు బలంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడున్న పరిస్థితిలో ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం త్వరగా ముగియకపోతే భారత్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. యుద్ధం ఇలానే కొంతకాలం కొనసాగితే భారతదేశం భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడవలసి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముందుగా భారతదేశ దిగుమతి-ఎగుమతులు ప్రభావితమవుతాయి. ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ముడి చమురు ఉత్పత్తి తగ్గుతోంది. అటువంటి పరిస్థితిలో ఈ యుద్ధం కారణంగా రాబోయే రోజుల్లో ముడి చమురు ధరలు రాకెట్ వేగంతో పెరిగే అవకాశం ఉంది. ఆసియాలో ఇజ్రాయెల్‌కు భారతదేశం మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇజ్రాయెల్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాయి. భారతదేశ ఎగుమతుల్లో ఇజ్రాయెల్ వాటా 1.8%. ఇజ్రాయెల్ భారతదేశం నుండి 5.5 నుండి 6 బిలియన్ డాలర్ల విలువైన శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. ఇజ్రాయెల్ భారతదేశం నుండి శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులతో పాటు ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ సంబంధిత ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. పలు భారతీయ కంపెనీలు ఇజ్రాయెల్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ప్రస్తుతం అంతగా ప్రభావం కనిపించనప్పటికీ యుద్ధం త్వరగా ముగియకపోతే నష్టాల గణాంకాలు కనిపించనున్నాయి. ఇజ్రాయెల్‌తో పాటు భారత్‌కు పాలస్తీనాతో కూడా వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. భారతదేశం-పాలస్తీనా మధ్య వాణిజ్యం ఇజ్రాయెల్ ద్వారా జరుగుతుంది. 2020లో భారత్-పాలస్తీనా వాణిజ్య పరిమాణం సుమారు $67.77 మిలియన్లు. భారతదేశం నుండి మార్బుల్, గ్రానైట్, సిమెంట్, బాస్మతి బియ్యం, వైద్య, శస్త్రచికిత్స పరికరాలు మొదలైనవి పాలస్తీనాకు ఎగుమతి అవుతాయి. ఇదే సమయంలో భారతదేశం తాజా, ఎండిన ఖర్జూరాలు, లోహాలతో తయారైన వస్తువులను పాలస్తీనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం తీవ్రతరం అయితే పాలస్తీనాతో భారతదేశ దిగుమతి, ఎగుమతులు ప్రభావితం కానున్నాయి. అందుకే భారత్ ఈ యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటోంది. ఇది కూడా చదవండి: దేశంలో అత్యల్ప అక్షరాశ్యత గల జిల్లా ఏది? -
సాక్షి మనీ మంత్ర: ప్రారంభ లాభాలు ఆవిరి..నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ సూచీలు బుధవారం భారీ నష్టాల్లోకి ట్రేడయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మార్కెట్ ముగిసేనాటికి నష్టాల్లో జారుకున్నాయి. అమెరికా బాండ్ల రాబడి పెరగడం, అధిక క్రూడాయిల్ ధరలు వంటివి మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 522 పాయింట్ల మేర నష్టపోయి 64,049వద్దకు చేరింది. కాగా నిఫ్టీ 159 పాయింట్లు కుంగి 19,122కు చేరుకుంది. మార్కెట్లు ఒక్కసారిగా తలకిందులు కావటంతో దేశీయ పెట్టుబడిదారుల సంపద దాదాపు రూ.15 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. ప్రారంభంలో 65,619 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్.. కాసేపటికి నష్టాల్లోకి జారుకుని చివరి వరకు అలాగే కొనసాగించి. నిఫ్టీ 19286 వద్ద ప్రారంభమయింది. ఒకానొక సమయానికి 19074కు చేరుకుంది. చివరకు 19122 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.174గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఎస్బీఐ, ఎం అండ్ ఎం, మారుతీసుజుకీ, నెస్లే మిగతా అన్ని స్టాక్‌లు నష్టపోయాయి. ఇజ్రాయెల్-హమాస్ వివాదం కారణంగా ఉత్పన్నమయ్యే అనిశ్చితి మార్కెట్లపై ప్రభావం చూపుతూనే ఉంది. దాంతో బుధవారం భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు కుదేలయ్యాయి. లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం కనిష్ఠ స్థాయికి చేరాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, మిడిల్ ఈస్ట్ దేశాల్లోని భౌగోళిక రాజకీయ పరిస్థితి కారణంగా మార్కెట్లు బలహీనంగా మారాయి. దాంతో మదుపర్లు అమ్మకాలకు పూనుకున్నారు. ఈ పరిస్థితులపై కొంత స్పష్టత వచ్చే వరకు పెట్టుబడిదారులు మార్కెట్‌ను జాగ్రత్తగా పరిశీలించే అవకాశం ఉందనే వాదనలు ఉన్నాయి. నెలవారి డెరివేటివ్‌ల ముగింపునకు రేపు చివరితేది కావడంతో కూడా మార్కెట్లు నష్టాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఫ్లిప్‌కార్ట్ నష్టాలు పెరిగాయ్
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర నష్టం భారీగా పెరిగి రూ. 4,891 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 3,371 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం స్టాండెలోన్ నష్టాలు సైతం 44 శాతం పెరిగి రూ. 4,839 కోట్లను దాటాయి. అంతక్రితం రూ. 3,362 కోట్ల నష్టం ప్రకటించింది. కాగా.. కన్సాలిడేటెడ్ ఆదాయం 9 శాతంపైగా ఎగసి రూ. 56,013 కోట్లకు చేరింది. 2021–22లో మొత్తం ఆదాయం రూ. 51,176 కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యయాలు రూ. 60,858 కోట్లకు చేరాయి. -
ఒక్క వీడియోతో లక్షన్నర పొగొట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్!
సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ యూట్యూబర్ అభిషేక్ మల్హాన్. ఇటీవలే తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన జీవితంలో మొదటిసారి పెద్దమొత్తంలో నగదును వెంట తీసుకెళ్తున్నట్లు వీడియోలో వెల్లడించాడు. రూ. 1.5 లక్షలతో ఐఫోన్ కొనాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని డబ్బులు గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారు. (ఇది చదవండి: కావాలయ్యా సాంగ్.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు) అభిషేక్ వీడియోలో మాట్లాడుతూ.. "నేను నా జీవితంలో ఇంత పెద్ద మొత్తంలో నగదును ఎప్పుడూ తీసుకువెళ్లలేదు. ఈ సమయంలో నా హృదయం బాధతో ఉప్పొంగిపోతోంది. నా డబ్బు ఎలా పోయిందో ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఆ డబ్బులతో ఒక ఐఫోన్‌ని కొనుగోలు చేయాలనుకున్నా. కానీ ప్రస్తుతం ఆ నగదు నా వద్ద లేదు. డబ్బుతో జాగ్రత్తగా ఉండమని మా నాన్న చాలా సార్లు చెప్పారు. నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటానని అనుకోలేదు. ఇది తలుచుకుంటే చాలా భయంగా ఉంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నా" అంటూ పోస్ట్ చేశారు. కాగా.. అభిషేక్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2లో మొదటి రన్నరప్‌గా నిలిచాడు. ప్రస్తుతం యూట్యూబర్‌గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా పోస్ట్‌లతో తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు. (ఇది చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు బిగ్ షాక్.. షో మధ్యలోనే అరెస్ట్!) -
దీర్ఘకాలికంగా డయాబెటిస్ మందులు వాడుతున్నారా?
దీర్ఘకాలికి వ్యాధుల కోసం వాడే మందులు సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ వాడక తప్పదు. కొన్ని వ్యాధులైతే జీవితాంతం మందులు వాడాల్సిందే. ఓ పట్టాన తగ్గవు. అలా వాడటంతో ఆ సమస్యలకు మరికొన్ని సమస్యలు యాడ్ అవుతుంటాయి. కానీ కొన్ని వ్యాధులకు వాడిన మందులు మాత్రం విపరీతమైన దుష్పరిణామాలు చూపించి మనిషిని చావు అంచులదాక తీసుకువెళ్తాయి. యూఎస్‌లోని ఓ మహిళ అలాంటి ఘోర అనుభవమే ఎదుర్కొంది. డయాబిటిస్ కోసం వాడే మందులు ఇంతటి చేటు తెచ్చిపెడతాయిన అస్సలు ఊహిచలేదని వాపోయింది. వివరాల్లోకెళ్తే..టెక్సాస్‌కు చెందిన అమెరికన్ ప్రొఫెసర్ టైప్ 2 డయాబెటిస్‌కి డ్రగ్ ఓజెంపిక్ మందులను వాడుతుంది. దీని వల్ల ఆమె విపరీతమైన దుష్పరిణామాలను ఎదుర్కొంది. ఒక్కసారిగా ఆకలిని తగ్గించేసింది. దీంతో బరువు తగ్గిపోయింది. ఆ తర్వాత ఆమె బాడీలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోయాయి. జీర్ణక్రియను నెమ్మదించడంతో ఇతరత్ర దుష్పరిణామాలు ఎదుర్కోవల్సి వచ్చింది. ఇదికాస్త డిప్రెషన్ యాంగ్జయిటీలో పెట్టింది. ఆ తర్వాత ఆమె టాయిలెట్‌కి వెళ్లినప్పుడల్లా ఆమె చర్మం పొలుసులుగా ఊడిపోవడం ప్రారంభమైంది. మూత్ర విజర్జనకు వెళ్తున్న ప్రతిసారి విపరీతమైన నొప్పి బాధ తాళలేకపోయింది. ఇంతలా ఈ మందు నా శరీరంపై ప్రభావం చూపిస్తుందని అనుకోలేదని బోరున విలపించింది. దీంతో ఆమె వైద్యుడు ఆ మందులను సిఫార్సు చేయడం ఆపేశాడు. ఆ మందుని వాడటం ఆపేసినప్పటికీ ఇంకా ఆ డ్రగ్ తాలుకా దురద, మూత్ర విసర్జన నొప్పి ఇంకా పోలేదని చెబుతోంది. ఇంతకీ ఓజెంపిక్ దుష్పరిణామాలను ఎందుకు కలిగిస్తుందంటే.. సెమాగ్లుటైడ్ అని పిలిచే ఓజెంపిక్ ఊబకాయం, ఇతర బరువు సంబంధిత వైద్య సమస్యలతో జీవిస్తున్న వ్యక్తులకు చికిత్స చేయడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినస్ట్రేషన్ దీని సిఫార్సు చేయమని ఆమోదించింది. ఇది గ్లూకాగాన్లాంటి పెప్టైడ్-1 లేదా జీఎల్పీ-1 రిసెప్టర్ అగోనిస్ట్లను సక్రియం చేసి సహజంగా సంభవించే హర్మోన్ జీఎల్పీ-1 ప్రభావాన్ని పెంచుతుంది. ఈ జీఎల్పీ -1 శరీరంలో బహుళ విధులను నిర్వర్తిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ను పెంచే హార్మోన్ అయిన గ్లూకాగాన్ విడుదలను తగ్గిస్తుంది. జీఎల్పీ-1 గ్రాహకం మెదడులోని ఆకలి కేంద్రాలను ప్రభావితం చేస్తుంది. ఆకలి కోరికను తగ్గిస్తుంది. కడుపు ఖాళీ అయ్యే రేటును పెంచి బరువు తగ్గేలా చేస్తుంది. ఈ డ్రగ్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. జంతువులలో ఈ డ్రగ్‌ని ప్రయోగిస్తే థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాద హెచ్చరికను ఇచ్చింది. ఐతే ఈ ఔషధం మానవులలో థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందా లేదా అన్నది క్లారిటీ లేదు. కానీ యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినస్ట్రేషన్ మాత్రం అరుదైన జన్యు పరిస్థితి ఉన్నవారు, లేదా కుటుంబసభ్యులకు థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తులకు ఈ మందుని సిఫార్సు చేయకూడదని పేర్కొంది. (చదవండి: భారత సంతతి విద్యార్థికి.. ఒకేరోజు ఏకంగా ఆరుసార్లు గుండె ఆగిపోడమా!..) -
ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే...
ముంబై: విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ఆసియా మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ మంగళవారం అరశాతం పతనమైంది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఒకశాతానికి పైగా క్షీణించి సూచీలను నష్టాల వైపు నడిపించాయి. సెన్సెక్స్ 316 పాయింట్లు క్షీణించి 65,512 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 19,529 వద్ద నిలిచింది. 3 రోజుల వరుస సెలవుల తర్వాత స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 484 పాయింట్లు పతనమై 65,345 వద్ద, నిఫ్టీ 158 పాయింట్లు క్షీణించి 19,480 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ప్రైవేట్ బ్యాంకింగ్, ఆటో, ఐటీ స్టాకులు షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, మీడియా, రియల్టి, కన్జూ్యమర్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,034 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,361 కోట్ల షేర్లను కొన్నారు. వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ఆర్బీఐ పాలసీ, కార్పొరేట్ క్యూ2 ఫలితాల ప్రకటనకు ముందు ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లకు భారీ డిమాండ్ లభించింది. యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్, పీఎన్బీ, పీఎస్బీ, ఐఓబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 5–3% ర్యాలీ చేశాయి. యుకో బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 2% లాభపడ్డాయి. ఎస్బీఐ బ్యాంక్ షేరు ఒకశాతం పెరిగింది. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్ రెండున్నర శాతం ర్యాలీ చేసింది కేంద్ర పెట్రోలియం శాఖ దేశీయ సహజ వాయువు ధరలు 7% పెంచడంతో ఓఎన్బీసీ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య రికవరీ సైతం ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా ఈ షేరు బీఎస్ఈలో 4% నష్టపోయి రూ.185 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 4.50% క్షీణించి రూ.184 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇండెక్సుల్లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ఐషర్ మోటార్స్ షేరు 3% నష్టపోయి రూ.3351 వద్ద స్థిరపడింది. మోటార్ సైకిళ్ల అమ్మకాలు సెపె్టంబర్లో తగ్గిపోవడం షేరు పతనానికి కారణమైంది. హిట్... ఫ్లాట్ నష్టాల మార్కెట్లోనూ జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిస్టింగ్ బంపర్ హిట్ కొట్టింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.119)తో పోలిస్తే 20% ప్రీమియంతో రూ.143 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్ ఆద్యంతం కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా షేరు 32.18% ర్యాలీ చేసి ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.157 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.33,033 కోట్లుగా స్థిరపడింది. ఎక్సే్చంజీలో మొత్తం 57.99 లక్షల ఈక్విటీ షేర్లను చేతులు మారాయి. మనోజ్ వైభవ్ జెమ్స్ ఎన్ జ్యువెలర్స్ షేరు ఫ్లాటుగా లిస్టయింది. ఇష్యూ ధర (రూ.215)తో పోలిస్తే బీఎస్ఈలో లాభ, నష్టాలు లేకుండా రూ.215 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.210–222 మధ్య ట్రేడైంది. చివరికి 0.30% స్వల్ప లాభంతో రూ.216 వద్ద క్లోజైంది. మార్కె ట్ విలువ రూ.1,053 కోట్లుగా నమోదైంది. -
నిఖత్ జరీన్‌కు చుక్కెదురు
కచ్చితంగా స్వర్ణ పతకంతో తిరిగి వస్తుందనుకున్న భారత స్టార్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్‌కు ఆసియా క్రీడల్లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మహిళల 50 కేజీల విభాగం సెమీఫైనల్లో నిఖత్ 2–3తో రక్సత్ చుథామట్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. దాంతో ఈ తెలంగాణ బాక్సర్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రక్సత్‌ను అలవోకగా ఓడించిన నిఖత్‌కు ఈసారి గట్టిపోటీ ఎదురైంది. పక్కా ప్రణాళికతో ఈ బౌట్లో దిగిన రక్సత్ భారత బాక్సర్‌ను నిలువరించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు స్వర్ణాలు నెగ్గిన నిఖత్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకంతో సంతృప్తి పడింది. మరోవైపు భారత్‌కే చెందిన పర్వీన్ హుడా (63 కేజీలు) సెమీఫైనల్ చేరుకొని కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకోవడంతోపాటు పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో పర్విన్ హుడా 5–0తో తుర్దిబెకోవా సితోరా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచింది. అయితే జాస్మిన్ (60 కేజీలు) పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ఉంగ్యోంగ్ వన్ (ఉత్తర కొరియా) సంధించిన పంచ్‌లకు జాస్మిన్ తట్టుకోలేకపోయింది. దాంతో రిఫరీ రెండో రౌండ్లో బౌట్‌ను ముగించి ఉంగ్యోంగ్ను విజేతగా ప్రకటించారు. -
21 కి.మీ. పరిగెత్తితే 11 కిలోలు తగ్గుతారా?.. దీనిలో నిజమెంత?
శరీర బరువును తగ్గించడంలో రన్నింగ్ సహాయపడుతుందని ఫిట్నెస్ నిపుణులు చెప్పడాన్ని మీరు వినే ఉంటారు. అయితే ఒక వ్యక్తి కేవలం 21 కిలోమీటర్ల రన్నింగ్ ద్వారా తన శరీర బరువును 11 కిలోలు తగ్గించుకున్నాడనే సంగతి మీకు తెలుసా? ఇటీవల రష్యాలోని రిపబ్లిక్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక వృద్ధుడు రన్నింగ్ ద్వారా 11 కిలోల బరువు తగ్గాడు. ఇందుకోసం ఆ వృద్ధుడు 2 గంటల 50 నిముషాలు పరిగెత్తాడు. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలేమిటో ధృవీకరణ కాలేదు. రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లో ఉంటున్న 69 ఏళ్ల బహామా ఎగుబోవ్ పేరు 2019లో రష్యన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. అప్పుడు బహామా 5 గంటల పాటు పరిగెత్తి, 9 కిలోలకుపైగా బరువు తగ్గాడు. తాజాగా బహామా ఎగుబోవ్ 21 కిలోమీటర్ల రేసులో పరుగు తీసి, కేవలం రెండున్నర గంటల్లోనే 11 కిలోల బరువు తగ్గాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫీట్లో బహామా ఎగుబోవ్ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కాలేదు. ఎందుకంటే శరీరానికి హాని కలిగించే ఇలాంటి విజయాన్ని రికార్డ్‌గా పరిగణించరు. త్వరగా బరువు తగ్గేందుకు ప్రయోగాలు చేయడం ప్రాణాంతకం కావచ్చని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత వేగంగా బరువు తగ్గిన వ్యక్తి ని తానేనని బహామా ఎగుబోవ్ చెబుతున్నాడు. ఆడిటీ సెంట్రల్ న్యూస్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం బహామా.. జూడో, సాంబో, గ్రీకో-రోమన్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ప్రావీణ్యం సాధించాడు. బహామా ఒకప్పుడు యుద్ధాల్లో పాల్గొన్న సమయంలో బరువు తగ్గించే కళను నేర్చుకున్నాడు. తాను తన చిన్నతనంలో యుద్ధాల కోసం 17 కిలోల బరువును తగ్గానని బహామా తెలిపాడు. అయితే వృద్ధాప్యంలో బరువు తగ్గడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అయినా తాను ఈ ఘనత సాధించానని పేర్కొన్నాడు. పోషకాహార నిపుణుడు ఒక్సానా లైసెంకో మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా రెండు గంటల్లో 11 కిలోల బరువు తగ్గాలంటే, శరీరం నుండి తగినంత ద్రవాన్ని తొలగించాలి. ఇది బహామా ఎగుబోవ్ విషయంలో నిస్సందేహంగా జరిగింది. అయితే సాధారణ వ్యక్తి ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని ఆయన హెచ్చరించారు. ఇది కూడా చదవండి: భారత్- కెనడాల మధ్య చిచ్చుపెడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు? -
జీ20 సమ్మిట్: దాదాపు రూ. 400కోట్లు నష్టం, వ్యాపారుల ఆందోళన
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన (సెప్టెంబర్ 8-10) జీ20 సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. అయితే ఈ సందర్భంగా విధించిన ఆంక్షలు కారణంగా ట్రాఫిక్ నియంత్రణల కారణంగావ్యాపారులు భారీగా నష్టపోయినట్టు తెలుస్తోంది. ఇటీవల వర్షాలు, వరదలతో కుదేలైన వ్యాపారాలు ఇది మరింత నష్టాన్ని మిగిల్చిందని మార్కెట్ వర్గాలు వాపోతున్నాయి. అంతేకాదు దాదాపు 9,000 మంది డెలివరీ కార్మికులను కూడా ప్రభావితం చేసిందట జీ20 సదస్సు నిర్వహణకు సంబంధించిన ఆంక్షలతో వ్యాపారులకు సుమారు రూ.300-400 కోట్ల నష్టం వాటిల్లిందని న్యూ ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అతుల్ భార్గవ వెల్లడించారు. షాపింగ్, డైనింగ్లకు ప్రసిద్ధి చెందిన ఖాన్ మార్కెట్, కన్నాట్ ప్లేస్, జన్‌పథ్ వంటి అగ్ర మార్కెట్లలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ ఆంక్షలు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి రావడంతో సంబంధి జోన్ బయట ఉన్న వ్యాపారాలు సైతం నష్టపోయాయని వెల్లడించారు. ఎక్కువగా వారాంతపు షాపింగ్ వల్ల వచ్చే ఆదాయాన్ని కోల్పోయినట్లు తెలిపారు. VIDEO | Glimpses from day one and day two of Delhi G20 Summit 2023. (Source: Third Party) pic.twitter.com/md9j3F7rmq — Press Trust of India (@PTI_News) September 11, 2023 ఢిల్లీలో డైన్, డెలివరీ సంఖ్యలు రెండూ కనీసం 50శాతం తగ్గాయనీ ఎన్‌సిఆర్‌లో అమ్మకాలు 20శాతం వరకు క్షీణించాయని స్పెషాలిటీ రెస్టారెంట్ల ఛైర్మన్ అంజన్ ఛటర్జీ తెలిపారు. లాంగ్ వీకెండ్లో (సెప్టెంబర్ 8-10) వ్యాపార అవకాశాలను కోల్పోయామని పంజాబ్ గ్రిల్, జాంబర్ అండ్ యూమీ చైన్లను నిర్వహిస్తున్న లైట్ బైట్ ఫుడ్స్ డైరెక్టర్ రోహిత్ అగర్వాల్ వెల్లడించారు. జీ20 ఖర్చు .4,100 కోట్లు :బడ్జెట్లో కేటాయించింది రూ.990కోట్లే G20 సమ్మిట్ ఈవెంట్‌కు సంబంధించిన మొత్తంగా రూ. 4,100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వ రికార్డుల ప్రకారం ల ద్వారా తెలుస్తోంది. ఫిబ్రవరిలో ప్రకటించిన 2023-24 బడ్జెట్లో G20 అధ్యక్ష పదవికి రూ.990 కోట్లు కేటాయించారు. అంటే ఈ మొత్తం బడ్జెట్లో కేటాయించిన మొత్తానికి నాలుగు రెట్లు ఎక్కువ. ఈ ఈవెంట్ జరిగిన సెప్టెంబర్ 8 - 10 మధ్య ఢిల్లీ చుట్టుపక్కల ఆంక్షలతోపాటు, అన్ని వాణిజ్య , ఆర్థిక సంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. -
సుతీర్థ–ఐహిక జోడీ ఓటమి
ప్యాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగాల్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మానవ్ ఠక్కర్ 9–11, 10–12, 5–11తో చైనా దిగ్గజం మా లాంగ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో సుతీర్థ 9–11, 6–11, 4–11తో ఒరావన్ పరానాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో... ఐహిక ముఖర్జీ 11–2, 11–6, 8–11, 9–11, 3–11తో చెన్ జింగ్టాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ (భారత్) జోడీ 5–11, 11–13, 10–12తో మాన్యు వాంగ్–చెన్ మెంగ్ (చైనా) ద్వయం చేతిలో... పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మానవ్ ఠక్కర్–మనుష్ షా (భారత్) జంట 5–11, 3–11, 5–11తో ఫాన్ జెన్‌డాంగ్–లిన్ గావోయువాన్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయాయి. టీమ్ విభాగంలో భారత పురుషుల జట్టు కాంస్య పతకం నెగ్గగా... మహిళల జట్టుకు ఆరో స్థానం లభించింది. -
'మాంసం తినే బ్యాక్టీరియా'!.. దీని బారిన పడితే..అంతే సంగతులు!
యూఎస్‌లోని తూర్పు తీర వెంబడి సముద్ర జలాల్లో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది విబ్రియో వల్నిఫికస్ అనే ప్రాణాంతక గాయాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఈ బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్లు నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌కు దారితీస్తుంది. దీంతో ఓపెన్ గాయం చుట్టూ మాంసం కుళ్లపోవడం ప్రారంభమవుతుంది. దీన్నే మాంసం తినే బ్యాక్టీరియాగా చెబుతారు. ఈ నైక్రోటైజింగ్ ఫాసిటస్ అనేది ఒకటికంటే ఎక్కువ రకాల బ్యాక్టీరియాల వల్ల సంభవిస్తుంది. దీని బారిన పడిన కేసుల్లో చాలావరకు ప్రాణాలు కోల్పోయే అవకాశం గానీ అవయవాన్ని కోల్పోయే ప్రమాదం గానీ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్ బారినే జెన్నిఫర్ బార్లో అనే అట్లాంట మహిళ పడి మరణం అంచులాదాకి వెళ్లొచ్చింది. అసలేం జరిగిందంటే.. జెన్నిఫర్ బార్లో(33) అనే అట్టాంట మహిళ యూఎస్‌లోని బహామాస్ పర్యటనలో ఉన్నప్పుడు..సముద్రపు నీరు కారణంగా చిన్నపాటి గాయం అయ్యింది. చాలా చిన్ననీళ్ల ఒరిపిడి గాయం. అదికాస్త పెద్దదిగా అయ్యి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్కి గురవ్వుతుందని ఊహించను కూడా ఊహించం. అయితే బార్లో కూడా పెద్ద గాయం కాదనే అనుకుంది. చిన్న పాటి క్రీమ్‌లు వంటివి రాసి గాయం పెద్దది కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటిని తీసుకుంది. తగ్గిపోతుందనుకుంటే రోజు రోజుకి పెరుగుతుందేంటి అని ఆశ్చర్యపోయింది కూడా. రెండు వారాలకు పైగా కోమాలోనే.. చిన్న గాయం ఏదో పెద్ద రాడ్‌తో కొట్టినట్ల, లేదా పడిపోతే తగిలిన గాయం మాదిరిగా ఇంత నొప్పి వస్తోందేంటి అని కూడా అనుకుంది. అంతే ఓ రోజు తన నివాసంలోనే హఠాత్తుగా స్ప్రుహ కోల్పోయి పడిపోయింది. ఇది గమనించిన ఆమె సోదరుడు వెంటనే ఆస్పత్రికి హుటాహుటినా తరలించాడు. అక్కడ వైద్యుల ఆమె సెప్టిక్ షాక్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. కాలు బాగా వాచిపోయి నొప్పిగా ఉండటమేగాక అక్కడ చర్మం అంతా వేడిగా ఉంది. బ్యాక్టీరియా ఆమె రక్త ప్రవాహంలో ప్రవేశించడంతో బార్లో సుమారు రెండు వారాల పాటు కోమాలోనే ఉండిపోయింది. ఆమె కిడ్నీ, లివర్ ఫెయిల్ అయిన లక్షణాలు కనిపించాయి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కూడా ఎదురైంది. వైద్యులు కూడా ఆమె దీని నుంచి ఆరోగ్యంతో బయటపడదనే భావించారు. ఆశలన్ని వదులేసి మరీ తమ వంతు ప్రయత్నంగానే వైద్యులు ఆమెకు చికిత్స చేయడం ప్రారంభించారు. ఆమె తొడలో చనిపోయిన కణజాలాన్ని తొలగించడానికి ఏకంగా 12 సర్జరీలు చేశారు. ఆమె కాలును తొలగించకుండానే నయం అయ్యేలా ఎన్నో ప్రయత్నాలు చేశారు. 30కి పైగా సర్జరీలు.. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక వైద్యులు చివరికి ఆమె కాలును తొలగించారు. ప్రస్తుతం ఆమె కాలు లేకుండా ఎలా దైనందిన జీవితాన్ని లీడ్ చేయాలో నేర్చుకునే పనిలో పడింది. అంతేగాదు ఈ గాయం కారణంగా కాలుని తొలగించకుండా ఉండేలా తొడలోని కణజాలన్ని తొలగించేందుకు గానూ సుమారు 30కి పైగా సర్జరీలు చేయించుకున్నప్పటికీ కాలు కోల్పోక తప్పలేదు బార్లోకి. కాగా, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం..1996 నివేదికలో యూఎస్‌లో ఏడాదికి 500 నుంచి 1500 దాక నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌కి సంబంధించని కేససులు ఉన్నాయని పేర్కొంది. వాటిలో దాదాపు 20 శాతం ప్రాణాంతకంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ప్రతి ఐదుమందిలో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుందని కూడా తెలిపింది. దయచేసి బీచ్‌ల వద్ద సముద్రపు నీటిలో ఎంజాయ్ చేసేటప్పుడూ జాగ్రత్తగా ఉండండి. ఏదైన గాయమైన జాగుకతతో వ్యవహరించండి. (చదవండి: సరోగసీకి ప్రత్యామ్నాయం!.భవిష్యత్తులో వేలాది మహిళలకు..) -
అదే జరిగితే 70 వేల ఉద్యోగాలు పోతాయ్.. ఎక్కడో తెలుసా?
Country Garden: కరోనా మహమ్మారి ప్రపంచ పరిస్థితులనే తలకిందులు చేసింది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించేశాయి. ఇప్పటికి కూడా ఆ ప్రభావం ఏదో ఒక మూల కనిపిస్తూనే ఉంది. చైనాలో ఒక దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీ గతంలో దాదాపు రూ. 6 లక్షల కోట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే.. కాగా ఇదే బాటలో మరో కంపెనీ కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ప్రాపర్టీ డెవలపర్ 'కంట్రీ గార్డెన్' నష్టాల్లో కూరుకుపోయినట్లు, మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికి సుమారు 7.6 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 57వేల కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కంపెనీ షేర్లు కూడా చాలా వరకు కుప్పకూలాయి. ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగినిపై నిఘా - పర్ఫామెన్స్ చూసి ఖంగుతిన్న కంపెనీ! గత సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ 265 మిలియన్ డాలర్ల లాభంతో ఉండేది, ఆ తరువాత క్రమంగా నష్టాల్లోనే ముందుకు సాగింది. మొత్తం మీద అటు లాభాలు.. ఇటు కంపెనీ షేర్లు పతనమవుతున్నాయి. దీంతో కంట్రీ గార్డెన్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! ప్రపంచమే సలాం కొట్టేలా.. కంట్రీ గార్డెన్ కంపెనీ దాదాపు మూడువేల హోసింగ్ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు, ఇందులో సుమారు 70 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఇదే తీరుగా నష్టాల్లోనే పయనిస్తే వీరందరి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. -
అదే బెంగళూరు కొంపముంచుతోంది.. ఏడాదికి వేల కోట్లలో నష్టం!
కర్ణాటక రాజధాని.. దేశానికి ఐటీ రాజధాని.. అదే సిలికాన్ వ్యాలీగా పేరు గాంచిన బెంగళూరు. ఇప్పుడే ఈ మెట్రోపాలిటన్ సిటీ ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీల కార్యకలాపాలతో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో ట్రాఫిక్ రద్దీతో అంతే అపఖ్యాతి పాలవుతుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ట్రాఫిక్ ఆలస్యం, రద్దీ, సిగ్నల్స్ ఆగిపోవడం, ట్రాఫిక్ వల్ల సమయం వృధా అవ్వడం, వాహనాల్లో ఇంధనం వృధా ఖర్చు వంటి ఇతర కారణాల వల్ల సంవత్సరానికి రూ.19,725 కోట్ల నష్టం వాటిల్లితున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ నిపుణుడు ఎంఎన్ శ్రీహరి అతని బృందం రోడ్ ప్లానింగ్, ఫ్లైఓవర్, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపాయాల లోటుకు సంబంధించిన సమస్యలపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో బెంగళూరు నగరంలో 60 పూర్తిస్థాయిలో ఫ్లైఓవర్లు ఉన్నప్పటికీ, ఆలస్యం, రద్దీ, సిగ్నల్ల వద్ద ఆగిపోవడం, వేగంగా వెళ్లే వాహనాలు, ఇంధన నష్టం, నెమ్మదిగా వెళ్లడం వంటి కారణాలతో బెంగళూరు వాహనదారులకు రూ. 19,725 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధ్యయనం హైలెట్ చేసింది. వేగంగా విస్తరిస్తున్న ఐటీ రంగం బెంగళూరులో రోజు రోజుకీ ఐటీ రంగం మరింత వృద్ది సాధిస్తోంది. తద్వారా హౌసింగ్,ఎడ్యుకేషన్‌తో పాటు వివిధ రంగాల అభివృద్దిలో పాలు పంచుకుంటుంది.వెరసీ బెంగళూరులో అసాధారణ జనాభా పెరుగుదల 14.5 మిలియన్లు ఉండగా వెహికల్ పాపులేషన్ 1.5 కోట్లుగా ఉంది. మరింత విస్తరిస్తున్న బెంగళూరు అంచనా ప్రకారం.. ఈ ఏడాది బెంగళూరు నగరం మరింత విస్తరిస్తోంది. 88 స్కైర్ కిలోమీటర్ల నుంచి 985 కిలోమీటర్లకు పెరిగింది. నగరం 1,100 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని అధ్యయనం ప్రతిపాదించింది. మరోవైపు, రహదారి పొడవు పెరుగుదల వాహనాల పెరుగుదల, విస్తీర్ణం పెరుగుదలకు సమానంగా లేదు. రహదారి మొత్తం పొడవు సుమారు 11,000 కిలోమీటర్లు. రవాణా డిమాండ్, చేసే ప్రయాణికులకు ఏ మాత్రం సరిపోదని నివేదిక పేర్కొంది. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కొరత ఆ నగర వాసుల్ని తీవ్రంగా వేధిస్తుంది. ఆలస్యం, రద్దీ, ప్రయాణం వంటి కారణాల వల్ల సామానులపై పరోక్షంగా ఖర్చుల భారం పడుతుంది. ఆర్ధికంగా నష్టపోతున్నారని శ్రీహరి అన్నారు. అంతేకాదు, తాము జరిపిన ఈ సర్వేలో ట్రాఫిక్ కారణంగా ఏడాదికి రూ.20వేల కోట్లు నష్టం వాటిల్లిందని, ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
వరద మృతుని కుటుంబానికి రూ.4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని, ఒక్కో మృతుని కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరో రూ.లక్ష అదనంగా ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నామని వెల్లడించింది. రాష్ట్రంలో సంభవించిన వరద నష్టాలపై శాసనసభలో గురువారం జరిగిన లఘు చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం తరపున రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బదులిచ్చారు. మృతుల్లో రైతులు ఉంటే రూ.4 లక్షల పరిహారంతో పాటు, తక్షణమే రూ.5 లక్షల రైతు బీమా అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో 139 గ్రామాల్లో వర్షాల వల్ల నష్టం జరిగిందని మంత్రి వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 7,870 ఇళ్లకు చెందిన 27 వేల మందిని 157 పునరావాస కేంద్రాలకు తరలించిన ట్టు తెలిపారు. 419 ఇళ్లు కూలిపోయాయని, 7,505 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. పూర్తిగా కూలిన ఇళ్లను గృహలక్ష్మి పథకంలో చేర్చి కట్టించాలని సీఎం కేసీ ఆర్ ఆదేశించినట్టు చెప్పారు. పంటల నష్టాలపై అంచనాలు వేస్తున్నామని, వివరాలు వచ్చాక ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి వేముల హామీనిచ్చారు. వరద సాయం చేయమని కోరితే కేంద్రం ప్రతిసారీ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల వాకౌట్ వరదల నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని, నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో అలక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చర్చలో పాల్గొన్న ఆ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తాము లేవనెత్తిన సందేహాలకు, ప్రజలను ఆదుకోమని చేసిన విజ్ఞప్తికి మంత్రి సరైన సమాధానం చెప్పలేదని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. -
వరదల నష్టం ఎన్ని వేల కోట్లో తెలుసా? ఎస్బీఐ రిపోర్ట్
దేశవ్యాప్తంగా ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో వరదలు విధ్వంసం సృష్టించాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు కలిగించాయి. అయితే ఈ వరదలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం కలిగించాయి అనే దానిపై ఎస్బీఐ (SBI) రీసర్చ్ రిపోర్ట్ ఎకోర్యాప్ (Ecowrap) ఓ నివేదిక విడుదల చేసింది. వరదల వల్ల కలిగిన ఆర్థిక నష్టం రూ. 10,000 కోట్లు నుంచి రూ.15,000 కోట్ల పరిధిలో ఉంటుందని ఎస్బీఐ ఎకోర్యాప్ నివేదిక అంచనా వేసింది. ఈ భారీ వరదలతోపాటు ఇటీవల సంభవించిన బిపార్జోయ్ తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాలు దేశానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. దేశ స్థానిక, భౌగోళిక స్వరూపాలు కూడా సహజ విపత్తులకు కారణమని అభిప్రాయపడింది. మూడో స్థానంలో భారత్ 1990 నుంచి తీసుకుంటే అమెరికా, చైనాల తర్వాత భారత్‌లోనే అత్యధిక ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడటం, తుఫానులు, భూకంపాలు, వరదలు, కరువులు వంటి విపత్తులతో సహా భారతదేశం 1900 సంవత్సరం నుంచి 764 ప్రకృతి వైపరీత్యాలను నమోదు చేసింది. 1900 నుంచి 2000 వరకు 402 సంఘటనలు, 2001-2022 మధ్య 361 విపత్తులు సంభవించాయి. ఇలాంటి విపత్తులు తరచూ సంభవించడం వల్ల ఆర్థిక ఒత్తిడికి సంబంధించి కొత్త రికార్డులను నెలకొల్పిందని నివేదిక పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు భారతదేశంలో ఎక్కువగా వరదల రూపంలోనే సంభవించాయని, ఇవి దాదాపు 41 శాతం, ఆ తర్వాత తుఫానులు సంభవించాయని నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే.. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన బీమా విషయంలో భారతదేశంలో చాలా అంతరం ఉందని ఎస్బీఐ నివేదిక గుర్తు చేసింది. 2022లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 275 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లగా 125 బిలియన్ డాలర్లు మాత్రమే బీమా పరిధిలోకి వచ్చాయంది. అంటే అంతరం 150 బిలియన్ డాలర్లు. ఇది 10 సంవత్సరాల సగటు 130 బిలియన్ డాలర్ల కంటే చాలా ఎక్కువ. మొత్తం నష్టాలలో 54 శాతం బీమా చేయనివేనని వెల్లడించింది. భారతదేశంలో ఈ బీమా రక్షణ అంతరం 92 శాతంగా ఉందని, దేశంలో సగటున 8 శాతం మందికి మాత్రమే బీమా రక్షణ ఉందని నివేదిక స్పష్టం చేసింది. ప్రకృతి వైపరీత్యాల రిస్క్‌లను కవర్ చేయడానికి బీమా రంగంలో 'డిజాస్టర్ పూల్' అవసరాన్ని నొక్కి చెప్పింది. దేశంలో 2020 వరదలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం ఆర్థిక నష్టం 7.5 బిలియన్ డాలర్లు (రూ. 52,500 కోట్లు) అయితే బీమా కవర్ కేవలం 11 శాతం మాత్రమే అని పేర్కొంది. -
ఒక్క వెబ్ సిరీస్.. రూ.2000 కోట్లు వృథా!
సినిమా చూడాలంటే ఒకప్పుడు థియేటర్ లోనే... ఏదేమైనా ఆ మజానే వేరుగా ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓటీటీ సంస్థలు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో స్టార్స్‌ని తీసుకొచ్చి భారీ బడ్జెట్స్ పెడుతున్నాయి. వందల కోట్ల లాభాలు దక్కించుకోవాలని చూస్తున్నాయి. కట్ చేస్తే ఘోరమైన నష్టాలు చూస్తున్నాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్ అలాంటి పరిస్థితులే ఎదుర్కొంటోంది. స్వయంగా ఆ సంస్థ సీఈఓ ఈ విషయాన్ని బయటపెట్టారు. 'సిటాడెల్' ఫ్లాప్ ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఖరీదైన వెబ్ సిరీసుల్లో 'సిటాడెల్' ఒకటి. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ మన దేశంలోనూ రిలీజైంది. చాలామందికి నచ్చే యాక్షన్ తరహా స్టోరీతోనే తీశారు. కానీ పెద్దగా ఆదరణ సొంతం చేసుకోలేకపోయింది. ఈ సిరీస్ కోసం దాదాపు 250 మిలియన్ డాలర్స్ వరకు ఖర్చు పెట్టినట్లు సీఈఓ ఆండీ జెస్సీ చెప్పుకొచ్చారు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.2000 కోట్లు. ఇప్పుడు అదంతా వృథా అయినట్లే! ఈ సిరీస్ మీద ప్రైమ్ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అవన్నీ కూడా గంగలో కలిసిపోయినట్లే. (ఇదీ చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల) సమంత కూడా ప్రియాంక చోప్రాతో తీసిన 'సిటాడెల్'.. ఇండియన్ వెర్షన్‌ని హీరోయిన్ సమంతతో తీశారు. 'ఫ్యామిలీ మ్యాన్' ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. సమంతతో పాటు వరుణ్ ధావన్ లీడ్ రోల్ చేశాడు. దీని షూటింగ్ పూర్తయి, విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఒరిజినల్ సిరీస్ మన దగ్గర ఆడలేదు. సమంత 'సిటాడెల్' హిట్ అయితే అమెజాన్‌కు కొంతైనా లాభాలు వస్తాయి. లేదంటే కష్టమే! ఉద్యోగులకు మూడింది 'సిటాడెల్' సిరీస్‌తో పాటు ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన డైసీ జోన్స్ అండ్ ది సిక్స్, ది పవర్, డెడ్ రింగర్స్, ది ఫెరిఫెరల్ లాంటి షోలు కూడా ఫెయిలయ్యాయి. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కోసమైతే ఏకంగా రూ.4000 కోట్లు ఖర్చు పెట్టినట్లు సీఈఓ ఆండీ జెస్సీ చెప్పుకొచ్చారు. కానీ అది కూడా నిరాశపరిచింది. ఈ పరిణామాలన్నీ సీరియస్ గా తీసుకున్న అమెజాన్.. ఇలా ఫెయిలైన సిరీస్‌లను కొనసాగించడం ఆపాలని నిర్ణయించుకుంది. దీనికి బాధ్యులైన ఉద్యోగులని తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఒక్కసారి దెబ్బ తగిలితే గానీ నొప్పి తెలిసి రాదు! (ఇదీ చదవండి: 'సలార్' టీజర్ సరికొత్త రికార్డ్.. ఏకంగా టాప్‌లోకి) -
ఇంటర్నెట్ షట్‌డౌన్: ఆరు నెలల్లో ఇన్ని వేల కోట్ల నష్టమా?
ఈ ఏడాది ప్రథమార్థంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధించిన ఇంటర్నెట్ షట్డౌన్ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు 1.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15,590 కోట్లు) నష్టం వాటిల్లిందని ఒక తాజా నివేదిక పేర్కొంది. ఈ ఇంటర్నెట్ షట్డౌన్లు దాదాపు 118 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 968 కోట్లు) విదేశీ పెట్టుబడుల నష్టానికి కారణమయ్యాయని, 21,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని అంతర్జాతీయ లాభాపేక్షలేని ఇంటర్నెట్ సొసైటీ తన నివేదిక 'నెట్‌లాస్'లో పేర్కొంది. ఇంటర్నెట్ నిషేధ ప్రభావం ఉత్పత్తి నష్టానికే పరిమితం కాదని, నిరుద్యోగ రేటులో మార్పు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కోల్పోవడం, భవిష్యత్తులో షట్డౌన్ల ప్రమాదాలు, పని చేసేవారి జనాభా మొదలైన అంశాలపైనా ప్రభావం చూపుతుందని వివరించింది. ఇంటర్నెట్ షట్డౌన్లు అశాంతిని అణచివేస్తాయని, తప్పుడు సమాచార వ్యాప్తిని ఆపివేస్తాయని లేదా సైబర్ సెక్యూరిటీ ముప్పును తగ్గిస్తాయని ప్రభుత్వాలు నమ్ముతున్నాయి. కానీ ఇంటర్నెట్ షట్డౌన్లు ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని అని నివేదిక పేర్కొంది. అల్లర్లను నియంత్రించడానికి భారత్ ఇంటర్నెట్ షట్డౌన్లను ఒక సాధనంగా ఉపయోగించడం వల్ల ఈ సంవత్సరం ఇప్పటివరకు భారతదేశానికి 16 శాతం షట్‌డౌన్ రిస్క్ ఉందని, ఇది 2023 నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని తెలిపింది. ఇంటర్నెట్ షట్డౌన్ల వల్ల ఈ-కామర్స్ వ్యాపారాలు స్తంభిస్తాయి. తద్వారా కాలాధారమైన లావాదేవీలు నష్టాలను మిగుల్చుతాయి. నిరుద్యోగాన్ని పెంచుతాయి. వ్యాపార సంస్థలు, కస్టమర్ల కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగిస్తాయి. కంపెనీలకు ఆర్థికంగా నష్టాలను మిగిల్చడమే కాకుండా పరపతికి భంగం కలిగిస్తాయని నివేదిక ఉద్ఘాటించింది. ఇదీ చదవండి: సైబర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? రూ. కోటి వరకూ కవరేజీ.. -
ఒకే పథకం.. రెండు ప్రయోజనాలు
ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడం మంచి ఆలోచన అవుతుంది. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చే సరికి ప్రణాళిక మేరకు పెట్టుబడులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఆశించిన మేర పన్ను ఆదాకు మార్గం సుగమం చేసుకోవచ్చు. పెట్టుబడులకు పన్ను ఆదా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. మెరుగైన రాబడులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాతే పన్ను ఆదా ప్రయోజనం చూడాలి. అన్ని సాధనాల్లోకి ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయని తెలిసిందే. పన్ను ఆదా ప్రయోజనంతో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాలతో దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టించుకోవచ్చని చారిత్రక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో చక్కని, నమ్మకమైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు సొంతం చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఈ పథకంలో చేసే ప్రతి పెట్టుబడికి అక్కడి నుంచి మూడేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. మూడేళ్లు నిండిన తర్వాతే ఆ పెట్టుబడిని వెనక్కి తీసుకోవడానికి అనుమతిస్తారు. రాబడులు 5 స్టార్ రేటెడ్ పథకం ఇది. ఏడాది కాలంలో 11 శాతం రాబడులను ఇవ్వగా, మూడేళ్లలో ఏటా 27 శాతం ప్రతిఫలాన్ని పెట్టుబడులపై అందించింది. ఇక ఐదేళ్లలో ఏటా 15 శాతం రాబడిని ఇచ్చింది. ఏడేళ్లలో చూసుకున్నా వార్షిక రాబడి రేటు 17.44 శాతంగా ఉంది. ఈక్విటీల్లో దీర్ఘకాలంలో వార్షిక సగటు రాబడి 12 శాతానికి పైన ఉంటే దాన్ని మెరుగైనదిగా భావిస్తారు. ఈ పథకం రాబడులకు బీఎస్ఈ 500 టీఆర్ఐ సూచీని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సూచీతో పోలిస్తే మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఐదేళ్లు, ఏడేళ్ల కాలంలో రెండు నుంచి మూడు శాతం అధికంగా వార్షిక రాబడిని అందించింది. కనుక ఐదేళ్లకు మించిన కాలానికే ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఐదేళ్లలోపు లక్ష్యాలకు అచ్చమైన ఈక్విటీలు అనుకూలం కాదని నిపుణుల సూచన. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో ఈ పథకం ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. అంటే నగదు నిల్వలు తక్కువగా నిర్వహిస్తుండడాన్ని గమనించొచ్చు. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15,218 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిల్లో 99.16 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. ఇందులోనూ లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే 69 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఇక మిడ్‌క్యాప్ కంపెనీల్లో 25 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 5.57 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 66 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగానికి చెందిన కంపెనీల్లోనే 32 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఆ తర్వాత అత్యధికంగా ఇంధన రంగ కంపెనీల్లో 11.13 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీల్లో 9 శాతం, సేవల రంగ కంపెనీల్లో 8.15 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. ఈ నాలుగు రంగాల్లోనే 60 శాతం పెట్టుబడులు ఉండడం గమనించొచ్చు. -
భారీ నష్టాల్లో స్పార్క్ - ఏకంగా..
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ సంస్థ సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్(స్పార్క్) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర నష్టం పెరిగి రూ. 82 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 71 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 25 కోట్ల నుంచి రూ. 48 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 97 కోట్ల నుంచి రూ. 140 కోట్లకు పెరిగాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ రూ. 223 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2021–22లో రూ. 203 కోట్ల నష్టం నమోదైంది. అయితే మొత్తం ఆదాయం రూ. 137 కోట్ల నుంచి రూ. 239 కోట్లకు జంప్ చేసింది. -
పనోడి సాయంతో పేషెంట్‌కి సర్జరీ..దెబ్బతో ఆ వైద్యుడి..
వైద్యులు రోగికి చికిత్స చేసేటప్పుడూ ట్రైయినింగ్ అవుత్ను నర్సు లేదా కనీసం వైద్యా విధానంపై కనీస అవగాహన ఉన్న వ్యక్తి సాయం తీసుకోవడం జరుగుతుంది. అలాకాకుండా ఏ మాత్రం వైద్యం గురించి అవగాహన లేని ఓ సాధారణ వ్యక్తి అదీకూడా ఆస్పత్రిని క్లీన్ చేసే వ్యక్తి సాయం తీసుకుంటే.. ఎవ్వరికైన వొళ్లు మండిపోతుంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే.. ఒకవేళ పేషెంట్‌కి ఏదైన సమస్య ఎదురైతే ఆ తప్పుని సరిచేయడం అనేది అసాధ్యం. కానీ ఒక వైద్యుడు అలానే చేసి ఉద్యోగం పోగొట్టుక్నునాడు. ఈ షాకింగ్ ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..జర్మనీలో మెయిన్జ్ యూనివర్శిటీకి చెందిన ఆస్పత్రిలో ఓ వైద్యుడు ఒక పేషెంట్‌కి కాలు తీసేవేసే ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఐతే ఆ సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆయన ఓ క్లీనర్ సాయం తీసుకున్నాడు. పేషెంట్‌కి మత్తుమందు ఇచ్చిన తర్వాత అతని కాలుని పట్టుకోమని చెప్పి వైద్య పరికారలను అందించమని కోరాడు. దీంతో సదరు క్లీనర్ ఆ వైద్యుడు సర్జరీలో సాయం అందించి ఆపరేషన్ థియోటర్ నుంచి బయటకు రావడంతో గమనించిన ఆస్పత్రి యాజమాన్యం ఆ వైద్యుడిపై ఫైర్ అయ్యింది. ఇదిలా ఉండగా, సర్జరీ చేయించుకున్న పేషెంట్‌కి ఎలాంటి హాని జరగలేదు. అతను సురక్షింతంగానే ఉన్నాడు. కానీ ఇలాంటి క్లిష్టమైన స్థితిలో సాయం చేసే మెడికల్ సిబ్బంది గురించి వాకబు చేయాలి లేదా ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకురావలి గానీ అలా చేయకూడదంటూ సదరు వైద్యుడికి ఆస్పత్రి యాజమాన్యం చివాట్లు పెట్టింది. ఈ ఘటన కారణంగా సదరు వైద్యుడు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన 2020లో జరిగినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఉక్రెయిన్‌పై పట్టు సాధిస్తున్న రష్యా బలగాలు.. పుతిన్ అభినందనల వెల్లువ) -
జియో సినిమా దెబ్బకు హాట్‌స్టార్ విలవిల.. టాటా చెప్పేస్తున్న లక్షల సబ్స్క్రైబర్లు
కొత్తగా వచ్చిన స్ట్రీమింగ్ యాప్ జియోసినిమా (JioCinema) దెబ్బకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar) విలవిలాడుతోంది. మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్లను కోల్పోతోంది. జియోసినిమా మార్కెట్లో ప్రజాదరణ పెరుగుతున్న స్ట్రీమింగ్ యాప్‌గా మారింది. 2023 మొదటి త్రైమాసికంలో 10 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది. ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల వీక్షకుల నుంచి ఈ స్థాయిలో ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఐపీఎల్ ప్రసారాలను ఉచితంగా అందించడం. ఇదే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఆసియాలో దాని సబ్‌స్క్రైబర్ బేస్ వేగంగా క్షీణించింది. కేవలం మూడు నెలల్లో 4 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కోల్పోయింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఏకంగా 8.4 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు హాట్‌స్టార్‌కు బై బై చెప్పేశారు. సబ్స్క్రైబర్లు బై..బై కంపెనీ ఆదాయ నివేదిక ప్రకారం.. 2023 మొదటి త్రైమాసికంలో డిస్నీ ప్లస్ పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 3.8 మిలియన్లు తగ్గి 57.5 మిలియన్లకు పడిపోయింది. అంతకుముందు త్రైమాసికంలోనూ 4 మిలియన్లకుపైగా సబ్స్క్రైబర్లను కోల్పోయింది. 2023 ఏప్రిల్ 1 నాటికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 52.9 మిలియన్ల పెయిడ్ సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. క్యూ2లో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు ఒక్కో పెయిడ్ సబ్‌స్క్రైబర్ నుంచి సగటు నెలవారీ ఆదాయం 0.74 నుంచి 0.59 డాలర్లు తగ్గింది. జియోసినిమాకు కలిసొచ్చిన ఐపీఎల్ జియో సినిమా విజయానికి అనేక కారణాలున్నాయి. అందులో మొదటిది, ముఖ్యమైనది జియో సినిమా ప్రతిఒక్కరికీ ఉచితం. ఎటువంటి సబ్స్క్రిప్షన్ ఛార్జ్ లేదు. అదే డిస్నీ హాట్‌స్టార్ ను వీక్షించాలంటే సబ్స్క్రిప్షన్ ఛార్జ్ చెల్లించాలి. జియో సినిమా విజయానికి అసలు కారణం ఐపీఎల్ ను ఉచితంగా చూసే అవకాశం. ఏదైనా ఉచితంగా వస్తున్నప్పుడు ఎవరైనా దాని కోసం ఎందుకు చెల్లించాలనుకుంటున్నారు? ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! -
కింగ్ చార్లెస్ పట్టాభిషేకం వేళ అనూహ్య ఘటన..గుర్రం అదుపు తప్పి..
బ్రిటన్ రాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ వేడుకలో ఓ సైనికుడి గుర్రం నియంత్రణ కోల్పోయి ఓ గుంపుపైకి దూసుకపోయింది. అయితే ఆ సమయంలో చార్లెస్ 3 వెస్ట్మిన్స్టర్ అబ్బే నుంచి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కి తిరిగి వెళ్లిపోయిన తదుపరి ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్ హౌస్‌హోల్డ్‌లోని మౌంటెడ్ సభ్యుడిని గుర్రం దాదాపు ఢీ కొట్టిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. సమీపంలో ఓ మెటల్ బారీకేడ్ని ఢీ కొట్టి మరీ గుంపుపైకి దూసుకుపోయింది. రాజు, రాణి వెళ్తున్న గోల్డస్టేట్ కోచ్‌కు కేవలం గజం దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అప్రమత్తమైన సైనిక సిబ్బంది గాయాలను ఊహించి సంఘటన స్థలానికి స్ట్రెచర్‌ను తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు భయపడేంతగా ఎవరికి గాయాలు కాలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. During today's coronation of the British King Charles the Third, an agitated horse, which was part of the royal procession, ran into the audience watching the event on the streets of London pic.twitter.com/29RXPOwK2e — Spriter (@Spriter99880) May 6, 2023 (చదవండి: అట్టహాసంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి) -
ట్రక్కు అదుపుతప్పడంతో నుజ్జునుజ్జు అయిన పెట్రోల్ పంపు
పెట్రోల్ బంక్‌లో ప్రవేశిస్తుండగా ట్రక్ అదుపుతప్పడంతో ఘోర ప్రమాదం చోట చేసుకుంది. ఈ ఘటనలో పెట్రోల్ పంపు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటన ఏప్రిల్ 22న ఉదయం 9.3 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ట్యాంక్ ఫిల్ చేసుకునేందుకు మహారాష్ట్రలోని పూణే సతారా హైవే సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు రావడంతోనే ఈ ఘోర ప్రమాదం సంభవించింది. సరిగ్గా పెట్రోల్ బంక్ ఎంట్రెన్స్‌లోకి వస్తుండగా ట్రక్కు అదుపుతప్పడంతో.. బంక్ వద్ద ఆగి ఉన్న కారుని ఢీకొట్టి పెంట్రోల్ బంక్ పంపు వైపుకి దూసుకొచ్చింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ప్రత్యక్ష సాక్ష్యలు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Video: Truck Hits Car At Pune Highway Petrol Pump, Uproots Fuel Dispenser Read here: https://t.co/w643tyKGZS pic.twitter.com/sVSq4qcZEU — NDTV Videos (@ndtvvideos) April 25, 2023 (చదవండి: చంపేస్తామన్న బెదిరింపు లేఖకి ఝలక్ ఇచ్చేలా..మోదీ రోడ్ షో) -
సైబర్ మోసంలో డబ్బు పొగొట్టుకున్న భార్య.. తలాక్ చెప్పిన భర్త
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి డబ్బులు పోగొట్టుకుందని భార్యకు తలాక్ చెప్పాడో ఓ వ్యక్తి. ఈ విచిత్ర ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఒడిశాలోని కేంద్రపరా జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళ సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకుంది. గుజరాత్లో ఉన్న తన భర్త ఈ విషయం తెలుసుకుని ఏప్రిల్ 1న తనకు మూడుసార్లు తలాక్ చెప్పినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు చట్ట విరుద్ధంగా విడాకులు ఇచ్చారని వాపోయింది. ఆ దంపతులకు పెళ్లై 15 ఏళ్లు, పైగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఐతే ఆమె సైబర్ నేరగాళ్ల చేతిలో ఎలా డబ్బులు పోగొట్టుకుందనేది తెలియాల్సి ఉంది. (చదవండి: ఏక్నాథ్ షిండే అయోధ్య పర్యటన: 'మా నమ్మకాలకి సంబంధించింది') -
Telangana: ఆర్టీసీ నష్టాలు రూ.11,000 కోట్లు.. ఆది నుంచి కష్టాలే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ రూ.10 వేల కోట్ల నష్టాల మార్కును దాటిపోయింది. గతేడాది డిసెంబర్ నాటికే నష్టాలు రూ.10,762 కోట్లకు చేరగా, జనవరి కూడా కలిపితే ఆ మొత్తం రూ.11 వేల కోట్లకు చేరినట్లు తాజాగా క్రోడీకరించిన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచే సంస్థ నష్టాలతో పరుగుపెడుతోంది. రాష్ట్రం విభజన జరిగిన 2014 జూన్ 2 నుంచి ఆర్థిక సంవత్సరం ముగిసిన 2015 మార్చి 31 నాటికి టీఎస్ ఆర్టీసీ రూ.299.64 కోట్ల నష్టాలతో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరమే కావటంతో, ఆ నష్టాలు తాత్కాలిక మే అన్న భావన వ్యక్తమైంది. కానీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. నష్టాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఎనిమిదేళ్లలో ఒక్క 2022లోనే తక్కువ నష్టాలు నమోదయ్యాయి. గత ఏడాది చివరలో డీజిల్ సెస్‌ను ప్రారంభించటం, నెల రోజుల్లోనే దాన్ని సవరించి మళ్లీ పెంచటం, ఆదాయం పెంచేందుకు చేపట్టిన రకరకాల చర్యలు, ఖర్చును తగ్గించటం, ప్రత్యామ్నాయ ఆదాయం పెంపుపై దృష్టి.. వెరసి నష్టాలు బాగా తగ్గాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రూ.473 కోట్లు రికార్డయ్యాయి. ఇదే నష్టాల్లో అత్యుత్తమ గణాంకం కావడం గమనార్హం. భారీ వేతన సవరణతో.. ఆర్టీసీలో 2013లో జరగాల్సిన వేతన సవరణ 2015లో జరిగింది. కార్మికులు అడిగిన దాని కంటే ఎక్కువగా ప్రభుత్వం ఏకంగా 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. భారీగా జీతాల పెంపుతో ఆర్టీసీపై సాలీనా రూ.850 కోట్ల మేర కొత్త భారం పడింది. కానీ అదనపు ఆదాయం పెంపు దిశగా అధికారులు కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ప్రభుత్వం కూడా పర్యవేక్షణను పట్టించుకోకపోవటంతో నష్టాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆ ఆర్థిక సంవత్సరం ఏకంగా రూ.1,150 కోట్ల నష్టం వచ్చింది. ఇది అప్పటివరకు ఆర్టీసీ చరిత్రలోనే అతిపెద్ద నష్టంగా నమోదయ్యింది. ఉమ్మడి ఆరీ్టసీలో కూడా (రెండు ఆర్టీసీలు కలిపి) ఎప్పుడూ ఇంత నష్టం రాలేదు. ఆ వేతన సవరణకు సంబంధించిన బకాయిల్లో సగం ఇంకా చెల్లించలేదు. బాండ్ల రూపంలో చెల్లించాల్సిన రూ.288 కోట్ల మొత్తమూ అలాగే ఉంది. అది చెల్లిస్తే నష్టాల కుప్ప మరింత పెరుగుతుంది. సమ్మెతో కోలుకోని స్థితికి.. 2019లో ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద సమ్మె జరిగింది. కారి్మకులు ఏకంగా 52 రోజుల పాటు బస్సుల్ని స్తంభింపజేశారు. ఫలితంగా 2019–20లో రూ.1,002 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఆ వెంటనే కోవిడ్ మహమ్మారి వల్ల రెండేళ్లు బస్సులు సరిగా తిరగలేదు. దీనివల్ల కూడా నష్టాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇటీవల చేపట్టిన సంస్కరణల వల్ల ప్రస్తుతం 35 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. మరో 20 డిపోలు బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యాయి. మిగతా డిపోల్లో నష్టాలు తగ్గాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ఏప్రిల్ నాటికి కొత్త నష్టాలు పూర్తిగా నియంత్రణలోకి వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. కానీ పరిస్థితి అంత సులభంగా మారేలా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం డీజిల్ సెస్ పెంపు వల్ల మాత్రమే నష్టాలు తగ్గాయన్నది సుస్పష్టం కాగా ఇప్పటికీ ప్రత్యామ్నాయ ఆదాయం పెరగక పోవడం గమనార్హం. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు... ఇటీవల నష్టాల లెక్కలను ఆర్టీసీ ప్రభుత్వం ముందుంచింది. ఆరీ్టసీకి రావాల్సిన బకాయిలు, సీసీఎస్, పీఎఫ్‌లకు చెల్లించాల్సిన మొత్తాలపై నివేదిక అందించింది. అయితే గతేడాది బడ్జెట్లో ఆరీ్టసీకి రూ.1,500 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ తాజా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి కేవలం రూ.600 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. కొత్త బడ్జెట్లో ఎక్కువ నిధులు వస్తాయని ఆశించినా, మళ్లీ అంతేమొత్తాన్ని ప్రతిపాదించటంతో సందిగ్ధత ఏర్పడింది. నష్టాలు మరింత తగ్గిస్తాం ఇటీవలి కొన్ని నిర్ణయాలతో ఆర్టీసీ నష్టాలను భారీగా తగ్గించగలిగాం. మరింత తగ్గించేందుకు చర్యలు చేపడతాం. డీజిల్ సెస్, సేఫ్టీ సెస్ లాంటివి సంస్థ ఆదాయాన్ని పెంచాయి. ఇక ప్రభుత్వం తన వంతుగా ప్రతి సంవత్సరం రూ.1,500 కోట్లు ఇస్తోంది. అయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవటంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. అవి కూడా వస్తే ఆరీ్టసీకి మరింత సాయం అందేది. పెద్ద సంఖ్యలో కొత్త బస్సులు రానున్నందున ఆదాయం కొంత పెరిగే వీలుంది. – బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టీసీ చైర్మన్ -
వొడాఫోన్ ఐడియా నష్టాలు అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో మొబైల్ టెలికం రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర నష్టం పెరిగి రూ. 7,990 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 7,234 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం 9 శాతంపైగా బలపడి రూ. 10,621 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. రూ. 9,717 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ కాలంలో కంపెనీ రూ. 16,133 కోట్లమేర (స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై) చెల్లించవలసిన వడ్డీని ప్రభుత్వం ఈక్విటీగా మారి్పడి చేసుకుంది. దీంతో వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం 33 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఆవిర్భవించింది. మరోపక్క కంపెనీ బోర్డు ఏటీసీ ఇండియాకు రూ. 1,600 కోట్ల విలువైన అప్షనల్లీ కన్వరి్టబుల్ డిబెంచర్ల జారీకి ఆమోదించింది. కాగా, తాజా సమీక్షా కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) 17 శాతంపైగా మెరుగై రూ. 135ను తాకింది. మొత్తం కస్టమర్ల సంఖ్య 23.44 కోట్ల(క్యూ2) నుంచి 22.86 కోట్లకు నీరసించింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 7.70 వద్ద ముగిసింది. -
మంచి మాట: నాణ్యతతో మాన్యత
నాణ్యత లేని మనిషి నాసిరకం మనిషి అవుతాడు. నాసిరకం మనిషి గడ్డిపోచకన్నా హీనం అవుతాడు. నాసిరకం మనిషి విలువలేని మనిషి, అనవసరం అయిన మనిషి అయిపోతాడు ఆపై అనర్థదాయకమైన మనిషిగానూ అయిపోతాడు. విద్య , సమాజం, సాహిత్యం, సంగీతం, కళలు, వృత్తులు, విధి నిర్వహణ... ఇలా అన్నింటా నాసిరకం మనుషులు కాదు నాణ్యమైనవాళ్లే కావాలి. నాణ్యత ఎంత కరువు అయితే అంత కీడు జరుగుతుంది. నాణ్యత ఎంత ఉంటే అంత మంచి జరుగుతుంది. నాణ్యత అన్నది సంస్కారం; మనిషికి ఉండాల్సిన సంస్కారం. నాణ్యత లోపిస్తే మనిషికి సంస్కారం లోపించినట్లే. నాణ్యత గురించి మనిషికి ఆలోచన ఉండాలి. మనిషికి నాణ్యమైన ఆలోచనలు ఉండాలి. నాసిరకం ఆహారం, నీరు తీసుకోవడంవల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది అని మనకు తెలిసిందే. నాసిరకం ఆలోచనాసరళివల్ల మన జీవితం చెడిపోతుంది అని అవగతం చేసుకోవాలి. నాణ్యమైన అభిరుచి, ప్రవర్తన, పనితీరు సాటివాళ్లలో మనకు గొప్పస్థాయిని ఇస్తాయి. చదువు నాణ్యమైంది అయితే అది వర్తమానంలోనివారికి, భావితరాలవారికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. చదవు నాసిరకంది అయితే పెనునష్టం జరుగుతుంది. గత ఆరు దశాబ్దులుగా నాసిరకం వ్యక్తులు ఎం.ఎ., ఎం.ఫిల్., పిహెచ్.డి. పట్టభద్రులు అవడంవల్ల, నాసిరకం వ్యక్తులు సాహితీవిమర్శకులు, కవులు, అధ్యాపకులు అవడం వల్ల, నాసిరకం రచనలకు పురస్కారాలు వస్తూ ఉండడంవల్ల తెలుగుసాహిత్యం, కవిత్వం పతనం అవుతూ నిరాదరణకూ, ప్రజల ఏవగింపుకు గురి అయిపోవడం క్షేత్రవాస్తవంగా తెలియవస్తోంది; అంతేకాదు వీళ్లవల్ల తెలుగుభాష కూడా వికలం అయిపోతూ ఉంది. ఏది ప్రక్రియ అవుతుందో కూడా తెలియని నాసిరకం వ్యక్తులవల్ల మరేభాషలోనూ లేని ప్రక్రియల పైత్యం తెలుగుకవితలో ముదిరిపోయింది. నాసిరకం వ్యక్తులవల్ల మత, కుల, ప్రాంతీయత, వాదాల ఉన్మాదం తెలుగుసాహిత్యాన్ని, కవిత్వాన్ని, భాషను ధ్వంసం చేస్తోంది. ఒక నాసిరకం వైద్యుడివల్ల రోగులకు సరైన వైద్యం జరగకుండా కీడు జరుగుతుంది. నాసిరకం కట్టడాలు కూలిపోతే ప్రజలకు జరిగే నష్టం భర్తీ చెయ్యలేనిది. నాసిరకం భావజాలాలవల్ల పలువురి బతుకులు బలి అవుతూ ఉండడమే కాదు పలువురు దుష్టులై సంఘానికి హానికరం అయ్యారు, అవుతున్నారు. నాసిరకం మనస్తత్వం వల్లే అసమానతలు, నేరప్రవృత్తి వంటివి సమాజాన్ని నిత్యమూ బాధిస్తున్నాయి. నాసిరకం చదువుల వల్ల, పనితీరువల్ల, ఆలోచనలవల్ల, ప్రవర్తనలవల్ల, మనిషికీ, సమాజానికీ, ప్రపంచానికీ విపత్తులు కలుగుతూ ఉన్నాయి, ఉంటాయి. కొందరి నాసిరకం చింతనవల్ల, దృక్పథంవల్ల, పోకడవల్ల మామూలు మనుషులుగా కూడా పనికిరానివాళ్లు, సంప్రదాయానికి చెందని వాళ్లు దైవాలుగా అయిపోయి అహేతుకంగా, అశాస్త్రీయంగా ఆలయాలు, అర్చనలు, హారతులతో పూజింపబడుతూ ఉన్న దుస్థితి మనలో తాండవిస్తోంది. ఈ పరిణామం నైతికత, సంస్కృతి, ధార్మికతలకు ముప్పు అవుతోంది. ఇలాంటివి కాలక్రమంలో ప్రజల్లో చిచ్చుపెడతాయి. నాసి వాసికెక్కకూడదు; నాణ్యత మాన్యత చెరిగిపోదు. నాణ్యత ప్రతిమనిషికీ ఎంతో అవసరం. మనిషి నాణ్యతకు అలవాటుపడాలి. నాణ్యత తప్పకుండా కావాల్సింది, ప్రయోజనకరమైంది ఆపై ప్రగతికరమైంది. నాణ్యతను వద్దనుకోకూడదు, వదులుకోకూడదు. నాణ్యతను మనం అనుగమించాలి, అనుసంధానం చేసుకోవాలి. నాణ్యతతో మనం క్షేమంగానూ, శ్రేష్ఠంగానూ బతకాలి. నాణ్యమైన వృత్తికారులవల్ల వృత్తి పరిఢవిల్లుతుంది. నాణ్యమైన కళాకారులవల్ల కళ పరిఢవిల్లుతుంది. నాణ్యమైన క్రీడాకారులవల్ల క్రీడ పరిఢవిల్లుతుంది. నాణ్యమైన మనుషులవల్ల సంఘం పరిఢవిల్లుతుంది. నాణ్యతవల్ల నాణ్యత నెలకొంటుంది; నాణ్యతవల్ల భవ్యత వ్యాపిస్తుంది. మనుషులమై పుట్టిన మనం మళ్లీ మనుషులమై పుడతామో లేదో? కనుక ఈ జన్మలో నాణ్యతనే కోరుకుందాం; నాణ్యతనే అందుకుందాం. – రోచిష్మాన్ -
80 మిలియన్ డాలర్లకు ప్రోజస్ నష్టాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో టెక్నాలజీ ఇన్వెస్టర్ ప్రోజస్ 80 మిలియన్ డాలర్ల ట్రేడింగ్ నష్టం ప్రకటించింది. ప్రధానంగా పేయూ ఇండియా వ్యాపారంలో మరింతగా ఇన్వెస్ట్ చేయాల్సి రావడం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. సమీక్షాకాలంలో పేయూ ఆదాయం 183 మిలియన్ డాలర్లుగా నమోదైంది. నెదర్లాండ్స్‌కి చెందిన ప్రోజస్ గ్రూప్ భారత్‌లో ఓఎల్ఎక్స్, బైజూస్, మీషో, ఎలాస్టిక్‌రన్, డేహాత్, ఫార్మ్ఈజీ తదితర సంస్థల్లో ఇన్వెస్ట్ చేసింది. -
ఐదేళ్ల తర్వాత.. ఈ చిట్టిబాబుకు చెవులొచ్చాయ్!
లండన్: వైద్య చరిత్రలో కొన్ని చిత్రమైన కేసులు అప్పుడప్పుడు నమోదు అవుతుంటాయి. అయితే.. ఇక్కడ మాత్రం విచిత్రమైన కేసు ఒకటి నమోదు అయ్యింది. ఐదేళ్లపాటు చెవులు వినిపించకుండా పోయిన ఓ వ్యక్తి.. ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చాడు. అయితే ఆయన చెవిటితననాకి కారణం తెలుసుకుంటే.. విస్తుపోవడం మీ వంతూ అవుతుంది కూడా!. ఇంగ్లండ్(ఉత్తర) డోర్సెట్ వెయ్మౌత్లో నివాసం ఉండే వాలెస్ లీ గత కొంతకాలంగా వినికిడి సమస్యతో బాధపడుతున్నాడు. ఏవియేషన్ పరిశ్రమలో పని చేయడం వల్లనో, రగ్బీ మ్యాచ్‌ల సమయంలో ప్రమాదవశాత్తూ తగిలిన గాయాల వల్లనో అలా జరిగి ఉంటుందా? అనే అనుమానం పెంచుకున్నారు ఆ 66 ఏళ్ల పెద్దాయన. వినికిడి శక్తి నానాటికీ తగ్గిపోతూ వస్తుండడంతో ఆయన భార్య సైతం ఆందోళన చెందసాగింది. ఈ క్రమంలో.. డాక్టర్‌ను కలిసే ముందు హోం ఎండోస్కోప్ కిట్‌ను కొనుగోలు చేసి.. చెవిని పరీక్షించగా, చెవి లోపల తెల్లగా ఓ చిన్న వస్తువు కనిపించింది. ఆపై ఈఎన్టీ స్పెషలిస్ట్‌ను కలిసి ఆ తెల్లటి వస్తువును బయటకు తీసే యత్నం చేశారు. అయితే చెవిలో గులిమి మధ్య అది ఇరుక్కుపోవడంతో బయటకు తీయడం వైద్యులకు కష్టతరంగా మారింది. ఈ క్రమంలో.. ఓ చిన్నిపైపును చెవిలోకి జొప్పించి.. పంపింగ్ ద్వారా ఆ వస్తువును విజయవంతంగా బయటకు రాబట్టగలిగారు. అది బయటకు వచ్చిన మరుక్షణమే ఆ చిట్టిబాబు ప్రతీ సౌండ్‌ను క్లియర్‌గా వినగలిగారట!. ఐదేళ్ల కిందట.. ఆస్ట్రేలియా ట్రిప్‌కు వెళ్తున్న సమయంలో.. పాత ఇయర్‌బడ్ ముక్క చెవిలోకి దూరి ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఆ టూర్ తర్వాతే ఆయన చెవులు క్రమక్రమంగా వినిపించడం ఆగిపోయిందట!. -
గోద్రెజ్ కన్జూమర్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం గోద్రెజ్ కన్జూమర్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 359 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 479 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,144 కోట్ల నుంచి 7 శాతం పుంజుకుని రూ. 3,364 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 14 శాతంపైగా పెరిగి రూ. 2,951 కోట్లను దాటాయి. దేశీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 1,985 కోట్లను తాకింది. ఇండోనేసియా నుంచి 8 శాతం అధికంగా రూ. 409 కోట్ల టర్నోవర్ సాధించింది. -
ఇండియా సిమెంట్స్‌కు నష్టాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ కంపెనీ ఇండియా సిమెంట్స్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 113 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. తాజా క్యూ2లో మొత్తం ఆదాయం మాత్రం 7.5 శాతం బలపడి రూ. 1,327 కోట్లను దాటింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 27 శాతం పెరిగి రూ. 1,528 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో ఇండియా సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో స్వల్పంగా లాభపడి రూ. 248 వద్ద ముగిసింది. -
ప్చ్.. వాల్‌మార్ట్ ఇండియాకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: బెస్ట్‌ప్రైస్ ఫ్లిప్‌కార్ట్ స్టోర్ల నిర్వాహక దిగ్గజం వాల్‌మార్ట్ ఇండియా మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ. 299 కోట్ల నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2020-21)లో రూ. 201 కోట్ల నష్టం ప్రకటించింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం 6 శాతంపైగా పుంజుకుని రూ. 5,362 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 8 శాతం పెరిగి రూ. 5,660 కోట్లను తాకాయి. వాల్‌మార్ట్ ఇండియాలో 100 శాతం వాటాను ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 2020 జులైలో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాల్‌మార్ట్ ఇండియా దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో 29 బెస్ట్‌ప్రైస్ ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ స్టోర్లు, 2 ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలను నిర్వహిస్తోంది. కాగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌ను యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ 2018 మే నెలలో 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం విదితమే. -
అక్రమ వాణిజ్యం, ప్రభుత్వానికి రూ.58,521 కోట్ల నష్టం!
న్యూఢిల్లీ: అక్రమ వాణిజ్యం కారణంగా పెద్ద ఎత్తున పన్ను ఆదాయానికి నష్టం వాటిల్లుతోంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అక్రమ వాణిజ్యం కారణంగా రూ.58,521 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయినట్టు వాణిజ్య మండలి ఫిక్కీ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ఎఫ్ఎంసీజీ, మొబైల్ ఫోన్లు, పొగాకు ఉత్పత్తులు, మద్యం రంగాల్లో అక్రమ వాణిజ్యాన్ని ప్రస్తావించింది. ఈ రంగాల్లో అక్రమ వాణిజ్యం 2019–20లో రూ.2.60 లక్షల కోట్లుగా ఉంటుందని ఫిక్కీ అంచనా వేసింది. ఇందులో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల టర్నోవర్ 75 శాతంగా ఉంటుందని తెలిపింది. అక్రమ వాణిజ్యం కారణంగా ఎఫ్ఎంసీజీ ప్యాకేజ్డ్ పరిశ్రమలో రూ.17,074 కోట్లు, ఆల్కహాల్ ఉత్పత్తుల వల్ల రూ.15,262 కోట్లు, పొగాకు ఉత్పత్తుల వల్ల రూ.13,331 కోట్లు, ఎఫ్ఎంసీజీ హౌస్‌హోల్డ్, పర్సనల్ గూడ్స్ విభాగంలో రూ.9,995 కోట్లు, మొబైల్ ఫోన్లలో రూ.2,859 కోట్ల మేర పన్ను నష్టం వాటిల్లినట్టు వెల్లడించింది. ‘అక్రమ మార్కెట్లు.. జాతి ప్రయోజనాలకు విరుద్ధం’ పేరుతో ఫిక్కీ ఈ నివేదికను తీసుకొచ్చింది. పొగాకు ఉత్పత్తులు, మద్యం ఉత్పత్తుల రూపంలో ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున పన్ను ఆదాయం వస్తుంటుంది. వీటిపై నియంత్రణలు కూడా ఎక్కువే కావడం గమనార్హం. అక్రమ వాణిజ్యం వల్ల ఖజానాకు కలిగిన నష్టంలో సగం పొగాకు, మద్యం ఉత్పత్తుల నుంచే ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఉపాధికీ నష్టమే.. ఎఫ్ఎంసీజీ ప్యాకేజ్డ్ ఫుడ్ పరిశ్రమలో అక్రమ వాణిజ్యం కారణంగా 7.94 లక్షల మంది ఉపాధికి నష్టం వాటిల్లింది. పొగాకు పరిశ్రమలో 3.7 లక్షల మంది, ఎఫ్ఎంసీజీ హౌస్‌హోల్డ్, పర్సనల్ గూడ్స్ పరిశ్రమలో 2.98 లక్షల మంది, ఆల్కహాల్ బెవరేజెస్‌లో 97,000 మంది, మొబైల్ ఫోన్ పరిశ్రమలో 35,000 మంది అక్రమ వాణిజ్యం కారణంగా ఉపాధి కోల్పోయారు. ‘‘ఈ రంగాల్లో అక్రమ వాణిజ్యం వల్ల ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావమే చూపిస్తుంది. ఎందుకంటే ఇతర రంగాలతో ఈ రంగాలకు అనుబంధం ఉండడం వల్లే’’అని ఫిక్కీ నివేదిక వివరించింది. తయారీని బలోపేతం చేయడం, అసలైన ఉత్పత్తులకు సంబంధించి డిమాండ్–సరఫరా మధ్య అంతరం లేకుండా చూడడం, వినియోగదారుల్లో అవగాహన కల్పించడం, పన్ను టారిఫ్‌ల క్రమబద్ధీకరణ, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం.. అక్రమ వాణిజ్య నిరోధానికి అవసరమని ఫిక్కీ నివేదిక సూచించింది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
రూ.17వేల కోట్ల నష్టం.. ఇలా అయితే గాల్లోకి ఎగరడం కష్టమే!
కరోనా మహమ్మారి కారణంగా డీలా పడిన వాటిలో ఏవియేషన్ రంగం కూడా ఉంది. అయితే కరోనా పరిస్థితులు తొలగినా దేశీయ విమానయాన సంస్థలకు నష్టాలు మాత్రం తప్పడం లేదు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో.. విమానయాన సంస్థలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.15 నుంచి 17 వేల కోట్లు నష్టాలను చవిచూడబోతున్నారని తెలిపింది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలు పెరగడం, రూపాయి విలువ క్షీణించడమే ఈ నష్టాలకు ప్రధాన కారణమని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ రంగానికి రూ.23వేల కోట్ల నష్టం వాటిల్లింది. దేశంలో వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం, గత కొన్ని నెలలుగా కరోనా కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో నమోదు కాకపోవడం వంటి కారణాలతో దేశీయ ప్రయాణీకుల రద్దీ సంవత్సరానికి 57.7 శాతం వృద్ధిని నమోదు చేసి FY22లో 84.2 మిలియన్లకు చేరుకుంది. అయితే అమెరికా డాలర్‌తో రూపాయిలో ఏదైనా సానుకూల లేదా ప్రతికూల కదలిక అదే విధంగా జెట్ ఇంధన ధరలలో ఏదైనా పెరుగుదల లేదా తగ్గుదల భారతదేశంలోని విమానయాన సంస్థల వ్యయ నిర్మాణంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ప్రయాణీకుల ట్రాఫిక్‌లో ఆశించిన మెరుగుదల ఉన్నప్పటికీ, ఎటిఎఫ్ ధరలు పెరగడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం, ఈ రెండూ కారణాల వల్ల నష్టాలను వస్తున్నట్లు నివేదిక చెప్తోంది. ఏటీఎఫ్ కిలోలీటర్ ధర గత ఏడాది సుమారు రూ.7ంవేలు ఉండగా, ప్రస్తుతం రూ. లక్ష 24వేలకు చేరింది. చదవండి: గౌతమ్ అదానీ: 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. 2030 కల్లా నెం.1 లక్ష్యం! -
వరల్డ్ టాప్ బ్యాంకర్..సాఫ్ట్ బ్యాంక్‌కు ఊహించని షాక్!
టోక్యో: అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆందోళనల కారణంగా పెట్టుబడుల విలువ కరిగిపోవడంతో జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 23.4 బిలియన్ డాలర్ల భారీ నష్టం నమోదు చేసింది. గతేడాది ఇదే వ్యవధిలో 5.6 బిలియన్ డాలర్ల లాభం ఆర్జించింది. సమీక్షాకాలంలో అమ్మకాలు 6 శాతం పెరిగి 11.6 బిలియన్ డాలర్లకు చేరాయి. కంపెనీ ఏర్పాటైన తర్వాత నుంచి ఒక త్రైమాసికంలో ఇంత భారీ నష్టాలు ఎన్నడూ చూడలేదని సంస్థ సీఈవో మసయోషి సోన్ తెలిపారు. గత ఆరు నెలలుగా నమోదైన నష్టాలు 37 బిలియన్ డాలర్లకు ఎగిశాయని వివరించారు. చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబాలో వాటాల విలువ భారీగా పడిపోవడం .. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో నష్టాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిల్చింది. అలాగే, యెన్ విలువ పడిపోవడం కూడా మరో కారణం. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, ద్రవ్యోల్బణం వంటి అంశాల కారణంగా ఈ సవాళ్లు నెలలు లేదా సంవత్సరాల తరబడి కూడా కొనసాగవచ్చని సోన్ పేర్కొన్నారు. -
వోల్టాస్.. తగ్గింది!
న్యూఢిల్లీ: ఏసీలు, ఇంజినీరింగ్ సర్వీసుల దిగ్గజం వోల్టాస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 10 శాతంపైగా నీరసించి రూ. 110 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 122 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 55 శాతం జంప్‌చేసి రూ. 2,768 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 57 శాతం పెరిగి రూ. 2,603 కోట్లను దాటాయి. యూనిటరీ కూలింగ్ ప్రొడక్టుల నుంచి ఆదాయంలో రూ. 2,162 కోట్లు సమకూరింది. ఇది రెట్టింపునకుపైగా వృద్ధికాగా.. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్టులు, సర్వీసుల నుంచి 34 శాతం తక్కువగా రూ. 455 కోట్లు లభించింది. ఇక ఇంజినీరింగ్ సరీ్వసుల నుంచి 8 శాతం అధికంగా రూ. 124 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఫలితాల నేపథ్యంలో వోల్టాస్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 1,000 వద్ద ముగిసింది. చదవండి: Adani: అదానీ దూకుడికి బ్రేక్.. గ్రీన్ డీలా! -
హమ్మయ్యా.. జొమాటో నష్టాలు తగ్గాయి
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర నష్టాలు దాదాపు సగానికి తగ్గి రూ. 186 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 361 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 917 కోట్ల నుంచి రూ. 1,582 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,260 కోట్ల నుంచి రూ. 1,768 కోట్లకు పెరిగాయి. బ్లింకిట్ కొనుగోలు ప్రతిపాదనకు వాటాదారుల నుంచి 97 శాతం ఓట్లు లభించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో దీపీందర్ గోయల్ వెల్లడించారు. స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి అనుమతి రావలసి ఉన్నదని సీఎఫ్‌వో అక్షంత్ గోయల్ పేర్కొన్నారు. బ్లింకిట్ కొనుగోలుకి సాధ్యాసాధ్యాల పరిశీలన చేపట్టడంతోపాటు విలువ విషయంలో తీవ్రస్థాయిలో చర్చలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో జొమాటో షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 46.50 వద్ద ముగిసింది. చదవండి: భారత్‌కు ఉబర్ గుడ్‌బై, స్పందించిన ఈవోసీ -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లాభం డౌన్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో బ్రోకరేజీ దిగ్గజం ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 273 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం పుంజుకుని రూ. 795 కోట్లకు చేరింది. సంస్థాగత ఈక్విటీల విభాగం ఆదాయం 17 శాతం నీరసించి రూ. 49 కోట్లకు చేరింది. మార్కెట్లో పరిమాణం మందగించడం, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు క్షీణించడం ప్రభావం చూపింది. కాగా.. పంపిణీ బిజినెస్ ఊపందుకుంది. 28 శాతం జంప్‌చేసి రూ.152 కోట్లకు చేరింది. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ తదితర ప్రొడక్టులు ఇందుకు సహకరించాయి. మార్జిన్ ఫండింగ్ ద్వారా రూ. 619 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇవి దాదాపు రెట్టింపుకాగా.. 80 లక్షల మంది క్లయింట్ బేస్‌ను కలిగి ఉంది. క్యూ1లో కొత్తగా 4.4 లక్షల మంది జత కలిశారు. ఇదే కాలంలో ఇతర బ్రోకింగ్ సంస్థలు జిరోధా 62 లక్షలు, అప్‌స్టాక్స్ 52 లక్షలు, గ్రో 38 లక్షలు, ఏంజెల్ వన్ 36 లక్షల చొప్పున క్లయింట్లను గెలుచుకోవడం గమనార్హం! ఫలితాల నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేరు ఎన్ఎస్ఈలో 1.3 శాతం బలపడి రూ. 469 వద్ద ముగిసింది. -
ఇండస్ ఇండ్ ఫలితాలు ఆకర్షణీయం!
న్యూఢిల్లీ: ఇండస్ఇండ్ బ్యాంకు జూన్ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించింది. నికర లాభం 61 శాతం పెరిగి రూ.1,631 కోట్లుగా నమోదైంది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టాయి. బ్యాంకు ఆదాయం సైతం రూ.10,113 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,016 కోట్లు, ఆదాయం రూ.9,298 కోట్లుగా ఉన్నాయి. వడ్డీ ఆదాయం 9.5 శాతం పెరిగి రూ.8,182 కోట్లకు చేరింది. స్థూల నినర్థక ఆస్తులు (ఎన్పీఏలు) మొత్తం రుణాల్లో 2.35 శాతంగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది జూన్ త్రైమాసికం చివరి నాటికి ఉన్న 2.88 శాతంతో చూస్తే కొంచెం తగ్గాయి. నికర ఎన్పీఏలు 0.84 శాతం (రూ.1,760 కోట్లు) నుంచి 0.67 శాతానికి (రూ.1,661 కోట్లు) క్షీణించాయి. మార్చి త్రైమాసికం చివరికి ఉన్న నికర ఎన్పీఏలు 0.64 శాతం (రూ.1,530 కోట్లు)తో పోల్చి చూస్తే స్వల్పంగా పెరిగాయి. ప్రొవిజన్లు, కంటెంజెన్సీలకు చేసిన కేటాయింపులు తగ్గినట్టు ఇండస్ఇండ్ బ్యాంకు ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో రూ.1,251 కోట్లను కేటాయించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,779 కోట్లను కేటాయించడం గమనించాలి. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో కేటాయింపులు రూ.1,461 కోట్లుగా బీఎస్ఈలో బ్యాంకు షేరు ఒక శాతం లాభంతో రూ.879 వద్ద క్లోజయింది. -
డీసీఎం శ్రీరామ్ ఫలితాలు ఆకర్షణీయం
న్యూఢిల్లీ: డీసీఎం శ్రీరామ్ లిమిటెడ్ జూన్ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 61 శాతం పెరిగి రూ.254 కోట్లకు చేరింది. ఆదాయం సైతం రూ.3,000 కోట్లకు దూసుకుపోయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.158 కోట్లు, ఆదాయం రూ.2,025 కోట్లుగా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన డీసీఎం శ్రీరామ్ క్లోరో వినిల్ కెమికల్, షుగర్, ఫెర్టిలైజర్స్, బయోసీడ్స్ వ్యాపారాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘‘ఎన్నో దశాబ్దాల తర్వాత ప్రపంచం వ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణాన్ని చూస్తున్నాం. సరఫరా వైపు సమస్యలు, కీలక కమోడిటీల ధరలు పెరిగిపోయాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. కరెన్సీలు చారిత్రంగా కనిష్టాలను చూస్తున్నాయి. ఇదంతా అనిశ్చిత వాతావరణానికి దారితీసింది, కంపెనీ బ్యాలన్స్ షీటు బలంగా ఉండడంతో వీటిని మెరుగ్గా అధిగమించింది’’అని సంస్థ చైర్మన్, ఎండీ అజయ్ శ్రీరామ్, వైస్ చైర్మన్, ఎండీ విక్రమ్ శ్రీరామ్ తెలిపారు. కెమికల్స్, షుగర్ వ్యాపారంలో రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. వచ్చే 12 నెలల్లో వీటి నుంచి కార్యకలాపాలు మొదలవుతాయన్నారు. -
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం రెట్టింపు!
ముంబై: ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో మంచి పనితీరు ప్రదర్శించింది. స్టాండలోన్ లాభం రెట్టింపునకు పైగా పెరిగి రూ.452 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.208 కోట్లు కావడం గమనించాలి. లాభంలో 117 శాతం వృద్ధిని చూపించినట్టు బ్యాంకు ఎండీ, సీఈవో ఏఎస్ రాజీవ్ తెలిపారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు ఉన్నా కానీ తాము మంచి ఫలితాలను సాధించినట్టు చెప్పారు. సెప్టెంబర్ త్రైమాసికం నుంచి అధిక వృద్ధిని అంచనా వేస్తున్నామని, భవిష్యత్తు వృద్ధి పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నామని ప్రకటించారు. నికర వడ్డీ ఆదాయం 20 శాతానికి పైగా పెరిగి రూ.1,686 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ 3.05 శాతం నుంచి 3.28 శాతానికి పుంజుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 6.35 శాతం నుంచి 3.74 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏలు 2.22 శాతం నుంచి 0.88 శాతానికి పరిమితమయ్యాయి. తాజాగా రూ.697 కోట్ల రుణాలు ఎన్పీఏల జాబితాలోకి చేరాయి. -
చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాథ్ ఫోటోలు...వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో మధరలోని ఒక స్థానిక మున్సిపాలిటి ఉద్యోగి చెత్తను సేకరించుకుంటూ వెళ్తున్నాడు. ఐతే ఆ చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాద్ ఫోటోలు ఉన్నాయి. దీంతో అతనికేం సంబంధం లేదు. అతను తన పనిగా చెత్తను సేకరించుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాజస్తాన్‌కి చెందిన కొందరు వ్యక్తలు సదరు వ్యక్తిని ఆపి మరీ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆ చెత్తబండిలో అబ్దుల్ కలాం పోటో కూడా ఉంది. దీంతో సదరు వ్యక్తిని ఏంటి ఇది అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. తనకేం తెలియదని చెత్తబుట్టలో ఉన్నవాటిని సేకరించుకుంటూ వచ్చానని చెప్పాడు. ఈ ఘటనను అవమానంగా భావించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సదరు మున్సిపాలిటీ కాట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ఆ చెత్తబండిలో ఉన్న ఫోటోలను గుర్తించి ప్రశ్నించిన వ్యక్తి ఆయా ఫోటోలను సదరు వ్యక్తి నుంచి తీసుకోవడమే కాకుండా గౌరవంగా నిమజ్జనం చేస్తానని చెప్పాడు. ఐతే నెటిజన్లు మాత్రం ఇందులో అతని తప్పే ఏముంది, చెత్త బుట్లలో ఉంటేనేగా అతను సేకరించి తీసుకువచ్చిందని ఒకరు, పాడైన ఫోటోలను ఏం చేయాలో చెప్పండి అంటూ మరోకరు మండిపడుతూ ట్వీట్ చేశారు. A contractual worker at UP's Mathura Nagar Nigam was terminated after he was found carrying pictures of PM Narendra Modi and CM Yogi Adityanath among other dignitaries in his hand held garbage cart. pic.twitter.com/Jg2x3LW3Mk — Piyush Rai (@Benarasiyaa) July 17, 2022 (చదవండి: ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. నెల క్రితమే నిర్మించారటా!) -
నన్ను గెలిపించనప్పుడు నా డబ్బులు ఇచ్చేయండి! బెదిరిస్తున్న వ్యక్తి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రాజు దయమా అనే వ్యక్తి ప్రజలను బెదిరిస్తూ..హింసిస్తున్నందుకుగానూ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే...రాజు మానస తహసీల్‌లోని దేవరాన్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో అతను తాను ఎన్నికల్లో గెలవలేదు కాబట్టి తన డబ్బులు తనకిచ్చేయమంటూ ప్రజలను బెదిరించడం మొదలు పెట్టాడు. రాజు ప్రజలను బెదరించడమే కాకుండా హింసించడం వంటి పనులు కూడా చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఈ ఘటన వెలుగు చూసింది. రాజు పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోయాను కాబట్టి తన వద్ద తీసుకున్న డబ్బులను వెనక్కి ఇచ్చేయాల్సిందే.. అంటూ ప్రజల వద్ద నుంచి సుమారు రూ. 4 లక్షలు వరకు వసూలు చేశాడని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు రాజు, అతని సహచరుడి పై ఎన్నికల్లో డబ్బు పంచినందుకు, ప్రజలను డబ్బు ఇచ్చేయమంటూ.. ఇబ్బందిపెట్టినందుకుగానూ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: లాలూ యాదవ్ కుమారుడి విచిత్రమైన అభ్యర్థన... తిరస్కరించిన పోలీసులు) -
బ్లింకిట్ డీల్: జొమాటోలో వేల కోట్ల రూపాయలు హాంఫట్
బెంగళూరు: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు భారీ షాక్ తగిలింది. కిరాణా డెలివరీ స్టార్టప్ బ్లింకిట్‌ను కొనుగోలు ఒప్పందం ప్రకటించిన తరువాత దాదాపు ఒక బిలియన్ డాలర్ల మేర కోల్పోయింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ భారీ నష్టాన్న చవి చూసింది. ఈ డీల్‌పై పెట్టుబడిదారులు ప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యంలో జొమాటో లిమిటెడ్ షేర్లు వరుసగా రెండవ రోజు నష్టపోయి మంగళవారం 8.2 శాతం వరకు పతమైంది. మొత్తం రెండు రోజుల్లో 14.07 శాతం నష్టపోయింది. కాగా యాంట్ గ్రూప్-ఆధారిత ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో రూ. 4,447 కోట్ల (568.16 మిలియన్ డాలర్లు) డీల్‌ను శుక్రవారం వెల్లడించింది. షేర్ల మార్పిడి ద్వారా కంపెనీని సొంతం చేసుకోనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. తీవ్రమైన పోటీలో నిలదొక్కుకుని, మార్కెట్లో పట్టు సాధించే ప్రక్రియలో ఈ డీల్ కుదుర్చుకుంది. ఇది కూడా చదవండి: Indian Rupee Vs US Dollar: రూపాయి మరింత ఢమాల్! మున్ముందు మరింత కష్టం -
Secunderabad Railway Station: రైల్వేకు నష్టం రూ.12 కోట్లు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసంలో ప్రత్యక్షంగా రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందని, పరోక్షంగా కూడా కోట్లలో నష్టం ఉంటుందని డివిజన్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా వెల్లడించారు. శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 30 బోగీలు, 5 రైలు ఇంజన్లు దెబ్బతిన్నాయని.. ప్లాట్‌ఫామ్‌లపై సీసీ కెమెరాలు, టీవీలు, దుకాణాలు, పార్శిళ్లకు పూర్తిగా నష్టం వాటిల్లిందని ఏకే గుప్తా చెప్పారు. రైళ్లు రద్దు కావడంతో జరిగే చెల్లింపులు, పార్శిళ్లు, ఇతర పరోక్ష నష్టాలను అంచనా వేస్తున్నామని తెలిపారు. రైల్వే ప్రయాణికుల లగేజీ కూడా నష్టం జరిగిందన్నారు. రైల్వే సిగ్నల్ వ్య వస్థకు ఎలాంటి నష్టం జరగలేదని.. శుక్రవా రం రాత్రి నుంచే రైళ్లను పునరుద్ధరించామని చెప్పారు. రైళ్లన్నీ యథావిధిగా నడుస్తున్నాయన్నారు. అదృష్టవశాత్తు పవర్ కార్కు ఎలాంటి నష్టం జరగలేదని, అందులో 3 వేల లీటర్ల డీజి ల్ ఉండటం వల్ల నిప్పంటుకుంటే నష్టం తీవ్రం గా ఉండేదని తెలిపారు. ఇందులో కుట్ర కోణ మేదైనా ఉందా అన్నదానిని దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు. ఘటనలో 8 మంది రైల్వే సిబ్బందికి స్వల్పగాయాలైనట్టు చెప్పారు. -
భారత్‌లో ఫోర్డ్, అమ్మో ఇన్ని వేల కోట్లు నష్టపోయిందా!
వాహన రంగంలో ఉన్న యూఎస్ సంస్థ ఫోర్డ్.. ఎగుమతుల కోసం భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ ప్రణాళికను విరమించుకుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద అనుమతి పొందినప్పటికీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చెన్నై, గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్లలో ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నట్టు వెల్లడించింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారత్‌లో వాహనాల తయారీని నిలిపివేస్తున్నట్టు ఫోర్డ్ 2021 సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశాల్లో తయారైన వెహికిల్స్‌ను మాత్రమే దేశంలో విక్రయించాలని నిర్ణయించింది. భారత్‌లోని ప్లాంట్ల కోసం ఫోర్డ్ సుమా రు రూ.19,250 కోట్లు వెచ్చించింది. అయితే కంపెనీ రూ.15,400 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. విదేశీ మార్కెట్ల కోసం సనంద్ ప్లాంటులో ఇంజన్ల తయారీ కొనసాగుతోంది. రెండు తయారీ కేంద్రాలను విక్రయించాలని కంపెనీ కొన్ని నెలలుగా ప్రయత్నిస్తోంది. -
ఆనందం రెండు రోజులే.. మళ్లీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: వరుసగా రెండు రోజుల పాటు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించిన స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైంది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నిన్న సాయంత్రం నుంచే అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఈ రోజు ఉదయం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. మరోవైపు యూఎస్, ఏసియా మార్కెట్ సూచీలు సైతం బలహీనంగా కదలాడుతుండంతో అమ్మకాలు మరింత జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, అటు ఎన్ఎస్ఈ నిఫ్టీలు మార్కెట్ మొదలైన 20 నిమిషాల్లోనే భారీగా నష్టాలను చవి చూశాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 57,531 పాయింట్లతో మొదలైంది. క్రితం రోజు ముగింపుతో పోల్చితే దాదాపు 400 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైంది. ఆ తర్వాత కూడా అమ్మకాల జోరు కొనసాగడంతో ఉదయం 9:20 గంటల సమయానికి 597 పాయింట్లు నష్టపోయి ఒక శాతం క్షీణత నమోదు చేసి 57,314 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైను ఎన్ఎస్ఈ నిఫ్టీ 186 పాయింట్లు నష్టపోయి 17,206 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
రోజంతా ఊగిసలాట.. చివరకు భారీ నష్టాలతో ముగింపు
ముంబై: స్టాక్ వరుసగా రెండో రోజు భారీ నష్టాలను చవి చూసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్ ఆ వెంటనే నష్టపోవడం మొదలెట్టింది. తిరిగి ఇన్వెస్టర్లు నమ్మకం చూపించడంతో లాభాల బాట పట్టాయి సూచీలు. అయితే తాజాగా విడుదల అవుతున్న త్రైమాసిక ఫలితాలు, పెరిగిన ద్రవ్యోల్బణం, మళ్లీ రాజుకున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధ వేడితో చివరకు నష్టాలు తప్పలేదు. ముఖ్యంగా మార్కెట్ చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 57,318 పాయింట్లతో మొదలైంది. ఓ దశలో గరిష్టంగా 57,464 పాయింట్లను టచ్ చేయగలిగింది. అయితే అంతర్జాతీయ పరిణాలు ప్రతికూలంగా మారడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి చివరకు 703 పాయిట్లు నష్టపోయి 56,463 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ 304 పాయింట్లు నష్టపోయి 16,869 పాయింట్ల దగ్గర ముగిసింది. ఈ రోజు ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఆ తర్వాత ఐసీఐసీఐ షేర్లు ఇన్వెస్టర్లకు ఆనందాన్ని పంచాయి. హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల పాలయ్యాయి. రెండు రోజుల వ్యవధిలో సెన్సెక్స్ సుమారు రెండు వేల పాయింట్లు నష్టపోగా నిఫ్టీ ఆరు వందల పాయింట్లకు పైగా కోల్పోయింది. -
భారీ నష్టాలు.. ఒక్క రోజులో 3.39 లక్షల కోట్ల సంపద ఆవిరి!
నాలుగు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవి చూసింది. సోమవారం ఉదయం మార్కెట్ ఆరంభంతోనే నష్టాల పరంపర మొదలైంది. షాంగైలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న లాక్డౌన్, మార్చిలో దేశీయంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్‌తో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, అంచనాలను అందుకోలేకపోయిన ఐటీ కంపెనీల పనితీరు. ప్రతికూలంగా కదలాడుతున్న అంతర్జాతీయ మార్కెట్ సూచీలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 58,338 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఈరోజు ఉదయం వెయ్యి పాయంట్లు నష్టపోతూ 57,338 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా ఎక్కడా మార్కెట్‌కు ఉత్తేజ పరితే పరిణామాలు చోటు చేసుకోకపోవడంతో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఫలితంగా కొత్త టైం టేబుల్ ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటల సమయానికి 1172 పాయింట్లు నష్టంతో 2.01 శాతం క్షీణత నమోదు చేసి 57,166 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ క్లోజయ్యింది. నిఫ్టీ సైతం 302 పాయింట్లు నష్టపోయి 1.73 శాతం క్షీణించింది 17,173 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీ రెండు సూచీలు భారీగా నష్టపోవడంతో ఒక్కరోజులోనే రూ. 3.39 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ముఖ్యంగా ఇన్ఫోసిస్ షేరు ధర ఒక్క రోజులో 124 రూపాయలు పడిపోవడంతో ఆ కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 48 వేల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. బ్యాంకు నిఫ్టీ సూచీ భారీగా నష్టపోయింది. ఇన్ఫోసిస్ తర్వాత కోటక్‌మహీంద్రా, టెక్ మహీంద్రా షేర్లు కూడా నష్టపోయాయి. ఇంతటి నష్టాల్లో ఎన్టీపీసీ, టాటా స్టీల్, బజాజ్ ఆటో షేర్లు లాభపడ్డాయి. చదవండి: మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ పెట్టుబడులు, 3.17 కోట్ల కొత్త ఫోలియోలు!