'మాంసం తినే బ్యాక్టీరియా'!.. దీని బారిన పడితే..అంతే సంగతులు! | US Woman Jennifer Barlow, 33, Loses Leg After Getting Flesh-Eating Bacteria In Bahamas - Sakshi
Sakshi News home page

Flesh Eating Bacteria: మాంసం తినే బ్యాక్టీరియా!.. దీని బారిన పడితే..అంతే సంగతులు!

Published Wed, Aug 30 2023 12:42 PM | Last Updated on Wed, Aug 30 2023 2:01 PM

US Womans Leg Amputated After Contracting Flesh Eating Bacteria  - Sakshi

యూఎస్‌లోని తూర్పు తీర వెంబడి సముద్ర జలాల్లో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది విబ్రియో వల్నిఫికస్ అనే ప్రాణాంతక గాయాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఈ బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్లు నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌కు దారితీస్తుంది. దీంతో ఓపెన్‌ గాయం చుట్టూ మాంసం కుళ్లపోవడం ప్రారంభమవుతుంది. దీన్నే మాంసం తినే బ్యాక్టీరియాగా చెబుతారు. ఈ నైక్రోటైజింగ్‌ ఫాసిటస్‌ అనేది ఒకటికంటే ఎక్కువ రకాల బ్యాక్టీరియాల వల్ల సంభవిస్తుంది. దీని బారిన పడిన కేసుల్లో చాలావరకు ప్రాణాలు కోల్పోయే అవకాశం గానీ అవయవాన్ని కోల్పోయే ప్రమాదం గానీ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్‌ బారినే  జెన్నిఫర్‌ బార్లో అనే అట్లాంట మహిళ పడి మరణం అంచులాదాకి వెళ్లొచ్చింది. 

అసలేం జరిగిందంటే.. జెన్నిఫర్‌ బార్లో(33) అనే అట్టాంట మహిళ యూఎస్‌లోని బహామాస్‌ పర్యటనలో ఉన్నప్పుడు..సముద్రపు నీరు కారణంగా చిన్నపాటి గాయం అయ్యింది. చాలా చిన్ననీళ్ల ఒరిపిడి గాయం. అదికాస్త పెద్దదిగా అయ్యి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌కి గురవ్వుతుందని ఊహించను కూడా ఊహించం. అయితే బార్లో కూడా పెద్ద గాయం కాదనే అనుకుంది. చిన్న పాటి క్రీమ్‌లు వంటివి రాసి గాయం పెద్దది కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటిని తీసుకుంది. తగ్గిపోతుందనుకుంటే రోజు రోజుకి పెరుగుతుందేంటి అని ఆశ్చర్యపోయింది కూడా.

రెండు వారాలకు పైగా కోమాలోనే..
చిన్న గాయం ఏదో పెద్ద రాడ్‌తో కొట్టినట్ల, లేదా పడిపోతే తగిలిన గాయం మాదిరిగా ఇంత నొప్పి వస్తోందేంటి అని కూడా అనుకుంది. అంతే ఓ రోజు తన నివాసంలోనే హఠాత్తుగా స్ప్రుహ కోల్పోయి పడిపోయింది. ఇది గమనించిన ఆమె సోదరుడు వెంటనే ఆస్పత్రికి హుటాహుటినా తరలించాడు. అక్కడ వైద్యుల ఆమె సెప్టిక్‌ షాక్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. కాలు బాగా వాచిపోయి నొప్పిగా ఉండటమేగాక అక్కడ చర్మం అంతా వేడిగా ఉంది. బ్యాక్టీరియా ఆమె రక్త ప్రవాహంలో ప్రవేశించడంతో బార్లో సుమారు రెండు వారాల పాటు కోమాలోనే ఉండిపోయింది.

ఆమె కిడ్నీ, లివర్‌ ఫెయిల్‌ అయిన లక్షణాలు కనిపించాయి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కూడా ఎదురైంది. వైద్యులు కూడా ఆమె దీని నుంచి ఆరోగ్యంతో బయటపడదనే భావించారు. ఆశలన్ని వదులేసి మరీ తమ వంతు ప్రయత్నంగానే వైద్యులు ఆమెకు చికిత్స చేయడం ప్రారంభించారు. ఆమె తొడలో చనిపోయిన కణజాలాన్ని తొలగించడానికి ఏకంగా 12 సర్జరీలు చేశారు. ఆమె కాలును తొలగించకుండానే నయం అయ్యేలా ఎన్నో ప్రయత్నాలు చేశారు.

30కి పైగా సర్జరీలు..
కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక వైద్యులు చివరికి ఆమె కాలును తొలగించారు. ప్రస్తుతం ఆమె కాలు లేకుండా ఎలా దైనందిన జీవితాన్ని లీడ్‌ చేయాలో నేర్చుకునే పనిలో పడింది. అంతేగాదు ఈ గాయం కారణంగా కాలుని తొలగించకుండా ఉండేలా తొడలోని కణజాలన్ని తొలగించేందుకు గానూ సుమారు 30కి పైగా సర్జరీలు చేయించుకున్నప్పటికీ కాలు కోల్పోక తప్పలేదు బార్లోకి.

కాగా, యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రకారం..1996 నివేదికలో యూఎస్‌లో ఏడాదికి 500 నుంచి 1500 దాక నెక్రోటైజింగ్‌ ఫాసిటిస్‌కి సంబంధించని కేససులు ఉన్నాయని పేర్కొంది. వాటిలో దాదాపు 20 శాతం ప్రాణాంతకంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ ఇన్ఫెక్షన్‌ కారణంగా ప్రతి ఐదుమందిలో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుందని కూడా తెలిపింది. దయచేసి బీచ్‌ల వద్ద సముద్రపు నీటిలో ఎంజాయ్‌ చేసేటప్పుడూ జాగ్రత్తగా ఉండండి. ఏదైన గాయమైన జాగుకతతో వ్యవహరించండి.

(చదవండి:  సరోగసీకి ప్రత్యామ్నాయం!.భవిష్యత్తులో వేలాది మహిళలకు..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement