సాధారణంగా మహిళలు ట్రెండ్‌కు తగ్గట్టు తమ హ్యాండ్ బ్యాగులు ఉండేలా జాగ్రత్తపడతారు. ఆఫీస్ వేర్ బ్యాగులు, పార్టీ వేర్ టినీ బ్యాగులు, లగ్జరీ హ్యాండ్ బ్యాగ్‌లు, హై-ఎండ్ డిజైనర్ పర్స్‌లు...ఇలా సమ యానుకూలంగా ఎవరి టేస్ట్‌కు తగ్గట్టు వారు ధరించడం ప్టైల్. ఆమెరికాకు చెందిన మహిళ ఒక సాధారణమైన బియ్యం సంచిని స్టయిలిష్‌గా టోట్ బ్యాగ్ (Tote bag) సెలూన్‌కు తీసుకొని వెళ్లిన వైనం నెట్టింట వైరల్ అవుతోంది.
మెడ్రన్ దుస్తుల్లో ఉన్న ఒక మహిళ (US Woman) ఒక సెలూన్‌లో బాస్మతి బియ్యం (Basmati Rice) సంచిని టోట్‌గా తీసుకువెళ్లడం నెటిజనులను ఆకర్షిస్తోంది ఇండియాలోని ఒకబ్రాండ్‌కు చెందిన బాస్మతీ బియ్యం సంచిని డిజైనర్ బ్యాగ్‌లాగా ధరించింది. అమెరికాలో ట్రెండింగ్‌లో ఏమి ఉందో చూశారా.. అంటూ షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే ఇది 8 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది.
‘‘భలే ఉంది, వాటే క్రియేటివిటీ , బోల్డ్ ఫ్యాషన్ ప్రయోగం, బాస్మతి ఉండగా, ఇక గూచి ఎందుకు, ‘‘అయ్యయ్యో.. నా దగ్గర ఉన్న చివరి బియ్యం బస్తా బ్యాగ్ విసిరేసా ..ముందే ఇది చూసి ఉంటేనా..’’ అంటూ రకరకాలుగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లను పోస్ట్ చేశారు. రోజువారీ వస్తువులను ఇలా రీయూజ్ చేయడం బావుంది, ఇది పీక్ సస్టైనబిలిటీ - ఒక ప్రయోజనంతో కూడిన ఫ్యాషన్." అని మరికొంతమంది స్పందించారు. అలాగే మొత్తానికి మన జ్యూట్ బ్యాగులు అమెరికన్ల మనసు దోచుకుంటున్నాయి అన్నారు మరికొంతమంది నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment