Rice bag
-
కేంద్రం కీలక నిర్ణయం.. రూ.25కే కిలో బియ్యం?
న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న బియ్యం ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భారత్ రైస్ పేరుతో కిలో బియ్యాన్ని రాయితీ కింద రూ. 25కే ఇవ్వాలనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు పలుజాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు పెరుగుతున్న నిత్యావసర ఆహార పదార్థాల ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో సగటున కిలో బియ్యం ధర రూ. 43గా ఉంది. ఇది కిందటి ఏడాదితో పోలిస్తే 14.1శాతం పెరిగింది. దీంతో అందుబాటు ధరలో బియ్యాన్ని అందించేందుకు కేంద్రం.. ‘భారత్ రైస్’ను తీసుకురానున్నట్లు వినికిడి. రాయితీ ధరతో అందించనున్న బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), కేంద్రీయ భండార్ అవుట్లెట్, మొబైల్ వ్యాన్లు వంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే దేశంలో ఆహార పదార్థాలను సామాన్యులకు అందుబాటు ధరల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్’ బ్రాండ్ పేరుతో పప్పు, గోధుమ పిండిని రాయితీ ధరలకు విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కిలో గోధుమ పిండిని రూ. 27.50, కిలో శనగ పప్పును . 60 చొప్పున వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఉత్పత్తులు 2,000 కంటే ఎక్కువ రిటైల్ పాయింట్లలో పంపిణీ చేస్తున్నారు. వీటిలాగే ‘భారత్ రైస్’ విక్రయాలు కూడా చేపట్టనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా.. దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ఇటీవల కేంద్రం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. అటు బాస్మతి బియ్యంపైనా ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. టన్ను ధర 1200 డాలర్లకంటే తక్కువ ధర ఉన్న బాస్మతి బియ్యం ఎగుమతులను నిషేధించింది. -
డీఐవై లేడీ
‘డూ ఇట్ యువర్ సెల్ఫ్’ (డిఐవై) పాలసీని అనుసరిస్తే ఏమొస్తుంది? మెదడుకు పనిదొరుకుతుంది. షార్ప్ అవుతుంది. తనను తాను ‘డీఐవై లేడీ’గా పిలుచుకునే నటి, కంటెంట్ క్రియేటర్ శ్వేతా మహదిక్ పాత ఖాళీ రైస్ బ్యాగును స్టైలిష్ హ్యాండ్‌బ్యాగ్‌గా మలిచింది. కత్తిరింపు నుంచి మెషీన్‌పై కుట్టువరకు అన్నీ తానే స్వయంగా చేసింది. ఈ అందమైన బ్యాగ్‌కు గోల్టెన్కలర్ చైన్ జత చేసి ‘అప్క్లచ్డ్ బ్యాగ్’ అని నామకరణం చేసింది. బ్యాగు తయారీ ప్రక్రియకు సంబంధించిన వీడియోను శ్వేతా మహదిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే వైరల్ అయింది. బాలీవుడ్ ప్రముఖ నటి ఉర్ఫీ జావెద్, శ్వేతా మహదిక్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. నెటిజనులు రకరకాల కామెంట్స్‌తో భారీగా స్పందించారు. వాటిలో మచ్చుకు మూడు... ‘ఇట్స్ రాకింగ్’ ‘మీకు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ అవార్డ్ తప్పనిసరిగా ఇవ్వాలి’ ‘మీ వీడియో చూసి ఇప్పటికే రెండు హ్యాండ్ బ్యాగ్‌లు తయారుచేశాను.’ -
అనాథలకు రైస్ కార్డు
సాక్షి, కర్నూలు: ఒంటరి నిరుపేద జీవితం ఎంతో దుర్భరం. తమను తాము పోషించుకునే శక్తి లేక పూట గడవడమే కష్టంగా బతకాల్సి వస్తోంది. అలాగే సమాజ వివక్షకు గురవుతూ జీవితాంతం ఒంటరిగా జీవించే ట్రాన్స్జెండర్ల పరిస్థితి మరీ అధ్వానం. అటువంటి వారికి రైస్ కార్డులు మంజూరు చేసి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వారిని గుర్తించే బాధ్యతను అధికారులు వలంటీర్లకు అప్పగించారు. తమ పరిధిలో కార్డులు లేని అనాథలు, ట్రాన్స్జెండర్లు, పిల్లలు లేని వితంతువులు, ఇల్లులేని వారిని గుర్తించాలి. అలా గుర్తించిన వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సాధారణ రైస్ కార్డు మాదిరిగానే ఆరు అంశాల ప్రాతిపదికన అర్హత ఉంటే చాలు. వీరికి కూడా పది రోజుల్లోనే కొత్త రైస్ కార్డులను మంజూరు చేస్తారు. ఈ మేరకు జిల్లాలో దాదాపు 5 వేల మంది కొత్తగా రైస్ కార్డు పొందే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇకపై సంక్షేమ పథకాలకూ అర్హులు.. ఏ సంక్షేమ పథకానికైనా అర్హత ఉండాలంటే ముఖ్యంగా రైస్ కార్డు ఉండాలి. ఆ కార్డు లేకపోవడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అనాథలు, ఒంటరిలు, ట్రాన్స్జెండర్లు దూరం కావాల్సి వస్తోంది. దీంతో కార్డు పొందేందుకు వారు అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోవాల్సి వచ్చేది. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదు. ప్రభుత్వమే అర్హులైన వారిని గుర్తించి రైస్ కార్డులు ఇస్తుండటంతో సంక్షేమ పథకాలకు అర్హత పొందనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం.. ఒంటరిగా జీవించే వారికి చేయూత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. గతంలోనూ ఈ డిమాండ్ ఉన్నా పాలకులు పట్టించుకోలేదు. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మానవత్వంతో ఆలోచించి ఒంటరి బతుకులకు అండగా నిలవాలని నిర్ణయించడం అభినందనీయం. ఈ నిర్ణయంతో పలువురి ఒంటరి బతుకుల్లో వెలుగులు నిండనున్నాయి. సర్వే జరుగుతోంది గతంలో ఒంటరిగా జీవించే వారికి రేషన్‌కార్డులు ఇచ్చేవాళ్లం కాదు. ఈ ప్రభుత్వం వారికి అండగా నిలవాలని సంకల్పించింది. ఒంటరిగా జీవించే వ్యక్తులకు కూడా కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. వలంటీర్లతో సర్వే జరుగుతోంది. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు రైస్ కార్డు మంజూరవుతుంది. – సయ్యద్ యాసిన్, డీఎస్ఓ మా జీవితాలకు భరోసా రెక్కల కష్టంపై బతికే మా జీవితాలకు ఓ భరోసా లభించింది. రైస్ కార్డు వస్తుందని ఇప్పటి వరకు కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు వలంటీర్ వచ్చి నాతో దరఖాస్తు చేయించారు. చాలా సంతోషం.– కె.రాజేశ్వరి, - ట్రాన్స్‌జెండర్, కర్నూలు -
బియ్యంలో పురుగు
బియ్యంలో పురుగు ఉంటుంది.బియ్యపు గింజలా ఉంటుంది.కలగలిసిన పురుగును కనిపెట్టడం కష్టం.కాని క్లూ ఉంటుంది.సరైన క్లూ దొరికితే పురుగు పట్టుబడుతుంది.చట్టం ఆ పురుగు చుట్టూ బిగుసుకుపోతుంది. హార్యానాలో ఆర్మీ క్యాంప్.‘ఘర్ జానా హై’... అని పెద్దగా అరిచాడు ఒక జవాను.అది సెలవులు ఇచ్చే టైము. అందరూ ఉత్సాహంగా ఉన్నారు.‘బీవీ కో చుమ్మా దేనా హై’ అని నవ్వాడు కిరణ్.‘ఏయ్... ఏంట్రా నీ వాగుడు’ అన్నాడు ఒక మిత్రుడు కిరణ్‌తో.‘లేకుంటే ఏంట్రా మీరంతా. ఎప్పుడెప్పుడు సెలవులిస్తారా పెళ్లాం పాదాల దగ్గర వాలిపోదామా అని. నాకు చూడు ఒంటరిగాణ్ణి. హాయిగా సెలవుల్లో తిరుగుతా. అన్నింటిమించి మా అన్నయ్య వొదిన దగ్గర సరదాగా గడుపుతా’ అన్నాడు కిరణ్.‘ఈ వయసులో పెళ్లి పిచ్చో సినిమాల పిచ్చో ఉండాలి. నువ్వు మాత్రం అన్నా వదినల పిచ్చోడివి’ అని ఆటపట్టించారు ఫ్రెండ్స్.కిరణ్ హాయిగా నవ్వేశాడు. అన్నా వదినల దగ్గరకు వెళ్లినా ఈసారి పెళ్లి బలవంతం తప్పదేమో అనుకుంటూ బ్యాగ్ సర్దుకొని స్టేషనుకు చేరుకున్నాడు. ‘ఇది కోడి కూరా.. ఇది చింతాకు పులుసు... ఇది గోంగూర రొయ్యలు’... వరుస పెట్టి పెడుతూ ఉంది వదిన మణి.‘ఇంకో నాలుగు తెచ్చి పెట్టవే. ఏ ఆర్మివాడైనా బుల్లెట్‌తో పోయాడంటే గౌరవం. భోం చేసి పోయాడంటే ఎంత అప్రదిష్ట’ నవ్వుతూ అన్నాడు.నెల్లూరు జిల్లాలోని ఒక టౌన్ అది.సెలవు ఇవ్వగానే కిరణ్ సరాసరి అన్నా వదినల ఇంటికి వచ్చేశాడు. అక్కడికి పది మైళ్ల దూరంలో ఉన్న పల్లెలో కిరణ్ తల్లిదండ్రులు ఉంటారు. కాని సాధారణంగా అక్కడికి వెళ్లడు. వచ్చాడంటే ఇక్కడే.‘కిరణ్ సంగతి ఏమోకాని మీరు తినకపోతే బడితె పూజే’ భర్త ప్లేట్లో కూడా అన్నీ వడ్డిస్తూ అంది మణి.కిరణ్ నవ్వుతూ వాళ్లనే చూస్తూ ఉన్నాడు.వచ్చిన ప్రతిసారీ వాళ్లనే చూస్తూ ఉంటాడు. ప్రసాద్ బియ్యం వ్యాపారం చేస్తాడు. మణి ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరు పిల్లలు. ఐదొకరు, ఏడొకరు చదువుతున్నారు. నలుగురూ హ్యాపీగా ఉంటారు. ప్రసాద్ మాటే వేదవాక్కు అన్నట్టుగా మణి ఉంటుంది. ప్రసాద్ తిన్నాక అదే కంచంలో తింటుంది. ఎంత ఆలస్యంగా వచ్చినా ఎదురు చూస్తూ ఉంటుంది. అన్నింటికి మించి ఎప్పుడూ నవ్వుతూఉంటుంది. వారిద్దరు కొట్లాడుకున్నట్టు కిరణ్ ఎప్పుడూ చూళ్లేదు.అందుకే ఆ వాతావరణంలో ఉంటాడు తను. ఇది చూసి ఇరుగూ పొరుగూ ‘సొంత అన్నదమ్ములు కూడా ఇలా ఉండరు’ అంటూ ఉంటారు. అవును. ప్రసాద్, కిరణ్ చిన్నాన్న పెదనాన్న పిల్లలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కిరణ్ అందుకే చనువుగా ఇక్కడ ఉంటాడు.భోజనం ముగిస్తుండగా పిల్లలు లోపలికొచ్చారు. ‘బాబాయ్... మా స్కూల్ యానివర్సరీ ఉంది ఎల్లుండి... నువ్వు రావాలి’ అంది పెద్దమ్మాయి. ‘అవును కిరణ్.. నువ్వు రా. ఈ మనిషికి అలాంటివేవీ పట్టవు. ఎంత పిలిచినా రాడు’ అంది మణి.‘అలాగే... తప్పకుండా వెళ్దాం వదిన’ అన్నాడు కిరణ్.అందరూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు.‘ఈసారి సంబంధం ఖాయం చేసి వెళ్రా’ అన్నాడు ప్రసాద్.‘బాబోయ్... ఇప్పుడే పెళ్లొద్దు’ హాస్యమాడాడు కిరణ్.ప్రసాద్ సీరియస్ అయ్యాడు.‘పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఇలా ఎంత కాలం’మణి కూడా అందుకోసమే ఎదురు చూస్తున్నట్టుంది.‘అవునయ్యా. పెళ్లికి ఓకే అనకపోతే ఇక మా ఇంటికి రావద్దు’ అంది.ప్రసాద్‌కు వ్యవహారం సీరియస్‌గా ఉన్నట్టుందని అర్థమై ‘సరే... మీ ఇష్టం’ అన్నాడు. ఏప్రిల్ 18. 2016.తెల్లవారి మంచం మీద నుంచి హడావిడిగా నిద్ర లేపుతోంది తల్లి.‘రేయ్ కిరణ్... లేవరా... అన్నయ్య కనపడటం లేదట’‘ఏంటి?’‘ప్రసాద్ కనిపించడం లేదట’కంగారుగా లేచాడు కిరణ్. రాత్రే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. ఏమై ఉంటుంది? ఆఘమేఘాల మీద టౌన్‌కు చేరుకున్నాడు.ఇంటి దగ్గర ప్రసాద్ ఫ్రెండ్స్ వచ్చి ఉన్నారు. సెల్ నాట్ రీచబుల్ వస్తోంది.‘కిరణ్’... కిరణ్‌ను చూసి మణి ఏడ్చేసింది.‘ఏం అయ్యుండదులే వదినా. కంగారు పడకు’ అన్నాడు కిరణ్. ఈలోపు ఊరి పొలిమేరలో పొదల దగ్గర ఓ బైక్ పడి ఉందని ఊర్లో వాళ్లు ఇంటికి వచ్చి చెప్పారు. వెళ్లి చూస్తే అది ప్రసాద్ బండే. మణి ఆలశ్యం చేయలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.‘సార్... మా అల్లుడికి బియ్యం వ్యాపారులతో కొన్నిసార్లు పడకపోవడం మేం చూశాం. వాళ్లే ఈ పని చేసి ఉంటారు’ అన్నాడు అనుమానంగా మణి తండ్రి. పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. వాళ్లనూ వీళ్లనూ ఆచూకీ తీశారు. గట్టిగా ఏమీ కనిపించలేదు. మూడు రోజులు గడిచాయి. కిరణ్ తిరిగి తిరిగి అలసిపోయాడు. మరోవైపు అతడికి సెలవులు అయిపోవచ్చాయి. అసలే ఆర్మీతో వ్యవహారం. వెళ్లి తీరాలి. బరువెక్కిన గుండెతో వదిన దగ్గరకు వచ్చాడు.‘వదినా! నా సెలవులైపోయాయి. లీవ్ పొడిగించుకోవడం కుదరడం లేదు. అన్నయ్య త్వరలోనే ఇంటికి వస్తాడు ధైర్యంగా ఉండు. పిల్లలు, నువ్వూ జాగ్రత్త’ అన్నాడు.కన్నీరుతో మౌనంగా ఉండిపోయింది మణి. ఏప్రిల్ 21, 2016 వింజమూరు–గుండెమడకల మధ్య చిట్టడవిలో ప్రసాద్ మృతదేహం దొరికింది.మెడపై, ఛాతిపైభాగాన, కడుపులో, భుజాలపై 11 కత్తిపోట్లు ఉన్నాయి. అంతక్రూరంగా హత్యచేశారంటే పగబట్టిన వాళ్లే అయి ఉంటారు. వాళ్లెవరనేది ఇప్పుడు తేలాలి.పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. బియ్యం వ్యాపారంలోని లావాదేవీలే హత్యకు కారణమై ఉండవచ్చని నిర్ధారణకొచ్చారు. ప్రసాద్‌తో సంబంధాలున్న ప్రతి ఒక్క వ్యాపారిని వేరువేరుగా విచారణ చేపట్టారు. ప్రసాద్ కాల్ డీటైల్స్‌ను పరిశిలించారు. ఏ చిన్నపాటి క్లూ లభ్యం కాలేదు. కేసు ఎటూ తేలడం లేదు. ఎనిమిది నెలలు గడిచిపోయాయి. జనవరి 28, 2017. కేరళ నుంచి ఒక పార్శిల్ మణి ఇంటికి వచ్చింది. అది అక్కడి ఒక ఆయుర్వేద హాస్పిటల్ నుంచి వచ్చిన మందుల ప్యాకెట్. దాని మీద కిరణ్ పేరు ఉంది. సెలవుల్లో ఇక్కడకు వచ్చే ముందు కేరళ తిరిగి వచ్చినట్టు కిరణ్ చెప్పడం మణికి గుర్తు ఉంది. మరి అక్కడ ఆయుర్వేద హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లాడు? మణి మందుల పేర్లు చూసింది. ఇంటర్నెట్లో సెర్చ్ కొట్టింది. అవన్నీ పురుషపటుత్వానికి ఉపయోగపడే మందులు. సర్ప్రైజ్ గిఫ్ట్‌గా వాటిని పంపుతున్నట్టు మళ్లీ విజిట్‌ను ఆశిస్తున్నట్టు ఆ లెటర్లో ఉంది. వాటిని తండ్రికి చూపించింది మణి. ఆయనకు కిరణ్ వ్యవహారం ముందు నుంచి గిట్టదు. అంత ప్రేమించే అన్నయ్య కనిపించకపోతే సెలవైపోయిందని వెళ్లడమే ఆయనకు నచ్చలేదు. ఎందుకైనా మంచిదని పోలీసులను కలిశాడు.ఎస్.ఐ ఆ మందులను చూసి ‘ఇలాంటివి కుర్రాళ్లు వాడటం మామూలే. దీని ఆధారంగా ఎలా అనుమానిస్తాం’ అన్నాడు.‘అది కాదండీ... పోయినసారి వచ్చినప్పుడు ఫ్రెండ్ పెళ్లి ఉందని సెలవు ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు. అప్పుడు ఎక్స్టెండ్ చేసుకోగా లేనిది అన్నయ్య కనపడకపోతే చేసుకోడా’ అన్నాడు మణి తండ్రి.ఎస్.ఐకి ఏదో క్లూ దొరికినట్టే అయ్యింది.కిరణ్‌కు సంబంధించిన ఒక్కొక్క వివరం సేకరించడం మొదలుపెట్టాడు. సరిగ్గా పది రోజులకు ఆర్మీ పర్మిషన్ తీసుకుని కిరణ్‌ను పట్టుకొని జైల్లో తోశాడు. కిరణ్ హర్యానాలోని మానేసర్ ఎన్ఎస్జీ క్యాంప్‌లో జవాన్‌గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు సొంత ప్రాంతానికి వచ్చి వెళుతుంటాడు. ఒక్కడే కొడుకు. కాని చిన్నతనం నుంచి ఇంట్లో శాంతి లేదు. తల్లిదండ్రుల వైవాహిక జీవితం సరిగా లేదు. ఎప్పుడూ కాట్లాడుకుంటూ ఉండేవారు. తను మాత్రం ఇలా కాకుండా కాబోయే భార్యతో బాగా ఉండాలని అనుకునేవాడు. కాని ఒకసారి ఊహించనిది జరిగింది. వేశ్యావాటికకు వెళ్లినప్పుడు అతడి లోపం తెలిసింది. పెళ్లి జరిగితే అవమానం తప్పదని అర్థమైంది. మెరుగు కోసం రకరకాల మందులు వాడేవాడు. లాభం లేకపోయింది. కేరళలో డూప్లికేట్ ఆయుర్వేదశాలకు వెళ్లి అక్కడా మోసపోయాడు. ఆత్మవిశ్వాసం పూర్తిగా పోయింది. బుద్ధి పాడైంది. ఈ నేపధ్యంలో ప్రసాద్–మణిల దాంపత్యం చూసి ఈర్ష్యతో రగిలిపోయాడు. తన జీవితంలో కుదరనిది అన్న జీవితంలో మాత్రం ఎందుకు అని భావించాడు. సెలవు మీద వచ్చినప్పుడు ప్రసాద్‌ని హత్యచేయాలని కత్తి కొనుగోలుచేసి తన వద్దనే ఉంచుకొన్నాడు. ఏప్రిల్ 17వ తేది సాయంత్రం స్కూల్ వార్షికోత్సవం కోసం ప్రసాద్ భార్య, ఇతర కుటుంబసభ్యులు స్కూల్‌కు వెళ్లారు. ప్రసాద్ ఇంటి దగ్గరే ఉండటంతో కిరణ్ వచ్చి స్నేహితులు పార్టీ ఇస్తున్నారని రమ్మని కోరాడు. ఇద్దరు ప్రసాద్ బైక్‌పై బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లాక బైక్‌ను నడపమని ప్రసాద్‌కు ఇచ్చి తను వెనుక కూర్చొన్నాడు. అటవీప్రాంతం వచ్చేసరికి బైక్‌ని స్లో చేయమన్నాడు. ఒక్కసారిగా ప్రసాద్‌ను విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని బోర్లపడవేసి అక్కడ నుంచి బైక్‌పై టౌన్‌కి బయలుదేరాడు. దారిలో పెట్రోల్ అయిపోవడంతో చెట్లలో పడేసి ఎవరికీ అనుమానం రాకుండా స్కూల్ వార్షికోత్సవ ఫంక్షన్లో పాల్గొని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయాడు. ప్రసాద్ కోసం గాలించినట్టు నటించాడు. తాను చేసిన ఘాతుకం ఎప్పటికీ బయటకు రాదని భావించాడు. నేరం చేసిన వాళ్లు చట్టం నుంచి తప్పించుకోలేరని, పోలీసులు చిన్నపాటి క్లూతో నిందితుడ్ని కటకటాల వెనక్కి పంపారు. ఊరి పొలిమేరలో పొదల దగ్గర ఓ బైక్ పడి ఉందని ఊర్లో వాళ్లు ఇంటికి వచ్చి చెప్పారు. వెళ్లి చూస్తే అది ప్రసాద్ బండే. మణి ఆలశ్యం చేయలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ‘సార్... మా అల్లుడికి బియ్యం వ్యాపారులతో కొన్నిసార్లు పడకపోవడం మేం చూశాం. వాళ్లే ఈ పని చేసి ఉంటారు’ అన్నాడు అనుమానంగా మణి తండ్రి. – కె. హరిబాబు, సాక్షి, నెల్లూరు -
రుణం...కొత్త ‘రణం’
చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ గ్రామానికి చెందిన కుర్వ పెద్ద సాయులు 1994లో అప్పంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రుణం తీసుకున్నాడు.ఆయన 2005లో మృతి చెందాడు. అప్పట్లో రైతులను ఆదుకునే ఉద్దేశంతో మహానేత వైఎస్ ప్రకటించిన రుణ మాఫీలో అప్పు తీరిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. ట్విస్ట్ ఏమిటంటే సాయులు 2005లో మృతి చెందితే ఆయన పేరిట 2007లో రుణాలు రెన్యూవల్ చేసినట్లు రికార్డుల్లో పొందుపరచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలుతో పాటు వడ్డీ కలిపి రూ.1,25,682లు చెల్లించాలని తాజాగా డిమాండ్ నోటీసు ఇచ్చారు. 2014 ఫిబ్రవరి 1వ తేదీలోపు రుణం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నా సొసైటీ అధికారులు ఏమాత్రం సమయం ఇవ్వకుండా వెంటనే రూ.లక్ష చెల్లించాలని డిమాండ్ చేస్తూనే మరో వైపు ఇంటిలో ఉన్న బియ్యం బస్తాలు, వ్యవసాయానికి ఉపయోగించే పరికరాలు అన్నీ బయటకు వేయడంతో ఏమి చేయాలో దిక్కు తెలియక పెద్ద సాయులు భార్య బసమ్మ కన్నీరు మున్నీరవుతోంది. అధికారుల తీరుకు గుండెలు బాదుకుంటోంది. మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ఇదీ జిల్లాలో సొసైటీ రుణం తీసుకున్న పలువురి రైతుల దుస్థితి. ఒక్క సాయులు కథే కాదు పలువురు అన్నదాతలకు ఎదురవుతున్న రుణ బెడద. రైతుల సంక్షేమం కోసం ఏర్పాటైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు వారికి ఆసరాగా ఉండడం మాట మరుస్తున్నాయి . రైతులు తిరిగి సకాలంలో డబ్బులు చెల్లించినా అవి బ్యాంకుల్లో జమ చేయడంలో అధికారులు పారదర్శకత పాటించడం లేదు. జిల్లాలో ఉన్న సహకార సంఘాల్లో 7.64 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రుణాలు తీసుకున్న ప్రతీ రైతునూ సభ్యునిగా గుర్తించి ఒక్కో రైతు నుంచి రూ. 300ల ప్రకారం మూలధనం కూడా వసూలు చేశారు. రైతు శ్రేయస్సే పరమావధిగా పని చేస్తున్నట్లు అధికారులు, పాలకులు పైకి గొప్పలు చెబుతున్నా అంతర్గతంగా రైతులకు జరిగే నష్టాన్ని మాత్రం వారు గుర్తించలేకపోతున్నారు. సొసైటీల్లో పని చేస్తున్న కొందరు కార్యదర్శులు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో రైతులు రుణ మొత్తం తిరిగి చెల్లిస్తున్నా బ్యాంకుల్లో మాత్రం జమ కావడం లేదు. ఆదుకునేందుకు ఉద్దేశించిన పథకం... పంటలు సరిగా పండక పోవడంతో అన్నదాతలు పడుతున్న అవస్థలను చూసి వాటి కోసం చేసిన అప్పులు తీర్చే పరిస్థితినుంచి వారిని గట్టెంకించాలని అప్పట్లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రుణ మాఫీ పథకాలన్ని అమలు చేశారు. అయితే సొసైటీల్లో మాత్రం 1994 నుంచి తీసుకున్న రుణాలు కూడా ఈ పథకం కింద రద్దు చేయకుండా ఇంకా అప్పుగానే చూపుతూ అందుకు చక్ర వడ్డీ కలుపుతూ అధికారులు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. మాఫీ అయిన రైతులకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలని ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు ఇచ్చినా బ్యాంకు అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో చాలా మంది రైతులు తాము తీసుకున్న రుణం మాఫీ అయినట్లేనని భావిస్తున్న తరుణంలో అసలుతో పాటు వడ్డీ చెల్లించాలంటూ సొసైటీల నుంచి కార్యదర్శులు డిమాండ్ నోటీసు జారీ చేస్తుండటంతో ఏమి చేయాలో తెలియక రైతులు కలవరపడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణం తీసుకున్న వారు ఏటా డబ్బు జమ చేస్తున్నా కనీసం డబ్బు చెల్లించినట్లు కొందరు కార్యదర్శులు రసీదులు కూడా ఇవ్వడం లేదు. తాజాగా వన్‌టైం సెటిల్మెంట్ పేరుతో జిల్లాలో 20 వేల మంది రైతులకు పైగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. రుణ మాఫీలో అప్పు తీరిపోయిందన్నారు రుణ మాఫీలో అప్పు తీరిపోయిందని చెప్పారు. తీరా చూస్తే గుండె పగిలే విధంగా నెల కిందట రూ. 1.25 లక్షలు అప్పు వుందంటూ నోటీసు ఇచ్చారు. ఆ వెంటనే అప్పు చెల్లించాలంటూ ఇం టిలో ఉన్న బియ్యం బస్తాలు సైతం బయటకు వేశారు. ఏమి చేయాలో దిక్కు తెలియక కొంత సమయం ఇవ్వాలని వేడుకున్నా. - బసమ్మ, వడ్డెమాన్, చిన్న చింతకుంట మండలం రుణ మాఫీ వర్తించని వారికే నోటీసులు రుణ మాఫీ వర్తించని రైతులకు మాత్రమే నోటీసులు ఇస్తున్నాం. 2009 జూలై 1వ తేదీ నాటికి వాయిదా మీరిన బకాయిలకు మాత్రం అసలుతో పాటు వడ్డీ చెల్లించాలని రైతులకు నోటీసులు జారీ చేశాం. వారికి ఏమైనా అనుమానాలుంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం. - దామోదర్‌రెడ్డి, డీసీసీబీ సీఈఓ