
‘డూ ఇట్ యువర్ సెల్ఫ్’ (డిఐవై) పాలసీని అనుసరిస్తే ఏమొస్తుంది? మెదడుకు పనిదొరుకుతుంది. షార్ప్ అవుతుంది. తనను తాను ‘డీఐవై లేడీ’గా పిలుచుకునే నటి, కంటెంట్ క్రియేటర్ శ్వేతా మహదిక్ పాత ఖాళీ రైస్ బ్యాగును స్టైలిష్ హ్యాండ్‌బ్యాగ్‌గా మలిచింది. కత్తిరింపు నుంచి మెషీన్‌పై కుట్టువరకు అన్నీ తానే స్వయంగా చేసింది. ఈ అందమైన బ్యాగ్‌కు గోల్టెన్‌కలర్ చైన్ జత చేసి ‘అప్‌క్లచ్‌డ్ బ్యాగ్’ అని నామకరణం చేసింది.
బ్యాగు తయారీ ప్రక్రియకు సంబంధించిన వీడియోను శ్వేతా మహదిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే వైరల్ అయింది. బాలీవుడ్ ప్రముఖ నటి ఉర్ఫీ జావెద్, శ్వేతా మహదిక్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. నెటిజనులు రకరకాల కామెంట్స్‌తో భారీగా స్పందించారు. వాటిలో మచ్చుకు మూడు... ‘ఇట్స్ రాకింగ్’ ‘మీకు ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ అవార్డ్ తప్పనిసరిగా ఇవ్వాలి’
‘మీ వీడియో చూసి ఇప్పటికే రెండు హ్యాండ్ బ్యాగ్‌లు తయారుచేశాను.’
Comments
Please login to add a commentAdd a comment