జూలై 26 నుండి ప్రారంభం కానున్న ప్యారిస్ ఒలింపిక్స్-2024 వేడుకల కోసం టీం మంగోలియా తన స్టయిల్‌తో ప్రపంచాన్ని మెస్మరైజ్ చేసింది. సంస్కృతి, ఫ్యాషన్ కలగలిసిన యూనిఫాంతో అందర్నీ అబ్బురపర్చింది. అలాగే ఈ యూనిఫాంలోని ఇతర హైలైట్లను చూసి క్రీడా ఫ్యాన్స్, నెటిజన్లు శభాష్ మంగోలియా అంటున్నారు.
ఉలాన్‌బాతర్‌కు చెందిన ఫ్యాషన్ లేబుల్ మిచెల్ అండ్ అమెజాన్‌కా ఈ దుస్తులను రూపొందించారు. మంగోలియాకు సొంతమైన క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, తదితర మంగోలియన్ మూలాంశాలు, ఆ దేశ జెండాలోని “సోయోంబో” చిహ్నం , జాతీయ రంగులైన నీలం, ఎరుపు బంగారు రంగుల మేళవింపుతో వీటిని తయారు చేశారు. అలాగే ఈ ప్యారిస్ ఒలింపిక్ వేడుకలకు గుర్తుగా ఈఫిల్ టవర్ ఒలింపిక్ క్రీడా జ్యోతి మరింత హైలైట్‌గా నిలిచాయి.
మంగోలియన్లు ధరించే సంప్రదాయ గౌనుకు డిజైనర్లు 'డీల్' అనే సొగసైన టచ్ ఇచ్చారు. ప్రారంభ వేడుకలో కాంటెంజెంట్ కవాతులో పాల్గొనే మంగోలియన్ క్రీడాకారులు ధరించే దుస్తులు, ఫ్లాగ్ జెండా బేరర్‌ల దుస్తులకు భిన్నంగా ఉంటాయి. ఇది స్టేడియం లోపల కాకుండా సెయిన్ నది వద్ద నిర్వహించనున్నారు. మంగోలియన్ అథ్లెట్లు గత రెండు ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా మిచెల్ అండ్ అమెజాన్‌కా రూపొందించిన దుస్తులను ధరించడం గమనార్హం.
ప్రతి అథ్లెట్ బాడీ కొలతలను తీసుకుని 3 నెలలకు పైగా సమయం పట్టిందని డిజైనర్లు వెల్లడించారు. ఒక్కో సెట్ రూపొందించడానికి 6 దశల్లో సగటున 20 గంటలు పట్టిందని డిజైనర్లు చెప్పారు.
కాగా 1964 గేమ్స్ నుండి, లాస్ ఏంజిల్స్ 1984 మినహా ప్రతి వేసవి ఒలింపిక్స్‌లో మంగోలియా పాల్గొంటూ వస్తోంది. ప్రస్తుతం క్రీడా సమరంలో మంగోలియన్ బృందంలో 30 మందికిపైగా అథ్లెట్లు ఉన్నారు. 2008లో బీజింగ్ గేమ్స్‌లో జూడో , బాక్సింగ్ క్రీడలో బంగారు పతకాలను గెల్చుకున్నమంగోలియన్లు ఈసారి మరిన్ని బంగారు పతకాలను గెల్చుకోవాలని ఆశిస్తున్నారు.
నాలుగేళ్లకోసారి జరిగే 33వ ఎడిషన్ 2024 వేసవి ఒలింపిక్స్ జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో జరగబోతున్నాయి. 200 పైగా దేశాలు తమ అథ్లెట్‌లను 32 బరిలోకి దింపనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment