Stylish
-
వారసుడిని రెడీ చేస్తున్న సింగర్ శ్రేయా ఘోషల్ (ఫొటోలు)
-
‘మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024’ జాబితాలో యువజంట (ఫొటోలు)
-
ముంబైలోని విలాసవంతమైన ఇంటిలో స్టైలిష్‌గా సోనమ్ (ఫోటోలు)
-
ఇటు కావ్యా మారన్, ప్రీతి జింటా.. అటు నీతా అంబానీ, జూహీ చావ్లా.. వేరే లెవల్! (ఫొటోలు)
-
బ్లాక్ డ్రెస్ ఔట్ఫిట్లో ఫోజులు ఇస్తున్న ప్రగ్యా జైస్వాల్ (ఫోటోలు)
-
బుల్లితెర భామ తేజస్విని గౌడ స్మైలీ లుక్స్.. ఫోటోలు
-
ఎంగేజ్మెంట్ రింగ్, స్టైలిష్ చీరలో శోభితా స్టన్నింగ్ లుక్ : ‘చే’ రియాక్షన్
ప్రముఖ నటి, మోడల్ శోభిత దూళిపాళ్ల అందం, స్టయిలిష్ మరోసారి తన ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. త్వరలో తన డ్రీమ్ బోయ్ నాగ చైతన్యను పెళ్లాడబోతున్న శోభిత తన తాజా ఫోటోషూట్‌కు సంబంధించిన అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది. నారింజ, నలుపు రంగుల మిశ్రమంల ఉన్న ప్రింటెడ్ చీరను ధరించింది. హెయిర్ స్టయిల్ కూడా స్పెషల్‌గా నిలిచింది. ముఖ్యంగా ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.ఈ ఫోటోలను చూసిన ప్రముఖ సెలబ్రిటీలు కూడా విస్మయం చెందడం విశేషం. ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే సానుకూల మెసేజ్‌లతో తమ ప్రేమను వ్యక్తం చేశారు. చీరలో చాలా అందంగా ఉన్నారంటూ ప్రశంసించారు. తమ అభిమాన హీరో నాగ చైతన్యకి పర్ఫెక్ట్ సెట్ అవుతారంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. ఈ పోస్ట్‌కు శోభిత కాబోయే భర్త నాగ చైతన్య లైక్ కొట్టాడు.ఇన్ స్టాలో గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ శోభిత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఆగస్ట్ 27న నిశ్చితార్థం పూర్తి చేసుకున్న శోభిత, చైతన్య జంట వచ్చే ఏడాది మార్చిలో మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారని తెలుస్తోంది. కాగా పెళ్లి గ్రాండ్‌గా చేసుకుంటారా, లేక సింపుల్ గానా? అని ఇటీవల ప్రశ్నించినపుడు, మన సంస్కృతి సంప్రదాయం ప్రకారం, సింపుల్‌గా పెళ్లి చేసుకోవడమే తనకిష్టమని చైతూ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
ప్యారిస్ ఒలింపిక్స్ : మంగోలియన్ల యూనిఫాం హాట్ టాపిక్
జూలై 26 నుండి ప్రారంభం కానున్న ప్యారిస్ ఒలింపిక్స్-2024 వేడుకల కోసం టీం మంగోలియా తన స్టయిల్‌తో ప్రపంచాన్ని మెస్మరైజ్ చేసింది. సంస్కృతి, ఫ్యాషన్ కలగలిసిన యూనిఫాంతో అందర్నీ అబ్బురపర్చింది. అలాగే ఈ యూనిఫాంలోని ఇతర హైలైట్లను చూసి క్రీడా ఫ్యాన్స్, నెటిజన్లు శభాష్ మంగోలియా అంటున్నారు. ఉలాన్బాతర్కు చెందిన ఫ్యాషన్ లేబుల్ మిచెల్ అండ్ అమెజాన్కా ఈ దుస్తులను రూపొందించారు. మంగోలియాకు సొంతమైన క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, తదితర మంగోలియన్ మూలాంశాలు, ఆ దేశ జెండాలోని “సోయోంబో” చిహ్నం , జాతీయ రంగులైన నీలం, ఎరుపు బంగారు రంగుల మేళవింపుతో వీటిని తయారు చేశారు. అలాగే ఈ ప్యారిస్ ఒలింపిక్ వేడుకలకు గుర్తుగా ఈఫిల్ టవర్ ఒలింపిక్ క్రీడా జ్యోతి మరింత హైలైట్‌గా నిలిచాయి.మంగోలియన్లు ధరించే సంప్రదాయ గౌనుకు డిజైనర్లు 'డీల్' అనే సొగసైన టచ్ ఇచ్చారు. ప్రారంభ వేడుకలో కాంటెంజెంట్ కవాతులో పాల్గొనే మంగోలియన్ క్రీడాకారులు ధరించే దుస్తులు, ఫ్లాగ్ జెండా బేరర్ల దుస్తులకు భిన్నంగా ఉంటాయి. ఇది స్టేడియం లోపల కాకుండా సెయిన్ నది వద్ద నిర్వహించనున్నారు. మంగోలియన్ అథ్లెట్లు గత రెండు ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా మిచెల్ అండ్ అమెజాన్కా రూపొందించిన దుస్తులను ధరించడం గమనార్హం. View this post on Instagram A post shared by Michel&Amazonka (@michelamazonka)ప్రతి అథ్లెట్ బాడీ కొలతలను తీసుకుని 3 నెలలకు పైగా సమయం పట్టిందని డిజైనర్లు వెల్లడించారు. ఒక్కో సెట్ రూపొందించడానికి 6 దశల్లో సగటున 20 గంటలు పట్టిందని డిజైనర్లు చెప్పారు.కాగా 1964 గేమ్స్ నుండి, లాస్ ఏంజిల్స్ 1984 మినహా ప్రతి వేసవి ఒలింపిక్స్‌లో మంగోలియా పాల్గొంటూ వస్తోంది. ప్రస్తుతం క్రీడా సమరంలో మంగోలియన్ బృందంలో 30 మందికిపైగా అథ్లెట్లు ఉన్నారు. 2008లో బీజింగ్ గేమ్స్‌లో జూడో , బాక్సింగ్ క్రీడలో బంగారు పతకాలను గెల్చుకున్నమంగోలియన్లు ఈసారి మరిన్ని బంగారు పతకాలను గెల్చుకోవాలని ఆశిస్తున్నారు. నాలుగేళ్లకోసారి జరిగే 33వ ఎడిషన్ 2024 వేసవి ఒలింపిక్స్ జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో జరగబోతున్నాయి. 200 పైగా దేశాలు తమ అథ్లెట్లను 32 బరిలోకి దింపనున్నాయి. -
మగువల మనసు దోచే స్కర్ట్... సూపర్ స్టయిల్! (ఫోటోలు)
-
కియారా అద్వానీ ఫ్యాషన్ అండ్ క్లాసీ లుక్స్ (ఫోటోలు)
-
అల్ట్రా స్టైలిష్ లుక్స్‌లో దసరా బ్యూటీ (ఫొటోలు)
-
అనన్య పాండే గ్లామర్ ట్రీట్.. వేరే లెవల్ అంతే! (ఫొటోలు)
-
Anchor Suma: రెండు జళ్ల సీత.. టాప్ యాంకర్ సుమ కొత్త లుక్ (ఫోటోలు)
-
ట్రెండీ ట్రెండీ స్టైలిష్ సారీ కుచ్చులు చూసారా..! (ఫొటోలు)
-
ఎంతైనా జ్యోతిక... ఆ స్టయిలే వేరు! (ఫొటోలు)
-
ఇస్మార్ట్ బ్యూటీ 'నభా నటేష్' ఖతర్నాక్ లుక్స్‌తో దుమ్మురేపిందిగా (ఫోటోలు)
-
Mouni Roy: కిర్రాక్ లుక్‌లో మౌనీ రాయ్ ఖతర్నాక్ పోజులు (ఫోటోలు)
-
మండే ఎండల్లో.. మీరు మెచ్చే, మీకు నప్పే దుస్తులు (ఫొటోలు)
-
Mahesh Babu: మహేశ్ స్టైలిష్ లుక్స్ వైరల్ (ఫోటోలు)
-
Madhuri Dixit Photos: కుర్ర హీరోయిన్లకు కుళ్ళు పుట్టిస్తున్న ఈ స్టార్ ఎవరు?
-
వీటిని చూశారంటే.. మంత్ర ముగ్ధులు అవక తప్పదు
సాధారణంగా మంచి మాటలు, మంత్రాలు, కొటేషన్స్‌ను బడులు, గుడులలో చూస్తుంటాం. వాటినిప్పుడు ఇళ్లల్లోనూ ప్లేస్ చేస్తున్నారు ఇంటీరియర్ డిజైనర్స్. ఎలాగంటే.. రీడింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో ఏదైనా ఒక గోడను ఎంపిక చేసుకుని.. సానుకూల ఆలోచనలను ప్రేరేపించే మంచి మాటలతో ఒక వాల్ పేపర్‌ను ఆ గోడ మీద అలంకరించవచ్చు. ఇది పెద్దల పెంపకాన్నీ.. పిల్లల ప్రవర్తననూ ప్రభావితం చేస్తుంది. ఆ గది వాతావరణాన్ని మారుస్తుంది. ఫొటో ఫ్రేమ్స్.. కోట్స్ లేదా చాంట్స్‌తో ఫొటో ఫ్రేమ్స్‌ను తయారుచేసుకోవచ్చు. లేదా మార్కెట్లో లభించే వాటిని ఎంపిక చేసుకోవచ్చు. వీటివల్ల ఆ గది హుందాగా కనపడుతుంది. పూజ గది.. ఇంట్లో పూజకు ప్రత్యేకంగా గది ఉంటే.. నచ్చిన శ్లోకాలతో దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే అందమైన అక్షరాలతో కార్నర్ ప్లేస్‌లో గోడను తీర్చిదిద్దుకోవచ్చు. ఈ అలంకరణల వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇవి చదవండి: ఈ వేసవి ఒక డేంజర్ బెల్.. నిపుణుల సూచనలతో జాగ్రత్త! -
Rhea Chakraborty Saree Photos: సారీలో కవ్విస్తూ, కాక పుట్టిస్తున్న ఈ బ్యూటీని చూశారా?
-
Catherine Tresa: అందమైన నటి కేథరిన్ థ్రెసా స్టైలిష్ డ్రస్సులు (ఫోటోలు)
-
స్టైలిష్ దుస్తులను మార్కెట్ లోకి తెస్తున్న ఈషా అంబానీ
-
డీఐవై లేడీ
‘డూ ఇట్ యువర్ సెల్ఫ్’ (డిఐవై) పాలసీని అనుసరిస్తే ఏమొస్తుంది? మెదడుకు పనిదొరుకుతుంది. షార్ప్ అవుతుంది. తనను తాను ‘డీఐవై లేడీ’గా పిలుచుకునే నటి, కంటెంట్ క్రియేటర్ శ్వేతా మహదిక్ పాత ఖాళీ రైస్ బ్యాగును స్టైలిష్ హ్యాండ్‌బ్యాగ్‌గా మలిచింది. కత్తిరింపు నుంచి మెషీన్‌పై కుట్టువరకు అన్నీ తానే స్వయంగా చేసింది. ఈ అందమైన బ్యాగ్‌కు గోల్టెన్కలర్ చైన్ జత చేసి ‘అప్క్లచ్డ్ బ్యాగ్’ అని నామకరణం చేసింది. బ్యాగు తయారీ ప్రక్రియకు సంబంధించిన వీడియోను శ్వేతా మహదిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే వైరల్ అయింది. బాలీవుడ్ ప్రముఖ నటి ఉర్ఫీ జావెద్, శ్వేతా మహదిక్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. నెటిజనులు రకరకాల కామెంట్స్‌తో భారీగా స్పందించారు. వాటిలో మచ్చుకు మూడు... ‘ఇట్స్ రాకింగ్’ ‘మీకు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ అవార్డ్ తప్పనిసరిగా ఇవ్వాలి’ ‘మీ వీడియో చూసి ఇప్పటికే రెండు హ్యాండ్ బ్యాగ్‌లు తయారుచేశాను.’ -
ఇంటెక్స్ ఎలైట్ ఈ7..ధర?
ఇంటెక్స్ టెక్నాలజీస్‌కు చెందిన తాజా మొబైల్ ఎలైట్ ఈ7 అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చింది. ఇటీవల మార్కెట్ లో ప్రవేశపెట్టిన ఇంటెక్స్ ఈ కొత్త ఆండ్రాయిడ్ 4జీ ఫోన్ ధరను రూ.7,999కు అందుబాటులోకి తెచ్చింది ఈ విషయాన్ని ఇంటెక్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇంటేక్స్ ఎల్ట్-ఏ 7 స్మార్ట్‌ఫోన్ మీ జీవితాన్ని సున్నితంగా తయారుచేసే అంశాల కలయిక. స్టైలిష్, స్మూత్, స్ట్రాంగ్ అంటూ ట్వీట్ చేసింది. ఎలైట్ ఈ7 ఫీచర్లు 5.2 ఇంచ్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్ 4020 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం Intex Elyt-e7 is a combination of everything that will make your life smoother. Buy Now @amazonIN : https://t.co/v3QliS0nTq#SimplyDebonair pic.twitter.com/S6hbfOMGSc — Intex Technologies (@IntexBrand) June 28, 2017 -
చేతులు మొక్కిన చీరలు
సృష్టిని... చేతిలో తీసుకొని ముద్దాడి... మగ్గానికి రాసి దోరగా... దారానికి పూసి నవ నవ... నవ్యదనం నేసి చేతులు మొక్కిన చీరలతో నీ అందానికి దండం చేసి... ►చీర మీద లేత రంగులు, అంతే అమరికగా ఇమిడిపోయే నూలు దారాల పువ్వులు మగ్గం మీదే పురుడు పోసుకుంటే... ఇలా అందంగా కళ్లకు కడతాయి. ►రాయల్ బ్లూ కలర్ కాటన్ శారీకి మల్టీకలర్ బార్డర్ ఆకర్షణీయతను పెంచుతోంది. పార్టీవేర్‌లో ప్రత్యేకంగా నిలుపుతుంది. ►చీరంతా ఒకే రంగు... దానికి ఓ సన్నని కాంట్రాస్ట్ అంచు... మరే ఆభరణమూ అక్కర్లేని హుందాతనం కాటన్ చీరకే సొంతం. ►చీరంతా చెక్స్ వచ్చినా కాంట్రాస్ట్ కలర్స్‌తో మ్యాజిక్ చేసినా కాటన్ శారీదెప్పుడూ ఓ ప్రత్యేకత. వేసవికి ఆధునికపు హంగుగా ఉండే కాటన్ శారీ ఎవర్గ్రీన్! ►సింపుల్‌గా అనిపించే తెలుపు రంగు కాటన్ శారీకి ప్రింటెడ్ కాటన్ బ్లౌజ్ స్టైలిష్ లుక్‌ను తీసుకువస్తుంది. క్యాజువల్ వేర్‌గానే కాదు ఈవెనింగ్ వేడుకల్లోనూ హైలైట్‌గా నిలుస్తుంది. ►వేడుకల్లోనే కాదు ఫ్యాషన్ వేదికల మీదా కాటన్ ప్రత్యేకతను చాటుతోంది. అందుకే అతివల మనసు లేత రంగు లినెన్ కాట¯Œ చీరల మీదకు మళ్లుతుంది. -
ఫ్యాషన్ పథ్
ఢిల్లీలో బాగా తెలిసిన వీధులు జన్‌పథ్.. రాజ్‌పథ్. రెండూ ఒక కూడలిలో కలుస్తాయి. రారాజులు నడిచిన, జనం నడిచిన మార్గాలు ఇవి. అదిగో అక్కడే సమ్మర్లో కూల్, సింపుల్, స్టైలిష్, స్మార్ట్ ఫ్యాషన్ కలగలుస్తాయి ఇదిగో, ఢిల్లీ నుంచి మన గల్లీకి ఫ్యాషన్ పథ్!! ►లాంగ్ స్లీవ్స్ కాటన్ గౌన్. జీన్స్ మీదకు మిడ్ స్లీవ్స్ ట్యూనిక్.. వేసవికి సౌకర్యవంతమైన డ్రెస్‌లు. ►సింగిల్ షోల్డర్ ట్యూనిక్ లూజ్ సల్వార్ ప్యాంట్ ఓ కంఫర్ట్. ►కలంకారీ ట్యూనిక్ కాటన్ ట్రౌజర్ వేసవికి కంఫర్ట్ స్టైల్. ►టైట్‌ఫిట్ ట్యూనిక్, స్టైలిష్ మిడ్ ప్యాంట్ విత్ ఓవర్‌కోట్ సరైన కాంబినేషన్. ►కాటన్ స్లీవ్‌లెస్ క్రాప్‌టాప్, లూజ్ ప్యాంట్ స్టైలిష్ కంఫర్ట్. ►లాంగ్ స్కర్ట్‌పై కాటన్ టీ షర్ట్ లేదా ట్యూనిక్ ధరిస్తే స్మార్ట్ స్టైల్ మార్కులు కొట్టేస్తారు. ►జీన్స్ మీదకు లాంగ్ కలర్‌ఫుల్ కాటన్ టాప్ ఆల్‌టైమ్ ఫ్యాషన్ డ్రెస్. ►పలాజో మీదకు లాంగ్ మ్యాక్సీ గౌన్, ఆ పైన స్లీవ్‌లెస్ ఓవర్‌కోట్ కంఫర్ట్ లుక్. ►సింపుల్ అండ్ స్మార్ట్ లుక్ సింగిల్ పీస్ మ్యాక్సీ డ్రెస్. ►వైట్ స్లీవ్‌లెస్ క్రాప్‌టాప్, పలాజో ప్యాంట్ బెస్ట్ ఛాయిస్. -
నాజూకు లినెన్
లినెన్ సుతిమెత్తగా ఉంటుంది. లినెన్ ఒంటికి హాయిగా ఉంటుంది లినెన్ కంటికి ఇంపుగా ఉంటుంది అన్నింటికీ మించి లినెన్ స్టైలిష్‌గా ఉంటుంది లినెన్ హుందాగా ఉంటుంది లినెన్ నాజూకుగా ఉంటుంది. లినెన్ ఫ్యాషన్‌లో ముందుంటుంది ► చలి, ఎండ కాలాలకు కాటన్ ఎప్పుడూ మొదటి ఎంపిక. వాటిలో ముఖ్యంగా లినెన్ కాటన్ చీరలు ధరించినప్పుడు ఆభరణాలు, ఇతర అలంకరణ వస్తువులపై శ్రద్ధ పెట్టాలి. ► సింపుల్‌గా ఉండే ఈ చీరలు, డ్రెస్సుల మీదకు బంగారు, సంప్రదాయ ఆభరణాలు అంతగా నప్పవు. ► కలప, పూసలు, టైట, స్టీలు, థ్రెడ్.. వంటి వాటితో తయారుచేసిన హ్యాండ్‌మేడ్ ఆభరణాలే నప్పుతాయి. ► బ్యాగులు, పాదరక్షలు కూడా లెదర్వి, హ్యాండ్మేడ్వే ఎంచుకోవాలి. ► ఏ ఆభరణాలు ధరించకపోయినా కాటన్ శారీ, డ్రెస్ ఎప్పుడూ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ► వంగపండు రంగు లినెన్ చీర, దానికి పూర్తి కాంట్రాస్ట్ కలర్ వైట్‌లో సాధారణ బ్లౌజ్... స్ట్రీట్ ఫ్యాషన్ లుక్‌తో ఎట్రాక్ట్ చేస్తుంది. ఆభరణాల ఊసు అంతగా లేని ఈ స్టైల్ పాత, కొత్త - అన్ని తరాలనూ ఆకట్టుకుంటుంది. ► టాప్ టు బాటమ్ ఒకే రంగు, ఒకే ఫ్యాబ్రిక్ అయినా, తన ప్రత్యేకతను చూపుతుంది లినెన్. వేలమందిలో ఉన్నా వేడుకగా కనువిందు చేస్తుంది. ► అఫిషియల్ వేర్‌గా నేత చీరలకు మంచి పేరుంది. వాటిలోనూ లినెన్ చీర తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ► ఏ హ్యాండ్లూమ్ డిజైనర్ బ్లౌజ్ అయినా ఈ చీరల మీదకు బాగా నప్పుతుంది. ► సింపుల్, మోడ్రన్, స్టయిలిష్ లుక్‌తో ఆకట్టుకోవాలనుకునేవారికి ఇష్టమైన వస్త్రంగా లినెన్ రూపు మార్చుకొని, ఇలా చీరగా సింగారించుకుంది. -
సిల్కీ హెయిర్‌తో స్టయిలిష్ బ్లాకీ సంచలనం
మెల్బోర్న్: ఒళ్లంతా సిల్కీ సిల్కీ జుట్టుతో మెరిసిసోతూ...పట్టుకుంటే జారీపోయేలా..నల్లని జుట్టుతో మెరిసిపోతున్న ఓ శునకం తాజాగా ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది. అఫ్ఘాన్ ఆఫ్గాన్‌హౌండ్ జాతికి చెందిన అయిదేళ్ల ఆస్ట్రేలియా డాగ్ కు సోషల్ మీడియాలో ఇతర సూపర్ మోడల్స్‌ను మించిన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సాధిస్తోంది. ఒక్క ఫోటోతో సూపర్ మోడల్ గా మారిన ఈస్టయిలిష్ బ్లాకీ పేరు టీ. వివరాల్లోకి వెళితే.. టీ యజమాని ల్యూక్ కవనాగ్ సోషల్ మీడియాలో ఫోటోలుఅప్లోడ్ చేశాడు. అంతే మరుక్షణం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. దాని అందానికి ముగ్ధులైన ఎంతోమంది డానికి అభిమానులుగా మారిపోతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ లో లక్షలకొద్దీ లైక్ లు షేర్లతో చక్కర్లుకొడుతోంది. దీంతో అనేక కంపెనీలు కూడా ఈ టీ కోసం క్యూ కట్టాయి. దీంతో శునకం రాజా యజమాని ల్యూక్ కవనాగ్ ,అతని కుటుంబం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. టీ చాలా అందంగా ఉంటుంది..అందుకే దాని ఫొటోను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాను.. దీంతో ఒక సూపర్ మోడల్ కంటే ఎక్కువ ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారని డెయిలీ టెలీగ్రాఫ్ .కాం ఒక నివేదికలో తెలిపింది. సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. షో డాగ్ గా ఆకట్టుకున్న టీ ఇటీవల రీటైరయ్యిందట. తాజాగా యానిమల్ యాక్టర్ గా సెకండ్ కరియర్ మొదలు పెట్టింది. అయిదే ఫార్మల్ గా రిటైర్ అయిన టీ తో హాలీవుడ్ నటింప చేసే ఆలోచన ఏదీ లేదని తమకు తెలిపారని రిపోర్టు చేసింది. ఇప్పటికే ఈ శునకం ప్రముఖ శునక ఆహార కంపెనీ స్పోక్స్ డాగ్ కి ప్రచారకర్తగా డాగ్ పర్ ఫ్యూమ్ కంపెనీ హారియత్ అండ్ హౌండ్స్ యాడ్ ప్రచారంలో బిజీగామారింది. చాలామంది ఇంటర్నెట్ ప్రముఖులు కంటే ఎక్కువ సంచలనంగా మారిపోయిందని తెలిపింది. -
వయసుకు చెక్..!
చెక్స్, ప్లెయిడ్, చెకర్ ప్లెయిడ్.. ఇలా ఆధునికుల నోట ఎలా వినిపించినా మనకు ‘చారల చొక్కా, గళ్ల లుంగీ’ అంటే ఇట్టే తెలిసిపోతుంది. ఒకప్పుడు మగవారి దుస్తులకే పరిమితమైన చారలు, గడులు ఇప్పుడు మహిళామణుల వార్డ్‌రోబ్‌లోనూ చేరిపోతున్నాయి. రెడీ టు వేర్: ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం... ఏ వేళ అయినా ఇంటా, బయట ధరించడానికి ‘నేను సిద్ధం’ అన్నట్టు ఉంటాయి ‘చారల’ దుస్తులు. ఏ వయసు వారికైనా నప్పుతూ... లావు- సన్నం, పొడవు-పొట్టి, నలుపు-తెలుపు తేడాలు చూపని ప్రియ నేస్తంగా చెక్స్‌కి పేరొచ్చేసింది. డిజైనర్ల నేస్తం: బాలీవుడ్ తారల ఫేవరేట్ డిజైనర్‌గా పేరొందిన ప్రముఖ వస్త్ర నిపుణులు సబ్యసాచీ ముఖర్జీ రూపొందించిన వస్త్రశ్రేణులలో ‘నిలువు-అడ్డం చారల’కు ఓ ప్రత్యేకత ఉంది. సంప్రదాయ దుస్తుల్లోనూ, ఆధునిక దుస్తుల్లోనూ బ్రైట్‌గా కనిపించే ఈ డిజైన్‌కు బాలీవుడ్ తార లూ గులామ్లవుతుంటారు. ‘ఎరుపు-నలుపు- ఎరుపు చారల డిజైన్లు ఆకట్టుకోవడంలో అన్నింటికన్నా పైన ఉంటాయి’ అంటారు మరో ప్రముఖ డిజైనర్ రితూకుమార్! ‘టీనేజర్స్ లుక్స్‌ను మరింత అధునాతనంగా, ప్రత్యేకంగా చూపించడంలో చెక్స్ కాంబినేషన్స్ బెస్ట్ ఆప్షన్’ అంటున్నారు డిజైనర్లు. నాడు - నేడు : నాడు-నేడు-రేపు దీర్ఘకాలం ఆధునిక పోకడలు గల ఏకైక ప్రింట్‌గా చెక్స్ ప్యాటర్న్ ఎప్పుడూ చాలా స్టైలిష్‌గా నిలుస్తుంది. అంతేకాదు ఇతర ప్రింట్లనూ కలుపుకుంటూ అందరినీ ఆకట్టుకుంటుంది. తాజా అనుభూతి: పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఏ వేళ అయినా లుక్ ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ‘చారలు’ పాప్యులర్ అవడానికీ ఇదే ప్రధాన కారణం. పైగా వయసు తగ్గినట్టుగా అనిపిస్తుంది. లావుగా ఉన్నవారు కాస్త సన్నగా కనపడే అవకాశం ఉంది. చారల వస్త్రం త్వరగామురికిగా కనిపించదు. ఏ సాదా వస్త్రంపైన అయినా సులువుగా ఒదిగి పోతుంది. ఇన్ని సౌకర్యాలు ‘చెక్స్ డ్రెస్’కు ఉంటే ఏ వనిత అయినా ఎందుకు కాదంటుంది? యాక్ససరీస్లోనూ ముందంజ కాలేజీ అమ్మాయిలను కట్టిపడేసే గీతల డిజైన్లు డ్రెస్సులకు మాత్రమే పరిమితం కాలేదు. శిరోజాలకు వాడే బ్యాండ్స్ నుంచి పాదరక్షల వరకూ ‘చార’లే గ్రేస్‌గా నిలుస్తున్నాయి. బ్యాగ్స్, బెల్ట్స్, గాజులు, గోళ్లరంగుల్లోనూ ‘చెక్స్’ చెక్ మని కళ్లను ఆకట్టుకుంటున్నాయి. చెక్స్ కుర్తీలకు కాలర్ నెక్ డిజైన్ అధునాతనంగానూ, హుందాగానూ కనిపిస్తుంది. కార్పోరేట్ పని సంస్కృతికి చెక్స్ బాగా నప్పుతాయి. ఎత్తు తక్కువ ఉన్నవారు చెక్స్ దస్తుల ఎంపికలో నిలువు చారలకే ప్రాధాన్యం ఇవ్వాలి. అడ్డ చారలు, పెద్ద గడులు ఎత్తును మరింత తక్కువగా చూపిస్తాయి. నవీన పోకడలను ఇష్టపడేవారు ‘చెక్స్’ ను తమ వేషధారణలో చేర్చడం మేలు. ఎందుకంటే లుక్ స్టైలిష్‌గా మారడానికి చెక్స్ ఏ కాలమైనా బెస్ట్ ఆప్షన్! సౌకర్యవంతంగా ఉంటూ, డైనమిక్‌గా కనిపించాలంటే సాదా లేత రంగుల డ్రెస్ వేసుకున్నప్పుడు చారల చొక్కాను జాకెట్‌గా పైన ధరించాలి. దీంతో వస్త్రధారణలో ఒక కొత్తదనం వచ్చేస్తుంది. మగవాళ్ల డ్రెస్సా... అని అదోలా మొహం పెట్టే అమ్మాయిలు సైతం ఈ స్టయిల్‌కి ప్లాట్ అయిపోవడం ఖాయం. చెక్స్ షార్ట్, ప్లెయిన్ కోటు వేస్తే క్లాసిక్ లుక్ మిమ్మల్ని చుట్టేస్తుంది. క్రీమ్ కలర్ స్లీవ్‌లెస్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరిస్తే పైన బ్లాక్ చారల చొక్కా ఒకటి ధరించండి. చారల స్కర్ట్ ధరిస్తే తెలుపు ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ ఫర్ఫెక్ట్గా సూటవుతుంది. నోట్: ఏ డ్రెస్ ధరించినా కలర్ కాంబినేషన్స్ దృష్టిలో పెట్టుకోవాలి. ఫొటోలో చూపినట్టు.. ఒక ప్లెయిన్ సిల్క్ స్కర్ట్, మగవారు ధరించేలాటి చారల చొక్కా వేసుకొని, స్కర్ట్ కలర్ జాకెట్ ధరిస్తే లుక్‌లో ఒక వేగం కనిపిస్తుంది. సంప్రదాయంలో ఆధునికం చెక్స్ కుర్తీ! టాప్ టు బాటమ్ ఒకేలాంటి డ్రెస్ ధరిస్తే నడుముకు ఒక చారల బెల్ట్ లేదా మెడలో చారల స్కార్ఫ్ లేదా నడుం కింది భాగాన్ని కప్పి ఉంచేలా చారల క్లాత్‌తో పాటు డ్రెస్సింగ్‌లో అతి కొద్దిగానైనా ‘చెక్స్’ని భాగం చేస్తే లుక్‌లో ఒక కొత్తదనం వచ్చేస్తుంది. పురుషుల్లా ముస్తాబు అయ్యేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. మంచి ఫిటింగ్ ఉన్న చారల చొక్కా, బాటమ్‌గా జీన్స్ లేదా డెనిమ్ ఫిటెడ్ ప్యాంట్ ధరించి చొక్కా ఇన్‌షర్ట్ వేస్తే చూపరులకు మీ డ్రెస్సింగ్ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎర్రటి చారల టాప్, బ్లాక్ లెగ్గింగ్ లేదా జెగ్గింగ్ ధరిస్తే చాలు అల్ట్రా మోడ్రన్లా అనిపిస్తారు. ఆడ-మగ, చిన్నా-పెద్దను ఆకట్టుకుంటున్న ‘చారలు’ స్కాట్లాండ్ దేశ సంస్కృతికి అద్దంగా చెబుతారు. క్రీస్తు పూర్వం 1500 కాలంలోనే ఆ దేశస్థుల వేషధారణలో ‘చారలు’ భాగమైనట్టు చరిత్ర చెబుతోంది. బ్రిటన్ రాణి విక్టోరియా ‘చారల’ డిజైన్‌ను ప్రపంచవ్యాప్తం చేశారని ప్రతీతి. -
స్కార్ఫ్ వాడుతున్నారా?
ఏ డ్రెస్ ధరించినా స్కార్ఫ్‌ను రెండు చేతులతో పట్టుకొని, మెడవెనక నుంచి, భుజాల మీదుగా తీసుకుంటూ ఒక్క ముడి వేసి వదిలేస్తే చాలు.. మీ రూపం క్షణంలో అధునాతనంగా మారిపోతుంది. ‘ఆడ, మగ భేదం లేకుండా ఇద్దరి వార్డ్‌రోబ్‌లోనూ ఉండాల్సిన స్టైలిష్ మెటీరియల్ స్కార్ఫ్’ అని ఫ్యాషన్ డిజైనర్స్ చెబుతున్న మాట. ఈ టిప్స్ పాటిస్తూ ధరించే రంగు, మెటీరియల్‌ను బట్టి మీ వ్యక్తిగత స్టైల్ స్టేట్మెంట్ను స్కార్ఫ్ ద్వారా ఎదుటివారికి ఇట్టే తెలియజేయండి. స్కార్ఫ్‌ను ఎంచుకునేటప్పుడు మీదైన ముద్ర కనిపించాలి. అందుకు సరైన ఫ్యాబ్రిక్, పరిమాణం, షేప్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. వాతావరణం కాస్త డల్‌గా ఉన్నప్పుడు కాంతివంతమైన రంగులు గల స్కార్ఫ్‌ను వాడాలి. రూపం అధునాతనంగా, కొంచెం రఫ్‌గా మరికొంచెం ఫాస్ట్లుక్తో కనిపించాలనుకుంటే లేత రంగులు గలవి, ధరించిన దుస్తులకు కాంట్రాస్ట్వి ఎంచుకోవాలి. దేహానికి ఫిట్‌గా ఉండే దుస్తులను ధరించినప్పుడే స్కార్ఫ్ వాడటం మేలైన పద్ధతి. ఒకేరంగు స్కార్ఫ్, డ్రెస్ ధరిస్తే చూడటానికి అస్సలు బావుండదు. దుస్తులు వదులుగా ఉన్నప్పుడు స్కార్ఫ్ నప్పదు. టోపీ ధరించినప్పుడు పెద్ద స్కార్ఫ్ వాడాలి. సాయంకాలం స్కార్ఫ్‌ను భుజాల మీదుగా షాల్లా వేసుకుంటే చల్లని వాతావరణాన్ని తట్టుకున్నట్టూ ఉంటుంది. మరింత స్టైలిష్‌గానూ కనిపిస్తారు.