
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్‌లకు న్యూయార్క్ టైమ్స్ గుర్తింపు లభించింది

న్యూయార్క్ టైమ్స్ సంస్థ రూపొందించిన ‘63 మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024’ జాబితాలో వీరు చోటు సంపాదించుకున్నారు

ఈ ఏడాది జులైలో వీరి పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు

పెళ్లి సంబరాల్లో భాగంగా వీరు ధరించిన దుస్తులు, ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించాయి

దాంతో వీరికి ఈ గుర్తింపు లభించినట్లు న్యూయార్క్‌టైమ్స్ తెలిపింది













