
పుణెకు చెందిన వైవ్ మొబిలిటీ భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) వైవే ఈవాను భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించింది.

రూ.3.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన వైవే ఈవా సోలార్ టెక్నాలజీతో ఈవీ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

వైవే ఈవా పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ అమర్చారు. ఇది రోజుకు 10 కిలోమీటర్ల పరిధిని పెంచుతుంది.

ఈ ఫీచర్ సాంప్రదాయ ఛార్జింగ్ అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

ఈ వాహనం ప్రత్యేకమైన బ్యాటరీ రెంటల్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇందుకోసం కిలోమీటరుకు రూ.2 సబ్ స్క్రిప్షన్ ఖర్చు అవుతుంది.









