solar electricity
-
‘ఈనాడు, ఆంధ్రజ్యోతి’పై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రచురించిన తప్పుడు, దురుద్దేశపూర్వక కథనాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. తప్పుడు కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్, దాని ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్, దాని ఎడిటర్ ఎన్.రాహుల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. తనపై ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, పోస్టులను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ అనుబంధ పిటిషన్లో కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అంతేకాక ఇకపై అలాంటి తప్పుడు కథనాలు ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఆ మేరకు ఈనాడు, ఆంధ్రజ్యోతికి నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇస్తూ జారీ చేసిన ఈ ఉత్తర్వుల తరువాత మీరు ఏ కథనాలు ప్రచురించినా, ప్రసారం చేసినా వాటిని కోర్టు ఉత్తర్వుల గురించి తెలిసీ ప్రచురించినట్లుగానే భావిస్తామని ఈనాడు, ఆంధ్రజ్యోతికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమోణియమ్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు.రూ.100 కోట్లకు పరువు నష్టం దావాసౌర విద్యుత్ ఒప్పందం కొనుగోళ్లలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు, అసత్య కథనాలపై వైఎస్ జగన్ ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు. తనపై ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, పోస్టులను తొలగించేలా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశించాలని దావాలో కోరారు. తనకు కలిగిన పరువు నష్టానికి రూ.వంద కోట్లు చెల్లించేలా ఆదేశించాలని కోరారు. ఇకపై తన విషయంలో ఎలాంటి తప్పుడు, అసత్య, దురుద్దేశపూర్వక కథనాలు ప్రచురించకుండా, ప్రకటనలు ఇవ్వకుండా, నిందారోపణలు చేయకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశిస్తూ శాశ్వత నిషేధ ఉత్తర్వులు జారీ చేయాలని దావాలో కోర్టును అభ్యర్థించారు. తనపై తప్పుడు కథనాలను ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ, దానిని ప్రముఖంగా ప్రచురించేలా, ప్రసారం చేసేలా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశించాలని దావాలో హైకోర్టును అభ్యర్థించారు. తనపై ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలు, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, ట్వీట్లు, ఇతర లింకులను గూగుల్ దృష్టికి తెచ్చిన వెంటనే వాటిని తొలగించేలా ఆ సంస్థకు సైతం ఆదేశాలు జారీ చేయాలని కోరారు.జగన్ ప్రస్తావన ఎక్కడా లేదుఈ పరువు నష్టం దావాపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, న్యాయవాదులు అమిత్ అగర్వాల్, సాహిల్ రావిన్, రాహుల్ కుక్రేజా వాదనలు వినిపించారు. సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో జగన్మోహన్రెడ్డికి ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలు నిరాధారమైనవన్నారు. రాజకీయ కారణాలతో ఉద్దేశపూర్వకంగా ఈ తప్పుడు కథనాలను ప్రచురించారన్నారు. యూఎస్ కోర్టులో దాఖలు చేసిన నేరారోపణలను ఉటంకిస్తూ తప్పుడు కథనాలను ప్రచురించారని తెలిపారు. ఆ నేరారోపణల్లో ఎక్కడా జగన్మోహన్రెడ్డి ప్రస్తావన గానీ, ఆయనకు ముడుపులు ఇచ్చినట్లుగానీ, ఆయన తీసుకున్నట్లుగా గానీ లేనే లేదని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వ్యవహారంలో యూఎస్ కోర్టు నుంచి జగన్ ఎలాంటి నోటీసు అందుకోలేదని తెలిపారు. అయినా కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ కథనాల్లో జగన్మోహన్రెడ్డి ప్రస్తావన తెస్తూ తప్పుడు కథనాలు ప్రచురించాయని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమోణియమ్ ప్రసాద్... తప్పుడు కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతికి సమన్లు జారీ చేశారు.దావాలో వైఎస్ జగన్ ఏమన్నారంటే..కేంద్ర ప్రభుత్వ చొరవతోనే సెకీతో ఒప్పందం..ఈ మొత్తం వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించినది. వాస్తవానికి ఈ ఒప్పందం కేంద్ర ప్రభుత్వం చొరవతో జరిగింది. ఇందులో మూడో పార్టీ ప్రమేయం లేదు. సెకీ స్వయంగా 15.9.2021న ఈ ఒప్పందం ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఇందులో సెకీ క్రియాశీలకంగా వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీగా లబ్ధి పొందేందుకు సెకీ అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. సెకీ ఆఫర్ వల్ల రాష్ట్రానికి కలిగే లాభాలు ఏమిటంటే... రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పటి వరకు కొన్న సౌర విద్యుత్ ధరల కంటే సెకీ అందించే విద్యుత్ ధరే అతి తక్కువగా ఉంది. అంతేకాకుండా ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీ (ఐఎస్‌టీసీ)లను కూడా ప్రత్యేక ప్రోత్సాహం కింద 25 ఏళ్ల పాటు మినహాయించింది. దీనివల్ల ఏటా రూ.4,420 కోట్ల చొప్పున 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకుపైనే ఆదా అవుతుంది.ఆ తప్పుడు కథనాల వెనుక టీడీపీ రాజకీయ ప్రయోజనాలు..నేను ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకున్నా. వాస్తవాలను వక్రీకరిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి నవంబర్ 21 నుంచి తప్పుడు కథనాలు వెలువరించడం మొదలుపెట్టాయి. అమెరికా కోర్టులోని ప్రొసీడింగ్స్‌లో.. నాకు ముడుపులు ఇచ్చినట్లు, నేను తీసుకున్నట్లు పేర్కొన్నారని, సెకీ అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీలను మినహాయించలేదని, సెకీతో ఒప్పందాన్ని హడావుడిగా 7 గంటల్లోనే పూర్తి చేశామంటూ తప్పుడు కథనాలను వండి వార్చారు. వాస్తవానికి సెకీతో ఒప్పందంలో ఎలాంటి నేరం జరగలేదు. అమెరికా కోర్టుల్లో దాఖలు చేసిన నేరారోపణలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఆ కోర్టుల్లో జరుగుతున్న ప్రొసీడింగ్స్‌లో ఎక్కడా కూడా నాకు లంచాలు ఇచ్చినట్లుగానీ, నేను తీసుకున్నట్లు గానీ లేదు. అలాగే అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీలను సెకీ మినహాయించలేదన్న వాటి కథనాలు అసత్యం. నాపై మోపిన నిందారోపణలు, సాగిస్తున్న దుష్ప్రయోజనాల వెనుక తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. ఆ తప్పుడు కథనాలపై సామాజిక మాధ్యమాల వేదికగా వైఎస్సార్సీపీ ఖండన కూడా ఇచ్చింది.రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం..అది రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం. అందులో ఏపీ ప్రభుత్వం, డిస్కంలు, సెకీ మినహా మరెవరూ లేరు. రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత లబ్ధి చేకూర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అందించిన అవకాశాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా విస్మరిస్తుందా? వదులుకుంటుందా? ఒకవేళ ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అలాంటి అవకాశాన్ని వదులుకుంటే అది కచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమే అవుతుంది. అంతేకాక అలా వదులుకుంటూ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రావా? దురుద్దేశాలు ఆపాదించరా? సెకీతో ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదనను అధికారుల కమిటీ క్షుణ్నంగా అధ్యయనం చేసిన అనంతరం సమర్పించిన నివేదిక ప్రకారం మంత్రిమండలి 28.10.2021న ఆమోదించింది. 11.11.2021న ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సైతం తన ఆమోదాన్ని తెలిపింది. ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ప్రోత్సాహకం కింద అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీలను మినహాయించాలని కేంద్ర విద్యుత్ శాఖ 30.11.2021న కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలికి ఆదేశాలిచ్చింది. ఆ తరువాతే 1.12.2021న సెకీతో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో సెకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రమే ఉన్నాయి. ఈ మూడూ మినహా ఈ ఒప్పందంలో మరెవరూ లేరు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్లే ఈ ఒప్పందం కుదిరింది.టీడీపీ హయాంలో యూనిట్ గరిష్టంగా రూ.6.99నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సౌర విద్యుత్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నా. ఈ విషయం ఈనాడు, ఆంధ్రజ్యోతిలతో పాటు అందరికీ తెలుసు. 2014–19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో సౌర విద్యుత్ యూనిట్ ధర రూ.6.99 వరకు ఉంది. టీడీపీ హయాంలో డిస్కంలు చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల వల్ల పవన విద్యుత్ యూనిట్ ధర రూ.4.70 నుంచి రూ.4.84 వరకు ఉండేది. నేను సీఎం అయిన తరువాత ఈ ధరలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకున్నా. అందులో భాగంగానే రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సౌర విద్యుత్ కొనుగోలు విషయంలో సెకీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం వల్ల యూనిట్ రూ.2.49కే అందే అవకాశం కలిగింది.యూనిట్ రూ.2.49కే అందించేందుకు సెకీ ముందుకొచ్చింది...రాష్ట్రంలో రైతాంగానికి నిరాటంకంగా 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్తు అందించేందుకు వీలుగా సౌర విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. అయితే దానిపై న్యాయ వివాదం నెలకొంది. దీనిపై మేం న్యాయ పోరాటాలు చేశాం. మేం న్యాయ పోరాటంలో ఉండగానే 2021 సెప్టెంబర్ 15న సెకీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర చరిత్రలో తక్కువ ధరకే సౌర విద్యుత్‌ను యూనిట్ రూ.2.49కే అందించేందుకు సెకీ ముందుకొచ్చింది. ఇçప్పటి వరకు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కెల్లా ఇదే అతి తక్కువ ధర. దీనివల్ల వచ్చే 25 ఏళ్ల పాటు నిరాటంకంగా సౌర విద్యుత్ అందుతుంది. రాష్ట్రంలో రైతులకు మేలు చేస్తూ దూరదృష్టితో ప్రభుత్వం చేపట్టిన చర్యలను అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం సైతం లేఖ రాసింది.వారు రాసినవేవీ యూఎస్ కోర్టు నేరారోపణల్లో లేవు...యూఎస్ కోర్టులో జరిగిన లీగల్ ప్రొసీడింగ్స్‌ను ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరించి నాపై తప్పుడు, అవాస్తవ కథనాలను ప్రచురించాయి. నాపై తప్పుడు నిందారోపణలు మోపారు. వారు రాసిన తప్పుడు కథనాల్లోని అంశాలేవీ యూఎస్ కోర్టులో దాఖలైన నేరారోపణల్లో లేవు.నా కుటుంబం పట్ల వారి శతృత్వ భావాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయిఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు, అసత్య కథనాలు నా పట్ల, నా కుటుంబం పట్ల వారికున్న శతృత్వ భావాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. గత 20 ఏళ్లుగా వారు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రయోజనాలను కాపాడుతూ వస్తున్నారు. ఇదే సమయంలో నా పట్ల ఎలాంటి దాపరికం లేని తీవ్ర వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన వాస్తవాలు ప్రజా బాహుళ్యంలో ఉన్నప్పటికీ వారు అసత్యాలు, నిరాధార ఆరోపణలతో తప్పుడు కథనాలు ప్రచురించారు. వీటి వెనుక విస్తృత రాజకీయ అజెండా ఉండేందుకు ఆస్కారం ఉంది. వారికి ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా ఇచ్చా. బేషరతుగా క్షమాపణలు చెబుతూ, మొదటి పేజీలో దానిని ప్రముఖంగా ప్రచురించాలని సూచించినా వారు తప్పుడు కథనాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇతరుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరికీ హక్కు లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ టుడే నెట్వర్క్ తప్పుడు కథనాలను ప్రచురించడం, ప్రసారం చేయడం ద్వారా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులకు విఘాతం కలిగించాయి. ఆ కథనాలు నా జీవితానికి, హుందాతనానికి భంగం కలిగించాయి.సమగ్ర అధ్యయనం తర్వాతే ఒప్పందంరూ.2.49కే యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామని 2021 సెప్టెంబర్ 15న సెకీ నుంచి లెటర్ వచ్చింది. ముందే నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 16న కేబినెట్ మీటింగ్ ఉన్నందున సెకీ ప్రతిపాదనను టేబుల్ అజెండాగా చేర్చి మంత్రివర్గ సహచరులతో చర్చించారు. అయితే ఆ కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయాలేమీ తీసుకోలేదు. ఆమోదాలు తెలపలేదు. కేవలం సెకీ నుంచి వచ్చిన లెటర్లో పేర్కొన్న అంశాలపై లోతుపాతులను అధ్యయనం చేసి వచ్చే కేబినెట్ సమావేశం నాటికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారుల కమిటీ ఏకంగాæ 40 రోజుల పాటు అధ్యయనం చేసిన అనంతరం 2021 అక్టోబర్ 25వ తేదీన నివేదిక సమర్పించింది. అక్టోబర్ 28న కేబినెట్ దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏపీఈఆర్సీ నుంచి కూడా ఆమోదం తీసుకోవాలని సూచిస్తూ తీర్మానం చేసింది. నవంబర్ 11న ఏపీఈఆర్సీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో డిసెంబర్ 1వ తేదీన సెకీతో ఒప్పందంపై ఏపీ ప్రభుత్వం, డిస్కమ్‌లు సంతకాలు చేశాయి. ఎక్కడా థర్డ్ పార్టీ ఎవరూ లేరు. ఇది కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన పవర్ సేల్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ 3.2 క్లాజ్‌లో 25 ఏళ్లపాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీలు నుంచి మినహాయింపు వర్తిస్తుందని స్పష్టంగా ఉంది. -
వాస్తవాలు దాచి.. అడ్డగోలు రాతలా?
మరి ధరలెందుకు తగ్గలేదు..?ఎల్ఈడీ టీవీ ధర 2016లో రూ.రెండు లక్షలు ఉంటే ఇప్పుడు ఇంకా మెరుగైన సదుపాయాలతో అవే కంపెనీ టీవీలు ఇప్పుడు రూ.55 వేలకే దొరుకుతున్నాయంటూ ఈనాడు తన కథనంలో రాసుకొచ్చింది. అలాంటప్పుడు కరెంట్ ధరలు మాత్రం ఎందుకు తగ్గవనే సందేహం వ్యక్తం చేసింది. టీడీపీ, ఈనాడు చేస్తున్న వాదనే గనుక నిజమైతే 2020లో రూ.1.99 (అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు కాకుండా)గా ఉన్న యూనిట్ విద్యుత్తు ధర 2024 నాటికి రూ.1.50 లేదా అంతకంటే తక్కువకు పడిపోవాలి. కానీ అలా జరగలేదు. రూ.2.70 కంటే ఎక్కువకు పెరిగింది. అయిన్పటికీ గత ప్రభుత్వం యూనిట్ రూ.2.49 (అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు కలిపి)కే సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. అదీగాక భారత ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందం చేసుకుంటే ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తామని కేంద్రం ప్రభుత్వం చెప్పడం వల్ల వైఎస్ జగన్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంది.సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయానికి 25 ఏళ్ల పాటు నిరాటంకంగా ఉచిత విద్యుత్తు అందించేందుకు గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా తాపత్రయపడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన గొప్ప ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది. అత్యంత చౌకగా సోలార్ విద్యుత్తు అందిస్తామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనంతట తానే ముందుకొచ్చి స్వయంగా రాష్ట్రానికి లేఖ రాసింది. చెప్పాలంటే దేశ చరిత్రలోనే ఇది ఓ చారిత్రక ఒప్పందం. దేశంలో మరే రాష్ట్రానికీ దక్కని అరుదైన అవకాశం. అంతేకాదు.. ఆత్మ నిర్భర్‌లో భాగంగా ప్రత్యేక ప్రోత్సాహంగా అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల (ఐఎస్టీఎస్) నుంచి మినహాయింపు సైతం సెకీ కల్పించింది. అత్యంత చౌక ధరకు విద్యుత్తు అందించే గొప్ప కార్యక్రమం అది. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ, ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా, డిస్కమ్‌ల చరిత్రలో తొలిసారిగా చౌక ధరకు విద్యుత్తు పొందేలా ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్రం మధ్య జరిగిన ఒప్పందం అది. అలాంటి కార్యక్రమాన్ని ప్రశంసించాల్సింది పోయి ‘ఈనాడు’ బురద చల్లేందుకు తెగబడింది. చౌకగా విద్యుత్తు ఇస్తామని సెకీ స్వయంగా లేఖ రాసినప్పుడు గత ప్రభుత్వం స్పందించకుంటే ఇదే ఎల్లో మీడియా నిందించేది కాదా? అయినా ఇది ఓ రాష్ట్ర ప్రభుత్వానికి – కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీకి మధ్య జరిగిన ఒప్పందం. మధ్యలో లంచాలెక్కడ? కేంద్ర సంస్థలు ఎక్కడైనా రాష్ట్రానికి లంచాలిస్తాయా? అసలు మూడో వ్యక్తికి తావెక్కడ? ఇందులో అదానీతో ప్రభుత్వానికి ఏం సంబంధం? అమెరికాకు చెందిన సంస్థ అదానీపై ఆరోపణలు చేస్తే వైఎస్ జగన్‌పై విషం చిమ్మడం ఏమిటి? అంతా అసంబద్ధ వాదనలు.. పసలేని ఆరోపణలు!! సెకీతో కుదుర్చుకున్న చారిత్రక ఒప్పందం వల్ల ఏటా రూ.3,750 కోట్ల విద్యుత్తు భారం తగ్గుతుంది. 25 ఏళ్లలో రాష్ట్రంపై రూ.లక్ష కోట్ల మేర భారాన్ని తప్పించే గొప్ప నిర్ణయం అది. రాష్ట్ర విద్యుత్తు రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే చర్యగా భావించవచ్చు. గుజరాత్లో రూ.1.99కే విద్యుత్తు అందించే ఒప్పందం కుదిరిందంటూ ఈనాడు ఓ పసలేని వాదన తెరపైకి తెచ్చింది. సరఫరా చార్జీల కింద వాటిపై మరో రూ.రెండు అదనంగా భారం పడుతుందనే విషయాన్ని దాచిపెట్టింది. మన రాష్ట్రానికి ఆ విద్యుత్తు చేరవేసేందుకు అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలతో కలిపితే అది రూ.3.98 నుంచి రూ.4 వరకు అవుతుంది. అంటే ఒక మెగావాట్కే నెలకు రూ.4 లక్షలు చొప్పున సరఫరా చార్జీల భారం అదనంగా పడుతుంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ మభ్యపెట్టేందుకు యత్నించడం ఈనాడు మార్కు జర్నలిజానికి నిదర్శనం. ఐఎస్టీఎస్ చార్జీల భారం పడుతోందంటూ ఎల్లో మీడియా అసత్య ఆరోపణలు చేసింది. ప్రత్యేక ప్రోత్సాహకంగా దాని నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు సెకీ తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నా ఎల్లో మీడియా వక్రీకరిస్తూ నిలువెల్లా విషం చిమ్ముతోంది. ఇక అత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసిన చంద్రబాబును వెనకేసుకొస్తూ ఈనాడు ఆదివారం ఓ కట్టుకథ అల్లింది. తక్కువ ధరకు సౌర విద్యుత్‌ను కొనడం తప్పన్నట్లు అడ్డగోలు రాతలు అచ్చేసింది. ఉత్పత్తి వ్యయం తక్కువ కాబట్టే.. గుజరాత్లో నెలకొల్పే ప్లాంట్ల నుంచి మధ్య గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్, దక్షిణ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్, ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్, గుజరాత్‌లోని నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు 2020 డిసెంబర్ నుంచి విద్యుత్ సరఫరా చేసేందుకు గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ (జీయూవీఎన్‌ఎల్) 2020 సెపె్టంబర్ 28న ఫేజ్ 11లో 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు టెండర్లు జారీ చేసింది. ఈ టెండర్లో యూనిట్ రూ.1.99కి ఇచ్చేందుకు గుత్తేదారులు ముందుకు వచ్చారు. విషయం ఏమిటంటే గుజరాత్, రాజస్థాన్‌లోని ప్రదేశాలు ఎడారి భూభాగం కారణంగా అధిక సూర్యరశ్మి తీవ్రత(వికిరణం) ఉన్న ప్రాంతాలు. మన రాష్ట్రంలో పీఎల్ఎఫ్ 17 శాతం నుంచి 18 శాతం ఉంటే అక్కడ 23.5 శాతం ఉంటుంది. అంటే అక్కడ ఒక యూనిట్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు మన రాష్ట్రంలో కంటే దాదాపు 60 నుంచి 70 పైసలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయం అంత తక్కువగా ఉన్నప్పుడు అక్కడ తక్కువ ధరకు సౌర విద్యుత్ లభించడంలో విశేషమేముంది. అదే విధంగా 1,070 మెగావాట్ల విద్యుత్‌కు సెకీ టెండర్లు పిలవగా టారిఫ్ యూనిట్‌కి రూ.2కి ఒప్పందం కుదిరింది. అయితే ఆ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటయ్యేది కూడా రాజస్థాన్‌లోనే కాబట్టే ఆ రేటు! 2020లో ఆంధ్రప్రదేశ్‌లో 6,400 మెగావాట్ల పీవీ సోలార్ ప్రాజెక్టుల స్థాపనకు టెండర్ జారీ చేసినప్పుడు యూనిట్ రూ.2.49, రూ.2.58 చొప్పున ఇచ్చేందుకు టెండర్లు దాఖలయ్యాయి. ఈ టెండరింగ్ ప్రక్రియలో ఎన్టీపీసీ, టోరెంట్ పవర్, అదానీ రెన్యూవబుల్, హెచ్ఇఎస్ ఇన్ఫ్రా, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ పాల్గొన్నాయి. ప్రసార చార్జీలు లేనందున తక్కువే కదా..మరో అంశాన్ని కూడా ఈనాడు ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చింది. ఒకవేళ యూనిట్ రూ.1.99 లేదా రూ.2.01, రూ.2.36కి ఇస్తామని చెప్పినా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) లేని కారణంగా ఆ ప్రాజెక్ట్‌లకు ఛార్జీల మినహాయింపు వర్తించదు. ఈ విద్యుత్‌ను గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తే అత్యధిక ప్రసార చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా కలిపితే ఆ విద్యుత్ ఖరీదు యూనిట్‌కు రూ.3.98 (యూనిట్ రూ.1.99కి కొంటే మరో రూ.1.99) చెల్లించాలి. అదే యూనిట్ రూ.2.01కి కొంటే దానికి ఐఎస్టీఎస్ చార్జీ రూ.1.99 కలిపి యూనిట్‌కు మొత్తం రూ.4.00 కట్టాలి. ఇక యూనిట్ రూ.2.36కు తీసుకుంటే దానికి రూ.1.99 జోడిస్తే యూనిట్ ధర రూ.4.35 పడుతుంది. అంటే నెలకు ఒక మెగావాట్‌కు రూ.4 లక్షలు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలకే చెల్లించాల్సి వస్తుంది. అదే సెకీ నుంచి తీసుకుంటే ఈ ఐఎస్టీఎస్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుంది. ఈ లెక్కన సెకీ అందిస్తామన్న యూనిట్ ధర రూ.2.49 తక్కువే కదా. కోవిడ్ తర్వాత పెరిగిన సోలార్ ప్యానల్స్ ధరలు.. జీయూవీఎన్‌ఎల్ ఫేజ్ 9 టెండర్ గుజరాత్ ప్రభుత్వం చేపట్టే నాటికి కోవిడ్ కారణంగా అంతర్జాతీయంగా సోలార్ ప్యానెళ్ల ధరలు భారీగా పడిపోయాయి. భవిష్యత్తులోనూ ధరలు అదే స్థాయిలో కొనసాగుతాయని ఆ ప్రభుత్వం భావించింది. కానీ కోవిడ్∙తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్యానెల్ ధరలు పెరిగాయి. దీంతో తర్వాత టెండర్లలో సోలార్ టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు జీయూవీఎన్‌ఎల్ 2024 మార్చి 15న గుజరాత్‌లోని ఖవ్డా ప్రాంతంలో అధిక సూర్యరశ్మి తీవ్రత, అధిక పీఎల్ఎఫ్ ఉన్న ప్రాంతాల్లో టెండర్‌ను జారీ చేసింది. ఈ టెండర్లో గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు వచ్చిన టారిఫ్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే...టీడీపీ హయాంలో అత్యధిక ధరలతో పీపీఏలు.. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో జరిగిన ఒప్పందాలు గత ప్రభుత్వం చేసుకున్న సెకీ ఒప్పందానికి భిన్నంగా ఉన్నాయి. అధిక ధరలకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు టీడీపీ హయాంలో పీపీఏలు కుదుర్చుకున్నారు. 2019–20 నాటి ఏపీఈఆర్సీ టారిఫ్ ఆర్డర్ ప్రకారం సౌర విద్యుత్ సగటు ధర రూ.5.90కి పెరిగింది. అంత ఖరీదైన దీర్ఘకాలిక పీపీఏలను డిస్కంలు హడావుడిగా అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు కారణమయ్యారని ఈనాడు పత్రిక ఏనాడైనా ప్రశ్నించిందా? నిజంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆందోళన చెంది ఉంటే చంద్రబాబును దీనిపై ఎందుకు నిగ్గదీయలేదు?ఐఎస్టీఎస్ చార్జీలు మాఫీ అని చెప్పిన కేంద్రం 2021 నవంబర్ 30 నాటి విద్యుత్ మంత్రిత్వ శాఖ 23వ ఆదేశాల్లోని క్లాజ్ 3.3 ప్రకారం.. మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ కెపాసిటీ స్కీమ్‌లో భాగంగా సెకీ టెండర్ ద్వారా ఏర్పాటయ్యే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఐఎస్టీఎస్ చార్జీలు మాఫీ అవుతాయి. అంతేకాదు రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆరీ్పఓ)తో సంబంధం లేకుండా అది ఉన్న సంస్థలకు కూడా ఈ ప్రయోజనం అందుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. రాష్ట్రానికి ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపుతో పాటు ప్రత్యేక ప్రోత్సాహంతో సెకీ టెండర్ ద్వారా స్థాపించే ప్రాజెక్టుల నుంచి విద్యుత్ సరఫరా అందుతుంది. అదే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల మన రాష్ట్రంపై ఈ భారం యూనిట్‌కు రూ.1.99 నుంచి రూ.2 వరకూ పడుతుంది. వాస్తవాలు ఇలా ఉంటే ఈనాడు గత ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో ఈ విషయాలను కథనంలో ప్రస్తావించకుండా వదిలేసింది. -
సోలార్ పవర్ డైరెక్టుగా స్పేస్ నుంచే
కరెంటు లేనిదే కాసేపైనా ఉండలేం.. మరి కరెంటు ఉత్పత్తి చేయాలంటే.. ఎన్నో తిప్పలు. నానాటికీ బొగ్గు కరువై థర్మల్ విద్యుత్ ఆగిపోయే పరిస్థితి. నదుల్లో నీళ్లు పారినంత సేపే జల విద్యుత్ వస్తే.. సౌర విద్యుత్ పగటి పూట మాత్రమే ఉంటుంది. కానీ భవిష్యత్తులో 24 గంటలూ సౌర విద్యుత్ పొందగలిగేందుకు బాటలు పడుతున్నాయి. పర్యావరణానికి నష్టం లేకుండా, ఇటు 24 గంటలూ కరెంటు అందించేందుకు.. అందమైన ఐస్‌ల్యాండ్ దేశం రెడీ అవుతోంది. అదెలాగో తెలుసుకుందామా..ఆకాశంలోనే అడ్డా వేసి..భూమ్మీద అయితే పగటి పూట మాత్రమే సౌర విద్యుత్ ఉత్పత్తి సాధ్యం. అందులోనూ ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్య కిరణాల ధాటి తక్కువగా ఉండటం వల్ల తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆకాశం మేఘావృతమై ఉన్నా, సోలార్ ప్యానెల్స్ దుమ్ముపట్టినా ఇదే పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయంగా.. నేరుగా ఆకాశంలోనే ఉపగ్రహాల్లా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. దానివల్ల 24 గంటలూ సూర్య కిరణాలు పూర్తి స్థాయిలో ప్రసరిస్తాయి. దుమ్ము పట్టడం వంటి సమస్యేదీ ఉండదు. వచ్చిన చిక్కు ఏమిటంటే.. అక్కడ ఉత్పత్తి అయిన కరెంటును భూమ్మీదికి తేవడం ఎలాగనేదే!1. స్పేస్‌లోని సోలార్ ప్యానళ్లపై సూర్య కిరణాలు పడతాయి.2. వాటితో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రేడియో వేవ్స్‌గా మార్చి భూమి మీదకు పంపుతారు.3. భూమిపై గ్రౌండ్ స్టేషన్ రేడియో వేవ్స్‌ను తిరిగి విద్యుత్‌గా మార్చి ఇళ్లకు సరఫరా చేస్తుంది.రేడియో తరంగాల రూపంలో పంపుతూ..ఆకాశంలో ఏర్పాటు చేసే ప్యానల్స్ వద్ద ఉత్పత్తి అయిన కరెంటును భూమ్మీదకు తెచ్చే టెక్నాలజీని కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే రూపొందించారు. ఆ కరెంటును నిర్ణీత ఫ్రీక్వెన్సీలో రేడియో తరంగాలుగా మార్చి.. భూమ్మీద ఎంపిక చేసిన ప్రదేశంలో కేంద్రీకృతమయ్యేలా ప్రసారం చేస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే ప్రత్యేక యాంటెన్నాలు, పరికరాలు వాటిని గ్రహించి.. తిరిగి కరెంటుగా మారుస్తాయి. ఈ కరెంటును ఇళ్లకు, ఇతర అవసరాలకు ప్రసారం చేస్తారు. ఇటీవలే ‘కాల్టెక్’ అనే సంస్థ అంతరిక్షం నుంచి రేడియో తరంగాల రూపంలో పంపిన విద్యుత్‌ను భూమ్మీద ఒడిసిపట్టి.. తిరిగి విద్యుత్‌గా మార్చగలిగింది కూడా. అది ప్రయోగాత్మక పరిశీలన కాబట్టి కొన్ని మిల్లీవాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇప్పుడు ఐస్‌ల్యాండ్‌లో పూర్తిస్థాయిలో మెగావాట్ల మేర విద్యుత్‌ను అంతరిక్షం నుంచి ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టు సిద్ధం చేస్తున్నారు.‘స్పేస్ సోలార్ విద్యుత్’ లాభాలెన్నో..24 గంటలూ సౌర విద్యుత్ సరఫరాకు చాన్స్.. మిగతా పునరుత్పాదక వనరులతో పోలిస్తే తక్కువ ధర ఈ స్పేస్ సోలార్ విద్యుత్ వల్ల పెద్దగా కాలుష్యం ఉండదు. ఇళ్లకు మాత్రమేగాకుండా వాహనాలు,పరిశ్రమల్లోనూ ఈ విద్యుత్ వినియోగిస్తే.. శిలాజ ఇంధనాలతో వెలువడే కాలుష్యం ముప్పు తగ్గుతుంది. ఒకసారి వ్యవస్థలను ఏర్పాటు చేస్తే సుదీర్ఘకాలం పాటు వినియోగించుకోవచ్చు. ప్రకృతి విపత్తులు వంటివి సంభవించినప్పుడు త్వరగానే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించుకోవచ్చు.మూడు కంపెనీలు కలసి.. యూకేకు చెందిన స్పేస్ సోలార్ సంస్థ, ఐస్‌ల్యాండ్‌కు చెందిన రేక్జావిక్ ఎనర్జీ కంపెనీ, ఐస్‌ల్యాండిక్ సస్టెయినబిలిటీ ఇనిíÙయేటివ్ ట్రాన్సిషన్ ల్యాబ్స్ సంస్థలతో కలసి.. అంతరిక్ష సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తొలుత 2030 సంవత్సరం నాటికి.. 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సుమారు 3వేల ఇళ్లకు ఆ విద్యుత్‌ను సరఫరా చేయాలని భావిస్తున్నారు.భవిష్యత్తులో గిగావాట్ల స్థాయిలో..స్పేస్ సోలార్ సంస్థ భవిష్యత్తులో భారీ స్థాయిలో ‘స్పేస్ విద్యుత్’ను ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ‘కాస్సియోపియా’ పేరిట ప్రాజెక్టును చేపట్టనుంది. భారీ సోలార్ ప్యానళ్లతో కూడి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి.. ఒక నెట్‌వర్క్‌గా రూపొందించాలని.. దాని నుంచి 2036 నాటికి గిగావాట్ల కొద్దీ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘‘స్పేస్ సోలార్ ప్రాజెక్టు వల్ల తక్కువ ధరకే 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుంటుంది. దీనిపై రేక్జావిక్ ఎనర్జీ సంస్థతో కలసి ముందుకు వెళ్తున్నాం. సుస్థిర భవిష్యత్తుకు ఇది బాటలు వేస్తుంది..’’ అని స్పేస్ సోలార్ సంస్థ కో–సీఈవో మార్టిన్ సోల్టూ పేర్కొన్నారు. - సాక్షి సెంట్రల్డెస్క్ఏర్పాటు, వాడకంలో ఇబ్బందులూ ఉన్నాయి?⇒ అంతరిక్షంలో ఉపగ్రహాలు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు చాలా వ్యయంతో కూడుకున్నది. ⇒ అంతరిక్షం నుంచి పంపే రేడియో వేవ్‌ల వల్ల మనుషులు, ఇతర జీవజాలంపై,⇒ వాతావరణంపై పడే ప్రభావం ఏమిటన్నది పూర్తిగా తేలాల్సి ఉంది. ⇒ ప్రస్తుతమున్న టెక్నాలజీలతో ట్రాన్స్మిట్ అయ్యే కరెంటు తక్కువ. ఇది గణనీయంగా పెరగాల్సి ఉంది. ⇒ ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు రేడియో వేవ్‌ల ప్రసారం ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ⇒రేడియో తరంగాలు గ్రౌండ్ స్టేషన్‌పైనే కాకుండా.. ఇతర ప్రాంతాలపైకి ఫోకస్ అయితే ప్రమాదాలు జరగవచ్చనే ఆందోళన ఉంది. -
ఐపీవోల హవా
రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతున్న సెకండరీ మార్కెట్ల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం భారీ సంఖ్యలో ఇష్యూలతో కదం తొక్కుతున్నాయి. తాజాగా రెండు కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో రెండు కంపెనీలు ఐపీవో సన్నాహాల్లో ఉన్నాయి. వివరాలు ఇలా.. –సాక్షి, బిజినెస్డెస్క్ఐపీవో చేపట్టేందుకు సోలార్ ప్యానళ్ల తయారీ కంపెనీ వారీ ఇంజినీర్స్.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి పొందింది. ఇదేవిధంగా డిజిటల్ పేమెంట్ల సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూకి సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. వారీ సెబీకి 2023 డిసెంబర్లో, మొబిక్విక్ 2024 జనవరిలో దరఖాస్తు చేశాయి. వారీ ఇంజినీర్స్.. రూ. 3,000 కోట్లకుపైగా వారీ ఇంజినీర్స్ ఐపీవోలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 32 లక్షల షేర్లను ప్రమోటర్‌తోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ఒడిషాలో 6 గిగావాట్ల ఇన్గాట్ వేఫర్, సోలార్ సెల్, సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ 2023 జూన్‌కల్లా 12 గిగావాట్ల పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొబిక్విక్.. రూ. 700 కోట్లు తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా మొబిక్విక్ రూ. 700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సై అంటోంది. ఐపీవో నిధుల్లో రూ. 250 కోట్లు ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్ వృద్ధికి వినియోగించనుంది. రూ. 135 కోట్లు పేమెంట్ సరీ్వసుల బిజినెస్‌కు దన్నుగా వెచ్చించనుంది. మరో రూ. 135 కోట్లు డేటా, మెషీన్ లెర్నింగ్, ఏఐ, ప్రొడక్ట్ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనుంది. ఈ బాటలో పేమెంట్ పరికరాలపై రూ. 70 కోట్లు పెట్టుబడి వ్యయాలుగా కేటాయించనుంది. రూ. 10,000 కోట్లపై కన్ను విద్యుత్ రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ భారీ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గత వారమే సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా నవంబర్ తొలి వారంలో ఐపీవోకు వచ్చే వీలున్నట్లు తెలుస్తోంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ముంబైసహా.. సింగపూర్ తదితర దేశాలలో రోడ్‌షోలకు ప్రణాళికలు వేసింది.ఇష్యూ నిధుల్లో రూ. 7,500 కోట్లు అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెనెవబుల్ ఎనర్జీ రుణ చెల్లింపులతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఈ మహారత్న కంపెనీ 2024 ఆగస్ట్‌కల్లా 3,071 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు, 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను కలిగి ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 60 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచి్చన నేపథ్యంలోనూ మరిన్ని కంపెనీలు ఇందుకు తెరతీస్తుండటం విశేషం! ఇదే బాటలో లీలా ప్యాలెస్ లీలా ప్యాలెస్ హోటళ్ల నిర్వాహక సంస్థ ష్లాస్ బెంగళూరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. వెరసి దేశీ ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. కాగా.. ఇష్యూలో భాగంగా లీలా ప్యాలెస్ రూ. 3,000 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ డీఐఎఫ్సీ రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ దన్నుగల ష్లాస్ బెంగళూరు వెల్లడించింది. 2024 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 4,053 కోట్లుగా నమోదైంది. ద లీలా బ్రాండ్‌తో కంపెనీ విలాసవంత హోటళ్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. మొత్తం 3,382 గదులను కలిగి ఉంది.రూ. 1,100 కోట్ల సమీకరణరియల్టీ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తెరతీసింది. ఇందుకు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీతోపాటు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాసాగ్రాండ్ బ్రాండుతో కంపెనీ రియల్టీ అభివృద్ధి కార్యకలాపాలు చేపడుతోంది. 2023–24లో రూ. 2,614 కోట్ల ఆదాయం, రూ. 257 కోట్ల నికర లాభం ఆర్జించింది.14ఏళ్లలో సెప్టెంబర్ బిజీ..బిజీ ఐపీవోలకు 28 కంపెనీలు ఈ నెల(సెప్టెంబర్) 14 ఏళ్ల తదుపరి సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వివరాల ప్రకారం సెపె్టంబర్లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్‌కు తెరతీశాయి. ఫైనాన్షియల్ మార్కెట్లు పరివర్తనలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెపె్టంబర్ బులెటిన్‌లో ఆర్బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్‌్రస్కయిబ్ అవుతున్నట్లు వివరించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోలలో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. -
కేంద్ర సబ్సిడీ ప్రక్రియ గడువు తగ్గింపు
ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1.6 లక్షల మందికి సబ్సిడీ అందించినట్లు కేంద్రం తెలిపింది. వినియోగదారుల ఖాతాల్లో జమయ్యే సబ్సిడీకి సంబంధించి ప్రక్రియ సమయాన్ని నెల నుంచి ఏడు రోజులకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన బడ్జెట్ సమావేశంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రవేశపడుతున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఫిబ్రవరిలో కేంద్రమంత్రి ఈ పథకం వివరాలు ప్రకటించినప్పటి నుంచి దాదాపు 1.3 కోట్ల దరఖాస్తులు నమోదయ్యాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందులో 3.85 లక్షల గృహ వినియోగదారుల ఇళ్లలో సోలాన్ ప్యానెళ్ల ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తియిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 1.6 లక్షల మంది లబ్ధిదారులకు సబ్సిడీ అందిందని చెప్పారు. గతంలో ప్రభుత్వం సబ్సిడీ అందించేందుకు బ్యాంక్ ఖాతాలు, చెక్‌లను వినియోగించేది. తాజాగా వాటి స్థానంలో ఎన్పీసీఐ సేవలు వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇదీ చదవండి: కాలుష్య కట్టడికి రూ.25 వేలకోట్లుప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఫిబ్రవరి 15, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దేశంలో కోటి గృహాల్లో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్లను వినియోగించేలా ప్రోత్సాహకాలు అందిస్తారు. ఈ సోలార్ ప్యానెళ్లను అమర్చుకునే గృహ వినియోగదారులు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా పొందవచ్చు. దీనికి అర్హత పొందాలంటే దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయ పౌరులు అయి ఉండాలి. సోలార్ ప్యానెల్లకు తగిన ఇంటి పైకప్పు ఉండాలి. ఇతర సోలార్ ప్యానెల్ సబ్సిడీని పొందకూడదు. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ (ఎన్పీఏఐ), రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు (ఎస్ఐఏ) నిర్వహిస్తున్నాయి. -
Oxford University: అరచేతిలో అపార సౌర శక్తి
ఒకవైపు ఇంధన అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. సంప్రదాయ ఇంధన వనరుల ఉత్పత్తి అంతులేని కాలుష్యానికి, గ్లోబల్ వారి్మంగ్ పెనుభూతానికి కారకంగా మారుతోంది. సౌర విద్యుత్ సమర్థ ప్రత్యామ్నాయంగా కని్పస్తున్నా దాని తయారీకి భారీ ఫలకాలు, విశాలమైన స్థలం వంటివెన్నో కావాలి. ఈ సమస్యలకు కూడా చెక్ పెడుతూ, సౌర విద్యుదుత్పత్తిని అత్యంత సులభతరం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎక్కడికక్కడ సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలిగే అతి సూక్ష్మ సౌర ప్యానళ్లు త్వరలో రాబోతున్నాయి. వెంట్రుక మందంలో కేవలం వందో వంతు మాత్రమే ఉండే ఈ బుల్లి సౌర ప్యానళ్లను ఆక్స్ఫర్డ్ వర్సిటీ సైంటిస్టులు తాజాగా అభివృద్ధి చేశారు. వీటిని ప్రయాణాల్లో వీపుకు తగిలించుకునే బ్యాక్ప్యాక్పై, సెల్ ఫోన్ వెనక, కార్ రూఫ్ మీద... ఇలా ఎక్కడైనా సులువుగా అమర్చుకోవచ్చు! అంతేకాదు, ప్రస్తుత సౌర ఫలకాల కంటే రెట్టింపు సౌర విద్యుదుత్పాక సామర్థ్యం ఈ బుల్లి ఫలకాల సొంతం!!ఎలా పని చేస్తుంది? ఈ బుల్లి ప్యానళ్లలో సోలార్ కోటింగ్‌ను పెరోవ్సై్కట్స్గా పిలిచే పదార్థంతో తయారు చేస్తారు. ప్రస్తుత సిలికాన్ ఆధారిత సౌర ప్యానళ్లతో పోలిస్తే ఇది సూర్యరశి్మని మరింత మెరుగ్గా ఒడిసిపడుతుంది. పైగా ప్రస్తుత ప్యానళ్లు అవి ఒడిసిపడుతున్న సూర్యరశి్మలో 22 శాతాన్ని మాత్రమే ఇంధనంగా మార్చగలుగుతున్నాయి. ఆక్స్ఫర్డ్ సైంటిస్టులు రూపొందించిన బుల్లి ప్యానళ్లు 27 శాతం సామర్థ్యంతో పని చేస్తాయి. దీన్ని మున్ముందు 45 శాతం దాకా పెంచుకోవచ్చని వాళ్లు బల్లగుద్ది చెబుతున్నారు. ‘‘తొలిసారి రూపొందించినప్పుడు వీటి కన్వర్షన్ సామర్థ్యం 6 శాతమే. ఐదేళ్లలోనే దాన్ని 27 శాతానికి పెంచగలిగాం’’ అని వివరించారు. ‘‘ఎలా చూసుకున్నా సౌర విద్యుదుత్పత్తి రంగంలోనే ఇది అతి కీలకమైన ముందడుగు. ఎందుకంటే సిలికాన్ ఆధారిత ప్యానళ్లను బిగించేందుకు ప్రత్యేక సౌర క్షేత్రాలు తప్పనిసరి. అందుకు పంట పొలాలను వాడుతుండటం ప్రపంచవ్యాప్తంగా రైతుల ఆందోళనలు తదితరాలకు దారితీస్తోంది. కానీ పెరోవ్సై్కట్స్ ప్యానళ్లకు ఆ అవసరమే ఉండదు. సిలికాన్ ప్యానళ్లతో పోలిస్తే వీటిని ఎక్కడంటే అక్కడ అతి సులువుగా బిగించుకోవచ్చు. కారుచౌకగా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎలాంటి ఉపరితలం మీదైనా ఇవి సులువుగా ఒదిగిపోతాయి. చివరికి ప్లాస్టిక్, కాగితంపై కూడా!’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న ఆక్స్ఫర్డ్ సైంటిస్టు జుంక్ వాంగ్ వివరించారు. ‘‘పెరోవ్సై్కట్స్ ప్యానళ్లలో కేవలం ఒక మైక్రాన్ మందం కోటింగ్ ఉంటుంది. ప్రస్తుత సౌర ప్యానళ్లలో వాడుతున్న సిలికాన్ కోటింగ్‌తో పోలిస్తే ఇది ఏకంగా 150 రెట్లు పలుచన’’ అని చెప్పారు. ఆ సమస్యనూ అధిగమిస్తే... సంప్రదాయ సిలికాన్ సౌర ప్యానళ్లతో పోలిస్తే బుల్లి ప్యానళ్లలో ఒక పెద్ద సమస్య లేకపోలేదు. అదే... స్థిరత్వం! పెరోవ్సై్కట్స్ ప్యానళ్లు ప్రయోగశాల పరిస్థితుల్లోనే కరిగిపోతున్నాయి. లేదా కొద్ది రోజుల్లోనే విరిగిపోతున్నాయి. అయితే ఇది సమస్యేమీ కాదని వాంగ్ అన్నారు. ‘‘వాటి జీవితకాలాన్ని పెంచేందుకు జరుగుతున్న పరిశోధనలు కొలిక్కి వస్తున్నాయి’ అని వివరించారు.ఆకాశమే హద్దు...!ప్రపంచవ్యాప్తంగా సౌర ప్యానళ్ల ఏర్పాటు ఒక్క గత ఏడాదిలోనే ఏకంగా 80 శాతం పెరిగినట్టు స్వచ్ఛ ఇంధన గణాంకాలు, విశ్లేషణలో పేరున్న వుడ్ మెకెంజీ సంస్థ వెల్లడించింది. వాటి ఏర్పాటుకు వెచి్చంచాల్సిన ఖర్చు భారీగా తగ్గుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా సౌర విద్యుత్ అతి చౌకైన ఇంధన వనరుగా మారిపోతోంది. అంతేగాక గత 19 ఏళ్లుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విద్యుత్ వనరుగా నిలుస్తూ వస్తోంది. ‘‘ఈ పరిస్థితుల్లో మేం రూపొందించిన బుల్లి సౌర ప్యానళ్లు గనక ఒక్కసారి సక్సెసైతే వీటి వాణిజ్య విలువ ఆకాశాన్నంటుతుంది. అప్పుడిక ప్రపంచ ఇంధన రంగ ముఖచిత్రమే మారిపోవడం ఖాయం’’ అని పరిశోధక బృందం సారథి హెన్రీ స్నెయిత్ ధీమాగా చెబుతున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోటి ఇళ్లకు 300 యూనిట్లు ఉచిత విద్యుత్!
రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ద్వారా దేశంలోని కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో స్పష్టం చేసింది. 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా, రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా కోటి గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.గ్రీన్ గ్రోత్ , పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యలను ప్రకటించిన ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్‌కు విశేష స్పందన వచ్చినట్లు చెప్పారు. ఈ పథకానికి ఇప్పటివరకు 1.28 కోట్ల రిజిస్ట్రేషన్లు, 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.ఆ ఉచిత సౌర విద్యుత్ పథకం ద్వారా ఆయా కుటుంబాలకు సంవత్సరానికి రూ. 15,000-18,000 కోట్ల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా మిగులు విద్యుత్‌ను పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చు. సప్లయి, ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ చేసే క్రమంలో అనేక మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంటోంది. -
ఏఐ డస్ట్బిన్స్ని.. ఎప్పుడైనా చూశారా?
చెత్తబుట్టల వాడకం చాలాకాలంగా ఉన్నదే! పర్యావరణ స్పృహ పెరిగిన తర్వాత చాలా ప్రాంతాల్లో తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్తలకు వేర్వేరు చెత్త బుట్టలను స్థానిక సంస్థలు వేర్వేరు రంగులతో ఏర్పాటు చేయడాన్ని చూస్తూనే ఉన్నాం. అవగాహనలేని కొందరు వీటిలో ఒకదానిలో వేయాల్సిన చెత్తను వేరేదానిలో వేసేస్తూ ఉంటారు.రంగులను బట్టి గందరగోళానికి లోనవకుండా, ఎందులో వేయాల్సిన చెత్తను అందులోనే వేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే చెత్తబుట్టలను ఇటీవల అమెరికన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటిని ప్రయోగాత్మకంగా అమెరికాలోని సీటల్–టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు.చెత్తబుట్టల్లో వేయడానికి తీసుకొచ్చే చెత్తను వీటిపై ఉండే కెమెరాలు స్కాన్ చేసి, అది ఎందులో వేయాల్సినదో నిర్ధారిస్తుంది. వీటిలోని సెన్సర్లు చెత్తకు అనుగుణమైన బుట్ట మూత తెరుచుకునేలా చేస్తాయి. ఇలాంటి చెత్తబుట్టలు ప్రతిచోటా వాడుకలోకి వస్తే, రకరకాలు చెత్తలన్నీ కలగాపులగం కాకుండా, వాటి వల్ల తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది.సోలార్ పవర్‌బ్యాంక్..సౌర విద్యుత్తు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, విశాలమైన స్థలంలేని చోట సోలార్ ప్యానెల్స్, పవర్‌బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు. అయితే, చిన్న చిన్న అపార్ట్మెంట్లలో కూడా సులువుగా అమర్చుకునే సోలార్ పవర్‌బ్యాంక్‌ను చైనా కంపెనీ ‘యాంకర్ ఇనవేషన్స్ రూపొందించింది.‘యాంకర్ సోలార్ బ్యాంక్ 2 ఈ1600 ప్రో’ పేరుతో రూపొందించిన ఈ సోలార్ పవర్ బ్యాంకును బాల్కనీ చోటులో తేలికగా అమర్చుకోవచ్చు. ఇది సూర్యకాంతిని విద్యుత్తుగా మార్చి, బ్యాటరీలో నిక్షిప్తం చేస్తుంది. ఇందులో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని అమర్చారు.ఈ బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయినట్లయితే, సూర్యకాంతి లేకపోయినా, నిరంతరాయంగా పదిహేను గంటల సేపు ఇంటికి సరిపోయేంత విద్యుత్తును సరఫరా చేస్తుంది. దీనికి వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉండటంతో యాప్ ద్వారా కూడా దీనిని అవసరాలకు తగినట్లుగా ఉపయోగించుకోవచ్చు. దీని ధర అంతర్జాతీయ మార్కెట్లో 850 యూరోలు (రూ.76,030) మాత్రమే!ఎలక్ట్రిక్ ట్రాక్టర్..ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే విద్యుత్ వాహనాల వినియోగం బాగా పుంజుకుంటోంది. తాజాగా భారత శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థలు సంయుక్తంగా దేశంలోని తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను రూపొందించాయి. ఇది లిథియం అయాన్ ప్రిస్మాటిక్ సెల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది.బ్యాటరీ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తుతో ఈ ట్రాక్టర్ ఇంజిన్ 13 హార్స్పవర్ సామర్థ్యంతో పనిచేస్తుంది. చిన్న పొలాలు, తోటలకు అనుకూలంగా ఉండేలా దీనిని తయారు చేశారు. దీనికి రిడ్జర్స్, కల్టివేటర్స్, ఇనుప చక్రాలు, నాగలి ములుకులు వంటి వ్యవసాయ పరికరాలను అవసరం మేరకు అమర్చుకోవచ్చు. సన్నకారు, చిన్నకారు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ధర రూ.9.25 లక్షలు మాత్రమే! -
పైకప్పుపై ‘పవర్’..! ఫుల్..!!
ఏ ఇంటికై నా నెల వచ్చిందంటే భయపెట్టేది కరెంటు బిల్లే. గృహ విద్యుత్తు దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ వినియోగదారులకు భారంగానే మారుతోంది. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులు స్వయంగా విద్యుత్‌ని ఉత్పత్తి చేసుకుంటే కరెంటు బిల్లు బెడద లేకుండా హాయిగా ఉండొచ్చు. కేవలం విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవడమే కాదు.. మనం వాడుకోగా మిగిలిన కరెంటును ఎంచక్కా డిస్కంలకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయోజనం కూడా ఉంటుంది. భవిష్యత్ విద్యుత్ అవసరాల దృష్ట్యా కేంద్రం సరికొత్త విధానాలను అమల్లోకి తెచ్చింది. అందులో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తోంది. సోలార్ విద్యుత్ తయారీకి సబ్సిడీ, రుణ సదుపాయం కల్పించింది. ఆసక్తిదారులు ‘పీఎం సూర్యఘర్’ పథకం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసుకునే సౌకర్యం కల్పించింది. మన ఇంట్లోనే సూర్యరశ్మి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరాలంటే ముందుగా ‘సూర్యఘర్’ యాప్‌ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అందులో వివరాలు నమోదు చేయాలి. ఆరు నెలల కరెంటు బిల్లు కాపీని జతపరచాలి.తరువాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యుత్ వాడకం 300 యూనిట్లలోపు మాత్రమే ఉండాలన్న నిబంధన ఉంది. తదుపరి ట్రాన్స్‌కో అనుమతులు పొందాక వెండర్లను ఎంపిక చేసుకోవాలి. ఇందులో కిలో వాట్‌కు నిర్ణయించిన దాని ప్రకారం రాయితీని అందిస్తారు. మిగిలిన మొత్తానికి బ్యాంకు రుణ సదుపాయం కల్పించనున్నారు. చివరగా ఇంటి రూఫ్‌పై 100 చదరపు అడుగుల స్థలంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారు.ప్రస్తుతం వాడే మీటర్ స్థానంలో ‘నెట్ మీటర్’ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా సోలార్ ఉత్పత్తి.. వినియోగదారుడు వాడుతున్న వి ద్యుత్ని గణిస్తారు. ఈపీడీసీఎల్లోని విశాఖపట్నం సర్కిల్లో ఇప్పటి వరకు 452 మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.రూ.78 వేల వరకు సబ్సిడీ..కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ఒక కిలోవాట్ సోలార్ ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.30 వేలు సబ్సిడీ ఇస్తుంది. 2 కిలోవాట్ల ప్యానల్‌కు రూ.60 వేలు సబ్సిడీ, 3 కిలోవాట్ల సోలార్ ప్యానల్ సిస్టమ్‌కు రూ.78 వేలు సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ పోను, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు వెచ్చించే అదనపు ఖర్చును బ్యాంక్‌లోన్ రూపంలో పొందొచ్చు. దీనిపై తక్కువ వడ్డీ తీసుకుంటారు. ఈ లోన్ కోసం బ్యాంక్‌లకు ప్రజలు ఎలాంటి పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రకటన ప్రకారం ఇంటి పైకప్పుపై గరిష్టంగా 3 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర ఫలకాలు బిగించుకోవడానికి 7% వడ్డీ రేటుతో కొలేటరల్ ఫ్రీ లోన్ (తాకట్టు లేని రుణం) అందుబాటులో ఉంటుంది.30 రోజుల్లో రాయితీ..నెట్ మీటర్ అమర్చిన తరువాత వినియోగదారులు ‘పోర్టల్’లో బ్యాంక్ ఖాతా వివరాలు అప్లోడ్ చెయ్యాలి. సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం 30 రోజుల్లోనే వినియోగదారుడికి చెల్లిస్తుంది. ఒక కిలో వాట్ రూఫ్ టాప్ కెపాసిటీ కోసం 3–4 ప్యానల్స్ (1 మీటరు వెడల్పు – 1.6 మీటర్ల ఎత్తు)ని అమర్చనున్నారు. ఒక కిలో వాట్ సోలార్ రూఫ్ టాప్ ప్యానల్ నెలకు దాదాపు 125 పైగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ సూర్యరశ్మిని నిలిపేసుకోవడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. వినియోగదారుడు పెట్టిన పెట్టుబడి ఆరు నుంచి ఏడేళ్లలో తిరిగి పొందగలరని అధికారులు చెబుతున్నారు.సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అర్హతలు, అనర్హతలు..– దరఖాస్తుదారుడు భారతీయ పౌరుడై ఉండాలి.– వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలి.– సోలార్ ప్యానెళ్ల వ్యవస్థ ఏర్పాటు చేయడానికి స్థలం ఉండాలి.– దరఖాస్తుదారు వార్షిక వేతనం రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.– పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుంది.– దరఖాస్తుదారు గానీ, అతని కుటుంబంలో గానీ ప్రభుత్వ ఉద్యోగి/ఉద్యోగులు ఉంటే అనర్హులు.– దరఖాస్తుదారు దగ్గర అవసరమైన సరైన పత్రాలు ఉండాలి.– దరఖాస్తుదారు బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి.అర్హులు దరఖాస్తు చేసుకోవాలి..వినియోగదారులే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా చూసే ‘సూర్యఘర్’ అద్భుతమైన పథకం. సోలార్ విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ, రుణ సదుపాయం కల్పిస్తోంది. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్ మీటర్ విధానం ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అయ్యింది.. అందులో ఎంత మేర వినియోగిస్తున్నాం అనే వివరాలు కూడా సులువుగా తెలుసుకోవచ్చు. సందేహాలుంటే ట్రాన్స్‌కో అధికారులతో నివృత్తి చేసుకునే అవకాశం ఉంది.దరఖాస్తు చేసేందుకు అవసరమైన పత్రాలు..– ఆధార్ కార్డు నివాస ధ్రువీకరణ పత్రం– విద్యుత్ బిల్లు బ్యాంకు పాస్ బుక్– పాస్‌పోర్ట్ సైజు ఫొటో రేషన్ కార్డు– మొబైల్ నంబర్ అఫిడవిట్– ఆదాయ ధ్రువీవీకరణ పత్రం – ఎల్.మహేంద్రనాథ్, ఈపీడీసీఎల్ ఎస్ఈ -
కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్.. లబ్ధిదారుల ఖాతాల్లో త్వరలో రూ.78వేలు..?
సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఇటీవల విడుదల చేసిన బడ్జెట్లో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దాని అమలుదిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకాన్ని గతంలోనే ప్రారంభించింది. ఈ మేరకు లబ్ధిదారులు సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా రూ.78వేలు ఇవ్వనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ పథకానికి కేబినెట్ ఆమోదం లభించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువరించనున్నట్లు సమాచారం. పీఎం సూర్య ఘర్ పథకాన్ని రూ.75 వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్నారు. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రధాని గతంలోనే తెలియజేశారు. ఇదీ చదవండి: వేసవిలో ఇల్లు చల్లగా ఉండాలంటే.. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందొచ్చు. ప్రజలపై ఎలాంటి వ్యయభారం ఉండదని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
కొత్తప్లాన్‌తో భారత్‌లోకి టెస్లా.. ప్రయత్నం ఫలిస్తుందా..?
భారతప్రధాని నరేంద్రమోదీ ఇటీవల రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్ ప్రకటించిన తర్వాత ఈ రంగంలోని కంపెనీల షేర్లు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి బడ్జెట్లో కూడా దాదాపు రూ.10వేలకోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనివల్ల పేద కుటుంబాలకు ఏటా రూ.18 వేల వరకు లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. తాజాగా అమెరికాలోని ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇంక్ దేశంలో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఇన్స్టాల్ చేయడానికి స్థానిక భాగస్వామి కోసం చూస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా కంపెనీ తన భవిష్యత్తు ప్రణాళిక గురించి ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేసినట్లు లైవ్ మింట్ నివేదిక పేర్కొంది. సబ్సిడీ, ఇతర గ్రాంట్లలో రాయితీ ఇవ్వాలని కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. ఎలక్ట్రిక్ కార్ వ్యాపారం కాకుండా, టెస్లా సౌర విద్యుత్ ఉత్పత్తి, కరెంట్ స్టోరేజ్ చేసే గృహ విద్యుత్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తోంది. టెస్లా తయారు చేసే ఉత్పత్తుల్లో ‘సోలార్ రూఫ్’ కూడా ఒకటి. దీనిలో పైకప్పును ఫొటోవోల్టాయిక్ టైల్స్‌తో భర్తీ చేస్తారు. దీన్ని పవర్వాల్ అని పిలుస్తారు. ఇది సోలార్ ప్యానెల్, బ్యాటరీ పవర్ స్టోరేజ్ యూనిట్‌గా వ్యవహరిస్తుంది. అమెరికాలో కంపెనీకి చెందిన సోలార్ వ్యాపారం కొంత మందగించిన తరుణంలో టెస్లా భారతదేశంలో తన కార్యకలాపాలు ప్రారంభించాలని చూస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. అమెరికాలో టెస్లా విద్యుత్ వ్యాపారం ఏడాది క్రితం 100 మెగావాట్ల నుంచి డిసెంబర్ త్రైమాసికానికి 59శాతం తగ్గి 41 మెగావాట్లకు చేరుకుంది. మరోవైపు, దేశీయంగా ఇప్పటికే టాటా పవర్ సోలార్, అదానీ సోలార్, సెర్వోటెక్ పవర్ సిస్టమ్స్..వంటి దేశీయ కంపెనీలు రూఫ్ టాప్ సోలార్ విభాగంలో పనిచేస్తున్నాయి. గత ఐదేళ్లలో భారతదేశ సోలార్ రూఫ్‌టాప్ సామర్థ్యం 47శాతం చొప్పున పెరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ నాటికి దేశం మొత్తం రూఫ్ టాప్ సోలార్ సామర్థ్యం 11.1 గిగావాట్లుగా ఉంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ద్వారా దేశంలోని కోటి ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదీ చదవండి: గగనతల రారాజు ‘జిర్కాన్’.. ఎన్నో ప్రత్యేకతలు ఇదిలా ఉండగా, ఇప్పటికే టెస్లా కార్ల తయారీ యూనిట్‌ను భారత్‌లో స్థాపించాలని కంపెనీ అన్నివిధాలా ప్రయత్నిస్తోంది. కానీ అందుకు సంస్థ కోరేలా భారీ రాయితీలు, పన్ను మినహాయింపులు ప్రభుత్వం ఇవ్వడానికి సుముఖంగా లేదు. దాంతో జాప్యం జరుతున్నట్లు తెలిసింది. తాజాగా సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటుకు భారత్‌లో ప్రవేశించడానికి కొత్త ప్రయత్నం చేస్తోంది. -
ఉచిత కరెంట్ కోసం అప్లయ్ చేశారా?, లేదంటే ఇలా చేయండి..
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. సోలార్ పవర్ వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రధాని మోదీ 'పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో ప్రతి నెలా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ అధికార పరిధిలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ప్రోత్సహించాలని మోదీ అన్నారు. అదే సమయంలో, ఈ పథకం మరింత ఆదాయానికి, తక్కువ విద్యుత్ బిల్లులకు, ప్రజలకు ఉపాధి కల్పనకు దారి తీస్తుంది అని చెప్పారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఇందుకోసం ఎలాంటి పత్రాలు కావాలో తెలుసుకుందాం ♦ ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. ♦ అప్లయ్ ఫర్ రూఫ్‌టాప్ సోలార్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి ♦ మీరు ఈ వివరాలతో ముందుగా నమోదు చేసుకోవాలి - రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ, విద్యుత్ వినియోగదారు సంఖ్య, మొబైల్ నంబర్, ఇమెయిల్ వివరాల్ని నమోదు చేయాలి. ♦ పూర్తి చేసిన తర్వాత, మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ♦ మీరు ఇప్పుడు సోలార్ ప్యానల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ప్రాసెస్‌లో బ్యాంక్ వివరాలను సమర్పించాలి. ♦ మీరు ఆమోదం పొందిన తర్వాత, మీ డిస్కమ్‌లోని రిజిస్టర్డ్ విక్రేతలలో ఎవరైనా ప్లాంట్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ♦ ఇనెట్ మీటర్‌ను ఇన్స్టాల్ చేశాక, డిస్కమ్ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ♦ ఈ రిపోర్ట్ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది. -
ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా, షాబాద్: రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో శుక్రవారం జున్నా సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును ఆయన ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ 2030 సంవత్సరం నాటికి డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్‌ను ఉత్పత్తిని చేస్తామన్నారు. విద్యుత్ రంగంపై గత ప్రభుత్వం రూ.81 వేల కోట్లకుపైగా అప్పుల భారం మోపిందని ఆయన విమర్శించారు. ఈ భారాన్ని అధిగమిస్తూ, విద్యుత్ డిమాండ్ పెరిగిపోతున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని వెల్లడించారు. ఈ మేరకు సౌరశక్తి, పవనశక్తి, హైడెల్, చెత్త నుంచి తయారు చేసే కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలు తీరుస్తుందని చెప్పారు. చందనవెల్లి భూసేకరణలో అక్రమాలపై విచారణ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హైతాబాద్, చందనవెల్లి గ్రామాల్లో పరిశ్రమల కోసం చేసిన భూ సేకరణలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన భూ బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిజమైన లబ్థిదారులకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. -
పిక్నిక్ కోసం సోలార్ ప్యానల్ టెంట్..ధర ఎంతంటే?
శీతాకాలంలో చాలామంది పిక్నిక్లకు, వనవిహారాలకు వెళుతుంటారు. ఆరుబయట టెంట్లు వేసుకుని కాలక్షేపం చేస్తుంటారు. పగటివేళ ఫర్వాలేకున్నా, రాత్రివేళల్లో చలి వణికించేటప్పుడు టెంట్లలో గడపడం కష్టంగానే ఉంటుంది. దుప్పట్లు, రగ్గులు ఎన్ని తీసుకువెళ్లినా చలితీవ్రత అధికంగా ఉండే ప్రదేశాల్లో టెంట్లు పూర్తి సౌకర్యాన్ని ఇవ్వలేవు. టెంట్లలో వెలుతురు కోసం లాంతర్లు లేదా ఎమర్జెన్సీ లైట్లను, పూర్తిస్థాయి విద్యుత్తు సరఫరా కావాలనుకుంటే భారీ బ్యాటరీలను మోసుకుపోవాల్సి ఉంటుంది. ఇంత తతంగం లేకుండా, తేలికగా ఏర్పాటు చేసుకునే సోలార్ టెంట్‌ను అమెరికన్ కంపెనీ జాకరీ ‘లైట్ టెంట్–ఎయిర్’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. చాలా తేలికగా ఉన్న టెంట్‌ను ఆరుబయట ఎక్కడైనా సులువుగా వేసుకోవచ్చు. దీంతోపాటే సోలార్ ప్యానల్స్‌ను, బ్యాటరీని అమర్చుకోవాల్సి ఉంటుంది. సోలార్ ప్యానల్స్ ద్వారా ఈ బ్యాటరీ 1200 వాట్ల విద్యుత్తును నిక్షిప్తం చేసుకుంటుంది. రాత్రివేళ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉపయోగ పడుతుంది. రాత్రంతా టెంట్‌ను వెచ్చగా ఉంచుతుంది. దీని ధర సుమారు 3 వేల డాలర్లు (రూ.2.49 లక్షలు) మాత్రమే! -
మూసిన బొగ్గు గనుల్లో తరగని విద్యుత్..?
సంప్రదాయేతర విధానాల్లో కరెంటును ఉత్పత్తి చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. దేశీయంగా విద్యుత్తులో అధికంగా థర్మల్ కేంద్రాల నుంచే ఉత్పత్తి అవుతోంది. జల, అణు, గ్యాస్, సౌర, పవన తదితర వనరుల నుంచీ కరెంటు అందుతోంది. థర్మల్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కోసం బొగ్గును మండించడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. అందువల్ల సౌర, పవన తదితర సంప్రదాయేతర కరెంటు ఉత్పత్తిని పెంచుతూ, థర్మల్ కేంద్రాలను క్రమంగా తగ్గించాలని కేంద్రం ఆశిస్తోంది. ఇప్పటికే మూసివేసిన బొగ్గు గునులను రెన్యూవబుల్ ఎనర్జీ తయారీకి వాడుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. సోలార్ పార్క్‌లు, కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా కరెంట్ ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. విజన్ 2047 లో భాగంగా గ్రీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వాలని చూస్తున్న ప్రభుత్వం ఇందుకోసం వివిధ చర్యలు తీసుకుంటోంది. సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో వివిధ పనులు నిర్వహించాలని చూస్తోంది. ఇందులో కోల్ ఇండియా రూ.24 వేల కోట్లు సమకూర్చనుందని కొందరు అధికారులు తెలిపారు. మిగిలిన రూ.6 వేల కోట్ల కోసం ప్రైవేట్ సెక్టార్ సహకారం తీసుకోనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. కోల్ గ్యాసిఫికేషన్ (కోల్‌ను ఫ్యూయల్ గ్యాస్‌గా మార్చడం) వంటి సస్టయినబుల్ విధానాలతో పర్యావరణానికి హాని కలిగించకుండా చూస్తామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవల అన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా సేకరించిన ఫ్యూయల్ గ్యాస్‌ను హైడ్రోజన్, మీథేన్, మిథనాల్, ఇథనాల్ వంటి ఇంధనాల తయారీ కోసం వాడుకోవచ్చని తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ కోసం రూ.6 వేల కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌కు ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉందని చెప్పారు. నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాన్ కింద 2030 నాటికి 10 కోట్ల టన్నుల కోల్‌ను గ్యాస్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. -
37,490 మెగావాట్ల సోలార్‌పార్క్‌లు.. ఏయే రాష్ట్రాల్లో ఎంతంటే..
దేశవ్యాప్తంగా పరిశ్రమలు, గృహావసరాలకు విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. కానీ అందుకు సరిపడా కరెంట్ తయారవడం లేదు. సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికి బదులుగా పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్‌ను తయారుచేయాలని చాలాకాలంగా అవగాహన కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఈ ఏడాది నవంబర్ 30 వరకు 37,490 మెగావాట్ల సామర్థ్యం గల మొత్తం 50 సోలార్ పార్కులకు ఆమోదం తెలిపినట్లు మంగళవారం పార్లమెంటులో వెల్లడింకచారు. ప్రభుత్వం 40 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పార్కులు, అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ల అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోందని పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కె సింగ్ పార్లమెంట్లో తెలిపారు. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఈ పథకం కింద నవంబర్ 30 నాటికి దేశంలోని 12 రాష్ట్రాల్లో 37,490 మెగావాట్ల సామర్థ్యంతో 50 సోలార్ పార్కులను మంజూరు చేసినట్లు సింగ్ చెప్పారు. ఇప్పటికే 10,401 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 19 సోలార్ పార్కులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇదీ చదవండి: మళ్లీ ఉద్యోగుల సమరం.. మార్పు ఖాయం? రాష్ట్రాల వారీగా గుజరాత్లో సుమారు 12,150 మెగావాట్ల సోలార్ పార్క్ ప్రాజెక్టులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత రాజస్థాన్ (8,276 మెగావాట్లు), ఆంధ్రప్రదేశ్ (4,200 మెగావాట్లు), మధ్యప్రదేశ్ (4,180 మెగావాట్లు), ఉత్తర్‌ప్రదేశ్ (3,730 మెగావాట్లు), కర్ణాటకలో 2,500 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌పార్క్‌లు మంజూరయ్యాయని మంత్రి చెప్పారు. జార్ఖండ్‌లో 1,089 మెగావాట్లు, మహారాష్ట్రలో 750 మెగావాట్లు, కేరళలో 155 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 100 మెగావాట్లు, మిజోరాంలో 20 మెగావాట్ల సోలార్ పార్క్ ప్రాజెక్టులు కూడా మంజూరైనట్లు వివరించారు. -
‘ఆయుష్’కు కొత్త కళ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆయుష్ డిస్పెన్సరీలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. రంగులు వెలిసిపోయి, పాచిపట్టి అధ్వానంగా కనిపించే డిస్పెన్సరీలు కళకళలాడుతున్నాయి. రోగులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్ అవసరాల కోసం ముందుగానే మందులు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అల్లోపతి ఆస్పత్రుల రూపురేఖలు మార్చినట్లుగానే ఆయుష్ ఆస్పత్రులను సైతం అన్ని విధాలా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో ఎంపిక చేసిన 110 డిస్పెన్సరీలను ఆధునికీకరిస్తున్నారు. ఒక్కో డిస్పెన్సరీకి రూ.3.5 లక్షలు కేటాయించి భవనాలకు మరమ్మతులు చేసి రంగులు వేస్తున్నారు. ఎలక్రి్టకల్, ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. సోలార్ ప్యానల్స్‌ను అమర్చి విద్యుత్ ఆదాకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 95 డిస్పెన్సరీల్లో మరమ్మతులు, రంగులు వేయడం వంటి పనులన్నీ పూర్తయ్యాయి. రూ.12 కోట్లతో మందుల సరఫరా ఈ ఏడాది మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 735 ఆయుష్ డిస్పెన్సరీలకు రూ.3 కోట్లతో ప్రభుత్వం మందులు సరఫరా చేసింది. ఈ మందులు వినియోగంలో ఉండగానే భవిష్యత్‌లో కొరత లేకుండా మరో రూ.12 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తోంది. రెండు నెలల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి డిస్పెన్సరీలకు మందులను సరఫరా చేయనుంది. ఇంగ్లిష్ మందుల తరహాలోనే ఆయుష్ మందులను కూడా ట్యాబ్లెట్లు, క్యాప్సుల్స్, సిరప్స్, టానిక్స్ రూపంలో అందజేసేలా కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం 110 డిస్పెన్సరీలను ఆధునికీకరిస్తున్నామని, విడతల వారీగా అన్ని ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని ఆయుష్ కమిషనర్ డాక్టర్ ఎస్బీ రాజేంద్రకుమార్ లగింశెట్టి తెలిపారు. -
కలెక్టరేట్లకు సౌర సొబగులు
జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో సోలార్ పార్కింగ్ షెడ్ల ఏర్పాటు దిశగా తెలంగాణ రెడ్కో (రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్) అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయగా తాజాగా ఇతర జిల్లాల్లోనూ వాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సూర్యా పేట, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ల క్యాంపస్‌లలో సోలార్ పార్కింగ్ షెడ్ల నిర్మాణం పూర్తయింది. 20న సూర్యాపేట ప్లాంటును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.– సాక్షి, హైదరాబాద్ ఖమ్మంలో 200 కేవీ సామర్థ్యంతో.. ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 200 కేవీ (కిలోవాట్ల) గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ ప్లాంటును తెలంగాణ రెడ్కో ఏర్పాటు చేసింది. పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకొనేలా పార్కింగ్ ప్రాంత పైభాగంలో సోలార్ ప్యానల్స్‌ను అమర్చింది. ప్రస్తుతం కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో హైటెన్షన్ సర్వీస్‌లో నెలకు 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. లోటెన్షన్ సర్వీస్‌లో మరో 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్ ఖర్చవుతోంది. తాజాగా 200 కేవీ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో 24 వేల యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.దీనివల్ల రెండు సర్వీసుల్లో కలిపి నెలకు 4–5 వేల యూనిట్ల వరకు మాత్రమే గ్రిడ్ నుంచి వినియోగించుకున్నా సరిపోనుంది. అంతమేర మాత్రమే విద్యుత్ బిల్లు చెల్లించాల్సి రానుంది. ప్రస్తుతం నెలకు రూ. 1.80 లక్షల వరకు విద్యుత్ బిల్లులను కలెక్టరేట్ కార్యాలయాలు చెల్లిస్తుండగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో 80% వరకు విద్యుత్ బిల్లు తగ్గనుంది. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల ఏటా రూ. 20 లక్షల వరకు చార్జీల భారం తగ్గనుంది. ఈ లెక్కన 200 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు ఆరున్నరేళ్లలో తీరనుంది. మరో రెండు జిల్లాల్లో... రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్, కామారెడ్డి కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంగల ప్లాంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరోవైపు ఇతర కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చొరవ చూపా లని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి వల్ల జరిగే కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా గరిష్టంగా ఆరున్నర ఏళ్ల లో తిరిగి వస్తుందన్నారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్య తను 20 ఏళ్లపాటు తెలంగాణ రెడ్కో పర్యవేక్షించనుంది. సూర్యాపేటలో 100 కేవీ సామర్థ్యంతో.. సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 100 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏటా 1.44లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా ఏటా రూ.11.23లక్షల మేర ఆదా కానున్నట్లు రెడ్కో అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అయిన వ్యయం ఐదున్నర ఏళ్లలో తీరనున్నట్లు వివరిస్తున్నారు. -
ఏపీయే స్ఫూర్తి
సాక్షి, అమరావతి : ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికాభివృద్ధిని సాధించిందని చెప్పడానికి ఉపయోగపడే ప్రధాన సూచికల్లో విద్యుత్ వినియోగం ఒకటి. అందుకే విద్యుత్ వినియోగం ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ పారిశ్రామిక, వాణిజ్య రంగాలు, జీవన ప్రమాణాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని లెక్కిస్తుంటారు. అలాంటి విద్యుత్ సరఫరాకు దీర్ఘకాలంగా ఆటంకం ఏర్పడితే ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రభుత్వాలు భవిష్యత్ విద్యుత్ సరఫరాకు ముందుగానే ప్రణాళికలు వేస్తుంటాయి. ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం దేశానికి మరోసారి ఆదర్శంగా నిలిచింది. ఏపీ చర్యలను స్ఫూర్తిగా తీసుకుని అన్ని రాష్ట్రాలూ పదేళ్ల విద్యుత్ వినియోగానికి ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు తొమ్మిదేళ్ల ముందుగానే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్దేశించింది. జల విద్యుత్ కొనాలంటే తొమ్మిదేళ్ల ముందు, థర్మల్‌కు ఏడేళ్ల ముందు, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లకు ఐదేళ్లు, పవన విద్యుత్‌కు మూడేళ్లు, సౌర విద్యుత్‌కు రెండేళ్ల ముందు ఒప్పందాలు కుదుర్చుకోవాలని కేంద్రం వెల్లడించింది. 2031 నాటికి రెట్టింపు వినియోగం.. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ ఆధారంగా రానున్న పదేళ్లలో వినియోగం ఎంత ఉంటుందో అంచనా వేయాలని కేంద్రం కోరింది. దీంతో.. 2031 నాటికి ఏపీలో ఇంధన వినియోగం రెట్టింపు అవుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తన 20వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే (ఈపీఎస్) నివేదికలో ఇప్పటికే వెల్లడించగా, ఇటీవల జాతీయ విద్యుత్ ప్రణాళిక కమిటీ దానిని ధుృవీకరించింది. ఇక రాష్ట్రంలో 2021–22 ఏడాదిలో విద్యుత్ వినియోగం 60,495 మిలియన్ యూనిట్లు ఉండగా, 2031–32 నాటికి 1,21,798 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. దానికి తగ్గట్లుగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కూడా మరో 13,510 మెగావాట్లు పెరగనుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పటికే కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్కేంద్రంలో 800 మెగావాట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితమిచ్చారు. అలాగే, ఈ నెలలోనే డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో మరో 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇంధన శాఖ, ఏపీ జెన్కో సన్నాహాలు చేస్తున్నాయి. పునరుత్పాదక విద్యుత్‌కు పెద్దపీట.. ఇక 2030 నాటికి వినియోగించే విద్యుత్‌లో 50 శాతం పునరుత్పాదక విద్యుత్ ఉండాలని కేంద్రం స్పష్టంచేసింది. ఈ విషయంలోనూ రాష్ట్రం ముందంజలోనే ఉంది. వ్యవసాయానికి ఏకంగా ముప్పై ఏళ్ల పాటు పగటివేళలోనే 9 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరాను అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు ఇప్పటికే యూనిట్‌కు రూ.2.49 పైసల చొప్పున ఒప్పందం చేసుకున్నాయి. సెకీ నుంచి తీసుకుంటున్న 7 వేల మెగావాట్ల విద్యుత్ సౌర విద్యుత్ కావడం విశేషం. దీంతోపాటు 44,250 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.9.47 లక్షల కోట్ల విలువైన పునరుత్పాదక ప్రాజెక్టుల స్థాపనకు ఒప్పందాలు కూడా చేసుకుంది. -
భలే మంచి చౌక బేరము
సాక్షి, అమరావతి: సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను సాధించడం కోసం రూఫ్‌టాప్ సోలార్ యోజన స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 మార్చి 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం కింద 3 కిలోవాట్ల రూఫ్‌టాప్‌కు దాదాపు రూ.43 వేల వరకూ సబ్సిడీ అందించనుంది. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌తో ఇంట్లో ఏసీ, ఫ్రిజ్, కూలర్, టీవీ, మోటార్, ఫ్యాన్ మొదలైన వాటిని నడపవచ్చు. దీని కోసం నెలనెలా ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మిగులు విద్యుత్‌ను ఇంల్లో అద్దెకున్న వారికి, పొరుగింటి వారికి విక్రయించడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. అదనపు చార్జీలతో పనిలేదు సోలార్ ప్యానెల్స్‌ను అమర్చడానికి ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించవద్దని న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ వినియోగదారులను కోరింది. తమ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవాలనుకునే వినియోగదారులు నేషనల్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకోసం ఏ కంపెనీకి అదనంగా ఎలాంటి చార్జీలు చెల్లించవద్దని, అలాగే మీటర్, టెస్టింగ్ కోసం సంబంధిత పంపిణీ సంస్థ నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ చెల్లించవద్దని గృహ విద్యుత్ వినియోగదారులకు సూచించింది. ఎవరైనా అదనపు రుసుము కోరితే ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాల్సిందిగా తెలిపింది. సబ్సిడీ మినహాయించి చెల్లిస్తే చాలు ఒక కిలోవాట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే 100 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఎన్ని కిలోవాట్లు పెట్టాలనుకుంటే అన్ని వందల చదరపు అడుగులు అవసరం. బెంచ్‌మార్క్ ధరలపై సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ (సీఎఫ్ఏ) 3 కిలోవాట్ల వరకూ 40 శాతం, 3 కిలోవాట్లపైన 10 కిలోవాట్ల కంటే ఎక్కవ సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలపై 20 శాతం సబ్సిడీ లభిస్తుంది. గృహ విద్యుత్ వినియోగదారులు సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే 1 కిలోవాట్‌కు అయ్యే రూ.50 వేల ఖర్చులో రూ.18,800 సబ్సిడీ వస్తుంది. అదే 10 కిలోవాట్ల ప్లాంట్ అయితే రూ.4.40 లక్షల్లో రూ.1,06,600 సబ్సిడీ లభిస్తుంది. వీటికి తోడు దరఖాస్తు రుసుం 5 కిలోవాట్ల వరకూ రూ.1,000, ఆ పైన రూ.5 వేల చొప్పున చెల్లించాలి. మీటరింగ్ చార్జీలు అదనం. ఈ ధరలు చెల్లించిన వారికి సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ల రూపకల్పన, సరఫరా, ఏర్పాటు చేసి ఇవ్వడంతో పాటు బీమాతో సహా 5 ఏళ్ల వారంటీ లభిస్తుంది. ఈ మేరకు నగదును తగ్గించుకుని సంబంధిత ఏజెన్సీకి మిగతా ధర చెల్లిస్తే సరిపోతుంది. అయితే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, అపార్ట్మెంట్లకు 20 శాతం మాత్రమే సీఎఫ్ఏ వస్తుంది. -
సౌర వెలుగుల శిఖరంపై ముఖర.. రాష్ట్రంలోనే తొలి గ్రామంగా రికార్డు
ఇచ్చోడ (బోథ్): ఆదిలాబాద్ జిల్లా ముఖర(కె) గ్రామ పంచాయతీ సొంత నిధులతో సౌర విద్యుత్ సౌకర్యం కల్పించుకుని రాష్ట్రంలోనే మొదటి గ్రామంగా నిలిచింది. పంచాయతీల్లో విద్యుద్దీపాలు, ఇతర సౌకర్యాల బిల్లులు పెరిగిపోతుండడంతో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులున్నాయి. దీంతో సమస్య పరిష్కారానికి సర్పంచ్ గాడ్కే మీనాక్షి వినూత్నంగా ఆలోచించారు. గ్రామంలో సేంద్రియ ఎరువుల విక్రయంతో వచ్చిన ఆదాయం రూ.4లక్షలు ఖర్చు చేసి సోలార్‌గ్రిడ్ ఏర్పాటు చేయించారు. దీనిద్వారా ఉత్పత్తి అయ్యే 6 కిలోవాట్ల విద్యుత్‌ను పంచాయతీ, అంగన్వాడీ, గ్రామ వీధి దీపాలకు వినియోగిస్తున్నారు. 4 కిలోవాట్ల విద్యుత్ పంచాయతీ అవసరాలకు సరిపోగా.. మిగతా 2కిలోవాట్ల విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు విక్రయించి నెలకు రూ.4వేల ఆదాయం పొందుతున్నారు. బిల్లుల చెల్లింపు బాధ లేకపోగా ఆదాయం సమకూరుతుండటంతో ముఖర(కె) గ్రామ పంచాయతీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. చదవండి: బడిలోనే ఒకరు.. బడికెళ్లనంటూ మరొకరు.. నలుగురు ఒకేరోజు.. -
దేశంలో తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. మోదీ ప్రకటన
గాంధీనగర్: దేశంలోనే తొలి 24×7 సోలార్ విద్యుత్ గ్రామంగా గుజరాత్, మెహసానా జిల్లాలోని మొధేరా గ్రామాన్ని అధికారికంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మొధేరాలో నిర్వహించిన బహిరంగ సభ వేదికా ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా.. ఇప్పటివరకు సూర్యదేవాలయం ఉన్న గ్రామంగానే మొధేరా దేశానికి తెలుసునని.. ఇప్పుడు దేశ ప్రజలంతా దీన్ని సౌర విద్యుత్తు గ్రామంగా గుర్తిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు శరద్ పూర్ణిమ, వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ‘సహజ వనరులను సద్వినియోగం చేసుకొని పునరుత్పాదక ఇంధనాన్ని మరింత పోత్సహించడం ద్వారా ప్రపంచానికి ఇంధన ప్రదాతగా మారడమే లక్ష్యంగా పనిచేయాలి. మెహసానా ప్రజలు గతంలో నీళ్లు, విద్యుత్ కోసం ఎన్నో అవస్థలు పడ్డారు. మహిళలు నీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది. కానీ ఇప్పటితరానికి ఆ బాధల్లేవు. మంచి ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యంతో పరిశ్రమలను స్థాపించడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, అనుసంధానతను పెంచడం వంటివి అందిస్తోంది.’ అని తెలిపారు మోదీ. గతంలో కరెంట్ సౌకర్యం లేకపోవడం వల్ల చదువు, ఇంటి పనులకు ఇబ్బందులు ఉండేవని.. ఇప్పుడు సౌర విద్యుత్ న్యూ ఇండియాను మరింత సాధికారత కల్పించేలా లక్ష్యాన్ని అధిగమించేలా చేస్తోందన్నారు. ఒకప్పుడు సైకిళ్లను తయారు చేయలేని రోజుల నుంచి నేడు గుజరాత్ కార్లు, మెట్రోకోచ్‌లను తయారు చేసే స్థాయికి ఎదిగిందన్నారు. મોઢેરાના વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરનું પરિસર 3D પ્રોજેક્શન મેપિંગ તથા હેરિટેજ લાઇટિંગ્સથી ઝળહળી ઉઠશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.9 ઓક્ટોબરના રોજ કરશે આ સૌર ઊર્જા સંચાલિત લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું ઉદઘાટન અને સાથે જ ઉજાગર થશે મોઢેરાનો ગૌરવવંતો ઇતિહાસ.#SuryaGramModhera pic.twitter.com/zsop1XqOiT — CMO Gujarat (@CMOGuj) October 8, 2022 ఇదీ చదవండి: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం.. ‘ఆప్’ మంత్రి రాజీనామా -
గోల్డి సోలార్ రూ.5,000 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ రంగంలో ఉన్న గోల్డి సోలార్ వ్యాపార విస్తరణలో భాగంగా రూ.5,000 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. మాడ్యూల్స్, సెల్స్, ముడి పదార్థాల తయారీ సామర్థ్యాలతో సమీకృత కంపెనీగా మారాలని లక్ష్యంగా చేసుకుంది. గుజరాత్లో కొత్త సెల్ తయారీ కేంద్రం వచ్చే ఏడాది అందుబాటులోకి రానుందని గోల్డి సోలార్ ఎండీ ఐశ్వర్ ధోలాకియా తెలిపారు. ‘తద్వారా సెల్ ఉత్పత్తి సామర్థ్యం 5 గిగావాట్లకు చేరుకుంటుంది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
చితి మంటలకు చెల్లు! విదేశాల్లో ఉన్నవారు సైతం చూసేలా...
ఎల్బీనగర్(హైదరాబాద్): ఆ శ్మశాన వాటికలో చితిమంటలు ఉండవు. కట్టెలతో కాల్చే పద్ధతి కానరాదు. ఎల్బీనగర్లో ఆధునిక విధానంలో సోలార్ శ్మశాన వాటిక త్వరలోనే అందుబాటులోకి రానుంది. నాగోలు వద్ద ఫతుల్లాగూడలో నిర్మించే శ్మశాన వాటిక ఇందుకు వేదిక కానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఇక్కడి శ్మశాన వాటిక పనులు తుది దశకు చేరుకున్నాయి. సోలార్ బర్నింగ్ శ్మశాన వాటిక నిర్మాణ పనులు హెచ్ఎండీఏ పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టింది. సుమారు రూ.25 కోట్లతో దీని పనులు పూర్తి కావస్తున్నాయి. మరో వారం రోజుల్లో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే విదేశాల్లో ఉన్నవారు సైతం తమ బంధువుల అంత్యక్రియలను ఇంటర్నెట్ ద్వారా చూసే అవకాశముంది. ఇందుకోసం తెర ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25 సీసీ కెమెరాలతో పాటు ఒక తెర ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానం నగరంలోనే మొదటిది. ఫతుల్లాగూడలోని మహాప్రస్థానాన్ని సుమారు 6 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇక్కడ మూడు మతాలకు చెందిన శ్మశాన వాటికలను రూపుదిద్దుకుంటున్నాయి. హిందు, క్రిస్టియన్, ముస్లింలకు వేర్వేరుగా అత్యున్నత ప్రమాణాలతో అన్ని హుంగులతో నిర్మాణం సాగుతోంది. సుందరమైన లాన్లు, పచ్చిక బయళ్లు, కూర్చునేందుకు విశాలమైన హాల్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఫతుల్లాగూడలోని మహాప్రస్థానాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేశాం. ఇదొక అద్భుతమైన ప్రాజెక్టు. ఇక్కడికి వచ్చేవారికి అన్ని సదుపాయాలు కల్పించనున్నాం. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే (చదవండి: ఇదేమి ‘పని’ష్మెంట్!) -
మరింత లాభం, చైనా కంపెనీపై ముఖేష్ అంబానీ కన్ను
ముంబై: సోలార్ ప్యానెల్స్ తయారీ సంస్థ ఆర్ఈసీ గ్రూప్‌ను దక్కించుకోవడంపై దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) దృష్టి పెట్టింది. చైనా నేషనల్ కెమికల్ కార్పొరేషన్ (కెమ్‌చైనా) నుంచి కంపెనీని కొనుగోలు చేయాలని ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ఈ డీల్ విలువ సుమారు 1–1.2 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని అంచనా. దీని కోసం దాదాపు 500–600 మిలియన్ డాలర్లను రుణ రూపంలో సమకూర్చుకునేందుకు అంతర్జాతీయ బ్యాంకులతో రిలయన్స్ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చదవండి : కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే! త్వరలోనే ఈ డీల్ గురించి ప్రకటన చేయొచ్చని వివరించాయి. నార్వే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆర్ఈసీ గ్రూప్ .. యూరప్‌లోనే అతి పెద్ద సోలార్ ప్యానెల్స్ తయారీ సంస్థ. సింగపూర్‌లో రిజిస్టర్ అయ్యింది. ఫొటోవోల్టెయిక్ (పీవీ) అప్లికేషన్లకు అవసరమైన సిలికాన్ మెటీరియల్, మల్టీ–క్రిస్టలైన్ వేఫర్లు, గృహాలు .. పరిశ్రమలు .. సోలార్ పార్కుల్లో ఉపయోగించే మాడ్యూల్స్‌ను తయారు చేస్తుంది. పర్యావరణ అనుకూల విద్యుదుత్పత్తి రంగంలో కార్యకలాపాలు విస్తరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ఆర్ఈసీ కొనుగోలు ప్రయోజనకరంగా ఉండగలదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అధునాతన టెక్నాలజీతో పాటు అంతర్జాతీయంగా తయారీ సామర్థ్యాలు కూడా కంపెనీకి అందుబాటులోకి వస్తాయని వివరించాయి. సౌర విద్యుత్ పరిశ్రమ ఎక్కువగా చైనాపై ఆధారపడాల్సి వస్తున్న పరిస్థితుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఆర్ఈసీని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం భారత్‌కి ఏటా 3 గిగావాట్ల సోలార్ సెల్స్, 15 గిగావాట్ల మాడ్యూల్స్ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నాయి. 90 శాతం ఉత్పత్తులను చైనా, చైనీస్ కంపెనీల నుంచే దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. 2019–20లో భారత్ 2.5 బిలియన్ డాలర్ల విలువ చేసే సోలార్ వేఫర్లు, సెల్స్, మాడ్యూల్స్, ఇన్వర్టర్లను దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.