శీతాకాలంలో చాలామంది పిక్నిక్‌లకు, వనవిహారాలకు వెళుతుంటారు. ఆరుబయట టెంట్లు వేసుకుని కాలక్షేపం చేస్తుంటారు. పగటివేళ ఫర్వాలేకున్నా, రాత్రివేళల్లో చలి వణికించేటప్పుడు టెంట్లలో గడపడం కష్టంగానే ఉంటుంది. దుప్పట్లు, రగ్గులు ఎన్ని తీసుకువెళ్లినా చలితీవ్రత అధికంగా ఉండే ప్రదేశాల్లో టెంట్లు పూర్తి సౌకర్యాన్ని ఇవ్వలేవు.
టెంట్లలో వెలుతురు కోసం లాంతర్లు లేదా ఎమర్జెన్సీ లైట్లను, పూర్తిస్థాయి విద్యుత్తు సరఫరా కావాలనుకుంటే భారీ బ్యాటరీలను మోసుకుపోవాల్సి ఉంటుంది. ఇంత తతంగం లేకుండా, తేలికగా ఏర్పాటు చేసుకునే సోలార్ టెంట్‌ను అమెరికన్ కంపెనీ జాకరీ ‘లైట్ టెంట్–ఎయిర్’ పేరుతో ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది. చాలా తేలికగా ఉన్న టెంట్‌ను ఆరుబయట ఎక్కడైనా సులువుగా వేసుకోవచ్చు.
దీంతోపాటే సోలార్ ప్యానల్స్‌ను, బ్యాటరీని అమర్చుకోవాల్సి ఉంటుంది. సోలార్ ప్యానల్స్ ద్వారా ఈ బ్యాటరీ 1200 వాట్ల విద్యుత్తును నిక్షిప్తం చేసుకుంటుంది. రాత్రివేళ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉపయోగ పడుతుంది. రాత్రంతా టెంట్‌ను వెచ్చగా ఉంచుతుంది. దీని ధర సుమారు 3 వేల డాలర్లు (రూ.2.49 లక్షలు) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment