ఉచిత కరెంట్‌ కోసం అప్లయ్‌ చేశారా?, లేదంటే ఇలా చేయండి.. | How To Apply PM Surya Ghar Muft Bijli Yojana? | Sakshi
Sakshi News home page

ఉచిత కరెంట్‌ కోసం అప్లయ్‌ చేశారా?, లేదంటే ఇలా చేయండి..

Published Wed, Feb 14 2024 4:59 PM | Last Updated on Wed, Feb 14 2024 5:19 PM

How To Apply Pm Pm Surya Ghar Muft Bijli Yojana - Sakshi

 దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. సోలార్‌ పవర్‌ వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రధాని మోదీ 'పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో ప్రతి నెలా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను అందించనున్నట్లు తెలిపారు. 

 ఈ పథకాన్ని అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ అధికార పరిధిలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను   ప్రోత్సహించాలని మోదీ అన్నారు. అదే సమయంలో, ఈ పథకం మరింత ఆదాయానికి, తక్కువ విద్యుత్ బిల్లులకు, ప్రజలకు ఉపాధి కల్పనకు దారి తీస్తుంది అని చెప్పారు. 

 ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఇందుకోసం ఎలాంటి పత్రాలు కావాలో తెలుసుకుందాం 

♦ ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి. 

♦ అప్లయ్‌ ఫర్‌ రూఫ్‌టాప్ సోలార్ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి 

♦ మీరు ఈ వివరాలతో ముందుగా నమోదు చేసుకోవాలి - రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ, విద్యుత్ వినియోగదారు సంఖ్య, మొబైల్ నంబర్, ఇమెయిల్ వివరాల్ని నమోదు చేయాలి.

♦ పూర్తి చేసిన తర్వాత, మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. 

♦ మీరు ఇప్పుడు సోలార్‌ ప్యానల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ ప్రాసెస్‌లో బ్యాంక్ వివరాలను సమర్పించాలి.

♦ మీరు ఆమోదం పొందిన తర్వాత, మీ డిస్కమ్‌లోని రిజిస్టర్డ్ విక్రేతలలో ఎవరైనా ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. 

♦ ఇనెట్‌ మీటర్‌ను ఇన్‌స్టాల్‌ చేశాక, డిస్కమ్‌ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్‌ నుంచి కమిషనింగ్‌ సర్టిఫికేట్‌ ఇస్తారు.

♦ ఈ రిపోర్ట్‌ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్‌ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్‌ చేయాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement