ఎలక్ట్రిక్ కార్ల ప్రియులకు శుభవార్త. త్వరలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ కీలక భేటీ తర్వాత దేశీయంగా టెస్లా కార్ల తయారీ ప్లాంట్, పెట్టుబడులపై ప్రకటన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
పలు నివేదికల ప్రకారం.. ఏప్రిల్ 22న ఎలాన్ మస్క్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్నట్లు తెలుస్తోంది. అనంతరం మస్క్ భారత్‌లో వ్యాపార ప్రణాళికలపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే, మస్క్ భారత పర్యటనపై పీఎంఓ కార్యాలయం, టెస్లా స్పందించాల్సి ఉంది.
కాగా, భారత్‌లో టెస్లా కార్ల తయారీ యూనిట్ కోసం టెస్లా దాదాపు 2 బిలియన్ల పెట్టుబడి పెట్టనున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన స్థలాల్ని, అనుమతులు పొందేందుకు టెస్లా ప్రతినిధులు భారత్‌లో పర్యటిస్తారని వెల్లడించింది. తాజాగా, మరోసారి భారత్ పర్యటనలో ఎలాన్ మస్క్ అంటూ నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment