రూ.4.5 లక్షల కోట్లు భారీ వేతన ప్యాకేజీలో.. మస్క్‌కు ఎదురు దెబ్బ | Tesla Shareholders Advised To Reject Musk's $56 Billion Pay | Sakshi
Sakshi News home page

రూ.4.5 లక్షల కోట్లు భారీ వేతన ప్యాకేజీలో.. మస్క్‌కు ఎదురు దెబ్బ

Published Sun, May 26 2024 10:06 AM | Last Updated on Sun, May 26 2024 10:57 AM

Tesla Shareholders Advised To Reject Musk's $56 Billion Pay

టెస్లా సీఈఓ ఎలోన్‌ మస్క్‌కు చెల్లించే భారీ వేతన ప్యాకేజీ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీని ఇవ్వొద్దంటూ టెస్లా షేర్‌ హోల్డర్లు తమని కోరినట్లు ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్‌ తెలిపింది.  

ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్‌ లూయిస్‌ అనేది కార్పొరేట్‌ కంపెనీల్లో జరిగే కార్యకలాపాల్లో షేర్‌ హోల్డర్లకు సహాయం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం టెస్లాలో షేర్‌ హల‍్డర్ల తరుపున పనిచేస్తోంది.  

మార్కెట్‌ విలువను పెంచి
అయితే, ఎలోన్‌ మస్క్‌ తన అసాధారణమైన ప్రతిభతో టెస్లా మార్కెట్‌ విలువను కేవలం 10 ఏళ్ల కాలంలో అన్యూహ్యంగా పెంచారని, 2018లో  తొలిసారి మార్కెట్‌ విలువ 650 బిలియన్‌ డాలర్లకు చేర్చారని టెస్లా బోర్డు డైరెక్టర్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు టెస్లా బోర్డు డైరెక్టర్లు ఏడాదికి 55 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీ అందిస్తూ ఆమోదం తెలిపారు. వేతనాన్ని అందించారు.

రూ.4.5 లక్షల కోట్ల వేతనం దండగ
దీనిని వ్యతిరేకిస్తూ టెస్లా సీఈఓ ఎలోన్‌ మస్క్‌, ఆ సంస్థ డైరెక్టర్లకు వ్యతిరేకంగా  టెస్లా వాటాదార్లలో ఒకరైన రిచర్డ్‌ టోర్నెట్టా.. డెలావర్‌ కోర్టును ఆశ్రయించారు. ఇంత వేతనం ఇవ్వడం కార్పొరేట్‌ ఆస్తులను వృథా చేయడమే అవుతుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతుండగా.. షేర్‌ హోల్డర్లు మస్క్‌కు అంత ప్యాకేజీ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గ్లాస్ లూయిస్‌కు ప్రతిపాదనలు పంపారు. తాజా షేర్‌ హోల్డర్ల నిర్ణయంతో టెస్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. 

అంత ప్యాకేజీ.. అందుకు మస్క్‌ అనర్హుడే
గతంలో టెస్లా షేర్‌ హోల్డర్‌ రిచర్డ్‌ టోర్నెట్టా పిటిషన్‌పై డెలావర్‌ కోర్టు విచారణ చేపట్టింది. టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలోన్‌ మస్క్‌ అనర్హుడని డెలావేర్‌ కోర్టు న్యాయమూర్తి కేథలీన్‌ మెక్‌కార్మిక్‌ ఆదేశాలిచ్చారు.

అయితే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన పారిశ్రామికవేత్త, తన విలువైన సమయాన్ని కంపెనీ కోసం వెచ్చించాలనే ఉద్దేశంతోనే అంత మొత్తం చెల్లించామని టెస్లా డైరెక్టర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement