shareholders
-
రిలయన్స్ బోనస్ ఆఫర్.. ప్రతి షేర్‌కు మరో షేర్ ఫ్రీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) బోర్డు 1:1 బోనస్ ఇష్యూని ఆమోదించింది. 2017 సెప్టెంబర్ తర్వాత కంపెనీ మొదటి బోనస్ ఆఫర్ ఇదే. దీని ద్వారా షేర్ హోల్డర్లు ప్రతి షేర్‌కు ఒక షేరును ఉచితంగా పొందుతారు.భారతదేశపు అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు తేదీకి సంబంధించిన వివరాలను తర్వాత తెలియజేయనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ అధీకృత వాటా మూలధనాన్ని రూ.15,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు పెంచే ప్రతిపాదనకు ఆర్ఐఎల్ బోర్డు ఆమోదం తెలిపింది.షేర్హోల్డర్లకు బోనస్ షేర్లను బహుమతిగా ఇవ్వడానికి కంపెనీ ప్రణాళికలను ప్రకటించడం ఇది ఐదవసారి. 1983, 1997, 2009, 2017లో ఇలాగే బోనస్ షేర్లను రిలయన్స్ అందించింది. -
మస్క్‌కు జాక్‌పాట్ తగలింది.. రూ.4.5 లక్షల కోట్ల వేతనం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్!
న్యూయార్క్: టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ జాక్ పాట్ కొట్టేశారు. రూ.4.5లక్షల కోట్లు (56 బిలియన్ డాలర్లు) పారితోషికం ఇచ్చేందుకు ఆ సంస్థ వాటా దారులు మస్క్‌కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆనందానికి అవదుల్లేని మస్క్ తన డ్యాన్స్‌తో సందడి చేశారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన టెస్లా వార్షిక సమావేశంలో వాటా దారులు మస్క్‌కు 56 బిలియన్ డాలర్ల భారీ వేతనం ఇవ్వాలా? వద్ద అన్న అంశంపై ఓటింగ్ జరిగింది. ప్రాథమిక ఓట్ల ఫలితాల ఆధారంగా మస్క్‌కు 56 బిలియన్ డాలర్ల పారితోషికం ఇచ్చేలా పెట్టుబడి దారులు మద్దతు ఇచ్చారని కార్పొరేట్ సెక్రటరీ బ్రాండన్ ఎర్హార్ట్ తెలిపారు.ఎలోన్ మస్క్ 2018లో అన్ని రకాల ప్రయోజనాలు కలిపి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) వార్షిక వేతనం అందుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అత్యధిక పారితోషికం. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్‌కు అధికంగా చెల్లించారంటూ వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన డెలావర్ కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా సీఈవోకి భారీ వేతనాన్ని రద్దు చేస్తూ తీర్పిచ్చారు. తాజాగా, టెస్లా వాటాదారులు మస్క్‌కు అనుకూలంగా ఓటు వేయడంతో ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవోల్లో నెంబర్ వన్‌గా కొనసాగుతున్నారు. Elon Musk dance is 🔥. Tesla shareholders have spoken. pic.twitter.com/GiLWOtt8ZI— Tesla Owners Silicon Valley (@teslaownersSV) June 13, 2024 -
రూ.4.5 లక్షల కోట్లు భారీ వేతన ప్యాకేజీలో.. మస్క్‌కు ఎదురు దెబ్బ
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్‌కు చెల్లించే భారీ వేతన ప్యాకేజీ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీని ఇవ్వొద్దంటూ టెస్లా షేర్ హోల్డర్లు తమని కోరినట్లు ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్ తెలిపింది. ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్ అనేది కార్పొరేట్ కంపెనీల్లో జరిగే కార్యకలాపాల్లో షేర్ హోల్డర్లకు సహాయం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం టెస్లాలో షేర్ హల్డర్ల తరుపున పనిచేస్తోంది. మార్కెట్ విలువను పెంచిఅయితే, ఎలోన్ మస్క్ తన అసాధారణమైన ప్రతిభతో టెస్లా మార్కెట్ విలువను కేవలం 10 ఏళ్ల కాలంలో అన్యూహ్యంగా పెంచారని, 2018లో తొలిసారి మార్కెట్ విలువ 650 బిలియన్ డాలర్లకు చేర్చారని టెస్లా బోర్డు డైరెక్టర్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు టెస్లా బోర్డు డైరెక్టర్లు ఏడాదికి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీ అందిస్తూ ఆమోదం తెలిపారు. వేతనాన్ని అందించారు.రూ.4.5 లక్షల కోట్ల వేతనం దండగదీనిని వ్యతిరేకిస్తూ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, ఆ సంస్థ డైరెక్టర్లకు వ్యతిరేకంగా టెస్లా వాటాదార్లలో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. ఇంత వేతనం ఇవ్వడం కార్పొరేట్ ఆస్తులను వృథా చేయడమే అవుతుందని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతుండగా.. షేర్ హోల్డర్లు మస్క్‌కు అంత ప్యాకేజీ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గ్లాస్ లూయిస్‌కు ప్రతిపాదనలు పంపారు. తాజా షేర్ హోల్డర్ల నిర్ణయంతో టెస్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. అంత ప్యాకేజీ.. అందుకు మస్క్ అనర్హుడేగతంలో టెస్లా షేర్ హోల్డర్ రిచర్డ్ టోర్నెట్టా పిటిషన్‌పై డెలావర్ కోర్టు విచారణ చేపట్టింది. టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలోన్ మస్క్ అనర్హుడని డెలావేర్ కోర్టు న్యాయమూర్తి కేథలీన్ మెక్కార్మిక్ ఆదేశాలిచ్చారు.అయితే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన పారిశ్రామికవేత్త, తన విలువైన సమయాన్ని కంపెనీ కోసం వెచ్చించాలనే ఉద్దేశంతోనే అంత మొత్తం చెల్లించామని టెస్లా డైరెక్టర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. -
ఖరీదైనా.. రెండు గజాలు!
అదొక మెట్రోపాలిటన్ సిటీ. ప్రముఖ వాణిజ్య ప్రాంతం. అక్కడ ప్రాపర్టీ కొనాలంటే కనీసం రూ.20 కోట్లు అయినా ఉండాల్సిందే. కానీ అంత ఖరీదైన ప్రాపర్టీని సొంతం చేసుకోవాలంటే ఎగువ మధ్య తరగతి వారి వల్ల కూడా అయ్యే పని కాదు. అయినా సరే ఆ ప్రాపర్టీకి యజమాని కావాలనే కోరిక బలంగా ఉంది. ఇందుకు ఉన్న మార్గం ఏంటి..? నిజమే అంత భారీ పెట్టుబడి లేకపోవచ్చు. చేతిలో కొద్ది మొత్తమే ఉన్నా, అదే ప్రాపర్టీకి యజమానిగా మారిపోగల అవకాశం ఉంది. అదే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్. తమకు బాగా నచ్చిన ప్రాపర్టీలో ఒక శాతం వాటాను తక్కువకే సొంతం చేసుకోవచ్చు. మధ్యతరగతి వాసులను సైతం ప్రాపర్టీ యజమానులను మార్చేదే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్. ఈ సాధనం గురించి తెలియజేసే కథనమే ఇది. అసలు ఏంటి ఇది..? పాక్షిక అని పేరులోనే ఉంది. రియల్ ఎస్టేట్‌లో స్వల్ప వాటా. ఈ విధానంలో మీరు పెట్టుబడి పెట్టే మొత్తానికి తగ్గ వాటా మీ సొంతం అవుతుంది. అంటే ఒక ప్రాపర్టీకి అచ్చమైన యజమాని కాలేరు. ఆ ప్రాపర్టీకి ఎంతో మంది యజమానుల్లో మీరు కూడా ఒకరు అవుతారు. ఈక్విటీల గురించి తెలిసే ఉంటుంది. లిస్టెడ్ కంపెనీ మూలధనంలో ప్రమోటర్ల వాటా గరిష్టంగా 75 శాతమే ఉంటుంది. మిగిలినది పబ్లిక్ షేర్ హోల్డర్ల చేతుల్లో ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.17 లక్షల కోట్లు. ఒక్క షేరు ధర సుమారు రూ.2,500. కేవలం రూ.2,500 పెట్టి ఒక్క షేరు కొనుగోలు చేసినా ఆ కంపెనీ వాటాదారుగా మారతారు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ కూడా ఇదే మాదిరి ఉంటుంది. పాక్షిక రియల్ ఎస్టేట్‌కు ఇప్పుడు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. స్వల్ప వాటాలు తీసుకునేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి ప్రధాన ప్రేరణ టికెట్ సైజు (పెట్టుబడి పరిమాణం) చిన్నగా ఉండడమే అని చెప్పుకోవాలి. పైగా కొద్ది మొత్తానికే నాణ్యమైన రియల్ ఎస్టేట్ వాటా వస్తుండడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఆదరణ పెరుగుతుండటం గమనార్హం. ఎలా పనిచేస్తుంది..? సాంకేతికంగా చెప్పుకోవాలంటే.. మీరు, మీ స్నేహితులతో కలసి 5–10 మంది ఒక గ్రూప్‌గా ఏర్పడి ప్రాపర్టీని కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ఆచరణలో ఇది అందరికీ సాధ్యం కాదు. అందరి మధ్య సఖ్యత లేదా ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడితే ప్రాపర్టీ సంగతేమో కానీ, తమ హక్కుల కోసం కోర్టు చుట్టూ తిరగాల్సి రావచ్చు. అందుకే ఈ పాక్షిక రియల్ ఎస్టేట్‌ను సాకారం చేసేందుకు పలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు స్వల్ప పెట్టుబడితో ప్రాపర్టీలో పాక్షిక వాటా కొనుగోలుకు ఇవి అవకాశం కలి్పస్తాయి. ఇలా ఒకరితో ఒకరు పొత్తు లేకపోయినా, అందరూ కలసి ఒక ప్రాపర్టీకి ఉమ్మడి యజమానులుగా మారిపోయేందుకు పలు ప్లాట్‌ఫామ్‌లు వేదికగా నిలుస్తున్నాయి. ఈ తరహా సేవలు అందించే పోర్టళ్లను ‘ఎఫ్వోపీ’ లేదా ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్ అని పిలుస్తారు. గడిచిన కొన్నేళ్ల కాలంలో ఇలాంటివి పదుల సంఖ్యలో ఏర్పాటయ్యాయి. ఇన్వెస్టర్ల తరఫున క్లిష్టమైన ప్రాపర్టీ కొనుగోలు, దానికి సంబంధించిన ఇతర పనులను ఇవి చక్కబెడతాయి. దాంతో కొనుగోలు, విక్రయం ఎంతో సులభంగా, సౌకర్యంగా ఉంటుంది. ప్రాపర్టీ పరిశోధన, కొనుగోలు, అమ్మకం, డాక్యుమెంటేషన్, న్యాయపరమైన అంశాలు, అద్దె వసూలు, ఆ అద్దెను యజమానులకు పంపిణీ చేయడం తదితర సేవలను ఈ ప్లాట్‌ఫామ్‌లు అందిస్తాయి. వీటి సాయం లేకుండా ఇన్వెస్టర్లు ఒక సమూహంగా ఏర్పడి ఇలాంటి కార్యకలాపాలు అన్నింటినీ సొంతంగా నిర్వహించుకోవడం సులభం కాదు. అందుకే ఈ ప్లాట్‌ఫామ్ సేవలకు ఆదరణ పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఎక్కడ..? దేశవ్యాప్తంగా ఎన్నో పట్టణాలకు సంబంధించి ఫ్రాక్షనల్ ప్రాపర్టీ లావాదేవీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో గచ్చి»ౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఓ ప్రాపర్టీ ఆఫర్ విలువ రూ.46,60,00,000. దీని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్/ఐఆర్ఆర్ (యాజమాన్య నిర్వహణ సమయంలో అంతర్గత రాబడి రేటు) 13.5 శాతంగా ఉంది. స్థూల ఈల్డ్ (వార్షిక అద్దె రాబడి) 8.9 శాతంగా ఉంది. అలాగే మహారాష్ట్రలోని గోరేగావ్‌లో (ఈజోన్ అపార్చునిటీ) రూ.33,60,00,000 విలువ చేసే ప్రాపర్టీకి సంబంధించి డీల్‌లో.. ఐఆర్ఆర్ 13.4 శాతంగా ఉంటే, గ్రాస్ ఎంట్రీ ఈల్డ్ 9.6 శాతంగా ఉంది. సాధారణంగా రియల్ ఎస్టేట్‌లో 10 శాతానికి పైన ఐఆర్ఆర్ ఉంటే దాన్ని మెరుగైనదిగా పరిగణిస్తారు. 18–20 శాతంగా ఉంటే అత్యుత్తమంగా భావిస్తారు. ఐఆర్ఆర్ 5% కంటే తక్కువ ఉంటే అది లాభసాటి కాదు. నిర్వహణ సులభతరం ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో ఉన్న సౌలభ్యం నిర్వహణ అని చెప్పుకోవాలి. అద్దె వసూలు, ప్రాపర్టీ నిర్మాణం, విక్రయం, పన్నుల చెల్లింపుల ఇవన్నీ ఫ్రాక్షనల్ ఓనర్íÙప్ ప్లాట్‌ఫామ్‌లే చూస్తాయి. దీంతో ఇన్వెస్టర్‌పై నిర్వహణ భారం పడదు. ప్రాపర్టీ డాక్యుమెంట్లు పట్టుకుని ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడదు. సెబీ నియంత్రణ లేదు గత కొన్నేళ్లలో ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలోకి ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు వచ్చాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల లావాదేవీల పరంగా ఓ ప్రామాణిక విధానం, ప్రక్రియ, మార్గదర్శకాలు, నియంత్రణలు అంటూ లేవు. ఇన్వెస్టర్లకు సమగ్రంగా అన్ని వివరాలు వెల్లడిస్తున్నాయా? లావాదేవీల నిర్వహణ చట్టబద్ధంగానే ఉందా? అని చూసే వారు లేరు. అందుకే ఫ్రాక్షనల్ ఓనర్íÙప్ ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణకు సంబంధించి చర్చా పత్రాన్ని సెబీ విడుదల చేసింది. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) నియంత్రణల పరిధిలోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ మార్కెట్లో లావాదేవీలకు రక్షణలు ఏర్పడతాయి. ఇన్వెస్టర్ల హక్కులు, ప్రయోజనాలకు భరోసా ఉంటుంది. అయితే ఇందుకు ఎంత కాలం పడుతుంది? అన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ఎలాంటి ప్రాపర్టీలు..? ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో అధిక శాతం లావాదేవీలు వాణిజ్య రియల్ ఎస్టేట్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో వృద్ధి ఎక్కువగా ఉంటుంది. పైగా పెట్టుబడి వృద్ధికి తోడు, వాణిజ్య రియల్ ఎస్టేట్ నుంచి రెంటల్ రూపంలో ఆదాయం క్రమం తప్పకుండా వస్తుండడం మరో ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అందుకే వాణిజ్య ప్రాపర్టీల ధరలు చాలా ఖరీదుగా ఉంటాయి. వీటి విలువ సాధారణంగా రూ.20 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్య ఉంటుంది. అందుకే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. పైగా వాణిజ్య ప్రాపర్టీల్లో రిటైల్ ఇన్వెస్టర్ నేరుగా పెట్టుబడి పెట్టడం సాధ్యపడదు. ఈ ప్లాట్‌ఫామ్‌లు దీన్ని సాధ్యం చేస్తున్నాయి. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో కనీసంగా ఒక టికెట్ సైజు (పెట్టుబడి పరిమాణం) విలువ రూ.10–25 లక్షల మధ్య ఉంటుంది. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లు సైతం ఇందులో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రాపర్టీ వారీగా రాబడి రేటు, ధర తదితర వివరాలు అన్నీ ఉంటాయి. లిక్విడిటీ మాటేమిటి? రియల్ ఎస్టేట్‌లో ఉండే ప్రధాన సమస్య లిక్విడిటీయే. అవసరం వచ్చినప్పుడు విక్రయిద్దామంటే ఎక్కువ సందర్భాల్లో వెంటనే సాధ్యపడదు. విక్రయించే ప్రాపర్టీ, దాని ధర ఇతర అంశాలన్నింటినీ కొనుగోలుదారులు లోతుగా చూస్తారు. బేరసారాలు, విచారణలు అన్నీ అంగీకారం అయితేనే ప్రాపర్టీ లావాదేవీ పూర్తవుతుంది. కనుక కావాల్సినప్పుడు వెంటనే నగదుగా మార్చుకునే సౌలభ్యం సహజంగా రియలీ్టలో తక్కువ. మీరు ఆశించే ధరకే విక్రయించాలని అనుకుంటే నెలల నుంచి సంవత్సరాల పాటు వేచి చూడాల్సి వస్తుంది. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లోనూ ఇదే అమలవుతుంది. కాకపోతే విడిగా ఓ ప్రాపర్టీ లావాదేవీతో పోలిస్తే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ టికెట్ సైజు తక్కువగా ఉంటుంది. కనుక లిక్విడిటీ కాస్తంత మెరుగు అని భావించొచ్చు. పాక్షిక ప్రాపర్టీ అయినా సరే, దాని అద్దె రాబడి ఏ మేరకు? ప్రాపర్టీ నాణ్యత మాటేమిటి? అనేది కొనుగోలు దారులు చూస్తారు. నాణ్యమైన ప్రాపర్టీ, అద్దె రాబడి మెరుగ్గా ఉంటే వేగంగా అమ్ముడుపోతుంది. లేదంటే చాలా కాలం పాటు అందులో పెట్టుబడి చిక్కుకుపోవచ్చు. పైగా ఇందులో కొనుగోలు చేసే ప్రాపర్టీ పెట్టుబడి దృష్ట్యానే తప్ప వినియోగం కోణంలో ఉండదు. అందుకని విక్రయించుకునేందుకు కొంత సమయం పట్టొచ్చు. టికెట్ సైజు తక్కువగా ఉండడం ఇందులో కాస్త అనుకూలతగా చెప్పుకోవచ్చు. -
చిప్ ప్లాంటుకు భాగస్వామి సిద్ధం..
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ ప్లాంటు ఏర్పాటు కోసం భాగస్వామిని సిద్ధం చేసుకున్నట్లు వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ ఏడాదే చిప్‌ల తయారీని ప్రారంభించనున్నట్లు కంపెనీ 58వ షేర్‌హోల్డర్ల సమావేశంలో వివరించారు. అయితే, భాగస్వామి పేరు మాత్రం ఆయన వెల్లడించలేదు. రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ ప్లాంటు నెలకొల్పేందుకు వేదాంతతో కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ నుంచి ఫాక్స్‌కాన్ తప్పుకున్న నేపథ్యంలో అగర్వాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమ అనుబంధ సంస్థ ఎవాన్్రస్టేట్.. గ్లాస్ సబ్్రస్టేట్స్ తయా రీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉందని, సొంత పేటెంట్లు కూడా ఉన్నాయని అగర్వాల్ చెప్పారు. మరోవైపు, భారత్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడాన్ని వేదాంత కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 35 బిలియన్ డాలర్ల పైగా (దాదాపు రూ. 2.9 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. కార్యకలాపాల విస్తరణ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 14,000 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. -
సెప్టెంబర్ నాటికి ఆడిట్ పూర్తి
న్యూఢిల్లీ: 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఖాతాల ఆడిట్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి కాగలదని ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ సీఈవో బైజూ రవీంద్రన్.. ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. అలాగే 2023 ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలు డిసెంబర్ నాటికి పూర్తి కాగలవని షేర్హోల్డర్లతో కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో తప్పిదాలు జరిగాయని అంగీకరించిన రవీంద్రన్.. వాటి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. అటు బోర్డు సభ్యుల రాజీనామా విషయం కూడా వాస్తవమేనని, కానీ కంపెనీ ఇంకా వాటిని ఆమోదించలేదని తెలిపారు. ఈలోగానే రా జీనామా వార్తలు లీకయ్యాయని పేర్కొన్నారు. కొత్త గా నియమితులైన సీఎఫ్‌వో అజయ్ గోయల్‌ను రవీంద్రన్ పరిచయం చేశారు. రాజీనామా చేసిన ముగ్గురు డైరెక్టర్లు కూడా సమావేశంలో పా ల్గొన్న ట్లు సమాచారం. ఆడిటర్లు వైదొలగడం, తమ రా జీనామాలు రెండూ వేర్వేరు అంశాలని వారు చెప్పి నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. సంస్థ లోని వివిధ విభాగాలు మెరుగ్గానే పనిచేస్తున్నాయని, గ్రూప్ కౌన్సిల్‌తో కలిసి కొత్త సీఎఫ్‌వో సంస్థను మరింత పటిష్టం చేయగలరని రవీంద్రన్ తెలిపిన ట్లు పేర్కొన్నాయి. 2022 ఆర్థిక సంవత్సర ఫలితాలను ఇంకా వెల్లడించకపోవడం, ఆడిటర్లు.. డైరెక్ట ర్లు రాజీనామా చేయడం, 1 బిలియన్ డాలర్ల రుణా ల చెల్లింపుపై వివాదం నెలకొనడం తదితర సవాళ్ల తో బైజూస్ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. -
ఎస్‌సీఐఎల్‌ఏఎల్ లిస్టింగ్ ఈ నెలలోనే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎస్సీఐ నుంచి విడదీసిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అండ్ అసెట్స్ (ఎస్‌సీఐఎల్‌ఏఎల్) సంస్థ ఈ నెలలో స్టాక్ ఎక్స్చెంజీలలో లిస్ట్ కానుంది. విభజన ప్రక్రియ కింద ఎస్సీఐ (షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) షేర్హోల్డర్లకు ఎస్‌సీఐఎల్‌ఏఎల్ షేర్లు లభించనున్నాయి. సంస్థ లిస్టింగ్ తర్వాత ఎస్సీఐ ప్రైవేటీకరణపై స్పష్టత వస్తుందని, అటుపైన ఫైనాన్షియల్ బిడ్లను ప్రభుత్వం ఆహ్వానించే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 2020 నవంబర్‌లో షిప్పింగ్ కార్పొరేషన్లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా ప్రధాన వ్యాపారయేతర అసెట్స్‌ను ఎస్‌సీఐఎల్‌ఏఎల్ కింద విడగొట్టారు. గతేడాది మార్చి 31 నాటికి దీని విలువ రూ. 2,392 కోట్లు. ప్రస్తుతం ఎస్‌సీఐలో కేంద్రానికి 63.75 శాతం వాటాలు ఉన్నాయి. -
లాభాల్లోకి టొరెంట్ పవర్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టొరెంట్ పవర్ 2022–23 చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 484 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 487 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇక మొత్తం ఆదాయం సైతం భారీగా ఎగసి రూ. 6,134 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 3,841 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 2,165 కోట్లకు జంప్‌చేసింది. 2021–22లో కేవలం రూ. 479 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 14,493 కోట్ల నుంచి రూ. 26,076 కోట్లకు ఎగసింది. ఒకేసారి లేదా దశలవారీగా మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 3,000 కోట్ల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. టొరెంట్ పవర్ షేరు ఎన్ఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 556 వద్ద ముగిసింది. -
నష్టాల్లోకి యాక్సిస్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. జనవరి–మార్చి (క్యూ4)లో రూ. 5,728 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2021– 2022 ఇదే కాలంలో రూ.4,118 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం రూ.22,000 కోట్ల నుంచి రూ.28,865 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం సైతం రూ. 17,776 కోట్ల నుంచి రూ.23,970 కోట్లకు బలపడింది. బ్యాంకు బోర్డు వాటాదారులకు షేరుకి రూ.1 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో రూ. 5,361 కోట్ల నికర నష్టం నమోదైంది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,417 కోట్ల నికర లాభం ఆర్జించింది. సిటీఇండియా రిటైల్ బిజినెస్ కొనుగోలు నేపథ్యంలో నష్టాలు నమోదైనట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ ప్రభావాన్ని (రూ. 12,490 కోట్లు) మినహాయిస్తే నికర లాభం 61% వృద్ధి సాధించినట్లని బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరీ చెప్పారు. ఎన్పీఏలు డౌన్ క్యూ4లో యాక్సిస్ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 2.82 శాతం నుంచి 2.02 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 0.73 శాతం నుంచి 0.39 శాతానికి దిగివచ్చాయి. మొండిరుణాలు తగ్గడంతో ప్రొవిజన్లు, కంటిజెన్సీలు రూ. 987 కోట్ల నుంచి తగ్గి రూ. 306 కోట్లకు పరిమితమయ్యాయి. నికర వడ్డీ మార్జిన్లు 0.73 శాతం మెరుగై 4.22 శాతానికి చేరాయి. ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు 0.8 శాతం క్షీణించి రూ. 881 వద్ద ముగిసింది. -
Tesla Tweet: ఎలన్ మస్క్‌కు భారీ ఊరట
శాన్ ఫ్రాన్సిస్కో: దాదాపు నాలుగేళ్ల క్రిందట.. టెస్లా విషయంలో ఆ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ చేసిన ఆ ఒక్క ట్వీట్ ఆ కంపెనీ పెట్టుబడిదారులను బెంబేలెత్తించింది. నిర్లక్ష్యంగా ఆయన చేసిన ఆ ట్వీట్.. కంపెనీ షేర్లను ఘోరంగా పతనం చేసింది. వెరసి.. సొంత కంపెనీ, సొంత ఇన్వెస్టర్లు, సొంత సీఈవో పైనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అదీ బిలియన్ల డాలర్ల పరిహారం కోరుతూ!. కానీ, ఎలన్ మస్క్ దూకుడుకు కళ్లెం వేసేందుకు కోర్టు కూడా ఆసక్తి చూపలేదు. ఆయనకు భారీ ఊరటే ఇచ్చింది. శుక్రవారం శాన్ఫ్రాన్సిస్కో(కాలిఫోర్నియా స్టేట్) కోర్టు.. ఎలన్ మస్క్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తన ట్వీట్ ద్వారా ఎలన్ మస్క్ ఎలాంటి మోసానికి పాల్పడలేదని స్పష్టం చేసింది. తద్వారా వాటాదారులకు ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. 2018లో టెస్లా ప్రైవేట్ ఫండింగ్‌కు వెళ్తోందంటూ ఓ ట్వీట్ చేశాడు ఎలన్ మస్క్. అయితే.. కంపెనీకి వ్యతిరేకంగా పందెం వేసిన పెట్టుబడిదారులను అణిచివేసే ప్రయత్నమే అయినా.. సదరు వ్యాపారవేత్త నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తద్వారా టెస్లా షేర్లు దారుణంగా పడిపోయాయని టెస్లా ఇన్వెస్టర్లు మస్క్‌పై శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేశారు. కానీ, మస్క్ చేసిన ‘‘ఫండింగ్ సెక్యూర్డ్’’ ట్వీట్ సాంకేతికంగా సరికాదని మాత్రమే కోర్టు చెప్పింది తప్ప.. ఎలన్ మస్క్ ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తద్వారా ఇన్వెస్టర్లకు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే.. ఎలన్ మస్క్ తన ట్వీట్లతో నెటిజన్స్‌లో ‘హీరో’గా పేరు సంపాదించుకుంటున్నప్పటికీ .. టెస్లాను మాత్రం నిండా ముంచుతూ పోతున్నాడు. టెస్లాలో తన పేరిట ఉన్న అధిక వాటాలను ఇదివరకే మస్క్ అమ్మేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా తీర్పుతో ఎలన్ మస్క్ ఇంకా చెలరేగిపోయే ఆస్కారం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు దావాల్లోనూ మస్క్‌కి అనుకూలంగానే తీర్పులు వెలువడుతుండడం చూస్తున్నాం. ఇక నుంచి తనకు ఏది అనిపిస్తే దానిని సోషల్ మీడియా వేదికగా ఎలన్ మస్క్ ప్రకటించే అవకాశం ఉందని, అది భావ స్వేచ్ఛ ప్రకటనగా పరిగణించడం ఎంతమాత్రం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను చేజిక్కించుకున్న ఎలన్ మస్క్.. ఆ మైక్రోబ్లాగింగ్ కంపెనీ వ్యవస్థను అతలాకుతలం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. -
వచ్చే 8న కిర్లోస్కర్ బ్రదర్స్ ఈజీఎం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్(కేబీఎల్) డిసెంబర్ 8న వాటాదారుల అత్యవసర సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. వెలుపలి సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్‌కు పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించవలసిందిగా వాటాదారులకు సూచించింది. కంపెనీలో ఉమ్మడిగా 24.92 శాతం వాటా కలిగిన కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, అతుల్ కిర్లోస్కర్, రాహుల్ కిర్లోస్కర్ డిమాండుమేరకు ఈజీఎంను చేపట్టినట్లు తెలియజేసింది. కిర్లోస్కర్ సోదరుల మధ్య వివాదాలు తలెత్తడంతో కేబీఎల్ చైర్మన్, ఎండీ సంజయ్ కిర్లోస్కర్ ఒకవైపు, అతుల్, రాహుల్ మరోవైపు చేరారు. ఈ నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టేందుకు స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిటర్‌ను నియమించాలన్న డిమాండుపై ఈజీఎంను నిర్వహిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. గత ఆరేళ్లలో న్యాయ, వృత్తిపరమైన కన్సల్టెన్సీ చార్జీలకు సంబంధించి కంపెనీ చేసిన వ్యయాలపై పరిశోధన చేపట్టేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్ ఎంపికను కోరుతున్నట్లు వివరించింది. కాగా.. బోర్డు ఈ ప్రతిపాదనలను సమర్థించడంలేదని కేబీఎల్ పేర్కొంది. బోర్డు, డైరెక్టర్ల స్వతంత్రతను ప్రశ్నించడం సరికాదని వాదిస్తోంది. -
వాటాదారుల ఆమోదం కోరనున్న ఫ్యూచర్ గ్రూపు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో చేసుకున్న ఒప్పందానికి వాటాదారుల ఆమోదాన్ని ఫ్యూచర్ గ్రూపు సంస్థలు కోరనున్నాయి. ఈ మేరకు నవంబర్ 10, 11 తేదీల్లో వాటాదారులు, రుణదాతల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా ఫ్యూచర్ గ్రూపు కంపెనీలు తమ వాటాదారులకు సమాచారం ఇచ్చాయి. వీడియో కాన్ఫరెన్స్/ఆడియో, వీడియో విధానంలో ఈ సమావేశాలను నిర్వహించనున్నట్టు తెలిపాయి. అదే విధంగా ఉన్నచోట నుంచే ఈఓటు వేసే ఏర్పాటు కూడా చేసినట్టు పేర్కొన్నాయి. ఫ్యూచర్ గ్రూపు కంపెనీలన్నింటినీ ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో విలీనం చేసి.. తదుపరి ఫ్యూచర్ రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గుంపగుత్తగా విక్రయించాలన్నది ఫ్యూచర్ గ్రూపు ప్రణాళిక. ఇందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.24,713 కోట్లు చెల్లించనుంది. ఈ మొత్తం ఫ్యూచర్ గ్రూపు రుణదాతలకు దక్కనుంది. -
మైనారిటీ వాటాదారుల అభిప్రాయాలూ తెలుసుకోండి
ముంబై: వివిధ అంశాలు, సమస్యలపై చర్చకు జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మైనారిటీ వాటాదారు ఇన్వెస్కో చేసిన అభ్యర్థనకు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ సానుకూలంగా స్పందించింది. బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మీడియా రంగ కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్)ను ఆదేశించింది. అమెరికాకు చెందిన ఇనెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్, ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్‌తో కలిగి జీ ఎంటర్టైన్మెంట్పై ఈ పిటిషన్ దాఖలు చేశాయి. బోర్డ్ సమావేశం ఏర్పాటు ద్వారా జీల్ సీఈవో, ఎండీ పునీత్ గోయెంకాసహా మరో ఇద్దరు డైరెక్టర్లను తొలగించాలని ఆశిస్తోంది. అలాగే కొత్తగా ఎంపిక చేసిన ఆరుగురు డైరెక్టర్లతో బోర్డును పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తోంది. బోర్డ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను షేర్ హోల్డర్లందరికీ తగిన విధంగా తెలియజేయాలని కూడా జీ ఎంటర్టైన్మెంట్నుజీ ఎంటర్టైన్మెంట్, అత్యవసర వాటాదారుల సమావేశం, ఇన్వెస్కో , ఎన్సీఎల్టీ , బోర్డ్ సమావేశం ఎన్సీఎల్టీ ఆదేశించింది. ఈ అంశాలపై తదుపరి విచారణను అక్టోబర్ 4న చేపట్టనున్నట్లు ఇద్దరు సభ్యుల బెంచ్ తెలియజేసింది. మరోపక్క ఈ అంశాలపై చట్ట ప్రకారం కేటాయించిన గడువులోగా బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జీల్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. వాటాలు ఇలా... ఈజీఎంను చేపట్టమంటూ సెప్టెంబర్ 11న జీల్‌ను అభ్యర్థించినట్లు ఇన్వెస్కో తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ ట్రిబ్యునల్‌కు తెలియజేశారు. వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణార్ధం ప్రస్తుత బోర్డు ఆధ్వర్యంలో కంపెనీ నిర్వహణ చేపట్టరాదంటూ పేర్కొన్నారు. కొత్త డైరెక్టర్లను నియమించుకోవడం ద్వారా బోర్డును తిరిగి నిర్మించాలని కోరారు. దీంతో 45 రోజుల్లోగా ఈజీఎంను చేపట్టవలసిందిగా జీల్‌ను ఆదేశించమంటూ ఎన్సీఎల్టీని వేడుకున్నారు. ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్‌తో కలిపి ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ జీల్లో 17.88 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. సెపె్టంబర్ 22న సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో విలీనమయ్యేందుకు జీల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో జీల్ షేరు 2 శాతం క్షీణించి రూ. 304 వద్ద ముగిసింది. -
వాటాదారులకు మరింత విలువ
న్యూఢిల్లీ: వాటాదారులకు విలువ చేకూర్చడంపై దృష్టిపెట్టిన మౌలిక రంగ దిగ్గజం ఎల్అండ్టీ ఇందుకు మరిన్ని చర్యలను తీసుకోనున్నట్లు వెల్లడించింది. కీలకంకాని ఆస్తుల విక్రయం, వ్యయ నియంత్రణలు పాటించడం, టెక్నాలజీ వినియోగం ద్వారా ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి అంశాలను అమలు చేయనున్నట్లు ఎల్అండ్టీ గ్రూప్ చైర్మన్ ఏంఎ నాయక్ పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా పలు విభాగాలలోగల వ్యాపార పోర్ట్‌ఫోలియో, ప్రాంతాలవారీ విస్తరణ, పటిష్ట బ్యాలన్స్‌షీట్, వృద్ధిలో ఉన్న ఆర్డర్‌బుక్ తదితరాలు కంపెనీ పురోభివృద్ధికి దోహదం చేయనున్నట్లు తెలియజేశారు. కంపెనీ సాధారణ సర్వసభ్య సమావేశం సందర్భంగా వాటాదారులనుద్దేశించి నాయక్ ప్రసంగించారు. తద్వారా పలు అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) లో కంపెనీ పనితీరుపై అప్రమత్తతతోకూడిన ఆశాభావంతో ఉన్నట్లు తెలియజేశారు. కాగా.. గతేడాది(2020–21)కిగాను వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున తుది డివిడెండ్ చెల్లించేందుకు తాజాగా బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రూ. 18 మధ్యంతర డివిడెండ్ చెల్లించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్అండ్టీ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు యథాతథంగా రూ. 1,624 వద్ద ముగిసింది. -
హెచ్‌డీఎఫ్‌సీకు భారీ షాక్
సాక్షి, ముంబై: ప్రైవేటురంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు భారీ షాక్ తగిలింది. అమెరికాకు చెందిన న్యాయ సంస్థ రోసన్ లా కంపెనీ బ్యాంకుపై క్లాస్ యాక్షన్ వ్యాజ్యం దాఖల్ చేసింది..పొటెన్షియల్ సెక్యూరిటీ క్లెయిమ్స్ పై షేర్ హోల్డర్స్ తరపున విచారణ ప్రారంభించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. వాస్తవాలు దాచిపెట్టినట్టు ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తునకు ఆదేశించినట్టు సంస్థ తెలిపింది. ఈ బ్యాంక్ సెక్యూరిటీలను కొనుగోలు చేసిన వాటాదారులు కూడా దీనికి మద్దతు పలకాలంటూ కోరింది. తమ ఫిర్యాదును నమోదు చేయాల్సిందిగా ఒక వెబ్ సైట్ సమాచారాన్ని అందించింది. హెచ్డీఎఫ్సీ వాహన-ఫైనాన్సింగ్ విభాగంలో తప్పుడు విధానంపై దర్యాప్తు జరిపినట్లు జూలై 13న బ్యాంకు నివేదించిన కొద్ది రోజుల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. వాహన రుణాల టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు తప్పుడు విధానాలు అవలంబించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై దర్యాప్తు చేసిన బ్యాంక్ ఆరుగురు సీనియర్, మధ్య స్థాయి అధికారులను తొలగించింది. అయితే దీనిపై క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎక్స్ పీరియన్ కూడా బ్యాంకుపై గత నెలలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్న లక్షల మంది కస్టమర్ల వివరాలతో పాటు వారి పేమెంట్ హిస్టరీ కూడా ఆలస్యంగా ఇస్తుందని ఈ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే 2020-21 తొలి త్రైమాసిక ఫలితాలపైన అనుమానాలును వ్యక్తం చేసింది. కాగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు, వాటాదారులకు రక్షణగా నిలిచే సంస్థ రోసన్ లా దావా సంచలనంగా మారింది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆదాయాన్ని, లాభాలను పెంచుకునేందుకు ఇన్ఫోసిస్ టాప్ మేనేజ్ మెంట్ తప్పుడు విధానాలను చేపట్టిందంటూ ఈ సంస్థ గత సంవత్సరం ఒక క్లాస్ యాక్షన్ దావా వేసిన సంగతి తెలిసిందే. -
ఒక్క గంటలో 50 వేల కోట్ల రూపాయలు
సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను ప్రకటించింది. దీనికి తోడు గత త్రైమాసికంలో 1.65 బిలియన్ డాలర్లతో పోలిస్తే 1.74 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలను దక్కించుకుంది. దీంతో గురువారం నాటి మార్కెట్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఫలితంగా ఇన్ఫోసిస్ షేరు రికార్డు లాభాల్లో దూసుకుపోతోంది. ఆరంభంలోనే 15 శాతం పైగా లాభపడి ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. దీంతో ఇన్ఫోసిస్ వాటాదారులు కేవలం ఒక గంటలో 50 వేల కోట్ల రూపాయలను దక్కించుకోవడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలను ఇన్పీ అధిగమించింది. జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 11.5 శాతం వృద్ధితో 4233 కోట్లు నికర లాభాలను సాధించింది. గత ఏడాది ఇదే సమయంలో ఇది 3798 కోట్లు రూపాయలుగా ఉంది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 8.5 శాతం వృద్ధి చెంది 23,665 కోట్ల రూపాయలకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో 21,803 కోట్ల రూపాయలుగా నమోదైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం వల్ల సంస్థ లాభపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో దేశీయ బ్రోకరేజ్ ఎడెల్విస్ ఇన్ఫోసిస్‌పై టార్గెట్ ధరను అప్‌గ్రేడ్ చేసింది.ఆదాయ మార్గదర్శక వృద్ధిని పునరుద్ఘాటించడం ముఖ్య సానుకూలతనీ, డిజిటల్ కార్యకలాపాలు పుంజుకోవడం కూడా సంస్థకు సానుకూలమైన అంశమని వ్యాఖ్యానించింది. (వ్యాగన్ ఆర్, బాలెనో కార్లు రీకాల్) -
టీవీఎస్ మోటార్ కంపెనీ రెండో డివిడెండ్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ తన వాటాదారులకు రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేర్‌కు రూ.1.40 చొప్పున(140 శాతం) రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఈ నెల 18నాటికి తమ షేర్లను హోల్డ్ చేస్తున్న వాటాదారులకు ఈ నెల 20లోపు ఈ డివిడెండ్‌ను చెల్లిస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. మొత్తం 47.5 కోట్ల షేర్లకు రూ.80 కోట్లు చెల్లించనున్నామని పేర్కొంది. గత నెలలోనే ఈ కంపెనీ ఒక్కో షేర్‌కు రూ.2.10 డివిడెండ్‌ను ప్రకటించింది. -
ఇన్ఫోసిస్‌కి మరో తలనొప్పి
లాస్ ఏంజెలిస్: సీఈవో, సీఎఫ్‌వోలపై ప్రజావేగుల ఫిర్యాదులతో సతమతమైన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు తాజాగా మరో తలనొప్పి ఎదురైంది. షేర్‌హోల్డర్ల హక్కుల పరిరక్షణకు సంబంధించి ఇన్ఫోసిస్‌పై క్లాస్ యాక్షన్ దావా వేయనున్నట్లు అమెరికాకు చెందిన న్యాయసేవల సంస్థ ది షాల్ లా ఫర్మ్ వెల్లడించింది. మార్కెట్‌ను తప్పుదోవ పట్టించేలా ఇన్ఫోసిస్ తప్పుడు ప్రకటనలు చేసిందని షాల్ ఆరోపించింది. స్వల్పకాలిక లాభాలను పెంచి చూపించడం కోసం ఆదాయాల లెక్కింపునకు తప్పుడు విధానాలు పాటించిందని ఫిర్యాదులో పేర్కొంది. పెద్ద డీల్స్‌పై ప్రామాణికంగా జరపాల్సిన సమీక్షలు జరగకుండా సీఈవో సలిల్ పరేఖ్ తప్పించారని షాల్ ఆరోపించింది. పైగా ఈ అకౌంటింగ్ లొసుగులు, వివాదాస్పద డీల్స్ వివరాలను ఆడిటర్లు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్లనివ్వకుండా ఫైనాన్స్ విభాగంపై యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందని తెలిపింది. ‘ఈ అంశాలకు సంబంధించి కంపెనీ అందర్నీ తప్పుదోవ పట్టించేలా అవాస్తవమైన, తప్పుడు ప్రకటనలు చేసింది. ఈ వ్యవహారం గురించి మార్కెట్లకు నిజాలు తెలిసిన తర్వాత.. ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది‘ అని షాల్ ఒక ప్రకటనలో పేర్కొంది. 1,00,000 డాలర్ల పైగా నష్టపోయిన ఇన్వెస్టర్లు.. క్లాస్ యాక్షన్ దావాలో భాగం అయ్యేందుకు తమను కలవాలని సూచించింది. 2018 జూలై 7–2019 అక్టోబర్ 20 మధ్య కాలంలో ఇన్ఫీ షేర్లను కొనుగోలు చేసిన వారు.. డిసెంబర్ 23లోగా సంప్రదించాలని పేర్కొంది. వివరణ కోరిన బీఎస్ఈ .. అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా వార్తలపై వివరణనివ్వాలంటూ ఇన్ఫీకి స్టాక్ ఎక్సే్ఛంజీ బీఎస్ఈ సూచించింది. అయితే, దీనిపై కంపెనీ స్పందించాల్సి ఉంది. ఇన్ఫీ సీఈవో సలిల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్‌లు వ్యాపారపరంగా అనైతిక విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచి్చన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్ఈసీ విచారణ జరుపుతోంది. తాజా వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు సుమారు 3 శాతం క్షీణించి, రూ. 702 వద్ద ముగిసింది. -
బోనస్‌కు విప్రో వాటాదారుల ఆమోదం
న్యూఢిల్లీ: బోనస్ ఇష్యూ ప్రతిపాదనకు, అధీకృత మూలధనం పెంపునకు మెజారిటీ వాటాదారులు ఆమోదం తెలిపినట్టు విప్రో తెలిపింది. వాటాదారుల వద్దనున్న ప్రతి మూడు షేర్లకు (ముఖ విలువ రూ.2) ఒక షేరును బోనస్‌గా ఇవ్వడానికి విప్రో బోర్డు జనవరిలో నిర్ణయించిన విషయం గమనార్హం. ఫిబ్రవరి 22 గడువు నాటికి అవసరమైన మెజారిటీ వాటాదారులు బోర్డు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్టు విప్రో స్టాక్ ఎక్సే్చంజ్‌లకు సమాచారం ఇచ్చింది. అధీకృత మూలధనం పెంపునకు 98.82 శాతం, బోనస్ షేర్ల జారీకి 99.81 శాతం మంది వాటాదారుల ఆమోదం లభించినట్టు వెల్లడించింది. బోనస్ షేర్ల జారీ ద్వారా కంపెనీ అధీకృత మూలధనం రూ.1,126.50 కోట్ల నుంచి రూ.2,526.50 కోట్లకు పెరగనుంది. -
రెండేళ్లు.. రూ.లక్ష కోట్లు..!
న్యూఢిల్లీ: దేశీ టాప్ 5 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) దిగ్గజాలు షేర్హోల్డర్లకు గత రెండేళ్లలో సుమారు రూ. 1.17 లక్షల కోట్లు తిరిగి చెల్లించాయి. 2017 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో షేర్ల బైబ్యాక్, డివిడెండ్స్ రూపంలో ఈ నిధులను చెల్లించాయి. సగటున డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 67గా లెక్కిస్తే దాదాపు 17.5 బిలియన్ డాలర్లు చెల్లించినట్లవుతుంది. ఇందులో అయిదింట నాలుగొంతుల వాటా టాప్ రెండు ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్దే ఉంది. అయిదు టాప్ కంపెనీల్లో మూడు కంపెనీలు బోనస్‌లు కూడా ఇచ్చాయి. ఈ రెండేళ్ల వ్యవధిలో ఈ ఐదు ఐటీ సంస్థల షేర్లు సుమారు 16–68 శాతం మేర పెరిగాయి. ఇలా షేర్హోల్డర్లకు తిరిగిచ్చిన మొత్తం నిధుల్లో దాదాపు 61 శాతం షేర్ల బైబ్యాక్ రూపంలోనే జరిగింది. టీసీఎస్ రూ. 32,000 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 21,200 కోట్ల మేర బైబ్యాక్స్ జరిపాయి. అటు విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా అదే బాటలో నడవగా.. టెక్ మహీంద్రా ఒక్కటి మాత్రమే బైబ్యాక్ చేపట్టలేదు. మరోవైపు, టాప్ 4 కంపెనీలు చేసిన చెల్లింపుల్లో మొత్తం షేర్ల బైబ్యాక్ వాటా 54 శాతం నుంచి 89 శాతం దాకా ఉంది. బైబ్యాక్స్కే ఎందుకు ప్రాధాన్యం.. డివిడెండ్ల కన్నా షేర్ల బైబ్యాక్ వైపే కంపెనీలు ఎక్కువగా మొగ్గు చూపుతుండటానికి 2016 కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలే ప్రధాన కారణం. సాధారణంగా కార్పొరేట్ ట్యాక్స్‌లు గట్రా కట్టేసిన తర్వాత వచ్చే నికర లాభం నుంచే డివిడెండ్ల చెల్లింపు ఉంటుంది. కానీ 2016 బడ్జెట్లో రూ. 10 లక్షల పైగా డివిడెండ్ అందుకునే హై నెట్‌వర్త్ ఇన్వెస్టర్లు ఆ మొత్తంపై పది శాతం ట్యాక్స్ కట్టాల్సి వచ్చేలా ప్రతిపాదనలు చేశారు. ఇక కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేస్తే.. దానిపై దాదాపు 20% దాకా (అసలు 15%, సర్‌చార్జి, సెస్సు మొదలైనవన్నీ కలిపి) డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) కట్టాల్సి వస్తుంది. ఈ కారణాలతో డివిడెండ్లకు ఆకర్షణీయత తగ్గింది. మరోవైపు, బైబ్యాక్ మార్గంలో షేర్లను తిరిగి కంపెనీకే విక్రయించినప్పుడు వచ్చే లాభాలను దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. దీనిపై పది శాతం మేర లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించినా.. డివిడెండ్లతో పోలిస్తే తక్కువే ఉంటుంది. అందుకే డివిడెండ్ల కన్నా బైబ్యాక్లవైపే కాస్త ఎక్కువ మొగ్గు ఉంటోందని నిపుణులు తెలిపారు. ఈపీఎస్ ప్రయోజనాలు కూడా.. డివిడెండ్ చెల్లించడం కన్నా షేర్లను బైబ్యాక్ చేయడం వల్ల కంపెనీలకు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డివిడెండును కంపెనీ నికర లాభం నుంచి నగదు రూపంలో చెల్లించాల్సి వస్తుంది. దీంతో.. కంపెనీ నికర విలువ, ఫలితంగా మార్కెట్ విలువ కూడా ఆ మేరకు కాస్త తగ్గుతుంది. అయితే, షేర్లను బైబ్యాక్ చేసినప్పుడు చలామణీలో ఉన్న మొత్తం షేర్ల సంఖ్య తగ్గడం వల్ల షేరువారీ ఆర్జన (ఈపీఎస్) పెరిగి, వేల్యుయేషన్ కూడా ఆ మేరకు పెరుగుతుంది. అంతే కాకుండా నిర్దిష్ట రేటు ప్రకారం కొనుగోలు ఉంటుంది కాబట్టి.. ఆ స్థాయిలో సంస్థ షేరు స్థిరపడేందుకు కూడా చాలా సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. బైబ్యాక్ ప్రకటించినా ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించకుండా దూరంగా ఉంటే.. కంపెనీలో తమ వాటాలను మరింత కన్సాలిడేట్ చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది. బోనస్‌లు కూడా.... షేర్ల బైబ్యాక్, డివిడెండ్లతో పాటు ఈ కంపెనీలు బోనస్ షేర్లు కూడా ప్రకటించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు షేరు ఒక్కింటికి ఒక షేరు ఇచ్చాయి. విప్రో మాత్రం రెండు సార్లు బోనస్ ఇష్యూలు ప్రకటించింది. 2017లో షేరు ఒక్కింటికి ఒకటి చొప్పున ఇవ్వగా.. తాజాగా జనవరిలో మరో బోనస్ ఇష్యూకి బోర్డు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రతి 3 షేర్లకు ఒక్క షేరు చొప్పున బోనస్‌గా ఇవ్వనుంది. -
ఫేస్బుక్ చైర్మన్‌గా జుకర్‌బర్గ్ తొలగింపు?
-
ఫేస్బుక్ చైర్మన్‌గా జుకర్‌బర్గ్ తొలగింపు?
వాషింగ్టన్ : ఫేస్బుక్లో చోటు చేసుకున్న డేటా హ్యాక్ ప్రకంపనాలు, ఫేక్ న్యూస్ ఇష్యూ ఆ కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు ఎసరు తెచ్చి పెడుతున్నాయి. ఈ సోషల్ మీడియా దిగ్గజ చైర్మన్‌గా మార్క్ జుకర్‌బర్గ్‌ను తొలగించాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఫేస్బుక్ ఇంక్‌లో మెజార్టీ షేర్లను కలిగి ఉన్న నాలుగు దిగ్గజ అమెరికా పబ్లిక్ ఫండ్స్ బుధవారం మార్క్ జుకర్‌బర్గ్‌ను చైర్మన్‌గా తొలగించాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చాయి. కంపెనీలో అతిపెద్ద అసెట్ మేనేజర్లు కూడా ఈ ప్రతిపాదనకే ఓకే చేస్తారని అవి ఆశిస్తున్నారు. ఈ ప్రతిపాదన దాఖలు చేసిన వాటిలో ఇల్లినోయిస్, రోడ్ ఐలండ్, పెన్సిల్వేనియాలకు చెందిన స్టేట్ ట్రెజర్స్, న్యూయార్క్ సిటీ కంప్ట్రోలర్ స్కాట్ స్ట్రింగర్ ఉన్నాయి. ఇలాంటి ప్రతిపాదనే ఫేస్బుక్లో 2017లో ఒకసారి వచ్చింది. తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదన ఎంతో కీలకమైనదని రోడ్ ఐలండ్ స్టేట్ ట్రెజర్స్ వెల్లడించింది. డేటా హ్యాక్, కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ వంటి సమస్యల నుంచి ఫేస్‌బుక్‌ను బయటపడేయడానికి ఇదే మార్గమని పేర్కొంది. వార్షిక సమావేశంలో ఎలాగైనా ఈ ప్రతిపాదనన చర్చించేలా చేస్తామని రోడ్ ఐలండ్ స్టేట్ ట్రెజర్ సేథ్ మాగజైనర్ చెప్పారు. ఈ విషయంపై స్పందించడానికి ఫేస్బుక్ అధికార ప్రతినిధి నిరాకరించారు. కంపెనీ వార్షిక సమావేశం 2019 మేలో జరగనుంది. స్వతంత్ర బోర్డ్ చైర్‌ను నియమించాలని బోర్డును కోరతామని తెలిపారు. ఫేస్బుక్లో ప్రస్తుతం నడుస్తున్న ఈ లుకలుకలు ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా నెట్‌వర్క్‌గా పేరున్న ఈ కంపెనీ ప్రతిష్టను బజారుకు ఈడస్తున్నాయి. బుధవారం ఫేస్బుక్ షేర్లు 10 శాతం కిందకి పడిపోయాయి. కాగా, పెన్సిల్వేనియా ట్రెజరీ 38,737 షేర్లను, ఇల్లినోయిస్ ట్రెజరీ 1,90,712 షేర్లు, రోడ్ ఐలండ్ ట్రెజరీ 1,68,230 షేర్లను కలిగి ఉంది. అయితే జుకర్‌బర్గ్ 60శాతం ఓటింగ్ హక్కులు ఉండటంతో, ఈ ప్రతిపాదన ఈ సారైనా ఆమోదం అవుతుందో లేదో చూడాల్సి ఉంది. -
ఎల్ అండ్ టీ మెగా బై బ్యాక్: చరిత్రలో తొలిసారి
సాక్షి, ముంబై: దేశీయ ఇంజనీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి) వాటాదారుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు (బై బ్యాక్)కు చరిత్రలోనే తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నిర్వహించిన బోర్డు సమావేశంలో బై బ్యాక్ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకుని వాటాదారులకు గుడ్ న్యూస్ అందించింది. రూ. 9వేలకోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. టెండర్ ఆఫర్ ద్వారా బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు తెలియజేసింది. వాటాదారులు కంపెనీ పట్ల చూపిన ప్రేమను తిరిగి ఇవ్వాలనుకుంటున్నామని ఎల్ అండ్ టి ఛైర్మన్ ఏఎం నాయక్ చెప్పారు. ఒక్కో ఈక్విటీ షేరువిలువు 1500రూపాయల వద్ద సుమారు 6వేల షేర్లు కొనుగోలు చేయనున్నామని వెల్లడించారు. ఈ మేరకు ఎల్ అండ్‌టీ బోర్డు ఆమోదం తెలిపింది. ఎల్ అండ్ టీ షేరు ధర మంగళవారం నాటి ముగింపు రూ.1,322 తోలిస్తే 13శాతం ఎక్కువ.దీంతో ఫ్లాట్‌మార్కెట్‌లో ఈ కౌంటర్ 2 శాతం లాభాలతో కొనసాగుతోంది. -
హై గవర్నెన్స్ ప్రమాణాలను పునరుద్ధరిస్తాం!
న్యూఢిల్లీ: గత కొన్నాళ్లుగా ఇన్ఫోసిస్ బోర్డులో నెలకొన్న వివాదం, సంక్షోభం నేపథ్యంలో ఇన్ఫోసిస్ వ్యవహరాలను చక్క దిద్దే పనిలో పడింది. ఈ మేరకు శుక్రవారం ఇన్ఫోసిస్ సంస్థ అధికారికంగా ఒకప్రకటన జారీ చేసింది. సంస్థలో అత్యున్నత విలువలను కాపాడుతామని హామీ ఇచ్చింది. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణపై వాటాదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. ఫౌండర్స్ మాజీ బోర్డు సభ్యుల మధ్య నెలకొన్న వివాదాలను తొలగించి , లోపించిన గవర్నెన్స్ పునరుద్ధరిస్తామని చెప్పింది. హై గవర్నెన్స్ ప్రమాణాలను పాటించనున్నట్టు తెలిపింది. 200 మిలియన్‌డాలర్ల పనయా ఒప్పందం, మాజీ ఎగ్జిక్యూటివ్ లకుచెలించిన అత్యధిక వేతన ప్యాకేజీల తదితర ఆరోపణలపై ఎన్.ఆర్ నారాయణ మూర్తి నేతృత్వంలోని వ్యవస్థాపకులు ఆరోపణలుతో ఇన్ఫీలోవివాదం రాజుకుంది. చిలికి చిలికి గాలివానలా మారి చివరికి ఆగష్టు 18 న, ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సికా తన పదవి నుంచి తప్పుకున్నారు. ఒక వారం తరువాత ఆగస్టు 24 న ఈ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు మాజీ ఫౌండర్ నందన్ నీలేకని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా రంగంలోకి దిగారు. దీంతో ఛైర్మన్ శేషసాయి, మరో ముగ్గురు డైరెక్టర్లు బోర్డు నుండి వైదొలిగిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ వాటాదారులకు కూడా ఓ కానుక
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ వార్షికోత్సవం సందర్భంగా వాటాదారులకు బోనస్ ఆఫర్ ప్రకటించింది. జియో వినియోగదారులకు జియో ఫోన్ ద్వారా బంపర్ ఆఫర్లతో పాటు వాటాదారులకు కూడా తీపి కబురు అందించారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. శుక్రవారం నాటి వార్షిక సాధారణ సమావేశంలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ బోనస్ షేర్లను షేర్ల హోల్డర్స్‌కు బహుమతిగా ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాటాదారులకు 1: 1 బోనస్ ప్రకటించారు. దీని ప్రకారం ప్రతి షేరుకు అదనంగా ఒక షేర్ బోనస్‌గా లభించనుంది. దీంతో రిలయన్స్ షేరు 3.19 శాతం లాభపడి 1,578 వద్ద కొనసాగుతోంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన ప్రసంగంలో 1977 లో నుంచి రిలయన్స్ షేర్లలో రూ .1,000 పెట్టుబడికి గాను దీని విలువ రూ. 16.5 లక్షలకు చేరుకుందని ప్రకటించారు. రూ .5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కెట్ క్యాప్‌లో భారతదేశంలో అతిపెద్ద కంపెనీగా అవతరించిందని వెల్లడించారు. ముఖ్యంగా ఏజీఎం సందర్భంగా జియో 4 జీ ఫీచర్ ఫోన్ ను ఆవిష్కరించారు. ఉచిత వాయిస్ సేవలతోపాటు నెలకు రూ.153లకు డేటా సేవలను ఉచితంగా అందించనున్నామని తెలిపారు. -
టీసీఎస్ షేర్ల బై బ్యాక్‌కు షేర్‌హోల్డర్ల ఆమోదం
ముంబై: టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) బోర్డు సోమవారం కీలక నిర్ణయం ప్రకటించింది. దేశీయ అతి పెద్ద ఐటీ సర్వీసుల టీసీఎస్ ఇటీవల ప్రకటించిన రూ.16,000 కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్‌కు వాటాదారుల ఆమోదం లభించింది. కంపెనీ షేర్‌హోల్డర్ల ఆమోదం లభించిందనీ టీసీఎస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ బైబ్యాక్‌ను ప్రతింపాదించగా మొత్తం వచ్చిన ఓట్లలో 99.81 శాతం చెల్లుబాటయ్యే ఓట్లు అనుకూలంగా వచ్చినట్టు సమాచారం ఇచ్చింది. మొత్తం 2.85 ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించగా.. ఒక్కో షేర్‌కు రూ. 2850 చొప్పున వెచ్చించి కొనుగోలు చేయనున్నారు. దీంతో రూ. 16 వేల కోట్లతో 5.61 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు ఇప్పుడు టీసీఎస్‌కు అన్ని అనుమతులు లభించాయి. భారత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో షేర్ల బ్యాక్‌ను ప్రకటించిన టీసీఎస్ సుమారు 5.61 కోట్ల షేర్లు లేదా క్యాపిటల్ షేర్లో 2.85 శాతం వాటాను రూ.2,850 చొప్పున తిరిగి కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నస్లీ వాడియాకు టాటా స్టీల్ గుడ్ బై
-
నస్లీ వాడియాకు టాటా స్టీల్ గుడ్ బై
టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా తప్పించిన సైరస్ మిస్త్రీకి మద్దతుగా నిలుస్తున్నారనే నెపంతో ప్రముఖ పారిశ్రామిక వేత్త నస్లీ వాడియాకు టాటా స్టీల్ గుడ్ బై చెప్పింది. బుధవారం జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశంలో స్వతంత్ర డైరెక్టర్‌గా ఆయనకు ఉద్వాసన పలుకుతున్నట్టు టాటా స్టీల్ వెల్లడించింది. నస్లీ వాడియాకు వ్యతిరేకంగా 90 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిసింది. చాలామంది షేర్ హోల్డర్స్ వాడియాను తొలగించడానికే మొగ్గుచూపినట్టు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీకి టాటా స్టీల్ పేర్కొంది. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఓటింగ్‌లో నస్లీ వాడియా పాల్గొన్నలేదు. 37 ఏళ్లుగా నస్లీ వాడియా టాటా స్టీల్ స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్నారు. చైర్మన్‌గా గ్రూప్ కంపెనీల నుంచి బయటికి గెంటివేయబడ్డ సైరస్ మిస్త్రీకి నస్లీ వాడియా మద్దతుగా నిలవడంతో పాటు టాటా గ్రూప్‌పై పలు విమర్శలు సంధించారు. దీంతో ఆగ్రహించిన టాటా సన్స్ , గ్రూపు కంపెనీల నుంచి స్వతంత్ర డైరెక్టర్ నస్లీ వాడియాను సాగనంపే ప్రక్రియను ప్రారంభించింది. స్వతంత్ర డైరెక్టర్ అయిన తనను ఈ సమావేశాల ద్వారా తొలగించే సత్తా టాటా సన్స్‌కు ఉందా? అంటూ ప్రశ్నలను సైతం ఆయన సంధించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం జరిగిన ఈజీఎంలో టాటా స్టీల్ నస్లి వాడియాను కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా తప్పిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్, టాటా కెమెకిల్స్ కూడా ఈ వారంలో వాడియాను డైరెక్టర్‌గా తొలగించేందుకు ఈజీఎంలు నిర్వహించనున్నాయి. అయితే కంపెనీల స్వతంత్ర డైరెక్టర్‌గా తనను తొలగిస్తుండటం వివరణ కోరిన అనంతరం రతన్ టాటా, టాటా సన్స్, కొంతమంది డైరెక్టర్లపై నుస్లీ వాడియా రూ.3000 కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు. దీంతో ఇక ఆయన టాటా గ్రూప్ సంస్థల్లో ఉండటం ఏ మాత్రం మంచిది కాదని టాటా సన్స్ నిర్ణయించింది. తొలగింపుపై నస్లి వాడియా స్పందన: తనకు అప్పగించిన పనుల్లో స్వతంత్ర అభిప్రాయాలు తీసుకుని పనిచేస్తున్నందునే తనపై వేటు వేశారని నుస్లి వాడియా ఆరోపించారు. తన తొలగింపుపై టాటా సన్స్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా ఉన్నాయని వాడియా పేర్కొన్నారు. నానో మూతను జాప్యం చేయడం కంపెనీని మరింత ఆర్థిక నష్టాల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. ఇది కంపెనీ పీవీబీపై మరింత నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుందన్నారు. -
మిస్త్రీకి మరో షాక్!
ముంబై: టాటా గ్రూప్ ఛైర్మన్ గా తొలగించబడిన సైరస్ మిస్త్రీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛైర్మన్ గా తొలగించబడిన తరువాత ఆయన అధికారాలకు, పదవులకు చెక్ పెడుతున్న సంస్థ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టాటా గ్రూపుకు చెందిన టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్ పదవి నుంచి కూడా తొలగించింది. ఈ మేరకు సోమవారం జరిగిన షేర్ హోల్డర్స్ సమావేశంలో నిర్ణయం జరిగింది. టాటా ఇండస్ట్రీస్ అసాధారణ సర్వ సభ్య సమావేశంలో (ఈజీఎం) ఆయన్ను డైరెక్టర్ గా తొలగిస్తూ నిర్ణయం జరింగింది. మిస్త్రీ తొలగింపుకు అనుకూలంగా వాటాదారులు ఓటు వేశారు. ఆయన డైరెక్టర్ గా కొనసాగితే టాటా గ్రూపు మరింత విచ్ఛిన్నమవుతుందని పేర్కొన్న సంస్థ ఆయన్ను తొలగించాల్సిందిగా వాటాదారులకు విజ్ఞప్తి చేసింది. అలాగే రానున్న రోజుల్లో మిస్త్రీ తొలగింపు కోసం మరో ఆరు టాటా గ్రూపులు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందే ఆయన్ను టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్ గా తొలగించారు. తాజాగా డైరెక్టర్ పదవి నించి కూడా తొలగించిన టాటా సంస్థ మిస్త్రీపై మరింత పట్టు సాధించింది. కాగా టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై గ్రూప్ కంపెనీలు కూడా వేటువేస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీల చైర్మన్‌గా బోర్డు సభ్యుడిగా ఆయన్ని తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైరస్ మిస్త్రీ ఇక షేర్‌హోల్డర్స్ మద్దతుపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. -
నాకు సపోర్టు ఇవ్వండి ప్లీజ్ : మిస్త్రీ
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై గ్రూప్ కంపెనీలు కూడా వేటువేస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీల చైర్మన్‌గా బోర్డు సభ్యుడిగా ఆయన్ని పీకేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైరస్ మిస్త్రీ ఇక షేర్‌హోల్డర్స్ మద్దతుపై దృష్టిసారించారు. టాటా పవర్ బోర్డు నుంచి తనను పీకేయకుండా ఉండేందుకు వారి మద్దతును కోరారు. బోర్డు నుంచి తనను వైదొలగించే ప్రతిపాదనను వ్యతిరేకించాలని అభ్యర్థిస్తూ ఆయన షేర్హోల్డర్స్కు ఓ లేఖ రాశారు. తన కాలంలో టాటా పవర్, పోటీదారులకంటే మెరుగైన ప్రదర్శనను కనబరిచిందని మిస్త్రీ ఆ లేఖలో పేర్కొన్నారు. గత మూడేళ్లలో ఈబీఐటీడీఏలు మెరుగుపడ్డాయని, దేశీయ పవర్ సెక్టార్లో కంపెనీకి పునఃరేటింగ్ కల్పించానని చెప్పారు. 2006లో మిస్త్రీ సన్స్ బోర్డులో చేరారు. తర్వాత 2012 డిసెంబర్లో బోర్డు చైర్మన్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన టాటా పవర్ చైర్మన్‌గా ఉన్నారు. కాగ, సైరస్ మిస్త్రీని బోర్డు నుంచి తొలగించడానికి టాటా పవర్ కంపెనీ 2016 డిసెంబర్ 26న అసాధారణ జనరల్ మీటింగ్ నిర్వహిస్తోంది. ఈ భేటీలో సైరస్ మిస్త్రీని బోర్డు నుంచి వైదొలగించే ప్రతిపాదనను తీసుకొస్తోంది. -
అదంతా కొడుకు మహిమేనట...
-
అదంతా కొడుకు మహిమేనట...
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ క్యాపిటల్ అధిపతి అనిల్ అంబానీ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. వాటాదారుల వార్షిక సాధారణ సమావేశంలో తన కుమారుడు, బోర్డ్ లో కొత్త డైరెక్టర్ అన్మోల్ అంబానీ (24) పరిచయం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రాక కంపెనీకి "అద్భుతమైన అదృష్టం" తెచ్చిపెట్టిందని అనిల్ పొంగిపోయారు. అన్మోల్ నియామకం తరువాత షేర్ ధర 40 శాతం పెరిగిందనీ, భవిష్యత్తులో కూడా ఆ ప్రభావం కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన వాటాదారుల సమావేశంలో ఫుల్ టైం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అన్మోల్ నియామకానికి ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అన్మోల్ యొక్క నియామకానికి ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చెప్పిన వాటాదారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ జనాభాలో 30 సంవత్సరాల సగటు వయస్సు గా ఉంటే, తమ రిలయన్స్ క్యాపిటల్ ఉద్యోగుల సగటు వయస్సు 34 సంవత్సరాలని అనిల్ పేర్కొన్నారు. అన్మోల్ రాక సంస్థకు అదృష్టం తెచ్చిపెట్టిందనీ, మెరుగైన పనితీరు, టీమ్ వర్క్ ఆధారంగా సంస్థ అభివృద్ధిలో 'అన్మోల్ ప్రభావం' ఇక ముందు కూడా కొనసాగుతుందని విశ్వసిస్తున్నానని చైర్మన్ చెప్పారు. కాగా లండన్ వార్విక్ బిజినెస్ స్కూల్ నుండి డిగ్రీ పొందిన అన్మోల్, రిలయన్స్ కాపిటల్ మండలిలో పూర్తి కాలపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియామకమైన సంగతి తెలిసిందే. సుమారు రూ .4,000 కోట్ల ఆదాయంతో, రిలయన్స్ క్యాపిటల్ జీవిత భీమా, వాణిజ్య ఆర్ధిక, సెక్యూరిటీలు, సాధారణ ఫైనాన్స్ , మ్యూచువల్ ఫండ్స్ సేవలను అందిస్తోంది. కాగా అన్మోల్ నియామకానికి ముందు రూ.467 గా వున్న షేర్ ధర రూ.575 వద్ద ట్రేడవుతోంది. గత నెలలో సంభవించిన షార్ప్ ర్యాలీ ద్వారా గత ఏడాదిగా దాదాపు 70 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2014నుంచి సంస్థకు సేవలందిస్తున్న అన్మోల్ .. రిలయన్స్ క్యాపిటల్ బోర్డులో ఛైర్మన్ అనిల్ అంబానీ తర్వాత ఆయన పెద్ద కుమారుడుగా ఏకైక ఇతర కుటుంబ సభ్యుడు కావడం విశేషం. -
వేదాంత, కెయిర్న్ మెర్జర్ కు షేర్ హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్
ప్రముఖ మైనింగ్ సంస్థ వేదాంత లిమిటెడ్..కెయిర్న్ ఇండియా విలీనానికి షేర్ హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విలీన ప్రతిపాదనకు మదుపర్లు, సెక్యూర్డు, అన్సెక్యూర్డ్ రుణదాతలు అంగీకారం తెలిపారు. ఈ విషయాన్నివేదాంత రెగ్యులేటరీ ఫైలింగ్‌లో శుక్రవారం తెలిపింది. గోవాలో గురువారం జరిగిన ప్రతిపాదన ఓటింగ్‌కు వేదాంత లిమిటెడ్ మదుపర్లు అనుమతినిచ్చారని తెలిపింది. ఈ మెర్జర్ ద్వారా దేశంలో అతిపెద్ద విభిన్నమైన సహజ వనరులను సంస్థగా అవతరించాలనేది అగర్వాల్ ప్రణాళిక. సవరించిన ఆఫర్ ప్రకారం10 రూపాయల ముఖ విలువ గల షేర్ కు నాలుగు ప్రిఫరెన్షియల్ షేర్లను మైనారిటీ వాటాదారులకు అందించనుంది. అయితే వేదాంత అసలు పరీక్షను సెప్టెంబర్ 12న ఎదుర్కోనుంది. విలీన ఒప్పందంపై స్టేక్ హోల్డర్ల అభిప్రాయం తెలుసుకునేందుకు కెయిర్న్ ఇండియా ఆరోజునే సమావేశం నిర్వహించనుంది. అక్కడ అంగీకారం లభిస్తేనే ప్రక్రియ ముందుకు సాగుతుంది. కోటీశ్వరుడు అనిల్ అగర్వాల్ నేతృత్వంలో ముందుకు సాగుతున్న ఈ వ్యవహారంలో ఇటీవల వేదాంత రిసోర్సెస్, వేదాంత లిమిటెడ్ మాతృ సంస్థ యొక్క వాటాదారులు మెర్జర్ ను అనుమతించిన విషయం తెలిసిందే. -
మ్యాజిక్ రిపీట్ చేసిన విశాల్..
ముంబై: ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సీఈవో విశాల్ సిక్కా తన మ్యాజిక్ ను కంటిన్యూ చేశారు. పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ వరుస లాభాలతో సంస్థను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదల చేసిన 2016 త్రైమాసికంలో రూ 3,597 కోట్లు లాభంతో మరోసారి తన సత్తాను చాటుకున్నారు. దీంతోపాటుగా భారీ డివిడెండును ప్రకటించి ఇన్వెస్టర్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. 2016 ఆర్థిక సంవత్సరానికి గాను ఈక్విటీ షేరుకు రూ 14.25 ఫైనల్ డివిడెండ్ ను , రూ .5 ముఖ విలువ గల షేరుకుగాను షేర్ హోల్డర్స్ కు 285 శాతం తుది డివిడెండ్ చెల్లించనుంది. జూన్ 20 తేదీకల్లా దీన్ని చెల్లించనున్నారు. దీనికి ముందు, గత ఏడాది అక్టోబర్ లో రూ .10 మధ్యంతర డివిడెండ్ ను ఇచ్చింది. ఈ తాజా ఫలితాల నేపథ్యంలో ఈ షేర్ కు భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. -
అరబిందో నిధుల సేకరణకు ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అరబిందో ఫార్మా రూ. 3,970 కోట్ల (60 కోట్ల డాలర్లు) నిధుల సేకరణకు వాటాదారుల నుంచి అనుమతి లభించింది. గత నెలలో జరిగిన బోర్డు సమావేశంలో వివిధ మార్గాల్లో 60 కోట్ల డాలర్లు సేకరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఎసిడిటీ నివారణకు వినియోగించే ఫామోటిడిన్ ట్యాబ్లెట్లను అమెరికాలో విక్రయించడానికి అరబిందో ఫార్మాకి యూఎస్ఎఫ్డీఏ తుది అనుమతులను జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు అరబిందో ఫార్మాకి 226 ఏఎన్‌డీఏ అనుమతులు లభించాయి. -
మీ నెట్‌వర్త్ ఎంత?
♦ ఫైనాన్షియల్ బేసిక్స్ మొత్తం ఆస్తుల విలువలో నుంచి అన్ని రకాల రుణాల విలువను తీసివేస్తే వచ్చే విలువే నెట్‌వర్త్. వ్యక్తులకైనా, సంస్థలకైనా నెట్‌వర్త్‌ను బట్టే ఆ వ్యక్తి లేదా సంస్థకు నికరంగా వున్న ఆస్తి విలువ తెలిసేది. సంస్థలకు సంబంధించి ఈ నెట్వర్త్నే పుస్తక విలువ లేదా షేర్‌హోల్డర్ల మూలధనంగా పరిగణిస్తారు. నెట్‌వర్త్ విలువ మీ ఆర్థిక నిర్వహణ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే నెట్‌వర్త్ విలువ పెరుగుతూ పోతే అతని ఆర్థిక సామర్థ్యం బాగా ఉన్నట్లు లెక్క. అదే తగ్గుతూ వస్తే.. అతనికి ఆర్థిక లావాదేవీల నిర్వహణపై సరైన నియంత్రణ లేదని అర్థం. అదే ఒక కంపెనీ నెట్‌వర్త్ విలువ (బుక్ వ్యాల్యూ) పెరుగుతూ ఉంటే.. అది మంచి పనితీరును కనబరుస్తోందని తెలుసుకోవాలి. నెట్ వర్త్ విలువ బాగా ఉన్న వ్యక్తికి/కంపెనీకి క్రెడిట్ రేటింగ్ కూడా బాగా ఉంటుంది. నెట్‌వర్త్ అనేది వ్యక్తి/కంపెనీ నిధుల సమీకరణపై ప్రభావాన్ని చూపిస్తుంది. నెట్‌వర్త్‌ను లెక్కించడం ఎలా? నెట్‌వర్త్ విలువ ఎంతో తెలుసుకోవాలంటే ముందుగా మీరు ఇళ్లు, కారు, బైక్, ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ వంటి అన్ని ఆస్తుల వివరాలతో ఒక జాబితా తయారుచేసుకోవాలి. తర్వాత మీకు ఉన్న బ్యాంకు రుణాలు, ఇతర అప్పుల వివరాలతో మరొక జాబితా రూపొందించుకోండి. ఇప్పుడు ఆస్తుల విలువ లో నుంచి రుణ మొత్తాలను తీసివేస్తే మీ నెట్‌వర్త్ విలువ వస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.20,00,000 ఖరీదైన ఇంటిని కలిగి ఉన్నాడు. అలాగే అతనికి రూ.5,00,000 విలువైన పెట్టుబడులు ఉన్నాయి. రూ.4,00,000 విలువైన వాహనం ఉంది. ఇవన్నీ అతని ఆస్తులు. అతను ఇంకా చెల్లించాల్సిన ఇంటి రుణం రూ.10,00,000 వరకూ వుంది. అలాగే అతనికి కారు రుణం రూ.2,00,000 ఉంది. ఇవన్నీ అతని రుణాలు. ఇప్పుడు అతని నెట్‌వర్త్ విలువ (మొత్తం ఆస్తుల విలువ-అన్ని రుణాలు) రూ.17,00,000గా ఉంటుంది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత అతను నివాసం ఉంటున్న ఇంటి విలువ రూ.22,00,000కు పెరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ రూ.6,00,000గా, సేవింగ్స్ రూ.1,00,000గా వున్నాయి. వాహనం విలువ రూ.3,00,000కు తగ్గింది. కారు రుణం చెల్లించివేశాడు. ఇంటి రుణం రూ.6,00,000గా ఉంది. దాంతో అతని నెట్‌వర్త్ రూ.26,00,000గా ఉంటుంది. అంటే అతని నెట్‌వర్త్ ఐదేళ్లలో రూ.9,00,000 మేర పెరిగిందన్న మాట. -
సుజుకీతో ఒప్పందానికి మారుతీ బోర్డు ఆమోదం
న్యూఢిల్లీ: గుజరాత్లో ఏర్పాటు చేయబోతున్న ప్లాంట్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 30 ఏళ్ల దాకా వాహనాల తయారీకి సంబంధించి సుజుకీ మోటార్ గుజరాత్(ఎస్ఎంజీ)తో ఒప్పందం కుదుర్చుకునే ప్రతిపాదనను మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) బోర్డు ఆమోదించింది. దీనికి నియంత్రణ సంస్థలు, మైనారిటీ షేర్‌హోల్డర్ల ఆమోదం లభించాల్సి ఉంటుంది. పలు మార్పులకు లోనైన తర్వాత రూపుదిద్దుకున్న ఈ కొత్త ఒప్పందం ప్రకారం ఎస్ఎంజీ.. లాభనష్టాలు లేని ప్రాతిపదికన వాహనాలను తయారు చేసి, ఎంఎస్ఐకి అందిస్తుంది. -
అనుబంధ కంపెనీల్లో ల్యాంకో పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అనుబంధ కంపెనీల మూలధన అవసరాల కోసం ల్యాంకో ఇన్ఫ్రాటెక్ రూ.6,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. సెక్యూరిటీస్ రూపంలో రూ.6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వాటాదారుల అనుమతి కోరనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ నెలలలో జరిగే వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించాల్సి ఉంది. మార్చి 31, 2015 నాటికి ఈ అనుబంధ కంపెనీల్లో రూ.10,959 కోట్లు సెక్యూరిటీస్ రూపంలో ఇన్వెస్ట్ చేసింది. -
దివీస్ బోనస్ ఇష్యూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని దివీస్ ల్యాబ్ నిర్ణయించింది. శనివారం సమావేశమైన బోర్డు తొలి త్రైమాసిక ఫలితాలను ఆమోదించడంతోపాటు, బోనస్ ఇష్యూను ప్రతిపాదించింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ. 809 కోట్ల ఆదాయంపై రూ. 243 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 45 శాతం వృద్ధి నమోదయ్యింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 640 కోట్ల ఆదాయంపై రూ. 168 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. -
ఫ్లిప్‌కార్ట్‌లోకి మరో 70 కోట్ల డాలర్లు
బెంగళూరు: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పలు సంస్థల నుంచి తాజాగా మరో 70 కోట్ల డాలర్లను (సుమారు రూ. 4,200 కోట్లు) సమీకరించింది. తాజా నిధుల సమీకరణతో షేర్‌హోల్డర్ల సంఖ్య నిర్దేశిత 50కి మించడంతో ఫ్లిప్‌కార్ట్ .. సింగపూర్‌లో పబ్లిక్ కంపెనీగా నమోదు చేసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అక్కడి కంపెనీల నియంత్రణ సంస్థ ఏసీఆర్ఏకి దరఖాస్తు చేసుకుంది. అయితే, వీటిని పబ్లిక్ ఇష్యూ సన్నాహాలుగా భావించరాదని ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం సమీకరించిన నిధులను భారత్‌లో దీర్ఘకాలిక వ్యూహాత్మక పెట్టుబడుల కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది. -
మిస్త్రీని నిలదీసిన వాటాదారులు
ముంబై: టాటా స్టీల్ చైర్మన్ సైరస్ మిస్త్రీకి తొలిసారి ఆ సంస్థ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వాటాదారుల నుంచి కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. టాప్ మేనేజ్మెంట్లో జీతాలు పెరుగుతున్నప్పటికీ వాటాదారులకు చెల్లించే డివిడెండ్ తగ్గడంపై నిరసన వ్యక్తమైంది. 2007-08లో షేరుకి రూ. 16 డివిడెండ్‌ను చెల్లించగా, ప్రస్తుతం రూ. 8కి పడిపోవడంపై ఒక వాటాదారుడు సైరస్ను నిలదీశాడు. అయితే ప్రపంచస్థాయిలో స్టీల్‌కు డిమాండ్ పడిపోయిందని, దీంతో కంపెనీ లాభాలు సైతం భారీగా క్షీణించాయని సైరస్ వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో కంపెనీ విస్తరణ బాటలో ఉన్నందువల్ల కొంత డివిడెండ్‌ను తగ్గించాల్సి వచ్చిందని వివరించారు.