న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో చేసుకున్న ఒప్పందానికి వాటాదారుల ఆమోదాన్ని ఫ్యూచర్ గ్రూపు సంస్థలు కోరనున్నాయి. ఈ మేరకు నవంబర్ 10, 11 తేదీల్లో వాటాదారులు, రుణదాతల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా ఫ్యూచర్ గ్రూపు కంపెనీలు తమ వాటాదారులకు సమాచారం ఇచ్చాయి. వీడియో కాన్ఫరెన్స్/ఆడియో, వీడియో విధానంలో ఈ సమావేశాలను నిర్వహించనున్నట్టు తెలిపాయి. అదే విధంగా ఉన్నచోట నుంచే ఈఓటు వేసే ఏర్పాటు కూడా చేసినట్టు పేర్కొన్నాయి. ఫ్యూచర్ గ్రూపు కంపెనీలన్నింటినీ ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో విలీనం చేసి.. తదుపరి ఫ్యూచర్ రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గుంపగుత్తగా విక్రయించాలన్నది ఫ్యూచర్ గ్రూపు ప్రణాళిక. ఇందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.24,713 కోట్లు చెల్లించనుంది. ఈ మొత్తం ఫ్యూచర్ గ్రూపు రుణదాతలకు దక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment