meetings
-
తిరిగి ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎర్రవల్లి నివాసానికి పరిమితమైన బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలో ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టేలా కార్యాచరణకు పదును పెడుతున్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా రాష్ట్రంలో పర్యటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే కొందరు పార్టీ ముఖ్యనేతలతో చర్చించి ప్రజల్లోకి వెళ్లాల్సిన తీరుపై ప్రాథమికంగా ఓ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇదే అంశంపై మరోమారు పార్టీ నేతలతో మరింత లోతుగా చర్చించి ఒకట్రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టేందుకు కేసీఆర్ ప్రత్యక్షంగా జనంలోకి వెళ్లాలని పార్టీ నేతలు సూచిస్తున్నట్లు తెలిసింది.రుణమాఫీ, రైతు బంధు వైఫల్యంపై..రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీరు, విద్యుత్ కష్టాలతోపాటు రుణమాఫీ జరగకపోవడం, రైతుబంధు ఇవ్వకపోవడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతు సంక్షేమం కేంద్రంగా అమలు చేసిన కార్యక్రమాలను వివరించడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు.రుణమాఫీ, రైతు భరోసా అంటూ ఎన్నికల హామీలను ఉల్లంఘిస్తున్న వైనాన్ని కేసీఆర్ ఎండగట్టనున్నారు. దీని కోసం లోక్‌సభ ఎన్నికల ప్రచారం తరహాలో బస్సు యాత్ర పెట్టాలా లేక భారీ సభలు నిర్వహించాలా అనే కోణంలో పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ కేడర్, రైతులతో సభలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ కసరత్తు జరుగుతోంది. అమెరికా పర్యటనకు కేటీఆర్బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బుధవారం రాత్రి అమెరికా పర్యటనకు వెళ్లారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి సోదరి కవితతోపాటు హైదరాబాద్‌కు చేరుకున్న కేటీఆర్ కొద్ది గంటల వ్యవధిలోనే అమెరికాకు వెళ్లారు. తన కుమారుడు హిమాన్షుకు సంబంధించిన విద్యాపరమైన విషయాల కోసం కేటీఆర్ అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. సెప్టెంబర్ రెండో వారంలో కేటీఆర్ తిరిగి హైదరాబాద్‌కు వస్తారని సమాచారం. ఇదిలాఉంటే ‘తండ్రి బాధ్యతల్లో అమెరికాకు వెళ్తున్నా’ అనే అర్థం వచ్చేలా కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్‌పెట్టారు. ఆడబిడ్డకు ఆత్మీయ స్వాగతం ఎర్రవల్లిలోని ఫామ్హస్కి చేరుకున్న కవిత ఆప్యాయంగా హత్తుకున్న కేసీఆర్ మర్కూక్/గజ్వేల్/సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఫామ్హúస్లో ఆత్మీయ స్వాగతం లభించింది. మూడు రోజుల క్రితం బెయిల్‌పై విడుదలై హైదరాబాద్‌కు చేరుకున్న కవిత గురువారం బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి భర్త అనిల్ కుమార్, కుమారుడితో కలిసి ఎర్రవల్లికి వెళ్లారు. ఎర్రవల్లిలోని నివాసానికి చేరుకున్న కవితను ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆప్యాయంగా హత్తుకున్నారు.కేసీఆర్ పాదాలకు నమస్కరించి తండ్రి చేతిని కవిత ఆప్యాయంగా ముద్దాడారు. కేసీఆర్ పాదాలకు కవిత నమస్కరిస్తున్న సమయంలో ఎర్రవల్లి నివాసంలో ఉది్వగ్న వాతావరణం కనిపించింది. పలువురు మహిళలు కవితకు దిష్టితీసి మంగళహారతులతో స్వాగతం పలికారు. అప్పటికే ఫామ్‌హౌస్‌లో ఉన్న ఎంపీ జోగినపల్లి సంతోష్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, మాజీ టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కూడా కవితకు స్వాగతం పలికారు. కవిత రెండు గంటలకుపైగా ఫామ్‌హౌస్‌లో గడిపి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. -
హరీశ్‌రావు.. నాపై పోటీ చేయి: మైనంపల్లి సవాల్
సాక్షి,సిద్దిపేటజిల్లా: సిద్దిపేట పట్టణంలో మంగళవారం(ఆగస్టు20) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటాపోటీ ర్యాలీలతో పట్టణంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పట్టణంలో మంగళవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ ర్యాలీలకు పిలుపునివ్వడంతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకుంటూ తరలి వెళుతున్నారు. దీంతో వీరిరువురి మధ్య ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది.‘మేం ధ్వజం ఎత్తాలనుకుంటోంది బీఆర్ఎస్పైన.. హరీష్ రావుపైనో ప్రజలపైనో కాదు. ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ నేతలు గూండాల్లా వ్యవహరిస్తున్నారు. మేం ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకున్నాం.వారు రేపు కూడా రైతు రుణమాఫీ ర్యాలీ చేసుకోవచ్చు. కానీ, మా ర్యాలీ అడ్డుకునేందుకే పోటాపోటీ ర్యాలీ పెట్టి ఉద్రిక్తతలు పుట్టిస్తున్నారు. వాళ్ల అంతు చూసేదాకా వదలబోం. రుణమాఫీ చేసినందున హరీశ్‌రావు మళ్లీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఇద్దరం మళ్లీ పోటీ చేద్దాం. హరీశ్ మళ్లీ గెలిస్తే నేను రాజకీయాల్లో నుంచి వెళ్లిపోతా’అని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు సవాల్ విసిరారు. అయితే రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ర్యాలీకి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు చెబుతున్నారు. రుణమాఫీపై బీఆర్ఎస్ ర్యాలీకి అనుమతి లేదని తెలిపారు. తాము కూడా ర్యాలీ చేసి తీరుతామని బీఆర్ఎస్ శ్రేణులు తెగేసి చెబుతున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. -
సేంద్రియ సేద్యంపై 21 రోజుల ఉచిత శిక్షణా శిబిరం..
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో ఇమిడి ఉండే అన్ని అంశాలతో పాటు పిజిఎస్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ విషయాలపై పూర్తిస్థాయి శిక్షణ పొందాలనుకునే తెలుగు వారికి ఇదొక గొప్ప అవకాశం. సేంద్రియ/ప్రకృతి సేద్యంలో అన్ని విషయాలతో పాటు పిజిఎస్ సర్టిఫికేషన్‌పై లోతైన అవగాహన కల్పించేందుకు 21 రోజుల పాటు తెలుగులో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణా శిబిరం జరగనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్/నేచురల్ ఫార్మింగ్ (ఎన్సిఓఎన్ఎఫ్) తోడ్పాటుతో సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ), కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ (కెఎస్ఎ) సెప్టెంబర్ 5 నుంచి ఉమ్మడిగా ఈ శిబిరాన్ని నిర్వహించనున్నాయి. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, సిఎస్ఎ, కెఎస్ఎల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం జరగనుండటం విశేషం.విజయవాడకు 50 కిమీ దూరంలో ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సమీపంలో శ్రీపద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ నెలకొల్పిన కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ ఆవరణలో ఈ శిబిరం జరగనుంది. 38 ఎకరాలలో అత్యాధునిక సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేస్తూ ఆచణాత్మక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటైన కెఎస్ఎకు సుస్థిర వ్యవసాయ కేంద్రం నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఈ 21 రోజుల శిబిరంలో బోధన పూర్తిగా తెలుగులో ఉంటుంది. శిక్షణ, భోజన వసతులు ఉచితం. అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. 30 మందికి అవకాశం.సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలోను, సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపారంలోను స్థానికంగా కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి, నిబద్ధత కలిగిన వారికి సంపూర్ణ అవగాహన కలిగించేందుకే ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు డా. రామాంజనేయులు వివరించారు. స్థానిక స్వయం సహాయక బృందాలు/ ఎఫ్పిఓలు / ఐసిఎస్/ ఆత్మ, పికెవివై, నామని గంగే లేదా ఏదైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సేంద్రియ వ్యవసాయ పథకాలలో నమోదైన వారికి ్రపాధాన్యం ఉంటుందన్నారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. గూగుల్ ఫామ్‌లో వివరాలు పొందుపరచటం ద్వారా ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 85002 83300. జుట్చఃఓటజీటజిn్చ uఛీజ్చిఅఛ్చిఛ్ఛీఝy.ౌటజముచ్చింతల్లో ‘సిరిధాన్యాలతో జీవన సిరి’ శిబిరం..రైతునేస్తం ఫౌండేషన్, స్వర్ణభారత్ ట్రస్ట్ సహకారంతో.. కర్షక సేవా కేంద్రం నిర్వహణలో హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో సిరిధాన్యాలతో జీవన సిరి అనే అంశంపై ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్‌వలి, డా. సరళా ఖాదర్లచే ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. 3 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇతర వివరాలకు.. 97053 83666, 70939 73999. -
త్వరలో కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాలు
సాక్షి, విశాఖపట్నం: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 8న ఘనంగా నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. గురువారం ఎండాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, డిప్యూటీ రీజనల్ కో–ఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డి, నగర మేయర్ హరి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, సమన్వయకర్త కె.కె.రాజు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం అమర్నాథ్, వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని, ప్రతి వార్డులో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను సమీక్షిస్తున్నామని, వచ్చే వారం నుంచి పార్టీ నాయకులు, శ్రేణుల మనోభావాలు తెలుసుకుంటారని చెప్పారు. త్వరలోనే పార్టీ జిల్లా, నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు కూడా నిర్వహిస్తామన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల అయిందని, మరో 4 నెలలు పాలనా విధానాన్ని పరిశీలించి ఆ తర్వాత మాట్లాడతామని చెప్పారు. తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తామని, తిరిగి వారి అభిమానాన్ని సంపాదిస్తామని అన్నారు. ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని, దానికి అనుగుణంగా పార్టీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తల ఆలోచనలు, సమస్యలను తెలుసుకొని, పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి మనోభావాలకు అనుగుణంగానే పని చేస్తామన్నారు. 2019కి ముందు జగన్మోహన్రెడ్డి చెప్పిన ప్రతి అంశాన్ని మళ్లీ అమలు చేస్తామని తెలిపారు. -
ఫించన్ ఎత్తేశారు!
రాకముందే అవ్వాతాతలకు అవస్థలు 14 ఏళ్లు అధికారంలో ఉండీ ఏ పేదవాడికీ, ఏమీ చేయని చంద్రబాబు ఈనాడులో ఇచి్చన ప్రకటన చూశారా? సూపర్ సిక్స్‌లో అవ్వాతాతల పెన్షన్‌ను అప్పుడే ఎత్తేశారు. సూపర్ సిక్స్‌లో అవ్వాతాతల పెన్షన్ మీకు ఎక్కడైనా కనిపించిందా? చంద్రబాబు రాకమునుపే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనకా వాననకా తిరగాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇక పొరపాటున చంద్రబాబు పాలన వస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ ఇది జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు, సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘ఈ ఎన్నికల యుద్ధంలో చంద్రబాబు తన బాణాన్ని నేరుగా పేద సామాజికవర్గాల మీద, నా అవ్వాతాతల మీద, వారి పెన్షన్ల మీద గురి పెట్టాడు. ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతున్న రాజకీయాలు, చేస్తున్న అన్యాయాన్ని మీరంతా చూస్తున్నారు. అయ్యా చంద్ర బాబూ...! 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చి న పెన్షన్ ఎంత? కేవలం వెయ్యి రూపాయలు కాదా? ఆ పెన్షన్‌ను రూ.3 వేలు చేసింది ఎవరు? ఆ అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికే పంపుతున్నది ఎవరు? చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో అవ్వాతాతల పెన్షన్‌ను అప్పుడే ఎత్తేశారు’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పల్నాడు జిల్లాపెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు, సాయంత్రం ప్రకాశం జిల్లా కనిగిరిలోని పామూరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. సాధ్యం కాని హామీలతో వల.. మరో 10 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఈ ఎన్నికలు కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి కావు. ఐదేళ్ల మీ భవిష్యత్తు, ఇంటింటికీ పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. మీ జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్లీ మోసపోవడమే! చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే. సాధ్యం కాని హామీలతో వల వేస్తున్నాడు. వదల బొమ్మాళీ వదలా.. అంటూ పసుపు పతి మళ్లీ నిద్రలేచి వస్తాడు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముఖి మీ ఇంటి తలుపుతట్టి లకలకా అంటూ ఐదేళ్లు రక్తం తాగేందుకు వస్తుంది. మరోసారి మోసగించేందుకే చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇస్తున్నాడు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే ఆ పెద్దమనిషి పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకొస్తుందా? నాడు అవస్థలతో 39 లక్షలు.. నేడు ఠంఛన్‌గా 66 లక్షలు ఓ అవ్వాతాతా.. చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా? ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకూ ఇచ్చింది కేవలం 39 లక్షలు. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ అరకొరగా తీసుకున్న దుస్థితి. మీ బిడ్డ జగన్ హయాంలో ఏకంగా 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా రూ.3వేలు చొప్పున పెన్షన్ నేరుగా మీ ఇంటికే అందిస్తున్నాడు. ఆ పాపిష్టి కళ్లు పడనంతవరకూ.. చంద్రబాబు పాపిష్టి కళ్లు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకూ ఇంటికే పెన్షన్ సజావుగా అందేది. సూర్యోదయానికి ముందే, ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతల ఇంటికే మనవళ్లు, మనవరాళ్ల రూపంలో వలంటీర్లు వచ్చి చిరునవ్వుతో పింఛను అందించి మంచి చేసిన కాలం మనదే. ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్లు పడ్డాయో.. తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి వలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వకూడదంటూ ఉత్తర్వులు ఇప్పించాడు. చంద్రబాబు పాపిష్టి చేష్టలు అంతటితో ఆగలేదు. ఇంకా కడుపుమంట చల్లారక ఏం చేశాడో తెలుసా? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేటట్టుగా వాళ్ల పెన్షన్ బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు. దీంతో ఎన్నికల కమిషన్ అక్కడ నుంచి ఆదేశాలు ఇచ్చింది. అవ్వాతాతలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇంత ఎండలో క్యూలలో నిలబడలేక చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటే ఆ దౌర్భాగ్యపు పని చేసిన చంద్రబాబు ఆ నెపాన్ని మీ బిడ్డపై వేస్తున్నాడు. చంద్రబాబు, దుష్ట చతుష్టయం, ఎల్లోమీడియా వీళ్లంతా కలిసి ఆ నెపాన్ని మీ బిడ్డ మీద వేస్తున్నారు. ఆ ఈనాడు కథనాలు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 చూస్తే.. వీళ్లంతా మనుషులేనా? అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పాలనను 14ఏళ్లు మీరంతా చూశారు. మీ బిడ్డ 59 నెలల పాలన కూడా చూశారు. పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వచ్చిన పరిస్థితులు చూశారు. చంద్రబాబు ఏ ఒక్క రోజూ అవ్వాతాతల మీద ప్రేమ చూపించలేదు. పెన్షన్ ఇంటికి పంపిన పరిస్థితి అంతకంటే లేదు. మీ కోసమే నా తొలి సంతకం.. నేను ఇవాళ ప్రతి అవ్వకూ, తాతకూ చెబుతున్నా. అవ్వాతాతా..! ఒక్క నెల ఓపిక పట్టండి. జూన్ 4వ తేదీ దాకా ఓపిక పట్టండి. మీ బిడ్డ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. నా మొట్ట మొదటి సంతకం మీకోసం పెడతా అని అవ్వాతాతలకు మాటిస్తున్నా. మీ మనవళ్లు, మనవరాళ్లుగా వలంటీర్లు సూర్యోదయానికి ముందే ఇంటికే వచ్చి చిరునవ్వుతో పెన్షన్లు అందించే పరిస్థితులు మీ బిడ్డ మళ్లీ తెస్తాడు. విద్యా విప్లవం.. మహిళా సాధికారత గతంలో ఎప్పుడూ జరగని విధంగా గవర్నమెంట్ బడిలో చదివే పిల్లలకు స్కూళ్లు తెరిచే సమయానికే విద్యాకానుక, ఇంగ్లిష్ మీడియం, బైజూస్ కంటెంట్, మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లను అందుబాటులోకి తెచ్చాం. నాడు–నేడుతో కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దాం. ఇంగ్లిష్ మీడియంతో వేసిన అడుగులు నుంచి సీబీఎస్ఈ, ఐబీ దాకా మన ప్రయాణం కొనసాగుతోంది. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి. తొలిసారిగా 6వ తరగతి నుంచే క్లాస్రూమ్ లలో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన పేద పిల్లలకు అందుబాటులోకి వచ్చింది. పిల్లలు ఇబ్బంది పడకుండా బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ సమకూర్చాం. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత చదువులు అభ్యసిస్తున్న 93శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెనతోపాటు వసతి దీవెన కూడా అందిస్తున్నాం. తొలిసారిగా అంతర్జాతీయ వర్సిటీలు అందించే ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులను మన కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చాం.పిల్లలను బడికి పంపిస్తే చాలు చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తున్నాం. అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ సున్నావడ్డీ, ఆసరా ఇస్తున్నాం. ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరిటే రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు 22 లక్షల ఇళ్లు కూడా కడుతున్నాం. గ్రామాల్లోనే మహిళా పోలీసు, దిశ యాప్, రాజకీయ సాధికారత కోసం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే. లంచాలు లేని సమాజం గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా 600 రకాల సేవలు మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. ప్రతి 60–70 ఇళ్లకు వలంటీర్ వ్యవస్థ, లంచాలు లేకుండా ఇంటికే పెన్షన్, పౌర సేవలు, పథకాలు.. ఇవన్నీ జరుగుతోంది ఈ 59 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రి కాకముందు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా నేరుగా మీ చేతికే అందుతాయని ఎవరైనా చెబితే నమ్మేవారా? మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా జమ చేశాడు. నాకు ఓటు వేయని వారినీ కోరుతున్నా.. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్ వార్. పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా మీ ఓటు ఎంత కీలకమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా ఒక్కటే కోరుతున్నా. మీ ఇంటికి వెళ్లి అవ్వాతాతలు, భార్యాపిల్లలతో కూర్చుని మాట్లాడండి. ఎవరి హయాంలో, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందో ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఇంటికే పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ పెన్షన్‌లో పెరుగుదల కూడా కనిపిస్తుంది. మళ్లీ మీ జగన్ అధికారంలో ఉంటేనే పెంచిన అమ్మ ఒడి నా అక్కచెల్లెమ్మలకు అందుతుంది. ఆ మోసాలు మీరంతా చూశారు.. మీ బిడ్డను నమ్మి మీరంతా అధికారం ఇచ్చినందువల్ల దేవుడి దయతో ఐదేళ్లలో ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తేగలిగాం. ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తూ 99శాతం హామీలను అమలు చేశాం. 2014లో ఒకసారి చంద్రబాబును నమ్మారు! ఆ కూటమిని నమ్మి ఓటు వేశారు! చంద్రబాబు మేనిఫెస్టో మాయలు, మోసాలు ఎలా ఉంటాయో మీరంతా చూశారు. ఈ 59 నెలల్లో మీ జగన్ పాలన చూస్తున్నారు. మీ బిడ్డ చెప్పిన దానికన్నా నాలుగు అడుగులు ముందుకు వేశాడు. కొత్త మోసాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న వారికి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని మనుషులకు తగిన గుణపాఠం చెప్పమని కోరుతున్నా. మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్సింకులోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, ఆసుపత్రులు, వ్యవసాయం బాగుండాలన్నా రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గకుండా గెలిపించాలి. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? మన అభ్యర్థులను ఆశీర్వదించండివైఎస్సార్సీపీ నరసాపురం, పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థులు ముదునూరి ప్రసాదరాజు, గుడాల గోపి, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకరరావు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి.అనిల్ కుమార్ యాదవ్, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా. గతంలో ఇవి ఉన్నాయా?» పిల్లలకు విద్యాకానుక, వారి చేతుల్లో ట్యాబ్‌లు గతంలో ఎప్పుడైనా చూశారా? » రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టికాహారంతో గోరుముద్ద చూశారా? » తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన, ఓ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, ఇంటివద్దే అందించిన పౌర సేవలు, పథకాలను చూశారా? » ఇంటికే రూ.3 వేల పెన్షన్ కానుక, ఓ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న తోడు, చేదోడు, లా నేస్తం, రూ.25 లక్షలదాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష గతంలో మీరు చూశారా? » వీటన్నింటితో పాటు మీ ఊరిలోనే గ్రామ సచివాలయం, నాడు–నేడుతో బాగుపడిన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఓ ఆర్బీకే, విలేజ్ క్లినిక్, ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల చేతుల్లో దిశ యాప్ గతంలో ఉన్నాయా? » మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఇవన్నీ సజావుగా కొనసాగి పథకాలు అందుతాయి. 2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..» రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ చేస్తానన్నాడు... జరిగిందా? » రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామని ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? » ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ అమలైందా? ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఏ ఇంటికైనా ఇచ్చాడా? » అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? » ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? » సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మించాడా? నరసాపురం, పెదకూరపాడు, కనిగిరిలో ఎవరికైనా కనిపిస్తున్నాయా? » ప్రత్యేక హోదా తీసుకురాకపోగా అమ్మేశాడు. »ఇప్పుడు మళ్లీ అదే కూటమి పేరుతో మీ ముందుకొచ్చి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కార్ అంటూ మరోసారి వంచనకు సిద్ధమైన మోసగాళ్లతో రాజకీయ యుద్ధం చేస్తున్నాం. నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా.. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరిక సాక్షి, నరసరావుపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలు, సంఘాల ముఖ్య నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. తూర్పు గోదావరి జల్లాకు చెందిన బీసీ పోరాట సమితి జిల్లా అ«ధ్యక్షుడు రేలంగి శేఖర్, మూల్ నివాసి సంఘ్ జాతీయ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు, జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ నేత మారూరి రామలింగారెడ్డి, మార్వాడి కమ్యూనిటీ ప్రెసిడెంట్ తివారీకి సీఎం జగన్ వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహా్వనించారు. -
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు.. షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: 22 రోజుల్లో 23 జిల్లాలు.. 86 నియోజకవర్గాలు.. 2,188 కి.మీలు.. 9 భారీ రోడ్ షోలు 6 ప్రత్యేక సమావేశాలు 16 బహిరంగ సభలు.. జన ప్రభంజనం మధ్య జైత్ర యాత్రలా సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సాగింది. మండుటెండైనా, అర్ధరాత్రయినా పిల్లలు, పెద్దలు ఆత్మీయ స్వాగతం పలికారు. యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. మరో జైత్రయాత్రకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఈ నెల 28న తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించనున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో సీఎం పాల్గొననున్నారు. 28న ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండేపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకారావుపేట, ఏలూరులో జరిగే సభలకు సీఎం జగన్ హాజరుకానున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు30న కొండెపి, మైదుకూరు, పీలేరుమే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు -
మన సభలకు జనం రారేంటి!
సాక్షి, అమరావతి: ఓ పక్క ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర అశేష ప్రజానీకంతో సాగుతోంది. అంతకు ముందు సీఎం జగన్ పాల్గొన్న సిద్ధం సభలూ ఘన విజయం సాధించాయి. మరి మన బాబు సభలేమిటి ఇంతగా తేలిపోతున్నాయి.. టీడీపీ నేతల్లో అంతర్మథనమిది. 14 ఏళ్లు సీఎంగా చేసిన బాబు నిర్వహిస్తున్న ప్రజాగళం సభలకు కనీస స్థాయిలో జనం రావడంలేదు. బాబు సభలకు ప్రజల నుంచి స్పందన లేదని పవన్ కళ్యాణ్‌ని తీసుకువచ్చినా ఫలితం సున్నా. నాలుగు రోజులక్రితం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన కూటమి సభలో చంద్రబాబు, పురందేశ్వరితోపాటు పవన్ కూడా పాల్గొన్నారు. అయినా ఈ సభకు నాలుగైదు వేల మంది కూడా రాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. అంతకు ముందు తణుకు సభకూ జనం ఆశించిన స్థాయిలో రాలేదు. మూడు పార్టీల నేతలు వస్తుండడంతో జన సమీకరణ భారీగా చేయాలని ఆ జిల్లా నాయకులపై ఒత్తిడి తెచ్చారు. జిల్లా నాయకులు ఎంతగా ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. తమ పార్టీ సభలకి ప్రజల్ని తీసుకురావడం కష్టంగా మారిందని, ఎంత చెప్పినా, ప్రలోభపెట్టినా రావడంలేదని స్థానిక నేతలు వాపోతున్నారు. బాబు ఒక్కడే విడిగా పెడుతున్న సభల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటోందని చెబుతున్నారు. రోజుకి రెండు, మూడు సభలు పెడుతున్నా, ఒక్క చోట కూడా అనుకున్న స్థాయిలో ప్రజలు రావడంలేదని టీడీపీ నేతలే చెబుతున్నారు. పలుచగా ఉన్న సభల్ని చూసి మిగిలిన ప్రాంతాల్లోని కేడర్ నీరుగారిపోతుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది వచ్చినట్లుగా కనిపించేందుకు చిన్న సెంటర్లు, చిన్న రోడ్లను ఎంచుకుని సభలు పెడుతున్నారు. అక్కడికి అతి కష్టం మీద కొద్దిపాటి జనాన్ని తీసుకువచ్చి ఫొటోలు, వీడియోలతో వాటినే గొప్పగా ఉన్నట్లు చూపిస్తున్నారు. బాబు స్పీచ్ మొదలైతే.. జనమూ జంపే... మరోవైపు సభలకు వచ్చిన కొద్దిపాటి జనం కూడా బాబు ప్రసంగం మొదలవగానే వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. బాబు ప్రసంగం అంటేనే గంటా గంటన్నరపాటు ఊకదంపుడు స్పీచ్ ఉంటుంది. అందులోనూ విషయం లేకపోవడంతో వినేందుకు ఎవరూ ఇష్టపడటంలేదు. వైఎస్ జగన్‌పై అదే పనిగా అక్కసు వెళ్లగక్కుతుండడంతో ప్రజలు పట్టించుకోవడంలేదు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరిగిన నాలుగు సభలను చూస్తే బాబు మాట్లాడుతున్నప్పుడు వింటున్నవారి సంఖ్య చాలా స్వల్పం. ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్‌ను తిట్టడం, ఈర‡్ష్య, ద్వేషాలను బయటపెట్టుకోవడం తప్ప బాబు ప్రసంగాల్లో కొత్తదనం కనిపించడంలేదని చెబుతున్నారు. దానివల్లే జనం ఏమీ పట్టించుకోవడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన కడుపు మంటనంతా వెళ్లగక్కి, కళ్లు మూసుకుని గంటల తరబడి అబద్ధాలను చెబుతూ వాటినే గొప్ప ప్రసంగాలుగా ఫీల్ అవుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈసారి ఎలాగైనా జనాన్ని తీసుకురండి.. నేతలకు హెచ్చరికలు గత నెలలో చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోడీతో నిర్వహించిన సభను కూడా టీడీపీ విజయవంతం చేయలేకపోయింది. ఎన్నో ఆశలతో నిర్వహించిన ఆ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను మోదీ పెద్దగా పట్టించుకోకపోవడం, సభ కూడా అట్టర్‌ఫ్లాప్ అవడంతో బాబుకు షాక్ తగిలినట్లయింది. ఆ తర్వాత నుంచి ‘ప్రజా గళం’ పేరుతో నిర్వహించిన సభలేవీ జనాన్ని ఆకర్షించలేదు. అంతకుముందు ‘రా కదలిరా’ పేరుతో పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలూ తేలిపోయాయి. దీంతో ఏం చేయాలనే దానిపై కూటమి అగ్ర నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. శుక్రవారం చంద్రబాబు నివాసంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో సభలు విఫలమవడంపైనా చర్చించారు. ఈసారి ఎలాగైనా కొన్ని సభలకు జనాన్ని భారీగా తరలించాలని పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు చెప్పారు. రాబోయే వారం రోజుల్లో వరుసగా 13 సభలకు ప్రణాళిక రూపొందించి అక్కడి నేతలకు ముందుగానే హెచ్చరికలు చేశారు. జన సమీకరణ బాగా ఉండాలని, లేకపోతే బాబు గారు తిడతారని పరిశీలకులు అక్కడి ఇన్‌ఛార్జిలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నియోజకవర్గాల నేతలు మాత్రం జనం రాకపోతే తామేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. -
స్టార్టప్‌లతో ప్రతి నెలా సమావేశం నిర్వహించండి..
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు, ఫిన్‌టెక్ సంస్థల ఆందోళనలను, సమస్యలను పరిష్కరించేందుకు వాటితో నెలవారీ సమావేశాలు నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ సంస్థలతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు సూచనలు చేసినట్లు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. రేజర్‌పే, క్రెడ్, పీక్‌ఫిఫ్టీన్ తదితర 50 సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి, డీపీఐఐటీ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తదితరులు, ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా, ఎన్పీసీఐ అధికారులు హాజరయ్యారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ ఆంక్షల కొరడా ఝుళిపించిన తరుణంలో ఫిన్‌టెక్, స్టార్టప్‌లతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, పీపీబీఎల్ ఉదంతంపరమైన ఆందోళనలేమీ అంకుర సంస్థల వ్యవస్థాపకుల్లో కనిపించలేదని అధికారి తెలిపారు. ఈ భేటీలో స్టార్టప్‌లు సైబర్‌సెక్యూరిటీ సంబంధ అంశాలను ప్రస్తావించినట్లు వివరించారు. మహాకుంభ్‌లో వెయ్యి అంకుర సంస్థలు.. మార్చి 18 నుంచి న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో 1,000 పైచిలుకు అంకుర సంస్థలు, పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు, ఇన్క్యుబేటర్లు పాల్గొననున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభా గం డీపీఐఐటీ నిర్వహించనుంది. పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చలు, మెంటార్ సెషన్లు, మాస్టర్‌క్లాస్‌లు, కీలకోపన్యాసాలు, యూనికార్న్ రౌండ్‌టేబుల్ సమావేశాలు మొదలైనవి ఉంటాయి. -
8 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రెండో సెషన్ సమావేశా లు ఈ నెల 8వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం నోటిఫికేష న్ జారీ చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ను 8వ తేదీ నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తొలిరోజు గవర్నర్ తమిళిసై ఉభయసభల ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. -
టీడీపీ వెన్నులో వణుకు.. జగన్ జన బలం సుప్ర‘సిద్ధం’!
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘సిద్ధం’ పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావ సభలు తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఈ సభలు జరుగుతున్న తీరు, వాటికి వస్తున్న జనాన్ని చూసి వారు గెలుపుపై ఆశలు వదిలేసుకుంటున్నారు. జగన్ జన బలం సుప్రసిద్ధమేనని, అయితే గత వారం భీమిలిలో జరిగిన సభతోపాటు శనివారం దెందులూరులో నిర్వహించిన సభ అంతకుమించి సూపర్ సక్సెస్ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో టీడీపీ పూర్తిగా అంతర్మథనంలో పడిపోయింది. ఇప్పటివరకు రకరకాల ప్రచారాలతో తమ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందంటూ ఊదరగొడుతున్న టీడీపీ అధిష్టానమూ ఈ పరిణామాలతో ఉలిక్కిపడుతోంది. అదేపనిగా వైఎస్సార్‌కు, జగన్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేసినా, ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి మరీ వ్యతిరేక ప్రచారాన్ని చేయించినా అవేమీ పనిచేయడం లేదని, జనంలో జగన్‌కు ఉన్న ఆదరణను తగ్గించలేకపోయాయని తేలడంతో టీడీపీ డీలాపడిపోయింది. తమ పార్టీ నిర్వహించే సభలకు జనం రాకుండా, వైఎస్ జగన్ సభలకు జనం పోటెత్తుండడం తమ నైతిక ఓటమికి సంకేతమని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ‘రా కదలి రా’ అట్టర్ ఫ్లాప్‌తో ఆవేదన చంద్రబాబు గత నెలలో నిర్వహించిన ‘రా కదలిరా’ సభలు అట్టర్‌ప్లాప్ కావడాన్ని గుర్తుచేసుకుని టీడీపీ నేతలు కుమిలిపోతున్నారు. ఈ సభలను 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించాలని, ఒక్కో సభకు కనీసం లక్ష మందిని, కుదరకపోతే 50 వేల మందినైనా సమీకరించాలని ప్రణాళిక రూపొందించారు. కానీ అతికష్టం మీద 16 సభలు నిర్వహించగలిగారు. ఏ ఒక్క సభకూ 20 వేల మందిని మించి తీసుకురాలేకపోయామని ఆ పార్టీ సీనియర్లే ఆవేదన చెందుతున్నారు. సభలకు జనం రాకపోతుండడంతో చంద్రబాబు మధ్యలోనే వాటికి విరామం ఇచ్చారు. ఏం చేయాలోనని మంతనాలు జరిపారు. తాము సభలు నిర్వహించలేమని, జనాన్ని సమీకరించలేమని చాలాచోట్ల నేతలు చేతులు ఎత్తేసినట్టు సమాచారం. దీంతో అర్థాంతరంగా సభలు ఆపితే సమాధానం చెప్పుకోలేమని, ఎలాగొలా ముగించడానికి అధిష్టానం అష్టకష్టాలు పడుతోంది. బాబును జనం నమ్మడం లేదు మోసాలు, నయవంచనతో చంద్రబాబు ప్రజల నమ్మకం కోల్పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అబద్ధాలు, కట్టుకథలతో జనాన్ని మళ్లీ మోసం చేయాలని శత విధాలుగా యత్నిస్తున్నా.. జనం నుంచి స్పందన లేదని, బాబు ప్రసంగం కూడా పస లేకుండా ఉంటుందని, వైఎస్ జగన్‌పై విషం కక్కడాన్ని ప్రజలు జీరి్ణంచుకోలేకపోతున్నారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. జగన్‌ను తిట్టడం తప్ప అధికారంలో ఉన్నప్పుడు తాను ఏం చేశానో చెప్పే పరిస్థితి చంద్రబాబుకు లేదని అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ఏం చేస్తారో కూడా బాబు స్పష్టంగా చెప్పలేకపోతున్నారని, ఉన్న పథకాలనే పేర్లు మార్చి తానూ ఇస్తానని చెప్పడాన్ని ప్రజలు విశ్వసించడం లేదని పేర్కొంటున్నారు. ఫలితంగా వచ్చే ఎన్నికల్లోనూ తమకు ఓటమి తప్పదని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు విశ్లేషించుకుంటున్నారు. ఇదీ చదవండి: అక్షౌహిణులు సిద్ధం! -
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయనున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదలచేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. తొలి రెండు రోజులు ఉభయసభల్లో జీవో అవర్, క్వశ్చన్ అవర్‌ను ఇప్పటికే రద్దు చేస్తూ బులిటెన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఆ తర్వాత రాజ్యసభ, లోక్‌సభలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసిన నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్రపతిపాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూకశ్మీర్ బడ్జెట్‌నూ ఆర్థిక మంత్రి నిర్మల లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. వాడీవేడిగా చర్చలు సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. నిరుద్యోగిత, అధిక ధరలు, ఆర్థిక అసమానతల కారణంగా రైతాంగం, కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు, జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ అంశాలపై మోదీ సర్కార్‌ను విపక్షాలు నిలదీయనున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అంశం సైతం ప్రధానంగా విపక్షాలు ప్రస్తావించవచ్చు. ఢిల్లీలో మద్యం కేసులో ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్‌పై, భూమికి ఉద్యోగం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్‌పై ఈడీ, సీబీఐ కేసులనూ విపక్షాలు పార్లమెంట్లో లేవనెత్తనున్నాయి. జార్ఖండ్ సీఎంసోరెన్పై, తమిళనాడులో డీఎంకే నేతలపై ఈడీ, సీబీఐ వరుస దాడులను విపక్షాలు పార్లమెంట్లో ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. పశ్చిమబెంగాల్‌కు రావాల్సిన కేంద్ర నిధులను మోదీ సర్కార్ మంజూరుచేయకుండా ఆపేస్తోందని, ఈ అంశంలో కేంద్రాన్ని నిలదీస్తానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ్ చెప్పారు. 14 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత గత పార్లమెంట్ సమావేశాల్లో సస్పెండ్ అయిన వారిలో 14 మంది విపక్ష సభ్యులు ఈసారి సెషన్లో పాల్గొననున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సమావేశాల్లోకి రాకుండా గతంలో వీరిపై విధించిన నిషేధ కేసును సభాహక్కుల కమిటీలకు పంపామని, మా అభ్యర్థనతో ఆ కమిటీల చైర్మన్లు వీరి సస్పెన్షన్‌ను ఎత్తేశారని మంత్రి వెల్లడించారు. సస్పెన్షన్ ఎత్తేసిన 14 మందిలో 11 మంది రాజ్యసభ, ముగ్గురు లోక్‌సభ సభ్యులున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం అంశాన్ని ఎత్తిచూపుతూ లోక్‌సభ, రాజ్యసభ లోపల ప్లకార్డులు పట్టుకుని నినదించినందుకు కేంద్రం ఫిర్యాదుతో 100 లోక్‌సభ, 46 రాజ్యసభ సభ్యులు సస్పెన్షన్‌కు గురైన విషయం తెల్సిందే. ప్రతి ఒక్కరి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సభాపతులను కోరామన్నారు. వీరిలో 14 మంది క్షమాపణలు చెప్పడంతో వారికి మాత్రమే ఈ సెషన్లో పాల్గొనే అవకాశం కల్పించారు. బుధవారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ ఇరు సభలకు తమ సభ్యులు ఎలాంటి ప్లకార్డులు తీసుకురారని విపక్ష పార్టీలు సమాచారం ఇచ్చాయని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. -
వచ్చే నెలలో బీజేపీ కీలక సమావేశాలు.. ఎంపీ ఎన్నికలపైనే ఫోకస్!
సాక్షి, ఢిల్లీ: త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం అధికార బీజేపీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 15, 16 తేదీల్లో జరిగే పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికలపైనే ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు అవసరమైన వ్యూహాలపై జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ అగ్ర నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ సహా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర ముఖ్య నేతలు, జాతీయ కౌన్సిల్ సభ్యులు హాజరవనున్నారు. ఇదీచదవండి.. భారత విద్యార్థులకు మాక్రాన్ రిపబ్లిక్ డే కానుక -
రామంటున్న జనం.. టీడీపీలో కలవరం
టీడీపీ సభలకు జనం ‘కదలిరా’వడం లేదు. కార్యకర్తలు నానా తంటాలుపడి బలవంతంగా తరలించినా... చివరి వరకూ ఉండటం లేదు. పసలేని ప్రసంగాలు... అదేపనిగా రాగాలు తీస్తూ జగన్‌పై నిందారోపణలు... జనాన్ని ఆకర్షించని నిర్ణయాలు... సభలను నీరుగార్చేస్తున్నాయి. ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక్కోసభ నిర్వహించాలని యోచించినా... పట్టుమని పది సభలే నిర్వహించారు. అవి కూడా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. దత్తపుత్రుడి సాయం తీసుకుందామను కుంటే... ఆయన నుంచి సానుకూల స్పందన రావడం లేదు. సీట్ల సర్దుబాటు తేలకుండా సభలకు వెళ్లేందుకు జనసేన నేతలు కూడా సుముఖత చూపడం లేదు. సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల ‘రా కదలిరా’ పేరిట ప్రారంభించిన సభలు అర్ధంతరంగా ఆపేస్తున్నారా... అంటే తమ్ముళ్లనుంచి ఔననే సమాధానం వస్తోంది. ఎంత ప్రయత్నించినా జనం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనం ఏమాత్రం సానుకూలంగా లేకపోవడం... టీడీపీ నేతలు, క్యాడర్ ఆసక్తి చూపకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ముక్కుతూ మూలుగుతూ ఇప్పటివరకు 10 సభలు నిర్వహించినా మిగిలిన జిల్లాల్లో వాటిని నిర్వహించడం కష్టమని చెబుతున్నారు. నెలాఖరులోగా ఎలాగోలా కొన్ని చోట్ల సభలు నిర్వహించి.. మరికొన్ని చోట్ల రద్దు చేసి.. మరో కార్యక్రమం తలపెట్టాలని భావిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఒంగోలుతో మొదలుపెట్టి 29వ తేదీ వరకూ షెడ్యూల్ ప్రకటించినా... జనం నుంచి స్పందన లేకపోవడంతో కొన్ని సభలు నిలిచిపోయాయి. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని జీడీ నెల్లూరు సభ, బుధవారం జరగాల్సిన రాజంపేట పార్లమెంటు పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఉరవకొండ సభలు వాయిదా పడ్డాయి. ఈ నెల 27న రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని గోపాలపురంలో సభ నిర్వహించాల్సి వున్నా అక్కడ రద్దు చేసి 29న రాజమండ్రిలో నిర్వహించాలని నిర్ణయించారు. సభలన్నీ అట్టర్ ఫ్లాపే ఇప్పటివరకు నిర్వహించిన సభలన్నీ విఫలమవడంతో టీడీపీలో నైరాశ్యం నెలకొంది. తిరువూరు, కనిగిరి, ఆచంట, ఆళ్లగడ్డ, గుడివాడ తదితర సభలు జనం లేక వెలవెలబోయాయి. సభలు విజయవంతమైనట్లు ఎల్లోమీడియా ఎంతగా బూస్టప్ ఇచ్చినా వాస్తవానికి అవన్నీ ఫ్లాపేనని ఆ పార్టీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అరకులో పెట్టిన సభ తర్వాత ఇక నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ప్రసంగంలో సీఎం జగన్‌పై ఈర్ష్య, ద్వేషంతో తిట్టిపోయడం తప్ప తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమిటి చేశారో చెప్పలేకపోవంతో జనం విసిగెత్తిపోతున్నారు. బాబు ప్రతి ఎన్నికల్లోనూ హామీలివ్వడం అధికారంలోకి వచ్చాక దానిని బుట్టదాఖలు చేయడంతో ప్రజలు ఈసారి హామీలను ఏమాత్రం నమ్మడం లేదు. కార్యక్రమాలన్నీ విఫలమే... బాబు ఏ కార్యక్రమం చేపట్టినా విఫలమవుతూనే ఉన్నాయి. బాదుడే బాదుడు,, ఆయన కుమారుడు లోకేశ్ నిర్వహించిన పాదయాత్ర ఈ కోవలోకే వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయ్యాక ఆయన సతీమణి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికీ సరైన ఆదరణ లభించలేదు. బాబుపై నమ్మకం పోయింది జనం తనను నమ్మడం లేదని చంద్రబాబు కూడా గుర్తించారు. అందుకే జనసేనతో కలిసి వారిని నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నా అది కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. రా కదలిరా సభలకు పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడం దీనికి నిదర్శనం. సీట్లు ఖరారు కాకుండా సభలకు ఎందుకెళ్లాలని పవన్ వెనుకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే రా కదలిరా సభలకు ఇక ఫుల్స్టాప్ పెట్టనున్నారు. త్వరలో మరో కొత్త పేరుతో, కొత్త కార్యక్రమం చేపట్టాలని యోచిస్తున్నా... అసలు జనాన్నిఆకర్షించలేకపోవడంతో ఏ పేరుతో కార్యక్రమం నిర్వహించినా ఉపయోగం ఏమిటనే అభిప్రాయాలు పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. -
ఈ నెల 25 నుంచి రీజనల్ క్యాడర్ సమావేశాలు
-
నేటి నుంచి బీఆర్ఎస్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా బుధవారం నుంచి సన్నాహక సమావేశా లు నిర్వహించేందుకు భారత్ రాష్ట్ర సమితి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు విడతలుగా రోజుకో లోక్‌సభ నియో జకవర్గం చొప్పున భేటీలు జరుగుతాయి. తొలి రోజు బుధవారం ఆదిలాబాద్ లోక్‌సభ నియోజక వర్గం పరిధిలోని పార్టీ నేతలతో సమావేశం ఏర్పా టు చేశారు. తెలంగాణ భవన్లో ఉదయం 10.30 కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్య క్షతన ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఆదిలా బాద్ మాజీ ఎంపీ గోడెం నగేశ్‌తో పాటు ఎమ్మెల్యే లు అనిల్ జాధవ్, కోవా లక్ష్మి, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజక వర్గాల ఇన్చార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సుమారు 500 మంది పాల్గొంటారు. సీనియర్ నేతలకు సమన్వయ బాధ్యతలు సన్నాహక సమావేశాలను కేటీఆర్‌తో పాటు పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ స్పీకర్లు పోచా రం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు సమన్వ యం చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో లోక్‌సభ నియోజ కవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించే అవకాశా లు ఉన్నాయి. కాగా ఈ సన్నాహక సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచర ణపై దిశానిర్దేశం చేస్తారు. కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ లోక్‌సభ సన్నాహక సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కేటీఆర్ మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేయాల్సిన అంశాలను కేసీఆర్ వివరించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో తొలిసారిగా పార్టీ కీలక నేతలందరూ హాజరవుతుండటంతో ఈ సన్నాహక సమావేశాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. -
సానుకూలంగానే మున్సిపల్ కార్మికులతో చర్చలు: మంత్రి ఆదిమూలపు
గుంటూరు, సాక్షి: పారిశుధ్య కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు ముగిశాయి. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిసినప్పటికీ.. సానుకూలంగానే జరిగినట్లు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పలు డిమాండ్లకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగానే స్పందించిందని పేర్కొంటూ.. చర్చల సారాంశాన్ని ఆయన మీడియాకు వివరించారు. ‘‘కార్మికుల డిమాండ్ మేరకు హెల్త్ అలవెన్స్ రూ.6 వేలు ఇచ్చాం. ఎక్స్‌గ్రేషియాపై సానుకూలంగా స్పందించాం. సమానపనికి సమాన వేతనంపై చర్చించాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చాం. దాని మేరకే చర్యలు తీసుకున్నాం. ఇవాళ్టి చర్చలు సానుకూలంగా సాగాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మికులు సమ్మె విరమించాలని కోరుతున్నాం. మరోసారి మంత్రివర్గ ఉపసంఘంతో ఇతర సమస్యలపైనా చర్చిస్తాం’’ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. పారిశుద్ధ్య సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఝ చర్చలు జరిపింది. మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు బొత్స సత్యనారాయణతో పాటు ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికుల డిమాండ్లలో ప్రధానమైనటువంటి కేటగిరీల వారీగా బేసిక్ ఫే నిర్ణయం, పొరుగు సేవల విధానాన్ని కాంట్రాక్టు & శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్దీకరించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఝ చర్చలు జరిగాయి. వీటితో పాటు అవుట్ సోర్సింగ్ పై పనిచేసే పారిశుధ్య, ఇంజనీరింగ్, ఇతర సిబ్బందికి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపచేయడం, నియామకాల్లో వెయిటేజీ మార్కులు కేటాయించడం, ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేయడం, అవసరానికి తగ్గట్టుగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచడం, కాంట్రాక్టు విదానంలో ఘన వ్యర్థాలను తరలించే వాహనాల పనితీరును మెరగుపర్చడం, పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బంది, పార్కుల నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్ల నిర్వహించే పనుల ఆధారంగా వారికి బేసిక్ పే నిర్ణయించడం తదితర అంశాలపై కూడా సుదీర్ఝ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహా దారులు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్. చంద్ర శేఖర రెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ, సిడిఎంఎ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్రకార్పొరేషన్ విసి & ఎండి గంధం చంద్రుడు, ఆప్కాస్ ఎండి వాసుదేవ రావు తదితర అధికారులతో పాటు రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు ఆనంద్ రావు (YSRTUC రాష్ట్ర ప్రెసిడెంట్), వై.వి.రమణ (YSRTUC ప్రధాన కార్యదర్శి), ఎ. రంగనాయకులు (AITUC రాష్ట్ర అధ్యక్షులు), పి. సుబ్బారాయుడు (AITUC ప్రధాన కార్యదర్శి), అబ్రహం లింకన్ (IFTU ప్రెసిడెంట్), జి. ప్రసాద్ (APCITU ప్రెసిడెంట్), కె. ఉమామహేశ్వరరావు (AP CITU ప్రధాన కార్యదర్శి), జి.రఘురామరాజు (TNTUC రాష్ట్ర ప్రెసిడెంట్), శ్యామ్ (TNTUC ప్రధాన కార్యదర్శి), మధుబాబు (AP MEWU రాష్ట్ర ప్రెసిడెంట్), అంజినీయులు (AP MEWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), GVRKH వరప్రసాద్ (AICTU రాష్ట్ర అధ్యక్షులు), కె. శ్రీనివాసరావు (AICTU జనరల్ సెక్రటరీ) తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడి అవకాశాలు గురించి తెలుసుకోవడానికి చక్కని అవకాశం
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), ఒమన్‌లోని సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ ప్రతినిధి బృందంతో వ్యాపార కార్యక్రమంలో భాగంగా ఇంటరాక్టివ్ సెషన్, B2B సమావేశాలను ప్రకటించింది. ఈ కార్యక్రమం 2023 నవంబర్ 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో జరగనుంది. ప్రపంచ మార్కెట్లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా సంస్థ 23 తేదీ సాయంత్రం ఇంటరాక్టివ్ సెషన్‌తో కార్యక్రమం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత B2B సమావేశాలు జరుగుతాయి. ఒమన్ అండ్ మిడిల్ ఈస్ట్‌లోని అనేక వ్యాపారాలు, పెట్టుబడి అవకాశాలను గురించి నగరంలోని వ్యాపార వేత్తలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ సమావేశాలకు హాజరయ్యేవారు సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ అందించే ప్రయోజనాలు, వాటి ప్రోత్సాహకాల గురించి తెలుసుకుంటారు. ఇందులో పాల్గొనాలంటే తప్పకుండా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అసోచామ్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్, యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'రవి కుమార్ రెడ్డి కటారు' మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు మూలస్తంభంగా నిలుస్తుందని, ముఖ్యంగా ఔషధ పరిశ్రమకు బలమైన కేంద్రమవుతుందని వ్యాఖ్యానించారు. గత కొన్ని సంవత్సరాలుగా నగరం నుంచి ఎగుమతులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటిని మరింత పెంచడంలో ద్రుష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. యూరోప్, ఆఫ్రికాలలో మాత్రమే కాకుండా మధ్యప్రాచ్య ప్రాంతంలోని వ్యాపారాల కోసం ఒమన్ దక్షిణ భారతదేశాన్ని ఇష్టపడుతోంది. ఇప్పటికే ఈ సంస్థలకు అమెరికా, సింగపూర్ దేశాల్లో కూడా వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. అయితే త్వరలో జరిగే ఈ కార్యక్రమం ఒమన్‌లోకి ప్రవేశించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి భారతీయ వ్యాపారులకు అవగాహన కల్పించడానికి సహాయపడుతుంది. అసోచామ్ ఈ కార్యక్రమానికి పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానిస్తోంది. -
తుమ్మ ముండ్ల తుమ్మల కావాల్నా..పువ్వాడ కావాల్నా: ఖమ్మంలో కేసీఆర్
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో తుమ్మముండ్ల తుమ్మల కావాల్నా.. పువ్వుల్లో పెట్టి చూసుకునే పువ్వాడ కావాల్నా తేల్చుకోవాలని అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘తుమ్మలకు నేను మంత్రి పదవి ఇస్తే నాకే ఆయన మంత్రి పదవి ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. ఇంత అరాచకంగా మాట్లాడతారా.. ఎవరు ఎవరికి మంత్రి పదవి ఇచ్చారో మీరే చూశారు. ఇక ఇంకొక అర్బకుడైతే ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వనంటున్నాడు. అయనేమైనా ఖమ్మం ప్రజలను కొనేశాడా..ఖమ్మాన్ని గుత్తా పట్టాడా. ఖమ్మానికి పట్టిన ఆ ఇద్దరి పీడను వదిలించాం’ అని కేసీఆర్ అన్నారు. ‘ఖమ్మం చాలా చైతన్యవంతమైన ప్రాంతం. ఒకప్పుడు ఖమ్మం అంటే ఇరుకు సందులు, మురికి కాలువలు, ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ కష్టాలు, యాక్సిడెంట్లు. ఇప్పుడు మంచి రోడ్లు, దగ దగలాడే సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీలు వచ్చాయి. ఒకనాటి లకారం చెరువు అంటే వికారం, ఇప్పుడు లకారం అంటే సుందరమైన చెరువు’అని కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్ వల్లే సింగరేణిలో వాటా కేంద్రానికి పోయింది.. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని, ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మొద్దని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ వల్లే సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి వెళ్లిందని విమర్శించారు. ప్రజల చేతిలో ఓటు వజ్రాయుధం అని చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థి వెనుక ఏ పార్టీ ఉన్నదో ఆ పార్టీ వైఖరి, చరిత్ర, నడవడిక చూసి ఓటు వేయాలని ప్రజలను కేసీఆర్ కోరారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లో ఉండేదన్నారు. తెలంగాణ వచ్చాక సింగరేణి లాభాల బాట పట్టిందన్నారు. సింగరేణి తెలంగాణ ఆస్తి అని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే కొత్తగూడెం జిల్లాకు కరువనేదే రాదన్నారు. వనమా వెంకటేశ్వర్రావు ఎప్పుడు తన దగ్గరకు వచ్చినా వ్యక్తిగత పనులు అడగలేదని కేసీఆర్ చెప్పారు. కొత్తగూడెం అభివృద్ధి గురించి మాత్రమే అడిగారని తెలిపారు. వనమాను చూసి కాకుండా కేసీఆర్‌ను చూసి వనమాకు ఓటు వేయండని కోరారు. -
సభలకు బదులు రోడ్ షోలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభల నిర్వహణకు బదులు ప్రస్తుతానికి కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలకే పరిమితం కావాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలన్నింటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నాయకులతో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం మినహా ఇతర రాష్ట్రాల నేతలతో రోడ్‌షోల నిర్వహణ కోసం ప్లాన్ వేస్తోంది. భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను సభకు తీసుకువచ్చే దాని కంటే ప్రజల్లోకి తామే వెళ్లడం మేలన్న ఆలోచనతో కార్యాచరణ రూపొందిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. రోడ్ షోలలో భాగంగా ఉదయం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయాలని.. సాయంత్రం రోడ్ షోలు నిర్వహించాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీని ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ కొత్త జోష్ వస్తుందని అంటున్నారు. నేటి బస్సు యాత్ర వాయిదా సోమవారం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో నిర్వహించతలపెట్టిన రెండో విడత బస్సు యాత్ర అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆయా నియోజకవర్గాల్లో తిరిగి యాత్ర ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే తెలియజేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అగ్రనేతలతో పెద్ద సభలు ఈ నెల 31న కొల్లాపూర్‌లో ప్రియాంకా గాంధీ బహిరంగ సభ జరగనుంది. దీనితోపాటు అగ్రనేతలతో మరో రెండు, మూడు పెద్ద సభ లు నిర్వహించాలని పీసీసీ నేతలు యోచిస్తు న్నారు. ఈ సభల్లో పార్టీ అతిరథ మహారథు లతో హామీలు ఇప్పించాలని భావిస్తున్నారు. అవి మినహా చాలా వరకు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, బస్సుయాత్రతో ఎన్నికల ప్రచారా న్ని కొనసాగించాలని నిర్ణయించారు. -
కేసీఆర్ సభల షెడ్యూల్లో స్వల్ప మార్పు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్వల్పవిరామం తర్వాత తిరిగి గురువారం నుంచి బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభల్లో పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖరరావు పాల్గొంటారు. అయితే గతంలో ప్రకటించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేస్తూ బహిరంగ సభల ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఈ నెల 26న నాగర్‌కర్నూలు, 27న స్టేషన్ ఘన్ పూర్లో నిర్వహించ తలపెట్టిన సభలను వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ తాజాగా ప్రకటించింది. రద్దయిన సభల స్థానంలో 26న వనపర్తి, 27న మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. 26న వనపర్తితోపాటు అచ్చంపేట, మునుగోడులో, 27న మహబూబాబాద్, వర్ధన్న పేటతోపాటు పాలేరులో జరిగే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 28న విరామం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భా గంగా ఈ నెల 15 నుంచి నవంబర్ 9 వరకు 17 రోజుల్లో 41 అసెంబ్లీ నియోజ కవర్గాల్లో కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభల షెడ్యూల్‌ను గతంలో బీఆర్ఎస్ ప్రకటించింది. ఈనెల 15 మొదలుకుని 18 వరకు కేసీఆర్ హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చర్ల, మేడ్చల్‌లో జరిగిన సభల్లో ప్రసంగించారు. సద్దుల బతుకమ్మ, దసరా నేప థ్యంలో ఈనెల 19 నుంచి 25 వరకు కేసీఆర్ పాల్గొనే సభలకు విరామం ప్రకటించారు. 26 నుంచి తిరిగి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు ప్రారంభమై వచ్చే నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ నెల 28న ప్రచారానికి విరా మం ఇచ్చి 29న కోదాడ, తుంగతు ర్తి, ఆలేరు 30న జుక్కల్, బాన్సువాడ, నారాయ ణ్ఖేడ్లలో, 31న హుజూర్నగర్, మిర్యాలగూ డ, దేవరకొండ సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. తిరిగి నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లెందు, 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి 3న భైంసా (ముధోల్), ఆర్మూర్, కోరుట్ల, 5న కొత్తగూడెం, ఖమ్మం, 6న గద్వాల్, మఖ్తల్, నారాయణపేట, 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, 9న కామారెడ్డి సభల్లో ప్రసంగిస్తారు. 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. -
ఎన్నికల నిర్వాహణ ఏర్పాట్లలో అధికారులకు క్షణం తీరిక దొరకడం లేదు..!
సూర్యాపేట: అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. కలెక్టరేట్లోని దాదాపు అన్ని శాఖల జిల్లా అధికారులకు, సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. రోజూ కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చలు జరపడం, సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా మారారు. కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఎన్నికలకు సంబంధించి సమీక్షలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు కమిటీలు.. జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కలెక్టర్ ఎస్. వెంకట్రావు 17 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలకు జిల్లా అధికారులను నోడల్ అధికారులుగా విధులు కేటాయించారు. ఇందులో మోడల్ కోడ్ అమలు, ఈవీఎం, వీవీ ప్యాట్ల పర్యవేక్షణ, ఉద్యోగులకు విధుల కేటాయింపు, అభ్యర్థి తరఫున ఏజెంట్లకు లైసెన్స్ ఇవ్వడానికి, పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పన, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఓటరు నమోదుపై అవగాహన, ఎన్నికల వ్యయ నిర్ధారణ, మీడియా కమ్యూనికేషన్, పోస్టల్ బ్యాలెట్– ఈవీఎం బ్యాలెట్ కమిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, గెస్ట్ హౌస్‌ల ఏర్పాటు, మైక్రో అబ్జర్వర్, హెల్ప్‌లైన్ అండ్ కంట్రోల్ యూనిట్, ఎంసీఎంసీఏ, పోలీస్ కోఆర్డినేషన్, హెలిపాడ్ కోఆర్డినేషన్ వంటి వాటికి వివిధ శాఖల అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఇటు శాఖా పరమైన విధులు.. అటు ఎన్నికల పనులు కలెక్టరేట్లో ఎన్నికల విభాగం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారికి సహాయకులుగా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎన్నికల సూపరింటెండెంట్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు కాగా మరో నలుగురు కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. వీరంతా నెల రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వీరే కాకుండా ఆయా శాఖల అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా మారారు. జిల్లా స్థాయి అధికారులైతే ఇటు తమ శాఖకు సంబంధించిన పనులు చేస్తూ అటు ఎన్నికల ఏర్పాట్లపై తమకు కేటాయించిన మండలాలు, గ్రామాలకు వెళ్లి క్షేత్ర పర్యటన చేస్తున్నారు. అక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సదుపాయాలు, ఇంకా కావాల్సిన అవసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను ఇప్పటికే కేటాయించారు. తుంగతుర్తి నియోజకవర్గానికి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గానికి జగదీశ్వర్‌రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గానికి సూర్యాపేట ఆర్డీఓ వీరబ్రహ్మచారి, కోదాడ నియోజకవర్గానికి కోదాడ ఆర్డీఓ సూర్యానారాయణలను రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. అదే విధంగా నియోజకవర్గాల పరిధిలోని తహసీల్దార్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దగ్గర నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు అన్ని బాధ్యతలను వీరు నిర్వర్తించనున్నారు. అదే విధంగా అభ్యర్థుల వ్యయ నిర్ధారణ, ఫిర్యాదులు, చర్యలు వంటివి రిటర్నింగ్ అధికారులు చూసుకుంటారు. పోలింగ్ నిర్వహణకు సుమారు 12 వేల మంది పోలింగ్ నిర్వహణకు సిబ్బందిని కేటాయించే పనిలో జిల్లా అధికారులు ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, ఇతర శాఖల ఉద్యోగులను పోలింగ్ నిర్వహణకు వినియోగించుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సరిపడక పోతే ప్రైవేట్ ఉపాధ్యాయులను విధులకు వాడనున్నారు. జిల్లాలో 1,201 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ పోలింగ్ అధికారి, ఇద్దరు, లేదా ముగ్గురు పోలింగ్ సిబ్బందిని కేటాయించనున్నారు. దీని ప్రకారం 1,201 మంది పోలింగ్ అధికారులు, 1,201 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు , ఇద్దరు సిబ్బందిని వాడితే 2,402 మంది, లేదా ముగ్గురిని కేటాయిస్తే 3,603 మంది ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయించనున్నారు. -
లక్ష మందితో బీజేపీ ‘జనగర్జన’..
ఆదిలాబాద్: షెడ్యూల్ విడుదలతో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరిస్తుంది. ప్రచారంలో భా గంగా రాష్ట్రంలోనే తొలి బహిరంగ సభ ఆదిలాబాద్‌లో నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం జిల్లా కేంద్రానికి విచ్చేయనున్నారు. ఈ బహిరంగసభకు జనగర్జనగా నామకరణం చేశా రు. డైట్ మైదానంలో మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభం కానుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నేతలు బండి సంజయ్, ఈటల ఇతరత్రా ము ఖ్యనేతలతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాలు చూసే జాతీయనేతలు కూడా హాజరు కానున్నారు. ఈ స భ కోసం కొద్ది రోజులుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నా రు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ సభ ద్వారా బీజేపీ ఎన్నికల సమరశంఖం పూరించనుంది. లక్ష జనసమీకరణ.. ఈ సభ కోసం బీజేపీ భారీగా ఏర్పాట్లు చేసింది. డైట్ మైదానంలో నిర్వహిస్తుండగా ప్రాంగణంలో జర్మన్ టెంట్ ఏర్పాటు చేశారు. ఎలాంటి వాతావరణంలోనైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు లక్ష జనాన్ని సమీకరించేలా ప్రణాళిక చేశారు. ఆయా నియోజకవర్గాల బాధ్యులు జనసమీకరణపై దృష్టి సారించారు. కాషాయమయం.. బీజేపీ జనగర్జన సభ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం పూర్తిగా కాషాయమయంగా మారిపోయింది. పట్టణంలోని డివైడర్ పొడవునా, ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చౌక్‌లను పార్టీ జెండాలతో నింపేశారు. ఎన్నికల తొలి బహిరంగ సభ కావడం, కేంద్ర హోంమంత్రితో పాటు జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలు వస్తుండటంతో భారీ ఏర్పాట్లు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. హోంమంత్రి హెలీక్యాప్టర్ అక్కడ దిగనుంది. అక్కడి నుంచి ప్రత్యేక వాహనం ద్వారా డైట్ మైదానానికి చేరుకుంటారు. అడుగడునా బందోబస్తు ఏర్పాటు చేశారు. అమిత్ షా జెడ్‌ప్లస్ సెక్యూరిటీలో ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ డి.ఉదయ్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలీప్యాడ్ స్థలంతో పాటు బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. -
92 శాతం కౌలురైతులకు సీసీఆర్సీలు
సాక్షి, అమరావతి: కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు పంట సాగుదారుల హక్కుల కార్డు (సీసీఆర్సీ)ల జారీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ప్రభుత్వం 92 శాతం లక్ష్యాన్ని సాధించింది. కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వడంతోపాటు వారికి బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు మంజూరు చేయించడంపై ప్రత్యేకదృష్టి సారించింది. భూ యజమానులకు, కౌలురైతులకు మధ్య అవగాహన ఒప్పందాలను కుదిర్చి భూ యజమానులకు నష్టం లేకుండా కౌలురైతులకు మేలుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగానే కౌలురైతులకు సీసీఆర్సీలు జారీచేసి వీలైనంతమందికి బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ప్రతి వారం కలెక్టర్లతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షిస్తున్నారు. కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడంపై సీఎస్ ఇటీవల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తగిన ఆదేశాలిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం 8.81 లక్షలమంది కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 8.10 లక్షలమందికి (92 శాతం) కార్డులు జారీచేశారు. 13 జిల్లాల్లో లక్ష్యానికి మించి ఈ కార్డులు జారీచేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా లక్ష్యాలను సాధించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ద్వారా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయించడంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్డులున్న వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకర్ల కోసం లోన్ చార్జ్ క్రియేష్ మాడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు. అలాగే ఈ–క్రాప్‌తో కౌలురైతుల రుణ ఖాతాలను అనుసంధానించనున్నట్లు చెప్పారు. బ్యాంకులు ఈ ఏడాది ఇప్పటివరకు రూ.948.77 కోట్ల మేర కౌలురైతులకు రుణాలిచ్చాయని తెలిపారు. మరింతమంది కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడానికి అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. బ్యాంకర్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించి, బ్రాంచీల స్థాయిలో మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ యజమానులకు ఎటువంటి హాని కలగకుండానే కౌలురైతులకు రుణాల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ విషయంపై భూ యజమానులకు అవగాహన కల్పించి కౌలురైతులకు సహకరించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. -
ఐటీ హబ్‌గా విశాఖ
సాక్షి, అమరావతి: రానున్న కాలంలో విశాఖ నగరం ఐటీ ఉద్యోగాలకు కేంద్రంగా మారనుంది. ఈ రంగంలో కొత్తగా కెరీర్ ప్రారంభించే వారికి అది అవకాశాల గని కానుంది. ముఖ్యంగా ఐటీ, ఐటీ ఆధారిత రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. వచ్చే ఐదేళ్ల కాలంలో ఐటీ రంగంలో ఒక్క విశాఖపట్నంలోనే ఐదులక్షలకు పైగా ఉపాధి అవకాశాలు వస్తాయని పల్సస్ గ్రూపు తన అధ్యయన నివేదికలో వెల్లడించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో పాటు ఇక్కడ ఉపాధి అవకాశాలపై అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించడంతో ఐటీ హబ్‌గా విశాఖ వేగంగా ఎదుగుతోందని పల్సస్ గ్రూపు సీఈఓ శ్రీనుబాబు గేదెల తెలిపారు. ఇప్పటికే ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, అమెజాన్, అదానీ డేటాసెంటర్ వంటివి రావడంతో పాటు ఆంధ్రయూనివర్సిటీలో ఆర్టీఫిన్ యల్ ఇంటెలిజెన్స్‌పై సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ, పారిశ్రామిక రంగంలో నాలుగో తరం టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కల్పతరువు పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలు ఇక్కడ ఏర్పాటుకావడంతో అంతులేని ఉపాధి అవకాశాల నిధిగా విశాఖ ఎదుగుతోందన్నారు. ఈ ఏడాది భారతదేశం జీ20 సమావేశాలకు వేదికగా ఎంపిక కావడంతో ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్, ఐటీ, ఐటీ ఆధారిత సేవల్లో విశాఖపట్ననికి ఉన్న అవకాశాలు, అందుబాటులో ఉన్న మానవ వనరులను ప్రపంచ దేశాలకు వివరించినట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి ఏటా మూడు లక్షలకు పైగా విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకుంటుంటే అందులో ఒక్క విశాఖ చుట్టుపక్కల నుంచే 1.5 లక్షల మంది వస్తున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించడంలో విశాఖకు ఇది కలిసొచ్చే అతిపెద్ద అంశమని ఆ నివేదికలో పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో కొలువుల పండగ.. ఇక రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు రానుండగా అందులో ఒక్క విశాఖలోనే 5 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు పల్సస్ గ్రూపు అంచనా వేసింది. ఇందులో ఒక్క ఆర్టీఫిన్ యల్ ఇంటెలిజెన్స్ రంగంలోనే విశాఖలో 50,000 ఉద్యోగాలు వస్తాయని ఆ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం విశాఖలోని ఐటీ రంగం 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంటే హెల్త్‌కేర్, ఫార్మా, మెరైన్ ఇండస్ట్రీస్, పర్యాటకం, రక్షణ, విద్య వంటి రంగాలు లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ సంఖ్య ఐదేళ్లలో ఐదు లక్షలకు చేరుతుందని శ్రీనుబాబు వివరించారు. -
ముకేశ్ అంబానీ బాటలోనే..
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ బాటలోనే ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తె జీతాలు తీసుకోకుండా బాధ్యతలు నిర్వహించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు, కమిటీ సమావేశాలలో పాలుపంచుకుంటున్నందుకు ఆకాశ్, ఈషా, అనంత్ ఫీజులు మాత్రమే పొందనున్నారు. అంతేకాకుండా నికర లాభాల నుంచి కమీషన్ అందుకోను న్నారు.ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వాటాదారుల అనుమతి కోరుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఈ అంశాలను వెల్లడించింది. 66ఏళ్ల అంబానీ 2020–21 ఏడాది నుంచి ఎలాంటి జీతాన్ని అందుకోవడంలేదు. అయితే అంబానీ బంధువులు నిఖిల్, హిటల్ వేతనాలతోపాటు.. ఇతర అలవెన్సులు తదితరాలను పొందుతున్నారు. (వాహన స్క్రాపేజీ పాలసీ: కంపెనీలకు నితిన్ గడ్కరీ కీలక సూచనలు) నీతా అంబానీ తరహాలో 2014లో ముకేశ్ భార్య నీతా అంబానీ ఎంపిక తరహాలోనే కవలలు 31ఏళ్ల ఆకాశ్, ఈషా సహా 28ఏళ్ల అనంత్‌ను ఆర్ఐఎల్ బోర్డులో నియమించనున్నారు. 2022–23లో నీతా అంబానీ రూ. 6 లక్షల సిటింగ్ ఫీజు, రూ. 2 కోట్ల కమీషన్ అందుకున్నట్లు ఆర్ఐఎల్ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత నెలలో నిర్వహించిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్ఐఎల్ బోర్డులోకి ముగ్గురునీ ఎంపిక చేశారు. అయితే ముకేశ్ ఆర్ఐఎల్ చైర్మన్, సీఈవోగా మరో ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు. తద్వారా తదుపరితరం నాయకులకు మార్గదర్శకత్వం వహించనున్నారు. కాగా.. ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వీలుగా ఆర్ఐఎల్ పోస్టల్ బ్యాలట్ ద్వారా వాటాదారుల అనుమతి కోరుతోంది. (సీఈవో సంచలన వ్యాఖ్యలు: ఉద్యోగుల నెత్తిన పిడుగు)