జిల్లాలో బుధ, గురువారాల్లో నిర్వహించాల్సిన జన్మభూమి-మా ఊరు గ్రామ సభలు రద్దయ్యూరుు. ఉత్తరాంధ్రలో చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు
ఏలూరు : జిల్లాలో బుధ, గురువారాల్లో నిర్వహించాల్సిన జన్మభూమి-మా ఊరు గ్రామ సభలు రద్దయ్యూరుు. ఉత్తరాంధ్రలో చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు జిల్లాలోని అధికారులు, ఉద్యోగులు తరలివెళ్లిన నేపథ్యంలో ఇక్కడ నిర్వహించాల్సిన గ్రామ సభలను వాయిదా వేసినట్టు కలెక్టర్ కె.భాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 561 సభలు నిర్వహించారు. ఈ నెల 20వ తేదీతో జన్మభూమి కార్యక్రమాల్ని ముగించాల్సి ఉండగా, హుదూద్ తుపాను నేపథ్యంలో తేదీలను పొడిగించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర కోలుకుని, అక్కడి నుంచి అధికారులు, ఉద్యోగులు జిల్లాకు వచ్చిన తరువాతే జన్మభూమి కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయి.