సాక్షి,హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లపై ఏకంగా ఆ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ ఇన్చార్జి దీపదాస్ మున్షీ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేతలు పార్టీ మీటింగులు పెడితే దానికి కార్యకర్తలు రావాలి కానీ 200 రూపాయల కూలీలు రాకూడదని నేతలకు మున్షీ చురకంటించారు. సోమవారం(డిసెంబర్16) హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ రివ్యూ మీటింగ్‌లో మున్షీ చేసిన ఈ వ్యాఖ్యలు కార్యకర్తల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. తమను కూలీలతో పోలుస్తారా అని కార్యకర్తలు ఫైర్ అయ్యారు.
మరోవైపు సీనియర్ నేత హనుమంతరావు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రసంగాలపై మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలు పొద్దంతా కాంగ్రెస్‌తో ఉండి సాయంత్రానికి ఎమ్‌ఐఎమ్‌కు ఓట్లు వేస్తారన్న హనుమంతరావు ,అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై మైనారిటీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment