Deepa Dasmunsi
-
నేడు గాందీభవన్‌లో ఆవిర్భావ దినోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం గాందీభవన్‌లో ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నా యకులు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే లు, పార్టీ నేతలు పాల్గొంటారని వెల్లడించారు. దశాబ్ది ఉత్సవాల శకటం ప్రారంభం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల శకటాన్ని శనివారం గాందీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, మెట్టుసాయి పాల్గొన్నారు. -
9 సీట్లలో గెలుపు ఖాయం
సాక్షి , హైదరాబాద్ : ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నియమించిన ఎన్నికల నిర్వహణ కమిటీ తేల్చి చెప్పింది. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను 13 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ, పోల్ మేనేజ్మెంట్లో విఫలమైనట్లు పేర్కొంది. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ కన్వినర్‌గా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, పుష్పలీల, రాములు నాయక్ తదితరులు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ.. ఈ మేరకు ఒక మధ్యంతర నివేదికను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి సమర్పించింది.తాము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా గుర్తించిన అంశాలను గురువారం గాం«దీభవన్‌లో మున్షీకి వివరించింది. బీఆర్ఎస్ను నిలువరించ గలిగినప్పటికీ, ఆపార్టీ ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని తెలిపింది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మళ్లి, కొన్నిచోట్ల కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బకొట్టినట్లు పేర్కొంది. 13 నుంచి 14 సీట్లు లక్ష్యంగా పనిచేసినా.. లోక్‌సభ ఎన్నికల్లో 13 నుంచి 14 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పార్టీ పనిచేసినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లక పోవడం వల్ల నాలుగైదు సీట్లలో వెనుకబడినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వరంగల్, భువనగిరి, జహీరాబాద్‌లలో ప్రత్యర్థి పారీ్టల కన్నా బలంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.కొన్ని నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్మెంట్లో 2 శాతం నుంచి 8 శాతం వరకు మెరుగ్గా ఉంటే, నాలుగైదు నియోజకవర్గాల్లో 25 శాతం వరకు మెరుగైన స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, చేవెళ్ల, నిజామాబాద్, మెదక్ స్థానాల్లో ఇంకొంత కష్టపడి ఉంటే బాగుండేదని, అయినా ఈ నియోజకవర్గాల్లో కూడా గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా పేర్కొన్నట్లు సమాచారం. మూడుచోట్ల బీజేపీకే అవకాశాలు: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మల్కాజిగిరి, కరీంనగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించలేదని, అప్పటికి ఇప్పటికీ పార్టీ పురోగతి ఆశించినంత లేదని పేర్కొంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సరైన ప్రణాళికతో ముందుకు వెళితే బాగుండేదని కమిటీ సూచించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఓట్లు బదిలీ కావడం, ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడం బీజేపీకి అనుకూలంగా మారినట్లు విశ్లేíÙంచింది. టీజేఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలతో సమన్వయం లేకపోవడం కూడా కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలను దెబ్బకొట్టినట్లు అభిప్రాయపడింది. -
కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దృఢ సంకల్పం కలిగిన కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో నిర్వహించిన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్య అతి«థిగా హాజరై ప్రసంగించారు. సిమెంట్ లేకుండా ఇల్లు ఎలా కట్టలేమో కార్యకర్తలు లేకుండా కాంగ్రెస్ గెలుపు లేదన్నారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల వల్లే పార్టీ బలంగా ఉందని, కార్యకర్తలు చిందించిన చెమట వల్ల తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని, ఎంపీ ఎన్నికల్లో కూడా నల్లగొండ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మెజారిటీ కోసం ఎలా పోటీ పడ్డారో, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. దీపాదాస్ మున్షీ ప్రసంగాన్ని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి తెలుగులోకి అనువదించారు. కార్యకర్తలు గెలిపించాలి: మంత్రి తుమ్మల మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి 1983 నుంచి ఈ ప్రాంతానికి ఎనలేని సేవలందించారని, అభివృద్ధికి కృషి చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ, రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల విషయంలో నిబద్ధతతో ముందుకుసాగి కీర్తి గడించారన్నారు ఆయన తనయుడిగా రఘువీర్‌రెడ్డిని కార్యకర్తలు అంతా కలిసి గెలిపించాలన్నారు. రావి నారాయణరెడ్డిని మించిన మెజారిటీతో: మంత్రి కోమటిరెడ్డి దేశంలోనే నల్లగొండ పార్లమెంట్ స్థానంలో అత్యధిక మెజారిటీ సాధించిన రావి నారాయణరెడ్డిని మించిన మెజారిటీతో రఘువీర్‌రెడ్డిని గెలిపించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తామంతా టీం వర్క్ చేస్తున్నామని, నల్లగొండ ఎంపీ అభ్యర్థి 6 లక్షల ఓట్ల మెజారిటీ టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలునాయక్, జయవీర్‌రెడ్డి, బి.లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్, చెవిటి వెంకన్న యాదవ్ తదితరులు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు: మంత్రి ఉత్తమ్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ఉండదని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గతంలో తెలంగాణకు హామీలు ఇచ్చిన బీజేపీ వాటిని అమలు చేయకుండా, ఈ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. బయ్యారం స్టీల్‌ప్లాంట్, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ఇస్తానని ఇవ్వలేదని దుయ్యబట్టారు. నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో నామరూపాలు లేకుండా పోవడం ఖాయమన్నారు. ఈ ప్రాంత సమస్యలపై తాను ఎంపీగా పార్లమెంట్లో గళమెత్తానని, తన స్థానంలో నల్లగొండ ఎంపీగా రఘువీర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎంపీగా తాను ఐదేళ్లలో ఏడు నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించానన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రాంతానికి రైల్వేలైన్ మంజూరు చేయించానన్నారు. వేలాది ఎకరాలకు ఎత్తిపోతల ప«థకాలు ఏర్పాటు చేసి సాగునీరు అందించామన్నారు. ఇతర పార్టీల నేతలను తాము బలవంతంగా కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం లేదని, వారే స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్పారు. -
కాంగ్రెస్ పోరాటం బీజేపీతోనే కాదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది కేవలం బీజేపీతో మాత్రమే కాదని, ప్రమాదంలో పడిన రాజ్యాంగ హక్కులను కాపాడే దిశగా పోరా టం కొనసాగుతోందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలని, ఆ దిశలో పార్టీ నేతలు కృషి చేయాలని ఆమె కోరారు. శుక్రవారం టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత బలో పేతం చేసేందుకు గాను రాష్ట్రంలో అత్యధిక స్థానా ల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో టీపీసీసీ ప్రచార కమిటీ ప్రతినిధులు పనిచేయాలని, పదేళ్ల బీఆర్ఎస్ రాక్షస పాలన, మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్, మోదీల పదేళ్ల దుర్మార్గ పాలన, రేవంత్ 100 రోజుల ప్రజాపాలన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీసీ కార్యదర్శి పవన్, ప్రచార కమిటీ కో కన్వీనర్ తీన్మార్ మల్లన్న, సభ్యులు రమ్యారావు, ఆనంద్, వజీర్ ప్రకాష్ గౌడ్, దయాకర్ పాల్గొన్నారు. -
నేడు పీఈసీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం శుక్రవారం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరగనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఏప్రిల్ 6న తుక్కుగూడలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొనే సభను విజయవంతం చేసే అంశంపై కూడా సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్చార్జ్ దీపా దాస్‌మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, పీఈసీ సభ్యులు పాల్గొంటారు. ‘జాతీయ మేనిఫెస్టో కమిటీ’ ఏర్పాటు పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు చైర్మన్‌గా ‘ప్రజల ముంగిట్లోకి జాతీయ మేనిఫెస్టో కమిటీ’ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ మేనిఫెస్టో ప్రజల చెంతకు చేరేలా ఏం చేయాలనే దానిపై ఈ కమిటీ 15 రోజుల్లో టీపీసీసీకి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీలో కన్వీనర్‌గా ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, పీసీసీ మేధావుల విభాగం చైర్మన్ శ్యాంమోహన్, మాజీ ఎమ్మెల్సీ కమలాకరరావు, ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ బీఎం వినోద్‌కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి మహ్మద్ రియాజ్, ఐఎన్టీయూసీ కార్యదర్శి జనక్ ప్రసాద్ ఉన్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. -
తండాల స్థాయి నుంచి కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం గిరిజన నేతలు కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ కోరారు. తండాల స్థాయి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. గాందీభవన్‌లో శనివారం జరిగిన ఆదివాసీ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. లోక్‌సభ అభ్యర్థులతో గిరిజన విభాగం సమ న్వయం చేసుకోవాలని, ప్రతి అసెంబ్లీ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, పార్ల మెంట్ నియోజక వర్గాల వారీగా భారీ సభలను గిరిజనులతో ఏర్పాటు చేయాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీని ప్రధాని చేయడంలో గిరిజనులు ప్రధాన భూమిక పోషించాలన్నారు. ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ బెల్ల య్యనాయక్ మాట్లాడుతూ...అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన విధంగానే రాష్ట్రంలో 13–14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర వైస్ చైర్మన్ రఘు నాయక్, కోఆర్డినేటర్లు గణేశ్ నాయక్ పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీ మేయర్‌కు కాంగ్రెస్ ఆహ్వానం
బంజారాహిల్స్ (హైదరాబాద్): ‘రెండుసార్లు కార్పొరేటర్‌గా బంజారాహిల్స్ డివిజన్ ప్రజలు గెలిపించారు. దీపాదాస్ మున్షీ మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. మా డివిజన్ ప్రజలు, కార్యకర్తలు, కార్పొరేటర్లతో చర్చించిన తర్వాతనే నా నిర్ణయం ప్రకటిస్తాను’ అని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డిలు బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కేశవరావు ఇంటికి వెళ్లారు. అక్కడే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేశవరావులతో గంటపాటు చర్చించారు. కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా, పార్టీని బలోపేతం చేయా ల్సిందిగా దీపాదాస్ వారిని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో విజయలక్ష్మి రాజకీయ భవిష్యత్‌పై భరోసా ఇచ్చినట్టు సమాచారం. -
నేడు టీపీసీసీ విస్తృత భేటీ
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో బుధవారం మద్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్య మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీతోపాటు ఏఐసీసీ ఇన్చార్జ్ కార్యదర్శులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, పీఏసీ, పీఈసీ సభ్యులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్య దర్శులు, డీసీసీ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల చైర్మన్లు, అధికార ప్రతినిధులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతంపై రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఇన్చార్జ్గా నియమితురాలైన తర్వాత మంగళ వారం తొలిసారి రాష్ట్రానికి వచ్చిన దీపాదాస్ మున్షీ కి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కు మార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరు సతీశ్ తదితరులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. సీఎంను కలిసిన దీపాదాస్ మున్షీ రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ హోదాలో దీపాదాస్ మున్షీ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై కాసేపు ఆయనతో చర్చించారు. అంతకు ముందు మంత్రి ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డితోనూ మున్షీ భేటీ అయ్యారు. రేపు ఢిల్లీకి రేవంత్ సీఎం రేవంత్ గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్ల మెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకుగాను అన్ని రాష్ట్రాల సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన డిల్లీ వెళ్లనున్నట్టు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది. -
భూసేకరణ సమస్యలతో పథకాలలో జాప్యం
సాక్షి, హైదరాబాద్: భూసేకరణలో సమస్యలతోనే ప్రభుత్వ పథకాల అవులులో జాప్యం జరుగుతోందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి దీపాదాస్మున్షీ అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆరవ యూరో ఇండియా సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా వూట్లాడుతూ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ధి సాధ్యవుని చెప్పారు. గ్రావూలను వదలి, నగర బాట పడుతున్న యువతకు ఉపాధి కల్పన సవాల్‌గా మారిందన్నారు. పట్టణాలకు వలసలు పెరిగాయని, 2031నాటికి రెట్టింపయ్యే అవకాశం ఉందని, ఇందుకు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు రూపొందిస్తున్నా, భూసేకరణలో అడ్డంకులు ఎదురవుతున్నందునే చట్టానికి మార్పులు చేశామన్నారు. హైదరాబాద్ కన్నా ఇతర నగరాల్లో మెరుగైన పరిస్థితులున్నాయని, దీనిపై అధ్యయనం చేయాలని ఆమె నిపుణులకు సూచించారు. జనాభాకు తగినట్టు వలిక సదుపాయూలు...వుహీధర్ పట్టణీకరణ పెరిగి, పలు సమస్యలు ఎదురవుతున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పట్టణాలకు వలసలు, 2011 నాటికి 33.49 శాతానికి పెరిగాయని, నగరాలు, పట్టణాల్లో మురికివాడల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నావుని తెలిపారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టావుని, నీరు, విద్యుత్, పర్యావరణ రక్షణను పరిగణనలోనికి తీసుకుని భవన నిర్మాణాలు చేపట్టాలని కచ్చితమైన ఆదేశాలు ఇచ్చావుని అన్నారు.