
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో తెలంగాణ రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో కొత్త ఇంఛార్జ్‌ని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం లోపే కొత్త ఇంఛార్జ్‌ను నియమించడానికి హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ఇంఛార్జ్‌లను ఏఐసీసీ మార్చనుంది. రాష్ట్ర నేతలకు ఇప్పటికే అధిష్ఠానం సంకేతాలు ఇచ్చింది. ఏడాదిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో స్థానిక నేత అయిన దీపాదాస్ మున్షీకి పశ్చిమ బెంగాల్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి ఏఐసీసీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కొత్త ఇంఛార్జ్‌ను యమించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న దీపాదాస్ మున్షీ స్థానంలో మాజీ ముఖ్యమంత్రికి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా, గత వారం హైదరాబాద్‌లోని కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో సీఎంతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీ కోసం అందరం కలసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Telangana: గీత దాటితే వేటే..!
Comments
Please login to add a commentAdd a comment