incharge
-
రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్చార్జ్గా మీనాక్షి నటరాజన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ను మారుస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీపాదాస్ మున్షీని తప్పించి, ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)కు బాధ్యతలను కట్టబెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇక పార్టీ సీనియర్ నేత కొప్పుల రాజుకు జార్ఖండ్ వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. వీరితోపాటే మరో ఏడుగురు సీనియర్ నేతలను వివిధ రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. పూర్తిస్థాయి పర్యవేక్షణ కోసమే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన కొద్దిరోజులకే ఇన్ చార్జ్‌గా ఉన్న మాణిక్‌రావ్ థాక్రేను గోవాకు పంపిన ఏఐసీసీ, కేరళ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న దీపాదాస్ మున్షీకి రాష్ట్ర బాధ్యతలను అదనంగా కట్టబెట్టింది. అప్పటి నుంచి ఆమె పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటున్నారు. అయితే పారీ్టనేతలకు ఆమె అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ప్రభుత్వంతో పార్టీని సమన్వయం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలొచ్చాయి. ఇటీవల కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ.. పార్టీలో నెలకొన్న అసంతృప్తిని తట్టిలేపింది. ఆమె సారథ్యంలో సీఎల్పీ భేటీ నిర్వహించి సరిదిద్దే ప్రయత్నం చేసినా,.. ఈ అంశం ఏఐసీసీకి చేరింది. ఆమెస్థానంలో పూర్తిస్థాయి నేతకు బాధ్యతలు కట్టబెట్టాలని నిర్ణయించారు. రాహుల్ టీమ్ నుంచే.. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌లోని బిర్లాగ్రామ్ నాగ్డాలో జన్మించారు. ఆమె బయోకెమిస్ట్రీలో పీజీ, న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. 1999లో ఎన్ఎస్యూఐ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2002–2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమెను, 2008లో ఏఐసీసీ కార్యదర్శిగా రాహుల్‌గాంధీ ఎంపిక చేశారు. అప్పటి నుంచి రాహుల్ టీమ్‌లో ఉన్న ఆమె 2009లో మంద్సౌర్ నుంచి ఎంపీగా పోటీ చేసి.. 1971 నుంచి అక్కడ గెలుస్తున్న లక్ష్మీనారాయణ్ పాండేను ఓడించారు. అనంతరం 2014, 2019 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు.అయినా రాహుల్ టీమ్‌లో కొనసాగిన ఆమె భారత్ జోడోయాత్ర, న్యాయ్‌యాత్రలో క్రియాశీల పాత్ర పోషించారు. 2023 ఆగస్టు 6న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆమెను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా నియమించారు. భూదా న్ పోచంపల్లి నుంచి పాదయాత్ర చేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. తాజాగా ఆమెకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. అయితే.. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ అంశంపై చర్చించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి హడావుడిగా ఢిల్లీ వచ్చారనే ప్రచారం జరిగింది. ఆయన ఢిల్లీ చేరే సమయానికే ఏఐసీసీ నుంచి కొత్త ఇన్చార్జ్పై ప్రకటన వెలువడింది. జార్ఖండ్‌కు కొప్పుల రాజు రాహుల్ టీమ్‌కే చెందిన కొప్పుల రాజును జార్ఖండ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా ఏఐసీసీ నియమించింది. 15 ఏళ్లుగా పార్టీ మేనిఫెస్టో, విధాన రూపకల్పన, పార్టీపరంగా కేంద్రంపై లేవనెత్తాల్సిన అంశాలపై ప్రధాన సలహాదారుగా ఉన్న ఆయనకు జార్ఖండ్ బాధ్యతలు కట్టబెట్టారు. ఆయన గత ఎన్నికల్లో ఏపీలోని నెల్లూరు నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఆయన ఓడిపోయారు. -
తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్
సాక్షి, ఢిల్లీ: తొమ్మిది రాష్ట్రాలకు ఇంఛార్జ్‌లను ఏఐసీసీ ప్రకటించింది. దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. 2009లో మధ్యప్రదేశ్ మాండసోర్ నుంచి ఎంపీగా మీనాక్షి నటరాజన్ పనిచేశారు.హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లను ఏఐసీసీ నియమించింది. పంజాబ్, జమ్మూకశ్మీర్‌లకు కొత్త జనరల్ సెకట్రరీలను కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. -
దీపాదాస్ మున్షీ మార్పు.. వారం లోపే కొత్త ఇంఛార్జ్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో తెలంగాణ రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో కొత్త ఇంఛార్జ్‌ని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం లోపే కొత్త ఇంఛార్జ్‌ను నియమించడానికి హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ఇంఛార్జ్‌లను ఏఐసీసీ మార్చనుంది. రాష్ట్ర నేతలకు ఇప్పటికే అధిష్ఠానం సంకేతాలు ఇచ్చింది. ఏడాదిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో స్థానిక నేత అయిన దీపాదాస్ మున్షీకి పశ్చిమ బెంగాల్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.రాష్ట్రంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి ఏఐసీసీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కొత్త ఇంఛార్జ్‌ను యమించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న దీపాదాస్ మున్షీ స్థానంలో మాజీ ముఖ్యమంత్రికి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.కాగా, గత వారం హైదరాబాద్‌లోని కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో సీఎంతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీ కోసం అందరం కలసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: Telangana: గీత దాటితే వేటే..! -
‘నీ అక్రమ అరెస్టులు, ఉడత బెదిరింపులకు భయపడం’: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొణతం దిలీప్‌ను సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా హెడ్‌గా కొణతం దిలీప్ వ్యవహారించారు.అయితే,కొణతం దిలీప్ కుమార్ అరెస్ట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీప్ అరెస్ట్ అయ్యారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో కేటీఆర్ ఏమన్నారంటే ప్రశ్నిస్తే సంకెళ్లు...నిలదీస్తే అరెస్టులు..నియంత రాజ్యమది...నిజాం రాజ్యాంగమిది..కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ గారి అరెస్ట్ విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా?ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావ్!ప్రజాస్వామ్య…— KTR (@KTRBRS) November 18, 2024 -
బీఆర్ఎస్ సోషల్‌మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ సోషల్‌మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం(నవంబర్ 18) అరెస్టు చేశారు. సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారన్న కారణంగా దిలీప్‌ను అరెస్టు చేసినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. దిలీప్‌ను అరెస్టు చేసిన అనంతరం ఆయనకు ఉస్మానియా ఆస్పత్రితో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. కొణతం దిలిప్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా వింగ్‌కు తొలి డైరెక్టర్‌గా పనిచేశారు.ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు సరికాదు: హరీశ్‌రావు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎక్స్(ట్విటర్)లో పెట్టిన పోస్టుకు సంబంధించిన కేసులో దిలీప్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దిలీప్ అరెస్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. -
కశ్మీర్ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ ప్లాన్
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ స్కెచ్ గీసింది. ఈ క్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ను మళ్లీ తెర మీదకు తెచ్చింది. ఆయన్ని జమ్ము కశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జీగా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. 2014 ఎన్నికల్లో జమ్ము కశ్మీర్లో బీజేపీని అధికారంలోకి(సంకీర్ణం) తీసుకురావడంలో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు. రామ్ మాధవ్ దాదాపు ఆరేడు సంవత్సరాల పాటు బీజేపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అక్కడి రాజకీయాలపై అనుభం ఉన్న రామ్‌మాధవ్‌ను బీజేపీ మళ్లీ రంగంలోకి దించింది. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రంకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎన్నికల ఇన్‌చార్జీగా రామ్‌మాధవ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్నికల ఇన్‌చార్జీగా రామ్‌మాధవ్ కీయాశీలక రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా అభయ్ పాటిల్
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా కర్ణాటక నేత అభయ్ పాటిల్‌ను నియమించింది ఆ పార్టీ అధిష్టానం. ఇంతకు మందు.. లోక్‌సభ ఎన్నికల టైంలోనూ తెలంగాణ బీజేపీ ఇంఛార్జిగా ఆయన వ్యవహరించారు. ఈయన పూర్తి పేరు అభయ్‌కుమార్ పాటిల్ దక్షిణ బెల్గాం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కార్యకర్తగా బీజేపీలో తన ప్రస్థానం ప్రారంభించిన అభయ్కు సోషల్ మీడియా ద్వారా యూత్‌తో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకవైపు సామాజిక కార్యక్రమాలతో పాటు మరోవైపు.. నియోజకవర్గానికి ఐటీ పార్క్ ఏర్పాటు లాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో ఆయన ప్రజల దృష్టిని ఆకర్షించగలిగారు. బెలగావి అభివృద్ధి కోసం విజన్ 2040 పేరిట ఆయన ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం కూడా లభించింది. -
జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ( జీహెచ్ఎంసీ) ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ మూడు రోజుల పాటు లీవ్‌లో వెళుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. -
BRS: రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు
సాక్షి,గజ్వేల్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం(ఏప్రిల్14) భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో జరిగిన ఈ భేటీ సందర్భంగా రాజయ్యకు స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్‌కుమార్ గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా రాజయ్యకు కేసీఆర్ సూచించారు. కాగా, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ సీటును కేసీఆర్ రాజయ్యకే ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో సుధీర్‌కుమార్‌కు కేటాయించారు. అయినా స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో స్టేషన్‌ఘన్‌పూర్ ఇంఛార్జ్ బాధ్యతల కోసం రాజయ్య తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చినట్లు చెబుతున్నారు. తాను బీఆర్ఎస్ను వీడుతున్నట్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. కవితతో ముగిసిన కేటీఆర్ ములాఖత్ -
కోనసీమలో జనసేనకు ఎదురుదెబ్బ
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీకి అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు రాజీనామా చేశారు. అమలాపురంలో పార్టీ అధిష్టానం చాలా అన్యాయం చేసిందని రాజబాబు మండిపడ్డారు. అమలాపురంలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని.. జనసైనికులు, వీర మహిళల ఆశయాల మీద నీళ్లు చల్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ అమలాపురం సీటును టీడీపీకి కేటాయించారు. తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా అనైతికంగా సీటు దక్కించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమాలు చేసి అమలాపురంలో జనసేన జెండాను నిలబెట్టాను. టీడీపీ జెండా మోయడానికి సిద్ధంగా లేము. పవన్ కల్యాణ్ ఓ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి పార్టీ ఇంచార్జ్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నాను’’ అని రాజబాబు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన మునిసిపల్ ఏఈ
విజయవాడస్పోర్ట్స్: ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ వర్క్ ఆర్డర్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఏఈ తోట ఈశ్వర్‌కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈశ్వర్‌కుమార్ డివిజన్–4 వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఇన్చార్జ్ ఏఈగా పని చేస్తున్నాడు. కార్పొరేషన్ పరిధిలోని న్యూ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఏఎస్ ఎకో మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ సొల్యూషన్ యజమాని షేక్ సద్దాంహుస్సేన్ నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే వర్క్ ఆర్డర్ కోసం అగ్రిమెంట్ ప్రాసెస్ చేయాలని డివిజన్–4 వెహికల్ డిపో ఈఈ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రాసెస్ కోసం రూ.50 వేలను ఇవ్వాలని ఈశ్వర్‌కుమార్ పట్టుబట్టాడు. దీంతో సద్దాంహుస్సేన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వల పన్ని కార్యాలయంలోనే రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ ఈశ్వర్‌కుమార్‌ను సోమవారం అదుపులోకి తీసుకుని ఏసీపీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. -
ఇన్చార్జులపై ‘రూకలు’పోటు
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో టీడీపీ మసిబూసి మారేడు కాయ చేసి ప్రస్తుత ఇన్చార్జులను వంచించేందుకు యత్నిస్తోంది. ఇప్పటివరకు వారిచేత డబ్బులు ఖర్చుచేయించి ఇప్పుడు రోకలిపోటుకు సిద్ధమైంది. మంత్రా ల యం, ఎమ్మిగనూరు, ఆదోనిలో అభ్యర్థులను మార్చేందుకు యోచిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై టీడీపీ జోన్–4 ఇన్చార్జ్ బీద రవిచంద్రయాదవ్ పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుత ఇన్‌చార్జ్‌లు డైలమాలో పడ్డారు. ఎమ్మిగనూరు ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయనను కాదని మాచాని సోమనాథ్‌ను బరిలోకి దించే యోచనలో టీడీపీ ఉంది. శనివారం కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, సోమనాథ్‌ను కలిశారు. టికెట్ విషయం ప్రస్తావించారు. అయితే సమయం ఇవ్వాలని ఆలోచించి చెబుతా మని సోమనాథ్ చెప్పినట్లు తెలుస్తోంది. సోమనాథ్‌కు టికెట్ ఇస్తే జయనాగేశ్వరరెడ్డి రాజకీయ ప్రయాణం ముగిసినట్లే! ఆదోని ఇన్చార్జ్గా మీనాక్షి నాయుడు కొనసాగుతున్నారు. పొత్తులో భాగంగా జనసేన తరఫున సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ టికెట్ దక్కించుకోవాలని భావిస్తున్నారు. కుదరకపోతే తానే టీడీపీ తరఫున బరిలోకి దిగాలనే యోచన కూడా చేస్తున్నట్లు తెలు స్తోంది. టీజీ వెంకటేశ్‌కు బంధువు కావడంతో విశ్వప్రసాద్‌కు టికెట్ ఇప్పించేందుకు వెంకటేశ్, భరత్ కూడా యత్నిస్తున్నట్లు తెలు స్తోంది. దీంతో మీనాక్షినాయుడు శుక్రవారం ఆదోని లో సదస్సు నిర్వహించారు. ‘ఎవరంటే వారు టికెట్ అడుగుతున్నారని, ఇదేమైనా సినిమా టికెట్టా? అంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నట్లు తె లుస్తోంది. తనకేనా లేదా తన కుమారుడు భూపాల్ నాయుడుకైనా టికెట్ వస్తుందని,లేనిపక్షంలో ఏం చేయాలో ఆలోచిస్తానని చెప్పినట్టు సమాచారం. మంత్రాలయంలో రాఘవేంద్ర జపం మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్గా తిక్కారెడ్డి ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో తిక్కా రెడ్డి ఓడారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కాకుండా బీసీ వర్గానికి చెందిన రాఘవేంద్రని బరిలోకి దించాలని టీడీపీ యోచిస్తోంది. ఇటీవల టీడీపీలో చేరిన రాఘవేంద్ర.. చంద్రబాబును కలిశారు. కచ్చితంగా బీసీలకే టిక్కెట్ ఇస్తామని, డబ్బులు సిద్ధం చేసుకోవాలని రాఘవేంద్రకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో 2 ఎన్నికల్లో టీడీపీ కోసం భారీగా ఖర్చు చేశానని, తనకు టి కెట్ ఇవ్వకపోతే పార్టీలో కొనసాగనని తిక్కారెడ్డి తన వర్గీయులతో చెప్పినట్లు సమాచారం. -
భూమన అభినయ్ ఫస్ట్ ఇంటర్వ్యూ..తిరుపతి ఇంచార్జ్ గా ప్రకటించిన తరువాత
-
ఠాక్రేకు టీపీసీసీ వీడ్కోలు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్న మున్షీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల నుంచి అధిష్టానం తప్పించిన నేపథ్యంలో మాణిక్ రావ్ ఠాక్రే తన సొంత రాష్ట్రా నికి వెళ్లిపోయారు. గోవా ఇన్ చార్జిగా నియమితులైన ఆయన కు ఆదివారం ఎమ్మెల్యే క్వార్ట ర్స్‌లో పలువురు టీపీసీసీ నేత లు కలిసి అభినందనలు తెలి పారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉపాధ్యక్షులు హర్కర వేణు గోపాల్, అంజన్‌కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ఏఐసీసీ సభ్యుడు ఎం.ఎ.ఫహీం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు భూపతిరెడ్డి నర్సారెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆయనను కలిసి వీడ్కోలు పలికారు. ఠాక్రేకు టీపీసీసీ పక్షాన జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలోనే మహారాష్ట్ర కు వెళ్లినట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త ఇన్చార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షీ త్వర లో బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం. -
ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా మంత్రి సీతక్క!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్చార్జిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు చేశారు. ఇన్చార్జి మంత్రిగా ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పథకాలు, పాలన తీరుపై సమీక్షలు, సమావేశాల నిర్వహణ, ప్రజాపాలనపై పర్యవేక్షణ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగే ప్రభుత్వ వ్యవహారాలన్నీ సమన్వయం చేస్తారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆమె ఇన్చార్జి మంత్రిగా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం ఎస్టీ రిజర్వు కావడంతో ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ములుగు ఎమ్మెల్యేను సీతక్కను జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వ్యవహరించారు. ఇవి చదవండి: ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం -
జగనన్న సైనికురాలిని.. సీటు ఇవ్వకున్నా ఆయన వెంటే: మంత్రి రోజా
-
మహిళాకూలీతో అంగన్వాడీ నిర్వహణ
మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండలంలోని కంచన్‌పల్లి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ఓ మహిళా కూలీ టీచర్ అవతారమెత్తారు. కేంద్రంలో టీచర్, ఆయా లేకపోవడంతో ఓ కూలీని పెట్టి కేంద్రం నిర్వహణ కొనసాగించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూడగా, మహిళా కూలీ బెత్తం చేతబట్టుకుని పిల్లలను వారించడాన్ని చూశారు. కూలీతో అంగన్వాడీ కేంద్రం నిర్వహించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వగా.. అంగన్వాడీ కేంద్రంలో కూలీని పెట్టలేదని, పక్క అంగన్వాడీ కేంద్రానికి ఇన్చార్జ్ ఇచ్చినట్లు సూపర్వైజర్ మల్లమ్మ తెలిపారు. -
ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్
-
జనసేనకు ‘మేడా’ గుడ్‌బై
మధురపూడి: తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన మేడా గురుదత్త ప్రసాద్ సహా 100 మంది ఆ పార్టీకి రాజీనామా చేశారు. కోరుకొండలో ఆదివారం ఆయన మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం గురించి మాట్లాడే జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్.. ఆ పార్టీలో ఉన్న వారికి కూడా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉంటాయన్న విషయం తెలుకోలేకపోవడం బాధాకరమని, ఈ కారణంగానే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని గురుదత్త ప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజారాజ్యం, తరువాత జనసేన పార్టీలో కలిపి 16 ఏళ్లు అంకితభావంతో పనిచేశానని చెప్పారు. పార్టీలో ఒంటెద్దు పోకడలు నెలకొన్నాయని, అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందని, ఈ కారణంతోనే మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణతోపాటు తోట చంద్రశేఖర్, అద్దేపల్లి శ్రీధర్, రాజురవితేజ, జయలలిత వద్ద చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ సహా 11 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు జనసేనకు గుడ్‌బై చెప్పారని గుర్తుచేశారు. వారితో పోలిస్తే తాను చాలా చిన్నవాడినన్నారు. తనను నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తప్పిస్తున్నట్లు తనకు తెలియజేయలేదని, అధిష్టానం అపాయింట్మెంట్ కోసం 87 రోజులుగా వేచి చూశానని.. చివరకు ఈ అవమానం భరించలేక రాజీనామా చేస్తానని గత నెల 30న లేఖ రాసినప్పటికీ ఎవ్వరూ స్పందించలేదన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ తీరు కారణంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గురుదత్త ప్రసాద్ తెలిపారు. ఆయనతో పాటు జనసేన కోరుకొండ మండలాధ్యక్షుడు మండపాక శ్రీను, రాజానగరం మండలాధ్యక్షుడు బత్తిన వెంకన్నదొర, ఉపాధ్యక్షుడు నాగారపు భానుశంకర్, నాయకులు అడబాల సత్యనారాయణ, కొచ్చెర్ల బాబీతోపాటు 100 మంది జనసేనకు గుడ్‌బై చెప్పారు. త్వరలో మరికొందరు కూడా రాజీనామా చేస్తారని మేడా తెలిపారు. స్థానిక నాయకత్వం వన్‌మ్యాన్ షోలా వ్యవహరించడం, ఇతర సమస్యల కారణంగా రాజీనామాలు తప్పవన్నారు. ఏ పార్టీలో చేరేదీ త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. -
దయచేసి రావాలి..!!
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసినా పార్టీ నాయకులు, క్యాడర్ బయటకు రాకపోవడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ పార్టీ అధినేత ఇబ్బందుల్లో ఉన్నా ఎక్కడా నిరసనలు చేయకపోవడం సరికాదన్నారు. ఎందుకు ఆందోళనలు చేయడం లేదని చాలామంది తనను అడుగుతున్నారని, తనకు చాలా బాధగా ఉందని, ఇప్పటికైనా జనసమీకరణ చేయాలని పార్టీ నాయకులను ప్రాధేయపడ్డారు. ఆదివారం కృష్ణా జిల్లా టీడీపీ ఇన్‌ఛార్జీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎలాగైనా జనాన్ని తరలించాలని అచ్చెన్నాయుడు వేడుకుంటున్న ఆడియో లీక్ అయింది. ‘పార్టీ అధ్యక్షుల వారిని అరెస్టు చేశారు. ఇంతకంటే మనకు, పార్టీకి ప్రాధాన్యత అంశం ఇంకొకటి లేదు.. రాదు కూడా! నేను ఈ కాన్ఫరెన్స్ నిర్వహించటానికి కారణం... ఆ చుట్కుపక్కల ప్రాంతాల్లో చాలా తక్కువ మంది మొబిలైజేషన్ ఉంది. పోలీసులు ఆపుతున్నారని మీరు అనవచ్చు. వాళ్లు చేస్తారు. దయ ఉంచి.. ఎక్కడి కక్కడ అర్బన్ నియోజకవర్గాల్లో బొండా ఉమ, గద్దె రామ్మోహన్, వన్‌టౌన్ నాయకులు, బోడె ప్రసాద్ బయటకు రావాలి. పెద్ద నాయకులను హౌస్ అరెస్టు చేస్తున్నారు గానీ సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్‌కు ఎక్కడా ఇబ్బంది లేదు. వెంటనే అందరూ రంగంలోకి దిగి జనసమీకరణ చేయాలి. అందులో మహిళలు ఎక్కువ మంది ఉండాలి’ అని అందులో అచ్చెన్న పేర్కొన్నారు. రాత్రి నుంచి చెబుతూనే ఉన్నా.. తాను రాత్రి 3 గంటల నుంచి జనసమీకరణ గురించి అందరికీ చెబుతూనే ఉన్నానని విజ యవాడ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురాం కాన్ఫరెన్స్‌లో వివరణ ఇచ్చారు. తమ నియోజకవర్గం వాళ్లను పో లీస్ స్టేషన్లో పెట్టారని, వాళ్లంతా చాలా చికాకుగా ఉందని ఫోన్లు చేస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాపోయారు. మహిళల్ని ఇబ్బంది పెట్టకపోయినా... వెళ్లిపోతారా? లేదా వ్యాన్ ఎక్కించమంటారా? అని అడుగుతున్నారని చెప్పారు. సెకండరీ లీడర్లు చాలా భయపడుతున్నారని, ప్రాక్టికల్‌గా చాలా ఇబ్బందిగా ఉందన్నారు. పోలీసులు బయటకు రానివ్వడం లేదని విజయవాడ సెంట్రల్ ఇన్‌ఛార్జి బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. చాలా ఇబ్బందులున్నాయని, 20 మంది కార్యకర్తలను పంపిస్తే రాత్రి 11 గంటలకు వదిలారని మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసి తిప్పుతున్నా చిన్న చిన్న కారణాలు చెప్పి బయటకు రాకపోవడం బాగోలేదని టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్థన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీజేపీ ఇన్చార్జీ కమిటీల నియామకం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర బీజేపీ వివిధ కమిటీల నియామకాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే కొన్ని కమిటీలను ఏర్పాటు చేయగా తాజాగా 17 లోక్‌సభ స్థానాలకు ‘పార్లమెంట్ ప్రభారీలు’ (ఇన్చార్జీలు), 33 జిల్లాలకు ఇన్చార్జీలను నియమించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆయా కమిటీల సభ్యలను నియమించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ప్రభారీలు వీరే... ఆదిలాబాద్–అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దపల్లి–విశ్వవర్ధన్రెడ్డి, కరీంనగర్–పి.గంగారెడ్డి, నిజామాబాద్–వెంకటరమణి, జహీరాబాద్–బద్దం మహిపాల్‌రెడ్డి, మెదక్–ఎం.జయశ్రీ, మల్కాజిగిరి–ఎ.పాపారావు, సికింద్రాబాద్–దేవకి వాసుదేవరావు, హైదరాబాద్–గోలి మధుసూదన్‌రెడ్డి, చేవెళ్ల–పి,సుగుణాకరరావు, మహబూబ్‌నగర్–వి.చంద్రశేఖర్, నాగర్‌కర్నూల్– ఎడ్ల ఆశోక్‌రెడ్డి, నల్లగడొండ–చాడ శ్రీనివాసరెడ్డి, భువనగిరి–అట్లూరి రామకృష్ణ, వరంగల్–వి.మురళీథర్గౌడ్, మహబూబాబాద్–ఎన్.వెంకటనారాయణరెడ్డి, ఖమ్మం–కడగంచి రమేశ్. జిల్లా ఇన్చార్జీలు వీరే... ఆదిలాబాద్–బద్దం లింగారెడ్డి, నిర్మల్–ఎం. మల్లారెడ్డి, కొమురం భీమ్–ఎం.మహేశ్‌బాబు, నిజామాబాద్–కళ్లెం బాల్‌రెడ్డి, కామారెడ్డి–ఎర్ర మహేశ్, కరీంనగర్– మీసాల చంద్రయ్య, జగిత్యాల– చంద్రశేఖర్, పెద్దపల్ల–రావుల రాంనాథ్, రాజన్న సిరిసిల్ల–జి.మనోహర్‌రెడ్డి, సంగారెడ్డి–జె.రంగారెడ్డి, మెదక్–డా.ఎస్.మల్లారెడ్డి, రంగారెడ్డి రూరల్–పి.అరుణ్ కుమార్, వికారాబాద్–వి.రాజవర్ధన్‌రెడ్డి, మేడ్చల్ అర్బన్–గిరిమోహనశ్రీనివాస్, మేడ్చల్ రూరల్– వి.నరేందర్‌రావు, నల్లగొండ–ఆర్.ప్రదీప్‌కుమార్, యాదాద్రి– జె.శ్రీకాంత్, మహబూబ్‌నగర్ కేవీఎల్ఎన్ రెడ్డి, వనపర్తి–బోసుపల్లి ప్రతాప్, నాగర్‌కర్నూల్–టి.రవికుమార్, గద్వాల–బి.వెంకటరెడ్డి, నారాయణపేట–కె.జంగయ్య యాదవ్, హనుమకొండ–అడ్లూరి శ్రీనివాస్, వరంగల్– కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, భూపాలపల్లి–ఎస్.ఉదయ్ ప్రతాప్, జనగామ–యాప సీతయ్య, మహబూబాబాద్–బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ములుగు– ఎ.వెంకటరమణ, ఖమ్మం–ఎస్.విద్యాసాగర్‌రెడ్డి, కొత్తగూడెం–ఆర్.రుక్మరాజు, గోల్కొండ–గోషామహల్–ఎస్.నందకుమార్‌యాదవ్, మహంకాళి–సికింద్రాబాద్–నాగూరావు నామాజీ, హైదరాబాద్ సెంట్రల్– టి.అంజన్‌కుమార్‌గౌడ్. -
రెగ్యులర్ అధికారులు లేక.. గాడితప్పుతున్న పాలన..!
బెజ్జూర్: మండలంలో ఇన్చార్జీల పాలన కొనసాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో సకాలంలో సేవలు అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయా శాఖల్లో ప్రభుత్వం నియమించిన ఇన్చార్జీలు పూర్తిస్థాయిలో ఇక్కడ పని చేయలేకపోతున్నారని దీంతో ప్రజలకు న్యాయం జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. మండలంలో తహసీల్దార్, పశువైద్యాధికారి, టీజీబీ మేనేజర్, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రెగ్యులర్ అధికారులు లేక ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారు. మండలానికి వచ్చేందుకు విముఖత.. మండలంలో రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో మండల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ శ్రీపాల్ రెడ్డి గత ఆగస్టు 8న బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నియమించిన అధికారి ఇక్కడికి రావడానికి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయా తహసీల్దార్లను బెజ్జూర్‌కు వెళ్లాలని ఉన్నతాధికారులు చెబుతున్నా వారు ససేమిరా అంటున్నట్లు సమాచారం. దీంతో నెలరోజుల నుంచి డెప్యూటీ తహసీల్దార్ బ్రహ్మేశ్వరరావు ఇన్చార్జి తహసీల్దార్‌గా వ్యవహరిస్తున్నారు. పశు వైద్యాధికారి లేక ఇబ్బందులు.. మండల కేంద్రంలో పశు వైద్యాధికారి లేకపోవడంతో రైతులు, పాడి పోషకులు అనేక అవస్థలు పడుతున్నారు. గత రెండేళ్లుగా ఇక్కడ రెగ్యులర్ పశువైద్యాధికారి లేకపోవడంతో పెంచికల్‌పేట పశువైద్యాధికారి రాకేశ్‌ను ఇన్‌చార్జీగా నియమించారు. ఆయ న అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. వర్షాకాలంలో గాలికుంటు వ్యాధి, సీజనల్ వ్యాధులతో పశువులు అల్లాడిపోతున్నాయని పేర్కొంటున్నారు. రైతులకు అందని బ్యాంక్ సేవలు బెజ్జూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మూడు నెలల క్రితం అనారోగ్య కారణాలతో మెడికల్ లీవ్ తీసుకున్నారు. మేనేజర్‌ను ఉన్నతాధికారులు బదిలీ చేయగా.. పెంచికల్పేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ రవికుమార్‌ను ఇక్కడ ఇన్చార్జి మేనేజర్‌గా నియమించారు. రెగ్యులర్ మేనేజర్ కావడంతో రైతులకు రుణాల రెన్యూవల్లో ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్చార్జి మేనేజర్ కావడంతో సకాలంలో సేవలు అందడం లేదని బ్యాంకు ఖాతాదారులు వాపోతున్నారు. విద్యార్థులకు తప్పని తిప్పలు మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ఇటీవల పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. కుంటలమానేపల్లి ప్రధానోపాధ్యాయుడు ఇక్కడ ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. సదరు ఉపాధ్యాయుడు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటూ విద్యా బోధన చేయాల్సి ఉన్నా అలా జరగడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. -
బీజేపీ ఇన్చార్జి తరుణ్‌ఛుగ్ స్థానంలో భూపేంద్రయాదవ్?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీజేపీని గద్దెనెక్కించాలనే దృఢసంకల్పంతో ఉన్న ఆ పార్టీ అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల వ్యూహానికి పదునుపెడుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను మార్చి ఆయన స్థానంలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిన అధిష్టానం మరో కీలక మార్పు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలు స్తోంది. ఇందులో భాగంగా ట్రబుల్షూటర్గా పేరున్న కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను రంగంలోకి దించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న తరుణ్ ఛుగ్‌ను తొలగించి ఆయన స్థానంలో భూపేంద్ర యాదవ్‌ను పంపిస్తారని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్చార్జిగా పనిచేసిన అనుభవం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పట్టున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయనను క్రియాశీలం చేయను న్నట్లు తెలుస్తోంది. బీజేపీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తర్వాత భూపేంద్ర నాలుగో స్థానంలో ఉన్నారు. యూపీ, బిహార్, హరియాణాల్లో భూపేంద్ర యా దవ్ రచించిన వ్యూహాలు పార్టీ విజయానికి బాటలు వేశాయి. 2019 ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: Kishan Reddy: అందుకే కిషన్‌రెడ్డికి బీజేపీ బాధ్యతలు, ఈటలకు కీలక పదవి నడ్డాతో భేటీ.. రాష్ట్ర అధ్యక్ష మార్పు ప్రకటన వెలువడిన సమయంలో భూపేంద్రయాదవ్ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు. ప్రకటన వెలువ డటానికి కొద్దిగంటల ముందు జేపీ నడ్డాతో బండి సంజయ్ భేటీ అయిన సమయంలో కూడా భూపేంద్రయాదవ్ ఉన్నారు. ఈ సమయంలోనే రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సుమారు గంటపాటు నడ్డా, యాదవ్ తెలంగాణ రాజకీ యాలపై గంటపాటు చర్చించుకున్నట్లుగా సమాచారం. -
TS: ఇంఛార్జ్‌లకు కొత్త టెన్షన్.. బీజేపీకి బిగ్ మైనస్ అదేనా?
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు అధికారం కోసం తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు జాతీయ పార్టీలు ఇంఛార్జ్‌లను పెట్టుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీల రాష్ట్ర ఇంఛార్జ్‌లు ఏం చేస్తున్నారు? వారి వ్యూహాలు తెలంగాణలో వర్కవుట్ అవుతాయా?.. జాతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఇంఛార్జ్ లను నియమించుకుని తమ ప్రణాళికలను అమలు చేస్తుంటాయి. అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఇంఛార్జ్ లను పెట్టుకున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌కు ఇంఛార్జ్ గా మహారాష్ట్రకు చెందిన మాణిక్‌రావు ఠాక్రే వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి తెలంగాణ వ్యవహారాలను జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నలుగురు పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శులు శివప్రకాశ్, సునీల్ బన్సాల్ తో పాటు పొలిటికల్ ఇంఛార్జ్ గా తరుణ్ చుగ్, సహ ఇంఛార్జ్ గా అరవింద్ మీనన్ పనిచేస్తున్నారు. పార్టీలో అన్నీ తామై ముందుకు నడపాల్సిన బాధ్యత ఇంఛార్జ్ లపై ఉంటుంది. రాజకీయ క్షేత్రంలో నేతలను సమన్వయం చేయడం కష్టసాధ్యమైన పని. కాంట్రావర్సీల జోలికి వెళ్లకుండా తెరవెనుక చక్రం తిప్పుతూ.. కార్యక్రమాలను రూపొందించడం.. పార్టీ నేతలను సమన్వయం చేస్తూ కార్యక్రమాల్లో అందరిని ఇన్వాల్వ్ చేయడం పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ల కర్తవ్యం. తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్‌ల తీరు పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంటా అన్నట్లుగా ఉందని సొంత పార్టీలోనే నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసమ్మతి నేతలు తరుచూ భేటీ అవుతున్నారు. అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. నేతల మధ్య సమన్వయం సాధించే పనిని వదిలేసి.. ఇంఛార్జ్ లుగా పెత్తనం చేస్తున్నారని మండిపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పలువురు నేతలకు పొసగడం లేదు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా.. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ లు ఇప్పటి వరకు సర్ధుబాటు చేయలేదని అసమ్మతి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూపీ లాంటి పెద్దరాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా పనిచేసి వచ్చిన సంస్థాగత ఇంఛార్జ్ సునీల్ బన్సల్ చేస్తున్న ప్రయోగాలు తెలంగాణ నేతలు ఒంటపట్టించుకోవడం లేదట. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, బూత్ స్వశక్తికరణ్ లాంటి కార్యక్రమాలతో తొలుత హడావిడి చేసినా.. తర్వాత స్థానిక నేతల తీరుతో బన్సల్ విసిగిపోయారట. పొలిటికల్ ఇంఛార్జ్ గా ఉన్న తరుణ్ చుగ్ తెలంగాణకు రావడమే తగ్గించారు. నేతల మధ్య సమన్వయం కోసం ఎలాంటి వర్క్ అవుట్స్ చేయకపోవడం బీజేపీకి పెద్దమైనస్ గా మారిందని చెప్పవచ్చు. కర్ణాటక ఎన్నికల విజయంతో దూకుడు మీదున్న కాంగ్రెస్ పార్టీ ... తెలంగాణలో అధికారం కోసం పావులు కదుపుతోంది. టీపీసీసీ ఇంఛార్జ్ గా మాణిక్‌రావు ఠాక్రే బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా వరకు అంతర్గత గొడవలు తగ్గాయి. పీసీసీ ఛీఫ్ రేవంత్‌పై పార్టీలో అసమ్మతి జ్వాలలు తగ్గించడంలో ఠాక్రే కీలకంగా వ్యవహరించారని టాక్. గాంధీభవన్ లో అందుబాటులో ఉంటూ..సైలెంట్ గా తనపని తాను చేసుకుపోతున్నారు. నేతల చేరికలపై ఎప్పటికప్పుడు ఫోన్ లో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎటువంటి హంగామా లేకుండా తెరవెనక పావులు కదుపుతున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ లను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు జాతీయ పార్టీల నేతలు. నలుగురు ఇంఛార్జ్ లతో బీజేపీ.. ఒకే ఇంఛార్జ్ తో కాంగ్రెస్ ఎన్నికల రేసులో దిగుతున్నాయి. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇది కూడా చదవండి: TS: సైలెంట్ అయిన బీజేపీ నేతలు.. ఢిల్లీ పెద్దల డైరెక్షన్ ఇదే? -
కర్ణాటక ఎన్నికలకు బీజేపీ సారథిగా ఉజ్వల్ మ్యాన్
సాక్షి, ఢిల్లీ: కర్ణాటకలో మరోసారి అధికారం చేపట్టేందుకు పావులు కదుపుతోంది బీజేపీ. ఇప్పటికే అభివృద్ధి పనులు, బడ్జెట్ కేటాయింపులతో అక్కడి ప్రజలను ఆకట్టుకునే యత్నం చేసింది. ఇక ఈ ఏడాది వేసవిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. తాజాగా ఆ రాష్ట్రానికి ఎన్నికల సారథిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. కర్ణాటక అసెంబ్లీ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(54)ను నియమించింది ఆ పార్టీ. అలాగే.. కో ఇన్ఛార్జిగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా పేరుతో ఒక ప్రకటనను శనివారం విడుదల చేసింది. ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖతో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖలను ధర్మేంద్ర ప్రధాన్ చూసుకుంటున్నారు. ఒడిషాలో పుట్టిపెరిగిన ధర్మేంద్ర ప్రధాన్.. కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్ తనయుడు. దేవేంద్ర ప్రధాన్.. వాజ్‌పేయి హయంలో కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. ధర్మేంద్ర ప్రధాన్.. ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. బీజేపీలో పలు కీలక పదవులు చేపట్టారు. పలు రాష్ట్రాలకు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగానూ పని చేశారు. 2004లో దియోగఢ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆపై బీహార్, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. స్వతంత్ర భారతంలో సుదీర్ఘ కాలం పెట్రోలియం, సహజ ఇంధనాల శాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం పని చేసిన ఘనత ధర్మేంద్ర ప్రధాన్ ఖాతాలో ఉంది.ఈయన హయాంలోనే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభం అయ్యి.. విజయవంతమైంది. అందుకే ఈయన్ని ఉజ్వల మ్యాన్‌గా పిలుస్తుంటారు. ఆంత్రోపాలజీలో పీజీ చేసిన ధర్మేంద్ర ప్రధాన్.. మంచి వక్త కూడా. ఈ ఏడాది ఏప్రిల్ లేదంటే మే నెలలో కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారం కోసం బీజేపీ, అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుండగా.. ప్రభుత్వ ఏర్పాటులో అద్భుతం సృష్టిస్తామంటూ జేడీఎస్ ప్రకటించుకుంటోంది. -
రూ.30 లక్షల బిల్లులు రాక.. ఇన్చార్జ్ సర్పంచ్ భిక్షాటన
కౌడిపల్లి (నర్సాపూర్): గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో ఓ ఇన్చార్జి సర్పంచ్ భిక్షాటన చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెల్మకన్నలో సోమవారం చోటు చేసుకుంది. వెల్మకన్న గ్రామ ఇన్చార్జ్ సర్పంచ్ కాజిపేట రాజేందర్ మాట్లాడుతూ.. గతేడాది మార్చి నుంచి సుమారు రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. సీసీ రోడ్లు, మురికి కాల్వలు, క్రీడాప్రాంగణం, పారిశుధ్యం పనులు, హరితహారం, వీధి దీపాలు తదితర పనులు పూర్తి చేశామని తెలిపారు. అప్పులు తెచ్చి పనులు చేస్తే, ఇంత వరకు బిల్లులు రాలేదని, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది లేక గ్రామంలో పంచాయతీ కారి్మకులతో కలిసి భిక్షాటన చేస్తున్నట్లు తెలిపారు. రెండున్నర నెలల క్రితం రూ.ఆరు లక్షలకు సంబంధించి ఎంబీలు పూర్తి చేయగా చెక్కులు ఇచ్చారని, అయినా డబ్బులు మాత్రం రాలేదని తెలిపారు. అధికారులను ఎన్నిసార్లు అడిగిన ఫ్రీజింగ్లో ఉందని, వచ్చాక ఇస్తామని చెబుతున్నారని అన్నారు. చదవండి: కరీంనగర్లో వింతవ్యాధి కలకలం..! ఉన్నట్టుండి వాంతులు విరేచనాలు, ఆపై -
కాంగ్రెస్‌కు మరో షాక్.. రాజస్థాన్ ఇన్ఛార్జ్ రాజీనామా
జైపూర్: కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. రాజస్థాన్ ఇన్ఛార్జ్ అజయ్ మాకెన్ తన పదవికి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించడానికి సరిగ్గా రెండు వారాల ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అజయ్ మాకెన్ రాజీనామాతో పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడినట్లయింది. అయితే మాకెన్ రాజీనామాకు బలమైన కారణమే ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు. సెప్టెంబర్‌లో సీఎం అశోక్ గహ్లోత్ వర్గానికి చెందిన నేతలు కొందరు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న గహ్లోత్‌ను సీఎం పదవి నుంచి తప్పిస్తే అంగీకరించే ప్రసక్తే లేదని వారు తిరుగుబావుటా ఎగురవేశారు. దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని స్పీకర్ దగ్గరకు వెళ్లడం అప్పట్లో కలకలం రేపింది. వీరి కారణంగానే అశోక్ గహ్లోత్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష బరి నుంచి తప్పుకున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలు చేసిన పనికి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు వ్యవహారంలో ముఖ్యంగా ముగ్గురు నేతలు శాంతి ధరివాల్, మహేశ్ జోషి, ధర్మేంద్ర రాఠోడ్ కీలకంగా వ్యవహరించారు. వీరే సెప్టెంబర్ 25న కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశానికి డుమ్మాకొట్టి తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయంపైనే కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఈ ముగ్గురికి నోటీసులు కూడా పంపింది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న అజయ్ మాకెన్ కూడా పార్టీ అధిష్ఠానికి ఇప్పటికే స్పష్టం చేశారు. చర్యలు లేకపోవడంతో.. కానీ ఇన్ని రోజులు గడుస్తున్నా.. ఆ ముగ్గురు నేతలపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అజయ్‌మాకెన్ కలత చెందారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఇక ఇన్‌ఛార్జ్‌గా ఉండి ఏం ప్రయోజనం అని భావించి రాజీనామా చేసినట్లు చెప్పారు. నవంబర్ 8నే రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారని వెల్లడించారు. అయితే ఖర్గే ఆయన రాజీనామాను అమోదించలేదని, పదవిలో కొనసాగాలని సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం అజయ్ మాకెన్ వారం రోజులు వేచిచూసినప్పటికీ గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సచిన్ పైలట్ కూడా రెండు వారాల క్రితమే రాజస్థాన్ కాంగ్రెస్‌లో అనిశ్చితికి తెరదించాలని డిమాండ్ చేశారు. పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కానీ అధిష్ఠానం నుంచి ఆ దిశగా ఎలాంటి అడుగు పడకపోవడంతోనే అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఈ కారణంగానే ఆయన రాహుల్ భారత్ జోడో యాత్రకు సంబంధించిన సమీక్ష సమావేశాలకు కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: గుజరాత్లో ట్విస్ట్.. నామినేషన్ వేసేందుకు వెళ్లిన అభ్యర్థి కిడ్నాప్.. ఆ తర్వాత.. -
Munugode Bypoll Results: సీఎం కేసీఆర్ సారు గ్రామంలో కారు జోరు
మర్రిగూడ/చండూరు: మునుగోడు ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ ఇన్చార్జిగా వ్యవహరించిన మర్రిగూడ మండలం లెంకలపల్లి ఎంపీటీసీ పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థికి 711 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక్కడ సహ ఇన్చార్జిగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి వ్యవహరించారు. ఈ ఎంపీటీసీ పరిధిలో లెంకలపల్లి, సరంపేట గ్రామాల్లోని మూడు బూత్‌లలో 4,009 మంది ఓటర్లు ఉండగా 2,793 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్కు 1,610, బీజేపీకీ 899, కాంగ్రెస్‌కు 95, బీఎస్పీకి 34, మిగతావి ఇతరులకు పోలయ్యాయి. కేటీఆర్ ఇన్చార్జిగా ఉన్న గట్టుప్పల్‌లో 47 ఓట్ల ఆధిక్యం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గట్టుప్పల్ ఎంపీటీసీ–1కు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆయన పరిధిలో 3,360 మంది ఓటర్లు ఉండగా 3097 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్కు 1359 ఓట్లు, బీజేపీకి 1312 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్కు 47 ఓట్ల ఆధిక్యం లభించింది. మంత్రి కేటీఆర్ తరపున పూర్తిగా సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆగయ్య ప్రచార బాధ్యతలు నిర్వహించారు. మర్రిగూడ మండల కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఇక్కడ మూడు బూత్‌లలో 2,785 మంది ఓటర్లు ఉండగా 2,522 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్కు 1,389, బీజేపీకి 792, కాంగ్రెస్‌కు 174, బీఎస్పీకి 37 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ బీజేపీపై టీఆర్ఎస్కు 597 ఓట్ల ఆధిక్యం లభించింది. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
Telangana Congress: మాణిక్యమేనా.. మారుతారా? లైన్లోకి చిదంబరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్యం ఠాగూరే కొనసాగుతారా లేక కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తారా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో గతంలో నియమితులైన సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జులందరూ వారి పదవులకు రాజీనామా చేశారు. ఈ పదవులన్నింటినీ మళ్లీ ఖర్గే భర్తీ చేయనున్నారు. అందులోభాగంగానే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి పదవికి మాణిక్యం ఠాగూర్ కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు తెలంగాణకు కొత్త ఇంచార్జి వస్తారా లేదా మాణిక్యమే కొనసాగుతారా అనే చర్చ మొదలైంది. చిదంబరంకు ఇస్తారా? రాష్ట్ర పార్టీ ఇన్చార్జి బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకుంటారనే చర్చ చాలాకాలంగా పార్టీలో జరుగుతోంది. ఆయన తమిళనాడు పీసీసీ అధ్యక్షుడిగా వెళ్లే అవకాశం ఉందని, ఆయన స్థానంలో కొత్తవారికి బాధ్యతలు ఇస్తారనే చర్చ ఉంది. అన్ని పదవులను భర్తీ చేసే అధికారం కొత్త అధ్యక్షుడు ఖర్గేకు కట్టబెడుతూ నేతలంగా రాజీనామా చేసిన నేపథ్యంలో మాణిక్యం ఠాగూర్‌ను మళ్లీ కొనసాగిస్తారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. పార్టీలోని కొందరు ఆయన మళ్లీ కొనసాగుతారని, సంప్రదాయంలో భాగంగానే ఆయన రాజీనామా చేశారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం గతం నుంచే ఆయన్ను మార్చాలనే ప్రతిపాదన ఉందని, అందువల్ల మార్పు జరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. చదవండి: ఫామ్‌హౌజ్ ఘటన.. టీఆర్ఎస్పై కిషన్‌రెడ్డి కౌంటర్ ఎటాక్ రాష్ట్ర పార్టీ వ్యవహారాలను నేరుగా ప్రియాంకాగాంధీ పర్యవేక్షిస్తున్నందున ఆమె అభిప్రాయమే కీలకమవుతుందని, ఆమె సిఫారసును బట్టి ఖర్గే నిర్ణయం తీసుకుంటారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. అయితే, కొందరు సీనియర్ నేతలు మాణిక్యం వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఆయన్ను మార్చి చిదంబరం లాంటి సీనియర్‌కు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని కూడా అంటున్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరనుండటం, రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందనే అభిప్రాయం అధిష్టానం పెద్దల్లో ఉన్న పరిస్థితుల్లో గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన సీనియర్‌ను పంపుతారనే చర్చ జరుగుతోంది. మరి, కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? మాణిక్యం కొనసాగుతారా? లేదా అన్నది కొద్ది రోజుల్లోనే తేలనుంది. -
దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ గట్టి షాక్..
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఒడిశా పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతల్లో కోతలు విధించగా తాజాగా ఛత్తీస్‌గఢ్ బాధ్యతల నుంచి పురందేశ్వరిని పూర్తిగా తప్పించారు. 2020 నవంబర్ నుంచి ఆమె ఛత్తీస్‌గఢ్, ఒడిశా బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్నారు. పురందేశ్వరి స్థానంలో రాజస్థాన్‌కు చెందిన కీలక నాయకుడు ఓం మాథుర్‌ను ఛత్తీస్‌గఢ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా అక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఇన్‌చార్జ్‌ను మారుస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. చదవండి: బీజేపీ బిగ్ ప్లాన్.. ప్రత్యర్థులకు అంతుచిక్కని ఎత్తుగడలు! యూపీ విజయంలో కీలక పాత్ర ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడిగా భావించే ఓం మాథుర్ గతంలో గుజరాత్ ఇన్చార్జ్గా, గతేడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇన్చార్జ్గా పనిచేశారు. యూపీ విజయంలో మాథుర్ తనదైన శైలిలో కీలక పాత్ర పోషించారు. ఏడాదిన్నరగా పురందేశ్వరి అంచనాలకు తగ్గట్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేయని కారణంగానే ఆమెను తప్పించారనే చర్చ జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా మార్పు.. వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ క్షేత్రస్థాయిలో భారీ మార్పులు చేపట్టింది. అందులో భాగంగా 15 రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌లుగా బలమైన నేతలకు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా వచ్చే ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్‌ను గద్దె దింపేందుకు బీజేపీ సన్నద్ధమైంది. ఒడిశా ఇన్చార్జ్గా ఉన్న పురందేశ్వరి బాధ్యతల్లో హై కమాండ్ కోత విధించింది. అంతేకాకుండా ఛత్తీస్‌గఢ్‌కు మరో ఇన్చార్జ్గా జాతీయ ప్రధాన కార్యదర్శి, అమిత్ షాకి సన్నిహితుడైన సునీల్ బన్సల్‌ను నియమించింది. బన్సల్ రంగంలోకి దిగడంతో పురందేశ్వరి పాత్ర నామమాత్రమే అనే చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయని కీలక నేత ఒకరు వెల్లడించారు. -
బీజేపీ బిగ్ ప్లాన్.. ప్రత్యర్థులకు అంతుచిక్కని ఎత్తుగడలు!
వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పలు రాష్ట్రాల్లో, తెలంగాణలో సైతం కాషాయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ ప్లాన్స్ రచిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ ప్రముఖులు వచ్చి వెళ్లారు. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో పరిస్థితులపై స్పెషల్ నజర్ పెట్టిన బీజేపీ.. ఇన్చార్జ్ తరుణ్‌చుగ్ విషయంలో సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో బీజేపీ అధిష్టానం మరోసారి ఆయనకే బాధ్యతలను అప్పగించింది. కాగా, శుక్రవారం బీజేపీ అధిష్టానం పలు రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది. అందులో భాగంగా తెలంగాణకు మరోసారి బీజేపీ ఇన్చార్జ్గా తరుణ్ చుగ్‌ను అధిష్టానం ఫైనల్ చేసింది. అంతేకాకుండా.. సహ ఇన్చార్జ్గా అరవింద్ మీనన్‌కు బాధ్యతలను అప్పగించింది. ఇదిలా ఉండగా.. పలు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు బీజేపీ హైకమాండ్.. పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించింది. కొత్త ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌ల లిస్ట్ ఇదే.. 1. తెలంగాణ- తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ 2. రాజస్థాన్- అరుణ్ సింగ్, విజయ రహత్కార్ 3. మధ్యప్రదేశ్- పి.మురళీధర్ రావు, పంకజా ముండే, డాక్టర్ రామ్ శంకర్ కథేరియా 4. కేరళ- ప్రకాశ్ జవదేకర్, డాక్టర్ రాధామోహన్ అగర్వాల్ 5. హర్యానా- బిప్లబ్ కుమార్ దేబ్ 6. పశ్చిమ బెంగాల్- మంగళ్ పాండే, అమిత్ మాలవ్యా, సుశ్రీ ఆశా లక్రా 7. బీహార్- వినోద్ తవాడే, హరీశ్ ద్వివేది 8. జార్ఖండ్- లక్ష్మీకాంత్ బాజ్ పాయి 9. పంజాబ్- విజయ్ భాయ్ రూపానీ, డాక్టర్ నరీందర్ సింగ్ రైనా 10. చత్తీస్ గఢ్- ఓం మాధుర్, నితిన్ నబీన్ 11. త్రిపుర- డాక్టర్ మహేశ్ శర్మ 12. డయ్యూడామన్, దాద్రానగర్ హవేలీ- వినోద్ సోంకర్ 13. లక్షద్వీప్- డాక్టర్ రాధామోహన్ అగర్వాల్ 14. చండీగఢ్- విజయ్ భాయ్ రూపానీ 15. ఈశాన్య రాష్ట్రాలకు.. డాక్టర్ సంబిత్ పాత్రా, రుతురాజ్ సిన్హా. Congratulations to @BJP4India National General Secretary @TawdeVinod ji, @VijayaRahatkar tai, @Pankajamunde tai, @PrakashJavdekar ji and all leaders for the additional new responsibilities! Wishing everyone a successful tenure !#BJP pic.twitter.com/J6kJUg6LXE — Devendra Fadnavis (@Dev_Fadnavis) September 9, 2022 -
సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు: తరుణ్ చుగ్
-
బీజేపీ మాస్టర్ ప్లాన్: తెలంగాణలో తరుణ్‌చుగ్ ఔట్.. బన్సాల్ ఇన్
న్యూఢిల్లీ: తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించిన బీజేపీ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న తరుణ్ చుగ్‌ను తొలగించి ఆయన స్థానంలో సునీల్ బన్సాల్‌కు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నత కల్పించింది. అలాగే.. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఇంఛార్జ్‌గా నియమించింది. ఈ మూడు విపక్ష పాలిత రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయటంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు సునీల్ బన్సాల్ నియామకాన్ని బుధవారం ప్రకటించారు. బీజేపీ ప్రధాన వ్యూహకర్తల్లో బన్సాల్ ఒకరు. 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి తేవటంలో కీలకంగా వ్యవహరించారు. 2022లోనూ యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యేందుకు సాయపడ్డారు. మరోవైపు.. బీజేపీ ఉత్తర్‌ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ధరంపాల్‌ను నియమించింది. ఆయనను ఝార్ఖండ్ నుంచి యూపీకి మార్చింది. ప్రస్తుతం యూపీలో బన్సాల్‌కు సహాయకుడిగా వ్యవహరించిన కరంవీర్ సింగ్‌ను ఝార్ఖండ్ ఇంఛార్జ్‌గా నియమించింది బీజేపీ. भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने श्री सुनील बंसल, प्रदेश महामंत्री (संगठन) उत्तर प्रदेश को पार्टी का राष्ट्रीय महामंत्री नियुक्त किया है। श्री सुनील बंसल को पश्चिम बंगाल, ओडिशा एवं तेलंगाना की प्रदेश प्रभारी के रूप में जिम्मेदारी रहेगी। pic.twitter.com/1b4eYlq1ei — BJP (@BJP4India) August 10, 2022 ఇదీ చదవండి: మునుగోడులో మరో ట్విస్ట్.. ఉప ఎన్నిక బరిలో వామపక్షాలు? -
టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కీలక నేత రాజీనామా
జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గ్రూపు తగాదాలు.. అన్నదమ్ముల కొట్లాటలు.. పార్టీ పెద్దల తీరుతో ద్వితీయశ్రేణి నేతల తీవ్ర అసంతృప్తులతో సతమతమవుతున్న ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీ కీలక నాయకుడు, దర్శి టీడీపీ ఇన్చార్జి పమిడి రమేష్ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. పార్టీ కోసం తాను ఎంత కష్టపడినా అధినేత గుర్తించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దర్శి టీడీపీలో ముసలం మొదలైంది. ఇప్పటికే దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిన ఆ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు పమిడి రమేష్ పరోక్షంగా ప్రకటించడంతోపాటు, అధిష్టానం తాను కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు లేదనే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల ఒంగోలు నగర శివారులో జరిగిన మహానాడుతో రాష్ట్రవ్యాప్తంగా పారీ్టలో ఉత్సాహం నింపాలనే టీడీపీ అధినేత చంద్రబాబు విపరీతమైన ప్రచారాలు చేసినా ఫలితాలు ఇవ్వడం లేదన్నది ఈ సంఘటనతో రుజువైంది. జిల్లాలో ఇప్పటికే పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలో గ్రూపుల గోల టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. అసలే పార్టీని ప్రజలు విశ్వసించని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పార్టీ అధినేత నుంచి ఇన్చార్జి వరకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఆందోళనలు చేయకుండా పర్సనల్ విషయాలను తెరపైకి తెచ్చి రాజకీయాలు చేయడం పట్ల ఆ పార్టీలోనే తీవ్ర అసంతృప్తి మొదలైంది. 2020 నవంబరు నుంచి దర్శి నియోజకవర్గ ఇన్చార్జిగా పమిడి రమేష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరిగి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. పార్టీ కార్యక్రమాలకు సొంత డబ్బును ఖర్చు చేస్తూ వచ్చారు. ఇంత చేస్తున్నా పార్టీ అధిష్టానం తనను గుర్తించడం లేదని సన్నిహితుల వద్ద పలు మార్లు వాపోయినట్టు సమాచారం. ఇదిలా ఉండగా మహానాడు తరువాత పారీ్టలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. పార్టీ అధినేత సైతం పట్టించుకోకపోవడంతో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన వర్గీయులు బహిరంగంగానే చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేయడంతో ఇక దర్శి నియోజకవర్గంలో టీడీపీ క్లోజ్ అనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. మరో రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ బాధ్యతలు మోసేవారు కరువడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 75 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్చార్జిలు లేరని స్వయంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్పుకునే నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో దర్శికి కూడా ఇన్చార్జి లేకుండా పోవడం ఆపార్టీ దీన స్థితికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ సీపీలోకి మాజీ ఎమ్మెల్యేలు: దర్శి నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావుతోపాటు, 2012లో దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు సైతం వైఎస్సార్సీపీలో చేరిపోయారు. దీంతో దర్శిలో టీడీపీకి నాయకత్వం వహించే దిక్కే లేకుండా పోయింది. 2020 నవంబరులో పమిడి రమేష్ టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో గ్రూపుల గోలతో నెట్టుకుంటూ వచ్చారు. అయితే టీడీపీ అధిష్టానం తీరుతో ఆవేదన చెంది ఇన్చార్జి పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆపార్టీ వర్గాల్లో చర్చ నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు, చీరాల, దర్శి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం, గిద్దలూరు వంటి నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్చార్జిలు ఉన్నారా.. లేరా అన్నట్లుగా పరిస్థితి నెలకొని ఉంది. మహానాడు సూపర్ హిట్ అంటూ జబ్బలు చరుచుకుంటున్న ఆ పార్టీ.. మహానాడు నిర్వహించిన జిల్లాలోనే కనీస బలం కూడా పెంచుకోకపోవడం గమనార్హం. జిల్లాలో రోజురోజుకూ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శి టీడీపీకి దిక్కెవరు..? దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పమిడి రమేష్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ద్వితీయ శ్రేణి నేతల్లో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నా గ్రూపు రాజకీయాలకు భయపడి ఎవరూ ముందుకు రావడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. దర్శి టీడీపీలో చెలరేగిన జ్వాలను చల్లార్చాలని ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం. పార్టీ పెద్దల తీరుమారకపోతే సొంతపార్టీ నేతలు, కార్యకర్తలే కాకుండా ప్రజలు సైతం ఛీత్కరించుకుంటున్న పరిస్థితి నెలకొంది. -
యాదాద్రి ఇన్చార్జి ఈవోగా రామకృష్ణ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఇన్చార్జి ఈవోగా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఇన్చార్జి ఆర్జేసీ రామకృష్ణ రానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న ప్రస్తుత ఈవో గీతారెడ్డి తన కుమార్తె వివాహం దృష్ట్యా సెలవుపై వెళ్లారు. దీంతో రామకృష్ణను ఇన్చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన సోమవారం లేదా మంగళవారం బాధ్యతలు స్వీకరించను న్నట్లు సమాచారం. -
ఏపీ: 26 జిల్లాలకు ఇన్చార్జి మంత్రులు వీరే..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. తాము ఇన్చార్జిగా ఉండే జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను, పాలనపరమైన వ్యవహారాలను ఈ మంత్రులు పర్యవేక్షిస్తారు. జిల్లాల వారీగా ఇన్చార్జి మంత్రుల వివరాలు జిల్లా పేరు ఇన్చార్జి మంత్రి 1 గుంటూరు ధర్మాన ప్రసాదరావు 2 కాకినాడ సీదిరి అప్పల రాజు 3 శీకాకుళం బొత్స సత్యనారాయణ 4 అనకాపల్లి రాజన్న దొర 5 ఏఎస్ఆర్ఆర్ గుడివాడ అమర్నాథ్ 6 విజయనగరం బూడి ముత్యాల నాయుడు 7 పశ్చిమ గోదావరి దాటిశెట్టి రాజా 8 ఏలూరు పినిపె విశ్వరూప్ 9 తూర్పుగోదావరి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ 10 ఎన్టీఆర్ తానేటి వనిత 11 పల్నాడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు 12 బాపట్ల కొట్టు సత్యనారాయణ 13 అమలాపురం జోగి రమేష్ 14 ఒంగోలు మేరుగ నాగార్జున 15 విశాఖపట్నం విడదల రజిని 16 నెల్లూరు అంబటి రాంబాబు 17 కడప ఆదిమూలపు సురేష్ 18 అన్నమయ్య కాకాణి గోవర్థన్‌రెడ్డి 19 అనంతపురం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 20 కృష్ణా ఆర్కే రోజా 21 తిరుపతి నారాయణ స్వామి 22 నంద్యాల అంజాద్ బాషా 23 కర్నూలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 24 సత్యసాయి గుమ్మనూరి జయరాం 25 చిత్తూరు కేవి ఉషాశ్రీ చరణ్ 26 పార్వతీపురం గుడివాడ అమర్నాథ్ -
ఏపీ టీడీపీ: సర్దుకుంటున్న సీనియర్లు..!
సాక్షి, అమరావతి: ప్రజాదరణ కోల్పోయి సోషల్ మీడియా, అనుకూల మీడియాకు పరిమితమైన టీడీపీ నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటోంది. వరుసగా ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ సీనియర్ నాయకులు చాలావరకూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దీర్ఘకాలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కోటలు బీటలు వారడంతో నాయకుల్లో తీవ్ర నైరాశ్యం, అభద్రతా భావం నెలకొంది. తిరుపతి ఉప ఎన్నికలో సైతం ఓటమితో టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం ఆవరించింది. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ జూమ్, సోషల్ మీడియాలో హడావుడి చేయడమే కానీ తమ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని పలువురు టీడీపీ నేతలు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. చేతులెత్తేసిన సీనియర్లు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన మంత్రులు, ముఖ్య నాయకులు ఎవరూ ప్రస్తుతం చురుగ్గా లేరు. పార్టీ బాధ్యతలను మోసేందుకు మాజీ మంత్రులు ఎవరూ ముందుకు రాకపోవడంతో జూనియర్లు, బయట పార్టీల నుంచి వచ్చిన వారిని పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయుల్ని ఇటీవల ప్రకటించారు. చింతమనేని ప్రభాకర్, మాగంటి బాబు లాంటి సీనియర్ నాయకులు చేతులెత్తేయడంతో వీరాంజనేయులుకు బాధ్యతలు అప్పగించారు. విజయవాడ, గుంటూరు పార్లమెంటు జిల్లాలకు నెట్టెం రఘురాం, తెనాలి శ్రావణ్‌కుమార్‌లను అధ్యక్షులుగా చేశారు. నెట్టెం రఘురాం చాలా ఏళ్ల నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత ఉదయభానుని ఢీకొట్టే సత్తాలేక కాంగ్రెస్ నుంచి శ్రీరాం తాతయ్యను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అప్పగించారు. గుంటూరులో పత్తిపాటి పుల్లారావు, రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్ లాంటి చాలామంది సీనియర్లున్నా శ్రావణ్‌కి బాధ్యతలు ఇచ్చి సరిపెట్టుకున్నారు. ఒకటి రెండు చోట్ల మినహా దాదాపు అన్ని పార్లమెంటు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గాల్లో కానరాని నేతలు.. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిల వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. దాదాపు 100కిపైగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లు చురుగ్గా లేరని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. ఏ కార్యక్రమం తలపెట్టినా స్పందన లేదని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి. చాలామంది ఇన్‌ఛార్జిలు నియోజకవర్గాల్లో క్యాడర్‌కే అందుబాటులో లేరు. పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, కేఈ కృష్ణమూర్తి లాంటి సీనియర్లు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జి ఎవరో ఇంతవరకూ స్పష్టత లేదు. నూజివీడు, గన్నవరం, పామర్రు, ఏలూరు, పోలవరం లాంటి పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. -
తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జిగా కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జిగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర బీజేపీ మంగళవారం 4 రాష్ట్రాలకు ఇన్చార్జులను నియమించింది. తమిళనాడుతోపాటు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలకు కూడా ఎన్నికల ఇన్చార్జుల నియామకం చేపట్టింది. -
కుప్పం వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ కన్నుమూత
-
ఎగిరిపడే వాళ్లకు ఎన్నికలతోనే సమాధానం
సాక్షి, హైదరాబాద్: ‘మున్సిపల్ ఎన్నికలు ఈ నెలలో లేదా.. కోర్టు తీర్పు కొంత ఆలస్యమైతే వచ్చే నెలలో జరిగే అవకాశముంది. మున్సిపల్ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. ఇతర ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు వైవిధ్యంగా, భిన్నంగా ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అవతలి పార్టీ అభ్యర్థుల బలాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఒక్క ఓటుతోనూ ఓడిన సందర్భాలున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా ముందుకుసాగాలి..’ అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఇన్‌చార్జీలుగా పనిచేసిన పార్టీ రాష్ట్ర నేతలు, నల్లగొండ జిల్లా, హుజూర్నగర్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కేటీఆర్ సోమవారం తెలంగాణభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించే దుర్మార్గులు పక్క పార్టీల్లో ఉన్నారు. విపక్ష పార్టీల నేతల తరహాలో బజారు భాష మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాల దుష్ప్రచారానికి ప్రజలే సమాధానం చెప్తారు. ఎగిరిపడే వారికి ఎన్నికల ద్వారా సమాధానం చెప్పాలి’అని అన్నారు. బీజేపీది ఓవరాక్షన్.. ‘హుజూర్నగర్ ఎన్నికల్లో బీజేపీ ఓవరాక్షన్ చేసి.. నిన్న మొన్నటిదాకా బిల్డప్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల తర్వా తే హుజూర్‌నగర్‌లో ఎన్నికలు జరగాలని కోరుకుంది. హుజూర్నగర్ ఎన్నిక జరగకుండా బీజేపీ అడ్డుకునే ప్రయ త్నం చేసిందనే సమాచారం ఉంది. హుజూర్నగర్ ఉపఎన్నికతో బీజేపీ ప్రచార పటాటోపం బయటపడింది.’అని కేటీఆర్ అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన స్థానాలు గాలివాటమే అని తేలిపోవడంతో పాటు, ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న అసలైన బలమేమిటో ప్రజలు ఓట్లు వేసి మరీ తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని పోలి ఉన్న స్వతంత్ర అభ్యర్థి సాధించిన ఓట్ల కంటే బీజేపీకి తక్కువ ఓట్లు పోలయ్యాయి. హుజూర్నగర్ ఎన్నిక ద్వారా ఏ పార్టీ బలమేంటో తేలిపోయింది. స్వయానా టీపీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారు. ప్రజాభిమానం ముందు ప్రతిపక్షాల ప్రచార ఆర్భాటం చిన్నబోయింది’అని వ్యాఖ్యానించారు. కారు గుర్తును పోలిన చిహ్నాలతో నష్టం ‘హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డికి 50వేలకు పైచిలుకు మెజారిటీ వచ్చేది. పార్టీ చిహ్నం కారు గుర్తును పోలిన ఇతర చిహ్నాలతో నష్టం జరిగింది. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఇలాం టి తప్పులు జరగకుండా పరిష్కారం చూడాలని పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెప్తున్నాం. హుజూర్నగర్ ప్రజల రుణం తీర్చుకునేందుకు, ఇచ్చిన హామీల అమలుపై ఎమ్మెల్యే సైదిరెడ్డిపై స్థానిక నేతలు ఒత్తిడి తేవాలి. అధికారం, దుర్వినియోగం కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా, ప్రతిపక్ష నేతలు టీఆర్ఎస్లోకి వస్తే తీసుకుని పార్టీని బలోపేతం చేయాలి’ అని కేటీఆర్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పార్టీ అధినేత కేసీఆర్.. సంస్థాగత శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో పార్టీ గెలుపునకు కృషి చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేటీఆర్ అభినందించారు. కంచుకోట కాదు.. కరుగుతున్న మంచుకొండ హుజూర్‌నగర్‌ను కాంగ్రెస్ కంచుకోట అంటూ మీడియా ప్రచారం చేసిందని, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట.. అక్కడ కరుగుతున్న మంచుకొండ అని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల విజయం సీఎం కేసీఆర్ నాయకత్వానికి, కేటీఆర్ వ్యూహానికి దక్కిన ఫలితంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ అభివర్ణించారు. ‘కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుటుంబానికి లాభం, టీఆర్ఎస్ గెలిస్తే హుజూ ర్‌నగర్ ప్రజలకు లాభం అని కేటీఆర్ ఇచ్చిన నినాదానికి అక్కడి ప్రజలు ఓట్లేశారన్నారు. పార్టీ నేతలతో సమావేశం తర్వాత తెలంగాణభవన్‌లో కేటీఆర్ ఇచ్చిన విందు లో నల్లగొండ జిల్లా, హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు, పార్టీ ఉప ఎన్నిక ఇన్చార్జీలు.. మొత్తం 300 మంది పాల్గొన్నారు. -
దోమలపై దండయాత్రతో దోచింది మర్చిపోయారా?
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా : టీడీపీ పాలనలో డ్రైనేజీలను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రస్తుతం వ్యాధులు ప్రబలుతున్నాయని పాలకొల్లు వైఎస్సార్సీపీ ఇంచార్జి కవురు శ్రీనివాస్ తెలిపారు. దోమలపై దండయాత్ర పేరుతో నిధుల దోపిడీ చేయడం తప్ప ఒక్క పనీ చేయలేదని ఆయన మండిపడ్డారు. శనివారం స్థానికంగా నిర్వహించిన ప్రెస్‌మీట్ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ.. కిడ్నీ బాధితులకు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతి లేని పాలన అందిస్తూ రూ. 25 లక్షలు ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే రామానాయుడు చేసిన తప్పులను ప్రజల్లో ఎండగడతామని వెల్లడించారు. వైఎస్సార్సీపీ నాయకుడు యడ్ల తాతాజీ మాట్లాడుతూ.. గతంలో చేసిన అవినీతి, తప్పిదాల నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యే డ్రామాలాడుతున్నాడని పేర్కొన్నారు. పర్సంటేజీలు వచ్చే పనులకు ప్రాధాన్యతనిచ్చి మిగిలిన పనులను మరుగున పడేయడం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. -
13 జిల్లాలకు ఇన్చార్జి మంత్రులు
-
ఏపీ: 13 జిల్లాలకు ఇన్చార్జి మంత్రులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. తాము ఇన్చార్జిగా ఉండే జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను, పాలనపరమైన వ్యవహారాలను ఈ మంత్రులు పర్యవేక్షిస్తారు. జిల్లా పేరు ఇన్చార్జి మంత్రి 1 శ్రీకాకుళం వెల్లంపల్లి శ్రీనివాస్ 2 విజయనగరం చెరుకువాడ శ్రీరంగనాథరాజు 3 విశాఖపట్నం మోపిదేవి వెంకటరమణ 4 తూర్పుగోదావరి ఆళ్ల నాని 5 పశ్చిమగోదావరి పిల్లి సుభాష్‌చంద్రబోస్ 6 కృష్ణా కురసాల కన్నబాబు 7 గుంటూరు పేర్ని నాని 8 ప్రకాశం అనిల్‌కుమార్ యాదవ్ 9 నెల్లూరు మేకతోటి సుచరిత 10 కర్నూలు బొత్స సత్యనారాయణ 11 వైఎస్సార్ కడప బుగ్గన రాజేంద్రనాథ్ 12 అనంతపురం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 13 చిత్తూరు మేకపాటి గౌతమ్‌రెడ్డి -
జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సాక్షి, అనంతపురం: జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా భూగర్భ గనుల శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. పీలేరు, పుంగనూరు ఎమ్మెల్యేగా చాలాకాలం పని చేశారు. 2009లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రివర్గంలో పని చేశారు. అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్ మరణానంతరం రోశయ్య మంత్రివర్గంలోనూ కొనసాగారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కీలకంగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పుంగనూరు నుంచి విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం మంత్రివర్గంలో సభ్యుడు. ఈయన తనయుడు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఐదేళ్లుగా అనంతపురం జిల్లా పార్టీ ఇన్చార్జ్గా వ్యవహరించారు. -
తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఇంచార్జ్ ఎండీ నిర్బంధం
-
ఊరించి.. ఉసూరుమనిపించి
పుత్తూరు: నగరి టీడీపీ ఇన్చార్జి పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులతో సీఎం చంద్రబాబునాయుడు శనివారం రాజధాని అమరావతిలో సమావేశమయ్యారు. ఇన్చార్జి పదవి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిత్వంపై ఎటూ తేల్చకుండానే వాయిదా వేశారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి చెందిన తరువాత ఆయన ఇద్దరు కుమారుల మధ్య ఆధిపత్యపోరుతో టీడీపీ కేడర్ వర్గాలుగా చీలిపోయింది. పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుల అభ్యర్థన మేరకు శనివారం సమావేశానికి అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముద్దు కుటుంబానికి క్లాస్ అభిప్రాయ సేకరణ అనంతరం నాయకులతో మాట్లాడిన చంద్రబాబునాయుడు ముద్దుక్రిష్ణమనాయుడి కుటుంబానికి క్లాస్ తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముద్దు పెద్ద కుమారుడు భానుప్రకాష్, తల్లి గాలి సరస్వతమ్మ మధ్య విభేదా లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అలాగే ఇద్దరి కుమారుల మధ్య ఉన్న విభేదాలపైనా అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు వేర్వేరుగా నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలకు హాజరవుతుండడంపై పార్టీ మండల అధ్యక్షులను నిలదీశారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని కఠినంగా చెప్పారు. కుటుంబం ఏకాభిప్రాయంతో రావాలని సూచించారు. అందుకుగాను ఆదివారం సాయంత్రం వరకు గడువు విధించారు. ఈ విషయంపై చర్చ జరుగుతుండగానే పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గంధమనేని రమేష్ చంద్రప్రసాద్ కలుగజేసుకుని ఏకాభిప్రాయంతో వస్తే పార్టీ అభ్యర్థిత్వం ముద్దు కుటుంబానికే కేటాయిస్తారా..? అని అన్నట్టు తెలిసింది. కలిసి వస్తే పరిశీలిస్తానని సర్ది చెప్పినట్లు సమాచారం. ముఖ్య నాయకులతో సమావేశం ముగించుకున్న అధినేత బయట ఉన్న కేడర్‌తో మాట్లాడిన సమయంలోనూ ఇన్చార్జి విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదని తెలిసింది. ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఎవరికి ఇచ్చినా గెలిపించి ముద్దుకృష్ణమకు ఘనంగా నివాళులర్పించాలని ముక్తాయించి నట్లు సమాచారం. ఈ మాత్రం దానికి సమావేశం నిర్వహించడం ఎందుకని టీడీపీ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అన్నదమ్ముల మధ్య ఆదివారం సాయంత్రంలోపు సయోధ్య కుదిరినప్పటికీ అభ్యర్థిత్వంపై అధినేత తేల్చడనే మాటలు టీడీపీ కేడర్ నుంచి వినిపిస్తోంది. అభిప్రాయ సేకరణ టీడీపీ అధినేత తన సహజ వైఖరి నాన్చుడు దోరణిని మరోసారి విజయవంతంగా ప్రదర్శించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరి నియోజకవర్గానికి చెందిన ముఖ్యమైన నాయకులతో ఉండవల్లిలో శనివారం అధినేత సమావేశం కానున్నట్లు ముందురోజు సమాచారం అందింది. నియోజకవర్గ ఇన్చార్జి పదవిపై విస్పష్ట ప్రకటన ఉంటుందని భావించిన ముద్దుక్రిష్ణమనాయుడి ఇద్దరు కుమారులు సమావేశానికి మందీమార్బలంతో హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, రాష్ట్ర నాయకుడు టీడీ జనార్దన్ అభిప్రాయ సేకరణ జరిపారు. నియోజకవర్గంలోని 5 మండలాలు, రెండు మున్సిపాలిటీల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్‌తోపాటు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ అశోక్‌రాజు, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు రమేష్‌చంద్రప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి విజయబాబు తదితరులతో అభిప్రాయాలు సేకరించారు. -
పల్లె పాలనపై పంచాయితీ!
కర్నూలు(అర్బన్): పల్లె పాలనపై సందిగ్ధం నెలకొంది. సర్పంచుల పదవీ కాలం ఆగస్టు 1వ తేదీతో పూర్తి కానుండడం...ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా లేకపోవడంతో సమస్య ఎదురవుతోంది. ప్రస్తుత సర్పంచులనే పర్సన్ ఇన్‌చార్జీలుగా కొనసాగిస్తారా..లేదంటే ప్రత్యేకాధికారులను నియమిస్తారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జిల్లాలో 889 పంచాయతీలకు 2013 జూలై 24, 26, 31వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. అదే ఏడాది ఆగస్టు 2వ తేదీన పల్లెల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. వీటి పదవీకాలం 2018 ఆగస్టు 1వ తేదీతో పూర్తి కానుంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఐదారు నెలల క్రితమే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా తదితర ప్రక్రియను పూర్తి చేసింది. ఎన్నికల వ్యయం ఎంతవుతుందనే విషయంపై సమావేశాలు నిర్వహించారు. అయితే ప్రభుత్వం వెనకడగు వేయడంతో ఎన్నికల ఏర్పాట్లను మానుకున్నారు. ఇదిలా ఉండగా.. తమనే పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా కొనసాగించాలని పలు జిల్లాలకు చెందిన సర్పంచులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరినట్లు తెలుస్తోంది. 1996 మార్చి4న అప్పటి ప్రభుత్వం పర్సన్ ఇన్చార్జీల నియామకానికి సంబంధించి జీఓ నం113ను విడుదల చేసింది. 2011లో బీసీ రిజర్వేషన్లపై ఏర్పడిన సందిగ్ధ కారణంగా రెండేళ్ల పాటు ప్రత్యేకాధికారులతో పల్లె పాలనను అప్పగించారు. అయితే 1994 పంచాయతీరాజ్ యాక్ట్ సెక్షన్ 143 ప్రకారం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగించాలన్నా.. పర్సన్ ఇన్చార్జీలను నియమించాలన్నా అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. ఇదిలా ఉండగా..ఈ నెల మొదటి వారంలో 14వ ఆర్థిక సంఘం నిధులు జిల్లాకు రూ.69 కోట్లు విడుదలయ్యాయి. పలు సాంకేతిక కారణాలతో ఆయా నిధులు సర్పంచుల ఖాతాల్లో జమ కాలేదు. పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు వస్తాయోరావోనని సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. ‘ప్రత్యేక’ సమస్యలివీ.. ప్రత్యేకాధికారుల పాలనతో గ్రామీణపాలన అస్తవ్యస్తంగా తయారవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మండల స్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా వ్యవహరించాల్సి రావడంతో వారికున్న పనిఒత్తిడి కారణంగా గ్రామీణ పాలనపై దృష్టి సారించలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అత్యవసర సమయాల్లో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తే వారు వెనకడుగు వేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జిల్లాలో 520 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. వీరికి బాధ్యతలను అప్పగించినా పాలన కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాలకవర్గాలు ఉంటేనే గ్రామాలాభివృద్ధి పాలకవర్గాలు ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ప్రత్యేకాధికారుల పాలనలో ప్రజలు నేరుగా ఇబ్బందులు చెప్పుకునే అవకాశాలు చాలా తక్కువ. ప్రభుత్వ కుట్రతోనే 14వ ఆర్థిక సంఘం నిధులు సర్పంచుల ఖాతాల్లో జమ కావడం లేదు. వై. కోటేశ్వరరెడ్డి, సర్పంచ్, ఎం. కృష్ణాపురం, గోస్పాడు మండలం -
543 పార్లమెంట్ స్థానాలకు ఇన్చార్జీలు
న్యూఢిల్లీ : 2019 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దేశంలోని 543 పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జీలను నియమించాలని నిర్ణయించింది. దీంతోపాటు ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు గాను ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రానికి 11 మంది సభ్యుల కమిటీని నియమించనున్నట్లు సీనియర్ నేతలు తెలిపారు. పార్లమెంట్ ఇన్చార్జిలుగా నియమితులయ్యే వారిని ఇతర ప్రాంతాల నుంచి ఎంపిక చేస్తారు. ‘చునావ్ తయారీ తోలి’గా పిలిచే ఎన్నికల సన్నాహక కమిటీలు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన 13 కార్యక్రమాలను చేపడతాయి. బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పటి నుంచో అమలు చేస్తున్న ఈ విధానాన్ని బీజేపీ అమలు చేయడం ఇదే ప్రథమం. ‘ఎన్నికల సన్నద్ధత పనులను ఎంత తొందరగా మేం ప్రారంభిస్తే..అంత తొందరగా మా బలహీనతలు, బలాలు తెలుస్తాయి. 2014 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను 2019 ఎన్నికల్లో సాధించాలని పార్టీ నిర్దేశించుకుంది. మోదీ–షా ద్వయం సంస్థాగత పనులపై ప్రత్యేక దృష్టి పెట్టింది’అని వారు తెలిపారు. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారనివారన్నారు. -
ఇలాంటి ప్రభుత్వం ఉండడం మన ఖర్మ
కుప్పం : ఏ రాష్ట్రంలోనూ ఇంత దౌర్భాగ్య ప్రభుత్వం తాను చూడలేదని, ప్రభుత్వంలో పనిచేసే చీఫ్ సెక్రటరీలే ప్రభుత్వ తీరుపై బహిరంగ ఆరోపణలు చేయడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రమౌళి అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం చీఫ్ సెక్రటరీ అజయ్ కలాం బాహాటంగా ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారని తెలిపారు. కుప్పం అభివృద్ధిపై గతంలో రెండు సార్లు చంద్రబాబుకు లేఖలు రాశామని, అవి ఆయనకు చేరిందో లేదో తెలియదు కానీ, ఈసారి ప్రజల సమక్షంలో బహిరంగంగా సీఎం నియోజకవర్గ అభివృద్ధిపై లేఖ రాస్తానని తెలిపారు. ఏ నియోజకవర్గంలో లేని సంస్కృతి కుప్పంలో చోటుచేసుకుందని విమర్శించారు. హెచ్చుమీరుతున్న ఆగడాలు... ‘డీకేటీ భూములు, పట్టాలు, ప్రభుత్వ కార్యాలయల్లో ఏ పార్టీకి చెందినవారో తెలుసుకుని పనులు చేస్తారా..? దేవాలయ భూములను ఆక్రమించుకుని భవనాలు నిర్మిస్తారా..? మార్కెట్ యార్డు నిర్మాణంలో భూ వివాదంపై ప్రభుత్వ స్పందన ఏది..? అధికార పార్టీ వ్యక్తులు కాకపోతే వారిపై తప్పుడు కేసులు విధిస్తారా..? ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరుగుతున్న తతంగ’మన్నారు. ఇక్కడ పనిచేస్తున్న వారిని ఎవర్నీ వదిలి పెట్టేది లేదన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్యకైనా పరిష్కారం దొరకడం లేదని, ప్రతి విషయానికి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రం అష్టకష్టాల్లో ఉంటే బాబు సింగపూర్ టూర్ వెళ్లడం అవసరమా అని ప్రశ్నించారు. హైదరాబాద్, బెంగళూరు నుంచి సింగపూర్‌కు అనేక విమానాలున్నా ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ప్రధానిని కలిసేందుకు వెళ్తున్నట్లు డ్రామాలు సృష్టించి ఢిల్లీలో ఆయనకు కనపడకుండా దాగుడుమూతలు ఆడి తిరిగి రాలేదా? అని విమర్శించారు. వినుగొండ దగ్గర కియో కార్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా 40 వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తుందని, ఇలాంటి ఫ్యాక్టరీని కుప్పంలో ఎందుకు స్థాపించలేదని ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మరుగుదొడ్లును కూడా కాంట్రాక్టర్లకు అమ్ముకుని అధికా ర పార్టీ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. ఆయన వెంట రామకుప్పం, గుడుపల్లె కన్వీనర్లు రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసమూర్తి, గోవింద, శరవణ ఉన్నారు. -
మూడుసార్లు ఓడిపోయాం.. టీడీపీలో కలకలం
సాక్షి, గుంటూరు: అధికార తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీలో కలకలం రేగింది. టీడీపీ అధిష్టానంపై నరసరావుపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి రామిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడేళ్లుగా నియోజకవర్గ ఇన్‌ఛార్జిని ప్రకటించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నిర్లక్ష వైఖరికి నిరసనగా రేపటి (శనివారం) నుంచి ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటానని ప్రకటించారు. ఎంపీ నిధులతో జరిగే అభివృద్ధిని కొందరు అడ్డుకుంటున్నారని, నిజమైన టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని రామిరెడ్డి వాపోయారు. నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిను నియమించాలని అధిష్టానానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. నరసరావుపేటలో టీడీపీ వరుసగా మూడుసార్లు ఓటమిని చవి చూసింది.. ఇకనైనా పార్టీ అధిష్టానం స్పందించి పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టాలని పులిమి రామిరెడ్డి కోరారు. -
స్టేషన్ ఇన్‌చార్జ్‌లుగా మహిళా పోలీసులు
ముంబై : మహారాష్ట్ర పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌లుగా ఎనిమిది మంది మహిళా అధికారులును నియమిస్తున్నట్లు ముంబై పోలీసులు ట్వీటర్లో తెలిపారు. రాష్ట్రంలో ఏమూల నుంచైనా మహిళలు ప్రమాదంలో ఉన్నారని ఫిర్యాదు చేస్తే ఈ టీం వెంటనే స్పందిస్తుంది. అంతేకాకుండా వారి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎనిమిది మంది మహిళా అధికారులను నియమిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కాగా ఈ విధంగా మహిళా ఇన్‌చార్జ్‌లను ఏర్పాటు చేయటం దేశంలోని మొదటి సిటీగా ముంబై పోలీసులు ఘనత సాధించారు. ఈ టీం కేవలం ట్వీటర్‌ను ఫాలో అవ్వడమే కాకుండా నేరస్తులను కూడా పట్టుకోవడంతో కీలక పాత్ర పోషించే విధంగా వారికి శిక్షణ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలను ఎప్పటికప్పడు సమీక్షిస్తూ సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని అందిస్తారు. ముంబై పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా సంఘాలు, స్థానికులు అభినంధనలు తెలుపుతున్నారు. మహిళా సాధికారతకు ఇది మంచి పరిణామం అని ట్వీటర్ వేదికగా ప్రసంశలు కురిపిస్తున్నారు. -
టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్గా నాతాల రాంరెడ్డి
సూర్యాపేటరూరల్ : టీడీపీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్గా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరికి చెందిన నాతాల రాంరెడ్డి నియామకమైనట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజా వెల్లడించారు. బుధవారం అంజనాపురి కాలనీలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పెద్దిరెడ్డి రాజా మాట్లాడుతూ కార్యకర్తల అభిష్టం మేరకు నాతాల రాంరెడ్డిని పార్టీ అధిష్టానం నియమించిందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని హుజూర్‌నగర్‌లో ఇప్పటికే పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించామని, త్వరలో సూర్యాపేట నియోజకర్గంలోనూ మొదలు పెడతామన్నారు. ఈ నెల 29న నిర్వహించే టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం చౌడోజు వీరాచారి ఆధ్వర్యంలో గజమాలతో రాంరెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాల అధ్యక్షుడు కుంచం అంజయ్య, రాధాకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వీరారెడ్డి, పగడాల లింగయ్య, శంకర్‌నాయక్, వంశీ, జానిమియా, జితేందర్, మోహన్, రామాచారి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్‌గా శిల్పాచక్రపాణి రెడ్డి
-
ముగిసిన కాలపరిమితి
హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం పర్సనల్ ఇన్చార్జిలను నియమించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్సనల్ ఇన్చార్జిలను నియమించే అధికా రం సహకార శాఖ రిజిస్ట్రార్‌కు అప్పగించింది. ఉత్తర్వుల్లో ప్రస్తుత పాలకవర్గాలను ఆరునెలల పాటు పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగించాలని ఉన్నా.. తుది నిర్ణయాన్ని సహకార శాఖ రిజిస్ట్రార్‌కు వదిలేయ డంతో ప్రస్తుత పాలకవర్గాల్లో కొన్నింటిని తప్పించే అవకాశం లేకపోలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 91 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటి కాలపరిమితి జనవరి 30తో ముగియగా, మరికొన్ని సంఘాల పాలకవర్గాల కాల పరిమితి శనివారానికి ముగియనున్నాయి. ప్రభుత్వం సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదు. మరోవై పు సహకార ఎన్నికల నిర్వహణలో మార్పులు తీసు కురావాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పాలకవర్గాల కాల పరిమితి ముగిసిన సంఘాలకు ప్రస్తుతం ఉన్న చైర్మన్లను పర్సనల్ ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తూ మరో ఆరు నెలలు పొడిగింపు ఇచ్చింది. అయితే ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలతోనే వీరి కాల పరిమితి ముగియనుంది. వీటితో పా టు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, మార్కెటింగ్ సహకార సంఘాలకు ప్రస్తుత చైర్మన్లే పర్సనల్ ఇన్చార్జిలుగా కొనసాగే అవకాశాలున్నాయి. వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అక్రమాలు జరిగా యని ప్రభుత్వం డీసీసీబీ పాలక వర్గాన్ని సస్పెండ్ చే సింది. అప్పటి నుంచి వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ను ఆఫీసర్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. దీంతో కలెక్టర్ పర్సన్ ఇన్చార్జిగా కొనసాగనున్నారు. ఓరుగల్లు సహకార మార్కెటింగ్ సంస్థ చైర్మన్‌గా ప్రస్తుతం నూకల వేణుగోపాల్‌రెడ్డి కొనసాగుతున్నారు. వివరాల సేకరణలో అధికారులు.. పీఏసీఎస్‌లు, డీసీసీబీలు, సహకార మార్కెటింగ్ సంస్థల పాలక వర్గాలకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్ల వివరాలను జిల్లా సహకార అధికారులు సేకరిస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 13 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఈ డైరెక్టర్లలో ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. వీరిని మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించిన క్రమంలో సహకార శాఖ వీరి వివరాలు సేకరిస్తుంది. సహకార సంఘాల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు బకాయిలు ఉన్నారా? అక్రమాలకు పాల్పడ్డారా తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాలు రెండు రోజుల్లో రాష్ట్ర సహకార శాఖ రిజిస్ట్రార్‌కు పంపనున్నారు. బకాయిలు, అవకతవకలకు పాల్పడినవారిని పర్సన్ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించే అవకాశముంది. ఓరుగల్లు జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ పాలకవర్గం విషయంలోను ఇదే నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు పర్సన్ ఇన్చార్జిల నియామకాల ముందు జిల్లా మంత్రుల అభిప్రాయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఎవరు పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగుతారో.. ఎవరు తొలగించబడుతారోననే సందిగ్ధంలో పాలవర్గాలు ఉన్నాయి. -
మళ్లీ ఆజాద్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా కాంగ్రెస్ అధినాయకత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆ పార్టీ ట్రబుల్ షూటర్లలో ఒకరైన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ను రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ నెలాఖరులో లేదా నవంబర్ మొదటి వారంలో ఆజాద్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అత్యున్నత విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. గత పదేళ్లుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న దిగ్విజయ్‌సింగ్‌ను ఇటీవలే తప్పించి ఆర్సీ కుంతియాను నియమించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత కొరవడటం, క్రమశిక్షణారాహిత్యం పెరిగిపోవడం వంటి అంశాలను చక్కదిద్దేందుకు కుంతియా ఏమాత్రం ప్రయత్నించడంలేదని, ఆయనకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి స్థాయి లేదని సీనియర్ నేతలు కొందరు అధిష్టానవర్గం దృష్టికి తీసుకెళ్లారు. కొందరైతే కుంతియాపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నేతలను ఏకతాటిపైకి తీసుకురావడంతోపాటు పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందించే బాధ్యతను ఆజాద్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఎన్నికలకు ఏడాది ముందుగా ఆజాద్‌ను రంగంలోకి దించాలని పార్టీ ముందుగా భావించింది. అయితే వచ్చే ఏడాది నవంబర్లోనే ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన నియామక పక్రటనను కూడా ముందుకు జరిపినట్లు సమాచారం. కుంతియాను లెక్కచేయని నేతలు మామూలుగా అధిష్టానవర్గం ఎవరిని ఇన్చార్జిగా నియమించినా కాంగ్రెస్ నేతలు ఆయన చెప్పినట్లు నడుచుకోవడం కొంతవరకు ఆనవాయితీ. కానీ కుంతియాను ఇన్చార్జిగా నియమించిన నాటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో అసహనం పెరిగిపోయింది. కుంతియాకు ఇన్చార్జి స్థాయి లేదంటూ నేతలు బహిరంగంగా విమర్శించడమే కాకుండా వెంటనే ఆయన్ను తొలగించాలని అనేక మంది ఢిల్లీకి వెళ్లారు. నేరుగా సోనియా, రాహుల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులు అయితే ఏకంగా తాము పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతామంటూ బహిరంగంగా అల్టిమేటమ్ జారీ చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా ఏ మాత్రం పనికిరారని, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన నడుచుకుంటున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడొకరు రాహుల్‌కు ఫిర్యాదు చేశారు. కుంతియాను కొనసాగిస్తే కాంగ్రెస్‌లో ఎవరూ మిగలరని, ఓ స్థాయి కలిగిన నేతను నియమిస్తే బాగుంటుందని అనేక మంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా అధిష్టానవర్గానికి సూచించినట్లు సమాచారం. కోమటిరెడ్డి సోదరులను నిలువరించిన ఆజాద్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరించే సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్‌కు పనికొచ్చే నాయకులుగా పేరున్న కోమటిరెడ్డి సోదరులు పార్టీ వీడుతున్నారని తెలియడంతోనే ఆజాద్ రంగంలోకి దిగారు. అధిష్టానవర్గంతో మాట్లాడి కోమటిరెడ్డి సోదరులను ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపారు. పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడొద్దని సూచించారు. వారి భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో కూడా మాట్లాడిన ఆజాద్.. కోమటిరెడ్డి సోదరులు పార్టీ వీడకుండా చర్చలు జరపాలని సూచించారు. నాలుగు రోజుల క్రితం మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డిని తన నివాసానికి పిలిపించుకుని జైపాల్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరపారు. మరుసటి రోజే రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆజాద్, రాహుల్‌గాంధీని కలిసి వచ్చినట్లు తెలిసింది. ఆజాద్‌ను పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా నియమిస్తే తాము పార్టీలోనే ఉంటామని కోమటిరెడ్డి సోదరులు తమ సన్నిహితులతో చెబుతున్నారు. పార్టీ వీడిన వారిని రప్పించేందుకు చర్యలు గడచిన మూడేళ్ల కాలంలో పార్టీని వీడి వెళ్లిపోయిన వారిని తిరిగి సొంత గూటికి తెచ్చేందుకు కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. ఇటీవల ఆజాద్ ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా .. సీనియర్ నేతలకు ఇందుకు సంబంధించి కొన్ని సూచనలు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకత్వంలో సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు, జీవన్‌రెడ్డి, డీకే అరుణ తదితరులతో కమిటీ వేయాలని, పార్టీని వీడి వెళ్లినవారితో ఈ కమిటీ సంప్రదింపులు జరపాలని సలహా ఇచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై విధానపరమైన ప్రకటన వెలువడిన తర్వాతే పార్టీ వీడి వెళ్లిన వారితో చర్చలు ఉంటాయని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ఆజాద్ తిరిగి రాష్ట్ర ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరిస్తారన్న సమాచారం రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం నింపింది. -
మహిళా ప్రొఫెసర్‌పై ఇన్చార్జి వేధింపులు
పోలీసులకు ఫిర్యాదు గుడుపల్లె : తన శాఖ అధ్యక్షుడు చిన్నరెడ్డెయ్య అసభ్యకరంగా మాట్లాడు తూ వేధింపులకు గురి చేస్తున్నారని ద్రవిడ వర్సిటీలో తెలుగు శాఖ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీదేవి శుక్రవారం గుడుపల్లె పోలీసుల కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాలు.. పనివేళల్లో అకారణంగా అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలాలతో మాట్లాడుతూ శ్రీదేవిని చిన్నరెడ్డెయ్య ఇబ్బందులు పెడుతున్నారు. ఆరు నెలలగా ఈ హింసను ఆమె భరిస్తోంది. చిన్నరెడ్డెయ్యపై పలుమార్లు వర్సిటీ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నా వేధిం పులు తట్టుకోలేకపోతున్నానని, భద్రత కరువవుతోందని ఆమె తీవ్ర మన స్తాపానికి గురవు తున్నారు. వర్సిటీ అధికారులు ఇక తమకు న్యాయం చేయలేరని నమ్మకం పోయిందని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో ఆమె పోలీసులను కోరారు. -
లోవ ఇన్చార్జి సూపరింటెండెంట్ సస్పెన్షన్
తుని రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కాండ్రేగుల వెంకటరమణను సస్పెండ్ చేసినట్టు అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. శనివారం జారీ చేసిన ఉత్తర్వుల నకళ్లలో సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ కేవీ రమణ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం, అధికారుల అనుమతి లేకుండా పనులు చేపట్టడం, అధికార దుర్వినియోగం అభియోగాలపై సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. తొమ్మిది అంశాలపై 30 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని, తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. గతేడాది నవంబరు నెలాఖరిలో అప్పటి సూపరింటెండెంట్ వివిధ ఆరోపణలపై శ్రీనివాస్ సస్పెండయ్యారు. దాంతో ఏర్పడిన ఖాళీలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న కాండ్రేగుల వెంకట రమణకు సూపరింటెండెంట్ బాధ్యతలను అప్పగించారు. అభియోగాలు : ఈఓ అనుమతి లేకుండా ఈ నెల 23న ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించడం. - విధుల్లో నిర్లక్ష్యం, అందుబాటులో లేకుండా చైర్మన్ వద్ద ఉంటూ పరిపాలనలో సమన్వయం దెబ్బతీయడం. - నిబంధనలను వక్రీకరించి ధర్మకర్తలను తప్పుదారి పట్టించుట. - తోటి సిబ్బందిపై ఆరోపణలు చేయుటకు ధర్మకర్తలను ప్రేరేపించడం. - పూర్వపు టెండరుదారులతో చనువుగా వ్యవహరిస్తూ టెండర్ల ప్రక్రియపై అసంబద్ధ సమాచారం ఇవ్వడం - అంతర్గత బదిలీల్లో స్వప్రయోజనాలు కలిగి ఉండడం, తనకు ధర్మకర్తల మండలి రక్షణ ఉందని, తనను ఏమి చేయలేరని, తన కోసం అవసరమైతే ధర్మకర్తలు రాజీనామా చేస్తారని, నేను చెప్పినట్టు వినాల్సిందేని తోటి ఉద్యోగులను వేధించడం - ఈఓ, తోటి సిబ్బందిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదులు పెట్టడం, ఇతరలను ప్రేరేపించడం. - ధర్మకర్తల మండలివారికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై తప్పుడు సమాచారం ఇవ్వడం, ఉద్యోగాలపై వారికి ఆశ కల్పించడం - ఇంజనీరింగ్ విభాగం అనుమతులు లేకుండా దేవస్థానంలో ధర్మకర్తల మండలి వారితో మైనర్, మేజర్ పనులు చేపట్టవచ్చని తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా దేవస్థానం పరిపాలనకు ఆటంకం కలిగించడాన్ని కారణాలుగా చూపించారు. -
ఇన్చార్జి ఈఓగా జగన్నాథరావు
- నేడు అన్నవరం దేవస్థానం బాధ్యతలు చేపట్టనున్న ఏసీ - ప్రిన్సిపల్ సెక్రటరీ విదేశీ పర్యటనతో రెగ్యులర్ ఈఓ నియామకంలో జాప్యం అన్నవరం (ప్రత్తిపాడు) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ఇన్చార్జి కార్యనిర్వహణాధికారి(ఫుల్ అడిషనల్ చార్జి)గా అసిస్టెంట్ కమిషనర్ ఈరంకి వేంకట జగన్నాథరావు నియమితులయ్యారు. ఈమేరకు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఈఓ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కె.నాగేశ్వరరావును విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్-2గా ఈ నెల 8న ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో వచ్చేందుకు పలువురు ప్రయత్నాలు చేశారు. అవి ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు. దీనికితోడు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ రెండు వారాల పాటు సెలవు పెట్టి శుక్రవారం విదేశాలకు వెళ్లారు. ఆయన ఈ నెల 30న తిరిగి వస్తారు. ఆ తరువాతే ఈఓ నియామకంపై ఒక నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈలోగా దేవస్థానంలో పాలన వ్యవహారాలు చూసేందుకు, బదిలీ అయిన ఈఓ నాగేశ్వరరావును రిలీవ్ చేసేందుకు ఇన్చార్జిగా ఈరంకిని నియమించారు. ఆయనను ఆ ఇన్చార్జి ఈఓగా నియమించే అవకాశం ఉందని ‘సాక్షి’ ముందే చెప్పింది. బదిలీ అయిన ఈఓ నాగేశ్వరరావు నుంచి జగన్నాథరావు శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయనగరం జేసీ-2గా సోమ లేదా మంగళవారాల్లో తాను బాధ్యతలు స్వీకరిస్తానని నాగేశ్వరరావు శుక్రవారం సాయంత్రం ‘సాక్షి’కి తెలిపారు. ఈరంకికి ఈ బాధ్యతలు ఏడోసారి.. గత ఆరేళ్లుగా ఏసీ జగన్నాథరావు ఆరుసార్లు అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా పని చేశారు. ఈసారి కూడా కలుపుకుంటే అది ఏడోసారి అవుతుంది. 2010లో అప్పటి ఈఓ కె.రామచంద్రమోహన్ అమెరికాలో సత్యదేవుని వ్రతాల నిర్వహణకు వెళ్లినపుడు ఈరంకి పది రోజులు ఇన్చార్జి ఈఓగా పని చేశారు. రామచంద్రమోహన్ తరువాత 2012లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ప్రసాదం వేంకటేశ్వర్లు ఈఓగా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు తీసుకోవడానికి 15 రోజులు పట్టడంతో అప్పుడు కూడా జగన్నాథరావే ఇన్చార్జి ఈఓగా పని చేశారు. వేంకటేశ్వర్లు 2013లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినపుడు 12 రోజులు ఇన్చార్జి ఈఓగా పని చేశారు. వేంకటేశ్వర్లు 2013 మే నెలలో 15 రోజులు సెలవు పెట్టినపుడు కూడా ఇన్చార్జి ఈఓగా పని చేశారు. 2014 ఆగస్టులో వేంకటేశ్వర్లు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పీఏగా బదిలీ కాగా, ఆయన స్థానంలో 2015 జూలై రెండో తేదీన కె.నాగేశ్వరరావు ఈఓగా వచ్చే వరకూ ఈరంకి ఇన్చార్జి ఈఓగా పని చేశారు. ఇప్పుడు తిరిగి ఇన్చార్జి ఈఓగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ఇన్చార్జ్ డీఈఓకే పూర్తి బాధ్యతలు?
– నేడు అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం కర్నూలు సిటీ: ఇన్చార్జ్ డీఈఓ తాహెరా సుల్తానాకే పూర్తి బాధ్యతలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా.. 11 చోట్ల ఇన్చార్జ్ డీఈఓలు పనిచేస్తున్నారు. శాసన మండలి ఎన్నికల కోడ్ ఉండడంతో రెగ్యులర్ డీఈఓలు వచ్చేందుకు సుమారు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. పదో తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఇన్‌చార్జీలకే పూర్తి బాధ్యతలు ఇవ్వనున్నారు. -
విష్ణుపై తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు
- ప్యాలకుర్తి జన్మభూమి గ్రామసభ గందగోళం - అర్ధంతరంగా ముగిసిన కార్యక్రమం కోడుమూరు రూరల్ : టీడీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డిపై తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు చేశారు. మండలంలోని ప్యాలకుర్తిలో మంగళవారం సర్పంచ్ మునిస్వామి అధ్యక్షతన నోడల్ అధికారి భాస్కర్‌రెడ్డి..జన్మభూమి గ్రామ సభ నిర్వహించారు. రేషన్‌కార్డులు, ఇళ్లు, పింఛన్ల మంజూరు కోసం జన్మభూమి కమిటీ సభ్యులు డబ్బులు వసూలు చేస్తున్నారని, అక్రమాలకు పాల్పడే సభ్యులపై క్రిమినల్ కేసులు పెట్టిస్తానంటూ సభలో ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. విష్ణు వ్యాఖ్యలతో ప్యాలకుర్తికి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు ఉగాది వెంకటేశ్వర్లు, రంగన్న, మరికొందరు విభేదించారు. అక్రమ వసూళ్లు చేసివుంటే చూపించాలంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఇరువర్గాల వాగ్వాదంతో సభ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇదిలా ఉండగా..సభను పంచాయతీ కార్యాలయం వద్ద కాకుండా..ప్రాథమిక పాఠశాలలో నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని భయపడి అధికారులు ఇలా చేశారనే ఆరోపణలు వచ్చాయి. -
టీడీపీ మార్కు రాజకీయం
ఎమ్మెల్యేలకే ప్రొటోకాల్! - గతంలో ఉన్న ఇన్‌చార్జీలకు రద్దు - అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు - కోడుమూరు ఎమ్మెల్యేకు మాత్రం ఎదురుదెబ్బ? - చర్చనీయాంశంగా అధికార పార్టీ తీరు - వాడుకుని వదిలేశారనే చర్చ సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో గతం నుంచి ఉన్న ఇన్‌చార్జీలకు, గోడదూకిన ఎమ్మెల్యేలకు మధ్య రోజుకో వివాదం తెరమీదకు వస్తోంది. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకే ప్రొటోకాల్ ఇవ్వాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించినట్టు తెలిసింది. ఇన్‌చార్జీలకు ప్రొటోకాల్ రద్దు చేయాలని అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. అయితే, ఈ విషయంలో కోడుమూరు ఎమ్మెల్యేకు మాత్రం మినహాయింపు ఇవ్వడం గమనార్హం. ఈ నియోజకవర్గంలో ఇన్చార్జీకే ప్రొటోకాల్ వర్తింపచేయాలని సూచించినట్టు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. తాజా వ్యవహారంతో అధికార పార్టీలో పాత, కొత్త నేతల మధ్య వివాదం రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో తమ భవితవ్యం ఏమిటనే అంశంపై ఇన్చార్జీలు తర్జనభర్జన పడుతున్నారు. ఇంతగా అవమానాలు పడుతూ తాము ఎలా పని చేయాలని మదనపడుతున్నారు. త్వరలో నేరుగా పార్టీ అధినేత చంద్రబాబును కలిసి తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆది నుంచీ అంతే...! వాస్తవానికి అప్పటికే ఉన్న ఇన్‌చార్జీలకు, పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు మధ్య వివాదం రగులుతూనే ఉంది. కొత్తగా చేరిన వారికి కేవలం ఎమ్మెల్యేగా ప్రొటోకాల్ మాత్రమే ఉంటుందని.. నియోజకవర్గంలో మిగతా అన్ని పనులు ఇన్చార్జీలు చేప్పినట్టే జరుగుతాయని స్వయంగా అధికారపార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరీ స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యేల పనులు ఏమీ కావని అందరూ భావించారు. అయితే, పార్టీలో చేరిన తమకు గౌరవం ఇవ్వకపోతే ఎలా అంటూ వీరు సీఎం వద్ద పంచాయితీ పెట్టారు. ఈ మధ్యకాలంలో ఇన్‌చార్జీలే కీలకంగా వ్యవహరించారు. పనులు మొదలుకొని అధికారుల బదిలీల వరకూ అన్నీ తామై వ్యవహరించారు. అయితే, ఎమ్మెల్యేలు కాస్తా తమ పరువు పోతోందంటూ వాపోవడం మొదలుపెట్టారు. దీంతో ప్రొటోకాల్ ఇవ్వడమే కాకుండా ఎమ్మెల్యేల పనులే చేయాలంటూ తాజాగా ప్రభుత్వ పెద్దల నుంచి అధికార యంత్రాంగానికి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలోనే జన్మభూమి సమావేశాల్లో ఎక్కడా ఇన్చార్జీలు దర్శనమివ్వని పరిస్థితి. ఇంతటితో ఆగిపోకుండా ఇన్‌చార్జీలకు అసలు ప్రొటోకాల్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అధికార పార్టీ పెద్దలు తేల్చిచెప్పడంతో వీరు కంగుతిన్నారు. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యింది. మొన్నటి దాకా ఎమ్మెల్యే కాకపోయినా ముందుండి జీపుల్లో సెక్యూరిటీ ఇవ్వడం.. సమావేశం అని పిలిస్తే పరుగెత్తి పోవడం జరిగేది. ఇప్పుడు ఆ అవసరం లేదని ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. జన్మభూమి సభల్లో ఇన్చార్జీలు పెద్దగా కనిపించకపోవడం అందులో భాగమేననే చర్చ జరుగుతోంది. అయితే, కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల మాత్రమే ఇన్‌చార్జీలకు బాధ్యతలు ఇవ్వాలని చెబుతున్న అధికార పార్టీ ద్వంద్వ వైఖరిని ఆ పార్టీ నేతలే ఈసడించుకుంటున్నారు. వాడుకుని వదిలేయడం తమ అధినేతకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు అధికారం వచ్చిందని సంబరపడిపోతున్న పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా త్వరలోనే అవమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి అధికార పార్టీలో రోజుకో మలుపుతిరుగుతున్న ఇన్చార్జి–ఎమ్మెల్యేల వ్యవహారం మరింతగా ఇద్దరి మధ్య అగాథం పెంచక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
తాత్కాలిక డీఎంహెచ్‌వోగా మీనాక్షి మహదేవ్
కర్నూలు(హాస్పిటల్): తాత్కాలిక డీఎంహెచ్‌వోగా డాక్టర్ మీనాక్షి మహదేవ్‌ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం డాక్టర్ మీనాక్షి మహదేవ్ బాధ్యతలు స్వీకరించారు. డీఎంహెచ్‌వోగా ఉన్న డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఇదే సమయంలో అడిషనల్ డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న డాక్టర్ రాజాసుబ్బారావు సైతం డిసెంబర్ 31వ తేదీన పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో ప్రాంతీయ శిక్షణా కేంద్రం(మేల్)లో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న డాక్టర్ వై.నరసింహులును ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఆయన తన తల్లి ఆరోగ్యం బాగాలేదని బాధ్యతలు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో డీఎంహెచ్‌వోతో పాటు అడిషనల్ డీఎంహెచ్‌వో పోస్టు ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఉన్న సందర్భంగా సీనియర్‌గా ఉన్న ప్రాంతీయ శిక్షణ కేంద్రం(ఫిమేల్) ప్రిన్సిపాల్ డాక్టర్ మీనాక్షిమహదేవ్‌ను తాత్కాలిక డీఎంహెచ్‌వోగా నియమించారు. ఆమెను ఆదివారం ఏపీ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం నాయకులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
ఎమ్మెల్యేలదే పెత్తనం!
ఇన్చార్జీలు ఇక డమ్మీలే.. - అధికార పార్టీలో కొత్త ముసలం - నియోజకవర్గాల్లో ఇక ఒక్కరిదే రాజ్యం - గుంటూరు సమావేశంలో స్పష్టం చేసిన అధినాయకత్వం? - అదే జరిగితే సత్తా చూపుతామంటున్న పాత కాపులు - పార్టీ రెండుగా చీలక తప్పదని హెచ్చరికలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో ఇక ఎమ్మెల్యేల పెత్తనం సాగనుందా? వారే నియోజకవర్గానికి రాజుగా వ్యవహరించనున్నారా? నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా ఉన్న వారు ఇక డమ్మీలేనా? అనే వరుస ప్రశ్నలకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అవుననే అంటున్నారు. వారం రోజుల క్రితం గుంటూరులో జరిగిన సమావేశంలో ఈ మేరకు అధికార పార్టీ నాయకత్వం స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. అయితే, అలాంటిదేమీ లేదని నియోజకవర్గ ఇన్చార్జీలు కౌంటర్ ఇస్తున్నారు. నిజంగా ఎమ్మెల్యేలకే పెత్తనం ఇస్తే.. ఇన్ని రోజులుగా పార్టీకి సేవచేసి.. కష్టాల్లో ఉన్న సమయంలో పార్టీ వెంట నడిచిన వారిని కాదంటే కార్యకర్తలకు రాంగ్ సిగ్నల్ పంపినట్టు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే అమలైతే ఇక అధికార పార్టీని సొంత కేడర్ కూడా నమ్మే పరిస్థితి ఉండదంటున్నారు. మొత్తం మీద తాజా నిర్ణయం అధికార పార్టీలో కొత్త రచ్చకు తెరలేపింది. పార్టీ మారినా దక్కని పరువు...! వాస్తవానికి ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలో చేరిన తర్వాత కూడా నియోజకవర్గ ఇన్‌చార్జీలే పెత్తనం చెలాయిస్తూ వస్తున్నారు. వారు సిఫారసు చేసిన వారికే నామినేటెడ్ పోస్టులు దక్కాయి. జన్మభూమి కమిటీల్లోనూ వారి పెత్తనమే సాగింది. ఈ నేపథ్యంలో పార్టీ మారినప్పటికీ తమకు ఏ మాత్రం విలువ లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. పైగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్టు ప్రకటనలు గుప్పించామని.. అలాంటిదేమీ జరగకపోవడంతో నోట్ల కట్టల కోసమే పార్టీ మారామనే విషయం ప్రజలకు తెలిసిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పార్టీ మారడంతో కేడర్ నుంచి వ్యతిరేకత వస్తోందనేది వీరి వాదనగా ఉంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా తమనే పరిగణించాలని పార్టీ అధినాయకత్వాన్ని కోరుతూ వస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు అది అమలు కాలేదు. అయితే, గత నాలుగు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలకు పెత్తనం అప్పగించాలనే నిర్ణయం జరిగిందని అధికార పార్టీలోని కొందరు నేతలు చెబుతున్నారు. చీలిక ఖాయం ఎమ్మెల్యేల పెత్తనం రాబోతుందన్న వార్తలను ఇన్చార్జీలు కొట్టిపడేస్తున్నారు. ఇదే జరిగితే కష్టకాలంలో పార్టీ వెంట నడిచిన వారంతా క్రమంగా పార్టీకి దూరమవుతారని అంటున్నారు. పైగా మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి సాహసం పార్టీ చేయదని వీరు వాదిస్తున్నారు. ఇది అమలైన మరుక్షణం కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చిన అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ రెండుగా చీలుతుందని వీరు బలంగా పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేల రాజ్యం అమల్లోకి వచ్చిన మరుక్షణం తమ సత్తా ఏమిటో మార్చిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చూపుతామని హెచ్చరిస్తున్నారు. -
పుష్కర బాధ్యులు వీరే..!
– శ్రీశైలం ఓవరాల్ ఇన్చార్జిగా ఈవో భరత్ గుప్త – సంగమేశ్వరం ఓవరాల్ ఇన్చార్జిగా జేసీ హరికిరణ్ – కంట్రోల్ రూముల్లో 19 మంది అధికారులు – ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణా పుష్కరాలను విజయవంతం నిర్వహించడంలో భాగంగా జిల్లాకలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఘాట్లు, పార్కింగ్ స్థలాలు, వసతులు తదితర వాటిని విభజించి వాటికి జిల్లాస్థాయి అధికారులను, ఏరియా ప్రత్యేక అధికారులను, ప్లేస్ అధికారులను నియమించారు. వారి విధులు, బాధ్యతలను వివరించారు. వీరంతా ఈనెల 8వ తేదీ నుంచి ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు ప్రొసీడింగ్ ఇచ్చారు. ప్రధానంగా శ్రీశైలంపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. పుష్కరాలు విజయవంతం కావడంలో ఏరియా ప్రత్యేక అధికారి, ప్లేస్ అధికారుల పాత్ర ఎంతో ఉంటుంది. వీరికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. శ్రీశైలం శ్రీశైలం దేవస్థానం ఓవరాల్ ఇన్చార్జి ఆఫీసర్‌గా దేవస్థానం కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్ గుప్తను నియమించారు. అక్కడ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇది నంద్యాల ఎస్ఆర్బీసీ ప్రత్యేక ఉప కలెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో పోలీసు, ఇరిగేషన్, మత్స్య శాఖ, ఫైర్, మెడికల్ అండ్ హెల్త్, దేవదాయ శాఖ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అధికారులు, సమాచార శాఖ డీడీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్(శానిటేషన్), విద్యుత్, కమ్యూనికేషన్, వికలాంగుల శాఖ ఏడీ, రవాణా, ఆర్టీసీ, ఎకై ్సజ్ సివిల్ సప్లయ్ అండ్ ధరల నియంత్రణ అధికారులు, ప్రొటోకాల్ అధికారులు ఉంటారు. పార్కింగ్ ప్లేస్‌లు శ్రీశైలంలో పార్కింగ్ ప్లేస్‌లను ఐదింటిని ఏర్పాటు చేసి వాటికి జిల్లా అధికారులను ఏరియా ప్రత్యేక అధికారులను నియమించారు. పార్కింగ్ ప్లేస్–1 ప్రత్యేక ఏరియా అధికారిగా జిల్లా సహకార అధికారి, పార్కింగ్ ప్లేస్–2 ప్రత్యేక అధికారిగా పట్టు పరిశ్రమ శాఖ డీడీ, పార్కింగ్ ప్లేస్–3 చేనేత జౌళి శాఖ ఏడీ, పార్కింగ్ ప్లేస్–4కు సర్వశిక్ష అభియాన్ పీఓ, పార్కింగ్ ప్లేస్–5కు నంద్యాల ఉద్యాన శాఖ ఏడీని ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరు ఓవరాల్‌గా పర్యవేక్షిస్తుండగా వీరికి సహాయకంగా ప్లేస్ అధికారులు ఉంటారు. పుష్కర నగర్... శ్రీశైలంలో పుష్కర నగర్లు మూడు ఏర్పాటు అయ్యాయి. ఇందులో స్త్రీలు, పురుషులకు ప్రత్యేక వసతులు ఉంటాయి. ఒకటో పుష్కర నగర్‌కు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ, రెండో పుష్కర నగర్‌కు జిల్లా విద్యాశాఖాధికారి, మూడో పుష్కర నగర్‌కు హౌసింగ్ పీడీలను ప్రత్యేక ఏరియా అధికారులుగా నియమించారు. ఘాట్ ఇన్చార్జి... మల్లికార్జున ఘాట్ (పాత)కు మైనార్టీ కార్పొరేషన్ ఈడీ, భ్రమరాంబిక ఘాట్(కొత్త)కు వ్యవసాయ శాఖ జేడీ, హోల్డింగ్ ఏరియా–1(మల్లికార్జున ఘాట్ వెనుక)కు బీసీ కార్పొరేషన్ ఈడీ, హోల్డింగ్ ఏరియా–2(భ్రమరాంబిక ఘాట్ వెనుక)కు బీసీ సంక్షేమ అధికారి, రోప్ వేకు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి, లింగాల ఘాట్‌కు డ్వామా పీడీ, లో లెవల్ లింగాల ఘాట్‌కు మెప్మా పీడీ, పాలధార, పంచధారకు జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం, సాక్షి గణపతికి మార్కెటింగ్ శాఖ ఏడీ, సున్నిపెంటలోని పుష్కర నగర్‌కు గనుల శాఖ ఏడీ, భ్రామరీ కళామందిరం, శివదీక్ష శిబిరాలకు శ్రీశైలం జేఈఓ, దేవస్థానం ఏరియాకు జెడ్పీ సీఈఓలను ఏరియా స్పెషల్ అధికారులుగా నియమించారు. వీరికి సహాయకంగా గజిటెడ్ అధికారులను నియమించారు. సంగమేశ్వరం... సంగమేశ్వరం ఓవరాల్ ఇన్చార్జి ఆఫీసర్‌గా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ వ్యవహరిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్ హెచ్ఎన్ఎస్ఎస్–4 స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ మల్లికార్జున నేతత్వంలో పనిచేస్తుంది. ఇందులో శ్రీశైలంలోని కంట్రోల్ రూమ్‌లో ఉంటున్న విధంగానే 18 శాఖల ద్వితీయ స్థాయి అధికారులు ఉంటారు. సంగమేశ్వర నగర్... దీనికి ఏరియా ప్రత్యేక అధికారిగా శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ వ్యవహరిస్తారు. ఇందులోనే పార్కింగ్ ప్లేస్, స్త్రీలు, పురుషుల వసతి, క్లాక్రూము, ఫుడ్ కోర్టు, అన్నదాన సత్రం, డ్వాక్రా ఉత్పత్తులు, పూజా సామాగ్రి లభిస్తాయి. పార్కింగ్ ప్లేస్‌కు హెచ్ఎన్ఎస్ఎస్–3 స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ ప్రత్యేక అధికారిగా ఉంటారు. ఒక్కోదానికి విడివిడిగా ప్లేస్ అధికారులను నియమించారు. బీమానగర్... బీమా నగర్ పర్యవేక్షణ అధికారిగా జేసీ–2 రామస్వామి వ్యవహరిస్తారు. ఇందులో వీఐపీ సిబ్బంది వాహనాల పార్కింగ్, సిబ్బంది వసతి, సిబ్బంది క్యాంటీన్, క్లాక్రూము, 10 బెడ్స్ ఆసుపత్రి, వీఐపీలకు వాటర్‌ప్రూఫ్ పందిళ్లు (వంద మందికి తగ్గట్లుగా) ఫుడ్ కోర్టు ఉంటాయి. ఘాట్ ఏరియా... ఘాట్ ఏరియా ప్రత్యేక అధికారిగా కర్నూలు ఆర్డీఓ వ్యవహరిస్తారు. ఇందులో సంగమేశ్వరం ఘాట్, పిండ ప్రదానం ఘాట్, దుస్తులు మార్చుకునే గదులు, పూజాసామాగ్రి, పిండ ప్రధాన సామాగ్రి స్టాల్స్, వీవీఐపీ ఘాట్, లలితాదేవి ఘాట్లు ఉంటాయి. వీవీఐపీ ఘాట్ ప్రత్యేక అధికారిగా ప్యాపిలి ఎంపీడీఓను నియమించారు. దేవస్థానం ఏరియా... టెంపుల్ ఏరియా ప్రత్యేక అధికారిగా కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ వ్యవహరిస్తారు. ఇందులో లో లెవల్ ఘాట్, పిండ ప్రదాన ఘాట్, ఆలయం ఉంటాయి. ప్రతి విభాగానికి ప్లేస్ అధికారి ఉంటారు. మొత్తంగా పుష్కరాలకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులందరినీ వినియోగిస్తున్నారు. -
ఏపీఈపీడీసీఎల్ ఇన్చార్జి సీఎండీగా నివాస్
సాక్షి, విశాఖపట్నం ఏపీ ఈపీడీసీఎల్ ఇన్చార్జి సీఎండీగా జిల్లా జాయింట్ కలెక్టర్ జె.నివాస్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సీఎండీగా ఉన్న రేవు ముత్యాలరాజు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన విషయంతెలిసిందే. ఆయన స్థానంలో ఇన్చార్జి బాధ్యతలను నివాస్‌కు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్‌ను సీఎండీగా నియమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. యలమంచిలి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ యలమంచిలి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎస్.శ్రీనివాసరావుపై బదిలీ వేటు పడింది. ఆయనను కౌన్సెలింగ్‌లో పార్వతీపురం మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ తొలుత ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ తర్వాత ఆ పోస్ట్‌లో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న సీహెచ్ ప్రమీలను నియమించారు. దీంతో ఎస్.శ్రీనివాసరావును గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్‌గా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న వి.సత్యనారాయణను యలమంచిలి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. -
ఇదేమి శిక్షణ?
మంచిర్యాల సిటీ : జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లతోపాటు పీజీ హెచ్ఎంల కొరత అధికంగా ఉంది. దీనికి తోడు ఉన్న పీజీ హెచ్ఎంలకు ఇన్చార్జి మండల విద్యాధికారులుగా అదనపు బాధ్యతలు ఉన్నాయి. విద్యావారోత్సవాలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, ఏకరూప దుస్తుల అందజేత, పదో తరగతి ఇన్స్టంట్ పరీక్షలు, తరగతుల నిర్వహణ, అడ్మిషన్ల సమయంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బిజీబిజీగా ఉంటారు. ఇంతటి విలువైన సమయంలో రాష్ట్ర విద్యాశాఖ మారిన 9,10 తరగతుల కొత్త పాఠ్యపుస్తకాలపై పీజీ హెచ్ఎంలకు, స్కూల్ అసిస్టెంట్లకు ఈ నెల 16 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు మండలాల వారిగా టెలికాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సమయంలో శిక్షణ సరికాదని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. పదో తరగతి పరీక్షల అనంతరం సంబంధిత ఉపాధ్యాయులు మూల్యాంకనంకు వెళ్తారు. ఈ సమయంలోనే విద్యావారోత్సవాలు నిర్వహించాలి. 15 రోజుల్లో.. ఉన్నత పాఠశాలల్లో ఈనెల 16 తేదీ నుంచి 27 తేదీ వరకు పదో తరగతి విద్యార్థులకు ఇన్స్టంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 16 తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు విద్యావారోత్సవాలు నిర్వహించాలి. మారిన 9,10 తరగతుల పాఠ్యపుస్తకాలపై ఈనెల 16 తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, సబ్జెక్టు ఉపాధ్యాయులకు టెలికాన్ఫరెన్సు ద్వారా శిక్షణ ఇవ్వడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. పదో తరగతి పరీక్షలకు, శిక్షణకు ఇక్కడ హాజరయ్యే వారంతా కూడా స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులే. దీంతో పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుండా పోతారు. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు మూడు రకాల విధుల్లో పాల్గొంటే పాఠశాల పరిస్థితి, విద్యార్థుల చదువు ఏమవుతుందో ఫలితాల కోసం ఆరాటపడే అధికారులకే తెలియాలి. ఖాళీలు.. జిల్లాలో పదోన్నతుల ప్రక్రియ 2012 జనవరిలో నిలిచిం ది. 90 శాతం ఉన్నత పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది లేరు. పాఠశాల కార్యాలయం పనులు ఏవరో ఒక ఉపాధ్యాయుడు చేయాల్సిందే. 468 ఉన్నత పాఠశాలల్లో 356 స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికితోడుగా 38 పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు లేరు. మిగిలిన 430 పాఠశాలల్లో పనిచేస్తు న్న ప్రధానోపాధ్యాయుల్లో 49 మంది ఇన్చార్జి మండల విద్యాధికారులుగా పనిచేస్తున్నారు. కాగా, శిక్షణ అనేది సెలవుల సమయంలో ఉంటేనే సమంజసంగా ఉంటుం దని ఉపాధ్యాయువర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. నష్టం పదిహేను రోజులపాటు వివిధ కార్యక్రమాల పేరుతో ఉ పాధ్యాయుల, ప్రధానోపాధ్యాయులు బడికి దూరంగా ఉంటే పాఠశాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. పాఠశాల అరంభంలోనే అడ్మిషన్లు రావడం సహజం. ఈ కీలక సమయంలో అరకొర ఉపాధ్యాయులచే నడు స్తున్న పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు కనబడకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో విద్యాశాఖకే తెలియాలి. ఈ ప రిస్థితి ప్రవేటు పాఠశాలలకు పరోక్షంగా అవకాశం ఇచ్చి నట్లవుతుందని ఉపాధ్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పీఆర్వోలను ని యమించి, వీధివీధికి బస్సులను తిప్పుతూ అడ్మిషన్లను తీసుకుంటుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు శిక్షణ పేరిట వెళ్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే అడ్మిషన్లు రావాలంటే ఎలా పస్తాయని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. -
ఏడు అసెంబ్లీ స్థానాలకు
త్వరలో ఇన్‌చార్జ్‌ల నియామకం కేంద్రమంత్రి పనబాక లక్ష్మి చీమకుర్తి, న్యూస్‌లైన్: బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనున్న ఏడు అసెంబ్లీ స్థానాలకు త్వరలో కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించనున్నట్లు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. చీమకుర్తిలోని డాక్టర్ జవహర్ ఆస్పత్రి ఆవరణలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పనబాక మాట్లాడుతూ ఇన్చార్జిలను నియమించేందుకు ఈ పాటికే ప్రతిపాదనలను పంపించామని, అవి ఆమోదం పొందగానే అసెంబ్లీ స్థానాల్లో కొత్త ఇన్చార్జిలు వస్తారన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయకుమార్ ఉన్నారుగదా..? అని విలేకరులు గుర్తు చేయగా ఆయన టచ్‌లో లేరని అందువలనే ఇన్చార్జిని నియమించాల్సి వస్తుందని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలన్నిటిలోనూ కాంగ్రెస్‌పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కీరోల్ వహించనుందని అన్నారు. అనంతరం కాంగ్రెస్‌పార్టీ తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఆమె వెంట ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేమా శ్రీనివాసరావు, అవిశనేని వెంగన్న, కడియాల సుబ్బారావు, పాలడుగు తిరుపతయ్య, బండి శ్రీహరి, డాక్టర్ బీ.జవహర్ ఉన్నారు. -
గులాబీ నేతలకు పరీక్ష
మునిసిపల్ ఎన్నికలు టీఆర్ఎస్ ఇన్‌చార్జ్‌లకు పరీక్షగా మారాయి. ఆ పార్టీ నియోజకవర్గ నేతలతోపాటు ఎన్నికల ఇన్‌చార్జ్‌లకు సవాల్‌గా నిలిచాయి. జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సాధారణ ఎన్నికలు ఉన్నందున టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మునిసి‘పోల్స్’ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు ఆయూ మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఇద్దరు చొప్పున ఎన్నికల ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఇటీవల హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జిల్లా నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఏమరుపాటు లేకుండా మునిసిపాలిటీలు, నగర పంచాయతీలపై గులాబీ జెండా ఎగురవేయాలని స్పష్టం చేశారు. అలసత్వం ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు. అంతేకాదు.. సాధారణ ఎన్నికల్లో టికెట్ రావాలంటే మునిసిపల్ ఎన్నికల్లో గెలవాలని మెలిక పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అనుకూల పవనాలు వీస్తున్న ఈ తరుణంలో సునాయూసంగా అసెంబ్లీలో అడుగుపెడదామని భావించిన ఆశావహులకు కేసీఆర్ ఝలక్ ఇచ్చినట్లరుుంది. ప్రధానంగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆశిస్తున్న నియోజకవర్గ ఇన్చార్జ్లలో గుండె దడ పెరిగింది. తెలంగాణ వచ్చిన నేపథ్యంలో తమదే విజయమనే బీరాలు పలుకుతున్నప్పటికీ... అంతర్గతంగా వారిలో గుబులు నెలకొంది. ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికలు జరిగే జనగామ, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, మహబూబాబాద్‌లకు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యే మొలుగూరి, సిరికొండ, పెద్ది సుదర్శన్‌రెడ్డి, సంగూలాల్ నేతృత్వం వహిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి స్వస్థలం మహబూబాబాద్ కావడంతో ఆయనకు ఇక్కడ గెలుపు సవాల్‌గా మారింది. వ్యూహాత్మకంగా సాగుతున్న నేతలు కేసీఆర్ ఝలక్ నేపథ్యంలో ఆయూ నియోజకవర్గ నేతలతోపాటు పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లు వ్యూహాత్మకంగా సాగుతున్నారు. జిల్లా ముఖ్య నేతలంతా దృష్టి కేంద్రీకరించి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారు. ఈ దిశలోనే మహబూబాబాద్‌కు చెందిన టీడీపీ నేత డాక్టర్ నెహ్రూనాయక్‌ను టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఈ ఎన్నికల్లో పొత్తులేకుండా ఒంటరిగా విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే మొలుగూరికి పరకాల ఎన్నిక మరింత ప్రతిష్టాత్మకం కానున్నది. రంగంలోకి దిగిన ఎన్నికల ఇన్‌చార్జ్‌లు జనగామకు పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, పరకాలకు కడియం శ్రీహరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు అజ్మీరా చందూలాల్, భూపాలపల్లికి ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, నర్సంపేటకు పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ సుధాకర్‌రావు, వర్ధన్నపేట ఇన్చార్జ్ ఆరూరి రమేష్, మహబూబాబాద్‌కు పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ కేంద్రాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు, వార్డు కౌన్సిలర్లు, చైర్మన్ల ఎంపిక నుంచి ప్రచారంతో పాటు పోలింగ్ ముగిసేవరకు పూర్తి బాధ్యత వీరిదే. ఇప్పటికే ఈ వీరు స్థానికంగా ఉండే ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు. -
టీడీపీ డీలా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరి చిప్పల సమన్యాయం జిల్లాలో తెలుగుదేశం పార్టీని నిండా ముంచిందనే చెప్పాలి. బలమైన తెలంగాణ సెంటిమెంటు నేపథ్యంలో జిల్లాలో పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. కొద్దో గొప్పో కార్యకర్తలు కష్టనష్టాలకు తట్టుకొని నిలబడినప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, దిగువశ్రేణి నాయకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలంగాణ సెంటిమెంటును గౌరవించే పార్టీల్లో చేరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా ఆ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జిలను వెతుక్కునే పనిలోనే ఉంది. ఐదు నియోజకవర్గాల్లో ఇంతవరకు ఇన్చార్జిలనే నియమించలేదు. పార్టీకి చెప్పుకోవడానికి జిల్లాలో ఒకే ఒక అసెంబ్లీ సీటుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇప్పటికే జిల్లాను వదిలేసి సేఫ్ జోన్‌కు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి దాదాపు ఆయన మానసికంగా సిద్ధమైనట్టు సమాచారం. చంద్రబాబునాయుడుతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని బట్టి ఆయనకు టికెట్ ఖాయమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన పునాదులు లేవు. ఈ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలే దిక్కు లేరు. సిద్దిపేటలో హరీష్‌రావు, సంగారెడ్డిలో జగ్గారెడ్డి, పటాన్చెరులో నందీశ్వర్‌గౌడ్ బలమైన క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి గ్రామస్థాయిలో కార్యకర్తలు కూడా లేరు. సిద్దిపేటలో హరీష్‌రావును రాజకీయంగా ఢీకొట్టగల తెలుగుదేశం అభ్యర్థులు లేరనే చెప్పాలి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి నాయకుడిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అంతంతగానే ఉంది. పలు గ్రామాల్లో కార్యకర్తలు ఉన్నా మండల కమిటీ నాయకత్వం వారిని ముందుకు నడిపే స్థితిలో లేదు. ఈ నియోజకవర్గం కౌడిపల్లి మండలంలో చాలా గ్రామాల్లో పార్టీకి కార్యకర్తలే లేరు. గతంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీలలో చేరారు. పటాన్చెరులో కొంతమేరకు నందమూరి కుటుంబానికి అభిమానులున్నా, చంద్రబాబునాయుడు వైఖరిపై నందమూరి హరికృష్ట తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో అక్కడి కార్యకర్తల్లో స్తబ్దత ఏర్పడింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ పార్టీ ఉనికి అంతంతమాత్రంగానే ఉంది. సంగారెడ్డిలో ఐదు మంది సభ్యుల కమిటీ ఉన్నా ఒక్క నేత కూడా ముందుకొచ్చి జగ్గారెడ్డిని దీటుగా ఎదుర్కొనే ప్రయత్నమే చేయడం లేదు. ఆందోల్ నియోజకవర్గంలో పార్టీ స్వల్పంగా క్యాడర్ ఉన్నప్పటికీ వాళ్లు కూడా మాజీ మంత్రి, నియోజకవర్గం ఇన్చార్జి బాబుమోహన్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బహుసభ్య కమిటీలతో మొదటికే మోసం... ఇన్ని సమస్యల నేపధ్యంలో పార్టీని పటిష్ట పరిచి, గ్రామస్థాయిలో పార్టీని పునర్నిర్మాణం చేసేందుకు కొన్ని నియోజకవర్గాల్లో బహుసభ్య కమిటీని వేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో వీలును బట్టి ముగ్గురు నుంచి ఐదు మందితో కూడిన సమన్వయ కమిటీలు వేశారు.ఈ కమిటీలతో పార్టీకి కొత్త తలనొప్పులు వచ్చాయి. ఇంత మందిలో ఎవరికి టికెట్ ఇస్తారో తెలియని పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు చేసి పార్టీని నడిపించడం వృథాప్రయాస అనే ధోరణిలో నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ఎవరినో ఒక్కరినే ఇన్చార్జిగా వేయాలని ఈ కమిటీ సభ్యులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఎవరికి ఇన్చార్జి పదవి అప్పగిస్తే మిగిలిన వారి నుంచి ఎలాంటి సమస్యలు వస్తాయేనని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రేపు, మాపు అంటూ కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు.