
ముంబై : మహారాష్ట్ర పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌లుగా ఎనిమిది మంది మహిళా అధికారులును నియమిస్తున్నట్లు ముంబై పోలీసులు ట్వీటర్‌లో తెలిపారు. రాష్ట్రంలో ఏమూల నుంచైనా మహిళలు ప్రమాదంలో ఉన్నారని ఫిర్యాదు చేస్తే ఈ టీం వెంటనే స్పందిస్తుంది. అంతేకాకుండా వారి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎనిమిది మంది మహిళా అధికారులను నియమిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కాగా ఈ విధంగా మహిళా ఇన్‌చార్జ్‌లను ఏర్పాటు చేయటం దేశంలోని మొదటి సిటీగా ముంబై పోలీసులు ఘనత సాధించారు.
ఈ టీం కేవలం ట్వీటర్‌ను ఫాలో అవ్వడమే కాకుండా నేరస్తులను కూడా పట్టుకోవడంతో కీలక పాత్ర పోషించే విధంగా వారికి శిక్షణ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలను ఎప్పటికప్పడు సమీక్షిస్తూ సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని అందిస్తారు. ముంబై పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా సంఘాలు, స్థానికులు అభినంధనలు తెలుపుతున్నారు. మహిళా సాధికారతకు ఇది మంచి పరిణామం అని ట్వీటర్ వేదికగా ప్రసంశలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment