Mumbai polices
-
స్టేషన్ ఇన్‌చార్జ్‌లుగా మహిళా పోలీసులు
ముంబై : మహారాష్ట్ర పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌లుగా ఎనిమిది మంది మహిళా అధికారులును నియమిస్తున్నట్లు ముంబై పోలీసులు ట్వీటర్లో తెలిపారు. రాష్ట్రంలో ఏమూల నుంచైనా మహిళలు ప్రమాదంలో ఉన్నారని ఫిర్యాదు చేస్తే ఈ టీం వెంటనే స్పందిస్తుంది. అంతేకాకుండా వారి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎనిమిది మంది మహిళా అధికారులను నియమిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కాగా ఈ విధంగా మహిళా ఇన్‌చార్జ్‌లను ఏర్పాటు చేయటం దేశంలోని మొదటి సిటీగా ముంబై పోలీసులు ఘనత సాధించారు. ఈ టీం కేవలం ట్వీటర్‌ను ఫాలో అవ్వడమే కాకుండా నేరస్తులను కూడా పట్టుకోవడంతో కీలక పాత్ర పోషించే విధంగా వారికి శిక్షణ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలను ఎప్పటికప్పడు సమీక్షిస్తూ సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని అందిస్తారు. ముంబై పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా సంఘాలు, స్థానికులు అభినంధనలు తెలుపుతున్నారు. మహిళా సాధికారతకు ఇది మంచి పరిణామం అని ట్వీటర్ వేదికగా ప్రసంశలు కురిపిస్తున్నారు. -
3.80 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్
ముంబై: దేశంలో నకిలీ నోట్లు చెలామణి జోరుగా కొనసాగుతున్నాయి. నకిలీ నోట్లను యథేచ్ఛగా కొందరు చెలామణి చేస్తున్నారు. తాజాగా దక్షణ ముంబైలో నకిలీ నోట్లు కలిగిన ముగ్గురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 3లక్షల 80వేల రూపాయలు విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని మసీద్ బందర్ రైల్వే స్టేషన్ సమీపంలో కొందరు నకిలీ నోట్లను చెలమణీ చేస్తున్నట్టు సమాచారం అందండంతో అప్రమత్తమైన పోలీసులు వలపన్నీ నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. పట్టుబడిన నిందితులు గులాం ముర్తుజా అబ్దుల్ షేక్ (28), అక్తర్ ఈద్రీస్ షేక్ (29), మహ్మద్ అల్లుద్దీన్ (29)లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా వారినుంచి మొత్తంగా 380నకిలీ వెయ్యి రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నకిలీ నోట్ల చెలమణీ వెనుక ఓ పెద్ద ముఠా ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నకిలీనోట్ల ముఠాకు సంబంధించి ఆధారాలను సేకరించేందుకు యత్నిస్తున్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. 489 సెక్షన్ సీ ప్రకారం నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. -
అనూహ్య హంతుకుడి అరెస్ట్
- రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన ఆగంతుకుడే ఈ హంతకుడు - చంద్రభాన్ సానాప్ నాసిక్ నివాసి.. గతంలో రైల్వే కూలీ.. పాత నేరస్తుడు సాక్షి, ముంబై/మచిలీపట్నం: తెలుగమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య ముంబైలో దారుణ హత్యకు గురైన కేసును ఛేదించామని.. నిందితుడిని అరెస్ట్ చేశామని ముంబై పోలీసులు సోమవారం ప్రకటించారు. నిందితు డు పాత నేరస్థుడని.. అతడి పేరు చంద్రభాన్ సానాప్ అలియాస్ చౌక్యాసుదామ్ సానాప్ (28) అని గుర్తించామన్నారు. భాందూప్ సబర్బన్‌లోని కాంజూర్మార్గ్లో నిందితుడ్ని అదుపులోకి తీసుకుని ముంబైలోని ఖిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. నిందితుడిని ఈ నెల 15 వరకూ పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్మారియా చెప్పారు. అయితే.. తమ కుమార్తె హత్య కేసును ఛేదించినట్లు ముంబై పోలీసులు కట్టుకథ అల్లుతున్నారని అనూహ్య తండ్రి ఆరోపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నివాసి అయిన సురేంద్రప్రసాద్ కుమార్తె, ముంబై సబర్బన్ గోరేగావ్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో పనిచేస్తున్న ఎస్తేర్ అనూహ్య (23) జనవరి ఐదో తేదీన ముంబై కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) చేరుకున్న అనూహ్య అదృశ్యమై, ఆ తర్వాత శవమై కనిపించిన సంగతి తెలిసిందే. అనూహ్య అదృశ్యమైన 55 రోజుల తర్వాత, ఆమె మృతదేహం లభించిన 45 రోజుల తర్వాత.. సీసీటీవీ దృశ్యాల్లో కనిపించిన అనుమానితుడిని చంద్రభాన్ సానాప్గా గుర్తించామని.. అతడిని ఆదివారం కంజూర్‌మార్గ్ ఈస్ట్‌లో అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. నిందితుడు విచారణలో నేరం అంగీకరించాడన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు వాస్తవానికి కంజూర్‌మార్గ్‌లో స్లమ్ నివాసి. ప్రస్తుతం నాసిక్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోని మఖమలాబాద్లో నివసిస్తున్నాడు. మద్యానికి బానిసై రైల్వేకూలీ బ్యాడ్జిని అమ్మేశాడు. ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ దొంగతనాలు, నేరాలకు పాల్పడుతుండేవాడు. అతడిపై.. ముంబైలోని గావ్‌దేవి పోలీస్‌స్టేషన్‌తో పాటు నాసిక్, మన్మాడ్, ఇటారసీ తదితర రైల్వే పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ట్యాక్సీ అని చెప్పి మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్లాడు!: ‘‘చంద్రభాన్ జనవరి నాలుగో తేదీన తన మిత్రులతో కలిసి మద్యం సేవించాడు. ఐదో తేదీ వేకువజామునే కుర్లాలోని ఎల్టీటీకి వచ్చి దొంగతనం చేసేందుకు ప్రయత్నించసాగాడు. అదే సమయంలో ఒంటరిగా ఉన్న అనూహ్యను చూశాడు. ఆమె అంధేరి వెళ్లనున్నట్లు తెలుసుకుని రూ. 300 చార్జీకి ఆమెను అంధేరిలో దింపుతానని చెప్పాడు. స్టేషన్ వెలుపల పార్కింగ్ ప్రదేశంలోకి వెళ్లాక.. ట్యాక్సీకి బదులు తన మోటారుసైకిల్ మీద అంధేరీ వెస్ట్‌కు తీసుకెళ్లి వదిలిపెడతానని నిందితుడు చెప్పాడు. అనూహ్య తొలుత నిరాకరించారు. అయితే నిందితుడు ఎలాంటి భయం అవసరం లేదంటూ ఆమెకు తన ఫోన్ నెంబరు, మోటర్ సైకిల్ నెంబరు ఇచ్చి ఒప్పించాడు. ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై గల కంజూర్‌మార్గ్ వరకు వెళ్లిన తర్వాత పెట్రోల్ అయిపోయినట్లుందని చెప్పి సర్సీస్ రోడ్డు పైకి బైకును మళ్లించాడు. అక్కడ నిర్జన ప్రదేశంలో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అనూహ్య తీవ్రంగా ప్రతిఘటించటంతో ఆమె తలను నేలకేసి కొట్టి, చున్నీ/స్కార్ఫ్‌తో ఆమె గొంతుకు ఉరి బిగించి చంపేశాడు. ఆ తర్వాత ల్యాప్‌టాప్‌తో ఉన్న బ్యాగ్‌ను తీసుకుని కంజూర్‌మార్గ్‌లోకి వెళ్లాడు. ఆమె వద్ద ఉన్న ఫోన్లో తన సెల్ నెంబరు ఉంటుందని భయపడి మళ్లీ ఘటనా స్థలానికి వచ్చాడు. అయితే ఆమె సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో మోటర్‌సైకిల్‌లోని పెట్రోల్‌ను కొంత తీసి ఆమె జీన్స్‌పై పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. అనంతరం అక్కడి నుంచి కంజూర్‌మార్గ్‌లోని మిత్రుడు నందకిషోర్‌ను కలిసి అతని మోటర్‌సైకిల్ అతనికి ఇచ్చేశాడు. నందకిషోర్‌కు జరిగిందంతా చెప్పి అదే రోజు నాసిక్‌కు వెళ్లిపోయాడు. అనూహ్యకు సంబంధించిన లగేజీని భిక్షాటన చేసే ఓ మహిళకు ఇచ్చేశాడు’’ అని పోలీసులు వివరించారు. దర్యాప్తులో.. నిందితుడి నుంచి హతురాలి ట్రాలీ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కూడా చెప్పారు. అలాగే.. నిందితుడు వినియోగించిన మోటర్ సైకిల్ యజమాని నందకిషోర్ షావును సోమవారం జార్ఖండ్‌లో అదుపులోకి తీసుకుని ముంబైకి తెచ్చామన్నారు. నిందితుడ్ని పట్టుకునేందుకు సుమారు 36 సీసీటీవి ఫుటేజ్‌లను పరిశీలించామని, 2,500 మందిని విచారించామని, ఎట్టకేలకు సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితుడి ఆచూకీ కనుగొన్నామని పేర్కొన్నారు. అయితే.. చంద్రభాన్‌ను కేసు దర్యాప్తు మొదట్లోనే రైల్వే పోలీసులు విచారించి అనుమానం వ్యక్తంచేశారని.. దీనిపై కంజూర్‌మార్గ్ పోలీసులు స్పదించలేదని తెలుస్తోంది. ఈ విషయంపై విలేకరులు ప్రశ్నించినప్పటికీ.. పోలీస్ కమిషనర్ మారియా దాటవేసేందుకు యత్నించారు. కట్టుకథ అల్లారు: అనూహ్య తండ్రి అనూహ్య హత్య కేసులో నిందితుడి అరెస్ట్ అంటూ ముంబై పోలీసులు కట్టు కథ అల్లారని ఆమె తండ్రి సురేంద్రప్రసాద్ ఆరోపించారు. ఆయన సోమవారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. అనూహ్య రైల్వేస్టేషన్ నుంచి గుర్తుతెలియని వ్యక్తితో మోటార్‌సైకిల్‌పై వెళ్లినట్లు చెప్పటం నమ్మశక్యంగా లేదన్నారు. అనూహ్య వద్ద రెండు బ్యాగులు ఉన్నాయని.. ఒకటి పది కిలోల బరువు ఉంటుందని, ల్యాప్‌టాప్ ఉన్న మరో బ్యాగు ఐదు కిలోల బరువు ఉందని.. ఈ రెండు బ్యాగులతో మోటార్‌సైకిల్‌పై వెళ్లటం సాధ్యం కాదని ఆయన స్పష్టంచేశారు. అనూహ్యకు సంబంధించిన బ్యాగు లు, వాటిలోని వస్తువులు, ల్యాప్‌టాప్‌ను ముంబై పోలీసులు ఇంతవరకూ చూపలేదన్నారు. రైల్వేస్టేషన్ సీసీ కెమెరా ఫుటేజీలలో అనూహ్య ఫోన్లో మాట్లాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని.. ఆ సమయంలో ఆమె ఏ నంబరుతో మాట్లాడిందీ.. ఆ నంబరు ఎవరిదీ.. అనే విషయాలు కూడా పోలీసులు వెల్లడించలేదని పేర్కొన్నారు. -
అనూహ్య హత్య.. తెలిసినవారి పనేనా ?
-
అనూహ్య హత్య.. తెలిసినవారి పనేనా ?
అనూహ్య హత్య కేసులో పురోగతి కుర్లా రైల్వే స్టేషన్లో ఆమెతోపాటు మరో వ్యక్తిని గుర్తించిన పోలీసులు సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు అనుమానితుడి కోసం కొన సాగుతున్న వేట సాక్షి, ముంబై: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్యను తెలిసినవారే హత్య చేశారా..? ముంబై పోలీసులు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతదేహం లభించిన 16 రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కొంత పురోగతి కనబరిచారు. జనవరి 5న కుర్లా రైల్వే స్టేషన్లో అనూహ్యతోపాటు మరో వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఆరోజు అనూహ్య ప్రయాణించిన రైలు మూడో నంబరు ప్లాట్‌ఫాంపై ఆగింది. అక్కడ ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులు ఇప్పటికే పరిశీలించినా అందులో పోలీసులకు ఆమె కనిపించలేదు. దీంతో నాలుగు, ఐదో నంబరు ప్లాట్‌ఫాంలపై ఉన్న కెమెరాలను పరిశీలించగా అందులో అనూహ్య కన్పించిందని కుర్లా రైల్వే పోలీసు ఇన్స్పెక్టర్ శివాజీ దుమాల్ తెలిపారు. ఆమెతోపాటు ఓ వ్యక్తి మాట్లాడుతున్నట్లు కెమెరాలో రికార్డ్ అయినట్లు వివరించారు. వారిద్దరూ టాక్సీ స్టాండ్ వైపు వెళ్తున్నట్టు కన్పించింది. తర్వాత ఎటు వెళ్లారన్నది తెలియడం లేదు. ఎవరు ఆ వ్యక్తి..? అనూహ్యతో ఉన్న ఆ వ్యక్తి ఎవరనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది. సీసీటీవీ ఫుటేజీలతో రైల్వే, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల బృందం శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లినట్టు శివాజీ దుమాల్ తెలిపారు. బంధువులకు కెమెరాల్లోని దృశ్యాలను చూపించగా వారు అనూహ్యను మాత్రమే గుర్తించారని, ఆమెతో ఉన్న వ్యక్తిని మొదటిసారిగా చూసినట్టు చెప్పారు. దీంతో అతడు ఎవరన్న విషయంపై ముంబైతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో గాలింపు చేపట్టారు. అతడు ముం బైలో అనూహ్య నివాసం ఉండే ప్రాంతానికి చెందిన వ్యక్తా లేదా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తా అన్న విషయం తేల్చుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హత్య వెనుక ఈయన హస్తం ఉండవచ్చా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. నేడు ఫోరెన్సిక్ నివేదిక! అనూహ్య హత్య కేసులో కీలకంగా మారిన ఫోరెన్సిక్ నివేదిక శనివారం వెలుగుచూసే అవకాశం ఉంది. ఇక్కడి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరెటీస్ డెరైక్టర్ డాక్టర్ మాల్వే మాట్లాడుతూ.. అతి త్వరలోనే నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ నివేదికతో అనూహ్య హత్య ఎలా జరిగింది, దేనితో హత్య చేశారు.,? ఎప్పుడు జరిగింది..? తదితర వివరాలు తెలియనున్నాయి. బాంబే హైకోర్టులో పిటిషన్ అనూహ్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై బాంబే హైకోర్టులో అభాసింగ్ అనే అడ్వొకేట్ పిటిషన్ దాఖలు చేశారు. అనూహ్య రైల్వే స్టేషన్ నుంచి అదృశ్యమైనప్పట్నుంచీ శవం దొరికే వరకు పోలీసులు అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శించారని, దీనిపై సీఐడీతో విచారణ జరిపించాలని ఆమె తన పిటిషన్లో కోరారు. ఈ కేసులో సరైన చర్యలు తీసుకోలేని పోలీసులపై కేసు పెట్టేలా ఆదేశించాలని విన్నవించారు. -
అనూహ్య కేసులో.. ఎవరినీ అరెస్టు చేయలేదు!
అనూహ్య కేసులో ముంబై పోలీసుల వెల్లడి చానళ్లలో వచ్చిన వార్తలకు ఖండన ముంబైలో ప్రవాసాంధ్రుల నిరసన ర్యాలీ హ ంతకులను వెంటనే పట్టుకోవాలని హోంమంత్రికి వినతి సాక్షి, ముంబై/మచిలీపట్నం: సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్యను హత్య చేసిన దుండగులను పట్టుకున్నట్లు వచ్చిన వార్తలను ముంబై పోలీసులు ఖండించారు. ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టుచేయలేదని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. హంతకులను పట్టుకున్నట్లు మంగళవారం పలు టీవీ చానెళ్లలో వార్తలు ప్రసారమయ్యాయి. ‘సాక్షి’ వీటిని కంజూర్‌మార్గ్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ నిశికాంత్ తుంగారే, కుర్లా రైల్వే పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ శిందే దృష్టికి తీసుకువెళ్లగా వారు అవన్నీ అవాస్తవమన్నారు. కాగా, అనూహ్యను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ముంబైలోని ఆజాద్ మైదానంలో స్థానిక తెలుగు ప్రజలు ర్యాలీ నిర్వహించారు. తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అనూహ్య మేనమామ అరుణ్‌కుమార్‌తోపాటు వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనూహ్యను హత్య చేసిన వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ హత్య కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయని, తొందర్లోనే నిందితులను పోలీసులు పట్టుకుంటారని హోంమంత్రి వారికి హామీనిచ్చారు. కట్టుకథలు అల్లకండి: తన కూతురును హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారంటూ టీవీ ఛానెళ్లలో వచ్చిన వార్తలను అనూహ్య తండ్రి ప్రసాద్ ఖండించారు. అనూహ్య మృతదేహం లభ్యమైన స్థలానికి సమీపంలో ఒక బెడ్‌షీట్ దొరికినట్టు ముంబై పోలీసులు తనకు మెయిల్ చేశారని, అది తమ కుమార్తెది కాదని తిరిగి తాను మెయిల్లో సమాధానం ఇచ్చినట్టు చెప్పారు. తన కుమార్తె మృతిపై పోస్టుమార్టం నివేదిక వచ్చాకే నిజానిజాలు వెళ్లడవుతాయని, అంతవరకూ కట్టుకథలు అల్లకూడదని విజ్ఞప్తి చేశారు. మరోవైపు అనూహ్య హత్యను నిరసిస్తూ విజయవాడలో మేరీస్ స్టెల్లా కాలేజీ విద్యార్థినులు మంగళవారం భారీ ర్యాలీ, మావహారం నిర్వహించి నిరసన తెలిపారు. అనూహ్య తండ్రికి మైసూరారెడ్డి ఫోన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు పార్టీ పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి మంగళవారం అనూహ్య తండ్రి ప్రసాద్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ ఉదంతాన్ని తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావిస్తారని చెప్పారు. కాగా, అనూహ్యకు జరిగిన దారుణాన్ని వివరించేందుకు ఆమె తండ్రిని ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర హోంమంత్రి షిండేల వద్ద తీసుకుని వెళ్తామని వైఎస్సార్సీపీ బందరు పార్లమెంట్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కేవీఆర్ విద్యాసాగర్ తెలిపారు. ప్రధాని, హోంమంత్రి అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.