ముంబై: దేశంలో నకిలీ నోట్లు చెలామణి జోరుగా కొనసాగుతున్నాయి. నకిలీ నోట్లను యథేచ్ఛగా కొందరు చెలామణి చేస్తున్నారు. తాజాగా దక్షణ ముంబైలో నకిలీ నోట్లు కలిగిన ముగ్గురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 3లక్షల 80వేల రూపాయలు విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని మసీద్ బందర్ రైల్వే స్టేషన్ సమీపంలో కొందరు నకిలీ నోట్లను చెలమణీ చేస్తున్నట్టు సమాచారం అందండంతో అప్రమత్తమైన పోలీసులు వలపన్నీ నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు.
పట్టుబడిన నిందితులు గులాం ముర్తుజా అబ్దుల్ షేక్ (28), అక్తర్ ఈద్రీస్ షేక్ (29), మహ్మద్ అల్లుద్దీన్ (29)లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా వారినుంచి మొత్తంగా 380నకిలీ వెయ్యి రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నకిలీ నోట్ల చెలమణీ వెనుక ఓ పెద్ద ముఠా ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నకిలీనోట్ల ముఠాకు సంబంధించి ఆధారాలను సేకరించేందుకు యత్నిస్తున్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. 489 సెక్షన్ సీ ప్రకారం నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
3.80 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్
Published Thu, Jun 5 2014 9:51 PM | Last Updated on Thu, Jul 26 2018 1:42 PM
Advertisement
Advertisement