fake currency
-
పట్టుబడ్డ అంతర్జాతీయ నకిలీ కరెన్సీ నేరస్తుడు
సాక్షి,హైదరాబాద్:ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్న అంతర్జాతీయ నేరగాడిని అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. ఈ విషయమై శుక్రవారం(జనవరి24) సుధీర్‌బాబు మీడియాతో మాట్లాడారు.‘ఎల్బీనగర్ ఎస్ఓటీ,పహాడి షరీఫ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేసే అంతర్జాతీయ నేరస్తుడు నవీన్‌కుమార్‌ను పట్టుకున్నారు. నవీన్ కుమార్ మహబూబ్‌నగర్ జిల్లావాసి.నవీన్‌కుమార్ వద్ద నుంచి ఐదు లక్షల రూపాయల నకిలీ కరెన్సీ సీజ్ చేశాం. నవీన్ కుమార్ సివిల్ ఇంజినీరింగ్ల్ పాలిటెక్నిక్ చేశాడు. నిందితుని నుంచి ప్రింటర్,కరెన్సీ పేపర్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నాం. నకిలీ నోట్ల ప్రింట్కు కావాల్సిన పేపర్స్ కోల్‌కతా,గుజరాత్,విజయవాడలలో తీసుకుంటాడు’ అని సుధీర్‌బాబు తెలిపారు. -
Fake Currency: హైదరాబాద్‌లో నకిలీ నోట్ల తయారీ
కామారెడ్డి టౌన్: హైదరాబాదులో నకిలీ నోట్లను తయారుచేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాలోని ఆరుగురిని బాన్సువాడ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాన్సువాడ పోలీసులు శుక్రవారం కొయ్యగుట్ట వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారులోని కొందరు పోలీసులను చూసి పరారయ్యేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వెంబడించి ముగ్గురిని పట్టుకున్నారు. ఇందులో కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన కోలావర్ కిరణ్‌కుమార్, బాన్సువాడకు చెందిన కె.రమేష్ గౌడ్‌తోపాటు హైదరాబాద్ కొంపల్లికి చెందిన కడపత్రి రాజ్‌గోపాల్ ఉన్నారు. వారి వద్దనుంచి రూ. 30 లక్షల విలువ చేసే నకిలీ రూ. 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారించగా తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి ఈ దందాకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరిలో తెలంగాణకు చెందిన రాజగోపాల్, కర్ణాటకకు చెందిన హుసేన్ పీరా నకిలీ నోట్ల తయారీ, చెలామణిలో పెట్టుబడి పెడతారు. రాజస్థాన్‌కు చెందిన కమలే‹Ù, సుఖ్రాం, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణలు కలిసి నకిలీ కరెన్సీని తయారు చేస్తారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, రమేశ్ గౌడ్, మహారాష్ట్రకు చెందిన అజయ్ ఈశ్వర్ వీటిని చెలామణి చేస్తున్నారు. పట్టుబడ్డారిలా.. నగరంలోని గౌలిగూడ, సికింద్రాబాద్ సీటీసీలలో నకిలీ నోట్ల తయారీకి అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేసి బోయిన్‌పల్లిలోని అంటిలియా అపార్ట్మెంట్లో పెంట్‌హౌజ్‌లో ఇప్పటివరకు రూ.60 లక్షల విలువ చేసే రూ.500 నకిలీ నోట్లు ప్రింట్ చేశారు. ఇందులో రూ.3 లక్షలను బిచ్కుందకు చెందిన కిరణ్ కుమార్, బాన్సువాడకు చెందిన రమేశ్ గౌడ్‌కు చెలామణి కోసం అప్పగించారు. వారు వాటిని చుట్టుపక్కల గ్రామాల్లో చెలామణి చేశారు. మరో రూ.30 లక్షలను హైదరాబాద్ నుంచి రాజగోపాల్ బాన్సువాడకు తీసుకువచ్చి కిరణ్‌కుమార్, రమేష్ గౌడ్లకు అప్పగించాడు. అయితే తిరిగి రాజ్‌గోపాల్‌ను బాన్సువాడ బస్టాండులో దింపడానికి కిరణ్ కుమార్, రమే‹Ùగౌడ్లు కారులో బయలు దేరారు. ఈ క్రమంలో బాన్సువాడలోని కొయ్యగుట్ట వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. రూ.30 లక్షలు స్వా«దీనం చేసుకున్న పోలీసులు నిందితుల సమాచారం మేరకు హైదరాబాద్‌లో తనిఖీలు చేపట్టి మిగతా రూ.26.90 లక్షల విలువైన రూ.500 నోట్లను స్వా«దీనం చేసుకున్నారు. అలాగే నోట్ల తయారీకి వినియోగించే వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. నిందితులు రాజగోపాల్, హుసేన్ పీరా, కిరణ్ కుమార్, రమేష్ గౌడ్, రాధాకృష్ణ, అజయ్ ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. కమలే‹Ù, సుఖ్రాంలు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల నుంచి రూ.56 లక్షల 90 వేల విలువ చేసే రూ.500 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. -
AP: పోలీసులు బకరా.. సినీ ఫక్కీలో దొంగ నోట్ల ముఠా డాన్ పరారీ
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో సినీ ఫక్కీలో దొంగ నోట్ల ముఠా సభ్యులు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. ముఠా సభ్యులు పోలీసుల అదుపులోకి ఉన్న నిందితుడి తప్పించారు. దీంతో, నడిరోడ్డుపై అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది.వివరాల ప్రకారం..దొంగ నోట్ల కేసులో భీమవరంలో ఉన్న ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు శుక్రవారం రాత్రి శ్రీకాకుళం బయలుదేరారు. అదే సమయంలో పోలీసు వాహనాన్ని రెండు కార్లు, నాలుగు బైకులు వెంబడించాయి. కొంత దూరం వరకు వెళ్లిన తర్వాత అర్ధరాత్రి సమయంలో రాజమండ్రిలోని వీఎల్‌పురం వద్ద నిందితుడిని తీసుకెళ్తున్న శ్రీకాకుళం పోలీసుల వాహనాన్ని వారు అడ్డుకున్నారు. సినిమా ఫక్కీలో ఈకేసులో ఉన్న నిందితుడిని వారు తప్పించి.. తమ కారులో తీసుకెళ్లారు.అనంతరం, సదరు పోలీసులు.. 100కు కాల్ చేసి ఈ విషయాన్ని రాజమండ్రి పోలీసులకు చెప్పారు. దీంతో, కేసు నమోదు చేసిన రాజమండ్రి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను వెంబండించిన కార్ల నెంబర్లను సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, దొంగ నోట్ల ముఠా డాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కాలపరిమితి ఆదేశాలు సరికాదు
న్యూఢిల్లీ: ట్రయల్ కోర్టుల పరిధిలో కేసుల విచారణకు కాలపరిమితిని విధిస్తూ ఆదేశాలిచ్చే సంస్కృతిని హైకోర్టులు విడనాడాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు ఒక వ్యక్తికి బెయిల్‌ను నిరాకరిస్తూ, కాలపరిమితిలోపు విచారణ పూర్తిచేయాలంటూ ట్రయల్ కోర్టుకు హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది. గత సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. నకిలీ నోట్ల కేసులో రెండున్నరేళ్లుగా విచారణ ఖైదీగా జైలులో మగ్గిపోతున్న ఒక వ్యక్తికి బెయిల్ మంజూరుచేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ‘‘కాల పరిమితిలోపు కేసు విచారణ పూర్తికాని పక్షంలో బెయిల్ కోసం నిందితుడు చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు చట్టప్రకారం వీలైతే ఆ నిందితుడికి బెయిల్ ఇవ్వడానికే మొగ్గుచూపాలి. మరో అవకాశంలేని పక్షంలో మాత్రమే అతడిని విచారణ ఖైదీగా జైలుకు పరిమితం చేయాలి. బెయిల్ అనేది నియమం, జైలు అనేది ఒక మినహాయింపు అనే సూత్రం ఇక్కడా వర్తిస్తుందని హైకోర్టులు గుర్తుంచుకోవాలి’’అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ప్రతి కోర్టులోనూ క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేసు విచారణను కాలపరిమితిలోపు ముగించాలని ట్రయల్ కోర్టులను హైకోర్టులు ఆదేశిస్తే ఆయా కిందికోర్టుల పనితీరుపై తీవ్ర ఒత్తిడి, ప్రభావం పడుతుంది. ఇలాంటి ఆదేశాలను కచ్చితంగా అమలుచేయడం ట్రయల్ కోర్టుకు కష్టమవుతుంది. బెయిల్‌ను నిరాకరిస్తూ నిందితులకు కంటితుడుపు చర్యగా ఆ కేసు విచారణను త్వరగా పూర్తిచేయిస్తామని హైకోర్టులు చెబుతున్నాయి. ఇలాంటి ఆదేశాలతో సంబంధిత వ్యక్తులకు అనవసరంగా ఆశ కలి్పంచినవారమవుతాం. ఇది ఒకరకంగా వాళ్లకు తప్పుడు సందేశం పంపినట్లే’’అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. -
అనుపమ్ ఖేర్ బొమ్మ కరెన్సీతో బురిడీ
అహ్మదాబాద్: వీళ్లు అలాంటిలాంటి మోసగాళ్లు కాదు.. దొంగనోట్ల కట్టలు. అవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో ఉన్నవి అక్షరాలా రూ.1.30 కోట్లు..ఓ బడా బంగారం వ్యాపారికి అంటగట్టి ఏకంగా 2.1 కిలోల బంగారంతో ఉడాయించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వాళ్లు ఓ నకిలీ హవాలా ఆఫీసును సైతం ఏర్పాటు చేసుకున్నారు. మోసం తెలుసుకునేలోపే పత్తా లేకుండా పోయారు. బాలీవుడ్‌ను సైతం తలదన్నే ట్విస్టులున్న ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ ఠక్కర్‌కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు ప్రశాంత్ పటేల్ అని, స్థానికంగా ఉన్న ఫలానా నగల దుకాణం మేనేజర్‌ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ దుకాణం మెహుల్‌కు తెలిసిందే కావడంతో ఆయన నిజమేననుకున్నాడు. పటేల్ 2.1 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా, కొంత బేరసారాల తర్వాత రూ.1.60 కోట్లకు డీల్ కుదిరింది. అతడిచి్చన సమాచారం మేరకు సెప్టెంబర్ 24వ తేదీన ఠక్కర్ తన మనుషులకు 2.1 కిలోల బంగారమిచ్చి పంపించారు. చెప్పిన ప్రకారం వాళ్లు ఓ హవాలా దుకాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వీరి కోసం ముగ్గురు వ్యక్తులున్నారు. దుకాణంలోని నోట్ల లెక్కింపు మిషన్‌తో తీసుకువచి్చన 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించడం మొదలైంది. తాము రూ.1.30 కోట్లే తెచ్చామని, మిగతా రూ.30 లక్షలు పక్కనే మరో దుకాణం నుంచి తెస్తామంటూ ముగ్గురిలో ఇద్దరు బంగారం బిస్కెట్లను తీసుకుని వెళ్లారు. అయితే, ఆ నోట్లపై మహాత్మా గాం«దీకి బదులు నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. రిజర్వు బ్యాంక్ ఇండియా స్థానంలో తప్పుగా ‘రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అని ఉంది. ఠక్కర్ సిబ్బంది ఇదంతా గమనించి, అనుమానించారు. ఇదేమని, అక్కడే ఉన్న మూడో వ్యక్తిని ప్రశ్నించారు. కౌంటింగ్ మిషన్ తెమ్మంటే తెచ్చానే తప్ప, వారెవరో, ఆ నోట్ల విషయమేంటో నాకూ తెలియదు’అంటూ అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. బంగారం బిస్కెట్లతో వెళ్లిన పెద్దమనుషులు తిరిగి రాలేదు. దీంతో, సిబ్బంది ఆ విషయాన్ని ఠక్కర్ చెవిన వేశారు. ఆయన గుండె ఆగినంత పనైంది..! ఇదేమిటని ఆరా తీయగా ఆ హవాలా దుకాణాన్ని రెండు రోజుల క్రితమే ఎవరో తెరిచారని తేలింది. దీంతో, మెహుల్ ఠక్కర్ తననెవరో బకరాను చేశారని గ్రహించి, నవ్‌రంగ్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్ మల్కాజిగిరిలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు
కర్నూలు: నకిలీ కరెన్సీ (నోట్లు) ముఠా గుట్టు రట్టయ్యింది. పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో రెండు గ్రూపులకు చెందిన ఎనిమిది మంది నోట్ల బ్యాగులు మార్చుకుంటుండగా అర్బన్ తాలూకా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఆలూరు గ్రామానికి చెందిన కరిడికొండ గంగాధర్, కర్నూలు ధర్మపేటకు చెందిన అరేకల్ కుమార్, క్రిష్ణగిరి మండలం ఎరుకలిచెరువు గ్రామానికి చెందిన ఈడిగ జయన్న, కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన బోయ బంగి పరుశురాముడు ఒక ముఠాగా, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన జనుపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, బంగిపోగు చిన్ననాగన్న, చాకలి బ్రహ్మ, కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన కమ్మరి వీరేష్ ఆచారి తదితరులు మరో ముఠాగా ఏర్పడ్డారు. వీరు పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీ పక్కన అపూర్వ హోమ్స్‌కు వెళ్లే రోడ్డులో ఉన్న ఖాళీ స్థలంలో మంగళవారం డీల్ ప్రకారం ఒకరి ఒకరు బ్యాగులు మార్చుకుంటుండగా పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. అదుపులోకి తీసుకొని బ్యాగులను పరిశీలించగా అందులో నకిలీ నోట్లు బయటపడ్డాయి. ఒకరినొకరు మోసం చేసుకునే క్రమంలో... ఒక బ్యాగులో 17 బండిల్స్ ఉండగా, అందులో కింద, పైన ఒరిజినల్ రూ.500 నోట్లు పెట్టి మధ్యలో రూ.87,50,000 నకిలీ నోట్లు ఉన్నాయి. అలాగే రెండో గ్రూపునకు చెందిన బ్యాగులో పరిశీలించగా అందులో సుమారు రూ.16.30 లక్షల నకిలీ నోట్లు బయటపడ్డాయి. మొదటి ముఠా వారు రూ.90 లక్షలు నకిలీ కరెన్సీ ఇస్తే రెండో గ్రూపు వారు రూ.30 లక్షలు ఒరిజినల్ కరెన్సీ ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒరిజినల్ నోట్లు ఇస్తామన్న ముఠా కూడా నకిలీ నోట్లతో వెళ్లి ఒకరినొకరు మోసం చేసుకునే క్రమంలో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. కర్నూలు అర్బన్ తాలూకా సీఐ శ్రీరాం, ఎస్ఐలు రామయ్య, సమీర్ బాషా, మన్మథ విజయ్ తదితరులతో కలసి సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రెండు ముఠాల నుంచి రూ.1,03,51,000 నకిలీ నోట్లు (సినిమా షూటింగ్ కోసం వినియోగించే నోట్లు), రూ.29 వేలు ఒరిజినల్ నోట్లతో పాటు మూడు మోటర్ సైకిళ్లు స్వా ధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. దొంగ నోట్ల ముఠాను పట్టుకుని వారి నుంచి భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నందుకు క్రైం పార్టీ సిబ్బంది ఏఎస్ఐ ఆచారి, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుళ్లు మంజుకుమార్, రామ్‌ప్రసాద్, సుధీర్ తదితరులను సీఐ అభినందించారు. -
యూట్యూబ్ చూసి దొంగనోట్ల ముద్రణ
పలమనేరు (చిత్తూరు జిల్లా): చదివింది కేవలం ఏడో తరగతి.. వారపు సంతలో దుకాణాల వద్ద తిరుగుతూ టీ అమ్మడం అతని వృత్తి. ఇంట్లో రహస్యంగా దొంగ నోట్టు ముద్రించి సంతలో మార్చి సులభంగా డబ్బులు సంపాదించడం ప్రవృత్తి. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా వి.కోట మండలం కె.కొత్తూరుకు చెందిన గోపాల్ (41) ఏడో తరగతి చదివాడు. కొన్నాళ్లు బెంగళూరులోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేశాడు. ఇప్పుడు సంతలకు వెళ్లి టీ అమ్ముతుంటాడు. వ్యసనాలకు బానిసైన గోపాల్ సులభంగా డబ్బులు సంపాదించడం ఎలా అని యూట్యూబ్‌లో చూసేవాడు. అందులో దొంగనోట్లను ముద్రించే వీడియోలు చూస్తూ దొంగనోట్లను ముద్రించాలనుకున్నాడు. బెంగళూరు వెళ్లి కలర్ ప్రింటర్, మందంగా ఉండే ఖాళీ బాండ్ పేపర్లు, కలర్లు, గ్రీన్ కలర్ నెయిల్ పాలీష్ కొనుక్కొచ్చాడు. 6 నెలలుగా ఇంట్లోనే రహస్యంగా రూ.500, రూ.200, రూ.100 నోట్లను ముద్రిస్తున్నాడు. రూ.500 నోట్లపై ఉండే సెక్యూరిటీ థ్రెడ్ కోసం గ్రీన్ నెయిల్ పాలిష్ వేశాడు. ఇలా ముద్రించిన నోట్లను వారపు సంతలో చలామణి చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం పట్టణంలోని కూరగాయల దుకాణంలో రూ.500 దొంగనోటు ఇచ్చి రూ.50 విలువైన కూరగాయలు కొని చిల్లర తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గోపాల్‌ను అరెస్ట్ చేసి రూ.8,200 విలువైన దొంగనోట్లను, ప్రింటర్, ఖాళీ తెల్లకాగితాలను సీజ్ చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
తూ.గో. జిల్లా కు చెందిన మహిళ తో ట్రాప్ చేయించిన ముట్ట
-
ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
-
వాట్ ఏ ప్లాన్..! యూట్యూబ్‌లో చూసి.. అన్న ఆలోచన, చెల్లెలి తయారీ
సాక్షి, హైదరాబాద్: అతడి పేరు కస్తూరి రమేష్ బాబు... ఆమె పేరు రామేశ్వరి. అన్నాచెల్లెళ్లు అయిన వీళ్లు యూట్యూబ్ వీడియోల ఆధారంగా నకిలీ కరెన్సీ ముద్రణ, చెలామణిలో దిట్టలు. ఐదు నెలల కాలంలో గోపాలపురం, గుజరాత్‌ల్లో వీరిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రమేష్ గుజరాత్ జైల్లో ఉండగా... రామేశ్వరి తన అన్న ద్వారా పరిచయమైన హసన్ బిన్ హమూద్‌తో కలిసి ఫేక్ నోట్లు చెలామణి చేయడానికి ప్రయత్నించింది. వీరిద్దరినీ పట్టుకున్న సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.27 లక్షలు నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారని డీసీపీ క్రైమ్స్ డాక్టర్ పి.శబరీష్ తెలిపారు. బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. అన్న ఆలోచన.. చెల్లెలి తయారీ... నారాయణపేట్ జిల్లా కోస్గికి చెందిన రమేష్ తన సోదరి రామేశ్వరితో కలిసి బండ్లగూడ జాగీర్‌లోని కాళీ మందిర్ వద్ద కొన్నాళ్లు నివసించాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడానికి రమేష్ నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేయాలని నిర్ణయించుకున్నాడు. రామేశ్వరికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో ల్యాప్‌టాప్, స్కానర్, ప్రింటర్ సాయంతో 2021 నుంచి ఫేక్ కరెన్సీ తయారీ దందా మొదలెట్టారు. యూట్యూబ్‌లో ఉన్న అనేక వీడియోలు చూసిన వీళ్లిద్దరూ నోట్లు తయారు చేయడంతో పాటు ఆ వీడియోల కింద కామెంట్ బాక్స్‌లో ‘మాల్ హై హోనా క్యా?’ అంటూ రమేష్ కామెంట్ చేసి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. మొదటిసారిగా గోపాలపురంలో అరెస్టు.. నాచారంలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే సాట్ల అంజయ్య తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. ఆయనకు చికిత్స చేయించడానికి డబ్బు కోసం ఇతడు ఆ వీడియోలు చూశాడు. అలా రమేష్‌ను సంప్రదించి రూ.50 వేలు చెల్లించి రూ.1.3 లక్షల నకిలీ నోట్లు తీసుకున్నాడు. వీటిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద చెలామని చేస్తూ అంజయ్య పోలీసులకు చిక్కాడు. ఇదే కేసులో రమేష్‌ను గతేడాది సెపె్టంబర్లో గోపాలపురం పోలీసులు అరెస్టు చేయగా.. రామేశ్వరి కోర్టు నుంచి బెయిల్ పొందారు. జైల్లో రమేష్‌కు హత్య కేసులో అరెస్టు అయిన ఫలక్‌నుమకు చెందిన ఆటోడ్రైవర్ హసన్‌తో పరిచయమైంది. అక్కడే వీళ్లు నకిలీ కరెన్సీ చెలామణిపై ఓ పథకం వేశారు. ఈ కేసులో బయటకు వచ్చిన రమేష్... రామేశ్వరితో కలిసి తాండూర్‌కు మకాం మార్చాడు. భారీగా నకిలీ కరెన్సీ ముద్రించిన వీళ్లు ఈ ఏడాది జనవరిలో గుజరాత్లో మారి్పడికి ప్రయతి్నంచారు. అక్కడి ముఠా వీరి నుంచి తీసుకున్న నోట్లను చెలామణికి ప్రయతి్నంచి చిక్కింది. వీరి ద్వారా రమేష్ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాజ్‌కోట్ పోలీసులు రమేష్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. పాతబస్తీలో దాచి మార్పిడికి యత్నం.. రమేష్ ద్వారానే రామేశ్వరికి హసన్ విషయం తెలిసింది. గుజరాత్ పోలీసులు దాడి చేసినప్పుడు మరో గదిలో దాచి ఉంచిన రూ.27 లక్షలు వారికి దొరకలేదు. ఈ మొత్తాన్ని హసన్ వద్దకు తీసుకువచ్చి దాచిన రామేశ్వరి ఇద్దరూ కలిసి మార్పిడి చేయాలని భావించారు. వీరిద్దరూ ఈ ప్రయత్నాల్లో ఉన్నారనే సమాచారం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్రకు తెలిసింది. ఆయన నేతృత్వం ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, షేక్ బుర్హాన్, కె.నర్సింహులు వలపన్ని ఇద్దరినీ పట్టుకుని నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌ను గుజరాత్ జైలు నుంచి పీటీ వారెంట్‌పై అరెస్టు చేయనున్నారు. వీళ్లు ఇప్పటి వరకు దాదాపు రూ.కోటి విలువైన నకిలీ నోట్లు మార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. గోపాలపురం పోలీసులు రమేష్‌ను పట్టుకున్నప్పుడు అతడి ల్యాప్‌టాప్‌లో రూ.2 వేలతో పాటు రూ.5 వేల నోటు స్కాన్డ్ కాపీని గుర్తించారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఆర్బీఐ వీటిని ముద్రిస్తుంటుంది. చదవండి వివాహేతర సంబంధం: రాత్రి వేర్వేరు గదుల్లో నిద్రిస్తుండగా -
హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
నకిలీ నోట్ల వ్యవహారం పై సమగ్ర దర్యాప్తు
-
Bengaluru: పెద్దమొత్తంలో భారత్, అమెరికా నకిలీ కరెన్సీ నోట్లు సీజ్
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో అమెరికా డాలర్లు, భారత్ కరెన్సీ నకిలీ నోట్లు ముద్రిస్తున్న ఇంటిపై బెంగళూరు సీసీబీ పోలీసులు బుధవారం దాడి చేశారు. పెద్దమొత్తంలో నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నగర జాయింట్ పోలీస్ కమిషనర్ ఎస్.డి.శరణప్ప తెలిపిన వివరాల ప్రకారం... హెణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో భారత్, అమెరికా నకిలీ కరెన్సీ ముద్రించి మార్కెట్లోకి పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు ఆ ఇంటిపై దాడి చేశారు. అయితే అప్పటికే ఇద్దరు నిందితులు అక్కడి నుంచి జారుకున్నారు. ఇంట్లో గాలించగా భారత్‌కు చెందిన రూ.500 నోట్లు 10,033, అమెరికాకు చెందిన వంద డాలర్ల నోట్లు 708 లభించాయి. అలాగే మరికొంత మొత్తంలో వెయ్యి రూపాయల పాత నోట్లు, ముద్రణకు వాడే రసాయనాల సీసాలు, నాలుగు కలర్ ప్రింటర్లు, ఇంక్జెట్ ఎల్రక్టానిక్ డైయింగ్ మెషిన్ తదితరాలు అక్కడ దొరికాయి. ఇప్పటివరకు ఎంత మొత్తంలో నోట్లను మార్కెట్లోకి వదిలారన్నది తేలాల్సి ఉంది. చదవండి: (మద్యం మత్తులో యువతి హల్చల్.. బీర్‌బాటిల్‌తో దాడి.. ఏఎస్సైకి తీవ్రగాయాలు) -
వరంగల్‌లో నకిలీ నోట్ల కలకలం.. గుట్టలుగా రూ.2 వేల కట్టలు
సాక్షి, వరంగల్: వరంగల్‌లో దొంగ నోట్లు ముద్రిస్తున్నముఠా గుట్టు రట్టయ్యింది. ఈ మేరకు జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమీషనర్ సీపీ తరుణ్ జోషీ మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన నిందితుల నుంచి రూ. 2 వేల నకిలీ కరెన్సీ నోట్లను సుమారు రూ. 6లక్షల వరకు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అలాగే ఏడు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ నోట్ల తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నిందితులు సయ్యద్ యూకుబ్, అలియాస్ షకీల్, గడ్డం ప్రవీన, గుండా రజనీగా ప్రకటించారు. వీరంతా ఒక కిడ్నాప్ కేసులో రామగుండం సబ్‌జైలులో శిక్ష అనుభవించినట్లు చెప్పారు. అక్కడే దొంగ నోట్లు ముద్రించే సభ్యులతో పరిచయం పెంచుకుని ఈ నకిలీ నోట్ల తయారీ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ నకిలీ నోట్లను యూట్యూబ్ సాయంతో తయారు చేసినట్లు తెలిపారు. రద్దీగా ఉండే వ్యాపార కూడళ్ల తోపాటు కిరాణా, బట్టలషాపు, బెల్టు షాపుల్లో ఈ నకిలీ నోట్లను చెలామణి చేసేవారని తెలిపారు. (చదవండి: కలలు.. కల్లలయ్యాయి.. జీవితమెంత విచిత్రమైంది) -
నకిలీ నోట్ల ముఠా హల్చల్: గుట్టలుగా రూ.2 వేల నోట్ల కట్టలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో భారీ ఎత్తున నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టు అయింది. ఈ సందర్బంగా థానే క్రైమ్ బ్రాంచ్ భారీ ఎత్తున నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ. 2 వేల నకిలీ నోట్ల 400 కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ సమాధానం) ఇదీ చదవండి: అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా? నిందితులు రామ్ శర్మ, రాజేంద్ర రౌత్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. వీరి నుంచి భారీ మొత్తంలో రూ.2000 నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.8 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని, నిందితులిద్దరూ పాల్ఘర్ నివాసితులని తెలిపారు. ఈ నకిలీ నోట్లను మార్కెట్‌కు తరలించాలని ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. కాసర్వాడవలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెట్వర్క్ ఎంత విస్తరించిందీ దర్యాప్తు చేస్తున్నారు. (ఓలా ఎలక్ట్రిక్ బైక్ కమింగ్ సూన్, సీఈవో ట్వీట్ వైరల్) #WATCH | Maharashtra: Unit 5 of Thane Crime Branch seized fake Indian currency notes in Rs 2000 denomination with face value of Rs 8 Cr. Two people, both of them residents of Palghar, arrested. Search for other accused underway, probe initiated. (Video: Thane Crime Branch) pic.twitter.com/DwkZcmMK7e — ANI (@ANI) November 12, 2022 (హ్యుందాయ్ భారీ ఆఫర్, ఆ కారుపై లక్ష దాకా డిస్కౌంట్) (ప్రేమలో పడిన మిలిందా గేట్స్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?) -
కలకలం.. ఏటీఎం నుంచి నకిలీ నోటు!
గుత్తి(అనంతపురం జిల్లా): స్థానిక ప్రధాన ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం కేంద్రం నుంచి నకిలీ రూ.500 బయటపడింది. వివరాలు.. గుత్తిలోని లచ్చానపల్లి రోడ్డులో నివాసముంటున్న సీఆర్పీఎఫ్ విశ్రాంత జవాన్ కిష్టప్ప బుధవారం ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం కేంద్రం నుంచి రూ.9,500 డ్రా చేశాడు. అందులో ఓ నకిలీ రూ.500 నోటు వచ్చింది. విషయాన్ని వెంటనే ఎస్బీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై ఎస్బీఐ అధికారులు స్పందించలేదని, ఏటీఎం కేంద్రంలో డబ్బు డిపాజిట్టు విషయం తమ పరిధిలో కాదని వారు పేర్కొన్నట్లు వివరించాడు. చదవండి: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్ ఫాదర్’ -
యూ ట్యూబ్ నేర్పిన పాఠాలు
రాంగోపాల్‌పేట్: యూ ట్యూబ్ ద్వారా నకిలీ కరెన్సీ తయారీని నేర్చుకుని వాటిని ముద్రించి చెలామణి చేస్తున్న వ్యక్తిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.3.16లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసికున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలైన యువతి పరారీలో ఉంది. మంగళవారం ఏసీపీ సుధీర్‌తో కలిసి డీసీపీ చందనా దీప్తి వివరాలు వెల్లడించారు. నారాయణపేట్ జిల్లా, కోస్గికి చెందిన కస్తూరి రమేష్ బాబు గత కొద్ది నెలలుగా బండ్లగూడ జాగీర్ కాళీమందిర్ ప్రాంతంలో సోదరి రామేశ్వరితో కలిసి ఉంటూ కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతను యూ ట్యూబ్‌లో నకిలీ కరెన్సీ ముద్రణపై తెలుసుకున్నాడు. తన సోదరి రామేశ్వరికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో ఇద్దరు కలిసి నకిలీ కరెన్సీ తయారు చేయాలని పథకం వేశారు. ఇందుకుగాను ల్యాప్‌ట్యాప్, ప్రింటర్లు, పేపర్ కట్టింగ్ మిషన్‌తో పాటు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశారు. ఇద్దరు కలిసి రూ.100, 200, 500 నోట్లను ముద్రించారు. ముద్రించిన నకిలీ కరెన్సీని కొందరు ఏజెంట్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టుబడిందిలా..: నాచారంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే సాట్ల అంజయ్య తండ్రి అనారోగ్యానికి గురికావడంతో డబ్బు అవసరం కలిగింది. యూ ట్యూబ్ ద్వారా రమేష్ బాబును సంప్రదించి రూ.50వేలు చెల్లించి రూ.1.30 లక్షల విలువైన నకిలీ నోట్లను తీసుకున్నాడు. ఇందులో కొన్ని చలామణీ చేయగా మరికొంత మొత్తం మిగిలి ఉంది. వీటిని చెలామణి చేసేందుకు అంజయ్య ఈ నెల 19న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి రామస్వామి అనే ఫుట్‌పాత్ వ్యాపారి వద్ద పండ్లు కొనుగోలు చేసి రూ.200 నకిలీ నోటు ఇచ్చాడు. ఇది నకిలీదని గుర్తించిన అతను గోపాలపురం పోలీ సులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని అదే రోజు రిమాండ్‌కు తరలించారు. అంజయ్య ఇచ్చిన సమాచారంతో రమేష్ బాబును అరెస్టు చేయగా, అతడి సోదరి రామేశ్వరి తప్పించుకుంది. వారి నుంచి ప్రింటింగ్ సామగ్రి, కారు స్వాధీనం చేసుకున్నారు. రూ.5వేల నోట్లు కూడా : నిందితులు రూ.100, 200, 500 నోట్లే కాకుండా రూ.2000, రూ.5వేల నోట్లు కూడా ముద్రించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.5వేల నోట్లను రిజర్వు బ్యాంకు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ముద్రిస్తుంది. వాటి నమూనాలు కూడా స్కాన్ చేసి ల్యాప్‌టాప్‌లో ఉంచుకున్నారు. దీని ఆధారంగా వాటిని కూడా ముద్రించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మాల్ హై హోనా క్యా.... యూ ట్యూబ్‌లో నకిలీ కరెన్సీకి సంబంధించిన అనేక వీడియోలు ఉన్నాయి. వాటి కింద నిందితులు మాల్ హై హోనా క్యా అంటూ కామెంట్ చేసి తమ ఫోన్ నంబర్ ఇచ్చేవారు. ఇలాగే ఈ కేసులో నిందితుడు కూడా వీరిని సంప్రదించాడు. వారిని హైదరాబాద్‌కు పిలిపించుకుని నకిలీ నోట్లు విక్రయించే వారు. 2021 నుంచే ముద్రణ...లక్షల్లో చెలామణి నిందితులు 2021 కరోనా తర్వాత నుంచి నకిలీ కరెన్సీని ప్రింట్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.80లక్షల మేర నకిలీ కరెన్సీ చేతులు మారి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
నకిలీ కరెన్సీ చలామణీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): నకిలీ కరెన్సీ నోట్లను చలామణీ చేస్తున్న పది మందితో కూడిన అంతర్రాష్ట్ర ముఠాను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమట పోలీస్‌లు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.4.90 లక్షల ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు, రూ.60 వేల నగదు, ఒక కారు, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫన్‌టైం రోడ్డులోని విజయవాడ సెంట్రల్ ఏసీపీ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వర్మ ఈ కేసు వివరాలను బుధవారం విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు..ఈ నెల 19న పటమట పోలీస్ పరిధిలోని మారిస్ స్టెల్లా కాలేజీ సమీపంలోని యాక్సిస్ బ్యాంకులో ఎనిమిది రూ.500 నకిలీ ప్లాస్టిక్ కట్టలను అంతర్రాష్ట్ర ముఠా ఏటీఎం డిపాజిట్ మిషన్‌లో వేసింది. నకిలీ నోట్లు అన్ని మిషన్‌లోకి రావడాన్ని గమనించిన బ్యాంకు అధికారులు పటమట పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితులను పట్టుకునేందుకు విజయవాడ సీపీ రాణా 3 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న విజయవాడ భారతీనగర్‌కు చెందిన తాతపూడి రాజు, జి.కొండూరు మండలం వెలగలేరుకి చెందిన రమేష్‌బాబు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి చెందిన ఆంజనేయులు, సుజాత, సాయిమణికంట, రాజు, బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన అబ్రహం, పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన హనుమంతరావు, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన మధుమంచి ప్రసాద్, చిలుకూరి మరియదాస్‌ను బుధవారం పటమట పోలీస్ స్టేషన్ పరిధి భారతీనగర్‌లో టాస్క్‌ఫోర్స్, పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లను అసలు నోట్లుగా మార్చి, తక్కువ నగదుకు ఎక్కువ నగదు పొంది వాటితో జల్సాలు చేద్దామనే ఉద్దేశంతో నిందితులు ఈ వ్యవహారానికి పాల్పడ్డారు. వీరిలో ఆంజనేయులు, రమేష్‌బాబు, అబ్రహం, రాజు నకిలీ నోట్ల చలామణీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
'దేశంలో పెరిగిన నకిలీ నోట్లు'
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసి దాదాపు ఆరేళ్లవుతోంది. సమాంతర ఆర్థిక వ్యవస్థను అరికట్టి, నగదు రహిత లావాదేవీలను పెంచడానికి, దేశంలో నకిలీ నోట్లను కనిపించకుండా చేయడానికి నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో అట్టహాసంగా ప్రకటించింది. పాత వెయ్యి, ఐదువందల రూపాయల నోట్లను రద్దు చేసి, వాటికి బదులుగా కొత్తగా రెండువేలు, ఐదువందల రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. కొత్త నోట్లకు నకిలీలు సృష్టించడం అసాధ్యమన్న రీతిలో కేంద్రం ప్రకటనలు గుప్పించింది. ఇంత జరిగినా, దేశంలో నకిలీ నోట్ల చలామణీ ఇంకా జరుగుతూనే ఉంది. అంతేకాదు, నానాటికీ పెరుగుతూనే ఉంది కూడా. నకిలీ నోట్లు గత ఏడాదిలో 102 శాతం మేరకు పెరిగినట్లు సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. నకిలీ కరెన్సీ బెడద అగ్రరాజ్యాల్లో సైతం ఉంది. ఎన్ని చట్టాలు తెచ్చినా, కట్టలు కట్టలుగా, గుట్టలు గుట్టలుగా నకిలీ కరెన్సీ పుట్టుకొస్తూ ఆర్థిక వ్యవస్థకు సవాలు విసురుతూనే ఉంది. ఆర్థిక వ్యవస్థకు చిరకాల సమస్యగా మారిన నకిలీ కరెన్సీ కథా కమామిషూ తెలుసుకుందాం. నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రెండువేల రూపాయల నోట్ల ముద్రణను రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతోకాలం కొనసాగించలేదు. దాదాపు మూడేళ్లుగా వీటి ముద్రణ నిలిచిపోయింది. ఈ విషయాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం చలామణీ ఉన్న చోట్ల మొత్తం విలువలో రెండువేల రూపాయల నోట్ల వాటా 1.6 శాతం మాత్రమే. అయినా, గత ఏడాదితో పోల్చుకుంటే, ఈ ఏడాది 54.16 శాతం అధికంగా రెండువేల రూపాయల నకిలీ నోట్లు చలామణీలోకి వచ్చాయి. వీటి కంటే కొంత విరివిగా ఉన్న ఐదువందల రూపాయల నోట్లు గత ఏడాది కంటే ఈ ఏడాది 101.9 శాతం అధికంగా చలామణీలోకి వచ్చాయి. ఈ సంగతిని ఆర్బీఐ 2021–22 వార్షిక నివేదికలో వెల్లడించింది. అంతకు ముందు ఏడాది నకిలీ కరెన్సీ చలామణీలో 190 శాతం పెరుగుదల నమోదైంది. బ్యాంకింగ్ వ్యవస్థ గుర్తించిన నకిలీ నోట్లలో 6.9 శాతం ఆర్బీఐ వద్ద బయటపడితే, మిగిలిన 93.1 శాతం నకిలీ నోట్లను ఇతర బ్యాంకులు గుర్తించాయి. దేశవ్యాప్తంగా 2019లో రూ.25 కోట్ల విలువైన 2,87,404 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోగా, 2020లో రూ.92 కోట్ల విలువైన 8,34,947 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. అధికారిక సంస్థలు వెల్లడించిన మొత్తంలో మాత్రమే దేశంలో నకిలీ కరెన్సీ చలామణీలో ఉందనుకుంటే పొరపాటే! దేశంలో చలామణీ అవుతున్న నకిలీ కరెన్సీకి సంబంధించిన కచ్చితమైన లెక్కలు ప్రభుత్వానికి కూడా తెలీవు. ఈ విషయాన్ని పదేళ్ల కిందటే, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంటులో స్వయంగా చెప్పారు. యూపీఏ ఓటమి తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దేశంలో నకిలీ కరెన్సీ కనిపించకుండా చేస్తానని మోదీ గంభీరంగా ప్రకటించారు. నకిలీ కరెన్సీని చలామణీ నుంచి మాయం చేయడానికేనంటూ 2016 నవంబర్ 8న ఉన్నపళాన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. అప్పటి వరకు దేశంలో చలామణీలో ఉన్న వెయ్యి, ఐదువందల రూపాయల నోట్లు చెల్లకుండా పోయాయి. వీటిని మార్చుకోవడానికి పరిమిత గడువు విధించడంతో జనాలు బ్యాంకుల మీదకు ఎగబడ్డారు. మరోవైపు కనీస అవసరాల కోసం డబ్బులు విత్‌డ్రా చేసుకుందామనుకున్నా, ఏటీఎంల నుంచి గరిష్ఠంగా రెండువేల రూపాయల వరకు మాత్రమే తీసుకునే అవకాశం కల్పించడంతో, దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద చాంతాడంత క్యూలైన్లలో జనాలు గంటల తరబడి పడిగాపులు పడ్డారు. మెల్ల మెల్లగా పరిస్థితులు దారిలోకి వచ్చినా, దేశంలో నకిలీ కరెన్సీ కలకలం యథావిధిగా మళ్లీ మొదలైంది. నకిలీ కరెన్సీ సమస్య అంత తేలికగా వదిలించుకోగల వ్యవహారం కాదు. నకిలీ కరెన్సీ తయారీలో కొద్దిమంది స్థానికుల పాత్ర ఉంటే, చాలావరకు విదేశీ గూఢచర్య సంస్థలు, మాఫియా ముఠాలు, ఉగ్రవాద మూకల పాత్ర కూడా ఉంటోంది. చివరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగలుగుతున్న అగ్రరాజ్యాలకు సైతం ఈ బెడద తప్పడం లేదు. అతి పురాతన వృత్తుల్లో రెండోది నకిలీ కరెన్సీ తయారీ, చలామణీ ప్రపంచంలోని అతి పురాతన వృత్తుల్లో రెండోది అని చరిత్రకారులు చెబుతున్నారు. కాగితపు కరెన్సీ వాడుకలోకి రాకముందు నుంచే నకిలీ కరెన్సీ తయారీ బెడద చాలా చోట్ల ఉండేది. అప్పట్లో నకిలీ నాణేలను తయారు చేసేవారు. రోమన్ సామ్రాజ్యంలోని ఆసియా మైనర్ ప్రాంతానికి చెందిన లిడియాలో క్రీస్తుపూర్వం 600 నాటికి నాణేల తయారీ తొలిసారిగా మొదలైంది. తొలినాళ్లలో బంగారు, వెండి నాణేలు వాడుకలో ఉండేవి. తర్వాతికాలంలో కంచు, రాగి వంటి తక్కువ విలువ కలిగిన లోహాల నాణేలు, ఆ తర్వాత అల్యూమినియం, నికెల్ వంటి అతిచౌక లోహాలతో తయారైన నాణేలు క్రమంగా వాడుకలోకి వచ్చాయి. నాణేలు డబ్బుగా వాడుకలోకి వచ్చి, అవి ప్రజలకు అలవాటైన తొలి రోజుల నుంచే నకిలీ నాణేల తయారీ, చలామణీ కూడా ఉండేది. క్రీస్తుశకం పదమూడో శతాబ్దిలో చైనా తొలిసారిగా కాగితపు కరెన్సీ తయారు చేయడం మొదలుపెట్టింది. చైనాలో అప్పట్లో కరెన్సీ నోట్ల తయారీకి మల్బరీ కలపను ఉపయోగించేవారు. అందువల్ల మల్బరీ అడవులకు కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేసేవారు. నకిలీ కరెన్సీ తయారు చేసేవారికి అప్పట్లో పలుదేశాల్లో మరణదండన విధించేవారు. అయినా నకిలీ కరెన్సీ తయారీ, చలామణీ కొనసాగుతూనే ఉండేది. పదమూడో శతాబ్దికి చెందిన ఇటాలియన్ రచయిత డాంటే తొలిసారిగా నకిలీ కరెన్సీ ఉదంతాన్ని గ్రంథస్థం చేశాడు. అప్పట్లో ఇటలీలో చలామణీలో ఉన్న ‘ఫ్లోరినో’ అనే బంగారు నాణేలకు నకిలీలు సృష్టించిన మాస్ట్రో ఆడమో అనేవాణ్ణి ఉరితీసిన సంఘటనను డాంటే తన పుస్తకంలో వివరంగా రాశాడు. నకిలీ కరెన్సీకి సంబంధించి చరిత్రలో నమోదైన తొలి ఉదంతం ఇదే! మన దేశంలో క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటికే నకిలీ నాణేల బెడద ఉండేది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో వీటిని ‘కూట నాణేలు’గా పేర్కొన్నాడు. శత్రురాజ్యాల ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేలా చేసి, వాటిని లొంగదీసుకునే ఉద్దేశంతో అప్పటి గూఢచర్య వ్యవస్థలు కూట నాణేలను సాధనంగా ఉపయోగించుకునేవి. క్రీస్తుపూర్వం నాటి ఆ పద్ధతి ఇప్పటికీ మారలేదు. ఉదాహరణ చెప్పుకోవాలంటే, మన దేశంలోకి ఏటా వచ్చిపడుతున్న నకిలీ కరెన్సీ కట్టల్లో పాకిస్తానీ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ హస్తం ఉంటోందనే విషయమై లెక్కలేనన్ని కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్త సమస్య నకిలీ కరెన్సీ ప్రపంచవ్యాప్త సమస్య. నకిలీ కరెన్సీ బెడదను అరికట్టడానికి ప్రతిదేశం తను అధికారికంగా ముద్రించే కరెన్సీలో ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేసుకుంటూనే ఉంటుంది. అయినా, నకిలీ నిపుణులు వాటికి దీటుగా నకిలీ కరెన్సీని చాపకింద నీరులా చలామణీలోకి తెస్తూనే ఉంటారు. ప్రపంచంలో విరివిగా నకిలీలకు గురయ్యే కరెన్సీ అమెరికన్ డాలర్. ఆ తర్వాత ఇదే వరుసలోకి బ్రిటన్ పౌండ్, యూరోప్ దేశాల ఉమ్మడి కరెన్సీ యూరో వస్తాయి. అత్యధిక శాతం నకిలీలకు లోనయ్యే ఘనత మెక్సికన్ పెసోకు దక్కుతుంది. 9.91 కోట్ల మెక్సికన్ పెసో నోట్లలో కనీసం 3 లక్షల నకిలీ నోట్లు ఉంటాయంటే, మెక్సికోలో నకిలీ కరెన్సీ బెడద ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, పోలండ్, పోర్చుగల్, జాంబియా, కొలంబియా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ నకిలీ కరెన్సీ బెడద చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. నకిలీ కరెన్సీ తయారీకి పాల్పడే వారికి జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తూ, కట్టుదిట్టమైన చట్టాలను దాదాపు అన్ని దేశాలూ చట్టాలను రూపొందించుకున్నాయి. భారత్ సహా చాలా దేశాల్లో నకిలీ కరెన్సీ తయారీకి పాల్పడితే, గరిష్ఠంగా యావజ్జీవ శిక్ష వరకు పడే అవకాశాలు ఉంటాయి. చట్టాల్లో ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నా, నకిలీ కరెన్సీ బెడద మాత్రం తగ్గడమే లేదు. అనాయాసంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కొందరు నకిలీ కరెన్సీ తయారీని ఒక మార్గంగా ఎంచుకుంటారు. సాధారణంగా ఇలాంటి వాళ్లు తయారు చేసే నకిలీ కరెన్సీ అంత నాణ్యంగా ఉండదు. అందువల్ల ఇలాంటి వాళ్లు పోలీసులకు దొరికిపోతుంటారు. గూఢచర్య సంస్థల అండతో కొన్ని ముఠాలు పకడ్బందీగా నకిలీ నోట్లు తయారు చేస్తుంటాయి. శత్రుదేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే వాటి లక్ష్యం. ఇలాంటి అధికారిక అండదండలతో తయారయ్యే నకిలీ నోట్లు దాదాపు అసలు నోట్లను పోలి ఉంటాయి. ఇవి నాణ్యతలో అసలు నోట్లకు ఏమాత్రం తీసిపోవు. వీటిని గుర్తించడమూ కష్టమే. ఇంకోవైపు అంతర్జాతీయ మాఫియా ముఠాలు, ఉగ్రవాద మూకలు కూడా నకిలీ కరెన్సీ తయారీలోను, వ్యాప్తిలోను ఇతోధిక పాత్ర పోషిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ నాయకత్వంలోని నాజీ సైన్యం ‘ఆపరేషన్ బెర్న్‌హార్డ్’ పేరిట భారీ ఎత్తున నకిలీ అమెరికన్ డాలర్లు, బ్రిటన్ పౌండ్లు ముద్రించింది. ఆ నోట్ల కట్టలను నిర్ణీత దేశాలకు నిర్దేశిత సమయానికి చేర్చలేకపోవడంతో చరిత్రల అదో విఫలయత్నంగా మిగిలిపోయింది. అమెరికా–సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో అప్పటి సోవియట్ గూఢచర్య సంస్థ ఇబ్బడి ముబ్బడిగా అమెరికన్ డాలర్లకు నకిలీలను ముద్రించి, అమెరికన్ మార్కెట్లోకి సరఫరా చేసేది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ తరచుగా మన భారత్ రూపాయలకు, బంగ్లాదేశ్ టాకాలకు నకిలీలను ముద్రించి, రెండు దేశాల్లోకి చేరవేస్తూ వస్తోంది. ఇలా ఒక దేశంలోకి మరో దేశం నకిలీ సరఫరా చేయడం తరతరాలుగా సాగుతూనే ఉంది. ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థలేవీ ఈ సమస్యను అరికట్ట లేకపోతున్నాయి. ఇదిలా ఉంటే, అధునాతన ముద్రణ యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చాక నకిలీ కరెన్సీ తయారీ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ కరెన్సీ తయారీకి పాల్పడుతూ పోలీసులకు పట్టుబడుతున్న ముఠాలు కూడా ఉంటున్నాయంటే, పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. మనకు వచ్చిన నోట్లలో ఏవైనా నకిలీవి ఉన్నట్లు అనుమానం వస్తే, వాటిని ఏ బ్యాంకుకైనా తీసుకు వెళ్లవచ్చు. బ్యాంకు సిబ్బంది వాటిని పరిశీలించి, అసలువో నకిలీవో చెబుతారు. ఒకవేళ నకిలీ నోటు అయితే, బ్యాంకు సిబ్బంది ఆ నోటును తీసుకుని, దాని విలువ తెలుపుతూ ఒక రసీదు ఇస్తారు. నకిలీ నోటు మనకు ఎవరి వద్ద నుంచి వచ్చిందో, వారికి ఆ రసీదు చూపించి, ఇచ్చినది నకిలీ నోటని చెప్పవచ్చు. అయితే, ఆ రసీదుకు ఎలాంటి మారక విలువ ఉండదు. బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసేటప్పుడు అక్కడి యంత్రాలు గాని, సిబ్బంది గాని నకిలీ నోట్లను గుర్తిస్తే, బ్యాంకు సిబ్బంది వాటిని తీసుకుంటారు. అయితే, లావాదేవీలో దాని విలువ శూన్యం. ఒకసారి డిపాజిట్ చేసిన నగదులో నాలుగు లేదా అంతకు మించిన సంఖ్యలో నకిలీ నోట్లను గుర్తిస్తే, బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులను ఆప్రమత్తం చేస్తారు. ఐదు లేదా అంతకు మించి నకిలీ నోట్లు వస్తే, సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, కేసు పెడతారు. కరెన్సీ కట్టుదిట్టాలు నకిలీ కరెన్సీ చలామణీలోకి రాకుండా ఉండేందుకు దాదాపు ప్రతిదేశం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా అంత తేలికగా ఎవరూ నకిలీలు తయారు చేయలేని రీతిలో అధికారిక కరెన్సీని రూపొందిస్తుంది. అధికారిక కరెన్సీ రూపకల్పనలో ఎప్పటికప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటుంది. మన దేశం కూడా కరెన్సీ రూపకల్పనలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం మన కరెన్సీలో నకిలీలను కట్టడి చేసేందుకు పొందుపరచిన ముఖ్యాంశాలు ఏమిటంటే... సెక్యూరిటీ త్రెడ్: మన దేశంలో పాత నోట్లలో కూడా సెక్యూరిటీ త్రెడ్ ఉండేది. కొత్తగా 2016 నుంచి చలామణీలోకి తెచ్చిన రెండువేలు, ఐదువందలు, వంద రూపాయలు సహా అన్ని నోట్లలోనూ ఈ సెక్యూరిటీ త్రెడ్‌ను మరింత కట్టుదిట్టంగా రూపొందించారు. వెలుతురులో పెట్టి చూస్తే, ఈ సెక్యూరిటీ త్రెడ్ సన్నని గీతలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీనిపై హిందీ ‘భారత్’ అనే చిన్న అక్షరాలు కనిపిస్తాయి. అసలు నోట్లను గుర్తించడంలో సెక్యూరిటీ త్రెడ్ మొదటి అంశం. సెక్యూరిటీ త్రెడ్ మామూలుగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని 45 డిగ్రీల కోణంలో చూస్తే నీలిరంగులో కనిపిస్తుంది. నకిలీ నోట్లలో ఇలా రంగు మార్పు కనిపించదు. వాటర్ మార్క్: మహాత్మాగాంధీ బొమ్మతో చలామణీలో ఉన్న ప్రతి నోటుపైనా మహాత్మాగాంధీ బొమ్మ వాటర్ మార్క్ ఉంటుంది. నోటుపై సెక్యూరిటీ త్రెడ్ పక్కన ఆర్బీఐ గవర్నర్ సంతకం, ఆర్బీఐ ముద్ర ఉంటాయి. ఆ పక్కనే ఖాళీగా కనిపించే భాగాన్ని వెలుగులో చూస్తే, అందులో మహాత్మాగాంధీ బొమ్మ వాటర్ మార్క్ కనిపిస్తుంది. గాంధీ వాటర్ మార్క్ బొమ్మ పక్కనే నోటు విలువ తెలిపే సంఖ్య వాటర్ మార్క్ కూడా కనిపిస్తుంది. సీత్రూ రిజిస్టర్: రూ. 500 నోటుకు ఎడమవైపు 500 సంఖ్య సగం మాత్రమే ముద్రించారా అనేలా కనిపిస్తుంది. దీనికి సరిగ్గా వెనుక భాగంలోనూ అలాగే ఉంటుంది. వెలుతురుకు ఎదురుగా పెట్టి చూస్తే, 500 సంఖ్య పూర్తిగా కనిపిస్తుంది. రూ.2000 నోటులోనూ కనిపించే ఈ సెక్యూరిటీ ఫీచర్‌నే సీత్రూ రిజిస్టర్ ఫీచర్ అంటారు. న్యూ నంబరింగ్ ప్యాటర్న్: నోటుకు కుడివైపున కింది భాగంలో ముద్రించి ఉండే సంఖ్యలో 2015 నుంచి ఒక సెక్యూరిటీ ఫీచర్ ఏర్పాటు చేశారు. ఎడమ నుంచి కుడివైపు చూస్తున్నప్పుడు ఆ సంఖ్య సైజు పెరుగుతుంది. అయితే, సంఖ్యకు ముందు ఉండే మూడు ఇంగ్లిష్ అక్షరాల సైజు మాత్రం పెరగదు. ఈ సంఖ్య ఏ రెండు నోట్లకు ఒకేలా ఉండదు. ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్: నోటుకు కుడివైపున ఆర్బీఐ చిహ్నం, అశోక స్తంభానికి మధ్యలో నోటు విలువ తెలిపే సంఖ్య ఉంటుంది. కంటికి ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఇది ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. కంటికి సమాంతరంగా పట్టుకున్నప్పుడు నీలం రంగులోకి మారి కనిపిస్తుంది. ఈ సంఖ్య ముద్రణకు ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్ వాడుతారు. అలాగే, నోటుకు కుడివైపు చివరి భాగంలో రైజ్డ్ ప్రింటింగ్‌లో చిన్న గుర్తు కనిపిస్తుంది. ఇలా రైజ్డ్ ప్రింటింగ్‌లో రూ.2000 నోటుపై దీర్ఘ చతురస్రం, రూ.500 నోటుపై వృత్తం, రూ.100 నోటుపై త్రిభుజం, రూ.50 నోటుపై చతురస్రం, రూ.20 నోటుపై నిలువుగా ఉండే దీర్ఘ చతురస్రం ఉంటాయి. దృష్టి లోపాలు ఉన్నవారు నోటు విలువను సులువుగా తెలుసుకునేందుకు చేసిన మరో ఏర్పాటు ఇది. నోటు వెనుక వైపు: నోటు వెనుకవైపు తిప్పి చూస్తే, ఎడమవైపు మధ్య భాగంలో నోటు ముద్రించిన సంవత్సరం, దాని పక్కన కింది భాగంలో స్వచ్ఛ భారత్ చిహ్నం, నినాదం ఉంటాయి. దాని పక్కన లాంగ్వేజ్ ప్యానెల్లో తెలుగు సహా పదిహేను భాషల్లో నోటు విలువ రాసి ఉంటుంది. కుడివైపు చివరి భాగంపైన నోటు విలువ సంఖ్య దేవనాగరి లిపిలో ఉంటుంది. రూ.2000 నోటుపై మంగళయాన్, రూ.500 నోటుపై ఎర్రకోట, రూ.200 నోటుపై సాంచీ స్థూపం, రూ.100 నోటుపై రాణీ కా వావ్ చిత్రాలు ఉంటాయి. ఇంటాగ్లియో ప్రింటింగ్: నోటుకు మధ్యలో మహాత్మగాంధీ బొమ్మ, ఆర్బీఐ ముద్ర, కుడివైపున అశోక స్తంభం ఉంటాయి. వీటితో పాటు నోటుకు ఇరువైపులా బ్లీడ్ లైన్స్‌ను ప్రత్యేక విధానంలో ముద్రిస్తారు. ఈ విధమైన ముద్రణను ఇంటాగ్లియో ప్రింటింగ్ అంటారు. ఇలా ముద్రించిన నోట్లను తాకుతున్నప్పుడు ఉబ్బెత్తుగా చేతికి తగులుతాయి. రూ.100 నుంచి రూ.2000 వరకు విలువ గల నోట్లపై ఇది కనిపిస్తుంది. మైక్రో లెటరింగ్: ప్రతి నోటులోనూ మహాత్మాగాంధీ బొమ్మకు, దాని పక్కనే ఉన్న నిలువుగీతకు మధ్య ‘ఆర్బీఐ’ అనే అతి చిన్న అక్షరాలు కనిపిస్తాయి. భూతద్దం సాయంతో వీటిని స్పష్టంగా చూడవచ్చు. లాటెంట్ ఇమేజ్: నోటు ఎడమవైపు కింది భాగంలో ఒక బొమ్మ కనిపిస్తుంది. దీనిని లాటెంట్ ఇమేజ్ అంటారు. లాటెంట్ ఇమేజ్ అంటే దాగి ఉన్న బొమ్మ. ఈ బొమ్మ లోపల ఏముందో మామూలుగా చూస్తే కనిపించదు. కంటి ఎదుట సమాంతరంగా ఉంచి, వెలుతురులో పెట్టి చూస్తే, అందులో నోటు విలువ అంకెల్లో కనిపిస్తుంది. ఇది 2005 తర్వాత వచ్చిన వంద రూపాయలు, అంతకు పైబడిన విలువ కలిగిన ప్రతి నోటులోనూ ఉంటుంది. -
చార్మినార్‌లో కరెన్సీ నోట్ల వర్షం.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుల్జార్‌హౌజ్ ఫౌంటెన్ వద్ద గుర్తు తెలియని యువకులు రోడ్లపై వెదజల్లిన నోట్ల కరెన్సీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10న (శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు) మదీనా వైపు నుంచి గుల్జార్‌హౌజ్ వైపు వచ్చిన నాలుగైదు కార్లలో యువకులు కార్లను రోడ్డుపై నిలిపి ఫౌంటెయిన్ వద్దకు వచ్చి రూ.20 నోట్లను వెదజల్లారు. అక్కడే విధి నిర్వహణలో పారిశుద్ధ్య కార్మికులు రోడ్డుపై పడిన కరెన్సీ నోట్లను ఎగబడి అందుకున్నారు. కొద్దిసేపు గుల్జార్‌హౌజ్ ఫౌంటెయిన్ వద్ద హంగామా సృష్టించి యువకులు అనంతరం కాలికమాన్ వైపు వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పెళ్లి బరాత్ ముగించుకొని వస్తుండగా.. దారి మధ్యలో ఈ సంఘటనకు పాల్పడినట్లు చార్మినార్ ఇన్స్పెక్టర్ గురు నాయుడు తెలిపారు. తమకు అందించిన సమాచారం మేరకు ఆయా పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. యువకులు ఎగరవేసిన నోట్లు నకిలీవా...? ఆసలైనా నోట్లా...? అని పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
రూ.500 దొంగనోట్లు పెరుగుతున్నాయ్: తస్మాత్ జాగ్రత్త!
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థ మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో 79,669 రూ. 500 డినామినేషన్ నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సంఖ్య రెట్టింపని ఆర్బీఐ వార్షిక నివేదిక తెలిపింది. ఇక రెండువేల నోట్ల విషయంలో గుర్తించిన నకిలీ సంఖ్య 13,604గా ఉంది. 2020–21తో పోల్చితే ఈ సంఖ్య 54.6 శాతం అధికం. 2016లో అమలులో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు ప్రధాన లక్ష్యాలలో ఒకటి నకిలీ కరెన్సీ నోట్ల చెలామణిని అరికట్టడం కావడం గమనార్హం. కాగా, ఇందుకు సంబంధించి తాజా పరిస్థితి ఏమిటన్నది గణాంకాల్లో పరిశీలిస్తే... ► 2020–2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 2,08,625 నకిలీ నోట్లను గుర్తిస్తే, 2021–22లో ఈ సంఖ్య 2,30,971కి చేరింది. ► 2020–21తో పోల్చితే 2021–22లో రూ.10, రూ.20, రూ.200, రూ.500 (కొత్త డిజైన్), రూ. 2,000ల విలువ కలిగిన నకిలీ నోట్లలో వరుసగా 16.4 శాతం, 16.5 శాతం, 11.7 శాతం, 101.9 శాతం, 54.6 శాతం పెరుగుదల నమోదైంది. ► అయితే ఇదే కాలంలో రూ.50, రూ.100 దొంగ నోట్లు వరుసగా 28.7%, 16.7% తగ్గడం గమనార్హం. ► 2021–22లో గుర్తించిన మొత్తం నకిలీ నోట్లలో 6.9 శాతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తించగా, 93.1 శాతం నోట్లను ఇతర బ్యాంకులు పసిగట్టాయి. ► 2021 ఏప్రిల్ నుండి 2022 మార్చి 31 వరకు కరెన్సీ ప్రింటింగ్‌పై చేసిన మొత్తం వ్యయం రూ. 4,984.8 కోట్లు. అంతకుముందు సంవత్సరం (2020 జూలై 1 నుండి 2021 మార్చి 31 వరకు) ఈ మొత్తం రూ. 4,012.1 కోట్లు. 2021 మార్చికి ముందు ఆర్బీఐ జూలై–జూన్ మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించేది. అయితే 2021 ఏప్రిల్ నుంచి ‘ఏప్రిల్–మార్చి’ని ఆర్థిక సంవత్సరంగా మార్చారు. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో పాడైపోయిన నోట్లను వెనక్కు తీసుకోడానికి సంబంధించిన సంఖ్య 88.4 శాతం పెరిగి 1,878.01 కోట్లకు చేరింది. 2020–21లో ఈ సంఖ్య 997.02 కోట్లు. -
చైన్ స్నాచింగ్ కేసులో అరెస్ట్ చేస్తే.. నకీలీ కరెన్సీ వ్యవహారం గుట్టు రట్టు
సాక్షి హైదరాబాద్: అద్దెకు ఉంటామనే నెపంతో ఇంట్లోకి దూరి మహిళల మెడలోని బంగారు నగలతో ఉడాయిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నగల రికవరీ నిమిత్తం ప్రధాన సూత్రధారి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. రూ.40 వేల నకిలీ కరెన్సీ దొరకడంతో పోలీసులకు అనుమానమొచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది. దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు రాచకొండ పోలీసులు చెక్ పెట్టారు. మొత్తం 11 మంది గ్యాంగ్‌లో 9 మందిని అరెస్ట్ చేశారు. గురువారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. అక్కడ దొరికి.. నగరానికి వచ్చి.. తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన కొవ్వూరు శ్రీనివాస్ రెడ్డి గతంలో దొంగనోట్లు ముద్రించి అనపర్తి, రాజమండ్రిలలో చెలామణి చేసేవాడు. అదే గ్రామానికి చెందిన ఓగిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి.. దొంగ నోట్లు ఎలా తయారు చేయాలో శ్రీనివాస్ రెడ్డి వద్ద నేర్చుకున్నాడు. స్థానికంగా నకిలీ కరెన్సీ నోట్ల వినియోగిస్తూ ప్రజలను మోసం చేసేవాడు. ఈ కేసులో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చాక ఏపీలో ఉంటే మళ్లీ పట్టుబడతామని గ్రహించి.. తన స్నేహితులైన అనపర్తికి చెందిన కోడూరి శివ గణేష్, శ్రీకాంత్ రెడ్డి, కర్రి నాగేంద్ర సుధామాధవ రెడ్డి, సోరంపూడి శ్రీనివాస్, పిల్లి రామకృష్ణ, పేరం వెంకట శేషయ్య, నాగిరెడ్డి, మస్తాన్‌లతో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. రూ.50 వేలు ఇస్తే రూ.లక్ష.. మియాపూర్ కల్వరీ టెంపుల్ సమీపంలోని శిల్పా అవెన్యూ కాలనీకి చెందిన తోట సంతోష్ కుమార్ ఇంట్లో దొంగనోట్లు ముద్రించడం మొదలుపెట్టారు. నాగిరెడ్డి, మస్తాన్, శివ గణేష్‌లు నకిలీ రూ.100, 200, 500 దొంగ నోట్ల తయారీదారులు కాగా.. శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సుధామాధవ రెడ్డి, శ్రీనివాస్, రామకృష్ణలు మధ్యవర్తులు. వీరు రూ.50 వేల అసలు నగదు ఇచ్చే వినియోగదారులకు రూ.లక్ష నకిలీ కరెన్సీని ఇస్తుంటారు. ఇందుకు గాను మధ్యవర్తులకు రూ.15వేలు కమీషన్ ఇస్తారు. రూ.35 వేలు తయారీదారులు తీసుకుంటారు. విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు గురువారం ఉదయం మార్కెట్లో నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. నాగిరెడ్డి, మస్తాన్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.3.22 లక్షల నకిలీ కరెన్సీ, రెండు కలర్ జిరాక్స్ ప్రింటర్లు, వాటర్ మార్క్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. జైలులో ఒక్కటయ్యారు.. గతంలో గంజాయి కేసులో సంతోష్ కుమార్ అరెస్ట్ కాగా.. మానవ అక్రమ రవాణా కేసులో పేరం వెంకట శేషయ్య అరెస్ట్ అయ్యాడు. వీళ్లిద్దరికి చర్లపల్లి జైలులో పరిచయం ఏర్పడింది. బెయిల్‌పై బయటికి వచ్చాక దొంగనోట్ల కేసులో ప్రధాన సూత్రధారి అనపర్తికి చెందిన ఓగిరెడ్డి వెంకట కృష్ణారెడ్డితో జట్టుకట్టారు. మియాపూర్‌లోని సంతోష్ ఇంట్లో దొంగనోట్లు ముద్రించి స్థానికంగా చెలామణి చేయడం మొదలుపెట్టారు -
Fake Currency: రాత్రి వేళ నకిలీ నోట్ల దందా
హసన్‌పర్తి (వరంగల్): నకిలీ నోట్లను అరికట్టడానికి సర్కారు చర్యలు చేపట్టింది. నోట్లు రద్దు చేసి కొత్త నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ మార్కెట్లో మాత్రం నకిలీ నోట్ల దందా మాత్రం జోరుగా సాగుతోంది. ఇటీవల హసన్‌పర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో నకిలీ నోట్లను స్థానిక వ్యాపారులు గుర్తించారు. రాత్రి వేళ కొనసాగుతోంది. సరుకులు ఇచ్చి నకిలీ రెండువేలు రూపాయలు తీసుకున్న ఓ వ్యాపారి ఆ తర్వాత అది అసలు నోటు కాదని తెలియడంతో లబోదిబోమన్నాడు. చదవండి: (Nalgonda: 'రూ. 1.50లక్షల ఆర్థికసాయం.. ఆస్పత్రి ఖర్చులన్నీ భరిస్తా') -
మాదాపూర్‌లో నడిరోడ్డుపై నోట్లకట్టలు.. ట్రాఫిక్ జామ్.. తీరా చూస్తే..
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో నకిలీ 2000 నోట్ల కలకలం సృష్టించాయి. 100 ఫీట్ రోడ్‌కు సమీపంలోని కాకతీయ రోడ్డులో గుట్టలుగుట్టలుగా 2000 నోట్లు ఉండడంతో స్థానికులు, వాహనాదారులు నోట్ల కోసం ఎగబడ్డారు. ఎవరికి అందిన కాడికి వారు తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. కొంతసేపు ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. తీరా ఆ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండడంతో వాటిని తీసుకున్న వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. చదవండి: ('పుంజు'కున్న ధరలు.. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ) -
రూ.3 లక్షలకు.. రూ.12 లక్షల నకిలీ నోట్లు
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): విశాఖ నగరంలో నకిలీ నోట్ల చలామణీ కలకలం రేపింది. సీతమ్మధారకు చెందిన ఓ వ్యక్తి ఒడిశా నుంచి నకిలీ నోట్లు తీసుకొస్తున్నట్టు ఎంవీపీ కాలనీ పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో ద్వారకా ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. ఎంవీపీ పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు గురువారం రాత్రి రాజాన విష్ణు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్దనున్న నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారించగా సీతమ్మధారకు చెందిన యాగంటి ఈశ్వరరావు అనే వ్యక్తి ద్వారా ఈ నకిలీ నోట్లు పొందినట్లు వెల్లడించాడు. ఈశ్వరరావుకు రూ.3 లక్షల నగదు ఇవ్వగా, అతను ఒడిశా తీసుకెళ్లి రూ.12 లక్షల విలువచేసే నకిలీ నోట్లు ఇప్పించినట్లు వెల్లడించారు. ఇందులో రూ.4.77 లక్షల నకిలీ నోట్లు ఇప్పటికే మార్చినట్లు చెప్పాడు. విష్ణు ఇచ్చిన సమాచారంతో ఈశ్వరరావును కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ మూర్తి తెలిపారు. ఈ నోట్లలో రూ.100, రూ.200, రూ.500 నోట్లు ఉన్నాయని, నిందితులు ఇద్దర్నీ శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించిందన్నారు. ఒడిశా కేంద్రంగా నడుస్తున్న నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు చేసేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసినట్టు ఏసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణయ్య, ఎస్ఐ భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
హైటెక్ మోసం: యూ ట్యూబ్‌లో చూసి కలర్ జిరాక్స్‌తో దొంగనోట్ల ముద్రణ..
పెడన: ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో నకిలీ కరెన్సీ ముద్రించి.. వాటిని చెలామణి చేసేందుకు ప్రయత్నించిన ముఠాను పెడన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూ ట్యూబ్ ద్వారా నకిలీ కరెన్సీని ఎలా తయారు చేయాలి.. వాటిని ఎలా చెలామణి చేయాలి అనే అంశాలపై మూడు నెలలపాటు క్షుణ్ణంగా నేర్చుకుని.. పక్కాగా అమలు చేయాలనుకున్న వారికి పోలీసులు ఆదిలోనే చెక్ పెట్టారు. పెడన పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మచిలీ పట్నం డీఎస్పీ షేక్ మసూంబాషా సోమవారం విలేకరులకు వెల్లడించారు. సూత్రధారితో పాటు కేసుతో సంబంధం ఉన్న మొత్తం ఎనిమిది మందిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అసలు ఎలా తెలిసిందంటే.. పట్టణంలోని దక్షిణ తెలుగుపాలెంకు చెందిన ముచ్చు శివ తన తల్లి వైద్యఖర్చుల నిమిత్తం రామలక్ష్మీవీవర్స్‌కాలనీకి చెందిన వాసా వెంకటేశ్వరరావు దగ్గర అప్పుగా రూ.2వేలు తీసుకున్నాడు. వీటితో శివ స్థానికంగా మెడికల్ దుకాణంలో మందులు కొనుగోలు చేసేందుకు నగదు ఇచ్చాడు. మెడికల్ షాపులో ఉన్న వ్యక్తి ఆ నోట్లలో తేడాను గమనించి.. ఇవి దొంగనోట్లు అని చెప్పడంతో శివ తిరిగి వాసా వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లాడు. వెంకటేశ్వరరావు అవి దొంగనోట్లు కాదని, తనకు వీరభద్రపురంలోని కాసా నాగరాజు, అతని కుమారుడు ఇచ్చారని చెప్పి వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన శివ పెడన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోనే ముద్రణ.. దీంతో పోలీసులు తొలుత వెంకటేశ్వరరావును విచారించి, ఆపై కాసా నాగరాజు ఇంటికి వెళ్లి శనివారం అర్ధరాత్రి సోదాలు చేశారు. ఈ సోదాల్లో కలర్ జిరాక్స్ మిషన్‌తో పాటు ల్యాప్‌టాప్, కటింగ్ మిషన్, రూ.4లక్షలు విలువ గల నకిలీ కరెన్సీ నోట్లు, రూ.32,700 అసలు నగదు దొరికింది. దీంతో నాగరాజును పూర్తిస్థాయిలో విచారించగా.. అసలు విషయాలు బయటకొచ్చాయి. నాగరాజు, ఇంటర్ చదివే తన కుమారుడు ఇద్దరూ కలిసి ఇంట్లోనే నకిలీ నోట్లు ముద్రిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. యూట్యూబ్‌లో నకిలీ నోట్లకు సంబంధించిన వీడియో చూసి, మూడు నెలలుగా ముద్రణపై ప్రాక్టీస్ చేసినట్లు చెప్పాడు. చెలామణి చేసేందుకు మరికొందరు.. నకిలీ నోట్లు ఎవరెవరికి.. ఎంతెంత ఇచ్చిన దానిపై పోలీసులు విచారణ చేయగా రూ.40వేలు లేదా రూ.35వేలు అసలు నగదు తీసుకుని రూ.లక్ష నకిలీ కరెన్సీ నోట్లు ఇస్తున్నట్లు వారు వివరించారు. ఇలా నకిలీ కరెన్సీ నోట్లు తీసుకుని చెలామణి చేసేందుకు సిద్ధమైన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొప్పి సాయికుమార్, తాళ్ల నాగేశ్వరరావు, కాసా శివరాజు, వీణం వెంకన్న, వాసా రాజశేఖర్, బట్ట పైడేశ్వరరావు, సిద్ధాని పెద్దిరాజులు ద్వారా చెలామణి చేసేందుకు ప్రయత్నించారు. వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఒక్క పెద్దిరాజులు మాత్రం పరారీలో ఉన్నాడు. నాగరాజు కుమారుడు మైనర్ కావడంతో మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. కేసును త్వరితగతిన కొలిక్కి తీసుకువచ్చిన ఏఎస్ఐ టి. సురేష్‌కుమార్, పీసీలు జి. కోటేశ్వరరావు, కె. కృష్ణమూర్తిలతో పాటు ఎస్ఐ మురళీలను డీఎస్పీ షేక్ మసూంబాషా, సీఐ ఎన్ కొండయ్య ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: సీఎం జగన్ ఎవరితో పోరాడాలి పవన్?: ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి -
పాపం.. టాయ్ కరెన్సీ ‘ఇచ్చి’ అనూహ్యంగా అరెస్టయిన సినీ నిర్మాత
Tollywood Movie Producer AS Kishore Arrested In Toy Currency Case Hyderabad సాక్షి, సిటీబ్యూరో: గోల్కొండ పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన టాయ్ కరెన్సీ కేసులో చోటా నిర్మాత ఏఎస్ కిషోర్ బుక్కయ్యాడు. ప్రధాన నిందితురాలు సమీనా కోరిన మీదట ఈ నోట్లను ‘చూపించడానికి’ ఇచ్చినందుకు నిందితుడిగా మారాడు. ఇతడితో పాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన మరో ఇద్దరినీ నిందితులుగా చేర్చామని వెస్ట్‌జోన్ జేసీపీ ఏఆర్ శ్రీనివాస్ శనివారం ప్రకటించారు. అప్పులు చేసి వ్యాపారం... టోలిచౌకిలోని సెవెన్ టూంబ్స్ ప్రాంతానికి చెందిన సమీనా అలియాస్ రూహి 2019లో ఓ వ్యాపారం ప్రారంభించారు. దీనికోసం బంధువులు, స్నేహితులతో పాటు పరిచయస్తుల వద్దా కలిపి మొత్తం రూ.2 కోట్ల వరకు అప్పులు చేశారు. వ్యాపారంలో నష్టం రావడంతో ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయారు. ఇటీవల అప్పులు ఇచ్చిన వారి నుంచి తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి పెరింగింది. దీని నుంచి బయటపడటానికి ఆమె తన వద్ద భారీగా డబ్బు ఉన్నట్లు ‘చూపించాలని’ పథకం వేశారు. అంత మొత్తం ఒక్క రోజుకు కూడా ఎవ్వరూ ఇవ్వరని తెలిసిన సమీనా టాయ్ కరెన్సీ వినియోగించాలని భావించింది. (చదవండి: అభ్యర్థి ఎంపికే కొంపముంచింది!) పరిచయస్తుల ద్వారా నిర్మాత నుంచి... ఈ విషయాన్ని సమీనా తనకు పరిచయస్తులైన రియల్టర్ డి.ధనావత్ రాజు, క్యాట్రింగ్ వ్యాపారి జి.సుదర్శన్లకు చెప్పింది. దీంతో వాళ్లు తమకు పరిచయస్తుడైన ఏఎస్ కిషోర్ సినీ రంగంలో ఉన్నారని చెప్పారు. ఆయన వద్ద షూటింగ్స్ సమయంలో వాడే టాయ్ కరెన్సీ ఉంటుందని వివరించారు. దీంతో ఆ కరెన్సీ తీసుకువచ్చి కథ నడపాలని భావించింది. ఈ ముగ్గురూ కిషోర్‌ను సంప్రదించడంతో ఆయన చిల్ట్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉన్న రూ.500, రూ.2 వేల నోట్లు రూ.2 కోట్ల విలువైనవి ఇచ్చారు. కొన్ని షార్ట్ ఫిల్ములు తీసిన కిషోర్ ఇటీవలే పెద్ద చిత్రం నిర్మించాలని భావిస్తున్నారు. నగదు ఉందని నమ్మించడానికే... ఈ టాయ్ కరెన్సీని తీసుకున్న సమీనా ఒక్కో బండిల్‌కు పైన, కింద అసలు నోట్ల కలర్ జిరాక్సు ప్రతులు ఉంచింది. వీటిని తన ఇంట్లో ఉంచి అప్పులు ఇచ్చిన వారికి నేరుగా, ఫొటోలు, వీడియో కాల్స్ ద్వారా చూపిస్తోంది. డబ్బు ఎక్కడకూ పోలేదని వారిని నమ్మించి ఒత్తిడి తగ్గించుకోవాలని ప్రయత్నించింది. షాహిద్‌నగర్‌కు చెందిన మహ్మద్ సోహెల్ నుంచి ఓ స్థిరాస్తి ఖరీదు చేస్తున్నట్లు సమీనా బిల్డప్ ఇచ్చింది. అతడికి ఫోన్ చేసి పిలిచిన ఆమె రూ.15 లక్షల టాయ్ కరెన్సీని ఓ పాలథీన్ బ్యాగ్‌లో వేసి చూపించాలని భావించింది. అయితే అతడు ఆ మొత్తం తీసుకుని వెళ్లిపోవడం, ఇంటికి వెళ్లాక తెరిచి చూడటంతో కథ అడ్డం తిరిగింది. నిందితులుగా మారిన నలుగురూ... సమీనా తనను మోసం చేసిందని భావించిన సోహైల్ దీనిపై గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి సమీనాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే సదరు టాయ్ కరెన్సీని అప్పులు ఇచ్చిన వారికి చూపించి తిరిగి ఇచ్చేస్తానని చెప్పడంతో నిర్మాత కిషోర్ ఇచ్చాడని, దీనికి రాజ్, సుదర్శన్ సహకరించారని బయటపెట్టింది. దీంతో అధికారులు టాయ్ కరెన్సీ స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆమెతో సహా నలుగురినీ అరెస్టు చేశారు. సమీనా ఈ టాయ్ కరెన్సీని చెలామణి చేయడా నికి ప్రయత్నించలేదని జేసీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. (చదవండి: Sahasra: బాల నటి భళా.. కుట్టి ) -
దొంగనోట్ల ముఠా గుట్టురట్టు: 6 గురు అరెస్టు
పశ్చిమగోదావరి: బుట్టాయిగూడెంలో దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా జంగారెడ్డి గూడెం, పోలవరం ప్రాంతంలో నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి దగ్గరి నుంచి రూ.12 లక్షల నకిలీ కరెన్సీ, 3 బైకులు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో ఎవరిపైనా ఒత్తిడిలేదు: మంత్రి అవంతి -
రోడ్డుపై కుప్పలుకుప్పలుగా రూ.2 వేల నోట్లు.. షాహిద్‌పై నెటిజన్స్ ఫైర్
రోడ్డుపై డబ్బులు కనిపిస్తే ఎవరైనా ఊరుకుంటారా? టక్కున వెళ్లి గమ్మున జేబులో వేసుకొని వెళ్లిపోతారు. అలాంటిది రోడ్డుపై కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు.. అది కూడా రూ.2000 నోట్ల కట్టలు పడి ఉంటే..? ఎవరు ఊరుకుంటారు? అంతా పరుగెత్తుకొచ్చి ఆ నోట్లను ఏరుకునే పనిని మొదలు పెడతారు. సరిగ్గా ఇలాంటి సంఘటననే ముంబైలోని ఓ ప్రాంతంలో జరిగింది. రోడ్డుపై కుప్పలుకుప్పలుగా రూ.2 వేల నోట్లు పడి ఉండడంతో.. వాటిని ఏరుకోవడానికి స్థానికులు ఎగబడ్డారు. తీరా అవన్ని నకిలీ నోట్లు అని తెలియడంతో నిరాశతో వెనుదిరిగారు. కొంతమంది మాత్రం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌పై ఫైర్ అయ్యారు. (చదవండి: సోనుసూద్ ట్వీట్, మండిపడుతున్న నెటిజన్లు) నోట్ల కట్టలకు షాహిద్‌కు సంబంధం ఏంటనేగా మీ అనుమానం? ఆ నకిలీ డబ్బంతా షాహిద్ కపూర్ నటిస్తున్న వెబ్ సిరీస్ ‘సన్నీ’షూటింగ్ కోసం ఉపయోగించినదే. ‘ఫ్యామిలీ మేన్’సిరీస్ తర్వాత రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ ‘సన్నీ’.ఈ సిరీస్‌లో హీరోగా షాహిద్ కపూర్ నటించగా, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, రెజీనా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. (చదవండి: అన్ని భయాలను జయించా.. తన అరుదైన వ్యాధి గురించి నటి వెల్లడి) ఈ సిరీస్ షూటింగ్లో భాగంగా ఓ యాక్సిడెంట్ సన్నివేశం ఉంది. ఆ సమయంలో రూ. 2 వేల నోట్లు రోడ్డుపై పడిపోవాలి. దీని కోసం నకిలీ నోట్లను ఉపయోగించింది చిత్ర యూనిట్. కానీ షూటింగ్ అయిపోయాక వాటిని తీసేయడం మర్చిపోయారు. దీంతో ఆ ప్రాంతంలోకి కొంతమంది అవి నిజమైన డబ్బులే అనుకొని ఏరుకునేందుకు ఎగబడ్డారు. తర్వాత అసలు విషయం తెలుసుకొని నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయంపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీ మహాత్ముడు ఫొటో ఉన్న నోట్లను రోడ్డుపై పారేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. షూటింగ్‌కి చిత్రబృందం అనుమతి తీసుకుందని, అయితే గాంధీజీకి అవమానం జరిగిందనే విషయంపై విచారణ చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. చిత్ర యూనిట్ మాత్రం తాము వినియోగించిన నకిలీ నోట్లను అక్కడ నుంచి తొలగించామని, ఇప్పుడున్న నోట్లు ఎలా వచ్చాయో తెలియదని చెప్పినట్లు సమాచారం. -
బాన్సువాడలో నకిలీ నోట్ల కలకలం
సాక్షి, బాన్సువాడ: నకిలీ నోట్ల కేసులో బాన్సువాడ యువకుడ్ని మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం జిల్లాలో కలకలం సృష్టించింది. చత్తీస్‌గఢ్‌లో నకిలీ నోట్లను ముద్రించగా, సుమారు రూ.8 లక్షల విలువైన నోట్లను బాన్సువాడ యువకుడు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇవే నకిలీ నోట్లు మధ్యప్రదేశ్‌లోనూ చెలామణి కాగా, అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో ఫేక్ కరెన్సీ విషయం వెలుగులోకి వచ్చింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రం భిలాయ్ జిల్లా కేంద్రంలో నరేశ్పవార్ అనే వ్యక్తి నకిలీ నోట్లు ముద్రించగా, అతని నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు నోట్లను కొనుగోలు చేసినట్లు తేలింది. విచారణలో అతను ఇచ్చిన సమాచారం మేరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌గఢ్ జిల్లా జీరాపూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మంగళ్‌సింగ్ రాథోడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేపట్టింది. బాన్సువాడకు చెందిన యువకుడు నకిలీ విషయం యూట్యూబ్‌లో చూసి నరేశ్పవార్ను సంప్రదించినట్లు తేలింది. దీంతో మధ్యప్రదేశ్ పోలీసు లు శుక్రవారం రాత్రి బాన్సువాడకు వచ్చారు. స్థానిక పోలీసుల సహాయంతో సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు సుమారు రూ.8 లక్షల నకిలీ నోట్లను బాన్సువాడకు తీసుకొచ్చాడని పోలీసులు చెబుతున్నారు. అయితే, నోట్ల చెలామణి చేశాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికైతే పోలీసులకు ఎలాంటి నకిలీ నోట్లు లభించలేదు. నకిలీ నోట్లు ప్రింట్ చేసిన వ్యక్తిని ఏ–1గా చేర్చి, అతని వద్ద నోట్లు కొనుగోలు చేసిన రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులపై దృష్టి సారించారు. వీరంతా కలిసి భారీగా నకిలీ నోట్లను ముద్రించేందుకు ప్లాన్ వేసిన ట్లు తెలిసింది. నకిలీ నోట్ల కేసులో బాన్సువాడకు చెందిన యువకుడిని మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని బాన్సువాడ టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి చెప్పారు. అతను ఎన్ని నోట్లు తీసుకువచ్చాడు? చెలామణి చేశాడా.. లేదా? అనే సమాచారం లేదని తెలిపారు. వర్నీలో రూ.2 వేల నకిలీ నోటు వర్నీలో రూ.2 వేల నకిలీ నోటు వెలుగు చూసింది. బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామా నికి చెందిన ఓ మహిళ.. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో కూలీ పనికి వెళ్లగా, రైతు ఆమెకు రూ.2 వేల నోటు ఇచ్చాడు. అయితే, అది దొంగ నోటుగా గుర్తించిన మహిళ కుమారుడు రెండ్రోజుల క్రితం బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌లో అందజేసినట్లు సమాచారం. ఆ నోటును శుక్రవారం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఎస్సై మంగళ్‌సింగ్ రాథోడ్ పరిశీలించగా, అది చత్తీస్‌గఢ్ ముఠాది కాదని తేల్చినట్లు సమాచారం. ఈ నోటు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ప్రింట్ చేశారని, ఈ నకిలీ నోట్లను కర్ణాటక నుంచి చెలామణి చేశారని గుర్తించినట్లు సమాచారం. -
రంగురాళ్ల చోరీ కేసులో కొత్త ట్విస్ట్
-
రంగురాళ్ల చోరీ కేసులో కొత్త ట్విస్ట్
-
‘జోతిష్యుడి’ కథ అడ్డం తిరిగింది!
నాగోలు: జోతిష్యం తెలుసంటూ కలరింగ్ ఇచ్చి ఆ ముసుగులో నకిలీ రంగురాళ్లు అంటగట్టడంతో పాటు హవాలా దందా, నకిలీ నోట్ల చెలామణి చేపట్టాడో బోగస్ జోతిష్యుడు. ఈ విషయం తెలియని పని వాడు మరికొందరితో కలిసి ఫేక్ కరెన్సీ ఎత్తుకుపోయాడు. ఇది కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో అతగాడు విలువైన రంగురాళ్లు, వజ్రాలు పోయాయంటూ కేసు పెట్టాడు. రంగంలోకి దిగిన ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో అసలు వ్యవహారం బయటపడింది. జోతిష్యుడితో సహా ఏడుగురిని అరెస్టు చేసిన అధికారులు రూ.17.72 కోట్ల టాయ్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ క్రైమ్స్ డీసీపీ యాదగిరి పూర్తి వివరాలు వెల్లడించారు. జోతిష్యుడి అవతారంలో మోసాలు... గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుళ్ళపల్లికి చెందిన బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ పదో తరగతి వరకు చదివాడు. ఆపై జోతిష్యుడి అవతారం ఎత్తి మాయమాటలతో ఎదుటి వారిని తేలిగ్గా మోసం చేయడం మొదలెట్టాడు. ఈ ముసుగులో నకిలీ రంగురాళ్ళను అంటగట్టి అమాయకులను బురిడి కొ ట్టించి రూ.లక్షల్లో ఆర్జించాడు. 2006లో కుటుంబంతో వెళ్లి విజయవాడలో స్థిరపడ్డారు. అక్కడ ఉంటూ భక్తి నిధి పేరుతో ఓ వెబ్సైట్ ఏర్పాటు చేసిన నకిలీ రంగురాళ్ళు అమ్మాడు. ఈ మోసాలతో అనుకున్న స్థాయిలో ధనార్జన సాధ్యం కాలేదు. దీంతో విలాసా ల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. గతంలో కటకటాల్లోకి పంపిన సీబీఐ.. మురళీకృష్ణకు 2019లో నూరుద్దీన్ అనే వ్యక్తి ఇతడికి పరిచయమయ్యాడు. అతడు ట్రేడింగ్ చేస్తుండటంతో అందులో పెట్టుబడి పెట్టేందుకు తన బ్యాంకు ఖాతాలో రూ.90 కోట్లు ఉన్నట్లు నమ్మించాడు. ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు మల్కాజ్‌గిరిలో ఓ బ్యాంక్ అధికారుల సాయం తీసుకున్నాడు. తాత్కాలిక ప్రాతిపదికన తనకు ఆ నగదు తన ఖాతాలో ఏర్పాటు చూస్తే..24 గంటల్లో ఖరీదు చేసిన షేర్లు అమ్మేసి లాభాలు పంచుకుందామని ఎర వేశాడు. ఆ స్కామ్‌ను ముందే బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు. సీబీఐకు ఫిర్యాదు చేయగా మురళీకృష్ణతోపాటు కొందరు బ్యాంకువారిని అరెస్టు చేశారు. జైలు నుంచి వచ్చి కొత్త దందాలు... ఈ కేసులో బెయిల్ పొందిన మురళీకృష్ణ తన మకాంను నాగోల్ పరిధిలోని బండ్లగూడకు మార్చాడు. జూబ్లీహిల్స్‌లో మరో ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నాడు. జోతిష్యం, సమస్యల పరిష్కారం పేరుతో వివిధ ఛానళ్లలో ప్రకటనలు ఇచ్చి çఆకర్షితులైన వారికి నకిలీ రంగురాళ్లు విక్రయిస్తున్నాడు. దీంతో పాటు నలుగురు అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో నకిలీ నోట్ల చెలామణి చేపట్టాడు. ఆ కట్టుకథతో దొరికిపోయాడు.. ఈ నకిలీ జోతిష్యుడి వద్ద పని చేసే గుంటూరుకు చెందిన సి.నాగేంద్రప్రసాద్ శర్మ, వేల్పూరి పవన్ కుమార్, దొండపాటి రామకృష్ణ, చందులూరి విజయ్ కుమార్, కంభంపాటి సూర్యం, చందులూరి నాగేంద్రలకు దుర్భుద్ది పుట్టింది. ఈ నెల 14న వీరంతా కలిసి మురళీకృష్ణ ఇంట్లో నగదు ఉన్న బ్యాగ్ చోరీ చేశారు. దాన్ని తీసుకుని కారులో గుంటూరు జిల్లాకు వెళ్తున్న వీళ్లు మార్గ మధ్యంలో బ్యాగ్ తెరిచి చూశారు. బ్యాగ్‌లో ఉన్న వాటిలో కేవలం రూ.2 వేల నోట్లు 16 మాత్రమే అసలైనవి అని, మిగిలినవి నకిలీ కరెన్సీ, టాయ్ కరెన్సీగా గుర్తించారు. అవి తమ వద్ద ఉంటే పోలీసులు పట్టుకుంటారని భయపడిన ఆ నిందితులు నార్కట్‌పల్లి వద్ద ప్రధాన రోడ్డు దూరంగా తీసుకువెళ్లి పెట్రోల్ పోసి కాల్చేశారు. ఈ చోరీని తనకు అనుకూలంగా మార్చుకుని క్యాష్ చేసుకోవాలని భావించిన మురళీకృష్ణ తన ఇంటి నుంచి రూ.40 లక్షల విలువైన రంగురాళ్లు, వజ్రాలు చోరీ అయ్యాయని ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. అసలు విషయం చెప్పిన ఆరుగురు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు పిగుడురాళ్ల వెళ్లి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి విచారణలో చోరీ చేసిన నకిలీ నోట్లు, వాటిని కాల్చేయడం తదితర విషయాలు బయటపడ్డాయి. నకిలీ నోట్లు జోతిష్యుడి వద్దకు ఎలా వచ్చాయనే అనుమానంతో పోలీసులు అతడినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మురళీకృష్ణ హవాలా దందా, టాయ్ కరెన్సీతో మోసాలు, నకిలీ కరెన్సీ చెలామణి తదితరాలు బయటపెట్టాడు. దీంతో అతడి ఇంటిపై దాడి చేసిన పోలీసులు రూ.రూ.17.72 కోట్ల టాయ్ కరెన్సీ, రూ.6 లక్షల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. మురళీకృష్ణతో పాటు ఏడుగురు నిందితుల్నీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: 'ఆ రూపాయి నాణేం కోటికి కొంటాను' -
వరంగల్ జిల్లా లో ఫేక్ కరెన్సీ కలకలం
-
సుంకి చెక్ పోస్టు: సంచుల కొద్దీ నకిలీ నోట్ల పట్టివేత
సాక్షి, కొరాపుట్: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏఓబీ) సుంకి చెక్ పోస్టు వద్ద పొట్టంగి పోలీసులు సోమవారం సాయంత్రం భారీగా నకిలీ నోట్లను పట్టుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై సునాబెడ ఎస్డీపీఓ నిరంజన్ బెహచరా పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించి పోలీసులు పట్టుకున్న నకిలీ నోట్లతో పాటు నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. పొట్టంగి ఎస్సై ఎస్.కె.స్వంయి, ఏఎస్సై ఎమ్.ఎస్.నాయక్‌లు వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో ఒక ఫోర్డు ఫిగో కారు రావడంతో ఆపి తనిఖీ చేయగా నకిలీ రూ. 500 నోట్లు ఆ కారులో సంచుల కొద్దీ కనబడ్డాయి. కారులో ఉన్న ముగ్గురు నిందితులు, నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని జంగిర్చంపా జిల్లాకు చెందిన నిందితులు రాజధాని రాయిపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న వారి సహచరులకు నకిలీ నోట్లు చేరవేసేందుకు వెళ్తున్నారు. మెజిస్ట్రేట్ సమక్షంలో నకిలీ నోట్లను లెక్కపెట్టగా రూ.7,90,00,000 ఉన్నాయని, నేరస్తులను అరెస్టు చేయడంతో పాటు వారి దగ్గర గల రూ.35 వేల నగదు, 5 మొబైల్ ఫోన్లు, క్రెడిట్, డెబిట్, ఐడీ కార్డులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్డీపీఓ నిరంజన్ బెహరా వివరించారు. -
నకిలీ నోట్ల రాకెట్ : షాకైన పోలీసులు
సాక్షి, ముంబై : మహరాష్ట్రలోని పుణేలో భారీ ఎత్తున నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించారు. కోట్లాది రూపాయల విలువైన స్వదేశీ, విదేశీ కరెన్సీని చూసి పోలీసు ఉన్నతాధికారులే షాక్ అయ్యారు. దీనికి సంబంధించి ఆర్మీ సిబ్బంది సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. సదరన్ కమాండ్ ఇంటెలిజెన్స్ వింగ్, పూణె క్రైం బ్రాంచ్ జాయింట్ ఆపరేషన్‌లో బుధవారం(జూన్ 10)న ఈ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. మిలటరీ ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించామని డిప్యూటీ పోలీసు కమిషనర్ క్రైమ్ బచ్చన్ సింగ్ వెల్లడించారు. మిలటరీ ఇంటెలిజెన్స్ సహకారంతో నిర్వహించిన దాడిలో ఒక జవానుతో పాటు మరికొందరు దొంగ నోట్లను ముద్రిస్తున్నారని చెప్పారు. వీటిలో వెయ్యి రూపాయల నోట్లను మినహాయించి రూ. 43.4 కోట్లు స్వదేశీ నోట్లు, రూ. 4.2 కోట్లు విదేశీ కరెన్సీ ఉన్నట్టు వివరించారు. దీనిపై ఉన్నతాధికారులు మరింత విచారణ జరుపుతున్నారనీ అదుపులోకి తీసుకున్న జవాన్‌ను పూణెలోని ఆర్మీ అధికారులకు అప్పగించామని తెలిపారు. (పెట్రో వడ్డింపు : ఎంత పెరిగిందంటే) అరెస్టయిన ఆరుగురిలో భారత ఆర్మీ జవాన్ షేక్ అలీమ్ గులాబ్ ఖాన్, ఇతరులు సునీల్ బద్రీనారాయణ సర్దా, రితేష్ రత్నాకర్, తుఫైల్ అహ్మద్ మహ్మద్ ఖాన్, రెహ్ముతుల్లా ఖాన్, అబ్దుల్ రెహమాన్ ఖాన్ అని పూణే సంయుక్త పోలీసు కమిషనర్ రవీంద్ర షిస్వే తెలిపారు. (ఫెడ్ ఎఫెక్ట్ : లాభాలకు చెక్) పోలీసులు అందించిన మరిన్ని వివరాలు రూ .43.4 కోట్ల విలువైన భారత కరెన్సీ, రూ .4.2 కోట్ల విలువైన యుఎస్ డాలర్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులుగా ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో ముద్రణ వీటిలో 2016 లో కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్లు కూడా ఉన్నాయి. ఈ నకిలీ నోట్ల కట్టల్లో మొదటి నోటు మాత్రమే అసలుది ఉంటుంది. ఒక నకిలీ పిస్తోల్ స్వాధీనం Six persons, including one serving military personnel detained in possession of multiple denominations of fake Indian and foreign currency. Counting of currency & further investigation underway: Crime Branch, Pune #Maharashtra pic.twitter.com/KamjyHelV3 — ANI (@ANI) June 10, 2020 -
నకిలీ కరెన్సీ కలకలం
ఒంగోలు: నగరంలో నకిలీ కరెన్సీ ముఠా హల్చల్ చేస్తోందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చిల్లర కావాలంటూ ఆగంతకుడు ఏకంగా రూ.31 వేలకు ఓ డెయిరీ నిర్వాహకుడిని మోసం చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో రాజా వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి దొడ్ల డెయిరీ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి ఓ వ్యక్తి అతని వద్దకు వచ్చి తన వద్ద పెద్ద నోట్లు ఉన్నాయని, తనకు చిల్లర అవసరం ఉందని చెప్పాడు. చిల్లర నోట్లు ఇస్తే పెద్ద నోట్లు ఇస్తానని నమ్మబలికాడు. తన వద్ద రూ.500 నోట్లు 68 ఉన్నాయని చెప్పాడు. డెయిరీ నిర్వాహకుడు తన వద్ద చిన్న నోట్లు ఎక్కువగా ఉండటంతో అతనికి పెద్ద నోట్లు ఇస్తే పోయేదేముందనే ఉద్దేశంతో తన వద్ద ఉన్న వంద రూపాయల నోట్లు 340 ఇచ్చాడు. అతను తన వద్ద ఉన్న రూ.500 నోట్లు 68 ఇచ్చి వంద నోట్లు తీసుకెళ్తుంటే డెయిరీ యజమాని ఒకసారి లెక్క పెట్టుకోమన్నాడు. తాను మెషీన్‌పై లెక్క పెట్టుకుంటానులే అంటూ వెళ్లిపోయాడు. అతను వెళ్లిన తర్వాత పరిశీలించుకుంటే ఆ నోట్లలో అన్నింటిపై ఒకే నెంబర్ ఉంది. ఆరు నోట్లపై మాత్రం వేర్వేరు నంబర్లు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే పైన ఉన్న ఆరు నోట్లు మాత్రమే మంచివి. మిగితావన్నీ కలర్ జిరాక్స్ పేపర్లుగా స్పష్టమైంది. ఆవేదన చెందిన సుబ్బారెడ్డి హుటాహుటిన ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయాన్ని వివరించి కలర్ జిరాక్స్ నోట్లు 62 సీఐ భీమానాయక్‌కు అందజేశాడు. మొత్తం రూ.31 వేలకు ఆగంతకుడు మోసం చేసినట్లు స్పష్టమైంది. సీఐ వెంటనే అప్రమత్తమై ఘటన జరిగిన సమయానికి గంట అటూ ఇటుగా సీసీ కెమెరాల ఫీడ్ బ్యాక్ తీసుకురావాలంటూ సిబ్బందిని పురమాయించాడు. షాపు యజమాని చెప్పిన గుర్తుల ఆధారంగా ఆగంతకుడిని గుర్తించేందుకు పోలీసుశాఖ ఏర్పాటు చేసిన కెమెరాలే కాకుండా ఆ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు ఉన్నా పేటేజీలు తీసుకునేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. కలర్ జిరాక్స్ మెషీన్ల ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నట్లు తాజాగా వెల్లడైంది. ఇటీవల స్థానిక కేబీ రెస్టారెంట్ వద్ద విదేశీయుల మాదిరిగా ఉన్న రెండు జంటలు ఒక వ్యక్తిని ఆపి అతని వద్ద ఉన్న నగదును చెక్ చేసినట్లు నటిస్తూ రూ.6 వేలు చోరీ చే శారు. -
క్వెట్టాలో కరెన్సీ ప్రెస్!
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించడానికి పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అక్కడి బలూచిస్థాన్ ప్రాంతంలో ఉన్న క్వెట్టాలో ప్రత్యేకంగా ఓ పవర్ ప్రెస్ ఏర్పాటు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రింట్ అవుతున్న నకిలీ నోట్లు అసలు వాటిని తలదన్నేలా ఉంటున్నాయి. బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి వస్తున్న ఈ కరెన్సీని దక్షిణ భారతదేశంలో చలామణి చేయించడంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అమీన్ ఉల్ రెహ్మాన్ అలియాస్ బబ్లూ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. గత ఏడాది ఇతడి అనుచరుడిని పట్టుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాదాపు 11 నెలల గాలించి ఈ కీలక నిందితుడిని పట్టుకోగలిగారు. ఇతడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కేసులు నమోదై ఉన్నాయని, 2013 నుంచి రిజిస్టర్ అవుతున్న ఈ కేసుల్లో బబ్లూ వాంటెడ్‌గా ఉన్నాడని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ప్రకటించారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. రూట్ మార్చి.. క్వెట్టాలో ముద్రితమవుతున్న నకిలీ కరెన్సీ తొలుత ఆ దేశ రాజధాని కరాచీకి చేరుతోంది. అక్కడ నుంచి ఐఎస్ఐ ప్రత్యేక పార్శిల్స్ ద్వారా వివిధ మార్గాల్లో భారత్‌కు పంపిస్తోంది. ఒకప్పుడు పాకిస్థాన్ నుంచి విమానాల ద్వారా దుబాయ్/సౌదీ అరేబియాలను తరలించేవారు. అక్కడున్న ఏజెంట్ల సహకారంతో జల మార్గంలో ఓడల ద్వారా గుజరాత్, మహారాష్ట్రల్లోని వివిధ ఓడ రేవులకు చేర్చేవారు. చిత్తుకాగితాలు, ముడిసరుకులు ఇలా అనేక పేర్లతో ఈ కన్సైన్మెంట్స్ వచ్చేవి. గడిచిన కొన్నేళ్లుగా ఈ మార్గంలో తీసుకురావడం కష్టంగా మారడంతో ఐఎస్ఐ తన రూటు మార్చింది. కరాచీ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్‌కు చేరవేస్తోంది. అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు తీసుకువచ్చి ఏజెంట్ల ద్వారా చలామణి చేయిస్తోంది. వివిధ దశల్లో ఏజెంట్లు.. నకిలీ కరెన్సీ డంప్ చేసి చలామణి చేయించడం ద్వారా పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడంతో పాటు అలా వచ్చే నిధుల్ని పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలున్నాయి. కరాచీ నుంచి మల్దా వరకు వివిధ దశల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ఐఎస్ఐ వారికి కమీషన్లు చెల్లిస్తోంది. సాధారణంగా హైదరాబాద్‌కు చేరే నకిలీ కరెన్సీ మార్పిడిన రేటు 1:3గా ఉండేది. అంటే రూ.30 వేలు అసలు నోట్లు ఇస్తే ఏజెంట్లు రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చే వారు. ఏళ్లుగా ఇదే రేటు కొనసాగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో ఈ కమీషన్ పెరిగింది. కరెన్సీ నోట్లను పక్కాగా ముద్రిస్తున్న నేపథ్యంలోనే ఈ కమీషన్ కూడా పెంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా మాల్దాకు చెందిన బబ్లూ ఈ కరెన్సీని దక్షిణ భారతదేశంలో ఉన్న అనేక మంది ఏజెంట్లకు సరఫరా చేస్తుంటాడు. ఇలా వెలుగులోకి.. చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలోని బండ్లగూడకు చెందిన మహ్మద్ గౌస్ వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి. 1991లో పోలీసులకు బాంబులతో పట్టుబడటంతో బాంబ్ గౌస్‌గా మారాడు. ఇతడిపై పోలీసులు ఉగ్రవాద చర్యల వ్యతిరేక చట్టం (టాడా) కూడా ప్రయోగించారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం 2011 నుంచి నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనేక మంది ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఇతగాడు అక్కడ నుంచి నకిలీ కరెన్సీని వివిధ మార్గాల్లో నగరానికి రప్పించి చెలామణి చేస్తున్నాడు. ఇతగాడికి 2013లో మాల్దా జిల్లాలో కృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన బబ్లూతో పరిచయం ఏర్పడింది. అతడికి రూ.40 వేల నుంచి రూ.50 వేల చొప్పున అసలు కరెన్సీ చెల్లిస్తూ రూ.లక్ష నకిలీ కరెన్సీ తెప్పించి చలామణి చేసేశాడు. బబ్లూ గౌస్‌తో పాటు అనేక మందికి సరఫరా చేస్తున్నాడు. ఈ కరెన్సీని నగరంలో సర్క్యులేట్ చేస్తున్న గౌస్‌ను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు 11 నెలల క్రితం పట్టుకున్నారు. ఇతడి విచారణ నేపథ్యంలోనే బబ్లూ పేరు వెలుగులోకి వచ్చింది. మోస్ట్ వాంటెడ్‌గా మారిన అతడి కోసం అప్పటి నుంచి పోలీసులు గాలిస్తున్నారు. సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకియుద్దీన్, వి.నరేందర్‌లతో కూడిన బృందం మాల్దా వెళ్లి ఇతడి కోసం ముమ్మరంగా గాలించింది. ఎట్టకేలకు పట్టుకుని నగరానికి తీసుకువచ్చింది. తదుపరి చర్యల నిమిత్తం చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించింది. ఇతడి అరెస్టుకు సంబంధించి ఇతర జిల్లాలు, రాష్ట్రాల అధికారులకు సమాచారం ఇవ్వనున్నారు. -
రూ.2 వేల నోటు, మరో షాకింగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ట రద్దు తరువాత చలామణిలోకి వచ్చిన పెద్ద నోటు రూ.2వేల నోటుపై తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ నోట్లను చెక్ పెట్టేందుకంటూ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి నరేంద్ర మోదీ సర్కార్ ఆ తరువాత అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్లతో రూ.2వేల నోటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే రూ.2వేల నోట్లు కాపీ కొట్టడానికి ఈజీగా, భద్రతా డొల్లతనంతో నిండి ఉన్నాయని తాజాగా తేలింది. దేశంలో హల్ చల్ చేస్తున్న నకిలీనోట్లలో సగానికిపైగా రూ.2 వేల నోట్లు ఉన్నాయని, తాజా రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) అందించిన డేటా ప్రకారం పీఎం నరేంద్ర మోదీ డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా పట్టుబడిన నకిలీ నోట్లలో ఎక్కువ శాతం రూ.2వేల నోట్లు ఉన్నాయని ఈ డేటా వెల్లడించింది. మొత్తంలో 56 శాతం రూ. 2వేల నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించాయి.. అంతేకాదు రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో నకిలీ కరెన్సీ పట్టుబడి, గుజరాత్ ఫేక్ కరెన్సీ అడ్డాగా మారిందని డేటా ద్వారా తెలుస్తోది. కాగా 2016, నవంబర్ 8న రూ .1000, రూ .500 నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించిన ప్రధాని మోదీ, అవినీతి, నకిలీ నోట్లు, నల్లధనాన్ని నిరోధించేందుకు తమ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. భారతదేశంలో నకిలీ కరెన్సీపై తాము ఈ చేపట్టిన ఈ మహాయజ్ఞంలో ప్రజలు తమకు సహకరించాలనీ కోరిన సంగతి తెలిసిందే. Promise: Demonetization will eliminate fake currency, mitron bas 50 din dijiye Reality: Latest NCRB data shows 👉 56% of all fake currency seized in India is the new ₹2000 note 👉 Gujarat is the hub of fake currency. State where highest number of fake notes were found — Dhruv Rathee (@dhruv_rathee) January 15, 2020 -
నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు
కొత్తూరు: మద్యం షాపులు, రద్దీగా ఉండే చిల్లర దుకాణాలే లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. గత కొద్ది రోజులుగా కొత్తూరు, భామినితోపాటు పలు గిరిజన ప్రాంతాల్లో జోరుగా సాగుతున్న ఈ తంతుపై గత నెల 22న ‘నకిలీ నోట్లు చలామణి’ అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన పోలీసులు కొన్ని రోజుల నుంచి నిఘా పెట్టారు. ఈ క్రమంలో ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1,23,400 నకిలీ నోట్లను స్వా«దీనం చేసుకున్నారు. ఈ మేరకు కొత్తూరు పోలీసు స్టేషన్లో శుక్రవారం పాలకొండ డీఎస్పీ రారాజు ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం... కేసు దర్యాప్తులో భాగంగా స్థానిక ఇన్చార్జి సీఐ రవిప్రసాద్, ఎస్ఐ బాలకృష్ణ, కానిస్టేబుల్ బాబూరావు రవికుమార్, ఎస్పీవో ప్రసాద్‌పాత్రో మండలంలోని నివగాం బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అయిదుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారిలో కొత్తూరు మండలం ఎన్ఎన్ కాలనీకి చెందిన మీసాల ప్రకాష్ అలియాస్ ప్రశాంతకుమార్, ఇదే మండలం మహసింగి గ్రామానికి చెందిన షేక్ నబీ, భామిని మండలానికి చెందిన పొట్నూరు రామారావు, ఒడిశా రాష్ట్రం సార గ్రామానికి చెందిన రామచంద్ర సుందరరరావు పాత్రో, అదే రాష్ట్రం కాశీనగర్‌కు చెందిన సాసుబిల్లి రాజేష్ ఉన్నారు. వీరి నుంచి రూ. 2 వేలు, రూ.500, రూ. 200, రూ. 100 నకిలీ నోట్లు మొత్తం రూ. 1,23,400 స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో ఏ1 నిందితుడు ప్రకాష్‌పై 2017లో నకిలీ కరెన్సీ కేసు నమోదై ఉండటం గమనార్హం. ఈయన కొంతకాలంగా దీనికి దూరంగా ఉన్నాడు. మరలా నకిలీ కరెన్సీ చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ముఠా సభ్యులకు ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ తయారైన నకిలీ నోట్లను తీసుకొచ్చి మన జిల్లాలో వస్తువులు కొనుగోలు చేసి చలామణి చేసేవారు. ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు చేస్తేగాని, నకిలీ నోట్ల బాగోతం బయటపడదని డీఎస్పీ తెలిపారు. ఇటువంటి ముఠాల ఊబిలో పడి అమాయక ప్రజలు మోసపోవద్దని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సీఐ రవిప్రసాద్, ఎస్ఐ బాల కృష్ణ, పీసీలు బాబూరావు, రవికుమార్, హెచ్‌సీ చంద్రినాయుడు, రాంబాబు పాల్గొన్నారు. ఇన్నాళ్లు గోప్యంగా ఎందుకు ఉంచినట్టు...! నకిలీ నోట్ల చలామణి వ్యవహారంపై సాక్షిలో కథనం రాగానే అప్రమత్తమైన పోలీసులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. అయితే నకిలీ నోట్ల ముఠాను మూడు రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ వివరాలు ఇంతవరకు గోప్యంగా ఉంచి, తాజాగా డీఎస్పీ సమావేశంలో వెల్లడించారు. ఈ ముఠా వెనుక పెద్ద తలకాయల హస్తం కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వారిని తెరముందుకు తెస్తారో.. లేదో చూడాలి. -
పాడేరు– కామెరూన్ వయా బెంగళూరు
సాక్షి, కడప: తీగలాగితే డొంక కదిలినట్లు చిక్కింది ఐదుగురు నేరస్తుల ముఠా. స్పందనలో వచ్చిన ఫిర్యా దును తీవ్రంగా పరిగణించి కడప పోలీసులు దర్యాప్తు చేసి దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు. ముఠా వివరాలు వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ శనివారం వెల్లడించారు. పోలీసులు నిర్వహించే స్పందనకు కేరళకు చెందిన అబ్దుల్ కరీం వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేశారు. కడప భాగ్యనగర్ కాలనీకి చెందిన చింపిరి సాయికృష్ణ ఫేస్బుక్ ద్వారా పరిచయమై ఖరీదైన, నాణ్యమైన విగ్గులను విక్రయిస్తున్నట్లు చెప్పి డబ్బులను కాజేశారనేది సారాంశం. అలాగే సాయికృష్ణ మోసం చేశాడని కడపకు చెందిన జనార్దన్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సీఐ అశోక్‌రెడ్డి దీనిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ సైబర్ నేరాలను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. దర్యాప్తునకు కడప డీఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. గుట్టు రట్టు ఇలా: కడప నగరంలో ఒక ప్రయివేట్ లాడ్జీలో ఆ ముఠా ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం దాడి చేసి పట్టుకున్నారు. చింపిరి సాయికృష్ణ (కడప), పంగి దాసుబాబు (విశాఖ జిల్లా సిమిలిగూడ), కుర్రా జగన్నాథ్ (విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం పెద్దపాడు), కామెరూన్ దేశానికి చెందిన ఏంబిఐ అడోల్ప్ ఆషు, ఆకో బ్రోన్సన్ ఎనౌ పోలీసులకు చిక్కిన వారిలో ఉన్నారు. వారి నుంచి 9కిలోల గంజాయి, రూ.9,600 నగదు, రూ.7.28 లక్షల విలువైన నకిలీ రూ.2వేల నోట్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, కలర్ ప్రింటర్, ఏడు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీ నుంచి గంజాయిని కామెరూన్ దేశానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు నిర్ఘాంతపోయారు. నకిలీ రూ.2000 నోట్లను కూడా ప్రింట్ చేస్తున్నట్లు గుర్తించా రు. పాడేరులో రూ.6వేలకు గంజాయి కొనుగోలు చేసి కామెరూన్లో విక్రయిస్తే పదిరెట్లు ఆదాయం వస్తుందని నిందితులు తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేసి పాస్‌పోర్టులను స్వా«దీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. -
నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ కరెన్సీ రూ.2వేలు, రూ.100 నోట్లను చెలామణి చేస్తుండగా హెచ్‌బీ కాలనీ దరి స్టీల్ ప్లాంట్ కళావేదిక వద్ద ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా మీడియాకు ఆదివారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని ఇసుకతోట ప్రాంతానికి చెందిన కడపల నాగ వెంకట సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు శివాజీపాలెంకి చెందిన మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి బొంత పద్మారావుతో పరిచయం ఏర్పడింది. అతని మధ్యవర్తిత్వంతో చోడవరం ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్, తూర్పు గోదావరి జిల్లాకి చెందిన సయ్యద్ రెహమాన్‌ల నుంచి 1:3 నిష్పత్తిలో నకిలీ కరెన్సీ (ప్రతి మూడు నకిలీ కరెన్సీ నోట్లుకి ఒక ఒరిజినల్ నోటు) సత్యనారాయణ తీసుకున్నాడు. ఈ నకిలీ నోట్లు మార్పిడంతా సత్యనారాయణ తన కారు డ్రైవర్ రౌతు జయరాం ద్వారా చేస్తుండేవాడు. నకిలీ నోట్లను షాపులు, పెట్రోల్ బంకుల్లో డ్రైవర్ సాయంతో మార్చేవాడు. ఎవరికీ అనుమానం రాకపోవడంతో కొద్దిరోజుల కిందట మళ్లీ చోడవరం వెళ్లి షేక్ అబ్దుల్ రెహమాన్, తూర్పు గోదావరి జిల్లాకి చెందిన సయ్యద్ రెహమాన్‌ల నుంచి రూ.2,96,100లు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నారని సమాచారం రావడంతో ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ సీహెచ్ షణ్ముఖరావు, ఎస్సై సూర్యనారాయణ అప్రమత్తమయ్యారు. హెచ్‌బీ కాలనీ స్టీల్ ప్లాంట్ కళావేదిక వద్దకు చేరుకోగా అప్పటికే అక్కడ సంచరిస్తున్న ముగ్గురు నిందితులు సత్యనారాయణ, పద్మారావు, జయరాంలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7వేలు నగదు, నకిలీ కరెన్సీ రూ.2,96,100లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.వీరికి నకిలీ కరెన్సీ నోట్లు అందించిన వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని సీపీ మీనా తెలిపారు. సమావేశంలో డీసీపీ – 2 ఉదయ్ భాస్కర్ బిల్లా, ద్వారకా ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి, ఎంవీపీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ షణ్ముఖరావు, ఎస్సై సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విదేశీ ముఠాల హస్తాన్ని తోసిపుచ్చలేం : పోలీస్ కమిషనర్
సాక్షి, విశాఖపట్టణం : సిటీలో దొంగ నోట్ల ముద్రణ, చెలామణీ రాకెట్‌ను పోలీసులు ఆదివారం ఛేదించారు. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేల నోట్లు, వంద రూపాయల నోట్లు చెలామణీ చేస్తుండగా ఓ రియల్ఎస్టేట్ వ్యాపారిని పట్టుకొని అతని వద్దనుంచి సుమారు 3 లక్షల రూపాయల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నోట్లను పరిశీలించిన పోలీసులు వాటిని పకడ్బందీగా ముద్రించినట్టు నిర్థారించారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు ఎన్.ఐ.ఏ సహాయం తీసుకోవాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. విదేశీ ముఠా హస్తం ఉండే అవకాశముందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సిటీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా స్పందిస్తూ.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఫేక్ కరెన్సీ అక్రమ రవాణాను తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించారు. నోట్ల పంపిణీ ముఠాను అరెస్ట్ చేస్తే పూర్తి ఆధారాలు లభిస్తాయని వెల్లడించారు. -
రూ.7కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడమే లక్ష్యం. పేరుకు కోళ్లు, పాల వ్యాపారం చేస్తున్నా.. లోపల మాత్రం నకిలీ నోట్లు చలామణి చేయడం. అసలు నోట్లు రూ.2లక్షలు ఇస్తే.. ఐదు రెట్లు నకిలీవి ఇస్తానని నమ్మించడం. ఆ తర్వాత నకిలీ నోట్లు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడడం. దీనినే నిత్యకృత్యంగా మార్చుకుంది ఆ ముఠా. సత్తుపల్లి పోలీసులు పన్నిన వలకు చిక్కిన ముఠా నుంచి రూ.7కోట్ల విలువైన నకిలీ నోట్లతోపాటు రెండు కార్లు స్వాధీనం చేసుకుని.. ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ శుక్రవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నకిలీ దొంగ నోట్ల ముఠా వివరాలను వెల్లడించారు. సత్తుపల్లి మండలం గౌరిగూడెంకు చెందిన షేక్ మదార్ పాలు, కోళ్ల వ్యాపారం చేస్తున్నాడు. 20 ఏళ్లుగా నకిలీ నోట్లు చలామణి చేయడం ప్రవృత్తిగా పెట్టుకుని.. అసలు నోట్లు రూ.2లక్షలు ఇస్తే.. 5 రెట్లు నకిలీ నోట్లు ఇస్తానని మధ్యవర్తుల ద్వారా అమాయక ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. తీరా వారి వద్ద డబ్బులు తీసుకున్న తర్వాత నకిలీ నోట్లు ఇవ్వకుండా.. ఎదురు తిరిగిన వారిని కత్తులు, చాకులతో బెదిరించేవాడు. భార్య మస్తాన్‌బీ, కొడుకు రమీజ్, మేనల్లుడు నౌషద్, తోట హన్మంతరావు, అఖిల్, గాయం వెంకటనారాయణ, మోడెం సాయమ్మలతో కలిసి మోసాలు చేస్తూ రూ.లక్షలు సంపాదించాడు. వీరిలో మదార్, రమీజ్ మరికొందరిపై ఇప్పటికే పలు పోలీస్స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. రూ.2వేల నోట్లే లక్ష్యంగా.. కేంద్రం త్వరలోనే రూ.2వేల నోట్లు రద్దు చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో భారీగా రూ.2వేల నకిలీ నోట్లను తెచ్చి మదార్ నిల్వ చేశాడు. తన వద్ద రూ.100కోట్లకు పైగా రూ.2వేల నోట్ల కట్టలు ఉన్నాయని, వీటిని వైట్ మనీగా మార్చాలని ప్రచారం చేసేవాడు. ఎవరైనా రూ.80కోట్లు ఇస్తే.. రూ.100కోట్లు ఇస్తానని.. తీసుకున్న వారికి రూ.20కోట్లు మిగులుతాయని ఆశ చూపించేవాడు. ఇలా అమాయకులను మోసం చేస్తూ లక్షలాది రూపాయలు రాబట్టేవాడు. ఇంట్లోనే నోట్ల తయారీ.. నకిలీ కరెన్సీ ముఠా ఇంట్లోనే నకిలీ నోట్లను తయారు చేసి చలామణి చేసేది. వీరికి అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠాతో కూడా సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రంలోని ముఠాలతో కూడా వీరికి సంబంధాలు ఉండేవి. ముఠా నాయకుడు మదార్‌పై ఖమ్మంతోపాటు సత్తుపల్లి, దమ్మపేట, కొత్తగూడెం పోలీస్స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. రద్దయిన రూ.500, రూ.వెయ్యి నోట్లతో మోసం.. ఈ ముఠా రద్దయిన నోట్లతో అనేక మోసాలకు పాల్పడేది. కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్లను ఇంకా మార్చుకునే అవకాశం ఉందని అమాయక ప్రజలను నమ్మించి రూ.లక్షలు కాజేసింది. నకిలీ బంగారు బిస్కెట్ల పేరుతో.. నకిలీ నోట్లే కాకుండా బంగారు బిస్కెట్ల పేరుతో అనేక మందిని ముఠా నాయకుడు మోసం చేశాడు. దుబాయ్, సౌదీ అరేబియాలో తనకు బంధువులు ఉన్నారని, వారి ద్వారా షిప్‌లలో బంగారం బిస్కెట్లు తెప్పిస్తానని నమ్మబలికేవాడు. ఇలా చాలా మందిని తన మాటల ద్వారా బుట్టలో పడేసేవాడు. అక్కడి నుంచి తెప్పించిన బంగారు బిస్కెట్లను తక్కువ ధరకు ఇస్తానని చెప్పి బిస్కెట్లకు బంగారు పూత పూసి.. నకిలీ గోల్డ్ బిస్కెట్లు చూపించి అనేక మంది వద్ద రూ.లక్షలు ఆర్జించాడు. ప్లాస్టిక్ కాగితపు కరెన్సీతో.. ప్లాస్టిక్ కాగితపు కరెన్సీని ఉపయోగించి అనేక మందిని మోసం చేశాడు. తాను ఏర్పాటు చేసుకున్న మధ్యవర్తుల ద్వారా వచ్చే కస్టమర్లకు తన వద్ద ఎక్కువ మొత్తంలో బ్లాక్‌మనీ ఉందని నమ్మించేవాడు. ఒక అట్ట పెట్టెను తయారు చేసి పిల్లలు ఆడుకునే, సినిమాల్లో ఉపయోగించే ప్లాస్టిక్ కాగితపు కరెన్సీ నోట్లు అంటించి పెద్ద మొత్తంలో ఉన్నాయని చూపించేవాడు. అంతేకాక టెక్నిక్‌గా వీడియో తీసి.. తాను మోసం చేయబోయే వ్యక్తులు మరింత నమ్మేందుకు వీడియో చూపించేవాడు. తన వద్ద ఉన్న నోట్లు చూడాలని ముందుగా టోకెన్ అమౌంట్ రూ.5లక్షలు చెల్లించాలంటూ వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని వివిధ రకాలుగా మోసాలకు పాల్పడేవాడు. పైన నోట్లు.. లోపల తెల్ల పేపర్లు.. పైన అసలు నోట్లు.. లోపల తెల్ల పేపర్లు పెట్టి కట్టలుగా కట్టి అనేక మందిని మోసం చేశాడు. తన వద్ద ఉన్న ఒరిజినల్ కరెన్సీ నోట్లకు అయోడిన్ పూసి అట్ట పెట్టెల్లో పెట్టి.. పైన ఒరిజినల్ నోటు పెట్టి మధ్యలో తెల్ల పేపర్లు పెట్టి కట్టలుగా తయారు చేసేవాడు. నోట్ల కట్టల నుంచి అయోడిన్‌లో ముంచిన ఒరిజినల్ నోటును తీసి దానిని హైపో ద్రావణంలో ముంచి కస్టమర్లకు చూపించేవాడు. మిగతా నోట్ల కట్టలన్నీ అలాగే ఉంటాయని నమ్మించి వారిని మోసం చేసి లక్షల్లో డబ్బులు సంపాదించాడని సీపీ వివరించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీలు మురళీధర్, పూజ, మాధవరావు, సత్తుపల్లి ఏసీపీ వెంకటేశ్, వైరా ఏసీపీ సత్యనారాయణ, సత్తుపల్లి టౌన్ సీఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.7 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నకిలీ నోట్లు చలామణీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.7 కోట్ల విలువైన నకిలీ నోట్లు, రెండు కార్లను ఖమ్మం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేసిన ట్లు సీపీ తఫ్సీర్ ఇక్బాల్ శనివారం మీడియాకు తెలిపారు. సత్తుపల్లి మండలం గౌరిగూడెం గ్రామానికి చెందిన షేక్ మదార్ గత 20 ఏళ్లు గా నకిలీ నోట్లు చలామణీ చేస్తున్నాడని, తన వద్ద నకిలీ నోట్లున్నాయని చెబుతూ, అసలు నోట్లకు 5 రెట్ల నకిలీ నోట్లు ఇస్తానని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నాడని వివరించారు. ప్రజల నుంచి డబ్బులు తీసుకున్నాక నకిలీ నోట్లు ఇవ్వకుండా మోసం చేస్తూ.. ఎదురు తిరిగితే కత్తులు, చాకులతో బెదిరించేవాడని తెలిపారు. ఈ తరహా మోసాలు చాలా కాలం గా తన భార్య మస్తాన్‌బీ, కొడుకు రమీజ్, మే నల్లుడు నౌషద్, తోట హన్మంతరావు, అఖిల్, గాయం వెంకటనారాయణ, మోడెం సాయమ్మలతో కలసి చేస్తూ అక్రమంగా సంపాదించాడని సీపీ వివరించారు. భారీగా మోసాలు రూ. 2 వేల నోట్లు రద్దవుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో మదార్ భారీగా నకిలీ 2 వేల రూపాయల నోట్లను నిల్వ చేశాడని, వాటిని బ్లాక్ మనీగా ప్రచారం చేసి వైట్ మనీగా మా ర్చే ప్రయత్నం చేసేవాడన్నారు. ఇతడికి అంతర్రాష్ట్ర ముఠాలతో కూడా సంబంధాలున్నట్లు విచారణలో వెల్లడైందని సీపీ తెలిపారు. -
ఖమ్మంలో నకిలీ కరెన్సీ ముఠా ఆరెస్ట్
-
రూ 4.6 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కశ్మీరీగేట్ మెట్రో స్టేషన్ వద్ద ఓ బ్యాగ్‌లో రూ 4.6 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) స్వాధీనం చేసుకుంది. కశ్మీరీగేట్ మెట్రో స్టేషన్ వద్ద శనివారం సాయంత్రం పెట్రోలింగ్ చేస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఓ బ్యాగ్ కంటపడగా, దాన్ని తెరిచిచూస్తే భారీ మొత్తంలో రూ 500 నోట్లతో కూడిన నకిలీ కరెన్సీని గుర్తించారు. సీఐఎస్ఎఫ్ సబ్ఇన్స్పెక్టర్ ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్ ఇన్ఛార్జ్తో పాటు సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. ఘటనా ప్రాంతాన్ని సీఐఎస్ఎఫ్ బృందం స్వాధీనంలోకి తీసుకుని బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. తదుపరి చర్యల నిమిత్తం నకిలీ కరెన్సీతో కూడిన బ్యాగ్‌ను ఢిల్లీ మెట్రో రైల్ పోలీసులకు సీఐఎస్ఎఫ్ అధికారులు అప్పగించారు. -
దొంగనోట్ల ముఠా అరెస్ట్
సాక్షి, నెల్లూరు (క్రైమ్): ఏలూరు–జంగారెడ్డిగూడెం రోడ్డు కేంద్రంగా దొంగనోట్లను ముద్రించి వాటిని చలామణి చేస్తున్న ముఠాను నెల్లూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.34.19 లక్షలు విలువైన దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ముఠా వివరాలను వెల్లడించారు. ఏలూరుకు చెందిన పి.మురళి అలియాస్ మురళీకృష్ణ పాత నేరస్తుడు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది. గతంలో దొంగనోట్లను తయారు చేసి చెలామణి చేస్తుండగా గుంటూరు జిల్లా రేపల్లె పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నెలన్నర క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన అతను తిరిగి దొంగనోట్ల తయారీకి తెరలేపాడు. కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన సంధ్యపోగు రాములు అలియాస్ ఆదాం, నెల్లూరు నగరంలోని వనంతోపుసెంటర్కు చెందిన కాకు శ్రీను అలియాస్ శ్రీనివాసులు, గుంటూరు జిల్లా తెనాలి పట్టణం రాధా టాకీస్ సెంటర్ ప్రాంతానికి చెందిన కానికిచెర్ల నరేంద్రకుమార్, తెనాలి మండలం రావూరు గ్రామానికి చెందిన కె.రవికుమార్, చుండూరు మండలం మోదుకూరి గ్రామానికి చెందిన ఆర్.విద్యాకుమార్ అలియాస్ విద్యాసాగర్, ప్రకాశం జిల్లా చీరాల పట్టణం ఈపూరుపాళేనికి చెందిన ఎ.సునీత, రాజస్థాన్ రాష్ట్రం, బాదమురు జిల్లా గడ్డాడారోడ్, జనకలై గ్రామానికి చెందిన ప్రేమదాస్‌లను కలుపుకుని ముఠాగా ఏర్పడ్డారు. వీరందరూ నేరచరిత్ర కలిగిన వారే. గది అద్దెకు తీసుకుని.. మురళీకృష్ణ తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో దొంగనోట్లను ముద్రించేందుకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, ఆర్బీఐ మార్కు కలిగిన స్టిక్కర్లను ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం ఏలూరు పట్టణంలో ఓ గదిని అద్దెకు తీసుకుని రూ.45 లక్షల దొంగనోట్లను ముద్రించాడు. వాటిని ముఠాలోని సభ్యులకు ఇచ్చాడు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని రొయ్యల వ్యాపారస్తులకు వాటిని చలామణి చేయాలని నిర్ణయించుకుని మురళీ, రాములు, కాకు శ్రీని, మౌలాలీలు ఈనెల 5వ తేదీ ఇందుకూరుపేట యార్లగడ్డ సెంటర్ వద్ద దొంగనోట్లను మార్చేందుకు యత్నించసాగారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్ నేతృత్వంలో నెల్లూరు రూరల్ సీఐ కె.రామకృష్ణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు శుక్రవారం ఏలూరులో దొంగనోట్లు ముద్రించే పరికరాలతో పాటు ముఠాలోని నరేంద్రకుమార్, విద్యాసాగర్ సునీత, ప్రేమదాస్‌లను అరెస్ట్ చేశారు. నిందితులు సుమారు నెలరోజుల వ్యవధిలో రూ.9 లక్షల దొంగనోట్లను చలామణి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వారంతా రూ.లక్షకు రూ.25 వేలు కమీషన్ చొప్పున నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే సూరత్ నుంచి ఓ వ్యాపారి రూ.200 దొంగనోట్లు రూ.4 లక్షలు కావాలని నిందితులను కోరినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కేవలం మూడురోజుల వ్యవధిలోనే దొంగనోట్ల ముఠా ఆటకట్టించిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. సంధ్యపోగు రాములు అలియాస్ ఆదాంపై అనేక జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. -
ఆపరేషన్ దొంగనోట్లు
సాక్షి, నెల్లూరు: దొంగనోట్లు చలామణి చేస్తున్న ఓ ముఠా ఆటకట్టిచారు జిల్లా పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు కేంద్రంగా పలు జిల్లాలో మోసం చేస్తున్న వీరిని జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అత్యంత చాకచక్యంగా వలపన్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.34.19 లక్షల విలువైన దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ముఠా వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితుడైన పి.మురళి అలియాస్ మురళీకృష్ణ ప్రకాశం జిల్లా కనిగిరి మండలం రాజుపాళెం వాసి. అతను కొంతకాలంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నివాసం ఉంటున్నాడు.పాతనేరస్తుడు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది. గతంలో దొంగనోట్లను తయారుచేసి చెలామణి చేస్తుండగా గుంటూరు జిల్లా రేపల్లె పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నెలన్నర క్రితం బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈక్రమంలో ఇదే తరహా నేరాలకు పాల్పడుతూ గతంలో పరిచయం ఉన్న కర్నూలు జిల్లాకు గోనెగండ్లకు చెందిన సంధ్యపోగు రాములు అలియాస్ ఆదాంను కలిశాడు. ఇద్దరూ కలిసి దొంగనోట్లను ముద్రించి చలామణి చేయాలని నిర్ణయించుకున్నారు. ఏలూరు పట్టణం శనివారంపేట జంగారెడ్డిగూడెం రోడ్డు వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, ఆర్బీఐ మార్కు కలిగిన స్టిక్కర్లను ఏర్పాటు చేసుకున్నాడు. రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 నోట్లను మొత్తం రూ.45 లక్షలకు ముద్రించారు. స్వాధీనం చేసుకున్న కంప్యూటర్, ప్రింటర్లు ముఠాగా ఏర్పడి.. మురళీకృష్ణ, రాములు తమకు పరిచయం ఉన్న కావలి రూరల్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెంది ప్రస్తుతం నెల్లూరు వనంతోపు సెంటర్లో నివాసం ఉంటున్న కాకు శ్రీను అలియాస్ శ్రీనివాసులు, కావలి వెంగళ్రావ్నగర్కు చెందిన షేక్ మౌలాలీ, గుంటూరు జిల్లా తెనాలి పట్టణం రాధా టాకీస్ ప్రాంతానికి చెందిన కె.నరేంద్రకుమార్, తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన కె.రవికుమార్, చుండూరు మండలం మోదుకూరి గ్రామానికి చెందిన ఆర్.విద్యాకుమార్ అలియాస్ విద్యాసాగర్, ప్రకాశం జిల్లా చీరాల పట్టణం ఈపూరుపాళేనికి చెందిన సునీత, రాజస్తాన్ రాష్ట్రం బాదమూరు జిల్లా జనకలై గ్రామానికి చెందిన ప్రేమదాస్లతో ముఠాను ఏర్పరచుకున్నారు. వీరందరూ నేరచరిత్ర కలిగిన వారే. కమీషన్ లెక్కన.. మురళీకృష్ణ, రాములు ముద్రించిన నోట్లను ముఠా సభ్యులకు ఒక్కొక్కరికి రూ.లక్ష, గుంటూరుకు చెందిన కాశీ అనే వ్యక్తికి రూ.3 లక్షలు ఇచ్చారు. అవి మార్చుకుని వస్తే రూ.లక్షకు రూ.25 వేలు కమీషన్ ఇస్తానని నమ్మబలికారు. దీంతో వారు దొంగనోట్లను మార్చేందుకు పలు జిల్లాలకు వెళ్లారు. నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఆక్వా వ్యాపారం జోరుగా సాగుతుందని వారివద్ద మార్చివేయచ్చని నిర్ధారించుకున్న మురళీకృష్ణ, రాములు, శ్రీను, మౌలాలీలు ఈనెల 5వ తేదీన ఇందుకూరుపేట మండలానికి వచ్చారు. ఈ విషయమై జిల్లా పోలీసు బాస్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్, నెల్లూరు రూరల్ సీఐ కె.రామకృష్ణలు తమ సిబ్బందితో కలిసి నిఘా ఉంచారు. 5వ తేదీ నిందితులు ఇందుకూరుపేట యార్లగడ్డ సెంటర్ వద్ద దొంగనోట్లను మార్చేందుకు యత్నించసాగారు. టాస్క్‌ఫోర్స్ సీఐ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు శుక్రవారం ఏలూరులో దొంగనోట్లు ముద్రించే పరికరాలతోపాటు ముఠాలోని నరేంద్రకుమార్, రవికుమార్, విద్యాసాగర్, సునీత, ప్రేమదాస్‌లను అరెస్ట్ చేశారు. నిందితులు సుమారు నెలరోజుల వ్యవధిలో రూ.9 లక్షల దొంగనోట్లను చలామణి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సూరత్ నుంచి ఓ వ్యాపారి రూ.200 దొంగనోట్లు రూ.4 లక్షలు కావాలని నిందితులను కోరినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇదిలా ఉండగా దొంగల ముఠాలో ఏ2గా ఉన్న సంధ్యపోగు రాములు అలియాస్ ఆదాంపై గుంటూరు, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 10 కేసులకు పైగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్నవి పోలీసులు నిందితుల నుంచి రూ.3,99,800 దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు ఏలూరులో దొంగనోట్లను ముద్రించేందుకు ఉపయోగించిన కంప్యూటర్ ఇతర సామగ్రిని, వస్తువులను, రూ.25 లక్షల దొంగనోట్లు, తెనాలిలో రూ.3 లక్షలు, చీరాలలోని ఈపూరుపాళెంలో రూ.2 లక్షల దొంగనోట్లను ఇలా మొత్తంగా రూ.34,19,200 స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందికి రివార్డులు కేవలం రోజుల వ్యవధిలోనే దొంగనోట్ల ముఠా గుట్టురట్టు చేసి నిందితులను అరెస్ట్ చేసేందుకు కృషిచేసిన టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్, నెల్లూరు రూరల్ సీఐ కె.రామకృష్ణ, ఎస్సైలు నరేష్, ఎస్సై సుబ్రహ్మణ్యం, శివరామకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్స్ ఎస్కే అమీన్, ఐ.ఇస్మాయిల్, పీసీలు ఎం.రమేష్, డి.వెంకటేశ్వర్లు, దేవకిరణ్, శివనారాయణ, ఇంతియాజ్‌లను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్‌కు నగదు రివార్డు అందిస్తున్న ఎస్పీ రస్తోగి -
నకిలీ నోట్ల దందా..
నకిలీ నోట్ల చలామణి మళ్లీ మొదలైంది. గతంలో ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా జరిగిన నోట్ల చలామణి ప్రస్తుతం మళ్లీ పుంజుకున్నట్లు తెలుస్తోంది. నోటును నిశితంగా పరిశీలిస్తే ఏది నకిలీ.. ఏది అసలు నోటు అనేది తేల్చుకోలేని పరిస్థితి. కొన్ని బ్యాంకులకు చెందిన ఏటీఎంల నుంచి కూడా రూ.వంద, రూ.500 నోట్లు నకిలీవి వస్తున్నట్లు పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి నకిలీ నోట్లను ఈ ప్రాంతానికి తరలించి.. కొందరు బుకీలను ఏర్పాటు చేసుకుని వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. నోట్ల కట్టల్లో వీటిని జొప్పించి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నకిలీ నోట్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఏ నోట విన్నా నకిలీ నోట్లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. నాలుగైదేళ్ల క్రితం ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలానికి చెందిన ఓ వ్యక్తి భద్రాచలం ప్రాంతానికి చెందిన మహిళ కలిసి సుమారు రూ.2కోట్ల వరకు నకిలీ నోట్ల వ్యాపారం చేస్తుండగా.. పోలీసులు పట్టుకుని వారిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే పోలీసులకు నకిలీ నోట్ల వ్యాపారం ఉమ్మడి జిల్లాలో భారీగా నడుస్తుందనే విషయం కూడా తెలిసింది. ముఖ్యంగా సత్తుపల్లి, పక్కనే ఉన్న ఏపీ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, కొత్తగూడెం, భద్రాచలానికి చెందిన పలువురు ముఠాగా ఏర్పడి.. నకిలీ నోట్ల దందా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. అప్పట్లో పోలీసుల హడావుడి ఎక్కువగా ఉండడంతో కొద్దిమేరకు వారి వ్యాపారం తగ్గించినా.. ఇటీవలి కాలంలో మళ్లీ పుంజుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సత్తుపల్లి, భద్రాచలం ప్రాంతాల్లో పలు పోలీస్స్టేషన్లలో సైతం నకిలీ నోట్ల చలామణిపై కేసులు నమోదయ్యాయి. 60–40 పర్సంటేజీ.. నకిలీ నోట్ల వ్యాపారంలో ముఖ్యంగా 60–40 పర్సంటేజీ విధానంలో వ్యాపారం సాగుతున్నట్లు తెలిసింది. ఉదా.. నకిలీ నోట్ల వ్యాపారం చేసే వ్యక్తికి రూ.40వేలు ఇస్తే.. వారికి నకిలీ నోట్లు సరఫరా చేసే వ్యక్తి తిరిగి రూ.లక్ష నకిలీ నోట్లు ఇస్తాడు. ఈ మేరకు వారు ఆ నోట్లను అసలైన నోట్ల మధ్యలో పెట్టి చలామణి చేస్తారు. దీనికి సంబంధించి కొందరు బుకీలను సైతం ఏర్పాటు చేసుకుని.. నోట్లను ఎవరికీ అనుమానం రాకుండా దర్జాగా చలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ నుంచి సరఫరా.. కోల్‌కతా సరిహద్దు బంగ్లాదేశ్ వద్ద గల సిలిగురి ప్రాంతం నుంచి నకిలీ నోట్లు దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నకిలీ నోట్లను సరఫరా చేసుకోవడం కోసం కొందరు ముఠాగా ఏర్పడి.. సిలిగురి వెళ్లి అక్కడి నుంచి రైళ్లు, బస్సులు, అవసరమైతే లారీల్లో కూడా సూట్‌కేసులలో దుస్తుల కింద అమర్చి నకిలీ నోట్లను తీసుకొస్తున్నట్లు సమాచారం. నోట్లలో ఎక్కువగా రూ.100, రూ.500 నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటీఎంలలోకి ఎలా వస్తున్నాయి? ఇటీవలి కాలంలో నేరుగా నకిలీ నోట్లు ఏటీఎంలలో కూడా వస్తుండడంతో ఖాతాదారులు బెంబేలెత్తుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఏటీఎంలలో నకిలీ నోట్లు రావడానికి బ్యాంకు సిబ్బందికి.. నకిలీ నోట్ల ముఠాకు సంబంధం ఉండడం.. లేదా ఏటీఎంలలో డబ్బులు పెట్టే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ వారితో సంబంధాలు ఉండి ఉండవచ్చనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పోలీసుల నిఘా తగ్గడంతో మళ్లీ ఉమ్మడి జిల్లాలో నకిలీ నోట్ల వ్యాపారం ఊపందుకుంది. వాస్తవానికి నకిలీ నోట్ల వ్యవహారానికి సంబంధించి సీఐడీ అధికారులు కేసులను దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అయితే వారెక్కడా అందుబాటులో లేకపోవడంతో స్థానిక పోలీసులు కేసులను దర్యాప్తు చేస్తుంటారు. వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి నకిలీ నోట్ల చలామణికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు, బ్యాంకు ఖాతాదారులు కోరుతున్నారు. దుకాణంలో తేలింది.. సతీష్(పేరు మార్చాం) నగరంలోని ఏటీఎంలోకి వెళ్లి రూ.వెయ్యి డ్రా చేశాడు. రూ.500 నోటుతోపాటు రూ.100 నోట్లు ఐదు వచ్చాయి. వాటిలో నుంచి వంద నోట్లు మూడు తీసి సరుకులు కొనుగోలు చేశాడు. సతీష్ ఇచ్చిన నోట్లలో ఒక నోటును షాపు యజమాని మళ్లీ సరుకు కొనుగోలు చేసిన వ్యక్తికే ఇచ్చాడు. ఇదేమిటంటే.. అది నకిలీ నోటు అని తేల్చి చెప్పాడు. దీంతో బిత్తరపోయిన సతీష్.. ఇప్పుడే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేశానని షాపు యజమానితో వాదనకు దిగాడు. దీంతో షాపు యజమాని అసలు నోటు, నకిలీ నోటుకు తేడా చూపించడంతో సతీష్ నోరెళ్లబెట్టాడు. అయితే ఏటీఎంకు సంబంధించిన బ్యాంకుకు సతీష్ వెళ్లి విచారణ చేయగా.. మాకు సంబంధం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేయండి అంటూ బ్యాంకు సిబ్బంది సలహా ఇచ్చారు. చేసేది లేక సతీష్ ఇంటిదారి పట్టాడు. నకిలీ’ని అరికట్టాలి.. నకిలీ నోట్ల చలామణిని అరికట్టేందుకు పోలీసు లు, బ్యాంకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో నకిలీ నోట్లు ఎక్కువగా వస్తున్నాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ఈ నోట్లను చలామణి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాసరావు, ప్రైవేట్ లెక్చరర్ ‘100’కు సమాచారం ఇవ్వాలి.. ఖాతాదారులకు ఏటీఎం ద్వారా నకిలీ నోట్లు వస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. అక్కడ పట్టించుకోకపోతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. డ్రా చేసిన రశీదును దగ్గర పెట్టుకోవాలి. నకిలీ నోట్లు నంబర్‌ను స్కాన్ చేసినప్పుడు తెలిసిపోతుంది. నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు తెలిస్తే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. – వెంకట్రావు, ఖమ్మం ఏసీపీ -
పాత నోట్లు మార్చే ముఠా గుట్టురట్టు
సాక్షి, విశాఖపట్నం: పాత నోట్లు ఇస్తే, ఆ మొత్తానికి మూడు రెట్లు రెట్టింపు ఇస్తామంటూ ఆశ చూపి మోసానికి పాల్పడుతున్న నకిలీ నోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రద్దయిన పాత నోట్లను మార్చే ఈ ముఠా సభ్యుల నుంచి 500, 1000 రూపాయల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే..ఓ వాహనంలో తరలిస్తున్న కోటి 57 వేల విలువైన పాత కరెన్సీతో పాటు, 17 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నిందితుల నుంచి నకిలీ కారు నెంబర్ ప్లేట్లు, వాకీ టాకీలు, డమ్మీ తుపాకీలు, పోలీస్ పేరుతో ఉన్న నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా మాట్లాడుతూ ...ఈ ముఠా సభ్యులు పాత నోట్ల కోసం డమ్మీ తుపాకీలు, వాకీ టాకీలు, పోలీస్ స్టిక్కర్లతో బెదిరింపులకు పాల్పడేవారని తెలిపారు. నకిలీ, పాత నోట్ల చెలామణిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే విశాఖలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్డి సారించామని ఎస్పీ తెలిపారు. -
వీటిలో ఏ ఒక్కటి లేకున్నా అది దొంగనోటే..
సాక్షి, హైదరాబాద్ : నకిలీ నోట్ల చలామణీ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. వీటిని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అత్యున్నత ప్రమాణాల్లో కరెన్సీని ముద్రిస్తోంది. అయినప్పటికీ దొంగ నోట్లు మార్కెట్లో చలామణీ అవుతూనే ఉన్నాయి. మార్కెట్లో విచ్చలవిడిగా దొంగనోట్లు చెలామణీ అవుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే దొంగనోట్లను నివారించడానికి ఆర్బీఐ 2016లోనే పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులోని 17 అంశాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా అది దొంగనోటేననే నిర్ధారణకు రావొచ్చు. ఆర్బీఐ ప్రకారం నోట్లలోని ప్రధాన గుర్తులను తెలుసుకుంటే ఏది అసలు.. ఏది నకిలీ అని తేలిపోతుంది. రూ.2000, రూ.500, రూ.200, రూ.100 కరరెస్సీ నోట్లలో గుర్తించాల్సిన అంశాలను పరిశీలిస్తే.. రూ.2వేలు నోటు ముందు 1. లైటు వెలుతురులో రూ.2000 అంకెను గమనించవచ్చు. 2. 45 డిగ్రీల కోణంలో చూస్తే రూ.2000 అంకెను గమనించొచ్చు. 3. దేవనాగరి లిపిలో రూ.2000 సంఖ్య ఉంటుంది 4. మధ్య భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది 5. చిన్న అక్షరాల్లో ఆర్బీఐ, 2000 అని ఉంటుంది 6. నోటును కొంచెం వంచితే విండోడ్ సెక్యూరిటీ త్రెడ్ ఆకుపచ్చ నుంచి నీలానికి మారుతుంది. మధ్యలో భారత్, ఆర్బీఐ, రూ.2000 అంకె ఉంటుంది. 7. గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మార్పు 8. మహాత్మాగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్ (2000) వాటర్ మార్క్ ఉంటుంది 9. పైభాగంలో ఎడమ వైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలతో కూడిన నంబర్ సైజ్ ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది. 10. కుడి వైపున కింది భాగంలో రంగు మారే ఇంక్ (ఆకుపచ్చ నుంచి నీలం)లో రూపాయి సింబల్‌తో పాటు 2000 సంఖ్య ఉంటుంది 11. కుడివైపున అశోక స్తూపం చిహ్నం ఉంటుంది. అంధుల కోసం..మహాత్మాగాంధీ బొమ్మ, అశోక స్తూపం చిహ్నం, బ్లీడ్ లైన్స్, గుర్తింపు చిహ్నం చెక్కినట్లుగా లేదా ఉబ్బెత్తుగా ఉంటాయి. 12. కుడి వైపున దీర్ఘ చతురస్రాకారంలో ఉబ్బెత్తుగా 2000 అని ముద్రించి ఉంటుంది. 13. కుడి,ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముద్రించిన ఏడు బ్లీడ్ లైన్స్ ఉంటాయి. వెనుక వైపు 14. నోటు ముద్రణ సంవత్సరం ఎడమవైపున ఉంటుంది. 15. నినాదంతో సహా స్వచ్ఛభారత్ లోగో ఉంటుంది 16. మధ్య భాగంలో భాషల ప్యానల్ ఉంటుంది 17. మంగళయాన్ చిత్రం ఉంటుంది. -
ఆడి కారు కోసం... ఇంట్లోనే డబ్బులు ప్రింట్ చేసి..
బెర్లిన్: ప్రతి ఒక్కరు తమ జీవితంలో సొంత ఇల్లు, కారు, పొలాలు ఇలా ఏదో ఒకటి సంపాదించాలని కోరుకుంటారు. అందుకోసం ఎంతో కష్టపడి, రూపాయి.. రూపాయి కూడబెట్టి వాటిని సంపాదించుకుంటారు. మరికొందరు అడ్డదారులు తొక్కుతుంటారు. అది వేరే విషయం. కానీ ఇంకో రకం మనుషులు ఉంటారు.. వారిని చూస్తే అమాయకులా.. అతి తెలివి తేటలు ఉన్నవారా అనే విషయం అంత సులువుగా అర్థం కాదు. ఇలాంటి సంఘటనే ఒకటి జర్మనీలో చోటు చేసుకుంది. ఓ 20 ఏళ్ల యువతి తనకు ఎంతో ఇష్టమైన ఆడి కారును కొనాలని భావించింది. దాని కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15వేల యూరోలు(రూ. 11లక్షల 57వేలు) ఫేక్ కరెన్సీ ముద్రించింది. నకిలీ నోట్లను గుర్తుపట్టిన షోరూం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానికంగా ఉండే కైసర్స్లేటర్న్ కారు షోరూంకు వెళ్లిన యువతి అక్కడి సిబ్బందితో మాట్లాడి తనకు కావాల్సిన ఆడి ఏ3 2013 మోడల్‌ను ఎంచుకుంది. అనంతరం కారు తాలూకు డబ్బులు చెల్లించేందుకు బిల్ కౌంటర్‌కు వెళ్లిందామె. అక్కడ 15వేల యూరోల ఫేక్ కరెన్సీ తీసి చెల్లించబోయింది. చూడగానే నకిలీ నోట్లు అని గుర్తు పట్టేలా ఉన్న ఆ కరెన్సీని చూసిన కౌంటర్ సిబ్బందికి నోటమాట రాలేదు. తేరకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సిబ్బంది. షోరూం వద్దకు వచ్చిన పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను విచారించగా కరెన్సీని తన ఇంట్లోనే ముద్రించినట్లు తెలిపింది. దాంతో ఆమె ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు ఇంక్జెట్ ప్రింటర్ దొరికింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకున్నారు. -
బెజవాడలో మళ్లీ నకిలీ కరెన్సీ కలకలం
సాక్షి, విజయవాడ : బెజవాడలో మరోసారి నకిలీ కరెన్సీ కలకలం రేపుతోంది. చిరు వ్యాపారులనే టార్గెట్‌గా చేసుకొని నకిలీ కరెన్సీ ముఠా దొంగనోట్లను ప్రజల్లోకి చలామణి చేస్తోంది. రెండు రోజుల క్రితం ఈ ముఠాలోని ఇద్దరిని అదుపులోకి తీసుకుని మూడు లక్షల రూపాయల విలువ చేసే దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. దొంగనోట్ల ముఠా కృష్ణా జిల్లా మచిలీపట్నం చిన్నాపురానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల వ్యవధిలోనే దొంగనోట్ల ముఠాలోని మరో ఇద్దరిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.13 లక్షల ఇరవై ఎనిమిది వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో వంద, ఐదు వందల, రెండు వేల రూపాయల నకిలీ నోట్లు ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో నలుగురు ముఠా సభ్యులు ఉన్నారు. అయితే అసలు ముఠా సూత్రధారుల కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. నకిలీ నోట్ల వ్యవహారంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని.. ఎవరిపైన అయినా అనుమానం వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ సూచించారు. దొంగనోట్ల చలామణీని పూర్తిస్థాయిలో అరికడతామని.. నకిలీ నోట్ల ముఠా కోసం నగరంలో ప్రత్యేక టీంలు తిరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. -
రూ. 7.5 కోట్ల నకిలీ కరెన్సీ; నలుగురి అరెస్టు
ఖాట్మండు : దావూద్ ఇబ్రహీం అనుచరుడు యూనస్ అన్సారీని నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి దగ్గర నుంచి దాదాపు ఏడున్నర కోట్ల రూపాయల భారత నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అన్సారీతో పాటు ముగ్గురు పాకిస్తాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఇస్లామిక్ స్టేట్ కోసం పనిచేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే అక్రమ దందాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. భారత ఇంటలెజిన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అతడిని ఖాట్మండూ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా నేపాల్ మాజీ మంత్రి సలీం అన్సారీ, ఆయన కుమారుడైన యూనస్ అన్సారీకి అండర్‌వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐఎస్ ఉగ్రవాదులతో కూడా యూనస్‌కు పరిచయం ఏర్పడింది. వారితో చేతులు కలిపిన యూనస్ ఐఎస్ ఫండింగ్ కోసం భారత నకిలీ కరెన్సీని మారుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శనివారం నకిలీ కరెన్సీని తీసుకువస్తున్న ముగ్గురు పాకిస్తానీయులను రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం గురించి లోతుగా విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. -
‘విశ్వాస’ ఘాతుకం
న్యూఢిల్లీ: దాయాది దేశాల ప్రజల్లో పరస్పరం విశ్వాసం నెలకొల్పాలన్న సదుద్దేశంతో వాస్తవాధీన రేఖ వెంబడి వాణిజ్యానికి భారత్ ఇచ్చిన అవకాశాన్ని ఉగ్రవాదులు దుర్వినియోగం చేస్తున్నారు. వాస్తవాధీన రేఖకు ఇరువైపుల ఉన్న భారత వ్యతిరేక శక్తులు(హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అక్రమ వ్యాపార లావాదేవీలతో విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ సొమ్ము నంతా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఉగ్రవాద మూకలకు అందిస్తున్నాయి. ఆ సొమ్ముతో ఉగ్రవాదులు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సేకరించి భారత్‌పై దాడులకు పాల్పడుతున్నాయి. అంతేకాకుండా ఈ దారి గుండా మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ కూడా భారత దేశంలోకి పెద్ద ఎత్తున వచ్చి పడుతోంది. ఈ విషయం గుర్తించిన భారత దేశం సరిహద్దు వాణిజ్యాన్ని నిషేధించింది. పకడ్బందీగా.... సరిహద్దు ఆవల నుంచి వివిధ పదార్ధాలు, వస్తువులను ఈ మార్గం గుండా భారత దేశానికి రవాణా చేస్తారు. ఆ సమయంలో సరుకు అసలు ధర కంటే బాగా తక్కువ ధరను ఇన్వాయిస్లో చూపిస్తారు. మన దేశంలో వ్యాపారులు ఆ సరుకులను మార్కెట్ ధరకు అమ్మి అత్యధిక లాభాలు సంపాదిస్తున్నారు. ఇలా వచ్చిన అధిక లాభాలను ఉగ్రవాదులకు అందజేస్తున్నారు. ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలతో సంబంధాలు ఉన్న వారు సరిహద్దుకు ఇరువైపుల వ్యాపారాల పేరుతో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని భద్రతా దళ అధికారులు చెబుతున్నారు. వీరే కాకుండా సరిహద్దు దాటి పాక్‌లో ప్రవేశించి అక్కడి ఉగ్ర సంస్థల్లో చేరిన భారతీయులు కొందరు మన దేశంలో ఉన్న వారి బంధు, మిత్రులతో వ్యాపార సంస్థలు పెట్టించి వారి ద్వారా కూడా ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నారని వారు వివరించారు. ఈ దారి గుండా జమ్ము,కశ్మీర్లోకి చేరిన మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ, ఆయుధాలు ఇక్కడి ఉగ్రవాద, వేర్పాటు వాదులకు అందుతున్నాయని, ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతున్నాయని వారు తెలిపారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్న ఆరోపణపై అరెస్టు చేసిన జహూ అహ్మద్ వతాలి అనే వ్యాపారి ఎల్వోసీ ట్రేడర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడని తేలింది. జహూకు చెందిన కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. 12 మందిని అరెస్టు చేశారు. వేల కోట్ల వాణిజ్యం భారత ప్రభుత్వం 2008లో వాస్తవాధీన రేఖ వెంబడి రెండు చోట్ల వాణిజ్యానికి అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి ఈ దారిలో రూ. 6,900 కోట్ల లావాదేవీలు జరిగాయి. మన దేశం నుంచి అరటిపళ్లు, ఎంబ్రాయిడరీ వస్తువులు, చింతపండు, ఎర్రమిర్చి వంటివి ఎగుమతి అవుతోంటే, కాలిఫోర్నియా బాదంపప్పు, ఎండు ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, మామిడి వంటివి దిగుమతి అవుతున్నాయి. 21 రకాల వస్తువులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో కాలిఫోర్నియా బాదం పప్పు వల్లే వ్యాపారులు అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ మార్గంలో అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, పరిస్థితిని సమీక్షించి వాణిజ్యాన్ని మళ్లీ అనుమతించాలా వద్దా అన్నది నిర్ణయిస్తామని అధికారులు చెప్పారు. -
పాక్‌తో సరిహద్దు వాణిజ్యం రద్దు
న్యూఢిల్లీ / శ్రీనగర్: భారత్–పాకిస్తాన్ల మధ్య జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట జరుగుతున్న వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. మామిడికాయలు, ఎండు మిరప, మూలికలు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, కాలిఫోర్నియా ఆల్మండ్ సహా 21 ఉత్పత్తుల కొనుగోలు–అమ్మకాలను రద్దుచేస్తున్నట్లు వెల్లడించింది. వాణిజ్యం ముసుగులో ఉగ్రమూకలకు ఆయుధాలు, డ్రగ్స్, ధనసహాయం అందడంతో పాటు నకిలీ నోట్లు భారత్‌లోకి వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తాజా నిర్ణయంతో 280 వ్యాపారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. -
పాక్‌లో మన కరెన్సీ ప్రింటింగ్!
భారత ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే ఉద్దేశంతో భారీగా నకిలీ కరెన్సీని ముద్రించి, దేశంలోకి పంపుతున్న పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ.. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రెస్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెలలో హైదరాబాద్‌లోని పాతబస్తీలో దొరికిన కరెన్సీ అక్కడే ముద్రితమై బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమబెంగాల్‌కు వచ్చినట్లు భావిస్తున్నారు. పాక్‌లోని బలూచిస్తాన్ లో ఉన్న క్వెట్టాలో ప్రత్యేకంగా ‘భారత్ పవర్ ప్రెస్’ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ ముద్రితమైన నకిలీ నోట్లు అసలు వాటిని తలదన్నేలా ఉన్నా.. అసలు నోట్లపై ఉండే కొన్ని భద్రతా ప్రమాణాలను మాత్రం ఐఎస్ఐ కాపీ చేయలేకపోయింది. – సాక్షి, హైదరాబాద్ రూటు మార్చి భారత్‌కు.. క్వెట్టాలో ముద్రితమవుతున్న ఈ నకిలీ కరెన్సీ తొలుత ఆ దేశ రాజధాని కరాచీకి చేరుతోంది. అక్కడ నుంచి ఐఎస్ఐ ప్రత్యేక పార్సిల్స్ ద్వారా పలు మార్గాల్లో భారత్‌కు వస్తోంది. ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి విమానాల ద్వారా దుబాయ్/సౌదీ అరేబియాలకు తరలించే వారు. అక్కడున్న ఏజెంట్ల సహకారంతో జలమార్గంలో ఓడల ద్వారా గుజరాత్, మహారాష్ట్రల్లోని వివిధ ఓడ రేవులకు చేర్చేవారు. చిత్తుకాగితాలు, ముడిసరుకుల పేరుతో వచ్చేవి. కొన్నాళ్లుగా ఈ మా ర్గం ద్వారా తీసుకురావడం కష్టంగా మారడంతో ఐఎస్ఐ రూటు మార్చింది. కరాచీ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్‌కు చేరవేస్తోంది. అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు తీసుకొచ్చి ఏజెంట్ల ద్వారా చెలామణీ చేయిస్తోంది. క్వాలిటీతో పాటే పెరిగిన కమీషన్ కరాచీ నుంచి మాల్దా వరకు వివిధ దశల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ఐఎస్ఐ వారికి కమీషన్లు చెల్లిస్తోంది. హైదరాబాద్‌కు చేరే నకిలీ కరెన్సీ మార్పిడి రేటు 1:3గా ఉండేది. అంటే రూ.30 వేలు అసలు నోట్లు ఇస్తే ఏజెంట్లు రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చే వారు. ఇటీవల ఏజెంట్లకు ఇచ్చే ఈ కమీషన్ పెరిగింది. నోట్లను పక్కాగా ముద్రిస్తున్న నేపథ్యంలో కమీషన్ పెంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల చిక్కిన కరెన్సీని పాతబస్తీకి చెందిన గౌస్‌కు, మాల్దాకు చెందిన బబ్లూ రూ.50 వేల అసలు కరెన్సీకి రూ.లక్ష నకిలీ నోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా వచ్చే నిధులను పాకిస్తాన్ పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలు ఉన్నాయి. చిక్కిన గౌస్.. పరారీలో బబ్లూ.. బండ్లగూడకు చెందిన మహ్మద్ గౌస్ పండ్ల వ్యాపారి. 1991లో పోలీసులకు బాంబులతో పట్టుబడటంతో బాంబ్ గౌస్‌గా మారాడు. ఇతడిపై పోలీసులు ఉగ్రవాద చర్యల వ్యతిరేక చట్టం (టాడా) కూడా ప్రయోగించారు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు 2011 నుంచి నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్ నుంచి పలు మార్గాల్లో హైదరాబాద్‌కు తెప్పించి చెలామణీ చేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా మాల్దాలో ఉన్న కృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన అమీనుల్ రెహ్మాన్ అలియాస్ బబ్లూతో పరిచయం ఏర్పడింది. ఇతడికి రూ.40 వేలు చొప్పున చెల్లిస్తూ రూ.లక్ష నకిలీ కరెన్సీ తెప్పించి చెలామణి చేసేశాడు. బబ్లూ గౌస్‌తో పాటు అనేక మందికి సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు. బబ్లూ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ మూడు గమనించుకోవాలి.. 1. సెక్యూరిటీ థ్రెడ్ కరెన్సీ నోటుకు ముందు వైపు మధ్యలో కుడివైపుగా నోటు విలువ అంకెల్లో ముద్రితమై ఉంటుంది. దీనికి కుడివైపున నోటు లోపలకు, బయటకు కనిపిస్తూ చిన్న పట్టీ ఉంటుంది. సిల్వర్ బ్రోమైడ్తో తయారయ్యే దీనిపై ఆర్బీఐ అంటూ ఆంగ్లం, హిందీ భాషల్లో చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది. ఇది నీలం, ఆకుపచ్చ రంగుల్లో మెరుస్తూ ఉంటుంది. నకిలీ కరెన్సీపై ఆర్బీఐ మార్క్ ఉన్నా.. ఈ థ్రెడ్ సిల్వర్ కోటెడ్ అయి ఉండి, ఆకుపచ్చ రంగు మాత్రమే ఉంటుంది. 2. బ్లీడ్ లైన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించే రూ.2 వేల కరెన్సీ నోటుకు కుడి, ఎడమ వైపుల్లో పైభాగంలో కొన్ని గీతలు ఉంటాయి. బ్లీడ్ లైన్స్‌గా పిలిచే ఇవి కాస్త ఎత్తుగా, ఒక్కో వైపు ఏడు చొప్పున ఉంటాయి. సాధారణ నోటును చేతితో తడిమితే ఇవి తగులుతాయి. నకిలీ నోట్లలో ఈ ఫీచర్‌ను కాపీ చేయడం సాధ్యం కాదు. నకిలీ నోట్లపై కూడా లైన్లు ఉన్నా అవి చేతికి తగిలేలా పైకి ఉండవు. 3. వాటర్ మార్క్ కరెన్సీ నోటుకు ముందు భాగంలో కుడి వైపు ఖాళీ ప్రదేశం ఉంటుంది. పైకి కనిపించని విధంగా గాంధీ బొమ్మ ఉంటుంది. దీనికి పక్కగా ఆ నోటు విలువ వేసి ఉంటుంది. ఈ వాటర్ మార్కును వెలుతురులో పెట్టిచూస్తే అందులోనూ గాంధీజీ ఫొటో కనిపిస్తుంటుంది. దాదాపు సగం ప్రాంతానికి సరిపోతూ ఉంటుంది. నకిలీ నోట్లలోనూ ఈ వాటర్‌మార్క్‌లో గాంధీజీ ఫొటో ఉన్నా.. దాని చుట్టూ ఖాళీ ఎక్కువగా ఉంటుంది. -
యూట్యూబ్‌లో చూసి దొంగనోట్ల ముద్రణ
-
యూట్యూబ్‌లో చూసి దొంగనోట్ల ముద్రణ
చెన్నై : అప్పులు భారం నుంచి తప్పించుకోవడానికి దొంగ నోట్ల ముద్రణ ప్రారంభించిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. మారియప్ప నగర్‌కు చెందిన భరణి కుమారి ఎంబీఏ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. కుంటుంబ ఇబ్బందుల కారణంగా ఇరుగు పొరుగు వారి వద్ద అప్పులు చేసింది. కానీ వాటిని తీర్చలేకపోయింది. భరణి కుమారికి అప్పు ఇచ్చిన వారు తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఏం చేయాలో దిక్కు తోచని భరణి కుమారి యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్ల ముద్రణ నేర్చుకుంది. ఆ తరువాత ఇంట్లోనే దాదాపు రూ. లక్ష విలువ చేసే నకిలీ నోట్లను ముద్రించింది. వాటిని సమీపంలోని కడలూరులో మారుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం కడలూరులోని ఓ దుకాణానికి వెళ్లి సామాన్లు కొన్న భరణి నకిలీ రెండు వేల రూపాయల నోటును ఇచ్చింది. అనుమానం వచ్చిన దుకాణం యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుల రాకను గమనించిన భరణి సమీపంలోని బస్టాండ్‌కు వెళ్లి చిదంబరం వెళ్లే బస్సు ఎక్కి కూర్చుంది. పోలీసులు బస్టాండ్ అంతా వెతికి బస్సులో ఉన్న భరణి కుమారిని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. అప్పుల భారం నుంచి తప్పించుకోవడానికే నకిలీ నోట్ల ముద్రణ ప్రారంభించినట్లు భరణి పోలీసుల విచారణలో వెల్లడించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఇంటి నుంచి నకిలీ రెండు వేల రూపాయల నోట్లు, ప్రింటర్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేక్ కరెన్సీ ఫ్రమ్ పశ్చిమ బెంగాల్!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ప్రాంతం నుంచి నకిలీ కరెన్సీని తీసుకువచ్చి హైదరాబాద్‌లో చెలామణి చేయడానికి యత్నించిన అంతర్రాష్ట్ర ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఒక బెంగాలీ సహా ఇద్దరిని అరెస్టు చేశామని, వీరి నుంచి రూ.3.98 లక్షలు విలువ గల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని నగర కొత్వాల్ అంజనీకుమార్ వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్‌తో కలసి తన కార్యాలయంలో విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. ఈ కరెన్సీ బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నామని అన్నారు. గౌస్ దందానే నకిలీ కరెన్సీ.. చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలోని బండ్లగూడకు చెందిన మహ్మద్ గౌస్ వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి. 1991లో పోలీసులకు బాంబులతో పట్టుబడటంతో బాంబ్ గౌస్‌గా మారాడు. ఇతడిపై పోలీసులు ఉగ్రవాద చర్యల వ్యతిరేక చట్టం (టాడా) కూడా ప్రయోగించారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం 2011 నుంచి నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనేకమంది ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఇతడు అక్కడ నుంచి నకిలీ కరెన్సీని వివిధ మార్గాల్లో నగరానికి రప్పించి చలామణి చేసేవాడు. అలా వచ్చిన మొత్తం నుంచి ఏజెంట్ల వాటాను వారికి పంపేవాడు. ఈ తరహాలో దందా చేస్తూ ఇప్పటికే మోండా మార్కెట్, గోపాలపురం, కంచన్‌బాగ్, గోపాలపురం, శాలిబండ, కాలాపత్తర్, భవానీనగర్, చాంద్రాయణగుట్ట, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, చార్మినార్, విజయవాడ, విశాఖపట్నం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇప్పటివరకు సిటీలో 13 సార్లు, బయట 2 సార్లు నకిలీ కరెన్సీ కేసుల్లో చిక్కాడు. జైలు నుంచి వచ్చిన నెల్లోనే.. జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన ప్రతిసారీ పోలీసు నిఘా నుంచి తప్పించుకోవడానికి తన చిరునామా మార్చేసే గౌస్ ప్రస్తుతం తలాబ్‌కట్ట మహ్మద్‌నగర్‌లో నివసిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో తన కుటుంబీకులతోనూ కలసి నకిలీ కరెన్సీ మార్పిడి చేసే ఇతగాడికి పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా మాల్దాలో ఉన్న కృష్ణాపూర్‌కు చెందిన అమీనుల్ రెహ్మాన్ అలియాస్ బబ్లూతో పరిచయం ఏర్పడింది. ఇతడికి రూ.40 వేలు చొప్పున చెల్లిస్తూ రూ.లక్ష నకిలీ కరెన్సీ తెప్పించి చెలామణి చేసేవాడు. 2016 సెప్టెంబర్‌లో సిటీ పోలీసులకు చిక్కిన గౌస్ గత నెల 12న విడుదలయ్యాడు. ఖాళీగా ఉండకుండా వెంటనే తన దందా మొదలెట్టాలని ప్రయత్నించాడు. రెండేళ్లకు పైగా జైల్లో ఉండటంతో ఇతడి వద్ద బబ్లూ కాంటాక్ట్ మిస్ అయింది. దీంతో విశాఖ జైల్లో ఉన్న తన పరిచయస్తుడు సిరాజ్ షేక్‌ను గత నెల 19న ములాఖత్‌లో కలిశాడు. అతడి నుంచి గౌస్ నంబర్ తీసుకుని సంప్రదించి నకిలీ కరెన్సీ సరఫరా చేయమని కోరాడు. రూ.4 లక్షల విలువైన కొత్త రూ.2,000 నోట్లు పంపడానికి అతడు అంగీకరించడంతో అది మార్పిడి చేసి రూ.1.6 లక్షలు తిరిగి ఇస్తానని ప్రతిపాదించాడు. స్నేహితుడికి ఇచ్చి సిటీకి సరఫరా.. దీనికి అంగీకరించిన బబ్లూ రూ.2,000 డినామినేషన్లో ఉన్న రూ.4 లక్షల నకిలీ కరెన్సీని గౌస్‌కు పంపాలని నిర్ణయించుకున్నాడు. తనకు పరిచయస్తుడైన మాల్దా వాసి రబీబుల్ షేక్‌కు ఈ మొత్తాన్ని ఇచ్చిన బబ్లూ వారిని రైలులో హైదరాబాద్‌కు పంపాడు. షేక్ గతంలోనూ సిటీలో నకిలీ కరెన్సీ రవాణా చేసి 2015లో ఫలక్‌నుమా పోలీసులకు చిక్కాడు. అప్పట్లో ఇతడు మైనర్ కావడం గమనార్హం. ఇతడికి సిటీపై పట్టు ఉండటంతోనే బబ్లూ ఆ మొత్తాన్ని ఇతడికి ఇచ్చి పంపాడు. ఇతడికి గౌస్ ఫోన్ నంబర్ ఇచ్చిన బబ్లూ నగరానికి చేరుకున్నాక సంప్రదించి నగదు అందించమని చెప్పాడు. దీంతో అతగాడు శుక్రవారం సిటీకి చేరుకుని గౌస్‌ను సంప్రదించాడు. అతడు చెప్పిన ప్రకారం చాంద్రాయణగుట్ట ప్రాంతంలో నకిలీ కరెన్సీ అందించాడు. ఆ మొత్తం నుంచి రూ.2 వేలను ఓ పండ్ల వ్యాపారి వద్ద మార్పిడి చేసిన గౌస్ నగదు క్వాలిటీపై సంతృప్తి చెందాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్ఐలు ఎన్.శ్రీశైలం, కేఎన్ ప్రసాద్ వర్మ, మహ్మద్ తఖ్రుద్దీన్, వి.నరేందర్ తమ బృందాలతో వలపన్ని ఇద్దరినీ అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.98 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకుని కేసును చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. ఇంతటి హైక్వాలిటీతో, సామాన్యులు గుర్తుపట్టలేని విధంగా ఉన్న కరెన్సీ చిక్కడం డీమానిటైజేషన్ తర్వాత ఇదేతొలిసారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. -
తెలంగాణలో దొంగనోట్ల ముఠా గుట్టురట్టు
సాక్షి, కృష్ణాజిల్లా: తెలంగాణలో దొంగనోట్ల ముద్రిస్తున్న ముఠా గుట్టును కృష్ణాజిల్లా పోలీసులు రట్టు చేశారు. రెండు రోజుల కిందట ఆర్టీసీ బస్సులో కండక్టర్‌కు రవి అనే వ్యక్తి నకిలీ నోటు ఇచ్చి.. చెలామణి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, నకిలీ నోటును గుర్తించిన కండక్టర్.. ప్రయాణికుల సాయంతో నిందితుడిని పట్టుకొని.. స్థానికంగా ఉన్న కంచికచర్ల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైనశైలిలో విచారించడంతో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడ సమీపంలోని మునగాలలో ఓ ఇంట్లో దొంగ నోట్లు ముద్రిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. గుట్టుచప్పుడు కాకుండా దొంగనోట్లను ముద్రిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి స్కానర్ , ప్రింటర్లు, రూపాయలు విలువచేసే 47వేల దొంగనోట్లను కంచికచర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సరిహద్దులో నకిలీ కరెన్సీ.. ఒకరు అరెస్ట్
కోల్‌కతా : బీఎస్ఎఫ్ అధికారులు సరిహద్దులో భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మాల్దాలో సబ్దల్ పూర్లోని సరిహద్దు చెక్ పోస్టు వద్ద 24వ బెటాలియన్ బీఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి రూ.4,76,000 లక్షల విలువైన నకిలీ కరెన్సీని సీజ్ చేశారు. బీఎస్ఎఫ్ అధికారులు నిందితుడిని పశ్చిమబెంగాల్ పోలీసులకు అప్పగించారు. -
రూ.79 లక్షల నకిలీ నోట్ల పట్టివేత
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద శనివారం రూ.79 లక్షల నకిలీ కరెన్సీ పట్టుబడింది. గోదావరిఖని ఏసీపీ రక్షిత కె మూర్తి కథనం.. ఎన్నికల సందర్భంగా ఎస్ఎస్టీ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న షేఖ్ మస్తాన్ బ్యాగ్‌ను తనిఖీ చేశారు. 24 కట్టల్లో రూ.79 లక్షలు ఉన్నాయి. ‘పైనా.. కిందా అసలు నోట్లు పెట్టారు. మిగతాదంతా నకిలీ కరెన్సీ. ఇందులో కేవలం రూ. 24 వేలు మాత్రమే ఒరిజినల్ నోట్లు’ అని ఏసీపీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడిపర్తి మండలం పిండుపాకకు చెందిన షేఖ్ మస్తాన్, వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన పొడిశెట్టి కృష్ణమూర్తి, భూపాలపల్లి జిల్లాకు చెందిన ఆకుల శంకర్లు ఈ నకిలీ కరెన్సీని తరలిస్తున్నారని తెలి పారు. డబ్బు దేనికోసం తరలిస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నట్లు వివరించారు. -
కొత్త మోసం : ఎంటర్టైన్మెంట్ బ్యాంక్ కరెన్సీతో టోకరా
చండీగఢ్ : అవినీతి నిర్మూలన, నకిలీ నోట్ల కట్టడి అంటూ మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి.. జనాలను ముప్ప తిప్పలు పెట్టిన వైనాన్ని ఇప్పటికి మర్చిపోలేదు. పెద్ద నోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం కొత్త రంగుల్లో నూతన కరెన్సీని విడుదల చేసింది. పాపం ఈ కొత్త రంగుల కరెన్సీ వల్ల ఓ బంగారం షాపు యజమాని దాదాపు రెండు లక్షల రూపాయల వరకూ మోసపోయాడు. మోసగాళ్లు ఎంటర్టైన్మెంట్ బ్యాంక్ పేరుతో సొంత కరెన్సీని ప్రింట్ వేసి.. ఈ ఘరానా మోసానికి పాల్పడ్డారు. మోసపోయిన బాధితుడు ఇక నేను జీవితంలో కోలుకోలేను అంటూ విలపిస్తున్నాడు. వివరాలు.. శ్యామ్ సుందర్ వర్మ అనే వ్యక్తికి లుధియానాలో జ్యూవెలరి షాప్ ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఓ జంట బంగారం కొనాలని శ్యామ్ సుందర్ షాప్‌కి వచ్చింది. దాదాపు 56 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేశారు. దీని విలువ దాదాపు 1. 90 లక్షల రూపాయల వరకూ ఉంటుందని తెలిసింది. బంగారం కొన్న అనంతరం సదరు జంట మాకు చాలా అర్జెంట్ పని ఉందంటూ ఓ నోట్ల కట్టను ఇచ్చేసే అక్కడి నుంచి హాడవుడిగా బయటపడ్డారు. అనంతరం శ్యామ్ సుందర్ వారు ఇచ్చిన నోట్లను పరిశీలించగా అవి నకిలీ నోట్లుగా తేలింది. సదరు జంట 500 రూపాయల నోట్ల కట్టను ఇచ్చారు. అవి చూడ్డానికి ఒరిజినల్ 500 రూపాయల నోట్ల రంగులోనే ఉన్నాయి. కానీ రిజర్వ్ బ్యాంక్ అని ఉండాల్సిన చోట మాత్రం ఎంటర్టైన్మెంట్ బ్యాంక్ అని ఉందని బాధితుడు తెలిపాడు. వచ్చిన వాళ్లు తనకు నకిలీ నోట్లు ఇచ్చారని అర్థం చేసుకున్న శ్యామ్ సుందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి తనకు ఏళ్లు పట్టిందని.. ఈ నష్టాన్ని పూడ్చడం తనకు సాధ్యం కాదంటూ వాపోయాడు. -
ప్రగతి నివేదన సభ: నకిలీ కరెన్సీ కలకలం
సాక్షి, హైదరాబాద్: ప్రగతి నివేదన సభ కోసం చేపట్టిన ర్యాలీలో నకిలీ కరెన్సీ కలకలం సృష్టించింది. ఆదివారం ఉప్పల్, రామంతాపూర్ స్థానిక కార్పోరేటర్ గంధం జ్యోత్స్ననాగేశ్వరరావు ఆధ్యర్యంలో జరిగిన ర్యాలీలో టీఆర్ఎస్ నాయకులు నకిలీ కరెన్సీని వెదజల్లారు. దీంతో అక్కడున్న కార్యకర్తలు, జనాలు అసలు నోట్లనుకుని ఏరుకునేందుకు పోటీపడ్డారు. తీరా అవి నకిలీ నోట్లని తెలియడంతో నిరాశకు లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాయకులు వెదజల్లిన నకిలీ నోట్లు -
నకిలీ కరెన్సీ ఎక్కువగా దొరికింది అక్కడే..!
న్యూఢిల్లీ : నకిలీ కరెన్సీ నిర్మూలించడానికి, అవినీతిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నోట్ల రద్దు అనంతరం దర్యాప్తు సంస్థలు పెద్ద ఎత్తున్న నకిలీ కరెన్సీని పట్టుకున్నాయి. అయితే అత్యధిక నకిలీ కరెన్సీని గుజరాత్‌లోనే సీజ్ చేసినట్టు కేంద్రం నేడు లోక్‌సభకు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.13.87 కోట్లకు పైగా నకిలీ కరెన్సీని సీజ్ చేస్తే, వాటిలో ఎక్కువగా గుజరాత్లో రూ.5.94 కోట్లను సీజ్ చేసినట్టు వెల్లడించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ)లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం హోం వ్యవహారాల సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారం అహిర్ ఈ విషయాన్ని లోక్‌సభలో వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్ 9 నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ బోర్డర్లతో పాటు, రాష్ట్రాల్లో మొత్తం రూ.13.87 కోట్ల విలువైన కరెన్సీ నోట్లను(ఎఫ్ఐసీఎన్) సీజ్ చేశామని చెప్పారు. దీనిలో అత్యధికంగా గుజరాత్లో రూ.5.94 కోట్లను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. గుజరాత్ అనంతరం ఉత్తరప్రదేశ్‌లో రూ.2.19 కోట్లను, పశ్చిమ బెంగాల్లో రూ.2 కోట్లను, మిజోరాంలో కోటి రూపాయలను సీజ్ చేసినట్టు చెప్పారు. నకిలీ కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకొస్తున్నట్టు అనుమానం ఉన్న వారిపై కేంద్ర, రాష్ట్రాల ఇంటెలిజెన్స్, సెక్యురిటీ ఏజెన్సీలు నిఘా ఉంచాయని, వారిపై చర్యలు కూడా తీసుకున్నాయని మంత్రి తెలిపారు. నకిలీ కరెన్సీని సృష్టించడం, స్మగ్లింగ్ చేయడం, చలామణిలోకి తీసుకురావడం చట్టవిరుద్ధ చర్యలు (నివారణ) చట్టం, 1967 కింద ఉగ్రవాద కార్యకలాపాల కిందకు వస్తాయి. -
నగరంలో నకిలీ నోట్ల గ్యాంగ్ హల్చల్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో నకిలీ నోట్ల గ్యాంగ్ హల్చల్ చేసింది. యూఎస్ డాలర్లు మారుస్తామంటూ పాతబస్తీకి చెందిన జాఫర్ నుంచి రూ.20లక్షలు తీసుకొని ఓ ముఠా ఉడాయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. 30వేల యూఎస్ డాలర్లు కావాలని పాతబస్తీకి చెందిన జాఫర్‌తో అహమ్మద్ గ్యాంగ్ 20లక్షలకు బేరం కుదుర్చుకుంది. గచ్చిబౌలిలో జాఫర్ లక్షరూపాయల యూఎస్ డాలర్లను మార్చాడు. కాగా మరో 20లక్షలు కావాలంటూ జాఫర్‌ను ఔటర్ రింగ్ రోడ్‌కు పిలిపించారు.అక్కడి చేరుకున్న జాఫర్‌పై తుపాకీ గురి పెట్టి నకిలీ యూఎస్ డాలర్లు ఇచ్చి ఈ గ్యాంగ్ కారులో పరారైంది. బాధితుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
ఆ ‘నకిలీ నోట్ల’ వెనుక భారీ కుట్ర
సాక్షి, సిటీబ్యూరో: విశాఖపట్నం రైల్వే స్టేషన్లో దాదాపు మూడేళ్ల క్రితం చిక్కిన హైక్వాలిటీ నకిలీ కరెన్సీ నోట్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీని ద్వారా హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం దృష్టికి అనేక కీలకాంశాలు తీసుకువెళ్లారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రుస్తుం, సద్దాం హోసేన్పై అభియోగాలు మోపిన ఎన్ఐఏ.. వీరి ఏజెంట్ల వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలిపింది. ఈ నకిలీ నోట్ల సరఫరా వెనుక భారీ కుట్ర ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంలో భాగమని పేర్కొంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు 2015లో విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఈ గ్యాంగ్ గుట్టును రట్టు చేశారు. రూ.5.01 లక్షల కరెన్సీతో వెళ్తున్న సద్దాం హోసేన్‌ను పట్టుకున్నారు. ఈ కేసు డీఆర్ఐ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకు (ఎన్ఐఏ) వచ్చింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న కీలక నిందితుడు రుస్తుంను రెండున్నరేళ్ల పాటు వేటాడిన ఎన్ఐఏ హైదరాబాద్ యూనిట్ ఎట్టకేలకు గత ఏప్రిల్‌లో పట్టుకుంది. రుస్తుం డీమానిటైజేషన్‌కు ముందు వరకు బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి వచ్చిపడిన నకిలీ కరెన్సీని చాలా కాలం వరకు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా సహా అనేక జిల్లాలకు చెందిన ముఠాలు ఆయా ప్రాంతాల కేంద్రంగా రిసీవ్ చేసుకుని దేశ వ్యాప్తంగా సరఫరా చేస్తుండే వాడు. ఆ సరిహద్దుపై నిఘా ముమ్మరం కావడం, సరిహద్దు భద్రతా దళం చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో 2015 నుంచి అంతర్జాతీయ ముఠాలు తమ పంథాను మార్చాయి. బంగ్లాదేశ్‌తో ఉమ్మడి సరిహద్దులు కలిగి ఉన్న మరో రాష్ట్రమైన అసోం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో నిఘా ముమ్మరం చేయడంతోనే సద్దాం హోసేన్ వ్యవహారంపై ఉప్పంది 2015 సెప్టెంబర్‌లో విశాఖపట్నంలో అరెస్టు చేశారు. అసోంలోని మణిక్పూర్కు చెందిన హోసేన్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఇతడికి అదే రాష్ట్రంలోని దుబ్రీ జిల్లాకు చెందిన రుస్తుంతో పరిచయమైంది. ఒక్కోసారి ఒక్కో ఫోన్ నెంబర్ వినియోగించి హోసేన్తో సంప్రదింపులు జరిపిన రుస్తుం చివరకు తాను అందించే ఓ ప్యాకెట్‌ను బెంగళూరుకు చేరిస్తే రూ.10 వేల కమీషన్ ఇస్తానంటూ వల వేశాడు. డబ్బుకు ఆశపడిన హోసేన్ అందుకు అంగీకరిచడంతో న్యూ ఫరాఖా రైల్వేస్టేషన్లో అమ్రుల్ ద్వారా ఓ ప్యాకెట్ అందించాడు. అందులో నకిలీ కరెన్సీ ఉన్నాయని, గౌహతి–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరు వెళ్లాలని ఆదేశించాడు. అక్కడికి చేరుకున్నాక తనకు ఫోన్ చేస్తే, ఎక్కడ, ఎవరికి ఇవ్వాలనేది చెప్తానంటూ రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చాడు. రైలులో బెంగళూరు బయలుదేరిన హోసేన్ విశాఖపట్నంలో డీఆర్ఐ అధికారులకు చిక్కాడు. ఇతడి నుంచి డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న 803 కరెన్సీ నోట్ల విలువ రూ.5.01 లక్షలుగా తేల్చారు. రుస్తుం అసోంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతను ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుని భారీ ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు డీఆర్ఐ ఆధారాలు సేకరించింది. ఈ రాకెట్‌ను ఛేదించాలంటే రుస్తుంను పట్టుకోవడం అనివార్యం కావడంతో ప్రత్యేక బృందాలను రంగంలోకిదింపింది. అయితే కేసుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా కేంద్ర హోంశాఖ దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేసింది. రంగంలోకి దిగిన హైదరాబాద్ యూనిట్ ముమ్మరంగా గాలింపు చేపట్టి గత ఏప్రిల్‌లో అతడిని పట్టుకున్నారు. వీరిద్దరి వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించడంతో వారిపై దృష్టిపెట్టారు. ఈ విషయాలను ఎన్ఐఏ అధికారులు మంగళవారం దాఖలు చేసిన చార్జ్‌షీట్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. -
నకిలీ నోట్ల ముఠా అరెస్టు
బూర్జ : మండలంలో సంచలనం సృష్టించిన నకిలీ నోట్ల కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి ఒడిశాకు చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు విజయనగరానికి జిల్లా వాసులు! స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఈ విషయాలను వెల్లడించారు. ఈ నెల 12న తోటవాడ గ్రామంలో హోమియో ఆస్పత్రి అటెండర్ ఆరిక అప్పారావు రూ.3.50లక్షలను పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేశారు. ఆ నగదును బ్రాంచ్ పోస్టుమాస్టర్ తిరుపతిరావు ఉపాధి వేతనదారులకు చెల్లించారు. కొంతమందికి ఇచ్చిన నోట్లలో నకిలీవి ఉన్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆమదాలవలస సీఐ ఆదాం, ఎస్ఐ జనార్దనరావు, బూర్జ పోలీసులు 10 రోజులుగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారని భీమారావు తెలిపారు. ఒడిశా గజపతి జిల్లాలోని గయిబ గ్రామానికి చెందిన స్పరిగ నాయక్ ప్రధాన నిందితుడని వెల్లడించారు. అతడికి సీతంపేట మండలానికి చెందిన సవర చిన్నారావు, సవర చోడంగి, లచ్చన్న, ఎస్.చిన్నారావుతో పాటు విజయనగరం జిల్లా గుర్ల మండలం జమ్ము గ్రామానికి చెందిన జమ్ము రాజు, గరివిడి సమీపంలోని కోడూరు గ్రామానికి చెందిన కసుమంచి శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడిందన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి కలర్ ప్రింటర్, కట్టర్, కంప్యూటర్, ఏ4 ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ల సాయంతో నకిలీ రూ.100 నోట్లు తయారు చేస్తుంటారని వివరించారు. వీటిని శ్రీకాకుళం, విజయనగరం సంతల్లో, బ్యాంకుల వద్ద నిరక్షరాస్యులకు ఇచ్చి మోసగిస్తుంటారని పేర్కొన్నారు. పెద్ద నోట్లు ప్రింట్ చేస్తే అనుమానం వస్తుందనే నకిలీ రూ.100 నోట్లను తయారు చేస్తున్నారని తెలిపారు. సీతంపేటకు చెందిన సవర లచ్చన్న.. అదే గ్రామానికి చెందిన అటెండర్ ఆరిక అప్పారావు వద్ద ఇల్లును రూ.5.10 లక్షలకు కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకున్నాడని తెలిపారు. లచ్చన్న తన సహచరుల వద్ద ఉన్న 840 నకిలీ వంద నోట్లలో 152 నోట్లు అప్పారావుకి ఇచ్చిన నగదులో జత చేశారన్నారు. ఆ నగదులో కొంత పోస్టాఫీసులో డిపాజిట్ చేశాడన్నారు. పోస్టుమాస్టర్ తిరుపతిరావు, అటెండర్ అప్పారావు నిర్ధోషులుగా గుర్తించామని డీఎస్పీ స్పష్టం చేశారు. వీరిని అరెస్టు చేసి శ్రీకాకుళం అంపోలు సబ్ జైలుకు తరలించారు. -
ఉపాధి కూలీలకు నకిలీ నోట్లు పంపిణీ
బూర్జ : శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తోటవాడ గ్రామంలో ఉపాధి జకూలీలకు పంపిణీ చేసిన నోట్లలో నకిలీ నోట్లు వెలుగుచూశాయి. వేతనదారులకు తోటవాడ పోస్టుమాస్టర్ తిరుపతిరావు బుధవారం వేతనాలు పంపిణీ చేశారు. వీటిలో సుమారు రూ.15 వేల మేరకు నకిలీ రూ.వంద నోట్లు ఉన్నట్లు కొంతమంది గుర్తించి సర్పంచ్ గేదెల ప్రసాద్‌కు చూపించారు. సర్పంచ్ పోస్టుమాస్టర్‌ని పిలిపించి ప్రశ్నించగా తోటవాడ హోమియో ఆస్పత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్న అప్పారావు మంగళవారం రూ.3.50 లక్షలు డిపాజిట్ చేశారని.. ఆ నోట్లనే తాను కూలీలకు పంపిణీ చేశానని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, పోస్టుమాస్టర్ తిరుపతిరావు, అటెండర్ అప్పారావును బూర్జ పోలీసులు అదుపులోకి తీసుకొని సీఐ సమక్షంలో విచారిస్తున్నారు. నకిలీ నోట్ల వ్యవహారంలో మరో వ్యక్తి హస్తం ఉన్నట్లు అప్పారావు తెలియజేయటంతో సంబంధిత వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. -
నకిలీ చలా‘మనీ’!
సాక్షి, సిటీబ్యూరో : పాత కరెన్సీ పెద్ద నోట్లను రద్దు చేస్తే జన బాహుళ్యంలో ఉన్న దొంగనోట్ల బెడద తప్పుతుందని భావిస్తే.. నకిలీగాళ్లు మాత్రం ‘కొత్త’గా చెలరేగిపోతున్నారు. ప్రభుత్వం సరికొత్త కరెన్సీ నోట్లను అమల్లోకి తెచ్చాక కూడా రాజధాని నగరంలో ఫేక్ కరెన్సీ ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతోంది. డీమానిటైజేషన్ అమలులోకి వచ్చిన 2016లో నకిలీ నోట్ల చలామణిపై 88 కేసులు నమోదు కాగా, గతేడాది 76 కేసులు, ఈ ఏడాది మే వరకు 34 కేసులు సీసీఎస్‌లో నమోదయ్యాయి. ఫేక్ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం ప్రత్యేక దృష్టి సారించింది. నకిలీ నోట్లకు సంబంధించిన ప్రతి ఉదంతాన్నీ హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా బ్యాంకులను ఆదేశించింది. దేశ భద్రతతో ముడిపడిన అంశం కావడంతో ప్రతి కేసుకూ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కచ్చితంగా ఫిర్యాదు చేయాల్సిందే.. వినియోగదారుల నుంచి బ్యాంకులకు కొన్ని నకిలీ నోట్లు రావడం ఎప్పటి నుంచో ఉంది. కేవలం ఒకటిరెండు నోట్లు వస్తే ఒకప్పుడు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే ఆర్బీఐ గతేడాది కీలక ఆదేశాలు జారీ చేసింది. నకిలీ నోట్లు వెలుగులోకి వచ్చిన ప్రతి ఉదంతం పైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేసింది. రాజధానిలో బయటపడే కరెన్సీకి సంబంధించి కేసుల నమోదు, దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్ పోలీసులు చేపడుతున్నారు. దీంతో బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని కచ్చితంగా పోలీసుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తున్న సీసీఎస్ అధికారులు.. బ్యాంకునకు వచ్చిన వినియోగదారుడి వద్ద ఒక లావాదేవీలో నాలుగు అంతకంటే తక్కువ నకీలీ కరెన్సీ నోట్లు వస్తే దాన్ని నాన్–ఎఫ్ఐఆర్ కేసుగా, ఐదు అంతకంటే ఎక్కువ నోట్లు వస్తే ఎఫ్ఐఆర్ కేసుగా పరిగణిస్తున్నారు. బ్యాంకులు గుర్తించకుండా, అసలు వాటికి చేరకుండా చెలామణిలో ఉంటున్న ఫేక్ కరెన్సీ.. గుర్తించిన దానికంటే కొన్ని రెట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. క్వాలిటీ బాగుంటే ‘యూఏపీఏ’ కింద ఆర్బీఐ సహా వివిధ బ్యాంకులు తమ ఫిర్యాదుతో పాటు గుర్తించిన నకిలీ నోట్లను సైతం తీసుకువచ్చి సీసీఎస్ అధికారులకు అప్పగిస్తాయి. నాన్ ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్.. వీటిలో ఏ తరహా కేసు అయినప్పటికీ పోలీసుల ప్రాథమికంగా ఆ నకిలీ నోట్లను మైసూర్‌లోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు పంపిస్తారు. నోట్లను అక్కడి నిపుణులు పరీక్షించి నకిలీ కరెన్సీ క్వాలిటీ నిర్దేశిస్తూ నివేదిక ఇస్తారు. నకిలీ నోట్లు హై క్వాలిటీతో ఉన్నట్లు నివేదిక వస్తే సీసీఎస్ పోలీసులు అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) ను సైతం జోడిస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టు ఉత్తర్వులకు లోబడి సీసీఎస్ పోలీసులు ఆయా నకిలీ నోట్లను ధ్వంసం చేయడానికి ఆర్బీఐకే అప్పగిస్తున్నారు. ఈ నకిలీ కరెన్సీలో రూ.2 వేల డినామినేషన్లో ఉన్నవే ఎక్కువగా ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ‘చెస్ట్’ కేసుల్లో దర్యాప్తు కష్టమే.. సీసీఎస్ అధికారులకు బ్యాంకులతో పాటు ఆర్బీఐ నుంచీ ఈ నకిలీ కరెన్సీపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఓ వినియోగదారుడు చేసిన లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదుల కేసుల్లో పురోగతి ఉంటోంది. ఆ వ్యక్తిని పిలిచి వాంగ్మూలం నమోదు చేస్తున్న పోలీసులు.. మరికాస్త ముందుకు వెళ్లి కూపీ లాగుతున్నారు. ఇలా బ్యాంకు స్థాయిలో గుర్తించలేని నకిలీ కరెన్సీని ఆయా బ్యాంకులకు చెందిన చెస్ట్‌లకు పంపినప్పుడు అక్కడి సిబ్బంది గుర్తిస్తున్నారు. ఇక్కడా సాధ్యం కాకుంటే ఆర్బీఐ అధికారులు గుర్తిస్తున్నారు. అయితే సదరు కరెన్సీ ఏ బ్యాంకు శాఖ నుంచి వచ్చిందో బ్యాంకు చెస్ట్ నుంచి వచ్చిందో ఆర్బీఐ చెస్ట్ అధికారులు చెప్పగలుగుతున్నారు. ఇంతకు మించి మరే వివరాలు దొరకడం లేదు. ఫలితంగా దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఇలాంటి కేసుల్లో మూతపడుతున్నవే ఎక్కువగా ఉంటున్నాయి. (చెస్ట్ అంటే.. ఒక బ్యాంకు చెందిన అన్ని శాఖల నుంచి వచ్చిన నగదు నిల్వ కేంద్రం. ఇక్కడి నుంచే కొత్త నోట్లు ఆయా శాఖలకు సరఫరా చేస్తారు) సీసీఎస్ గణాంకాల ప్రకారం ఫేక్ కరెన్సీపై నమోదైన కేసులు ఇవీ.. ఏడాది ఎఫ్ఐఆర్ నాన్– ఎఫ్ఐఆర్ గుర్తించిన నోట్లు 2016 9 79 70,823 2017 4 72 22,867 2018 (మే) 3 31 17,740 -
రెండున్నరేళ్ల తర్వాత చిక్కిన సద్దాం హుసైన్
సాక్షి, హైదరాబాద్: అస్సాం కేంద్రంగా సాగిన నకిలీ కరెన్సీ రాకెట్లో కీలక పాత్రధారిగా ఉన్న పశ్చిమ బెంగాల్ వాసి సద్దాం హుసైన్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఈ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు 2015లో విశాఖపట్నం రైల్వేస్టేషన్లో రట్టు చేశారు. రూ.5,01,500 కరెన్సీతో వెళుతున్న హోసేన్‌ను పట్టుకున్నారు. అతని సహచరుడైన సద్దాం హుసైన్ అప్పటి నుంచీ వాంటెడ్‌గా మారాడు. ఈ కేసు డీఆర్ఐ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి వచ్చింది. రెండున్నరేళ్ల పాటు వేటాడిన ఎన్ఐఏ హైదరాబాద్ యూనిట్ ఎట్టకేలకు సద్దాం హుసైన్‌ను బుధవారం బెంగళూరులో పట్టుకుంది. నిందితుడిని అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై గురువారం విజయవాడకు తరలించింది. అస్సాం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రుస్తుం ఈ రాకెట్ సూత్రధారి. కాగా హుసైన్ నుంచి రూ.26 వేల నకిలీ కరెన్సీ, రెండు రద్దైన రూ.1,000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి తీసుకోవాలని ఎన్ఐఏ అధికారులు నిర్ణయించారు. -
పూలదుకాణం మాటున దొంగనోట్ల వ్యాపారం
బొబ్బిలి : బొబ్బిలి పట్టణంలో కలకలం రేపిన దొంగనోట్ల వ్యాపారుల ముఠాకు రాజకీయ అండదండలున్నాయా? పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులను వదిలేయాలని పోలీసులపై స్థానిక నాయకులు ఒత్తిళ్లు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణంలోని మద్యం దుకాణాల్లో ఇటీవల కాలంలో దొంగనోట్ల చలామణీ జోరుగా సాగుతోంది. తరచూ మద్యం దుకాణాలు, ఇతర హోల్‌సేల్ దుకాణాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఇటీవల దీనిపై పోలీసులు నిఘా పెంచి దొంగనోట్లను చలామణీ చేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మద్యం దుకాణాలు, ఇతర రద్దీగా ఉన్న హోల్‌సేల్ మార్కెట్లలోనే ఈ తతంగం గుట్టుచప్పుడుగా జరుగుతున్నట్టు గుర్తించారు. బొబ్బిలిలోని తాండ్రపాపారాయ జంక్షన్లో పూల దుకాణం నిర్వహిస్తున్న తిరుపతిరావును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతనికి సహాయకుడిగా దుకాణంలో పనిచేస్తున్న షేక్‌పీర్, మరో వ్యక్తి తౌడులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. షేక్ పీర్ పట్టణంలోని పేదలుండే ఇందిరమ్మ కాలనీలో నివసిస్తూ అక్కడే దొంగనోట్లను భద్రపరచి చలామణి చేస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే వీరిని పట్టుకున్న తరువాత బొబ్బిలి దాడితల్లి అమ్మవారి పండగ జరుగడం, పోలీసులకు విశ్రాంతి లేకపోవడం వంటి కారణాలతో పట్టుకున్న నిందితులను అరెస్టు ప్రకటించలేదని సమాచారం. విచారణలో వివిధ అంశాల పరిశోధనపై కూడా మరికాస్త సమయం అవసరమున్న నేపథ్యంలో డీఎస్పీ పి.సౌమ్యలత ఆదేశాలను సీఐ మోహనరావు, ఎస్సైలు వి.ప్రసాదరావు, బి.రవీంద్రరాజులు పాటిస్తున్నట్టు భోగట్టా. కొత్త నోట్లు వచ్చిన కొత్తలోనే..? కొత్త నోట్లు చలామణీకి వచ్చి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్న సమయంలోనే దొంగనోట్లను సిద్ధం చేసే సిద్ధహస్తులు బొబ్బిలిలోనే ఉన్నారా? లేక వీరి వెనుక ఇంకెవరయినా ఉన్నారా అన్నది ఇప్పడు పోలీసుల ముందున్న ప్రశ్న. దీనికి సమాధానం వెతికే పనిలో పోలీసులు తలమునకలై ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు అధికంగా ఉన్న బొబ్బిలిని దొంగనోట్ల చలామణికి అక్రమార్కులు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు..? పోలీసుల అదుపులో ఉన్నవారిని విడిపించేందుకు, కేసులు మాఫీ చేసేందుకు స్థానిక అధికార పార్టీ నేతలు పోలీసు అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రధాన నిందితుడు తిరుపతిని కేసులోంచి బయటపడేసేందుకు ముగ్గురు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నట్టు భోగట్టా. అయితే, పోలీసులు ఒత్తిళ్లను ఖాతరు చేయడం లేదని, దొంగనోట్ల చలామణిని ప్రోత్సహిస్తారా అంటూ సదరు నేతలను తిరిగి ప్రశ్నించినట్టు తెలిసింది. కేసులో మూలాలను వెతకడంలో భాగంగా పొరుగు జిల్లాలైన శ్రీకాకుళంలోని రాజాం, విశాఖపట్నంలకు వెళ్లినట్టు సమాచారం. -
బొబ్బిలిలో నకిలీ నోట్ల చెలామణి..
బొబ్బిలి: బొబ్బిలిలో ఒక్కసారిగా నకిలీనోట్ల కలకలం రేగింది. ప్రశాంతంగా ఉండే పట్టణంలో నకిలీనోట్ల చలామణి జరుగుతున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఈ రకం నోట్ల చలామణిపై అపోహలున్నా పోలీసులకు ఫిర్యాదు చేసేంత వరకూ వెళ్లలేదు. ఇటీవల కాలంలో మద్యం షాపులకు వరుసగా ఈ దొంగనోట్లు రావడంతో వారు ఆందోళన చెందారు. హడావిడిగా జరిగే వ్యాపార కార్యకలాపాల్లో కొంతమంది నకిలీ నోట్లు ఇస్తూ మోసానికి పాల్పడుతున్నట్లు సమాచారం. రామాటాకీస్ సెంటర్లో ఉన్న మద్యం దుకాణానికి ఇలానే దొంగనోట్లు వస్తున్నా వ్యాపారులు గుర్తించలేకపోయారు. అయితే ఈ వ్యవహారం సోమవారం బయట పడింది. మద్యం దుకాణాన్ని తెరవగానే ఓ నిందితుడు నకిలీ నోటుతో మద్యం కొనుగోలు చేయడానికి ప్రయత్నించగా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. అయితే గొల్లపల్లికి చెందిన ఓ వ్యక్తితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నకిలీనోట్లను చలామణీ చేస్తున్నదెవరు..?. ఈ క్రమంలో వారి వెనుక బలమయిన శక్తులున్నాయా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పోలీసులు నిందితుల వద్ద నుంచి భారీగానే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారన్న వార్త పట్టణంలో హల్చల్ చేస్తోంది. ఈ తతంగంపై పోలీసులు పెదవి విప్పితేనే అసలు విషయం బయటకు వస్తుంది. -
భారీగా పెరిగిన నకిలీ కరెన్సీ, కారణమిదే
న్యూఢిల్లీ : డిమానిటైజేషన్.. నకిలీ కరెన్సీ నిర్మూలనకు 2016లో ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న హఠాత్తు నిర్ణయం. దీంతో నకిలీ కరెన్సీ ఆట కట్టించవచ్చంటూ చెప్పుకొచ్చారు. కానీ పరిస్థితి దీనికి తలకిందులైంది. నోట్ బ్యాన్ భారీ ఎత్తున నకిలీ కరెన్సీకి దారితీసింది. నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల వద్దకు భారీ ఎత్తున్న నకిలీ కరెన్సీ చేరినట్టు తాజా రిపోర్టులు తెలిపాయి. అంతేకాక అనుమానిత లావాదేవీల్లో 480 శాతం జంప్ అయినట్టు గుర్తించినట్టు పేర్కొన్నాయి. ఇవన్నీ పెద్ద నోట్ల రద్దు తర్వాతే ఎక్కువగా చోటు చేసుకున్నట్టు రిపోర్టులు తెలిపాయి. ప్రైవేట్, పబ్లిక్, కోఆపరేటివ్ రంగాలు, ఇతర ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లు.. 400 శాతం ఎక్కువ అనుమానిత లావాదేవీల రిపోర్టులను(ఎస్టీఆర్) జనరేట్ చేశాయని రిపోర్టులు వెల్లడించాయి. మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ కోసం చేపట్టిన అనుమానిత లావాదేవీలను ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ పరిశీలిస్తోంది. ఇది నివేదించిన రిపోర్టులో బ్యాంకింగ్, ఇతర ఎకనామిక్ ఛానళ్లలో నకిలీ కరెన్సీ లావాదేవీలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 3.22 లక్షల సందర్భాలలో పెరిగినట్టు తెలిసింది. నకిలీ కరెన్సీ రిపోర్టులు(సీసీఆర్లు) 2015-16లో 4.10 లక్షలకు పైగా ఉంటే, 2016-17లో 7.33 లక్షలకు పైగా పెరిగినట్టు రిపోర్టు పేర్కొంది. సీసీఆర్ అనేవి ‘లావాదేవీ ఆధారిత రిపోర్టులు’.. వీటిని కేవలం నకిలీ ఇండియన్ కరెన్సీ నోట్లు గుర్తించినప్పుడు రికార్డు చేస్తారు. అయితే నకిలీ కరెన్సీ విలువను ఎంత ఉందని మాత్రం రిపోర్టు వెల్లడించలేదు. అనుమానిత లావాదేవీల రిపోర్టులు కూడా 2015-16తో పోలిస్తే నాలుగు సార్లకు పైగా పెరిగి 4,73,006గా నమోదయ్యాయి. డిమానిటైజేషన్తోనే ఈ రిపోర్టుల సంఖ్య మరింత పెరిగినట్టు తాజా రిపోర్టులు తెలిపాయి. ఎప్పడికప్పుడు అన్ని బ్యాంకులు, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లు ఎస్టీఆర్లను రికార్డు చేసి, యాంటీ-మనీ లాండరింగ్ లా కింద వాటిని ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు పంపిస్తుంటారు. -
ఏడు కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ పట్టివేత
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నకిలీ కరెన్సీ రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. తాజాగా బుధవారం బెలగవిలో పోలీసుల తనిఖీల్లో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడింది. ఈ సందర్భంగా ఏడు కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేశారు. కాగా వచ్చేనెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆయా పార్టీలు రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. ఈ అంచనాలకు ఊతమిస్తూ మంగళవారం అక్రమంగా భారీగా నగదును తరలిస్తూ పలువురు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఒక ప్రైవేటు బస్సులో వంద కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
రుస్తుం.. రెండున్నరేళ్లు!
సాక్షి, హైదరాబాద్: అసోం కేంద్రంగా సాగిన నకిలీ కరెన్సీ రాకెట్లో కీలక సూత్రధారిగా ఉన్న పశ్చిమ బెంగాల్ వాసి రుస్తుం ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఈ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు 2015లో రట్టు చేశారు. రూ.5 లక్షల కరెన్సీతో వెళ్తున్న సద్దాం హోసేన్‌ను విశాఖపట్నం రైల్వేస్టేషన్లో పట్టుకున్నారు. అప్పటి నుంచి రుస్తుం వాంటెడ్‌గా మారాడు. ఈ కేసు డీఆర్ఐ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు వచ్చింది. రెండున్నరేళ్ల పాటు వేటాడిన ఎన్ఐఏ హైదరాబాద్ యూనిట్ ఎట్టకేలకు రుస్తుంను మంగళవారం పట్టుకుంది. అసోం నుంచి ఇతర ప్రాంతాలకు.. నోట్ల రద్దు ముందు వరకు బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి వచ్చిన నకిలీ కరెన్సీని పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా సహా అనేక జిల్లాలకు చెందిన ముఠాలు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తుండేవి. ఇక్కడ నిఘా ముమ్మరం కావడంతో అంతర్జాతీయ ముఠాలు పంథా మార్చాయి. బంగ్లాదేశ్‌తో సరిహద్దు కలిగిన మరో రాష్ట్రం అసోం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో డీఆర్ఐ నిఘా ముమ్మరం చేయడంతో సద్దాం హోసేన్ వ్యవహారంపై ఉప్పందింది. 2015 సెప్టెంబర్‌లో విశాఖలో అతడిని అరెస్టు చేశారు. కమీషన్ పేరిట వల.. అసోంలోని మణిక్పూర్కు చెందిన హోసేన్ పదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. నిరుద్యోగిగా ఉన్న ఇతడికి పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లాకు చెందిన రుస్తుంతో పరిచయమైంది. ఫోన్ ద్వారా హోసేన్తో సంప్రదింపులు జరిపిన రుస్తుం.. తాను అందించే ఓ ప్యాకెట్‌ను బెంగళూరుకు చేరిస్తే రూ.10 వేల కమీషన్ ఇస్తానని వల వేశాడు. డబ్బుకు ఆశపడిన హోసేన్‌కు న్యూఫరాఖా రైల్వేస్టేషన్లో అమ్రుల్ ద్వారా ఓ ప్యాకెట్ అందించాడు. అందులో నకిలీ కరెన్సీ ఉందని, గువాహటి–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరు వెళ్లాలని ఆదేశించాడు. కరెన్సీని బెంగళూరులో ఎవరికి అందించాలనే విషయాన్ని హోసేన్‌కు చెప్పని రస్తుం.. అక్కడికి చేరుకున్నాక తనకు ఫోన్ చేయాలని, అప్పుడు ఎక్కడ, ఎవరికి ఇవ్వాలనేది చెప్తానంటూ రెండు ఫోన్ నంబర్లు ఇచ్చాడు. దీంతో రైలులో బెంగళూరు బయలుదేరిన హోసేన్ విశాఖలో డీఆర్ఐ అధికారులకు చిక్కాడు. ఇతడి నుంచి రూ.5.01 లక్షల విలువైన 803 నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రుస్తుం అసోంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ, నిరక్షరాస్యులైన యువతకు ఎరవేసి భారీ ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు డీఆర్ఐ ఆధారాలు సేకరించింది. కేసు ప్రాధాన్యత దృష్ట్యా కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు బదిలీ చేసింది. రంగంలోకి దిగిన హైదరాబాద్ యూనిట్ ముమ్మరంగా గాలింపు చేపట్టింది. నోట్ల రద్దు తర్వాత రుస్తుం పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇటీవల మళ్లీ మాల్దాలో అతడి కదలికలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. వారం పాటు వలపన్నిన ప్రత్యేక బృందం మంగళవారం అతడిని పట్టుకుంది. నకిలీ కరెన్సీ నెట్వర్క్ వివరాలు సేకరించి దాన్ని ఛేదించాలని భావిస్తున్న ఎన్ఐఏ.. దీనికోసం రుస్తుంను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. -
నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు
అన్నవరం (ప్రత్తిపాడు): నకిలీ కరెన్సీ మారుస్తున్న ముగ్గురు వ్యక్తులను అన్నవరం పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పెద్దాపురం డీఎస్పీ చిలకా వెంకటరమణ అన్నవరం పోలీస్ స్టేషన్లో బు«ధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపిన వివరాల మేరకు స్థానిక ఆర్టీసీ బస్‌స్టేషన్ వద్ద గల దేవస్థానం ఆస్పత్రి వద్ద ఆగి ఉన్న కారులో నకిలీ కరెన్సీ ఉందన్న సమాచారం మేరకు అన్నవరం ఎస్ఐ పార్థసారథి, ఇతర సిబ్బంది అక్కడకు వెళ్లి ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా రూ.రెండు వేల నకిలీ కరెన్సీ నోట్లు 50, రూ.50 వేల అసలు కరెన్సీ లభ్యమైంది. వీరిలో ప్రధాన నిందితుడు నమ్మి శ్రీనివాసరావు రూ.లక్ష విలువైన 50 నకిలీ రెండు వేల నోట్లు తీసుకురాగా, అవి తీసుకుని అసలు కరెన్సీ రూ.50 వేలు ఇచ్చేందుకు వల్లభదాసు లక్ష్మణరావు, అతని సహాయకుడు మిద్దే రవికుమార్ వచ్చారని తెలిపారు. వీరు ముగ్గిరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులు విశాఖ, పశ్చిమగోదావరి వాసులు నమ్మి శ్రీనివాసరావుది విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం. ఇతడు కలకత్తా నుంచి నకిలీ కరెన్సీ తెచ్చి వివిధ జిల్లాలలోని ఏజెంట్లకు నకిలీ కరెన్సీ విలువకు సగం అసలు కరెన్సీ ఇచ్చే షరతు మీద సరఫరా చేస్తుంటాడని తెలిపారు. గతంలో ఇదే నేరంపై శ్రీకాకుళం, రాజమండ్రిలో అరెస్టై బెయిల్ మీద వచ్చాడని, అతనిపై నాలుగు కేసులు ఉన్నట్లు డీఏస్పీ తెలిపారు. ఆ కేసుల్లో సుమారు రూ.25 లక్షల నకిలీ కరెన్సీ అతని నుంచి రికవరీ చేసినట్లు విచారణలో తెలిసిందని వివరించారు. అసలు కరెన్సీ ఇచ్చేందుకు వచ్చిన వల్లభదాసు లక్ష్మణరావుది పశ్చిమగోదావరి జిల్లా మెట్టు ఉప్పరగూడెం కాగా, సహాయకునిగా వచ్చిన మిద్దే రవికుమార్‌ది భీమడోలు జంక్షన్ అని తెలిపారు. వీరిద్దరు మారుతి సుజికీ వెర్టికా కారులో అన్నవరం వచ్చినట్టు తెలిపారు. 50 నోట్లపైనా ఒకటే నంబరు.. రూ.రెండు వేల నకిలీ కరెన్సీ నోట్లన్నీ ఒకే నెంబర్‌తో ఉండడం విశేషం. ఆ నోట్లన్నీ 8 సీబీ 608207 నెంబర్‌తో ఉన్నాయి. నిందితులను నకిలీ కరెన్సీ రవాణా, మార్పిడి తదితర కేసులపై నమోదు చేశామని వివరించారు. ప్రత్తిపాడు సీఐ ఎ.శ్రీనివాసరావు, అన్నవరం ఎస్ఐ పార్థసారథి, అడిషనల్ ఎస్ఐ చిరంజీవి ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.