ఏటీఎమ్ నుంచి వచ్చిన ఫేక్ నోటు
కాన్పూర్ : పొరపాటు ఎక్కడ దొర్లిందో తెలీదుగానీ ఖాతాదారులు మాత్రం తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఏటీఎమ్ మెషీన్ నుంచి బొమ్మ నోట్లు రావటం కాన్పూర్‌లో కలకలం రేపింది. చెల్లని వాటిని ఏం చేయాలో తెలీక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్లితే... స్థానిక మార్బుల్ మార్కెట్‌లో ఉన్న ఓ యాక్సిస్ బ్యాంకు ఏటీఎమ్ నుంచి ఆదివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు నగదు విత్‌డ్రా చేశారు. అయితే అందులో 500 రూ.. నోట్లు చిన్న పిల్లలు ఆడుకునేవి (చిల్డ్రన్ బ్యాంక్) రావటంతో ఆందోళన చెందారు. వెంటనే సెక్యూరిటీ గార్డు దృష్టికి ఈ విషయాన్ని తెలియజేయగా... సోమవారం వాటిని మార్చి ఇప్పిస్తానని గార్డు తెలియజేశాడు. అంతకు ముందు డ్రా చేసిన మరికొందరికి కూడా ఇలాంటి నోట్లే వచ్చినట్లు తెలిసింది.
దీంతో అంతా కలిసి సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఏటీఎంను మూసివేయించారు. ఆదివారం సెలవు దినం కావటంతో సోమవారం ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని సౌత్ కాన్పూర్ ఎస్పీ తెలియజేశారు. ఈ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ... అప్పటిదాకా ఈ నోట్లను ఏం చేయాలని? తమ అవసరాలకు ఎలాగని? ఖాతాదారులు నిలదీశారు. కానీ, పోలీసుల నుంచి మాత్రం సమాధానం లేదు. తరచూ జరిగే ఇలాంటి ఘటనలపై విమర్శలు వినిపిస్తున్నా.. ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హం.
Kanpur: An Axis Bank ATM located in Marble Market dispensed fake currency notes with 'Children Bank of India' printed on them. pic.twitter.com/fu7D2QbZtB
— ANI UP (@ANINewsUP) 11 February 2018
Comments
Please login to add a commentAdd a comment