ATM
-
ఏటీఎం నుంచే పీఎఫ్ నిధుల డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి (పీఎఫ్) క్లెయిమ్‌ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యుల ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదానికి 7–10 రోజుల సమయం తీసుకుంటోంది. క్లెయిమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు. వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఏడు కోట్లకు పైగా సభ్యులకు బ్యాంక్‌ల మాదిరి సేవలు అందించాలన్నది ఈపీఎఫ్‌వో ఆలోచనగా పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో తన ఐటీ సదుపాయాలను మెరుగుపరుచుకుంటోందని కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే పీఎఫ్ ప్రయోజనాలు, బీమా ప్రయోజనాలను ఏటీఎంల నుంచే పొందొచ్చని చెప్పారు. -
ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి..? ఆర్బీఐ రూల్స్ తెలుసా..?
-
ఏటీఎంను ధ్వంసం చేసి.. చివరికి..
కరీంనగర్: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలోని ఓ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. ఏటీఎంను ధ్వంసం చేసి చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎంలోని సీసీ పుటేజీల ఆధారంగా గుర్తుతెలియని దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.దొంగతనానికి యత్నించిన వ్యక్తి సీసీ పుటేజీ ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. సదరు వ్యక్తిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏటీఎం పై కప్పును తొలగించి అందులోంచి డబ్బులు తీయడానికి విఫలయత్నం చేశాడు. గంట సేపు ప్రయత్నించి వెళ్లిపోయాడు. క్లూస్ టీం పోలీసులు రంగంలోకి దిగి నిందితుని వేలిముద్రలు సేకరించారు. సీసీ పుటేజీ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించి సమాచారం ఇవ్వాలని ఎస్సై రమాకాంత్ కోరారు. -
ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ
కూడేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా, కూడేరు మండలంలో చోటుచేసుకుంది. ఏటీఎంను పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, అందులోని రూ.18,41,300 నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కూడేరులో దళితవాడకు ఎదురుగా అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన అనంతపురం సాయినగర్‌లోని స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖ ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కట్టర్‌తో ఏటీఎంను కట్ చేశారు. మిషన్‌లో ఉంచిన నగదు చోరీ చేశారు. అదే సమయంలో మిషన్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించి పైభాగం కాలిపోయింది. శబ్దం కూడా రావడంతో స్థానికుడొకరు బయటకు వచ్చి చూడగా.. ఏటీఎం సెంటర్ నుంచి కొందరు కార్లో వెళ్లిపోవడం, సెంటర్లో నుంచి పొగ రావడం గమనించాడు. కొంత సమయం తర్వాత విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. సీఐ శివరాముడు ఏటీఎం సెంటరును పరిశీలించారు. చోరీ జరిగిందని నిర్ధారించుకుని సమాచారాన్ని బ్యాంకు అధికారులకు అందించారు. సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించారు. నగదు నిల్వ, విత్‌డ్రాలకు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి డేటా తీసుకున్నారు. రూ.18,41,300 చోరీకి గురైనట్టు పోలీసులకు తెలిపారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
హిటాచీ పేమెంట్ సర్వీసెస్ భారత్ అప్‌గ్రేడబుల్ ఏటీఎం మెషీన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఏటీఎంలను ఎప్పుడైనా నగదు రీసైక్లింగ్ మెషిన్ (CRM)కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇది దేశంలోనే మొదటి అప్‌గ్రేడబుల్ ఏటీఎం అని హిటాచీ సంస్థ పేర్కొంది.' మేక్ ఇన్ ఇండియా ' చొరవ కింద తయారు చేసిన ఈ ఏటీఎంలు బ్యాంకులకు మెరుగైన సౌలభ్యాన్ని, సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న 2,64,000 ఏటీఎంలు/సీఆర్ఎంలలో, హిటాచీ 76,000కు పైగా నిర్వహిస్తోంది. రాబోయే ఎనిమిదేళ్లలో దాదాపు 1,00,000 అప్‌గ్రేడబుల్ ఏటీఎంల మార్కెట్‌ను కంపెనీ అంచనా వేసింది.ఏంటీ సీఆర్ఎం మెషీన్లు?సీఆర్ఎం మెషీన్లు అంటే క్యాష్ రీసైక్లింగ్ మెషీన్. దీని ద్వారా నగదు డిపాజిట్, విత్‌డ్రా రెండు సేవలనూ పొందవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు ఈ నగదు రీసైక్లింగ్ మెషీన్ల ద్వారా తమ శాఖల వద్ద రౌండ్-ది-క్లాక్ నగదు ఉపసంహరణ, డిపాజిట్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఆఫ్‌సైట్ ప్రదేశాల్లో బ్యాంకులు సాధారణంగా ఏటీఎంల ద్వారా 24 గంటలూ నగదు ఉపసంహరణ సేవలను మాత్రమే అందిస్తాయి. ఇలాంటి చోట్ల అప్‌గ్రేడబుల్ ఏటీఎంలను ఏర్పాటు చేసుకుంటే బ్యాంకులు తమ వారి వ్యాపార అవసరాలు, స్థానిక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డిపాజిట్, విత్ డ్రా సేవలు విస్తరించడానికి బ్యాంకులకు వీలు కలుగుతుంది. -
ATM మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆసక్తి రేకెత్తిస్తున్న హరీశ్ శంకర్ ‘ఏటీఎం’ టీజర్
బిగ్‌బాస్ ఫేం వీజే సన్నీ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘ఏటీఎం’. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సిరీస్‌కి కథ అందించారు. దోపిడీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు సి చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 20న ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ‘ఏటీఎం’టీజర్‌ని హరీశ్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `దోపిడీ జోనర్లో రాసే కథల్లో చాలా పొటెన్షియల్ ఉంటుంది. సెట్టింగ్ రియలిస్టిక్‌గా ఉంటుంది. ఈ సీరీస్‌లో దొంగలు రొటీన్‌గా ఉండరు. వాళ్లల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. వీజే సన్నీ కీ రోల్ చేశారు. స్లమ్ లైఫ్ మీద అతనికున్న ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. నవాబ్ తరహా జీవితాన్ని కోరుకున్న అతను ఏం చేశాడనేది ఆసక్తికరం. సీరీస్ గురించి ఇంతకు మించి ఎక్కువ చెప్పదలచుకోలేదు. ఓ వైపు నవ్విస్తూనే ఉంటుంది. చాలా కొత్త ప్రయత్నం చేశాం`అని అన్నారు. ‘పవర్ ఫుల్ ఫోర్సుల వల్ల కార్నర్ అయిన నలుగురు చిన్న దొంగల రోలర్ కోస్టరే ఈ సీరీస్. ప్రాణాలతో బతికి ఉండాలంటే కొన్ని కోట్ల రూపాయలను దోపిడీ చేయాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడిన వాళ్ల కథే ఇది. సుబ్బరాజు చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారు` అని నిర్మాత హర్షిత్ రెడ్డి అన్నారు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న వీజే సన్నీ ATM, ఎప్పుడంటే?
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ దొంగతనం చేస్తూ సీసీ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే కదా! అయితే ఇదంతా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ప్రమోషన్స్‌లో భాగమేనని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. చివరకు వారు అనుకుందే నిజమైంది. వీజే సన్నీ ఏటీఎమ్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇందులో సుబ్బరాజు, దివి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హరీష్ శంకర్ అందించిన కథను చంద్రమోహన్ డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఏటీఎమ్: పైసల్తో ఆట అనే వెబ్ సిరీస్ జనవరి 20 నుంచి తెలుగు, తమిళ భాషల్లో జీ5లో ప్రసారం కానుందని ప్రకటించింది చిత్రయూనిట్. A heist that will make you relook at your way of life & startle you to your very core.#ATMOnZee5 - The game of money, #PaisalThoAata, STARTS SOON@VJSunnyOfficial @actorsubbaraju @RoielShree @ravirajdance @KrishnaBurugula @DiviActor@harish2you @chandramohan_c @DilRajuProdctns pic.twitter.com/rKkoheUOQ2 — ZEE5 Telugu (@ZEE5Telugu) January 6, 2023 చదవండి: పంత్ ఉన్న ఆస్పత్రి ఫోటో షేర్ చేసిన నటి -
దొంగతనం చేస్తూ దొరికిపోయిన సన్నీ
-
గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్‌డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది!
న్యూఢిల్లీ: గతంలో బ్యాంకులోని మన నగదుని తీసుకోవాలంటే.. అయితే బ్యాంకుకు వెళ్లాలి లేదా ఏటీం( ATM) మెషిన్‌కు వెళ్లి డెబిట్ కార్డ్‌తో కావాల్సినంత డబ్బులను డ్రా చేసుకోవాలి. కానీ నేటి డిజిటల్ యుగంలో, మీరు డెబిట్ కార్డ్ లేకుండా కూడా ఏటీఎం మెషీన్ నుంచి డబ్బును తీసుకోవచ్చు. దీని కోసం మీకు మీ మొబైల్ మాత్రమే అవసరం. చాలా రోజుల నుంచి ఈ బ్యాంకింగ్ సర్వీస్ నడుస్తోంది. అసలు ఇలాంటి సర్వీస్ ఒకటి ఉందని చాలా మందికి కూడా తెలియదు. డబ్బులు డ్రా చేసేందుకు.. ఏటీఎం అక్కర్లేదు ఇప్పటికే చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు కార్డు లేకుండానే డబ్బు తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నప్పటికీ.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ తన పరిధిని మరింత పెంచింది. ఈ సౌకర్యం కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ఉపయోగించనుంది. డెబిట్ కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే, మీరు తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ని కలిగి ఉండాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లో భీం(BHIM), పేటీఎం (Paytm), గూగుల్‌పే (GPay), ఫోన్‌పే (PhonePe) మొదలైన యాప్‌లను ఉపయోగించి ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా ఫాలో అయితే సరిపోతుంది.. ఏటీఎం సెంటర్లోకి వెళ్లి కార్డ్ లేకుండా డబ్బు విత్‌డ్రా చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు యూపీఐ ద్వారా గుర్తింపును అందించే ఎంపికను చూస్తారు. ఆ తర్వాత మీ మొబైల్లో యూపీఐ యాప్‌ని ఓపెన్ చేసి, మీ ముందు కనిపిస్తున్న QR కోడ్‌ను స్కాన్ చేయండి. ఇక్కడి నుంచి ప్రక్రియ మునుపటి మాదిరిగానే ఉంటుంది. మీకు కావలసిన డబ్బును ఎంటర్ చేయండి ఆ తర్వాత విత్‌డ్రా చేసుకోండి. కార్డ్ లెస్ క్యాష్.. ప్రయోజనాలు ఇవే కార్డు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కార్డు స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ వంటి మోసాలను నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, మీరు కార్డును మీ వద్ద ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీ స్మార్ట్‌ఫోన్ ఈ పనులన్నింటినీ చేస్తుంది. చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి! -
ఓరి దేవుడా! ఏకంగా ఏటీఎం యంత్రాన్నే...
సాక్షి, బనశంకరి: ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకుని కంటైనర్‌లో ఉడాయించారు. ఈ ఘటన బెళ్లందూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హరళూరు రోడ్డు బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం కేంద్రంలోకి ఈనెల 10న అర్ధరాత్రి 2.30 సమయంలో చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని పెకలించి వాహనంలో తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం గమనించిన బ్యాంక్ అధికారులు ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించి బెళ్లందూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టామని డీసీపీ గిరీష్ తెలిపారు. ట్రక్‌తో వచ్చిన దుండగులు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి అక్కడ ఉన్న సీసీ కెమెరాకు రంగు స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎం యంత్రాన్ని పెకిలించి కంటైనర్‌లో పెట్టుకుని ఉడాయించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో నమోదైనట్లు తెలిపారు. (చదవండి: చికెన్ రోల్ లేదని.. హోటల్‌కు నిప్పు) -
ఇండియాలోనే ఫస్ట్ గోల్డ్ ATM .. ఎలా పని చేస్తుందో చూస్తే షాక్ అవుతారు..
-
మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? మారిన ఏటీఎం విత్‌డ్రా నిబంధనలు
కెనరా బ్యాంక్ ఖాతా దారులకు ముఖ్య గమనిక. ఖాతాదారులు నిర్వహించే రోజూ వారీ ఏటీఎం లావాదేవీలపై మార్పులు చేసింది. ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రాల్, పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్), ఈకామర్స్ ట్రాన్సాక్షన్లలో ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది ► క్లాసిక్ డెబిట్ కార్డుల కోసం రోజువారీ ఏటీఎం విత్డ్రాల్ పరిమితిని ప్రస్తుతం రూ.40వేలు ఉండగా.. రూ.75వేలకు పెంచింది. ► ప్రస్తుతం ఉన్న పీఓఎస్,ఈ కామర్స్ పరిమితిని రూ.1 లక్ష నుండి రోజుకు రూ. 2లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ► రూ.25వరకు లిమిట్ ఉన్న ఎన్ఎఫ్సీ (కాంటాక్ట్‌లెస్)ని తటస్థంగా ఉంచింది. కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు ఒక్కో సందర్భంలో రూ. 5000 వరకు, రోజుకు 5 లావాదేవీలకు అనుమతి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం డెబిట్ కార్డ్ లావాదేవీల పరిమితిలో మార్పులు చేసింది. పీఎన్బీ వెబ్సైట్ ప్రకారం.. ప్లాటినం మాస్టర్ కార్డ్, రూపే, వీసా గోల్డ్ డెబిట్ కార్డ్‌లతో పాటు రూపే సెలెక్ట్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్‌ల పరిమితిని పెంచనున్నట్లు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల వినియోగదారులకు షాక్ ఇచ్చింది. థర్డ్ పార్టీ పద్దతుల ద్వారా రెంట్ పేమెంట్ చేస్తే..సదరు వినియోగదారులు చేసిన లావాదేవీ మొత్తంలో 1శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. చదవండి👉 మారనున్న నిబంధనలు!, పాన్ కార్డు అమలులో కేంద్రం మరో కీలక నిర్ణయం? -
హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎం వచ్చేసింది.. దేశంలోనే తొలిసారి
సనత్‌నగర్: నగదు ఉపసంహరణ, జమకు ఉపయోగించే ఏటీఎంల తరహాలోనే డెబిట్, క్రెడిట్ కార్డులతో బంగారం విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్‌లో గల ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటైన ఈ ఏటీఎంను శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్ ఏటీఎం నిదర్శనమన్నారు. బంగారాన్ని తీసుకునేందుకు దేశంలోనే తొలిసారి గోల్డ్ ఏటీఎంను నగరంలో ప్రారంభించడాన్ని ఆమె అభినందించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఈ గోల్డ్ ఏటీఎంలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ తరహా ఏటీఎంలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకివస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గోల్డ్ సిక్కా సంస్థ సీఈఓ సయ్యద్ తరుజ్ మాట్లాడుతూ...ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా 99.99% నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను విత్ డ్రా చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు తాము జారీ చేసే ప్రీపెయిడ్ కార్డులనూ ఉపయోగించవచ్చన్నా రు. ఒక్కో మిషన్‌లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల పసిడిని లోడ్ చేయవచ్చన్నారు. భారత్‌లో గోల్డ్ మార్కెట్ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్ తీసుకోవచ్చని తెలిపారు. త్వరలోనే మరిన్ని గోల్డ్ ఏటీఎంల ఏర్పాటు... త్వరలోనే ఎయిర్పోర్ట్, పాతబస్తీలో మూడు ఏటీఎంలు, సికింద్రాబాద్, అబిడ్స్‌లతో పాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్‌లలో కూడా గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించనున్నామని చెప్పారు. రానున్న రెండేళ్లల్లో దేశవ్యాప్తంగా 3,000 యంత్రాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వివరించారు. కార్యక్రమంలో వ్యాపార వ్యవస్థాపకుడు బండారి లక్ష్మారెడ్డి, దర్శకుడు నరసింహారావు, టీ–హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం.శ్రీనివాసరావు, తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ అధ్యక్షుడు కొండూరు రవీందర్రావు, అక్రితి గ్రూప్ చైర్మన్ డాక్టర్ కుల్దీప్ రైజాదా, తెలంగాణ జియో సీఈఓ కేసీ రెడ్డి, గోల్డ్ సిక్కా సంస్థ చైర్పర్సన్ అంబిక బుర్మన్ తదితరులు పాల్గొన్నారు. -
అలర్ట్: అమలులోకి వచ్చే కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాలండోయ్!
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు ఇవన్నీ తరచూ జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని రూల్స్ మారుతూ ఉంటాయి, కొన్ని కొత్తవి వస్తుంటాయి. అయితే వీటిలో కొన్నింటిపై మాత్రం సామన్యులు అప్రమత్తంగా ఉండాలండోయ్. ఎందుకంటే అవి వారి నగదుపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ డిసెంబరు 1 నుంచి అమలులోకి వచ్చే రూల్స్‌పై ఓ లుక్కేద్దాం.. LPG Gas Cylinder Price: ప్రతీ నెల ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరల్ని అంతర్జాతీయ పరిణమాలను అనుసరించి సవరిస్తుంటాయి. ఈ క్రమంలో ఒక్కొసారి సిలిండర్ ధరలనేవి పెరగడం, తగ్గడం సహజమే. కొన్ని ధరలు స్థిరంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఈ సారి డిసెంబర్ 1కి సంబంధించిన ధరల్ని ఆయిల్ కంపెనీలు తాజా సమాచారాన్ని తెలపాల్సి ఉంది. Railway time table: చలికాలం వాతావరణ పరిస్థితులు, పొగమంచు కారణంగా, రైళ్ల టైమ్ టేబుల్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. అవి డిసెంబర్ 1నుంచి అమలులోకి రానుంది. 13,000 ప్యాసింజర్ రైళ్లు, 7,000 గూడ్స్ రైళ్లు, 30 రాజధాని రైళ్లకు సంబంధించిన టైమ్ టేబుల్లో మార్పులు ఉన్నాయి. ATM withdraw: డిసెంబర్ 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్లు కోసం పీఎన్బీ ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసే ప్రక్రియ మారనుంది. ఇది మనుపటిలా కాకుండా ఇందులో కాస్త మార్పులను జత చేశారు. కస్టమర్లు తమ డెబిట్ కార్డ్ నుంచి డబ్బులను విత్‌డ్రా చేయాలంటే ఇకపై వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) అవసరం. ఏటీఎం మెషీన్లో మీ డెబిట్ కార్డ్‌ను చొప్పించిన తర్వాత, ఖాతాదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీని అందుకుంటారు. అలా వచ్చిన OTPని నమోదు చేసిన తర్వాత, మీ ఏటీఎం పిన్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. PNB KYC: పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్ ఉన్న కస్టమర్లు డిసెంబర్ 12 లోగా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి సూచించింది. ఇది చేయకపోతే కస్టమర్ల అకౌంట్‌పై ఆంక్షలు తప్పవని పీఎన్బీ హెచ్చరించింది. Hero Moto Corp: హీరో బైక్ లేదా స్కూటర్ కొనాలనుకునేవారు ఇది షాకిచ్చే వార్త అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో పోలిస్తే ఈ డిసెంబర్ నుంచి హీరో బైక్‌ను కొనాలంటే కాస్త ఎక్కువ ఖర్చు చేయక తప్పదు. కంపెనీ తమ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల్ని రూ.1,500 వరకు పెంచింది. పెరిగిన ధరలు డిసెంబర్ 7 నుంచే అమలులోకి రానున్నాయి. Digital Rupee: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రీటైల్ పైలట్ ప్రాజెక్ట్‌ను డిసెంబర్ 1న ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. క్లోజ్డ్ యూజర్ గ్రూప్ అనగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో, కేవలం ఎంపిక చేసిన వ్యాపారులు, కస్టమర్లు మాత్రమే ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ఉంటారు. చదవండి: ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ రియాక్షన్ -
ఫోన్‌పే వాడుతున్నారా? అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు గురించి తెలుసా!
ఫోన్‌పే(Phone Pay) .. డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటి నుంచి ఈ పేరు బాగా పాపలర్ అయిపోయింది. పర్సలో మనీ లేకపోయినా పర్లేదు ఫోన్లో ఫోన్‌పే ఉంటే చాలు అనుకునేంతగా ప్రజాదారణ పొందింది ఈ యాప్. ప్రస్తుతం 350 మిలియన్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లతో పలు సేవలు అందిస్తూ భారత్‌లో దూసుకుపోతుంది ఫోన్‌పే. ఎప్పటికప్పడు కొత్త సేవలో కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి సంఖ్యను పెంచుకుంటున్న ఈ యాప్ తాజాగా మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త సేవల మీ కోసం.. ఇది వరకు ఫోన్‌పే ఉపయోగించాలంటే తప్పనిసరిగా మన డెబిట్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డెబిట్ కార్డు అవసరం లేకుండా సరికొత్త సేవలను ఫోన్‌పే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారుడు కేవలం ఆధార్ కార్డు ఉపయోగించి యూపీఐ సేవలు పొందవచ్చని ఫోన్ పే తెలిపింది. ఇకపై ఫోన్ పేలో మీ డెబిట్ కార్డ్ అవసరం లేకుండా కేవలం మీ ఆధార్ కార్డ్ ద్వారా ఫోన్‌పేలో మీ యూపీఐ (UPI)ని సెటప్ చేయాలనుకుంటే, సింపుల్‌గా ఇలా ఫాలో అవ్వండి. ►ముందుగా ప్లేస్టోర్ (PlayStore) లేదా యాప్ స్టోర్( App Store) నుంచి ఫోన్‌పేని డౌన్లోడ్ చేసుకోండి. ►ఆపై ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్ని యాడ్ చేయండి, తర్వాత OTP వస్తుంది దాని ఎంటర్ చేయండి. ►ఇప్పుడు మై మనీ పేజీకి వెళ్లి, ఆపై పేమెంట్స్ మెతడ్స్ (payments method)పై క్లిక్ చేయండి. ►తర్వాత మీ బ్యాంక్‌ని ఎంచుకోని, 'Add New Bank Account'పై క్లిక్ చేయండి. ► మీ బ్యాంక్‌ని సెలక్ట్ చేసుకుని, మీ ఫోన్ నంబర్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ►దీంతో ఫోన్‌పే మీ ఖాతా వివరాలను యాక్సెస్ పొందుతుంది, వీటితో పాటు మీ అకౌంట్ యూపీఐకి లింక్ అవుతుంది. ►తర్వాత మీ డెబిట్/ఏటీఎం కార్డ్ వివరాలను నమోదు చేయవచ్చు లేదా ఆధార్ కార్డ్ ఎంపికను ఎంచుకోవచ్చు. ►మీ ఆధార్‌లోని చివరి ఆరు అంకెలను నమోదు చేయండి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ► OTPని ఎంటర్ చేసి ఆపై మీ యూపీఐ పిన్ నెంబర్ సెట్ చేసుకోవడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. చదవండి: వణుకుతున్న ఉద్యోగులు.. డిసెంబర్ నాటికి మాంద్యంలోకి ఆ దేశాలు! -
ఏటీఎం ఉపయోగిస్తే చార్జీల మోత
-
బెంగళూరులో ఇడ్లీ ఏటీఎం మిషన్ ...
-
వాట్ యాన్ ఐడియా! ఇడ్లీ ఏటీఎం మిషన్...హాయిగా లాగించేయి గురు!
ఏటీఎం మెషిన్లో డబ్బులు తీసుకోవడం, డిపాజిట్ చేయడం వరకు మనకు తెలుసు ఔనా!. ఇక నుంచి టిఫిన్స్‌కి సంబంధించిన ఏటీఎంలు కూడా రానున్నాయండి. ఔను! ప్రస్తుతం ఇడ్లీ ఏటీఎం అందుబాటులోకి తీసుకొచ్చారు బెంగళూరుకి చెందిన యువ స్టార్ట్ అప్పర్లు. వివరాల్లోకెళ్తే...ఇక నుంచి మహా నగరాల్లోకి ఇడ్లీ ఆటోమేటిడ్ మేకింగ్ మిషన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ సరికొత్త రోబోటిక్ మిషన్‌ని బెంగళూరుకి చెందిన ఎంట్రప్రెన్యూర్స్ శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్ రూపొందించారు. మన ఏటీఎం మిషన్‌లానే 24x7 సేవలందిస్తుంది. చాలా ఫ్రెష్‌గా వేడివేడి ఇడ్లీలను అందిస్తుంది. ఒక్కషాట్‌లో 72 ఇడ్లీలను కేవలం 12 నిమిషాల్లో అందిస్తుంది. అంతేకాదండోయ్ బయట హోటల్స్ రెస్టారెంట్స్ మాదిరిగా టిఫిన్ తోపాటు చట్నీ, కారప్పొడి, సాంబర్తో సహా అందిస్తోంది. ఐతే మనం ఈ మిషన్ వద్దకు వచ్చి మెనులో మనకు నచ్చిన టిఫిన్‌ని సెలక్ట్ చేసుకుని దానిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి బిల్ పే చేస్తే...55 సెకండ్లలో మన ఆర్డర్ ప్యాక్ చేసి మన ముందు ఉంటుంది. ఈ ఆలోచన హిరేమత్‌కి 2016లో ఒక రోజు తన కూతురు అనారోగ్యం బారిన పడినప్పుడూ వచ్చినట్లు చెబుతున్నాడు. ఆ రోజు రాత్రి తన కూతురుకి వేడి వేడి ఇడ్లీ దొరక్కపోవడంతో చాలా ఇబ్బంది పడినట్లు పేర్కొన్నాడు. అప్పుడే తనకు ఏ సమయంలోనైనా వేడివేడిగా ఫ్రెష్‌గా లభించాలే ఆహారం అందించాలని నిర్ణయించుకుని ఈ ఆటోమెటిష్ మిషన్‌ని తయారు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మిషన్‌లో ఇడ్లీ, వడ అందిస్తున్నట్లు చెప్పారు. ఇదే సౌత్ ఇండియన్స్ వంటకాలకి సంబంధించిన తొలి అల్పాహర ఆటోమెటిక్ మిషన్ అని గర్వంగా చెబుతున్నాడు. ఈ ఏటీఎం ప్రస్తుతం బెంగళూరులోని రెండు ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్‌లను విస్తరింప చేయడమే కాకుండా ఈ ఏటీఎంలో జ్యూస్, రైస్, దోశ వంటి వాటిని కూడా అందించే ఏర్పాటు చేయాలనకుంటున్నట్లు తెలిపాడు. (చదవండి: వృద్ధురాలి కంటి నుంచి ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్ తీసిన వైద్యులు) -
క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయొచ్చా?
ఇటీవల కాలంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఈ డిజిటల్ చెల్లింపుల కంటే లిక్విడ్ క్యాష్తో మన అవసరాల్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో డెబిట్ కార్డుతో డబ్బుల్ని డ్రా చేస్తుంటాం. మరి క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకునే సదుపాయం ఉంది కదా. డబ్బుల్ని డ్రా చేయొచ్చా? డ్రా చేస్తే ఏమవుతుంది? ఆర్ధిక నిపుణులు ఏం చెబుతున్నారు. ఏటీఎంలో డెబిట్ కార్డును ఎలా ఉపయోగిస్తామో.. క్రెడిట్ కార్డును కూడా అలాగే వినియోగించుకోవచ్చు. అయితే, క్రెడిట్ కార్డుల విషయంలో ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకుంటే కొన్ని అదనపు ఛార్జీలు బ్యాంకులకు కట్టాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఆర్ధికంగా అంత మంచి పద్దతి కాదని ఆర్ధిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. సర్వీస్ ఛార్జ్ మీరు మీ క్రెడిట్ కార్డ్‌తో ఏటీఎం నుండి నగదును విత్‌డ్రా చేస్తే.. సదరు విత్ డ్రాల్ పై సర్వీస్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము సాధారణంగా మీరు ఏటీఎం నుంచి డ్రా చేసిన నగదు పై చెల్లించాలి. మొత్తంగా ఆ అదనపు ఛార్జీలు 2.5% నుండి 3% వరకు ఉంటాయి. ఈ ఛార్జీలు మీ నెక్ట్స్ క్రెడిట్ కార్డు బిల్ జనరేట్ స్టేట్మెంట్లో యాడ్ అవుతాయి. వడ్డీ సాధారణంగా డెబిట్ కార్డుతో నెలకు 5 సార్లు ఉచితంగా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. కానీ క్రెడిట్‌తో అలా కాదు. బ్యాంకులు అందించే క్రెడిట్ కార్డుతో ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేస్తే భారీగా వడ్డీ చెల్లించాలి. ఆ వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డుతో డబ్బులు డ్రా చేసిన నెంబర్‌ను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ప్రారంభ వడ్డీ నెలకు 3.5% వరకు ఉండవచ్చు. సిబిల్ స్కోర్ తగ్గుతుందా? క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి డబ్బుల్ని డ్రా చేసుకుంటే ఆ ప్రభావం నేరుగా క్రెడిట్ కార్డు స్కోర్‌పై ప్రభావితం చూపదు. అయినప్పటికీ, అధిక ఛార్జీల కారణంగా మీరు కనీస బకాయిని చెల్లించడంలో విఫలం కావచ్చు. మీ క్రెడిట్ కార్డ్ వినియోగం పెరుగుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రయోజనాలు, డీల్స్ రెస్టారెంట్లు, దుకాణాలలో చెల్లించడానికి మీ క్రెడిట్ కార్డ్‌ని స్వైప్ చేసినప్పుడు, బ్యాంకులు మీకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంటాయి. కానీ, మీరు నగదు ఉపసంహరించుకోవడానికి మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినప్పుడు ఈ అదనపు ప్రయోజనాల్ని పొందలేం. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో తప్పా క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేయొద్దని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఏటీఎం వద్దే బండరాయిలా నుంచొన్న వ్యక్తి... తీరా దగ్గరికెళ్తే...
ఏటీఎం వద్ద డబ్బులు డ్రా చేసుకోవడం లేదా డిపాజిట్ చేయడం వంటివి సర్వ సాధారణం. ఐతే ఎవరైన మనకంటే ముందు డబ్బులు తీసుకుంటుంటే కాసేపు ఆగుతాం జౌనా! పాపం అలానే ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఏటీఎం వద్ద డబ్బులు తీసుకుంటున్నాడు కదా అని ఆగుతారు. గంటలు గంటలు గడిచిపోతాయే కానీ ఎంతసేపటికి కదలడు. ఇక విసిగిపోయి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి తట్టగా ఆవ్యక్తిని చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్న జనాలంతా షాక్ అయిపోతారు. అసలేం జరిగిందంటే...యూకేలోని టెస్కో క్యాష్ పాయింట్ సమీపంలో ఉన్న ఏటీఎం వద్ద ఒక వ్యక్తి నుంచుని ఉంటాడు. ఎంతకీ ఒక పట్టాన కదలడు. ఒకపక్క జనాలంతా క్యూలో నుంచుని అలానే ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి ఎంతసేపు ఇలా అని కోపంతో దగ్గరకు వచ్చి చేత్తో తడతాడు. అయినా కదలడు. దీంతో అనుమానంతో దగ్గరకు వచ్చి చూస్తే అది బొమ్మ. దీంతో వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుతారు. అబ్బా టైం వేస్ట్ చేశామే గానీ అసలు ఎందుకు కదలకుండా అలా ఉన్నాడని గమనించ లేకపోయామే అనుకున్నారు వారంతా. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తె వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్కేయండి. Man leaves a mannequin outside a Tesco cashpoint 😭 pic.twitter.com/CgYtG372RK — UB1UB2 Southall (@UB1UB2) September 30, 2022 (చదవండి: Viral Video: జలపాతానికే రంగులు వేసే స్టంట్...పర్యావరణ అధికారులు ఫైర్) -
రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.. సీన్ కట్ చేస్తే జైల్లో ఉన్నాడు
ఒక వ్యక్తికి ప్రమాదవశాత్తు ఏటీఎం నుంచి ఊహించని విధంగా కుప్పులు కుప్పలుగా డబ్బు వచ్చింది. అంతే అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ నడిమంత్రపు సిరి ఉద్యోగాన్ని, ప్రియురాలిని కోల్పోయేలా చేసింది. చివరికి అతన్ని కటకటాలపాలయ్యేలా చేసింది. వివరాల్లోకెళ్తే... ఆస్రేలియాలోని ఒక బార్లో పనిచేసే సర్వర్ డాన్ సాండర్స్‌కి ఊహించని విధంగా ఏటీఎం నుంచి కట్టకట్టలు డబ్బు లభించింది. దీంతో అతను రాత్రికి రాత్రే మిలినియర్గా మారిపోయాడు. అతను ఒక రోజు రాత్రి బాగా మద్యం సేవించి ఆస్ట్రేలియాలోని వాంగారట్టాలో ఏటీఎం వద్దకు వెళ్లాడు. అప్పుడే అతను ఊహించని విధంగా ఏటీఎం నుంచి సుమారు రూ 13 కోట్ల నగదును పొందాడు. అసలేం జరిగిందటే.. అతను ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్న ప్రతిసారి సారీ ట్రై ఎగైన్ అని రావడం పెద్ద మొత్తంలో డబ్బులు మాత్రం ఏటీఎం నుంచి వచ్చేస్తుండేవి. ఇలా అతను మూడుసార్లు చేయగా...మూడుసార్లు పెద్దమొత్తంలో డబ్బు వచ్చింది. కానీ ఏటీఎం మెషిన్ మాత్రం లావాదేవీలు జరుపుతున్నంత సేపు ట్రాన్స్యాక్షన్ క్యాన్సిల్డ్ అని రావడం డబ్బులు మాత్రం వచ్చేయడం జరుగింది. ఐతే తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు కూడా రావడం లేదు. దీంతో సర్వర్ సాండర్స్‌కి దెబ్బకి తాగిన మత్తంతా దిగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక ఆ రాత్రికి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు బ్యాంకుకు ఫోన్‌చేసి సంప్రదిస్తే ఎలాంటి అవాంఛనీయమైన నగదు బదిలీలు జరగలేదని చెబుతారు. అసలు ఏమైంది ఎందుకు ఇలా జరిగిందని సర్వర్ సాండర్స్ వాకాబు చేస్తే ఆ రోజు రాత్రి తెల్లవారుజామున 1 గంట నుంచి 3 గంటలకు బ్యాంక్ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయ్యిందని గ్రహించాడు. అదీగాక తాను ఆరోజు ఏటీఎంలో సేవింగ్ అకౌంట్లోని కొంత సొమ్మును క్రెడిట్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నసమయంలోనే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు రూ 13 కోట్ల నగదు బయటకు వచ్చిందని కనుగొన్నాడు. దీంతో ఊహించని విధంగా వచ్చిపడ్డ డబ్బుతో విచ్చల విడిగా జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేశాడు. స్నేహితులు యూనివర్సిటీలు ఫీజులు కట్టడం, ఉన్నత చదువులకు స్నేహితులను ఫారెన్ పంపించే పనులు వంటి సాయాలు కూడా చేశాడు. అతని మితిమీరిన జల్సాల కారణంగా బార్లో ఉద్యోగాన్ని, గర్లఫ్రెండ్‌ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు ఆ డబ్బును మొత్తం ఐదునెలలో ఖర్చు పెట్టేశాడు. ఇదిలా ఉండగా బ్యాంకు అధికారులకు ఏటీఎంలో ఫ్రాడ్ జరిగిందని ఎవరో వ్యక్తి అధిక మొత్తంలో డబ్బును పొందినట్లు గుర్తిస్తారు. తర్వాత పోలీసులు ఇలా అక్రమంగా అధిక మొత్తంలో డబ్బుని పొందింది సర్వర్ సాండర్స్గా గర్తించి అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడు సాండర్స్ పై 111 అభియోగాలతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన 2011లో జరిగింది. అతను సుమారు ఐదేళ్లు జైలు శిక్షను కూడా అనుభవించాడు. అతను 2016లో జైలు నుంచి విడుదలయ్యాడని ప్రస్తుతం ఒక బార్లో పనిచేస్తున్నాడని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. ఐతే పోలీసులు ఫ్రాడ్ కేసుల విషయమే చెబుతూ... ఆన్లైన్లో ఈ ఘటన గురించి చెప్పడంతో ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. ఏదీఏమైన ఉచితంగా వచ్చే డబ్బు ఎప్పటికైనా ప్రమాదమే కదా!. (చదవండి: ఫ్రీ బస్సులోనూ టికెట్ కోసం పట్టు.. బామ్మ వీడియో వైరల్) -
ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మైక్రో ఏటీఎంల ఏర్పాటు కు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా కస్టమర్ ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.10,000 నగదు స్వీకరించవచ్చు. ఇందుకోసం ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌నకు చెందిన బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ సాయం తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని బ్యాంక్‌లకు చెందిన డెబిట్ కార్డుల ద్వారా కస్టమర్లు ఈ సేవలను పొందవచ్చు. ఖాతా నిల్వ తెలుసుకోవచ్చు. ద్వితీయ శ్రేణి నగరాలు, ఉప పట్టణ ప్రాంతాల్లో దశలవారీగా దేశవ్యాప్తంగా 2023 మార్చి నాటికి 1.5 లక్షల మైక్రో ఏటీఎంలను అందుబాటులోకి తేనున్నట్టు బుధవారం బ్యాంక్ ప్రకటించింది. ఏటీఎంలు తక్కువగా ఉండి, నగదు అవసరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని పరిచయం చేస్తామని వెల్లడించింది. మైక్రో ఏటీఎం లావాదేవీలు జరిపేందుకు వీలుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్‌తో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనుసంధానమైంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వినియోగదార్లను శక్తివంతం చేసేందుకే ఈ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టామని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీవోవో అనంతనారాయణన్ తెలిపారు. చదవండి: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇది తప్పనిసరి! -
కలకలం.. ఏటీఎం నుంచి నకిలీ నోటు!
గుత్తి(అనంతపురం జిల్లా): స్థానిక ప్రధాన ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం కేంద్రం నుంచి నకిలీ రూ.500 బయటపడింది. వివరాలు.. గుత్తిలోని లచ్చానపల్లి రోడ్డులో నివాసముంటున్న సీఆర్పీఎఫ్ విశ్రాంత జవాన్ కిష్టప్ప బుధవారం ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం కేంద్రం నుంచి రూ.9,500 డ్రా చేశాడు. అందులో ఓ నకిలీ రూ.500 నోటు వచ్చింది. విషయాన్ని వెంటనే ఎస్బీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై ఎస్బీఐ అధికారులు స్పందించలేదని, ఏటీఎం కేంద్రంలో డబ్బు డిపాజిట్టు విషయం తమ పరిధిలో కాదని వారు పేర్కొన్నట్లు వివరించాడు. చదవండి: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్ ఫాదర్’ -
ఈ బ్యాంకింగ్ సేవలు ఫ్రీ కాదండోయ్.. లిమిట్ దాటితే బాదుడే!
ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ప్రతీ ఒకరికి ఉంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇటీవల కాలంలో బ్యాంక్ సంస్థలు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో తమ సేవలను అందిస్తున్నాయి. అయితే నగదు లావాదేవీల ఎస్ఎంఎస్(SMS), ఐఎంపీఎస్(IMPS) ఫండ్ బదిలీ, చెక్ క్లియరెన్స్ , ఏటీఎం విత్డ్రాల్ ఇలా ఏ సౌకర్యం పూర్తిగా ఉచితం కాదు. అన్ని సేవలకు, బ్యాంక్ నిబంధనల అనుసరించి తమ కస్టమర్ల నుంచి కొంత ఛార్జీని వసూలు చేస్తుంది. ఇది తెలియక మన జేబులో పైసలు చార్జీల రూపంలో బ్యాంక్‌లకు కడుతున్నాం. ఓసారి ఆ సేవల గురించి తెలసుకుందాం. నగదు లావాదేవీ బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరు నగదు లావాదేవీలు చేయడం సహజం. అయితే ఈ లావాదేవీని నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే చేయవచ్చు. మీరు నిర్ణీత పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే, దానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీ ప్రతి బ్యాంకుకు దాని నిబంధనల ప్రకారం మారుతూ ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ బ్యాంకులో 20 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉండాలి బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్‌ను నిర్దిష్ట పరిమితి వరకు నిర్వహించాలి. మీ ఖాతాలో అంత కంటే తక్కువ మొత్తం ఉన్నట్లయితే, కనీస బ్యాలెన్స్ లేని కారణంగా ఛార్జ్ చెల్లించాలి. అన్ని బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్, దానిని నిర్వహించనందుకు ఛార్జీల పరిమితి భిన్నంగా ఉంటాయి. ఐఎంపీఎస్ ఛార్జీలు అన్ని బ్యాంకులు నెఫ్ట్( NEFT), ఆర్టీజీఎస్( RTGS) లావాదేవీలను కస్టమర్లకు ఉచితంగా అందిస్తాయి. అయితే చాలా బ్యాంకులు ఇప్పటికీ ఐఎంపీఎస్( IMPS ) లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ ఛార్జీ రూ.1 నుంచి రూ.25 వరకు ఉంటుంది. లక్ష వరకు ఓకే మీ చెక్కు రూ. 1 లక్ష వరకు ఉంటే, మీరు బ్యాంకుకు ఎటువంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అంతకంటే ఎక్కువ మొత్తం ఉంటే క్లియరెన్స్ ఛార్జీని చెల్లించాలి. మరోవైపు, చెక్కుల విషయంలోనూ పరిమితి సంఖ్య వరకు ఉచితంగా ఇస్తారు. అంతకు మించి చెక్కుల కావాలంటే వాటికోసం మీరు ధర చెల్లించాలి. ఏటీఎం లావాదేవీ ఏటీఎం (ATM) నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా నిర్ణీత సమయం వరకు మాత్రమే ఉచితంగా లభిస్తుంది. పేర్కొన్న సంఖ్య కంటే ఎక్కువ లావాదేవీల జరిపితే అప్పటి నుంచి చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో బ్యాంకు వసూలు చేసే మొత్తం వేర్వేరుగా ఉంటుంది. ఇందుకు చాలా బ్యాంకులు రూ.20-50 వరకు వసూలు చేస్తున్నాయి. ఎస్ఎంఎస్ కూడా ఫ్రీ కాదండోయ్ మీ ఖాతాలో డబ్బు క్రెడిట్ అయినప్పుడు లేదా డెబిట్ అయినప్పుడు బ్యాంక్ మీకు ఎస్ఎంఎస్ పంపుతుంది. దీనికి బ్యాంకులు కూడా ఛార్జీలు వసూలు చేస్తాయి. కానీ చాలా మందికి దీని గురించి తెలియదు ఎందుకంటే ఈ ఛార్జీ చాలా తక్కువగా ఉంటుంది. వివిధ బ్యాంకులకు ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. డెబిట్ కార్డు పోతే.. పైసలే మీరు మీ డెబిట్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, మీరు మరొక కార్డును పొందడానికి ఛార్జీ చెల్లించాలి. ఈ ఛార్జీ రూ. 50 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. ఒక్కో బ్యాంకు ఒక్కో ఛార్జీలను నిర్దేశించింది. చదవండి: టైం వచ్చింది వెళ్దాం.. ప్రభుత్వ ఆఫీసులు ఖాళీ చేస్తున్న ఎయిరిండియా