దొంగతనం అనగానే బంగారం, డబ్బు, విలువైన వస్తువులను చోరీ చేయడం గుర్తుకు వస్తాయి. కానీ కొందరు కక్కుర్తి వ్యక్తులు చేసే చోరీలు చూస్తే వారిపై జాలి పడాలో లేక కోప్పడాలో అర్థం కాదు. ఓ వ్యక్తి చేసిన దొంగతనం చూస్తే మీకు కూడా ఇలానే అనిపిస్తుంది. ఇంతకు ఆ వ్యక్తి చేసిన దొంగతనం ఏంటయ్యా అంటే.. ఏటీఎం సెంటర్‌లో ఉన్న శానిటైజర్ డబ్బాను తస్కరించాడు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. ఏటీఎంలో డబ్బులు తీయడానికి వెళ్లిన ఓ కస్టమర్.. అక్కడే ఉన్న శానిటైజర్ బాటిల్‌ను దొంగిలించాడు.
కరోనా కట్టడిలో భాగంగా ప్రస్తుతం శానిటైజర్, మాస్క్ వినియోగం తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో పలు దుకాణాలు, ఏటీఎం సెంటర్లు, ఆఫీసుల ముందర శానిటైజర్లను ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి డబ్బులు తీసుకోవడం కోసం ఏటీఎం సెంటర్‌కి వెళ్లాడు. కాసేపు అక్కడే ఉన్న ఆ వ్యక్తి.. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం గమనించి వెంటనే శానిటైజర్ బాటిల్‌ను తన బ్యాగులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడే ఏటీఎం సెంటర్‌లోని సీసీ కెమెరాల్లో ఈ తతంగమంతా రికార్డవ్వడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. సదరు వ్యక్తిని నెటిజనులు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. నీ కక్కుర్తి తగలడా.. ఓ ఇరవై రూపాయలు పెట్టి శానిటైజర్ కొనుక్కోలేవా అంటూ విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment