Sanitizer
-
టూత్ బ్రష్ మారుస్తున్నారా?ఎన్నాళ్లకు మార్చాలి? లేదంటే...!
ఉదయం లేవగానే పళ్ళు తోముకోవడం అనేది మనం చిన్నప్పటినుంచీ నేర్చుకుంటున్న ప్రాథమిక పాఠం. దంతాల ఆరోగ్యాన్ని(Oral health)కాపాడుకోవాలన్నా, లేదా నోరు పరిశుభ్రంగా ఉండాలన్నా క్రమం తప్పకుండా బ్రష్ చేసుకోవడం అవసరం. లేదంటే నోరు దుర్వాసన రావడం మాత్రమే కాదు. అనేక రోగాలకు దారి చూపించిన వారమవుతాం. పళ్లు తోముకునేందుకు సాధారణంటా అందరూ టూత్ బ్రష్ (tooth brush)నే వాడతాం. వేప పుల్లలతో పళ్లు తోముకునే వారు కూడా ఉన్నప్పటికీ టూత్ బ్రష్ వాడే వారే ఎక్కువ. అయితే ఈ బ్రష్ ఎన్నిరోజులకు ఒకసారి మార్చాలి. ఏళ్ల తరబడి ఒకే టూత్ బ్రష్‌ను వాడవచ్చా? ఇలా వాడితే ఎలాంటి సమస్యలొస్తాయి? వీటి గురించి ఆలోచించారా ఎపుడైనా?ఎపుడు మార్చాలి?దంత సంరక్షణ విషయంలో రోజూ బ్రష్ చేయడం ఎంత ముఖ్యమో, సమయానికి బ్రష్ మార్చడమూ అంతే ముఖ్యం. టూత్ బ్రష్ ను ఎన్ని రోజులు ఉపయోగించాలి అనే విషయంలో దంత వైద్యులు కచ్చితమమైన సిఫార్సులున్నాయి. ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు మార్చమని సిఫార్సు చేస్తారు. అరిగిపోయిన టూత్ బ్రష్ వాడుతూనే ఉంటానని చెబితే దంతక్షయం, చిగుళ్ల వ్యాధి వంటి అనేక సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ సూచనలను నిర్లక్ష్యం చేసినా, అవగాహనా లేమితో ప్రయత్నించినా నష్టం తప్పదు అరిగిపోయిన లేదా, విరిగిపోయిన లేదా పాడైపోయిన బ్రష్ లను అస్సలు వాడకూడదు. అటువంటి అరిగిపోయిన టూత్ బ్రష్‌ను ఉపయోగించడం వల్ల దంతాల నుండి బ్యాక్టీరియా పోదు సరికదా మరికొన్ని వ్యాధులకుమూలవుతుంది. శానిటైజ్బ్రష్లను తరచుగా మార్చడంతో పాటు ఉపయోగించిన తర్వాత టూత్ బ్రష్‌ను నీటితో బాగా కడగాలి. కనీసం వారానికి ఒకసారి శానిటైజ్ చేయాలి. వీటికి ప్రత్యేకమైన శానిటైజర్ల పరికరాలున్నాయి. లేని పక్షంలో వేడి నీళ్లలో నానబెట్టి, బాగా కడగాలి. యాంటీమైక్రోబయల్ మౌత్‌వాష్‌లో లేదా నీరు, వెనిగర్, బేకింగ్ సోడా మిశ్రమంలో 30 నిమిషాలు నానబెట్టి శుభ్రం చేసుకోవాలి.అలాగే బ్రష్ హోల్డర్లను బాత్రూంలలో అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా బ్రష్ ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ముంది.టూత్ బ్రష్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు. ప్రతి ఒక్కరికి వేర్వేరు నోటి బ్యాక్టీరియా ఉంటుంది .సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి మాన్యువల్ టూత్ బ్రష్‌ను మార్చాలి. ముఖ్యంగా నోటి శస్త్రచికిత్స, రూట్ కెనాల్ థెరపీ, చిగుళ్ల వ్యాధికి చికిత్స వంటి పంటి చికిత్సల తర్వాత.. బ్రష్ కచ్చితంగా మార్చాలని నిపుణులు అంటున్నారు. వైద్యం చేసిన ప్రాంతంలో బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ ముప్పు తగ్గించడానికి.. కొత్త బ్రష్ వాడటం మంచిది. చదవండి: 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయంఅనారోగ్యం తరువాతజలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి అంటువ్యాధుల నుంచి కోలుకున్న తర్వాత, టూత్ బ్రష్‌ను కచ్చితంగా మార్చాలి. బాక్టీరియా, వైరస్లు మీ టూత్ బ్లష్ పళ్లపై ఉంటాయి. ఇది మళ్లి ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశాన్ని పెంచుతుంది.క్ష్మక్రిములు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని నివారించాలంటే ఏదైనా అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత పాత బ్రష్‌ను వదిలేసి, కొత్త బ్రష్‌ను ఎంచుకోవాలి. అలాగే పాతబ్రష్ను బ్రష్‌నుంచి కూడా తొలగించడం కూడా చాలా ఉత్తమం. ఈ విషయంలో పిల్లల బ్రష్ విషయంలో మరింత అప్రమత్తత అవసరం. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడుతున్నా కూడా చాలా త్వరగా బ్రష్‌ను మార్చాల్సి ఉంటుంది. ప్రతి రెండు మూడు నెలలకోసారి దాని తలను(Head) మార్చుకోవాలి. ఎందుకంటే సాధారణ బ్రష్‌లతో పోలిస్తే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు ఇంకా వేగంగా అరిగిపోతాయి. -
అమ్మను నాన్నే చంపాడు
మేడ్చల్: కట్టుకున్న భార్యను హత్య చేసి పథకం ప్రకారం ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త దురాగతాన్ని ఆయన కూతురు బట్టబయలు చేసింది. సిద్దిపేట ములుగు మండలం తుంకిబొల్లారం గ్రామానికి చెందిన తిరునగర్ నవ్యశ్రీ(33), నాగేందర్ భార్యాభర్తలు. వీరికి కూతుళ్లు చందన, మేఘన ఉన్నారు. మేడ్చల్ పట్టణంలోని సూర్యనగర్ కాలనీలో నివాసముంటున్నా రు. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 20న నవ్యశ్రీ పూజ చేయడానికి అగ్గిపెట్టెను వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తూ అగ్గిపుల్ల చీరపై పడి మంటలు చెలరేగాయని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా అలానే పేర్కొంది. నవ్యశ్రీని ప్రాథమిక చికిత్సల అనంతరం గాంధీ ఆస్పత్రికి తర లించగా ఈ నెల 5న మృతి చెందింది. ఈ నెల 6న పెద్ద కూతురు చందన మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తల్లి నవ్యశ్రీని తండ్రి నాగేందర్ చంపాడని స్టేట్మెంట్ ఇచ్చింది. తల్లి ఒంటిపై నాగేందర్ శానిటైజర్ పోసి నిప్పటించాడని, అడ్డం వెళ్లిన తనపై కూడా శానిటైజర్ పోశాడని ఫిర్యాదు చేసింది. నాగేందర్ నవ్యశ్రీ ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఈ మేరకు నాగేందర్‌పై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
చిన్నారి ప్రాణం తీసిన శానిటైజర్
సాక్షి,అంబర్‌పేట(బెంగళూరు): శానిటైజర్ ఓ నాలుగేళ్ల పాప ప్రాణం మీదికి తెచ్చింది. ఒంటికి రాసుకున్న శానిటైజర్‌కు మంటలు అంటుకోవడంతో చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన శనివారం కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రామ్‌లక్ష్మణ్‌రాజ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.అంబర్‌పేట 6 నెంబర్లో నివాసం ఉంటున్న జగనాథం, రాజేశ్వరీ దంపతులకు అక్షర, ప్రీతి(4) ఇద్దరు కుమార్తెలు. రాజేశ్వరీ ఇద్దరు కుమార్తెలతో కలిసి కృష్ణానగర్‌లో ఉంటున్న పుట్టింటికి వచ్చింది. శనివారం రాజేశ్వరీ ఇంట్లో నిద్రిస్తుండగా అక్కాచెలెళ్లు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఒంటికి శానిటైజర్ రాసుకున్న ప్రీతి ఆడుకునే క్రమంలో దేవుడి వద్ద వెలుగుతున్న దీపం దగ్గరికి వెళ్లడంతో మంటలంటుకున్నాయి. దీనిని గుర్తించిన ఆమె అక్క అక్షర కేకలు వేయడంతో నిద్ర మేల్కొన్న తల్లి రాజేశ్వరీ నీళ్లు చల్లి మంటలు ఆర్పివేసింది. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెనం మీద నుంచి పొయ్యిలోకి ప్రపంచం..! -
శానిటైజర్‌కు ‘అగ్ని’పరీక్ష,.. ఇద్దరికి తీవ్రగాయాలు
సాక్షి, బంజారాహిల్స్: శానిటైజర్ కాలుతుందో.. లేదో చూద్దామని అగ్గిపుల్ల గీసి వేయడంతో మంటలు చెలరేగి ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు...బంజారాహిల్స్ రోడ్ నం.4లోని యానిమల్ కేర్ సెంటర్లో వికారాబాద్‌కు చెందిన జె.మొగలప్ప నాలుగేళ్లుగా పని చేస్తున్నాడు. అతనితో పాటు పవన్ ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 12న ఇద్దరూ కలిసి ఐదు లీటర్ల శానిటైజర్‌ను ఓ చిన్న డబ్బాలోకి ఒంపుతుండగా, అసలు శానిటైజర్‌కు నిప్పు అంటుకుంటుందా లేదా అని పవన్‌కు అనిపించింది. వెంటనే తన వద్ద ఉన్న అగ్గిపెట్టెను తీసి అగ్గిపుల్లను గీసి శానిటైజర్లో వేశాడు. ఒక్కసారి మంటలు చెలరేగి ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డాడు. మొగలప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనగర్‌కాలనీ తన్వీర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: దోమ తెరలు, బ్లాంకెట్ల సరాఫరా.. 60 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని.. ) -
జోడో యాత్రపై రాహుల్‌కు కేంద్రం హెచ్చరిక..
న్యూఢిల్లీ: చైనా సహా ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో భారత్‌లోనూ కలవరం మొదలైంది. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక వ్యాఖ్యలు. ఈ యాత్రలో పాల్గొనే వారు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. అందరూ మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని స్పష్టం చేశారు. కరోనా టీకాలు తీసుకున్న వారిని మాత్రమే భారత్ జోడో యాత్రలో అనుమతించాలని కేంద్రమంత్రి హితవు పలికారు. ఒకవేళ కరోనా నిబంధనలు పాటించడం సాధ్యం కాకపోతే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జోడో యాత్రను రాహుల్ తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈమేరకు రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు మాండవీయ లేఖ రాశారు. రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభమై ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకుంది. బుధవారం రాజస్థాన్ నుంచి హర్యానాలోకి ప్రవేశించింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్ర సాగుతోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల మీదుగా పాదయాత్ర చేసిన రాహుల్.. ప్రస్తుతం హర్యానాలో ఉన్నారు. చదవండి: రూ.500కే వంటగ్యాస్.. ఇది చూసైనా మారండి.. బీజేపీపై రాహుల్ సెటైర్లు.. -
Warangal: బర్త్‌డే వేడుకల్లో గొడవ.. శానిటైజర్ తాగిన విద్యార్థినులు
వరంగల్/ఎంజీఎం: హనుమకొండ జిల్లా ఆరెపల్లి సమీపంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆదివారం ఉదయం 10వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగారు. దీంతో రుతిక, స్ఫూర్తి, జోత్స్న, ఉమాదేవి, చార్విక అనే విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యు లు విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో స్కూల్ నిర్వాహకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ములుగు జిల్లా పాకాల కొత్తగూడకు సంబంధించిన జ్యోతిరావుపూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆరెపల్లి వద్ద ఒక ప్రైవేటు పాఠశాలను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. కాగా, శనివారం 10వ తరగతి విద్యార్థిని పుట్టినరోజు వేడుకల్లో తలెత్తిన గొడవ ఈ ఘటనకు దారి తీసినట్లు తెలుస్తోంది. బర్త్‌డేకు హాస్టల్లోని వారే కాకుండా ఇతర విద్యార్థులు కూడా హాజరు కావడంతో హాస్టల్ విద్యార్థినుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో ఈ గొడవపై వసతి గృహం అధి కారులు విద్యార్థినులను మందలించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ విషయాన్ని వారు ఆదివారం ఉదయం ప్రిన్సి పాల్ దృష్టికి తీసుకెళ్లడంతో గొడవతో సంబంధం ఉన్న ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. అధికారులు మాత్రం విద్యారి్థని బర్త్ డే వేడుకల్లో తలెత్తిన గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. కాగా, హాస్టల్లో విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లు ఆరా తీసినట్లు సమాచారం. ఆస్పత్రి లో ఉన్న విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని వై ద్యులకు సూచించినట్లు తెలుస్తోంది. విచారణకు ఆదేశించిన మంత్రి.. ఈ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ విచారణకు ఆదేశించినట్లు చెపుతున్నారు. మరో పక్క ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చే స్తున్నాయి. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వరంగల్ అదనపు కలెక్టర్ శ్రీవత్స పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారో.. తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. విద్యారి్థనుల తల్లిదండ్రులతో మాట్లాడి హాస్టల్లో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్ ఎదుట సంతోష్ హాజరు లేనట్టే! -
పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న... పరిశుభ్రత ప్రశ్నార్థకం
సాక్షి, హైదరాబాద్: మండుతున్న ఎండలకు తోడు కోవిడ్ ఫోర్తు వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో పరిశుభ్రత, శానిటేషన్, తాగునీటి ఏర్పాట్లు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నెల 23 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణ కోసం ప్రభుత్వ పాఠశాలలను కూడా పరీక్ష కేంద్రాలుగా గుర్తించడంతో ఏర్పాట్లు సమస్యగా మారాయి. సర్కారు బడుల్లో నాలుగో తరగతి ఉద్యోగుల కొరత వెంటాడుతుంటంతో ఇప్పటి వరకు ప్రైవేటు సిబ్బందితో పనులు కొనసాగిస్తూ వచ్చారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు రానప్పటికీ టీచర్లందరు కలిసి సిబ్బంది వేతనాలను భరిస్తూ వచ్చారు. ఇక పరీక్షలు కేంద్రాల్లో సదుపాయాలను సమకూర్చేందుకు నిధుల కొరతతోపాటు ప్రైవేట్ సిబ్బంది విధులకు హాజరయ్యే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి సెలవుల సందర్భంగా ఇప్పటివరకు పాఠశాలల్లో పనిచేసిన స్వీ పర్లు, స్కావెంజర్లు డ్యూటీకి రాకుంటే పరిస్థితి ఏమిట ని ప్రధానోపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 62 మంది సిబ్బందే.. హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 690 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నా యి. ఆయా స్కూళ్లలో ప్రస్తుతం 1,06,635 మంది చదువుతుండగా, 6,200 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు నాలుగో తరగతికి చెందిన సుమారు 62 మంది పర్మనెంట్ అటెండర్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ఇతర పాఠశాలల్లో ప్రైవేట్ సిబ్బందిని నియమించుకుని తరగతి గదులు, నీటి ట్యాంకులు, మరుగుదొడ్లను శుభ్రం చేయడంతోపాటు విద్యార్థులకు తాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్ధితేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రెండేళ్ల నుంచి.. కరోనాకు ముందు పాఠశాల నిధులు (స్కూల్ గ్రాంట్) నుంచి కొంత డబ్బులు తీసి ఒక్కొక్కరికి నెలకు రూ.2500 వేతనం కింద ఇచ్చేవారు. సర్వశిక్ష అభియాన్ కింద కేటాయించే నిధులను కోవిడ్ కాలం నుంచి రద్దు కావడంతో హెచ్ఎంలు, ఉపాధ్యాయులపై భారం పడినట్లయింది. తాము పని చేస్తున్న స్కూల్లో మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులు, తరగతి గదులను శుభ్రం చేయించేందుకు సొంతంగా డబ్బులు సమకూర్చే పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న స్కూల్లో ఒక్కొక్కరు రూ.300 నుంచి 500 ఇస్తుండగా, ఎక్కువ ఉన్న చోట్ల రూ.500–1000 వరకు వేసుకొని వారికి వేతనాలుగా అందిస్తున్నారు. పరీక్షల సమయంలో ఎలా? వాస్తవంగా ప్రతి ఏటా పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ రెండో వారంలోగా పూర్తవుతుంటాయి. అప్పుడు అటెండర్లు, స్వీపర్లు, స్కావెంజర్ల సమస్య ఎదురయ్యేది కాదు. ప్రస్తుతం వేసవి సెలవుల సమయంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనుండడంతో ఏర్పాట్లు సమస్యగా తయారైంది. వేసవి సెలవుల్లో ప్రైవేట్ స్వీపర్లు, స్కావెంజర్లు విధులకు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదని కొందరు ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. పరీక్షలు జరుగుతున్నప్పుడు రోజువారీగా తరగతి గదులను శుభ్రం చేయడంతోపాటు తాగునీటిని అందించాల్సిన అవసరం ఉంది, ఎండాకాలం సెలవుల్లో వేతనం ఇచ్చే పరిస్థితి ఉండకపోవడంతో మెజారిటీ సిబ్బంది విధులకు హాజరుపై నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రంజాన్‌కు భారీ బందోబస్తు) -
మీ కంపెనీ సర్వీస్ చెత్తగా ఉంది,లక్షన్నర ఫోన్ ఆర్డర్ ఇస్తే శానిటైజర్ ఇచ్చారు!!
ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుకలు, అట్టముక్కలు రావడం సర్వ సాధారణమయ్యాయి. తాజాగా ఓ మహిళ తనకెంతో ఇష్టమైన ఐఫోన్ బుక్ చేసింది. అయితే ఐఫోన్ బుక్ చేసిన ఆమెకు అనూహ్యంగా శానిటైజర్ డబ్బా డెలివరీ అయ్యింది. దీంతో కంగుతిన్న బాధితురాలు లక్షన్నర ఫోన్ ఆర్డర్ ఇస్తే శానిటైజర్ డబ్బా వచ్చింది! ఏం చేసుకోను అంటూ ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. లండన్ కు చెందిన 32 ఏళ్ల ఖవ్లా లఫాహిల్ గతేడాది యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 13 మ్యాక్స్‌ప్రో ను బుక్ చేసింది. యూకేలో ఆ ఫోన్ ధర 2,031 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం(సుమారు రూ.1,51,713.67) బుక్ చేసిన కొన్నిరోజల తర్వాత తన ఇంటికి వచ్చిన ఐఫోన్ పార్శిల్ ఓపెన్ చేసి చూడగా అందులో శానిటైజర్ ఉండడంతో అవాక్కు అవ్వడం ఆమె వంతైంది. అంతే ఐఫోన్‌కు బదులు శానిటైజర్ రావడంతో ఆగ్రహానికి గురైంది.మీ కంపెనీ సర్వీస్ చెత్తగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దిగివచ్చిన యాజమాన్యం బాధితురాలికి క్షమాపణలు చెప్పింది. త్వరలోనే ఐఫోన్ 13 మ్యాక్స్ ప్రోను అందిస్తామని సదరు డెలివరీ సంస్థ నిర్వాహకులు హామీ ఇచ్చారు. -
చిన్నారి ఉసురు తీసిన దంపతుల తగాదా
లింగోజిగూడ: భార్యాభర్తల మధ్య తగాదా ఏడు నెలల చిన్నారి ప్రాణం తీసింది. నల్లగొండ జిల్లా నాంపల్లికి చెందిన రాయత్ వెంకటేశ్, సువర్ణలకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. హయత్‌నగర్ బంజారా‡కాలనీకి వచ్చి స్థిరపడ్డారు. వెంకటేశ్ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి మొదట కవల పిల్లలు జన్మించగా అనంతరం కన్నయ్య (7 నెలలు) జన్మించాడు. వెంకటేశ్, సువర్ణల మధ్య గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 11న కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ అనంతరం భర్త బయటకు వెళ్లగానే కన్నయ్యతోపాటు తనపై కూడా శానిటైజర్ పోసుకుని సువర్ణ నిప్పంటించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సువర్ణను ఆసుపత్రికి తరలించారు. కన్నయ్యను నీలోఫర్ ఆసుపత్రికి తరలించి.. అనంతరం పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కన్నయ్య గురువారం మృతిచెందగా సువర్ణ చికిత్స పొందుతోంది. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఎలాంటి మాస్క్‌లు ధరించాలంటే..
కొత్త సంవత్సర వేడుకలు, పండుగల నేపథ్యాల్లో ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభించొచ్చన్న వైద్య వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయన్న ఆందోళన నడుమే.. వ్యాక్సినేషన్ రేటు రోజురోజుకీ పెరిగిపోతోంది కూడా. అదే తరుణంలో మాస్క్‌ల వాడకం, ఇతర జాగ్రత్తల గురించి కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కరోనా వేరియెంట్లలో డెల్టా, ఒమిక్రాన్ వేరియెంట్లు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ తరుణంలో వైద్య నిపుణులు ‘మాస్క్ అప్‌గ్రేడ్’ థియరీని తెరపైకి తీసుకొచ్చారు. అంటే.. ఇప్పుడు వాడుతున్న వాటి కంటే మెరుగైన మాస్క్‌లను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం విజృంభిస్తున్న వైరస్ వేరియెంట్ల స్థాయికి సాధారణ మాస్క్‌లు సరిపోవంటున్నారు గ్లోబల్ హాస్పిటల్స్ పల్మనాలిజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ హరీష్ ఛాప్లే. సాధారణ మాస్క్‌లు, సర్జికల్ మాస్క్‌ల కంటే.. ఎన్95, ఎఫ్ఎఫ్పీ2, కేఎన్95 మాస్క్‌లు ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ముఖ్యంగా వైద్య సిబ్బందిని ఇవి కచ్చితంగా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హెల్త్ కేర్ వర్కర్స్, ఇన్ఫెక్షన్కు గురయ్యే హైరిస్క్ ఉన్న వాళ్లు ఈ తరహా మాస్క్‌లు ఉపయోగించాలని చెప్తున్నారు. అయితే ఇమ్యూనిటీ జోన్లో ఉన్నవాళ్లు, వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకున్నవాళ్లు క్లాత్ మాస్క్‌ల ద్వారా కూడా రక్షణ పొందవచ్చని ఇంటెర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ వినీత తనేజా చెప్తున్నారు. కాకపోతే సింగిల్, డబుల్ లేయర్ మాస్క్‌ల కంటే మూడు పొరల మాస్క్‌ల్ని ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఒకవేళ సింగిల్, డబుల్ లేయర్ మాస్క్‌లు గనుక ఉపయోగిస్తున్నట్లయితే.. వాటిపైనా మరో మాస్క్ ధరించడం మేలని చెప్తున్నారు. ఇక ఎలాంటి మాస్క్ ధరించాలని ఎంచుకోవడం కంటే.. దానిని సరిగా ధరించడం ఇప్పుడు తప్పనిసరి అవసరం. ఎందుకంటే వైరస్ వేరియెంట్లు ఎంత ప్రమాదకరమైనవి అయినా.. రక్షణ కల్పించే మార్గం ఎక్కువగా ఇదొక్కటి మాత్రమే అని డాక్టర్ వినీత చెప్తున్నారు. చాలామంది మాస్క్‌ను కిందకి పైకి జారవేస్తూ ఉంటారు. కానీ, దీనివల్ల రిస్క్‌కు ఛాన్స్ ఉంటుంది. అందుకే బహిరంగ ప్రదేశాల్లో, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో మాస్క్‌ను ముక్కు పైభాగం నుంచి గదవ భాగం వరకు పూర్తిగా కప్పి ఉంచడం ఉత్తమమని డాక్టర్ వినీత చెప్తున్నారు. ఉత్తగా ధరించడం కాదు.. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో చాలామంది జాగ్రత్తలను పక్కాగా పాటించారు. అయితే రాను రాను ఆ వ్యవహారం చిరాకు తెప్పించడమో లేదంటే వ్యాక్సినేషన్ ఇచ్చిన ధైర్యమోగానీ ఆ అలవాట్లను చాలావరకు దూరం చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాస్క్‌ల విషయంలో అయినా కనీస జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ టిప్స్ ►మాస్క్‌లను తీసేటప్పుడు, ధరించేటప్పుడు వాటి చివరల దారాలను మాత్రమే ముట్టుకోవాలి. ►క్లాత్ మాస్క్‌లను ఒక్కసారిగా వాడాక శుభ్రంగా ఉతకాలి. వేడినీళ్లలో ఉతక్కూడదు. ►సర్జికల్ మాస్క్‌లను మళ్లీ ఉపయోగించడం మంచిదికాదు. ►ఇంట్లో అందరి మాస్క్‌లను కలిపి ఉంచకూడదు. విడివిడిగా ఉంచాలి. ►మాస్క్ మీద శానిటైజర్ చల్లడం, రుద్దడం లాంటివి చేయకూడదు. ►మాస్క్‌లకు డ్యామేజ్లు, లీకేజీలు లేకుండా చూసుకోవాలి. ►ఇతరులతో మాట్లాడేటప్పుడు మాస్క్‌లను పదే పదే కిందకి జరపడం లాంటివి చేయకపోవడం మంచి అలవాటు. ►పిల్లలకు నాన్ మెడికల్ మాస్క్‌లు వాడడం మంచిది. ►పిల్లలకు ఆరోగ్య సమస్యలుంటే గనుక వైద్యులను సంప్రదించి మెడికల్ మాస్క్‌లు వాడొచ్చు. ►మాస్క్ జాగ్రత్తగా వాడడమే కాదు.. వాటిని పారేసేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించడం ఒక బాధ్యత. మరికొన్ని.. ♦పదే పదే ముఖాన్ని చేతులతో రుద్దకపోవడం. ♦సామూహిక భోజనాలకు దూరంగా ఉండడం. ♦తరచూ చేతుల్ని సబ్బుతో, హ్యాండ్‌వాష్‌తో క్లీన్ చేసుకోవడం. ♦చలికాలంలో జలుబు, ఇతర సమస్యల కారణంగా అలర్జీతో ముక్కులో వేలు పెడుతుంటారు. అలా చేయకపోవడం ఉత్తమం. ♦శానిటైజర్ రాసిన చేతులతో తినుబండారాల్ని తాకరాదు. ♦శానిటైజర్‌ను క్యారీ చేయడం మరీ మంచిది. మాస్క్‌ను ధరిస్తూ శుభ్రతను పాటిస్తూ వీలైనంత మేర భౌతిక దూరం పాటిస్తే సాధారణ జాగ్రత్తలతోనూ కరోనా వేరియెంట్లను జయించొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
‘కరోనా’ అలవాట్లకు గుడ్‌బై.. భారీ దెబ్బే!
Hygiene Products Business Fall After Vaccination In India: కరోనా టైంలో అలవర్చుకున్న ఆరోగ్య సూత్రాలకు, శుభ్రతా అలవాట్లకు జనాలు గుడ్‌బై చెప్పేస్తున్నారా?!. కొవిడ్ పూర్వ అలవాట్లకు మళ్లుతున్నారు. తగ్గుతున్న హైజీన్, రోగ నిరోధక ఉత్పత్తుల అమ్మకాలు, ఆయా సెగ్మెంట్స్ నుంచి కంపెనీలు తప్పుకుంటున్న వైనం పరిస్థితి అదేనని చెప్తోంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రజల్లో పరిశుభ్రత, ఆరోగ్య సూత్రాలు పాటించడం, రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రాధాన్యమివ్వడం పెరిగింది. మాస్క్‌ల మొదలు.. శానిటైజర్లు, ఫ్లోర్ క్లీనర్లు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారోత్పత్తులు.. తదితర అమ్మకాలు భారీగా జరిగాయి. పాత తరం ఫుడ్డు, అలవాట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ప్రజలు కొత్త(పాత) జీవన విధానానికి క్రమంగా అలవాటు పడిపోతున్నారని, రానున్న రోజుల్లో ఇదే కొనసాగిస్తారనే అభిప్రాయం ఏర్పడింది. కానీ.. కొన్నాళ్లుగా టీకాల ప్రక్రియ వేగవంతమవుతుండటం, ఎకానమీలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి జోరందుకుంటూ ఉండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలు కోవిడ్ పూర్వ అలవాట్లకు క్రమంగా మళ్లుతున్నారు. హైజీన్ (పరిశుభ్రత), ఆరోగ్య సంరక్షణ, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ ప్రొడక్టుల ఉత్పత్తుల అమ్మకాలు మార్కెట్లో తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనం. దీనితో గంపెడు ఆశలు పెట్టుకున్న కంపెనీలు..ఈ విభాగాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడమో లేదా ఆయా ఉత్పత్తుల తయారీని తగ్గించుకోవడమో చేస్తున్నాయి. ఈ–కామర్స్ వంటి అత్యధిక వృద్ధి అవకాశాలు ఉండే మాధ్యమాల్లో కూడా అమ్మకాలు దాదాపు సున్నా స్థాయికి తగ్గిపోవడం మరో విశేషం. కంపెనీలు వెనక్కి.. శానిటైజర్లు, క్లీనర్ల ఉత్పత్తులకు సంబంధించి కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. డాబర్, పార్లే ప్రోడక్ట్స్, ఇమామి వంటి కంపెనీలు ఇప్పటికే హ్యాండ్ శానిటైజర్ విభాగం నుంచి తప్పుకున్నాయి. ఇమామీ నెమ్మదిగా డిస్ఇన్ఫెక్టెంట్ ఫ్లోర్ క్లీనర్లు, సర్ఫేస్ శానిటైజర్లు, డిష్ వాష్ జెల్ లాంటి సెగ్మెంట్ల నుంచి కూడా తప్పుకుంటోంది. ‘మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా ఈ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగానే ఉంటాయన్న అంచనాలు అన్నీ తప్పుతున్నాయి. వినియోగదారులు నెమ్మదిగా మల్లీ కోవిడ్ పూర్వ జీవన విధానాలకు మళ్లుతున్నారు. వీటి వినియోగం దారుణంగా తగ్గిపోయింది’ అని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇక చ్యవన్‌ప్రాశ్ మినహా మిగతా ఉత్పత్తుల తయారీని గణనీయంగా తగ్గించుకున్నట్లు ఇమామి సంస్థ వర్గాలు వెల్లడించాయి. హెచ్‌యూఎల్ ఆశాభావం.. ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ కూడా హ్యాండ్ శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌ల విక్రయాలు గణనీయంగా తగ్గినట్లు వెల్లడించింది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కొత్త అలవాట్లను కొనసాగించగలరని ఆశాభావం వ్యక్తం చేసింది. చిరువ్యాపారులకు తప్పట్లేదు బడా కంపెనీల విషయంలోనే కాదు.. చిరువ్యాపారులకు సైతం ఈ ఇబ్బందులు తప్పట్లేదు. పండ్లు, డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసుల దుకాణాలు కరోనా టైంలో చేసిన భారీ బిజినెస్‌లో ఇప్పుడు సగం కూడా చేయట్లేదు. దీంతో చాలా వరకు దుకాణాలు మూతపడుతున్నాయి. రోడ్ సైడ్ వెండర్లదీ ఇంతకన్నా దీనస్థితి. మరోవైపు మాంసం అమ్మకాలు సైతం కిందటి ఏడాదితో పోలిస్తే 30 శాతానికి పడిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. చదవండి: దేశంలో భారీగా పెరిగిన ఆదాయ అసమానతలు -
దీపావళి 2021: శానిటైజర్లతో జాగ్రత్త! హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ!!
Safe Diwali Tips In Telugu: దేశవ్యాప్తంగా పిల్లా పాపలతో కలిసి దీపావళి సంబరాన్ని ఉత్సాహంగా జరుపుకునేందుకు సిద్ధమవు తున్నారు. కుల మత ప్రాంత విభేదాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ దీపావళి. అయితే పలుదేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్న తరుణంలో కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముంచు కొస్తున్న కాలుష్య భూతం కోరలకు చిక్కకుండా వీలైనంతవరకు క్రాకర్స్‌కు దూరంగా ఉండాలని కనీసం పర్యావరణ హితమైన గ్రీన్‌క్రాకర్స్ మాత్రమే వినియోగించాలంటున్నారు. దీంతోపాటు చిన్నపిల్లలు వృద్ధులను దృష్టిలో ఉంచుకుని భారీ శబ్దాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. పెంపుడు జంతువులకు కూడా పెద్ద పెద్ద శబ్దాలు హానికరం. మరీ ముఖ్యంగా టపాసులు అంటే పిల్లలకు చాలా ఇష్టం. ఉత్సాహంగా దూసుకుపోతూ వుంటారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆనందంగా దీపావళి జరుపు కోవచ్చు. ప్రమాదాలు లేని దీపావళి కోసం జాగ్రత్తలు పాటిద్దాం.. తద్వారా సర్వత్రా వెలుగు దివ్వెల పండుగ దీపావళి కాంతులు నింపుదాం. శానిటైజర్ల వినియోగంలో అప్రమత్తత దీపావళి పండుగలో కీలకమైన దీపాలు, కొవ్వొత్తులను వెలిగించే ముందు శానిటైజర్ల వాడకాన్ని మానుకోండి. ముఖ్యంగా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను వాడకండి. ఎందుకంటే శానిటైజర్లు మండించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇది తీవ్రమైన అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా నీరును, పేపర్ సబ్బులు బెటర్. అలాగే దీపాలను వెలిగించే ముందు టపాసులు వెలిగించిన తరువాత చేతులు సరిగ్గా కడుక్కోవాలి. దీపావళికి తగిన దుస్తులు ఉదయం నుంచి ఎథ్నిక్ వేర్, డిజైనర్ వేర్ ఎలాంటి దుస్తులు ధరించినా పరవాలేదు కానీ, టపాసులు కాల్చే సమయంలో షిఫాన్, జార్జెట్, శాటిన్, సిల్క్ ఫ్యాబ్రిక్స్‌కు దూరంగా ఉండాలి. దీనికి బదులుగా, కాటన్ సిల్క్, కాటన్ లేదా జ్యూట్ దుస్తులను ధరించడం మంచిది. ►టపాసులు కాల్చేటప్పుడు కాస్త వదులైన మందపాటి కాటన్ దుస్తులను ధరించడం, తప్పనిసరిగా కాళ్లకు చెప్పులు ధరించడం మంచిది. ►కాకరపువ్వొత్తులు, మతాబులు, పెద్ద పెద్ద బాంబులు వంటివి కాల్చేటప్పుడు చిన్న పిల్లలకు పెద్దలెవరైనా సహాయంగా ఉండటం మంచిది. ►టపాసులు, బాంబులు వంటి పేలుడు పదార్థాలను గృహసముదాయాల వద్ద కాకుండా దూరంగా ఆరుబయట ప్రదేశంలో కాల్చడం మంచిది. ►కొన్ని రకాల టపాసులను కాల్చేసిన తర్వాత ఆవి పూర్తిగా ఆరిపోయాయో లేదు తనిఖీ చేసుకోవాలి. పిల్లలు తొందరపాటుగా వాటి సమీపానికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ►ఇంట్లో ఉన్న అందరూ రాకెట్లు, తారాజువ్వలు వంటివి కాల్చేటప్పుడు అవి ఇతరుల ఇళ్లలోకి చొరబడకుండా దిశ సరిగా ఉండేలా చూసుకోవాలి. ►దీపావళి టపాసులు కాల్చేటపుడు కళ్లకు రక్షణగా కళ్లజోడు ధరించడం కూడా చాలా మంచిది. ఈ జాగ్రత్తల విషయంలో తల్లిదండ్రులు, పెద్దలు బాధ్యతగా వ్యవహరిస్తే.. హ్యాపీ అండ్ సేఫ్ దివాలి సొంతమవుతుంది. కరోనా సమయంలో సంబంధిత మార్గదర్శకాలను పాటిస్తూ సురక్షితంగా దీపావళిని జరుపుకోవాలి. ప్రతీ ఏడాది దీపావళి తరువాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి పెరగడం మనం చూస్తున్నాం. దీంతో శ్వాసకోశ రుగ్మతలు, సంబంధిత బాధితులు మరింత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందులోనూ ప్రస్తుత కోవిడ్-19 సమయంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కాలుష్యమైన గాలి చాలా ప్రమాదకరమని పల్మనాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. -
ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మరింత రక్షణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా ముప్పు ఇప్పటికీ పూర్తిగా తొలగిపోలేదు. ముఖ్యంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది భవిష్యత్తులో పీపీఈ కిట్లు, శానిటైజర్లు తొడుక్కునే విధులు నిర్వహిస్తున్నారు. అయితే పీపీఈ కిట్లను సురక్షితంగా వదిలి, వైరస్‌ను ఇంటికి తీసుకెళ్లకుండా ఉండేందుకు వీలుగా త్వస్త మ్యాన్యు ఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్, సెయింట్ గోబెన్ కంపె నీలు కొత్త ఆవిష్కరణ చేశాయి. త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత ద్వారా డాఫింగ్ యూనిట్లను రూపొందించారు. ఏమిటీ డాఫింగ్ యూనిట్లు..? ఆరోగ్య సిబ్బంది తమ పీపీఈ కిట్లు, గ్లోవ్స్‌ను సురక్షితంగా వదిలిపెట్టేందుకు ఉపయోగపడే నిర్మాణమే డాఫింగ్ యూనిట్. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులు స్థాపించిన త్వస్త మ్యాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్, సెయింట్ గోబెన్ సంయుక్తంగా 2 యూనిట్లు తయారు చేశారు. ఒకదాన్ని కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేశాయి. రెండో యూనిట్‌ను చెన్నైలోని ఒమండురార్ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. నిర్మాణంలో ఉన్న మూడో యూనిట్‌ను తిరువళ్లువార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేయనున్నారు. అతినీల లోహిత కిరణాలు, సీ స్టెరిలైజేషన్ బాక్స్, ఆటోమెటిక్ శానిటైజర్, సోప్ డిస్పెన్సర్ వంటి సౌకర్యాలు ఇందులో ఉంటాయి. ఇవీ ప్రయోజనాలు.. డాఫింగ్ యూనిట్లో పీపీఈ కిట్లు, ఇతర వస్తువులను సురక్షితంగా విడిచిపెట్టొచ్చు. వైద్యులు, సిబ్బంది షిఫ్ట్‌లు ముగించుకుని వెళ్లేటప్పుడు లేదా విధుల్లోకి చేరేటప్పుడు తమను తాము శానిటైజ్ చేసుకునేందుకూ ఇవి ఉపయోగపడతాయి. త్వస్త మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూష న్స్ అభివృద్ధి చేసిన టెక్నాలజీకి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అందించామని సెయింట్ గోబెన్ తెలిపింది. -
ఫ్రిజ్, టీవీ, ఐపాడ్, మాస్క్: ఆటోనా.. హైటెక్ హోటలా?
చెన్నై: మనలో అందరికి చాలా ఆశలు, కోరికలుంటాయి. కానీ కొందరు మాత్రమే తన వాటిని తమ కలలను సాకారం చేసుకుంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. సరే వాటిని అధిగమించి.. తాము అనుకున్నది సాధిస్తారు. సాధించాలనే సంకల్పం, గట్టి పట్టుడదల ఉంటే చాలు.. మిగతా సమస్యలన్ని దూది పింజల్లా తేలిపోతాయి. ఈ మాటలకు ఆకారం వస్తే.. అతడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆటోవాలా అన్నా దురైలా ఉంటాడు. పారిశ్రామికవేత్త కావాలనేది అన్నాదురై చిన్ననాటి కోరిక. కానీ దానికి తగ్గ డబ్బు, చదువు అతడి వద్ద లేదు. అయితే ఇవేవి అతడిని అడ్డుకోలేకపోయాయి. తన దగ్గరున్న ఆటోనే ఓ పరిశ్రమలా భావించాడు. దానిలో ఎక్కే కస్టమర్లను ఆకర్షించడం కోసం అతడు ఎంచుకున్న మార్గం.. ఇప్పుడతన్ని ప్రత్యేకంగా, వార్తల్లో నిలిచే వ్యక్తిగా మార్చింది. అన్నాదురైకి సంబంధించిన కథనాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. తమిళనాడు, చెన్నైకి చెందిన అన్నాదురై ఆర్థిక ఇబ్బందులు వల్ల పెద్దగా చదువుకోలేదు. కానీ పారిశ్రామికవేత్త కావాలనేది అతడి కోరిక. అయితే కుటుంబ పరిస్థితులు దృష్ట్యా ఆటో నడపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కానీ పారిశ్రామికవేత్త కావాలనే అతడి కోరిక మాత్రం తనని నిద్రపోనివ్వలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అతడికి తట్టిన ఓ వినూత్న ఐడియా అన్నాదురై జీవితాన్ని మార్చేసింది. తాను నడుపుతున్న ఆటోనే ఓ పరిశ్రమలా భావించాడు అన్నాదురై. ఇక తన ఆటోలోకి ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలంటే ఏం చేయాలా అని బాగా ఆలోచించాడు. ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తుంది. కనుక జనాలు ఆటోల్లో తిరగాలంటే భద్రత ముఖ్యం.. ఆ తర్వాత ప్రయాణికులు తమ గమ్యస్థానం చేరేవరకు వారికి ఎంటర్టైన్మెంట్ కల్పించడం ముఖ్యం అనుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రణాళిక రచించాడు అన్నాదురై. దాని ప్రకారం తన ఆటోలో మాస్క్, శానిటైజర్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఓ ఐపాడ్, టీవీ, చిన్న ఫ్రిజ్ ఏర్పాటు చేశాడు. ఆటో ఎక్కిన వారికి అందులో ఉన్న సౌకర్యాలు చూస్తే నిజంగానే మతి పోతుంది. తాము ఆటో ఎక్కామా లేక.. ఏదైనా స్టార్ హోటల్లో ఉన్నామా అనే అనుమానం కలగక మానదు. ఈ వినూత్న ఆలోచనే అతడి జీవితాన్ని మార్చేసింది. ఇక అన్నాదురై 9 భాషల్లో తన కస్టమర్లను పలకరిస్తాడు. వారితో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. ఇన్ని హైటెక్ హంగులతోపాటు.. కస్టమర్లను దైవంగా భావిస్తున్న అన్నాదురై ఆటో అంటే ఆ ప్రాంతంలో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఒక్కసారి అతడి ఆటో ఎక్కిన వారు.. మళ్లీ మళ్లీ దానిలోనే ప్రయాణం చేయాలని కోరుకుంటారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబేలో జూల్ 15న పోస్ట్ చేసిన అన్నాదురై స్టోరీ ఎందరినో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 1.3 మిలియన్ల కన్నా ఎక్కువ మంది దీన్ని వీక్షించారు. అన్నాదురై వినూత్న ఆలోచనపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
కరోనా కాలంలో పుట్టిన పిల్లలు ఇలానే చేస్తారట..!
మన జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. కరోనా వైరస్ వ్యాప్తితో ఈ విషయం మరింత బాగా అర్థం అవుతుంది. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి మాస్క్ ధరించడం, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటివి మన జీవితంలో నిత్యకృత్యమయ్యియి. పెద్దలతో పాటు చిన్నారులు కూడా వీటిని పాటిస్తున్నారు. ఈ అలవాట్లు చిన్నారులపై మరీ ముఖ్యంగా కరోనా కాలంలో జన్మించిన చిన్నారులపై ఎంత ప్రభావం చూపాయో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇప్పటికే ఈ వీడియోని 1.8మిలియన్ల మంది చూశారు. ఆ వివరాలు.. ప్రస్తుతం షాపింగ్ మాల్స్, ఆఫీసులు, ఆస్పత్రులు ఇలా ప్రతి చోటా శానిటైజర్ స్టాండ్లు కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్లాలంటే తప్పకుండా శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాల్సిందే. ఈ క్రమంలో ఓ చిన్నారి తనకు కనిపించిన లాంప్ పోస్ట్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, లాన్లో ఉన్న లైట్ స్టాండ్, ఆఖరకు గార్డెన్లో ఉన్న చిన్న గోడ.. ఇలా తనకు కనిపించిన ప్రతి దాన్ని శానిటైజర్ స్టాండ్‌గా భావిస్తుంది. దాని దగ్గరకు వెళ్లి.. వాటిని తడిమి.. చేతిలో శానిటైజర్ పడినట్లు భావిస్తుంది. ఆ తర్వాత చేతులను రుద్దుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. బేబీగ్రామ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీన్ని చూసిన వారిలో చాలా మంది మా పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారు. శానిటైజర్ డబ్బా కనిపిస్తే చాలా చేతులు చాస్తున్నారు అని కామెంట్ చేస్తున్నారు. ఎంతో అమాయకంగా ఉన్న ఈ చిన్నారి చేష్టలు బలే ముద్దుగా ఉన్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో సెల్ఫీ వీడియో తీసుకుని
బోనకల్: మండలంలోని చిరునోముల గ్రామంలో మంగళవారం రాత్రి తన ప్రియుడు పెళ్లికి ఒప్పుకోవడం లేదని మనస్తాపంతో ప్రియురాలు శానిటైజర్ తాగి ఆత్మాహత్యాయత్నం చేసింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పారా సింధు రావినూతలకు చెందిన పర్సగాని వేణు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. తనను శారీరకంగా లొంగదీసుకొని పెళ్లి చేసుకోకుండా మొహం చాటేస్తున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్లో పది రోజుల కిందట వేణుపై సింధు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని ఇప్పటికే రెండు సార్లు ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేసింది. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శానిటైజర్ తాగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సింధును కుటుంబ సభ్యులు రావినూతలలో ఉన్న ప్రియుడి ఇంటి ఎదుట వదిలేశారు. దళితురాలైనందున తనను పెళ్లి చేసుకునేందుకు ప్రియుడి తల్లిదండ్రులకు ఇష్టం లేదని అందుకు తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, ఎవ్వరినీ వదిలిపెట్టవద్దని సూసైడ్ నోట్లో పేర్కొంది. -
ప్రాణం తీసిన శానిటైజర్
సాక్షి, చెన్నై: తమిళనాడులో తిరుచ్చి ఈబీ రోడ్డుకు చెందిన బాలమురుగన్ కుమారుడు శ్రీరాం (13) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం మిత్రులు వంటావార్పుతో సహపంక్తి భోజనం ఆటకు సిద్ధమయ్యారు. మిత్రులు వారి వారి ఇళ్ల నుంచి తెచ్చిన పప్పు, బియ్యం, కూరగాయలను పాత్రలో వేసి పొయ్యి మీద పెట్టారు. ఇంట్లో నీలం రంగులో ఉన్న ద్రవాన్ని కిరోసిన్‌గా భావించిన బాలుడు శ్రీరాం ఆ మంటల మీద పోశాడు. క్షణాల్లో ఆ మంటలు బాలుడిని చుట్టుముట్టాయి. మిత్రుల కేకలు విన్న ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే శ్రీరాం శరీరం 90 శాతం మేర కాలిపోయింది. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడు మృతిచెందాడు. కిరోసిన్ అనుకుని శానిటైజర్‌ను పొయ్యిలో పోయడం, ఆ బాటిల్ చేతిలోనే ఉండటంతో మంటలు చుట్టుముట్టినట్టు విచారణలో తేలింది. -
TMC Dulal Roy: వైరస్ పూర్తిగా అంతమయ్యేలా శానిటైజర్‌తో శుద్ధి!
సురీ: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భమ్ జిల్లాలో గురువారం దాదాపు 150 మంది బీజేపీ కార్యకర్తలు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)లో చేరారు. వీరంతా గతంలో టీఎంసీలో ఉన్నవారే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో మళ్లీ సొంతింట్లో అడుగుపెట్టారు. అయితే, టీఎంసీ నేతలు వారిపై శానిటైజర్ చల్లిన తర్వాతే తమ పార్టీలో చేర్చుకోవడం సంచలనాత్మకంగా మారింది. ఈ కార్యక్రమం కోసం ఇలామ్‌బజార్ ప్రాంతంలో ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు. బీజేపీ నుంచి వస్తున్న కార్యకర్తలపై టీఎంసీ స్థానిక నాయకులు శానిటైజర్ చల్లారు. తర్వాత టీఎంసీ జెండాలను వారి చేతుల్లో పెట్టారు. ఇన్నాళ్లూ వారు బీజేపీ కోసం పని చేశారని, వైరస్‌తో ప్రభావితమయ్యారని, తమ పార్టీలో చేర్చుకునేముందు వారిపై వైరస్ పూర్తిగా అంతమయ్యేలా శానిటైజర్‌తో శుద్ధి చేశామని టీఎంసీ నేత దులాల్‌రాయ్ చెప్పారు. అయితే, తమ పార్టీ కార్యకర్తలను బలవంతంగా టీఎంసీలో చేర్చుకున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధ్రువా సాహా ఆరోపించారు. చదవండి: పారదర్శకంగా రాష్ట్రాలకు టీకా పంపిణీ -
Covid-19: పీపీఈ కిట్లు, శానిటైజర్లకు నకిలీ బెడద
న్యూఢిల్లీ: కోవిడ్–19 కట్టడికి విధించిన లాక్డౌన్ కాలంలో నకిలీ ఫార్మా ఉత్పత్తుల తయారీ భారీగా పెరిగింది. ముఖ్యంగా పీపీఈ కిట్లు, శానిటైజర్ల వంటి ఉత్పత్తుల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. పరిశ్రమ సమాఖ్య ఆథెంటికేషన్ సొల్యూషన్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (ఏఎస్‌పీఏ) ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. గడిచిన కొన్నేళ్లలో దేశీయంగా నకిలీల తయారీ భారీగా పెరిగినట్లు పేర్కొంది. 2018 జనవరి నుంచి 2020 డిసెంబర్ దాకా ఇది 20 శాతం దాకా పెరిగిందని తెలిపింది. ఎక్కువగా పొగాకు, ఆల్కహాల్, ఎఫ్ఎంసీజీ ప్యాకేజ్డ్ ఉత్పత్తులు, కరెన్సీ, ఫార్మా రంగాల్లో ఈ ధోరణి ఉందని వివరించింది. మొత్తం నకిలీ ఉత్పత్తుల్లో వీటి వాటా 84 శాతం పైగా ఉంది. నకిలీల తయారీ కేవలం విలాసవంతమైన ఖరీదైన ఉత్పత్తులకు పరిమితం కాకుండా ప్రస్తుతం జీలకర్ర, ఆవాలు, వంట నూనెలు, నెయ్యి, సబ్బులు, పిల్లల సంరక్షణ ఉత్పత్తులు మొదలైన రోజువారీ వినియోగించే వాటికి కూడా విస్తరించింది. సిసలైన ఉత్పత్తులుగా అనిపించే వాటిని తయారు చేసేందుకు ప్రొఫెషనల్ మోసగాళ్లు ఇప్పుడు ఆధునిక తయారీ, ప్రింటింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. నకిలీ ఉత్పత్తుల బెడద ఎక్కువగా ఉన్న పది రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, బిహార్, పంజాబ్ మొదలైనవి ఉన్నాయి. ఇప్పటికే మందగించిన ఆర్థిక రికవరీ వేగం.. నకిలీ ఉత్పత్తులు, అక్రమ వ్యాపారాల కారణంగా మరింత నెమ్మదించే ముప్పు ఉందని ఏఎస్‌పీఏ ప్రెసిడెంట్ నకుల్ పశ్రిచా ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: ధరలకు ఇంధన సెగ! -
వైరల్: కరోనా ఇతని దరిదాపుల్లోకి కూడా చేరదు..
మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత శుభ్రతపై ఎక్కువ దృష్టి సారస్తున్నారు. మాస్క్ ధరించడం, చేతుల్ని పదే పదే కడుక్కోవడం, శానిటైజర్, హ్యాండ్ వాష్‌ను ఉపయోగించడం ఎక్కువైపోయింది. ఇంట్లో నుంచి బయటకు ఎక్కడకు వెళ్లినా.. మాస్క్‌తోపాటు శానిటైజర్‌ను కూడా తీసుకెళ్తున్నారు. అన్ని దుకాణాలు, ఏటీఎం సెంటర్లు, షాపింగ్ మాల్స్.. ఇలా ప్రతి చోటా హ్యాండ్ శానిటైజర్‌ను కచ్చితంగా అందిస్తున్నారు. సాధారణంగా శానిటైజర్ కొన్ని చుక్కలు తీసుకొని మోచేతుల వరకు క్లీన్ చేసకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఒంటికి నూనె అద్దినట్లు హ్యాండ్ శానిటైజర్ రాసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను రూపిన్ శర్మ అనే ఐపీఎస్ అధికారి తన ట్విటర్లో షేర్ చేశాడు. ఇందులో ఓ వృద్ధుడు మరికొంతమందితో కలిసి ఓచోట కూర్చొని ఉన్నాడు.. ఇంతలో టో వ్యక్తి శానిటైజర్ నుంచి ముసలాయనకు రెండు మూడు చుక్కలను వేయగా.. చేతులతో పాటు, జుట్టు, ముఖం, కాళ్లకు కూడా రాసుకున్నాడు. రెండో సారి కూడా శానిటైజర్ వేయగా.. మళ్లీ అదే రీతిలో శరీరానికి పట్టించాడు. ‘కరోనా అతడిని తాకే ధైర్యం ఏమాత్రం చేయదు. కానీ అంకుల్ మీరు మాస్క్‌ను కిందకు లాగాల్సిన అవసరం లేదు.’ అని క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 50 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోపై నెజిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. "అంకుల్ శానిటైజర్ ఉపయోగించి మీరు స్నానం చేస్తే బాగుండేది" అని ఒకరు కామెంట్ పెట్టగా.. "మీకు సంపూర్ణమైన రక్షణ కవచంలా శానిటైజర్ పనిచేస్తోంది" అని మరొకరు పోస్ట్ చేశారు. "కరోనా అతడి దగ్గరకు వెళ్లడానికి కూడా ధైర్యం చేయదు" అని ఇంకొకరు స్పందించారు. మరికొంత మంది అతని అమాయకత్వం చూసి నవ్వుకుంటున్నారు. ఇతడికి జాగ్రత్తగా ఎక్కువని ట్వీట్ చేయగా.. "పాపం ఇతడికి శానిటైజర్ ఎలా వాడాలో తెలియదనుకుంటా" అని పోస్ట్ చేశారు. చదవండి: విషాదం: పొగిడారు, ఫొటోలు తీశారే తప్ప.. జీతం ఎంతో చెప్పాలంటూ కాబోయే అల్లున్ని గదిలో బంధించి... *इसका Corona बाल भी बाका नहीं कर सकता 😆😆* पर #मास्क नीचे नहीं करना था चाचा pic.twitter.com/WVXxGCpMfS — Rupin Sharma IPS (@rupin1992) May 29, 2021 -
‘బ్రాండెడ్’ బెస్ట్: రంగు నీళ్లన్నీ శానిటైజర్లు కాదు
సాక్షి, సిటీబ్యూరో: మెరిసేదంతా బంగారం కాదన్న చందంగా మారింది శానిటైజర్ల పరిస్థితి. కోవిడ్ మహామ్మారి విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరికీ ఇప్పుడు తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రపరచుకోవడం దినచర్యగా మారింది. ఇదే తరుణంలో బహిరంగ మార్కెట్లో అందమైన డబ్బాలు, బాటిళ్లలో ప్యాక్‌చేసి..తీరైన లేబుల్స్ అంటించి విక్రయిస్తోన్న రంగునీళ్లన్నీ శానిటైజర్లు కావని జేఎన్టీయూ, బిట్స్‌పిలానీ తాజా పరిశోధనలో స్పష్టమైంది. లేబుల్స్‌పై పేర్కొన్న విధంగా ఇవన్నీ సరైన ప్రమాణాల ప్రకారం సిద్ధం చేసినవి కావని..వీటితో చేతులపై ఉన్న వైరస్, బ్యాక్టీరియా ఆనవాళ్లు అంత త్వరగా నశించవని ఈ పరిశోధన తేటతెల్లం చేసింది. ప్రధానంగా వీటిల్లో ఇథైల్ ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండడం, ఇతర ప్రమాణాలను పాటించకపోవడంతోనే ఈ అనర్థాలు తలెత్తుతున్నాయని పరిశోధకులు స్పష్టంచేశారు. పరిశోధనలో తేలింది ఇదీ.. ► బహిరంగ మార్కెట్లో దొరికే పలు రకాల బ్రాండ్ల శానిటైజర్లను సేకరించి..నగరంలోని జేఎన్టీయూహెచ్, బిర్లా ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ (హైదరాబాద్ క్యాంపస్) పరిశోధకులు తమ ప్రయోగశాలల్లో వాటి నాణ్యతను పరీక్షించారు. ► పలు లోకల్ మేడ్ శానిటైజర్లలో ఇథైల్ ఆల్కహాల్ 95 శాతం ఉందంటూ లేబుల్‌పై ప్రకటించారు. కానీ వీటిల్లో కేవలం ఆల్కహాల్ 50 శాతానికి మించ లేదని తమ పరిశోధనలో తేలిందని జేఎన్టీయూహెచ్ పరిశోధకులు ప్రొఫెసర్ బిందు తెలిపారు. ► తాము ఆయా శానిటైజర్లను గ్యాస్ క్రోమాటోగ్రఫీ విధానంలో పరీక్షించామని పేర్కొన్నారు. మరికొన్నింటిలో కేవలం 5 శాతం మాత్రమే ఇథైల్ ఆల్కహాల్ ఉందని స్పష్టంచేశారు. ► ఆయా శానిటైజర్లు వైరస్, బ్యాక్టీరియాలను ఎలా నిరోధిస్తున్నాయన్న అంశంపైనా మైక్రోబయాలజికల్ విశ్లేషణ జరిపామని...వీటిల్లోనూ ఆయా లోకల్‌మేడ్ శానిటైజర్లు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయని తెలిపారు. ► మరికొన్నింటిలో ఇథనాల్, ఐసో ప్రొపనాల్ మోతాదు కూడా సరైన ప్రమాణాల్లో కలపకపోవడంతో బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధించలేవని స్పష్టమైందన్నారు. నాణ్యత చూసి కొనండి బహిరంగ మార్కెట్లో దొరికే శానిటైజర్లలో బ్రాండెడ్‌వి, నాణ్యమైనవి చూసి కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీ ఒక్కరూ వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లడం అనివార్యమైన తరుణంలో వినియోగించే శానిటైజర్ నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. లేకుంటే కోవిడ్ ముప్పు రావొచ్చని హెచ్చరించారు. విక్రయాలు ఫుల్..నాణ్యత నిల్ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లు, వీధి వ్యాపారులు, కిరాణా దుకాణాలు, మెడికల్ షాపులు ఇలా అన్ని ప్రదేశాల్లోనూ ‘మూడు మాస్కులు..ఆరు శానిటైజర్లు’ అన్న చందంగా వ్యాపారం సాగుతోంది. ప్రతి రోజు రూ.కోట్లలో విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుత తరుణంలో వీటితయారీ సంస్థలకు సైతం పీసీబీ సులభంగా అనుమతులు జారీచేస్తోంది. ఇదే సమయంలో కొందరు కుటీర పరిశ్రమగా ఇళ్లు, పురాతన షెడ్లలో నాసిరకం శానిటైజర్లు తయారీచేసి విక్రయిస్తున్నారు. వీటి నాణ్యతే ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: కరోనా రోగులకు ఇక సహజ వాయువే! -
Covid:గాలిలో 10 మీటర్లు దూరం వరకు
న్యూఢిల్లీ: గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో కేంద్రం నేడు కీలక విషయాలు వెల్లడించింది. అది ఏంటంటే మనం తుమ్మినా, దగ్గినా తుంపర్లు సాధారణంగా రెండు మీటర్ల దూరం ప్రయాణిస్తాయి. కానీ ఏరోసోల్స్ అంటే అతి సూక్ష్మమైన తుంపర్లు ఏకంగా 10 మీటర్ల దూరం ప్రయాణం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం గురువారం విడుదల చేసిన నూతన మార్గ దర్శకాల్లో వెల్లడించింది. ఫలితంగా వైరస్ కట్టడి కోసం మాస్క్, భౌతిక దూరం పాటించడంతో పాటు ఇళ్లు, కార్యాలయాల్లో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని తెలిపింది. సూచనలు.. ఈ క్రమంలో వైరస్ కట్టడికి మాస్క్, భౌతిక దూరం పాటించడంతో పాటు ఇళ్లల్లో వెంటిలేషన్‌ని పెంచుకోవాలి. కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్ సోకే ముప్పును వెంటిలేషన్ తగ్గిస్తుంది. ఇంట్లో ఉండే కిటికీలు, తలుపులు వంటి ఎగ్జాస్ట్ సిస్టంతో చెడు వాసనలు బయటకు వెళ్లాయి. అలానే అదే ప్రాంతంలో ఫ్యాన్లు పెడితే వైరస్‌తో కూడిన గాలి బయటకు పోయి కోవిడ్ సోకే ముప్పు తగ్గుతుంది అని తెలిపింది. లక్షణాలు లేని వ్యక్తులు కూడా వైరస్‌ని వ్యాప్తి చేస్తారు. సాధారణంగా కరోనా బారిన పడి వ్యక్తి నుంచి విడుదలయ్యే లాలాజలం, ముక్కు నుంచి వెలువడే తుంపర్లు, ఏరోసోల్స్ రూపంలో ఉండే అతి సూక్ష్మ తుంపర్లు వైరస్ వ్యాప్తికి ప్రధాన కారకాలు. పెద్ద తుంపర్లు భూమీ ఉపరితలం మీద పడతాయి. అవి పడిన ప్రదేశాలను ఇతరులు తాకితే వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందుకే ఇంటి లోపల నేల, తలుపు హ్యాండిల్స్ వంటి వాటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులను తరచుగా సబ్బు, శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇక చిన్న తుంపర్లు అయిన ఏరోసోల్స్ గాలిలో 10 మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఎప్పుడూ మూసి ఉన్న గదుల్లో ఈ ఏరోసోల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఇంట్లో వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. కిటికీలు, తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచాలి. పని చేసే ఆఫీసుల్లో ఏసీలు వేసి, మొత్తం మూసేస్తారు. దాని వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడంతో పాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేయాలి అని సూచించారు. రెండు మాస్క్‌లు వాడటం మేలు.. కరోనా కట్టడిలో మాస్క్ కీలకం. రెండు మాస్క్‌లతో మరింత ప్రయోజనం అంటున్నారు నిపుణులు. సర్జికల్ మాస్క్‌తో పాటు కాటన్ మాస్క్ కలిపి పెట్టుకోవాలి. ఎన్ 95 మాస్క్ వాడటం శ్రేయస్కరం. భారతదేశంలో ఇప్పటి వరకు కనీసం 2.57 కోట్ల మంది ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2.87 లక్షల మంది మరణానికి దారితీసింది. చదవండి: Black Fungus: ఆయుర్వేదంతో చెక్ -
సిగరెట్ తాగుతూ శానిటైజర్ రాసుకున్నాడు.. ఆ తర్వాత
వాషింగ్టన్: కరోనా వ్యాప్తి మూలంగా చేతలను తరచుగా శుభ్రం చేసుకోవడం మన జీవితంలో ఓ భాగమయ్యింది. సబ్బు, నీరు ఎప్పుడు అందుబాటులో ఉండదు కనుక.. శానిటైజర్ వినియోగం బాగా పెరిగింది. అయితే కొన్ని శానిటైజర్లలో మంటను ఆకర్షించే పదార్థాలు ఉంటాయి. అలాంటి వాటిని వాడినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిప్పుకు దూరంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యహరించినా.. ఇదిగో ఇలాంటి భయంకర పరిస్థితులు ఎదురవుతాయి. ఓ వ్యక్తి కారులో కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు.. ఆ తర్వాత శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాడు. దాంతో కారులో మంటలు చెలరేగాయి.. చూస్తుండగానే కారు దగ్ధమయ్యింది. అదృష్టం కొద్ది డ్రైవర్‌కు పెద్దగా గాయాలు కాలేదు. ఈ సంఘటన అమెరికాలోని రాక్‌విల్లే షాపింగ్ సెంటర్ వద్ద గత గురువారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం సదరు కారు డ్రైవర్ తొలుత సిగరెట్ వెలిగించి నోట్లో పెట్టుకున్నాడు.. ఆ తర్వాత చేతులకు శానిటైజర్ రాసుకున్నాడు. ఈ క్రమంలో అది కొంత అతడి బట్టల మీద పడింది. ఇదే సమయంలో సిగరెట్ నుంచి నిప్పు రవ్వలు బట్టల మీద పడటంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. ప్రమాదం గమనించిన డ్రైవర్ వెంటనే కారు నుంచి బయటకు దూకాడు. ఈ ప్రమాదంలో అతడికి పెద్దగా గాయాలు కాలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక చూస్తుండగానే కారు తగలబడిపోయింది. అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకునే లోపు కారు పూర్తిగా తగలబడింది. ఇక కారులో కూర్చుని సిగరెట్, శానిటైజర్ వాడటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. చదవండి: విలేకరులపై శానిటైజర్ స్ప్రే చేసిన ప్రధాని -
వైరల్ వీడియో: సిగరెట్ తాగుతూ శానిటైజర్ రాసుకున్నాడు..
-
వైరల్ వీడియో: శానిటైజర్ దొంగిలించిన వ్యక్తి
-
‘‘నీపై కోప్పడాలో.. జాలి పడాలో తెలీడం లేదు’’
దొంగతనం అనగానే బంగారం, డబ్బు, విలువైన వస్తువులను చోరీ చేయడం గుర్తుకు వస్తాయి. కానీ కొందరు కక్కుర్తి వ్యక్తులు చేసే చోరీలు చూస్తే వారిపై జాలి పడాలో లేక కోప్పడాలో అర్థం కాదు. ఓ వ్యక్తి చేసిన దొంగతనం చూస్తే మీకు కూడా ఇలానే అనిపిస్తుంది. ఇంతకు ఆ వ్యక్తి చేసిన దొంగతనం ఏంటయ్యా అంటే.. ఏటీఎం సెంటర్లో ఉన్న శానిటైజర్ డబ్బాను తస్కరించాడు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. ఏటీఎంలో డబ్బులు తీయడానికి వెళ్లిన ఓ కస్టమర్.. అక్కడే ఉన్న శానిటైజర్ బాటిల్‌ను దొంగిలించాడు. కరోనా కట్టడిలో భాగంగా ప్రస్తుతం శానిటైజర్, మాస్క్ వినియోగం తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో పలు దుకాణాలు, ఏటీఎం సెంటర్లు, ఆఫీసుల ముందర శానిటైజర్లను ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి డబ్బులు తీసుకోవడం కోసం ఏటీఎం సెంటర్‌కి వెళ్లాడు. కాసేపు అక్కడే ఉన్న ఆ వ్యక్తి.. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం గమనించి వెంటనే శానిటైజర్ బాటిల్‌ను తన బ్యాగులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడే ఏటీఎం సెంటర్లోని సీసీ కెమెరాల్లో ఈ తతంగమంతా రికార్డవ్వడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. సదరు వ్యక్తిని నెటిజనులు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. నీ కక్కుర్తి తగలడా.. ఓ ఇరవై రూపాయలు పెట్టి శానిటైజర్ కొనుక్కోలేవా అంటూ విమర్శిస్తున్నారు. చదవండి: పొగ వదలడం.. ఫుటేజీ ఎత్తుకెళ్లడం వీరి స్టైల్ -
మద్యం లభించక.. శానిటైజర్ తాగి ఏడుగురు మృతి
సాక్షి ముంబై: యావత్మాల్ జిల్లాలో శానిటైజర్ తాగి ఏడుగురు మృతి చెందడంతో కలకలం రేగింది. జిల్లాలోని వణీ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరోవైపు శానిటైజర్ తాగిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. లాక్డౌన్ కారణంగా మద్యం లభించకపోవడంతో వీరంతా శానిటైజర్ సేవించారని తెలిసింది. ఏడుగురిలో ముగ్గురు ఇంట్లోనే మృతి చెందినప్పటికీ మిగతావారు మాత్రం ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం మృతి చెందారు. చనిపోయిన ఏడుగురిలో ముగ్గురు శానిటైజర్ సేవించడం వల్లే మృతిచెందారని, మరో ముగ్గురు అలాంటి లక్షణాలతోనే మృత్యువాత పడ్డారని వైద్యులు తెలిపారు. మృతులను దత్తా లాంజేవార్, నూతన్ పాథరటకర్, గణేష్ నాదేకర్, సంతోష్ మెహర్, సునీల్‌లుగా గుర్తించారు. చదవండి: దేశంలో కొత్తగా 3,49,691 కరోనా కేసులు -
శానిటైజర్ పోసుకొని ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
-
పోలీస్ మాట: శానిటైజర్ బదులు గంగాజలం, గంధం
లక్నో: మహమ్మారి కరోనా వైరస్ రెండోసారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ భౌతిక దూరం, మాస్క్‌లు, శానిటైజర్ వినియోగం పెంచాలి. అవన్నీ కూడా కరోనా సోకకుండా తీసుకునే ముందస్తు చర్యలు. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా శానిటైజర్ ఉపయోగపడదు.. గంగాజలమే కరోనాను దూరం చేస్తుంది అని సాక్షాత్తు పోలీసులు చెబుతున్నారు. దీంతో పాటు గంధం కూడా అదే పని చేస్తుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్లో శానిటైజర్ బదులు గంగాజలం సీసాలను పంచుతున్నారు. స్టేషన్‌కు వచ్చేవారికి గంధం బొట్టు పెట్టడంతో పాటు గంగాజలం కొద్దిగా వేస్తున్నారు. ఈ పరిస్థితి ఉత్తరప్రదేశ్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌లో. ఉత్తరప్రదేశ్‌లోని నౌచందీలో ఉన్న మీరట్ పోలీస్‌స్టేషన్‌లో శానిటైజర్ బదులు గంగాజలం వినియోగిస్తున్నారు. స్టేషన్‌కు ఎవరైనా వచ్చినా మొదట గంధం బొట్టు పెడతారు. అనంతరం గంగాజలం చేతులకు వేస్తారు. శానిటైజర్ మాదిరి రుద్దుకోవాలి. ఎందుకంటే కరోనాను వ్యాప్తి చెందకుండా గంగాజలం దోహదం చేస్తుందని ఆ స్టేషన్ అధికారి ప్రేమ్‌చంద్ శర్మ చెబుతున్నారు. చేతులపై ఉన్న వైరస్‌ను గంగాజలం చంపుతుందని చెప్పారు. నుదుటన గంధం బొట్టు పెడితే ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతత ఏర్పడుతుందని ప్రేమ్‌చంద్ శర్మ వివరిస్తున్నారు. ఇదే పాటించాలని తోటి సిబ్బందికి సూచిస్తున్నారు. అంతటితో ఆగకుండా పోలీస్‌స్టేషన్ అంటే జాతీయ నాయకుల చిత్రపటాలు ఉండాల్సిన చోట దేవుడి ప్రతిమలు ఉన్నాయి. ఈ విధంగా స్టేషన్ స్వరూపం మార్చివేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. Sneak peek inside his office at Nauchandi police station in UP's Meerut district. SHO Prem Chand Sharma arrived with a bottle of Gangajal and soon several bottles were lined up on the table. pic.twitter.com/fQ4XzDAJVY — Piyush Rai (@Benarasiyaa) March 28, 2021 -
విలేకరులపై శానిటైజర్ స్ప్రే చేసిన థాయ్‌ల్యాండ్ ప్రధాని
-
విలేకరులపై శానిటైజర్ స్ప్రే చేసిన ప్రధాని
బ్యాంకాక్: ప్రెస్ మీట్ పెట్టేది ఎందుకు.. ప్రభుత్వ విధానాల గురించి ప్రజలకు తెలపడం కోసం.. అలానే ప్రభుత్వ పని తీరుపై వచ్చిన ఆరోపణలను ప్రజల తరఫున ప్రశ్నించడానికి. అందుకే చాలా మంది నాయకులు ప్రెస్ మీట్స్ అంటే భయపడతారు. ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొవాల్సి వస్తుందో.. ఎక్కడ నోరు జారతామో అని ప్రెస్ మీట్లు పెట్టరు. ఒకవేళా పెట్టినా నచ్చని ప్రశ్నలు ఎదురైతే సమాధానం చెప్పకుండా దాట వేస్తారు. అంతే తప్ప ప్రశ్నలు అడిగిన రిపోర్టర్ల మీద దాడి చేయడం అసంభవం. కానీ దీన్ని నిజం చేసి చూపారు థాయ్‌లాండ్ ప్రధాని. విలేకరుల తమ ప్రశ్నలతో విసిగిస్తున్నారని అసహనానికి గురైన థాయ్ పీఎం ఏకంగా వారిపై శానిటైజర్ స్ప్రే చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి ప్రయూత్ చాన్-ఓచా మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో రిపోర్టర్లు తాజాగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న పలు అంశాల గురించి ప్రశ్నించారు. ముఖ్యంగా కొద్ది కాలం నుంచి పలువురు అధికారులు తమ క్యాబినేట్ పదవుల నుంచి వైదొలగారు. అలానే ఏడు సంవత్సరాల క్రితం జరిగిన నిరసనల్లో పాల్గొన్నందుకు ముగ్గురు మినిస్టర్లను వారం రోజుల క్రితమే జైలుకు పంపించారు. ఈ అంశాలన్నింటి గురించి విలేకరులు ప్రధాని ప్రయూత్ని ప్రశ్నించారు. రిపోర్టర్ల ప్రశ్నలకు విసిగిపోయిన ప్రధాని ప్రయూత్.. ‘‘మీరు అడగవలసిన ప్రశ్నలు ఇంకా ఏమైనా మిగిలాయా.. ఇలాంటి విషయాలన్ని నాకు కనిపించడం లేదు ఎందుకో.. ఇవన్ని ముందుగా తెలియాల్సింది ప్రధానికే కదా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వత తన పొడియం వద్ద నుంచి బయటకు వచ్చేశారు. అలా వస్తూ.. పక్కనే ఉన్న శానిటైజర్ డబ్బాను చేతిలోకి తీసుకుని జర్నలిస్ట్‌ల దగ్గరకు వచ్చి.. వారందరి మీద శానిటైజర్ స్ప్రే చేస్తూ ముందుకు వెళ్లి పోయారు. ఈ తతంగాన్నంత అక్కడ ఉన్న రిపోర్టర్లు వీడియో తీశారు. చివరకు ప్రయూత్ ఇదే రిపోర్టర్లతో చాలా ఆగ్రహంగా మాట్లాడటం వీడియోలో చూడవచ్చు. ఇక ప్రధాని చర్యలపై నెటిజనులు మండి పడుతున్నారు. ఇంత అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నీళ్ల బదులు శానిటైజర్ తాగిన కమిషనర్ పోలియో బదులు శానిటైజర్.. చిన్నారులు అస్వస్థత -
నీళ్ల బదులు శానిటైజర్ తాగిన కమిషనర్
సాక్షి, ముంబై : నీళ్ల బాటిల్ అనుకుని పొరపాటున శానిటైజర్ తాగిన ఘటన సోషల్ మీడియాలో నవ్వులు తెప్పిస్తోంది. కొద్దిగా శానిటైజర్ తాగిన అనంతరం వెంటనే సిబ్బంది అప్రమత్తమవడంతో ఆయన శానిటైజర్‌ను ఉమ్మేసి అనంతరం నీళ్లు తాగారు. శానిటైజర్ తాగినట్లు గుర్తించిన ఆ అధికారి నవ్వడంతో తోటి అధికారులు కూడా నవ్వుకున్నారు. ఈ ఘటన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో జరిగింది. 2021-22 సంవత్సరానికి విద్యా శాఖ బడ్జెట్‌ను బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ రమేశ్ పవార్ సమర్పిస్తున్నారు. నివేదిక ఇచ్చిన అనంతరం అందరూ కూర్చున్న సమయంలో నీళ్లు తాగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో నీళ్ల బాటిల్ అనుకుని శానిటైజర్ డబ్బాను తీసుకొని తాగారు. ఆయన వెంట నిల్చున సహాయక సిబ్బంది వెంటనే గమనించి వారించారు. అయితే అప్పటికే ఆయన కొద్దిగా శానిటైజర్ తాగారు. వెంటనే ఉమ్మి వేసి నవ్వారు. అనంతరం సిబ్బంది నీళ్ల సీసా అందించారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
పోలియో బదులు శానిటైజర్.. చిన్నారులు అస్వస్థత
ముంబై: పోలియో చుక్కల పంపిణీలో సిబ్బంది చేసిన నిర్వాకంతో చిన్నారులు అస్వస్థతకు గురయ్యాయి. కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వినియోగించే శానిటైజర్‌ను పోలియో చుక్కల మాదిరిగా వేశారు. దీంతో చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారు. అయితే ఈ ఘటనపై చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆదివారం (జనవరి 31) చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ చేశారు. అయితే యావత్మల్లో పిల్లలకు పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ చుక్కలు వేశారు. దీంతో చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపింది. శానిటైజర్ చుక్కలు వేయించుకున్న 12 మంది పిల్లల అస్వస్థతకు గురయ్యారు. కంగారుపడిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు గుర్తించారు.. పిల్లలకు పోలియో బదులు శానిటైజర్ వేశారని. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం బాగుందని.. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. అయితే విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్, ఆరోగ్య, ఆశా కార్యకర్తలను సస్పెండ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
శానిటైజర్ పోసి నిప్పంటించి..
లక్నో(ఉత్తరప్రదేశ్) : జర్నలిస్టు హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను బలరామ్‌పూర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన 37 ఏళ్ల జర్నలిస్టు రాకేష్‌సింగ్ నిర్భిక్, మరో జర్నలిస్టు పింటు సాహు (34)తో కలిసి గ్రామసర్పంచ్ చేస్తున్న అక్రమాలపై వరుస కథనాలు ప్రచురించారు. ఈ నేపథ్యంలోనే కాల్వారి గ్రామ సర్పంచ్ కుమారుడు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అధిక ఆల్కహాల్ శాతం కలిగిన శానిటైజర్‌ను జర్నలిస్టులపై పారబోసి ఆ తర్వాత నిప్పుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘనటలో సాహు అక్కడికక్కడే మరణించగా, మరో జర్నలిస్టు రాకేష్ సింగ్ కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. శరీరం అప్పటికే 80 శాతానికి పైగా కాలడంతో కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు. సర్పంచి చేస్తోన్న అవినీతిపై వరుస కథనాలు ప్రచురించడం, సాహుతో డబ్బు చెల్లింపులు లాంటి వివాదాలు ఉండటంతో ఇద్దరినీ చంపేందుకు పథకం రచించినట్లు తెలుస్తోంది. (కరోనాపై కథనాలు.. ఐదేళ్ల జైలు) ఈ కేసులో సర్పంచ్ కుమారుడు రికు మిశ్రాకు, ఇదివరకే పలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న స్నేహితుడు అక్రమ్, లలిత్ మిశ్రా సహకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. జర్నలిస్ట్ రాకేష్ సింగ్ చనిపోవడానికి ముందే తనపై హత్యాయత్నం చేసింది సర్పంచి కుమారుడేనని పేర్కొంటూ రెండున్నర నిమిషాల వ్యవధి గల వీడియోను రూపొందించాడు. అక్రమాలపై వరుస కథనాలు రాస్తూ నిజాయితీ గల జర్నలిస్టుగా ఉన్నందుకు ఇదే నాకు లభించిన బహుమతి అంటూ వీడియోలో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాదాపు 17 మందిని విచారించారు. ఇరువురి మధ్య ఉన్న పాత తగాధాల కారణంగా పథకం ప్రకారం జర్నలిస్టులను హత్య చేయించినట్లు బలరామ్‌పూర్ పోలీసు చీఫ్ దేవ్ రంజన్ వర్మ తెలిపారు. ఈ కేసులో మరికొంత మందిని కూడా విచారిస్తున్నామని, అవసరమైతే వారిని సైతం అరెస్టు చేస్తామని వెల్లడించారు. (కూతురి నుంచి ప్రాణహాని.. సంచలన ఆరోపణలు) -
చేతులు కడగండి.. పాలిటిక్స్‌ను కూడా!
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. బాధ్యతాయుత పౌరులుగా ఓటు హక్కును వినియోగించుకుంటూ.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు వేసి వచ్చేందుకు కొన్ని నిమిషాల సమయం పడుతుంది. ఆ కొద్దిసేపు జాగ్రత్తగా ఉండాలని, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖలు ప్రజలకు విన్నవించాయి. పోలింగ్స్టేషన్లోకి ప్రవేశించేప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి వెళ్లాలి. లేకపోతే లోనికి అనుమతించరు. అలాగే పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూలైన్లలో ఒకరికొకరికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా వృత్తాకార గుర్తులు ఏర్పాటు చేశారు. వాటిల్లోనే నిలబడి బూత్‌లోకి లైన్‌గా వెళ్లాలి. బూత్‌లో పలుచోట్ల తాకాల్సి ఉంటుంది.. అక్కడ ఏర్పాటు చేసిన శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాక బూత్‌లోకి ప్రవేశించాలి. బ్యాలెట్ పత్రం ద్వారా ఓటు వేయాల్సి ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బూత్లోనికి వెళ్లగానే మొదటి పోలింగ్ అధికారి ఓటర్ జాబితాలో పేరుందా లేదా చూస్తారు. అందుకోసం ఓటర్ తమ గుర్తింపు కార్డును అధికారికి ఇవ్వాలి. ఆ అధికారి గుర్తింపు కార్డును పట్టుకొని చూసి తిరిగి ఇచ్చేస్తారు. అధికారి తాకిన కార్డును తిరిగి తీసుకున్నప్పుడు కాంటాక్ట్ ఏర్పడుతుంది. తర్వాత రెండో అధికారి వద్దకు వెళ్లాలి. అక్కడ ఓటర్ ఎడమ చూపుడు వేలుపై సిరా మార్క్ వేస్తారు. మూడో పోలింగ్ అధికారి బ్యాలెట్ పత్రం ఇస్తారు. దాన్ని ఇచ్చేముందు బ్యాలెట్ కౌంటర్ పాయింట్‌పై ఓటర్ సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు. తర్వాత బ్యాలెట్ పేపర్‌తోపాటు ఓటు వేసేందుకు ఇంకు అద్దిన రబ్బర్ స్టాంప్‌ను ఓటర్‌కు ఇస్తారు. అప్పుడు కూడా ఇతరులు వాడిన, అధికారి పట్టుకున్న స్టాంప్‌ను తీసుకోవడం ద్వారా కాంటాక్ట్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లోకి వెళ్లి ఇష్టమైన అభ్యర్థి గుర్తుపై ముద్ర వేయాలి. తర్వాత దాన్ని మడతబెట్టి బయటకు వచ్చి ప్రిసైడింగ్ అధికారి వద్ద ఉన్న బ్యాలెట్ పెట్టెలో వేయాల్సి ఉంటుంది. ఇలా వివిధ దశల్లో పలుసార్లు చేతులతో వివిధ ప్రాంతాల్లో తాకాల్సి ఉంటుంది. అధికారి అనేకమంది ఓటర్లతో కాంటాక్ట్ అవుతారు. కాబట్టి ఓటేసి బయటకు వచ్చాక తక్షణమే చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. అందుకోసం అవసరమైతే సొంతంగా శానిటైజర్‌ను దగ్గర ఉంచుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులంతా మాస్క్‌లు, ఫేస్ షీల్డ్‌లు పెట్టుకుంటారు. పైగా బూత్‌లోకి ఒక్కరినే అనుమతిస్తారు. వారు ఓటేసి వెళ్లిపోయాక మరొకరిని లోనికి అనుమతిస్తారు. కరోనా బాధితులకు గంటపాటు ప్రత్యేక ప్రవేశం ► కరోనా పాజిటివ్ బాధితులు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఓటేయడానికి ప్రత్యేక సమయం, ప్రత్యేక ద్వారం కేటాయించారు. వారికి మాస్క్‌లు, ఫేస్‌షీల్డులు అందజేస్తారు. అదే సమయంలో ఇతర ప్రవేశమార్గాల్లో సాధారణ ఓటర్లు ఓటేయవచ్చు. ► నవంబర్ ఒకటో తేదీ తర్వాత కరోనా పాజిటివ్ వచ్చిన వారికి పోస్టల్ బ్యాలెట్‌కు కూడా అవకాశం కల్పించారు. ► బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్లే సిబ్బందికి, బ్యాలెట్ పేపర్లను ఒక దగ్గరకు చేర్చే ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇస్తారు. ► ఎన్నికల సిబ్బంది అంతా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► పోలింగ్ సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే, తక్షణమే వారిని మార్చడానికి రిజర్వుడు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ► భౌతికదూరాన్ని పర్యవేక్షించేందుకు వాలంటీర్లను నియమించారు. ► సిబ్బంది, ఏజెంట్ల కోసం పోలింగ్స్టేషన్లలో భౌతికదూరం పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ► బూత్‌లో అధికారులు ఓటరును గుర్తించేందుకు ఒకసారి మాస్క్‌ను తొలగించి వెంటనే పెట్టుకోవచ్చు. -
నీళ్లు అనుకొని శానిటైజర్ తాగిన ఎస్ఐ
సాక్షి, ఒంగోలు: స్థానిక పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ రజాక్ మంచినీరు స్థానే శానిటైజర్ తాగి అస్వస్థతకు గురయ్యారు. స్థానిక కర్నూల్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో నివాసం ఉండే రజాక్ శానిటైజర్ తాగిన వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రోజూ నిద్రలేచిన వెంటనే మంచినీరు తాగడం రజాక్‌కు అలవాటు. ఆ క్రమంలోనే ఆయన శానిటైజర్ కలిసిన నీరు తాగినట్లు ఆలస్యంగా గుర్తించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రజాక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు తాలూకా సీఐ శివరామకృష్ణారెడ్డి తెలిపారు. (శానిటైజర్ కొంటలేరు...) -
శానిటైజర్ కొంటలేరు...
సాక్షి, హైదరాబాద్: శానిటైజర్.. కరోనా మహమ్మారి విజృంభించేంతవరకు ఆసుపత్రుల్లో తప్ప పెద్దగా వాడకం లేని పేరు. కానీ, ఇటీవల అది ఏకంగా నిత్యావసరంగా మారిపోయింది. రేషన్ కోసం క్యూ కట్టిన తరహాలో శానిటైజర్ కోసం జనం దుకాణాలకు ఎగబడ్డారు. ఇళ్లు, కార్యాలయాలు, పనిచేసే చోట, కార్లు.. ఇలా అన్ని చోట్లా శానిటైజర్ సీసాలను అందుబాటులో ఉంచుకున్నారు. చివరకు చిన్న సీసాలను జేబుల్లో పెట్టుకుని తిరిగారు. అయితే అంతలా వినియోగించిన జనం ఒక్కసారిగా దాని వైపు చూడ్డం మానేశారు. ఆగస్టు చివరివారం నుంచి శానిటైజర్ అమ్మకాలు బాగా పడిపోవటం మొదలైంది. ప్రస్తుతం అమ్మకాలు 30 శాతానికి పరిమితమయ్యాయి. జూన్, జూలైలలో విపరీతంగా కొరత ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు, కొనేవారులేక, నిల్వలు పేరుకుపోయి దుకాణదారులు శానిటైజర్‌ను డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కు పంపే పరిస్థితి ఏర్పడింది. అసలు పని పక్కన పెట్టి .. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. దీంతో చిన్నచిన్న తయారీ సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తయారీ రంగం పడకేయటంతో సిబ్బంది చెల్లాచెదురయ్యారు. దీంతో చాలా సంస్థలు కరోనానే తిరిగి అవకాశంగా చేసుకున్నాయి. శానిటైజర్ వాడకం విపరీతంగా పెరుగుతుండటాన్ని ఆసరా చేసుకుని అసలు ఉత్పత్తులను పక్కన పెట్టి శానిటైజర్ డిస్ట్రిబ్యూ టర్లుగా మారాయి. పెద్ద ఎత్తున శానిటైజర్ తయారీ సంస్థలు కొత్తగా ఏర్పడ్డాయి. కరోనా వచ్చే వరకు హైదరాబాద్‌లో రెండుమూడు తప్ప శానిటైజర్‌కు చెప్పుకోదగ్గ డిస్ట్రిబ్యూటర్ సంస్థలు లేవు. వ్యక్తిగతం మొదలు చిన్న సంస్థల వరకు వెరసి రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది డిస్ట్రిబ్యూటర్ అవతారమెత్తారు. కాగా కొన్ని సంస్థలు శానిటైజర్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తమ వద్ద పనిచేసే సిబ్బంది జీతాలకు వినియోగించుకున్నాయి. పడిపోయిన ధరలు.. జూన్ నెలలో ఐదు లీటర్ల క్యాన్‌ను రూ.2 వేల కు ఈ సంస్థలు దుకాణాలకు సరఫరా చేసేవి. అలా నిత్యం సగటున 8 నుంచి 10 వరకు అలాంటి క్యాన్లు, 100 మిల్లీలీటర్ల చిన్న సీసాలు 300 వరకు, 200 మి.లీ. సీసాలు 100 నుంచి 200 చొప్పున సరఫరా చేసేవి. జూలై వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం వాటి ధరలను నియంత్రించటంతో 5 లీటర్ల క్యాన్ ధర వెయ్యి రూపాయలకు పడిపోయింది. ఆగస్టు చివరికొచ్చేసరికి క్రమంగా విక్రయాలు తగ్గిపోవటంతో అదే క్యాన్‌ను కేవలం రూ.400 అమ్మడం ప్రారంభించారు. ఇప్పుడు చాలా మెడికల్ షాపుల్లో అలాంటి క్యాన్లు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. దాంతో వాటిని వాపస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. భయం వీడడమే కారణం..! కరోనా సోకటం మొదలైన కొత్తలో జనంలో విపరీతమైన భయం పెరిగిపోయింది. మాస్కుతోపాటు శానిటైజర్ వాడకం కూడా అనివార్యమైంది. కానీ ప్రస్తుతం నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నా.. జనంలో మాత్రం భయం బాగా తగ్గిపోయింది. కరోనా వచ్చినా సాధారణ జ్వరం తరహాలో తగ్గిపోతుందన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 77 శాతానికి చేరుకుంది. మరణాల రేటు బాగా తక్కువగా ఉండటంతో జనంలో కరోనా భయం బాగా తగ్గిపోయింది. ఫలితంగా శానిటైజర్ వాడకం కూడా పడిపోయింది. దీంతో కొనేవారు లేక దుకాణాల్లో సరుకు పేరుకుపోతోంది. -
ప్రాణం మీదకు తెచ్చిన కరోనా భయం
సాక్షి, ఇల్లందకుంట(హుజూరాబాద్): కరోనా భయం ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చింది. ఎక్కడ కరోనా వస్తుందోనని చికెన్‌కు శానిటైజ్ చేసి తినడం ప్రాణాపాయ స్థితికి చేర్చింది. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాపక్కపల్లి గ్రామానికి చెందిన దినసరి కూలీ యాకుబ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆగస్టు మొదటి వారంలో ఇంటికి చికెన్ తీసుకొచ్చాడు. కరోనా భయంతో చికెన్ వండిన తర్వాత చేతులను శుభ్రం చేసుకునే శానిటైజర్‌ను అందులో కలిపాడు. వాసన రావడంతో భార్యాపిల్లలు తినలేదు. ఒక్కడే తినడంతో కొద్దిసేపటి తర్వాత వాంతులయ్యాయి. దీంతో మొదటి వారంలోనే వరంగల్ ఎంజీఎంకు వెళ్లాడు. పేగులు గాయపడినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారనే భయంతో ఆగస్టు 29న ఆస్పత్రి వైద్యులకు సమాచారం ఇవ్వకుండానే స్వగ్రామానికి చే రాడు. చికిత్సకు డబ్బులు లేకపోవడం, కాళ్లూ చేతులు పనిచేయకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. పరిస్థితి విషమించినట్లు తెలియడంతో జెడ్పీటీసీ శ్రీరాం శ్యామ్ తన వంతు ఆర్థికసాయం అందజేశారు. మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి తగిన వైద్యసాయం చేస్తామని కుటుంబానికి హామీ ఇచ్చారు. సర్పంచ్ మహేందర్, నాయకులు పాల్గొన్నారు. -
శానిటైజర్‌ను ఇలా కూడా వాడొచ్చా!
లండన్: స్వింగ్‌ను రాబట్టేందుకు తన వద్ద ఉన్న హ్యాండ్ శానిటైజర్‌ను బంతికి అంటించడంతో... ఇంగ్లండ్ కౌంటీ ప్లేయర్ మిచ్ క్లేడన్ నిషేధానికి గురయ్యాడు. సస్సెక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతడు... గత నెలలో జరిగిన ఒక మ్యాచ్‌లో బంతికి శానిటైజర్‌ను పూసి బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు దక్కించుకోవడం విశేషం. కరోనా నేపథ్యంలో బంతికి ఉమ్మితో సహా ఎటువంటి పదార్థాలను రాయకూడదనే నిబంధనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రవేశపెట్టింది. దాంతో 37 ఏళ్ల క్లేడన్‌పై ఆగ్రహించిన సస్సెక్స్ జట్టు అతడిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా విచారణ జరిపిస్తోంది. (చదవండి: ఇలా మొదలవుతోంది...) (చదవండి: పాపం.. శానిటైజర్ ఎంత పని చేసింది!) -
పాపం.. శానిటైజర్ ఎంత పని చేసింది!
టెక్సాస్ : కరోనా వైరస్ బారినుంచి రక్షణ కల్పించేందుకు వాడే శానిటైజర్ ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రమాదవశాత్తు శానిటైజర్ బాటిల్ పేలటంతో ఆమె శరీరం మొత్తం తీవ్రంగా కాలిపోయింది. ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌కు చెందిన కేట్ వైడ్ గత ఆదివారం.. రోజూలానే ఆ రోజు కూడా చేతులకు శానిటైజర్ రాసుకుంది. ఆ తర్వాత కొవ్వొత్తి వెలిగిద్దామని అగ్గిపుల్ల గీసింది. అంతే ఆమె చేతికి మంటలు అంటుకున్నాయి. దీంతో భయపడ్డ ఆమె వెంటనే వెనక్కు దూకింది. ( పదే పదే శానిటైజర్ వాడుతున్నారా? ) ఆ సమయంలో వెనకాల ఉన్న శానిటైజర్ బాటిల్‌ను తాకింది. ఆ వెంటనే మంటలు శానిటైజర్ బాటిల్‌ను అంటుకోవటంతో బాంబ్‌లాగా పెద్ద శబ్ధంతో పేలిందది. పెద్ద ఎత్తున ఎగిసి పడ్డ మంటలు ఆమెను చుట్టుముట్టడంతో ముఖం, చేతులు, కాళ్లపై తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న కేట్ కూతుళ్లు స్థానికుల సహాయంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. -
మెట్రో సేవలు.. మార్గదర్శకాలు విడుదల
న్యూఢిల్లీ: అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రయాణానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ)ని విడుదల చేసింది. 15 మెట్రో రైల్ కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లతో కేంద్రం మంగళవారం చర్చించిన అనంతరం ఎస్ఓపీని నిర్ణయించింది. దాని ప్రకారం మెట్రో సేవలను తొలుత గ్రేడెడ్ పద్దతిలో ప్రారంభిస్తారు. సెప్టెంబర్ ఏడు నుంచి ఒకటి కంటే ఎక్కువ లైన్లలో సేవలు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబరు 12 నాటికి అన్ని కారిడార్లు పని చేస్తాయి. ఇక కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కంటైన్మెంట్ జోన్లలో అన్ని స్టేషన్లు మూసివేసే ఉంటాయి. ఇక ప్రయాణికులు, సిబ్బంది తప్పక మాస్క్ ధరించాలి. సామాజిక దూరం తప్పనిసరి. మాస్క్ లేకుండా వచ్చేవారి వద్ద నుంచి డబ్బు వసూలు చేసి.. మాస్క్ ఇస్తారు. (చదవండి: సిటీ బస్సులు లేనట్టేనా?) ఇక స్టేషన్లోకి ప్రవేశించేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. కోవిడ్ లక్షణాలు లేనివారినే స్టేషన్లోకి అనుమతిస్తారు. అనుమానితులను సమీప కోవిడ్ కేర్ సెంటర్‌కి పంపిస్తారు. ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. ప్రయాణికులు ఉపయోగం కోసం స్టేషన్ ఎంట్రీ వద్ద శానిటైజర్ ఉంచనున్నారు. నగదు రహిత లావాదేవీల కోసం స్మార్ట్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సాహించాలని నిర్ణయించారు. -
శానిటైజర్ శాంపిల్స్‌లో 50 శాతం కల్తీమయం!
ముంబై : కరోనా కట్టడికి ఉపయోగించే శానిటైజర్లు వ్యాపారుల అక్రమ దందాకు అడ్డాగా మారాయి. నకిలీ శానిటైజర్ల విక్రయంతో తయారీదారులు, విక్రేతలు సొమ్ము చేసుకుంటున్నారు. 120 శానిటైజర్ శాంపిళ్లను తాము పరీక్షించగా వాటిలో 50 శాతం శానిటైజర్లు కల్తీవని తేలాయని కన్జూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీజీఎస్ఐ) వెల్లడించింది. 4 శాతం శానిటైజర్లలో హానికారక మిథైల్ ఆల్కహాల్ కలిసిఉన్నట్టు గుర్తించారు. దీర్ఘకాలం మిథైల్ ఆల్కహాల్‌ను వాడితే దృష్టిలోపాలతో పాటు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ నివేదికను కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఆహార ఔషధ నియంత్రణ మండలి (ఎఫ్‌డీఏ)కి పంపామని సీజీఎస్ఐ తెలిపింది. కరోనా వైరస్ కట్టడిలో చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం అనివార్యం కావడంతో ఈ వ్యాపారంలో సత్వరమే డబ్బు సంపాదించేందుకు పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని సీజీఎస్ఐ కార్యదర్శి డాక్టర్ ఎంఎస్ కామత్ పేర్కొన్నారు. సబ్బు, నీరు అందుబాటులో లేకుంటే కనీసం 60 శాతం ఆల్కహాల్ కలిగిన శానిటైజర్‌ను వాడాలని డాక్టర్ కామత్ సూచించారు. ఇథైల్ ఆల్కహాల్ స్ధానంలో మిథైల్ ఆల్కహాల్‌ను తయారీదారులు వాడటంతో సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక సీజీఎస్ఐ పరీక్షించిన కొన్ని శాంపిళ్లలో 75 రూపాయల విలువైన 250 ఎంఎల్ శానిటైజర్లో ఆల్కహాల్ అసలు లేదని గుర్తించారు. మరోవైపు మార్కెట్లో లభించే 37 శాతం శానిటైజర్లపై తయారీ వివరాలు తెలిపే లేబుల్ లేదని వెల్లడైంది. చదవండి : లిక్విడ్ బదులు జెల్ శానిటైజర్లు విక్రయించాలి -
అంతా చేసి అమాయకుడిలా ఆ ఫేసు చూడు
తిరువనంతపురం : కరోనా వైరస్ భయంతో శానిటైజర్ మనిషి జీవితంలో ఓ నిత్యావసరంగా మారిపోయింది. డబ్బు పెట్టి శానిటైజర్ కొనుక్కునే వారి సంగతి పక్కన పెడితే.. కొనుక్కోలేని వాళ్లు అది ఫ్రీగా అందుబాటులో ఉండే షాపుల దగ్గరకో సెలూన్ల దగ్గరకో వెళ్లి పని జరుపుకుంటున్నారు. మరి కొంతమంది మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వాటిని దొంగిలించటమే పనిగా పెట్టుకుంటున్నారు. టైం బాగోలేక కొంతమంది సీసీ కెమెరాలకు దొరికిపోతున్నారు కూడా. అలాంటిదే ఈ వీడియో. కొద్దిరోజుల క్రితం కేరళకు చెందిన ఓ వ్యక్తి ఓ షాపు దగ్గరకు వెళ్లాడు. అక్కడ చిన్న బాటిల్లో ఉన్న శానిటైజర్‌ను గుట్టుచప్పుడు కాకుండా తన వెంట తెచ్చుకున్న బాటిల్లో నింపుకున్నాడు. ( నిన్ను చూస్తుంటే కడుపు మండుతోంది) తీరా అక్కడినుంచి వెళ్లిపోయే సమయంలో తాను చేసిన ఘన కార్యం సీసీ కెమెరాల్లో రికార్డయిందని తెలిసి కంగుతిన్నాడు. ఆ వెంటనే శానిటైజర్‌ను తీసిన బాటిల్లో నింపేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేస్బుక్లో పోస్టయిన ఈ వీడియోకు 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ కాస్త వెనకా ముందు చూసుకో బాసు!.. అంతా చేసి! అమాయకుడిలా ఆ ఫేసు చూడు.. కరోనా సమయంలో శానిటైజర్ దాత సుఖీభవ అనుకోవాలి అందరూ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
శానిటైజర్ ఘటనలో నగరవాసి హమీద్
జీడిమెట్ల: ఏపీలోని ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన కేసులో మూలాలు హైదరాబాద్ శివారులో వెలుగు చూస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు జీడిమెట్లకు చెందిన సాలె శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్ శానిటైజర్‌ను ఎలా తయారు చేయాలి అని యూట్యూబ్‌లో చూశాడు. అనంతరం ముడి సరుకులను జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్డులో ఉన్న హమీద్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న పర్ఫెక్ట్ సాల్వెంట్ షాపులో నిషేధిత రసాయనం మిథైల్ క్లోరై‡డ్తో పాటు తదితర రసాయనాలను కొనుగోలు చేశాడు. అనంతరం లాభసాటిగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నకిలీ శానిటైజర్లు సరఫరా చేస్తున్నాడు. ప్రకాశం జిల్లా కురిచేడు గ్రామంలో 16 మంది తాగిన శానిటైజర్ ఇక్కడ తయారయ్యిదేనని తెలుసుకుని ఏపీ పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి హస్తం ఉందో తేల్చేందుకు సన్నద్ధమయ్యారు. కాగా శ్రీనివాస్ ఇంటి వద్దనే శానిటైజర్ పరిశ్రమను నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో హమీద్ పాత్ర తేల్చేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. -
‘పర్ఫెక్ట్’వల్లే శానిటైజర్ మరణాలు
సాక్షి, ప్రకాశం : కురిచేడు, పామూరులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడు శ్రీనివాస్‌తో సహా 10 మందిని సిట్ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేసు వివరాలను ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మీడియాకు వివరించారు. ఈ ఘటనకు హైదరాబాద్‌లో తయారు చేసిన ‘పర్ఫెక్ట్’సొల్యూషన్స్ శానిటైజర్లే కారణమని ఆయన తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా జీడిమెట్లలో అక్రమంగా నకిలీ శానిటైజర్లను తయ్యారు చేశారన్నారు. మిథైల్ క్లోరైడ్‌ను విచ్చలవిడిగా వినియోగించినట్లు విచారణలో తేలిందన్నారు. శానిటైజర్ల తయారీలో అధికారులకు చిక్కినా లంచాలు ఇచ్చి బయట పడ్డారని తెలిపారు. ఈ నకిలీ శానిటైజర్లను బెంగళూరు, హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు నిందితులు సరఫరా చేశారని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు. (చదవండి : కురిచేడు ఘటన: ఆసక్తికర విషయాలు వెలుగులోకి) మరోవైపు ఈ కేసులో మరో నిందితుడు, శానిటైజర్ నిర్వాహకుడు సాలె శ్రీనివాస్‌ను విచారించిన సిట్ అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు. పేదరికంలో ఉన్న శ్రీనివాస్ ఆదాయంపై ఆకర్షితుడై లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే శానిటైజర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్‌లో చూసి శానిటైజర్ తయారు చేసి ఆ వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో పెట్టిన పదిరోజులల్లో బిజినెస్ సక్సస్ కావడం, ఆదాయం ఆశాజనకంగా ఉండటంతో ఈ వ్యాపారాన్ని వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసం ఇద్దరు వ్యక్తులను కలిసి హైదరాబాద్ జీడిమెట్లలో పారిశ్రామికవాడ పైప్‌లైన్ రోడ్డులో పర్ఫెక్ట్ కెమికల్స్ అండ్ సాల్వెంట్స్ కంపెనీ ఏర్పాటు చేశాడు. అక్కడ తయారు చేసిన శానిటైజర్‌ని తెలుగు రాష్ట్రాల్లో సరఫరా చేయడానికి ఇద్దరు పంపిణీ దారులను నియమించుకున్నాడు. అయితే పెరిగిన ఖర్చులకు తగిన ఆదాయం రాలేదనే కారణంతో ఇథైల్ ఆల్కాహాల్‌కు బదులుగా మరో ద్రావణాన్ని కలిపి విక్రయించాడు. అదే పరిస్థితుల్లో శ్రీనివాస్ కరోనా బారిన పడటంతో, ఆ బాధ్యతలను తన తమ్ముడికి అప్పగించాడు. ఇంతలో కురిచేడు ఘటన వెలుగులోకి రావడంతో ఆందోళన చెంది విజయవాడలోని తన మిత్రుడి నివాసంలో శ్రీనివాస్ తలదాచుకోగా.. అతడి ఆచూకీని తెలుసుకున్న సిట్ బృందం అదుపులోకి తీసుకున్నారు. -
లిక్విడ్ బదులు జెల్ శానిటైజర్లు విక్రయించాలి
సత్తెనపల్లి: లిక్విడ్ శానిటైజర్ బదులు జెల్ శానిటైజర్లు మాత్రమే విక్రయించాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అడిషనల్ ఎస్పీ కె.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. పట్టణంలోని పలు మెడికల్ షాపుల్లో సోమవారం ఆయన తనిఖీలు చేశారు. అనంతరం పట్టణ పోలీసు స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో శానిటైజర్ మరణాల తరువాత స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. మెడికల్ షాపుల వద్ద ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు. శానిటైజర్ తయారీదారులు, మెడికల్ షాపుల నిర్వాహకులు, మెడికల్ షాపుల అసోసియేషన్లతో మాట్లాడి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మద్యం అక్రమ సరఫరాలో పాత నిందితుల్ని బైండోవర్ చేస్తున్నామని తెలిపారు. ప్రవర్తన మార్చుకోని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు సత్తెనపల్లి అర్బన్ సీఐ ఎస్.విజయచంద్ర, సిబ్బంది ఉన్నారు. -
కురిచేడు శానిటైజర్ ఘటనపై సిట్ దర్యాప్తు ముమ్మరం
-
కురిచేడు ఘటన: ఆసక్తికర విషయాలు వెలుగులోకి
సాక్షి, ప్రకాశం: కురిచేడు శానిటైజర్ ఘటనపై సిట్ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. శానిటైజర్ నిర్వాహకుడైన సాలె శ్రీనివాస్‌ను సిట్ విచారించి అన్ని కోణాల్లో కూపీ లాగింది. పేదరికంలో ఉన్న శ్రీనివాస్ తొలుత ఓ యజమాని వద్ద వాహనాలకు వాటర్ సర్వీసింగ్ చేసే పనిలో చేరినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం సొంతంగానే వాటర్ సర్వీసింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. లాక్డౌన్ సమయంలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో శానిటైజర్ల తయారీపై చేసిన వీడియోను చూసి శ్రీనివాస్ ఆకర్షితుడయ్యాడు. దీంతో వెంటనే ఇంట్లోనే శానిటైజర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తన కూతురుకు చెందిన బంగారు వస్తువులను అమ్మి రూ. 4,500 నగదు సమీకరించుకున్నాడు. (చదివింది మూడు.. నకిలీ కంపెనీని సృష్టించి) ఆ నగదుతో శానిటైజర్ తయారీకి కావాల్సిన ముడిసరుకులను కొని తొలుత ఇంట్లోనే శానిటైజర్ల తయారీని ప్రారంభించాడు. వ్యాపారం ప్రారంభించిన పదిరోజుల్లోనే బిజినెస్ సక్సస్ కావడం, ఆదాయం ఆశాజనకంగా ఉండటంతో వ్యాపారాన్ని వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసం ఇద్దరు వ్యక్తులను కలిసి హైదరాబాద్ జీడిమెట్లలో పారిశ్రామికవాడ పైప్‌లైన్ రోడ్డులో పర్ఫెక్ట్ కెమికల్స్ అండ్ సాల్వెంట్స్ కంపెనీ ఏర్పాటు చేశారు. అంతేగాక.. తయారు చేసిన శానిటైజర్లను తెలుగు రాష్ట్రాల్లో సరఫరా చేయడానికి ఇద్దరు పంపిణీ దారులను శ్రీనివాస్ నియమించుకున్నాడు. (కురిచేడు ఘటన.. దర్యాప్తు ముమ్మరం) అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో శ్రీనివాస్ కరోనా బారిన పడ్డాడు. దీంతో బాధ్యతలను తమ్ముడికి అప్పగించాడు. పెరిగిన ఖర్చులకు తోడు తగిన ఆదాయం రాలేదనే కారణంతో ఇథైల్ ఆల్కహాల్‌కు బదులుగా మరో ద్రావణాన్ని కలిపి శ్రీనివాస్ విక్రయాలు సాగించాడు. ఇంతలో కురిచేడు ఘటన వెలుగులోకి రావడంతో ఆందోళన చెంది విజయవాడలోని తన మిత్రుడి నివాసంలో తల దాచుకున్నాడు. అయితే శ్రీనివాస్ ఆచూకీని గుర్తించిన సిట్ బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 12.30కి శానిటైజర్ కేసులో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. -
శానిటైజర్లు తాగుతున్న వారి కోసం ఎస్ఈబీ వేట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటి వరకు శానిటైజర్లు తాగుతున్న 144 మందిని స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు పట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా శానిటైజర్లు తాగి ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్న వారిని గుర్తించే పనిలో ఎస్ఈబీ అధికారులు నిమగ్నమయ్యారు. వీరికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు డీ–అడిక్షన్ కేంద్రాలకు పంపుతున్నారు. మద్యానికి బానిసైన వారు మాత్రమే శానిటైజర్లు తాగుతున్నారని, వీరి కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేసి మద్యం వ్యసనపరుల గురించి వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్ కేంద్రాలతో పాటు ప్రైవేటు కేంద్రాల్లోనూ కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ► శానిటైజర్లలో మిథైల్ ఆల్కహాల్ బదులుగా మిథైల్ క్లోరైడ్ కలుపుతున్నట్లు ల్యాబ్ పరీక్షల్లో ఫలితాలు వస్తున్నాయి. ► శానిటైజర్లు తాగి మృత్యువాత పడుతున్న ఘటనల్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశిస్తున్నారు. ► ఎస్ఈబీతో పాటు స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ► కురిచేడు ఘటనపై గత ఐదు రోజుల నుంచి ఎక్సైజ్, ఎస్ఈబీ, పోలీసు బృందాలు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు శానిటైజర్ తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాయి. ► రాష్ట్రంలో అక్రమ మద్యం సరఫరా చేస్తున్న 345 ప్రాంతాల్ని గుర్తించి వాటిపై నిఘా ఉంచామని, ఎవరైనా పట్టుబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ పీహెచ్డీ రామకృష్ణ స్పష్టం చేశారు. -
కురిచేడు ఘటన.. దర్యాప్తు ముమ్మరం
సాక్షి, ప్రకాశం జిల్లా: కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో శానిటైజర్లు విక్రయించిన పర్ఫెక్ట్ శానిటైజర్ కంపెనీ నిర్వహకుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శానిటైజర్లలో మిథైల్ ఆల్కహాల్‌కు బదులు మిథైల్ క్లోరైడ్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా నిర్వహిస్తున్నాడని.. ఏజెంట్ల ద్వారా కురిచేడు, దర్శిలలో శానిటైజర్లు విక్రయించినట్టు విచారణలో తేలింది. (చదివింది మూడు.. నకిలీ కంపెనీని సృష్టించి) కురిచేడు మండల కేంద్రంలో జూలై 30వ తేదీ గురువారం రాత్రి శానిటైజర్ తాగి ఇద్దరు మరణించారనే వార్త బయటికొచ్చింది. అంతా అప్రమత్తమయ్యే లోపే శుక్రవారం 11 మంది, శనివారం ఇద్దరు, ఆదివారం మరొకరు చొప్పున ఏకంగా 16 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారి ఇళ్ల వద్ద పర్ఫెక్ట్ కంపెనీ శానిటైజర్ బాటిళ్లు గుర్తించిన పోలీసులు అవి ఎవరు అమ్మారనే దానిపై విచారణ జరిపినప్పటికీ కురిచేడులో వాటిని అమ్మిన మెడికల్ షాపులు నిర్వాహకులు అప్పటికే వాటిని దాచేసి తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. బృందం ఐదు రోజుల పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు శానిటైజర్ ఫ్యాక్టరీలకెళ్లి తనిఖీలు నిర్వహించింది. అయితే పర్ఫెక్ట్ కంపెనీ ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. హైదరాబాద్ నగరంలో శానిటైజర్లు అమ్మే మెడికల్ షాపులను క్షుణ్ణంగా తనిఖీలు చేసే క్రమంలో పర్ఫెక్ట్ కంపెనీ శానిటైజర్లను అమ్ముతున్న డిస్ట్రిబ్యూటర్ పాయింట్‌ను కనిపెట్టారు. వీరిని విచారించడంతో పాటు టెక్నాలజీని ఉపయోగించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ గోడౌన్లో అక్రమంగా తయారవుతున్న పర్ఫెక్ట్ కంపెనీ కేంద్రాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. -
ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం : భూమన
సాక్షి, తిరుపతి : తిరుపతి స్కేవెంజర్స్ కాలనీలో శుక్రవారం శానిటైజర్ తాగి నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మార్చురీని సందర్శించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శానిటైజర్ తాగి నలుగురు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. శానిటైజర్ మద్యం కాదని.. కేవలం చేతులుశుభ్ర పరుచుకోవడానికి వినియోగించే మందని.. దీనిపై అధికారులు, ప్రభుత్వము పదేపదే హెచ్చరిస్తున్నా ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మద్యానికి బానిసైన యువకులు పొరపాటున శానిటైజరర్ తాగి ప్రాణాలు కోల్పోయారు. చేతులు శుభ్రపరుచుకుని శానిటైజర్‌ను మత్తుకు వాడకూడదని చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ తెలిపారు. ఎమ్మెల్యే భూమనతో పాటు రుయా సూపరిండెంట్ మృతదేహాల వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. -
చదివింది మూడు.. నకిలీ కంపెనీని సృష్టించి
చదివింది మూడో తరగతే. కాని ప్రముఖ ఫార్మా కంపెనీ పేరుతో శానిటైజర్ తయారీ కేంద్రం నడుపుతున్నాడు.. కుమార్తె పేరుతో ఉన్న కాన్పూర్‌లోని ఓ ఫార్మా కంపెనీ పేరుతో లేబుల్స్ తయారుచేసి కంపెనీ బాటిళ్ల మాదిరిగా అలంకారం చేశాడు. హైదరాబాద్‌లో పలువురు డి్రస్టిబ్యూటర్లు, మెడికల్ షాపుల ద్వారా శానిటైజర్ అమ్మకాలు జరిపాడు. సరైన మిషనరీ గాని, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులు గాని శానిటైజర్ తయారీకి సంబంధించిన ఫార్ములా గాని ఏమీ లేకుండానే ఇష్టం వచ్చిన కెమికల్స్ కలిపేసి శానిటైజర్‌ను తయారు చేసి అమ్మకాలు జరిపాడు. అందులో ప్రమాదకరమైన మిౖథెలిన్ క్లోరైడ్ (డీసీఎం) ను కలపడంతో అది తాగి ప్రకాశం జిల్లా కురిచేడులో ఏకంగా 16 మంది మృత్యువాత పడిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. అది తాగడానికి తయారు చేసినది కాకపోయినా అందులో ప్రమాదకరమైన కెమికల్స్ కలపడం వల్ల సదరు పర్ఫెక్ట్ కంపెనీ యజమాని శ్రీనివాస్ 16 కుటుంబాలు చిన్నాభిన్నం కావడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారకుడయ్యాడు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన సిట్ బృందం వారం రోజుల్లోనే మూలాలతో సహా పెకిలించి వేసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ... సాక్షి, ఒంగోలు: మద్యం దొరక్క శానిటైజర్ తాగి కురిచేడులో 16 మంది మృత్యువాత పడిన ఘటనకు సంబంధించి సిట్ బృందం విచారణ కొలిక్కి వచ్చింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పర్ఫెక్ట్ తయారీ కేంద్రాన్ని మూడు రోజుల క్రితమే సిట్ అధికారులు కనుగొన్న విషయం తెలిసిందే. తయారీ కేంద్రంలో పని చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు పరారీలో ఉన్న కీలక సూత్రధారి, కంపెనీ యజమాని శ్రీనివాస్‌ను విజయవాడ పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌కు వెళ్లిన మరో బృందం అక్కడ ఈ బాటిళ్లను సరఫరా చేస్తున్న డి్రస్టిబ్యూటర్తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఒంగోలుకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ముందుగా శానిటైజర్ బాటిళ్లు, తయారీ సామగ్రిని సీజ్‌చేసి ఒంగోలుకు తరలించే పనిలో సిట్ అధికారులు నిమగ్నమయ్యారు. మూడో తరగతి చదివి.. నకిలీ కంపెనీని సృష్టించి.. పర్ఫెక్ట్ కంపెనీ పేరుతో శానిటైజర్ తయారు చేస్తున్న శ్రీనివాస్ గతాన్ని పరిశీలిస్తే మొదట్లో ఓ పెట్రోల్ బంకులో చిన్న ఉద్యోగిగా పనిచేస్తూ కార్ పాలిషింగ్ లిక్విడ్ తయారు చేసే వారితో కలిసి వ్యాపారం మొదలు పెట్టాడు. ఆ తరువాత కరోనా విజృంభణతో వ్యాపారం మూలన పడటంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతికే పనిలో పడ్డాడు. గతంలో పరిచయం ఉన్న మార్కెటింగ్ వ్యక్తులు ఇచ్చిన సలహా మేరకు శానిటైజర్ తయారు చేసేందుకు సమాయత్తమయ్యాడు. మొదట్లో ఇంట్లోనే తయారు చేసి చిన్న ప్లాస్టిక్ బాటిల్లో నింపి అమ్మేందుకు ప్రయత్నించాడు. పర్ఫెక్ట్ కంపెనీ శానిటైజర్ బాటిళ్లు అయితే అవి అమ్ముడుపోక పోవడంతో కాన్పూర్‌లో ఉండే వందన ఫార్మా పేరుతో లేబుళ్లు తయారుచేసి ప్లాస్టిక్ బాటిళ్లను అలంకరించి అమ్మడం మొదలుపెట్టాడు. తన కూతురు పేరు వందన కావడంతో ఆ ఫార్మా కంపెనీని ఎంచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మొదట్లో హైదరాబాద్‌లో మాత్రమే ఈ బాటిళ్లను అమ్మాడు. అయితే కొందరు డి్రస్టిబ్యూటర్స్ ద్వారా దర్శి, కురిచేడు ప్రాంతాల్లో మెడికల్ షాపులకు సరఫరా కావడం వాటిని తాగి 16 మంది మృత్యువాత పడిన ఘటన తెలుసుకుని పరారయ్యాడు. శుక్రవారం విజయవాడ పరిసర ప్రాంతాల్లో సిట్ అధికారుల చేతికి చిక్కాడు. దొరకకుండా దాచేశారు... హైదరాబాద్‌లోని డి్రస్టిబ్యూటర్ వద్ద నుంచి తక్కువ ధరకు పర్ఫెక్ట్ శానిటైజర్ బాటిళ్లను దిగుమతి చేసుకున్న దర్శి, కురిచేడులోని కొందరు మెడికల్ షాపు యజమానులు వాటిని తాగి వరుసగా మరణాలు సంభవించడంతో భయాందోళనకు గురై స్టాకును దాచేశారు. పోలీసులు పదే పదే విచారించినా అమ్మిందెవరో బయట పెట్టలేదు. పర్ఫెక్ట్ కంపెనీ యజమానితో శ్రీనివాస్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్ సైతం సిట్ అధికారుల చేతికి చిక్కాడని తెలుసుకున్న మెడికల్ షాపు నిర్వాహకులకు కంటిపై కునుకు లేకుండా పోయింది. తమ గుట్టు రట్టు కాక తప్పదని భావించిన కొందరు అజ్ఞాతంలోకి వెళ్లేందుకు ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అన్ని కోణాల్లో దర్యాప్తు.. పర్ఫెక్ట్ కంపెనీకి సంబంధించిన మూలాలతో సహా సిట్ అధికారులు కనిపెట్టినప్పటికీ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మరిన్ని కోణాల్లో దర్యాప్తు జరిపేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. పర్ఫెక్ట్ కంపెనీ మాదిరిగా నకిలీ కంపెనీలు సృష్టించి శానిటైజర్లు అమ్మే ఫ్యాక్టరీలు, తయారీ కేంద్రాలపై పూర్తిస్థాయిలో సమాచారం సేకరించే పనిలో పడ్డారు. అంతే కాకుండా దర్శి, కురిచేడులలో పర్ఫెక్ట్ కంపెనీ శానిటైజర్లు అమ్మిన మెడికల్ షాపు నిర్వాహకులను గుర్తించి వారిలో కేసులో ఎంతవరకు బాధ్యులను చేయాలనే దానిపై న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. శభాష్ సిట్.. కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృత్యువాత పడిన ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సీరియస్‌గా దృష్టి సారించారు. హుటాహుటిన మార్కాపురం ఓఎస్డీ కె.చౌడేశ్వరి నేతృత్వంలో దర్శి, మార్కాపురం డీఎస్పీలు కె. ప్రకాశరావు, నాగేశ్వరరెడ్డిలతో పాటు దర్శి, పొదిలి, అద్దంకి సీఐలు మొయిన్, శ్రీరాం, ఆంజనేయరెడ్డిలతో సిట్‌ను ఏర్పాటు చేశారు. ఎస్ఐబీ నుంచి మరో సీఐ వీరేంద్రబాబు, కురిచేడు ఎస్ఐ రామిరెడ్డిలు కూడా దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారు. తమకు బాధ్యతలు అప్పగించిన వారం రోజుల్లోనే పక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్న పర్ఫెక్ట్ కంపెనీ తయారీ కేంద్రం గుట్టురట్టు చేసి జనంలో ఉన్న అనుమానాలకు తెరదించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సిట్ అధికారులతో నిరంతరం వారికి సూచనలిస్తూ కేసును ఛేదించారు. దీంతో శభాష్ సిట్ అంటూ ప్రకాశం జిల్లా ప్రజలతో పాటు డీజీపీ ప్రశంసలు పొందగలిగారు. -
తిరుపతిలో శానిటైజర్ తాగి నలుగురు మృతి
సాక్షి, చిత్తూరు : తిరుపతి స్కేవెంజర్స్ కాలనీలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసికొంది. సానిటైజర్ తాగి నలుగురు చనిపోయారు. మృతులు స్కేవెంజెర్ కాలనీకి చెందిన కార్మికులు వీరయ్య, వెంకట రత్నం, కుమార్, శ్రీనివాసులుగా గుర్తించారు. దీంతో కాలనీలో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా, ఇటీవలే ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో శానిటైజర్‌ను సేవించిన 12 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.(శానిటైజర్ తాగి 12 మంది మృతి) మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా శానిటైజర్ అమ్మకాలు, బెల్టుషాపులు, నాటుసారా తయారీ కేంద్రాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న 345 ప్రాంతాలను గుర్తించారు. శానిటైజర్లు తాగుతున్న144 మందిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. శానిటైజర్ తయారీ కేంద్రాల లైసెన్స్ లను పరిశీలించి హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా శానిటైజర్లను తయారు చేస్తున్న 76 మందిపై ఎస్ఈబీ అధికారులు కేసులు నమోదు చేశారు. -
'పర్ఫెక్ట్' కంపెనీ గుట్టురట్టు చేసిన సిట్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :మద్యానికి బానిసైన వారు మద్యం దొరక్క శానిటైజర్ తాగి 16 మంది మృత్యువాత పడ్డారు. కురిచేడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసు దర్యాప్తు ‘‘పర్ఫెక్ట్’’గా సాగుతోంది. ఘటన జరిగి ఐదు రోజులు గడవక ముందే అందుకు కారణమైన పర్ఫెక్ట్ కంపెనీ మూలాలను పోలీసులు గుర్తించారు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు చేస్తూ వెళ్లిన సిట్ బృందం ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తయారు చేస్తున్న నకిలీ శానిటైజర్ గుట్టును రట్టు చేసింది. కనీసం ఈ శానిటైజర్ తయారీ కేంద్రంలో సాంకేతిక నిపుణులు గానీ కనీసం చదువుకున్న వారు గాని లేని పరిస్థితి. గ్రామాల్లో కూలీ పనులు చేసుకునే వారిని ఓ గోడౌన్లో ఉంచి వారి చేత శానిటైజర్ పేరుతో నకిలీవి తయారు చేసి సొమ్ము చేసుకుంటున్న వైనం పోలీసు దర్యాప్తులో బయటపడింది. దీనికి సంబంధించి కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్న సిట్ బృందం అసలైన సూత్రధారులను పట్టేపనిలో పడింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కురిచేడు మండల కేంద్రంలో జూలై 30వ తేదీ గురువారం రాత్రి శానిటైజర్ తాగి ఇద్దరు మరణించారనే వార్త బయటికొచ్చింది. అంతా అప్రమత్తమయ్యే లోపే శుక్రవారం 11 మంది, శనివారం ఇద్దరు, ఆదివారం మరొకరు చొప్పున ఏకంగా 16 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారి ఇళ్ల వద్ద పర్ఫెక్ట్ కంపెనీ శానిటైజర్ బాటిళ్లు గుర్తించిన పోలీసులు అవి ఎవరు అమ్మారనే దానిపై విచారణ జరిపినప్పటికీ కురిచేడులో వాటిని అమ్మిన మెడికల్ షాపులు నిర్వాహకులు అప్పటికే వాటిని దాచేసి తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. బృందం ఐదు రోజుల పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు శానిటైజర్ ఫ్యాక్టరీలకెళ్లి తనిఖీలు నిర్వహించింది. అయితే పర్ఫెక్ట్ కంపెనీ ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. హైదరాబాద్ నగరంలో శానిటైజర్లు అమ్మే మెడికల్ షాపులను క్షుణ్ణంగా తనిఖీలు చేసే క్రమంలో పర్ఫెక్ట్ కంపెనీ శానిటైజర్లను అమ్ముతున్న డిస్ట్రిబ్యూటర్ పాయింట్‌ను కనిపెట్టారు. వీరిని విచారించడంతో పాటు టెక్నాలజీని ఉపయోగించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ గోడౌన్లో అక్రమంగా తయారవుతున్న పర్ఫెక్ట్ కంపెనీ కేంద్రాన్ని పట్టుకున్నారు. అంతా అక్రమమే.. పర్ఫెక్ట్ కంపెనీ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన సిట్ బృందానికి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని చూసి ఒళ్లు జలదరించింది. కనీసం ఒక్క టెక్నికల్ పర్సన్ కూడా లేకుండా చదువులేని గ్రామీణ ప్రాంతాల కూలీలను తీసుకొచ్చి శానిటైజర్ పేరుతో ఏదో ద్రవాన్ని తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. శానిటైజర్లో ఐసోప్రొఫైల్ ఆల్కహాల్, ప్రొఫనాల్ కాకుండా మిథైలిన్ క్లోరైడ్ (డీసీఎం) ను ఉపయోగించి శానిటైజర్ తయారు చేస్తున్నట్లు తేలింది. ఈ మిథైలిన్ క్లోరైడ్ ప్రమాదకరమైనదని దానిని శానిటైజర్లో వాడకూడదని నిపుణుల ద్వారా తెలుసుకున్న పోలీసులు నిర్ఘాంతపోయారు. అక్కడ కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఫ్యాక్టరీ పేరుతో చూపుతున్న అడ్రస్, జీఎస్టీ, ఐఎస్ఓ సర్టిఫికెట్ వంటివి అన్ని తప్పుడు వాటిని సృష్టించి శానిటైజర్ తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరి వద్ద నుంచి కురిచేడులో మెడికల్ షాపు నిర్వాహకులు ఎంతమంది కొనుగోలు చేసి వీటిని అమ్మారనే విషయంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నారు. మెడికల్ షాపు నిర్వాహకులకు విషయం తెలిసినా బయటపడటం లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది తాగడం వల్లే కురిచేడులో అధిక శాతం మరణాలు సంభవించాయని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరినీ వదలం.. – ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశాం. ఇప్పటికే సిట్ అధికారులు పర్ఫెక్ట్ కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీని సీజ్ చేసి అందులో నిషేధిత మిథైలిన్ క్లోరైడ్‌ను కలుపుతున్నట్లుగా గుర్తించాం. ఇది ప్రమాదకరమైన కెమికల్. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఇందులో కురిచేడులోని మెడికల్ షాపు నిర్వాహకులకు ఎంతమందికి సంబంధాలున్నాయనే దానిపై ఆరా తీస్తున్నాం. అది నిజమని తేలితే వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు వెనుకాడం. -
శానిటైజర్ల విక్రయదారులూ.. భద్రం సుమా..
కడప అర్బన్ : శానిటైజర్ తాగి ఎవరూ ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ హితవు పలికారు. మంగళవారం జిల్లా ఎస్పీ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ప్రసార మాధ్యమాల్లో పలువురు శానిటైజర్లు సేవించి మరణించారని వార్తలు రావడం బాధాకరమన్నారు. ఈ క్రమంలో జిల్లాలోని పోలీసు యంత్రాంగం అప్రమత్తమైందని, జిల్లాలోని రెండు లైసెన్స్డ్ శానిటైజర్ తయారీ దారులపై పోలీసు, డ్రగ్ కంట్రోల్ అథారిటీ వారితో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాన్నారు. జిల్లాలోని డిస్టిలరీలు, స్పిరిట్ తయారీ, నిల్వ, సరఫరాలపై పోలీసు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) వారితో సంయుక్తంగా తనిఖీలు చేస్తోందన్నారు. శానిటైజర్లు విక్రయించేందుకు ఎలాంటి లైసెన్స్‌ల అవసరం లేకపోయినప్పటికీ శానిటైజర్‌ను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? ఎవరికి అమ్ముతున్నారు? కొనుగోలుకు సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా ఉండాలని ఎస్పీ తెలిపారు. కర్మాగారంలో నిర్ణీత ప్రమాణాల్లో శానిటైజర్ తయారీ తర్వాత కల్తీ చేయడం, విక్రయించడం, లైసెన్స్‌లేని తయారీ దారునుంచి కొనుగోలు చేయడం, సంబంధిత వాణిజ్య పన్నుల బిల్లులు లేకపోయినా చట్టప్రకారం కఠిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని ఎస్పీ హెచ్చరించారు. వీరికి స10 సంవత్సరాలపాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. విక్రయించేవారు, కొనుగోలు చేసే వారి పేరు, ఫోన్ నెంబరు తప్పనిసరిగా నమోదు చేయాలని, పక్కా బిల్లుల ద్వారా విక్రయించాలన్నారు. మెడికల్ షాపుల్లో పోలీసుల తనిఖీలు ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని పలు మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో మంగళవారం పోలీసులు, ఎస్ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల జిల్లాలో శానిటైజర్లు తాగి పలువురు మృతి చెందిన నేపథ్యంలో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. శానిటైజర్లను కొనుగోలు చేసిన బిల్లులు, బ్యాచ్ నెంబర్, వోచర్లను డీఎస్పీ సుధాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ దుకాణదారులకు పలు సూచనలు చేశారు. బ్రాండెడ్ శానిటైజర్లను మాత్రమే విక్రయించాలన్నారు. రిటైర్ దుకాణాల్లో శానిటైజర్లు కొనుగోలు చేసిన వారి పేర్లు, మొబైల్ నంబర్లను నమోదు చేయాలన్నారు. తనిఖీల్లో ఎస్ఈబీ సీఐ సీతారామిరెడ్డి, వన్‌టౌన్ సీఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. నిబంధనలను పాటించాలి బద్వేలు అర్బన్ : శానిటైజర్ విక్రయాల్లో మెడికల్‌షాపుల యజమానులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని అర్బన్ ఇన్స్పెక్టర్ రమేష్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం పుట్పెట్రోలింగ్లో భాగంగా పట్టణంలోని మెడికల్ షాపులను పరిశీలించి సంబంధిత యజమానులకు సూచనలు ఇచ్చారు. మెడికల్‌షాపుల యజమానులు శానిటైజర్ కొనుగోలుకు వచ్చే వారి పరిస్థితిని గమనించి నిజంగా కోవిడ్ సంరక్షణ కోసం వినియోగిస్తున్నాడా లేక మత్తుకోసం సేవించేందుకు వినియోగిస్తున్నాడా అని గమనించాలన్నారు. శానిటైజర్ కొనుగోలుకు వచ్చే వారి పూర్తి వివరాలను ఆధార్‌కార్డుతో సహా నమోదు చేయాలని సూచించారు. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో శానిటైజర్‌ను కొనుగోలు చేసే వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. అలాగే దుకాణ యజమానులు కూడా అధిక మొత్తంలో శానిటైజర్లను విక్రయించరాదని హెచ్చరించారు. పెనగలూరులో.. పెనగలూరు: మండలంలో శానిటైజర్స్ అమ్ముతున్న దుకాణాలపై మంగళవారం ఎస్ఐ చెన్నకేశవ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు మందులషాపులు, ఇతర దుకాణాల్లో శానిటైజర్స్ అమ్ముతున్న వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. శానిటైజర్స్ కొనుగోలు చేసిన ఇన్వాయిస్ బిల్లులను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. శానిటైజర్స్ ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నారు, వాటి ధరలు ఎంతో ఖచ్చితంగా బిల్లులు చూపాలన్నారు. శానిటైజర్స్ ఎవరికి అమ్ముతున్నామో వారి సెల్‌నెంబర్‌తో సహా షాపుల నందు నమోదు చేసుకొని ఉండాలన్నారు. -
కడప: పెండ్లిమర్రిలో విషాదం
-
శానిటైజర్ తాగి ముగ్గురు మృతి
సాక్షి, కడప: మద్యానికి బానిసలై చివరికి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. కరోనా కాలంలో శానిటైజర్ విరివిగా దొరుకుతుండడంతో మత్తు కోసం వాటిని ఆశ్రయిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండల కేంద్రంలో శానిటైజర్ తాగి ముగ్గురు మృతి చెందారు. మృతులను చెన్నకేశవులు, భీమయ్య, ఓబులేష్‌లుగా గుర్తించారు. వీరిలో చెన్నకేశవులు ఇంటి వద్దనే మృతి చెందగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఖననం చేశారు. ఓబులేష్ రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందగా.. భీమయ్య ఇంటి దగ్గరే చనిపోవడంతో పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ కు తరలించారు. వీరు మొత్తం 8 మంది బ్యాచ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ కలిసే శానిటైజర్ సేవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మిగిలిన ఐదుగురి ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. (వైఎస్సార్ జిల్లాలో బరితెగించిన టీడీపీ నేతలు) -
తాగితే నిప్పు.. ప్రాణానికే ముప్పు
మద్యానికి బానిసలైన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం, వేల్పూరు గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు మార్చి 30న శానిటైజర్లో ఉప యోగించే ఐసోప్రోపిల్ ఆల్కహాల్‌ను కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగారు.ఈ ఘటనలో యువకులు మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లా, కురిచేడు మండల కేంద్రంలో శానిటైజర్ తాగి ఆరోగ్యం విషమించి గురు, శుక్రవారాల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో గుంటూరుకు చెందిన మాతంగి పెదసుబ్బారావు కూడా ఉన్నాడు. ఇతను కురిచేడులో ఓ ఫంక్షన్‌కు హాజరై అక్కడి వ్యక్తులతో కలసి శానిటైజర్ తాగాడు. శనివారం మరో ఇద్దరు మృతి చెందారు. 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాక్షి, గుంటూరు: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న కంటైన్మెంట్ ప్రాంతాల్లో మద్యం షాపులు మూతపడ్డాయి. దీంతో మద్యం లభించక తాగుడుకు బానిసలైన కొందరు ప్రత్యామ్నాయ మార్గాల్లో కిక్‌ను వెతుక్కుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జిల్లాలో 239 ప్రభుత్వ మద్యం దుకాణాలున్నాయి. వీటిలో ప్రస్తుతం 116 దుకాణాల్లో మాత్రమే విక్రయాలు నడుస్తున్నాయి. మిగిలినవి కంటైన్మెంట్ జోన్లలో ఉండటంతో మూతపడ్డాయి. గుంటూరు నగరం, నరసరావుపేట, బాపట్ల, తెనాలి, పొన్నూరు, మాచర్ల పట్టణాలు సహా జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు నెలలకు పైగా మద్యం షాపులు తెరుచుకోలేదు. ప్రత్యామ్నాయం వైపు మందుబాబుల చూపు.. మూడు, నాలుగు నెలలకు పైగా మద్యం షాపులు మూతపడటం, దీనికి తోడు పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలు, పేదలు శానిటైజర్లు, స్పిరిట్, నాటుసారా తాగడం, నిద్ర మాత్రలు వేసుకోవడం, గంజాయి పీల్చడం వంటి మార్గాల్లో కిక్ పొందుతున్నారు. బీర్లో తొమ్మిది శాతం, మద్యంలో సుమారు 24.3 శాతం ఆల్కహాల్ ఉంటుంది. అయితే, శానిటైజర్లో కంపెనీని బట్టి 80–90శాతం వరకూ ఉంటుంది. ఆల్కహాల్ శాతం అధికంగా ఉన్న శానిటైజర్‌ను మద్యానికి బానిసలైన కొందరు నీళ్లు, కూల్ డ్రింక్స్లోకి పోసుకుని తాగుతున్నారు. ఇది ఎంతో ప్రమాదకరమని, ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కిక్ కోసం ఈ మార్గాన్నే కొందరు ఎంచుకుంటున్నారు. స్టువర్టుపురం, వెల్దుర్తి, బొల్లాపల్లి, దిండి, నిజాంపట్నం సహా మరికొన్ని ప్రాంతాల్లో నాటు సారా వినియోగం అధికంగా ఉంటోంది. దిండి పరిసర ప్రాంతాల్లో తయారవుతున్న నాటు సారా భట్టిప్రోలు, పొన్నూరు, బాపట్ల, రేపల్లె ఇలా డెల్టా ప్రాంతాల్లో సరఫరా అవుతోంది. గుంటూరు నగరంలో అయితే కొందరు మద్యం దొరక్క నిద్రమాత్రలు వేసుకుంటూ కిక్ పొందుతున్నారు. మందుబాబులు కిక్ కోసం వెతుక్కుంటున్న ప్రత్యామ్నాయ మార్గాలన్నీ ప్రాణాల మీదకి తెచ్చేవేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం జిల్లా, కురిచేడు ఘటనను గుణపాఠంగా తీసుకుని ఇప్పటికైనా మందుబాబులు మత్తు కోసం అడ్డదార్లు తొక్కవద్దని సూచిస్తున్నారు. మానడానికి ఇదే అవకాశం ఓ వైపు కరోనా ఆంక్షలు, మద్యం షాపులు మూతపడటం అంశాలు మద్యం మానడానికి ఇదే సరైన అవకాశం అని మానసిక నిపుణులు చెబుతున్నారు.తాగుడును ఒకేసారి మానడం కష్టం. మద్యానికి ప్రత్యామ్నాయంగా ప్రమాదకరమైన శానిటైజర్, నాటుసారా వంటివి తాగకుండా జ్యూస్‌లు, కూల్ డ్రింక్‌లు తాగడం, ఖాళీగా ఉండకుండా ఏదోక పనిలో నిమగ్నం అవ్వడం, మద్యం నుంచి ఇతర అంశాలపై దృష్టి సారించడం చేయాలని సూచిస్తున్నారు. మార్పు తేవచ్చు మద్యానికి బానిసలైన వారిని డీ అడిక్షన్ సెంటర్లో చేర్చి చికిత్స అందించడం ద్వారా మార్పు రాబట్టవచ్చు. మద్యం, మత్తు పదార్థాలకు బానిసలైన వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు, ఉచితంగా మందులు అందిస్తాం. కుటుంబ సభ్యులు వారితో ఎలా మెలగాలి అనేదానిపై కౌన్సెలింగ్ ఇస్తాం. తల్లిదండ్రులు పిల్లల్ని ఓ కంట కనిపెట్టాలి. ప్రస్తుతం యువతే ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసవుతోంది. – పబ్బతి లోకేశ్వరరెడ్డి, డీ అడిక్షన్ సెంటర్ నోడల్ ఆఫీసర్, గుంటూరు జీజీహెచ్ స్వచ్ఛమైన ఇథైల్ ఆల్కహాల్ తాగితే చనిపోతారు మద్యానికి అలవాటు పడిన వారిలో కొంతమంది శానిటైజర్, స్పిరిట్ తాగి చనిపోతున్నారు. సాధారణంగా తాగే మద్యంలో ఇథైల్ ఆల్కహాల్ 40 శాతం వరకూ మాత్రమే ఉంటుంది. కాని శానిటైజర్, స్పిరిట్‌లో 100శాతం ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది. అంతేకాకుండా వాటి స్వచ్ఛత కోసం ఇథైల్ ఆల్కహాల్‌తో పాటుగా గ్లిజరిన్, ఐసోప్రొఫెల్ ఆల్కహాల్ ఇతర రసాయనాలను కలుపుతారు. స్పిరిట్, శానిటైజర్లు శరీరంపైన బ్యాక్టీరియాలను నిర్మూలించేందుకు మాత్రమే వినియోగించాలి. వాటిని తాగటం వల్ల రక్తాన్ని శుద్ధి చేసే వ్యవస్థ దెబ్బతినిపోతుంది. రక్తంలో ఆక్సిజన్‌ను పూర్తిగా నిర్వీరం చేస్తుంది. దీంతో రెస్పిరేటరీ సిస్టం దెబ్బతిని ఊపిరి తిత్తులు పాడై ఊపిరి తీసుకోలేక మనిషి చనిపోతాడు. కొన్ని సందర్భాల్లో కళ్లు పోతాయి. –డాక్టర్ తిరుమలశెట్టి వెంకట ఆదిశేషుబాబు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, గుంటూరు జీజీహెచ్ -
పెళ్లి రద్దయ్యిందని.. శానిటైజర్ తాగి
బేతంచెర్ల: వారం రోజుల్లో జరగాల్సిన పెళ్లి రద్దు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలోని శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మోహిద్దీన్‌పురం గ్రామానికి చెందిన వేల్పుల ఏడుకొండలు(22) కుటుంబం కొంత కాలం క్రితం ఉపాధి నిమిత్తం బేతంచెర్లకు వచ్చి స్థిరపడ్డారు. అయ్యలచెర్వులోని పాలీస్ బండల ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగించేవారు. ఏడుకొండలుకు మహానంది మండలం నందిపల్లెకు చెందిన యువతితో ఆగస్టు 7న వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కాగా కొన్ని కారణాల వల్ల యువతి కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం వివాహాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉదయం శానిటైజర్ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆరోగ్య కేంద్రానికి తరలించగా, కోలుకోలేక మృతి చెందాడు. మృతుని తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.సురేష్ తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించారు. -
మద్యానికి బానిసై.. ప్రాణాలు కోల్పోయి..
-
కురిచేడు మృతుల ఘటన బాధాకరం: లక్ష్మణరెడ్డి
సాక్షి, గుంటూరు: ఆల్కహాల్ తీసుకోవడంతో అది మనిషి రోగ నిరోధక శక్తిపై గణనీయమైన ప్రభావం చూపే ప్రమాదముందని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులో మద్యం అందుబాటులో లేదని శానిటైజర్ తాగి ప్రాణాలొదిలిన ఘటనపై లక్ష్మణరెడ్డి తీవ్రంగా చలించి శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు. మద్యం, మత్తు పదార్ధాలు వ్యసనంగా మారి వత్తిడికి గురవడంతోనే పేదలు వివిధ ప్రత్యామ్నాలకు పోయి ప్రాణాలమీదికి తెచ్చుకోవడం బాధాకరమన్నారు. అలాంటి వ్యసనపరులను మద్యం, మత్తుల నుంచి విముక్తి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం డి- అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 15చోట్ల ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఏరియా ఆస్పత్రులలో డి- అడిక్షన్ కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. మరో 10 చోట్ల సైతం ఈ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టిందని తెలియజేశారు. (మద్యానికి బానిసై.. ప్రాణాలు కోల్పోయి..) వ్యక్తిగత కౌన్సిలింగ్‌తో పాటు వ్యసనపరులు తాగుడుకు దూరమైనప్పుడు కనిపించే లక్షణాలకు తగిన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వ వైద్యులు సిద్ధంగా ఉన్నారని వివరించారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ మనసును నియంత్రించుకోవడం కూడా అవసరమేనని లక్ష్మణరెడ్డి చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ కోవిడ్ సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు పొగతాగడం, మద్యం, మత్తు మందులు వినియోగించడం చేయరాదని సూచించిందని గుర్తుచేశారు. మద్యం, మత్తు ఒక్కసారిగా ఆగిపోతే చేతులు, కాళ్లు వణకడం, గందరగోళానికి గురి కావడం, కొన్ని కేసులలో ఫిట్స్‌కు గురి కావడం జరుగుతుందని..ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మద్యం తీసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో నష్టమే ఎక్కువ ఉందని తెలిపారు. మద్యం తీసుకుంటే ఆందోళన కాస్త తగ్గించవచ్చేమో కానీ మద్యం ప్రియులు డిప్రెషన్లోకి చేరుకునేందుకు తోడ్పడుతుందని వెల్లడించారు. (కురిచేడులో విషాదం..) సాధారణ రోజుల్లో తాము ఎంత తాగాలనే దానిపై మద్యం ప్రియులకు ఓ అంచనా ఉంటుందని.. కానీ, కరోనా లాంటి కాటస్ట్రోపిక్ ఈవెంట్స్ లాంటివి ఈ మొత్తాన్ని అధికం చేస్తాయని హెచ్చరించారు. మద్యపానం వల్ల వైరస్ దరిచేరదన్నది అపోహ మాత్రమేనని...నిజానికి లివర్, శ్వాస సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మద్యం అధికంగా సేవించడం వల్ల కోపం, నిరాశ, డిప్రెషన్‌లోనికి జారిపోవడంతో పాటుగా గృహ హింస లాంటివి సైతం పెరిగే అవకాశాలున్నాయని సైకాలజిస్టులు చెబుతుండటం గమనార్హం అన్నారు. మద్యపానం మానేయడంతో బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడంతో పాటుగా సరిగా నిద్ర పట్టడం, భావోద్వేగాలు నియంత్రణలో ఉండటం లాంటి ప్రయోజనాలెన్నో ఉన్నాయని వివరించారు. మద్యపానం మానేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని.. కాలేయ ఆరోగ్యం, బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గేందుకు అవకాశం ఉండటంతో పాటుగా కొన్ని రకాల కేన్సర్లు కూడా నివారించబడే అవకాశాలున్నాయని చెప్పారు. ఆల్కహాల్ తీసుకోకపోవడంతో బరువు కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చన్నారు. లిక్కర్లో ఉండే కేలరీలతో బరువు పెరగడమే కాకుండా, ఆల్కహాల్ వల్ల తెలియకుండానే అధికంగా తినడం జరుగుతుందన్నారు. ఒత్తిడితోనే చాలామంది మద్యం తీసుకుంటుంటారని.. దాన్ని నియంత్రించుకోగలిగితే చాలా వరకూ అలవాటుకు దూరం కావచ్చని తెలిపారు. వ్యాయమాలు, యోగా లాంటి వాటితో ఈ ఒత్తిడిని కొంతమేర నియంత్రించుకోవచ్చని లక్ష్మణరెడ్డి సూచించారు. (శానిటైజర్ అమ్మకాలపై కీలక ప్రకటన) ఖాళీగా ఉంటే చెడు ఆలోచనలు వచ్చే ప్రమాదమున్నందున ప్రతీ ఒక్కరు ఏదొక ఉపయోగకరమైన పని కల్పించుకుంటే ఈ అలవాటుకు దూరం కావచ్చన్నారు. మనసును మద్యం నుంచి ఇతర అంశాలపైకి దృష్టి మళ్లించడం మంచిదన్నారు. మద్యం దొరకడం లేదనే బెంగతో కొంతమంది కృశించిపోతున్నారని.. దానికి బదులు కరోనా తనకు మద్యం అలవాటు మాన్పించేందుకు ఓ అవకాశం ఇచ్చిందని ప్రతీ ఒక్కరూ భావించాలన్నారు. ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా ఉంటుందని ఉద్భోదించారు. వత్తిడి తట్టుకోలేని వారు స్నేహితులు, కుటుంబసభ్యుల సలహాలను తీసుకోవడమే మంచిదని... వారి సలహాలతో పాటు సకాలంలో ఆయా జిల్లాకేంద్రాల్లోని డి-అడిక్షన్ కేంద్రాలకు వెళ్లడం లాభించవచ్చని లక్ష్మణరెడ్డి సూచించారు. -
వారం రోజులుగా శానిటైజర్ తాగుతూ..
సాక్షి, ప్రకాశం: కురిచేడులో శానిటైజర్ తాగి చనిపోయిన అనుగొండ శ్రీను బోయకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసైన అతడు తనతో పాటు మరో వ్యక్తికి కూడా గ్లాసులో శానిటైజర్ పోసి ఇచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో కొందరు స్థానికులు, యాచకులు శానిటైజర్ తాగారు. ఈ ఘటనలో గురువారం అర్ధరాత్రి ముగ్గరు మరణించగా, శుక్రవారం మరో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. (శానిటైజర్ తాగి 9 మంది మృతి ) ఇక ఈ విషాదకర ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మద్యానికి బానిసైన మృతులు.. మందు దొరకకపోవడంతో శానిటైజర్లు తాగారని, సీనియర్ అధికారులతో కేసు విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే.. దయచేసి ఎవరూ శానిటైజర్లు తాగవద్దని విజ్ఞప్తి చేశారు. -
కురిచేడులో విషాదం..
-
కురిచేడులో విషాదం..
సాక్షి, ప్రకాశం: కురిచేడులో శానిటైజర్ తాగిన ఘటనలో మృతి చెందినవారి సంఖ్య పదికి చేరింది. నిన్న అర్ధరాత్రి ముగ్గురు మరణించగా, శుక్రవారం మరో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు భిక్షాటన చేసే వ్యక్తులు కాగా, మరో ఆరుగురు గ్రామస్తులు ఉన్నారు. అనుగొండ శ్రీను బోయ(25), భోగేమ్ తిరుపతయ్య (37), గుంటక రామిరెడ్డి (60), కడియం రమణయ్య (30), కొనగిరి రమణయ్య (65), రాజారెడ్డి (65), బాబు (40), ఛార్లెస్ (45), అగస్టీన్ (47) మృతి చెందారు.మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం చనిపోయారు. కరోనా దృష్ట్యా కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దుకాణాలు లేకపోవటంతో కొందరు స్థానికులు, యాచకులు శానిటైజర్ తాగారు. మద్యం దొరకక కొంతకాలంగా వీరు శానిటైజర్ తాగుతున్నట్లు సమాచారం. మృతదేహాలను దర్శి మార్చురీకి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
శానిటైజర్ అమ్మకాలపై కీలక ప్రకటన
ఢిల్లీ : శానిటైజర్ విక్రయాలు, నిల్వలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సడలించింది. ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో శానిటైజర్ నిత్యావసర వస్తువుగా మారిన నేపథ్యంలో డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ నిబంధనల నుంచి శానిటైజర్లకు మినహాయింపు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో శానిటైజర్ వాడకం తప్పనిసరి కావడంతో అందరికీ అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శానిటైజర్ అమ్మకాలకు డిమాండ్ పెరడగంతో కొందరు కేటుగాళ్లు దీనిని క్యాష్ చేసుకొని కల్తీ అమ్మకాలు జరుపుతున్నారు. దీన్ని అరికట్టే లక్ష్యంతో ఇకపై శానిటైజర అమ్మకాలు, నిల్వలపై అనుమతులు తప్పనిసరి చేస్తూ కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. (చీరలో మెరిసిపోతూ.. శానిటైజర్ అందిస్తోన్న రోబో) శానిటైజర్ కొరత తలెత్తకుండా కొత్తగా మరో 600 సంస్థలకు తయారీ అనుమతులు ఇచ్చి ఉత్తర్వులు జారీ చేసింది. డిమాండ్ అవసరాలకు తగ్గట్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. శానిటైజర్ ధరలపై కూడా పరిమితులు విధిస్తూ నిర్ణయించింది. ఈ ప్రకటన తర్వాత శానిటైజర్ అమ్మకాలను లైసెన్సు నుంచి మినహాయింపులు కోరుతూ పలు విజ్ఞప్తులు కేంద్రానికి అందాయి. దీంతో ప్రజలకు శానిటైజర్ మరింత అందుబాటులో ఉండేందుకు వీలుగా డ్రగ్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ నిబంధనల నుంచి మినహాయింపు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. (శానిటైజర్ వాడుతున్నారా...) -
శానిటైజర్ అందిస్తోన్న రోబో
-
ఒకే దెబ్బకు రెండు పిట్టలంటే ఇదే
చెన్నై: కరోనా వచ్చిన నాటి నుంచి పలు దేశాల్లో రోబోల వాడకం పెరిగిపోయింది. కరోనా కట్టడి కోసం సామాజక దూరం తప్పని సరి కావడంతో రోబోల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో ఓ బట్టల దుకాణాదారుడు.. కస్టమర్ల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్న ఆలోచన చేశాడు. దానిలో భాగంగా షాప్‌లోకి వచ్చే కస్టమర్లకు శానిటైజర్ అందించడం.. టెంపరేచర్ చెక్ చేయడం కోసం ఓ రోబోను ఏర్పాటు చేశాడు. అంతటితో ఊరుకోక ఆ రోబోకు చక్కగా చీర కట్టి అందంగా ముస్తాబు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది.(కరోనాపై పోరుకు కొత్త అస్త్రం!) సుధా రామేన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి ‘తమిళనాడులోని ఓ బట్టల దుకాణం సాంకేతికతను సరైన మార్గంలో వినియోగించుకుంటోంది. చీర కట్టులో మెరిసిపోతున్న ఓ మర మనిషి కస్టమర్ల దగ్గరకు వెళ్లి శానిటైజర్ అందిస్తోంది’ అంటూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇప్పటికే దీన్ని 35వేల మంది లైక్ చేశారు. ప్రశంసలతో ముంచేత్తుతున్నారు. ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే.. మోడల్ కం హెల్పర్.. మీ ఐడియా సూపర్’ అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజనులు.(‘గాడిద సార్.. మాస్క్ ధరించదు’) -
జన జీవన సూత్రం.. ఆరోగ్యమంత్రం
సాక్షి, అమరావతి: కరోనా విజృంభిస్తున్న వేళ జన జీవన శైలిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైరస్ రాకుండా అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఒక వేళ వైరస్ వచ్చినా దానిని జయించేందుకు ముందుగానే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. మాస్క్‌లు, శానిటైజర్ల వినియోగంతో పాటు.. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు బలమైన ఆహారాన్ని తీసుకుంటు న్నారు. ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకూ గతానికి భిన్నంగా మన లైఫ్‌స్టైల్ పూర్తిగా మారిపోయింది. ప్ర«ధానంగా ఇళ్లల్లో ఉన్న వృద్ధులు, పిల్లలను సంరక్షించుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ► సాధారణ గృహిణి నుంచి ఉద్యోగి వరకు ఇప్పుడు ముఖానికి మాస్క్‌లు, చేతులకు శానిటైజర్లను వినియోగిస్తున్నారు. బయటికి వెళ్లేప్పుడు కూడా జేబుల్లో, హ్యాండ్ బ్యాగుల్లో శానిటైజర్లను వెంట తీసుకెళ్తున్నారు. ► స్తోమతను బట్టి రూ.20 నుంచి రూ.500 వరకు విలువైన మాస్కులను వాడుతున్నారు. ► రోగ నిరోధక శక్తిని పెంచుకునే క్రమంలో పసుపు, అల్లం, శొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగ తదితర వాటితో కషాయాలు తయారు చేసుకుని తాగుతున్నారు. కాఫీ, టీల స్థానే కషాయాలు తీసుకోవడం పెరిగింది. ► కరోనా సోకాక ఆందోళన చెందకుండా ముందు జాగ్రత్తగా అన్ని మందులను దగ్గర పెట్టుకుంటున్నారు. ► జ్వరానికి పెరాసెట్‌మాల్, జలుబు, దగ్గు, నొప్పులు వంటి వాటికి అవసరమైన మందు బిళ్లలను సరిపడా సిద్ధం చేసుకుంటున్నారు. ► కరోనా సోకినా తట్టుకుని ప్రాణాలు నిలుపుకొనేలా ఇమ్యూనిటీ బూస్ట్ కోసం మల్టీ విటమిన్ మాత్రలను మింగుతున్నారు. ఆక్సీమీటర్, ఆవిరి యంత్రాల కొనుగోలు ► పెరుగుతున్న కరోనా కేసులతో ఆస్పత్రుల్లో ఖాళీ ఉండే పరిస్థితి లేదని పలువురు ముందుగానే జాగ్రత్తపడుతున్నారు. ► ప్రయివేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో మాట్లాడుకుని తమకు అవసరమైనప్పుడు బెడ్, వెంటిలేటర్ కేటాయించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ► శరీరంలో ఆక్సిజన్ స్థాయిని తెలుసుకునేందుకు రూ.1,350 నుంచి 2,500 ఖరీదైన ఆక్సీమీటర్, ఊపిరితిత్తుల్లో నిమ్మును తగ్గించేలా రూ.200 నుంచి రూ.600 వరకు ఖరీదైన ఆవిరి యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. ► సత్వరం ఆక్సిజన్ అందించేలా రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకూ విలువైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మిషన్లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ► కాన్సన్ట్రేటర్ మిషన్‌లో నీళ్లు పోసి కరెంటు ప్లగ్ పెడితే దానికదే ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ మిషన్‌కు ఉండే మాస్క్‌ను ఏకకాలంలో ఒకరిద్దరు ముఖాలకు పెట్టుకుంటే ముక్కు ద్వారా ఆక్సిజన్ అంది ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. ముఖానికి మాస్క్ తప్పనిసరైంది.. నేను బయటకు వెళితే ఖచ్చితంగా శానిటైజర్, మాస్క్ వినియోగిస్తున్నా. జేబులో పెట్టుకునేలా పెన్ మాదిరిగా ఉండే శానిటైజర్ పైపును వెంట తీసుకెళ్తున్నా. దానిలో రోజువారీగా జల్ శానిటైజర్ నింపుకొని తీసుకెళ్లడం సులభంగా ఉంది. సురక్షితమైన క్లాత్‌తో తయారు చేసిన దాన్నే మాస్క్‌గా వినియోగిస్తున్నా. ఇంటికొచ్చాక మాస్క్, గ్లౌజులను మూత ఉండే డస్ట్‌బిన్‌లో పడేసి, మొదట కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుని స్నానం చేశాకే ఇంట్లోకి వెళుతున్నా. – మంగం రవికుమార్, ప్రైవేటు ఉద్యోగి, కలిసిపూడి, పశ్చిమగోదావరి ఆహారపు అలవాట్లు మార్చుకున్నా.. కరోనా నేపథ్యంలో మా ఇంట్లో ఉదయం లేవగానే వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగుతున్నాం. టిఫిన్‌లో బాదం పప్పులు, ఒకటి లేదా రెండు గుడ్లతో పాటు అల్లం టీ తీసుకుంటున్నాం. మధ్యాహ్న భోజనంలో మిరియాల రసం, ఆకు కూరలు, కొద్దిగా మాంసాహారం లేదా క్యారెట్, బీట్రూట్, ఏదో ఓ కూర తింటున్నాం. రాత్రిపూట తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగుతున్నాం. – ఎ.సుబ్బలక్ష్మి, గృహిణి, భీమవరం, పశ్చిమగోదావరి -
శానిటైజర్ వాడుతున్నారా...
శృంగవరపుకోట రూరల్: కరోనా వైరస్ వ్యాప్తితో చేతుల పరిశుభ్రతకు ప్రాధాన్యం పెరిగింది. ఎక్కడికి వెళ్లినా శానిటైజర్ రాసుకోవడం, సబ్బు నీళ్లతో కడగడం షరా మామూలుగా మారింది. స్నేహితులు, సన్నిహితులను కలిసి రాగానే చేతులకు శానిటైజర్ రాసుకోవడం పరిపాటైంది. పిల్లల చేతులను సైతం శానిటైజర్‌తో శుభ్రం చేస్తున్నారు. వంట చేసే సమయంలోనూ శానిటైజర్‌ను రాసుకోవడం మానడం లేదు. అయితే.. శానిటైజర్‌తో ఎంత ప్రయోజనం ఉందో అంతే నష్టం కూడా ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా గృహిణులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శానిటైజర్లు ఎందుకంటే.. బిజీగా ఉన్న జీవితంలో అన్ని పనులు త్వరత్వరగా చేస్తుంటాం. చేతులు శుభ్రం చేసుకోకుండా కొన్నిసార్లు ఆహార పదార్థాలు తింటూ ఉంటాం. ఇది మంచిది కాదు. ఎందుకంటే, ప్రతిరోజు మన చేతిలో ఒక మిలియన్ క్రిములు నిండిపోతాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎప్పుడూ సబ్బు నీటితో చేతులు కడుక్కోవడం సాధ్యం కాదు. కాబట్టి చాలామంది శానిటైజర్లను వాడుతుంటారు. ఇందులో మద్యం ఆధారిత హ్యాండ్ శానిటైజర్ల వినియోగం ఎక్కువగా ఉంది. ఈ హ్యాండ్ శానిటైజర్లని వాడితన తర్వాత నీరు అవసరం లేదు. సాధారణ సబ్బు, నీరు లేకుండానే.. చేతులని శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చేతుల్లోని క్రిములు చాలా వరకు నశిస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో వీటి వాడకం మరింత ఎక్కువైంది. మండే స్వభావం.. శానిటైజర్లలో 60–90శాతం ఆల్కహాలు కలిసి ఉంటాయి. అదే క్రిముల్ని సంహరిస్తుంది. ఈ మిశ్రమానికి వంద డిగ్రీల కంటే తక్కువ వేడిలో మండే స్వభావం ఉంటుంది. ఇది చేతికి రాసుకున్న వెంటనే వంట గదిలోకి వెళ్లి గ్యాస్ స్టవ్ వెలిగిస్తే నిప్పు అంటుకునే ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల గృహిణులు చేతికి శానిటైజర్ రాసుకుని అది ఆరిన తర్వాతే వంట చేసే పనులు చేయడం మేలు. పిల్లల విషయంలో... శానిటైజర్ల వినియోగం ద్వారా సమస్యలు వస్తాయని అంతర్జాతీయ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రి వెన్షన్ సెంటర్ నివేదికలు సూచిస్తున్నాయి. పదేళ్ల లోపు పిల్లలు వినియోగించే సమయంలో తగిన జా గ్రత్తలు తీసుకోవాలి. ఐదేళ్ల లోపు వారికి చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. ఎలాంటి శానిటైజర్లు మేలు.. జిగురు, నురుగు మాదిరి కంటే ద్రావణంగా ఉండే శానిటైజర్లే మంచిది. చేతుల్లో వేసుకుని రుద్దుకున్న తర్వాత ఒక నిమిషంలో అది ఆవిరవ్వాలి. అలా కాకుండా చేతులకు అంటుకుని ఉంటే చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయి. శానిటైజర్లతో 60–90 శాతం ఆల్కహాల్ ఉండాలి. అంతకంటే తగ్గినా, ఎక్కువగా ఉన్నా ఆశించిన ఫలితం రాకపోగా కొత్త సమస్యలు వస్తాయి. కనీసం 20–30 సెకన్ల పాటు చేతులకు రుద్దుకోవాలి. సబ్బుతో కడుక్కుంటే మేలు.. శానిటైజర్ల వాడకంపై విస్తృతంగా ప్రచారం జరగడంతో పలు నాసిరకం శానిటైజర్లు మార్కెట్లోకి వచ్చాయి. వాటి గాఢత ఎక్కువ ఉండటంతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. శానిటైజర్ల ధరలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. సబ్బు అయితే తక్కువ ధరలో లభ్యమవుతుంది. చేతులు పూర్తిస్థాయిలో శుభ్రమవుతాయి. వైద్యులు సైతం సబ్బుతో చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు. -
శానిటైజర్లపై 18శాతం జీఎస్టీ ఎందుకంటే..?
న్యూఢిల్లీ: శానిటైజర్లు అన్నవి.. సబ్బులు, యాంటీ బ్యాక్టీరియల్ ద్రావకాలు, డెట్టాల్ మాదిరే ఇన్ఫెక్షన్ కారకాలను నిర్మూలించేవని, కనుక వీటిపై 18 శాతం జీఎస్టీ అమలవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. శానిటైజర్లలో వినియోగించే పలు రకాల రసాయనాలు, ప్యాకింగ్ సామగ్రిపైనా జీఎస్టీ 18 శాతం అమల్లో ఉందంటూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘శానిటైజర్లపై జీఎస్టీని తగ్గించినట్టయితే అది విలోమ సుంకాల విధానానికి (తుది ఉత్పత్తిపై జీఎస్టీ కంటే దాని తయారిలో వినియోగించే సరుకులపై అధిక జీఎస్టీ ఉండడం) దారితీస్తుంది. అప్పుడు దిగుమతి చేసుకునే హ్యాండ్ శానిటైజర్లు చౌకగా మారతాయి. దీంతో దేశీయ తయారీ దారులకు ప్రతికూలంగా మారుతుంది’’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. -
కిడ్నాప్, ప్రైవేటు భాగాలపై శానిటైజర్
పుణె: కంపెనీ పనిమీద ఢిల్లీ వెళ్లొచ్చిన ఓ ఉద్యోగి పై పుణెలోని ఓ కంపెనీ యజమాని అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంపెనీ సొమ్ము సొంతానికి వాడుకుని తిరిగి ఇవ్వడం లేదని కంపెనీ యజమాని ఉద్యోగిని కిడ్నాప్ చేసి ఇబ్బందులకు గురిచేశాడు. రెండు రోజులపాటు బంధించి వదిలేశాడు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివరాలు.. పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసే ఓ వ్యక్తి (30) సంస్థ పనిమీద మార్చిలో ఢిల్లీ వెళ్లాడు. లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన అతను మే 7న తిరిగి పుణెలోని సొంతూరు కొత్రూడ్ వచ్చాడు. (చదవండి: కరోనా: ప్రపంచంలో మూడో స్థానంలో భారత్) కరోనా నేపథ్యంలో అతన్ని 17 రోజులపాటు హోటల్లో ఉండాలని సంస్థ యజమాని చెప్పాడు. అయితే, క్వారంటైన్ పూర్తి చేసుకుని కంపెనీకి వచ్చిన అతనిపై యజమాని రెచ్చిపోయాడు. ఢిల్లీలో, తిరిగి వచ్చిన తర్వాత పుణెలో అతను ఖర్చు చేసిన మొత్తం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చాడు. కంపెనీ పనిమీద వెళ్లిన తను డబ్బులు ఎలా ఇవ్వాలని మేనేజర్ అతన్ని ప్రశ్నించాడు. దీంతో మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి యజమాని మేనేజర్‌ను జూన్ 13న కిడ్నాప్ చేశాడు. రెండురోజులపాటు బంధించి.. ప్రైవేటు భాగాలపై శానిటైజర్ పూసి టార్చర్ చేశాడు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియాకు ఆదివారం కేసు వివరాలు వివరించారు. (గాలి ద్వారా కరోనా సంక్రమణ) -
కరెన్సీని శానిటైజ్ చేసేలా..
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): వాల్తేరు డీజిల్ లోకో షెడ్ అల్ట్రా వైలట్ రేడియేషన్‌తో కూడిన డిసిన్ఫెక్షన్ కరెన్సీ శానిటైజర్లను రూపొందించింది. రిజర్వేషన్ కౌంటర్లు, పార్సిల్ కార్యాలయాల వద్ద రైల్వే నిత్యం నగదు కార్యకలాపాలు నిర్వహించాల్సి రావడం, రసీదులు, టికెట్లు, ఫైళ్లను నిత్యం అనేకమంది తాకుతూ ఉన్న సమయంలో కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నందున డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ నాయకత్వంలో సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ (డీజిల్) సంతోష్ కుమార్ పాత్రో సహకారంతో డీజిల్ లోకో షెడ్ సిబ్బంది ఈ కరెన్సీ శానిటైజర్లను తయారు చేశారు. ఈ పరికరంలో జర్మి సైడల్ యూవీసీ బల్బస్ 99.9శాతం క్రిములను, వైరస్‌లను, బాక్టీరియాలను హరింపచేస్తాయని సిబ్బంది తెలిపారు. మిషన్ వినియోగమిలా.. ప్రయాణికులు కౌంటర్లో రిక్వెస్ట్ స్లిప్‌లు, నగదు వంటివి ఈ శానిటైజర్ ట్రేలో వేస్తారు. అది స్కాన్ చేసిన తరువాత కౌంటర్లో సిబ్బంది దీనిని తీసుకుంటారు. అలాగే ప్రయాణికులకు అందజేయవలసిన టికెట్లు, రసీదులు కూడా ఈ ట్రేల ద్వారా ప్రయాణికులకు అందజేస్తారు. వీటి పనితీరు పరిశీలించిన ఈస్ట్‌కోస్ట్ రైల్వే సంతృప్తి వ్యక్తం చేసి, సిబ్బందిని అభినందించింది. తమ పరిధిలోని అన్ని కౌంటర్లకు అవసరమైన 150 కరెన్సీ శానిటైజర్లను తయారుచేయవలసిందిగా సూచించింది. ప్రస్తుతం 24 యూనిట్లను అందించగా, మిగిలిన వాటిని జూలై 10వ తేదీకి అందజేయనున్నట్లు డీఎల్ఎస్ సిబ్బంది తెలిపారు. -
కరోనా టెస్టులకు మరోసారి బ్రేక్
-
శానిటైజర్ తెగ వాడేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: కరోనా భయం మన వాళ్లపై బాగానే ప్రభావం చూపుతోంది. గతంలో చేతుల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతకు అంతంత మాత్రంగానే ప్రాధాన్యమిచ్చే వారిలో ఒక్కసారిగా పెద్దమార్పే వచ్చింది. కరోనా వైరస్ సోకకుండా చేతులను శానిటైజర్‌తో పదే పదే శుభ్రం చేసుకోవాలన్న ప్రభుత్వాలు, వైద్యుల సూచనలు ఈ విషయంలో బాగానే పనిచేస్తున్నట్లు కన్పిస్తోంది. గత 2 నెలల్లోనే దేశంలో దాదాపు 70 రెట్ల మేర హ్యాండ్ శానిటైజర్ వినియోగం పెరగడమే దీనికి నిదర్శనం. కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందువరకు దేశంలో ఏడాదికి 10 లక్షల లీటర్ల ఇథనాల్ ఆధారిత శానిటైజర్‌ను వివిధ అవసరాల కోసం ఉపయోగించేవారు. ప్రధానంగా ఆసుపత్రులు, క్లినిక్‌లలో వైద్యులు, సిబ్బంది ఉపయోగించేవారు. ఇళ్లల్లో శానిటైజర్ల వినియోగం దాదాపు లేదనే చెప్పొచ్చు. అలాంటిది కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేందుకు శానిటైజర్ వినియోగమే పరిష్కార మార్గమని తెలిశాక, దీని డిమాండ్ గత 2, 3 నెలల్లో అమాంతంగా పెరిగింది. గతంలో నెలకు లక్ష లీటర్ల కంటే తక్కువ శానిటైజర్‌ను వినియోగించగా, ఇప్పుడు ఏకంగా నెలకు దాదాపు 70 లక్షల లీటర్ల దాకా శానిటైజర్ వినియోగిస్తున్నారు. ఇళ్లల్లో, వ్యక్తిగతంగా దాదాపు మెజారిటీ ప్రజలు శానిటైజర్‌ను వాడుతున్నారు. 1,200 సంస్థలకు కొత్త లైసెన్స్‌లు.. శానిటైజర్ల వినియోగానికి ఒక్కసారిగా పెద్దమొత్తంలో డిమాండ్ పెరగ డంతో దీని తయారీ కోసం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఇథనాల్ ఆధారిత శానిటైజర్ల ఉత్పత్తికి కొత్తగా 1,200 సంస్థలకు లైసెన్స్‌లు ఇచ్చింది. షుగర్ కంపెనీలు, డిస్టిలరీలతో పాటు ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ఈ లైసెన్స్‌లు ఇచ్చారు. శానిటైజర్ తయారీతో పాటు బాటిలింగ్ చేసి, చిన్న ప్యాక్‌ల్లో నింపి అమ్మేందుకు సిద్ధం చేసేలా ఈ సంస్థలు ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఏప్రిల్ తర్వాత వీటిలో చాలా యూనిట్లు ఉత్పత్తిని మొదలుపెట్టి ఇప్పటివరకు 3 కోట్ల లీటర్ల వరకు ఉత్పత్తి చేశాయి. దీంట్లో ఇప్పటికే 2 కోట్ల లీటర్ల శానిటైజర్‌ను విక్రయించడంతో దేశంలో నెలకు దాదాపుగా 70 లక్షల లీటర్ల దాకా ప్రజలు ఉపయోగిస్తున్నట్లు తేలిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇక్కడి అవసరాలకు మించి ఉత్పత్తి జరుగుతుండటంతో ఎగుమతి చేసేందుకు కూడా ఆయా సంస్థలు సిద్ధమవుతున్నాయి. దేశంలో శానిటైజర్ల కొరత ఏర్పడుతుందేమోనన్న భయంతో శానిటైజర్ల ఎగుమతిని తొలుత కేంద్రం నిషేధించింది. ప్రస్తుతం దేశీయ అవసరాలకు మించి ఉత్పత్తి అవుతుండటంతో శానిటైజర్ల ఎగుమతులపై నిషేధాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఎత్తేసింది. ఇది అమల్లోకి వచ్చిన వెంటనే కొన్ని కంపెనీలు ఈ ఉత్పత్తుల ఎగుమతిని కూడా ప్రారంభించాయి. శానిటైజర్లు విరి విగా అందుబాటులోకి రావడంతో గతంతో పోలిస్తే ధరలు కొద్దిమేర తగ్గాయి. -
ఫోన్‌ను ఈ శానిటైజర్‌తో క్లీన్ చేయండి
న్యూ ఢిల్లీ: ఇంట్లో ఉన్నప్పుడు చేతులు కడుక్కునేందుకు సాధారణంగా సబ్బు వినియోగిస్తాం. బయట ఉన్నప్పుడైతే శానిటైజర్ వాడుతాం. అది సరే.. మరి ఫోన్లను శుభ్రం చేసేందుకు..? శానిటైజర్ ఉపయోగిస్తే స్క్రీన్ పాడైపోతుందేమోనని భయపడిపోతాం. కానీ మార్కెట్లో వచ్చిన కొత్తరకాల శానిటైజర్లతో ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టేయొచ్చు. మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీ రిమోట్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను శుభ్రం చేసేందుకు మార్కెట్లో ఎన్నో శానిటైజర్లు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇవి రెండు రకాలుగా లభ్యమవుతున్నాయి. మొదటిది స్ప్రే శానిటైజర్, రెండోది యూవీ బాక్స్ శానిటైజర్. వీటిలో కొన్ని ముఖ్యమైన ఉత్పత్తుల గురించి గురించి తెలుసుకుందాం.. స్ప్రే శానిటైజర్: వీటి ధర 230 రూపాయల నుంచి 250 వరకు ఉంటుంది. ఈ శానిటైజర్‌ను ఫోన్ లేదా ల్యాప్‌ట్యాప్ వంటి వస్తువులపై స్ప్రే చేసి అనంతరం కాటన్ వస్త్రంతో తుడవాలి. అయితే ఇష్టమొచ్చినట్లుగా కాకుండా నెమ్మదిగా రుద్దాల్సి ఉంటుంది. ► పోరట్రానిక్స్ స్వైప్: ఇది వాడటానికే కాకుండా మీ వెంట తీసుకెళ్లడానికి కూడా సులభంగా ఉంటుంది. ఇందులో స్ప్రేయర్తోపాటు శుభ్రం చేసేందుకు వీలుగా చిన్న వస్త్రాన్ని కూడా ఇస్తారు. దీని ధర 249 రూపాయలు. ► మొబివాష్ మొబైల్ శానిటైజర్: ఇది శానిటైజింగ్తోపాటు క్లెన్సింగ్, డియోడరైజింగ్ వంటి పనులను కూడా చేసి పెడుతుంది. దీని వెంట కూడా ఒక కాటన్ వస్త్రం వస్తుంది. పైన చెప్పిన దానిలాగే దీన్ని ఫోన్‌పై స్ప్రే చేసి సుతారంగా తుడిచేయాలి. (చైనా బ్యాన్ : మైక్రోమాక్స్ రీఎంట్రీ) యూవీ(అల్ట్రా వయొలెట్) బాక్స్ శానిజైజర్: వీటి ధర 3000 రూపాయల నుంచి 5 వేల వరకు ఉంటుంది. మీ ఫోన్‌పై ఉండే వైరస్ కణాలను నాశనం చేయాలనుకుంటే వీటిని ఎంచుకోవడమే ఉత్తమం. ♦ నైకా జెనరిక్ యూవీ-సీ పోర్టబుల్ శానిజైజింగ్ బాక్స్: పేరు చదవగానే అర్థమై ఉంటుంది. ఇది అతినీల లోహిత కిరణాలు, ఓజోన్ క్రిమిసంహారకాలను ప్రసరింపజేసి ఫోన్‌పై ఉండే బాక్టీరియా, వైరస్‌ను నాశనం చేస్తుంది. ఇందులో అరోమా థెరపీ సౌలభ్యం కూడా ఉంది. ఇది 99.9 శాతం క్రిములను సంహరిస్తుందని పేర్కొంటోంది. దీన్ని నైకా వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయవచ్చు. దీని ధర 3,200 రూపాయలు. ♦ డెయిలీ ఆబ్జెక్ట్స్ పోర్టబుల్ మల్టీ ఫంక్షనల్ యూవీ స్టెరిలైజర్ అండ్ వైర్లెస్ చార్జర్: ఇది కూడా పైదానిలాగే పని చేస్తుంది. ఇక 5 నిమిషాల్లో మీ ఫోన్‌పై ఉండే సూక్ష్మ క్రిములను మటుమాయం చేస్తామని సదరు కంపెనీ చెబుతోంది. ఈ పరికరం 15 వాట్ల వరకు చార్జింగ్ అవుతుంది. దీన్ని వైర్‌లెస్‌గానూ ఉపయోగించవచ్చు. దీని ధర 4,800 రూపాయలు. ఇది మీకు కావాలనుకుంటే డెయిలీ ఆబ్జెక్ట్స్ వెబ్‌సైట్‌ను సందర్శించి ఆర్డర్ చేసుకోండి. (కొత్త వాదన: ఇక్కడ శానిటైజర్లకు నో!) -
నీళ్లు అనుకుని శానిటైజర్ తాగి..
సాక్షి, విశాఖపట్నం : నీళ్లు అనుకుని శానిటైజర్ బాటిల్లోని శానిటైజర్ తాగడంతో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన విశాఖపట్నంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లాకు చెందిన సారిపల్లి సత్తిబాబు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న(శనివారం)సాయంత్రం ఆఫీసులో ఉన్న సమయంలో విపరీతంగా దాహం వేసింది. దీంతో అక్కడే ఉన్న శానిటైజర్ బాటిల్‌ను వాటర్ బాటిల్ అనుకుని అందులోని శానిటైజర్ గటాగటా తాగేశాడు. (కొత్త వాదన: ఇక్కడ శానిటైజర్లకు నో! ) అనంతరం ఒంట్లో బాగుండటం లేదని సర్వేయర్‌కు చెప్పడంతో పక్కనే ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం సత్తిబాబు ఇంటికి వెళ్లిపోయాడు. అయితే అర్థరాత్రి సమయంలో వాంతులు, విరేచనాలు మొదలవ్వటంతో అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
కొత్త వాదన: ఇక్కడ శానిటైజర్లకు నో!
భోపాల్: దేవాలయాల్లో ఆల్కహాల్‌తో తయారైన శానిటైజర్లను అనుమతించేది లేదని మధ్యప్రదేశ్‌లోని ఓ పూజారి కొత్త వాదన లేవనెత్తారు. తమ ఆలయంలోకి ఆల్కహాల్ కలిగిన శానిటైజర్ మెషీన్లు తీసుకురావొద్దని శనివారం స్పష్టం చేశారు. భోపాల్‌లోని మా వైష్ణవధమ్ నవ్ దుర్గా ఆలయ పూజారి చంద్రశేఖర్ తివారీ ఈ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కాగా, అన్‌లాక్-1లో భాగంగా జూన్ 8 (సోమవారం) నుంచి దేవాలయాలు పునఃప్రారంభవుతున్న సంగతి తెలిసిందే. ‘దేవాలయాల్లోకి శానిటైజర్లు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినా నేను ఒప్పుకోను. దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది. మద్యం తాగి గుళ్లోకి ఎవరైనా వెళ్తారా. ఇదీ అంతే. కావాలంటే చేతులు శుభ్రంగా కడుక్కునేందుకు గుడి బయట సదుపాయాలు కల్పిస్తాం. భక్తులెవరైనా స్నానమాచరించాక నేరుగా దైవదర్శనానికి రావాలి’అని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. కరోనా విజృంభణ నేపథ్యంలో మాస్కుల వాడకాన్ని తప్పనిసరి చేసి కేంద్రం.. ఆల్కహాల్‌తో తయారైన శానిటైజర్లనే వాడాలని చెప్పిన విషయం విదితమే. దాంతోపాటు ఆరు ఫీట్ల భౌతిక దూరం పాటించాలని.. 40 నుంచి 60 సెకండ్లపాటు హ్యాండ్‌వాష్‌తో చేతులు కడుక్కోవాలని కేంద్రం చెప్పింది. ఇక దైవ దర్శనాలకు వెళ్ల భక్తులు వాహనాల్లోనే చెప్పులు విడిచి వెళ్లాలని, దేవుడి ప్రతిమలు, అక్కడున్న పురాతన వస్తువులను తాకొద్దని మార్గదర్శకాల్లో తెలిపింది. (చదవండి: వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికెళ్లిన మహిళపై..) -
ఇక మీదట తీర్థ ప్రసాదాలు బంద్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దాదాపు 2 నెలల నుంచి దేశంలోని ఆలయాలన్ని మూసి వేశారు. లాక్డౌన్ 5.0లో దేశవ్యాప్తంగా ఈ నెల 8నుంచి కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వనుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థన స్థలాలను తెరిచేందుకు అనుమతివ్వనున్నారు. దీనికి అనుగుణంగా కేంద్రం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. (సకల జాగ్రత్తలతోనే పునఃప్రారంభించాలి) 1. ప్రార్థన మందిరాలల్లోకి వచ్చేందుకు, వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఉండాలి. 2. ప్రవేశ మార్గంలో శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పనసరి. 3. ప్రార్థన మందిరాలకు వచ్చేవారిని దశలవారిగా పంపించాలి. క్యూలైన్లో 2 మీటర్ల భౌతిక దూరం పాటించేలా చూడాలి. 4. భక్తి గీతాలను ఆలపించడానికి వీలులేదు. బదులుగా రికార్డు చేసినవి వినిపించాలి. 5. ప్రసాదం, తీర్థం ఇవ్వడం, పవిత్ర జలం చల్లడం చేయకూడదు. 6. అన్న ప్రసాదం తయారు చేసే సమయంలో, పంచేటప్పుడు భౌతిక దూరం తప్పని సరి. 7. విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను తాకకుండా చూడాలి. 8. మతపరమైన సమావేశాలు, జనాలు గుంపులుగా చేరే వేడుకలు నిర్వహించడం నిషేధం. -
ఈ ఆటోవాలా ఐడియా సూపర్
తిరువనంతపురం: భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ప్రజలు తమను తాము సురక్షితంగా ఉంచుకునేందుకు వినూత్న పద్ధతులతో ముందుకు వస్తున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజులో 7,8 సార్లు కనీసం 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఆటో ఎక్కే ప్రయాణికులు చేతులు శుభ్రం చేసుకునేందుకు ఓ ఆటో డ్రైవర్ చేసిన ప్రయోగం ప్రశంసలు అందుకుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆటో ముందు భాగంలో టాప్, హ్యాండ్‌వాష్ ఏర్పాటు చేశాడు సదరు డ్రైవర్. ఆటో ఎక్కే ప్రయాణికులను ముందుగా చేతులు కడుక్కొవాల్సిందిగా కోరుతున్నాడు. మొదట టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయాంక తన ట్విట్టర్లో షేర్ చేయడంతో మరోసారి వైరల్ అవుతోంది. ఆటో డ్రైవర్ ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు నెటిజనులు. -
ఆటోడ్రైవర్‌పై నెటిజనుల ప్రశంసలు