
లండన్: స్వింగ్‌ను రాబట్టేందుకు తన వద్ద ఉన్న హ్యాండ్ శానిటైజర్‌ను బంతికి అంటించడంతో... ఇంగ్లండ్ కౌంటీ ప్లేయర్ మిచ్ క్లేడన్ నిషేధానికి గురయ్యాడు. సస్సెక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతడు... గత నెలలో జరిగిన ఒక మ్యాచ్‌లో బంతికి శానిటైజర్‌ను పూసి బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు దక్కించుకోవడం విశేషం. కరోనా నేపథ్యంలో బంతికి ఉమ్మితో సహా ఎటువంటి పదార్థాలను రాయకూడదనే నిబంధనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రవేశపెట్టింది. దాంతో 37 ఏళ్ల క్లేడన్‌పై ఆగ్రహించిన సస్సెక్స్ జట్టు అతడిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా విచారణ జరిపిస్తోంది.
(చదవండి: ఇలా మొదలవుతోంది...)
(చదవండి: పాపం.. శానిటైజర్ ఎంత పని చేసింది!)
Comments
Please login to add a commentAdd a comment