Sussex
-
ఒకే ఓవర్లో 43 రన్స్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!
ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంగ్లిష్ కౌంటీ చాంపియన్‌షిప్ 134 ఏళ్ల చరిత్రలో.. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు.కాగా కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా లీసస్టర్‌షైర్- ససెక్స్ జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్ బుధవారంతో ముగిసింది. ఆఖరి రోజు ఆటలో భాగంగా రాబిన్సన్ బౌలింగ్‌లో లీసస్టర్‌షైర్ వికెట్ కీపర్ బ్యాటర్ లూయీస్ కింబర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.వరుసగా 6, 6, 4, 6, 4, 6, 4, 6, 1బ్రిగ్టన్లోని హోవ్ గ్రౌండ్లో ఓలీ రాబిన్సన్ చేసిన పొరపాట్లను తనకు అనుకూలంగా మార్చుకుని బ్యాట్‌తో అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో ఏకంగా 43 పరుగులు పిండుకున్నాడు. వరుసగా 6, 6, 4, 6, 4, 6, 4, 6, 1 రన్స్ స్కోరు చేశాడు.ఈ ఓవర్లో రెండో బంతి నో బాల్ కాగా.. తదుపరి మూడు డెలివరీల్లో 4, 6, 4 పరుగులు రాబట్టిన లూయీస్ కింబర్.. ఐదో బంతి మళ్లీ నోబాల్‌గా పడగా.. ఆ తర్వాతి డెలివరీని మళ్లీ ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాత మళ్లీ నో బాల్ పడటంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సిక్స్ కొట్టాడు.అయితే, చివరి బంతికి సింగిల్ మాత్రమే తీయగలిగాడు. అలా ఒకే ఓవర్లో మొత్తంగా 43 రన్స్ రాబట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో కింబర్ 127 బంతుల్లోనే 243 పరుగులతో సంచలన ప్రదర్శన చేశాడు. అయితే, లీసస్టర్షైర్ను మాత్రం గెలిపించలేకపోయాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ససెక్స్ 18 పరుగుల తేడాతో గెలిచింది. కాగా రాబిన్సన్ ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 20 టెస్టులాడి 76 వికెట్లు తీశాడు.ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్లు1. ఓలీ రాబిన్సన్- 43 పరుగులు- 20242. అలెక్స్ ట్యూడర్- 38 పరుగులు- 19983. షోయబ్ బషీర్- 38 పరుగులు- 2024.LOUIS KIMBER HAS TAKEN 43 OFF AN OVER pic.twitter.com/kQ4cLUhKN9— Vitality County Championship (@CountyChamp) June 26, 2024 -
Bengaluru: స్టంప్ బ్రేక్ చేసిన జోఫ్రా ఆర్చర్.. వీడియో వైరల్
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ప్రస్తుతం కర్ణాటక జట్టుకు ఆడుతున్నాడు. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు! అదేంటీ.. ఆర్చర్.. కర్ణాటక టీమ్‌లో ఎలా? అని ఆశ్చర్యపోతున్నారా?! ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ కౌంటీ చాంపియన్‌షిప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో ససెక్స్, లంకాషైర్ జట్లు ఇండియాకు వచ్చాయి. బెంగళూరులో పదిరోజుల పాటు జరుగనున్న శిక్షణా శిబిరంలో పాల్గొననున్నాయి. ఈ క్రమంలో ససెక్స్ ఆటగాడు, ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా బెంగళూరుకు విచ్చేశాడు. ససెక్స్- కర్ణాటక(అండర్ 19, అండర్ 23 ప్లేయర్లు కలగలిసిన టీమ్) జట్ల మధ్య తొలి రోజు ఆటకు దూరంగా ఉన్న అతడు.. శుక్రవారం బరిలోకి దిగాడు. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా కర్ణాటక జట్టులోకి వచ్చి మార్నింగ్ సెషన్లో రెండు వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌల్ చేసిన ఆర్చర్ దెబ్బకు స్టంప్ బ్రేక్ అయిపోయింది. ఇక మరో సందర్భంలో బ్యాటర్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని పెవిలియన్‌కు పంపాడు. ఈ రెండు సందర్భాల్లోనూ కర్ణాటక తరఫున.. తమ బ్యాటర్లను జోఫ్రా ఆర్చర్ అవుట్ చేసిన వీడియోలను ససెక్స్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా గాయం కారణంగా ఐపీఎల్-2023 టోర్నీ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్).. ఇంతవరకు మళ్లీ కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. కుడి మోచేతి గాయంతో బాధపడుతున్న అతడు.. టీ20 ప్రపంచకప్-2024 నాటికి ఇంగ్లండ్ జట్టుతో చేరే అవకాశం ఉంది. Jofra’s taken another wicket and broken the stump! 🚨 pic.twitter.com/9L7X2u4PEt — Sussex Cricket (@SussexCCC) March 15, 2024 Wicket - Alsop out lbw, b Archer The KSCA XI’s newest addition looks like a decent player tbf. 😅 pic.twitter.com/KXOTr6AgRI — Sussex Cricket (@SussexCCC) March 15, 2024 -
పుజారాపై సస్పెన్షన్ వేటు
భారత టెస్ట్ ఆటగాడు, నయా వాల్ చతేశ్వర్ పుజారాపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ 2023లో పుజారా సారథ్యం వహిస్తున్న ససెక్స్ జట్టుకు 12 పాయింట్లు పెనాల్టీ పడగా.. దీని ఫలితం జట్టు కెప్టెన్ అయిన పుజారాపై పడింది. పుజారాపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తున్నట్లు కౌంటీ ఛాంపియన్షిప్ అధికారులు వెల్లడించారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం ఓ సీజన్లో ఓ జట్టు నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొంటే, సదరు జట్టు కెప్టెన్‌పై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడుతుంది. ప్రస్తుత సీజన్లో ససెక్స్ నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొంది. టోర్నీ తొలి లెగ్‌లో రెండు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొన్న ససెక్స్.. సెప్టెంబర్ 13న లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో రెండు పెనాల్టీలను పొంది, మొత్తంగా 12 డీమెరిట్ పాయింట్లను పొందింది. పుజారాపై సస్పెన్షన్‌ను ససెక్స్ అధికారులు ఎలాంటి వాదనలు లేకుండా స్వీకరించారు. ఆటగాళ్ల ఆన్ ఫీల్డ్ ప్రవర్తన కారణంగా ససెక్స్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ ఆటగాళ్లు టామ్ హెయిన్స్, జాక్ కార్సన్, అరి కార్వెలాస్‌లు మైదానంలో నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించడంతో కెప్టెన్ పుజారా బాధ్యుడయ్యాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లలో టామ్ హెయిన్స్, జాక్ కార్సన్‌లపై ససెక్స్ అధికారులు తదుపరి మ్యాచ్‌కు వేటు వేశారు. విచారణ అనంతరం కార్వెలాస్‌పై కూడా చర్యలు ఉంటాయని వారు తెలిపారు. కాగా, పాయింట్ల కోత కారణంగా ప్రస్తుత కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ససెక్స్ ఖాతాలో 124 పాయింట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే, కౌంటీ డివిజన్ 2 పోటీల్లో భాగంగా ససెక్స్ సెప్టెంబర్ 19-22 వరకు డెర్బీషైర్‌తో తలపడాల్సి ఉంది. అనంతరం సెప్టెంబర్ 26న గ్లోసెస్టర్‌షైర్‌ను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లతో ప్రస్తుత సీజన్ ముగుస్తుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం డర్హమ్ లీడింగ్‌లో ఉంది. ఆ జట్టు 198 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీసిన జయదేవ్ ఉనద్కత్
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా బౌలర్, భారత దేశవాలీ స్టార్ జయదేవ్ ఉనద్కత్ రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో తన రెండో మ్యాచ్‌లోనే 9 వికెట్లతో చెలరేగాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2-2023 సెకెండ్ లెగ్‌లో ససెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఉనద్కత్.. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి తన జట్టును గెలిపించాడు. ఉనద్కత్ ప్రదర్శన కారణంగా ససెక్స్ 15 పరుగుల తేడాతో ప్రత్యర్ధిని మట్టికరిపించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 12.4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత రెచ్చిపోయి 32.4 ఓవర్లలో 94 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్.. హడ్సన్ ప్రెంటిస్ (65) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ కోల్స్ (44), టామ్ హెయిన్స్ (39), పుజారా (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లీసెస్టర్‌షైర్ బౌలర్లలో శాలిస్బరీ 5 వికెట్టు పడగొట్టగా.. స్కాట్ కర్రీ, టామ్ స్క్రీవెన్ తలో 2 వికెట్లు, రైట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. "He's bowled him! He's bowled him! Unadkat takes the final wicket and Sussex have won!" 😁 The highlights from a thrilling final day against Leicestershire. 🙌 #GOSBTS pic.twitter.com/KSmW7qFySu — Sussex Cricket (@SussexCCC) September 14, 2023 అనంతరం బరిలోకి దిగిన లీసెస్టర్‌షైర్.. ఉనద్కత్ (3/23), కార్వెలాస్ (4/14), హడ్సన్ (2/30), హెయిన్స్ (1/33) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే కుప్పకూలింది. లీసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో రిషి పటేల్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ససెక్స్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టామ్ క్లార్క్ (69), జేమ్స్ కోల్స్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. లీసెస్టర్‌షైర్ బౌలర్లలో స్క్రీవెన్ 4, రెహాన్ అహ్మద్ 2, రైట్, స్కాట్ కర్రీ తలో వికెట్ దక్కించుకున్నారు. 499 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లీసెస్టర్‌షైర్.. ఉనద్కత్ (6/94), కార్వెలాస్ (2/58), జాక్ కార్సన్ (2/98) ధాటికి 483 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ససెక్స్ 15 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఉనద్కత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ జట్టుకు టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
కౌంటీల్లో ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా బౌలర్.. పుజారాతో పాటు..!
విండీస్‌తో తాజాగా జరిగిన టెస్ట్ సిరీస్‌తో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వెరటన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఇంగ్లండ్ కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ససెక్స్ కౌంటీ ఉనద్కత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆ కౌంటీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఉనద్కత్.. సెప్టెంబర్‌లో పునఃప్రారంభంకానున్న కౌంటీ సీజన్లో తమతో జతకట్టనున్నాడని వారు పేర్కొన్నారు. ఈ స్టింక్ట్లో ఉనద్కత్ ససెక్స్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా తర్వాత ససెక్స్‌కు ఆడే అరుదైన అవకాశం ఉనద్కత్ దక్కింది. భారత దేశవాలీ అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన ఉనద్కత్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 101 మ్యాచ్‌లు ఆడి 382 వికెట్లు పడగొట్టాడు. ఈ ట్రాక్ రికార్డు చూసే ససెక్స్ ఉనద్కత్‌ను తమ జట్టులో చేర్చుకుంది. ససెక్స్‌కు ఆడుతున్న ఇద్దరు భారతీయ క్రికెటర్లు సౌరాష్ట్రకు చెందిన వారే కావడం విశేషం. ఇదిలా ఉంటే, ససెక్స్‌కు ప్రస్తుత కౌంటీ సీజన్ చెత్త సీజన్‌గా సాగింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌లను డ్రా చేసుకుని కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. అది కూడా ఏప్రిల్‌లో జరిగిన తమ సీజన్ తొలి మ్యాచ్‌లో. మరోవైపు ఇంగ్లండ్‌లో ప్రస్తుతం దేశవాలీ వన్డే కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ససెక్స్ గ్రూప్-బిలో ఆఖరి నుంచి రెండో స్థానంతో చెత్త ప్రదర్శన కొనసాగిస్తుంది. అయితే ఈ టోర్నీలో ససెక్స్ ఆటగాడు పుజారా మాత్రం చెలరేగిపోయాడు. పుజారా తానాడిన 5 మ్యాచ్‌ల్లో 2 శతకాలు బాదాడు. ఇదే టోర్నీలో భారత యువ ఓపెనర్ పృథ్వీ షా కూడా చెలరేగిపోయాడు. ఈ సీజన్‌తోనే కౌంటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన షా.. నార్తంప్టన్‌షైర్ తరఫున ఓ మెరుపు ద్విశతం, ఓ సుడిగాలి శతకం బాదాడు. అయితే షా అనూహ్యంగా గాయం బారిన పడి అర్థాంతరంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. -
సెంచరీతో కదం తొక్కిన పుజారా.. తేలిపోయిన పృథ్వీ షా
2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా టెస్ట్ బ్యాటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్‌లో సెంచరీతో కదం తొక్కాడు. టోర్నీలో భాగంగా నార్తంప్టన్‌షైర్‌తో నిన్న (ఆగస్ట్ 6) జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో (119 బంతుల్లో 106 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. టీమిండియాలో చోటు కోల్పోయాక కసితో రగిలిపోతున్న పుజారా.. తన తాజా ఇన్నింగ్స్‌తో భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. ఈ మ్యాచ్‌లో పుజారా ఇన్నింగ్స్ సాగిన తీరు పై పేర్కొన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. పుజారా సెంచరీతో చెలరేగినా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ ఓటమిపాలవ్వడం కొసమెరుపు. Great to have you back, @cheteshwar1! 🙌 Century 💯 pic.twitter.com/k7SfSu59si — Sussex Cricket (@SussexCCC) August 6, 2023 వర్షం కారణంగా 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్.. పుజారా శతకొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో పుజారా మినహా ఎవరూ రాణించలేదు. కెప్టెన్ టామ్ హెయిన్స్ (13), జేమ్స్ కోల్స్ (29), హడ్సన్ (14), ఒలివర్ కార్టర్ (21), జాక్ కార్సన్ (17), హెన్రీ క్రొకోంబ్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. నార్తంప్టన్‌షైర్ బౌలర్లలో జాక్ వైట్ 3, ప్రాక్టర్, కియోగ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తేలిపోయిన పృధ్వీ షా.. గ్లోసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌తో ఇంగ్లండ్ దేశవాలీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఓపెనర్ పృథ్వీ షా.. ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. గ్లోసెస్టర్తో మ్యాచ్‌లో 35 బంతుల్లో 34 పరుగులు చేసి విచిత్ర రీతిలో ఔటైన (హిట్ వికెట్) షా.. తాజాగా ససెక్స్‌తో జరిగిన తన రెండో మ్యాచ్‌లోనూ తక్కువ స్కోర్‌కే (17 బంతుల్లో 26; 4 ఫోర్లు) పరిమితమయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లో షాకు మంచి ఆరంభమే లభించినా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. షా భారీ స్కోర్ చేయకపోయినా, మిగతా వారు రాణించడంతో అతని జట్టు విజయం సాధించింది. ససెక్స్‌తో మ్యాచ్‌లో 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్‌షైర్.. మరో 8 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నార్తంప్టన్‌షైర్ ఆటగాళ్లు తలో చేయి వేసి తమ జట్టును గెలిపించుకున్నారు. షాతో పాటు రికార్డో (37), సామ్ వైట్‌మ్యాన్ (30), రాబ్ కియోగ్ (22), లూక్ ప్రాక్టర్ (10), లెవిస్ మెక్మానస్ (36) రెండంకెల స్కోర్లు చేయగా.. టామ్ టేలర్ (42 నాటౌట్), జస్టిన్ బ్రాడ్ (22 నాటౌట్) నార్తంప్టన్షైర్ను విజయతీరాలకు చేర్చారు. ససెక్స్ బౌలర్లలో కర్రీ, కార్సన్ చెరో 2 వికెట్లు, క్రొకోంబ్, హడ్సన్, జేమ్స్ కోల్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
50 ఓవర్ల ఫార్మాట్లో భారీ స్కోర్.. ఇంగ్లండ్ 498 పరుగులు చేస్తే..!
50 ఓవర్ల క్రికెట్ ఫార్మట్‌లో (లిస్ట్-ఏ క్రికెట్) భారీ స్కోర్ నమోదైంది. ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్-2023లో భాగంగా ససెక్స్‌తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో డర్హమ్ జట్టు 427 పరుగులు స్కోర్ చేసింది. కెప్టెన్ అలెక్స్ లీస్ (107 బంతుల్లో 144; 19 ఫోర్లు) భారీ శతకంతో విరుచుకుపడగా.. వన్‌డౌన్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్హమ్ (54 బంతుల్లో 102; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విజృంభించాడు. వీరితో పాటు ఓపెనర్ గ్రహం క్లార్క్ (58 బంతుల్లో 72; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో మెరిశాడు. ఫలితంగా డర్హమ్ లిస్ట్-ఏ క్రికెట్ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు కలుపుకుని) 21వ అత్యుత్తమ స్కోర్ నమోదు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యుత్తమ టీమ్ స్కోర్ రికార్డు తమిళనాడు జట్టు పేరిట ఉంది. గతేడాది (2022) విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 506 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. ఆ మ్యాచ్‌లో ఎన్ జగదీశన్ (277) భారీ డబుల్ సెంచరీతో విరుచుకుపడగా.. సాయి సుదర్శన్ (154) శతకంతో మెరిశాడు. Records galore in Hove as centuries from Bedingham & Lees help Durham to commanding one-day cup win.#ForTheNorth — Durham Cricket (@DurhamCricket) August 4, 2023 అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. గతేడాది జూన్ 17న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 498 పరుగుల భారీ స్కోర్ సాధించింది. నాడు ఇంగ్లీష్ జట్టులో ఏకంగా ముగ్గురు శతక్కొట్టారు. ఫిల్ సాల్ట్ (122), డేవిడ్ మలాన్ (125), జోస్ బట్లర్ (162 నాటౌట్) మెరుపు శతకాలతో చెలరేగిపోయారు. Shot Jonesy to bring up our highest List A score 🤩#ForTheNorth pic.twitter.com/HDR5fVmBkZ — Durham Cricket (@DurhamCricket) August 4, 2023 ఇక ససెక్స్-డర్హమ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 427 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ససెక్స్ 39.1 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ టామ్ హెయిన్స్ (65), ప్రెంటిస్ (65) అర్ధసెంచరీలతో రాణించారు. DAVID BEDINGHAM HAS OUR FASTEST LIST A 100 IN JUST 52 BALLS!!#ForTheNorth pic.twitter.com/5j9tZDIVug — Durham Cricket (@DurhamCricket) August 4, 2023 -
అరివీర భయంకర ఫామ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్.. నిర్దాక్షిణ్యంగా ఊచకోత
ఇంగ్లండ్ బ్యాటర్ జేమ్స్ విన్స్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 బ్లాస్ట్-2023లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోస్తున్నాడు. ఆడిన ప్రతి బంతిని బౌండరీ లేదా సిక్సర్‌గా మలుస్తున్నాడు. ససెక్స్‌తో నిన్న (జూన్ 3) జరిగిన మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న విన్స్.. 8 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేసి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ విన్స్ ఇదే తరహాలో రెచ్చిపోయాడు. ఆ బౌలర్, ఈ బౌలర్ అన్న తేడా లేకుండా ఎడాపెడా వాయించాడు. తొలుత మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 88 పరుగులు చేసిన విన్స్.. ఆతర్వాత ససెక్స్‌పై 56 బంతుల్లో 88 పరుగులు, ఎసెక్స్‌పై 48 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఎసెక్స్‌పై చేసిన మెరుపు సెంచరీలో 8 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇంతటి భీకర ఫామ్‌లో ఉన్న ఈ హ్యాంప్‌షైర్ ఆటగాడు.. మున్ముందు మరిన్ని విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడతాడని ఇంగ్లండ్ అభిమానులు అనుకుంటున్నాడు. ఇక ససెక్స్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన హ్యాంప్‌షైర్ తొలుత బౌలింగ్ చేసింది. లియామ్ డాసన్ (4-0-18-2), స్కాట్ కర్రీ (2/25), జేమ్స్ ఫుల్లర్ (1/9), వుడ్ (1/32), మేసన్ క్రేన్ (1/32) ధాటికి ససెక్స్ 18.5 ఓవర్లలో 144 పరుగులె మాత్రమే చేసి ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో టామ్ క్లార్క్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్‌షైర్.. కేవలం 14.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. ఓపెనర్లు బెన్ మెక్ డెర్మాట్ (51 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జేమ్స్ విన్స్ (39 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయమైన అర్ధశతకాలతో హ్యాంప్‌షైర్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ విజయయంతో హ్యాంప్‌షైర్ సౌత్ గ్రూప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్‌లో సోమర్సెట్ ,సర్రే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
కెప్టెన్‌గా అదుర్స్.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన పుజారా
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 లో ససెక్స్ జట్టుకు టీమిండియా వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే పుజారా సెంచరీతో అదరగొట్టాడు. హోవ్ వేదికగా డర్హామ్‌తో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పుజారా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆట సందర్భంగా 55వ ఓవర్లో బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన పుజరా.. తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 134 బంతుల్లో పుజరా శతకం సాధించాడు. టామ్ క్లార్క్‌తో కలిసి 112 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని పుజరా నమోదు చేశాడు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 163 బంతులు ఎదుర్కొన్న 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 115 పరుగులు చేశాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ససెక్స్ 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ససెక్స్ బ్యాటర్లలో పుజరా టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓలివర్ కార్టర్(41) పరుగులతో పర్వాలేదనపించాడు.అంతకుముందు డర్హామ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. కాగా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ముందు పుజారా అద్భుతమైన ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. చదవండి: IPL 2023 CSK vs MI: సీఎస్కేతో మ్యాచ్.. సచిన్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీ! -
కెప్టెన్‌గా చతేశ్వర్ పుజారా
టీమిండియా టెస్ట్ క్రికెటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా కెప్టెన్ అయ్యాడు. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్-2023 డివిజన్-2లో అతను ససెక్స్ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్‌కు సారథ్యం వహించడం చాలా ఆనందంగా ఉంది.. లెట్స్ గో అంటూ ట్వీట్‌కు క్యాప్షన్ జోడించాడు. Thrilled to lead @sussexccc in the County Championship! Let's go 💪🏻 pic.twitter.com/iW4Ihstk1p — Cheteshwar Pujara (@cheteshwar1) April 5, 2023 ససెక్స్ రెగ్యులర్ కెప్టెన్ టామ్ హెయిన్స్ గత సీజన్ సందర్భంగా గాయపడటంతో ఆ జట్టు మేనేజ్మెంట్ నాటి నుంచి పుజారాను తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగిస్తుంది. కౌంటీ ఛాంపియన్-2023 డివిజన్-2 సీజన్లో భాగంగా ససెక్స్ ప్రస్థానం ఇవాల్టి (ఏప్రిల్ 6) నుంచి ప్రారంభమవుతోంది. ససెక్స్.. ఇవాళ డర్హమ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా, ఇంగ్లండ్ ఫస్ట్‌క్లాస్ టోర్నీల్లో పుజారాకు ఇది వరుసగా రెండో సీజన్. 2022లో అతను ససెక్స్ తరఫున 13 ఇన్నింగ్స్‌ల్లో 109.40 సగటున 1094 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. పుజారా గతేడాది రాయల్ లండన్ వన్డే కప్‌లో కూడా ఆడాడు. అందులోనూ నయా వాల్ సత్తా చాటాడు. పుజారా చివరిసారిగా టీమిండియా తరఫున బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడాడు. ఈ సిరీస్‌లో అతను 6 ఇన్నింగ్స్‌ల్లో 28 సగటున కేవలం 140 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇదే సిరీస్‌లోనే పుజారా తన 100 టెస్ట్ మ్యాచ్ ఆడాడు. -
కౌంటీల్లో ఆడనున్న స్మిత్! ద్రోహులు అంటూ ఫైర్! తప్పేముంది?
Steve Smith- Sussex Deal: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడనున్నాడు. ససెక్స్ జట్టు తరఫున మూడు మ్యాచ్‌లలో భాగం కానున్నాడు. ఈ విషయాన్ని స్మిత్ స్వయంగా వెల్లడించాడు. ఇప్పటికే ససెక్స్ క్రికెట్ హెడ్ పాల్ ఫాబ్రేస్తో మాట్లాడానని, కౌంటీల్లో ఆడనుండటం నిజమేనని ధ్రువీకరించాడు. అందుకే ఈ నిర్ణయం తనకు ఇదో సరికొత్త అనుభవమన్న స్మిత్.. యువ క్రికెటర్లతో కలిసి బ్యాటింగ్ చేయడం కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. యంగ్ ప్లేయర్లతో కలిసి డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకోవడం ద్వారా వాళ్లను మెంటార్ చేసే అవకాశం కూడా వస్తుందని, ఇది తనకు సంతృప్తినిస్తుందని స్మిత్ సంతోషం వ్యక్తం చేశాడు. మండిపడుతున్న అభిమానులు కాగా ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ ఏడాది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సన్నాహకాల్లో భాగంగా స్మిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. స్మిత్ కౌంటీల్లో ఆడటంపై ఇంగ్లండ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతడికి ఈ అవకాశం ఇచ్చిన ససెక్స్ జట్టును ద్రోహులుగా అభివర్ణిస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. యాషెస్ సిరీస్‌కు ముందు ఆసీస్ ఆటగాళ్లను ఇంగ్లండ్ పిచ్‌లపై ఆడించడం ప్రతికూల ప్రభావం చూపుతుందని మండిపడుతున్నారు. తప్పేముందన్న మాజీ సారథి అయితే, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ మైకేల్ వాన్ భిన్నంగా స్పందించాడు. స్మిత్ కౌంటీల్లో ఆడటాన్ని అతడు స్వాగతించాడు. స్మిత్ వంటి మేటి టెస్టు క్రికెటర్లు ససెక్స్ డ్రెస్సింగ్‌రూంలో ఉండటం.. యువ ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతుందని, ఈ విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్.. మైకేల్ వ్యాఖ్యలతో ఏకీభవించినప్పటికీ.. యాషెస్ సిరీస్(డిసెంబరులో)కు ముందు ఇలాంటి నిర్ణయం సరికాదని పెదవి విరిచాడు. చదవండి: పిచ్చిగా మాట్లాడొద్దు.. అతడిని చూసి నేర్చుకో! అంటే.. తనెప్పటికీ టీమిండియాకు ఆడొద్దా? ఫ్యాన్స్ ఫైర్ Sunrisers: దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ! ఈసారి.. Great signing for our game … Well done 👍👍 https://t.co/Qs2iqrBARy — Michael Vaughan (@MichaelVaughan) January 19, 2023 -
విధ్వంసం సృష్టించిన పుజారా.. 20 ఫోర్లు, 2 సిక్స్‌లతో!
టీమిండియా వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశీవాళీ టోర్నీ రాయల్ లండన్ వన్డే కప్‌లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ టోర్నీలో ససెక్స్ క్రికెట్ క్లబ్‌కు పుజారా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా మంగళవారం మిడిల్సెక్స్తో మ్యాచ్‌లో పూజారా అద్భుతమైన సెంచరీతో చేలరేగాడు. ఈ మ్యాచ్‌లో 90 బంతులు ఎదుర్కొన్న పుజారా 20 ఫోర్లు, 2 సిక్సర్లతో 132 పరుగులు సాధించాడు. కాగా టెస్టు స్పెషలిస్టు పేరొందిన పుజారా తన సెంచరీ మార్క్‌ను కేవలం 75 బంతుల్లోనే అందుకోవడం గమానార్హం. ఇక ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటివరకు అతడికి ఇది మూడో సెంచరీ. అంతకుముందు వార్విక్షైర్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 73 బంతుల్లోనే మెరుపు శతకంతో చేలరేగాడు. అదేవిధంగా సుర్రేతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 174 పరుగులు చేసి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇక రాయల్ లండన్ వన్డే కప్-2022లో 500 పరుగుల మార్క్‌ను దాటిన రెండో బ్యాటర్‌గా పుజారా నిలిచాడు. A century from just 75 balls for @cheteshwar1. 🤩 💯 Just phemeomenal. 💫 pic.twitter.com/z6vrKyqDfp — Sussex Cricket (@SussexCCC) August 23, 2022 చదవండి: IND vs PAK: 'రోహిత్, రాహుల్, కోహ్లి కాదు.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించేది అతడే' -
సెంచరీతో చెలరేగిన పుజారా.. నాలుగేళ్ల కుమార్తె ఏం చేసిందంటే! వీడియో వైరల్
టీమిండియా వెటరన్ ఓపెనర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ‘రాయల్ లండన్ వన్డే కప్’లో సెంచరీల మోగిస్తున్నాడు. ఈ టోర్నీలో ససెక్స్ తరపున ఆడుతున్న పుజారా వరుసగా రెండో సెంచరీ సాధించాడు. శుక్రవారం(ఆగస్టు12) వార్విక్షైర్తో జరగిన మ్యాచ్‌లో మెరుపు శతకం (79 బంతుల్లో 107 పరుగులు) సాధించిన పుజారా.. ఆదివారం సర్రేతో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 131 బంతుల్లో 174 పరుగులు సాధించి ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన పుజారా నాలుగేళ్ల కుమార్తె అదితి మ్యాచ్‌ను తెగ ఎంజాయ్ చేసింది. పుజారా 174 పరుగులు సాధించి ఔటైన తర్వాత డగౌట్‌కు తిరిగి వస్తుండగా ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ అతడిని అభినందించారు. ఇదే సమయంలో అదితి కూడా తన తండ్రిని అభినందిస్తూ డ్యాన్స్ చేస్తూ చప్పట్లు కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను పుజారా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) చదవండి: Ms Dhoni: సరిగ్గా ఇదే రోజు.. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై! ఐసీసీ స్పెషల్ వీడియో -
Royal London One-Day Cup: పుజారా ప్రతాపం
లండన్: చాన్నాళ్లుగా ఇంటా బయటా టెస్టుల్లో విఫలమై జట్టులో చోటు కోల్పోయిన భారత సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్‌లో అది కూడా వన్డేల్లో చెలరేగిపోతుండటం విశేషం! అక్కడి దేశవాళీ టోర్నీ అయిన ‘రాయల్ లండన్ వన్డే కప్’లో ససెక్స్ తరఫున వరుసగా రెండో సెంచరీ సాధించాడు. శుక్రవారం వార్విక్షైర్తో 79 బంతుల్లో 107తో మెరుపు శతకం సాధించిన పుజారా ఆదివారం సర్రేతో ఏకంగా విశ్వరూపమే చూపించాడు. దీంతో ససెక్స్ 216 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా ససెక్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు సాధించింది. ఓపెనర్లు హారిసన్ (5), అలీ అర్ (4) విఫలమవగా... కెప్టెన్ పుజారా (131 బంతుల్లో 174; 20 ఫోర్లు, 5 సిక్సర్లు), టామ్ క్లార్క్ (106 బంతుల్లో 104; 13 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 205 పరుగులు జోడించాడు. క్లార్క్ అవుటయ్యాక అస్లాప్ (22), రాలిన్స్ (15), ఇబ్రహీం (15 నాటౌట్)లతో కలిసి జట్టు స్కోరును 350 పరుగులు దాటించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన సర్రే 31.4 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ రియాన్ పటేల్ (65; 8 ఫోర్లు, 1 సిక్స్), టామ్ లవెస్ (57 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కార్వెలస్ నాలుగు, రాలిన్స్ మూడు వికెట్లు తీశారు. -
తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్.. వెంటాడిన దురదృష్టం
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్ చేశాడు. పుజారా అంటేనే నెమ్మదైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్‌లో గ్రూఫ్-ఏలో వార్విక్షైర్తో జరిగిన మ్యాచ్‌లో ఈ 'నయావాల్' 73 బంతుల్లోనే శతకం మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 79 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 107 పరుగులు చేసిన పుజారా తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ససెక్స్ జట్టు విజయానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో ఆగిపోవడం దురదృష్టకరమనే చెప్పొచ్చు. అయితే ఇన్నింగ్స్ 47వ ఓవర్లో పుజారా ప్రత్యర్థి బౌలర్‌కు చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో 22 పరుగులు బాదాడు. లియామ్ నార్వెల్ వేసిన ఆ ఓవర్లో పుజారా 4,2,4,2,6,4తో 22 పరుగులు పిండుకున్నాడు. అయితే చివర్లో పుజారా ఔట్ కావడం జట్టు కొంపముంచిందనే చెప్పొచ్చు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఓపెనర్ రాబర్ట్ యేట్స్ 114 పరుగులతో మెరుపు శతకం అందుకోగా.. కెప్టెన్ రోడ్స్ 76, మైకెల్ బర్గెస్ 58 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ససెక్స్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచింది. పుజారా, అలిస్టర్ ఓర్(81 పరుగులు) క్రీజులో ఉన్నంత వరకు ససెక్స్ విజయం దిశగానే సాగింది. అయితే పుజారా ఔటైన అనంతరం మిగతావారు రాణించడంలో విఫలం కావడంతో గెలుపుకు దగ్గరగా వచ్చి బోల్తా పడింది. ఇక పాయింట్ల పట్టికలో వార్విక్షైర్ 4 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి.. రెండు ఓడి ఆరో స్థానంలో ఉండగా.. వార్విక్షైర్ 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో నాలుగో స్థానంలో ఉంది. 4 2 4 2 6 4 TWENTY-TWO off the 47th over from @cheteshwar1. 🔥 pic.twitter.com/jbBOKpgiTI — Sussex Cricket (@SussexCCC) August 12, 2022 చదవండి: ఆ అవకాశమే లేదు! ఒకవేళ అదే ముఖ్యమైతే.. బీసీసీఐతో బంధాలన్నీ తెంచుకున్న తర్వాతే! NZ vs WI: మారని ఆటతీరు.. మరో వైట్‌వాష్ దిశగా వెస్టిండీస్ -
పుజారానా 'మజాకా'.. ఒకే సీజన్లో వెయ్యి పరుగులు
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కౌంటీల్లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. వరుస డబుల్ సెంచరీలతో ఫుల్ జోష్‌లో కనిపిస్తున్న పుజారా ఈ సీజన్లో ససెక్స్ తరపున ఒకే సీజన్లో వెయ్యి పరుగుల మార్క్‌ను అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో పుజారా ససెక్స్ తరపున 8 మ్యాచ్‌లాడి 1095 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండగా.. వాటిలో మూడు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. ఈ సీజన్లో డెర్బీషైర్, డుర్హమ్, మిడిలెసెక్స్ జట్లపై పుజారా ద్విశతకాలు ఉన్నాయి. ఇక ఈ సీజన్లో కౌంటీల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గ్లామోర్గాన్ ఆటగాడు సామ్ నార్త్ఈస్ట్ 10 మ్యాచ్‌ల్లో 1127 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవలే లీస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ 401*పరుగులు రికార్డు ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇక ససెక్స్ తరపున ఆడుతున్న పుజారా 8 మ్యాచ్‌ల్లో 1095 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. డెర్బీషైర్ ఆటగాడు షాన్ మసూద్ 8 మ్యాచ్‌ల్లో 1074 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. పుజారా వ్యక్తిగత రికార్డుతో మెరిసినప్పటికి అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ససెక్స్ మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. నాటింగ్హమ్షైర్తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ 256 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలి ఇన్నింగ్స్‌లో నాటింగ్హమ్షైర్ 240 పరుగులకు ఆలౌట్ కాగా.. ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. జట్టు అంతా విఫలం కాగా.. పుజారా 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో నాటింగ్హమ్షైర్ 301 పరుగులకు ఆలౌటై ససెక్స్‌కు 398 పరుగులను టార్గెట్‌గా నిర్దేశించింది. అయితే ససెక్స్ మరోసారి ఘోరమైన ఆటతీరును ప్రదర్శిస్తూ 142 పరుగులకే కుప్పకూలింది. ఈసారి కూడా పుజారా ఒక్కడే నిలబడ్డాడు. పుజారా 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఈ ఓటమితో కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ 11 మ్యాచ్‌ల్లో ఒక విజయం.. ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉండగా.. భారీ విజయంతో నాటింగ్హమ్షైర్ టాప్ స్థానానికి దూసుకెళ్లింది. నాటింగ్హమ్షైర్ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. ఒక ఓటమితో తొలి స్థానంలో ఉంది. చదవండి: టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్.. తొలి మూడు టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు..! Gustav McKeon T20I Records: 18 ఏళ్ల వయసులో అదిరిపోయే రికార్డులు.. ఎవరీ క్రికెటర్? -
పుజారా డబుల్ సెంచరీ.. 118 ఏళ్లలో తొలి ఆటగాడిగా
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజరా కౌంటీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ససెక్స్‌కు స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పుజారా డబుల్ సెంచరీ సాధించాడు. మిడిలెసెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా ఈ ఫీట్ అందుకున్నాడు. 368 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న పుజారాకు ససెక్స్ తరపున ఈ ఏడాది ఇది మూడో డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే పుజారా ఒక అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. 118 ఏళ్లలో సింగిల్ కౌంటీ డివిజన్లో ససెక్స్ తరపున మూడు డబుల్ సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా పుజారా రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ససెక్స్ తరపున డెర్బీషైర్‌తో మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న పుజారా.. ఆ తర్వాత డుర్హమ్‌తో మ్యాచ్‌లో మరో డబుల్ సెంచరీ బాదాడు. తాజాగా మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లో ముచ్చటగా మూడో డబుల్ శతకం సాధించాడు. ఇక కౌంటీల్లో మిడిల్సెక్స్ ప్రత్యర్థిగా అత్యధిక స్కోరు సాధించిన భారత ఆటగాళ్లలో పుజారా(231 పరుగులు, ససెక్స్) తొలి స్థానంలో నిలిచాడు. పుజారా తర్వాత వీరేంద్ర సెహ్వాగ్(130 పరుగులు, లీస్టర్‌షైర్), రవిశాస్త్రి(127 పరుగులు, గ్లామ్), అబ్దుల్ ఖాదీర్(112 పరుగులు, వార్విక్షైర్), పియూష్ చావ్లా( 112 పరుగులు, సోమర్సెట్) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పుజారా 231 పరుగులు చేసి ఔట్ కాగానే ససెక్స్ ఇన్నింగ్స్ 523 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన మిడిలెసెక్స్ వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడిన పుజారా దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో పుజారా కౌంటీలు ఆడేందుకు వెళ్లి ససెక్స్ తరపున సెంచరీలు, డబుల్ సెంచరీలతో చెలరేగాడు. ఇంతకముందు మిడిలెసెక్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో 170 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన పుజారాకు ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టుకు టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి పుజారా రెండో ఇన్నింగ్స్‌లో అర్థశతకం సాధించి తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. A batting masterclass at Lord's. 🌟 Superb, @cheteshwar1. 👏 2⃣0⃣0⃣ pic.twitter.com/IQ0e3G25WD — Sussex Cricket (@SussexCCC) July 20, 2022 చదవండి: కౌంటీల్లో వాషింగ్టన్ సుందర్ అదిరిపోయే అరంగేట్రం -
కెప్టెన్‌గా పుజారా.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టాడు..!
టీమిండియా వెటరన్ ఆటగాడు, ససెక్స్ స్టాండింగ్ కెప్టెన్ ఛతేశ్వర్ పుజారా కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ టూ-2022లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. మిడిల్సెక్స్తో జరుగుతోన్న మ్యాచ్‌లో పుజారా శతకాన్ని నమోదు చేశాడు. కాగా అతడికి కౌంటీ చాంపియన్‌షిప్-2022లో ఇది 5వ సెంచరీ కావడం విశేషం. ఇక 182 బంతుల్లో 115 పరుగులు చేసిన పుజారా ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 10 ఫోర్లు, సిక్స్ ఉన్నాయి. కాగా ససెక్స్ రెగ్యులర్ కెప్టెన్ టామ్ హైన్స్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో పుజారా తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ససెక్స్ 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ససెక్స్ బ్యాటర్లలో పుజారాతో పాటు టామ్ ఆల్సోప్ 135 పరుగులతో రాణించాడు. చదవండి: Cheteshwar Pujara: పుజారాకు అరుదైన అవకాశం.. కెప్టెన్‌గా ఛాన్స్! అతడిపై నమ్మకం ఉంది! Pujara doing what he does best, scoring runs. 💯@cheteshwar1 👏 pic.twitter.com/NiKOkV6dct — Sussex Cricket (@SussexCCC) July 19, 2022 -
పుజారాకు అరుదైన అవకాశం.. కెప్టెన్‌గా ఛాన్స్! ఏ మ్యాచ్‌లో అంటే?
టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారాకు అరుదైన అవకాశం లభించింది. ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ టూ-2022లో భాగంగా ససెక్స్ జట్టుకు సారథిగా వ్యవహరించే ఛాన్స్ దొరికింది. కాగా ససెక్స్ రెగ్యులర్ కెప్టెన్ టామ్ హైన్స్ గత వారం లీసెస్టెర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్ మధ్యలో గాయపడ్డాడు. అతడి స్థానంలో పేసర్ స్టీవెన్ ఫిన్ కెప్టెన్సీ చేశాడు. అయితే, టామ్ చేతి ఎముక విరగడంతో ఐదు నుంచి ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమైంది. ఈ నేపథ్యంలో టామ్ స్థానంలో మిడిల్సెక్స్తో మ్యాచ్‌కు పుజారా తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ సందర్భంగా సస్సెస్ హెడ్‌కోచ్ ఇయాన్ సలిస్బరీ మాట్లాడుతూ.. పుజారా జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. పుజారాపై నమ్మకం ఉంది! ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘పూజ్.. టామ్ స్థానాన్ని భర్తీ చేయగలడు. జట్టులో చేరిన నాటి నుంచే తన అపార అనుభవంతో సహజంగానే నాయకుడిగా ఎదిగాడు. టామ్ గాయపడిన నేపథ్యంలో కెప్టెన్సీ చేపట్టాడు. గత మ్యాచ్‌లో ఫిన్నీ సారథిగా ఉన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌కు మాత్రం ఓ బ్యాటర్‌ను సారథిగా ఎంపిక చేయాలనుకున్నాం. ఎందుకంటే ఫిన్ బౌలింగ్ దళాన్ని ముందుకు నడిపించడంపై దృష్టి సారిస్తాడు. అదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో అనువజ్ఞుడైన పూజ్.. కెప్టెన్‌గా సరైన వ్యక్తి అని భావించాము’’ అని పేర్కొన్నాడు. కాగా లార్డ్స్ వేదికగా ససెక్స్, మిడిల్సెక్స్ మధ్య మంగళవారం(జూలై 19) టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. ఇదిలా ఉంటే.. మిడిల్సెక్స్ జట్టులో టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక చాలా కాలం తర్వాత ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టుతో జాతీయ జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగులే చేసి నిరాశపరిచాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 168 బంతులు ఎదుర్కొన్న నయావాల్ 66 పరుగులు చేశాడు. క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినప్పటికీ బ్రాడ్ బౌలింగ్‌లో అవుటై పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు జో రూట్, జానీ బెయిర్ స్టో అజేయ శతకాలతో చెలరేగడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమమైంది. చదవండి: India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! ICC WC: కోహ్లి కెప్టెన్సీలో గనుక నేను ఆడి ఉంటే.. ఇండియా 3 ప్రపంచకప్ టైటిళ్లు గెలిచేది! Following the news of Tom Haines' injury, Cheteshwar Pujara has been named as interim captain. © Good luck to @cheteshwar1 and the team. 👏 #GOSBTS — Sussex Cricket (@SussexCCC) July 19, 2022 -
చేతిలో 8 వికెట్లు.. విజయానికి 29 పరుగులు; నెత్తిన శని తాండవం చేస్తే
చేతిలో 8 వికెట్లు.. విజయానికి కావాల్సింది 38 బంతుల్లో 29 పరుగులు.. క్రీజులో అప్పటికే పాతుకుపోయిన ఇద్దరు బ్యాటర్లు. దీన్నిబట్టి చూస్తే సదరు జట్టు కచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని ఎవరైనా అంచనా వేస్తారు. కానీ మనం ఒకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. శని తమ నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నట్లు.. చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్న ఆ జట్టు కేవలం 23 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు చేజార్చుకొని నాలుగు పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఈ అరుదైన ఘటన ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శుక్రవారం రాత్రి ససెక్స్, గ్లూస్టర్షైర్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లూస్టర్షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. గ్లెన్ పిలిప్స్ 66, టేలర్ 46 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ససెక్స్ జట్టు ఆరంభంలోనే టిమ్ సీఫెర్ట్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 10 పరుగులు చేసిన రవి బొపారా ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన టామ్ అల్సోప్(82 పరుగులు).. ఫిన్ హడ్సన్(18 పరుగులు) మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో ససెక్స్ కోలుకుంది. 13 ఓవర్ వరకు రెండు వికెట్ల నష్టానికి 11 8 పరుగులు చేసింది. 38 బంతుల్లో 29 పరుగులు అవసరమైన దశలో ఫిన్ హడ్సన్ స్టంప్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత అదే ఓవర్ ఆఖరి బంతికి టామ్ అల్సోప్ కూడా స్టంప్ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కేవలం 23 పరుగుల తేడా వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయిన ససెక్స్ 19.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటై కేవలం నాలుగు పరుగులతో ఓటమి చవిచూసింది. ససెక్స్ ఆట తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''నెత్తిన శని తాండవం చేస్తుంటే ఇలాగే జరుగుతుంది.. ఓడిపోవాలని రాసిపెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు'' అంటూ పేర్కొన్నారు. చదవండి: ఖరీదైన కారు కొన్న వెస్టిండీస్ హిట్టర్.. డారిల్ మిచెల్ భారీ సిక్సర్.. అభిమాని బీర్ గ్లాస్లో పడ్డ బంతి.. వీడియో వైరల్! -
ఇంగ్లండ్ క్రికెట్లో విషాదం.. అత్యంత వృద్ధ క్రికెటర్ కన్నుమూత
ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ జిమ్ పార్క్స్(90) బుధవారం కన్నుమూశాడు. అతను మృతి చెందే నాటికి ఇంగ్లండ్ తరపున అత్యంత వృద్ధ టెస్టు క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. జిమ్ పార్క్స్ అనారోగ్య కారణాలతో బాధపడుతూ గత వారం ఇంగ్లండ్‌లోని వార్తింగ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. కాగా ఇవాళ ఉదయం చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడని వైద్యులు తెలిపారు. జిమ్ పార్క్స్ మృతి విషయాన్ని ససెక్స్ వెల్లడించింది. 'జిమ్ పార్క్స్ మరణ వార్త మమ్మల్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. తన కెరీర్లో కౌంటీల్లో ససెక్స్ తరపున ఎక్కువకాలం ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లండ్ క్రికెట్‌కు అతను అందించిన సేవలు వెలకట్టలేనివి. ఆ మృతి పట్ల ప్రగాడ సానభూతి ప్రకటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.' అంటూ తెలిపింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) కూడా జిమ్ పార్క్స్ మృతిపై సంతాపం తెలిపింది. ''నిజంగా చాలా విషాదకరమైన వార్త. అతనో గుర్తుంచుకోదగ్గ ఆటగాడు. ససెక్స్, సోమర్సెట్, ఇంగ్లండ్ జట్ల తరపున ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. జిమ్ పార్క్స్ కుటుంబసభ్యులకు, మిత్రులకు మా ప్రగాడ సానభూతి'' ఇక జిమ్ పార్క్స్ 1954 నుంచి 1968 మధ్య కాలంలో ఇంగ్లండ్ తరపున 46 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 2వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్ అయినప్పటికి లోయర్ ఆర్డర్లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చే జిమ్ పార్క్ తాను చేసిన రెండు సెంచరీలు 8వ స్థానంలో రావడం విశేషం. 1959/60 ఏడాదిలో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 101 నాటౌట్, అలాగే అదే ఏడాది డర్బన్ వేదికగా సౌతాఫ్రికాపై 108 పరుగులు నాటౌట్‌తో జిమ్ పార్క్స్ గుర్తింపు పొందాడు. ఇక 1931లో జన్మించిన జిమ్ పార్క్స్ 18 ఏళ్ల వయసులో ససెక్స్ తరపున కౌంటీల్లో అరంగేట్రం చేసిన పార్క్స్.. ససెక్స్, సోమర్సెట్ తరపున 739 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 132 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. బ్యాట్స్‌మన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినప్పటికి అప్పటి కోచ్‌ల ప్రోత్సాహంతో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అవతారంలోకి మారాడు. అయితే వికెట్ కీపర్ కంటే బ్యాట్స్‌మన్‌గానే తాను ఎక్కువగా ఇష్టపడతానని జిమ్ పార్క్స్ చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. చదవండి: యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్‌పై దాడి.. పరిస్థితి విషమం -
సెంచరీల మీద సెంచరీలు.. గ్యాప్‌లో పాక్ బౌలర్‌కు చుక్కలు
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా సూపర్ ఫామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడా తగ్గేదే లే అంటున్న పుజారా మరో సెంచరీతో చెలరేగాడు. ఈ గ్యాప్‌లోనే పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిదికి చుక్కలు చూపించాడు. ఇక ఫామ్ కోల్పోయి టీమిండియా జట్టులో చోటు కోల్పోయిన పుజారా.. కౌంటీ క్రికెట్లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. టీమిండియా జట్టులోకి తిరిగి రావాలనే కసితో ఆడుతున్న పుజారా కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ తరపున ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీతో మెరిశాడు. తాజాగా మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లో ఆదివారం పుజారా నాలుగో సెంచరీతో మెరిశాడు. రెండో ఇన్నింగ్స్‌లో టామ్ ఆల్సప్(66)తో కలిసి నాలుగో వికెట్‌కు 138 పరుగులు జోడించిన పుజారా.. ఆ తర్వాత టామ్ క్లార్క్‌తో(26*) కలిసి 92 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ఓవరాల్‌గా మూడోరోజు ఆట ముగిసేసమయానికి పుజారా(149 బంతుల్లో 125 బ్యాటింగ్, 16 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ క్లార్క్(26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పుజారా మెరుపులతో ససెక్స్ 270 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు మిడిలెసెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ కాగా.. ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగులకు ఆలౌటైంది. కాగా పుజారాకు ఈ సీజన్లో ఇది నాలుగో సెంచరీ కాగా.. ఇంతకముందు 201*(డెర్బీషైర్ జట్టుపై), 109(వోర్సెస్టర్షైర్ జట్టుపై), 203(డర్హమ్ జట్టుపై) సెంచరీలు అందుకున్నాడు. Fourth match, fourth 100+ score. 💯 🤯 It's a privilege to watch, @cheteshwar1. 👏 pic.twitter.com/IF8nLUt9Yg — Sussex Cricket (@SussexCCC) May 7, 2022 గ్యాప్‌లో పాక్ బౌలర్‌కు చుక్కలు.. సెంచరీతో మెరిసిన పుజారా షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్సర్ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ససెక్స్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇది చోటుచేసుకుంది. ఓపెనర్ల వికెట్లు ఆరంభంలోనే కోల్పోవడంతో ససెక్స్ కష్టాల్లో పడింది. ఈ దశలో పుజారా, టామ్ ఆల్సప్లు జాగ్రత్తగా ఆడారు. అయితే పుజారా తన ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభించాడు. షాహిన్ అఫ్రిది ఇన్నింగ్స్ మూడో ఓవర్ మూడో బంతిని బౌన్సర్ వేశాడు. అయితే పుజారా దానిని వదలకుండా బ్యాట్ ఎడ్జ్‌తో అప్పర్ కట్ చేశాడు. దీంతో బంతి బౌండరీ ఫెన్స్ దాటి అవతల పడింది. పుజారా కెరీర్లో అతి తక్కువగా ఆడిన షాట్లలో అప్పర్ కట్ ఒకటి. ఇక పుజారా, అఫ్రిదిలు ఎదురుపడడం ఇదే తొలిసారి. Shaheen Afridi 🆚 Cheteshwar Pujara A battle you don't want to miss. Watch it LIVE 👉 https://t.co/UVQbX7r83y#LVCountyChamp pic.twitter.com/GBHE5CdZzH — LV= Insurance County Championship (@CountyChamp) May 7, 2022 -
మరో డబుల్ సాధించిన పుజారా.. 28 ఏళ్ల కిందటి రికార్డు సమం
పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో స్థానం కోల్పోయిన చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో మూడంకెల స్కోర్‌ను అందుకున్నాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. టీమిండియాతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా పట్టించుకోలేదన్న కసితో రగిలిపోతున్న పుజారా.. ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ 2022లో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుత సీజన్లో ససెక్స్‌కు ఆడుతున్న అతను.. 3 మ్యాచ్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు (201*, 203), ఓ సెంచరీ (109) సాయంతో ఏకంగా 531 పరుగులు సాధించాడు. తాజాగా డర్హమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్) ద్విశతకం బాదిన పుజారా.. తన జట్టును పటిష్టమైన స్థితిలో ఉంచాడు. ఈ క్రమంలో అతను 28 ఏళ్ల కిందటి ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. కౌంటీ క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ తర్వాత రెండు డబుల్ సెంచరీలు సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కాగా, ససెక్స్‌తో జరుగుతున్న డివిజన్-2 మ్యాచ్‌లో టాస్ గెలిచిన డర్హమ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ససెక్స్ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పుజారా (334 బంతుల్లో 203; 24 ఫోర్లు) డబుల్ సెంచరీతో సత్తా చాటడంతో ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 538 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. ఈ క్రమంలో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన డర్హమ్.. నాలుగో రోజు (మే 1) తొలి సెషన్ సమయానికి వికెట్ నష్టపోకుండా 245 పరుగులు చేసింది. ఓపెనర్లు సీన్ డిక్సన్ (148 నాటౌట్), అలెక్స్ లీస్ (84 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: పుజారా మరో సెంచరీ.. పరుగుల వరద పారిస్తున్న నయా వాల్ -
కౌంటీ క్రికెట్లో దుమ్మురేపుతున్న పుజారా.. వరుసగా మూడో శతకం
టీమిండియా సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా కౌంటీలో వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. ఫామ్‌లేక సతమతమయిన పుజారా టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. తన సహచరులంతా ఐపీఎల్లో బిజీగా ఉంటే పుజారా మాత్రం కౌంటీల్లో ఆడుతున్నాడు. బ్యాటింగ్‌లో ఇరగదీస్తున్న పుజారా సెంచరీల మీద సెంచరీలు సాధిస్తున్నాడు. ససెక్స్ తరపున బరిలోకి దిగిన పుజారా డర్హమ్‌తో మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. శుక్రవారం రెండోరోజు ఆట ముగిసేసమయానికి పుజారా 128 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. కాగా ఈ సీజన్ కౌంటీలో పుజారాకు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం ససెక్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. దీంతో ససెక్స్ జట్టు డర్హమ్‌పై 139 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. పుజారకు తోడుగా మహ్మద్ రిజ్వాన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా పుజారా ఇంతకముందు వరుసగా డెర్బిషైర్‌పై 201 పరుగులు, వర్సిస్టర్ షైర్‌పై 109 పరుగులు సాధించాడు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్లో బిజీగా ఉన్నారు. ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌కు వెళ్లనున్న భారత్.. ఆ పర్యటనలో ఒక టెస్టు, ఐదు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. అంటే పుజరా టీమిండియా తరపున బరిలోకి దిగేది ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు ద్వారానే అని తెలస్తుంది. చదవండి: షాహిద్ అఫ్రిది ఒక క్యారెక్టర్ లెస్.. అబద్ధాల కోరు : పాక్ మాజీ స్పిన్నర్ ANOTHER 💯!@cheteshwar1 🤯 👏 pic.twitter.com/4nqhzhQjqW — Sussex Cricket (@SussexCCC) April 29, 2022 -
పుజారా మరో సెంచరీ.. పరుగుల వరద పారిస్తున్న నయా వాల్
Pujara Scores Century Followed By Double Ton: పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన చతేశ్వర్ పుజరా ఇంగ్లండ్ కౌంటీల్లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఈ సీజన్లో ససెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న నయా వాల్ వరుస శతకాలతో పరుగుల వరద పారిస్తున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ (రెండో ఇన్నింగ్స్) సాధించిన అతను.. వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ బాదాడు. వరుస ఇన్నింగ్స్‌ల్లో మూడంకెల స్కోర్‌ను రీచైన పుజారా ఎట్టకేలకు పూర్వపు ఫామ్‌ను దొరకబుచ్చుకున్నాడు. డెర్బిషైర్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే ఔటైన పుజారా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేశాడు. సూపర్ ఫామ్‌కు కొనసాగింపుగా వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 206 బంతులను ఎదుర్కొన్న నయా వాల్.. 16 ఫోర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. పుజారా ఒక్కడే సొగసైన సెంచరీతో రాణించడంతో ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులకు ఆలౌటైంది. ఇదే జట్టు తరఫున ఆడుతున్న పాక్ వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ తొలి బంతికే డకౌట్ కాగా, టామ్ క్లార్క్ (44) కాస్త పర్వాలేదనిపించాడు. అంతకుముందు వార్సెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 491 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ జట్టు కెప్టెన్ బ్రెట్ డిఒలివియెరా అజేయమైన 169 పరుగులతో సత్తా చాటగా, ఎడ్ పొలాక్ (77), బెర్నార్డ్ (75) అర్ధ సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన ససెక్స్ ఫాలో ఆన్ ఆడుతుంది. చదవండి: ధోనికో లెక్క.. పంత్‌కో లెక్కా..? నో బాల్ వివాదంపై ఆసక్తికర చర్చ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });