ఆర్చర్‌ బనానా ఇన్‌స్వింగర్‌.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్‌ | Jofra Archer banana Inswinger Shocks Batsman Became Viral | Sakshi
Sakshi News home page

ఆర్చర్‌ బనానా ఇన్‌స్వింగర్‌.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్‌

May 8 2021 6:30 PM | Updated on May 8 2021 7:41 PM

Jofra Archer banana Inswinger Shocks Batsman Became Viral - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌కు 2021 ఏడాది అంతగా కలిసిరాలేదు. జనవరి నుంచి వరుసగా గాయాల బారిన పడుతూ జట్టులోకి రావడం... పోవడం చేస్తున్నాడు. టీమిండియాతో జరిగిన టెస్టు, టీ20 సిరీస్‌లో ఆడిన ఆర్చర్‌ మోచేతి గాయంతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఆర్చర్‌కు శస్త్ర చికిత్స అవసరం పడడంతో స్వదేశానికి వెళ్లిపోవడంతో ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌కు కూడా దూరమయ్యాడు. తాజాగా సర్జరీ అనంతరం ప్రాక్టీస్‌ ఆరంభించిన ఆర్చర్ ఇంగ్లీష్‌ కౌంటీల్లో ఆడుతూ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం సెకండ్‌ ఎలెవెన్‌ చాంపియన్‌షిప్‌ ఆడుతున్న ఆర్చర్‌ ససెక్స్‌ సెకండ్‌ ఎలెవెన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా సర్రీ సెకండ్‌ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్‌ ​అద్బుత బౌలింగ్‌తో మెరిశాడు. క్రికెట్‌లో అరుదుగా కనిపించే బనానా ఇన్‌స్వింగర్‌ వేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించి అతను వికెట్‌ తీయగా.. బ్యాటింగ్‌ చేస్తున్న ఎన్‌ఎమ్‌జే రీఫిర్‌ నోరెళ్లబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోనూ సెసెక్స్‌ క్రికెట్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. '' ఆర్చర్‌ ఈజ్‌ బ్యాక్‌.. నాట్‌ ఏ బ్యాడ్‌ డెలివరీ..'' అంటూ లాఫింగ్‌ ఎమోజీతో క్యాప్షన్‌ జతచేసింది.

ఇక బనానా డెలివరీ అంటే బౌలర్‌ బంతిని విడుదల చేయగానే కాస్త ఎత్తులో వెళుతూ సీ షేప్‌గా మారుతుంది. అది పిచ్‌ మీద పడగానే ఇన్‌స్వింగ్‌ లేదా ఔట్‌ స్వింగ్‌ అయి యార్కర్‌లా మారుతుంది. ఒకవేళ ఆ బంతిని బ్యాట్స్‌మన్‌ వదిలేస్తే బౌల్డ్‌.. లేకపోతే ఎల్బీగా వెనుదిరగడం ఖాయం. ఇక బనానా ఇన్‌స్వింగర్‌ అంటే మనకు గుర్తుచ్చేది టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌. రివర్స్‌ స్వింగ్‌ రాబట్టడంలో మంచి పేరున్న పఠాన్‌ బనానా డెలివరీలు వేయడంలోనూ తన ప్రత్యేకతను చూపించాడు. 
చదవండి: Jofra Archer: ఫుల్‌ రిథమ్‌లో జోఫ్రా ఆర్చర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement