England cricketer
-
ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ కన్నుమూత..
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ గ్రాహం థోర్ప్(55) కన్నుముశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గ్రాహం థోర్ప్.. ఆదివారం ఆర్ధ రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సోమవారం సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. ఈ దివంగత క్రికెటర్‌కు ఈసీబీ ఎక్స్ వేదికగా నివాళులు అర్పించింది."ఈ రోజు వరల్డ్ క్రికెట్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్ మరణ వార్తను బరువెక్కిన హృదయాలతో మేము పంచుకుంటున్నాము. అతడి కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము" అని ఈసీబీ ఎక్స్‌లో రాసుకొచ్చింది.థోర్ప్ 1993-2005 కాలంలో ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడారు. ఈ రెండు ఫార్మాట్లలో ఆయన వరుసగా 6744, 2380 పరుగులు చేశారు. గ్రాహం కెరీర్లో 16 టెస్ట్ సెంచరీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 341 మ్యాచ్‌ల్లో 21937 పరుగులు చేశారు.గ్రాహం థోర్ప్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. కొంత కాలం బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశారు. అయితే 2022 యాషెస్ సిరీస్‌లో ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ (0-4) ఘోర ఓటమి చవిచూడటంతో బ్యాటింగ్ కోచ్‌గా థోర్ప్ తప్పుకున్నాడు. ఆ తర్వాత అఫ్గానిస్తాన్ హెడ్ కోచ్‌గా థోర్ప్ ఎంపికయ్యారు. కానీ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. It is with great sadness that we share the news that Graham Thorpe, MBE, has passed away.There seem to be no appropriate words to describe the deep shock we feel at Graham's death. pic.twitter.com/VMXqxVJJCh— England and Wales Cricket Board (@ECB_cricket) August 5, 2024 -
ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కన్నుమూత
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మాజీ రిఫరీ రామన్ సుబ్బా రో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయసు పైబడటం, దీర్ఘకాలిక అనారోగ్య కారణాల చేత సుబ్బా రో మృతి చెందినట్లు తెలుస్తుంది. భారత మూలాలున్న సుబ్బా రో ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 1958-61 మధ్యలో 13 టెస్ట్‌లు ఆడి 46.85 సగటున 984 పరుగులు చేశాడు. సుబ్బా రో ఫస్ట్‌క్లాస్ కెరీర్లో సర్రే, నార్తంప్టన్ఫైర్ కౌంటీల తరఫున 260 మ్యాచ్‌లు ఆడి 14182 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 73 అర్దశతకాలు ఉన్నాయి. సుబ్బా రో కెరీర్ అత్యధిక స్కోర్ 300 పరుగులుగా ఉంది. పార్ట్ టైమ్ లెగ్ స్పిన్ బౌలర్ కూడా అయిన సుబ్బా రో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 87 వికెట్లు తీశాడు. 1981 భారత్, శ్రీలంక పర్యటనల్లో సుబ్బా రో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మేనేజర్‌గా వ్యవహరించాడు. 1985-1990 మధ్యలో సుబ్బా రో ఇంగ్లండ్ టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డును చైర్మన్‌గా వ్యవహరించాడు. రామన్ సుబ్బా రో మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, ఐసీసీ సంతాపం తెలిపాయి. ఈసీబీ, ఐసీసీలకు సుబ్బా రో చేసిన సేవలు ఎనలేనివని కొనియాడాయి. కాగా, రామన్ సుబ్బా రో తండ్రి పంగులూరి వెంకట సుబ్బారావు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన వాడు. సుబా రో తల్లి డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్ బ్రిటన్ మహిళ. పంగులూరి వెంకట సుబ్బారావు ఉన్నత చదువుల కోసం లండన్‌కు వెళ్లగా అక్కడ డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారి తీసింది. వీరిద్దరి సంతానమే రామన్ సుబ్బా రో. -
రిటైర్మెంట్తో షాకిచ్చిన స్టువర్ట్ బ్రాడ్
ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఓవల్‌లో జరుగుతున్న మ్యాచే తనకు చివరి టెస్టు అని 37 ఏళ్ల బ్రాడ్ వెల్లడించాడు. యాషెస్‌లో చివరి టెస్టుకు ముందు 166 టెస్టుల్లో 27.68 సగటుతో 600 వికెట్లు తీసిన బ్రాడ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 2016లో చివరి వన్డే ఆడిన బ్రాడ్ అప్పటినుంచి ఒక్క టెస్టులకే పరిమితమయ్యాడు. ఈతరం టెస్టు క్రికెట్లో గొప్ప బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు స్టువర్ట్ బ్రాడ్. తన సహచర పేసర్ జేమ్స్ అండర్సన్‌తో పోటీ పడి మరీ వికెట్లు తీసే బ్రాడ్ అర్థంతరంగా రిటైర్మెంట్ ఇవ్వడం అభిమానులకు షాక్ కలిగించింది. ఇక స్టువర్ట్ బ్రాడ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది యువరాజ్ సింగ్. 2007 టి20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అతనికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. ఇప్పటికి బ్రాడ్ అనగానే ఆ ఆరు సిక్సర్లే కళ్లు ముందు కదలాడతాయి. అంతకముందు ఓవర్లో యువరాజ్‌తో ఆండ్రూ ఫ్లింటాఫ్ వైరం పెట్టుకున్నాడు. దీంతో యువరాజ్ కోపం ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన బ్రాడ్‌కు శాపంగా మారింది. ఓవరాల్‌గా స్టువర్ట్ బ్రాడ్ 167 టెస్టుల్లో 3656 పరుగులు.. 602 వికెట్లు, 121 వన్డేల్లో 529 పరుగులు.. 178 వికెట్లు, 56 టి20ల్లో 118 పరుగులు.. 65 వికెట్లు పడగొట్టాడు. ఇక 2014లో జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో బ్రాడ్ ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అయితే ఇంగ్లండ్‌ను సెమీస్ చేర్చడంలో బ్రాడ్ విఫలమయ్యాడు. BREAKING 🚨: Stuart Broad announces he will retire from cricket after the Ashes ends. pic.twitter.com/dNv8EZ0qnC — Sky Sports Cricket (@SkyCricket) July 29, 2023 Forever remembered for 𝘁𝗵𝗼𝘀𝗲 mesmerising spells, 𝘁𝗵𝗼𝘀𝗲 Ashes battles, 𝘁𝗵𝗼𝘀𝗲 602* wickets. Take a bow, Stuart Broad 👏#EnglandCricket | #Ashes pic.twitter.com/6WvdTW5AoA — England Cricket (@englandcricket) July 29, 2023 చదవండి: Ben Stokes: యాషెస్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా రికార్డు; రోహిత్‌ను దాటలేకపోయాడు ధోనిని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్ -
Ashes Series 2023: ఇంగ్లండ్ ఓపెనర్ డబుల్ సెంచరీ.. ఆసీస్‌కు ధీటుగా..!
మహిళల యాషెస్ సిరీస్ 2023 ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ట్యామీ బీమౌంట్ డబుల్ సెంచరీ సాధించింది. మహిళల క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్‌గా, తొలి ఇంగ్లీష్ మహిళగా ట్యామీ రికార్డుల్లోకెక్కింది. 317 బంతుల్లో 26 బౌండరీ సాయంతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న ట్యామీ.. కెరీర్లో తాను సాధించిన తొలి టెస్ట్ శతకాన్నే ద్విశతకంగా మార్చుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు ట్యామీ తన 7 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో కేవలం 2 అర్ధసెంచరీలు మాత్రమే సాధించింది. అయితే ఆమెకు వన్డేల్లో, టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. 103 వన్డేల్లో 9 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీల సాయంతో 3505 పరుగులు (40.8 యావరేజ్‌తో), 99 టీ20ల్లో సెంచరీ, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1721 పరుగులు (108.4 స్ట్రయిక్‌రేట్‌తో) సాధించింది. WOW 🤯 Our first female double centurion in Test match cricket.#EnglandCricket #Ashes pic.twitter.com/Eju1kwmlug — England Cricket (@englandcricket) June 24, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 473 పరుగులకు ఆలౌటైంది. ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన అనాబెల్ సదర్లాండ్ (137) అజేయమైన సెంచరీతో చెలరేగగా.. ఎల్లైస్ పెర్రీ (99) ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకుంది. తహిల మెక్‌గ్రాత్ (61) అర్ధసెంచరీతో రాణించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎక్లెస్టోన్ 5 వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్, లారెన్ ఫైలర్ తలో 2 వికెట్లు, కేట్ క్రాస్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆసీస్‌కు ధీటుగా జవాబిస్తుంది. ఆ జట్టు మూడో రోజు మూడో సెషన్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 25 పరుగులు వెనుకబడి ఉంది. ట్యామీ బీమౌంట్ (205), కేట్ క్రాస్ (0) క్రీజ్‌లో ఉన్నారు. హీథర్‌నైట్ (57), నాట్‌సీవర్ బ్రంట్ (78) అర్ధశతకాలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 3, తహిల మెక్‌గ్రాత్, డార్సీ బ్రౌన్, నదర్లాండ్, పెర్రీ తలో వికెట్ పడగొట్టారు. -
గెలవలేమని తెలిసినా సెంచరీ కోసం అలా.. చివరికి పరువు పాయే..!
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో ఓ బ్యాటర్ తన వ్యక్తిగత మైలురాయి కోసం స్ట్రయిక్‌లో ఉన్న మరో బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టి పరువు పోగొట్టుకున్నాడు. నాటింగ్హమ్షైర్తో నిన్న (జూన్ 4) జరిగిన మ్యాచ్‌లో వార్విక్షైర్ బ్యాటర్ సామ్ హెయిన్.. తన సెంచరీ కోసం సహచర బ్యాటర్ జేక్ లింటాట్ను ఇబ్బంది పెట్టాడు. ఇంత చేసి అతనేమైనా సెంచరీ సాధించాడా అంటే.. అదీ లేదు. వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్హమ్షైర్.. జో క్లార్క్ (53 బంతుల్లో 89; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కొలిన్ మున్రో (43 బంతుల్లో 87; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో సామ్ హెయిన్ (52 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, తన జట్టును (వార్విక్షైర్) గెలిపించలేకపోయాడు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. pic.twitter.com/A171O5RKOC— Spider Rashid (@RashidSpider) June 4, 2023 సెంచరీ కోసం కింద పడిపోయిన సహచరుడిని లేపి పరిగెట్టించాడు.. అయినా..! ఆఖరి ఓవర్ చివరి 3 బంతుల్లో 19 పరుగులు చేయల్సిన పరిస్థితి ఉండింది. జేక్ బాల్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతిని లింటాట్ సిక్సర్‌గా మలచడంతో ఈక్వేషన్ 2 బంతుల్లో 13 పరుగులుగా మారింది. అప్పటికి నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న హెయిన్ 96 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నాడు. ఏదో అద్భుతం జరిగితే తప్ప, వార్విక్షైర్ గెలిచే పరిస్థితి కూడా లేదు. ఈ దశలో ఐదో బంతిని ఎదుర్కొన్న లింటాట్ భారీ షాట్ ఆడబోయి క్రీజ్‌లోనే కింద పడిపోయాడు. అవతలి ఎండ్‌లో సెంచరీ కోసం పరితపిస్తున్న హెయిన్.. సహచరుడు కిందపడి పరుగు తీయలేని స్థితిలో ఉన్నాడని తెలిసి కూడా, సగం క్రీజ్ వరకు వచ్చి అతన్ని పరుగు తీయాల్సిందిగా కోరాడు. దీంతో లింటాట్ హెయిన్ సెంచరీ కోసం పడుతూ లేస్తూ పరుగు పూర్తి చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. అయితే ఈ లోపే ఫీల్డర్ నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు బంతి విసరడం, బౌలర్ ఆ బంతితో లింటాట్ను రనౌట్ చేయడం జరిగిపోయాయి. ఇంత జరిగికా కూడా సెంచరీ కోసం ఆఖరి బంతిని ఎదుర్కొన్న హెయిన్ అది సాధించాడా అంటే.. అది లేదు. 96 పరుగుల వద్ద ఉండిన హెయిన్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి ఉంటే, తన జట్టు గెలవకపోయినా అతను సెంచరీ అయినా చేసే వాడు. అయితే అతను సింగిల్ మాత్రమే తీయడంతో 97 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం తంతు చూసి నెటిజన్లు హెయిన్ను తిట్టిపోస్తున్నారు. స్వార్ధపరుడని, గెలవలేమని తెలిసినా సెంచరీ కోసం సహచరుడిని ఇబ్బందిపెట్టి పరువు పోగొట్టుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతుంది. -
అరివీర భయంకర ఫామ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్.. నిర్దాక్షిణ్యంగా ఊచకోత
ఇంగ్లండ్ బ్యాటర్ జేమ్స్ విన్స్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 బ్లాస్ట్-2023లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోస్తున్నాడు. ఆడిన ప్రతి బంతిని బౌండరీ లేదా సిక్సర్‌గా మలుస్తున్నాడు. ససెక్స్‌తో నిన్న (జూన్ 3) జరిగిన మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న విన్స్.. 8 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేసి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ విన్స్ ఇదే తరహాలో రెచ్చిపోయాడు. ఆ బౌలర్, ఈ బౌలర్ అన్న తేడా లేకుండా ఎడాపెడా వాయించాడు. తొలుత మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 88 పరుగులు చేసిన విన్స్.. ఆతర్వాత ససెక్స్‌పై 56 బంతుల్లో 88 పరుగులు, ఎసెక్స్‌పై 48 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఎసెక్స్‌పై చేసిన మెరుపు సెంచరీలో 8 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇంతటి భీకర ఫామ్‌లో ఉన్న ఈ హ్యాంప్‌షైర్ ఆటగాడు.. మున్ముందు మరిన్ని విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడతాడని ఇంగ్లండ్ అభిమానులు అనుకుంటున్నాడు. ఇక ససెక్స్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన హ్యాంప్‌షైర్ తొలుత బౌలింగ్ చేసింది. లియామ్ డాసన్ (4-0-18-2), స్కాట్ కర్రీ (2/25), జేమ్స్ ఫుల్లర్ (1/9), వుడ్ (1/32), మేసన్ క్రేన్ (1/32) ధాటికి ససెక్స్ 18.5 ఓవర్లలో 144 పరుగులె మాత్రమే చేసి ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో టామ్ క్లార్క్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్‌షైర్.. కేవలం 14.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. ఓపెనర్లు బెన్ మెక్ డెర్మాట్ (51 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జేమ్స్ విన్స్ (39 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయమైన అర్ధశతకాలతో హ్యాంప్‌షైర్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ విజయయంతో హ్యాంప్‌షైర్ సౌత్ గ్రూప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్‌లో సోమర్సెట్ ,సర్రే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
93 ఏళ్ల కిందటి బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 178 బంతుల్లో 24 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 182 పరుగులు చేసిన డకెట్.. 93 ఏళ్ల కిందట క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ నెలకొల్పిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్ట్‌ల్లో వేగవంతమైన 150 పరుగుల రికార్డు డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉండేది. 1930లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ 166 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. నిన్నటి వరకు లార్డ్స్ టెస్ట్‌ల్లో ఇదే వేగవంతమైన 150గా ఉండేది. అయితే నిన్నటి ఇన్నింగ్స్‌తో డకెట్ ఈ రికార్డును బద్దలు కొట్టి నయా రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. డకెట్ కేవలం 150 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసి బ్రాడ్‌మన్ రికార్డుకు ఎసరు పెట్టాడు. Ben Duckett broke Don Bradman's record for the fastest Test 150 at Lord's 🔥 #ENGvIRE pic.twitter.com/ARQcLnCtYK — ESPNcricinfo (@ESPNcricinfo) June 2, 2023 ఓవరాల్‌గా ఫాస్టెస్ట్ 150 రికార్డు విషయానికొస్తే.. ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ పేరిట ఉంది. మెక్కల్లమ్ 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 103 బంతుల్లోనే 150 రన్స్ బాదాడు. ఆతర్వాత మహేళ జయవర్ధనే 111 బంతుల్లో, రాయ్ ఫ్రెడ్రిక్స్ 113 బంతుల్లో, హ్యారీ బ్రూక్ 115 బంతుల్లో 150 పరుగులు బాదారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం తడబడుతున్న ఐర్లాండ్ ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 141 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకంతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా 352 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దీనికి ముందు స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదేయడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది. చదవండి: చరిత్ర సృష్టించిన జో రూట్ -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన ఇంగ్లండ్ బ్యాటర్
ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జేమ్స్ విన్స్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. టీ20 బ్లాస్ట్-2023లో భాగంగా నిన్న (జూన్ 2) ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విన్స్ 45 బంతుల్లోనే శతకం బాదాడు. ఇందులో 8 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి. విన్స్ శతకాన్ని బౌండరీ, సిక్సర్‌తో కంప్లీట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 48 బంతులు ఎదుర్కొన్న విన్స్ 103 పరుగులు చేసి ఔటయ్యాడు. విన్స్ శతక్కొట్టుడు సాయంతో హాంప్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో లియామ్ డాసన్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో హాంప్‌షైర్ 200 పరుగుల మార్కును దాటింది. విన్స్‌కు జతగా టోబి ఆల్బర్ట్ (28), వెథర్లీ (29) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. ఎసెక్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్, హార్మర్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. క్రిచ్లీ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్.. లియామ్ డాసన్ (4-0-21-4), నాథన్ ఇల్లిస్ (2.1-0-10-3), స్కాట్ కర్రీ (3-0-21-3) ధాటికి 14.1 ఓవర్లలో 96 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ రొస్సింగ్టన్ (23), డేనియల్ లారెన్స్ (22), పాల్ వాల్టర్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న విన్స్.. ఎసెక్స్‌తో మ్యాచ్‌లో మెరుపు సెంచరీ సాధించిన విన్స్ ప్రస్తుత టీ20 బ్లాస్ట్ సీజన్లో అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతుల్లో 103 పరుగులు చేసిన విన్స్.. దీనికి ముందు ససెక్స్‌తో మ్యాచ్‌లో 56 బంతుల్లో 88, మిడిల్సెక్స్తో మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 88 పరుగులు చేశాడు. 2019 ఇంగ్లండ్ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడైన.. ప్రస్తుతం ఇంగ్లండ్ వన్డే జట్టులో కొనసాగుతున్నాడు. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం.. విరాట్ కోహ్లి దిగ్బ్రాంతి -
ఇంగ్లండ్ క్రికెట్లో జేసన్ రాయ్ 'కాంట్రాక్ట్ కలకలం'
ఇంగ్లండ్ క్రికెట్లో జేసన్ రాయ్ కాంట్రాక్ట్ రద్దు వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో తాను ఈసీబీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై రాయ్ స్పందించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఈసీబీ కాంట్రాక్ట్ వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన మొదటి ప్రాధాన్యత అని తెలిపాడు. తాను ఈసీబీతో కేవలం ఇంక్రిమెంటల్ కాంట్రాక్ట్ (షెడ్యూల్ లేని సమయానికి డబ్బు వదులుకోవడం) మాత్రమే వదులుకున్నట్లు వివరణ ఇచ్చాడు. ఈసీబీతో తన కాంట్రాక్ట్ యధాతథంగా కొనసాగుతుందని, ఇంగ్లండ్ షెడ్యూల్ లేని సమయంలో తాను మేజర్ లీగ్ క్రికెట్లో ఆడేందుకు ఈసీబీ అధికారులు కూడా అనుమతిచ్చారని, ఈ కాలానికి తనకు ఈసీబీ నుంచి ఎలాంటి రెమ్యూనరేషన్ దక్కదని ఇన్‌స్టా వేదికగా క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సింగిల్ ఫార్మాట్ ప్లేయర్‌గా అసలు తనకు ఈసీబీతో సెంట్రల్ కాంట్రాక్టే లేదని వెల్లడించాడు. కాగా, అమెరికా వేదికగా జూలై 13 నుంచి జూలై 30 వరకు జరిగే మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు జేసన్ రాయ్ ఈసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకుంటున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్‌తో రాయ్ రెండేళ్లకు గాను రూ. 36.8 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కథనాలు ప్రసారమయ్యాయి. ఇదిలా ఉంటే, 33 ఏళ్ల జేసన్ రాయ్‌ను ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ 2 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2023 మధ్యలో కేకేఆర్ టీమ్‌లో చేరిన రాయ్.. ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడి 151కి పైగా స్ట్రయిక్ రేట్‌తో 285 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. చదవండి: ఐపీఎల్లో 18.50 కోట్లు పెడితే ఏం చేయలేకపోయాడు.. అక్కడికి వెళ్లగానే..? -
'భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్ నాకు ఆఖరిది'
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ రిటైర్మెంట్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన చివరి టి20 మ్యాచ్‌లోనూ ఓటమి పాలైన ఇంగ్లండ్ వైట్‌వాష్‌కు గురైంది. ఈ ఓటమి ఇంగ్లండ్ అభిమానులను బాధిస్తే.. బంగ్లా అభిమానులను మాత్రం ఫుల్ ఖుషీ చేసింది. కారణం.. టి20 క్రికెట్లో వరల్డ్ ఛాంపియన్స్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించడమే. ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్ అనంతరం మొయిన్ అలీ తన రిటైర్మెంట్పై చిన్న హింట్ ఇచ్చాడు. ఇప్పటికే టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన మొయిన్ అలీ పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఆటకు గుడ్‌బై చెప్పనున్నట్లు వివరించాడు. వివరాలు అతని మాటల్లోనే.. ''నేను రిటైర్ కానని చెప్పను.. అలాగని రిటైర్ అవ్వకుండా ఉండను. మరో ఏడు, ఎనిమిది నెలల్లో 35వ పడిలో అడుగుపెట్టబోతున్నా. రిటైర్మెంట్ వయసు వచ్చేసిందనిపిస్తుంది. ఇక ఎలాంటి గోల్స్ పెట్టుకోదలచుకోలేదు. అయితే ఈ ఏడాది ఇండియాలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడాలనుకుంటున్నా. ఆ వరల్డ్‌కప్ గెలవాలని కోరుకుంటున్నా. బహుశా అదే నా చివరి వన్డే కావొచ్చు.'' అని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ కేవలం వన్డేలకు మాత్రమే గుడ్‌బై చెప్పనున్నాడు. టి20ల్లో మాత్రం కొంతకాలం కొనసాగనున్నాడు. ఇక మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన మొయిన్ అలీ ఇంగ్లండ్ తరపున 64 టెస్టుల్లో 2914 పరుగులతో పాటు 195 వికెట్లు, 123 వన్డేల్లో 2051 పరుగులతో పాటు 95 వికెట్లు, 71 టి20ల్లో 1044 పరుగులతో పాటు 40 వికెట్లు పడగొట్టాడు. చదవండి: WTC Final: ఏ లెక్కన ఆసీస్‌ను ఓడించదో చెప్పండి? ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లా -
డబ్ల్యూపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లీష్ క్రికెటర్..
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా తొలి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదైంది. గుజరాత్ జెయింట్స్ బ్యాటర్.. ఇంగ్లండ్ ప్లేయర్ సోఫియా డంక్లీ 18 బంతుల్లోనే అర్థశతకం మార్క్‌ను అందుకుంది. బుధవారం ఆర్సీబీతో మ్యాచ్‌లో డంక్లీ ఈ ఫీట్ అందుకుంది. తద్వారా డబ్ల్యూపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా డంక్లీ రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా 28 బంతుల్లోనే 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో 65 పరుగులతో విధ్వంసం సృష్టించింది. ముఖ్యంగా రేణుకా ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 14 పరుగులు రాబట్టిన డంక్లీ.. ప్రీతిబోస్ వేసిన ఐదో ఓవర్లో విశ్వరూపం చూపించింది. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు పిండుకొని అర్థసెంచరీ మార్క్‌ను అందుకుంది. ఇక మహిళల టి20 క్రికెట్లో అత్యంత వేగంగా ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్న నాలుగో క్రికెటర్‌గా నిలిచింది. ఇక సోఫియా డంక్లీ ఇంగ్లండ్ తరపున 44 టి20ల్లో 652 పరుగులు, 28 మ్యాచ్‌ల్లో 746 పరుగులు, మూడు టెస్టుల్లో 152 పరుగులు చేసింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్
Eoin Morgan: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్, ఆ దేశ పరిమిత ఓవర్ల మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 13) ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇదివరకే (2022 జూన్ 28) గుడ్‌బై చెప్పిన మోర్గాన్.. తాజాగా అన్ని ఫార్మాట్ల ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. మోర్గాన్.. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత మిడిల్సెక్స్ (ఇంగ్లండ్ కౌంటీల్లో), సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ జట్ల తరఫున కొనసాగుతున్నాడు. తాజాగా వీటి నుంచి కూడా వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు. pic.twitter.com/1x1w0unGL2 — Eoin Morgan (@Eoin16) February 13, 2023 అయితే క్రికెట్‌తో తన అనుబంధం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా బ్రాడ్కాస్టర్లతో తన అనుబంధం కొనసాగుతుందని తెలిపాడు. తాను విడుదల చేసిన లేఖలో మోర్గాన్ ఇలా అన్నాడు. విశ్వవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం వల్ల చాలా నేర్చుకున్నానని, ఈ క్రమంలో చాలామంది వ్యక్తులతో జీవితకాల పరిచయం ఏర్పరచుకున్నానని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత కుటుంబంతో ఎక్కువగా గడపగలుగుతున్నానని.. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇంకాస్త అధిక సమయం వారికి కేటాయించే అవకాశం ఉంటుందని అన్నాడు. తన క్రికెట్ జర్నీలో తోడుగా, అండగా ఉన్న అభిమానులకు, సహచరులకు, కుటుంబానికి మోర్గాన్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా, ఐర్లాండ్ జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మోర్గాన్.. ఇంగ్లండ్ తరఫున తన 13 ఏళ్ల కెరీర్లో 225 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక పరుగుల రికార్డులు మోర్గాన్ పేరిటే నమోదై ఉన్నాయి. 2019లో ఇంగ్లండ్‌కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన 36 ఏళ్ల మోర్గాన్.. గత సంవత్సరకాలంగా ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్ కెప్టెన్‌గా సేవలందించిన మోర్గాన్.. కెరీర్ మొత్తంలో (ఐర్లాండ్‌తో కలుపుకుని) 16 టెస్ట్‌లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు, వన్డేల్లో 14 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీల సాయంతో 7701 పరుగులు, టీ20ల్లో 14 హాఫ్ సెంచరీల సాయంతో 2458 పరుగులు చేశాడు. -
అలెక్స్ హేల్స్ ఊచకోత.. పరుగు తేడాతో సెంచరీ మిస్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (దుబాయ్) 2023లో ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్, డెసర్ట్ వైపర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలు, సెంచరీ సాయంతో 356 పరుగులు (33 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసిన హేల్స్.. ఇవాళ (జనవరి 22) గల్ఫ్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 57 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి కేవలం పరుగు తేడాతో లీగ్‌లో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. On 99 tried to hit a six and got out!@AlexHales1 🫡pic.twitter.com/6PDOPghAUl — CricTracker (@Cricketracker) January 22, 2023 హేల్స్ ఊచకోత ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహన్ ముస్తఫా (16 బంతుల్లో 23; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ కొలిన్ మున్రో (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షెఫానీ రూథర్‌ఫోర్ట్ (15 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించారు. గల్ఫ్ జెయింట్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్, లియామ్ డాసన్, డేవిడ్ వీస్, క్రిస్ జోర్డాన్ తలో వికెట్ పడగొట్టారు. Alex Hales at his best in the ILT20! His lowest score in the tournament so far is 64 🤯#AlexHales #England #DesertVipers #DPWorldILT20 #CricTracker pic.twitter.com/dENrWohDt7— CricTracker (@Cricketracker) January 22, 2023 అనంతరం 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన గల్ఫ్ టీమ్.. 3.3 ఓవర్ల తర్వాత 2 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసి పోరాడుతుంది. ఓపెనర్లు టామ్ బాంటన్ (3), జేమ్స్ విన్స్ (4) విఫలమయ్యారు. క్రిస్ లిన్ (22), రెహాన్ అహ్మద్ క్రీజ్‌లో ఉన్నారు. బాంటన్ వికెట్ టామ్ కర్రన్ పడగొట్టగా.. విన్స్‌ను కాట్రెల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కాగా, తొట్ట తొలి ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అలెక్స్ హేల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. లీగ్ తొలి మ్యాచ్‌లో షార్జా వారియర్స్‌పై 52 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 నాటౌట్ పరుగులు చేసిన హేల్స్.. ఆతర్వాత అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్ సాయంతో 64 పరుగులు, ఆ వెంటనే అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో 59 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేశాడు. తాజాగా గల్ఫ్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ చెలరేగిన హేల్స్ పరుగు తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈ లీగ్‌లో తొలి సెంచరీ హేల్స్ పేరిటే నమోదై ఉంది. రెండో సెంచరీ ఇంగ్లండ్‌కే చెందిన టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (షార్జా వారియర్స్) బాదాడు. దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టామ్ (షార్జా వారియర్స్) 47 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 నాటౌట్ పరుగులు చేశాడు. -
డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరంటే..?
డిసెంబర్ నెల 2022 పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐసీసీ ఇవాళ (జనవరి 10) ప్రకటించింది. భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ మిడిలార్డర్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. 23 ఏళ్ల ఈ ఇంగ్లీష్ యువ బ్యాటర్ ఇటీవల ముగిసిన పాకిస్థాన్ టూర్లో విశేషంగా రాణించి 3 టెస్ట్‌లో ఏకంగా 468 పరుగులు స్కోర్ చేశాడు. ఫలితంగానే అతన్ని ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు వరించింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కోసం బ్రూక్.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఆసీస్ ఆల్‌రౌండర్ ట్రవిస్ హెడ్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నప్పటికీ, ఐసీసీ అతడివైపే మొగ్గుచూపింది. డిసెంబర్లో బ్రూక్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేసి, పాక్‌ను వారి సొంతగడ్డపై 17 ఏళ్ల తర్వాత మట్టికరిపించడంలో కీలకంగా వ్యవహరించాడు. పాక్‌తో టెస్ట్ సిరీస్‌లో బ్రూక్ సహా మిగతా ఇంగ్లీష్ ప్లేయర్లంతా మూకుమ్మడిగా రాణించడంతో ఇంగ్లండ్ 3-0 తేడాతో పాక్‌ను ఊడ్చేసింది. ఇక మహిళల ప్లేయర్ ఆప్ ద మంత్ అవార్డు విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే గార్డ్నర్ ఈ అవార్డును గెలుచుకుంది. డిసెంబర్ నెలలో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆష్లే.. ఈ సిరీస్‌లో 166.66 స్టయిక్ రేట్‌తో 115 పరుగులు చేసి 18.28 సగటున 7 వికెట్లు పడగొట్టింది. ఈ అవార్డు కోసం ఆష్లే.. న్యూజిలాండ్ సూజీ బేట్స్, ఇంగ్లండ్ చార్లీ డీన్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంది. కాగా, పురుషుల ప్లేయర్ ఆఫ్ డిసెంబర్ మంత్ అవార్డు గెలుచుకున్న హ్యారీ బ్రూక్‌ను ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
ఇంగ్లండ్ యువ బ్యాటర్ విధ్వంసం.. ఫాస్టెస్ సెంచరీ రికార్డు బద్దలు
ద హండ్రెడ్ లీగ్ 2022లో స్థానిక ఇంగ్లీష్ యువ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. లీగ్ రెండో ఎడిషన్‌లో శతకాల మోత మోగిస్తూ బౌలర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఆగస్ట్ 10న సథరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్కు చెందిన 20 ఏళ్ల ఓపెనింగ్ బ్యాటర్ విల్ స్మీడ్ 50 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి, లీగ్‌లో తొట్ట తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోక్కెగా.. తాజాగా అదే ప్రత్యర్ధిపై ఓవల్ ఇన్విన్సిబుల్స్‌కు చెందిన 23 ఏళ్ల యువ ఓపెనర్ విల్ జాక్స్ ఏకంగా 47 బంతుల్లోనే శతక్కొట్టి ఔరా అనిపించాడు. జాక్స్ మొత్తం 48 బంతుల్లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు సాధించి తన జట్టును మరో 18 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేర్చాడు. జాక్స్ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తమ జట్టుకు మరో విధ్వంసకర బ్యాటర్ దొరికాడని ఇంగ్లీష్ అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. జాక్స్ 2019లో జరిగిన ఓ టీ10 లీగ్‌లో 25 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డుల్లోకెక్కాడు. ఆదివారం (ఆగస్ట్ 14) సథరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ ప్రత్యర్ధిని 137 పరుగులకే (100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. మార్కస్ స్టోయినిస్ (27 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. రీస్ టాప్లే 20 బంతుల్లో 3 వికెట్లు పడగొట్టి సథరన్ బ్రేవ్ పతనాన్ని శాసించాడు. అనంతరం నామమత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్.. జాక్స్ విధ్వంసం ధాటికి 82 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జాక్స్ ఒక్కడే అన్నీ తానై తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. జాక్స్ 48 బంతుల్లో 108 పరుగులు సాధిస్తే.. బ్యాటింగ్ అవకాశం వచ్చిన మిగతా నలుగురు 35 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేసి తుస్సుమనిపించారు. ఓపెనర్ జేసన్ రాయ్ లీగ్‌లో మూడోసారి డకౌట్ కాగా, రిలీ రుస్సో (13 బంతుల్లో 10; సిక్స్), కెప్టెన్ సామ్ బిలింగ్స్ (8) దారుణంగా నిరాశపరిచారు. జాక్స్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది తన జట్టుకు ప్రస్తుత ఎడిషన్‌లో మూడో విజయాన్ని (4 మ్యాచ్‌ల్లో) అందించాడు. తాజా ఓటమితో డిఫెండింగ్ ఛాంనియన్ సథరన్ బ్రేవ్ పరాజయాల సంఖ్య మూడుకు (4 మ్యాచ్‌ల్లో) చేరింది. 4 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో లండన్ స్పిరిట్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చదవండి: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్.. హండ్రెడ్ లీగ్‌లో శతక్కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు -
సెంచరీ మిస్ అయినా 9 సిక్సర్లతో వీరవిహారం..
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ టోర్నమెంట్లో బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. 100 బంతుల్లో ముగిసే మ్యాచ్ కావడంతో అభిమానులు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాటర్లు కొట్టే సిక్సర్లు, బౌండరీలతో మైదానాలు చిన్నవిగా మారిపోయాయా. తాజాగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్.. ట్రెంట్ రాకెట్స్ బ్యాటర్ డేవిడ్ మలాన్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఆగిపోయినప్పటికి.. ఆఖరివరకు నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 44 బంతుల్లో 98 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన మలాన్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండడం విశేషం. మలాన్ దెబ్బకు 94 బంతుల్లోనే లక్ష్యం కరిగిపోయింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సాల్ట్ 46 బంతుల్లో 70 నాటౌట్, జాస్ బట్లర్ 41 పరుగులు రాణించగా.. చివర్లో స్టబ్స్ 10 బంతుల్లో 4 సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. అనంతరం ట్రెంట్ రాకెట్స్ 94 బంతుల్లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చదవండి: Hundred Tourney: సిక్సర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించిన ప్రొటిస్ బ్యాటర్ -
సొంత బోర్డు షాకివ్వడంతో.. ఇబ్బందుల్లో ఇంగ్లండ్ క్రికెటర్
ఇంగ్లండ్ క్రికెటర్ ఆడమ్ లిత్‌కు ఈసీబీ షాక్ ఇచ్చింది. ఇకపై ఈసీబీ పరిధిలో జరిగే ఏ మ్యాచ్‌లోనూ ఆడమ్ లిత్ బౌలింగ్ వేయకుండా అతనిపై నిషేధం విధించింది. అతని బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ ప్రకటించింది. జూలై 16న విటాలీటి బ్లాస్ట్‌లో భాగంగా లంకాషైర్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆడమ్ లిత్ ఒకే ఓవర్ బౌలింగ్ చేసి 15 పరుగులిచ్చాడు. ఆ మ్యాచ్‌కు ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా ఉన్న డేవిడ్ మిల్న్స్, నీల్ మాలెండర్లు ఆడమ్ లిత్ బౌలింగ్ యాక్షన్‌పై అభ్యంతరం చెప్పారు. లిత్ యొక్క బౌలింగ్ యాంగిల్లో చేయి 15-డిగ్రీల థ్రెషోల్డ్ మార్క్‌ను అధిగమించినట్లుగా కనిపించిదని పేర్కొన్నారు.అంపైర్ల ఫిర్యాదుతో లాఫ్‌బరో యునివర్సిటీలోని గ్రౌండ్లో ఆడమ్ లిత్ బౌలింగ్‌పై ఈసీబీ అధికారులు అసెస్మెంట్ నిర్వహించారు. బౌలింగ్ యాక్షన్ కాస్త తేడాతా అనిపించడంతో ఈసీబీ రెగ్యులేషన్ టీంకు పంపించారు. వారి నివేదిక వచ్చిన అనంతరం.. మరోసారి బౌలింగ్ రీ-అసెస్మెంట్ నిర్వహించే వరకు ఆడమ్ లిత్ బౌలింగపై నిషేధం కొనసాగుతుంది. దీంతో ప్రస్తుతం హండ్రెడ్ టోర్నమెంట్లో ఆడుతున్న ఆడమ్ లిత్ బౌలింగ్ వేయకూడదని ఉత్తర్వులు వచ్చాయి. కాగా ఆడమ్ లిత్ హండ్రెడ్ టోర్నమెంట్లో నార్తన్ సూపర్ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం టోర్నీలో మూడు మ్యాచ్‌లు కలిపి 132 పరుగులు చేసిన ఆడమ్ లిత్ టాప్ స్కోరర్‌గా కొనసాగతున్నాడు. ఇక అంతకముందు యార్క్‌షైర్ తరపున కౌంటీ సీజన్లో పాల్గొన్న ఆడమ్ లిత్ 10 మ్యాచ్‌లు కలిపి 608 పరుగులు చేశాడు. అంంతేకాదు విటాలిటీ బ్లాస్ట్ 2022 టోర్నమెంట్లోనూ ఆడమ్ లిత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం 16 మ్యాచ్‌లాడి 177 స్ట్రైక్‌రేట్‌తో 525 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో ఏడు టెస్టులు ఆడిన ఆడమ్ లిత్ 265 పరుగులు చేశాడు. అతని ఖాతాలో ఒక సెంచరీ ఉంది. చదవండి: ఏడుసార్లు గెలిచి చరిత్రకెక్కాడు.. ఈసారి మాత్రం అవమానం! CSA T20 League: జట్టు పేరును వెల్లడించిన రాయల్స్ గ్రూప్.. బట్లర్ సహా.. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్.. హండ్రెడ్ లీగ్‌లో శతక్కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహించే ద హండ్రెడ్ లీగ్ కాంపిటీషన్లో తొలి శతకం నమోదైంది. 2022 ఎడిషన్‌లో భాగంగా బర్మింగ్‌హామ్ ఫీనిక్స్కు చెందిన 20 ఏళ్ల యువ బ్యాటర్ విల్ స్మీడ్ లీగ్‌లో తొట్ట తొలి సెంచరీ సాధించి రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు సహచర ఆటగాడు, పంజాబ్ కింగ్స్ (ఐపీఎల్) ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్ చేసిన 92 పరుగులే హండ్రెడ్ లీగ్ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండింది. నిన్న (ఆగస్ట్ 10) సథరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మీడ్ ఈ ఘనత సాధించాడు. First 💯 in #TheHundred = @CazooUK Match Hero 🏅 👏 @will_smeed 👏 pic.twitter.com/bTqyqrSSsT — The Hundred (@thehundred) August 10, 2022 స్మీడ్.. 50 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం నమోదు చేశాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న బర్మింగ్‌హామ్ జట్టు 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఫీనిక్స్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఛేదనలో హెన్రీ బ్రూక్స్ (5/25), కేన్ రిచర్డ్సన్ (3/19) ధాటికి ప్రత్యర్ధి సథరన్ బ్రేవ్ 123 పరుగులకే చాపచుట్టేసింది. ఫీనిక్స్ ఇన్నింగ్స్‌లో స్మీడ్ అజేయమైన సెంచరీ బాదగా, లివింగ్‌స్టోన్ (20 బంతుల్లో 21; ఫోర్, సిక్స్) పర్వాలేదనిపించాడు. సథరన్ బ్రేవ్ బౌలర్లలో స్టొయినిస్, క్రిస్ జోర్డాన్, జేమ్స్ ఫుల్లర్, లిన్టాట్ తలో వికెట్ పడగొట్టారు.సథరన్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ డేవిస్ (24 బంతుల్లో 33; 2 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్కు ఇది తొలి విజయం. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో ప్రస్తుతానికి లండన్ స్పిరిట్ 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. చదవండి: దంచికొట్టిన డేవిడ్ మలాన్.. దూసుకుపోతున్న ట్రెంట్ రాకెట్స్ -
ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ ఆటగాడు..!
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్ నియమితుడయ్యాడు. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్ హెడ్ కోచ్‌గా పనిచేసిన గ్రాహం థోర్ప్ స్థానంలో ట్రాట్ ఎంపికయ్యాడు. కాగా ఈ ఏడాది మేలో తీవ్ర అస్వస్థతకు గురైన గ్రాహం థోర్ప్ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న ఐర్లాండ్ సిరిస్‌తో ఆఫ్ఘనిస్తాన్ ప్రాధాన కోచ్‌గా ట్రాట్ ప్రయాణం మొదలుకానుంది. ఇక 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ట్రాట్.. ఇంగ్లండ్‌కు 52 టెస్టులు, 68 వన్డేలు, 7 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ట్రాట్ 127 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 6792 పరుగులు సాధించాడు. అతడి కెరీర్లో 13 సెంచరీలు, 41 అర్థ సెంచరీలు ఉన్నాయి. ట్రాట్ గతంలో ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు మెంటార్‌గా, ఇంగ్లండ్ లయన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2021లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. చదవండి: ZIM vs BAN: జింబాబ్వే టూర్.. జట్లను ప్రకటించిన బంగ్లాదేశ్.. కెప్టెన్ దూరం..! -
ఇంగ్లండ్ స్టార్ రీస్ టాప్లీ.. ఐదేళ్ల క్రితం కథ వేరే
ఇంగ్లండ్ బౌలర్ రీస్ టాప్లీ.. టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో హీరో అయ్యాడు. తొలి వన్డేలో టీమిండియా స్పీడస్టర్ బుమ్రా బౌలింగ్‌లో మ్యాజిక్ చేసి జట్టును గెలిపిస్తే.. దాదాపు అదే రీతిలో బౌలింగ్ చేసిన టాప్లీ ఈసారి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఇంగ్లండ్ రెండో వన్డేలో గెలిచింది అంటే అదంతా టాప్లీ మాయే. ఆరు వికెట్లతో దుమ్మురేపిన టాప్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. టీమిండియాపై తన ప్రదర్శన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని రీస్ టాప్లీ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. బలహీన జట్టుపై వికెట్లు తీస్తే కిక్ ఉండదని.. పటిష్టమైన టీమిండియా లాంటి జట్టుపై మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ చేయడం ఎంతో కిక్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. కీలక సమయంలో అద్బుత బౌలింగ్‌తో జట్టును గెలిపించడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. నిజానికి రీస్ టాప్లీ కథ ఐదేళ్ల క్రితం వేరుగా ఉంది. 21 ఏళ్ల వయసులోనే ఇంగ్లండ్ జట్టులో ఎంట్రీ ఇచ్చిన టాప్లీ నిలదొక్కుకోవడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది. ఈ ఐదేళ్ల కాలంలో మానసికంగానూ.. శారీరకంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అవన్నీ ఎంతగానో బాధించాయి. ఒక దశలో ఇంగ్లండ్ జెర్సీని విసిరిపారేసిన సందర్భం కూడా వచ్చిందని టాప్లీ టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. టాప్లీ మాట్లాడుతూ.. ''21 ఏళ్ల వయసులో ఇంగ్లండ్ జట్టులోకి అడుగుపెట్టాను. ఆరంభంలో వరుస అవకాశాలు వస్తుండడంతో నన్ను నేను నిరూపించుకుననే పనిలో పడ్డాను. కెరీర్ అంతా సాఫీగా సాగుతున్న దశలో గాయాలు వేధించాయి. అంతే ఇక కోలుకోలేకపోయా. ఒక దశలో రిటైర్మెంట్ అనే ఆలోచనకు వెళ్లిపోయా. నాలుగేళ్ల క్రితం నా పరిస్థితి మాటల్లో వర్ణించలేనిది. భరించలేని కడుపునొప్పి నన్ను కుంగదీస్తే.. ఇక వెన్నునొప్పి సమస్య గురించి చెప్పుకుంటే కన్నీళ్లే దిక్కు. ఈ రెండింటిని అధిగమించేందుకు రోజు పొద్దునే పొత్తి కడుపు హార్మోన్ ఇంజెక్ట్ చేసుకోవడం.. నెలకోసారి లండన్‌కు వెళ్లి వెన్ను నొప్పికి చికిత్స చేయించుకొని అనస్థీషియా తీసుకోవడం లాంటివి జరిగేవి. ఇక ఆ తర్వాత రోజు గంటపాటు జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాను. ఈలోగా కరోనా పేరుతో ప్రపంచం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. అప్పటికి వయసు 25 ఏళ్లు.. అవకాశాలు లేకపోవడంతో రిటైర్మెంట్కు సమయం వచ్చేసిందని భావించా. సెలక్టర్లు కూడా నావైపు చూడకపోవడం.. కరోనా ఇలా ఒకదాని వెంట మరొకటి వెంటవెంటనే జరిగిపోయాయి. అప్పుడే ఇంగ్లండ్ జెర్సీని తీసిపారేయాల్సి వచ్చింది. నాకు ఇష్టమైన మ్యూజిక్ క్లాసులు నేర్చుకున్నాను. ఆ తర్వాత యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి మైక్రో ఎకానమిక్స్ కోర్సులో సీటు సాధించి ఫస్ట్ లాక్డౌన్లో కాలం గడిపాను. మైక్రో ఎకానమిక్స్ కోర్సు తర్వాత నా మనసులో దైర్యం పెరిగింది. నాకు నేనుగా ఒక ఫిలాసఫీ పాఠాలు చెప్పడం నేర్చుకున్నా. అందుకే వదిలేసిన క్రికెట్‌ను మళ్లీ ఆడాలనిపించింది. ఈలోగా కరోనా తగ్గుముఖం పట్టడం.. నా ఆరోగ్యం కూడా బాగుపడడం ఇవన్నీ చూస్తే నాకు మంచి రోజులు వచ్చాయనిపించింది. తిరిగి బౌలింగ్ చేయడం ఆరంభించాను. ఎంతో మంది కోచ్‌లను కలిసి బౌలింగ్‌లో మరిన్ని మెళుకువలు నేర్చుకున్నాను. నువ్వు మనసు పెట్టి బౌలింగ్ చేస్తే ఒక యార్కర్ బాల్‌ను 110 శాతం పర్ఫెక్ట్గా చేయగలవు అంటూ దైర్యం చెప్పారు. వాళ్ల నుంచి ఏం నేర్చుకున్నానో ఇవాళ మ్యాచ్‌లో అదే ఆచరించా. ఈరోజు ఇంగ్లండ్‌కు కీలక సమయంలో విజయం సాధించేలా చేశాను'' అంటూ ముగించాడు. ఇక రీస్ టప్లీ 2015లో ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఏడేళ్ల కాలంలో టాప్లీ 15 వన్డేలు, 12 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: IND vs ENG 2nd ODI Highlights: ‘టాప్’లీ లేపేశాడు... -
కొత్త అవతారమెత్తబోతున్న మోర్గాన్.. ఇండియాతో సిరీస్ నుంచి..?
ఇంగ్లండ్ తాజా మాజీ సారధి ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే ఓ ఆసక్తికర ప్రకటన చేశాడు. జూన్ 28న ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారిక ప్రకటన చేసిన మోర్గాన్.. కొద్ది నిమిషాల్లోనే తన ఫ్యూచర్ ప్లాన్‌ను వెల్లడించాడు. ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి కామెంటేటర్‌గా మారబోతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని మోర్గాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ‘స్కై’ నెట్వర్క్ ధృవీకరించింది. మోర్గాన్ తమ కామెంటరీ టీమ్‌లో చేరబోతున్నడని ప్రకటన విడుదల చేసింది. స్వదేశంలో ఇంగ్లండ్ ఆడబోయే తదుపరి సిరీస్‌ల నుంచి మోర్గాన్ స్కై నెట్‌వర్క్‌లో భాగస్వామిగా ఉంటాడని పేర్కొంది. మొత్తానికి ఇంగ్లండ్ తరఫున క్రికెటర్‌గా 13 ఏళ్ల కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే మోర్గాన్ మరో పనిని వెతుక్కున్నాడు. త్వరలో జరుగబోయే ఇండియా, సౌతాఫ్రికా సిరీస్‌ల నుంచి మోర్గాన్ కామెంటేటర్‌గా తన కెరీర్ మొదలుపెట్టనున్నాడు. ఐర్లాండ్ తరఫున కెరీర్ ప్రారంభించి ఇంగ్లండ్ క్రికెట్‌కు ఎనలేని సేవలనందించిన మోర్గాన్.. తన హయాంలో ఇంగ్లండ్‌కు వన్డే ప్రపంచకప్ (2019) అందించాడు. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్ కెప్టెన్‌గా సేవలందించిన మోర్గాన్.. కెరీర్ మొత్తంలో (ఐర్లాండ్‌తో కలుపుకుని) 16 టెస్ట్‌లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు, వన్డేల్లో 14 సెంచరీలు, హాఫ్ సెంచరీల సాయంతో 7701 పరుగులు, టీ20ల్లో 14 హాఫ్ సెంచరీల సాయంతో 2458 పరుగులు చేశాడు. చదవండి: Ind Vs Eng: ఇంగ్లండ్‌తో టెస్టుకు కెప్టెన్ బుమ్రా! బౌలర్లకు మెదడు తక్కువా? -
అతన్ని ఓపెనర్‌గా పంపండి.. సెహ్వాగ్‌లా సక్సెస్ అవుతాడు..!
ఐపీఎల్ 2022 సీజన్లో పరుగుల వరద (863 పరుగులు) పారించి, ఆతర్వాత నెదర్లాండ్తో జరిగిన వన్డే సిరీస్‌లో అంతకుమించిన బీభత్సం (162, 86 నాటౌట్) సృష్టించిన ఇంగ్లండ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్ గురించి శ్రీలంక లెజెండరీ ఆటగాడు, రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బట్లర్‌ను టెస్ట్‌ల్లో 6, 7 స్థానాల్లో కాకుండా ఓపెనర్‌గా పంపిస్తే సెహ్వాగ్‌లా సూపర్ సక్సెస్ అవుతాడని సంగక్కర అభిప్రాయపడ్డాడు. బట్లర్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్‌గా వచ్చి వేగంగా పరుగులు రాబట్టడంతో పాటు సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడిన వైనాన్ని ఇందుకు ఉదహరించాడు. సెహ్వాగ్ టీమిండియలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అతన్ని కూడా లోయర్ ఆర్డర్లో పంపారని, ఆతర్వాత ఓపెనర్‌గా ప్రమోషన్ వచ్చాక సెహ్వాగ్ ఏం చేశాడో ప్రపంచమంతా చూసిందని అన్నాడు. ఈతరంలో బట్లర్ అంత విధ్వంసకర ఆటగాడిని చేడలేదని, అతన్ని టెస్ట్‌ల్లో కూడా ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తే రెడ్ బాల్ క్రికెట్లోనూ రికార్డులు తిరగరాస్తాడని జోస్యం చెప్పాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రెచ్చిపోయి ఆడే బట్లర్ టెస్ట్‌ల్లో తేలిపోతున్న నేపథ్యంలో సంగక్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు 57 టెస్ట్‌లు ఆడిన బట్లర్.. 2 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీల సాయంతో 31.92 సగటున 2907 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ గతేడాది యాషెస్‌లో దారుణ పరాభవం ఎదుర్కొన్న అనంతరం బట్లర్ టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే లిమిటెడ్ ఓవర్స్‌లో అతని భీకర ఫామ్ తిరిగి టెస్ట్ జట్టులో చోటు సంపాదించిపెడుతుందని అంతా అనుకున్నారు. అయితే టీమిండియాతో జరిగే ఐదో టెస్ట్‌కు బట్లర్‌కు పిలుపు రాకపోవడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కొత్త కెప్టెన్ (స్టోక్స్), కొత్త కోచ్ (మెక్కల్లమ్) ఆధ్వర్యంలో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌పై హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి టీమిండియాకు ఛాలెంజ్ విసురుతుంది. భారత్‌తో జరిగే 5వ టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్టన్, జామీ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఓలీ పోప్, జో రూట్ చదవండి: టీమిండియాతో ఐదో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్..! -
ఇంగ్లండ్ జట్టులోనూ కరోనా కలకలం.. కీలక ఆటగాడికి పాజిటివ్‌గా నిర్ధారణ
కరోనా మహమ్మారి యూకేలో విలయతాండవం చేస్తుంది. స్థానిక క్రికెటర్లతో పాటు ఆ దేశంలో పర్యటిస్తున్న క్రికెట్ జట్లలోని ఆటగాళ్లు వరుసగా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ (ఈసీబీ) క్రికెట్ బోర్డు వెల్లడించింది. దీంతో ఫోక్స్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ నుంచి అర్ధంతరంగా వైదొలుగుతున్నట్లు ఈసీబీ పేర్కొంది. ఫోక్స్‌కు నడుము పట్టేయడంతో పాటు కరోనా లక్షణాలు ఉండటంతో మూడో రోజు ఆట బరిలోకి దిగలేదని ఈసీబీ వివరించింది. ఎల్ఎఫ్టి కోవిడ్ టెస్ట్‌లో ఫోక్స్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు తెలిపింది. ప్రస్తుతం ఫోక్స్‌ను ఐసోలేషన్‌కు తరలించామని, అతని రీప్లేస్‌మెంట్‌గా సామ్ బిల్లింగ్స్‌ను ఎంపిక చేశామని ప్రకటించింది. ఫోక్స్ జులై 1 నుంచి టీమిండియాతో జరుగబోయే టెస్ట్ మ్యాచ్‌లోపు కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది. ఐసీసీ కోవిడ్ నిబంధనల ప్రకారం సామ్ బిల్లింగ్స్ ఫోక్స్‌కు రీప్లేస్‌మెంట్‌గా జట్టులో చేరతాడని, అతను నాలుగో రోజు ఆటలో వికెట్‌కీపింగ్ చేస్తాడని పేర్కొంది. కాగా, ఇవాళ ఉదయం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కోవిడ్ బారిన పడినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. రోహిత్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. చదవండి: కొత్త చరిత్ర ఆవిష్కృతం.. రంజీ ట్రోఫీ విజేత మధ్యప్రదేశ్ -
అదో భయానక పరిస్థితి.. పాకిస్థాన్ లీగ్‌పై ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) అనుభవాలను ఉద్దేశించి ఇంగ్లండ్ క్రికెటర్ జేసన్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పీఎస్ఎల్ ఆడే రోజుల్లో భయానక పరిస్థితులను ఎదుర్కొన్నానని, పాక్‌లో ఉన్నన్ని రోజుల మానసికంగా చాలా సమస్యలతో బాధపడ్డానని, ఆ రోజులు తన జీవితంలో చీకటి రోజులని చెప్పుకొచ్చాడు. నెదర్లాండ్స్‌తో రెండో వన్డే ముగిసిన అనంతరం రాయ్ ఈ మేరకు తన పీఎస్ఎల్ అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. ఐపీఎల్‌కి ముందు జరిగిన పీఎస్ఎల్ (2022 సీజన్)లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ఆడిన జేసన్ రాయ్.. ఆ సీజన్లో అంచనాలకు తగ్గట్టుగానే రాణించినా మానసిక ప్రశాంతతను పొందలేకపోయానని షాకింగ్ కామెంట్స్ చేశాడు. క్రికెట్‌ను ఎక్కడున్నా ఆస్వాదించే నేను పీఎస్ఎల్లో ఆడినన్ని ఎంజాయ్ చేయలేకపోయానని తెలిపాడు. కారణం తెలీదు కానీ పాక్‌లో ఉన్నన్ని రోజులు నరకంలో ఉన్నట్టే అనిపించిందని వాపోయాడు. అక్కడి అనుభవాల కారణంగానే ఐపీఎల్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అన్నాడు. కాగా, ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో జేసన్ రాయ్‌ని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే లీగ్ ప్రారంభానికి ముందే అతను బయో బబుల్‌ను సాకుగా చూపి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో వన్డేలో రాయ్ 60 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 73 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: అరుదైన ఆటగాళ్ల జాబితాలోకి నెదర్లాండ్స్ క్రికెటర్ -
ఇంగ్లండ్ క్రికెట్లో విషాదం.. అత్యంత వృద్ధ క్రికెటర్ కన్నుమూత
ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ జిమ్ పార్క్స్(90) బుధవారం కన్నుమూశాడు. అతను మృతి చెందే నాటికి ఇంగ్లండ్ తరపున అత్యంత వృద్ధ టెస్టు క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. జిమ్ పార్క్స్ అనారోగ్య కారణాలతో బాధపడుతూ గత వారం ఇంగ్లండ్‌లోని వార్తింగ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. కాగా ఇవాళ ఉదయం చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడని వైద్యులు తెలిపారు. జిమ్ పార్క్స్ మృతి విషయాన్ని ససెక్స్ వెల్లడించింది. 'జిమ్ పార్క్స్ మరణ వార్త మమ్మల్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. తన కెరీర్లో కౌంటీల్లో ససెక్స్ తరపున ఎక్కువకాలం ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లండ్ క్రికెట్‌కు అతను అందించిన సేవలు వెలకట్టలేనివి. ఆ మృతి పట్ల ప్రగాడ సానభూతి ప్రకటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.' అంటూ తెలిపింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) కూడా జిమ్ పార్క్స్ మృతిపై సంతాపం తెలిపింది. ''నిజంగా చాలా విషాదకరమైన వార్త. అతనో గుర్తుంచుకోదగ్గ ఆటగాడు. ససెక్స్, సోమర్సెట్, ఇంగ్లండ్ జట్ల తరపున ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. జిమ్ పార్క్స్ కుటుంబసభ్యులకు, మిత్రులకు మా ప్రగాడ సానభూతి'' ఇక జిమ్ పార్క్స్ 1954 నుంచి 1968 మధ్య కాలంలో ఇంగ్లండ్ తరపున 46 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 2వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్ అయినప్పటికి లోయర్ ఆర్డర్లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చే జిమ్ పార్క్ తాను చేసిన రెండు సెంచరీలు 8వ స్థానంలో రావడం విశేషం. 1959/60 ఏడాదిలో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 101 నాటౌట్, అలాగే అదే ఏడాది డర్బన్ వేదికగా సౌతాఫ్రికాపై 108 పరుగులు నాటౌట్‌తో జిమ్ పార్క్స్ గుర్తింపు పొందాడు. ఇక 1931లో జన్మించిన జిమ్ పార్క్స్ 18 ఏళ్ల వయసులో ససెక్స్ తరపున కౌంటీల్లో అరంగేట్రం చేసిన పార్క్స్.. ససెక్స్, సోమర్సెట్ తరపున 739 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 132 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. బ్యాట్స్‌మన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినప్పటికి అప్పటి కోచ్‌ల ప్రోత్సాహంతో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అవతారంలోకి మారాడు. అయితే వికెట్ కీపర్ కంటే బ్యాట్స్‌మన్‌గానే తాను ఎక్కువగా ఇష్టపడతానని జిమ్ పార్క్స్ చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. చదవండి: యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్‌పై దాడి.. పరిస్థితి విషమం -
15 ఏళ్ల కుర్రాడి ముందు 12 ఏళ్ల అనుభవం పనికిరాలేదు
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్... ఆల్‌టైమ్ టెస్టు గ్రేట్‌స్ట్ బ్యాటర్ అలిస్టర్ కుక్ 15 ఏళ్ల కుర్రాడి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అదేంటి ఇందులో వింతేముంది అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నాం. 12 ఏళ్ల కెరీర్లో అలిస్టర్ కుక్ ఇంగ్లండ్ తరపున 161 టెస్టులు ఆడాడు. అందులో 291 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 35సార్లు మాత్రమే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కుక్ ఎంత మంచి బ్యాటర్ అనేది. మరి 12 ఏళ్ల అనుభవం ఉన్న కుక్‌ను 15 ఏళ్ల కుర్రాడు క్లీన్‌బౌల్డ్ చేస్తే అది విశేషమే కదా. ఈ ఘటన 12 ఓవర్ గేమ్‌లో భాగంగా యంగ్ ఫార్మర్స్, పొట్టొన్ టౌన్ మధ్య మ్యాచ్‌లో చోటు చేసుకుంది. యంగ్ ఫార్మర్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అలిస్టర్ కుక్ 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. కాగా పొట్టొన్టౌన్ బౌలర్ కైరన్ షాకిల్టన్ లెగ్‌సైడ్ దిశగా బంతిని వేశాడు. షాట్ ఆడే ప్రయత్నంలో కుక్ విఫలమయ్యాడు.. వెంటనే బంతి నేరుగా మిడిల్‌స్టంప్‌ను గిరాటేసింది. దీంతో 15 ఏల్ల కైరన్ షాకిల్టన్కు పట్టరాని సంతోషమేసింది. 12 ఏళ్ల అనుభవం ఉన్న ఒక మాజీ క్రికెటర్ తన బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అవడం సంతోషంగా అనిపించిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత కైరన్ 37 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పొట్టొన్ 3 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన యంగ్ ఫార్మర్ 7 వికెట్ల నష్టానికి 128 పరుగులకే పరిమితమై 26 పరుగులతో పరాజయం పాలైంది. ఇక ఇంగ్లండ్ ఆల్‌టైమ్ టెస్టు క్రికెటర్లలో అలిస్టర్ కుక్ ఒకడిగా ఉన్నాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆండ్రూ స్ట్రాస్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కుక్ విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ తరపున 161 టెస్టుల్లో 12,472 పరుగులు సాధించిన కుక్ ఖాతాలో 33 టెస్టు సెంచరీలు ఉన్నాయి. 92 వన్డేల్లో 3204 పరుగులు సాధించాడు. ఇక టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆల్‌టైమ్ జాబితాలో కుక్ రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: 'కోచ్‌గా ఉండుంటే కేఎల్ రాహుల్‌ను కచ్చితంగా తిట్టేవాడిని' IND Vs IRE: టీమిండియా టి20 తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ The moment cricket legend Sir Alastair Cook was bowled by 15 year old local lad Kyran, in Potton this evening. @PottonTownCC pic.twitter.com/PXR9ME5ptu — Adam Zerny (@adamzerny) May 23, 2022 -
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆఫ్ఘనిస్థాన్ హెడ్ కోచ్
లండన్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రహం థోర్ప్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ ప్లేయర్స్ యూనియన్ మంగళవారం వెల్లడించింది. థోర్ప్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, ప్రస్తుతం అతని కండీషన్ క్రిటికల్‌గా ఉందని యూనియన్ పేర్కొంది. థోర్ప్ కుటుంబం విజ్ఞప్తి మేరకే ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు తెలిపింది. కాగా, గ్రహం థోర్ప్ ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడాడు. థోర్ప్ రిటైర్మెంట్ అనంతరం ఇంగ్లండ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించాడు. ప్రస్తుతం థోర్ప్ ఆఫ్ఘనిస్థాన్ హెడ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. చదవండి: బీజేపీ మీటింగ్‌కు హాజరుకానున్న రాహుల్ ద్రవిడ్..? -
46 ఏళ్ల వయసులో సెంచరీ.. ముద్దుల్లో ముంచిన ఫేమస్ హీరోయిన్
టెస్టుల్లో ఒక బ్యాట్స్‌మన్ సెంచరీ సాధించడం గొప్పగా భావిస్తారు. వన్డేలు, టి20లు రాకముందు టెస్టు మ్యాచ్‌లే అసలైన క్రికెట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలుత ఆరు రోజుల పాటు నిర్వహించిన టెస్టు మ్యాచ్‌లను క్రమంగా ఐదు రోజులకు కుదించారు. ఐదు రోజులపాటు జరగాల్సిన మ్యాచ్‌లు ఇటీవలే మూడు, నాలుగు రోజుల్లోనే ఎక్కువగా ముగుస్తున్నాయి. ఇక టెస్టు మ్యాచ్‌ల్లో సెంచరీ సాధిస్తే ఆ మజా వేరుగా ఉంటుంది. కానీ ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ సాధించిన ఆటగాళ్లు అరుదుగా ఉంటారు. తాజాగా పాకిస్తాన్ ఓపెనర్ ఇమాముల్ హక్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ బాది ఆ ఘనత సాధించిన 12వ ఆటగాడిగా నిలిచాడు. మరి లేటు వయసులో టెస్టు సెంచరీ అందుకొని.. ఒక నటి చేత ముద్దుల వర్షం అందుకున్న క్రికెటర్ కూడా ఒకరు ఉన్నారు. ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. ఇంగ్లండ్‌కు చెందిన ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మన్ జాక్ హాబ్స్. ఈ తరానికి జాక్ హాబ్స్ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ 19వ దశకంలో క్రికెట్ ఇష్టపడిన వారికి జాకబ్ హాబ్స్ పేరు సుపరిచితం. ఇంగ్లండ్ తరపున 1908-1930 మధ్య 22 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 61 టెస్టుల్లో 5410 పరుగులు సాధించాడు. ఇందులో 15 సెంచరీలు, 28 అర్థసెంచరీలు ఉన్నాయి. అత్యంత లేటు వయసులో(46 ఏళ్ల 82 రోజులు) టెస్టు సెంచరీ సాధించిన ఆటగాడిగా జాక్ హాబ్స్ ఇప్పటికి తొలి స్థానంలో ఉన్నాడు. 1929లో యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన చివరి టెస్టులో జాక్ హాబ్స్ ఒక ఇన్నింగ్స్‌లో 142 పరుగులు సాధించాడు. 46 ఏళ్ల వయసులో సెంచరీ అందుకున్న తొలి క్రికెటర్‌గా స్థానం జాక్ హాబ్స్ నిలిచాడు. కాగా 1963లో కన్నుమూసిన జాక్ హాబ్స్ 1935లో మై లైఫ్ స్టోరీ పేరుతో ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు. ఆ పుస్తకంలో తాను లేటు వయసులో సెంచరీ సాధించిన రోజు ఒక ఇంగ్లీష్ ఫేమస్ నటి ముద్దుల్లో ముంచిందని పేర్కొన్నాడు. ''మెల్బోర్న్ టెస్టులో 142 పరుగులు చేసిన నేను.. ఆరోజు సాయంత్రం చిన్న పార్టీ ఇచ్చారు. హోటల్ డైనింగ్ రూమ్‌కు అడుగుపెట్టిన నాకు అందరు అభినందనలు చెప్పారు. కానీ ఒకావిడ మాత్రం నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టింది. ఈ పరిణామం ఆశ్చర్యపరిచినప్పటికి.. ఇదో రకమైన కృతజ్థత అనుకున్నా. కానీ ఆ నటి ఎవరో నేను ఇప్పడు చెప్పలేను'' అంటూ రాసుకొచ్చాడు. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు న్యూ సౌత్‌వేల్స్ అనే వార్తా పత్రిక జాక్ హాబ్స్‌ను ముద్దుపెట్టిన నటి పేరును బయటకు వెల్లడించింది. కెనడాకు చెందిన మార్గరెట్ బానర్మన్ అనే ఫేమస్ ఆర్టిస్ట్.. హాబ్స్‌కు ముద్దు పెట్టిందంటూ హెడ్‌లైన్స్ రాసుకొచ్చింది. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. ఈ దెబ్బకు మార్గరెట్ పేరు మార్మోగిపోయింది. 1896లో టొరంటోలో జన్మించిన బానర్మన్ కొన్నేళ్ల పాటు ఇంగ్లీష్ సినిమాల్లో నటించింది. మంచి నటిగా పేరున్న మార్గరెట్ బానర్మన్ 1976లో 79 ఏళ్ల వయసులో మరణించింది. ఇక లేటు వయసులో టెస్టుల్లో సెంచరీ సాధించిన జాబితాలో జాక్ హాబ్స్ తొలి స్థానంలో ఉండగా.. పాస్టీ ఎండ్రెన్( ఇంగ్లండ్, 45 ఏళ్ల 151 రోజులు), వారెన్ బార్డ్స్లే(ఆస్ట్రేలియా, 43 ఏళ్ల 202 రోజులు), డేవ్ నోర్సీ(సౌతాఫ్రికా, 42 ఏళ్ల 291 రోజులు), ఫ్రాంక్ వూలీ( ఇంగ్లండ్, 42 ఏళ్ల 61 రోజులు), మిస్బా ఉల్ హక్( పాకిస్తాన్, 42 ఏళ్ల 47 రోజులు) వరుసగా ఉన్నారు. చదవండి: Ruturaj Gaikwad - IPL 2022: సీఎస్కేకు బిగ్‌షాక్.. ఆరంభ మ్యాచ్‌లకు స్టార్ ఆటగాడు దూరం! Anirban Lahiri: భారత క్రీడల చరిత్రలోనే అత్యధిక ప్రైజ్‌మనీ కొట్టేశాడు.. -
జేసన్ రాయ్ విధ్వంసం.. 36 బంతుల్లోనే శతకం
వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జేసన్ రాయ్ విధ్వంసం సృష్టించాడు. 36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో శతక్కొట్టాడు. బార్బడోస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో జేసన్ ఈ ఫీట్‌ను సాధించాడు. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తం 47 బంతులను ఎదుర్కొన్న జేసన్.. 115 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను పొట్టి ఫార్మాట్లో పదో వేగవంతమైన శతకాన్ని సాధించాడు. ఫలితంగా ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ప్రత్యర్ధి కేవలం 137 పరుగులకే చేతులెత్తేయడంతో పర్యాటక జట్టు విజయం సాధించింది. ఈ సునామీ ఇన్నింగ్స్‌తో జేసన్ రాయ్ ఐపీఎల్ జట్లకు ఛాలెంజ్ విసిరాడు. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఇన్నింగ్స్ అతనికి భారీ ధర సమకూర్చి పెట్టే అవకాశం ఉంది. కాగా, రాయ్.. గత ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా క్రికెటర్లకు మరో అవమానం.. పాక్ ఆటగాళ్లకే అందలం -
ఐపీఎల్ 2022 బరిలో నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్
లండన్: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెం ట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే నెలలో జరిగే ఐపీఎల్ మెగా వేలంలో స్టోక్స్ తన పేరును నమోదు చేసుకోలేదు. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ లో ఐదు టెస్టులు ఆడిన స్టోక్స్ నిరాశ పరిచాడు. మొత్తం 236 పరుగులు చేసిన అతను నాలుగు వికెట్లే తీశాడు. స్వదేశంలో వచ్చే సీజన్ కోసం మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండాలనే లక్ష్యంతో స్టోక్స్ ఐపీఎల్లో ఆడకూడదని నిర్ణయం తీసుకున్నాడు. 2021 ఐపీఎల్ టోర్నీలో స్టోక్స్ రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, స్టోక్స్‌కు ముందు ఇంగ్లండ్ టెస్ట్ సారధి జో రూట్ కూడా ఐపీఎల్ మెగా ఆక్షన్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. -
చిన్ననాటి స్నేహితురాలితో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్
Sam Billings Engaged With Long Term Girl Friend.. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ తన చిన్ననాటి స్నేహితురాలితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. టెన్నిస్ ప్లేయర్ అయిన సారా కాంట్లేతో లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న సామ్ బిల్లింగ్స్ శనివారం ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా బిల్లింగ్స్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఈరోజు ప్రపంచంలో లక్కీ పర్సన్ నేనే.. మిస్టర్ బి టూ అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా టెన్నిస్ ప్లేయర్‌గా ఎన్నో ట్రోఫీలు గెలుచుకున్న కాంట్లే సైకాలజీలో మేజర్ డిగ్రీని పూర్తి చేసింది. ఇక 2015లో ఇంగ్లండ్ క్రికెట్లో అరంగేట్రం చేసిన సామ్ బిల్లింగ్స్ 25 వన్డేల్లో 607 పరుగులు.. 33 టి20ల్లో 417 పరుగులు చేశాడు. ఈ ఆరేళ్లలో రొటేషన్ పద్దతిలో ఇన్ అవుట్‌గా ఉన్నప్పటికి ఏనాడు జాతీయ జట్టుకు దూరమైన దాఖలాలు కనిపించలేదు. ఇటీవలే టి20 ప్రపంచకప్ 2021లోనూ సామ్ బిల్లింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఇక టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ సూపర్ 12లో మంచి విజయాలు సాధించినప్పటికి.. సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. చదవండి: Mitchell McClenaghan: 72 గంటలు కాలేదు.. భారత్- న్యూజిలాండ్ సిరీస్ 'మీనింగ్లెస్' View this post on Instagram A post shared by Sam Billings (@sambillings) -
ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. మరో దేశానికి వలస
లండన్: ఇంగ్లండ్ జాతీయ జట్టుకు 2011-2014 మధ్యలో 24 వన్డేలు, 34 టీ20లు ఆడిన జేడ్ డెర్న్‌బాచ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చాలాకాలంగా జాతీయ జట్టు నుంచి పిలుపు రాకపోవడంతో ఇంగ్లండ్‌ను వీడి మరో దేశానికి ప్రాతినధ్యం వహించాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే నెలలో జరుగనున్న టీ20 ప్రపంచకప్-2022 ఐరోపా క్వాలిఫయర్స్‌లో భాగంగా ఇటలీ జట్టు తరఫున ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. తన తల్లి ద్వారా ఇదివరకే ఇటలీ పాస్ పోర్ట్ కలిగిన డెర్న్‌బాచ్.. మాజీ సహచర ఆటగాడు ప్రస్తుత ఇటలీ కోచ్ కమ్ కెప్టెన్ గారెత్ బెర్గ్ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. డెర్న్బాచ్తో పాటు కెంట్ కౌంటీ జట్టు ఆటగాడు గ్రాండ్ స్టువార్ట్ కూడా ఈ ప్రపంచకప్ క్వాలిపయర్స్లో ఇటలీకి ఆడనున్నారు. మరోవైపు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఓవైస్ షా ఇటలీ అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. దీంతో కోచ్, అసిస్టెంట్ కోచ్, ఇద్దరు ఆటగాళ్లు సహా మొత్తం నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇటలీకి ప్రాతనిధ్యం వహించనున్నారు. ఇదిలా ఉంటే, 35 ఏళ్ల వెటరన్ బౌలర్ జేడ్ డెర్న్‌బాచ్.. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో 31, టీ20ల్లో 39 వికెట్లు పడగొట్టాడు. అతను ప్రస్తుతం సర్రే కౌంటీ జట్టు కాంట్రాక్ట్‌లో ఉన్నాడు. చదవండి: పంజాబ్ ఆటగాడిపై మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానం.. బీసీసీఐ సీరియస్ -
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డెక్స్టర్ కన్నుమూత
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ సారథి టెడ్ డెక్స్టర్ (86) అనారోగ్యంతో మృతి చెందారు. 1958–1968 మధ్య కాలంలో ఇంగ్లండ్ తరఫున 62 టెస్టులు ఆడిన ఆయన 47.89 సగటుతో 4502 పరుగులు చేశారు. ఇందులో 9 సెంచరీలు, 27 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాదే డెక్స్‌టర్‌కు ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది. రెజ్లింగ్‌కు అండగా యూపీ న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో రెండు పతకాల (రజతం, కాంస్యం) తో మెరిసిన భారత రెజ్లింగ్‌కు శుభవార్త. వచ్చే ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించేలా దేశంలో రెజ్లింగ్ క్రీడను అభివృద్ధి చేసేందుకు ఉత్తరప్రదేశ్ (యూపీ) ప్రభుత్వం ముందుకు వచ్చింది. హాకీ పునరుత్తేజం కోసం ఒడిశా ప్రభుత్వం అనుసరించిన ప్రణాళికనే రెజ్లింగ్‌లోనూ ప్రవేశపెట్టాలని యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే 11 ఏళ్లలో (2022–32 మధ్య) మూడు దఫాలుగా రెజ్లింగ్ కోసం 170 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ విషయాన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషన్ శరణ్ సింగ్ తెలిపారు. రెజ్లింగ్ అభివృద్ధి కోసం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
జాతివివక్ష వ్యాఖ్యలు.. ఇంగ్లీష్ క్రికెటర్‌కు భారీ ఊరట
లండన్: జాతివివక్ష వ్యాఖ్యలు, విద్వేషాలకు సంబంధించిన ట్వీట్లు చేసి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ ఒలీ రాబిన్సన్కు భారీ ఊరట లభించింది. తాజాగా ఈ అంశంపై విచారణ పూర్తి చేసిన ఈసీబీ రాబిన్సన్పై మొత్తంగా 8 మ్యాచ్‌ల నిషేధం, 3,200 పౌండ్ల జరిమానా విధించింది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లకు దూరమైన రాబిన్సన్.. మరో ఐదు మ్యాచ్‌లను రెండేళ్ల కాలవ్యవధిలో నిషేధం ఎదుర్కోవాల్సి ఉంది. దీంతో అతను వెంటనే ఇంగ్లండ్ జట్టులో కలిసే అవకాశం లభించనుంది. త్వరలో భారత్‌తో జరుగబోయే ఐదు టెస్ట్ సిరీస్ కోసం అతన్ని జట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఈసీబీ అధికరి ఒకరు వెల్లడించారు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో రాబిన్సన్ అరంగేట్రం చేశాడు. అదే సమయంలో 2012-13 కాలంలో అతడు చేసిన జాతివివక్ష, విద్వేషపూరిత ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఈసీబీ అతనిపై చర్యలు చేపట్టింది. లార్డ్స్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో రాబిన్సన్ అదిరిపోయే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగాడు. బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. కానీ, ఆ మ్యాచ్ పూర్తవ్వగానే ఈసీబీ అతడిపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై అతను బహిరంగ క్షమాపణలు కోరినప్పటికీ ఈసీబీ కనికరించకపోవడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. -
పాపం రాబిన్సన్.. క్షమించమని కోరినా కనికరించలేదు
లండన్: ఎనిమిదేళ్ల క్రితం మిడిమిడి జ్ఞానంతో చేసిన తప్పిదానికి ఇంగ్లండ్ యువ పేసర్ ఓలీ రాబిన్సన్ ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నాడని టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విచారం వ్యక్తం చేశాడు. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన 27 ఏళ్ల రాబిన్సన్.. 2013లో సోషల్ మీడియా వేదికగా స్త్రీల పట్ల అనుచిత వ్యాఖ్యలతో పాటు జాత్యాంహకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతనిపై విచారణ చేపట్టి, అతన్ని తక్షణమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ వ్యవహారంపై టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ట్విటర్ వేదికగా ఓలీ రాబిన్సన్కు మద్దతు తెలుపుతూనే.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోని ప్రవర్తించాలని ఈ తరం ఆటగాళ్లను హెచ్చరించాడు. ఈ సందర్భంగా ఆయన ఈసీబీ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. రాబిన్సన్ అప్పుడెప్పుడో చేసిన తప్పుకు క్షమించమని కోరినా ఈసీబీ ఇంత కఠినంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టాడు. టెస్ట్ కెరీర్లో అద్భుతమైన ఆరంభం లభించిన ఆటగాడిని ఈ రకంగా శిక్షించడం బాధగా ఉందని వాపోయాడు. ఏదిఏమైనప్పటికీ.. ఈ సోషల్ మీడియా యుగంలో ప్రస్తుత తరం ఆటగాళ్లకు ఇదో హెచ్చరిక లాంటిదని ట్వీట్ చేశాడు. కాగా, ఓలీ రాబిన్సన్ తన తొలి టెస్ట్‌లో 7 వికెట్లతో పాటు 42 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ డ్రాతో గట్టెక్కింది. కివీస్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ఓపెనర్ డామినిక్ సిబ్లీ 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, కెప్టెన్ జో రూట్ (40) పర్వాలేదనిపించాడు. ఇక అరంగేట్రంలోనే ద్విశతకంతో అదరగొట్టిన కివీస్ ఆటగాడు డెవాన్ కాన్వేను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు, జూన్ 10 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది. చదవండి: నదాల్‌కు మళ్లీ పెళ్ళా.. ఫేస్బుక్ అప్డేట్ చూసి షాక్ తిన్న అభిమానులు -
ఆర్చర్‌కు తిరగబెట్టిన గాయం... కోచ్ అసహనం
లండన్: ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు మోచేతి గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో ఆర్చర్ ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. కాగా ఆర్చర్ ఇంతకముందు కూడా మోచేతి గాయంతోనే భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. మోచేతికి సర్జీరీ చేయించుకోవడంతో ఐపీఎల్ 14వ సీజన్‌కు అందుబాటులోకి రాలేదు. ఈ ఏడాది జనవరిలో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌కు కూడా ఆర్చర్ ఇదే కారణంతో దూరమయ్యాడు. తాజాగా గాయం నుంచి కోలుకొని ససెక్స్ తరపున కౌంటీ మ్యాచ్‌లు ఆడుతూ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. ససెక్స్ తరపున కౌంటీ చాంపియన్‌షిప్ ఆడుతున్న ఆర్చర్ మంచి ప్రదర్శన కనబరుస్తూ వికెట్లు తీస్తున్నాడు. బనానా ఇన్‌స్వింగర్.. సాట్నర్... ఇలా రకరకాల వేరియేషన్స్ చూపిస్తూ సరికొత్త ఆర్చర్లా కనిపించాడు. అయితే కెంట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శనివారం ఆర్చర్ ఐదు ఓవర్లు వేసిన తర్వాత గాయం తిరగబెట్టడంతో మళ్లీ బౌలింగ్ వేయలేకపోయాడు. ఇదే విషయమై ససెక్స్ కోచ్ ఇయాన్ సాలిస్బరీ అసహనం వ్యక్తం చేశాడు.'' ఆర్చర్‌కు గాయం తిరగబెట్టింది. ఈరోజే బౌలింగ్ చేయలేకపోయాడు.. రేపు చేస్తాడని గ్యారంటీ లేదు. కానీ ఆర్చర్‌ను బౌలింగ్ చేయమని చెప్పలేం. దానికి ఈసీబీ అనుమతి అవసరం. ససెక్స్‌ను విజేతను చేయాలని ఆర్చర్ భావించాడు. కానీ ఇది మా చేతుల్లో లేదు.. ఈసీబీ అనుమతి ఇస్తేనే ఆర్చర్ బౌలింగ్‌కు వస్తాడు.''అంటూ తెలిపాడు. కాగా టీమిండియాతో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. గాయం తిరగబెట్టడంతో ఆర్చర్ ఈ సిరీస్ ఆడడం అనుమానమే. అయితే టీమిండియాతో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది చూడాలి. ఇప్పటికే ఐపీఎల్లో ఆడిన ఇంగ్లండ్ ప్లేయర్లకు టీమిండియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. తాజాగా ఆర్చర్‌కు గాయం తిరగబెట్టడం ఈసీబీని ఆందోళనకు గురిచేస్తుంది. కాగా ఆర్చర్ ఇంగ్లండ్ తరపున 13 టెస్టుల్లో 42 వికెట్లు.. 17 వన్డేల్లో 30 వికెట్లు.. 12 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. చదవండి: మొన్న బనానా ఇన్‌స్వింగర్; నేడు స్నార్టర్.. నువ్వు సూపర్ ఆర్చర్ బనానా ఇన్‌స్వింగర్.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్ -
గాయాలతో అలసిపోయా.. అందుకే రిటైర్మెంట్
లండన్: ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ గార్నీ అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. గార్నీ ఇంగ్లండ్ తరపున 10 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. రెండు ఫార్మాట్లు కలిపి మొత్తం 14 వికెట్లు తీశాడు. 2014లో స్కాట్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన గార్నీ కెరీర్ మొత్తం గాయాలతో సతమతమయ్యాడు. ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతూనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే గార్నీ దేశవాలీ క్రికెట్లో మాత్రం దుమ్మురేపాడు. నాటింగ్హమ్షైర్ తరపున 103 ఫస్ట్‌క్లాస్, 93 లిస్ట్ ఏ, 156 టీ20 మ్యాచ్‌లాడి మొత్తంగా 614 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన గార్నీ 8 మ్యాచ్‌లాడి 7 వికెట్లు తీశాడు.2017లో టీ20 బ్లాస్ట్ టోర్నీలో నాటింగ్హమ్షైర్ కప్ గెలవడంలో గార్నీ కీలకపాత్ర పోషించాడు. ఇక తన రిటైర్మెంట్పై గార్నీ స్పందిస్తూ.. ''నా రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం. 24 ఏళ్ల నా ఫస్టక్లాస్ కెరీర్లో గాయాలు చాలా ఇబ్బందులు పెట్టాయి. చివరకు గుడ్‌బై చెప్పే సమయంలోనూ భుజం గాయంతో బాధపడుతున్నా. అందుకే ఇక ఆడే ఓపిక లేకనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. కానీ ఇన్నేళ్ల నా కెరీర్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నాటింగ్హమ్షేర్ను మాత్రం వదల్లేదు. వీటితో పాటు ఇంగ్లండ్‌కు ఆడడం.. ఐపీఎల్, బిగ్‌బాష్, సీపీఎల్ లాంటి మేజర్ టోర్నీలో పాల్గొనడం నాకు గర్వంగా అనిపించింది. ఇక క్రికెటకు వీడ్కోలు పలికిన నేను బిజినెస్‌మన్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నా. చివరగా నా భార్య అవ్రిల్కు కృతజ్థతలు.. కష్టకాలంలో తను నాకు తోడుగా నిలబడింది.. నన్ను అర్థం చేసుకున్న భార్య దొరికినందుకు నేనే అదృష్టవంతుడిని'' అని చెప్పుకొచ్చాడు. -
మొన్న బనానా ఇన్‌స్వింగర్; నేడు స్నార్టర్.. నువ్వు సూపర్
లండన్: ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన పునరాగమనాన్ని బలంగా చాటుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి గాయాలతో సతమతమవుతూ వచ్చిన ఆర్చర్ టీమిండియాతో జరిగిన సిరీస్‌లో మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 14వ సీజన్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. తాజాగా గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్ కౌంటీ క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ససెక్స్ తరపున ఆడుతున్న ఆర్చర్ తన వికెట్ల వేటను కొనసాగిస్తున్నాడు. మొన్న సర్రీతో జరిగిన మ్యాచ్‌లో బనానా ఇన్‌స్వింగర్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఔట్ చేసిన ఆర్చర్ మరో అద్బుత బంతితో మెరిశాడు. కెంట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గురువారం ఆర్చర్ డేనియలల్ బెల్ రూపంలో తొలి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత అతని నాలుగో ఓవర్లో జాక్ క్రాలీని బుట్టలో వేసుకున్నాడు. 143 కిమీ వేగంతో ఆర్చర్ విసిరిన ఆ బంతి క్రాలీ బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీనికి సంబంధించిన వీడియోను ససెక్స్ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసింది. ''ఆర్చర్ ఆన్ ఫైర్.. ధట్స్ ఏ స్నార్టర్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఆర్చర్ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కాగా ఆర్చర్ త్వరలోనే ఇంగ్లండ్ జట్టుతో కలవనున్నాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌తో పాటు టీమిండియాతో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లోనూ ఆర్చర్ అడే అవకాశం ఉంది. అంతేగాక రానున్న టీ20 ప్రపంచకప్‌లో ఆర్చర్ ఇంగ్లండ్ బౌలింగ్ విభాగంలో కీలకం కానున్నాడు. చదవండి: ఆర్చర్ బనానా ఇన్‌స్వింగర్.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్ "That's a SNORTER!" 🎙️🔥 Two wickets already for @JofraArcher! 🤩 pic.twitter.com/HbaAthQv6h — Sussex Cricket (@SussexCCC) May 13, 2021 -
ఆర్చర్ బనానా ఇన్‌స్వింగర్.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్
లండన్: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు 2021 ఏడాది అంతగా కలిసిరాలేదు. జనవరి నుంచి వరుసగా గాయాల బారిన పడుతూ జట్టులోకి రావడం... పోవడం చేస్తున్నాడు. టీమిండియాతో జరిగిన టెస్టు, టీ20 సిరీస్‌లో ఆడిన ఆర్చర్ మోచేతి గాయంతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఆర్చర్‌కు శస్త్ర చికిత్స అవసరం పడడంతో స్వదేశానికి వెళ్లిపోవడంతో ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 14వ సీజన్‌కు కూడా దూరమయ్యాడు. తాజాగా సర్జరీ అనంతరం ప్రాక్టీస్ ఆరంభించిన ఆర్చర్ ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడుతూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సెకండ్ ఎలెవెన్ చాంపియన్‌షిప్ ఆడుతున్న ఆర్చర్ ససెక్స్ సెకండ్ ఎలెవెన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా సర్రీ సెకండ్ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్ అద్బుత బౌలింగ్‌తో మెరిశాడు. క్రికెట్లో అరుదుగా కనిపించే బనానా ఇన్‌స్వింగర్ వేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించి అతను వికెట్ తీయగా.. బ్యాటింగ్ చేస్తున్న ఎన్ఎమ్జే రీఫిర్ నోరెళ్లబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోనూ సెసెక్స్ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసింది. '' ఆర్చర్ ఈజ్ బ్యాక్.. నాట్ ఏ బ్యాడ్ డెలివరీ..'' అంటూ లాఫింగ్ ఎమోజీతో క్యాప్షన్ జతచేసింది. ఇక బనానా డెలివరీ అంటే బౌలర్ బంతిని విడుదల చేయగానే కాస్త ఎత్తులో వెళుతూ సీ షేప్‌గా మారుతుంది. అది పిచ్ మీద పడగానే ఇన్‌స్వింగ్ లేదా ఔట్ స్వింగ్ అయి యార్కర్‌లా మారుతుంది. ఒకవేళ ఆ బంతిని బ్యాట్స్‌మన్ వదిలేస్తే బౌల్డ్.. లేకపోతే ఎల్బీగా వెనుదిరగడం ఖాయం. ఇక బనానా ఇన్‌స్వింగర్ అంటే మనకు గుర్తుచ్చేది టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. రివర్స్ స్వింగ్ రాబట్టడంలో మంచి పేరున్న పఠాన్ బనానా డెలివరీలు వేయడంలోనూ తన ప్రత్యేకతను చూపించాడు. చదవండి: Jofra Archer: ఫుల్ రిథమ్‌లో జోఫ్రా ఆర్చర్ Not a bad delivery! 😅 Two wickets for @JofraArcher against Surrey's second XI yesterday, including this one... ☄️ pic.twitter.com/vBc5s09l4B — Sussex Cricket (@SussexCCC) May 7, 2021 -
'అక్కడ ప్రాణాలు పోతున్నాయి.. రద్దు చేయడం మంచిదే'
లండన్: బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు కరోనా సెగ తగలడంతో సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అయితే లీగ్ రద్దు అనేది తాత్కాలికమే అని.. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ ఐపీఎల్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్‌ను రద్దు చేయడం సరైనదని.. వారికి వేరే ఆప్షన్ లేదంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. హుస్సేన్ మాట్లాడుతూ..'' భారత్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ ఆటగాళ్లను బయోబబుల్ సెక్యూర్‌లో ఉంచి లీగ్ నిర్వహించారు. అత్యంత సురక్షితంగా చెప్పుకొనే బయోబబుల్‌కు కరోనా సెగ తగిలింది. ఈ సమయంలో లీగ్‌ను రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు తాత్కాలిక రద్దు మాత్రమే అని.. పరిస్థితి చక్కబడిన తర్వాత ఐపీఎల్‌ను జరిపి తీరుతామని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. నా దృష్టిలో మాత్రం ఈ సీజన్‌ను పూర్తిగా రద్దు చేయడమే ఉత్తమం. ఇప్పటికే పటిష్టమైన బయోబబూల్‌ను దాటి ఆటగాళ్లను చేరినా కరోనా భవిష్యత్తులో ఐపీఎల్ నిర్వహించినా అక్కడికి రాదని ఎవరు మాత్రం చెప్పగలరు. అంతేగాక ఐపీఎల్ మళ్లీ నిర్వహించినా విదేశీ ఆటగాళ్లు వస్తారనేది అనుమానమే. ఎందుకంటే ఇప్పుడు భారత్‌లో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయనేది వారి కళ్లతో చూశారు. ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకక.. ఆక్సిజన్ కొరతతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతటి భయానక పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో లీగ్‌లో పాల్గొనేందుకు ఎలా వస్తారు. అయినా ఐపీఎల్ 14వ సీజన్‌ను ఇండియాలో నిర్వహించాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తప్పు. సరిగ్గా ఆరు నెలల క్రితం యూఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్ 13వ సీజన్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా సీజన్‌ను అక్కడే నిర్వహించి ఉంటే బాగుండేది. పరిస్థితి దారుణంగా మారిన తర్వాత ఐపీఎల్‌ను రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదు.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'మీ అభిమానానికి థ్యాంక్స్.. జడేజా అని పిలిస్తే చాలు' ఆసీస్ మాజీ క్రికెటర్ కిడ్నాప్.. నలుగురు అరెస్ట్ -
'నేను నీలాగా కావాలంటే ఎన్ని ఆమ్లెట్స్ తినాలి'
రాయ్‌పూర్: టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. సచిన్ ఈ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సచిన్ సారధ్యంలో రెండు మ్యాచ్‌లాడిన ఇండియా లెజెండ్స్ ఒక దాంట్లో ఓడి మరొక దాంట్లో గెలిచింది. తాజాగా ఇంగ్లండ్ లెజెండ్స్ ఆటగాడు క్రిస్ ట్రెమ్లెట్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి దిగిన ఫోటోను తన ట్విటర్లో షేర్ చేశాడు. ''ప్రస్తుతం నేను ఫిట్‌గా ఉన్నా.. సచిన్ వయసు వచ్చేసరికి అదే ఫిట్నెస్తో ఉంటే ఇంకా సంతోషంగా ఉంటా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ట్రెమ్లెట్ ఫోటోను రీట్వీట్ చేస్తూ సచిన్ వినూత్నరీతిలో కామెంట్ చేశాడు. సచిన్ ట్రెమ్లెట్ ఫిజిక్‌ను పొగుడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ట్రెమ్లెట్.. నేను నీలాగా ఉండాలంటే రోజుకు ఎన్ని ఆమ్లెట్స్ తినాలి? అంటూ'' ఎమోజీ పెట్టాడు. సచిన్ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. కాగా ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ ట్రెమ్లెట్ ఆరు అడుగుల ఏడు అంగుళాల పొడగరి కాగా.. అతను తన ఫిజిక్‌ను కాపాడుకోవడంలో ఎప్పుడు ముందుంటాడు. స్వతహగా మంచి బిల్డర్ అయిన ట్రెమ్లెట్ రోజుకు 8వేల కేలరీల ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. చూడగానే భారీ కాయంగా కనబడే ట్రెమ్లెట్ ఇంగ్లండ్ తరపున 12 టెస్టుల్లో 50 వికెట్లు , 15 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. చదవండి: వైరలవుతోన్న సచిన్ ప్రాంక్ వీడియో మా పాజీ తర్వాత మ్యాచ్ ఆడుతాడా! How many OMELETTES would I need to eat to look like TREMLETT? 😋 🍳 मुझे TREMLETT जैसे बनने के लिए कितने OMELETTE 🍳 खाने पड़ेंगे?? 😜 https://t.co/jGa4mCgA8L — Sachin Tendulkar (@sachin_rt) March 10, 2021 -
కోవిడ్ వల్ల తీవ్ర అలసటకు లోనయ్యా: మొయిన్ అలీ
సాక్షి, న్యూఢిల్లీ: గత నెలలో శ్రీలంక పర్యటనకు బయల్దేరిన సందర్భంగా కోవిడ్ బారిన పడ్డ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, ఆతరువాత తాను ఎదుర్కొన్న భాయానక అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. శ్రీలంకతో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు సభ్యులందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, అందులో తనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో, 14 రోజుల పాటు హోటల్ గదిలో క్వారంటైన్లో ఉన్నానని, ఆ రోజులను తలచుకుంటుంటే ఇప్పటికీ భమయమేస్తుందని ఆయన వెల్లడించాడు. కోవిడ్ ప్రభావం వల్ల తీవ్ర అలసటకు లోనయ్యానని, అలాంటి పరిస్థితి తన జీవితంలో మునుపెన్నడూ ఎదురుకాలేదని పేర్కొన్నాడు. రుచిని కోల్పోవడంతో పాటు, తలనొప్పి, గొంతులో మంట లాంటి సమస్యల వల్ల తీవ్ర అలసటకు గరుయ్యానన్నాడు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని ఆ సందర్భంగా భగవంతున్ని ప్రార్ధించానన్నాడు. అయితే ఆ భయానక పరిస్థితులను ఎంతో స్థైర్యంతో ఎదుర్కొన్నానని, కష్ట కాలం పూర్తయ్యేవరకు ఓపిగ్గా వ్యవహరించానని తెలిపాడు. కష్టకాలం తరువాత సుఖాలు ఉంటాయనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని మొయిన్ అలీ చెప్పుకొచ్చాడు. హోటల్ గదిలో ఒంటరిగా గడపడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యానని, దానిని నుంచే బయటపడేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని తన అనుభవాలను పంచుకున్నాడు. కాగా, మొయిన్ అలీ ఫిబ్రవరి 5 నుంచి భారత్‌తో ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగబోయే తొలి రెండు టెస్ట్‌లు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్నాయి. -
వైరల్ : తండ్రిపై స్టోక్స్ ఉద్వేగభరిత పోస్ట్
లండన్ : ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తండ్రి గెరార్డ్ స్టోక్స్ బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న స్టోక్స్ తండ్రి మరణవార్తను తెలుసుకొని హుటాహుటిన న్యూజిలాండ్‌కు బయల్దేరాడు. కాగా స్టోక్స్‌కు తన తండ్రి గెరార్డ్ అంటే విపరీతమై ప్రేమ.. అతని కోరిక మేరకే క్రికెటర్ అయిన స్టోక్స్ ఇవాళ సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగాడు. గతేడాది డిసెంబర్లో తండ్రి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకున్న స్టోక్స్ గెరార్డ్కు సాయంగా ఉండేందుకు పాకిస్తాన్ పర్యటన నుంచి అర్థంతరంగా తప్పుకొని న్యూజిలాండ్‌కు చేరుకున్నాడు. గెరార్డ్ ఆరోగ్యం కాస్త కుదుటపడ్డ తర్వాత అతని అనుమతితో స్టోక్స్ యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్లో ఆడాడు. తాజాగా 29 ఏళ్ల స్టోక్స్ గెరార్డ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి తండ్రితో ఉన్న అనుబంధాన్ని ఉద్వేగభరితంతో రాసుకొచ్చాడు. (చదవండి : బెన్ స్టోక్స్ ఇంట తీవ్ర విషాదం) 'నాన్న.. నువ్వు చనిపోయేటప్పుడు నేను నీ దగ్గర లేను.. క్రికెట్ పేరుతో ఇన్ని సంవత్సరాలు నీకు దూరంగా బతకాల్సి వచ్చింది. కానీ ఎక్కడ ఉన్నా బతికే ఉన్నావని ఆశతో.. నీ చిరునవ్వుతో మమ్మల్ని సంతోషంగా ఉంచేవాడివి. ఈ జీవితం ఇలా ఉందంటే నువ్వు ఇచ్చిన ప్రోత్సాహమే. ఈరోజు మా నుంచి దూరమైన.. నీ జ్ఞాపకాలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. లవ్ యూ ఫర్ ఎవర్.. అంటూ ' ఎమోషనల్‌గా పేర్కొన్నాడు. అంతేకాదు నాన్న పని పట్ల ఎంతో నిబద్ధతతో వ్యవహరించేవాడని, రగ్బీకి దూరమైన తర్వాత 'నాకు ఒక జాబ్ ఉందని.. నా భార్యను.. పిల్లలను చూసుకోవాల్సిన అవసరం ఉందని' మాతో ఎప్పుడూ చెప్పేవాడని స్టోక్స్ పేర్కొన్నాడు. స్టోక్స్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'రిప్.. గెరార్డ్ స్టోక్స్.. మీ ఇద్దరి అనుబంధం విడదీయలేనిది.. మీలాంటి వ్యక్తి స్టోక్స్‌కు తండ్రి కావడం అతను చేసుకున్న అదృష్టం' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : 'క్రికెట్లో ఇలాంటి సూపర్‌స్టార్ చాలా అవసరం') View this post on Instagram A post shared by Ben Stokes (@stokesy) -
శానిటైజర్‌ను ఇలా కూడా వాడొచ్చా!
లండన్: స్వింగ్‌ను రాబట్టేందుకు తన వద్ద ఉన్న హ్యాండ్ శానిటైజర్‌ను బంతికి అంటించడంతో... ఇంగ్లండ్ కౌంటీ ప్లేయర్ మిచ్ క్లేడన్ నిషేధానికి గురయ్యాడు. సస్సెక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతడు... గత నెలలో జరిగిన ఒక మ్యాచ్‌లో బంతికి శానిటైజర్‌ను పూసి బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు దక్కించుకోవడం విశేషం. కరోనా నేపథ్యంలో బంతికి ఉమ్మితో సహా ఎటువంటి పదార్థాలను రాయకూడదనే నిబంధనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రవేశపెట్టింది. దాంతో 37 ఏళ్ల క్లేడన్‌పై ఆగ్రహించిన సస్సెక్స్ జట్టు అతడిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా విచారణ జరిపిస్తోంది. (చదవండి: ఇలా మొదలవుతోంది...) (చదవండి: పాపం.. శానిటైజర్ ఎంత పని చేసింది!) -
వేలానికి బట్లర్ ప్రపంచకప్ జెర్సీ
లండన్: కరోనా మహమ్మారి కోసం తనకు చిరస్మరణీయమైన చొక్కాను ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ వేలానికి పెట్టాడు. కరోనా కట్టడికి నిర్విరామంగా కృషిచేస్తోన్న వైద్య సంస్థలకు నిధులు అందించేందుకు... గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ గెలిచినపుడు ధరించిన జెర్సీని వేలం వేస్తున్నట్లు బట్లర్ ట్విట్టర్ వీడియో ద్వారా ప్రకటించాడు. తమ జట్టు సభ్యులందరి సంతకాలతో కూడిన ఈ జెర్సీని వేలం వేయడం ద్వారా లభించిన మొత్తాన్ని రాయల్ బ్రాంప్టన్, హ్యారీఫీల్డ్ హాస్పిటల్స్ చారిటీ కోసం వినియోగిస్తానని బట్లర్ తెలిపాడు. ‘కరోనా మహమ్మారి కట్టడికి వైద్యులు, నర్సులు, జాతీయ ఆరోగ్య సేవా సంస్థలు ఎంత తీవ్రంగా శ్రమిస్తున్నారో అందరికీ తెలుసు. రానున్న కాలంలో వారికి మన సహాయం మరింతగా అవసరం. గత వారం రాయల్ బ్రాంప్టన్, హ్యారీఫీల్డ్ ఆసుపత్రులు తమకు వైద్యపరికరాల అవసరముందని తెలిపాయి. వారికి సహాయం అందించేందుకు ప్రపంచకప్ ఫైనల్లో ధరించిన జెర్సీని వేలానికి ఉంచుతున్నా’ అని బట్లర్ వివరించాడు. -
‘రూత్... మాకు తీరని శోకాన్ని మిగిల్చింది’
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ స్ట్రాస్(46) కన్నుమూశారు. గత కొంత కాలంగా లంగ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆమె శనివారం మరణించినట్లు స్ట్రాస్ కుటుంబం తెలిపింది. ‘మహమ్మారి క్యాన్సర్ బారిన పడిన రూత్ మమ్మల్ని శాశ్వతంగా విడిచివెళ్లింది. మాకు తీరని శోకాన్ని మిగిల్చింది. నాతో పాటుగా సామ్, లుకా తనని ఎంతగానో మిస్సవుతారు. రూత్‌ను కలిసిన ప్రతీ ఒక్కరికీ తన ఎంత స్నేహభావం కలదో ఇట్టే తెలిసిపోయేది. గత 12 నెలలుగా తన చికిత్సకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. తన పేరిట ఫౌండేషన్ నెలకొల్పి క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తాం’ అంటూ ఆండ్రూ స్ట్రాస్ తరఫున ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ఆస్ట్రేలియాకు చెందిన రూత్.. 2003లో ఆండ్రూ స్ట్రాస్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి సామ్, లుకా అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. 2017లో ఆమెకు క్యాన్సర్ సోకింది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, గోల్ఫ్ ప్లేయర్ ల్యూక్ డొనాల్డ్ తదితరులు రూత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆండ్రూ స్ట్రాస్ పలు చిరస్మరణీయ విజయాలు అందించాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన విశిష్ట క్రికెటర్!
అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ అభిమానులకు దక్షిణాఫ్రికా విధ్వంసకర క్రికెటర్ ఏబీ డివిలియర్స్ షాకిచ్చిన మరుసటిరోజే మరో క్రికెటర్ ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తక్షణమే వైదొలుగుతున్నట్లు ఐర్లాండ్ క్రికెటర్ ఎడ్ జాయిస్(39) ప్రకటించాడు. అయితే గతంలో ఇంగ్లండ్ జాతీయజట్టుకు సైతం ఎడ్ జాయిస్ ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. ఈ నెలలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు ద్వారా టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసి ఏకైక మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఆటకు గుడ్‌బై చెప్పి కోచ్‌గా కెరీర్ కొనసాగిస్తానని ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ స్పష్టం చేశాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్లకు రెండు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించిన జాయిస్ ఓవరాల్‌గా 78 వన్డేలు, 18 టీ-20 మ్యాచ్‌లు, టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 78 వన్డేల్లో 6 శతకాలు, 15 అర్ధ శతకాల సాయంతో 2,622 పరుగులు సాధించాడు. అయితే ఐర్లాండ్‌కు 61 వన్డేలాడిన ఎడ్ జాయిస్.. 41.36 సగటుతో 2121 పరుగులు చేశాడు. 2016లో అఫ్గానిస్తాన్‌పై చేసిన 160 నాటౌట్ వన్డే కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2006లో జూన్13న ఐర్లాండ్‌తో మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన జాయిస్.. 2006-07 మధ్య కాలంలో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 17 వన్డేలాడి 27.70 సగటుతో 471 పరుగులు చేశాడు. 255 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 47 శతకాల సాయంతో 47.95 సగటుతో 18,461 పరుగులు సాధించాడు. కౌంటీల్లో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్, మిడిల్సెక్స్, సస్సెక్స్లకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రత్యేకతలు అంతర్జాతీయ క్రికెట్లో రెండు దేశాల తరఫున వన్డేల్లో ఆడిన పది మంది క్రికెటర్లలో జాయిస్ ఒకడు. కాగా, రెండు దేశాల తరఫున టీ20లు ఆడిన ఏకైక క్రికెటర్ ఇతడే. వన్డే ప్రపంచకప్‌లలో రెండు జట్లకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్‌గానూ గుర్తింపు పొందాడు. 2007లో ఇంగ్లండ్ నుంచి బరిలోకి దిగిన ఎడ్ జాయిస్.. 2011 వన్డే ప్రపంచ కప్‌లో ఐర్లాంట్ జట్టుకు ఆడాడు. రిటైర్మెంట్ సందర్భంగా ఎడ్ జాయిస్ మాట్లాడుతూ.. క్రికెట్ ఆడటం ఆపేసేందుకు ఇది సరైన సమయం. ఇటీవల పాకిస్తాన్‌తో ఆడిన టెస్ట్ మ్యాచ్ నా చివరి అంతర్జాతీయ మ్యాచ్. కోచ్‌గా రాణించాలనుంది. ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నా. ఐర్లాండ్ క్రికెటర్లను మేటి జట్టుగా తయారు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నాడు. -
జాదవ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెటర్!
లండన్ : గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ విల్లే జట్టులోకి రానున్నాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో యార్క్‌షైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ జట్టు తమ అధికారిక ట్విటర్లో పేర్కొంది. ఇక ఈ సీజన్ ఆరంభం ముందే గాయంతో న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ సాంట్నర్ దూరమవ్వడంతో చెన్నైకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో తొడ నరాలు పట్టేయడంతో జాదవ్ టోర్నీ మొత్తానికి దూరం కావల్సి వచ్చింది. కీలకమైన ఇద్దరి ఆటగాళ్లను కోల్పోయిన చెన్నై డేవిడ్ విల్లేతో ఈ నష్టాన్ని పూడ్చాలని భావిస్తోంది. ఇక బిగ్ బాష్‌లో పెర్త్ స్కార్చేర్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన డేవిడ్ ఇంగ్లండ్ తరఫున మాత్రం ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రాణించడం.. చివర్లో బంతిని హిట్ చేయగల సత్తా ఉన్న ఆటగాడు కావడంతో చెన్నై డేవిడ్‌పై మొగ్గు చూపింది. అయితే డేవిడ్ నియామకంపై చెన్నై ఫ్రాంచైజీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
భవిష్యత్తులో క్రికెటంటే టీ20లే!
సాక్షి, స్పోర్ట్స్ : భవిష్యత్తు క్రికెట్లో ఒక టీ20 ఫార్మాటే మిగలనుందని ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అభిప్రాయపడ్డాడు. ఓ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడుతూ.. మరో 10 నుంచి 15 ఏళ్లలో టెస్టు, వన్డే ఫార్మాట్లు కనుమరుగవ్వనున్నట్లు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఏదైనా త్వరగా కావాలని కోరుకుంటున్నారని, దీంతో టీ20కి ఆదరణ పెరుగుతుందన్నాడు. ‘టెస్టు క్రికెట్ చరిత్రను మనమంతా ఇష్టపడుతాం. టెస్టు క్రికెట్లో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులు టీ20 ఫార్మాట్లో కనబడవు. ఒక ఆటగాడిని నైపుణ్యం తెలియాలంటే టెస్ట్ ఫార్మాట్లోనే సాధ్యం. టెస్టు క్రికెట్ అంతరించిపోవడం బాధాకరమైన విషయమే. టెస్ట్ ఫార్మాట్‌కు ఆదరణ పెంచేలా ఐసీసీ కృషి చేస్తదని ఆశిస్తున్నా’ అని బట్లర్ వ్యాఖ్యానించాడు. ఇప్పటికి కేవలం 18 టెస్టులే ఆడిన ఈ ఇంగ్లండ్ ప్లేయర్ ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్‌కు ఎంపిక కాలేదు. బట్లర్ చివరి టెస్టు 2016లో భారత్‌లో ఆడాడు. టెస్టు క్రికెట్ ఆడటమే తనకిష్టమన్న బట్లర్ త్వరలో మరిన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు. తన తెల్లబంతి బలాన్ని ఎర్ర బంతితో ఆడటానికి ఉపయోగిస్తానన్నాడు. బట్లర్ ఐపీఎల్, బీపీఎల్, బిగ్ బాష్ టీ20 లీగ్‌లలో ఆడాడు. ఈ సారి ఐపీఎల్ వేలంలో సైతం బట్లర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 4 కోట్ల 40 లక్షలకు తీసుకున్న విషయం తెలిసిందే. -
దోషిగా తేలిన క్రికెటర్
లండన్: బహిరంగ ప్రదేశాల్లో మహిళల ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో ఇంగ్లండ్ అండర్ -19 మాజీ కెప్టెన్ శివ్ థాకూర్‌ను కోర్టు అపరాధిగా తేల్చింది. కేసు విచారించిన డెర్బీ క్రౌన్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. నవంబర్ 24న అతడికి శిక్ష ఖరారు చేయనుంది. న్యాయస్థానం అతడికి షరతుల్లేని బెయిల్ మంజూరు చేసింది. కౌంటీ క్రికెట్లో డెర్బీషైర్ తరపున ఆడిన నిందితుడు రెండు సందర్భాల్లో అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది జూన్ 12, 19 తేదీల్లో ర్యాడ్ బోర్న్ లేన్, మ్యాక్ వర్త్ ప్రాంతాల్లో ఇద్దరు మహిళల ముందు అభ్యంతకరంగా వ్యవహరించినట్టు ఫిర్యాదులు రావడంతో జులైలో శివ్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా బాధితులు ఇచ్చిన సాక్ష్యాలను కోర్టు విశ్వసించింది. శివ్ నేరానికి పాల్పడినట్టు న్యాయస్థానం ధ్రువీకరించింది. కాగా, శివ్ థాకూర్ అరెస్టైన వెంటనే అతడితో డెర్బీషైర్ టీమ్ తెగతెంపులు చేసుకుంది. 2014 -16 మధ్య కాలంలో ఈ యువ క్రికెటర్ డెర్బీషైర్ తరపున ఆడాడు. -
ఇంగ్లండ్ క్రికెటర్ పీటర్సన్ అరెస్ట్
లండన్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌ను ఎయిర్‌పోర్టు పోలీసులు ఒకే రోజు రెండు సార్లు అరెస్టు చేశారు. ఒకసారి జెనీవా మరోసారి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా పీటర్సన్‌కు ఇష్టమైన గోల్ఫ్ ఆటనే అతడిని అరెస్టు చేయించింది. ఎయిర్‌పోర్టు నిబంధనలకు విరుద్దంగా పీటర్సన్ గోల్ఫ్ బంతిని ముందుకు ఊపారు. దీంతో జెనీవా పోలీసులు అరెస్టు చేసి అతడిని కొద్దీసేపు సెల్లో ఉంచారు. ఇంత జరిగినా మారని పీటర్సన్ హీత్రూ ఎయిర్‌పోర్టులో మళ్లీ గోల్ఫ్ బంతిని ఊపారు. దీంతో పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకుని సెల్లో వేశారు. ఈ విషయాన్నిపీటర్సనే స్వయంగా తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఈ మధ్యే అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ అనంతరం పీటర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. Held at Heathrow too. My golf isn't as bad as they tried to make out today at both borders! Great friend just snapping away - @dnqwallace -
కూతుర్ని తనివితీరా చూడకుండానే...
విశాఖపట్నం: తన రెండో కుమార్తెతో అదృష్టం కలిసొచ్చిందని ఇంగ్లండ్ క్రికెట్ టెస్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ భావిస్తున్నాడు. ఇటీవల జన్మించిన తన కుమార్తెను చూసి మురిసిపోయేందుకు సమయం చిక్కడం లేదని వాపోయాడు. తన కూతుర్ని చూసేందుకు అక్టోబర్ లో బంగ్లాదేశ్ టూర్ నుంచి కుక్ స్వదేశం చేరుకున్నాడు. అయితే 18 గంటలు మాత్రమే అతడు కుటుంబంతో గడిపాడు. తన ముద్దుల కూతుర్ని తనివితీరా చూడకముందే భారత్ కు పయనమయ్యాడు. టీమిండియాతో రాజ్ కోట్ లో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. దీంతో భారత్ లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. టెస్టుల్లో 30 సెంచరీలు చేసి తన రికార్డు మెరుగుపరుచుకున్నాడు. ‘కేవలం 18 గంటల పాటు నా కుమార్తెను చూడడానికి సమయం చిక్కింది. ముద్దులొలికే పాపాయిని వదిలిరావడానికి చాలా కష్టపడ్డా. ఆమె పుట్టగానే అదృష్టం కలిసివచ్చి మరిన్ని పరుగులు సాధించాన’ని కుక్ చెప్పాడు. అయితే తనను బ్రాడ్‌మన్ తో పోల్చవద్దని కోరాడు. విశాఖపట్నంలో గురువారం నుంచి టీమిండియాతో జరగనున్న రెండో టెస్టులోనూ రాణించేందుకు కుక్ సన్నద్దమవుతున్నాడు. -
ఫీల్డింగ్ చేస్తుండగా..ఆ క్రికెటర్ కాలూడిపోయింది!
-
ఫీల్డింగ్ చేస్తుండగా..ఆ క్రికెటర్ కాలూడిపోయింది!
దుబాయ్‌లో ఇటీవల ఐసీసీ అకాడెమీ ఇన్విటేషనల్ టీ20 టోర్నమెంట్ సందర్భంగా అరుదైన ఘటన జరిగింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ దిశగా దూసుకుపోతున్న బంతిని ఇంగ్లండ్ క్రికెటర్ లియాయ్ థామస్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా అనూహ్యంగా అతని కృత్రిమకాలు ఊడిపోయింది. కాలు ఊడిపోయినా అతను మాత్రం వెనక్కితగ్గలేదు. ఒంటికాలితో కుంటుతూ బంతిని కీపర్‌కు విసిరేసి.. అందరి మన్ననలు అందుకున్నాడు. లియామ్ థామస్ దివ్యాంగుడు. ఇంగ్లండ్ దివ్యాంగుల క్రికెట్ టీమ్‌లో సభ్యుడైన అతడు ఇటీవల పాకిస్థాన్ దివ్యాంగుల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ విధంగా అసాధారణ ప్రతిభ చూపాడు. బౌండరీ వెళుతున్న బంతిని డైవ్ చేసి అడ్డుకోబోతుండగా.. అనూహ్యంగా అతని కృత్రిమకాలు ఊడిపోయింది. అయినా, ఒంటికాలితో కుంటుతూ వెళ్లి బంతిని అందుకొని.. కీపర్‌కు అందించాడు. ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. బంతిని అందుకునే క్రమంలో భూమిని బలంగా ఢీకొన్నా. ఆ తర్వాత నేను లేచేందుకు ప్రయత్నించగా ఒక కాలు లేదు. ముందు ఊడిపోయిన కాలును పెట్టుకోవాలా? లేక బంతిని అందుకోవాలా? అన్న సందిగ్ధ పరిస్థితి. కానీ బంతికే నేను ప్రాధాన్యం ఇచ్చాను' అని మ్యాచ్ అనంతరం థామస్ తెలిపారు. ' వైకల్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒకరినొకరు చూసుకొని కొంత నవ్వుకుంటాం. కానీ నిజానికి ఇలాంటి ఘటనల్లో ఒకరి బాధ మరొకరికి తెలుస్తుంది' అని చెప్పాడు. లియామ్ థామస్ ఈ ఫీల్డింగ్ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. -
జేమ్స్ టేలర్ అనూహ్య రిటైర్మెంట్
లండన్: ఇంగ్లండ్ క్రికెటర్ జేమ్స్ టేలర్ 26 ఏళ్ల చిన్న వయస్సులోనే తన అంతర్జాతీయ కెరీర్‌ను ముగిస్తున్నట్టు ప్రకటించాడు. తీవ్రమైన హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టేలర్ తెలిపాడు. అనారోగ్య కారణంగా ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ చాంపియన్‌షిప్ నుంచి కూడా తప్పుకున్నాడు. సోమవారం స్కానింగ్‌లో అతడి గుండె చాలా తీవ్ర పరి స్థితిలో ఉన్నట్టు తేలింది. ఇంగ్లండ్ తరఫున ఏడు టెస్టులు ఆడిన టేలర్ 312 పరుగులు చేయగా, 27 వన్డేల్లో 887 పరుగులు సాధిం చాడు. ఇందులో ఓ శతకం ఉంది. -
ఇంగ్లండ్ క్రికెటర్ అనూహ్య నిర్ణయం
లండన్: ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేమ్స్ టేలర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అనారోగ్య కారణాల వల్లే జేమ్స్ (26) చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. ప్రమాదకర గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు వెల్లడించాడు. మంగళవారం జేమ్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 'నా జీవితంలో ఇది క్లిష్టమైన సమయం. నా ప్రపంచం తలకిందులైంది. జీవన్మరణ పోరాటం చేస్తున్నా' అంటూ జేమ్స్ ట్వీట్ చేశాడు. ఈ వార్త తెలియగానే ఇంగ్లండ్ టీమ్ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఇది చాలా బాధాకరమని వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ కెరీర్లో జేమ్స్ 7 టెస్టులు, 27 వన్డేలు ఆడాడు. -
ఫిక్సింగ్ స్కాంలో బొపారా!
లండన్: భారత సంతతికి చెందిన ఇంగ్లండ్ క్రికెటర్ రవి బొపారాపై మ్యాచ్ ఫిక్సింగ్ నీడలు కమ్ముకుంటున్నాయి. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో వెలుగుచూసిన ఫిక్సింగ్ ఉదంతం తర్వాత అతన్ని ఐసీసీ అవినీతి నిరోధక మరియు భద్రతా యూనిట్ అధికారులు రెండు గంటల పాటు విచారించారని సమాచారం. 12 నెలల బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు మూడేళ్లకు సంబంధించిన మొబైల్ ఫోన్ కాల్స్ డేటాను ఇవ్వాలని క్రికెటర్‌ను కోరారు. అయితే బిజీ షెడ్యూల్ వల్ల బొపారా వాటిని సకాలంలో సమర్పించలేకపోయాడు. బీపీఎల్‌లో చిట్టగాంగ్ కింగ్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన బొపారా... ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో జరిగిన ఓ టి20 టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లాడు. అయితే ఇలాంటి అంశాలను తెలుసుకునేందుకు సంబంధించిన ఐసీసీ నియమావళిపై సంతకం చేయకపోవడంతో బొపారాపై మరో వారం రోజుల్లో వేటు పడే అవకాశాలున్నాయి.