జోస్ బట్లర్
లండన్: కరోనా మహమ్మారి కోసం తనకు చిరస్మరణీయమైన చొక్కాను ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ వేలానికి పెట్టాడు. కరోనా కట్టడికి నిర్విరామంగా కృషిచేస్తోన్న వైద్య సంస్థలకు నిధులు అందించేందుకు... గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ గెలిచినపుడు ధరించిన జెర్సీని వేలం వేస్తున్నట్లు బట్లర్ ట్విట్టర్ వీడియో ద్వారా ప్రకటించాడు. తమ జట్టు సభ్యులందరి సంతకాలతో కూడిన ఈ జెర్సీని వేలం వేయడం ద్వారా లభించిన మొత్తాన్ని రాయల్ బ్రాంప్టన్, హ్యారీఫీల్డ్ హాస్పిటల్స్ చారిటీ కోసం వినియోగిస్తానని బట్లర్ తెలిపాడు. ‘కరోనా మహమ్మారి కట్టడికి వైద్యులు, నర్సులు, జాతీయ ఆరోగ్య సేవా సంస్థలు ఎంత తీవ్రంగా శ్రమిస్తున్నారో అందరికీ తెలుసు. రానున్న కాలంలో వారికి మన సహాయం మరింతగా అవసరం. గత వారం రాయల్ బ్రాంప్టన్, హ్యారీఫీల్డ్ ఆసుపత్రులు తమకు వైద్యపరికరాల అవసరముందని తెలిపాయి. వారికి సహాయం అందించేందుకు ప్రపంచకప్ ఫైనల్లో ధరించిన జెర్సీని వేలానికి ఉంచుతున్నా’ అని బట్లర్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment