Jersey shirt
-
ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే..
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఇంటర్ మియామి క్లబ్లో మంచి ముహూర్తంలో జాయిన్ అయినట్లున్నాడు. ఇప్పటివరకు ఇంటర్ మియామి క్లబ్ తరపున ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ మెస్సీ గోల్స్‌తో మెరిశాడు. అందులో రెండు మ్యాచ్‌ల్లో డబుల్ గోల్స్ కొట్టి అభిమానులను అలరించాడు. తాజాగా గురువారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) ఓర్లాండో సిటీ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్ మియామి 3-1తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఉరుములు, మెరుపుల కారణంగా మ్యాచ్ 95 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే మ్యాచ్ ఆలస్యమైనప్పటికి మెస్సీ మాత్రం గోల్ కొట్టడంలో పెద్దగా టైం తీసుకోలేదు. ఆట 7వ నిమిషంలోనే మెస్సీ తన జట్టుకు తొలి గోల్ అందించాడు. అయితే ఓర్లాండో సిటీ ఆట 11వ నిమిషంలో గోల్ కొట్టి సోర్కును సమం చేసింది. అక్కడి నుంచి తొలి హాఫ్ ముగిసేవరకు మరో గోల్ నమోదు కాలేదు. రెండో హాఫ్ మొదలైన కాసేపటికి ఆట 51వ నిమిషంలో జోసెఫ్ మార్టినేజ్ పెనాల్టీని గోల్‌గా మలిచాడు. ఇక ఆట 72వ నిమిషంలో మెస్సీ మరో గోల్ కొట్టి జట్టును 3-1తో స్పష్టమైన ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిర్ణీత సమయంలోగా ఓర్లాండో మరో గోల్ కొట్టలేకపోవడంతో ఇంటర్ మియామి విజయాన్ని నమోదు చేసింది. కాగా మెస్సీ రెండు గోల్స్ కొట్టిన సందర్భంలో మ్యాచ్‌కు హాజరైన అతని భార్య ఆంటోనెలా రోకుజో స్టాండ్స్‌లో సెలబ్రేట్ చేసుకోవడం వైరల్‌గా మారింది. జెర్సీ అమ్మకాల్లో దిగ్గజాలను అధిగమించిన మెస్సీ.. కాగా మెస్సీ మరొక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గోల్స్‌తో రికార్డులు కొట్టడమే కాదు తాజాగా మెస్సీకి చెందిన జెర్సీ అమ్మకాల్లోనూ రికార్డులను కొల్లగొట్టాడు. 24 గంటల వ్యవధిలో మెస్సీ ఇంటర్ మియామి జెర్సీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో జెర్సీ అమ్మకాల విషయంలో క్రిస్టియానో రొనాల్డో, టామ్ బ్రాడీ, ఎన్బీఏ దిగ్గజం లెబ్రన్ జేమ్స్‌లను మెస్సీ అధిగమించాడు. 2021లో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ తరపున, 2020లో టాంపా బే బుక్కానీర్స్లో టామ్ బ్రాడీ జాయిన్ అయిన సమయంలో.. 2018 లో ఎల్ఏ లేకర్స్ తరపున లెబ్రన్ జేమ్స్ జాయిన్ అయినప్పుడు వారి జెర్సీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. MESSI X ROBERT TAYLOR BANGERS ONLY 🤯🤯 Taylor puts Messi in with the chip to give us the early lead over Orlando City.#MIAvORL | 📺#MLSSeasonPass on @AppleTV pic.twitter.com/kvb8Lmcccj — Inter Miami CF (@InterMiamiCF) August 3, 2023 చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ 100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్ -
కోహ్లి క్రీడాస్పూర్తి.. వీడియో వైరల్
టీమిండియా స్టార్.. కింగ్ కోహ్లి అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. తన చర్యతో అభిమానులను ఆకట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా కోహ్లి తన జెర్సీని ఆస్ట్రేలియా ప్లేయర్లు ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ కేరీకి గిఫ్ట్ అందించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. ఆ తర్వాత కాసేపు వారిద్దరితో మాట్లాడి కెరీర్ పరంగా ఆల్ ది బెస్ట్ చెప్పి తన పెద్ద మనసును చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి కోహ్లి మాత్రం అహ్మదాబాద్ టెస్టు హీరోగా నిలిచాడు. కొంతకాలంగా టెస్టుల్లో సెంచరీ చేయడంలో విఫలమవుతూ వచ్చిన కోహ్లి ఆ కొరతను తీర్చుకోవడమే గాక తన బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. ఇక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఇరుజట్లు కలిపి నలుగురు బ్యాటర్లు సెంచరీలు బాదారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌట్ కాగా.. ఉస్మాన్ ఖవాజా 180, గ్రీన్ 114 సెంచరీలతో మెరిశారు. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి 186, శుబ్‌మన్ గిల్ 128 పరుగులు.. సెంచరీలతో కదం తొక్కారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 175 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ట్రెవిస్ హెడ్ 90 పరుగుల వద్ద ఔటయ్యి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మార్నస్ లబుషేన్ 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్‌లో 186 పరుగులు చేసిన కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. సిరీస్‌లో పోటాపోటీగా వికెట్లు తీసిన అశ్విన్, జడేజాలు సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును పంచుకున్నారు. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మార్చి 17 నుంచి మొదలుకానుంది. తొలి వన్డే ముంబై వేదికగా మార్చి 17న జరగనుంది. Virat Kohli presents his match jersey to Usman Khawaja and Alex Carey. Class bloke! pic.twitter.com/tr3ciu1az7 — Vignesh Bharadwaj (@VBharadwaj31) March 13, 2023 -
ధోని కూతురుకు మెస్సీ అరుదైన కానుక
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇటీవలే ఫిఫా వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ఆ అభిమానం మరింత రెట్టింపైంది. ఖతర్ వేదికగా జరిగిన సాకర్ సమరంలో ఎలాగైనా మెస్సీ కప్ గెలవాలని అర్జెంటీనా అభిమానులే కాదు విశ్వవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ బలంగా కోరుకున్నారు. అందుకు తగ్గట్టే మెస్సీ తన కలను నెరవేర్చుకోవడమే గాక అర్జెంటీనాకు ముచ్చటగా మూడోసారి ఫిఫా టైటిల్‌ను అందించాడు. మరి అలాంటి మెస్సీని ఆరాధించని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. తాజాగా ఆ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని కూడా ఉన్నాడు.క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ తనకెంతో ఇష్టమైన ఆట అంటూ ధోని గతంలోనూ చాలాసార్లు చెప్పాడు. క్రికెటర్ కాకపోయుంటే గోల్‌కీపర్ అయ్యేవాడినని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు ధోని. ఇక తండ్రిలాగే జీవాకు ఫుట్ బాల్ ఆటంటే చాలా ఇష్టం. అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ ఆటను తండ్రితో కలిసి చూస్తుంటుంది. ఈ క్రమంలోనే మెస్సీపై అభిమానం పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే మెస్సీ.. తన అభిమాని అయిన ధోని కూతురు జీవా ధోనికి గిఫ్ట్ పంపించాడు. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జీవాకు పంపించాడు. అభిమాన ఆటగాడి నుంచి అందిన కానుకను చూసుకుంటూ జీవా ధోని మురిసిపోయింది. ఆ జెర్సీ వేసుకుని తీసుకున్న ఫొటోను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. ఈ ఫొటోలో జెర్సీపై..'' పారా జివా(జీవా కోసం)'' అంటూ మెస్సీ చేసిన సంతకం కనిపిస్తోంది. View this post on Instagram A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) చదవండి: అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు.. -
టెస్టు క్రికెట్ రూల్ బ్రేక్ చేసిన టీమిండియా.. మార్పు గమనించారా!?
సంప్రదాయమైన టెస్టు మ్యాచ్‌లు ఆడేటప్పుడు ఏ జట్టైనా పూర్తి తెలుపు జెర్సీతోనే బరిలోకి దిగడం ఆనవాయితీ. అయితే తాజాగా టీమిండియా టెస్టు క్రికెట్ రూల్‌ను బ్రేక్ చేసింది. టెస్టుల్లో ఎప్పుడు తెల్ల జెర్సీతోనే ఆడిన టీమిండియా బంగ్లాదేశ్‌తో తొలిటెస్టులో మాత్రం సగం వైట్ జెర్సీతో(ముదురు గోదుమ రంగు) బరిలోకి దిగింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే భారత అభిమానులు ఈ విషయాన్ని గుర్తించి ట్విటర్ వేదికగా పంచుకున్నారు. అయితే బీసీసీఐ జెర్సీ రంగును ఎందుకు మార్చిందనే దానిపై క్లారిటీ లేదు. కానీ టీమిండియా ఫ్యాన్స్ మాత్రం.. టీమిండియాను పాత వైట్ జెర్సీల్లోనే చూడాలని ఉందని.. ఇలా రంగు మారిస్తే మిగతా జట్లకు.. మనకు తేడా కనిపిస్తుందని.. కొత్త జెర్సీ స్థానంలో పాతవాటినే తిరిగి తేవాలని డిమాండ్ చేయడం కొసమెరుపు. ఇక బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో అజేయంగా ఆడుతున్నాడు. పుజరా 90 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో రిషబ్ పంత్(46), శ్రేయాస్ అయ్యర్(82 నాటౌట్)తో కలిసి పుజారా మంచి భాగస్వామ్యాలు నిర్మించాడు. ముఖ్యంగా అయ్యర్, పుజారాలు కలిసి ఏదో వికెట్‌కు 149 పరుగులు జోడించారు. వీరిద్దరి ఇన్నింగ్స్‌తోనే టీమిండియా తొలిరోజు ఆట సవ్యంగా సాగింది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ మూడు వికెట్లు తీయగా.. మెహదీ హసన్ 2, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు. India's jersey has changed from pure white to off-white? 🤔 — Naman Agarwal (@CoverDrivenFor4) December 14, 2022 చదవండి: FIFA WC: సెమీ ఫైనల్.. ప్రాణ స్నేహితులు ప్రత్యర్థులైన వేళ IND Vs BAN: రాణించిన పుజారా, శ్రేయస్.. పర్వాలేదనిపించిన పంత్ -
మారడోనా, మెస్సీలను మించినోడు.. జెర్సీ నెంబర్-10 ఆ ఆటగాడిదే
ఫుట్‌బాల్‌లో జెర్సీ నెంబర్ 10కి యమా క్రేజ్ ఉంది. దిగ్గజం డీగో మారడోనా ఇదే నెంబర్ జెర్సీతో ఆడి అర్జెంటీనాను విశ్వ విజేతగా నిలిపాడు. అలా మారడోనా జెర్సీ నెంబర్ 10కి ఒక లీగసీని సెట్ చేసి పెట్టాడు. ఇప్పుడు ఆ లెగసీని తన శిష్యుడైన లియోనల్ మెస్సీ కంటిన్యూ చేస్తున్నాడు. అయితే జెర్సీ నెంబర్ 10కి అంత క్రేజ్ రావడానికి మారడోనా, మెస్సీలు కాదు.. వీళ్లకంటే ముందే ఆ జెర్సీని ధరించిన మరో అర్జెంటీనా ఆటగాడు ఉన్నాడు. అతనే మారియో కెంపెస్. 1978లో అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌కప్ విజేతగా నిలవడంలో కెంపెస్ పాత్ర కీలకం. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. మెస్సీకి ఇదే చివరి వరల్డ్‌కప్ అని అంతా భావిస్తున్న తరుణంలో అర్జెంటీనాను విజేతగా నిలిపితే చూడాలనుకుంటున్నారు. అయితే మారడోనా, మెస్సీ కంటే ముందే అదే అర్జెంటీనా నుంచి ఒక ఆటగాడు జెర్సీ నెంబర్ 10ని ధరించాడు. ఆ జెర్సీని ధరించడమే కాదు.. అర్జెంటీనాను తొలిసారి ఫిఫా వరల్డ్ చాంపియన్స్‌గా(1978) నిలిపాడు. అతనే మారియో కెంపెస్. 1978 ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచిందంటే మారియో కెంపెస్ ప్రధాన కారణం. ఆ టోర్నీలో మొత్తం ఆరు గోల్స్ చేసిన మారియో టాప్ స్కోరర్‌గా నిలిచి గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్ అవార్డులను దక్కించుకున్నాడు. ఫుట్‌బాల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా మారియో కెంపెస్ నిలిచాడు. ఇక మారియో కెంపెస్ చేసిన ఆరు గోల్స్‌లో అన్ని జంట గోల్స్ కావడం విశేషం. వీటిలో కీలకమైన సెకండ్ రౌండ్, ఫైనల్స్ మ్యాచ్‌లు ఉన్నాయి. అప్పటి వరల్డ్‌కప్‌లో నాకౌట్ దశ లేదు. తొలి రౌండ్, రెండో రౌండ్.. ఆ తర్వాత ఫైనల్ నిర్వహించారు. ఇక రెండో రౌండ్లో గెలిచి టాప్‌లో నిలిచిన రెండు జట్లు నేరుగా ఫైనల్లో అడుగుపెడతాయి. తొలి రౌండ్లో మారియో కెంపెస్ అంతగా ప్రభావం చూపలేదు. అయితే రెండో రౌండ్ నుంచి మాత్రం అతని మాయాజాలం మొదలైంది. రెండో రౌండ్లో పోలాండ్, పెరూతో మ్యాచ్‌ల్లో నాలుగు గోల్స్ చేసిన మారియో జట్టు ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక నెదర్లాండ్స్‌తో జరిగిన ఫైనల్లోనూ మారియో కెంపెస్ మరోసారి మెరిశాడు. ఆట 38వ నిమిషంలో డచ్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ 12 మీటర్ల దూరం నుంచి అద్బుత గోల్ సాధించాడు. ఆ తర్వాత ఆట అదనపు సమయంలో 105 నిమిషంలో మరో గోల్ చూసి జట్టు స్కోరును రెండుకు పెంచాడు. మరోవైపు నెదర్లాండ్స్ ఒక గోల్‌కే పరిమితం కావడంతో అర్జెంటీనా 2-1 తేడాతో మ్యాచ్‌ను గెలిచి తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. అలా మారియో కెంపెస్ పేరు మార్మోగిపోయింది. అప్పటినుంచే జెర్సీ నెంబర్ 10కి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఇదే జెర్సీని మారడోనా ధరించడం.. 1986లో అర్జెంటీనాను విజేతగా నిలపడం జరిగిపోయాయి. ఇక ఇప్పుడు వీరిద్దరి ట్రెండ్‌ను కొనసాగిసున్న మెస్సీ తన ప్రపంచకప్ కలను తీర్చుకుంటాడో లేదో చూడాలి. ఇక అర్జెంటీనా రౌండ్ ఆఫ్-16లో డిసెంబర్ 4న ఆస్ట్రేలియాతో తలపడనుంది. -
వేలానికి మారడోనా ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ జెర్సీ
లండన్: దివంగత అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా కెరీర్లో ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ ఎంత ప్రసిద్ధికెక్కిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1986 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మారడోనా చేసిన ఈ గోల్ ఫుట్‌బాల్ ప్రపంచంలో మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ గోల్ మాత్రమే కాకుండా ఆ మ్యాచ్‌లో మారడోనా ధరించిన జెర్సీ, షూ పట్ల అందరికీ ప్రత్యేక ఆసక్తి. ఇప్పుడు ఆ జెర్సీ వేలానికి రానుంది. ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ స్టీవ్ హోడ్జ్ దగ్గరున్న జెర్సీని వేలంలో 20 లక్షల డాలర్లకు (రూ. 14.79 కోట్లు) విక్రయించనున్నట్లు అమెరికా క్రీడా వస్తువుల సేకరణ నిపుణుడు డేవిడ్ అమర్మన్ తెలిపాడు. ‘హ్యాండ్ ఆఫ్ గాడ్ జెర్సీకి విలువ కట్టడం చాలా కష్టం. కానీ దాని యజమాని వేలంలో 20 లక్షల డాలర్లు ఆశిస్తున్నారు. ధర ఎక్కువే. కానీ అధిక సంపద ఉన్న వ్యక్తి ఆ జెర్సీని ఎందుకు వద్దనుకుంటారు. ఇది అమ్ముడయ్యే అవకాశం ఉంది’ అని డేవిడ్ అన్నారు. మారడోనా మరణానంతరం ఈ జెర్సీని ప్రస్తుతం మాంచెస్టర్‌లోని ఇంగ్లండ్ జాతీయ ఫుట్‌బాల్ మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం ఉంచారు. -
వేలానికి బట్లర్ ప్రపంచకప్ జెర్సీ
లండన్: కరోనా మహమ్మారి కోసం తనకు చిరస్మరణీయమైన చొక్కాను ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ వేలానికి పెట్టాడు. కరోనా కట్టడికి నిర్విరామంగా కృషిచేస్తోన్న వైద్య సంస్థలకు నిధులు అందించేందుకు... గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ గెలిచినపుడు ధరించిన జెర్సీని వేలం వేస్తున్నట్లు బట్లర్ ట్విట్టర్ వీడియో ద్వారా ప్రకటించాడు. తమ జట్టు సభ్యులందరి సంతకాలతో కూడిన ఈ జెర్సీని వేలం వేయడం ద్వారా లభించిన మొత్తాన్ని రాయల్ బ్రాంప్టన్, హ్యారీఫీల్డ్ హాస్పిటల్స్ చారిటీ కోసం వినియోగిస్తానని బట్లర్ తెలిపాడు. ‘కరోనా మహమ్మారి కట్టడికి వైద్యులు, నర్సులు, జాతీయ ఆరోగ్య సేవా సంస్థలు ఎంత తీవ్రంగా శ్రమిస్తున్నారో అందరికీ తెలుసు. రానున్న కాలంలో వారికి మన సహాయం మరింతగా అవసరం. గత వారం రాయల్ బ్రాంప్టన్, హ్యారీఫీల్డ్ ఆసుపత్రులు తమకు వైద్యపరికరాల అవసరముందని తెలిపాయి. వారికి సహాయం అందించేందుకు ప్రపంచకప్ ఫైనల్లో ధరించిన జెర్సీని వేలానికి ఉంచుతున్నా’ అని బట్లర్ వివరించాడు. -
జెర్సీ మారింది... బోణీ కొట్టింది
అహ్మదాబాద్: మారిన జెర్సీ రంగు తెలుగు టైటాన్స్ జట్టుకు అదృష్టాన్ని తీసుకొచ్చింది. ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో అందని ద్రాక్షలా ఉన్న గెలుపు ఎట్టకేలకు తెలుగు టైటాన్స్‌ను పలకరించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30–24తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించి ఈ లీగ్‌లో తొలి విజయాన్ని అందుకుంది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్, విశాల్ భరద్వాజ్‌లు చెరో ఏడు పాయింట్లతో జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. మ్యాచ్ మొత్తంలో 16 టాకిల్ పాయింట్లు, 11 రైడ్ పాయింట్లతో ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసిన తెలుగు జట్టు గెలుపు బోణీ కొట్టింది. సీజన్లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ పసుపు రంగు జెర్సీతో బరిలో దిగిన టైటాన్స్... గుజరాత్‌తో మ్యాచ్‌లో మాత్రం నల్ల రంగు జెర్సీతో ఆడింది. కొత్త జెర్సీ రంగు ఏం అదృష్టం తెచ్చిందో ఏమో కానీ.. ప్రత్యర్థి జట్టును ఆట ఆరంభమైన ఏడో నిమిషంలోనే ఆలౌట్ చేసింది. మొదటి అర్ధ భాగంలో సిద్ధార్థ్ రైడింగ్‌లో చెలరేగితే... రెండో అర్ధ భాగంలో విశాల్ భరద్వాజ్ తన పట్టుతో ప్రత్యర్థి రైడర్లను పట్టేశాడు. దీంతో గుజరాత్ సొంత మైదానంలో వరుసగా రెండో ఓటమిని నమోదు చేసింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 30–33తో హరియాణా స్టీలర్స్ చేతిలో ఓడింది. హరియాణా రైడర్ వికాస్ ఖండోలా 12 పాయింట్లతో రాణించాడు. నేటి మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్; యూపీ యోధతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
ఉతికి జాడించేశారు!
ప్రపంచం ఉతికి, జాడించడంలో ఆడవాళ్ల తర్వాతే ఎవరైనా. ఆ సంగతి ఇండోనేషియాలోని ‘శాల్వో స్పోర్ట్’ కంపెనీ యజమానులకు బాగా తెలిసివచ్చినట్లుంది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా... ‘‘అమ్మ తల్లులూ, మమ్మల్ని అపార్థం చేసుకున్నట్లున్నారు! క్షమించి వదిలేయండి’’ అని లెంపలేసుకున్నారు. అంతగా అక్కడి ఆడవాళ్లకు కోపం రావడానికి కారణం ఏమిటిటంటే... స్థానికంగా పేరున్న ఒక ఫ్లయిట్ సాకర్ క్లబ్బు కోసం శాల్వో గత నెలలో ఒక జెర్సీ షర్ట్‌ను డిజైన్ చేసి ఇచ్చింది. షర్ట్ లోపల దానిని ఎలా ఉతకాలో సూచనలు కూడా ఇచ్చింది. ఆ సూచనలు కూడా ఎన్నో లేవు. సింపుల్‌గా రెండంటే రెండే ఉన్నాయి. ఒకటి: ఈ జెర్సీని మీ ఆవిడతో ఉతికించండి. రెండు: అది ఆవిడ పని. ‘బట్టలు ఉతకడం మహిళల పనే పని’ అర్థం వచ్చేలా ఉన్న ఈ సూచనల్ని ఎవరో ఫొటో తీసి సోషల్ నెట్వర్కింగ్ సైట్‌కు ఎక్కించారు. అలా అలా అది నెట్ అంతా వ్యాపించింది. దీంతో ఇండోనేషియా మహిళల్లో కదలిక వచ్చి ‘శాల్వో’ కంపెనీ తీరుపై విరుచుకుపడ్డారు. అప్పుడు గానీ శాల్వోకు తన తప్పేమిటో అర్థం కాలేదు. ‘‘ఈ సూచనలను మేము పురుషులను ఉద్దేశించి మాత్రమే ఇచ్చాం. ‘తెలియని పని చేసి షర్ట్‌ను నాశనం చేయకండి. ఆడవాళ్లకయితే ఉతకడంలో మెళకువలు తెలిసుంటాయి కనుక వారికే ఇవ్వండి’ అని చెప్పాలనుకున్న మా ప్రయత్నం ఇలా అపార్థానికి దారి తీసినందుకు బాధపడుతున్నాం’’అని ఒక ప్రకటన విడుదల చేసి, సారీ చెప్పింది.