MS Dhoni’s daughter Ziva gets a signed jersey from Lionel Messi - Sakshi
Sakshi News home page

Lionel Messi: ధోని కూతురుకు మెస్సీ అరుదైన కానుక

Dec 28 2022 4:16 PM | Updated on Dec 28 2022 4:40 PM

MS Dhoni Daughter Ziva Gets Special Jersey From Lionel Messi Viral - Sakshi

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీకి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇటీవలే ఫిఫా వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత ఆ అభిమానం మరింత రెట్టింపైంది. ఖతర్‌ వేదికగా జరిగిన సాకర్‌ సమరంలో ఎలాగైనా మెస్సీ కప్‌ గెలవాలని అర్జెంటీనా అభిమానులే కాదు విశ్వవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్‌ బలంగా కోరుకున్నారు. అందుకు తగ్గట్టే మెస్సీ తన కలను నెరవేర్చుకోవడమే గాక అర్జెంటీనాకు ముచ్చటగా మూడోసారి ఫిఫా టైటిల్‌ను అందించాడు. మరి అలాంటి మెస్సీని ఆరాధించని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి.

తాజాగా ఆ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని కూడా ఉన్నాడు.క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ తనకెంతో ఇష్టమైన ఆట అంటూ ధోని గతంలోనూ చాలాసార్లు చెప్పాడు. క్రికెటర్‌ కాకపోయుంటే గోల్‌కీపర్‌ అయ్యేవాడినని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు ధోని. ఇక తండ్రిలాగే జీవాకు ఫుట్ బాల్ ఆటంటే చాలా ఇష్టం.

అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ ఆటను తండ్రితో కలిసి చూస్తుంటుంది. ఈ క్రమంలోనే మెస్సీపై అభిమానం పెంచుకుంది.  ఈ నేపథ్యంలోనే  మెస్సీ.. తన అభిమాని అయిన ధోని కూతురు జీవా ధోనికి గిఫ్ట్ పంపించాడు. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జీవాకు పంపించాడు. అభిమాన ఆటగాడి నుంచి అందిన కానుకను చూసుకుంటూ జీవా ధోని మురిసిపోయింది. ఆ జెర్సీ వేసుకుని తీసుకున్న ఫొటోను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. ఈ ఫొటోలో జెర్సీపై..'' పారా జివా(జీవా కోసం)'' అంటూ మెస్సీ చేసిన సంతకం కనిపిస్తోంది.

చదవండి: అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement