FIFA World Cup 2022
-
అది మెస్సీ క్రేజ్.. జెర్సీల విలువ 64 కోట్ల పై మాటే..!
ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవ్యాప్తంగా ఈ స్టార్ ఫుట్‌బాలర్‌కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మెస్సీ ప్రపంచంలో ఏ మూలలో ఫుట్‌బాల్ ఆడినా ఇసకేస్తే రాలనంత మంది జనాలు స్టేడియాలకు తరలి వస్తారు. అతను ధరించే బ్రాండ్లు, అతని ఎండార్స్మెంట్ల రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. తాజాగా మెస్సీ ధరించిన జెర్సీలను ఆన్లైన్లో వేలానికి పెట్టగా కళ్లు బైర్లు కమ్మే మొత్తానికి అవి అమ్ముడుపోయాయి. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను న్యూయార్క్‌లో ఆన్లైన్ వేలానికి పెట్టగా.. ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 78 లక్షల డాలర్లకు (రూ. 64 కోట్ల 86 లక్షలు) ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో ఓ వ్యక్తి ధరించిన జెర్సీలు అమ్ముడుపోవడం క్రీడల చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యుంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి, మూడోసారి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో మెస్సీ రెండు గోల్స్ సాధించి అర్జెంటీనాను ఒంటిచేత్తో గెలిపించాడు. -
కోల్‌కతాలో పర్యటిస్తున్న అర్జెంటీనా స్టార్ గోల్ కీపర్.. నోరూరించే వంటకాలు రెడీ
అర్జెంటీనా స్టార్ గోల్ కీపర్, ఫిపా ప్రపంచకప్-2022 హీరో ఎమిలియానో మార్టినెజ్ కోల్‌కతా పర్యటనలో బీజీబీజీగా ఉన్నాడు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం కోల్‌కతాకు వచ్చిన మార్టినెజ్.. పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. జూలై 4న కోల్‌కతాలోని మోహన్ బగాన్ సూపర్‌జెయింట్స్ స్టేడియంను మార్టినెజ్ సందర్శించనున్నారు. అదే విధంగా ప్రస్తుత ఐఎస్ఎల్ ఛాంపియన్స్ మోహన్ బగాన్ సూపర్‌జెయింట్స్ జట్టును కూడా మార్టినెజ్ కలవనున్నాడు. అంతేకాకుండా క్రికెట్, ఫుట్‌బాల్ రంగాలకు చెందిన పలువురుతో మార్టినెజ్ ఇంట్రాక్ట్ కానున్నాడు. జాలై 5తో ఎమిలియానో టూర్ ముగియనుంది. ఇక అతడి కోసం నూరూరించే బెంగాలీ వంటకాలను బెంగాల్ స్పోర్ట్స్ ప్రమోటర్ సతద్రు దత్తా సిద్దం చేశారు. మార్టినెజ్ కోసం మెనూ ఎంపిక చేసే బాధ్యతను ప్రముఖ బెంగాలీ రెస్టారెంట్ సప్తపదికి అప్పగించారు. అందులో బెంగాళీ ప్రసిద్ద వంటకాలు కీమా మటర్ టార్ట్, ఇలిష్ పాటూరి,కంచ లోంక ముర్గి వంటివి ఉన్నాయి. చదవండి: స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం.. బోర్డుపై అవినీతి ఆరోపణలు -
Lionel Messi: 'వొడువని ముచ్చట'.. అరుదైన గౌరవం
మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జట్టు ఫిఫా వరల్డ్‌కప్ సాధించి ఇప్పటికి మూడు నెలలు కావొస్తుంది. కానీ ఇంకా అది ఒడవని ముచ్చటలాగానే కనిపిస్తుంది. ఎందుకంటే మూడు నెలలైనా ఇంకా మెస్సీ నామస్మరణ మారుమోగుతూనే ఉంది. వరల్డ్‌కప్ సాధించినప్పటి నుంచి మెస్సీకి ఏదో ఒక చోట గౌరవ సత్కారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సౌత్ అమెరికన్ ఫుట్‌బాల్ గవర్నింగ్ కౌన్సిల్ మెస్సీకి అరుదైన గౌరవంతో సత్కరించింది. సౌత్ అమెరికన్ ఫుట్‌బాల్ హెడ్‌క్వార్టర్స్ అయిన కాన్‌మిబోల్‌లోని మ్యూజియంలో అతని మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందించినందుకు గానూ ఈ గౌరవం ఇచ్చినట్లు గవర్నింగ్ కౌన్సిల్ పేర్కొంది. కాగా ఫుట్‌బాల్‌లో దిగ్గజాలుగా పేరు పొందిన డీగో మారడోనా, పీలే తర్వాత కాన్‌మిబోల్ మ్యూజియంలో ఈ గౌరవం అందుకున్న మూడో ఆటగాడిగా మెస్సీ రికార్డుకెక్కాడు. ఇక గతేడాది డిసెంబర్లో ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించిన అర్జెంటీనా 36 ఏళ్ల తర్వాత మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. టోర్నీ ఆద్యంతం అంతా తానై నడిపించిన మెస్సీ ఏడు గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇటీవలే బ్యూనస్ ఎయిర్స్లో పనామాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 2-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్ చేశాడు. ఇది మెస్సీకి 800వ గోల్ కావడం విశేషం. ఇక అర్జెంటీనా తరపున 99వ గోల్స్ సాధించిన మెస్సీ వందో గోల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. Statue for the best player in history. #Messi 🐐🇦🇷pic.twitter.com/BrW2XqShh8 — Leo #Messi 🐐 (@LeoCuccittini_) March 27, 2023 చదవండి: దుమ్మురేపిన రొనాల్డో.. పోర్చుగల్ ఖాతాలో రెండో విజయం -
మెస్సీనా మజాకా.. జట్టు కోసం గోల్డ్-ఐఫోన్స్
మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జట్టు ఫిఫా వరల్డ్‌కప్ సాధించి దాదాపు మూడు నెలలు కావొస్తుంది. అయితే ఇప్పటికి ఫుట్‌బాల్ అభిమానులు మెస్సీ మాయ నుంచి బయటికి రాలేకపోతున్నారు. అన్నీ తానై నడిపించిన మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ అందుకోవాలనే తన కలతో పాటు 36 ఏళ్ల అర్జెంటీనా నిరీక్షణకు తెరదించాడు. అందుకే ఫిఫా చరిత్రలోనే అర్జెంటీనా, ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్ అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్‌గా నిలిచిపోయింది. ఫైనల్లో గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ అవార్డు సొంతం చేసుకున్న మెస్సీ ఇప్పటికే ఫిఫా మెన్స్ అత్యుత్తమ ఆటగాడిగా అవార్డు కూడా అందుకున్నాడు. తాజాగా మెస్సీ చేసిన ఒక పని అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదేంటో తెలుసా.. ఫిఫా వరల్డ్‌కప్ అందుకున్న అర్జెంటీనా టీమ్, స్టాఫ్ కోసం మెస్సీ రూ. 1.73 కోట్ల విలువైన 35 గోల్డ్ ఐఫోన్లను ఆర్డర్ చేయడం విశేషం. స్పెషల్‌గా తయారయిన ఈ గోల్డ్ ఐఫోన్లపై ఆటగాడి పేర్లు, జెర్సీ నెంబర్లు, అర్జెంటీనా లోగోను ముద్రించారు. ఈ ఐఫోన్లు వారాంతంలో మెస్సీ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నాయని సమాచారం. ఫిఫా వరల్డ్ కప్ అర్జెంటీనా సొంతం కావడంతో ఈ వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ఆటగాళ్లకు ప్రత్యేకమైన బహుమతులు అందించాలని మెస్సీ భావిస్తున్నాడు. ఎంటర్ప్రెన్యూర్ బన్ లైన్స్‌తో కలిసి మెస్సీ డివైజ్‌ల డిజైన్‌ను రూపొందించినట్లు ది సన్ పత్రిక కథనం ప్రచురించింది. టీం సభ్యులకు, సపోర్ట్ స్టాఫ్‌కు మెస్సీ గోల్డ్ ఐఫోన్‌గా ఐఫోన్-14ను ఎంచుకున్నారు. ఫోన్ డిజైన్‌తో పాటు ఐఫోన్లను మెస్సీ రిసీవ్ చేసుకున్న ఫొటోను ఐ-డిజైన్ గోల్డ్ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతా వెల్లడించింది. ఫిఫా వరల్డ్‌కప్ గెలుపొందిన మెస్సీ బృందంతో పాటు స్టాఫ్ కోసం 35 గోల్డ్ ఐఫోన్లను డెలివరీ చేయడం గౌరవంగా భావిస్తున్నామని క్యాప్షన్ జత చేసింది. ఫిఫా ప్రపంచకప్ నెగ్గిన అర్జెంటీనా జట్టు: ఎమి మార్టినెజ్, ఫ్రాంకో అర్మానీ, గెరోనిమో రుల్లి, మార్కోస్ అకునా, జువాన్ ఫోయ్త్, లిసాండ్రో మార్టినెజ్, నికోలస్ టాగ్లియాఫికో, క్రిస్టియన్ రొమెరో, నికోలస్ ఒటామెండి, నహుయెల్ మోలినా, గొంజాలో మోంటియెల్, లెగో జర్మన్ పర్జెల్, ఆంరో జర్మన్ పర్జెల్, రోడ్రి పెజ్జెల్లా, డి పాల్, అలెక్సిస్ మాక్ అలిస్టర్, ఎంజో ఫెర్నాండెజ్, ఎక్సిక్వియెల్ పలాసియోస్, గైడో రోడ్రిగ్జ్, లియోనెల్ మెస్సీ, లౌటరో మార్టినెజ్, పాలో డైబాలా, ఏంజెల్ కొరియా, జూలియన్ అల్వారెజ్, థియాగో అల్మడ, అలెజాండ్రో గోమెజ్ View this post on Instagram A post shared by 𝗜𝗗𝗘𝗦𝗜𝗚𝗡 𝗚𝗢𝗟𝗗 (@idesigngold) View this post on Instagram A post shared by 𝘽𝙚𝙣𝙟𝙖𝙢𝙞𝙣 𝙇𝙮𝙤𝙣𝙨 (@benlyons1111) చదవండి: అదే రెండున్నర రోజులు.. సీన్ మాత్రం రివర్స్! స్టన్నింగ్ క్యాచ్.. అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్ -
ప్రధాని మోదీకి మెస్సీ జెర్సీ కానుకగా..
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ జెర్సీ గిఫ్ట్‌గా రావడం ఆసక్తి కలిగించింది. అర్జెంటీనాకు చెందిన వైపీఎఫ్ అనే పెట్రోలియన్ అండ్ గ్యాస్ కార్పోరేషన్ సంస్థ బెంగళూరులో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వారోత్సవాలకు హాజరయ్యింది. సంస్థ అధ్యక్షుడు పాబ్లో గొంజాలెజ్ ప్రధాని మోదీకి మంగళవారం మెస్సీ జెర్సీని అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా ఫైనల్లో ఫ్రాన్స్‌ను షూటౌట్లో 4-2తో మట్టికరిపించి జగజ్జేతగా అవతరించింది. మారడోనా తర్వాత దిగ్గజ ఆటగాడిగా పేరు పొందిన మెస్సీ ఫిపా వరల్డ్‌కప్‌ను అందుకోవాలన్న తన కలను సాకారం చేసుకోవడంతో పాటు అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు మెస్సీ ఘనతను పొగడ్తలతో ముంచెత్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెస్సీని ప్రశంసించిన జాబితాలో ఉన్నారు. -
'అలా ప్రవర్తించడం తప్పే.. నేను చేసింది నాకే నచ్చలేదు'
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన కెరీర్లో లోటుగా ఉన్న ఫిఫా వరల్డ్‌కప్‌ను గతేడాది అందుకున్న సంగతి తెలిసిందే. నాలుగుసార్లు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందుకోవడంలో విఫలమైన మెస్సీ ఐదో ప్రయత్నంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. జట్టును అంతా తానై నడిపించిన మెస్సీ.. కీలకమైన ఫైనల్లో ఫ్రాన్స్‌పై షూటౌట్ ద్వారా విజేతగా నిలిపాడు. ఫైనల్లో మూడు గోల్స్ చేసి విజయంలో కీలకపాత్ర పోషించిన మెస్సీ టోర్నీలో మొత్తంగా ఏడు గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ అవార్డును గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ ముగిసిన 45రోజులు కావొస్తున్న వేళ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌లో జరిగిన ఒక సంఘటనపై స్పందించాడు. అదేంటంటే.. నెదర్లాండ్స్‌తో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ సందర్భంగా డచ్ బాస్ లూయిస్ వాన్గాల్తో పాటు స్ట్రైకర్ వౌట్ వెగ్రోస్ట్లను హేళన చేస్తున్నట్లుగా తన రెండు చేతులను చెవుల మధ్య పెట్టి కోపంగా చూస్తూ ఫోజివ్వడం సంచలనం కలిగించింది. సౌమ్య హృదయడనుకున్న మెస్సీ నుంచి ఇలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుందని ఎవరు ఊహించలేదు. అందుకే మెస్సీని కొంతమంది తప్పుబట్టారు. అప్పుడే దీనిపై స్పందించిన మెస్సీ..''గేమ్‌లో భాగంగా కంట్రోల్ తప్పాను.. ఆ సమయంలో అలా వచ్చేసింది'' అంటూ వివరణ ఇచ్చాడు. తాజాగా మరోసారి ఇదే అంశంపై స్పందిస్తూ మరింత క్లారిటీ ఇచ్చాడు. ''నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అలా ప్రవర్తించడం తప్పే. నేను చేసింది నాకే నచ్చలేదు. అయితే దానిని మనసులో పెట్టుకొని ముందుకెళ్లడం నాకు సాధ్యం కాదు. అందుకే ఆరోజే ఏదో అనుకోకుండా జరిగిందని వివరణ ఇచ్చకున్నాడు. మ్యాచ్ అన్నాకా హైటెన్షన్ ఉండడం సహాజం. ఆ టెన్షన్లో ఒక్కోసారి మనం సహనం కోల్పోతాం. నాకు కూడా అదే జరిగింది. ఇక నేను అందుకున్న ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని దిగ్గజం మారడోనా చెంతకు చేర్చాను'' అంటూ వెల్లడించాడు. Lionel Messi on his celebration vs. Netherlands: "It came out naturally. My team mates told me what van Gaal said before the match. I don't like to leave that image, but it just came out. There was a lot of nervousness." Via @urbanaplayfm. 🇦🇷 pic.twitter.com/DT2w3sAo1D — Roy Nemer (@RoyNemer) January 30, 2023 చదవండి: విషాదం: ప్రపంచ ఛాంపియన్.. మంచు కింద సజీవ సమాధి -
జియో సంచలనం.. మొన్న సౌతాఫ్రికా లీగ్, ఇప్పుడు ఐపీఎల్! ఫ్రీ?!
FIFA World Cup 2022- SA20 2023- IPL 2023:ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త! ఐపీఎల్-2023 సీజన్ మ్యాచ్‌లను ఎలాంటి ప్రత్యేకమైన ఫీజు లేకుండానే డిజిటల్ మాధ్యమంలో చూసే అవకాశం రానుంది. ఇందుకు సంబంధించి రిలయన్స్ గ్రూపు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్-18 రూ. 23, 758 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జియోసినిమా యాప్‌లో ఫ్రీగా మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిఫా, సౌతాఫ్రికా లీగ్ ఇటీవల ముగిసిన సాకర్ మెగా టోర్నీ ఫిఫా వరల్డ్‌కప్-2022ను ఇప్పటికే జియో సినియా యాప్‌లో విజయవంతంగా ప్రసారం చేశారు. టీవీ ఛానెళ్లు స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్18 హెచ్డీలో ప్రేక్షకులు ఈ ఫుట్‌బాల్ సమరాన్ని వీక్షించగా.. డిజిటల్ యూజర్లకు జియో సినిమాలో ఈ వెసలుబాటు దక్కింది. మరోవైపు.. జనవరి 10న మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్ మ్యాచ్‌లను జియో సినిమాలో ఇప్పటికే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఇదే తరహాలో ఐపీఎల్-2023ని కూడా జియో సినిమా యాప్‌లో ప్రసారం చేసేందుకు వయాకామ్ ప్లాన్ చేస్తున్నట్లు ది హిందూ బిజినెస్‌లైన్ కథనం పేర్కొంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఐపీఎల్ మ్యాచ్‌లను డిజిటల్ మీడియాలో ఫ్రీగా ప్రసారం చేసిన తొలి సంస్థగా రిలయన్స్ మరో సంచలనానికి నాంది పలికినట్లవుతుంది. అంతేగాక.. టీవీ ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్ గ్రూప్‌నకు భారీ షాకిచ్చినట్లవుతుంది. 6️⃣ teams 3️⃣3️⃣ matches ♾️ entertainment Enjoy the thrilling 🏏 season as #SA20 is HERE 💥@sa20_league action from Jan 10 to Feb 11 👉🏻 LIVE on #JioCinema, #Sports18 & @colorstvtamil 📺📲#SA20League #SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/Jo3FkSJysw — JioCinema (@JioCinema) January 12, 2023 -
Lionel Messi: తగిన గౌరవం.. రూమ్‌నే మ్యూజియంగా
ఫిఫా వరల్డ్‌కప్ కోసం ఖతార్‌లో మెస్సీ బస చేసిన హోటల్ రూమ్‌ను ఓ మ్యూజియంగా మార్చాలని ఖతార్ యూనివర్సిటీ నిర్ణయించడం ఆసక్తి రేపింది. దోహాలో మెస్సీతోపాటు అర్జెంటీనా స్ట్రైకర్ సెర్గియో ఆగెరో ఒకే హోటల్ రూమ్‌లో ఉన్నారు. మెస్సీ గౌరవానికి సూచకంగా ఇక నుంచి ఆ రూమ్‌ను ఎవరికీ ఇవ్వకూడదని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో మెస్సీకి సంబంధించిన వస్తువులతో ఓ చిన్న మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఒక న్యూస్ ఏజెన్సీకి వెల్లడించారు. ఈ మ్యూజియాన్ని విద్యార్థులు, టూరిస్టులు సందర్శించే అవకాశం కల్పించారు. "అర్జెంటీనా టీమ్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ బస చేసిన హోటల్ రూమ్‌ను అలాగే ఉంచుతాం. ఈ రూమ్‌కు కేవలం సందర్శకులకు మాత్రమే అవకాశం కల్పిస్తాం. ఆ హోటల్ రూమ్ ఇక భవిష్యత్తులో మరెవరికీ కేటాయించం. మెస్సీకి చెందిన వస్తువులు విద్యార్థులు, భవిష్యత్తు తరాలకు ఓ పాఠంగా నిలుస్తాయి. అతడు వరల్డ్‌కప్ సందర్భంగా సాధించిన ఘనతలేంటో వారికి తెలుస్తాయి" అని ఖతార్ యూనివర్సిటీ డైరెక్టర్ హిత్మి అల్ హిత్మి చెప్పారు. ఖతర్ వేదికగా జరిగిన ఫిపా వరల్డ్‌కప్ ముగిసి దాదాపు పది రోజులు కావొస్తోంది. డిసెంబర్ 18న జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తన 17 ఏళ్ల కలను నెరవేర్చుకోవడంతో పాటు ముచ్చటగా మూడోసారి ఫిఫా టైటిల్‌ను అందించాడు. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మెస్సీకి చివరిదని అంతా భావించారు. అయితే అర్జెంటీనా విజేతగా నిలిచిన తర్వాత మనుసు మార్చుకున్న మెస్సీ కొంతకాలం కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. అయితే అర్జెంటీనా మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. మెస్సీ సేనకు ఘనస్వాగతం లభించింది. ఒపెన్ టాప్ బస్సులో రాజధాని బ్రూనస్ ఎయిర్స్ వీధుల్లో తిరగాలని ప్రయత్నించినప్పటికి ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో ఆటగాళ్లను ప్రత్యేక హెలికాప్టర్లో తమ స్వస్థలాలకు తరలించారు. మారడోనా లిగసీని కంటిన్యూ చేస్తూ మళ్లీ 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు కప్ అందించిన మెస్సీ హీరోగా మారిపోయాడు. Here's a quick tour of La Albiceleste's base camp at Qatar University! The room where the Argentinian captain, Lionel Messi, stayed in during the World Cup will also be turned into a mini museum soon!#Qatar #ARG #Argentina #Qatar2022 #FIFAWorldCup #LaAlbiceleste #LionelMessi pic.twitter.com/0UsdkBvcdX — The Peninsula Qatar (@PeninsulaQatar) December 27, 2022 చదవండి: పది రోజులైనా కిక్కు దిగలేదు.. చుట్టుముట్టేశారు -
పది రోజులైనా కిక్కు దిగలేదు.. చుట్టుముట్టేశారు
ఖతర్ వేదికగా ఫిపా వరల్డ్‌కప్ ముగిసి దాదాపు పది రోజులు కావొస్తోంది. డిసెంబర్ 18న జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తన 17 ఏళ్ల కలను నెరవేర్చుకోవడంతో పాటు ముచ్చటగా మూడోసారి ఫిఫా టైటిల్‌ను అందించాడు. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మెస్సీకి చివరిదని అంతా భావించారు. అయితే అర్జెంటీనా విజేతగా నిలిచిన తర్వాత మనుసు మార్చుకున్న మెస్సీ కొంతకాలం కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. అయితే అర్జెంటీనా మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. మెస్సీ సేనకు ఘనస్వాగతం లభించింది. ఒపెన్ టాప్ బస్సులో రాజధాని బ్రూనస్ ఎయిర్స్ వీధుల్లో తిరగాలని ప్రయత్నించినప్పటికి ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో ఆటగాళ్లను ప్రత్యేక హెలికాప్టర్లో తమ స్వస్థలాలకు తరలించారు. మారడోనా లిగసీని కంటిన్యూ చేస్తూ మళ్లీ 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు కప్ అందించిన మెస్సీ హీరోగా మారిపోయాడు. అయితే పది రోజులయినా అతనిపై మోజు తగ్గలేదునుకుంటా అభిమానులకు. తాజాగా మెస్సీ తన కోడలు 15వ పుట్టినరోజు వేడుకలకని తన హోమ్టౌన్ నుంచి బయలుదేరాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మెస్సీని చుట్టుముట్టారు. దాదాపు అరగంట పాటు మెస్సీ కారును చుట్టుముట్టిన అభిమానులు అతనితో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే మెస్సీ కూడా వారితో దురుసుగా ప్రవర్తించకుండా కూల్‌గా సర్దిచెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మెస్సీ పారిస్ సెయింట్ జెర్మెన్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే వారం పీఎస్జీ క్లబ్లో మెస్సీ జాయిన్ అయ్యే అవకాశం ఉందని పీఎస్జీ హెడ్‌కోచ్ క్రిస్టోప్ గాల్టియర్ పేర్కొన్నాడు. ఫిపా వరల్డ్‌కప్ ఫైనల్ సందర్భంగా అర్జెంటీనాకు వణికించిన ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె సహా బ్రెజిల్ స్టార్ నెయ్మర్ కూడా పీఎస్జీలో ఉన్నారు. El que anda tranquilo por Rosario es Lionel Messi 😅 NUESTRO CAMPEÓN DEL MUNDO 😍🇦🇷🏆 pic.twitter.com/jJuC2ToeZ1 — TNT Sports Argentina (@TNTSportsAR) December 28, 2022 చదవండి: ధోని కూతురుకు మెస్సీ అరుదైన కానుక -
ధోని కూతురుకు మెస్సీ అరుదైన కానుక
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇటీవలే ఫిఫా వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ఆ అభిమానం మరింత రెట్టింపైంది. ఖతర్ వేదికగా జరిగిన సాకర్ సమరంలో ఎలాగైనా మెస్సీ కప్ గెలవాలని అర్జెంటీనా అభిమానులే కాదు విశ్వవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ బలంగా కోరుకున్నారు. అందుకు తగ్గట్టే మెస్సీ తన కలను నెరవేర్చుకోవడమే గాక అర్జెంటీనాకు ముచ్చటగా మూడోసారి ఫిఫా టైటిల్‌ను అందించాడు. మరి అలాంటి మెస్సీని ఆరాధించని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. తాజాగా ఆ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని కూడా ఉన్నాడు.క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ తనకెంతో ఇష్టమైన ఆట అంటూ ధోని గతంలోనూ చాలాసార్లు చెప్పాడు. క్రికెటర్ కాకపోయుంటే గోల్‌కీపర్ అయ్యేవాడినని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు ధోని. ఇక తండ్రిలాగే జీవాకు ఫుట్ బాల్ ఆటంటే చాలా ఇష్టం. అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ ఆటను తండ్రితో కలిసి చూస్తుంటుంది. ఈ క్రమంలోనే మెస్సీపై అభిమానం పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే మెస్సీ.. తన అభిమాని అయిన ధోని కూతురు జీవా ధోనికి గిఫ్ట్ పంపించాడు. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జీవాకు పంపించాడు. అభిమాన ఆటగాడి నుంచి అందిన కానుకను చూసుకుంటూ జీవా ధోని మురిసిపోయింది. ఆ జెర్సీ వేసుకుని తీసుకున్న ఫొటోను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. ఈ ఫొటోలో జెర్సీపై..'' పారా జివా(జీవా కోసం)'' అంటూ మెస్సీ చేసిన సంతకం కనిపిస్తోంది. View this post on Instagram A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) చదవండి: అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు.. -
మెస్సీ 'నల్లకోటు' వెనక్కి ఇవ్వాలంటూ రూ. 8.2 కోట్ల ఆఫర్
ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌ను అర్జెంటీనా నెగ్గిన సంగతి తెలిసిందే. జట్టును అన్నీ తానై నడిపించిన మెస్సీ ట్రోఫీ గెలవడంతో పాటు తన 17 ఏళ్ల కలను కూడా నెరవేర్చుకున్నాడు. ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ ఏడు గోల్స్ చేయడమే గాక బెస్ట్ ఫుట్‌బాలర్‌గా గోల్డెన్ బాల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ఫిఫా టైటిల్ అందుకునే క్రమంలో మెస్సీ ఒక నల్లకోటు ధరించి వచ్చాడు. ఆ నల్లకోటును అరబ్ దేశాల్లో 'బిష్త్' అని పిలుస్తారు. ఎవరైనా గొప్ప పని సాధిస్తే కృతజ్ఞతగా వారిని గౌరవిస్తూ బిస్ట్ను అందిస్తారు. ఈ నేపథ్యంలోనే మెస్సీ ధరించిన బిష్త్(నల్లకోటు)ను ఖతర్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీ అందించారు. ట్రోఫీ అందుకోవడానికి ముందు మెస్సీకి ఆ నల్లని కోటు తొడిగారు. ఆ నల్లని కోటు ధర అక్షరాలా 10 లక్షల డాలర్లు. మరి అంత విలువైన కోటును మెస్సీ బహుకరించింది మాత్రం ఒమన్‌కు చెందిన అహ్మద్ అల్ బర్వానీ అనే పార్లమెంట్ సభ్యుడు. తాజాగా మెస్సీ ధరించిన బిస్ట్ వెనక్కి ఇవ్వాలంటూ మరొక ట్వీట్ చేశాడు అహ్మద్ అల్ బర్వానీ. ఆ ట్వీట్లో ఏముందంటే.. ''ఖతర్ సుల్తాన్ తరఫున వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గినందుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. బంగారం, నలుపు రంగులో ఉన్న అరబిక్ బిష్త్ శౌర్యానికి, తెలివితేటలకు ప్రతీక. అయితే మెస్సీ ఇప్పుడు దానిని తిరిగి ఇస్తే అతనికి నేను మిలియన్ డాలర్(రూ. 8.2 కోట్లు) ఆఫర్‌గా ఇస్తాను. ఎందుకంటే బిష్త్ అనేది మా సంప్రదాయానికి ప్రతీక. మెస్సీ సాధించిన గొప్పతనానికి గుర్తుగా ఆ బిష్త్‌ను తొడిగాం. మా దేశంలో ఉంటేనే ఆ బిష్త్‌కు గౌరవం ఉంటుంది. అందుకే మెస్సీ బిష్త్ తిరిగి ఇచ్చేయాలనే ఈ ఆఫర్ ఇస్తున్నా అంటూ తెలిపాడు. మొత్తానికి లియోనల్ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ అందుకోవడం ఏమోగానీ ఎటునుంచి చూసినా అతనికి డబ్బులు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. నిజంగా మెస్సీ అదృష్టవంతుడు. ఇప్పుడు తాను ధరించిన బిష్త్(నల్లకోటు)కు కూడా అంత ధర ఆఫర్ చేయడం మాములు విషయం కాదనే చెప్పొచ్చు. صديقي ميسي.. من #سلطنة_عمان أبارك لكم فوزكم بـ #كأس_العالم_قطر_2022 أبهرني الأمير @TamimBinHamad وهو يُلبسك #البشت_العربي ،رمز الشهامة والحكمة.#ميسي أعرض عليك مليون دولار أميركي نظير أن تعطيني ذلك #البشت#Messi𓃵 I'm offering you a million $ to give me that bisht@TeamMessi pic.twitter.com/45BlVdl6Fh — أحـمَـد الـبـَروانـي (@AhmedSAlbarwani) December 20, 2022 చదవండి: మెస్సీ ధరించిన నల్లకోటు ధర ఎంతంటే? -
మెస్సీ ధరించిన నల్లకోటు ధర ఎంతంటే?
ఫిఫా వరల్డ్ కప్ ముగిసి వారం కావొస్తున్నా.. ఆ కిక్ నుంచి మాత్రం ఫుట్‌బాల్ అభిమానులు బయటపడలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ. జట్టును అన్నీ తానై నడిపించడమే గాక కీలకమైన ఫైనల్లో రెండు గోల్స్ చేసి అర్జెంటీనాను మూడోసారి విశ్వవిజేతగా నిలబెట్టాడు. పనిలో పనిగా ఫిఫా టైటిల్ అందుకోవాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు. ఆ క్షణం నుంచి మెస్సీ మాయలో పడిపోయిన అభిమానులు అతని జపమే చేస్తున్నారు. ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన మెస్సీకి ఘనస్వాగతం లభించింది. ఇసుక వేస్తే రాలనంతో జనంతో రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వీధులు నిండిపోయాయి. ముందుకు కదల్లేని పరిస్థితిలో మెస్సీ బృంధాన్ని హెలికాప్టర్ సాయంతో వారి స్వస్థలాలకు తరలించాల్సి వచ్చింది. అలా మెస్సీకి తన స్వస్థలంలోనూ జనం నీరాజనం పట్టారు. ఇక ఫైనల్లో విజయం తర్వాత అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ నల్లకోటు ధరించి ఫిఫా టైటిల్ అందుకున్న సంగతి తెలిసిందే. మెస్సీ ధరించిన నల్లకోటు సెలబ్రేషన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ కోటు ధర తెలిస్తే షాక్ తినడం గ్యారంటీ. అంతలా ఆ కోటులో ఏముందనుకుంటున్నారా. బంగారు వర్ణంతో తయారు చేయడమే ఆ కోటు స్పెషాలిటీ. ట్రోఫీ అందుకునే ముందు ఖతర్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీ మెస్సీకి ఆ నల్లని కోటు తొడిగారు. ఆ నల్లని కోటు ధర అక్షరాలా 10 లక్షల డాలర్లు. మరి అంత విలువైన కోటును మెస్సీకి ఎవరు బహూకరించారో తెలుసా.. ఒమన్‌కు చెందిన అహ్మద్ అల్ బర్వానీ అనే పార్లమెంట్ సభ్యుడు. ''ఖతర్ సుల్తాన్ తరఫున వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గినందుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. బంగారం, నలుపు రంగులో ఉన్న అరబిక్ బిష్త్ శౌర్యానికి, తెలివితేటలకు ప్రతీక. అందుకు నీకు 10 లక్షల డాలర్లు ఇస్తున్నాను'' అంటూ అహ్మద్ ట్వీట్ చేశాడు. అరబ్ దేశాల్లో మగవాళ్లు పెళ్లిళ్లు, మతపరమైన పండుగల వేళ అలాంటి కోటు వేసుకుంటారు. ఇక హోరాహోరీగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్‌పై విజయం సాధించింది. దాంతో, 32 ఏళ్ల తర్వాత అర్జెంటీనా మళ్లీ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. 2014 ఫైనల్లో మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా జర్మనీపై ఓడిపోవడంతో కప్ చేజారింది. కానీ ఈ సారి మాత్రం ఆ చాన్స్‌ను మిస్ చేసుకోని మెస్సీ ఫిఫా టైటిల్‌ను ఒడిసిపట్టాడు. చదవండి: 'మానసిక వేదనకు గురయ్యా'.. సొంత బోర్డుపై ఆగ్రహం మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? -
FIFA rankings: రెండో ర్యాంక్‌లో అర్జెంటీనా
ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత అర్జెంటీనా ఒక స్థానం పురోగతి సాధించింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బ్రెజిల్ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతోంది. రన్నరప్ ఫ్రాన్స్ నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది. గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన బెల్జియం రెండో ర్యాంక్ నుంచి నాలుగో ర్యాంక్‌కు పడిపోయింది. మూడో స్థానం పొందిన క్రొయేషియా ఐదు స్థానాలు పురోగతి సాధించి ఏడో ర్యాంక్‌లో నిలిచింది. ప్రపంచకప్ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా గుర్తింపు పొందిన మొరాకో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరుకుంది. జపాన్ 20వ ర్యాంక్‌తో ఆసియా నంబర్‌వన్ జట్టుగా నిలిచింది. భారత్ 106వ ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు. -
Lionel Messi: అర్జెంటీనా బ్యాంక్ సంచలన నిర్ణయం..?
అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. 36 ఏళ్ల తర్వాత తమ దేశానికి ఫుట్‌బాల్ ప్రపంచకప్ అందించిన లియోనల్ మెస్సీ (అర్జెంటీనా కెప్టెన్) ఫోటోను తమ దేశ 1000 పెసో (అర్జెంటీనా కరెన్సీ) నోట్లపై ముద్రించేందుకు ప్రపోజల్ పంపిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రముఖ దినపత్రిక (ఎల్ ఫినాన్సియరో) ఓ ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించింది. ఫిఫా వరల్డ్‌కప్ 2022 విజయానికి గుర్తుగా అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫ్రాన్స్‌తో ఫైనల్ మ్యాచ్‌కు ముందే బ్యాంక్ అధికారులు ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టినట్లు వివరించింది. అయితే, ఈ ప్రచారం అవాస్తవమని ఆ దేశ ఇతర దినపత్రికలు కొట్టిపారేశాయి. కాగా, అర్జెంటీనా 1978లో తొలిసారి వరల్డ్‌కప్ గెలిచినప్పుడు ఆ దేశ ప్రభుత్వం నాటి ఫుట్‌బాల్ ఆటగాళ్లతో కూడిన కొన్ని స్మారక నాణేలను విడుదల చేసింది. తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అర్జెంటీనా ప్రతిపాదనతో మెస్సీ ఫోటోను కూడా ఆ దేశ కరెన్సీపై ముద్రించాలని విశ్వవ్యాప్తంగా ఉన్న మెస్సీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కాగా, డిసెంబర్ 18న ఫ్రాన్స్‌తో జరిగిన ఫిఫా ప్రపంచకప్-2022 ఫైనల్లో అర్జెంటీనా.. ఫ్రాన్స్‌పై 4-2 గోల్స్ తేడాతో జయకేతనం ఎగురవేసి, మూడోసారి జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మెస్సీ 2 గోల్స్ చేసి అర్జెంటీనా విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
Lionel Messi: తగ్గేదేలే.. మరో ‘ప్రపంచ రికార్డు’ బద్దలు కొట్టిన మెస్సీ!
FIFA World Cup 2022- Lionel Messi: ఒక్క అడుగు.. ఆ ఒకే ఒక్క అడుగు పడితే.. ఆ క్రీడాకారుడి జీవితం పరిపూర్ణమైనట్లే! తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరినట్లే! దేశాలకు అతీతంగా ప్రపంచమంతా అతడి గెలుపును కాంక్షించింది.. అందరి ఆశలు ఫలించాయి.. ఎట్టకేలకు ఫైనల్లో తమ జట్టును విజేతగా నిలిపి అతడు ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాడు! ఈ అపురూప దృశ్యాలను ఇన్‌స్టాలో పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘ఎన్నో ఏళ్లుగా నేను కంటున్న కల నెరవేరింది.. ఈ గెలుపు కోసం నేనెంతగానో తపించి పోయాను.. ఇప్పటికీ దీనిని నేను నమ్మలేకపోతున్నాను.. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, ప్రతి ఒక్క అభిమానికి పేరుపేరునా ధన్యవాదాలు. నేను ఇది సాధించగలనని నమ్మిన వాళ్లకు థాంక్స్. అర్జెంటీనా వాళ్లు ఐక్యంగా ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ ఉండదని మరోసారి నిరూపితమైంది. జట్టు సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది. అర్జెంటీనా కల ఇలా నెరవేరింది’’ అని ఉద్వేగపూరిత నోట్ రాశాడు. కోట్లాది మంది ఈ పోస్టును లైక్ చేశారు. ఇప్పటి వరకు 68.8 మిలియన్లకు పైగా లైకులు కొట్టారు. 1.8 మిలియన్లకు పైగా కామెంట్లు వచ్చాయి. ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ది ఎగ్ రికార్డు బద్దలు ఈ క్రమంలో అతడి ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదైంది. ‘ది ఎగ్’ పేరిట ఉన్న ఉన్న రికార్డును బద్దలు కొడుతూ.. అతడు చేసిన పోస్టు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైకులు పొందిన పోస్ట్‌గా నిలిచింది. అవును.. ఫుట్‌బాల్ స్టార్, రికార్డుల రారాజు లియోనల్ మెస్సీనే ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. 2019 జనవరి 4న పోస్ట్ చేసిన ‘ది ఎగ్’కు ఇన్‌స్టాలో ఇప్పటి వరకు 56 మిలియన్ లైకులు రాగా.. మెస్సీ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. దీంతో మరోసారి అతడి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మెస్సీ మాయ.. ప్రపంచమంతా సంబరం ఫిఫా ప్రపంచకప్- 2022ను మెస్సీ వరల్డ్‌కప్‌గా భావించిన తరుణంలో ఫ్రాన్స్‌తో ఆఖరి పోరులో అతడు మరోసారి తన మ్యాజిక్‌తో మెరిసిన విషయం తెలిసిందే. ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అర్జెంటీనాకు మూడో వరల్డ్‌కప్‌ను అందించాడు. ఈ ఈవెంట్లో మొత్తంగా ఏడు గోల్స్‌తో పాటు మూడు అసిస్ట్‌లు చేసిన మెస్సీ గోల్డెన్ బాల్ అవార్డును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా మెస్సీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఇక అతడి స్వదేశం అర్జెంటీనాలో సంబరాలు అంబరాన్నంటాయి. సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. చదవండి: Ajinkya Rahane: డబుల్ సెంచరీతో చెలరేగిన రహానే.. రెండో ద్విశతకం! టీమిండియాలో చోటు ఖాయమంటూ.. Lionel Messi: వరల్డ్‌కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలో మరో అరుదైన ఘనత View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) -
అభిమాన సంద్రం మధ్య... అర్జెంటీనా జట్టు సంబరాలు
బ్యూనస్ ఎయిర్స్: ‘థ్యాంక్యూ చాంపియన్స్’... అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో మంగళవారం ప్రతీ రోడ్డుపై, ప్రతీ వీధిలో కనిపించిన బ్యానర్లు ఇవి. విశ్వవిజేతగా నిలిచిన తర్వాత స్వదేశం తిరిగొచ్చిన ప్రపంచకప్ హీరోలు అక్కడి ఫ్యాన్స్ వీరాభిమానంలో తడిసి ముద్దయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు విమానం దిగినప్పటి నుంచి రోజంతా ఆటగాళ్లు, అభిమానుల సంబరాలకు విరామం లేకుండా పోయింది. 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా వరల్డ్‌కప్ గెలుచుకున్న ఘనతను దేశంలో ప్రతీ ఒక్కరూ వేడుకగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం ఆ దేశంలో జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. దాంతో సంబరాల ఆనందం రెట్టింపైంది. ఓపెన్ టాప్ బస్సులో ఆటగాళ్లంతా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారి మొత్తం ట్రోఫీని మెస్సీ తన చేతుల్లో ఉంచుకొని ప్రదర్శిస్తుండగా, సహచరులు నృత్యాలతో ఉత్సాహపరిచారు. భారీ సంఖ్య లో ఉన్న అభిమానుల మధ్య నుంచి ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టు అధికారిక గీతంగా మారిపోయిన ముకాకోస్... ముకాకోస్ను ఆలాపిస్తూ ఫ్యాన్స్ మరింత జోష్ నింపారు. ముందుగా విమానాశ్ర యం వద్ద, ఆ తర్వాత అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్య అధికారిక కార్యాలయం వద్ద, ఆపై లక్షలాది జనం మధ్య ప్రతిష్టాత్మక ‘ఒబెలిస్క్ స్క్వేర్’ వద్ద అంబరాన్నంటేలా ఈ సంబరాలు కొనసాగాయి. చదవండి: Lionel Messi: వరల్డ్‌కప్‌ను పక్కలో పెట్టుకుని పడుకున్న మెస్సీ.. వైరల్ ఫోటో -
మరో పోరాటం.. రాంచీలో తల్లుల ఫుట్‌బాల్ ఫైనల్
కతార్ వైపు అందరూ కళ్లప్పగించి చూస్తున్నప్పుడు అక్కడికి 3000 కిలోమీటర్ల దూరంలోని జార్ఖండ్‌లో కూడా అంతే ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లు జరిగాయి. ఆదివారమే అక్కడా ఫైనల్స్ జరిగాయి. ఎవరు గెలిచారో తర్వాతి సంగతి. కాని పిల్లల తల్లులైన గిరిజన స్త్రీలు క్రీడాదుస్తులు ధరించి బాల్ కోసం పరిగెత్తడం సామాన్యం కాదు. ఆదివాసీ స్త్రీల మీద సాగే బాల్య వివాహాలు, గృహ హింస, మంత్రగత్తె అనే అపవాదు, నిర్బంధ నిరక్షరాస్యత వంటి దురన్యాయాలపై చైతన్యం తేవడానికి ఈ తల్లుల ఫుట్‌బాల్ కప్‌ను నిర్వహిస్తున్నారు. ‘మాత్ర శక్తి ఫుట్‌బాల్ టోర్నమెంట్’ వినూత్నతపై కథనం. కతార్‌లో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రోమాంచిత సన్నివేశాలు చూశారు ప్రేక్షకులు. కాని మొన్న రాంచీలో జరిగిన ‘మాత్ర శక్తి ఫుట్‌బాల్ టోర్నమెంట్’లోని సన్నివేశాలు అంతకు తక్కువేమి కావు. సన్నివేశం 1: అనితా భేంగరాకు 24 ఏళ్లు. టీమ్‌లో జోరుగా ఫుట్‌బాల్ ఆడుతూ హటాత్తుగా ఆగిపోయింది. మేచ్ నుంచి బయటికొచ్చేసింది. కారణం? తన చంటి పిల్లాడి ఏడుపు వినిపించడమే. పాలకు వాడు ఏడుస్తుంటే వాడి దగ్గరకు పరిగెత్తింది. ఆమె లేకుండానే ఆట కొనసాగింది. బిడ్డకు పాలు ఇస్తూ తన టీమ్‌ను ఉత్సాహపరుస్తూ కూచుంది అనిత. సన్నివేశం 2: ‘నెట్టె హజమ్’ (ముందుకొచ్చి కొట్టు), ‘రుడుమ్ నెట్టె’ (పక్కకు తిరిగి కొట్టు) అని ముండారి భాషలో అరుస్తున్నాడు సుక్కు ముండా. అతను తోడుగా వచ్చిన టీమ్ గ్రౌండ్లో ఆడుతూ ఉంది. వారిలో అతని భార్య సునీతా ముండా ఉంది. అసలే అది ఫైనల్ మేచ్. భర్త ఉత్సాహానికి భార్య రెచ్చి పోయింది. గోల్ కొట్టింది. సునీత టీమే ఫైనల్స్‌లో విజేతగా నిలిచింది. సుక్కు ముండా ఉత్సాహానికి అంతే లేదు. జార్ఖండ్‌లోని రాంచీ, ఖుంతి జిల్లాలోని 23 గ్రామాల నుంచి 32 మహిళా టీములు ‘మాత్ర శక్తి ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2022’లో పాల్గొన్నాయి. 360 మంది తల్లులు ఈ టీముల్లో ఉన్నారు. కొందరు ఒక బిడ్డకు తల్లయితే మరొకరు ఇద్దరు పిల్లల తల్లి. వీరి వయసు 21 నుంచి 57 వరకూ ఉంది. ఈ టోర్నమెంట్‌ను 2018లో మొదలెట్టారు. జార్ఖండ్‌లో ఆదివాసీల కోసం పని చేస్తున్న ‘ప్రతిగ్య’ అనే సంస్థ వీటిని నిర్వహిస్తోంది. ఎందుకు ఈ టోర్నమెంట్? ►జార్ఖండ్ ఆదివాసీల్లో స్త్రీయే ప్రధాన పోషకురాలు. కుటుంబాన్ని ఆమె నడపాలి. అందువల్ల ఆమెపై కట్టడి జాస్తి. ►సంస్కృతి రీత్యా ఆమె ఒకే రకమైన దుస్తులు ధరించాలి. ఆటలు ఆడరాదు. ఆడేందుకు వేరే రకం దుస్తులు ధరించరాదు. ►చదువు వీరికి దూరం. బాల్య వివాహాలు, లైంగిక దాష్టీకాలు, మంత్రగత్తెలని చంపడం... ఇవి సర్వసాధారణం. ►ఆరోగ్య స్పృహ, వ్యక్తిగత శుభ్రత లోపం. వీటిపై పోరాడడానికి, చైతన్యం తేవడానికి, స్త్రీలలో ఐకమత్యం సాధించడానికి, తల్లులను ఇంటి నుంచి కదిలేలా చేస్తే వారి ద్వారా పిల్లలకు చదువు, ఆటలు అందుతాయనే ఉద్దేశం. వీటన్నింటి కోసం ప్రతిగ్య సంస్థ ఈ టోర్నమెంట్‌ను మొదలుపెట్టింది. నాగపూర్‌లో స్లమ్ ఫుట్‌బాల్ పుట్టినట్టు ఇది ఆదివాసీ స్త్రీల ఫుట్‌బాల్. ఎన్నో సమస్యలు అయితే 2018లో టోర్నమెంట్ కోసం ప్రతిగ్య వాలంటీర్లు పల్లెలు తిరుగుతుంటే స్త్రీల నుంచే వ్యతిరేకత ఎదురైంది. ‘మేమెందుకు ఆడాలి’ అన్నారు. భర్తలైతే కాళ్లు విరగ్గొడతాం అన్నారు. చివరకు రాంచీ జిల్లాలోని మైనీ కచ్చప్ అనే తల్లి (40) మొట్టమొదటి ప్లేయర్‌గా ఆడటానికి అంగీకరించింది. ఆమె నుంచి టీమ్ తయారైంది. 2018లో అతి కష్టమ్మీద 6 టీములు పాల్గొన్నాయి. 2019లో 24 టీములు వచ్చాయి. 2022 నాటికి టీముల సంఖ్య 32కు పెరిగింది. వీళ్లెవరికీ సరైన జెర్సీలు లేవు. షూస్ లేవు. కోచ్‌లు లేరు. ప్రచారం లేదు. స్పాన్సర్లు లేరు. ప్రైజ్ మనీని ఏర్పాటు చేయడం కూడా కష్టమే. అయినా సరే ఎంతో ఉత్సాహంగా టోర్నమెంట్లో పాల్గొన్నారు. కూతురూ తల్లి, అత్తా కోడలు ఈ టోర్నమెంట్లో ఒక పల్లెలో కూతురూ తల్లి (కూతురు కూడా తల్లే) టీమ్‌లో చేరారు. అయితే వాళ్లిద్దరూ ఆడటం ఊళ్లో మగవారికి ఇష్టం లేదు. వాళ్లను ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లే గ్రౌండ్‌కు చేర్చడానికి ఎవరూ సహకరించలేదు. దాంతో వాళ్లు నడుస్తూ వచ్చి ఆట ఆడారు. మరో ఊళ్లో అత్తా కోడలు కలిసి టీమ్‌లో చేరారు. ‘ఈ ఆట ఆడక ముందు అత్త నాతో అంటీ ముట్టనట్టు ఉండేది. ఇప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులయ్యాము. ఎన్నో మాటలు మాట్లాడుకుంటున్నాము. ఒకరికొకరం తోడయ్యాము’ అంది కోడలు. మొదట చర్రుపర్రుమన్న భర్తలు గ్రౌండ్లో తమ భార్యలు ఆడుతుంటే మురిసి ప్రోత్సహించడం మొదలెట్టారు. స్త్రీలందరూ ఈ గేమ్ వంకతో కలిసి మాట్లాడుకుంటున్నారు. తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వాటి సాధన కోసం ఏం చేయాలో తెలుసుకుంటున్నారు. వాళ్లు తన్నాలనుకుంటున్న బంతి ఆ సమస్యే. ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నోచోట్ల మరెన్నో జరిగితే బాగుండు. చదవండి: Kajol: 48 ఏళ్ల వయసులోనూ ఆకట్టుకునే రూపం.. ఈ మూడు పాటించడం వల్లే అంటున్న కాజోల్ -
వరల్డ్‌కప్‌ను పక్కలో పెట్టుకుని పడుకున్న మెస్సీ.. వైరల్ ఫోటో
ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలవాలన్న తన చిరకాల కోరికను ఆఖరి ప్రయత్నంలో నెరవేర్చుకోవడంతో పాటు అర్జెంటీనాను మూడోసారి జగజ్జేతగా నిలిపిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT), అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీకి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఫిఫా వరల్డ్‌కప్-2022 గెలిచాక ఖతార్ నుంచి జట్టుతో పాటు స్వదేశానికి చేరుకున్న మెస్సీ.. తన 17 ఏళ్ల కెరీర్లో వరల్డ్‌కప్ గెలుపుకున్న ప్రాధాన్యత ఏంటో ప్రపంచానికి మరోసారి రుజువు చేశాడు. వరల్డ్‌కప్ గెలిచి రెండు రోజు పూర్తయ్యాక కూడా ఆ మూడ్‌లోనుంచి ఇంకా బయటికి రాని మెస్సీ.. పడుకున్నప్పుడు కూడా ట్రోఫీని తన పక్కలోనే పెట్టుకుని వరల్డ్‌కప్ టైటిల్‌పై తనకున్న మమకారాన్ని చాటుకున్నాడు. మెస్సీ.. వరల్డ్‌కప్ ట్రోఫీపై చేయి వేసుకుని పడుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ ఫోటోను మెస్సీ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పిక్‌ను చూసిన మెస్సీ అభిమానులు.. తమ ఆరాధ్య ఫుట్‌బాలర్ వరల్డ్‌కప్‌ను పక్కలో పెట్టుకుని పడుకోవడాన్ని చూసి మురిసిపోతున్నారు. దిగ్గజ ఆటగాడికి ఆట పట్ల ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు. మెస్సీ.. వరల్డ్‌కప్ ట్రోఫీని తన బిడ్డల కంటే అధికంగా ప్రేమిస్తున్నాడనడానికి ఇది నిదర్శమని అంటున్నారు. ఈ పోస్ట్ 3 కోట్లకు పైగా లైక్స్ సాధించడం విశేషం. కాగా, డిసెంబర్ 18న జరిగిన ఫిఫా వరల్డ్‌కప్-2022 ఫైనల్లో అర్జెంటీనా 4-2 గోల్స్ తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మెస్సీ 2 గోల్స్ చేయడంతో పాటు మరో గోల్స్ సాధించడంలో డి మారియాకు తోడ్పడ్డారు. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం మెస్సీ ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్ వరల్డ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పోస్ట్‌కు రికార్డు స్థాయిలో 6 కోట్లకు పైగా లైక్స్ వచ్చాయి. గతంలో ఇన్‌స్టాలో అత్యధిక లైక్స్ వచ్చిన రికార్డు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉండేది. తాజాగా మెస్సీ.. రొనాల్డో రికార్డును బద్దలు కొట్టాడు. -
వైరల్: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అదిరిపోయే ట్విస్ట్!
ప్రపంచ వ్యాప్తంగా సాకర్ ( ఫుట్ బాల్ ) అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ఖతర్ లుసైల్ గ్రౌండ్ వైపు స్టేడియంలోని అభిమానులే కాదు.. వరల్డ్ వైడ్ సాకర్ లవర్స్ అర్జెంటీనా, ఫ్రాన్స్ ఆటతీరును తీక్షణంగా చూస్తున్నారు. అదే సమయంలో స్టాండ్స్‌లో ఉన్న మరి కొంత మంది ఫోటోలు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్ కోసం ఎగుబడుతున్నారు. నరాలు తెగే ఉత్కంఠతతో మ్యాచ్ జరుగుతుంటే...ఆక్కడ ఏం జరుగుతుందో అర్ధంగాక ఆటను కవర్ చేస్తున్న కెమెరామెన్ తన చూపును స్టాండ్ వైపు మరల్చారు. అంతే మస్క్..మస్క్ అంటూ ఆయన అభిమానులు హోరెత్తించారు. దీంతో మస్క్ సైతం అభిమానులకు అభివాదం చేశారు. ఆటోగ్రాఫ్స్,షేక్ హ్యాండ్స్ ఇచ్చి కొద్ది సేపు అలరించారు. క్షణం తీరిక లేకుండా వ్యాపార రంగంలో తలమునకలయ్యే ఎలాన్ మస్క్ ఖతర్ సాకర్ మ్యాచ్‌లో ప్రత్యక్షమవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక, మస్క్‌తో పాటు ఆర్సెలర్ మిట్టల్ సీఈవో లక్ష్మీ మిట్టల్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జార్డ్ కుష్నర్లు ఉన్నారు. At World Cup right now pic.twitter.com/CG7zMMxSjE — Elon Musk (@elonmusk) December 18, 2022 మ్యాచ్ జరుగుతుండగా ఈ ముగ్గురు వ్యాపార దిగ్గజాలు సీరియస్‌గా మాట్లాడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా మస్క్ సాకర్ మ్యాచ్‌కు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. కానీ ఆయన మాత్రం మ్యాచ్ జరుగుతున్నంత సేపు కామెంటేటర్ అవతారం ఎత్తారు. మొదటి సగం ఆట తర్వాత మస్క్ తన అభిమానుల్ని ఇలా అడిగారు.‘సూపర్ ఎక్సైటింగ్ వరల్డ్ కప్. అర్ధ సమయానికి అర్జెంటీనా 2-0తో ముందంజలో ఉంది. ఫ్రాన్స్ తిరిగి పుంజుకుంటుందా? అని ప్రశ్నించారు. Super exciting World Cup! 🇦🇷 ahead 2-0 at halftime. Can 🇫🇷 come back? — Elon Musk (@elonmusk) December 18, 2022 ఫ్రాన్స్ సాకర్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపే అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన తర్వాత, ‘ఫ్రాన్స్ గోల్ కోసం సెకనుకు 24,400 ట్వీట్లు, ప్రపంచ కప్‌లో అత్యధికం! అంటూ ట్వీట్ చేశారు. 24,400 tweets per second for France’s goal, highest ever for World Cup! — Elon Musk (@elonmusk) December 18, 2022 -
పోర్చుగల్ స్టార్ రొనాల్డోకు అవమానం.. అర్జెంటీనా ఆటగాడు కూడా
ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్ పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు చేదు అనుభవమే మిగిల్చింది. మెగాటోర్నీ ఆరంభం కాకముందే పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ ద్వారా మాంచెస్టర్ యునైటెడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టను దిగజార్చకున్నాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ రొనాల్డో ఆశించినంత మేర రాణించలేదనే చెప్పాలి. కేవలం ఒకే ఒక్క గోల్ కొట్టిన రొనాల్డో ఆ తర్వాత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో తొలుత బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఫామ్‌లో లేని రొనాల్డో స్థానంలో వేరేవారికి అవకాశం ఇవ్వాలనే అతన్ని బెంచ్‌కు పరిమితం చేసినట్లు పోర్చుగల్ హెడ్‌కోచ్ ఫెర్నాండో శాంటెజ్ వివరించాడు. అయితే రొనాల్డో తుదిజట్లులో లేకపోవడం పోర్చుగల్‌ను దెబ్బకొట్టిందనే చెప్పొచ్చు. స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో నెగ్గినప్పటికి.. కీలకమైన క్వార్టర్ ఫైనల్లో మొరాకో చేతిలో ఓడి పోర్చుగల్ ఇంటిబాట పట్టింది. ఈ మ్యాచ్‌లోనూ రొనాల్డో తొలుత బెంచ్‌కే పరిమితమయ్యాడు. రెండో అర్థభాగంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఆ తర్వాత క్రిస్టియానో రొనాల్డో కన్నీటిపర్యంతం అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలా రొనాల్డో అవమానభారంతో ఫిఫా వరల్డ్‌కప్‌ను ముగించాడు. 37 ఏళ్ల రొనాల్డో మరో ఫిఫా వరల్డ్‌కప్ ఆడేది అనుమానమే. ఈ నేపథ్యంలోనే రొనాల్డోకు మరోసారి అవమానం జరిగింది. ఫిఫా వరల్డ్‌కఫ్‌లో చెత్త ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో సోఫాస్కోర్ అనే వెబ్సైట్ వరస్ట్ ఎలెవెన్ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో క్రిస్టియానో రొనాల్డో చోటు దక్కించుకున్నాడు. ఒకే ఒక్క గోల్ చేసిన రొనాల్డోకు సోఫాస్కోర్ ఇచ్చిన స్కోర్ రేటింగ్ 6.46. ఇక ఈసారి ఫిఫా వరల్డ్‌కప్ ఛాంపియన్స్‌గా నిలిచిన అర్జెంటీనా జట్టులో నుంచి కూడా ఒక ఆటగాడికి వరస్ట్ ఎలెవెన్ టీమ్‌లో చోటు దక్కింది. అతనే ఫార్వర్డ్ ప్లేయర్ లౌటారో మార్టినెజ్. పైనల్ మ్యాచ్‌లో అదనపు సమయంలో జులియన్ అల్వరేజ్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మార్టినేజ్ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాడు. ఈ వరల్డ్‌కప్‌లో 148 నిమిషాల పాటు యాక్షన్‌లో ఉన్న మార్టినేజ్ గోల్ కొట్టడంలో.. అసిస్ట్ చేయడంలో ఫెయిల్ అవ్వడంతో కోచ్ లియోనల్ స్కలోని అతన్ని రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం చేశాడు. మార్టినేజ్కు 6.35 రేటింగ్ ఇచ్చింది. ఇక వీరిద్దరితో పాటు సెనెగల్ స్టార్ గోల్‌కీపర్ ఎడౌర్డ్ మండీ(6.30) రేటింగ్ ఇచ్చింది. రౌండ్ ఆఫ్ 16లో ఇంగ్లండ్ చేతిలో ఓడి సెనెగల్ ఇంటిబాట పట్టింది. ఇంకా ఈ జాబితాలో సెర్జినో డెస్ట్(అమెరికా, 6.50 రేటింగ్), పోలాండ్‌కు చెందిన కమిల్ గ్లిక్, బార్టోజ్ బెరెస్జిన్స్కిలు ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన జాక్సన్ ఇర్విన్, మాథ్యూ లిక్కీలతో పాటు సౌత్ కొరియాకు చెందిన హవాంగ్ ఇన్ బోయెమ్, రూబెన్ వర్గస్(స్విట్జర్లాండ్)లను మిడ్ఫీల్డింగ్లో చోటు దక్కింది. సోఫాస్కోర్ ఫిఫా వరల్డ్‌కప్ వరస్ట్ ఎలెవెన్ జట్టు: క్రిస్టియానో రొనాల్డో(కెప్టెన్), లౌటారో మార్టినె, హవాంగ్ ఇన్ బోయెమ్, రూబెన్ వర్గస్, జాక్సన్ ఇర్విన్, మాథ్యూ లిక్కీ, ఎడౌర్డ్ మండీ(గోల్ కీపర్), సెర్జినో డెస్ట్, కమిల్ గ్లిక్, బార్టోజ్ బెరెస్జిన్స్కి, అబ్దు డియల్లో చదవండి: శకం ముగిసింది.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? -
శకం ముగిసింది.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్‌బాలర్
ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది. ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్ కరీమ్ బెంజెమా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం రాత్రి తన ట్విటర్లో బెంజెమా రిటైర్మెంట్ విషయాన్ని పేర్కొన్నాడు. ఆదివారం ఖతర్ వేదికగా జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ పెనాల్టీ షూటౌట్లో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బెంజెమా తన ట్విటర్లో స్పందించాడు. ''ఫ్రాన్స్ ఓటమి నన్ను బాధించింది.. ఫిట్నెస్, ఇతర కారణాల రిత్యా అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా.. ఇన్నాళ్లు ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. నాపై ప్రేమను చూపించిన అభిమానులందరికి కృతజ్క్షతలు. ఫిఫా వరల్డ్‌కప్ లేకుండానే రిటైర్మెంట్ ఇవ్వడం బాధ కలిగిస్తుంది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు.. అందుకే గుడ్‌బై చెప్పేశా'' అంటూ పేర్కొన్నాడు. J’ai fait les efforts et les erreurs qu’il fallait pour être là où je suis aujourd’hui et j’en suis fier ! J’ai écrit mon histoire et la nôtre prend fin. #Nueve pic.twitter.com/7LYEzbpHEs — Karim Benzema (@Benzema) December 19, 2022 బెంజెమా సోమవారమే తన 36వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఇలా పుట్టినరోజు నాడే రిటైర్మెంట్ ప్రకటించి తన అభిమానులను షాక్‌కు గురిచేశాడు. 2007లో ఫ్రాన్స్ తరఫున అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన బెంజెమా 97మ్యాచుల్లో 37గోల్స్ కొట్టాడు.2015లో సెక్స్-టేప్ కేసులో బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు ఋజువు కావడంతో ఆ దేశ ఫుట్‌బాల్ సమాఖ్య బెంజెమాపై ఐదేళ్ల నిషేధం విధించింది. 2021లో తిరిగి పునారాగమనం చేసిన బెంజెమా యూరోపియన్ ఛాంపియన్షిప్ ప్రి క్వార్టర్స్‌లో ఏకంగా నాలుగు గోల్స్ కొట్టి ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ఈ ప్రపంచకప్‌లో కరీమ్ బెంజెమా తన మాయ చూపిస్తాడని అంతా భావించారు. కానీ ఫిఫా ప్రపంచకప్ ఆరంభానికి ముందే తొడ కండరాల గాయంతో బాధపడుతూ కరీమ్ బెంజెమా జట్టుకు దూరమయ్యాడు. అలా ఫ్రాన్స్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన కరీమ్ బెంజెమా ఫిఫా వరల్డ్‌కప్ లేకుండానే తన కెరీర్‌ను ముగించాడు. ఇక ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కరీమ్ బెంజెమా ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్(Ballon D'Or) అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Kylian Mbappe: నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? -
మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా?
ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో చిత్తు చేసిన అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి వరల్డ్‌కప్‌ను ఎగురేసుకుపోయింది. అర్జెంటీనా కప్పు కొట్టగానే స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో ఊగిపోయింది. అయితే ఈ గ్యాప్‌లోనే ఒక యువతి నగ్న ప్రదర్శన చేయడం హల్చల్గా మారింది. అయితే మెస్సీ మాయలో దీనిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ లేకుంటే పెద్ద వివాదం అయ్యుండేది. విషయంలోకి వెళితే.. ఫ్రాన్స్‌పై విజయం సాధించాకా అర్జెంటీనా అభిమానులు దేశ జెండాలతో సంబరాలు చేసుకున్నారు. ఇంతలో ఒక అర్జెంటీనా అభిమానుల గుంపులో ఒక యువతి టాప్‌లెస్‌గా దర్శనమిచ్చింది. జెండాల మధ్యలో నిలబడిన యువతి చాతి భాగం కనిపించేలా నగ్న ప్రదర్శన చేసింది. ఆమె చర్యతో ఆశ్చర్యపోయిన మిగతావారు.. ఇక్కడే ఉంటే ఆమె ప్రాణాలకు ప్రమాదమని.. ఎస్కార్ట్ సాయంతో అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఫైనల్ ముగిసిన ఒకరోజు తర్వాత ఈ ఫోటోలు బయటికి రావడంతో పెద్దగా దుమారం జరగలేదు. అయితే యువతి చర్యను తప్పుబట్టిన ఖతర్ అధికారులు ఆమె ఎక్కడ ఉన్నా నోటీసులు ఇస్తామని.. దానికి బదులు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. మెస్సీ బృందం గెలిచిన సంతోషంలో పొరపాటున అలా చేసిందో లేక కావాలనో తెలియదు కానీ తన అందాల ప్రదర్శనతో ఆమె పక్కన నిల్చున్న వారి మతులు మాత్రం పోగొట్టింది. చదవండి: వరల్డ్‌కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలో మరో అరుదైన ఘనత నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె -
వరల్డ్‌కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలో మరో అరుదైన ఘనత
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ సాధించానన్న ఆనందంలో మునిగి తేలుతున్నాడు. మెస్సీ సంతోషం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో గెలిచిన అర్జెంటీనా టైటిల్ విజేతగా నిలిచింది. 16 ఏళ్ల నిరీక్షణ.. 36 ఏళ్ల అర్జెంటీనా కలను తీర్చాడు కాబట్టే మెస్సీ అంత సంతోషంగా ఉన్నాడు. ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా తర్వాత ఆ లిగసీని కంటిన్యూ చేస్తూ ఎట్టకేలకు అర్జెంటీనాకు మూడో వరల్డ్‌కప్‌ను అందించాడు. ఈ వరల్డ్‌కప్‌లో అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ ఏడు గోల్స్‌తో పాటు మూడు అసిస్ట్‌లు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా గోల్డెన్ బాల్ అవార్డు సొంతం చేసుకున్నాడు. తాజాగా ఫిఫా వరల్డ్‌కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలోనే మెస్సీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సీ 400 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించించాడు. దీంతో క్రిస్టియానో రొనాల్డో తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సెలబ్రిటీగా మెస్సీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక రొనాల్డో 517 మిలియన్ ఫాలోవర్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. అంతేకాదు 500 మిలియన్ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన తొలి వ్యక్తిగా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొత్త చరిత్ర సృష్టించాడు. View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) చదవండి: నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె నిరీక్షణ ముగిసింది.. మెస్సీ సాధించాడు -
నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె
డిసెంబర్ 18(ఆదివారం) జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించాడు ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె. మరో 10 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా రంగంలోకి దిగిన ఎంబాపె మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కదలికల్లో చిరుత కంటే వేగంతో పరిగెత్తాడు. కేవలం 97 సెకన్ల వ్యవధిలోనే రెండు గోల్స్ కొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అలా నిర్ణీత సమయంలోగా 2-2తో ఎలాంటి ఫలితం రాలేదు. అదనపు సమయంలోనూ జట్టు వెనుకబడ్డ దశలో మరో పెనాల్టీ గోల్‌తో మ్యాచ్‌ను షూటౌట్‌కు తీసుకెళ్లాడు. అందులోనూ విజయం సాధించాడు ఎంబాపె. అయితే తాను ఒక్కడే ఆడితే సరిపోదు కదా.. సహచర ఆటగాళ్లు కూడా ఆడాలి. కానీ వాళ్లు ఆడలేదు.. ఫ్రాన్స్ ఓడిపోయింది. ఆ క్షణం ఎంబాపె మొకాళ్లపై మైదానంలో కూలబడ్డాడు. స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మారుమోగుతున్న వేళ.. తాను మాత్రం నిరాశలో మునిగిపోయాడు. కానీ అతని ఆట తీరుకు ముగ్దులైన యావత్ ప్రపంచం వీరుడి పోరాటానికి సలాం కొట్టింది. ఈ తరంలో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలను.. ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్లుగా అభివర్ణిస్తుంటారు. తాజాగా ప్రపంచకప్ కొట్టి మెస్సీ రొనాల్డో కంటే ఒక మెట్టు పైనున్నాడనుకోండి. అది వేరే విషయం. ఈ ఇద్దరు దిగ్గజాలు తమ చివరి వరల్డ్‌కప్‌ను దాదాపు ఆడేసినట్లే. వచ్చే వరల్డ్‌కప్ వరకు అందుబాటులో ఉంటారన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్‌కు మరో కొత్త సూపర్‌స్టార్ కావాల్సిన అవసరం వచ్చింది. నాలుగేళ్ల క్రితమే ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్‌కప్ గెలవడంలో ఎంబాపెది కీలకపాత్ర. 19 ఏళ్ల వయస్సులోనే ఫిఫా టైటిల్‌ను కొల్లగొట్టిన అతను.. ఈసారి కూడా అదే ఆటతీరుతో అదరగొట్టాడు. ముఖ్యంగా అర్జెంటీనాతో ఫైనల్లో ఎంబాపె ఆటతీరుకు ముచ్చటపడని వారుండరు. పట్టుమని పాతికేళ్లు కూడా లేని 23 ఏళ్ల కుర్రాడు ఫుట్‌బాల్‌లో సంచలన ప్రదర్శన చేస్తూ ఇక వచ్చే శకం తనదేనని ప్రపంచానికి సగర్వంగా చాటాడు. మరి అంతలా పేరు సంపాదించిన ఎంబాపె అసలు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చాడు.. 23 ఏళ్ల వయసులోనే ఇన్ని అద్భుతాలు ఎలా చేస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఎంబాపె తల్లిదండ్రులిద్దరు క్రీడాకారులే. కామెరూన్ నుంచి శరణార్థిగా పారిస్ శివారులోని బాండీకి వచ్చిన ఎంబాపె ఫుట్‌బాల్ ఆడేవాడు. ఆ తర్వాత కోచ్‌గా మారాడు. అల్జీరియాకు చెందిన అతని భార్య ఫైజా హ్యాండ్‌బాల్ క్రీడాకారిణిగా రాణించింది. 1998లో ఫ్రాన్స్ తొలిసారి ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ అందుకున్నప్పుడు పుట్టాడు కైలియన్ ఎంబాపె. అయితే ఎంబాపె పుట్టడమే గోల్డెన్ స్పూన్‌తో పుట్టలేదు. ఇరుకు గదుల్లో ఉంటూ.. కడు పేదరికంలో పెరిగిన ఎంబాపె చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్‌పై ఇష్టాన్ని పెంచుకున్నాడు. చదువు కంటే ఆటనే ఎక్కువగా ప్రేమించిన కొడుకును చూసి సంతోషపడిన తండ్రి విల్ఫ్రైడ్ ప్రోత్సహించాడు. ఎంబాపెకు ఫుట్‌బాల్ ఆటలో ఓనమాలు నేర్పిన మొదటి గురువు కూడా అతని తండ్రే కావడం విశేషం. ఆ తర్వాత ఎంబాపెను తాను పనిచేసే ఏఎస్ బాండీ క్లబ్లో జాయిన్ చేశాడు. అలా ఫుట్‌బాల్ ఆటలో పట్టు సాధించిన ఎంబాపె రెండేళ్ల పాటు మొనాకోకు ఆడాడు. 2017 ఎంబాపె కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. పారిస్ సెయింట్ జెర్మైన్తో(పీఎస్జీ) ఎంబాపెకు ఒప్పందం కుదిరింది. ఇక్కడే మెస్సీ, నెయమర్ లాంటి స్టార్ ఆటగాళ్లతో ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత స్పెయిన్ దిగ్గజ క్లబ్ రియల్ మాడ్రిడ్ నుంచి ఎంబాపెకు పిలుపొచ్చినా .. పీఎస్జీకి కొనసాగడంలో ఆ దేశ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మక్రాన్ ముఖ్య పాత్ర పోషించాడు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. ఎంబాపెకు ఎంత ప్రాముఖ్యత ఉందనేది. అలా 2018 ఫిఫా వరల్డ్‌కప్ రానే వచ్చింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్ చేరిన ఫ్రాన్స్ విశ్వవిజేతగా అవతరించింది. 19 ఏళ్ల వయసులోనే ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ సాధించిన ఎంబాపె ఆ ప్రపంచకప్‌లో నాలుగు గోల్స్ కొట్టాడు. అయితే ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో అన్నీ తానై నడిపించిన ఎంబాపె ఏకంగా ఎనిమిది గోల్స్ కొట్టి గోల్డెన్ బూట్ ఎగురేసుకుపోయాడు. 23 ఏళ్ల వయసులోనే ప్రత్యర్థి జట్లను అల్లాడిస్తూ ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న ఎంబాపె ఇదే ఆటతీరు ప్రదర్శిస్తే భవిష్యత్తులో దిగ్గజ ఆటగాడిగా పేరు పొందడం ఖాయం. సలాం కైలియన్ ఎంబాపె. చదవండి: మెస్సీ మ్యాజిక్కా.. అదృష్టమా.. ఎంబాపె అల్లాడించాడు 36 ఏళ్ల నిరీక్షణకు తెర.. మెస్సీకి ఘనంగా వీడ్కోలు! -
మెస్సీ లేరా.. సోషల్ మీడియాలో కాంతారా మీమ్ వైరల్..
నరాలు తెగిపోతాయా అన్నంత టెన్షన్.. ఫ్రాన్స్ ఒక వైపు.. అర్జెంటీనాకు మద్దతుగా మిగతా ప్రపంచమంతా ఓవైపు అన్నట్లుగా జరిగిన గేమ్.. దానికి కారణం.. మెస్సీ... అతడి కోసమైనా అర్జెంటీనా గెలవాలి అన్నట్లుగా ఫుట్‌బాల్ అభిమానులు ప్రార్థనలు చేశారు.. ఊపిరి బిగపట్టి మ్యాచ్‌ను చూశారు. జగజ్జేతగా నిలిచిన తర్వాత అటు అర్జెంటీనాలో లక్షలాదిగా జనం రోడ్డు మీదకు వచ్చి సంబరాలు చేసుకుంటే.. ఇటు సోషల్ మీడియాలో అభిమానులు రకరకాల ఫన్నీ మీమ్స్‌లో సందడి చేశారు. అందులో ఎక్కువ మందిని ఆకర్షించిన మీమ్.. ఇదిగో ఈ కాంతారా మీమ్.. ఇరుపక్షాల స్కోర్ సమమై.. మెస్సీ నీరసపడినప్పుడు అతడిలోని మహాశక్తిని నాటి మేటి దిగ్గజం మారడోనా మేల్కొలుపుతున్నట్లుగా రూపొందించిన ఈ మీమ్ ట్విట్టర్లో అందరినీ ఆకర్షిస్తోంది. చదవండి: అర్జెంటీనా జెర్సీలో వరుడు.. ఫ్రాన్స్ జెర్సీలో వధువు.. Messi and Maradona ( Kantara Inspired) Hats off to whoever done this edit#FIFAWorldCup pic.twitter.com/ZXLiunReue — Mr.S (@SarangSuresh95) December 18, 2022 -
ఫిఫా ప్రపంచకప్ విజేతగా అర్జెంటీనా
-
Qatar FIFA World Cup 2022: మెస్సీ మెరిసె... జగమే మురిసె...
టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఎన్నో వివాదాలు... వేడిమి వాతావరణంతో ఇబ్బందులు తప్పవేమోనని ఆటగాళ్ల సందేహాలు... ఆంక్షల మధ్య అభిమానులు ఆటను ఆస్వాదిస్తారో లేదోనని ఏమూలనో అనుమానం... కానీ ఒక్కసారి ‘కిక్’ మొదలుకాగానే... గోల్స్ మోత మోగింది... సంచలనాలతో సాకర్ సంరంభం షురూ అయింది... ఫైనల్ మ్యాచ్ చివరి క్షణం దాకా అదే ఉత్కంఠ కొనసాగింది... విశ్వవ్యాప్తంగా అభిమానులందరూ చిరకాలం గుర్తుండేలా ‘ఖతర్’నాక్ ప్రపంచకప్ సూపర్‌హిట్ అయ్యింది. ప్రపంచ నంబర్‌వన్ బ్రెజిల్ జిగేల్ మనలేదు... బెంబేలెత్తిస్తుందనుకున్న బెల్జియం బోల్తా కొట్టింది... పూర్వ వైభవం సాధిస్తుందనుకున్న జర్మనీ ఇంకా సంధికాలంలోనే ఉన్నామని సంకేతాలు పంపించింది... క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చు‘గల్లంతయింది’... ఆతిథ్యంలో అద్భుతమనిపించినా... ఆతిథ్య జట్టు ‘ఖతర్’నాక్ ఆటతో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. 56 ఏళ్లుగా మరో ప్రపంచకప్ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఇంగ్లండ్ దానిని మరో నాలుగేళ్లకు పొడిగించుకోగా... నెదర్లాండ్స్ ‘షూటౌట్’లో అవుట్ అయింది... సౌదీ అరేబియా, జపాన్, ఆస్ట్రేలియా అడపాదడపా మెరిసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కే పరిమితంకాగా... డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ అంచనాలను నిలబెట్టుకుంది. అర్జెంటీనా ఆరంభ విఘ్నాన్ని అధిగమించి ఆఖరకు జగజ్జేతగా నిలిచి ఔరా అనిపించి సాకర్ సంగ్రామానికి శుభంకార్డు వేసింది. అంచనాలను మించి... 29 రోజులపాటు సాగిన ఈ సాకర్ సమరంలో అందరి అంచనాలను తారుమారు చేసి ఆకట్టుకున్న జట్టు మొరాకో. 2018 ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాతో తొలి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించి, రెండో మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంను బోల్తా కొట్టించి... మూడో మ్యాచ్‌లో కెనడాపై గెలిచిన మొరాకో గ్రూప్ ‘ఎఫ్’ టాపర్‌గా నిలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 2010 ప్రపంచ చాంపియన్ స్పెయిన్‌పై ‘షూటౌట్’లో గెలిచిన మొరాకో క్వార్టర్ ఫైనల్లో 1–0తో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టును ఇంటిదారి పట్టించి ప్రపంచకప్ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా ఘనత సాధించింది. అయితే సెమీఫైనల్లో పటిష్టమైన ఫ్రాన్స్ చేతిలో పోరాడి ఓడిన మొరాకో మూడో స్థానం కోసం మ్యాచ్‌లో క్రొయేషియా చేతిలోనూ ఓడిపోయి నాలుగో స్థానంతో ఈ మెగా ఈవెంట్‌ను ముగించింది. మెస్సీ ఇంకొన్నాళ్లు... 36 ఏళ్ల అర్జెంటీనా ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన మెస్సీ తన కెరీర్లో లోటుగా ఉన్న విశ్వ కిరీటాన్ని సొంతం చేసుకొని దిగ్గజాల సరసన చేరిపోయాడు. సౌదీ అరేబియా చేతిలో ఆరంభ మ్యాచ్‌లోనే ఓడిపోయినా తన నాయకత్వ పటిమతో జట్టును ముందుండి నడిపించిన మెస్సీ ఆ తర్వాత ట్రోఫీ ముద్దాడేవరకు వెనుదిరిగి చూడలేదు. ఫ్రాన్స్‌తో ఫైనల్ అర్జెంటీనా తరఫున తన చివరి మ్యాచ్ అని ప్రకటించిన 35 ఏళ్ల మెస్సీ జట్టు జగజ్జేతగా నిలవడంతో తన నిర్ణయంపై పునరాలోచించాడు. ప్రపంచ చాంపియన్ అనే హోదాను ఇంకొన్నాళ్లు ఆస్వాదిస్తానని... జాతీయ జట్టుకు మరికొన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నానని తన మనసులోని మాటను వెల్లడించాడు. మెస్సీ కోరుకుంటే 2026 ప్రపంచకప్‌లోనూ ఆడవచ్చని అర్జెంటీనా కోచ్ లియోనల్ స్కలోని వ్యాఖ్యానించారు. ఈ టోర్నీలో ఏడు గోల్స్ సాధించిన మెస్సీ అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గానూ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. భవిష్యత్ ఎంబాపెదే... నాలుగేళ్ల క్రితం రష్యా గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ టైటిల్ సాధించడంలో యువస్టార్ కిలియాన్ ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. ఖతర్‌లోనూ ఎంబాపె అదరగొట్టాడు. ముఖ్యంగా ఫైనల్లో చివరి పది నిమిషాల్లో ఎంబాపె ఆటతో అర్జెంటీనా హడలెత్తిపోయింది. మ్యాచ్ ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య కాకుండా ఎంబాపె, అర్జెంటీనా మధ్య జరుగుతోందా అనే అనుమానం కలిగింది. చివరకు ‘షూటౌట్’లో ఫ్రాన్స్ ఓడిపోయినా ఎంబాపె పోరాట యోధుడిలా అందరి దృష్టిలో నిలిచాడు. జిరూడ్, గ్రీజ్మన్, కరీమ్ బెంజెమాలాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల కెరీర్ చరమాంకానికి చేరుకోవడంతో భవిష్యత్ ఎంబాపెదే కానుంది. 23 ఏళ్ల ఎంబాపె ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం వచ్చే ప్రపంచకప్‌లోనూ ఫ్రాన్స్ జట్టు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందని చెప్పవచ్చు. ‘యునైటెడ్’లో కలుద్దాం... అందరి ఆటగా పేరున్న ఫుట్‌బాల్ విశ్వసమరం వచ్చేసారి మూడు దేశాల్లో జరగనుంది. అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు 2026 ప్రపంచకప్‌నకు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. మరిన్ని జట్లకు అవకాశం లభించాలనే సదుద్దేశంతో ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) 2026 ప్రపంచకప్‌ను 32 జట్లకు బదులుగా 48 జట్లతో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, మెక్సికో, కెనడా జట్లకు నేరుగా ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే అవకాశం లభించింది. మిగతా 45 బెర్త్‌ల కోసం వచ్చే ఏడాది మార్చి నుంచి క్వాలిఫయింగ్ దశ మ్యాచ్‌లు మొదలై 2026 మార్చి వరకు కొనసాగుతాయి. మొత్తం 48 జట్లను 16 గ్రూప్‌లుగా (ఒక్కో గ్రూప్‌లో మూడు జట్లు) విభజిస్తారు. గ్రూప్ దశ తర్వాత ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 32 జట్లు నాకౌట్ తొలి రౌండ్ దశకు అర్హత సాధిస్తాయి. సాక్షి క్రీడా విభాగం -
మరపురాని క్షణాలు
ఫుట్‌బాల్ ప్రియుల జ్ఞాపకాలలో డిసెంబర్ 18 నాటి రాత్రి అనేక సంవత్సరాలు గుర్తుండిపోతుంది. 2022 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ సాగిన తీరు అలాంటిది. ప్రపంచ ఫుట్‌బాల్ సంఘం ‘ఫిఫా’ సారథ్యంలో నాలుగేళ్ళకోసారి జరిగే ఈ క్రీడా ఉత్సవంలో అర్జెంటీనా, ఫ్రాన్స్‌ల ఫైనల్ వంద కోట్ల పైచిలుకు మందిని తెర ముందు కట్టిపడేసింది. దిగ్గజాలైన 35 ఏళ్ళ మెస్సీ (అర్జెంటీనా), 24 ఏళ్ళ ఎంబాపే (ఫ్రాన్స్)ల మధ్య పోటాపోటీలో నిర్ణీత 90 నిమిషాలు, ఆపై అదనపు సమయాల్లోనూ ప్రత్యర్థులను సమవుజ్జీలుగా నిలిపిన ప్రతి ఘట్టం కుర్చీ అంచున కూర్చొని చూసేలా చేసింది. చివరకు పెనాల్టీ షూటౌట్లో 4–2 గోల్స్ తేడాతో అర్జెంటీనా, ఫ్రాన్స్నుఓడించడంతో ఉద్విగ్నత ముగిసింది. అయితే, ఈ 2022 విశ్వక్రీడా కిరీట పోరాటంపై చర్చ మాత్రం ఇప్పుడప్పుడే ఆగదు. అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ అనేక ఏళ్ళుగా తనను ఊరిస్తున్న స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. 1986 తర్వాత 36 ఏళ్ళకు తమ దేశానికి మరోసారి ప్రపంచ కప్ తెచ్చిపెట్టి, నవతరం క్రీడాభిమా నుల్లో తమ దేశానికే చెందిన మునుపటి ఫుట్‌బాల్ మాంత్రికుడు డీగో మారడోనాను మరిపించారు. తమ దేశం సాధించిన ఈ 3వ వరల్డ్ కప్ ట్రోఫీని చిరకాలం గుర్తుంచుకొనేలా చేశారు. ఫుట్‌బాల్ క్రీడాచరిత్రలో 5 వరల్డ్ కప్‌లలో పాల్గొన్న ఆరుగురు ఆటగాళ్ళలో ఒకడిగా నిలిచారు. ఏకంగా 4 ఛాంపియన్స్ లీగ్స్ సహా అనేక ఘనతలు సాధించినా, వరల్డ్‌కప్ ట్రోఫీ మాత్రం చిరకాలంగా మెస్సీకి అందకుండా ఊరిస్తూ వచ్చింది. 2014లో ఆఖరి దాకా వెళ్ళినా, ఆ కలను నెరవేర్చుకోలేకపోయారు. ఇప్పుడా లోటు భర్తీ చేసుకోవడమే కాక, ఈ వరల్డ్ కప్‌లో ప్రతి నాకౌట్ గేమ్‌లోనూ గోల్ చేసిన అరుదైన ఆటగాడయ్యారు. ఒకటీ రెండు కాదు... 13 వరల్డ్ కప్ గోల్స్ చేసి, దిగ్గజ ఆటగాడు పీలేను సైతం అధిగమించారు. ఫిఫా వరల్డ్ కప్‌లో 2 సార్లు గోల్డెన్ బాల్ ట్రోఫీని గెల్చిన ఏకైక ఆటగాడనే ఖ్యాతి గడించారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (జీఓఏటీ) పట్టానికి అర్హుడినని నిరూపించారు. పీలే, మార డోనా తర్వాత సరికొత్త ప్రపంచ ఫుట్‌బాల్ దేవుడిగా అవతరించారు. ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు సృష్టించినా, గాయాల బారినపడ్డ ఫ్రాన్స్‌కు కిరీటం కట్టబెట్టలేకపోతేనేం... 23 ఏళ్ళ ఎంబాపే కోట్లాది జనం మనసు గెలిచారు. ప్రపంచం కళ్ళప్పగించే మరో సాకర్ స్టార్ అనిపించుకున్నారు. కాలం మారింది. తాజా ప్రపంచ కప్ పోటీలు పాత కథను చెరిపేశాయి. వివిధ జట్ల మధ్య అంతరాన్ని చెరిపేశాయి. మరుగుజ్జులని అంతా భావించిన ఆసియా, ఆఫ్రికా ప్రాంత జట్లు ఆకలి గొన్న పులుల లాగా మైదానంలో ప్రత్యర్థి జట్లను వేటాడి, విజయాలు సాధించాయి. ప్రపంచంలో 80 శాతం జనాభా నివసించే ఈ ప్రాంత జట్లు విశ్వవేదికపై ఫేవరెట్లు కాదని అందరూ భావించినా, అగ్రస్థానంలోకి దూసుకొచ్చాయి. ఈ సాకర్ పోరాటంలో జపాన్ జట్టు 2014, 2010 వరల్డ్ ఛాంపి యన్స్ జర్మనీ, స్పెయిన్‌లను ఓడించి, ఆశ్చర్యపరిచింది. నరాలు తెగే ఉత్కంఠలోనూ స్థిమితంగా ఉంటూ, పూర్తి భిన్నమైన ఆట తీరు చూపడం జపాన్ జట్టు ప్రధాన కోచ్‌నే అబ్బురపరిచింది. ఒక్క జపానే కాదు... మొరాకో, సెనెగల్ లాంటి అనేక ఇతర నాన్ ఫేవరెట్ జట్లూ, బలమైన యూరోపియన్ జట్లకు చెమటలు పట్టించాయి. సెమీస్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ దేశంగా మొరాకో చరిత్ర సృష్టించింది. ఆసియా, ఆఫ్రికా ప్రాంత జట్లు టైటిల్ విజేతలు కాకపోతేనేం, తమను ఇక తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని చాటాయి. ఇంకా అనేక ఆశ్చర్యాలకు ఖతర్‌లో సాగిన ఈ 2022 వరల్డ్ కప్ వేదికైంది. జగజ్జేత అర్జెంటీనా సైతం సౌదీ అరేబియా చేతిలో, రన్నరప్ ఫ్రాన్స్ జట్టు ట్యునీసియా చేతిలో మట్టికరిచాయి. టోర్నమెంట్‌కు ముందు ఫేవరెట్లుగా భావించిన బెల్జియమ్, జర్మనీ, డెన్మార్క్‌లు మధ్యలోనే ఇంటి ముఖం పట్టాయి. అయితే, ఆద్యంతం వినోదానికి కొరవ లేదు. అదే సమయంలో స్వలింగ సంపర్కుల ఆకాంక్షలపై షరతులు, వేదికగా నిలిచిన ఖతార్ మానవ హక్కుల రికార్డులపై విమర్శలు, వివాదాలూ లేకపోలేదు. ప్రపంచమంతటి లాగే భారత్‌లోనూ సాకర్‌పై ఆసక్తి అపారం. మన దేశంలో 1982లో వరల్డ్ కప్ ఫుట్‌బాల్ ప్రత్యక్ష ప్రసారాలు మొదలయ్యాయి. యాంటెన్నాలతో, చుక్కలు నిండిన బ్లాక్ అండ్ వైట్ టీవీలే మహాప్రసాదంగా ప్రపంచ శ్రేణి ఆటగాళ్ళ ఆటను తొలిసారి తెరపై సామాన్యులు చూశారు. ఆ దెబ్బకు అప్పుడే బెంగుళూరులో జరుగుతున్న ఐటీఐ, హెచ్ఏఎల్ లాంటి అగ్రజట్ల మధ్య ఫుట్ బాల్ లీగ్ మ్యాచ్‌లకు స్టేడియమ్‌లు నిండిపోయాయట. నిజానికి, బెంగాల్, కేరళల్లో సోకర్పై పిచ్చి ప్రేమ ఆది నుంచీ ఉన్నదే. ఈసారీ దేశంలో టీవీని దాటి, 11 కోట్ల మందిపైగా వీక్షకులు యాప్‌ల ద్వారా డిజిటల్‌గా ఈ వరల్డ్ కప్ చూశారు. డిజిటల్ వ్యూయర్షిప్లో ఇది ఓ రికార్డ్. ఇంతగా ప్రేమి స్తున్న ఆటకు ప్రభుత్వ ప్రోత్సాహమెంత? విశ్వవేదికపై కనీసం క్వాలిఫై కాని మన ఆట తీరేంటి? ఈ వరల్డ్ కప్ ఫైనల్ దెబ్బతో 1998లో స్థాపించిన గూగుల్ సెర్చ్‌లో గత పాతికేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేనంతటి రద్దీ ఆదివారం ఏర్పడింది. ఫైనల్ విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు జనం ఆతురత చూపారు. క్రికెట్ లాంటివెన్ని ఉన్నా, ప్రపంచం మొత్తాన్నీ ఉర్రూతలూపేది ఫుట్‌బాల్ అనేది అందుకే. అదే సమయంలో క్రీడాస్ఫూర్తిని పెంచాల్సిన ఆటలో ఫలితాలు వచ్చాక గ్రూప్ దశలో, ఫైనల్ తర్వాత ఫ్రాన్స్ సహా వివిధ దేశాల్లో విధ్వంసాలు రేగడం విషాదం. మారాల్సిన వికృత నైజానికివి నిదర్శనం. ఏమైనా, ఇవన్నీ 2026లో వచ్చే వరల్డ్ కప్‌కు పాఠం కావాలి. వర్ణాలు, వర్గాలకు అతీతంగా ఫుట్‌బాల్ గెలవాలి. వట్టి మెస్సీ, ఎంబాపేల నామ జపం కన్నా అది ముఖ్యం. -
మెస్సీ అసోంలో పుట్టాడు..!
ఫిఫా వరల్డ్‌కప్-2022 విజేతగా అర్జెంటీనా ఆవిర్భవించిన క్షణం నుంచి ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీపై ప్రశంసల వర్షం కురుస్తూ ఉంది. విశ్వం నలుమూలల్లో ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు మెస్సీని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) అని సంబోధిస్తూ ఆకాశానికెత్తుతున్నారు. ఫైనల్ మ్యాచ్ పూర్తై 24 గంటలు గడుస్తున్నా మెస్సీ నామస్మరణతో ప్రపంచ వీధులన్నీ మార్మోగిపోతున్నాయి. సామాన్యుల దగ్గరి నుంచి హైరేటెడ్ సెలబ్రిటీల వరకు మెస్సీని అభినందనలతో (సోషల్‌మీడియా వేదికగా) ముంచెత్తుతున్నారు. ఎంతో మంది లాగే మన దేశంలోని అసోం రాష్ట్రానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు కూడా ట్విటర్ వేదికగా మెస్సీని అభినందించాడు. అసోంకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అబ్దుల్ ఖలీక్ మెస్సీని అభినందిస్తూ.. అసోంతో మీకు సంబంధం ఉన్నందుకు చాలా గర్విస్తున్నామంటూ పొంతన లేని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా నివ్వెరపోయారు. మెస్సీ ఏంటి.. అసోంతో సంబంధం ఏంటీ అంటూ సందిగ్ధంలో ఉండిపోయారు. సదరు ఎంపీ గారు చెప్పింది నిజమేనా అని ఓ సారి క్రాస్ చెక్ కూడా చేసుకున్నారు. ఓ నెటిజన్ అయితే మెస్సీకి అసోంతో కనెక్షన్ నిజమేనా అని ఎంపీ గారిని ప్రశ్నించాడు. ఇందుకు ఎంపీ స్పందిస్తూ.. అవును, మెస్సీ అసోంలోనే పుట్టాడు అంటూ బదులిచ్చాడు. assam connection? — Aditya Sharma (@strangecrickkk) December 19, 2022 ఈ ట్వీట్లు కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చేసుకుని ఫేక్ న్యూస్ అని తేల్చేసిన నెటిజన్లు కాంగ్రెస్ ఎంపీని ఓ రేంజ్లో ఆటాడుకున్నారు. ఎంపీ గారి అజ్ఞానాన్ని ఏకి పారేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో తప్పు తెలుసుకున్న సదరు ఎంపీ తన ట్వీట్లను తొలగించారు. అబ్దుల్ ఖలీక్ అసోంలోని బార్ పేట్ లోక్‌సభ స్థానానికి పాత్రినిధ్యం వహిస్తున్నాడు. కాగా, ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా నిన్న (డిసెంబర్ 18) ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో మెస్సీ 2 గోల్స్‌తో మాయాజాలం చేసి అర్జెంటీనాను జగజ్జేతగా నిలపడమే కాకుండా వరల్డ్‌కప్ గెలవాలన్న తన చిరకాల కోరికను సైతం నెరవేర్చుకున్నాడు. అర్జెంటీనా ఫైనల్లో ఫ్రాన్స్‌ను 4-2 గోల్స్ తేడాతో ఓడించి మూడోసారి (1978, 1986, 2022) జగజ్జేతగా ఆవిర్భవించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో నిర్ణీత సమయంతో పాటు 30 నిమిషాల అదనపు సమయం తర్వాత కూడా ఫలితం తేలకపోవడంతో (3-3) మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. షూటౌట్లో మెస్సీ సేన 4 గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ 2 గోల్స్‌కే పరిమితమై ఓటమిపాలైంది. నిర్ణీత సమయంలో ఆర్జెంటీనా తరఫున మెస్సీ 2 గోల్స్, ఏంజెల్ డి మారియ ఒక గోల్ సాధించగా.. ఫ్రాన్స్ తరఫున కైలియన్ ఎంబపే హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టాడు. -
మెస్సీ మ్యాజిక్కా.. అదృష్టమా.. ఎంబాపె అల్లాడించాడు
మొత్తానికి మెస్సీ అభిమానుల ఆశ ఫలించింది. అర్జెంటీనా మేటి ఆటగాడు లియోనల్ మెస్సీ చిరకాల వాంఛ నెరవేరింది. మెస్సీ ఫ్యాన్స్‌కు అర్జెంటీనా ‘ఖతర్’నాక్ విజయం అమితానందాన్ని కలిగించింది. ఫిఫా ప్రపంచకప్ 2022 విజేతగా అర్జెంటీనా నిలవడంతో అభిమానుల సంబరాలు ఆకాశన్నంటాయి. అర్జెంటీనా గెలిచినప్పటికీ ఫ్రాన్స్ పోరాటస్ఫూర్తిని కూడా పలువురు అభినందిస్తున్నారు. ఆట మొత్తంగా చూస్తే అర్జెంటీనా కంటే ఫ్రాన్స్ మెరుగ్గా ఆడిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై చర్చించుకుంటున్నారు. ఆట మొదటి అర్ధభాగంలో వెనుకబడినప్పటికీ పుంజుకుని పెనాల్టీ షూటౌట్ వరకు తీసుకెళ్లడం ఫ్రాన్స్ పోరాట పటిమకు నిదర్శమని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అర్జెంటీనా తప్పిదం వల్ల మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ వరకు వెళ్లిందన్న వాదనలు విన్పిస్తున్నాయి. కైలియన్ ఎంబాపె అయితే అదరగొట్టాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఫస్ట్ హాఫ్ అంతా అర్జెంటీనా దే గేమ్. అర్జెంటీనా డిఫెన్స్‌ను ఫ్రాన్స్ ఛేదించలేకపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఫ్రాన్స్ గోల్ చేసే అవకాశం కూడా రాలేదు. కానీ అర్జెంటీనాకు చాలా అవకాశాలు వచ్చాయి. తేలిగ్గా గెలవాల్సిన మ్యాచ్‌ను అర్జెంటీనా పెనాల్టీ షూట్ అవుట్ వరకు తెచ్చుకుంది. అలా గెలవాలని కోరుకోరు కూడా. ఏదేమైనా గెలుపు గెలుపే. కంగ్రాట్స్ టు అర్జెంటీనా’ అంటూ నెటిజన్ ఒకరు వ్యాఖ్యానించారు. ‘మొదట దెబ్బలు తిని తర్వాత కౌంటర్ అటాక్ చేసేవారిపై సానుభూతి చూపడం మానవ సహజం. అయితే మొదటి నుంచే సమర్థవంతంగా ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడులు ద్వారా అర్జెంటీనాయే ఒకట్రెండు శాతం ఎక్కువ పైచేయి సాధించింద’ని మరొకరు అభిప్రాయపడ్డారు. ‘అర్జెంటీనా ఆఖరి 12 నిమిషాలు అజాగ్రత్తగా ఆడింది. ఆట మొదటి 65 నిమిషాల వరకు ఫ్రాన్స్‌కు ఎటువంటి ఛాన్స్ ఇవ్వని మెస్సీ టీమ్ చివరలో మాత్రం కాస్త తడబడింది. ఏమైనా మ్యాచ్ మాత్రం సూపర్’ అంటూ ఇంకొరు పేర్కొన్నారు. ‘ఆట మొదటి అర్ధభాగం మొత్తంలో ఫ్రాన్స్ ప్రత్యర్థి గోల్ మీద ఒక షాట్ కూడా కొట్టలేదు. బాల్ 31% సమయం మాత్రమే ఫ్రాన్స్ అధీనంలో ఉంది. అర్జెంటీనా పూర్తిగా డామినేట్ చేసింది. కీలక సమయంలో పెనాల్టీలు ఫ్రాన్స్‌కు కలిసివచ్చాయి. వ్యక్తిగత గోల్స్ మాత్రం మెస్సీ మ్యాజిక్. ఎంబాపె అల్లాడించాడు. చివరలో అర్జెంటీనా గోల్ కీపర్ జట్టును సేవ్ చేశాడ’ని పలువురు వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా మ్యాచ్ మాత్రం తమను ఎంతగానో అలరించిందని క్రీడాభిమానులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఫుట్‌బాట్ ప్రపంచకప్ ఫైనల్ ఊహించిన దానికన్నా తమను ఉత్కంఠకు గురిచేసిందని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: మెస్సీ సాధించాడు.. ఘనంగా ‘ముగింపు’!) -
Kerala: హింసాత్మకంగా మారిన ఫిఫా విక్టరీ సంబురాలు
ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత్‌లోనూ ఈ ఆటకు కోట్లలో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. ముఖ్యంగా కేరళ ప్రజలు షుట్ బాల్ ఆటను విపరీతంగా ఫాలో అవుతుంటారు. ఖతర్ వేదికగా జరిగిన 2022 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా ఫ్రాన్స్ హోరాహోరీగా తలపడిన విషయం తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ పోరులో చివరికి మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాదే పైచేయి అయ్యింది. 36 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ టైటిల్‌ను అర్జెంటీనా ముద్దాడింది. దీంతో మెస్సీ అభిమానులు వీర లెవల్లో పండగ చేసుకుంటున్నారు. Calicut Kerala❤️🔥#WorldCup2022 pic.twitter.com/aZu5tlHnak — ForumKeralam (@Forumkeralam2) December 18, 2022 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా కేరళలోని ఫ్యాన్స్ అర్జెంటీనా, ఫ్రాన్స్ జెర్సీలు ధరించి జెండాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. జట్టు సభ్యుల భారీ కటౌట్లతో హోరెత్తించారు. ఫ్రాన్స్‌పై అర్జెంటీనా బృందం అద్భుత విజయం సాధించడంతో కేరళలో సంబరాలు అంబరాన్ని అంటాయి. స్వీట్లు, ఉచితంగా ఫుడ్ పంపిణీ చేస్తూ.. రోడ్లపై టపాసులు పేల్చుతూ డ్యాన్స్‌లతో అర్జెంటీనా విజయాన్ని వేడుకగా జరుపుకున్నారు. అయితే వేడుకలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి. కేరళలోని కన్నూర్‌లో ఆదివారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారని పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కొచ్చిలోని కలూర్లో అర్జెంటీనా అభిమానుల బృందం మద్యం సేవించి బైక్‌లపై ఊరేగింపుతో హంగామా సృష్టించారు. వీరిని నియత్రించడానికి ప్రయత్నించిన ముగ్గురు పోలీసులు సైతం గాయపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకోగా, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. FIFA WC 2022 AGRENTINA WIN Raising flags in Kerala. People enjoying. No complaints No FiR No Case No Arrest But when Pakistan Flag Rises...🙆 Why Double standard🤷 pic.twitter.com/qvGJJ3gjjV — MAK🇮🇳 (@MAKBABA7) December 19, 2022 అదే విధంగా తిరువనంతపురం, పొజియూర్లో విజయోత్సవ వేడుకలను నియంత్రించేందుకు ప్రయత్నించిన సబ్ఇన్స్పెక్టర్ గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొల్లంలో వేడుకల్లో పాల్గొన్న 18 ఏళ్ల యువకుడు ఉన్నట్టుండి కుప్పకూలి మృతి చెందాడు. -
సముద్రమంత అభిమానం.. కడలి అంచుల్లో మెస్సీ కటౌట్
ఫుట్‌బాల్ లెజెండ్, గ్రేటెస్ట్ ఆఫ్ టైమ్ (GOAT), అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీపై అభిమానం ఎల్లలు దాటుతోంది. విశ్వం నలుమూలల్లో ఉన్న ఫుట్‌బాల్ ఫ్యాన్స్ మెస్సీ నామస్మరణతో భూమ్యాకాశాలను మార్మోగిస్తున్నారు. మెస్సీ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ అయితే భూమి, ఆకాశాలతో పాటు నడి సంద్రంలోనూ తమ ఆరాధ్య ఫుట్‌బాలర్‌పై అభిమానాన్ని చాటుకుంటున్నారు. కేరళకు చెందిన మెస్సీ వీరాభిమానులు.. ఫిఫా వరల్డ్‌కప్-2022లో అర్జెంటీనా ఫైనల్‌కు చేరితే మెస్సీ కటౌట్‌ను సముద్ర గర్భంలో ప్రతిష్టింపజేస్తామని శపథం చేసి, ఆ ప్రకారమే చేశారు. మెస్సీకి చెందిన భారీ కటౌట్‌ను వారు పడవలో తీసుకెళ్లి అరేబియా సముద్రంలో 100 అడుగుల లోతులో దిబ్బల మధ్య ప్రతిష్టింపజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. View this post on Instagram A post shared by Mohammed Swadikh (@lakshadweep_vlogger_) కాగా, సెమీస్‌లో క్రొయేషియాపై 3-0 గోల్స్ తేడాతో జయకేతనం ఎగురవేసి దర్జాగా ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా.. నిన్న (డిసెంబర్ 18) జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను 4-2 గోల్స్ తేడాతో ఓడించి జగజ్జేతగా ఆవిర్భవించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో నిర్ణీత సమయంతో పాటు 30 నిమిషాల అదనపు సమయం తర్వాత కూడా ఫలితం తేలకపోవడంతో (3-3) మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. షూటౌట్లో మెస్సీ సేన 4 గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ 2 గోల్స్‌కే పరిమితం కావడంతో అర్జెంటీనా మూడోసారి వరల్డ్ ఛాంపియన్‌గా (1978, 1986, 2022) అవతరించింది. నిర్ణీత సమయంలో ఆర్జెంటీనా తరఫున మెస్సీ 2 గోల్స్, ఏంజెల్ డి మారియ ఒక గోల్ సాధించగా.. ఫ్రాన్స్ తరఫున కైలియన్ ఎంబపే హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టాడు. -
మెస్సీ, సచిన్.. నమ్మశక్యం కాని రీతిలో ఒకేలా..!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ గ్రేట్ లియోనల్ మెస్సీ వరల్డ్‌కప్ జర్నీ నమ్మశక్యం కాని రీతిలో ఒకేలా కొనసాగడం క్రీడాభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఈ ఇద్దరు దిగ్గజాలు తమ కెరీర్లో తొలి వరల్డ్‌కప్ సాధించే క్రమంలో చాలా విషయాల్లో దగ్గరి పోలికలు (దాదాపు ఒకేలా) కలిగి ఉన్నారు. Sports has paid its due to the GOATS 🐐#CricketTwitter #fifaworldcup2022 pic.twitter.com/vQJ3AguTf3 — Sportskeeda (@Sportskeeda) December 18, 2022 10 నంబర్ జెర్సీ ధరించే ఈ ఇద్దరు లెజెండ్స్.. తమ కెరీర్లో చివరి వరల్డ్‌కప్ ఆడుతున్నామని ముందే ప్రకటించి మరీ తమ జట్లను జగజ్జేతలుగా నిలిపారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)గా కీర్తించబడే సచిన్, మెస్సీ వారివారి వరల్డ్‌కప్ జర్నీలో 8 ఏళ్ల క్రితం చివరిసారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. #OnThisDay In 23/3/2003 Australia Defeated India in WC final 💔 Sachin Tendulkar Received M.O.S Award for his 673 runs & 2 wickets In 2003WC Most runs in a WC tournament 673 - Sachin (2003)* 659 - Hayden (2007) 648 - Rohit (2019) 647 - Warner (2019) pic.twitter.com/7kj56s1Rod — 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) March 23, 2022 సచిన్ ప్రాతినిధ్యం వహించిన టీమిండియా 2003 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ దాకా చేరి, తుది సమరంలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సరిగ్గా 8 సంవత్సరాల తర్వాత టీమిండియా 2011లో వన్డే వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. మెస్సీ విషయంలో ఇలానే జరిగింది. One of my most distinct memories from reporting on the 2014 World Cup was Messi’s dejected face staring at the trophy after losing the final to Germany. Good to see him finally be able to lift it at his last tournament pic.twitter.com/8tLoDyTQOp — Citizen of Paldea (@westcoastrepz) December 18, 2022 2014 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో మెస్సీ ప్రాతినిధ్యం వహించిన అర్జెంటీనా.. జర్మనీ చేతిలో ఓటమిపాలై ఛాంపియన్‌షిప్‌కు అడుగు దూరంలో నిలిచిపోయింది. అయితే సరిగ్గా 8 ఏళ్ల తర్వాత సచిన్ విషయంలో జరిగినట్టే మెస్సీ విషయంలోనూ జరిగింది. 2022 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జగజ్జేతగా అవతరించింది. June 25, 1983: The iconic image of Kapil Dev holding the World Cup Trophy at Lord’s is a watershed moment in Indian cricket history. It changed cricket in India. This win inspired the next generation to achieve the impossible & dream BIG pic.twitter.com/hoyEobpuwL — Mohammad Kaif (@MohammadKaif) June 25, 2020 #WorldCupFinal with Argentina playing are so exhilarating because - they are vulnerable! Remember 1986... pic.twitter.com/Vy6dJ5zyc3 — Dibyendu Nandi (@ydnad0) December 19, 2022 యాదృచ్చికంగా ఈ ఇద్దరు ప్రాతినిధ్యం వహించే జట్లు చివరిసారిగా వరల్డ్‌కప్‌ను 1980ల్లోనే నెగ్గాయి. లెజెండ్ కపిల్ దేవ్ సారధ్యంలో భారత్ 1983లో వన్డే వరల్డ్‌కప్ కైవసం చేసుకోగా.. 80వ దశకంలోనే (1986లో) ఫుట్‌బాల్ మాంత్రికుడు డీగో మారడోనా నేతృత్వంలో అర్జెంటీనా వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. 30 Mar 2011 - India beat their arch-rivals Pakistan in semifinal of 2011 WC. Sachin Tendulkar's 85 proved to be a match-winning knock for India. He was awarded player of the match for 3rd time against Pakistan in World Cup tournament. He is always Man of big tournaments 🙏🙏 pic.twitter.com/O8d6WtQjHO — Sachinist (@Sachinist) March 30, 2021 ఇవే కాక సచిన్, మెస్సీ తమతమ వరల్డ్‌కప్ జర్నీలను సంబంధించి మరిన్ని విషయాల్లో పోలికలు కలిగి ఉన్నారు. సచిన్ 2011 వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు (9 మ్యాచ్‌ల్లో 482 పరుగులు) చేసిన భారత ఆటగాడిగా నిలువగా.. మెస్సీ 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ (7 గోల్స్) సాధించిన అర్జెంటీనా ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. Messi wins man of the match against Croatia. (Yeah he's won it again... 4th this World Cup, he's insane.) pic.twitter.com/1suL2E1K9X — K.Shah (@kshitijshah23) December 13, 2022 అలాగే ఈ ఇద్దరు దిగ్గజాలు తమ ప్రపంచకప్ ప్రయాణంలో సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. సచిన్.. పాకిస్తాన్‌తో జరిగిన సెమీస్‌లో 85 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ఈ అవార్డుకు ఎంపిక కాగా.. క్రొయేషియాతో జరిగిన సెమీస్‌లో మెస్సీ ఒక గోల్ సాధించడంతో పాటు మరో రెండు గోల్స్ కొట్టడంలో జూలియన్ అల్వారెజ్‌కు సహకరించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. Leo Messi. The living legend just secured his legacy. 1,003 games. 793 goals. 7 Ballon d’Or wins. 1 World Cup. Messi just completed the set. If you’re still debating who TBE is, it’s time to rest your case. He is him. Game over. pic.twitter.com/Lsfvep2bef — VERSUS (@vsrsus) December 18, 2022 వీటితో పాటు తమ చిరకాల కోరిక నెరవేరిన అనంతరం ఈ ఇద్దరు దిగ్గజాలను సహచర సభ్యులు యాదృచ్చికంగా ఒకేలా సత్కరించారు. ప్రపంచకప్ నెగ్గిన అనంతరం ఈ ఇద్దరిని సహచరులు భుజాలపై ఎక్కించుకుని స్టేడియం మొత్తం ఊరేగించారు. Sachin Tendulkar top-scored for 🇮🇳 with 482 runs in their victorious 2011 @cricketworldcup campaign 🏆 Vote to help his ‘Carried on the shoulders of a nation’ moment enter the final round of Laureus Sporting Moment: https://t.co/tqBHY3AyDB#OneFamily @sachin_rt pic.twitter.com/nD3OGSDuF2 — Mumbai Indians (@mipaltan) February 1, 2020 Parallels between FIFA WC 2022 and Cricket World Cup 2011. GOATs (?) of respective sports without the World Cup trying to win it in the last try and doing it. They both lost in the final 8 years before. 2003 vs Australia for Sachin & 2014 vs Germany for Messi pic.twitter.com/yJ4oqf8ceq — NYY (@adi_nyy) December 18, 2022 -
ఎట్టకేలకు సాధించాం! మెస్సీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పోస్ట్ వైరల్
FIFA WC 2022 Winner Lionel Messi Comments: ‘‘ఈ టైటిల్‌తో నా కెరీర్ ముగించాలని ఆశపడ్డాను. ఇంతకు మించి నేను కోరుకునేది ఏదీ లేదు. ఇలా ట్రోఫీ సాధించి కెరీర్‌కు వీడ్కోలు పలకడం చాలా బాగుంటుంది కదా! దీని తర్వాత సాధించాల్సింది ఇంకేముంది? కోపా అమెరికా.. ఇప్పుడు వరల్డ్‌కప్.. కెరీర్ చరమాంకంలో నాకు లభించాయి. సాకర్ అంటే నాకు పిచ్చి ప్రేమ. జాతీయ జట్టుకు ఆడటాన్ని నేను ఎల్లప్పుడూ ఆస్వాదిస్తాను. వరల్డ్ చాంపియన్‌గా మరో రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా’’ అంటూ అర్జెంటీనా స్టార్, ప్రపంచకప్ విజేత లియోనల్ మెస్సీ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను ఇప్పుడే రిటైర్ కాబోవడం లేదని స్పష్టం చేశాడు. కాగా ఖతర్ వేదికగా ఆదివారం జరిగిన ఫిఫా వరల్డ్‌కప్-2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో మేజర్ టైటిల్‌తో కెరీర్ ముగించాలనుకున్న మెస్సీ ఆశ నెరవేరినట్లయింది. అయితే, తమ జట్టు ఫైనల్ చేరిన సందర్భంగా అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ ఆడబోతున్నానని మెస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, తాజా వ్యాఖ్యలతో తాను మరికొంత కాలం ఆడతానని అతడు స్పష్టం చేశాడు. ఈ మేరకు ఫైనల్లో గెలిచిన అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు కోసం నేను ఎంతగా ఎదురుచూశానో నాకే తెలుసు. ఆ దేవుడు ఏదో ఒకనాడు నాకు ఈ బహుమతి ఇస్తాడని కూడా తెలుసు. ఇక్కడిదాకా చేరుకోవడానికి చాలా కాలం పట్టింది. మేమెంతగానో కష్టపడ్డాం. కఠిన శ్రమకోర్చాం. ఎట్టకేలకు సాధించాం. వరల్డ్ చాంపియన్‌గా మరిన్ని మ్యాచ్‌లు ఆడతా’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా ఇన్‌స్టా వేదికగా ఫొటోలు పంచుకుంటూ ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ మెస్సీ భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. చదవండి: Messi- Ronaldo: మెస్సీ సాధించాడు.. ఘనంగా ‘ముగింపు’! మరి రొనాల్డో సంగతి? ఆరోజు ‘అవమానకర’ రీతిలో.. Rohit Sharma: ‘సెంచరీ వీరుడు గిల్ బెంచ్‌కే పరిమితం! రెండో టెస్టులో ఓపెనర్లుగా వాళ్లిద్దరే!’ View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: మెస్సీ సాధించాడు.. ఘనంగా ‘ముగింపు’! రొనాల్డో సంగతి? అవమానకర రీతిలో..
Lionel Messi- Cristiano Ronaldo: ఏడుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడిగా ‘బాలన్ డీర్’ అవార్డు... ప్రతిష్టాత్మక క్లబ్ బార్సిలోనా తరఫున ఏకంగా 35 టైటిల్స్‌లో భాగం... ఏ లీగ్‌లోకి వెళ్లినా అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ఘనత... లెక్కలేనన్ని రికార్డులు, అపార ధనార్జన... అపరిమిత సంఖ్యలో అతని నామం జపించే అభిమానులు... మెస్సీ గురించి ఇది ఒక చిన్న ఉపోద్ఘాతం మాత్రమే. ఫుట్‌బాల్ మైదానంలో అతను చూపించిన మాయకు ప్రపంచం దాసోహమంది... ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా గొప్పగా కీర్తించింది... కానీ...కానీ... అదొక్కటి మాత్రం లోటుగా ఉండిపోయింది. మెస్సీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వరల్డ్ కప్ మాత్రం గెలవలేదే అనే ఒక భావన... 2006లో అడుగు పెట్టిన నాటి నుంచి 2018 వరకు నాలుగు టోర్నీలు ముగిసిపోయాయి. కానీ ట్రోఫీ కోరిక మాత్రం తీరలేదు. 2014లో అతి చేరువగా ఫైనల్‌కు వచ్చినా, పేలవ ఆటతో పరాభవమే ఎదురైంది. రొనాల్డోతో ప్రతీసారి పోలిక వరల్డ్ కప్ లేకపోయినంత మాత్రాన అతని గొప్పతనం తగ్గదు... కానీ అది కూడా ఉంటే బాగుంటుందనే ఒక భావన సగటు ఫ్యాన్స్‌లో బలంగా నాటుకుపోయింది. అతని సమకాలీకుడు, సమఉజ్జీ క్రిస్టియానో రొనాల్డోతో ప్రతీసారి ఆటలో పోలిక... కానీ ఇప్పుడు మెస్సీ వరల్డ్ కప్ విన్నర్ కూడా... ఈ విజయంతో అతను రొనాల్డోను అధిగమించేశాడు... అర్జెంటీనా ఫుట్‌బాల్ అంటే మారడోనానే పర్యాయపదం... 1986లో అతను ఒంటి చేత్తో (కాలితో) తమ టీమ్‌ను విశ్వవిజేతగా నిలిపిన క్షణం ఆ దేశపు అభిమానులు మరచిపోలేదు. అంతటివాడు అనిపించుకోవాలంటే వరల్డ్ కప్ గెలవాల్సిందే అన్నట్లుగా ఆ దేశం మెస్సీకి ఒక అలిఖిత ఆదేశం ఇచ్చేసింది! ఎట్టకేలకు అతను ఆ సవాల్‌ను స్వీకరించాడు... తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో పరాజయం ఎదురైన తర్వాత తమను లెక్కలోంచే తీసేసిన జట్లకు సరైన రీతిలో సమాధానమిచ్చాడు. మైదానం అంతటా, అన్నింటా తానై అటు గోల్స్ చేస్తూ, అటు గోల్స్ చేసేందుకు సహకరిస్తూ టీమ్‌ను నడిపించాడు. ప్రపంచ కప్ చరిత్రలో గ్రూప్ దశలో, ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్లో, సెమీస్‌లో, ఫైనల్లో గోల్ చేసిన ఏకైక ఆటగాడు కావడంతో పాటు జట్టును శిఖరాన నిలిపాడు. శాశ్వత కీర్తిని అందుకుంటూ అర్జెంటీనా ప్రజలకు అభివాదం చేశాడు. చివరగా...మెస్సీ భావోద్వేగాలు చూస్తుంటే సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజం కూడా తన కెరీర్లో అన్నీ సాధించిన తర్వాత లోటుగా ఉన్న క్రికెట్ ప్రపంచకప్‌ను ఆరో ప్రయత్నంలో అందుకోవడం, అతడిని సహచరులు భుజాలపై ఎత్తుకొని మైదానంలో తిరిగిన ఘటన మీ కళ్ల ముందు నిలిచిందా! -సాక్షి, క్రీడా విభాగం. మరి రొనాల్డో సంగతి?! గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT).. ప్రస్తుత తరంలో మేటి ఫుట్‌బాల్ ఆటగాడు ఎవరు అంటే.. ఠక్కున గుర్తుకు వచ్చే రెండు పేర్లు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.. అన్నిటిలోనూ పోటాపోటీ.. అయితే, మెస్సీ ఖాతాలో ఇప్పుడు వరల్డ్‌కప్ టైటిల్ ఉంది. 37 ఏళ్ల రొనాల్డోకు ఇక ప్రపంచకప్ ట్రోఫీ గెలిచే అవకాశమే లేదు. నిజానికి, ఖతర్ ఈవెంట్లో మొదటి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా వంటి చిన్న జట్టు చేతిలో ఓటమి పాలైనా ఏమాత్రం కుంగిపోక.. ఒక్కో మ్యాచ్ గెలుస్తూ జట్టును ఫైనల్ వరకు తీసుకువచ్చాడు మెస్సీ. నాయకుడిగా, ఆటగాడిగా తన అపార అనుభవాన్ని ఉపయోగించుకుంటూ జట్టును ఆఖరి మెట్టు వరకు తీసుకువచ్చాడు. ఉత్కంఠభరిత ఫైనల్లోనూ చిరునవ్వు చెదరనీయక ఎట్టకేలకు ట్రోఫీ ముద్దాడి విజయదరహాసం చేశాడు. కానీ రొనాల్డోకు ఈ మెగా టోర్నీకి ముందే ఎదురుదెబ్బలు తగిలాయి. యునైటెడ్ మాంచెస్టర్‌తో బంధం తెగిపోవడం సహా కీలక ప్రి క్వార్టర్స్‌లో జట్టులో చోటు కోల్పోవడం వంటి పరిణామాలు జరిగాయి. పోర్చుగల్ సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ అతడు ఆలస్యంగా బరిలోకి దిగాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో ప్రవర్తన వల్లే కోచ్ అతడిని కావాలనే పక్కనపెట్టాడనే వార్తలు వినిపించాయి. ఏదేమైనా మెస్సీ తన హుందాతనంతో ఘనంగా ప్రపంచకప్ టోర్నీకి వీడ్కోలు పలికితే.. రొనాల్డో మాత్రం అవమానకర రీతిలో నిష్క్రమించినట్లయింది. దీంతో ఇద్దరూ సమఉజ్జీలే అయినా మెస్సీ.. రొనాల్డో కంటే ఓ మెట్టు పైకి చేరాడంటూ ఫుట్‌బాల్ అభిమానులు అంటున్నారు. చదవండి: Mbappe- Messi: మెస్సీ విజయానికి అర్హుడే! కానీ నువ్వు ఓటమికి అర్హుడివి కాదు! గర్వపడేలా చేశావు.. Rohit Sharma: ‘సెంచరీ వీరుడు గిల్ బెంచ్‌కే పరిమితం! రెండో టెస్టులో ఓపెనర్లుగా వాళ్లిద్దరే!’ Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మెస్సీ హీరోనే.. నువ్వేమీ తక్కువ కాదు! గర్వపడేలా చేశావు! బాధపడకు..
Kylian mbappe Beats Messi Win Award: ‘‘మెస్సీ ఈ విజయానికి నూటికి నూరుపాళ్లు అర్హుడే.. అయితే, ఎంబాపే మాత్రం ఓటమికి అర్హుడు కాదు’’... ఆదివారం నాటి ఫిఫా వరల్డ్‌కప్-2022 ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం చూసిన సగటు అభిమాని కనీసం ఒక్కసారైనా మనసులో ఈ మాట అనుకుని ఉంటాడనడంలో సందేహం లేదు. మ్యాచ్ మొదటి అర్ధ భాగంలో ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన ఫ్రాన్స్.. విజయం అంచుల దాకా వెళ్లే వరకు అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించిందంటే అదంతా కెప్టెన్ కైలియన్ ఎంబాపే చలవే! అప్పటి దాకా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఎంబాపె.. రెండో అర్ధ భాగంలో ఒక్కసారిగా విజృంభించాడు. 97 సెకన్ల వ్యవధిలో చకచకా రెండు గోల్స్ చేసి అర్జెంటీనాకు షాక్ ఇచ్చి... అభిమానుల గుండె వేగం పెంచాడు. ఈ క్రమంలో స్కోరు సమం(2-2) చేసిన ఫ్రాన్స్ జోరు పెరిగింది. అర్జెంటీనా గోల్‌పోస్ట్‌ను పదే పదే అటాక్ చేసింది. హోరాహోరీ పోరు.. దీంతో నిర్ణీత సమయం ముగిసేలోపు ఇరు జట్ల స్కోరు సమంగా ఉండటంతో అదనపు సమయం కేటాయించారు. అప్పటికే గోల్‌తో మెరిసిన మెస్సీ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేశాడు.. గోల్ కొట్టి అర్జెంటీనాను ముందుకు తీసుకువెళ్లాడు. తన చిరకాల కలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేశాడు. కానీ, ఓటమిని అంగీకరించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేని ఎంబాపె తమకు దక్కిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి ప్రేక్షకులు ఉత్కంఠతో మునివేళ్ల మీద నిల్చునేలా చేశాడు. అదనపు సమయం ముగిసే సరికి కూడా 3-3తో అర్జెంటీనా- ఫ్రాన్స్ సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. అయితే, షూటౌట్లో అర్జెంటీనా 3–2తో ఆధిక్యంలో ఉన్న సమయంలో పెనాల్టీ తీసుకున్న గొంజాలో మోంటీల్ విజయవంతంగా గోల్ కొట్టడంతో ఎంబాపె బృందం ఆశలు ఆవిరయ్యాయి. ఫ్రాన్స్‌ను 4-2తో ఓడించి మెస్సీ సేన వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది. అంచనాలు తలకిందులు చేసి ఇక ఈ మ్యాచ్‌లో గెలుపుతో ప్రపంచకప్ సాధించాలన్న 35 ఏళ్ల మెస్సీ ఆశయం నెరవేరగా.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్‌ను మరోసారి విజేతగా నిలపాలన్న 23 ఏళ్ల ఎంబాపె కల చెదిరిపోయింది. నిజానికి ఆరంభంలోనే పట్టు సాధించిన అర్జెంటీనా సులువుగా విజయం సాధిస్తుందని అంతా భావించినా.. ఆ అంచనాలు తలకిందులు చేశాడు ఎంబాపె. మెస్సీని వెనక్కినెట్టి... ఏదేమైనా తాను అనుకున్న ఫలితం రాబట్టలేకపోయినా ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ మెరిసిన ఎంబాపె.. మెస్సీతో పాటు తానూ హీరోనే అనిపించుకున్నాడు. ఈ ఎడిషన్‌లో 8 గోల్స్ చేసి మెస్సీని దాటుకుని గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే.. ఫైనల్ మ్యాచ్‌ను చిరస్థాయిగా నిలిచిపోయేలా తన ఆట తీరుతో అలరించిన ఎంబాపె ఆట తీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు సాకర్ అభిమానులు. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT) మెస్సీనే.. అయినా నువ్వేమీ తక్కువ కాదు ఎంబాపె. మెస్సీ ట్రోఫీ గెలిచి మా హృదయాలు పులకింపజేశాడు.. నువ్వు కూడా నీ పోరాటపటిమతో మా మనసులు గెలిచావు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అతడిని అభినందిస్తున్నారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత దిగాలుగా కూర్చున్న ఎంబాపె వద్దకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ వచ్చి అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు.. ‘‘బాధపడకు మిత్రమా.. మెస్సీ ఒక్కడే కాదు నువ్వు కూడా విజేతవే!’’ అంటూ ఎంబాపెకు విషెస్ తెలియజేస్తున్నారు. చదవండి: FIFA WC 2022: విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్‌మనీ, అవార్డులు, ఇతర విశేషాలు KL Rahul: అంత సులువేమీ కాదు.. కష్టపడ్డాం.. గెలిచాం! కాస్త రిలాక్సైన తర్వాతే.. Won our hearts #mbappe 💙🐐 pic.twitter.com/I1SAhvFPvH — Eddy Kenzo (@eddykenzoficial) December 19, 2022 What. A. Player. #mbappe pic.twitter.com/gavhNfdKrB — Piers Morgan (@piersmorgan) December 18, 2022 Mbappé is next Ronaldo, Messi whoever you support now. Only a few people support you in the journey. But when you get success they all will cheer you up. #ArgentinaVsFrance #Mbappe #WorldCupFinal pic.twitter.com/hhVjk9GuNz — Navin Depan (@DepanNavin) December 19, 2022 #EmmanuelMacron @KMbappe #Mbappe Well played and Congratulations for Golden Boot. French President @EmmanuelMacron consoled Mbappe, this shows how this country and president support and love their team. pic.twitter.com/iFlvwk4BhG — Neo007 (@neo007navin) December 18, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి.. ఫ్యాన్స్ ఆగ్రహం.. ఫ్రాన్స్‌లో ఘర్షణలు..
పారిస్: ఆద్యంతం ఉత్కంఠసాగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఓడిపోడవడంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి ఘర్షణలు చెలరేగాయి. పలుచోట్ల అభిమానులు పోలీసులతో బాహాబాహీకి దిగారు. ఫలితంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే హింసకు పాల్పడిన వందల మంది అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు. ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందే ప్రఖ్యాత ఛాంప్స్-ఎలిసీస్ అవెన్యూకు వేల మంది అభిమానులు తరలివెళ్లారు. దీంతో ఆ ప్రాంతం కిక్కిరిసి ట్రాఫిక్‌ను దారిమళ్లించారు. భద్రత కోసం వేల మంది పోలీసులను మోహరించారు. అయితే మ్యాచ్ జరిగినంతసేపు ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం.. పెనాల్డీ షూటౌట్ ఫ్రాన్స్ ఓడిపోవడంతో ఉద్రిక్తంగా మారింది. వేల మంది అభిమానులు ఆగ్రహంతో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పోలీసులపైకి బాణసంచా విసిరారు. ఘర్షణకు కూడా దిగారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. #Lyon : les affrontements après la défaite de la #France en finale de la #FIFAWorldCup se poursuivent, les projectiles pleuvent sur les policiers déployés dans le centre-ville (🎥@JDANDOU @lyonmag) pic.twitter.com/wU40hfENZH — Lyon Mag (@lyonmag) December 18, 2022 ఆదివారం రాత్రి జరిగిన ఫిపా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అదనపు సమయం ముగిసే సరికి ఫ్రాన్స్- అర్జెంటీనా చెరో మూడు గోల్స్ చేసి సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులో 4-2 తేడాతో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా విజయం సాధించింది. ఫలితంగా 36 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అయితే తమ జట్టు ఓడినప్పటికీ గర్వపడే ప్రదర్శన చేసిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మేక్రాన్ పేర్కొన్నారు. మ్యాచ్ అనంతరం తమ టీం సభ్యులను ఓదార్చారు. చదవండి: ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 19 మంది దుర్మరణం.. -
విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్‌మనీ, అవార్డులు, ఇతర విశేషాలు
FIFA World Cup Qatar 2022: దాదాపు నెల రోజులుగా ఖతర్ వేదికగా సాగిన సాకర్ సమరం ముగిసింది. ఫిఫా వరల్డ్‌కప్-2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించిన అర్జెంటీనా జగజ్జేతగా నిలిచింది. స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ సారథ్యంలో విజేతగా నిలిచి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్-2022 అవార్డులు, విజేత, రన్నరప్, లీగ్ దశలో నిష్క్రమించిన జట్లకు దక్కిన ప్రైజ్‌మనీ సహా ఇతర విశేషాలు తెలుసుకుందాం! వరల్డ్‌కప్–2022 అవార్డులు గోల్డెన్ బాల్ (బెస్ట్ ప్లేయర్) లియోనల్ మెస్సీ (7 గోల్స్)- అర్జెంటీనా గోల్డెన్ బూట్ (టాప్ స్కోరర్) కైలియన్ ఎంబాపె- 8 గోల్స్- ఫ్రాన్స్ గోల్డెన్ గ్లౌవ్ (బెస్ట్ గోల్‌కీపర్) మార్టినెజ్ (అర్జెంటీనా; 34 సార్లు గోల్స్ నిలువరించాడు) బెస్ట్ యంగ్ ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ (అర్జెంటీనా) మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ లియోనల్ మెస్సీ ఫెయిర్ ప్లే అవార్డు ఇంగ్లండ్ ప్రపంచకప్ విశేషాలు ►172- ప్రపంచకప్‌లో నమోదైన మొత్తం గోల్స్. ఒకే టోర్నీలో ఇవే అత్యధికం. 1998, 2014 ప్రపంచకప్‌లలో 171 గోల్స్ చొప్పున నమోదయ్యాయి. ►64- జరిగిన మ్యాచ్‌లు ►217-ఎల్లో కార్డులు ►3- రెడ్ కార్డులు ►16- టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన జట్టు (ఫ్రాన్స్) ►8- ఒకే మ్యాచ్‌లో నమోదైన అత్యధిక గోల్స్ (ఇంగ్లండ్ 6, ఇరాన్ 2) ►2- టోర్నీలో నమోదైన సెల్ఫ్ గోల్స్ ►2- టోర్నీలో నమోదైన ‘హ్యాట్రిక్’లు (ఎంబాపె, గొంకాలో రామోస్) ఎవరికెంత వచ్చాయంటే... ►విజేత: అర్జెంటీనా - 4 కోట్ల 20 లక్షల డాలర్లు (రూ. 347 కోట్లు) ►రన్నరప్: ఫ్రాన్స్ -3 కోట్ల డాలర్లు (రూ. 248 కోట్లు) ►మూడో స్థానం: క్రొయేషియా -2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 223 కోట్లు) ►నాలుగో స్థానం: మొరాకో -2 కోట్ల 50 లక్షల డాలర్లు (రూ. 206 కోట్లు) ►క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు (4) -కోటీ 70 లక్షల డాలర్ల చొప్పున (రూ. 140 కోట్ల చొప్పున) ►ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు (8) -కోటీ 30 లక్షల డాలర్ల చొప్పున (రూ. 107 కోట్ల చొప్పున) ►గ్రూప్ లీగ్ దశలో నిష్క్రమించిన జట్లకు (16) -90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 74 కోట్ల చొప్పున) చదవండి: FIFA WC 2022: వారెవ్వా అర్జెంటీనా.. మూడోసారి, మూడో స్థానం, మూడో జట్టు.. పాపం ఫ్రాన్స్! Lionel Messi: మెస్సీ నామసర్మణతో మారుమ్రోగిన అర్జెంటీనా.. కోల్‌కతాలోనూ సంబరాలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వారెవ్వా అర్జెంటీనా.. మూడోసారి, మూడో స్థానం, మూడో జట్టు.. పాపం ఫ్రాన్స్!
FIFA WC Qatar 2022 World Champions Argentina: ఫిఫా ప్రపంచకప్ గెలవాలన్న అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు ఆదివారం(డిసెంబరు 18) తెరపడింది. ఖతర్ వేదికగా ఫ్రాన్స్‌తో జరిగిన హోరాహోరీ పోరులో మెస్సీ బృందం విజయం సాధించడంతో కల సాకారమైంది. మేటి ఆటగాడు మెస్సీకి ఘనమైన వీడ్కోలు లభించడంతో పాటు మూడోసారి ట్రోఫీని గెలిచిన ఘనతను అర్జెంటీనా తన ఖాతాలో వేసుకుంది. కాగా అదనపు సమయంలోనూ 3-3తో ఇరు జట్లు సమంగా ఉన్న వేళ.. పెనాల్టీ షూటౌట్ ద్వారా వరల్డ్‌కప్-2022 ఫైనల్ ఫలితం తేలిన విషయం తెలిసిందే. 4-2తో అర్జెంటీనా పైచేయి సాధించి విశ్వ విజేతగా అవతరించింది. మరి ఈ మ్యాచ్ ద్వారా అర్జెంటీనా సాధించిన రికార్డులపై ఓ లుక్కేయండి! మూడోసారి ►ప్రపంచకప్ ఫుట్‌బాల్ టైటిల్ సాధించడం అర్జెంటీనాకిది మూడోసారి. గతంలో ఆ జట్టు 1978, 1986లలో సాధించింది. మూడో స్థానం ►ప్రపంచకప్‌ను అత్యధిక సార్లు గెలిచిన జట్ల జాబితాలో అర్జెంటీనా మూడో స్థానానికి చేరుకుంది. బ్రెజిల్ (5 సార్లు) టాప్ ర్యాంక్‌లో, జర్మనీ (4 సార్లు), ఇటలీ (4 సార్లు) సంయుక్తంగా రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. మూడో జట్టు ►‘షూటౌట్’ ద్వారా ప్రపంచకప్ నెగ్గిన మూడో జట్టు అర్జెంటీనా. గతంలో బ్రెజిల్ (1994లో), ఇటలీ (2006లో) ఈ ఘనత సాధించాయి. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌లో ‘షూటౌట్’లలో మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది. పాపం ఫ్రాన్స్ ►డిఫెండింగ్ చాంపియన్ తదుపరి టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం ఇది మూడోసారి. గతంలో అర్జెంటీనా (1990లో), బ్రెజిల్ (1998లో) జట్లకు ఇలాంటి ఫలితమే ఎదురైంది. ఇప్పుడు ఫ్రాన్స్ వంతు! చదవండి: Lionel Messi: మెస్సీ నామసర్మణతో మారుమ్రోగిన అర్జెంటీనా.. కోల్‌కతాలోనూ సంబరాలు IND VS BAN 1st Test: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు Make way for the 👑 #FIFAWorldCup #Qatar2022 — FIFA World Cup (@FIFAWorldCup) December 19, 2022 -
FIFA WC: మెస్సీ నామసర్మణతో మారుమ్రోగిన వీధులు.. కోల్‌కతాలోనూ సంబరాలు
FIFA WC 2022 World Champions Argentina- Lionel Messi: ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్... కీలక సమయంలో స్ట్రైకర్ ఎంబాపె గోల్స్ కొట్టడం ఫ్రాన్స్ అభిమానులకు కన్నుల పండువగా ఉన్నా.. మెస్సీ నామస్మరణలో మునిగిపోయిన మిగతా ప్రపంచానికి మాత్రం మింగుడుపడలేదు. ప్రపంచంలోనే మేటి ఆటగాడిగా పేరొందిన లియోనల్ మెస్సీకి అంత సులువుగా గెలుపు అందనిస్తానా అన్న చందంగా.. అదనపు సమయంలోనూ అతడు కొట్టిన గోల్ ఫ్యాన్స్ గుండెదడ పెంచింది. అయితే, అందరూ కోరుకున్నట్టుగా ఎట్టకేలకు పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా పైచేయి సాధించింది. 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది. తద్వారా 36 ఏళ్ల తర్వాత ట్రోఫీని అందుకోవడమే గాకుండా మెస్సీ కీర్తికిరీటంలో ప్రపంచకప్ అనే కలికితురాయిని చేర్చింది. దీంతో మెస్సీ అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మెస్సీ ట్రోఫీని ముద్దాడిన క్షణాలు చూసి వారందరి కళ్లు చెమర్చాయి. కలను సాకారం చేసుకున్న ఈ దిగ్గజ ఆటగాడి భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఆనంద భాష్పాలు రాలుస్తూ.. కేరింతలు కొడుతూ అతడి విజయాన్ని ఆస్వాదించారు. కేవలం అర్జెంటీనాలోనే మాత్రమే కాదు.. మెస్సీని అభిమానించే ప్రతీ దేశంలోనూ సంబరాలు అంబరాన్నంటాయి. స్వర్గంలో ఉన్నట్లుంది అంటూ మెస్సీ స్వదేశంలో విజయాన్ని సెలబ్రేట్ చేసుకోగా.. ఫుట్‌బాల్ క్రీడను అభిమానించే భారత్‌లోని పశ్చిమ బెంగాల్లోనూ క్రాకర్లు పేలుస్తూ, మెస్సీ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు. కోల్‌కతా వీధుల్లో డాన్సుల చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెస్సీ నామసర్మణతో సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోతున్నాయి. దీంతో అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. చదవండి: FIFA World Cup Qatar 2022: అర్జెంటీనా గర్జన.. జగజ్జేతగా మెస్సీ బృందం ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి #Argentina fans in one part of the city are celebrating with Jumma Chumma De De! #Kolkata’s colour scheme is anyways similar to #Argentina! #Messi𓃵 #Messi #LionelMessi𓃵 #LionelMessi #FIFAWorldCup #WorldCup pic.twitter.com/kMLXRgg9ZD — Saurabh Gupta(Micky) (@MickyGupta84) December 18, 2022 Make way for the 👑 #FIFAWorldCup #Qatar2022 — FIFA World Cup (@FIFAWorldCup) December 19, 2022 -
మెస్సీ కల నెరవేరింది.. అభిమానుల కళ్లు చెమర్చాయి (ఫొటోలు)
-
ప్రపంచకప్ గెలిచి అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికిన మెస్సీ
-
ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా
-
అర్జెంటీనా గర్జన.. జగజ్జేతగా మెస్సీ బృందం
ఏమా ఆట... ఎంతటి అద్భుత ప్రదర్శన... ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు... ప్రపంచకప్ ఫైనల్ అంటే ఇలా ఉంటుంది... కాదు, కాదు.. ఇంత గొప్పగా, ఇలాగే ఉంటుంది అనిపించేలా సాగిన ఆట... మైదానంలో ఆటగాళ్లు కొదమసింహాల్లా పోటీపడుతుంటే... స్టేడియంలో 90 వేల మంది ప్రేక్షకులే కాదు, ప్రపంచం మొత్తం ఊగిపోయింది... ఫైనల్లో ఆడుతున్న జట్లు మాత్రమే కాదు... ఏ జట్టుతో సంబంధం లేకపోయినా, రెప్పార్పకుండా చూసిన వీరాభిమానుల సంఖ్యకు లెక్కే లేదు... ఆట ఆరంభంలో అర్జెంటీనా దూకుడు చూస్తే మ్యాచ్ ఏకపక్షమే అనిపించింది... ఒకసారి కాదు, రెండుసార్లు కాదు... పదే పదే అటాక్ మంత్రంగా ఆ జట్టు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది... రెండు గోల్స్ ఆధిక్యం సాధించాక మెస్సీ మాయలో ఊగిపోతున్న అర్జెంటీనా అభిమానులు సంబరాలు షురూ చేసేశారు... తొలి అర్ధ భాగం చూస్తే అసలు ఫ్రాన్స్ ఫైనల్ చేరిన జట్టేనా అనిపించింది... స్టార్ ఆటగాళ్ల జాడే కనిపించలేదు. రెండో అర్ధభాగంలో కూడా కూడా అర్జెంటీనా తగ్గలేదు... మొత్తం 67 నిమిషాల ఆట సాగినా... ఒక్క షాట్ కూడా గోల్ పోస్ట్‌పై కొట్టలేకపోయింది. అప్పుడొచ్చాడు ఎంబాపె... అప్పటి వరకు కనీసం పాస్‌లు కూడా అందుకోలేకపోయిన ఈ సంచలన ఆటగాడు తనేంటో చూపించాడు... 97 సెకన్ల వ్యవధిలో రెండు గోల్స్ చేసేసి అర్జెంటీనాను ఒక్కసారిగా అచేతనంగా మార్చాడు. ఆపై తమదే ఆట అన్నట్లుగా ఫ్రాన్స్ దూసుకుపోగా, మెస్సీ సేన నిస్సహాయంగా కనిపించింది... స్కోరు సమం చేయడం సంగతేమో కానీ డిఫెన్స్‌తో తమ గోల్‌పోస్ట్‌ను కాపాడుకోవడమే అర్జెంటీనాకు కనాకష్టంగా మారింది. నిర్ణీత సమయం ముగిసింది... ఇంజ్యూరీ టైమ్ కూడా అయిపోయింది. స్కోర్లు సమంగానే ఉన్నాయి. అప్పుడు అదనపు సమయం తప్పలేదు. మళ్లీ మెస్సీపైనే గెలుపు భారం పడింది... తన కోసం, తన దేశం కోసం అన్నట్లుగా ఒక్కసారిగా శక్తి పుంజుకున్న మెస్సీ మరో గోల్‌తో ముందంజలో నిలిపి విజయధ్వానం చేశాడు... అయితే అది కొద్ది క్షణాలకే పరిమితమైంది... ఎంబాపె మళ్లీ మ్యాజిక్ ప్రదర్శించడంతో స్కోరు మళ్లీ సమమైంది. దాంతో ఫలితం పెనాల్టీ ‘షూటౌట్’కు వెళ్లింది. ‘అర్జెంటీనా జట్టు గెలవాలని ప్రపంచం మొత్తం కోరుకుంటోంది. మా దేశంలో కూడా అలాంటివారు ఉన్నారు’... ఫైనల్‌కు ముందు ఫ్రాన్స్ కోచ్ డెషాంప్స్ చేసిన వ్యాఖ్య ఇది. సగటు ఫుట్‌బాల్ అభిమాని దృష్టిలో ఇది నిజంగా నిజం... అందుకు ఒకే ఒక్క కారణం లయోనల్ మెస్సీ... ప్రపంచవ్యాప్తంగా అతడిని అభిమానించే వారెందరో అతను వరల్డ్‌కప్‌ను అందుకోవాలని కోరుకున్నారు. వారంతా ఫైనల్ రోజు అర్జెంటీనా అభిమానులుగా మారిపోయారు... అందుకే మెస్సీ కొట్టిన ప్రతీ గోల్ వారిని ఆనందంతో ముంచెత్తితే... ఎంబాపె ఆట చూస్తుంటే ఎక్కడో గుండెల్లో అలజడి... ఎక్కడ అతను మ్యాచ్‌ను లాగేసుకుంటాడేమోనని ఆందోళన... కానీ అందరి కల నెరవేరింది... ఐదో ప్రపంచకప్ ప్రయత్నంలో మెస్సీ తన టీమ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఆ ఒక్క లోటును అధిగమించి ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచాడు. సంవత్సరం క్రితం దివికేగిన డీగో మారడోనా పైనుంచి ఆశీర్వదించినట్లుగా 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా చాంపియన్‌గా మారింది. దోహా: గొంజాలో మోంటీల్... కొన్ని క్షణాల ముందు అర్జెంటీనా 3–2తో ఆధిక్యంలో ఉండి గెలుపు ఖాయమనుకుంటున్న దశలో అప్రయత్నంగానే మోచేతికి బంతికి తగిలించాడు... దాంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ కిక్ దక్కి స్కోరు సమమైంది. సబ్‌స్టిట్యూట్‌గా కొన్ని నిమిషాల క్రితమే మైదానంలోకి దిగి ఒక్క పొరపాటుతో విలన్‌గా మారిపోయాడు... కానీ మరికొన్ని నిమిషాల తర్వాత అతనే హీరోగా నిలిచాడు. షూటౌట్లో అర్జెంటీనా ఓడి ఉంటే తన తప్పిదపు భారాన్ని అతను జీవితకాలం మోయాల్సి వచ్చేదేమో... షూటౌట్లో అర్జెంటీనా 3–2తో ఉండగా మోంటీల్ పెనాల్టీ తీసుకున్నాడు... అతను కొట్టిన కిక్ ఫ్రాన్స్ గోల్ కీపర్ లోరిస్‌ను దాటి నెట్లో పడింది! అంతే... అర్జెంటీనా బృందం విజయ గర్జన చేసింది... కన్నీళ్లతో మోంటీల్ భావోద్వేగభరితమయ్యాడు. ఆదివారం జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా 4–2 (షూటౌట్లో) తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఓడించింది. నిర్ణీత సమయం, అదనపు సమయం కలిపి ఇరు జట్లు 3–3తో సమంగా నిలవగా, షూటౌట్లో ఫలితం తేలింది. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మెస్సీ (23వ నిమిషం, 108వ నిమిషం), మరియా (36వ నిమిషం) గోల్స్ చేయగా... ఫ్రాన్స్ తరఫున ఎంబాపె ఒక్కడే (80వ నిమిషం, 81వ నిమిషం, 118వ నిమిషం) మూడు గోల్స్‌తో హ్యాట్రిక్ నమోదు చేశాడు. హోరాహోరీ... విజిల్ మోగిన దగ్గరి నుంచి అర్జెంటీనా ఆధిపత్యమే సాగింది. వరుసగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై జట్టు దాడులు చేస్తూ పోయింది. అదే జోరులో ఫలితం రాబట్టింది. పెనాల్టీ ఏరియాలో ఫ్రాన్స్ వింగర్ ఉస్మాన్ డెంబెలెను దాటి అర్జెంటీనా ఆటగాడు డి మరియా బంతితో దూసుకుపోయాడు. అతడిని నిలువరించే క్రమంలో ఉస్మాన్ వెనకనుంచి మరియాను తోసేశాడు. దాంతో మరో మాట లేకుండా రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ ప్రకటించాడు. మెస్సీ ప్రశాంతంగా ఎడమ కాలితో కుడి వైపు చివరకు కిక్ కొట్టగా, మరోవైపు దూకిన గోల్ కీపర్ హ్యూగో లోరిస్ బంతిని ఆపడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఆ తర్వాత మెస్సీ, అల్వారెజ్ అద్భుత సమన్వయంతో పాస్‌లు ఇచ్చుకుంటూ దూసుకుపోయారు. బంతి అలిస్టర్‌కు చేరగా, అతడి నుంచి పాస్ అందుకున్న మరియా అద్భుత గోల్‌గా మలిచాడు. తొలి అర్ధభాగంలో అసలు ఫ్రాన్స్ ఆటగాళ్లు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. పాస్‌లు సరిగా అందుకోలేకపోగా, కదలికల్లో కూడా వేగం లోపించింది. రెండో అర్ధభాగంలో కూడా అర్జెంటీనా ఆట చూస్తే తామే వెనుకబడి ఉన్నామా అన్నట్లు అనిపించింది. మళ్లీ మళ్లీ అదే దూకుడుతో వారు ప్రత్యర్థిపై చెలరేగారు. అయితే నికోల్స్ పొరపాటుతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ దక్కింది. దీనిని గోల్‌గా మలచిన ఎంబాపె తర్వాతి నిమిషంలో అద్భుత ఆటతో ఫీల్డ్ గోల్ నమోదు చేశాడు. మెస్సీ సేన బేలగా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత మాత్రం అర్జెంటీనా కాస్త తేరుకుంది. దాంతో అదనపు సమయం మొత్తం పోటాపోటీగా సాగింది. మెస్సీ, ఎంబాపె ఇద్దరూ తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తూ చెరో గోల్‌తో మళ్లీ మ్యాచ్‌లో జీవం పోశారు. చివరకు పెనాల్టీ షూటౌట్ విశ్వవిజేతను తేల్చింది. –సాక్షి క్రీడా విభాగం -
గోల్డెన్ బూట్ గెలుచుకున్న ఎంబాపే.. రికార్డులు బద్దలుకొడుతున్నాడు!
ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో నరాలు తెగే ఉత్కంఠ పోరులో డిఫెండిగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌పై అర్జెంటీనా గెలిచి కప్ సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో ఘన విజయం అందుకుంది. అయితే, ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే.. తన సత్తా మరోసారి నిరూపించుకున్నాడు. ఫ్రాన్స్‌ను విజేతగా నిలిపే ప్రయత్నం చేశారు. ఫైనల్ మ్యాచ్‌లో ఎంబాపే.. హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. దీంతో, వరల్డ్‌కప్‌లో అధికంగా ఎనిమిది గోల్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. దీంతో, గోల్డెన్ బూట్‌ను అందుకున్నాడు. కాగా, 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఎంబాపే తన మార్క్ ఆటతో ఫ్రాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కైలియన్ ఎంబాపే.. 20 డిసెంబర్ 1998లో పారిస్‌లో జన్మించాడు. బాండీలో ఫుట్‌బాల్ కేరీర్‌ను ప్రారంభించాడు. అంతర్జాతీయ స్థాయిలో 18 సంవత్సరాల వయస్సులో 2017లో ఫ్రాన్స్ తరపున అరంగేట్రం చేసాడు. 2018 ఫిఫా ప్రపంచ కప్‌లో గోల్ కొట్టి ఎంబాపే అతి పిన్న వయస్కుడైన ఫ్రెంచ్ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఫుట్‌బాల్ దిగ్గజం పీలే తర్వాత స్కోర్ చేసిన రెండవ యంగ్ ప్లేయర్‌గా ఎంబాపే రికార్డుల్లోకి ఎక్కాడు. ఫ్రాన్స్ టోర్నమెంట్‌ను గెలుచుకోవడంతో ఎంబాపే.. రెండో అత్యధిక గోల్‌స్కోరర్‌గా నిలిచాడు. దీంతో, ఫిఫా వరల్డ్ కప్ బెస్ట్ యంగ్ ప్లేయర్, ఫ్రెంచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇక, 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఎంబాపే తన మార్క్ ఆటతో ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించాడు. ఫ్రాన్స్ విజయాల్లో కీలక పాత్ర కీలక పాత్ర పోషించాడు. The @adidas Golden Boot Award goes to Kylian Mbappe! 👏#Qatar2022's top goalscorer 📊 — FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022 -
36 ఏళ్ల నిరీక్షణకు తెర.. మెస్సీకి ఘనంగా వీడ్కోలు!
ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి మూడోసారి ఫిఫా టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక అర్జెంటీనాకు తొలి రెండు వరల్డ్‌కప్‌లు సాధించడానికి కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే పడితే.. మూడో టైటిల్ సాధించడానికి మాత్రం 36 సంవత్సరాల ఎదురుచూపులు తప్పలేదు. అర్జెంటీనా 1978లో తొలిసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను సాధించింది. అప్పట్లో నెదర్లాండ్స్‌తో జరిగిన ఫైనల్లో 3-1 తేడాతో నెగ్గిన అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. తొలి వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా నెగ్గడంలో మారియో కెంపెస్ది కీలకపాత్ర. ఇక 1986లో అర్జెంటీనా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గిన సమయంలో డీగో మారడోనా అన్నీ తానై జట్టును నడిపించాడు. జర్మనీతో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఓడించి రెండోసారి విజేతగా అవతరించింది. ఇక మారడోనా తర్వాత అంతటి పేరును సంపాదించిన మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను సాధించింది. 2022లో ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని అందుకుంది. ఈతరం గొప్ప ఆటగాళ్లలో టాప్ పొజీషన్లో ఉన్న మెస్సీ తన కెరీర్లో ఎన్నో టైటిల్స్ సాధించినప్పటికి ఫిఫా వరల్డ్‌కప్ లేదన్న లోటు అలాగే మిగిలిపోయింది. తాజాగా మెస్సీ తన కలను నెరవేర్చుకున్నాడు. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ.. అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ ఆడడం.. తన చివరి మ్యాచ్‌లోనే ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ కొట్టడం అతనికి ఘనమైన వీడ్కోలు అని చెప్పొచ్చు. ఇక ఫుట్‌బాల్ బతికున్నంతవరకు మెస్సీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. The third nation to win a #FIFAWorldCup Final on penalties 🔥 Watch the 🤯 penalty shoot-out from #FRAARG 📽️#Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/OwAIjHdqi7 — JioCinema (@JioCinema) December 18, 2022 -
నిరీక్షణ ముగిసింది.. మెస్సీ సాధించాడు
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ నిరీక్షణ ఫలించింది. మారడోనా లిగసీని ఈతరంలో కంటిన్యూ చేస్తూ ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టిన మెస్సీ కెరీర్లో ఎన్నో టైటిల్స్, అవార్డులు కొల్లగొట్టాడు. అయినా కానీ ఫిఫా వరల్డ్‌కప్ కొట్టలేదన్న లోటు మాత్రం అలానే ఉండిపోయింది. 2014లో ఫిఫా వరల్డ్‌కప్ మెస్సీ చేతిలోకి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అయితే ఈసారి మాత్రం మెస్సీనే వరించింది. ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ అని ప్రకటించిన మెస్సీ టైటిల్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. మారడోనా తర్వాత తనను ఎందుకంత ఆరాధిస్తారనేది మెస్సీ మరోసారి నిరూపించాడు. ఇక మెస్సీ గెలవడం కోసమే ఈసారి ఫిపా వరల్డ్‌కప్ జరిగిందా అన్న అనుమానం రాకమానదు. సౌదీ అరేబియాతో ఓటమి అర్జెంటీనాను పూర్తిగా మార్చివేసింది. ఆ ఓటమితో కుంగిపోని మెస్సీ అన్నీ తానై జట్టును నడిపించాడు. అక్కడి నుంచి మొదలైన మెస్సీ మాయాజాలం ఫైనల్ వరకు అజరామరంగా కొనసాగింది. జట్టు తరపున అత్యధిక గోల్స్ కొట్టడమే కాదు అత్యధిక అసిస్ట్‌లు చేసి విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇక 2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టిన మెస్సీ 17 ఏళ్ల తర్వాత తన ఫిఫా వరల్డ్‌కప్ అందుకోవాలన్న కలను నిజం చేసుకున్నాడు. అంతేకాదు డీగో మారడోనా తర్వాత అర్జెంటీనాకు కప్‌ను అందించి మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఫలితంగా తన వరల్డ్‌కప్ కలతో పాటు అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు. ఇక ఇప్పుడు మెస్సీ ఒక చరిత్ర. ఇన్నాళ్లు అర్జెంటీనా సూపర్‌స్టార్‌గా అభివర్ణించిన మెస్సీని ఇకపై దిగ్గజం అని పిలవాల్సిందే.. కాదు కాదు అలా పిలిపించుకోవడానికి అన్ని అర్హతలు సాధించాడు. ఈ తరానికి మెస్సీనే గోట్(GOAT) అని ఒప్పుకోవాల్సిందే. మెస్సీతో రొనాల్డోను పోల్చడం ఇకపై ఆపేస్తారేమో చూడాలి. ఇక ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం అందుకుంది. నిర్ణీత, అదనపు సమయం ముగిసేలోగా ఇరుజట్లు 3-3తో సమంగా ఉండడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్లో మెస్సీ సేన నాలుగు గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ రెండో గోల్స్‌కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఫిఫా వరల్డ్‌కప్ 2022 విజేతగా అర్జెంటీనా అవతరించింది.2014లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన మెస్సీ సేన ఈసారి మాత్రం కప్పును ఒడిసిపట్టుకుంది. 🏆🏆🏆 The greatest coronation in the history of the #WorldsGreatestShow 💯#Messi guides @Argentina to their third #FIFAWorldCup title 🐐#ARGFRA #ArgentinavsFrance #Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Tb6KfWndXa — JioCinema (@JioCinema) December 18, 2022 🎶 𝙈𝙐𝘾𝙃𝘼𝘼𝘼𝘾𝙃𝙊𝙊𝙊𝙎 🎶 pic.twitter.com/TVVt04TVMW — FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022 Lionel Messi with his mum after the game 🥰pic.twitter.com/mvIKQRYfXt — SPORTbible (@sportbible) December 18, 2022 The third nation to win a #FIFAWorldCup Final on penalties 🔥 Watch the 🤯 penalty shoot-out from #FRAARG 📽️#Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/OwAIjHdqi7 — JioCinema (@JioCinema) December 18, 2022 -
FIFA WC 2022: ఛాంపియన్స్‌గా అర్జెంటీనా.. 36 ఏళ్ల తర్వాత
వారెవ్వా ఏమి మ్యాచ్.. రెండు సింహాలు తలపడితే ఎవరిది పైచేయి అని చెప్పడం కష్టం. అచ్చం అలాంటిదే ఖతర్ వేదికగ జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో చోటుచేసుకుంది. మ్యాచ్‌లో క్షణక్షణానికి ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మ్యాచ్‌లో మెస్సీ సేన గోల్ కొట్టిన ప్రతీసారి తానున్నానంటూ ఎంబాపె దూసుకొచ్చాడు. ఒకరకంగా అర్జెంటీనాకు ఎంబాపె కొరకరాని కొయ్యగా తయరయ్యాడని చెప్పొచ్చు. ఆట 78వ నిమిషం వరకు కూడా మ్యాచ్ అర్జెంటీనా వైపే ఉంది. కానీ ఇక్కడే మ్యాచ్ అనూహ్య మలుపు తీసుకుంది. ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపె ఆట 80వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత 81వ నిమిషంలో మరో గోల్ కొట్టడంతో ఒక్కసారిగా ఫ్రాన్స్ 2-2తో స్కోరును సమం చేసింది. నిర్ణీత సమయం ముగియడం.. ఆ తర్వాత మరో 30 నిమిషాల పాటు అదనపు సమయం కేటాయించారు. ఈసారి కూడా 3-3తో సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్లో మెస్సీ సేన నాలుగు గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ రెండో గోల్స్‌కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఫిఫా వరల్డ్‌కప్ 2022 విజేతగా అర్జెంటీనా అవతరించింది. ఇక అర్జెంటీనా ఫిఫా ఛాంపియన్స్ కావడం ఇది మూడోసారి. ఇంతకముందు 1978, 1986లో విజేతగా నిలిచిన అర్జెంటీనా మళ్లీ 36 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా విజయం సాధించింది. Only the SECOND player ever to score hat-trick in a #FIFAWorldCup Final 👑 Will @KMbappe lead @FrenchTeam to successive 🏆?🤯 Watch the penalty shootout, LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGFRA #Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/iu1FuY3bxA — JioCinema (@JioCinema) December 18, 2022 -
మెస్సీ మాయ.. అర్జెంటీనాదే వరల్డ్‌కప్
Updates.. ► మెస్సీ మాయ.. అర్జెంటీనాదే వరల్డ్‌కప్ వారెవ్వా ఏమి మ్యాచ్.. క్షణక్షణానికి ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మెస్సీ గోల్ కొట్టిన ప్రతీసారి తానున్నానంటూ ఎంబాపె దూసుకొచ్చాడు. నిర్ణీత సమయం ముగిసింది.. అదనపు సమయం ముగిసేలోగా ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. అయితే ఆ తర్వాత మరో 30 నిమిషాలు అదనపు సమయం కేటాయించారు. ఈసారి కూడా 3-3తో సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్లో మెస్సీ సేన నాలుగు గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ రెండో గోల్స్‌కు మాత్రమే కొట్టగలిగింది. దీంతో అర్జెంటీనా విశ్వవిజేతగా అవతరించింది. The third nation to win a #FIFAWorldCup Final on penalties 🔥 Watch the 🤯 penalty shoot-out from #FRAARG 📽️#Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/OwAIjHdqi7 — JioCinema (@JioCinema) December 18, 2022 #FIFAWorldCupFinal | Argentina celebrates after #FIFAWorldCup win 🔗 https://t.co/s26S2Q2R9Q Watch 🇦🇷 🆚 🇫🇷 LIVE on #JioCinema & @Sports18 📺📲#ArgentinaVsFrance #ARGFRA #Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/RHqWLAS2sH — Moneycontrol (@moneycontrolcom) December 18, 2022 ► ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ క్షణక్షణానికి చేతులు మారుతుంది. ఆట అదనపు సమయం 108 వ నిమిషంలో మెస్సీ గోల్ కొట్టి అర్జెంటీనాను ఆధిక్యంలోకి తెచ్చాడు. అయితే కొద్దిసేపటికే ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీ కిక్‌ను ఎంబాపె మరోసారి సద్వినియోగం చేసుకున్నాడు. ఆట 118 వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను ఎంబాపె గోల్‌గా మలిచాడు. దీంతో ఇరుజట్ల స్కోర్లు మరోసారి సమం అయ్యాయి. ► అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ ఉత్కంఠగా కొనసాగుతుంది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోనూ ఎలాంటి గోల్స్ నమోదు కాలేదు. అయితే మరోసారి 30 నిమిషాలు అదనపు సమయం ఇచ్చారు. అందులోనూ ఫలితం రాకపోతే అప్పుడు పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం తేల్చనున్నారు. ► ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె నిమిషం వ్యవధిలో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆట 80వ నిమిషంలో తొలుత పెనాల్టీని గోల్‌గా మలిచిన ఎంబాపె.. మలి నిమిషం సహచర ఆటగాడు ఇచ్చిన పాస్‌ను చక్కగా వినియోగించుకున్న ఎంబాపె సూపర్ గోల్‌తో మెరిశాడు. దీంతో 2-2తో మ్యాచ్‌ను సమం చేసింది. ఫిఫా వరల్డ్‌కప్ కొట్టడానికి అర్జెంటీనా అడుగు దూరంలో ఉంది. తొలి అర్థభాగం ముగిసేసరికి ఫ్రాన్స్‌పై స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన మెస్సీ బృందం 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను అన్నీ తానై నడిపిస్తున్న మెస్సీ కీలకమైన ఫైనల్లో మరోసారి గోల్‌తో మెరిశాడు. ఆట 23వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన పెనాల్టీ కిక్‌ను మెస్సీ సద్వినియోగం చేసుకున్నాడు. ఫ్రాన్స్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ సూపర్ గోల్‌తో మెరిసి ఈ వరల్డ్‌కప్‌లో తన గోల్స్ సంఖ్యను ఆరుకు పెంచుకున్నాడు. ఇక ఆట 36వ నిమిషంలో ఏంజెల్ డి మారియా మరో గోల్‌తో మెరవడంతో అర్జెంటీనా ఖాతాలో రెండో గోల్ వచ్చి చేరింది. ఇక రెండో అర్థభాగంలో ఫ్రాన్స్‌ను నిలువరిస్తే చాలు అర్జెంటీనాతో పాటు మెస్సీ కల నెరవేరినట్లే. Lusail witnesses the @Oficial7DiMaria MANIA 💥 The man for the BIG OCCASION with a splendid finish ⭐ Keep watching the #FIFAWorldCup Final ➡ LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGFRA #ArgentinaVsFrance #Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/1S9SNBnsjq — JioCinema (@JioCinema) December 18, 2022 BIG BIG step towards the 🏆 dream 🙌🏻#Messi scores his 6️⃣th goal of #Qatar2022 & no better time than this 🔥 Can the @FrenchTeam strike back? Find out LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGFRA #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Io6fyc2uRm — JioCinema (@JioCinema) December 18, 2022 -
టైటిల్‌కు అడుగుదూరం.. మెస్సీని ఊరిస్తున్న ఆరు రికార్డులు
లియోనల్ మెస్సీ.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే పేరు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ఫైనల్ చేరినప్పటి నుంచి మెస్సీ జపం మరింత ఎక్కువైంది. ఈసారి ఫైనల్ మ్యాచ్ కేవలం మెస్సీ కోసమే చూస్తున్నవారు కోట్లలో ఉన్నారు. తన ఆటతీరుతో కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న మెస్సీకి ఇదే చివరి వరల్డ్‌కప్ కానుంది. అంతేకాదు ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. మెస్సీకి అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ కానుంది. అందుకే అభిమానులు ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఫైనల్ చేరిన మరో జట్టు ఫ్రాన్స్ అభిమానుల్లో మెజారిటి మెస్సీ సేన వరల్డ్‌కప్ గెలవాలని బలంగా కోరుకుంటుండడం విశేషం. మరి మెస్సీ అందరి అంచనాలను అందుకొని అర్జెంటీనాకు కప్ అందించి తన కలను నెరవేర్చుకుంటాడా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మరోవైపు ఫ్రాన్స్ కూడా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బలంగా కనిపిస్తుంది. కైలియన్ ఎంబాపె ఆ జట్టుకు పెద్ద బలం. వరుసగా రెండో ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గి బ్రెజిల్, ఇటలీ సరసన నిలవాలని ఫ్రాన్స్ భావిస్తోంది. ఇదిలా ఉంటే టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్న మెస్సీని ఆరు రికార్డులు ఊరిస్తున్నాయి. తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్న మెస్సీ ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఐదు గోల్స్ చేశాడు. ప్రీ క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ మెస్సీకి 1000వ మ్యాచ్. తాజాఆ ఫైనల్ మ్యాచ్ ఆడితే ఒక రికార్డు.. గోల్ కొడితే మరొక రికార్డు.. ఇలా అన్ని రికార్డులు ఒక్క మ్యాచ్‌తోనే ముడిపడి ఉన్నాయి. మరి మెస్సీని ఊరిస్తున్న ఆ ఆరు రికార్డులు ఏంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం. వరల్డ్‌కప్‌లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా.. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో మెస్సీ ఒక ఆటగాడిగా ఇప్పటివరకు 16 విజయాలు అందుకున్నాడు. ఒకవేళ ఫైనల్లో అర్జెంటీనా నెగ్గితే మెస్సీ ఖాతాలో 17వ విజయం అవుతుంది. ఈ నేపథ్యంలో ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్న ఆటగాడిగా మెస్సీ.. జర్మనీ లెజెండరీ ప్లేయర్ మిరాస్లోవ్ క్లోస్ సరసన నిలవనున్నాడు. మిరాస్లోవ్ క్లోస్ తన కెరీర్లో ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 17 విజయాలు అందుకున్నాడు. అత్యధిక మ్యాచ్‌ల్లో పాల్గొన్న ఆటగాడిగా.. ఫ్రాన్స్‌తో జరగనున్న ఫైనల్ మ్యాచ్ మెస్సీకి ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 26వ మ్యాచ్ కానుంది. ఈ నేపథ్యంలో జర్మనీ ఆటగాడు లోథర్ మాథ్యూస్ రికార్డును మెస్సీ బద్దలు కొట్టనున్నాడు. లోథర్ మాథ్యూస్ ఫిఫా వరల్డ్‌కప్స్‌లో జర్మనీ తరపున 25 మ్యాచ్‌లు ఆడాడు. తాజాగా ఫ్రాన్స్‌తో ఫైనల్ మ్యాచ్ ద్వారా మెస్సీ.. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలవనున్నాడు. వరల్డ్‌కప్‌లో అత్యధిక నిమిషాలు ఆడిన ఆటగాడిగా.. ఫిఫా వరల్డ్‌కప్స్ చరిత్రలో అత్యధిక నిమిషాలు మ్యాచ్‌లో గడిపిన ఆటగాడిగా ఇటలీ దిగ్గజం పాలో మల్దినీ తొలి స్థానంలో ఉన్నాడు. పాలో మల్దిని 2217 నిమిషాల పాటు మైదానంలో గడిపాడు. ఇక మెస్సీ ఇప్పటివరకు 2197 నిమిషాలతో రెండో స్థానంలో ఉన్నాడు మెస్సీకి, పాలో మల్దినీకి మధ్య వ్యత్యాసం కేవలం 23 నిమిషాలు మాత్రమే ఉంది. తాజాగా ఫ్రాన్స్‌తో జరగనున్న ఫైనల్లో మెస్సీ ఈ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. అత్యధిక అసిస్ట్‌లు చేసిన ఆటగాడిగా.. మెస్సీ ఇప్పటివరకు ఫిఫా వరల్డ్‌కప్స్‌లో తొమ్మిది అసిస్ట్‌లు చేశాడు. ప్రస్తుతం బ్రెజిల్ దిగ్గజం పీలే పది అసిస్ట్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఒకవేళ ఫ్రాన్స్‌తో ఫైనల్లో మెస్సీ ఇతర ఆటగాళ్లు గోల్స్ చేయడంలో రెండు అసిస్ట్ ఇవ్వగలిగితే పీలే రికార్డు బ్రేక్ చేసి తాను మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉంది. మల్టిపుల్ గోల్డెన్ బాల్ అవార్డ్స్.. 2014 ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ తొలిసారి గోల్డెన్ బాల్ అవార్డు గెలుచుకున్నాడు. ఒక వరల్డ్‌కప్‌లో బెస్ట్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఆటగాడికి గోల్డెన్ బాల్ అవార్డు అందిస్తారు. ఈసారి వరల్డ్‌కప్‌లోనూ మెస్సీ సూపర్ ఫామ్‌లో ఉండడం అతనికి గోల్డెన్ బాల్ దక్కే అవకాశం ఉంది. ఒకవేళ మెస్సీ గోల్డెన్ బాల్ గెలుచుకుంటే.. ఫిఫా టోర్నీ చరిత్రలో రెండుసార్లు గోల్డెన్ బాల్ గెలుచుకున్న తొలి ప్లేయర్‌గా మెస్సీ చరిత్ర సృష్టించనున్నాడు. అయితే ఈ అవార్డు కోసం మెస్సీతో ఫ్రాన్స్ సూపర్‌స్టార్ ఎంబాపె పోటీలో ఉన్నాడు. ఏకకాలంలో గోల్డెన్ బాల్, గోల్డెన్ బూట్ అందుకునే అవకాశం.. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక గోల్ చేసిన ఆటగాడికి ఇచ్చే అవార్డు గోల్డెన్ బూట్. ఈసారి ఈ అవార్డుకు మెస్సీతో పాటు ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపె కూడా పోటీ పడుతున్నాడు. ఇద్దరు చెరో ఐదు గోల్స్‌తో ఉన్నారు. ఇక ఫైనల్లో వీరిద్దరిలో ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తే వారికే గోల్డెన్ బూట్ దక్కుతుంది. ఇక ఏకకాలంలో గోల్డెన్ బూట్‌తో పాటు గోల్డెన్ బాల్ అవార్డు దక్కించుకునే అవకాశం మెస్సీతో పాటు ఎంబాపెకు ఉంది. మెస్సీ లేదా ఎంబాపెలలో ఎవరు దక్కించుకున్నా ఫిఫా చరిత్రలో ఎనిమిదో ఆటగాడిగా చరిత్రకెక్కనున్నారు. ఇంతకముందు లియోనిదాస్ సిల్వా(1938), గారించా(1962), రొనాల్డో(1998), పాలో రోసి(1982), సాల్వటోర్ సిలాచి(1990), మారియో కెంప్(1978) ఏకకాలంలో గోల్డెన్ బాల్, గోల్డెన్ బూట్ అవార్డును కొల్లగొట్టారు. అత్యధిక గోల్స్ కాంట్రిబ్యూషన్స్.. మెస్సీ ఇంతవరకు ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 20 గోల్స్ కాంట్రిబ్యూషన్లో పాల్గొన్నాడు. ఇందులో పదకొండు గోల్స్‌తో పాటు తొమ్మిది అసిస్ట్‌లు ఉన్నాయి. బ్రెజిల్ దిగ్గజం పీలే 22 గోల్స్ కాంట్రిబ్యూషన్తో(12 గోల్స్, 10 అసిస్ట్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇవాళ ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్ ద్వారా మెస్సీ.. పీలే రికార్డును సమం చేయడమో లేక బద్దలు కొట్టే అవకాశం ఉంది. చదవండి: FIFA WC Final: ప్రైజ్‌మనీ.. విన్నర్‌కు ఎంత ; రన్నరప్‌కు ఎంత? చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్ కోసం -
FIFA WC Final: ప్రైజ్‌మనీ.. విన్నర్‌కు ఎంత ; రన్నరప్‌కు ఎంత?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో.. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా అమితుమీ తేల్చుకోనుంది. వరుసగా రెండోసారి వరల్డ్‌కప్ సాధించి ఇటలీ, బ్రెజిల్ సరసన నిలవాలని ఫ్రాన్స్ అనుకుంటే.. అర్జెంటీనా మాత్రం మెస్సీ కోసమైన టైటిల్ గెలవాల్సిన అవసరం ఉంది. అన్నీ తానై జట్టును నడిపిస్తున్న మెస్సీనే జట్టుకు పెద్ద బలం. ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. మెస్సీకి అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ కానున్న సంగతి తెలిసిందే. అందుకే ఫైనల్లో గెలిచి మెస్సీకి కప్ అందించి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని అర్జెంటీనా కోరుకుంటుంది. ఈ సంగతి పక్కనబెడితే.. ఫిఫా ఛాంపియన్స్‌గా నిలిచే జట్టు ఎంత ప్రైజ్‌మనీ అందుకుంటుంది.. అదే విధంగా రన్నరప్‌గా నిలిచే జట్టు ఎంత సొంతం చేసుకుంటుదనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మూడోస్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో మొరాకోపై గెలిచిన క్రొయేషియా రూ. 225 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. ఇక నాలుగో స్థానంలో నిలిచిన మొరాకో జట్టు రూ.206 కోట్లు అందుకుంది. మూడో ప్లేస్‌లో ఉన్న జట్టుకే పెద్ద మొత్తం వచ్చిందంటే.. ఇక తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లకు కళ్లు చెదిరే మొత్తం లభించడం గ్యారంటీ. ఇక ఫిఫా వరల్డ్‌కప్ 2022 టైటిల్ విజేత రూ.368 కోట్ల ప్రైజ్‌మనీ కొల్లగొట్టనుంది. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ. 249 కోట్లు సొంతం చేసుకోనుంది. ఇక క్వార్టర్పైనల్స్లో వెనుదిరిగిన బ్రెజిల్,నెదర్లాండ్స్, పోర్చుగల్, ఇంగ్లండ్‌లకు రూ.141 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. రౌండ్ ఆఫ్ 16లో వెనుదిరిగిన అమెరికా, జపాన్, స్పెయిన్, సెనెగల్, పోలాండ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, సౌత్ కొరియాలకు రూ.107 కోట్ల ప్రైజ్‌మనీ అందనుంది. ఇక లీగ్ దశలో వెనుదిరిగిన జట్లకు రూ. 75 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకోనున్నాయి. చదవండి: చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్ కోసం 'మెస్సీ కల నెరవేరాలి.. అప్పుడే మనస్పూర్తిగా నవ్వగలను' -
చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్ కోసం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. శనివారం మూడోస్థానం కోసం మొరాకోతో జరిగని ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 2-1 తేడాతో క్రొయేషియా ఘన విజయం సాధించింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జట్టు కెప్టెన్ లుకా మోడ్రిక్ తన కెరీర్లో చివరి ఫిఫా వరల్డ్‌కప్ ఆడేసినట్లే. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో క్రొయేషియాను నడిపించిన లుకా మోడ్రిక్ ఒకసారి రన్నరప్, మరోసారి మూడో స్థానంలో నిలిపాడు. టైటిల్ అందుకోవాలన్న తన కలను నెరవేర్చుకోలేకపోయాడు లుకా మోడ్రిక్. అయినా కూడా ఈ క్రొయేషియా స్టార్ తన ఆటతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సంగతి పక్కనబెడితే.. ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫుట్‌బాల్ స్టార్స్ తర్వాత మరో పేరు బాగా మార్మోగింది. ఆమెనే క్రొయేషియా మోడల్ ఇవానా నోల్. ఖతర్‌లో పొట్టి దుస్తులు వేసుకోవాన్ని ఆ దేశం బహిష్కరించనప్పటికి ఇవానా నోల్ మాత్రం పొట్టి బట్టలు ధరించి క్లీవేజ్ షో చేస్తూ అందాల ఆరబోతను ప్రదర్శించింది. తనకు ఖతర్ అధికారుల నుంచి అనుమతి ఉందని.. అందుకే పొట్టి దుస్తులు వేసుకొని స్టేడియానికి వచ్చినట్లు ఇవానా పేర్కొంది. ఇక తాజాగా శనివారం క్రొయేషయా, మొరాకోల మధ్య జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో మరోసార దర్శనమిచ్చింది. అయితే ఈసార అందాల ప్రదర్శన కాకుండా తన ఫెవరెట్ అయిన.. క్రొయేషియా కెప్టెన్ లుకా మోడ్రిక్ కోసం మ్యాచ్‌కు వచ్చిందంట. అందుకు తగ్గట్లుగానే లుకా మోడ్రిక్ పేరున్న ప్రత్యేక ఔట్‌ఫిట్‌ను వేసుకొచ్చింది. ఈ సందర్భంగా లుకా మోడ్రిక్కు స్పెషల్ థాంక్స్ చెబుతూ.. థాంక్యూ కెప్టెన్ లుకా మోడ్రిక్.. మన దేశం గర్వించేలా చేశారు. ఇక మూడోప్లేస్లో నిలిచి మెడల్ అందుకోవడమే తరువాయి. ఇంకెందుకు ఆలస్యం పని కానిచ్చేయండి అంటూ రాసుకొచ్చింది. ఇవానా నోల్ కోరికను క్రొయేషియా నిలబెట్టింది. మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో 2-1తేడాతో గెలిచి ఈ వరల్డ్‌కప్‌ను మూడోస్థానంతో ముగించింది క్రొయేషియా జట్టు. ఏది ఏమైనా ఈసారి మాత్రం ఇవానా నోల్ తన అందచందాలతో ప్రత్యేకంగా నిలిచింది. చదవండి: మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే! -
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. డ్యాన్స్ చేయనున్న బాలీవుడ్ నటి
ఫిఫా ప్రపంచకప్ తుది సమరానికి మరి కొన్ని గంటల్లో తేరలేవనుంది. ఫైనల్ పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. లియోనెల్ మెస్సీ తన ప్రపంచకప్ కలను నెరవెర్చకుంటాడా? లేదా ప్రాన్స్ యువ సంచలనం కిలియాన్ ఎంబాపె తమ జట్టుకు మరోసారి ప్రపంచకప్‌ను అందిస్తాడా అన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ మ్యాచ్ దోహా వేదికగా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరిగే లుసైల్ ఐకానిక్ స్టేడియం వద్ద ఇప్పటి నంచేఅభిమానుల కోలాహలం నెలకొంది. కాగా ఇప్పటికే అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు స్టేడియం చేరుకున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఫిఫా సిద్దమైంది. ఈ వేడుకలలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ప్రత్యేక డ్యాన్స్ ప్రదర్శనతో అభిమానులను అలరించనుంది. నోరా ఫతేహితో పాటు యూఏఈ పాపులర్ సింగర్ బాల్కీస్, ఇరాక్ సింగర్ రహ్మా రియాద్, ఐషా, గిమ్స్ వంటి ప్రముఖ సింగర్లు ఈ కార్యక్రమంలో పాల్గోనబోతున్నారు. ఇక ఈ మ్యాచ్ క్లోజింగ్ సెర్మనీ 15 నిమిషాలు పాటు జరగనుంది. కాగా కెనడాకు చెందిన నోరా ఫతేహి 2014లో వచ్చిన రోర్: టైగెర్స్ అఫ్ ది సుందర్బన్స్ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లిద్దరూ వచ్చేస్తున్నారు! ఇక తిరుగు లేదు.. -
సాకర్ వరల్డ్ కప్ రారాజు ఎవరు ?
-
నేడే ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్.. అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనున్న ఫ్రాన్స్
దోహా: ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచకప్ అందినట్టే అంది చేజారిన క్షణం ఇప్పటికీ అర్జెంటీనా కెప్టెన్ లయనెల్ మెస్సీకి గుర్తుండే ఉంటుంది. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశం మళ్లీ మెస్సీ ముంగిట వచ్చింది. ఈరోజు జరిగే ప్రపంచకప్ ఫైనల్ తన అంతర్జాతీయ కెరీర్లో అర్జెంటీనా తరఫున చివరి మ్యాచ్ కాబోతుందని ఇప్పటికే ప్రకటించిన 35 ఏళ్ల మెస్సీ ఈ తుది సమరాన్ని చిరస్మరణీయం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. పేరుకు అర్జెంటీనా–ఫ్రాన్స్ జట్ల మధ్య సాకర్ ప్రపంచకప్ ఫైనల్ అంటున్నా... దీనిని మెస్సీ, ఫ్రాన్స్ మధ్య పోరుగానే అభివర్ణించాల్సి ఉంటుంది. తటస్థ అభిమానులందరూ అర్జెంటీనా గెలిచి మెస్సీ తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా... అత్యంత పటిష్టంగా ఉన్న ఫ్రాన్స్ మెస్సీ కల కలగానే మిగిలిపోవాలనే లక్ష్యంతో పోరాటం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అంతా తానై... టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా ఖతర్‌కు వచ్చిన అర్జెంటీనాకు తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. దాంతో మెస్సీపైనే కాకుండా అర్జెంటీనా జట్టు సత్తాపై అందరికీ సందేహం కలిగింది. అయితే కెప్టెన్‌గా మెస్సీ రెండో మ్యాచ్ నుంచి అంతా తానై జట్టును ముందుండి నడిపించాడు. మెరుపు కదలికలతో ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ ఐదు గోల్స్ చేయడంతోపాటు సహచరులు గోల్స్ చేయడానికి తోడ్పడ్డాడు. ముఖ్యంగా క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో మెస్సీ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌లో మెస్సీ మ్యాజిక్‌తోనే అర్జెంటీనా మూడో గోల్ చేయగలిగింది. క్రొయేషియా డిఫెండర్ గ్వార్డియోల్ ఎంత వెంటపడ్డా మెస్సీ తన పాదరసంలాంటి కదలికలతో అతడిని తప్పిస్తూ సహచరుడు అల్వారెజ్‌కు అందించిన పాస్, క్షణాల్లో నమోదైన గోల్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. అయితే ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్‌ను అర్జెంటీనా కెప్టెన్ మెస్సీతోపాటు అతడి సహచరులు తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఆడినా తమ నుంచి ట్రోఫీ మరోసారి చేజారిపోతుందని అర్జెంటీనాకు తెలుసు. మెస్సీతోపాటు ఈ టోర్నీలో నాలుగు గోల్స్ చేసిన అల్వారెజ్, ఎంజెల్ డి మారియా, రోడ్రిగో డి పాల్, ఎంజో ఫెర్నాండెజ్, గోల్‌కీపర్ మార్టినెజ్ రాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ఆద్యంతం పకడ్బందీగా ఆడి ట్రోఫీని అందుకుంటుందా లేక ఆఖరి మెట్టుపై తడబడి నాలుగోసారి ట్రోఫీని చేజార్చుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఎంబాపె ఒక్కడే కాదు... అర్జెంటీనా విజయావకాశాలు మెస్సీ ఆటపై ఆధారపడి ఉండగా... ఫ్రాన్స్ మాత్రం ఒకరిద్దరిపై ఆధారపడకుండా సమష్టి ఆటతో ఫైనల్‌కు చేరుకుంది. 23 ఏళ్ల కిలియాన్ ఎంబాపె ఐదు గోల్స్‌తో అదరగొట్టగా... 36 ఏళ్ల ఒలివియర్ జిరూడ్ నాలుగు గోల్స్‌తో మెరిపించాడు. థియో హెర్నాండెజ్, చువమెని, రాన్‌డల్, రాబియోట్ ఒక్కో గోల్ చేయగా... గ్రీజ్మన్ గోల్స్ చేయకున్నా సహచరులు గోల్స్ చేయడానికి తోడ్పడ్డాడు. గోల్‌కీపర్, కెప్టెన్ హుగో లోరిస్ ఏకంగా 53 సార్లు గోల్స్ కాకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. 1998లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న దీదీర్ డెషాంప్స్... కోచ్‌గా మారి 2018లో ఫ్రాన్స్‌కు రెండోసారి ప్రపంచ కప్‌ను అందించాడు. ఈ నేపథ్యంలో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న ఫ్రాన్స్ జట్టుకు మరోసారి గెలవాలంటే ఎలా ఆడాలో తెలుసు కాబట్టి నేటి ఆఖరి సమరం రంజుగా సాగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. 6: అర్జెంటీనాకిది ఆరో ప్రపంచకప్ ఫైనల్. 1978, 1986లలో విజేతగా నిలిచిన అర్జెంటీనా 1930, 1990, 2014లలో రన్నరప్‌గా నిలిచింది. నేటి ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోతే అత్యధిక సార్లు ఫైనల్లో ఓడిపోయిన జట్టుగా జర్మనీ (4 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. 4: ఫ్రాన్స్ జట్టుకిది నాలుగో ప్రపంచకప్ ఫైనల్. 1998, 2018లలో టైటిల్ నెగ్గిన ఫ్రాన్స్ 2006లో రన్నరప్‌గా నిలిచింది. 3: నేటి ఫైనల్లో ఫ్రాన్స్ గెలిస్తే ఇటలీ (1930, 1934), బ్రెజిల్ (1958, 1962) జట్ల తర్వాత వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన మూడోజట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. 4: ప్రపంచకప్ చరిత్రలో ఫ్రాన్స్, అర్జెంటీనా జట్ల మధ్య జరగనున్న నాలుగో మ్యాచ్ ఇది. 1930లో అర్జెంటీనా 1–0తో... 1978లో అర్జెంటీనా 2–1తో ఫ్రాన్స్‌పై గెలిచింది. 2018 ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 4–3తో అర్జెంటీనాను ఓడించింది. 10: దక్షిణ అమెరికా జట్లతో జరిగిన గత 10 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ ఓడిపోలేదు. ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. చివరిసారి దక్షిణ అమెరికా జట్టు చేతిలో ఫ్రాన్స్ ఓడిపోవడం 1978లో (అర్జెంటీనా చేతిలో 1–2తో) జరిగింది. 11: దక్షిణ అమెరికా, యూరోప్ ఖండాలకు చెందిన దేశాల మధ్య జరగనున్న 11వ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఇది. ఏడుసార్లు దక్షిణ అమెరికా జట్లకు టైటిల్ లభించగా... మూడుసార్లు యూరోప్ జట్ల ఖాతాలో టైటిల్ చేరింది. -
మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ను క్రొయేషియా మూడోస్థానంతో ముగించింది. శనివారం మూడోస్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో క్రొయేషియా.. మొరాకోను 2-1 తేడాతో ఓడించింది. క్రొయేషియా తరపున ఆట 7వ నిమిషంలో జోస్కో గ్వార్డియోల్, ఆట 42వ నిమిషంలో మిస్లావ్ ఓర్సిక్ గోల్స్ చేశారు. ఇక మొరాకో తరపున ఆట 9వ నిమిషంలో అచ్రఫ్ డారీ గోల్ చేశాడు. అయితే ఆట తొలి అర్థభాగంలోనే ఇరుజట్లు గోల్స్ చేశాయి. రెండో అర్థభాగంలో గోల్స్ కోసం ప్రయత్నించినప్పటికి సఫలం కాలేకపోయాయి. ఇక గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఈసారి మాత్రం మూడోస్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు ఆఫ్రికా దేశమైన మొరాకో తొలిసారి సెమీస్ చేరి సంచలనం సృష్టించింది. గ్రూప్ దశలో బెల్జియం.. నాకౌట్స్‌లో పోర్చుగల్, స్పెయిన్‌లను ఓడించి సెమీస్‌కు చేరుకున్న మొరాకో డిఫెడింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇక ఆదివారం(డిసెంబర్ 18న) అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరిగే ఫైనల్‌తో మెగాటోర్నీ ముగియనుంది. -
'మెస్సీ కల నెరవేరాలి.. అప్పుడే మనస్పూర్తిగా నవ్వగలను'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ తుది అంకానికి చేరుకుంది. డిసెంబర్ 18న(ఆదివారం) అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య తుది సమరం జరగనుంది. టైటిల్ సాధించి మెస్సీ తన కలను నెరవేర్చుకుంటాడా లేక డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ వరుసగా రెండోసారి వరల్డ్‌కప్‌ను నిలబెట్టుకుంటుందా అనేది చూడాలి. ఇక అర్జెంటీనా జట్టును మెస్సీ అన్ని తానై నడిపిస్తున్నాడు. కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌లో ఉన్న మెస్సీ ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఐదుగోల్స్ కొట్టి గోల్డెన్ బైట్ అవార్డు రేసులో ఉన్నాడు. అయితే మెస్సీ ఇంత సక్సెస్ కావడం వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు అదెవరో తెలుసా.. లియోనల్ స్కలోని. అర్జెంటీనా కోచ్‌గా లియోనల్ స్కలోని జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడు. కోచ్‌గా మంచి ఆఫర్స్ వచ్చినప్పటికి మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా ఎలాగైనా ఫిఫా వరల్డ్‌కప్ కొట్టాలని ఆశపడుతున్నాడు. స్కలోని తన కలను నెరవేర్చుకునే పనిలోనే ఉన్నాడు. ఇక ఫ్రాన్స్‌తో జరిగే ఆఖరి సమరంలో గెలిచి అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలవాలని కోరుకుంటున్నాడు. గతేడాది మెస్సీ సేన కోపా అమెరికా కప్ కొట్టడంలోనూ లియోనల్ స్కలోనీ కీలకపాత్ర పోషించాడు. అయితే స్కలోని గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటపడింది. అదేంటంటే.. అర్జెంటీనా ఒక్కో అడుగు వేస్తూ ఫైనల్‌కు చేరుకున్న సందర్భంలో స్కలోని ఒక్కసారి కూడా నవ్వలేదట. ఇక క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో మెస్సీ ఆటకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఒక గోల్ కొట్టడమే గాక.. మూడు అసిస్ట్‌లు అందించి మరో రెండు గోల్స్ కొట్టడంలో మెస్సీదే కీలకపాత్ర. మెస్సీ అంటే ఎంతో అభిమానం చూపించే స్కలోని.. అతను అంత బాగా ఆడుతున్నా ఒక్కసారి కూడా నవ్వలేదు. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత మెస్సీని హగ్ చేసుకొని స్కలోని ఏడ్చేశాడు. అయితే స్కలోని నవ్వకపోవడం వెనుక ఒక కారణం ఉంది. అర్జెంటీనా టైటిల్ కొట్టే వరకు తాను నవ్వలేనని లియోనల్ స్కలోని పేర్కొన్నాడు. తాను నవ్వితే అర్జెంటీనా ఎక్కడా ఓడిపోయి ఇంటికి వస్తుందేమోనని భయపడ్డాడు. మెస్సీ బృందం కప్ అందుకోవాలనే కోరిక నెరవేరిన తర్వాతే తాను మనస్పూర్తిగా నవ్వగలను అంటూ స్కలోని తన మనసులోని మాటను బయటపెట్టాడు. చదవండి: దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. మెస్సీ ముంగిట అరుదైన రికార్డు FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే! -
FIFA WC: వార్నీ వదిలేస్తే మొత్తం తినేసేలా ఉన్నాడు!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శనివారం మొరాకో, క్రొయేషియా మధ్య మూడోస్థానం కోసం ప్లేఆఫ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు అంతా సిద్ధం చేసుకున్నాయి. గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా మూడో స్థానంలో నిలుస్తుందా లేక తొలిసారి సెమీస్ వరకు అందరి దృష్టిని ఆకర్షించిన మొరాకో జట్టు మూడోస్థానం సాధించి కెరీర్ బెస్ట్‌ను అందుకుంటుందా అనేది చూడాలి. ఈ సంగతి పక్కనబెడితే.. మొరాకో గోల్‌కీపర్ యాసీ బౌనౌ కుమారుడు చేసిన పని సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. పోర్చుగల్‌తో క్వార్టర్ ఫైనల్లో గెలిచిన అనంతరం యాసీ బౌనౌ తన కుమారుడితో కలిసి ఇంటర్య్వూ ఇచ్చేందుకు వచ్చాడు. యాసీ మాట్లాడుతుండగా.. రిపోర్టర్ చేతిలో ఉన్న మైక్‌ను ఐస్‌క్రీం అనుకొని నాకడానికి ప్రయత్నించాడు. కానీ అది ఐస్‌క్రీం కాదని తెలుసుకొని వెనక్కి తగ్గాడు. కొడుకు చేసిన పనిని గమనించిన యాసీ బౌనౌకు నవ్వు ఆగలేదు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక మొరాకో గోల్‌కీపర్‌గా యాసీ బౌనౌ సూపర్ ఫామ్ కొనసాగించాడు. పెనాల్టీ అడ్డుకోవడంలో మంచి ప్రదర్శన కనబరిచిన యాసీ ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ అదే ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 13 పెనాల్టీల్లో ఐదింటిని గోల్స్ కాకుండా అడ్డుకున్నాడు. Yassine Bounou's son thinking the 🎤 to be 🍦 is supremely adorable! ❤️ #FIFAWorldCup pic.twitter.com/YTorvQwDvM — FIFA World Cup (@FIFAWorldCup) December 14, 2022 -
ఫైనల్‌కు ముందు ఫ్రాన్స్‌కు భారీ షాక్.. ముగ్గురు కీలక ఆటగాళ్లకి ఆనారోగ్యం
డిసెంబర్ 18న జరగనున్న ఫిఫా ప్రపంచకప్-2022 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌తో అర్జెంటీనా తలపడనుంది. అయితే కీలకమైన ఫైనల్‌కు ముందు ఫాన్స్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు ఆనారోగ్యం పాలయ్యారు. ఫ్రాన్స్ ఆటగాళ్లు రఫేల్ వారానే, ఇబ్రహీం కొనాటే, కింగ్స్లీ కొమన్ వైరల్ ఫ్లూ బారిన పడినట్లు సమాచారం. దీంతో ఈ ముగ్గురు శుక్రవారం తమ ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్నట్లు ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తెలిపింది. కాగా మొరాకోతో సెమీఫైనల్లో ఫ్రాన్స్ సబ్‌స్టిట్యూట్‌గా కోమన్ ఎంపికయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో కోమన్ అవసరం ఫ్రాన్స్‌కు రాలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో మొరాకోను ఫ్రాన్స్ 2-0 తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది. ముఖ్యంగా వారానే, ఇబ్రహీం కొనాటేల ఆనారోగ్యం ఫ్రాన్స్ జట్టును కలవరపెడుతోంది. ఎందుకంటే వీరిద్దరూ మిడ్ ఫీల్డ్‌లో కీలకమైన ఆటగాళ్లు. మొరాకోతో జరిగిన సెమీఫైనల్‌కు దయోట్ ఉపమెకానో స్థానంలో జట్టులోకి వచ్చిన కోనాటే అదరగొట్టాడు. ఫ్రాన్స్ డిఫెన్స్‌లో అతడు అద్భుతంగా రాణించాడు. ఇక ఇదే విషయంపై ఫ్రాన్స్ ఫార్వార్డర్లు రాండల్ కోలో, డెంబెలే స్పందించారు. "వారానే, కొనాటే, కొమన్ జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వారు ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే లక్షణాలు తేలికపాటిగానే ఉన్నాయి. ఈ ముగ్గురు ఫైనల్ మ్యాచ్‌కు ముందు కోలుకుంటారని అశిస్తున్నాను" అని రాండల్ కోలో పేర్కొన్నాడు. చదవండి: FIFA WC 2022: ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. ట్రెండింగ్‌లో ఎస్బీఐ పాస్‌బుక్ -
FIFA: ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. ట్రెండింగ్‌లో ఎస్బీఐ పాస్‌బుక్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. డిసెంబర్ 18న అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరగనున్నఫైనల్తో మెగా టోర్నీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ అభిమానుల కళ్లన్నీ అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీపైనే నెలకొన్నాయి. తన కెరీర్లో అత్యున్నత ఫామ్‌లో ఉన్న మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ తన దేశం తరపున చివరి మ్యాచ్ అని ఇప్పటికే ప్రకటించాడు. అంతేకాదు ఈసారి వరల్డ్‌కప్‌లో ఐదు గోల్స్ కొట్టడమే గాక సూపర్ అసిస్ట్స్తోనూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మారడోనా తర్వాత ఆ లిగసీని కంటిన్యూ చేస్తున్న మెస్సీ ఎలాగైన ఫిఫా వరల్డకప్ కొట్టాలని కోరుకుందాం. అయితే అర్జెంటీనా ఫైనల్ చేరిన క్రమంలో భారత్‌కు చెందిన ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)కు చెందిన పాస్‌బుక్ ట్విట్టర్ ట్రెండింగ్ లిస్టులో నిలిచింది. అదేంటి అర్జెంటీనాతో ఎస్బీఐ పాక్బుక్కు సంబంధం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. ట్రెండింగ్‌లో నిలవడానికి కారణం ఏంటంటే అర్జెంటీనా, ఎస్బీఐ పాస్ బుక్ రంగు ఒకటి కావడమే. అర్జెంటీనా జెర్సీ లైట్ బ్లూ, వైట్ కలర్స్‌తో నిలువు చెక్స్‌తో ఉంటుంది. ఇక ఎస్బీఐ పాస్‌బుక్ అవే కలర్స్‌తో అడ్డంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని భారత్‌కు చెందిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎస్బీఐ పాస్‌బుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి #Win Argentina హ్యాష్‌టాగ్‌ను జత చేశారు. ఇక ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్బీఐ పాస్‌బుక్ ఫొటోలు ట్విటర్లో వైరల్‌గా మారింది. SBI's lunch time = Argentina's Whole Match https://t.co/u2kt12FyRX — Harshad (@_anxious_one) December 15, 2022 Reason why Indians support Argentina Indians feel if Argentina loose they will loose all their money 😉#India #FIFAWorldCup #GOAT𓃵 #FIFAWorldCupQatar2022 #Argentina #WorldCup2022 #WorldCup #finale #mumbai #Delhi #Kerala #TamilNadu #Karnataka #Bengaluru #SBI #Bank pic.twitter.com/CTi7TW5X3Y — We want United India 🇮🇳 (@_IndiaIndia) December 15, 2022 State Bank of India (SBI) is also supporting Argentina 😆#FIFA #FIFAWorldCupQatar2022 #FIFAWorldCup2022 #ArgentinaVsFrance #Argentina @TheOfficialSBI pic.twitter.com/4gRYXItziq — Maghfoor Ahmad (@maghfoormalkana) December 15, 2022 చదవండి: Lionel Messi: దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. మెస్సీ ముంగిట అరుదైన రికార్డు -
దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. మెస్సీ ముంగిట అరుదైన రికార్డు
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ కలను నెరవేర్చుకుంటాడా?.. ఇప్పుడు సగటు ఫిఫా అభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్న. వీటన్నింటికి సమాధానం మరో రెండు రోజుల్లో దొరుకుతుంది. అప్పటివరకు ఓపికగా ఎదురుచూడాల్సిందే. డిసెంబర్ 18న ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్ జరగనుంది. దాదాపు నెలరోజులుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న సాకర్ సమరానికి ఈ మ్యాచ్‌తో తెరపడనుంది. మరి మెస్సీ టైటిల్ కొట్టాలన్న తన కలను నెరవేర్చుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి. అయితే ఇదే ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ ముంగిట మరో అరుదైన రికార్డు ఎదురుచూస్తుంది. ఈ వరల్డ్‌కప్‌లో మెస్సీ ఇప్పటివరకు ఐదు గోల్స్ కొట్టాడు. ఎక్కువ గోల్స్ ఎవరికి కొడితే వారికి గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. ఈ అవార్డు రేసులో మెస్సీతో పాటు కైలియన్ ఎంబాపె పోటీ పడుతున్నాడు. అయితే మెస్సీకి మాత్రమే సాధ్యమయ్యే మరో రికార్డు ఎదురుచూస్తుంది. అదేంటంటే వరల్డ్‌కప్‌లో ఎక్కువ గోల్స్ కొట్టడంతో పాటు ఎక్కువ అసిస్ట్‌లు ఇచ్చిన ఆటగాడిగా నిలిచే అవకాశం మెస్సీ ముంగిట ఉంది. ఒకవేళ ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్లో గోల్స్‌తో పాటు అసిస్ట్ చేస్తే మాత్రం అత్యధిక గోల్స్‌తో పాటు అత్యధిక అసిస్ట్‌లు చేసిన తొలి ఆటగాడిగా మెస్సీ చరిత్ర సృష్టించనున్నాడు. ఇప్పటివరకు మెస్సీ ఆరు మ్యాచ్‌లు కలిపి 570 నిమిషాలు ఆడి మూడు అసిస్ట్‌లు చేశాడు. ఈ జాబితాలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నప్పటికి అతని కంటే ముందున్న వారిలో ఫ్రాన్స్ స్టార్ ఆంటోని గ్రీజ్‌మెన్(467 నిమిషాలు, ఆరు మ్యాచ్‌లు, మూడు అసిస్ట్‌లు) మాత్రమే పోటీలో ఉన్నాడు. అయితే అతను ఒక్క గోల్ కూడా చేయలేదు. ఒకవేళ మెస్సీ ఒక్క అసిస్ట్ ఎక్కువగా చేస్తే మాత్రం.. అటు ఒక ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్, అత్యధిక అసిస్ట్‌తో గోల్డెన్ బూట్ గెలిచిన తొలి ఆటగాడిగా మెస్సీ చరిత్రలో నిలిచిపోతాడు. ఇంతకముందు 2010లో జర్మనీ ఫుట్‌బాల్ స్టార్ థామస్ ముల్లర్‌కు ఈ అవకాశం వచ్చింది. అత్యధిక గోల్స్‌తో ముల్లర్ గోల్డెన్ బూట్ అవార్డు దక్కించుకున్నాడు. కానీ అసిస్ట్స్ విషయంలో మాత్రం కాకా(బ్రెజిల్ స్టార్) వెనకాలే ఉండిపోయాడు. ఇక అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా 1986 ఫిఫా వరల్డ్‌కప్‌లో ఐదు గోల్స్‌తో పాటు ఐదు అసిస్ట్స్ చేసి టాపర్‌గా ఉన్నప్పటికి.. అప్పటి ఇంగ్లండ్ స్ట్రైకర్ గారి లినేకర్ ఆరు గోల్స్‌తో గోల్డెన్ బూట్ అవార్డు కొల్లగొట్టాడు. చదవండి: FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే! -
FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ తుది అంకానికి చేరుకుంది. డిసెంబర్ 18(ఆదివారం) ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య జరిగే ఫైనల్‌తో ఈ మెగాటోర్నీ ముగియనుంది. శనివారం మూడోస్థానం కోసం క్రొయేషియా, మొరాకోలు తలపడనున్నాయి. ఇక మెస్సీకి ఇదే ఆఖరి ఫిఫా వరల్డ్‌కప్. అంతేకాదు దేశం తరపున చివరి మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ తన కలను నెరవేర్చుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగి ఫైనల్లో అడుగుపెట్టిన ఫ్రాన్స్ వరుసగా రెండోసారి కప్ కొట్టాలని భావిస్తోంది. ఫ్రాన్స్ గనుక విజేతగా నిలిస్తే వరుసగా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గిన మూడో జట్టుగా.. ఇటలీ(1934,1938), బ్రెజిల్(1958,1962) సరసన నిలవనుంది. ఇరుజట్ల ముఖాముఖి పోరులో మాత్రం ఫ్రాన్స్‌పై అర్జెంటీనాదే పైచేయిగా ఉంది.అర్జెంటీనా, ఫ్రాన్స్ టీమ్స్ ఇప్పటి వరకూ 12 అంతర్జాతీయ మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో అర్జెంటీనా ఆరు మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఫ్రాన్స్ మూడింట్లోనే విజయం సాధించగా.. మరో మూడు డ్రాగా ముగిశాయి. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లలో ఇప్పటి వరకూ మూడుసార్లు ఈ రెండు టీమ్స్ ఆడాయి. అందులోనూ అర్జెంటీనానే రెండు విజయాలతో పైచేయి సాధించింది. 1930లో ఒకసారి 1-0తో, 1978లో 2-1తో ఫ్రాన్స్‌ను అర్జెంటీనా చిత్తు చేసింది. అయితే చివరిసారి 2018 వరల్డ్‌కప్‌లో మాత్రం ప్రీక్వార్టర్స్‌లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు మాత్రం ఫ్రాన్స్ 4-3తో అర్జెంటీనాను ఓడించి ఇంటిబాట పట్టేలా చేసింది. ఇది మాత్రం ఫ్రాన్స్‌కు ఊరట కలిగించే విషయం. అయితే గత రికార్డులు చూసుకుంటే మాత్రం ఫ్రాన్స్‌పై పైచేయి సాధించిన అర్జెంటీనాదే ఈసారి ఫిఫా వరల్డ్‌కప్ అని అభిమానులు జోస్యం చెప్పారు. చదవండి: ఫైనల్ ముందు ఫ్రాన్స్‌కు గుడ్‌న్యూస్.. కరీం బెంజెమా వచ్చేస్తున్నాడు! FIFA: గాయంతో అన్న దూరం.. తమ్ముడు అదరగొడుతున్నాడు -
ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు బిగ్ షాక్.. మెస్సీకి గాయం!
ఫిఫా ప్రపంచకప్-2022 తుది సమరానికి మరో 48 గంటల్లో తేరలేవనుంది. ఖాతార్ వేదికగా ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే కీలకమైన ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఫ్రాన్స్‌తో ఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెమీఫైనల్లో క్రొయేషియాతో మ్యాచ్ సందర్భంగా మెస్సీ తొడ కండరాల గాయంతో బాధపడినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు గురువారం జరిగిన తమ జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా మెస్సీ మాత్రమే కాకుండా స్టార్ ఆటగాడు పాపు గోమెజ్ కూడా చీలమండ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్‌కు అతడి అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొంది. కాగా ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ మెస్సీకి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. ఫైనల్లో గెలిచి ఫిఫా వరల్డ్‌కప్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ముగించాలని భావిస్తున్నాడు. చదవండి: Lionel Messi: మెస్సీతో ఇంటర్య్వూ; ఫిఫా ఫైనల్.. చివరి మ్యాచ్ అని తట్టుకోలేక -
FIFA World Cup Qatar 2022 Second Semi-Final: ఫైనల్‌కు ‘ఫ్రెంచ్ కిక్’
ఎట్టకేలకు మొరాకో తన ప్రత్యర్థికి గోల్స్ సమర్పించుకుంది. మేటి జట్లకే కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ ఆఫ్రికా జట్టు చివరకు సెమీఫైనల్లో ఓడింది. సంచలనానికి ఛాన్స్ ఇవ్వని ఫ్రాన్స్ నిర్ణీత సమయంలోనే విజయం సాధించింది. ‘డిఫెండింగ్ చాంపియన్’ వరుసగా రెండో ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిజానికి మొరాకో ఆషామాషీగా తలొగ్గలేదు. గోల్ కోసం ఆఖరి ఇంజ్యూరీ టైమ్ దాకా శ్రమించింది. మైదానం మొత్తం మీద ఫ్రాన్స్ స్ట్రయికర్లకు దీటుగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై గురి పెట్టినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. మరోవైపు ఫ్రాన్స్... ఈ టోర్నీలోనే కొరకరాని కొయ్యను ఐదో నిమిషంలోనే దారికి తెచ్చుకుంది. ద్వితీయార్ధంలో ఎదురులేని విజయానికి స్కోరును రెట్టింపు చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఖతర్‌కు వచ్చి తమ అద్భుత పోరాటపటిమతో తమకంటే ఎంతో మెరుగైన జట్లను బోల్తా కొట్టించిన మొరాకో ఇక మూడో స్థానం కోసం శనివారం గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాతో తలపడుతుంది. దోహా: అర్జెంటీనా ఫైనల్ ప్రత్యర్థి ఎవరో తేలింది. ఇక ఆఖరి సమరమే మిగిలుంది. విజేత ఎవరో... రన్నరప్‌గా మిగిలేదెవరో ఆదివారం రాత్రి తెలుస్తుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ 2–0 గోల్స్ తేడాతో ఈ టోర్నీలో మింగుడు పడని ప్రత్యర్థి మొరాకోను ఓడించి ఫైనల్ చేరింది. మ్యాచ్ 5వ నిమిషంలో థియో హెర్నాండెజ్... 79వ నిమిషంలో ‘సబ్‌స్టిట్యూట్’ రాన్‌డల్ కొలొముని ఫ్రాన్స్ జట్టుకు చెరో గోల్ అందించారు. 78వ నిమిషంలోనే మైదానంలోకి వచ్చిన సబ్‌స్టిట్యూట్ రాన్‌డల్ 44 సెకన్లలోనే గోల్ చేయడం విశేషం. ఈ మెగా టోర్నీలోనే నిర్ణీత సమయంలో క్వార్టర్స్ దాకా ప్రత్యర్థులెవరికీ గోల్ ఇవ్వని మొరాకో సెమీస్‌లో రెండు గోల్స్ ఇవ్వడమే కాకుండా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. మొరాకో గత మ్యాచ్‌లకి, తాజా సెమీఫైనల్స్‌కు ఇదొక్కటే తేడా! దీని వల్లే సంచలనం, టైటిల్ సమరం రెండు సాకారం కాలేకపోయాయి. ఆట మొదలైన కాసేపటికే ఫ్రాన్స్ పంజా విసరడం మొదలు పెట్టింది. గ్రీజ్మన్ ‘డి’ ఏరియాలో బంతిని ప్రత్యర్థి గోల్‌పోస్ట్ సమీపానికి తీసుకెళ్లాడు. కానీ క్రాస్ షాట్ కష్టం కావడంతో కిలియాన్ ఎంబాపెకు క్రాస్ చేశాడు. కానీ అతని షాట్ విఫలమైంది. అక్కడే గుమిగూడిన మొరాకో డిఫెండర్లు అడ్డుకున్నారు. అయితే బంతి మాత్రం అక్కడక్కడే దిశ మార్చుకుంది. గోల్‌పోస్ట్‌కు కుడివైపు వెళ్లగా అక్కడే ఉన్న థియో హెర్నాండెజ్ గాల్లోకి ఎగిరి ఎడమ కాలితో కిక్ సంధించాడు. దీన్ని ఆపేందుకు గోల్ కీపర్ యాసిన్ బోనో అతని ముందుకెళ్లగా... మొరాకో కెప్టెన్ రొమెయిన్ సైస్, అచ్రాఫ్ డారి గోల్‌పోస్ట్‌ను కాచుకున్నారు. అయినా సరే హెర్నాండెజ్ తన ఛాతీ ఎత్తున ఉన్న బంతిని ఎడమ కాలితో తన్ని లక్ష్యానికి చేర్చాడు. ఆఖరి క్షణంలో గోల్పోస్ట్లోనే ఉన్న అచ్రాఫ్ డారి దాన్ని ఆపేందుకు విఫలయత్నం చేశాడు. కానీ అతని కుడి మొకాలికి వెంట్రుకవాసి దూరంలోనే బంతి గోల్ అయ్యింది. ఫ్రాన్స్ 1–0 ఆధిక్యంలోకి వెళ్లింది. మరో 5 నిమిషాల వ్యవధిలోనే... మొరాకోకు ఆట పదో నిమిషంలో సమం చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ‘డి’ ఏరియా వెలుపలి నుంచి అజెడైన్ వొవునహి ఫ్రాన్స్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా లాంగ్‌షాట్ కొట్టాడు. ఫ్రాన్స్ గోల్‌కీపర్ లోరిస్ ఎడమ చేతితో అడ్డుకున్నప్పటికీ బంతి రీబౌండ్ అయింది. కానీ సమీపంలో తిరిగి షాట్ కొట్టే మొరాకో స్ట్రయికర్లు ఎవరూ లేకపోవడంతో గోల్ అవకాశం త్రుటిలో చేజారింది. 17వ నిమిషంలో ఫ్రాన్స్ స్కోరు రెట్టింపయ్యే ఛాన్స్ కూడా మిస్సయ్యింది. ఒలివియర్ జిరూడ్ మెరుపు వేగంతో మొరాకో ‘డి’ ఏరియాలోకి దూసుకొచ్చి బలంగా కొట్టిన షాట్ ప్రత్యర్థి గోల్‌కీపర్ కూడా ఆపలేకపోయాడు. కానీ బంతి గోల్‌పోస్ట్ కుడివైపున బార్ అంచును తాకి బయటికి వెళ్లిపోయింది. మళ్లీ 36వ నిమిషంలోనూ ఫ్రాన్స్ ఆటగాడు జిరూడ్ గట్టిగానే ప్రయత్నించాడు. వాయువేగంతో కొట్టిన షాట్‌ను మొరాకో డిఫెండర్ జవాద్ ఎల్ యామిక్ కళ్లు చెదిరే కిక్‌తో అడ్డుకున్నాడు. లేదంటే బంతి బుల్లెట్ వేగంతో గోల్‌పోస్ట్‌లోకి వెళ్లేది! 44వ నిమిషంలో కార్నర్‌ను గోల్‌పోస్ట్ కుడివైపున ఉన్న జవాద్ ఎల్ యామిక్ చక్కగా తనను తాను నియంత్రించుకొని బైసైకిల్ కిక్ కొట్టాడు. దాదాపు గోల్ అయ్యే ఈ షాట్‌ను ఫ్రాన్స్ గోల్‌కీపర్ లోరిస్ కుడి వైపునకు డైవ్ చేసి చేతితో బయటికి పంపించాడు. ద్వితీయార్ధంలోనూ మొరాకో గోల్స్ కోసం అదేపనిగా చేసిన ప్రయత్నాల్ని ఫ్రాన్స్ ఆటగాళ్లు ఎక్కడికక్కడ కట్టడి చేసి అడ్డుకున్నారు. 78వ నిమిషంలో రాన్‌డల్ మైదానంలోకి వచ్చాడు. అప్పుడే సహచరులు మార్కస్ తురమ్, ఎంబాపెలు మొరాకో ‘డి’ ఏరియాలో పరస్పరం పాస్ చేసుకొని గోల్‌పై గురి పెట్టారు. కానీ డిఫెండర్లు చుట్టుముట్టడంతో గోల్‌పోస్ట్‌కు మరింత సమీపంలో ఉన్న రాన్డల్కు ఎంబాపె క్రాస్పాస్ చేశాడు. 79 నిమిషంలో రాన్‌డల్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సులువుగా గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో ఫ్రాన్స్ ఆధిక్యం రెట్టింపైంది. మొరాకో విజయంపై ఆశలు వదులుకుంది. 4: ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో ఫ్రాన్స్ నాలుగోసారి (1998, 2006, 2018, 2022) ఫైనల్ చేరింది. రెండుసార్లు (1998, 2018) విజేతగా నిలిచింది. 5: వరుసగా రెండు అంతకంటే ఎక్కువసార్లు ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన ఐదో జట్టుగా ఫ్రాన్స్ నిలిచింది. గతంలో ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962), నెదర్లాండ్స్ (1974, 1978), పశ్చిమ జర్మనీ (1982, 1986), బ్రెజిల్ (1994, 1998, 2002) ఈ ఘనత సాధించాయి. 4: తమ జట్టును వరుసగా రెండు ప్రపంచకప్ లలో ఫైనల్‌కు చేర్చిన నాలుగో కోచ్‌గా ఫ్రాన్స్‌కు చెందిన దిదీర్ డెషాంప్ గుర్తింపు పొందాడు. గతంలో విటోరియో పోజో (ఇటలీ; 1934, 1938), కార్లోస్ బిలార్డో (అర్జెంటీనా; 1986, 1990), బెకన్బాయెర్ (జర్మనీ; 1986, 1990) ఈ ఘనత సాధించారు. 1998లో తొలిసారి ప్రపంచకప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టులో డెషాంప్ ప్లేయర్‌గా ఉన్నాడు. అనంతరం 2018లో విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు ఆయనే కోచ్‌గా ఉన్నారు. 3: ప్రపంచకప్ చరిత్రలో సబ్‌స్టిట్యూట్‌గా ఫాస్టెస్ట్ గోల్ చేసిన మూడో ప్లేయర్‌గా రాన్‌డల్ (ఫ్రాన్స్) గుర్తింపు పొందాడు. మొరాకోతో మ్యాచ్‌లో అతను సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన 44 సెకన్లకే గోల్ చేశాడు. ఈ జాబితాలో రిచర్డ్ మొరాలెస్ (ఉరుగ్వే; 2002లో సెనెగల్పై 16 సెకన్లలో), ఎబ్బీ సాండ్ (డెన్మార్క్; 1998లో నైజీరియాపై 26 సెకన్లలో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
ఫైనల్ ముందు ఫ్రాన్స్‌కు గుడ్‌న్యూస్.. కరీం బెంజెమా వచ్చేస్తున్నాడు!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి మొరాకో జరిగిన సెమీఫైనల్లో 2-0 తేడాతో గెలిచిన ఫ్రాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక డిసెంబర్ 18న జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనాతో తలపడనుంది. ఇక కీలకమైన ఫైనల్‌కు ముందు ఫ్రాన్స్‌కు ఒక గుడ్‌న్యూస్ అందినట్లు సమాచారం.గాయం కారణంగా ఫిఫా వరల్డ్‌కప్‌కు దూరమైన జట్టు స్టార్ స్ట్రైకర్ కరీం బెంజెమా ఫైనల్‌కు తిరిగి టీమ్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందు ఖతార్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. బెంజెమా తొడ గాయానికి గురయ్యాడు. దీంతో వరల్డ్‌కప్ టీమ్‌కు దూరమయ్యాడు. మాడ్రిడ్‌కు వెళ్లిపోయిన బెంజెమా అక్కడ గాయం నుంచి కోలుకోవడంపై దృష్టి సారించాడు. గాయం కారణంగా ఇలా టీమ్‌కు దూరమవడంపై బెంజెమా ఎంతో నిరాశ చెందాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తన స్థానాన్ని మరొకరికి ఇచ్చి వెళ్లిపోతున్నట్లు చెప్పాడు. అయితే అప్పటి నుంచీ మాడ్రిడ్‌లో ట్రైనింగ్ చేస్తున్న బెంజెమా.. ఎలాంటి ఫిట్నెస్ సమస్యలతో బాధపడటం లేదని స్పెయిన్ మీడియా వెల్లడించింది. దీంతో అతడు ఫైనల్ మ్యాచ్‌కు తిరిగి ఫ్రాన్స్ టీమ్‌తో చేరతాడన్న వార్తలు ఊపందుకున్నాయి. అదే జరిగితే ఆ టీమ్ బలం మరింత పెరగనుంది. ప్రపంచంలోని అత్యుత్తమ స్ట్రైకర్లలో ఒకడిగా కరీం బెంజెమాకు పేరుంది. ఇప్పటి వరకూ ఫ్రాన్స్ తరఫున 97 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 37 గోల్స్ చేశాడు. చదవండి: మెస్సీతో ఇంటర్య్వూ; ఫిఫా ఫైనల్.. చివరి మ్యాచ్ అని తట్టుకోలేక FIFA: గాయంతో అన్న దూరం.. తమ్ముడు అదరగొడుతున్నాడు -
మెస్సీతో ఇంటర్య్వూ; ఫిఫా ఫైనల్.. చివరి మ్యాచ్ అని తట్టుకోలేక
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తన దేశం తరపున ఆఖరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ మెస్సీకి ఆఖరిది కానుంది. ఈ విషయాన్ని సెమీస్‌లో క్రొయేషియాపై విజయం అనంతరం మెస్సీనే స్వయంగా ప్రకటించాడు. మెస్సీ నిర్ణయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆరాధ్య దైవం ఆఖరి మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో ఎలాగైనా ఫైనల్లో గెలిచి ఫిఫా వరల్డ్‌కప్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ముగిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం అర్జెంటీనా సహా ఫిఫా అభిమానులు మెస్సీ టైటిల్ గెలవాలని పూజలు చేస్తున్నారు. మరి మెస్సీ టైటిల్ కొట్టి తన కలను నెరవేర్చుకుంటాడా లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలియనుంది.ఈ విషయం పక్కనబెడితే.. క్రొయేషియాతో మ్యాచ్ అనంతరం మెస్సీని ఇంటర్య్వూ చేసిన అర్జెంటీనాకు చెందిన మహిళ రిపోర్టర్ కన్నీటిపర్యంతం అయింది. రిపోర్టర్ ఎమోషన్‌కు చలించిపోయిన మెస్సీ చిరునవ్వుతో ఆమెను ఓదార్చాడు. మ్యాచ్ విజయం అనంతరం మెస్సీని ఇంటర్య్వూ చేసింది. ''నా దృష్టిలో ఇది ప్రశ్న కాదు.. అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ ఆదివారం(డిసెంబర్ 18న) ఫైనల్ ఆడబోతున్నాం. ఒక అర్జెంటీనా వ్యక్తిగా కప్పు మనమే గెలవాలని అందరితో పాటు నేను కోరుకుంటన్నా. కానీ దేశం తరపున మీకు ఇది చివరి మ్యాచ్ అని తెలిసినప్పటి నుంచి ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. రిజల్ట్‌తో మాకు సంబంధం లేదు. అది ఎలా అయినా రానీ మీరు మాత్రం మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అర్జెంటీనాలో చిన్న పిల్లాడిని అడిగినా మెస్సీ గురించి ఎంతో గొప్పగా చెప్తుంటారు. అలాంటిది మన జట్టు ఇవాళ ఫైనల్‌కు అడుగుపెట్టడంలో మీది కీలకపాత్ర కావడం మాకు సంతోషకరం. ఇప్పటికి ఇది నిజమా.. కలా అనేది తెలుసుకోలేకపోతున్నాం. ఫుట్‌బాల్‌కు మీరు చేసిన సేవలు ఎన్నటికి మరువం. మారడోనా లీగసీని కంటిన్యూ చేస్తూ ఫుట్‌బాల్‌లో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించారు. మిమ్మల్ని బీట్ చేయడం ఎవరి తరం కాదు. మాలాంటి వాళ్లకు మెస్సీ ఒక స్పూర్తి.. ఒక అర్జెంటీనా మహిళను అయినందుకు గర్వపడుతున్నా థాంక్యూ మెస్సీ'' అంటూ ఎమోషనల్ అయింది. ఇదంతా ఓపికతో విన్న మెస్సీ చిరునవ్వుతో మెరిశాడు. అనంతరం రిపోర్టర్‌ను దగ్గరికి తీసుకొని ఆమెను ఓదార్చాడు. మీతో సహా అర్జెంటీనా ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తా. ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతాం. ఈసారి వరల్డ్‌కప్‌లో మా జర్నీ అంత ఈజీగా సాగలేదు. క్లిష్ట పరిస్థితులను దాటుకొని ఫైనల్‌కు చేరుకున్నాం. మరొక అడుగు పూర్తి చేస్తే సక్సెస్ అయినట్లే. మీ అభిమానానికి థాంక్స్ అంటూ పేర్కొన్నాడు. ఇక మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ అనంతరం అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. 2005 నుంచి అర్జెంటీనా సీనియర్ జట్టుకు ఆడుతున్న మెస్సీ 171 మ్యాచ్‌లు ఆడి 96 గోల్స్ సాధించాడు.ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. బటిస్టుటా (10 గోల్స్) పేరిట ఉన్న రికార్డును మెస్సీ (11 గోల్స్) సవరించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో మెస్సీ సంయుక్తంగా ఆరో స్థానానికి చేరుకున్నాడు. మిరోస్లావ్ క్లోజ్ (16), రొనాల్డో నజారియో (15), గెర్డ్ ముల్లర్ (14) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 😭 pic.twitter.com/iYhhMAWSwB — Emma 📊 (@emmaiarussi) December 13, 2022 చదవండి: FIFA: గాయంతో అన్న దూరం.. తమ్ముడు అదరగొడుతున్నాడు Kylian Mbappe: 'బాధపడకు మిత్రమా.. ఓడినా చరిత్ర సృష్టించారు' -
FIFA: గాయంతో అన్న దూరం.. తమ్ముడు అదరగొడుతున్నాడు
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో గెలిచిన ఫ్రాన్స్ దర్జాగా ఫైనల్స్‌కు చేరుకుంది. ఇక డిసెంబర్ 18న అర్జెంటీనాతో జరగనున్న ఫైనల్లో గెలిచి చాంపియన్‌షిప్‌ను నిలుపుకోవాలని ఫ్రాన్స్ భావిస్తోంది. అయితే మొరాకోతో జరిగిన సెమీస్‌లో ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె మెరవనప్పటికి తామున్నామంటూ ఇద్దరు ఆటగాళ్లు అదరగొట్టారు. వారిలో ఒకడు తియో హెర్నాండేజ్ అయితే.. ఇంకొకడు రాండల్ కొలో మునాయ్. ఆట 5వ నిమిషంలో హెర్నాండేజ్ గోల్ కొట్టి ఫ్రాన్స్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్తే.. రెండో అర్థభాగంలో ఆట 79వ నిమిషంలో రాండల్ మరో గోల్ కొట్టి 2-0తో ఫ్రాన్స్ విజయాన్ని ఖాయం చేశాడు. రాండల్ సంగతి పక్కనబెడితే.. ఆట ఆరంభంలోనే గోల్‌తో మెరిసిన తియో హెర్నాండేజ్ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. అదేంటంటే.. తియో హెర్నాండేజ్ ఎవరో కాదు.. ఫ్రాన్స్ స్టార్ లుకాస్ ఫెర్నాండేజ్ సొంత తమ్ముడు. అన్నదమ్ములిద్దరు ఏకకాలంలో ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌కు ప్రాతినిధ్యం వహించారు.అయితే గ్రూప్ దశలో ఫ్రాన్స్ ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-1 తేడాతో ఘనవిజయం సాధించింది. కానీ ఆట ఆరంభమైన కాసేపటికే లుకాస్ ఫెర్నాండేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. మైదానం వీడిన లుకాస్ ఇప్పటి వరకు తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఫిఫా వరల్డ్‌కప్‌కు పూర్తిగా దూరమైనట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. అన్న దూరం కావడం తియో హెర్నాండేజ్ను బాధించింది. ఎలాగైనా అన్న కోసం కప్ గెలవాలని బలంగా కోరుకున్నాడు. అప్పటినుంచి ప్రతీ మ్యాచ్ ఆడినప్పటికి హెర్నాండేజ్కు గోల్ కొట్టే అవకాశం రాలేదు. తాజాగా ఆ సమయం రానే వచ్చింది. మొరాకోతో కీలకమైన సెమీఫైనల్లో తియో హెర్నాండేజ్ గోల్ కొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక అన్న లుకాస్ హెర్నాండేజ్ కల నిజం చేసేందుకు తియో హెర్నాండేజ్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. అర్జెంటీనాతో జరగనున్న ఫైనల్లో ఫ్రాన్స్‌ను గెలిపించి అన్నకు టైటిల్ కానుకగా ఇవ్వాలనుకుంటున్నాడు. మొరాకోపై గెలుపు అనంతరం తియో హెర్నాండేజ్ మీడియాతో మాట్లాడాడు. ''లూలూ(లుకాస్ హెర్నాండేజ్).. ఈసారి వరల్డ్‌కప్ మనిద్దరి కోసం ఆడుతున్నా. మొరాకోతో మ్యాచ్‌లో గోల్ కొట్టగానే కోచ్ నన్ను పిలిచి మీ అన్న లుకాస్ నిన్ను అభినందించినట్లు చెప్పమని పేర్కొనడం సంతోషం కలిగించింది. నా ప్రదర్శన పట్ల లుకాస్ గర్వపడుతున్నాడు. ఆటలో నువ్వు లేకపోవచ్చు.. కానీ ఎప్పుడు నాతోనే ఉండాలని ఆశపడుతున్నా. నీ గాయం నాకు కష్టంగా అనిపిస్తున్నప్పటికి తప్పదు. అన్న కోసం కప్ గెలవాలనుకుంటున్నా. మ్యాచ్ ముగిసిన ప్రతీరోజు మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం'' అంటూ పేర్కొన్నాడు. 😬 Is @TheoHernandez a ninja? 🥷🏻 Check out the 🔢 from his 🤯 goal in last night's #FRAMAR 📹 Next 🆙 for the @FrenchTeam 👉🏻 #FIFAWorldCup Final 🆚 @Argentina on Dec 18 - 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/qX69GwBACz — JioCinema (@JioCinema) December 15, 2022 చదవండి: 'బాధపడకు మిత్రమా.. ఓడినా చరిత్ర సృష్టించారు' -
'బాధపడకు మిత్రమా.. ఓడినా చరిత్ర సృష్టించారు'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి మొరాకోతో జరిగిన సెమీఫైనల్లో 2-0 తేడాతో ఫ్రాన్స్ విజయం అందుకుంది. డిఫెండింగ్ చాంపియన్స్‌గా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన ఫ్రాన్స్ టోర్నీ ఆసాంతం అందుకు తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తూ వచ్చింది. ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె గోల్ కొట్టడంలో విఫలమైనప్పటికి మేమున్నామంటూ తియో హెర్నాండేజ్(ఆట 5వ నిమిషం), రాండల్ కొలో మునాయ్(ఆట 79వ నిమిషం)లో ఫ్రాన్స్‌కు గోల్ అందించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక డిసెంబర్ 18(ఆదివారం) జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమితుమీ తేల్చుకోనుంది. ఇదిలా ఉంటే ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆఫ్రికా జట్టు మొరాకో సెమీస్ చేరి అందర్ని ఆశ్చర్యపరిచింది. గ్రూప్ దశలో బెల్జియం, నాకౌట్స్‌లో స్పెయిన్, పోర్చుగల్‌లను చిత్తు చేసి సెమీఫైనల్లో అడుగుపెట్టి సంచలనం సృష్టించింది. అయితే ఫ్రాన్స్ అనుభవం ముందు మొరాకో తలవంచక తప్పలేదు.. అయినా సరే తమ ఆటతీరుతో ఇంత దూరం వచ్చిన మొరాకో జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె, మొరాకో ఢిపెండర్ అచ్రఫ్ హకీమిలు బయట బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. దాదాపు ఒకేసారి ఫుట్‌బాల్ కెరీర్‌ను ఆరంభించిన ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిద్దరు ఫిఫా వరల్డ్‌కప్ సెమీఫైనల్లో మాత్రం ప్రత్యర్థులయ్యారు. దేశం కోసం మ్యాచ్ ఆడగా.. ఎంబాపె విజయం సాధించగా.. హకీమి ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ వరకు మాత్రమే తాము ప్రత్యర్థులమని.. బయట ఎప్పటికీ ప్రాణ స్నేహితులమేనని మరోసారి నిరూపించారు. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి సంచలన విజయాలు అందుకున్న తన జట్టు సెమీస్‌లో నిష్క్రమించడంతో హకీమి కన్నీటిపర్యంతం అయ్యాడు. ఇది గమనించిన ఎంబాపె.. అతని వద్దకు వచ్చి ఓదార్చాడు. బాధపడకు మిత్రమా.. ఓడినా మీరు చరిత్ర సృష్టించారు. మేటి జట్లను చిత్తు చేసి ఇంతదూరం రావడం సామాన్యమైన విషయం కాదు. మీ పోరాటం అమోఘం. అయితే మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు మాత్రమే విజయం సాధిస్తుంది. ఇవాళ నీపై నేను పైచేయి సాధించాను. టోర్నీ వరకే ప్రత్యర్థులం.. బయట మాత్రం ఎన్నటికి స్నేహితులమే అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం ఎంబాపె, అచ్రఫ్ హకీమిలు తమ జెర్సీలను మార్చుకొని తమ స్నేహం గొప్పతనాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Don’t be sad bro, everybody is proud of what you did, you made history. ❤️ @AchrafHakimi pic.twitter.com/hvjQvQ84c6 — Kylian Mbappé (@KMbappe) December 14, 2022 Kylian Mbappe went straight over to console his good friend and teammate Achraf Hakimi.🤗 pic.twitter.com/IvbwKbemEu — Ben Jacobs (@JacobsBen) December 14, 2022 PSG team-mates Mbappe and Hakimi swapping shirts at the end.#Mar #fra #FIFAWorldCup pic.twitter.com/DrufStKHAV — Shamoon Hafez (@ShamoonHafez) December 14, 2022 Hugo Lloris kept his first clean sheet in #Qatar2022 to guide #LesBleus to another #FIFAWorldCup Final 📈 Relive his brilliant saves in #FRAMAR & watch @FrenchTeam go for 🏆 - Dec 18, 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/2GKLlJL6kX — JioCinema (@JioCinema) December 14, 2022 చదవండి: FIFA WC: సెమీ ఫైనల్.. ప్రాణ స్నేహితులు ప్రత్యర్థులైన వేళ -
FIFA WC: ఫుట్‌బాల్ రారాజు ఎవరో.. మెస్సీ మ్యాజిక్ చేస్తాడా?
ఫిఫా ప్రపంచకప్-2022 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి. తొలి సెమీఫైనల్లో క్రోయోషియాను ఓడించి అర్జెంటీనా ఫైనల్లో అడుగుపెట్టగా.. రెండో సెమీఫైనల్లో మొరాకోను చిత్తు చేసిన ఫ్రాన్స్ చివరి పోరుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో.. గోల్డెన్ బూట్ అవార్డు రేసు ఆసక్తికరంగా మారింది. గోల్డెన్ బూట్ అవార్డు ఎవరికి ఇస్తారు? ఫిఫా ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. ఈ అవార్డును 1982 వరల్డ్‌కప్ నుంచి ఇవ్వడం ప్రారంభించారు. తొలుత ఈ అవార్డును గోల్డెన్ షూగా పిలిచేవారు. అయితే 2010లో దీన్ని గోల్డెన్ బూట్ అవార్డుగా మార్చారు. ఫుట్‌బాల్ రారాజు ఎవరో? ప్రస్తుత ప్రపంచకప్ గోల్డెన్ బూట్ రేసులో అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ, ఫ్రాన్స్ యువ సంచలనం కైలియన్ ఎంబాపె చెరో 5 గోల్స్‌తో సమంగా ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం జరగనున్న ఫైనల్లో ఫుట్‌బాల్ రారాజు ఎవరో తేలిపోనుంది. అయితే వీరికి ఫ్రాన్స్ దిగ్గజ ఆటగాడు ఒలివర్ గిరౌడ్, అర్జెంటీనా ప్లేయర్ జూలియన్ అల్వారెజ్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురుయ్యే అవకాశం ఉంది. గోల్డన్ బూట్ పోటీలో వీరిద్దరూ కూడా చెరో 4 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు. గోల్డెన్ బూట్ టైబ్రేకర్స్ అంటే? ఫైనల్ ముగిసే సమయానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు అత్యధిక గోల్స్‌తో సమంగా నిలిస్తే దాన్ని గోల్డెన్ బూట్ టైబ్రేకర్స్ అంటారు. ఈ సమయంలో ఎవరైతే అత్యధిక అసిస్ట్‌లు, తక్కువ నిమిషాలు ఆడి ఉంటారో వారిని విజేతగా నిర్ణయిస్తారు. గోల్ చేసే స్కోరర్‌కు బంతిని పాస్ చేయడం లేదా క్రాస్ చేయడం చేస్తే ఆటగాడి ఖాతాలో అసిస్ట్ చేరుతుంది. కాగా అసిస్ట్‌ల ప్రకారం అయితే 3 అసిస్ట్‌లతో మెస్సీ ముందంజలో ఉండగా.. మబప్పే రెండు అసిస్ట్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక నిమిషాల ప్రకారం అయితే ఎంబాపె (477).. మెస్సీ (570) కంటే ముందు ఉన్నాడు. గోల్డెన్ బాల్ రేసులో.. ఫిఫా ప్రపంచకప్ టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి గోల్డెన్ బాల్ అవార్డు లభిస్తుంది. ఈ పోటీలో లియోనెల్ మెస్సీ, కైలియన్ ఎంబాపె , లుకా మోడ్రిక్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. చదవండి: FIFA WC2022: ఫ్రాన్స్ చేతిలో చిత్తు.. బ్రస్సెల్స్‌లో మొరాకో అభిమానుల విధ్వంసం -
అనన్య ఫ్యాన్‌గర్ల్ మూమెంట్.. ‘ఆయన నాకు చేయి ఊపారు’
ఎట్టకేలకు తన చిరకాల నేరవేరిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే. ఈమేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేస్తూ ఫ్యాన్‌గర్ల్ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తుంది. తన అభిమాన ఆటగాడు డేవిడ్ బెక్హాంను కలుసుకున్నానంటూ ఆమె మురిసిపోయింది. కాగా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ సెమిఫైనల్స్ చూసేందుకు అనన్య హజరైంది. ఈ సందర్భంగా తన అభిమాన ఆటగాడు, మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బేక్హాంను ఆమె కలుసుకుంది. డ్రెస్సింగ్ రూం వద్ద ఫార్మల్ సూట్లో ఉన్న డేవిడ్‌ను స్టేడియంలో ఉన్న అనన్య ఆయనను చూసింది. డేవిడ్ తన ఫ్యాన్స్‌కి చేయి ఊపాడు. అదే సమయంలో అనన్య తన అభిమాన ఆటగాడిని తన ఫోన్ కెమెరాలో క్లిక్ మనిపించింది. ఇక ఆ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ‘ఓకే.. ఐ యామ్ డన్.. ఇది నా చిరకాల కోరిక.. డేవిడ్ బేక్హాం పూర్తిగా నావైపే చేయి ఉపారు’ అంటూ అనన్య మురిసిపోయింది. డిసెంబర్ 14న సెమిఫైనల్స్లో తలపడిన అర్జెంటీనా వర్సెస్ క్రొయేషియా మ్యాచ్ చూసేందుకు అనన్యతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్ నటులు సంజయ్ కపూర్, చుంకీ పాండే, ఆదిత్య రాయ్ కపూర్‌తో తదితరలు హాజరయ్యారు. అలాగే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన సోదరితో కలిసి ఈ మ్యాచ్‌ను వీక్షించారు. 🤩Popular Bollywood actors Sanjay Kapoor, Aditya Roy Kapur & Chunky Panday, tennis star Sania Mirza and other personalities spotted at Nammos, Al Maha Island! #ILoveQatar #Qatar #Qatar2022 #WorldCupQatar2022 #almahaisland pic.twitter.com/yLJFFyxAov — ILoveQatar - Live (@ILQLive) December 13, 2022 చదవండి: ‘సాంగు భళా’: ఈ ఏడాది బాగా అలరించిన సాంగ్స్, అవేంటంటే.. మహేశ్-రాజమౌళి మూవీ నుంచి క్రేజీ అప్డేట్! సూపర్ స్టార్‌కు తండ్రిగా ఆ స్టార్ నటుడు? -
ఫ్రాన్స్ చేతిలో చిత్తు.. బ్రస్సెల్స్‌లో మొరాకో అభిమానుల విధ్వంసం
ఫిఫా ప్రపంచకప్-2022లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఖతర్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో మొరాకోను చిత్తు చేసిన ఫ్రాన్స్.. వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరుకుంది. ఇక నాకౌట్ దశలో అదరగొట్టిన మొరాకో.. కీలకమైన సెమీఫైనల్లో మాత్రం చేతులేత్తేసింది. 0-2 తేడాతో ఓటమిపాలైన మొరాకో ఈ మెగా ఈవెంట్ నుంచి ఇంటిముఖం పట్టింది. బ్రస్సెల్స్‌లో అల్లర్లు.. కాగా మొరాకో ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మొరాకో అభిమానులు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో విధ్వంసం సృష్టించారు. సుమారు 100 మంది ఫ్యాన్స్ బ్రస్సెల్స్ సౌత్ స్టేషన్ సమీపంలో పోలీసులపై బాణాసంచాలను విసిరారు. అదే విధంగా వీధుల్లో ఉన్న షాప్‌లకు నిప్పు అంటించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ అల్లర్లకు కారణమైన చాలా మంది అభిమానలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, భారీ నష్టం ఏమీ జరగలేదని రాయిటర్స్ పేర్కొంది. చదవండి: FIFA WC:సెమీస్‌లో అదరగొట్టిన ఫ్రాన్స్.. రికార్డులు బ్రేక్ చేస్తూ విజయం 🚨🇫🇷 Breaking: Moroccans start attacking French people celebrating their country's victory in Paris, France. pic.twitter.com/k19wvVeD5J — Terror Alarm (@Terror_Alarm) December 14, 2022 -
FIFA WC: సెమీస్‌లో అదరగొట్టిన ఫ్రాన్స్.. రికార్డులు బ్రేక్ చేస్తూ విజయం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ అదరగొట్టింది. మొరాకోతో జరిగిన కీలక మ్యాచ్‌లో 2-0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ అందుకు తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ ఫైనల్‌కు చేరింది. ఇక, డిసెంబర్ 18న అర్జెంటీనాతో జరిగే ఫైనల్లో ఫ్రాన్స్ అమితుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. గత ఏడు ఎడిషన్లలో ఫ్రాన్స్ జట్టు నాల్గొవ సారి ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఈ విజయంతో 2002లో బ్రెజిల్ తర్వాత వరుసగా ఫైనల్స్‌కు చేరిన తొలి డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఫ్రాన్స్ నిలిచింది. ఇదిలా ఉండగా.. రష్యాలో జరిగిన 2018 ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్ 4-2తో క్రొయేషియాను ఓడించి విన్నర్‌గా నిలిచింది. 🔝 performance 💥@AntoGriezmann covered every blade of grass to ensure @FrenchTeam would reach back-to-back #FIFAWorldCup Finals 🔥 Enjoy his Hero of the Day display, presented by @Mahindra_Auto#FRAMAR #Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/G7UOQ42HCa — JioCinema (@JioCinema) December 14, 2022 -
FIFA World Cup Qatar 2022 Semi-Final: మెస్సీ మాయ...
అంతా తానై జట్టును ముందుడి నడిపిస్తున్న లయెనెల్ మెస్సీ తన ‘ప్రపంచకప్’ కలను నిజం చేసుకోవడానికి మరో విజయం దూరంలో నిలిచాడు. నాలుగేళ్ల క్రితం ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లో మెస్సీ కెప్టెన్సీలోనే అర్జెంటీనా 0–3తో క్రొయేషియా చేతిలో దారుణంగా ఓడిపోయింది. నాలుగేళ్ల తర్వాత మెస్సీ సారథ్యంలోనే క్రొయేషియాపై అర్జెంటీనా 3–0తో ప్రతీకార విజయం సాధించింది. ఆనాడు అంతగా ప్రభావం చూపని మెస్సీ ఈసారి మాత్రం విశ్వరూపమే ప్రదర్శించాడు. మైదానం మొత్తం పాదరసంలా కదులుతూ క్రొయేషియా డిఫెండర్లకు చుక్కలు చూపించాడు. ఒక గోల్ చేయడంతోపాటు తనను ఆరాధ్యంగా భావించే 22 ఏళ్ల జూలియన్ అల్వారెజ్‌కు రెండు గోల్స్ చేయడానికి సహకరించాడు. ఫలితంగా అర్జెంటీనా ఆరోసారి ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 1986లో చివరిసారి విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా మళ్లీ జగజ్జేత కావడానికి గెలుపు దూరంలో ఉంది. దోహా: గతంలో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన ఐదుసార్లూ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న అర్జెంటీనా అదే ఆనవాయితీని కొనసాగించింది. ఆరోసారి ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ ఆడిన మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా అద్భుత ఆటతీరుతో క్రొయేషియా అడ్డంకిని అధిగమించి దర్జాగా ఆరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 88,966 మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన లుసైల్ స్టేడియంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి సెమీఫైనల్లో అర్జెంటీనా 3–0 గోల్స్ తేడాతో గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టును చిత్తుగా ఓడించింది. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మెస్సీ (34వ ని.లో) ఒక గోల్ చేయగా... జూలియన్ అల్వారెజ్ (39వ, 69వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, మొరాకోజట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఈనెల 18న జరిగే ఫైనల్లో అర్జెంటీనా తలపడుతుంది. అర్జెంటీనా 1978, 1986లలో ప్రపంచ చాంపియన్‌గా... 1930, 1990, 2014లలో రన్నరప్‌గా నిలిచింది. పక్కా ప్రణాళికతో... నాకౌట్ మ్యాచ్‌ల్లో రక్షణాత్మకంగా ఆడుతూ ప్రత్యర్థికి గోల్స్ ఇవ్వకుండా చివర్లో షూటౌట్లో విజయం సాధించడం క్రొయేషియా అలవాటుగా మార్చుకుంది. ఆరంభంలోనే గోల్స్ చేసి క్రొయేషియాను ఒత్తిడికి నెట్టాలనే వ్యూహంతో అర్జెంటీనా ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఈ వ్యూహం ఫలితాన్నిచ్చింది. ఆట 34వ నిమిషంలో ‘డి’ ఏరియాలో అల్వారెజ్ను క్రొయేషియా గోల్‌కీపర్ లివకోవిచ్ మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ కిక్‌ను ప్రకటించాడు. మెస్సీ ఎడమ కాలితో కొట్టిన షాట్ బుల్లెట్ వేగంతో క్రొయేషియా గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లింది. అర్జెంటీనా 1–0తో ఆధిక్యం సంపాదించింది. ఐదు నిమిషాల తర్వాత అర్జెంటీనా ఖాతాలో రెండో గోల్ చేరింది. మధ్య భాగంలో ఉన్న మెస్సీ బంతిని అల్వారెజ్‌కు పాస్ ఇవ్వగా అతను వాయువేగంతో క్రొయేషియా డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ ‘డి’ ఏరియాలోకి వచ్చాడు. అదే జోరులో గోల్కీపర్ను తప్పిస్తూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. విరామ సమయానికి అర్జెంటీనా 2–0తో ముందంజలో నిలిచింది. తక్కువ అంచనా వేయకుండా... నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 2–0తో ఆధిక్యంలో నిలిచినా చివర్లో తడబడి రెండు గోల్స్ సమర్పించుకొని చివరకు షూటౌట్లో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. ప్రమాదకరమైన క్రొయేషియా జట్టుకు అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో అర్జెంటీనా రెండో అర్ధభాగంలోనూ జాగ్రత్తగా ఆడింది. బంతి ఎక్కువ శాతం క్రొయేషియా ఆటగాళ్ల ఆధీనంలో ఉన్నప్పటికీ వారిని ‘డి’ ఏరియా వరకు రానివ్వకుండా చేయడంలో అర్జెంటీనా డిఫెండర్లు సఫలమయ్యారు. మ్యాచ్ మొత్తంలో క్రొయేషియా కేవలం రెండుసార్లు మాత్రమే అర్జెంటీనా గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టడం గమనార్హం. క్రొయేషియా కెప్టెన్ లుకా మోడ్రిచ్, పెరిసిచ్, బ్రోజోవిచ్, కొవాసిచ్లను అర్జెంటీనా డిఫెండర్లు సమర్థంగా నిలువరించారు. వారెవ్వా.. ఏమి గోల్..... ఆట 57వ నిమిషంలో అర్జెంటీనా ఖాతాలో మూడో గోల్ చేరేదే కానీ మెస్సీ కొట్టిన షాట్‌ను గోల్‌పోస్ట్ ముందు గోల్‌కీపర్ లివకోవిచ్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత 69వ నిమిషంలో అద్భుతమే జరిగింది. తనదైన రోజున తానెంత ప్రమాదకర ప్లేయర్‌నో మెస్సీ నిరూపించాడు. కుడి వైపున బంతి అందుకున్న మెస్సీ పాదరసంలా కదులుతూ ముందుకు వెళ్లగా... అతని వెంబడే క్రొయేషియా డిఫెండర్ జోస్కో గ్వార్డియోల్ పరుగెత్తాడు. గ్వార్డియోల్ అన్ని రకాలుగా మెస్సీని నిలువరించాలని చూసినా... ఈ అర్జెంటీనా స్టార్ మాత్రం కనువిందులాంటి డ్రిబ్లింగ్‌తో అలరించాడు. చివరకు గోల్‌లైన్ అంచుల్లోంచి గ్వార్డియోల్ కాళ్ల సందులోంచి బంతిని మెస్సీ క్రాస్ పాస్ ఇవ్వగా... అక్కడే ఉన్న అల్వారెజ్ నేర్పుతో బంతిని లక్ష్యానికి చేర్చాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ గోల్‌ను కళ్లారా చూసిన వారందరూ మెస్సీ మ్యాజిక్కు ఫిదా అయిపోవడమే కాకుండా ఈ గోల్‌ను చిరకాలం గుర్తుంచుకుంటారు. అర్జెంటీనా ఆధిక్యం 3–0కు పెరగడంతో క్రొయేషియా విజయంపై ఆశలు వదులుకుంది. మరోవైపు అర్జెంటీనా చివరి వరకు దూకుడును కొనసాగిస్తూ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో చివరిసారిగా... ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ తనకు చివరి వరల్డ్‌కప్ అవుతుందని అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ అధికారికంగా ప్రకటించాడు. 2006 నుంచి వరుసగా ఐదు ప్రపంచకప్‌లు ఆడిన మెస్సీ, తన ఆఖరి పోరులో గెలిచి చరిత్రకెక్కాలని పట్టుదలగా ఉన్నాడు. ‘నా ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించబోతున్నాను. నా చివరి మ్యాచ్‌గా ఫైనల్ ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మరోసారి వరల్డ్‌కప్ అంటే చాలా దూరంలో ఉంది. నేను అప్పటి వరకు ఆడలేనని తెలుసు. వరల్డ్‌కప్‌లో వేర్వేరు రికార్డులు నా దరిచేరడం మంచిదే. కానీ అన్నింటికంటే ముఖ్యం జట్టుగా మా లక్ష్యం ఏమిటనేది. అది సాధిస్తేనే అంతా అద్భుతంగా ఉంటుంది. దానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. ఎంతో కష్టపడి ఈ దశకు వచ్చాం. ట్రోఫీ గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం’ అని 35 ఏళ్ల మెస్సీ వ్యాఖ్యానించాడు. 2005 నుంచి అర్జెంటీనా సీనియర్ జట్టుకు ఆడుతున్న మెస్సీ 171 మ్యాచ్‌లు ఆడి 96 గోల్స్ సాధించాడు. 1: ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. బటిస్టుటా (10 గోల్స్) పేరిట ఉన్న రికార్డును మెస్సీ (11 గోల్స్) సవరించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో మెస్సీ సంయుక్తంగా ఆరో స్థానానికి చేరుకున్నాడు. మిరోస్లావ్ క్లోజ్ (16), రొనాల్డో నజారియో (15), గెర్డ్ ముల్లర్ (14) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 2: ప్రపంచకప్‌లో తొలి లీగ్ మ్యాచ్‌లో ఓడిన తర్వాత ఫైనల్ చేరడం అర్జెంటీనాకిది రెండోసారి. 1990లోనూ అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో కామెరూన్ చేతిలో ఓడిపోయి ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. 1982లో పశ్చిమ జర్మనీ... 1994లో ఇటలీ... 2010లో స్పెయిన్ కూడా ఈ ఘనత సాధించాయి. జర్మనీ, ఇటలీ రన్నరప్‌గా నిలువగా... స్పెయిన్ మాత్రం టైటిల్ సాధించింది. 2: జర్మనీ తర్వాత ప్రపంచకప్ సెమీఫైనల్లో రెండుసార్లు మూడు అంతకంటే ఎక్కువ గోల్స్ తేడాతో గెలిచిన రెండో జట్టుగా అర్జెంటీనా నిలిచింది. 3: వరుసగా ఐదో ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ గత నాలుగు ప్రపంచకప్‌లలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా చేయలేదు. ఈసారి మాత్రం ఏకంగా మూడు గోల్స్ చేశాడు. 5: ఒకే ప్రపంచకప్‌లో ఐదు గోల్స్ చేసిన పెద్ద వయస్కుడిగా మెస్సీ (35 ఏళ్లు) ఘనత సాధించాడు. 6: ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఫైనల్ చేరడం ఇది ఆరోసారి. జర్మనీ అత్యధికంగా 8 సార్లు ఫైనల్ చేరింది. బ్రెజిల్, ఇటలీ (6 సార్లు చొప్పున) సరసన అర్జెంటీనా నిలిచింది. 16: ఈ ఏడాది అర్జెంటీనా తరఫున మెస్సీ చేసిన గోల్స్. తన కెరీర్లో జాతీయ జట్టుకు ఒకే సంవత్సరం ఇన్ని గోల్స్ అందించడం ఇదే ప్రథమం. 25: ఇప్పటి వరకు ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో మెస్సీ ఆడిన మ్యాచ్‌లు. లోథర్ మథియాస్ (జర్మనీ–25 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును మెస్సీ సమం చేశాడు. ఫైనల్లోనూ మెస్సీ బరిలోకి దిగితే ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (26) ఆడిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. -
FIFA WC 2022: మొరాకోతో సెమీ ఫైనల్.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు భారీ షాక్
ఫిఫా వరల్డ్‌కప్-2022లో భాగంగా ఫ్రాన్స్-మొరాకో జట్ల మధ్య రేపు (అర్ధరాత్రి 12:30) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్టార్టర్లు డయోట్ ఉపమెకనో, అడ్రెయిన్ రేబియట్ అనారోగ్యం కారణంగా ఇవాళ ప్రాక్టీస్‌కు హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో వీరిద్దరు మొరాకోతో జరిగే సెమీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానమేనని సమాచారం. పై పేర్కొన్న ఇద్దరిలో డయోట్ ఉపమెకనో సోమవారం కూడా ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదని, అతను తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డాడని తెలుస్తోంది. ఉపమెకనో, రేబియట్ సెమీఫైనల్‌కు అందుబాటులో ఉండకపోవడం ఫ్రాన్స్ విజయావకాశాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రేబియట్ ఒక గోల్ సాధించి, మరో గోల్ చేసేందుకు సహాయపడగా.. ఉపమెకనో ఖాతా తెరవాల్సి ఉంది. ఇదిలా ఉంటే, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫ్రాన్స్.. క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 2-1 గోల్స్ తేడాతో గెలుపొంది సెమీస్‌కు చేరగా, మొరాకో.. పటిష్టమైన పోర్చుగల్‌పై సంచలన విజయం (1-0) సాధించి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన మొరాకో.. బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్ లాంటి హేమాహేమీ జట్లకు షాకిచ్చి సెమీస్ వరకు చేరింది. మరోవైపు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్.. స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ ఫైనల్ ఫోర్కు చేరింది. కాగా, ఇవాళ (డిసెంబర్ 14) జరిగిన తొలి సెమీఫైనల్లో హాట్ ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనా.. క్రొయేషియాపై 3-0 గోల్స్ తేడాతో గెలుపొంది ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్-మొరాకో మ్యాచ్‌లో విజేత డిసెంబర్ 18న జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
FIFA WC: సెమీ ఫైనల్.. ప్రాణ స్నేహితులు ప్రత్యర్థులైన వేళ
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇవాళ(డిసెంబర్ 14న) మొరాకో, ఫ్రాన్స్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో గెలిచిన జట్టు డిసెంబర్ 18న అర్జెంటీనాతో జరిగే ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. మ్యాచ్ సంగతి పక్కనబెడితే ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె, మొరాకో డిఫెండర్ అచ్రాఫ్ హకీమిలు ప్రాణ స్నేహితులు. ప్రస్తుతం పారిస్ సెయింట్-జర్మెన్కు(పీఎస్జీ) ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు నెలన్నర వ్యవధిలో పుట్టారు. దేశాలు వేరైనా ఇద్దరి మనసులు మాత్రం ఒక్కటే. ఎంబాపె గోల్ కొడితే.. అచ్రాఫ్ హకీమి సెలబ్రేట్ చేయడా.. అదే విధంగా హకీమి గోల్ కొడితే ఎంబాపె సంబరం చేసుకుంటాడు. హాలిడే టూర్ వెళ్లాల్సి వస్తే ఇద్దరు కలిసే వెళ్తారు. అలాంటి ప్రాణ స్నేహితులు ఇప్పుడు దేశం కోసం ప్రత్యర్థులుగా మారాల్సి వచ్చింది. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ఫ్రాన్స్ తరపున ఎంబాపె.. మొరాకో తరపున అచ్రాఫ్ హకీమిలు ఎదురుపడనున్నారు. ఇంతకాలం స్నేహితులుగా ఉన్న వీళ్లలో ఎవరిరపై ఎవరు ఆధిపత్యం చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఫ్రాన్స్ సూపర్‌స్టార్ ఎంబాపె ఈ వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఐదు గోల్స్ చేసిన ఎంబాపె అత్యధిక గోల్స్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ అందుకు తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ సెమీస్ చేరింది. మరోవైపు మొరాకో మాత్రం సంచలన ఆటతీరుతో అదరగొట్టింది. గ్రూఫ్ దశలో బెల్జియంను, నాకౌట్స్‌లో స్పెయిన్, పోర్చుగల్ లాంటి పటిష్టమైన జట్లకు షాక్ ఇస్తూ రోజురోజుకు మరింత బలంగా తయారవుతూ వచ్చింది. మరి ఇవాళ్టి మ్యాచ్‌లో ఫ్రాన్స్ ముందు మొరాకో ఆటలు సాగుతాయా లేక ఛాంపియన్స్‌కు మొరాకో షాక్ ఇస్తుందా అనేది చూడాలి. ఒకవేళ మొరాకో ఫైనల్ చేరితే మాత్రం ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్రికా జట్టుగా చరిత్ర సృష్టించనుంది. చదవండి: FIFA WC: ప్చ్.. క్రొయేషియాతో పాటే అమ్మడు అందాలకు చెక్ పదేళ్ల క్రితం మెస్సీ కోసం.. ఇప్పుడు మెస్సీతో కలిసి View this post on Instagram A post shared by Achraf Hakimi (@achrafhakimi) -
FIFA WC: ప్చ్.. క్రొయేషియాతో పాటే అమ్మడు అందాలకు చెక్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫాలో అవుతున్న వారికి క్రొయేషియా మోడల్ ఇవానా నోల్ గురించి పరిచయం అక్కర్లేదు. అసభ్య దుస్తులకు అనుమతి లేని చోట పొట్టి పొట్టి డ్రెస్సులు ధరిస్తూ హాట్ లుక్స్‌తో ఫిఫా అభిమానులను అలరిస్తుంది. తనకు తాను హాటెస్ట్ ఫ్యాన్ ఇన్ ద వరల్డ్ అని ప్రకటించుకున్న ఇవానా నోల్ తాజాగా తన చర్యతో మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా అర్జెంటీనా, క్రొయేషియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు హాజరైన ఇవానా నోల్ మరింత రెచ్చిపోయింది. క్రొయేషియా జెండా కలర్ లో కట్ టాప్ డ్రెస్.. బ్లూ జీన్స్‌తో మ్యాచ్‌కు హాజరైంది. కట్టిపడేసే అందంతో మ్యాచ్ చూడడానికి వచ్చిన కుర్రకారు గుండెల్లో ఆమె రైళ్లు పరిగెత్తించింది. క్లీవేజ్ షో చేస్తూనే హాట్ హాట్ లుక్స్‌తో అందరి కళ్లు తనవైపుకు తిప్పుకుంది. అయితే క్రొయేషియా కథ సెమీస్‌లో ముగియడంతో అమ్మడు అందాలు కూడా ఇక్కడికే పరిమితమవుతాయేమోనని కొంతమంది తెగ ఫీలవుతున్నారు. క్రొయేషియా వెళ్లిపోయింది కాబట్టి తాను వెళ్లిపోతుందని.. ప్చ్ అందాల ప్రదర్శన మిస్ అవుతామోనని మరికొంత మంది కామెంట్స్ చేశారు. అయితే ఇవానా నోల్ ఖతర్‌ను వీడి వెళుతున్నట్లు ఎలాంటి సమాచారం లేదని.. కచ్చితంగా ఫైనల్ మ్యాచ్ ముగిసాకే ఆమె తన దేశం వెళుతుందంటూ కొంతమంది పేర్కొన్నారు. ఏది ఏమైనా తన అందంతో ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్లతో సమానంగా పేరు పొందిన ఇవానా నోల్కు థ్యాంక్స్ చెప్పాల్సిందే. అరబ్ లాంటి కఠినమైన దేశాల్లో వారి ఆంక్షలను బేఖాతరు చేసి పొట్టి పొట్టి డ్రెస్సుల్లో దర్శనమిచ్చి అందాలు ఆరబోసిన ఇవానా నోల్ దైర్యానికి మెచ్చుకోవాల్సిందే అంటూ కొందరు అభిమానులు ట్విటర్ వేదికగా తెలిపారు. View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) చదవండి: FIFA WC 2022: అరబ్ గడ్డపై అందాల ప్రదర్శన.. చిక్కుల్లో సుందరి Ivana Knoll FIFA WC: జపాన్ను అవమానించిన క్రొయేషియా సుందరి -
పదేళ్ల క్రితం మెస్సీ కోసం.. ఇప్పుడు మెస్సీతో కలిసి
ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా జట్టు ఆరోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా ఎలాగైనా టైటిల్ కొట్టాలని ఉవ్విళ్లూరుతుంది. కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్న మెస్సీ సేన తమ కలను సాకారం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. అర్జెంటీనా తరపున మెస్సీ( ఆట 34వ నిమిషం), జులియన్ అల్వరేజ్(ఆట 39, 69వ నిమిషంలో) గోల్స్ చేశారు. కీలకమైన సెమీఫైనల్లో ఈ ఇద్దరు మంచి ఫైర్‌తో ఆడారు. అయితే అల్వరేజ్ గోల్స్ చేయడం వెనుక మెస్సీ పరోక్షంగా సహాయపడ్డాడు. మెస్సీ ఇచ్చిన పాస్‌లను గోల్ మలిచి అల్వరేజ్ సక్సెస్ కావడమే గాక జట్టును విజయం దిశగా నడిపించాడు. అయితే తాజాగా ట్విటర్లో మెస్సీతో అల్వరేజ్ దిగిన ఒక ఫోటో వైరల్‌గా మారింది. పదేళ్ల క్రితం అల్వరేజ్ 12 ఏళ్ల వయసులో మెస్సీ కోసం నిరీక్షించి మరీ అతనితో ఫోటో దిగాడు. కట్‌చేస్తే ఇప్పుడు మెస్సీతో కలిసి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 40 ఏళ్ల తర్వాత అర్జెంటీనా(1986 ఫిఫా వరల్డ్‌కప్ విజేత) కలను నిజం చేయాలని చూస్తున్న మెస్సీకి అల్వరేజ్ తనవంతు సహాయం అందిస్తున్నాడు. మొత్తానికి 10 ఏళ్ల వయసులో మెస్సీ కోసం నిరీక్షించిన అల్వరేజ్.. తాజాగా మెస్సీతో కలిసి ఆటను పంచుకోవడం అభిమానులకు కన్నులపండువగా ఉంది. 10 years ago: asking Leo Messi for a pic as big fan, dreaming of World Cup one day… Tonight: Julián Álvarez from Calchín scores in World Cup semifinal. 🕷️🇦🇷 #Qatar2022 pic.twitter.com/DhwozBijJu — Fabrizio Romano (@FabrizioRomano) December 13, 2022 చదవండి: రిటైర్మెంట్పై మెస్సీ సంచలన నిర్ణయం అల్విదా 'లుకా మోడ్రిక్'.. నాయకుడంటే నీలాగే -
ఖతర్‌లో అంతేనా.. కార్మికుల ప్రాణాలకు లెక్క లేదా
మోర్తాడ్ (బాల్కొండ): ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన ఖతర్ అన్ని దేశాల దృష్టిని ఆకర్షించింది. గత నెల 20న ప్రారంభమైన ఫుట్‌బాల్ పోటీలు ఈనెల 18తో ముగియనున్నాయి. ఫిఫా క్రీడా సంగ్రామంతో దాదాపు రూ.1.40 లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న ఖతర్.. తన గుర్తింపు కోసం రక్తం చిందించిన వివిధ దేశాల వలస కార్మికులను మాత్రం మరచిపోయిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఫిఫా కోసం చేపట్టిన వివిధ నిర్మాణాల్లో భాగస్వాములైన వలస కార్మికులు ప్రమాదాల వల్ల, పని ఒత్తిడితో అనారోగ్యానికి గురై మరణించిన ఘటనలు ఉన్నాయి. మరణించిన వలస కార్మికుల్లో తెలంగాణకు చెందిన వాళ్లే సుమారు వంద మంది వరకు ఉంటారని గల్ఫ్ జేఏసీ అంచనాల్లో తేలింది. ‘చనిపోయిన వారిని స్మరించుకుందాం–బతికి ఉన్నవారి కోసం పోరాడుదాం’ అనే నినాదంతో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో ఖతర్ ఫిఫా అమరులను స్మరిస్తూ నిజామాబాద్‌లో ఇటీవల సమావేశం నిర్వహించారు. ఖతర్‌లో ఫిఫా పనులు చేస్తూ మరణించిన వారి కుటుంబాలను ఐక్యం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఖతర్ సర్కార్‌కు బాధితుల గోడును వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ సింగిరెడ్డి నరేష్‌రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, గల్ఫ్ తెలంగాణ సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు బసంత్‌రెడ్డి, న్యాయవాది బాస రాజేశ్వర్‌లు బాధిత కుటుంబాలతో సమావేశమై వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిరాశపరిచిన విదేశాంగ శాఖ.. పార్లమెంట్ సమావేశాల్లో ఖతర్ మృతుల ఆంశంపై ఎంపీలు వెంకటేశ్ నేత బొర్లకుంట, డాక్టర్ రంజిత్‌రెడ్డి, మాలోవత్ కవిత ప్రస్తావించారు. ఇందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ సమాధానం ఇస్తూ ఖతర్ కార్మిక చట్టాల ప్రకారం మృతుల కుటుంబాలకు పరిహారం అందుతుందని తెలిపారు. కానీ మృతుల సంఖ్యను వెల్లడించలేదు. కనీసం ఎంత మందికి పరిహారం అందించారనే విషయంలోనూ స్పష్టత లేదు. ఎంపీలు అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సమాధానం అస్పష్టంగా ఉండటం బాధిత కుటుంబాలను నిరాశపరిచిందనే అభిప్రాయ వ్యక్తమవుతోంది. (క్లిక్ చేయండి: కొండగట్టు ఆంజనేయుని ‘వెనకనున్న’ ఆ దంపతులు ఎవరో తెలుసా!) -
రిటైర్మెంట్పై మెస్సీ సంచలన నిర్ణయం
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తన రిటైర్మెంట్పై సంచలన ప్రకటన చేశాడు. ఖతర్ వేదికగా జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ అర్జెంటీనా తరపున చివరిదని స్పష్టం చేశాడు. మెస్సీకి ఇదే చివరి ప్రపంచకప్ అని ఊహాగానాలు వ్యక్తమయిన వేళ మెస్సీ తన మనసులోని మాటను బయటపెట్టాడు. మంగళవారం అర్థరాత్రి దాటాకా క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి అర్జెంటీనాకు తొలి గోల్ అందించాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీకి ఇది నాలుగో గోల్. మిగతా రెండు గోల్స్ అల్వరేజ్ చేసినప్పటికి ఆ రెండింటిలోనూ మెస్సీదే ముఖ్యపాత్ర అన్న విషయం మరువద్దు. ఇక మొరాకో, ఫ్రాన్స్‌లలో గెలిచే జట్టుతో డిసెంబర్ 18న జరిగే ఫైనల్లో అర్జెంటీనా అమితుమీ తేల్చుకోనుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ''అర్జెంటీనా ఫైనల్స్ కు చేరడం సంతోషంగా ఉంది. ఫైనల్స్ లో చివరి మ్యాచ్ ను ఆడటం ద్వారా ఫుట్ బాల్ ప్రపంచకప్ ప్రయాణానికి ముగింపు పలకబోతున్నా.మరో ప్రపంచకప్ కు చాలా సంవత్సరాలు పడుతుందని... అప్పటి వరకు ఇలాగే ఆడేంత సత్తా ఉంటుందని అనుకోవడం లేదు. ఈసారి అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ అందించి ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించడమే ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే మారడోనా వారసుడిగా పేరు సంపాదించిన మెస్సీ తన కెరీర్లోనే ఎన్నో టైటిల్స్, రికార్డులు, అవార్డులు అందుకున్నాడు. అయితే మెస్సీకి ఫిఫా వరల్డ్‌కప్ మాత్రం అందని దాక్ష్రలా ఉంది. 2014లో ఆ అవకాశం వచ్చినప్పటికి అర్జెంటీనా చివరి మెట్టుపై బోల్తా పడింది. మరి ఈసారైనా ఫైనల్లో విజయం సాధించి ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలని చూస్తున్న మెస్సీ కల నెరవేరాలని కోరుకుందాం. చదవండి: అల్విదా 'లుకా మోడ్రిక్'.. నాయకుడంటే నీలాగే Luka Modric: 'ఈ వరల్డ్‌కప్ మెస్సీదే.. కచ్చితంగా కొడతాడు' దెబ్బకు దెబ్బ తీశారు.. లెక్క సరిచేసిన మెస్సీ -
అల్విదా 'లుకా మోడ్రిక్'.. నాయకుడంటే నీలాగే
లుకా మోడ్రిక్.. ఈతరం ఫుట్‌బాల్ స్టార్స్‌లో ఒకడు. మెస్సీ, రొనాల్డో లాగా పాపులారిటీ లేనప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అనామక జట్టుగా ఉన్న క్రొయేషియాను లుకా మోడ్రిక్ నడిపిన తీరు అద్బుతమని చెప్పొచ్చు. వరుసగా రెండు ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అసాధారణ ఆటతీరు కనబరిచి అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ మోడ్రిక్ జట్టును అన్నీ తానై నడిపించాడు. నాయకుడంటే ఇలాగే ఉండాలి అనే పదానికి నిర్వచనంగా నిలిచాడు లుకా మోడ్రిక్. 2006లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌ను ఆరంభించిన లుకా మోడ్రిక్ తొలి రెండు వరల్డ్‌కప్‌లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 2010, 2014 వరల్డ్‌కప్స్‌లో క్రొయేషియా గ్రూప్ దశలోనే వెనుదిరిగడం మోడ్రిక్ను వెలుగులోకి తీసుకురాలేకపోయింది. ఇక 2014 ఫిఫా వరల్డ్‌కప్.. గ్రూప్ దశలోనే క్రొయేషియా జట్టు వెనుదిరిగింది. కేవలం 40 లక్షల జనాభా మాత్రమే కలిగిన క్రొయేషియా వచ్చే నాలుగేళ్లలో అద్భుతం చేయబోతుందని అప్పట్లో ఎవరు ఊహించలేదు. 2014 తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మోడ్రిక్ దశ దిశ లేకుండా అనామక జట్టుగా ఉన్న క్రొయేషియాను గాడిలో పెట్టాడు. ఆ తర్వాత నాలుగేళ్లలో జట్టులో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు. మేజర్ టోర్నీలు గెలవకపోయినప్పటికి జట్టును బలంగా తయారు చేయడంలో మాత్రం సఫలమయ్యాడు. ఇక 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఆఖరి మెట్టుపై బోల్తా పడి రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా.. ఈసారి కూడా దాదాపు అదే ఫలితాలను రిపీట్ చేసింది. కీలకమైన నాకౌట్స్‌లో బ్రెజిల్, జపాన్ లాంటి మేటి జట్లకు షాకిచ్చి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అలా వరుసగా రెండు వరల్డ్‌కప్స్‌లో ఒకసారి రన్నరప్.. మరోసారి సెమీఫైనల్ వరకు వచ్చిందంటే లుకా మోడ్రిక్ జట్టులో నింపిన చైతన్యం వల్లే అని చెప్పొచ్చు. ఈసారి లుకా మోడ్రిక్తో పాటు గోల్ కీపర్ డొమినిక్ లివకోవిచ్ , ఇవాన్ పెరిసిక్, డెజన్ లొవ్రెన్, మార్సిలో బ్రొజోవిక్లు నాలుగు స్తంభాలుగా మారి క్రొయేషియాను ముందుకు నడిపించారు. 37 ఏళ్ల లుకా మోడ్రిక్ తన చివరి ఫిఫా వరల్డ్‌కప్ ఆడేసినట్లే. క్రొయేషియా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా లుకా రికార్డు నెలకొల్పాడు. క్రొయేషియా తరపున 161 మ్యాచ్‌ల్లో 23 గోల్స్ సాధించాడు. మిడ్‌ఫీల్డర్‌గా బాధ్యతలు నిర్వర్తించే లుకా మోడ్రిక్ ఎక్కువ గోల్స్ చేయకపోయినప్పటికి పాస్‌లు అందించడంలో మాత్రం దిట్ట. 2006 నుంచి 16 ఏళ్ల పాటు క్రొయేషియా జట్టుకు సేవలందించిన లుకా మోడ్రిక్.. ఫిఫి వరల్డ్‌కప్ గెలవలేదన్న కోరిక మినహాయిస్తే జీవితంలో అన్నీ చూశాడు. 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో గోల్డెన్ బాల్ అందుకున్న లుకా.. 2018లోనే ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డు, యూఈఎఫ్ఏ మెన్స్ ప్లేయర్ అవార్డులను గెలుచుకున్నాడు. ఇక 2019లో గోల్డెన్ ఫుట్ అవార్డు గెలుచుకున్న లుకా మోడ్రిక్ ఆటకు నీరాజనం పలుకుతూ అతని మలి కెరీర్ కూడా ఆనందంగా సాగిపోవాలని కోరుకుందాం. చదవండి: దెబ్బకు దెబ్బ తీశారు.. లెక్క సరిచేసిన మెస్సీ Luka Modric: 'ఈ వరల్డ్‌కప్ మెస్సీదే.. కచ్చితంగా కొడతాడు' Warrior spirit 💪 Still not over for @lukamodric10 & Co. in #Qatar2022 📊 Watch #Croatia vie for a third-place finish at the #FIFAWorldCup once again, Dec 17 - 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGCRO #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/HjqX7k2qKe — JioCinema (@JioCinema) December 13, 2022