ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో 4-1తో గెలిచిన బ్రెజిల్ దర్జాగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. బ్రెజిల్ తరపున విని జూనియర్(ఆట 7వ నిమిషం), నెయమర్(ఆట 13వ నిమిషం), రిచర్లీసన్(ఆట 29వ నిమిషం), లుకాస్ పెక్వెటా(ఆట 36వ నిమిషం)లో గోల్స్ చేశారు.
ఇక సౌత్ కొరియా తరపున పైక్ సాంగ్ హూ(ఆట 76వ నిమిషం) గోల్ సాధించాడు. కాగా బ్రెజిల్ తొలి అర్థభాగంలోనే నాలుగు గోల్స్ కొట్టి స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండో హాఫ్‌టైమ్‌లో దక్షిణ కొరియా గోల్‌పోస్ట్‌పై పలుమార్లు దాడులు చేసినప్పటికి సఫలీకృతం కాలేకపోయింది. ఆ తర్వాత ఆట అదనపు సమయంలోనూ ఇరుజట్లు గోల్స్ చేయలేకపోయాయి.
ఇక చీలమండ గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన స్టార్ ఆటగాడు నెయ్‌మర్ రీఎంట్రీలో అదరగొట్టాడు. ఆట 13వ నిమిషంలో బ్రెజిల్‌కు వచ్చిన పెనాల్టీని నెయ్‌మర్ చక్కగా వినియోగించుకున్నాడు. గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించి అద్బుత గోల్ సాధించాడు. కాగా ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలో సెర్బియాతో మ్యాచ్‌లో పాల్గొన్న నెయ్‌మర్ చీలమండకు గాయం అయింది. దీంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇక డిసెంబర్ 9న(శుక్రవారం) జరగనున్న క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్.. క్రొయేషియాతో తలపడనుంది.
🎦 CAN'T. MISS. THESE. 😍@CBF_Futebol run riot as they score 4️⃣ past @theKFA to set up a q/f fixture with @HNS_CFF ⚔️
— JioCinema (@JioCinema) December 6, 2022
Watch #Brazil in action on Dec 9 - 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#BRAKOR #Qatar2022 #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/bpIjF1tn3k
Comments
Please login to add a commentAdd a comment