Richarlison
-
FIFA WC: నెయ్మర్ అడుగు పడింది.. దర్జాగా క్వార్టర్స్‌కు బ్రెజిల్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో 4-1తో గెలిచిన బ్రెజిల్ దర్జాగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. బ్రెజిల్ తరపున విని జూనియర్(ఆట 7వ నిమిషం), నెయమర్(ఆట 13వ నిమిషం), రిచర్లీసన్(ఆట 29వ నిమిషం), లుకాస్ పెక్వెటా(ఆట 36వ నిమిషం)లో గోల్స్ చేశారు. ఇక సౌత్ కొరియా తరపున పైక్ సాంగ్ హూ(ఆట 76వ నిమిషం) గోల్ సాధించాడు. కాగా బ్రెజిల్ తొలి అర్థభాగంలోనే నాలుగు గోల్స్ కొట్టి స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండో హాఫ్‌టైమ్‌లో దక్షిణ కొరియా గోల్‌పోస్ట్‌పై పలుమార్లు దాడులు చేసినప్పటికి సఫలీకృతం కాలేకపోయింది. ఆ తర్వాత ఆట అదనపు సమయంలోనూ ఇరుజట్లు గోల్స్ చేయలేకపోయాయి. ఇక చీలమండ గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన స్టార్ ఆటగాడు నెయ్మర్ రీఎంట్రీలో అదరగొట్టాడు. ఆట 13వ నిమిషంలో బ్రెజిల్‌కు వచ్చిన పెనాల్టీని నెయ్మర్ చక్కగా వినియోగించుకున్నాడు. గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించి అద్బుత గోల్ సాధించాడు. కాగా ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలో సెర్బియాతో మ్యాచ్‌లో పాల్గొన్న నెయ్మర్ చీలమండకు గాయం అయింది. దీంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇక డిసెంబర్ 9న(శుక్రవారం) జరగనున్న క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్.. క్రొయేషియాతో తలపడనుంది. 🎦 CAN'T. MISS. THESE. 😍@CBF_Futebol run riot as they score 4️⃣ past @theKFA to set up a q/f fixture with @HNS_CFF ⚔️ Watch #Brazil in action on Dec 9 - 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#BRAKOR #Qatar2022 #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/bpIjF1tn3k — JioCinema (@JioCinema) December 6, 2022 -
FIFA WC: బ్రెజిల్‌ను గెలిపించినోడు.. పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మి
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో గురువారం రాత్రి సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. అయితే బ్రెజిల్ స్టార్ నెయ్మర్ గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో బ్రెజిల్‌ను ఎవరు ముందుండి నడిపిస్తారనే సంశయం మొదలైంది. కానీ నెయ్మర్ స్థానంలో వచ్చిన రిచర్లీసన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్రెజిల్ చేసిన రెండు గోల్స్ రిచర్లీసన్ కొట్టినవే కావడం విశేషం. అతను కొట్టిన రెండు గోల్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు 25 ఏళ్ల రిచర్లీసన్ పేరు ఫిఫా వరల్డ్‌కప్‌లో మారుమోగిపోతుంది. ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్‌కు ఆరో టైటిల్ అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రిచర్లీసన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. అయితే రిచర్లీసన్ అనుకున్నంత ఈజీగా ఫుట్‌బాలర్ అవ్వలేదు. ఫుట్‌బాలర్ అవ్వడానికి ముందు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇప్పుడు స్టార్‌గా పేరు సంపాదించినప్పటికి ఒకప్పుడు పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మాడు.. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. రిచర్లీసన్ తండ్రి ఓ మేస్త్రీ. తల్లి ఐస్ క్యాండీలు అమ్ముతుండేది. ఆమెతోపాటు అతడు కూడా వెళ్లి అవి అమ్మేవాడు. డ్రగ్స్‌కు మారు పేరుగా నిలిచే బ్రెజిల్‌లోని నోవా వెనేసియా అనే ఏరియాలో పుట్టి పెరిగాడు. ఐదుగురు సంతానంలో అందరి కంటే పెద్దవాడు. తినడానికి తిండి లేక ఖాళీ కడుపుతో పడుకున్న రోజులు ఉన్నాయి. తన స్నేహితులు డ్రగ్స్ అమ్ముతూ సులువుగా డబ్బు సంపాదిస్తున్నా.. అది తప్పని తెలిసి దానికి దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఒకసారి డ్రగ్స్ వ్యాపారం చేసే వ్యక్తి ఒకరు అతని తలకు తుపాకీ గురి పెట్టాడట. తన నుంచి డ్రగ్స్ దొంగిలించిన వాళ్లలో తననూ ఒకడిగా భావించి అతడలా చేసినట్లు రిచర్లీసన్ చెప్పాడు. "ఆ సమయంలో చాలా భయపడ్డాను. ట్రిగ్గర్ నొక్కితే నా పనైపోయేది. కానీ మరోసారి ఇక్కడ కనిపిస్తే చంపేస్తానని బెదిరించి వదిలేశాడు. అలా చావు అంచుల వరకు వెళ్లి తప్పించుకున్నాం" అని చెప్పుకొచ్చాడు. అప్పటికి రిచర్లీసన్ వయసు 14 ఏళ్లు మాత్రమే. అయితే తమ కుటుంబ పరిస్థితి లేకపోయినా తాను ఏడేళ్ల వయసున్నప్పుడు తన తండ్రి తనకు పది ఫుట్‌బాల్స్ గిఫ్ట్‌గా ఇచ్చాడని, అదే తన జీవితాన్ని మార్చేసిందని రిచర్లీసన్ గుర్తు చేసుకున్నాడు. అలా ఫుట్‌బాల్‌పై మక్కువ పెంచకున్న రిచర్లీసన్ ఒక వ్యాపారవేత్త దృష్టిలో పడ్డాడు. అతని ప్రాత్సాహంతోనే తాను ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా ఎదిగినట్లు చెప్పుకొచ్చాడు. ఇక రిచర్లీసన్ అమెరికా మినీరో క్లబ్‌కు వెళ్లాకా అతని దశ మారిపోయింది. అక్కడి నుంచి రిచర్లీసన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇటీవలే ఎవర్టన్ క్లబ్ అతన్ని 6 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేసింది. ఎవర్టన్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఒప్పందం ఇది కావడం విశేషం. ఏది ఏమైనా సెర్బియాతో మ్యాచ్‌లో నెయ్మర్ లేని లోటును రిచర్లీసన్ తీర్చాడని బ్రెజిల్ అభిమానులు కామెంట్ చేశారు. On the biggest night of his career, Richarlison turned opportunity into greatness. Can Brazil’s number 9 fire his way to the Golden Boot in Qatar? 🇧🇷 #BRASER 🇷🇸 #POTM #YoursToTake @Budweiser @Budfootball pic.twitter.com/TYCYXUSQz0 — FIFA World Cup (@FIFAWorldCup) November 25, 2022 Richarlison! What have you done?! 🤯#FIFAWorldCup | @richarlison97 pic.twitter.com/kCKFdlINXq — FIFA World Cup (@FIFAWorldCup) November 24, 2022 చదవండి: FIFA WC: బైనాక్యులర్స్‌లో బీర్.. అడ్డంగా దొరికిన అభిమాని